LATEST NEWS
మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ సరెండర్ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమా? ఆయన లొంగిపోలేదనీ, షెల్టర్ లో ఉండగా పోలీసులు అరెస్టు చేశారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఈ సమాధానం కూడా మావోయిస్టు సానుభూతి పరుల నుంచో, ఇంకా లొంగిపోకుండా ఉద్యమ బాటలోనే ఉన్న మావోయిస్టుల నుంచో కాదు.. స్వయంగా దేవ్ జీ నుంచే రావడంతో.. ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల లొంగుబాట్లపై జరుగుతున్న ప్రచారంపైనే అనుమాన నీలి మేఘాలు కమ్ముకున్నాయి. దేవ్ జీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఆయుధాలను విసర్జించి లొంగిపోలేదనీ, పోలీసులే తనను అరెస్టు చేశారనీ వెల్లడించారు. షెల్టర్ లో తలదాచుకున్న సమయంలో పోలీసులు అరెస్టు చేయడంతో ఇక విధిలేక, అనివార్య పరిస్థితుల్లో అజ్ణాత జీవితానికి స్వస్తి చెప్పి బహిరంగంగా రావాల్సి వచ్చిందని చెప్పారు.  దేవ్ జీ ప్రకటన ఒక్కసారిగా పెను సంచలనంగా మారింది.  దేవ్ జీ మావోయిస్టు సిద్ధాంతానికి ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని కుండబద్దలు కొట్టారు. ప్రజల కోసం తన పోరాటాన్ని ఆపే ప్రశ్నే లేదని తేల్చి చెప్పడమే కాకుండా.. పోరాట పంథా అనివార్యంగా మార్చుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు.   దేవ్ జీ అరెస్ట్  ఎలా జరిగింది?  అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది?  లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?   ఈ ప్రశ్నలకు సమాధానం మావోయిస్టు ఉద్యమంలో వచ్చిన మార్పులు, పోలీసుల వ్యూహాలు, మావోయిస్టు అగ్రనేతల్లో ఉద్యమం కొనసాగించడంపై ఏర్పడిన అభిప్రాయభేదాలు, ఆ భిన్నాభిప్రాయాలతో  పార్టీ చీలక అంచుకు చేరడం కారణాలుగా అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మొత్తంగా దేవ్ జీ ఇంటర్వూలో మావోయిస్టుల పోరాట పంధా, ఉద్యమ కొనసాగింపులో ఎదురైన ఆటుపోట్లు, ద్రోహాలూ, త్యాగాలూ మారిన పోలీసు వ్యూహాలకు అనుగుణంగా పార్టీ ప్రతివ్యూహరచనలో వైఫల్యాలు అన్నీ ప్రస్తావించారు. సాయుధపోరాటం ద్వారానే రాజ్యాధికారం అన్న సిద్ధాంతానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెబుతున్న దేవ్ జీ అనివార్య పరిస్థితుల్లోనే అజ్ణాత జీవితానికి స్వస్తి పలికినట్లు చెప్పడం సహజంగానే ఆయన లొంగుబాటు లేదా అరెస్టు పోరాట వ్యూహంలో భాగమేనా అన్న అనుమానాలకు తావిస్తోంది. అన్నిటికీ మించి ఆయన అభిప్రాయాల ప్రకటన రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. అధికారపార్టీ బూటకపు లొంగుబాట్లకు తెరలేపిందంటూ ప్రతిపక్షాల విమర్శలకు తావిచ్చింది.  ఇక లొంగిపోయిన మావోల పునరావాసం, ప్రభుత్వ విధానం వంటి అంశాలపై విస్తృత చర్చకూ, విమర్శలూ, ప్రతి విమర్శలకూ దోహదం చేస్తుందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.   మొత్తం మీద దేవ్ జీ ప్రకటన తెలంగాణ ప్రాంతంలో నక్సలిజంపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  తెలంగాణ ప్రాంతంలో  నక్సల్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులు,  మావోయిస్టు  భావజాలం తదితర అంశాలు మరో సారి విస్తృత చర్చనీయాంశాలుగా మారాయి. అపరేషన్ కగార్ నుంచి మావోయిస్టులు అంతమైపోకుండా కాపాడుకునే వ్యూహంలో భాగంగానే లొంగుబాట్లు జరుగుతున్నాయా అన్న అనుమానాలను తెరమీదకు తెచ్చాయి.  జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు ప్రజలతో సంబంధాలను ఏర్పరుచుకుని పరిస్థితులు కుదుటపడగానే మళ్లీ ఉద్యమ బాట పడతారా.. ఈ సంధి కాలంలో తమ సిద్ధాంతాన్ని ప్రజలలో బలంగా నాటుకునేలా ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటారా? అన్న చర్చ మొదలైంది. లొంగిపోలేదు, అరెస్టయ్యాను అంటూ దేవ్ జీ చెప్పడం వెనుక అర్ధం అదేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఏది ఏమైనా లొంగుబాట్ల తదననంతర పరిణామాలు సమాజంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయన్నది రానున్న రోజులలో తెలుస్తుందని అంటున్నారు.
దక్షిణాది భాషల్లో టాప్ హీరోయిన్ త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? తమిళరాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్నారా? ఇటీవలే రాజకీయరంగ ప్రవేశం చేసిన హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీ ద్వారా ఆమె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు.  ఇటీవల జరిగిన ఓ వేడుకకు  త్రిష విజయ్ తో కలిసి రావడంతో త్రిష పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.    త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి  ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలు వాస్తవమేనా అన్న అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.   అది పక్కన పెడితే.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్న త్రిష కొత్త సినిమాలకు అంగీకరించడం లేదని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. వేగంగా తను నటిస్తున్న సినిమాల షూటింగ్ లు పూర్తి చేసి  ఆ తరువాత ఆమె పూర్తి స్థాయిలో రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు  రాజకీయ పరిశీలకులు. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  మాటల యుద్ధం  మళ్లీ ఆరంభమైంది.  ఈ సారి మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు.  అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గైర్హాజర్ కావడంపై రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీడియాతో మాట్లాడిన రోజా.. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వ్యక్తిగత పనులపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపడంలేదని దుయ్యబట్టారు.  మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు.  ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు.   కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడం, రాష్ట్రం వదలి బెంగళూరులోనూ మకాం వేసి చుట్టపు చూపుగా తాడేపల్లి ప్యాలెస్ కు రావడంపై మాత్రం రోజా ఈ మీడియా సమావేశంలో మాట్లాడలేదు. జనసేన నాయకులు ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ జగన్ బెంగళూరు మకాంపై కూడా రోజా నోరెత్తాలని డిమాండ్ చేస్తున్నారు.  దీంతో రానున్న రోజులలో జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కర్ణాటక కాంగ్రెస్‌లో  సంక్షోభం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో పాతిక మందికి పైగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి బెంగళూరులో రహస్యంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది. కాగా  బుధవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 50 మందికి పైగా ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడం తేలిసిందే. ఈ నేపథ్యంలోనే  పాతిక మంది ఎమ్మెల్యేల రహస్యభేటీ రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలను వేడెక్కించింది. తాజా భేటీలో,   అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయనీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
  తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్ర రాజకీయాలకు వెళ్లడం ప్రమోషనా, డిమోషనా అని కంఠంనేని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, నితీశ్ కుమార్ సెంట్రల్ పాలిటిక్స్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే తన రాజకీయ వారసత్వాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. నితీశ్ కుమార్ చంద్రబాబు కంటే ఒక సంవత్సరం చిన్నవారని పేర్కొన్నారు. ఆయన విజయవంతమైన రాజకీయ నాయకుడని, ఎప్పుడు అధికారంలో ఉండాలో బాగా తెలిసిన నాయకుడని వ్యాఖ్యానించారు. మోదీలా ఎప్పటికీ అధికారంలో ఉండాలనే తత్వం నితీశ్‌కు లేదని తెలిపారు. నితీశ్ కుమార్ వ్యక్తిగత జీవితం చాలా సాధారణమైందని, బీహార్ పరిస్థితులపై ఆయనకు మంచి అవగాహన ఉందని చెప్పారు. ఎన్డీయేలో కీలక పాత్ర పోషించే నాయకుల్లో నితీశ్ కుమార్ ఒకరైతే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్య నేత అని అన్నారు. నితీశ్ మార్గంలోనే చంద్రబాబు ప్రయాణిస్తారా అని రవిశంకర్ ప్రశ్నించగా, టీడీపీ కార్యకర్తల్లో కూడా నాయకత్వంపై చర్చలు జరుగుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు. 2024లోనే నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాలని కొంతమంది చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు లోకేశ్‌దేనని అభిప్రాయపడ్డారు. మరోవైపు, చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో రాష్ట్రపతిగా వెళ్లవచ్చని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, అలాంటిదేమైనా జరుగుతుందా అని రవిశంకర్ ప్రశ్నించారు. వైసీపీ విమర్శలకు టీడీపీ నుంచి గట్టిగా ప్రతిస్పందించే నాయకులు ఉన్నారని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. అలాగే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఆయన ఉపరాష్ట్రపతిగా ఎంపికైన తర్వాత రాజకీయ శక్తి కొంత మేర తగ్గిందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి చంద్రబాబు విషయంలో ఉండదని అన్నారు. చంద్రబాబుకు ‘విజన్ 2047’ లక్ష్యాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపై అనేక ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా అమరావతిని ఆధునిక నగరంగా నిర్మించాలనే లక్ష్యం ఆయనకు ఉందన్నారు. ఆ ప్రణాళికలను భవిష్యత్తులో తన వారసుడు లోకేష్ ముందుకు తీసుకెళ్లే అవకాశముందని చర్చ జరిగింది. అలాగే, ప్రస్తుతం సోషల్ మీడియాలో జనసేన పార్టీ బలంగా ఉందని, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కువగా చురుకుగా పనిచేస్తారని రవిశంకర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కొన్నిసార్లు పక్కన పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంశంపై కూడా చర్చ సాగింది. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి  
ALSO ON TELUGUONE N E W S
'గబ్బర్ సింగ్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్.. 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)తో అలరించడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ నేడు (మార్చి 14) సాయంత్రం 6:30 గంటలకు విడుదలైంది. "ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం" అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, గన్ పట్టుకుని నడిచి వచ్చే స్టైల్ పాత 'గబ్బర్ సింగ్' రోజులను గుర్తుచేస్తున్నాయి.  పవర్, యాక్షన్, వినోదంతో నిండిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ను ఈ ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్‌లో కనిపిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రైలర్ అంతటా తన ట్రేడ్‌మార్క్ కరిష్మాను ప్రదర్శించారు. పంచ్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, వినోదభరితమైన క్షణాలు.. ప్రతి అంశం ప్రభావవంతంగా నిలిచి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మొత్తానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా అనిపిస్తోంది. హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ మాస్ పల్స్‌ను కరెక్ట్‌గా పట్టుకున్నారు. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్(Trisha Krishnan ) ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? రెండు దశాబ్దాల పాటు తన నటనతో, అందంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఈ చెన్నై చంద్రం.. త్వరలోనే వెండితెరకు దూరం కానున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ రాజకీయ వర్గాలు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. విజయ్, త్రిషల మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే, ఇటీవల జరిగిన ఓ వేడుకలో త్రిష, విజయ్‌తో కలిసి కనిపించడంతో.. TVK పార్టీలో ఆమె చేరడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం త్రిష, మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. సూర్యతో 'కరుప్పు', మోహన్ లాల్ తో 'రామ్' సినిమాలు కూడా చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా త్రిష కొత్త సినిమాలకు సంతకం చేయడం లేదని సమాచారం. తన వద్దకు వస్తున్న కథలను సున్నితంగా తిరస్కరిస్తూ, ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లను శరవేగంగా పూర్తి చేస్తోందట. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. TVK పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, తమిళ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని ఆమె భావిస్తోందట. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని త్రిష భావిస్తున్నట్లు సమాచారం.
మెగా మేనల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల తన చిరకాల స్నేహితురాలు నయనికరెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శిరీష్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. తాము డేటింగ్‌లో ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి, తమకు పుట్టబోయే పిల్లల గురించి చర్చించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా భాషా సంస్కృతుల పట్ల శిరీష్‌కు ఉన్న గౌరవం ఈ చర్చలో స్పష్టంగా కనిపించింది. తమ పిల్లలు ఇంట్లో కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలని తామిద్దరం నిర్ణయించుకున్నట్లు శిరీష్ తెలిపారు. ప్రస్తుత కాలంలో చాలామంది ఇళ్లలో పిల్లలు ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారని, కానీ తమ ఇంట్లో మాత్రం తెలుగు భాషకే ప్రాధాన్యం ఉండాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. నయనిక గురించి మాట్లాడుతూ.. ఆమెలో ఉండే నిజాయితీ అంటే తనకు చాలా ఇష్టమని శిరీష్ చెప్పారు. ఏదైనా విషయం నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తుందని, తన సినిమాల విషయంలో కూడా ఆమె ఇచ్చే ఫీడ్‌బ్యాక్ చాలా ఖచ్చితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమది ‘స్లో బర్న’ లవ్ స్టోరీ అని, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకున్నామని తెలిపారు. Also Read: 75 ఏళ్ల క్రితం రెండు కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ‘పాతాళభైరవి’ వారి ప్రేమ విషయం ఇంట్లో ఎలా తెలిసిందనేది కూడా ఒక ఆసక్తికరమైన కథ. ఒకసారి శిరీష్, నయనిక కాఫీ షాప్‌లో ఉండగా.. ఆ షాప్ యజమానికి చిరంజీవి భార్య సురేఖ (శిరీష్ అత్తమ్మ) బాగా తెలుసట. ఆయన వెంటనే ఫోన్ చేసి చెప్పడంతో విషయం ఇంట్లో అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి వేడుకలో తన అన్న అల్లు అర్జున్ ఇచ్చిన సలహా గురించి కూడా శిరీష్ ప్రస్తావించారు. “పెళ్లిలో కొన్ని పనులు అనుకున్నట్లు జరగకపోవచ్చు, కానీ ఆ క్షణాలను ఎంజాయ్ చేయడం మర్చిపోవద్దు” అని బన్నీ చెప్పారట. అన్నయ్య సలహాతో తాను పెళ్లి వేడుకలను ఎంతో ప్రశాంతంగా గడిపినట్లు శిరీష్ సంతోషం వ్యక్తం చేశారు. Also Read: మార్షల్ ఆర్ట్స్‌లో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో ప్రస్తుతం వీరిద్దరూ తమ కొత్త ఇంటి పనుల్లో బిజీగా ఉన్నారు. హనీమూన్‌కు వెళ్లడానికి ఇంకా సమయం ఉందని, ప్రస్తుతానికి వృత్తిపరమైన బాధ్యతలపై దృష్టి పెట్టామని శిరీష్ వివరించారు. పిల్లల పెంపకం, భాషాభిమానం విషయంలో శిరీష్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. చిన్న వయసులోనే అయాన్ చూపిస్తున్న ప్రతిభ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా అయాన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అయాన్ కనబరిచిన నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అల్లు అయాన్ ఎంతో ప్రొఫెషనల్‌గా కిక్స్ విసరడం, యాక్షన్ స్టంట్స్ చేయడం మనం చూడవచ్చు. ఒక చిన్నపాటి ఫైటర్‌ను తలపించేలా అయాన్ కదలికలు ఉన్నాయి. కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా, శారీరక దృఢత్వం కోసం అయాన్ తీసుకుంటున్న శిక్షణ పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ తన సినిమాల్లో డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో ఎంతటి పట్టుదల చూపిస్తారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అయాన్ కూడా అదే బాటలో నడుస్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు. ఫిట్‌నెస్ విషయంలో తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని, చిన్నతనం నుండే క్రమశిక్షణతో కూడిన శిక్షణ పొందుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయాన్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ చూసి కొందరు నెటిజన్లు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అయాన్ కూడా అదే తరహాలో గాల్లోకి ఎగిరి కిక్స్ ఇవ్వడం చూస్తుంటే, మెగా వారసుడిలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమాతో బాలనటిగా వెండితెరపై మెరిసింది. తన క్యూట్ యాక్టింగ్‌తో అందరి మనసు గెలుచుకుంది. ఇప్పుడు అయాన్ తన యాక్షన్ స్కిల్స్‌తో భవిష్యత్తులో వెండితెరపై ఒక మాస్ హీరోగా రాణించేందుకు పునాదులు వేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం ఫైటింగ్ మాత్రమే కాదు, అది క్రమశిక్షణకు మరియు ఏకాగ్రతకు చిహ్నం. అయాన్ చిన్న వయసులోనే ఇంతటి శ్రద్ధ చూపించడం అతని వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో చూసిన అల్లు అభిమానులు ‘లిటిల్ ఐకాన్ స్టార్‌’ అంటూ అయాన్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. మొత్తానికి అల్లు అయాన్ మార్షల్ ఆర్ట్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తన టాలెంట్‌తో కేవలం అల్లు అభిమానులనే కాకుండా, సామాన్య నెటిజన్లను కూడా అయాన్ ఫిదా చేస్తున్నాడు.  https://www.instagram.com/p/DVu2zoXjzmP/
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తూ హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో అత్యంత విలాసవంతమైన 'అల్లు సినిమాస్' (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ను సిద్ధం చేశారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ థియేటర్ లోపలి విజువల్స్, అక్కడ లభించే ఫుడ్ ఐటమ్స్ ధరలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్ సినీ ప్రియులకు కోకాపేట్ ఇప్పుడు ఒక కొత్త అడ్రస్‌గా మారబోతోంది. అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'అల్లు సినిమాస్' మల్టీప్లెక్స్ అధునాతన సాంకేతికతతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. మొత్తం నాలుగు స్క్రీన్‌లతో సిద్ధమైన ఈ థియేటర్‌లో స్క్రీన్-1 స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. సుమారు 75 అడుగుల భారీ స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఇక థియేటర్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పాప్‌కార్న్, సమోసా. సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో రేట్లు ఆకాశాన్ని తాకుతుంటాయి. అయితే అల్లు సినిమాస్‌లో ధరలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ పాప్‌కార్న్ ధరలు ₹250 నుండి ప్రారంభమై ₹480 వరకు ఉన్నాయి. సమోసా ₹110 కి లభిస్తుండటం విశేషం. సాండ్‌విచ్‌లు, బిర్యానీలు, పఫ్స్ కోసం విడివిడిగా సెక్షన్‌లు ఏర్పాటు చేశారు. వాల్ నట్ కేక్స్ వంటి వెరైటీలు కూడా అందుబాటులో ఉన్నాయి. థియేటర్ కెపాసిటీ విషయానికి వస్తే, స్క్రీన్-1 లో 644 మంది కూర్చునే వెసులుబాటు ఉండగా, మిగతా మూడు స్క్రీన్‌లలో ఒక్కో దానిలో దాదాపు 230 నుండి 250 మంది కూర్చోవచ్చు. మొత్తం మీద ఒకేసారి 1200 మంది సినిమా చూసేలా ప్లాన్ చేశారు. కార్పొరేట్ మీటింగ్స్ లేదా టీమ్ అవుటింగ్‌ల కోసం కూడా థియేటర్లను బల్క్ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఇక్కడ ఉంది. పార్కింగ్ సమస్య లేకుండా విశాలమైన ఓపెన్ ప్లేస్ కేటాయించడం ఈ మల్టీప్లెక్స్ మరో ప్లస్ పాయింట్. సాధారణంగా పెద్ద మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ దగ్గరే అరగంట సమయం వృధా అవుతుంది, కానీ ఇక్కడ ఆ ఇబ్బంది ఉండదని మేనేజ్మెంట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో ఈ థియేటర్లు పూర్తిస్థాయిలో సందడి చేయబోతున్నాయి.
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్ర వేశారు సముద్రఖని(Samuthirakani). విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యారు. 'విమానం' వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో మరో సినిమా రాబోతుంది. అదే ‘కార్మేని సెల్వం’(Carmeni Selvam). పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో  తెలుగు, తమిళ భాషల్లో  రూపొందుతున్న  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  ‘కార్మేని సెల్వం’ సినిమా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆకట్టుకోగా.. రీసెంట్ గా విడుదలైన టీజర్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది.  "డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచుతుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు వంటి విషయాలను వివిధ కోణాల్లో చూపిస్తూ నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంది.  ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్  ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. ఓ వైపు సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు, మరోవైపు విదేశాల్లో ఒంటరిగా కనిపించే కొన్ని షాట్లు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్ చివర్లో “ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుడిలా బతకడం నేర్చుకోవాలి.. లెక్క లేకుండా ఖర్చు పెట్టండి.. డబ్బు లేకపోతే అప్పు చేసి ఖర్చు పెట్టండి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తించేలా ఉంది. ప్రస్తుతం ఈ టీజర్ లోని డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటి సమాజం డబ్బు చుట్టూ ఎలా తిరుగుతుంది అనేది మంచి ఎమోషనల్ రైడ్ లా చూపించబోతున్నారని టీజర్ తో స్పష్టమైంది.
'NBK 111' నుంచి అదిరిపోయే అప్డేట్ భారీ ఫైట్ సీక్వెన్స్‌ లో బాలయ్య విశ్వరూపం  దసరాకు థియేటర్లలో మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద "జై బాలయ్య" అనే నినాదం వినిపిస్తే వచ్చే వైబ్రేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం గొపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న కొత్త సినిమా 'NBK 111' గురించి వినిపిస్తున్న అప్డేట్స్ చూస్తుంటే, థియేటర్లలో మరోసారి మాస్ జాతర మొదలవ్వడం ఖాయమనిపిస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ ఈ సినిమా షూటింగ్ ఈ నెల 5వ తేదీన అల్యూమినియం ఫ్యాక్టరీలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కదిలించే ఎమోషన్ కూడా బ్లెండ్ చేస్తూ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫైట్స్ అన్నీ నైట్ ఎఫెక్ట్ లో జరుగుతుండటం విశేషం. గతంలో బాలయ్యకి 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి పవర్‌ఫుల్ ఫైట్స్ అందించిన వెంకట్ మాస్టర్ ఈ సినిమాకు కూడా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆయన డిజైన్ చేస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు. బాలయ్య గెటప్ - ఒక రహస్యం బాలయ్య సినిమాల్లో ఆయన గెటప్ సెట్ అయితే 50% సినిమా సక్సెస్ అయినట్లే అని అభిమానులు భావిస్తారు. అందుకే ఈ సినిమాలో ఆయన లుక్ విషయంలో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. షూటింగ్ స్పాట్‌లో ఎవరూ ఫోటోలు తీయకుండా కఠినమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇటీవల సెట్స్‌లోనే దర్శకుడు గొపీచంద్ మలినేని బర్త్ డే వేడుకలు అర్ధరాత్రి జరిగాయి, కానీ బాలయ్య గెటప్ బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఆ ఫోటోలను కూడా యూనిట్ రిలీజ్ చేయలేదు. ఈ సినిమాలో బాలయ్యది ఒకే రోల్ అయినప్పటికీ, అందులో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని సమాచారం. షూటింగ్ టార్గెట్ బాలకృష్ణ, నయనతార కాంబినేషన్లో వస్తున్న నాలుగవ సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా షూటింగ్‌ను సుమారు 120 రోజుల్లో పూర్తి చేసి, వచ్చే దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఫైట్ సీక్వెన్స్ తర్వాత కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు. యాక్షన్, డైలాగులు, ఎమోషన్.. ఈ మూడు సరైన మోతాదులో ఉంటే బాలయ్య సినిమా రేంజ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానూలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దసరా బరిలో బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో వేచి చూడాలి. మరిన్ని ఎక్స్ క్లూజివ్ అప్డేట్స్ కోసం మా 'తెలుగువన్ సినిమా' (TeluguOneCinema) యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
పెళ్లిపీటలు ఎక్కుతున్న అనుష్క శెట్టి ప్రేమ పెళ్ళా? పెద్దలు కుదిర్చిన పెళ్ళా? వరుడు ఎవరో తెలుసా? టాలీవుడ్ 'లేడీ సూపర్ స్టార్' అనుష్క శెట్టి(Anushka Shetty) పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా ఆమె వివాహం గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నప్పటికీ, ఈసారి మాత్రం పెళ్లి దాదాపు ఖాయమైందని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అనుష్క బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని, సదరు వ్యాపారవేత్త కుటుంబం అనుష్క కుటుంబానికి అత్యంత సన్నిహితులని సమాచారం. అనుష్క స్వతహాగా మంగళూరుకు చెందిన కన్నడ అమ్మాయి కావడంతో, తన సొంత ప్రాంతానికి చెందిన వ్యక్తితోనే ఏడడుగులు వేయడానికి మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క వయసు 44 ఏళ్లు. గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పెళ్లి అంటూ అనేక రూమర్లు వచ్చినప్పటికీ, వారిద్దరూ కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ అని పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.  'బాహుబలి' తరువాత అనుష్క సినిమాలు తగ్గించింది. మూవీ ప్రమోషన్స్ లోనూ కనిపించడంలేదు. గతేడాది అనుష్క నటించిన 'ఘాటి' చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆమె మలయాళంలో 'కథనార్' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అనుష్క తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంది. అయితే, ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య చర్చలు ముగిశాయని, త్వరలోనే ముహూర్తం ఖరారు చేసి అధికారికంగా వెల్లడిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ ఏడాది టాలీవుడ్‌లో అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్ ఇదే కానుంది. Also Read: ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన నిర్మాత కన్నుమూత 
అల్లు అర్జున్‌ను కలవాలంటే ప్రోటోకాల్స్ ఉంటాయా? '42 రూల్స్' నిజమేనా? బన్నీ మేనేజర్ శరత్ చంద్ర షాకింగ్ రియాక్షన్! ఆర్‌ఎఫ్‌సిలో ఈటీవీ విన్ సాయికి ఎదురైన అనుభవం? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)ను కలవాలంటే కఠినమైన నిబంధనలు పాటించాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆయన మేనేజర్ శరత్ చంద్ర స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు. కొద్దిరోజుల క్రితం ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరువా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు తనకి'42 రూల్స్'తో కూడిన ఒక లిస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. "సార్ కళ్ళలోకి నేరుగా చూడకూడదు", "షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు", "ఆయన అడిగితే తప్ప మాట్లాడకూడదు" వంటి వింత రూల్స్ ఆ జాబితాలో ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో అల్లు అర్జున్ పై నెగెటివ్ ట్రోలింగ్ జరిగింది. దీంతో బన్నీ టీమ్.. ఆ ఆరోపణలను ఖండించడమే కాకుండా, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.  అయితే వివాదం ముదరడంతో బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరువా.. తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, అల్లు అర్జున్ కి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇదే విషయంపై తాజాగా బన్నీ మేనేజర్ శరత్ చంద్ర క్లారిటీ ఇచ్చారు. ఆయన నిర్మాతగా పరిచయమవుతున్న 'గుర్తుకొస్తున్నాయి' గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో.. అల్లు అర్జున్ ని కలవాలంటే "42 రూల్స్ ప్రోటోకాల్" ఉంటుందనే వార్త నిజమేనా? అని మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.  ఈ ఆరోపణలను శరత్ చంద్ర తీవ్రంగా ఖండించారు. అసలు అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం నేను చెప్పడం కాదు.. రామోజీ ఫిల్మ్ సిటీలో 'గుర్తుకొస్తున్నాయి' షూటింగ్ సమయంలో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణకు ఎదురైన అనుభవాన్ని ఆయనే పంచుకుంటారంటూ మైక్ అందించారు. "రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లు అర్జున్ గారు ఒక యాడ్ షూట్ లో ఉన్నారు. నేను అనుకోకుండా శరత్ ని కలవడానికి అక్కడికి వెళ్ళాను. బన్నీ గారు చాలా ఆప్యాయంగా పలకరించి, షేక్ హ్యాండ్ ఇచ్చారు." అని ఈటీవీ విన్ సాయి చెప్పుకొచ్చారు. శరత్ చంద్ర, సాయి ఇచ్చిన క్లారిటీతో "అల్లు అర్జున్ 42 రూల్స్" ట్రోల్స్ కి ఇకనైనా బ్రేక్ పడుతుందేమో చూడాలి.
  మూవీ : మేడిన్ కొరియా నటీనటులు: ప్రియాంక మోహన్,  పార్క్ హే-జిన్, సి-హున్ బేక్, రిషికాంత్ తదితరులు ఎడిటింగ్: ఆంథోని సినిమాటోగ్రఫీ: ప్రసన్న కుమార్ మ్యూజిక్: ధరణ్ కుమార్ నిర్మాతలు: శ్రీనిధి సాగర్ దర్శకత్వం: రా. కార్తీక్ ఓటీటీ: నెట్ ఫ్లిక్స్ కథ:  శెన్బా (ప్రియాంక అరుళ్ మోహన్) తమిళనాడులోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన యువతి. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేని ఒక విలేజ్ లో ఆమె నివసిస్తూ ఉంటుంది. కొండ ప్రాంతంలోని ఆ గ్రామంలో ఆమె తండ్రి ఒక చిన్నపాటి హోటల్ నడుపుతూ ఉంటాడు. చాలాకాలం క్రితం కన్యాకుమారి  నుంచి కొరియా వెళ్లిన ఒక రాణిగారి పాత్రను స్కూల్ వార్షికోత్సవంలో శెన్బా పోషిస్తుంది. ఆ పాత్ర ఆమెపై చాలా ప్రభావం చూపిస్తుంది. అప్పటి నుంచి ఆమెకి 'కొరియా' చూడాలనే ఒక కోరిక పుడుతుంది. వయసుతో పాటే ఆ కోరిక బలపడుతుంది. అయితే మణి అనే అబ్బాయిని ప్రేమిస్తుంది శెన్బా. తల్లిదండ్రులతో చెప్పకుండా మణితో కలిసి కొరియాకి వెళ్ళాలనుకుంటుంది. అయితే మణి మాత్రం తనని డబ్బు కోసమే ప్రేమించినట్టు నటిస్తాడు. ఇక ఒక్కతే కొరియాకి వెళ్తుంది శెన్బా‌. మరి ఊరు కాని ఊరు.. దేశం కానీ దేశంలో శెన్బా ఎలా సర్వైవ్ అయింది అనేది మిగతా కథ. విశ్లేషణ:  ప్రతీ ఒక్కరికి బాల్యం నుండి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అందులో ఒకటి పెద్దయ్యాక నెరవేర్చుకోవాలని అనుకుంటారు. అలాగే ఈ కథలో హీరోయిన్ శెన్బా దేశం కానీ దేశంలో , ప్రేమించిన వ్యక్తి నమ్మించి మోసం చేస్తే తనకి ఎదురైన కష్టాలని దాటుకొని తను ఎలా లైఫ్ లో నిలబడిందనేది ఈ సినిమా కథ.  సినిమా మొదట్లో కాస్త బాగున్నప్పటికి శెన్బా, మణిల లవ్ ట్రాక్ అంతగా ఇంపాక్ట్ చూపించదు. ఇక కొరియాకి వెళ్ళాక కథగా వేగంగా మందుకు సాగుతుంది. శెన్బా తన నటనతో కట్టిపడేసింది ఇక్కడే. తనకి వచ్చిన కష్టాలని లెక్కచేయకుండా తనకి తోచిన సాయం చేస్తూ వెళ్ళిన హీరోయిన్ లైఫ్ ఎలా మారిందో దర్శకుడు చూపించిన తీరు బాగుంది. అయితే బామ్మ క్యారెక్టర్ కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ కి వెళ్ళేసరికి జనాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు‌. సినిమా చివర్లో కలుపుకుంటూ పోతే గెలుపు నీదే అవుతుంది అనే మెసెజ్ ని ఇచ్చారు.  ఈ సినిమాకి ఇంకో ప్లస్ ఏంటంటే నిడివి.. ఇది రెండు గంటల లోపే ఉంది. సాధారణంగా ఇలాంటి కథలని ఎంత తక్కువ నిడివితో ఫినిష్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే జనాలకి బోర్ అనిపిస్తుంది. కానీ దర్శకుడు ఎక్కడా ఆ ఫీల్ రాకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే మధ్యలో కొన్నిచోట్ల క్యారెక్టర్ సహజత్వాన్ని ఆడియన్ కి కనెక్ట్ చేయడానికి డీప్ గా చూపించాడు. ఇలా అక్కడక్కడా నిదానంగా నడిచినట్టు అనిపించినా, ఫీల్ మిస్సవ్వకుండా తీసుకెళ్ళాడు దర్శకుడు. ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా ఇది. అసభ్య పదజాలం వాడలేదు. అశ్లీల దృశ్యాలు లేవు. ఎడిటింగ్ బాగుంది. మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: శెన్బాగా ప్రియాంక మోహన్ ఒదిగిపోయింది. మిగిలిన వాళ్ళంతా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.  ఫైనల్ గా :  వన్ టైమ్ వాచెబుల్ రేటింగ్ : 2.5 /5  ✍️. దాసరి మల్లేశ్  
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో.. అంతే కరెంట్ బిల్లు కూడా తెచ్చిపెడుతుంది.  ఏసీని ఎక్కువగా వాడితే వేలాది రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది.  ఈ కారణంగానే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏసీ పెట్టించుకోవాలి అనే ఆశ ఉన్నా, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయంతో ఆ ఆలోచన మానుకుంటారు. అయితే ఏసీ రోజంతా వాడినా సరే.. కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదంటే కొన్ని సీక్రెట్ ట్రిక్స్  ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే.. టెంపరేచర్... చాలామంది ఏసీ ఆన్ చేశారంటే తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటారు.  ఎక్కువ మంది 17 లేదా 15 వరకు కూడా పెడుతుంటారు. కానీ ఏసీ ని ఎప్పుడూ 26డిగ్రీల వద్ద పెడితే సరిపోతుంది.  ఇది రూమ్ మొత్తం చల్లదనాన్ని ఇస్తుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఏసీ, ప్యాన్ కాంబినేషన్.. ఏసీ, ప్యాన్ కాంబినేషన్ గురించి చాలామందికి తెలియదు.  ఏసీ వేసినప్పుడు ప్యాన్ ఎందుకు అని కొందరు అనుకుంటారు.  కానీ ఏసీ వేసినప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి.  ఇలా చేస్తే గది తొందరగా చల్లబడుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఆప్ చేసుకోవచ్చు. డోర్స్, విండోస్.. చాలామంది ఏసీ ఆన్ చేసి డోర్స్, విండోస్ తెరచి ఉంచుతారు. కానీ ఇది చాలా తప్పు.  డోర్స్, విండోస్ తెరచి ఉంచడం వల్ల బయటి వేడి గాలి లోపలి వస్తూ గదిని చల్లబడనివ్వదు.  దీనివల్ల ఏసీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. కర్టెన్లు.. కిటికీలకు గాజు అద్దాలు ఉంటే.. వేడి సెగ అనేది లోపలికి వస్తూ ఉంటుంది.  అందుకే కిటికీ ల దగ్గర కర్టెన్లు వేయాలి.  ఇలా చేస్తే వేడి లోపలికి రాదు. ఫిల్టర్.. చాలామంది వేసవి రాగానే ఏసీ వేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ,  ఏసీ ఫిల్టర్ల గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.  ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయాలి.  వాటిలో డస్ట్ అలాగే ఉంటే ఏసీ పని చేయడానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా ఫిల్టర్ల లో ఉండే డస్ట్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.  శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. స్లీప్ మోడ్ లేదా టైమర్.. వేసవిలో కాసింత చల్లగాలి తగిలితే చాలు నిద్రపోవచ్చు అనుకునేవారు ఏసీని  ఆన్ చేసినప్పుడు స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. ఇది సెట్ చేస్తే ఏసీ దానంతకు అదే ఆఫ్ అవుతుంది.  ఇది సెట్ చేసుకొనేటప్పుడు రూమ్ లో ప్యాన్ ఆన్ లో ఉంచితే.. ఏసీ ఆప్ అయినా ఫ్యాన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగకుండా హాయిగా నిద్రపోవచ్చు. పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే ఏసీ ఎంత వాడినా సరే.. కరెంట్ బిల్లు హడలిపోయేంతగా రాదు.  ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.                                        *రూపశ్రీ.
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు,  ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం,   నిరంతరం  అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి. పెరుగుతున్న వేడి,  వేడిగాలుల కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  వేసవి కాలంలో  హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు తాగుతారు,  కానీ అది శరీరాన్ని చల్లబరచదు. ఎన్ని నీళ్లు తాగినా తృప్తి కలగదు.  మార్కెట్ లో పానీయాలు కొనుగోలు చేయడం,  మరీ ముఖ్యంగా కూల్ డ్రింకుల కొనుగోలు వేసవిలో బాగా పెరుగుతాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి.  ఈ వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని పానీయాలు తీసుకోవడం మంచిది. భారతీయులకు ఎంతో సుపరిచితమైన,  ఆరోగ్యానికి మేలు చేస్తూ వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలు ఏంటో తెలుసుకుంటే.. బేల్ షర్బత్.. పరమ శివుడి ఆరాధనలో ఉపయోగించే బిల్వ  పత్రం మాత్రమే మనకు తెలుసు. కానీ బిల్వ వృక్షానికి పండ్లు కూడా కాస్తాయి.  వీటినే బిల్వ పండ్లు లేదా బేల్ పండ్లు అని మారేడు కాయలు అని అంటూ ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బాగా పండిన బిల్వ పండ్లను జ్యూస్ చేసి తాగితే శరీరం చల్లబడుతుంది. కావలసిన పదార్థాలు.. పండిన బిల్వ పండు చల్లని నీరు.. 4 గ్లాసులు బెల్లం లేదా చక్కెర.. 3 నుండి 4 స్పూన్లు నల్ల ఉప్పు.. కొద్దిగా. తయారు విధానం.. బిల్వ పండును పగలగొట్టి గుజ్జు తీయాలి.  ఈ గుజ్డులో నీరు పోసి బాగా బ్లెండ్ చేయాలి.  స్ట్రైయినర్ సహాయంతో వడబోయాలి. ఇందులో బెల్లం లేదా పంచదార,  నల్ల ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత తాగాలి. ఆమ్ పన్నా.. వేసవి అంటే మామిడికాయలు.  పచ్చి మామిడి కాయలతో చేసే ఆమ్ పన్నా రుచిగానే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. కావలసిన పదార్థాలు.. పచ్చి మామిడికాయలు.. 2 బెల్లం లేదా చక్కెర.. 3 టీస్పూన్లు వేయించిన జీలకర్ర పొడి నల్ల ఉప్పు పుదీనా.. తయారీ విధానం.. మామిడికాయలు ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి.  గుజ్జులో బెల్లం లేదా చక్కెర వేయాలి. ఇందులో కాసింత పుదీనాను వేసి మిక్సీ వేసుకోవాలి.  దీనికి కావలసినంత నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలిపి తాగాలి.  ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జల్ జీరా.. జల్ జీరా పేరు వింటేనే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది.  ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం,  శరీరానికి చలువ,  గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కూడా ఇస్తుంది. కావలసిన పదార్థాలు.. జల్ జీరా పొడి నీరు పుదీనా నిమ్మరసం నల్ల ఉప్పు తయారీ విధానం.. చల్లని నీటిలో జల్ జీరా పొడి,  నిమ్మరసం, నల్ల ఉప్పు,  పుదీనా అన్నీ వేసి బాగా కలిపి తాగడమే.   సత్తు జ్యూస్.. బీహార్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో సత్తును వేసవిలో  తాగుతారు. ఇది చాలా శక్తివంతమైన పానీయం.  కడుపును చల్లబరుస్తుంది,  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. కావలసిన పదార్థాలు.. సత్తు పొడి.. నల్ల ఉప్పు.. వేయించిన జీలకర్ర పొడి నిమ్మరసం తయారీ విధానం.. నీటిలో సత్తు పొడి, నల్ల ఉప్పు,  వేయించిన జీలకర్ర పొడి అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.  ఇందులో కాసింత నిమ్మరసం కలిపి తాగాలి. మజ్జిగ.. బారతీయులు ఎక్కువగా తాగే ఆరోగ్యకరమైన పానీయం మజ్జిగ.  పెరుగు నుండి  వెన్నను తీయగా మిగిలిన పానీయమే మజ్జిగ.  ఈ మజ్జిగ మరింత రుచిగా ఉండటానికి ఇందులో అల్లం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు,  పొదీనా వేసి తాగుతారు.  మజ్జిగ మరింత రుచిగా రావడానికి కరివేపాకుతో పోపు పెట్టి తాగుతారు.  ఇందులో కొత్తి మీర వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది.                               *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 బిలియన్ల మంది ఊబకాయం (Obesity) మరియు దాని సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ఇది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య కాదు.. ఇది మన ఆయుష్షును తగ్గించే ఒక నిశ్శబ్ద శత్రువు. ఈ రోజు మనం మన ఆరోగ్యం గురించి గంభీరంగా ఆలోచించకపోతే, రేపు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  Metabolic and Bariatric Surgeon Dr. Kona Lakshmi చెప్పిన మరిన్ని విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి. మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? (Why should we care?) ఊబకాయం అనేది ఇతర ప్రమాదకరమైన రోగాలకు ఒక ముఖద్వారం లాంటిది. దీనివల్ల కలిగే నష్టాలు ఊహించలేనంత దారుణంగా ఉంటాయి: గుండె మరియు ఊపిరితిత్తులపై ప్రభావం: మీ బరువు పెరిగేకొద్దీ మీ ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది గుండె దెబ్బతినడానికి దారితీస్తుంది. సడన్ కార్డియాక్ డెత్స్‌కు ఊబకాయం ప్రధాన కారణం. క్యాన్సర్ ముప్పు: దాదాపు 13 రకాల క్యాన్సర్లు నేరుగా ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. మెటబాలిక్ వ్యాధులు: డయాబెటిస్ (షుగర్), హై బ్లడ్ ప్రెషర్, మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు బాడీలోని "ఇంజిన్"ను లోపల నుండి దెబ్బతీస్తాయి. కీళ్ల నొప్పులు: అధిక బరువు వల్ల ఆర్థరైటిస్ వంటి కీళ్ల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఏమి చేయకూడదు? (What not to do?) మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మనల్ని అనారోగ్యం వైపు నెట్టేస్తాయి: పెద్ద సైజు దుస్తులపై ఆధారపడకండి: మార్కెట్‌లో 3XL నుండి 5XL వరకు దుస్తులు దొరుకుతున్నాయి కదా అని, బరువు తగ్గడానికి బదులు పెద్ద సైజు బట్టలు కొనడం అలవాటు చేసుకోవద్దు. మీ డ్రెస్ సైజు పెరుగుతుంటే, మీ అనారోగ్యం పెరుగుతోందని గుర్తించండి. నిర్లక్ష్యం వద్దు: "నేను బాగానే నడుస్తున్నాను కదా, నాకు ఏమీ కాదు" అని భ్రమపడకండి. లోపల షుగర్ లేదా కొలెస్ట్రాల్ ఎంత ఉందో బయటకి కనిపించదు. కెమికల్స్ వినియోగం: ఫుడ్ కలర్స్, పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం మరియు విపరీతమైన కెమికల్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. ఆరోగ్యం కోసం ఏం చేయాలి? (How to manage?) BMI పర్యవేక్షణ: మీ ఎత్తుకు తగ్గ బరువు (BMI) ఉన్నారో లేదో చూసుకోండి. సాధారణంగా BMI 18 నుండి 24 మధ్య ఉండాలి. ముందస్తు గుర్తింపు: మీకు ఆయాసం వస్తున్నా లేదా 15 నిమిషాలు కూడా నిరంతరంగా నడవలేకపోతున్నా మీ సిస్టమ్ ఫెయిల్ అవుతుందని అర్థం. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. జీవనశైలి మార్పులు: కాలుష్యం, జంక్ ఫుడ్ మరియు కెమికల్స్ కు దూరంగా ఉంటూ, శారీరక శ్రమను పెంచుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) 1. సన్నగా ఉన్నవారికి కూడా ఊబకాయం సమస్యలు ఉంటాయా?  అవును, బరువు తక్కువగా ఉన్నా మెటబాలిక్ సమస్యలు (షుగర్, బిపి) ఉండవచ్చు. ఊబకాయం అంటే కేవలం బయటకి కనిపించే కొవ్వు మాత్రమే కాదు, శరీర అంతర్గత వ్యవస్థల పనితీరులో లోపం కూడా. 2. 'మార్బిడ్ ఒబేసిటీ' అంటే ఏమిటి? BMI 40 కంటే ఎక్కువ ఉంటే దానిని 'మార్బిడ్ ఒబేసిటీ' అంటారు. ఈ స్థితిలో ఊబకాయం అనేది కేవలం బరువు సమస్య కాదు, అది ప్రాణాపాయ స్థితిని (Life risk) సూచిస్తుంది. 3. బేరియాట్రిక్ సర్జరీ అంటే కేవలం బరువు తగ్గడమేనా?  కాదు, ఈ సర్జరీ వల్ల బరువు తగ్గడంతో పాటు మెటబాలిక్ డిసీజెస్ (డయాబెటిస్, హై బిపి) కూడా కంట్రోల్ అవుతాయి, అందుకే దీనిని మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ అంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఊబకాయం అనేది మనకు సమయం ఇస్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. రేపటి తరానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వాలంటే ఈ రోజే మనం మారాలి. ఆరోగ్య విషయాలపై మరింత లోతైన అవగాహన కోసం మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా జీవించండి!
ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం తప్పనిసరి. నేటికాలంలో ఆహారం విషయంలో చాలా సీరియస్ నెస్ వచ్చింది.  నిజానికి నేటికాలంలో పుడీస్ ఎక్కువ అయ్యారు.  నచ్చిన ఆహారం తినడంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు, నచ్చినంత తినడంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కారు. అయితే ప్రతి రోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం ఎంత సహాజమో.. ఆహారం తీసుకోగానే 10 నిమిషాలు నడవడం అంత ముఖ్యమని అంటున్నారు వైద్యులు,  ఫిట్‌నెస్ నిపుణులు.  ఆహారం తీసుకున్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. వాకింగ్.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి కష్టం లేకుండా, డబ్బు ఖర్చుపెట్టకుండా చేయగలిగే అతి తేలిక వ్యాయామం ఏదైనా ఉందంటే అది వాకింగ్ ఏ.  వాకింగ్ ను చాలామంది దినచర్యలో భాగం చేసుకుంటారు.  ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ వెళ్లడం చేస్తుంటారు. కానీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం తిన్న తర్వాత ఓ 10 నిమిషాలు నడవడం చాలా మంచి అలవాటు అని అంటున్నారు. తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే కలిగే ప్రయోజాలు.. భోజనం తర్వాత ప్రతి రోజూ 10 నిమిషాలు నడిస్తే కాళ్ల కండరాలు బలపడతాయట.  ఇది ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని రోజులలోనే చాలా మంచి ఫలితాలు గమనించవచ్చని అంటున్నారు. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య షుగర్.  రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం వల్ల ఆహారం తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు.  అయితే ప్రతిరోజూ ఆహారం తీసుకున్న తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది అని అంటున్నారు.   ఆహారం తిన్న తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల  బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  వాకింగ్ చేయడం వల్ల శరీర కదలికలు జరిగి పేగులు కూడా కదలికలకు లోనవుతాయి.  జీవక్రియ  మెరుగవుతుంది.   ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురయ్యే వారు ఉంటారు.  ఇలాంటి వారు బోజనం చేసిన తర్వాత 10న నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవాలి.  ఇది చాలా గొప్పగా సహాయపడుతుంది.  మనసును ప్రశాంత పరుస్తుంది.  ఒత్తిడి తగ్గిస్తుంది. నేటికాలంలో చాలా మంది పొట్ట ఆరోగ్యంతోనే ఇబ్బంది పడుతున్నారు.  చాలామందికి పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. నిజానికి ఇలాంటి వారికే డయాబెటిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే బోజనం చేయగానే కూర్చోవడం లేదా పడుకోవడం చేయకుండా 10 నిమిషాలు వాకింగ్ చేస్తే పొట్ట వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బరువు కూడా తగ్గుతారు.                                   *రూపశ్రీ.