LATEST NEWS
పశ్చిమ బెంగాల్ సీఎం రేసులో ముందు వరుసలో కనిపిస్తున్న సువేందు అధికారి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు.  ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి..  మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.  ఈ సందర్భంగా సువేందు స్పందిస్తూ.. తమ తదుపరి టార్గెట్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..  బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేతను ఉద్దేశించి..  మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీల పనైపోయిందని.. తర్వాతి వంతు అఖిలేశ్ యాదవేనని హెచ్చరించారు.  తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు సువేందు. ఆప్‌లాగే టీఎంసీ కూడా అవినీతిమయమైందని, పతనం ఖరారైందని విమర్శించారు. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని.. అందుకే నందిగ్రామ్‌ ప్రజలు మరోసారి తనను గెలిపించారన్నారు. దీదీ రాజకీయ బహిష్కరణ ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలోనే టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరతారని   జోస్యం చెప్పిన సువేందు అధికారి.. ఇక తమ   దృష్టిపి  సమాజ్‌వాదీ పార్టీపై కేంద్రీకరిస్తామని అఖిలేశ్ యాదవ్‌కు హెచ్చరిక జారీచేశారు.  ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా.. తూర్పు మిడ్నాపూర్ వంటి జిల్లాలలో టీఎంసీ ఎదుగుదలలో సువేందు కీలక పాత్ర పోషించారు. కానీ.. 2020లో మమతతో విబేధించి బీజేపీలో చేరారు. ఆపై ఆమె ఓటమిని శాసించారు. నందిగ్రామ్‌లో టీఎంసీకి చెందిన పవిత్ర కర్‌ను కూడా సువేందు ఓడించారు. ఇప్పుడు బీజేపీ సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉంది.
అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో   అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ,  పద్ధతి ప్రకారం ఓట్ల చోరీని అమలు చేసిందనీ ధ్వజమెత్తారు.   కేంద్రంలోని అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించి ఓటర్ల తీర్పును తారుమారుచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.  ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో  బీజేపీ  ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం (మే 4)   తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో చేసిన ఓ పోస్టులో.. పశ్చిమ బెంగాల్‌లో వందకు పైగా సీట్లలో ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు.  ఇది బీజేపీకి తెలిసిన పాత వ్యూహమేనని, గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా పద్ధతిని చూశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  బీజేపీ ఎన్నికలనే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించే వ్యవస్థల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందని ఆయన ధ్వజమెత్తారు.   
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తలరాతలు మార్చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ప్రభుత్వాధినేత పినరయి విజయన్‌లు మాజీలుగా మిగిలిపోనున్నారు. మరోవైపు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. అదనంగా పశ్చిమబెంగాల్‌లో ఎన్టీఏ హవా కొనసాగింది. కేరళలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఎల్‌డీఎఫ్ విజయకేతనం ఎగరవేసింది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ సారథ్యంలోని టీవీకే చెక్ పెట్టింది.  పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ..  2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి   ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.  ఇక తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ కరుణానిధి తండ్రి కరుణానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిదే విజయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమై, విజయ్ సారథ్యంలోని టీవీకే తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల అధిపత్యాన్ని తుడిచిపెట్టింది.  దాంతో పదేళ్ల తర్వాత డీఎంకేను తిరిగి అధికారంలోకి తెచ్చిన సీఎం స్టాలిన్ మాజీగా మిగిలిపోనున్నారు. కేరళ చరిత్రలో వరుసగా రెండు సార్లు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పినరయి విజయన్‌కు తాజా ఎన్నికల ఫలితాలతో షాక్ తప్పలేదు. ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పునిస్తూ ప్రభుత్వాన్ని మార్చేసే కేరళ ఓటర్లు సీపీఐ(ఎం)కు చెందిన విజయన్‌పై నమ్మకంతో వరుసగా రెండో సారి పట్టం కట్టారు.  2016 ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ కూటమి నుంచి గెలిచి మొదటి సారి సీఎం అయి, పూర్తి పదవీ కాలం పూర్తి చేసుకుని, తిరిగి 2021 ఎన్నికల్లో ఎన్నికైన కేరళ మొదటి ముఖ్యమంత్రి ఆయనే. అయితే ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్‌ను చిత్తుగా ఓడించింది. ఆ క్రమంలో పినరన్ మాజీ సీఎంల జాబితాలో చేరనున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అస్సాం, పుదుచ్చేరిల్లో వరుసగా రెండో సారి సీఎం బాధ్యతలు చేపట్టబోతున్న ఎన్డీఏ సీఎంలు  హిమంత బిశ్వ శర్మ, ఎన్.రంగస్వామిలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా రెండోసారి గెలుపొందడం విశేషం.
తమిళనాడు రాజకీయాల్లో  నటుడు విజయ్ పార్టీ  తమిళగ వెట్రి కజగం  (టీవీకే) విజయం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇటీవలే తెలంగాణలో సొంత పార్టీ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత విజయం రాజకీయ ప్రభంజనంపై హర్షం వ్యక్తం చేశారు.  ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు. భ్రష్టుపట్టిపోయిన   రాజకీయ చరిత్రను తిరగ రాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళ ప్రజలు తమ తీర్పు ద్వారా నిరూపించారని  ఎక్స్ వేదికగా పేర్కొన్న కవిత.. 
సంకోచాలు, సవాళ్లు, వ్యక్తిగత వివాదాలు ఇవేవీ విజయ్ ను నిలువరించలేకపోయాయి.   తమిళనాట  దళపతి రాజకీయ ప్రభంజనం సృష్టించారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని అందుకోవడంతో  తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది.  తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినీ గ్లామర్‌తో పెనవేసుకుపోయి ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి హేమాహేమీల తర్వాత ఆ స్థాయిలో జనాకర్షణ ఉన్న నాయకుడు ఎవరనే ప్రశ్నకు విజయ్ సమాధానంగా నిలిచారు. తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది.  ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు. భార్యతో విడాకుల ప్రచారాలు, నటి త్రిషాతో ముడిపెట్టి చేసిన విమర్శలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భాష్యాలు చెప్పారు. కానీ..  తమిళ ఓటర్లు వ్యక్తిగత విషయాల కంటే విజయ్ ఆశయాలకే పెద్దపీట వేశారు.  ప్రచార పర్వంలో జరిగిన ఒక బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి సరైన అనుమతులు లేకపోవడంతో విజయ్ మలేషియాకు వెళ్లి అక్కడి నుండే డిజిటల్ ప్రచారం నిర్వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా తన పోరాటాన్ని కొనసాగించారు. జాతీయ స్థాయి విశ్లేషకులు టీవీకే పార్టీకి స్వల్ప స్థానాలే దక్కుతాయని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే తేల్చాయి. కానీ.. ఫలితాలు మాత్రం యావత్తు భారతదేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ఏకంగా 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి..  ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకునే  మ్యాజిక్ ఫిగర్ కు అతి చేరువకు చేరుకున్నారు.   దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి సాంప్రదాయ పార్టీల ఆధిపత్యానికి ఆయన బ్రేక్ వేశారు.  విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఆయన సినిమా ఇమేజ్ వల్ల వచ్చింది కాదు. ప్రజల్లో ఆయనపై ఉన్నఅపార విశ్వాసానికి  నిదర్శనం. ఎంజీఆర్, జయలలిత వంటి చారిత్రాత్మక నాయకుల వారసత్వాన్ని విజయ్ నిలబెడతారని ప్రజలు విశ్వసిస్తున్నారు. అవినీతి రహిత, ప్రజాహిత పాలనను ఆయన అందిస్తారని సామాన్యులు ఆశిస్తున్నారు.  ఇక దళపతి ‘విజయ్ అనే నేను’ అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). 2024 లో విడుదలైన ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘కల్కి 2’ (Kalki 2) కోసం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి పల్లవి ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్లాన్ చేసిన కీలక షెడ్యూల్ రద్దయినట్లు సమాచారం. నిజానికి ప్రభాస్, సాయి పల్లవి కాంబినేషన్‌లో నిన్నటి (మే 4) నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, అనూహ్యంగా సాయి పల్లవి అనారోగ్యానికి గురికావడంతో, ఆమె సెట్స్‌కు రాలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక చిత్ర బృందం ఆ షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చిందని ఫిలిం నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణెను తప్పించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఈ ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు తమ పోర్షన్ షూటింగ్‌లో పాల్గొనగా, ప్రభాస్ త్వరలోనే తిరిగి జాయిన్ కావాల్సి ఉంది. సాయి పల్లవి కోలుకున్న వెంటనే ఈ షెడ్యూల్‌ను మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉంది.  
Thalapathy Vijay has officially taken the political world by storm with his TVK party securing a massive victory in the recent assembly elections, but his fans are still eagerly waiting for another major announcement. While the election results have brought widespread celebrations across Tamil Nadu and the film fraternity, the theatrical release date for his highly anticipated last film as an actor, Jana Nayagan remains a total mystery. Fans largely expected that the makers would capitalize on the massive election buzz and drop the release date immediately after the victory. However, there has been absolute silence from the production house so far. This political triumph has undoubtedly amplified the hype surrounding the film, making it one of the most awaited projects in the industry right now. Already movie has been leaked and E. Pradeep Ragav, the editor, got punishment for being careless with appointing a freelance worker in Hyderabad. Now, many thought the movie censor certificate would immediately be sanctioned to please Vijay by central government but nothing as such happened. KVN Productions are thrilled to see such great political result but for their movie to release, they might have to wait a little more longer. Mamitha Baiju, Pooja Hegde, Bobby Deol are playing prominent roles in this Anirudh Ravichander musical.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
దేవభూమి కేరళలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పుడు అందరు సోషల్ మీడియా బిడ్డలు కాబట్టి అల్లు అర్జున్ పట్ల కేరళ అభిమానుల తాలూకు యొక్క  అభిమాన స్థాయిని చూస్తూనే ఉన్నాం. సదరు అభిమానాన్ని చూసి బడా హీరోలతో పాటు యావత్తు  మలయాళ చిత్ర పరిశ్రమ సైతం ఆశ్చర్యపోతోంది. రీసెంట్ గా కేరళ క్యాపిటల్  త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం జరిగింది. జనరల్ సెక్రటరీ ప్రభు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో  అసోసియేషన్ ని మరింత బలపరచడం, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేరళలోని అన్ని ఏరియాల నుంచి  జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జూన్ 4 న  సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు జరపునున్నారు. ఈ మీటింగ్ కి సౌత్ ఇండియా నుంచి భారీ ఎత్తున ఫ్యాన్స్ పాల్గొనబోతున్నారు. Also read: Varanasi: వారణాసి@199 రూపాయలు  ఇప్పుడు జూన్ 4 న మీటింగ్ అనే న్యూస్ వైరల్ గా మారింది. ఎందుకంటే ఆ రోజు పాన్ ఇండియా వ్యాప్తంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కాబోతుంది.     
నటుడు, దర్శకుడు రవిబాబు (Ravi Babu) తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల తెలుగువన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే లెజెండరీ నటుడు నందమూరి తారకరామారావు (NTR) తో జరిగిన ఒక మరపురాని సంఘటనను రవిబాబు గుర్తు చేసుకున్నారు. రవిబాబు తండ్రి, ప్రముఖ నటుడు చలపతిరావు ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తుడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రవిబాబు వాళ్ళ గృహప్రవేశానికి ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఒక సరదా సంఘటనను రవిబాబు పంచుకున్నారు. సాధారణంగా గృహప్రవేశం అప్పుడు ఆవు, దూడలను ఇంటి లోపలికి తీసుకువెళ్తారు. అయితే, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక చిన్న స్లోప్ ఉండటం వల్ల ఆవు లోపలికి రావడానికి మొరాయించిందట. అప్పుడు ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, ఆవు మెడలోని తాడును పట్టుకుని తనదైన శైలిలో "హుమ్!" అని ఒక గంభీరమైన శబ్దం చేస్తూ లాగారట. ఆ గంభీరమైన పిలుపునకు ఆవు ఒక్కసారిగా వేగంగా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయిందని రవిబాబు వివరించారు. ఆవు లోపలికి వెళ్లడమే కాకుండా, అక్కడ పేడ వేయడంతో "ఇక అంతా శుభమే జరుగుతుందని" ఎన్టీఆర్ అన్నారట.  అలాగే, ఆ రోజు పూజారిని పక్కన పెట్టి, ఎన్టీఆరే స్వయంగా మంత్రాలు చదువుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించారని రవిబాబు తెలిపారు. అలా ఎన్టీఆర్ తో తనకున్న ఆ మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు. రవిబాబు పూర్తి ఇంటర్వ్యూతో పాటు, మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.   https://x.com/Theteluguone/status/2051266348337267064
దక్షిణాది సినీ పరిశ్రమ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. మన హీరోలు పాన్ ఇండియా స్టార్‌లుగా వెలుగొందుతుంటే, ఇక్కడి హీరోయిన్లు మాత్రం బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ నిలదొక్కుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకప్పుడు శ్రీదేవి, జయప్రద వంటి తారలు హిందీ చిత్రసీమను దశాబ్దాల పాటు ఏలారు. కానీ, నేటి తరం టాప్ హీరోయిన్లకు బాలీవుడ్ ఒక అందని ద్రాక్షలానే మిగిలిపోతోంది. సౌత్‌లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి, కాజల్, త్రిష వంటి వారు సైతం హిందీ వెండితెరపై బోల్తా పడుతుండటం గమనార్హం. నేచురల్ స్టార్‌గా గుర్తింపు పొందిన సాయి పల్లవి, ఇటీవల అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ‘ఏక్ దిన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. క్రిటిక్స్ ఆమె నటనను మెచ్చుకున్నప్పటికీ, కమర్షియల్‌గా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మొదటి మూడు రోజుల్లో కనీసం రూ. 3 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోవడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కేవలం సాయి పల్లవి మాత్రమే కాదు, ఎంతో కాలంగా సౌత్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న తారల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అజయ్ దేవగన్ సరసన 'సింగం' వంటి హిట్ అందుకున్నప్పటికీ, బాలీవుడ్‌లో కాజల్ నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె 'రామాయణ్', 'ది ఇండియా స్టోరీ' వంటి చిత్రాలపై ఆశలు పెట్టుకుంది. అక్షయ్ కుమార్ సరసన 'కట్టా మీటా'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన త్రిష, ఆ తర్వాత మళ్లీ హిందీ సినిమాల వైపు చూడలేదు. సౌత్‌లో ఆమె వెలుగుతున్నా, హిందీలో మాత్రం సరైన అవకాశాలు రాలేదు. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో నటించినా పూజా హెగ్డేకు వరుస ఫ్లాపులే ఎదురయ్యాయి. ఇక తమన్నా, శ్రియ శరణ్ వంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ కేవలం సపోర్టింగ్ రోల్స్ లేదా చిన్న సినిమాలకే పరిమితం కావాల్సి వస్తోంది. దక్షిణాది తారలు బాలీవుడ్‌లో విఫలం కావడానికి ప్రధానంగా అక్కడి మేకింగ్ స్టైల్, నేటివిటీ సమస్యలు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సౌత్ సినిమాల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ హిందీ సినిమాల్లో ఒక్కోసారి మిస్ అవుతుంటాయి. అలాగే, సరైన కథలను ఎంచుకోవడంలో వైఫల్యం కూడా వీరి కెరీర్‌ను దెబ్బతీస్తోంది. సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్‌డమ్ అనుభవిస్తున్న ఈ సుందరీమణులకు బాలీవుడ్ ఎందుకు కలిసి రావడం లేదనేది ఒక మిస్టరీగా మారింది. టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ, అదృష్టం కలిసి రాకపోవడం లేదా అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు లేకపోవడం వల్ల వీరి ప్రయాణం కష్టతరమవుతోంది. అయితే, రాబోయే రోజుల్లో 'రామాయణ్' వంటి భారీ చిత్రాలతోనైనా మన దక్షిణాది భామలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారో లేదో వేచి చూడాలి.
ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) నుండి సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. క్రిస్టోఫర్ నోలన్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ది ఒడిస్సీ' (The Odyssey). తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. గ్రీకు పురాణగాధ ఆధారంగా, నోలన్ మార్కు మేకింగ్‌తో తెరకెక్కిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు 'ఒడిస్సియస్' తన ఇంటికి చేరుకోవడానికి సాగించిన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ ట్రైలర్ చూపించింది. గంభీరమైన సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవుల మధ్య సాగే పోరాటాలు ప్రేక్షకులకు ఆస్కార్ స్థాయి అనుభూతిని ఇస్తున్నాయి. ట్రైలర్ లో యుద్ధం ముగిసిన తర్వాత తన భార్య, కొడుకు కోసం ఇంటికి తిరిగి వెళ్లాలనుకునే యోధుడి ప్రయాణాన్ని అత్యంత భావోద్వేగ భరితంగా చూపించారు. "నీకేం గుర్తున్నాయో చెప్పు" అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్, హీరో తన గతాన్ని, కుటుంబాన్ని గుర్తుచేసుకునే సీన్లతో ఆకట్టుకుంటుంది. ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులు, శత్రువుల కుట్రలు, ప్రకృతి విపత్తులను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా నోలన్ సినిమాల్లో ఉండే ఆ గంభీరమైన నేపథ్య సంగీతం ఈ ట్రైలర్‌లోనూ రోమాంచితంగా ఉంది. "నాకు నా ఇంటికి మధ్య ఎవరూ నిలవలేరు.. చివరికి దేవుడితో సహా" అంటూ హీరో చెప్పే డైలాగ్ సినిమాలోని తీవ్రతను తెలియజేస్తోంది. తన కొడుకు, భార్య రక్షణ కోసం ఒక యోధుడు పడే తపన, శత్రువులతో చేసే యుద్ధం ఈ చిత్రంలో ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, నోలన్ సిగ్నేచర్ స్టైల్ విజువల్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. మొత్తానికి, 'ది ఒడిస్సీ' ట్రైలర్ చూస్తుంటే నోలన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమనిపిస్తోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషన్స్ కలగలిసిన 'ది ఒడిస్సీ' చిత్రం వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.  
  మహేష్ బాబు(Mahesh Babu),రాజమౌళి(Ss Rajamouli)ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi)ఇప్పుడు సరికొత్త ఫీచర్ ని ఇండియన్ చిత్ర సీమకి పరిచయం చేస్తుంది. ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వారణాసి ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సాధారణంగా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు సోషల్ మీడియాలో ఉచితంగా వస్తుంటాయి. కానీ, రాజమౌళి ఈసారి విభిన్నంగా ఆలోచిస్తున్నారు. సినిమా మేకింగ్ వీడియోలు, బిహైండ్ ద సీన్స్, నటీనటుల ఇంటర్వ్యూలు మరియు ఎక్స్‌క్లూజివ్ ఫోటోలను నేరుగా అభిమానులకు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి 'వారణాసి' అనే కోడ్ నేమ్ పెట్టినట్లు తెలుస్తోంది. అంటే వారణాసిని తెరకెక్కించడం వెనక ఉన్న కష్టాన్ని, ఆసక్తికరమైన బి టి ఎస్ వీడియోస్ చూడాలని అనుకునే వాళ్ళు 199 రూపాయలు చెల్లించి వారణాసిని సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీ లో  వారణాసికి సంబంధించి  మహేష్,ప్రియాంకకి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫొటోలతో పాటు మిగతా ఆర్టిసుల డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే వారణాసి   వివరాలన్నీ మీ పాకెట్ లో ఉండబోతున్నాయి. గతంలో  కొన్ని హాలీవుడ్ చిత్రాలకి    అనుసరించే ఈ విధానాన్ని ఇండియాలో రాజమౌళి ప్రవేశపెడుతుండటం విశేషం.  Also read: Santhosh Nair: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. భార్య పరిస్థితి విషమం  రాజమౌళి ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నేపథ్యంలో మహేష్ బాబు సినిమాతో ఇండియన్ సినిమా మార్కెట్ పరిధిని మరింత పెంచాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రవేశపెడుతున్న ఈ వినూత్న ప్రమోషనల్ స్ట్రాటజీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకవేళ ఇది క్లిక్ అయితే, భవిష్యత్తులో మిగిలిన పెద్ద సినిమాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.  
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' (Vishwambhara). షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి భారీ అంచనాలను మోస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక షాకింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుండి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వశిష్ట దర్శకత్వంలో వచ్చిన 'బింబిసార' చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించిన కీరవాణి, 'విశ్వంభర' కోసం కూడా పని చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. కీరవాణి స్థానంలో ఇప్పుడు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గౌర హరిని చిత్ర బృందం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గౌరహరి ఇప్పటికే 'హనుమాన్' వంటి సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించి తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. వీఎఫ్ఎక్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తున్నారు. గౌర హరి రాకతో సినిమాకు కొత్త రకమైన సంగీతం అందుతుందని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని జులై 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.   
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' (Dragon) గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రణాళికలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా పార్ట్-1 కి సంబంధించి అత్యంత కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించడానికి చిత్ర బృందానికి మరో 40 రోజుల సమయం పట్టనుంది. ఇప్పటివరకు పూర్తయిన షూటింగ్ కాకుండా, మరో 40 రోజులు కేవలం యాక్షన్ సీన్స్ కే కేటాయిస్తున్నారంటే.. ఇందులో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ పోర్షన్ పూర్తయిన వెంటనే, 'డ్రాగన్' మూవీ టీమ్ సాంగ్స్ చిత్రీకరణపై దృష్టి సారించనుంది. పాటల షూటింగ్ ముగిసిన తర్వాత చివరిగా టాకీ పోర్షన్‌ను పూర్తి చేసి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. దీనికోసం సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను ప్రారంభించారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.  
1. 'విశ్వంభర' నుంచి కీరవాణి అవుట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' టీమ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం 'హనుమాన్' ఫేమ్ హరి గౌరను తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హరి గౌర తన పనిని ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 2. NBK112 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న 'NBK112' మ్యూజిక్ డైరెక్టర్‌ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఆయన రేసులో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్‌లలో ఒకరిని ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. 3. 'ఫౌజీ' చిత్ర యూనిట్ లో ఒకరు మృతి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్ర యూనిట్ కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 4. 'RC17' షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్  రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న 'RC17' మూవీ షూటింగ్ కి ముహూర్తం ఖరారైంది. ఇటీవల 'పెద్ది' సినిమా షూటింగ్ పూర్తి చేసిన చరణ్.. త్వరలోనే  'RC17' షూటింగ్ మొదలుపెట్టనున్నారు. జూన్ 25 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్-సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  5. ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్ అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'డ్రాగన్' మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట. పార్ట్-1 లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను పూర్తి చేయడానికి చిత్ర బృందం మరో 40 రోజుల సమయాన్ని కేటాయించిందని సమాచారం. యాక్షన్ పార్ట్ ముగిసిన వెంటనే.. సాంగ్స్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆపై టాకీ పోర్షన్ తో షూటింగ్ ను ముగించనున్నారు.  6. సాయిపల్లవి వల్ల 'కల్కి 2' షూటింగ్ కు బ్రేక్ 'కల్కి 2' సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్, సాయి పల్లవి కాంబినేషన్‌లో సోమవారం ప్రారంభం కావాల్సిన 'కల్కి 2' కొత్త షెడ్యూల్ వాయిదా పడింది. సాయి పల్లవి అనారోగ్యం కారణంగా ఈ షూటింగ్ షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. కాగా, దీపికా పదుకొణె స్థానంలో ఈ ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవి వచ్చినట్లు సమాచారం. 7. డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మోహన్ బాబు విరాళం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం జరిగిన 'డైరెక్టర్స్‌ డే 2026' వేడుకలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మోహన్ బాబు 15 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.  8. 20 రోజులకే ఓటీటీలోకి 'పాపం ప్రతాప్'  తిరువీర్ నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్' ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ రూరల్ కామెడీ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, IMDBలో 7.8 రేటింగ్ సాధించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. 9. ప్రముఖ నటుడు కన్నుమూత మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సంతోష్ నాయర్.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన భార్య రాజలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 10. ఆస్కార్ రేంజ్ విజువల్స్ తో 'ది ఒడిస్సీ' ట్రైలర్! ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మూవీ 'ది ఒడిస్సీ' ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు 'ఒడిస్సియస్' తన ఇంటికి చేరుకోవడానికి సాగించిన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ ట్రైలర్ చూపించింది. గంభీరమైన సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవుల మధ్య సాగే పోరాటాలు ప్రేక్షకులకు ఆస్కార్ స్థాయి అనుభూతిని ఇస్తున్నాయి.  
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి.  అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. కొన్ని పనులను అస్సలు వాయిదా వేయకూడదని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త,  తత్వవేత్త.. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలను ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఎంతో క్షుణ్ణంగా వివరించి చెప్పాడు.  లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏ పనులను వాయిదా వేయకూడదు? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ముఖ్యమైన పనులు.. ఒక మనిషి  సక్సెస్ ఫుల్  వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తి తన ముఖ్యమైన పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి.  తమకు ముఖ్యమైన పనుల విషయంలో  వారు చూపించే చురుకుదనమే వారిని ఆ పనిలో విజయం సాధించేలా చేస్తుంది.ముఖ్యమైన పనులు ఏవైనా సరే.. మళ్లీ చేద్దాంలే అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు.  సమయం చాలా విలువైన ఆస్తి అని,  పనులను వాయిదా వేయడం వల్ల ఎంతో గొప్ప ఆస్తిని కోల్పోయినట్టేనని, దీని వల్ల  ఒత్తిడి పెరగడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. నేర్చుకోవడం.. నేర్చుకోవడాన్ని అభ్యాసం అని అంటారు. చాణక్యుడి  ప్రకారం, జ్ఞానమే మనిషి  నిజమైన శక్తి. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. వారు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఎందుకంటే, ఈ రోజు తాము సంపాదించే జ్ఞానమే రేపటి విజయానికి పునాది వేస్తుందని వారికి తెలుసు. కష్టం.. విజయానికి కష్టపడటమే ఏకైక, ప్రధాన  మార్గం. సక్సెస్ కావాలంటే.. పనులను భారంగా కాకుండా.. వాటిని చాలెంజ్ గా తీసుకుని పూర్తీ చేయాలి. తమకు ఎదురొచ్చే ప్రతి పని, తమ ఎదుగుదలకు ఒక గొప్ప మార్గంగా చూడాలి. సోమరితనం , వాయిదా వేయడం మానవ పతనానికి దారితీస్తాయి. అందుకే చాణక్యుడు ప్రతి  పనిని సమయానికి పూర్తి చేయమని సలహా ఇస్తాడు. తప్పులు.. తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా పారిపోవడం  వైఫల్యానికి ప్రదాన కారణం అవుతుంది.   తన తప్పుల గురించి తెలుసుకుని,  వెంటనే వాటిని అంగీకరించి, ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరిదిద్దుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించగలుగుతాడు. తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే, అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అవకాశాలు.. జీవితంలో సువర్ణావకాశాలు కాలంతో పాటు వస్తూ ఉంటాయి. అలాగే కాలంతో పాటు చేజారి పోతాయి కూడా. ఒకసారి అవకాశం చేజారితే అది తిరిగి రాదని తెలిసి, దానిని గుర్తించి ఆలస్యం చేయకుండా వినియోగించుకోవడంలో నేర్పరి అయినవాడే విజయం సాధిస్తాడని చాణక్య నీతి చెబుతుంది.                            *రూపశ్రీ.
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ వాతావరణం చాలా చక్కగా సహకరిస్తుంది. అయితే వేసవి కాలం మాత్రం కరివేపాకు మొక్కలకు కష్టకాలం అని చెప్పవచ్చు. వేసవిలో ఉండే తీవ్రమైన ఎండ కారణంగా కరివేపాకు మొక్క బాగా వాడిపోవడం,  ఎదుగుదల మందగించడం జరుగుతుంది.  అయితే మొక్క తిరిగి తాజాగా మారాలన్నా,  ఆరోగ్యంగా పెరగాలన్నా కేవలం నీరు పోస్తే సరిపోదు. ఇందుకోసం ఇంట్లోనే ఉండే ఒక పానీయం చక్కగా సహాయపడుతుంది.   అదేంటో తెలుసుకుంటే.. మజ్జిగ.. భారతీయుల చాలా ఇళ్లలో కరివేపాకు మొక్క ఉన్నట్టే.. వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు, మజ్జిగ ఖచ్చితంగా ఉంటుంది.  కలివేపాకు మొక్కకు మజ్జిగను ఉపయోగించడం వల్ల వాడిన మొక్క తిరిగి తాజాగా మారడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. మజ్జిగ ఎందుకు సహాయపడుతుంది? కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఆమ్ల నేల అవసరం. మజ్జిగలో ఆమ్లం ఉంటుంది. కరివేపాకు మొక్క పాదులో  మజ్జిగను పోసినప్పుడు నేల  pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది, ఇది మొక్క నేల నుండి పోషకాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. నత్రజని ఇస్తుంది.. కరివేపాకు పచ్చగా, దట్టంగా ఉండటానికి నత్రజని చాలా అవసరం. మజ్జిగలో కూడా నత్రజని ఉంటుంది, ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలోని పోషకాలు ఆకులను మరింత ముదురుగా, పచ్చగా మారడానికి సహాయపడతాయి. మజ్జిగను వాడటం కొత్త చిగుళ్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కీటకాల నుండి రక్షణ.. కరివేపాకు మొక్కలకు తరచుగా తెల్లటి బూజు లేదా కీటకాలు పడతాయి. మజ్జిగ ఒక సహజ శిలీంధ్రనాశకం. దానిలో ఉండే లాక్టిక్ ఆమ్లం ఈ బ్యాక్టీరియా , శిలీంధ్రాలను చంపి, మొక్క పెరగడానికి సహాయపడుతుంది. పోషకాలు.. మజ్జిగలో కాల్షియం మాత్రమే కాకుండా ఫాస్ఫరస్ , ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా నేలను సారవంతం చేస్తుంది. కరివేపాకు మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి  మజ్జిగను ఉపయోగించవచ్చు.                               *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ఇక ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది.  ఈ వేసవి కాలంలో అడుగు బయట పెట్టాలంటే భయపడాల్సి వస్తోంది. కానీ కొందరు మాత్రం ఎండలో కూడా బయటకు వెళ్లాలి,  ఎండలో తిరిగి పనులు చేయాల్సి వస్తుంది.  చాలామంది బయటి పనులకు బైక్ వాడుతూ ఉంటారు. సాధారణ రోజులలో బైక్ ప్రయాణం ఏమంత సమస్య అనిపించదు. కానీ.. వేసవిలో,  తీవ్రమైన ఎండలో మాత్రం బైక్ ప్రయాణించే వారు చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే వడగాలులు,  డీహైడ్రేషన్ సమస్య చాలా తొందరగా దెబ్బతీస్తాయి.  బైక్ రైడర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే.. సరైన దుస్తుల ఎంపిక.. ఎండలో ప్రయాణించేటప్పుడు సురక్షితమైన దుస్తులు , హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యం. చెమట త్వరగా ఆవిరైపోయి, శరీరాన్ని చల్లగా ఉంచడానికి తేలికైన, గాలి ప్రసరించే దుస్తులు ధరించాలి.  హెల్మెట్ సరిగ్గా బిగువుగా సరిపోయేలా ,  తలను ఎండ నుండి రక్షించేలా  ఉండేలా చూసుకోవాలి. నీరు..  తగినంత నీరు , ఎలక్ట్రోలైట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. వేడిలో, శరీరం నుండి నీరు , ఖనిజాలు వేగంగా నష్టపోతాయి, దీనివల్ల డీహైడ్రేషన్ , బలహీనత ఏర్పడతాయి. నీటితో పాటు కొబ్బరి నీరు లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను తీసుకోవడం శరీరంలోని నీరు , ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. సమయం.. ఎక్కువ సేపు ఎండలో బైక్ డ్రైవ్ చేయడం మానుకుంటే మంచిది. తెల్లవారుజాము లేదా సాయంత్రం వంటి చల్లని సమయాల్లో బైక్ డ్రైవింగ్ మేలు. దీనివల్ల ఎండ వేడిమి, అలసట తగ్గుతాయి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఎండ తగలకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విశ్రాంతి.. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళితే..  బైక్ వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి.  విశ్రాంతి తీసుకోవడానికి, శరీరాన్ని  చల్లార్చుకోవడానికి అక్కడక్కడా ఆగుతూ,  విశ్రాంతి తీసుకుంటూ వెళ్లడం మంచిది. ఎక్కువ సేపు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల శరీర వేడి పెరిగి అలసటకు దారితీస్తుంది. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం శరీరాన్ని కూల్ చేసుకోవడానికి, సురక్షితమైన ప్రయాణానికి సహాయపడతాయి. గ్లౌజులు,  సన్ స్క్రీన్.. తీవ్రమైన ఎండ  నుండి ప్రొటెక్షన్ కోసం సన్‌స్క్రీన్ , చేతికి గ్లౌజులు వాడాలి. సన్‌స్క్రీన్ చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తుంది, అదే సమయంలో గ్లౌజులు  బైక్ నడుపుతున్నప్పుడు  చేతుల చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మం కాలిన గాయాలు , నష్టం కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                               *రూపశ్రీ.
  వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది.  పైగా మార్కెట్ లో అమ్మే కూల్ డ్రింకులతో పోలిస్తే.. చెరకు రసం చాలా సహజమైన పానీయం.  అందుకే వేసవిలో చాలామంది చెరకు రసం తాగడానికి చాలా ఇష్టపడతారు.  కానీ ఎంతో  ఆరోగ్యకరమైనదని, తక్షణ చల్లదనాన్ని ఇచ్చేదాని అనుకునే  చెరకు రసం  తాగడం నిజంగా సురక్షితమేనా? ఈ విషయం నేటి కాలంలో చాలా సందేహమైన ప్రశ్నగా మారుతోంది.  వేసవి కాలంలో చెరకు తాగడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. చెరకు రసం మంచిదే.. కానీ ఎక్కువగా తాగితే.. వేసవిలో చెరకు రసం చాలా ఎక్కువగా తాగుతుంటారు.  చెరకు రసం  శరీరానికి తేమను అందించి, తక్షణ శక్తిని ఇస్తుంది.  చెరకు రసంలోని  సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందించి, అలసట , డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే మండుటెండలలో   ఉపశమనం కోసం చాలామంది చెరకు రసం తాగుతారు. చెరకు సహజంగానే తీపిగా ఉన్నప్పటికీ, రసంగా తీసుకున్నప్పుడు దానిలోని చక్కెర శాతం మరింత ఎక్కువగా మారుతుంది. రసం తీయడం వల్ల ఫైబర్ దాదాపు పూర్తిగా తొలగిపోతుంది, ఇది సాధారణంగా శరీరం చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, చెరకు రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.  చెరకు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు  మంచిది కాదని చెబుతారు. అంతేకాకుండా, ఫ్యాటీ లివర్, ఊబకాయం లేదా జీవక్రియ సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగడాన్ని చాలా తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ చక్కెర శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమై ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చెరకు రసం పరిశుభ్రత.. చెరకు రసం విషయంలో ఉన్న మరొక  ప్రమాదం దాని పరిశుభ్రత. తరచుగా చెరకు  రసాన్ని ఆరుబయట తయారు చేస్తారు, చెరకు పైన ఉండే తెల్లని పొడిని శుభ్రపరచకుండా చెరకు నుండి రసం తీస్తుంటారు.  పైగా చెరకు రసం తీసే చోట  యంత్రాలు, ఐస్, నీరు , గ్లాసులు సరైన పరిశుభ్రతతో ఉండవు. వైద్యుల ప్రకారం, రసం తయారీలో ఉపయోగించే యంత్రాలు లేదా ఐస్  శుభ్రంగా లేకపోతే, బ్యాక్టీరియా , వైరస్‌లు సులువుగా అటాక్ అవుతాయి. దీనివల్ల టైఫాయిడ్, కలరా , హెపటైటిస్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. చెరకు రసం విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే.. చెరకు రసం తాగే విషయంలో కొందరు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.  ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, లేదా ఫ్యాటీ లివర్ ఉన్నవారు,  రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతున్నవారు చెరకు రసం తాగే ముందు జాగ్రత్త వహించాలి. చెరకు రసాన్ని ఎల్లప్పుడూ శుభ్రమైన , పరిశుభ్రమైన ప్రదేశం నుండే కొనుగోలు చేయాలి.                                *రూపశ్రీ.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.