LATEST NEWS
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న తరుణంలో కోల్‌కతాలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం (ఏప్రిల్ 30) రాత్రి కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గ ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్న ఆమె..  అక్కడ సుమారు మూడు గంటల పాటు ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ..  అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ..  ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.  ఇది తమకు చావో రేవో తేల్చుకునే పోరాటంటూ ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేశారు.  అంతకుముందు, తృణమూల్ కాంగ్రెస్ ( నాయకులు కునాల్ ఘోష్, శశి పంజా ఖుదీరామ్ అనుశీలన్  స్ట్రాంగ్ రూం వెలుపల   వెలుపల ధర్నాకు దిగారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేకుండానే బాలెట్ బాక్సులను తెరుస్తున్నారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా పార్టీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మరోవైపు..  కేంద్ర దళాలు తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి లేదా ఏజెంట్ స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లే అధికారం ఉంటుందన్నారు. తమ పార్టీ ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని   విమర్శించారు. ఫలితాలు వెలువడే మే 4వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా ఈ  ఆరోపణలను పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం..  మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయంది. . సిసిటివి ఫుటేజీలో కనిపిస్తున్నది కేవలం పోస్టల్ బ్యాలెట్ల విభజన ప్రక్రియే తప్ప..  ఈవీఎంలను తాకడం లేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి బెంగాల్‌లో రాజకీయ వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో..  ప్రతి ఓటును కాపాడుకోవాలన్న  పట్టుదలతో టీఎంసీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను మరింత కఠినతరం చేయాలని, నిరంతరం నిఘా ఉంచాలని మమతా బెనర్జీ తమ పార్టీ  అభ్యర్థులను ఆదేశించారు.  
  తెలుగువన్ ‘వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ  భవిష్యత్తు వారసుడిగా నారా లోకేష్ ఎదుగుదల, పార్టీలో ఆయన పోషిస్తున్న పాత్రపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగింది. సీనియర్ జర్నలిస్టులు మరియు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గతంతో పోలిస్తే లోకేష్ రాజకీయ శైలిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. రాజకీయ పరిస్థితి - ఒక అవలోకనం రాష్ట్రంలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటువంటి క్లిష్ట సమయంలో లోకేష్ పార్టీ పగ్గాలను సమర్థవంతంగా చేపడుతున్నారా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. గత ఎన్నికల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్న లోకేష్, 'యువగళం' పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇది కేవలం ఒక యాత్రగానే కాకుండా, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే వేదికగా మారింది. క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకోవడం, ప్రజలతో నేరుగా మమేకమవ్వడం ద్వారా తనపై ఉన్న విమర్శలకు ఆయన చేతలతో సమాధానం చెబుతున్నారు. వ్యూహాలు మరియు అంతరార్థాలు లోకేష్ అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహం ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంది: ఒకటి సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడం, రెండు యువతను ఆకర్షించడం. సామాజిక మాధ్యమాల వినియోగం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ముందుంటున్నారు. అయితే, రాజకీయాల్లో వ్యూహం ఎంత ముఖ్యమో, సమయం కూడా అంతే ముఖ్యం. పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా లోకేష్ తన ప్రచార పంథాను మార్చుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా, అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఒక పరిణతి చెందిన నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ ప్రభావం రాబోయే ఎన్నికలు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్ష వంటివి. పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో నడిపించగలిగితే, ఆయన నాయకత్వంపై ఉన్న సందిగ్ధతలు పూర్తిగా తొలగిపోతాయి. రాబోయే కాలంలో లోకేష్ పోషించబోయే పాత్ర కేవలం తెలుగుదేశం పార్టీకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ గమనాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ సానుకూల ఫలితాలను సాధిస్తే, లోకేష్ కేవలం ఒక వారసుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న శక్తివంతమైన నాయకుడిగా స్థిరపడతారా... ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి  
   తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన నూతన రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు, కవితకు అధికారిక పత్రాలను అందజేశారు. గత కొద్దికాలంగా తన రాజకీయ ప్రస్థానంపై సస్పెన్స్ కొనసాగించిన కవిత, ఇటీవల మేడ్చల్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో సొంత పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఆమె తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించారు. కానీ, ఎన్నికల సంఘం నిబంధనలు మరియు సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ పేరులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తుది నిర్ణయం ప్రకారం, కవిత పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’  గా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. విశేషమేమిటంటే, ఈ పార్టీ సంక్షిప్త నామం ‘టీఆర్ఎస్‌’ గా ఉండబోతోంది. గురువారం మధ్యాహ్నం ఎన్నికల సంఘం ప్రతినిధులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకుని, పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని స్వయంగా ఆమెకు అందజేశారు. తెలంగాణ అస్తిత్వం, రక్షణే ధ్యేయంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నట్లు కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ నుంచి ‘తెలంగాణ రక్షణ సేన’గా పేరు మారినా, లక్ష్యం మాత్రం మారబోదని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ అనే పాత సెంటిమెంట్ పేరు మళ్లీ తెరపైకి రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తొలుత పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించినప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ‘రక్షణ సేన’గా మారడం వెనుక ప్రాంతీయ ప్రయోజనాల పరిరక్షణ అనే భావన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లే లక్ష్యంగా కవిత తన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ అధికారిక ఆమోదంతో కవిత తన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనున్నారు. త్వరలోనే పార్టీ జెండా, గుర్తు, మరియు కమిటీల ప్రకటన ఉండే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాల పర్యటనలకు కూడా ఆమె సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కవిత దరఖాస్తు చేసుకున్న “తెలంగాణ రక్షణ సేన” పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ సందర్భంగా కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన విషయాన్ని సమస్త తెలంగాణ సమాజానికి తెలియజేయడం ఆనందంగా ఉంది. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేస్తున్న కృషిని కొనసాగిస్తూ, ఇకపై కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తాను” అని పేర్కొన్నారు. అలాగే, “జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడవ ప్రాధాన్యతగా ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికమేనేమో… లేక ‘టీఆర్ఎస్’ నాకు రాసిపెట్టి ఉందేమో!” అంటూ చమత్కారంగా ట్వీట్ చేశారు. కవిత దరఖాస్తులో సూచించిన పేర్లు ఇవి: తెలంగాణ ప్రజా జాగృతి తెలంగాణ జాగృతి తెలంగాణ రక్షణ సేన తెలంగాణ రాష్ట్ర జాగృతి తెలంగాణ ప్రజాశక్తి ఈ ఐదు పేర్లలో ఏదో ఒక పేరుతో రాజకీయ పార్టీ స్థాపనకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కవిత కోరగా, అప్లికేషన్‌లో మూడో ప్రాధాన్యతగా పేర్కొన్న “తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)” పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.  
దక్షిణ భారత రాజకీయాల్లో కీలకమైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో  వివిధ జాతీయ,  ప్రాంతీయ  సంస్థలు బుధవారం (ఏప్రిల్ 29) వెల్లడించిన  ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి.  సుదీర్ఘ విరామం తర్వాత కేరళలో అధికార మార్పిడి జరగబోతోందనీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్  సర్కార్ గద్దె దిగడం ఖాయమని  దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్సూ కూడా అంచనా వేశాయి. కేరళలో  కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాయి.  మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో  ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71.  బుధవారం (ఏప్రిల్ 29)   వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే  అధికారమని అంచనా వేశాయి. పినరయి విజయన్ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు లేవని పేర్కొన్నాయి.  ఇందుకు  యాంటీ ఇంకంబెన్సీ,  కారణమని పేర్కొన్నాయి. దానికి తోడు..  కాంగ్రెస్ దూకుడు కూడా పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ వెనుకబాటుకు కారణమని విశ్లేషించాయి.  కాగా.. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణకు చెందిన మంత్రుల బృందంతో కలిసి ఆయన కేరళలో  ఇంచుమించు  పది రోజుల పాటు విస్తృతంగా పర్యటించి..  యూడీఎఫ్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు.   ఈ ప్రచార సమయంలో కేరళ సీఎం విజయన్‌కు, రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన మాటల యుద్ధం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి వ్యూహాలు,  కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమైనట్లు సర్వేల ఫలితాలు సూచిస్తున్నాయి.  యాక్సిస్ మై ఇండియా సర్వే కేరళలో యూడీఎఫ్‌కు 78 నుంచి 90 స్థానాలు దక్కుతాయని పేర్కొనగా,  పోల్ ల్యాబ్ సర్వే  ఏకంగా 90 నుంచి 92 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్  అయితే కాంగ్రెస్ కూటమి 72 నుంచి 80 , పీపుల్స్ పల్స్ 75నుంచి 85 స్థానాలను యూడీఎఫ్ సాధిస్తుందని అంచనా వేశాయి.  ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే కూడా కాంగ్రెస్ కూటమికి 76 నుంచి 81 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.  ఇక సర్వే సంస్థల అంచనాల మేరకు అధికార ఎల్‌డీఎఫ్ కూటమి  45 - 66 స్థానాలకే  మధ్యే పరిమితమయ్యే అవకాశం ఉంది  బీజేపీ  కేరళలో తన ఉనికిని చాటుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని సర్వేలు పేర్కొన్నాయి. చాలా వరకూ సర్వే సంస్థలు రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరిచే అవకాశం లేదని అంచనా వేశాయి.   ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, కేరళలో ఐదేళ్లకోసారి అధికారం మారే సాంప్రదాయం మళ్లీ పునరావృతమైనట్లు అవుతుంది. గత ఎన్నికల్లో విజయన్ ఈ సంప్రదాయాన్ని చెరిపివేస్తూ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకున్నారు. కానీ ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.  పెరిగిన ధరలు, నిరుద్యోగం మరియు పాలనపై వ్యతిరేకత వంటి అంశాలు విజయన్ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయని తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ శ్రేణులు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పండుగ చేసుకుంటున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తర్వాత కేరళలో కూడా పట్టు సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో పార్టీకి పునర్వైభవం వస్తుందని హస్తం నేతలు అంటున్నారు.  
ఏప్రిల్ 29న‌ విడుదలైన తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ప్రదీప్ గుప్తాకి చెందిన‌ యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు అందరినీ విశ్మయ పరిచాయి.  తమిళనాట  విజయ్  టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.  అంటే తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధిస్తుందన్నది ఆయన అంచనా అన్నమాట.   ఇక డీఎంకే కూటమికి 92 నుంచి110 సీట్లు, అన్నాడీఎంకేకి 22 - 32 సీట్లు వ‌స్తాయ‌ని యాక్సిస్ మై ఇండియా సర్వే పేర్కొంది.  ప్ర‌దీప్ గుప్తా  విశ్లేషణ ప్రకారం.. ముఖ్యంగా 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న యువత తమిళనాట సుమారు 42శాతంగా ఉన్నారు. వీరంతా గంప‌గుత్త‌గా విజయ్ వైపు మొగ్గు చూపారు. అందుకే ఆయన టీవీకే విజయం సాధిస్తుందనీ, ఆ విజయం 1983లో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనంతో  పోల్చదగినదిగా ఉంటుందనీ పేర్కొన్నారు.  అదలా ఉంటే.. మిగిలిన ప్రముఖ సర్వేలన్నీ..  డీఎంకే  మళ్లీ అధికారం చేపడుతుందని చెబుతున్నాయి. పీపుల్స్ ప‌ల్స్ సర్వే అయితే డీఎంకే కూటమికి 125 నుంచి 145 సీట్లు వస్తాయనీ, విజయ్ టీవీకే   18 నుంచి 24 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందనీ పేర్కొంది. అదే విధంగా  మాట్రిజ్ సర్వే టీవీకే పార్టీకి  పది నుంచి పన్నెండ్లు సీట్లు రావడమే గగనమని పేర్కొంది.ఇక పోతే..  పీమార్క్ సర్వీ విజయ్ పార్టీ 16 నుంచి 26 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.   అంటే..  ఒకవైపు దాదాపు అన్ని సర్వేలూ..  స్టాలిన్ హవా కొనసాగుతుందని చెబుతుంటే, ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా మాత్రం  విజయ్  విజయం ఖాయమని పేర్కొంది.  అయితే.. ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. యాక్సిస్ మై ఇండియా  గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని అంచనా వేసింది.  అది తప్పవడంతో ప్రదీప్ గుప్తా టీవీ లైవ్ డిబేట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన అంచనాలు తప్పినా.. అంతకు ముందు.. అంటే  గతంలో  దాదాపు 90శాతం పైగా.. ఆయన అంచనాలు నిజమయ్యాయి. అందుకే ఈసారి ఆయన  విజయ్ పై వేసిన విజిల్ నిజమవుతుందా లేదా? అన్న ఉత్కంఠ వ్యక్తమౌతోంది.  
ALSO ON TELUGUONE N E W S
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను వివాహం చేసుకుంటానని నమ్మించి రూ.9 కోట్లకు పైగా మోసగించిందన్న ఆరోపణలతో ఆమెపై సీసీఎస్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంపై స్పందించిన అషురెడ్డి తన పరువుకు భంగం కలుగుతోందని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా న్యాయస్థానం ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున, అషురెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎలాంటి నిరాధార కథనాలను ప్రసారం చేయకూడదని హైకోర్టు మీడియా సంస్థలను ఆదేశించింది. సోషల్ మీడియా వేదికలు, కంటెంట్ క్రియేటర్లు కూడా ఆమె ప్రైవసీని గౌరవించాలని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై అషురెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. "నాపై వస్తున్న ఆరోపణలు కోర్టు పరిధిలో ఉన్నాయి. నిరాధారమైన వార్తలు రాసి నా పరువు తీయొద్దని కోర్టు ఆదేశించింది. ఇప్పటికైనా నెటిజన్లు, మీడియా వారు నా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అషురెడ్డిపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు కోర్టు విచారణలో తేలనున్నాయి. అప్పటి వరకు సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా ఉండాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేసు తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.   https://www.instagram.com/reel/DXwvRAlp8ra/
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. (NBK x Koratala Siva) బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ తర్వాత బాలయ్య నుంచి రానున్న సినిమా ఇదే. 'NBK112' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా, టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. పవర్ ఫుల్ కాంబినేషన్ - పక్కా మాస్ మెసేజ్ కొరటాల శివ అంటేనే సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా ఒక పవర్‌ఫుల్ కథను కొరటాల సిద్ధం చేసినట్లు సమాచారం. బాలయ్య కుమార్తె తేజస్విని చొరవతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని, కథ విన్న వెంటనే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఎల్వీ సినిమాస్ (SLV Cinemas), యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్‌తో కూడిన హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది ఉండబోతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 'NBK111'తో పాటు పారలల్ గా ఈ మూవీ షూటింగ్ పాల్గొననున్నారు బాలయ్య. "Power Meets Purpose" అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్‌లో చిత్రబృందం ఉంది. బాలయ్య గర్జన, కొరటాల రచన తోడైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.   https://x.com/Theteluguone/status/2050084915937706143
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గాయపడ్డ సింహం' (Gaayapadda Simham). నూతన దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా నేడు(మే 1) థియేటర్లలో అడుగుపెట్టింది. ఇందులో జేడీ చక్రవర్తి విలన్ గా నటించగా, శ్రీవిష్ణు ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది?. అమెరికన్ డ్రీమ్ వెనుక ఉన్న చేదు నిజాలను సెటైరికల్ కామెడీతో చూపించే ప్రయత్నం చేసిన ఈ మూవీపై ట్విట్టర్ (X) వేదికగా ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో తెలుసుకుందాం. (Gaayapadda Simham Twitter Review) కథా నేపథ్యం ఈ సినిమా కథ దరహాస్ (తరుణ్ భాస్కర్) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ప్రేమ కోసం ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళిన అతను, అక్కడ అనుకోని పరిస్థితుల వల్ల డీపోర్ట్ అయి ఇండియాకు తిరిగి వస్తాడు. ఇక్కడ అతను తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాలు, జేడీ చక్రవర్తి పాత్రతో జరిగే గొడవలు ఎలాంటి గందరగోళాన్ని సృష్టించాయనేదే ఈ చిత్ర కథాంశం. ట్విట్టర్ టాక్: ట్విట్టర్ రివ్యూల ప్రకారం, ఈ సినిమాకు నెటిజన్ల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఐడియా బాగున్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ తేలిపోయింది అంటున్నారు. ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్ కావాల్సిన అన్ని హంగులు ఉన్నప్పటికీ, బలహీనమైన స్క్రీన్‌ప్లే కారణంగా ఇది ఒక సాదాసీదా ప్రయత్నంగానే మిగిలిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అక్కడక్కడా కామెడీ బాగానే వర్కౌట్ అయిందని టాక్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం కాస్త డల్ అయిందట. అయితే తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టాడని, ముఖ్యంగా సెల్ఫ్-ట్రోల్ సీక్వెన్స్‌లలో అదరగొట్టాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలాగే సెకండ్ హాఫ్‌లో శ్రీవిష్ణు ఎంట్రీతో వచ్చే 30 నిమిషాల నాన్‌స్టాప్ ఫన్ సినిమాకు ప్రధాన హైలైట్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు సంబంధించిన రిఫరెన్స్‌లు, స్పూఫ్ ఎపిసోడ్లు థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయట. ప్లస్ పాయింట్లు: వినూత్నమైన కథాంశం, తరుణ్ భాస్కర్ నటన, జేడీ చక్రవర్తి నెగటివ్ రోల్, నేచురల్ కామెడీ డైలాగులు మైనస్ పాయింట్లు: కథాంశం కొన్ని చోట్ల ముందే ఊహించేలా ఉండటం, సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించడం. మొత్తం మీద ట్విట్టర్ టాక్ ను బట్టి చూస్తే.. 'గాయపడ్డ సింహం' ఐడియా బాగున్నప్పటికీ, ఆ ఆసక్తికరమైన ఆలోచనను తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు తడబడినట్లు కనిపిస్తోంది. వినూత్న కథాంశం, కొన్ని నవ్వుల కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు అనిపిస్తోంది.  
టాలీవుడ్‌లో కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్ అందుకున్న వారు బాగానే ఉన్నారు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్య (Satya), ఇప్పుడు 'జెట్లీ' (Jetlee) మూవీతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, నేడు(మే 1) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్, ఎర్లీ షోలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి టాక్ వస్తుందో చూద్దాం. (Jetlee Twitter Review) కథా నేపథ్యం ఏమిటి? ఈ సినిమా కథ మొత్తం ఒక విమాన ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. దుబాయ్ నుండి కొచ్చికి వెళ్తున్న ఒక విమానంలో అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రయాణికులు, అందులో ఉండే ఒక పరారీలో ఉన్న బిలియనీర్, అలాగే తన గతాన్ని మర్చిపోయిన ఒక వ్యక్తి (సత్య) చుట్టూ రితేష్ రాణా ఈ కథను అల్లాడు. దాదాపు 80 శాతం సినిమా విమానంలోనే సాగడం విశేషం. ట్విట్టర్ రివ్యూ: ట్విట్టర్ (X) లో వస్తున్న రియాక్షన్స్ ప్రకారం, సినిమాకు 'మిక్స్డ్ టు పాజిటివ్' టాక్ లభిస్తోంది. సినిమా స్టార్టింగ్ బాగున్నప్పటికీ, కథ ముందుకు నడుస్తున్న కొద్దీ గాడి తప్పిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తేలిపోయింది అంటున్నారు. అయితే మళ్ళీ ప్రీ క్లైమాక్స్ మాత్రం మెప్పించిందట. అలాగే సత్య కామెడీ టైమింగ్ గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. సత్య తన నటనతో సినిమాను నిలబెట్టాడని అభిప్రాయపడుతున్నారు.  జెట్లీ మూవీ రితేష్ రాణా మార్క్ కామెడీతో సాగుతుంది. సెటప్ బాగుంది, సత్య వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రితేష్ రాణా గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ క్విర్కీ కామెడీ పుష్కలంగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం సినిమా నిడివి, కొన్ని ల్యాగ్ సీన్ల గురించి ప్రస్తావిస్తున్నారు. వెన్నెల కిశోర్ పాత్ర ఆశించిన స్థాయిలో లేదని  అంటున్నారు. ప్లస్ పాయింట్లు: సత్య నటన మరియు కామెడీ టైమింగ్, రితేష్ రాణా డైరెక్షన్ స్టైల్, కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. విమానం సెట్ క్వాలిటీ కూడా చాలా బాగుందని టాక్. మైనస్ పాయింట్లు: సెకండ్ హాఫ్‌లో కొన్ని చోట్ల కథ నెమ్మదించడం, కొన్ని లాజిక్ లేని సీన్లు, వెన్నెల కిశోర్ వంటి స్టార్ కమెడియన్‌ను ఇంకాస్త బాగా వాడుకోవాల్సిందనే కామెంట్స్ వస్తున్నాయి. మొత్తం మీద 'జెట్లీ' ఒక వినూత్నమైన కామెడీ ఎంటర్టైనర్ అని నెటిజన్లు చెబుతున్నారు. సత్య కామెడీని ఇష్టపడే వారికి, రితేష్ రాణా మార్క్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ కావచ్చు. మేడే హాలిడే కావడం ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.  
మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన యువ దర్శకుడు బసిల్ జోసెఫ్ (Basil Joseph), తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ‘మిన్నల్ మురళి’ వంటి సూపర్‌హీరో చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ దర్శకుడు, బన్నీతో కలిసి పనిచేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ - బసిల్ జోసెఫ్ క్రేజీ కాంబో? అల్లు అర్జున్ తన 25వ చిత్రాన్ని (AA25) బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌తో సినిమా గురించి ప్రశ్నించగా, బసిల్ జోసెఫ్ చిరునవ్వుతో సమాధానాన్ని దాటవేశారు. ఆయన ఏ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోయినా, ఆ నవ్వు వెనుక ఏదో పెద్ద ప్రాజెక్ట్ దాగి ఉందని అభిమానులు భావిస్తున్నారు. మిన్నల్ మురళి-2 ప్రస్తుత పరిస్థితి బసిల్ జోసెఫ్ తన సూపర్ హిట్ చిత్రం ‘మిన్నల్ మురళి’కి సీక్వెల్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి 'మిన్నల్ మురళి-2' పట్టాలెక్కే అవకాశం లేదని, తన దృష్టి ఇతర ప్రాజెక్టులపై ఉందని స్పష్టం చేశారు. దీంతో ఆయన తదుపరి చిత్రం ఖచ్చితంగా ఒక పెద్ద పాన్-ఇండియా ప్రాజెక్ట్ అయి ఉంటుందని, అది అల్లు అర్జున్‌తోనే జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ కు కేరళలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన్ని అభిమానంగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. ఒకవేళ మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బసిల్ తో బన్నీ చేతులు కలిపితే, అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు దారితీస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ AA25 ప్రాజెక్ట్ గురించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  
దక్షిణాది చిత్రసీమలో దాదాపు రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి త్రిష కృష్ణన్. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే త్రిష, తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. తన నిద్ర గురించి ఆమె చేసిన వింత లెక్కలు చదివిన వారు "అమ్మో.. త్రిషకు ఇంత పని ఒత్తిడి ఉందా?" అని ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ షూటింగ్ ఫొటోలు లేదా గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటారు. కానీ త్రిష తన వ్యక్తిగత జీవితంలోని అలసటను చాలా సరదాగా పంచుకున్నారు. "ఒక్క గంట నిద్రను కోల్పోతే, దాని నుండి మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి నాకు కనీసం నాలుగు రోజులు పడుతుంది. ఈ లెక్కన చూసుకుంటే, నేను మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోవాలంటే 2062 వరకు ఆగాల్సిందేమో" అంటూ ఆమె ఒక చమత్కారమైన కొటేషన్‌ను షేర్ చేశారు. ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూస్తుంటే ప్రస్తుతం త్రిష ఎంతటి బిజీ షెడ్యూల్స్ అనుభవిస్తుందో అర్థమవుతోంది. రాత్రింబవళ్లు షూటింగులు, వేర్వేరు నగరాలకు ప్రయాణాలు చేస్తూ విశ్రాంతి లేని జీవితం గడుపుతున్నట్లు ఈ పోస్ట్ ద్వారా స్పష్టమైంది. త్రిష ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభరస రిలీజ్ కావాల్సి ఉంది. సూర్యతో కలిసి 'కరుప్పు' వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అటు తెలుగు, ఇటు తమిళం.. రెండు భాషల్లోనూ టాప్ హీరోల సరసన న‌టిస్తున్నారు. ఈ పని ఒత్తిడి వల్లే ఆమెకు కంటి నిండా నిద్ర కరువైందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినిమా రంగంలో గ్లామర్ వెనుక ఉండే కష్టం అంతా ఇంతా కాదు. తెరపై మెరిసిపోయే నటీనటులు తమ ఆరోగ్యాన్ని, నిద్రను పణంగా పెట్టి కష్టపడుతుంటారు. త్రిష కూడా అదే విషయాన్ని తన స్టైల్‌లో చమత్కారంగా చెప్పడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె మళ్ళీ తన సాధారణ నిద్రను పొందడానికి 2062 వరకు ఆగాల్సిన అవసరం రాకూడదని, త్వరలోనే ఆమెకు మంచి విశ్రాంతి దొరకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఏదేమైనా, ఇంత బిజీగా ఉన్నా తన మనసులోని మాటను ఫ్యాన్స్‌తో పంచుకోవడం త్రిష ప్రత్యేకత అని చెప్పవచ్చు.
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజా రవీంద్ర (Raja Ravindra) ప్రధాన పాత్రలో "వైల్డ్" (Wild) అనే సినిమా రాబోతోంది. వయోలెంట్ సైకో థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయిరాం దాసరి రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని ఓవా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ రవి పీట్ల  నిర్మించనున్నారు. త్వరలో "వైల్డ్" మూవీ లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ చిత్ర అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "వైల్డ్" మూవీ మోషన్ పోస్టర్ లో రక్తంతో తడిసిపోయిన వయలెంట్ లుక్ లో రాజా రవీంద్ర కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారి సినిమాలు చేయడం చూస్తున్నాం. మరి రాజా రవీంద్ర మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈ 'వైల్డ్' మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
  కొన్ని నెలలుగా ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్(karisma kapoor)ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత సంజయ్ కపూర్(Sunjay Kapoor)ఆస్తి వ్యవహారంలో ఇష్యు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 30,000 వేల కోట్ల విలువైన ప్రాపర్టీలో సంజయ్ కపూర్ మరో భార్య ప్రియా సచ్ దేవ్ అజమాయిషీ ఉండకుండా చేయడంతో పాటు విక్రయించకుండా చూడాలని కోరుతు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో కోర్టు సంచలన తీర్పు వెల్లడి చేసింది.  సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆయన ఆస్తుల పంపకంపై నెలకొన్న వివాదాన్ని విచారించిన కోర్టు, ఆస్తుల అన్యాక్రాంతం కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.   సంజయ్ కపూర్ మూడవ భార్య ప్రియా సచ్‌దేవ్ ఆస్తులని విక్రయించడం లేదా ఇతర వ్యక్తులకు బదిలీ చేయకూడదు. సంజయ్ కపూర్‌కు చెందిన భారతీయ కంపెనీలలోని వాటాలు, ఈక్విటీల మార్పులు, విదేశీ బ్యాంక్ ఖాతాల నిర్వహణను నిలిపివేయడంతో పాటు, ఆయన వద్ద ఉన్న క్రిప్టో కరెన్సీ ఆస్తులను విక్రయించవద్దు.ఖరీదైన పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్ మరియు ఇతర విలువైన వస్తువులను ఏ విధంగానూ వేరేవారికి బదిలీ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ తీర్పు కరిష్మా కపూర్, ఆయన పిల్లలకి ఊరటనిచ్చినట్లయింది. Also read: Priyanka Chopra: అందం ఉంటే సరిపోదని ప్రియాంక చోప్రాపై మైక్ విసిరిన మన గురువు గారు సంజయ్ కపూర్ 2025 జూన్‌లో యూకేలో మరణించిన తర్వాత, ఆయన వీలునామా గురించి వివాదం మొదలైంది. ప్రియా సచ్‌దేవ్  సమర్పించిన వీలునామా నకిలీదని, దాన్ని ఫోర్జరీ చేశారని కరిష్మా పిల్లలు మరియు సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ కోర్టులో వాదించారు. సంజయ్ కపూర్ ఏడాదికి  60 కోట్ల జీతం తీసుకునేవారు. కానీ ఆయన ఖాతాల్లో కేవలం  1.72 కోట్లే ఉన్నట్లు చూపడం వెనుక ఆస్తుల మళ్లింపు జరిగిందని పిల్లల తరపు న్యాయవాదులు ఆరోపించారు. వీలునామాపై అనుమానాలు ఉన్నందున, అది నిజమైనదేనని నిరూపించాల్సిన బాధ్యత ప్రియా దేనని  కూడా కోర్టు పేర్కొంది.కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ ఇద్దరి పెళ్లి 2003 లో జరగగా సమైరా అనే పాప ఖైన్ అనే బాబు ఉన్నారు.        
రామ్ చరణ్ (Ram Charan), సుకుమార్ (Sukumar)  కాంబినేషన్ లో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'రంగస్థలం' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న 'RC17' ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ గురించి ఒక అదిరిపోయే వార్త బయటకు వచ్చింది.  జూన్ నుంచి యాక్షన్ మొదలు! మైత్రీ మూవీ మేకర్స్ CEO చెర్రీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక మూవీ షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'పెద్ది' (Peddi) పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఆయన సుకుమార్ 'RC17'లో జాయిన్ కానున్నారు. 'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్‌ను సుకుమార్ చూపించిన విధానం ఒక సంచలనం. ఇప్పుడు #RC17 కోసం కూడా సుకుమార్ ఒక సరికొత్త బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారని సమాచారం. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ డ్రామా అని, చరణ్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుండటంతో, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నటీనటుల ఎంపికపై కూడా చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మొదటి సినిమా కావడంతో దీనిపై పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ నెలకొంది.   
Director Ritesh Rana, known for his unconventional comedic narratives, returns with his latest project, Jet Lee. Produced by Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu, the film features comedian Satya in a prominent role, alongside Rhea Singha, Vennela Kishore, and Kaala Bhairava. The recently released trailer provides a clear look at the film’s central premise: a commercial flight hijacking treated as a comedy of errors. Rather than leaning into the high-stakes tension typical of hijack dramas, the trailer indicates a lighthearted and chaotic approach. The promo is filled with absurd situations, colorful visuals, and fast-paced editing. It establishes a quirky tone where the hostages and the situation itself are subject to continuous comedic interruptions and witty exchanges. Satya appears to be the anchor of the film's humor. The trailer heavily features his trademark deadpan expressions and dialogue delivery, positioning him as the standout performer in the ensemble. While actors like Vennela Kishore and Kaala Bhairava are glimpsed adding to the comedic chaos, Satya clearly drives the narrative forward in this promotional cut. Overall, the trailer for Jet Lee suggests an eccentric, situational comedy that plays on the tropes of action-thriller films. Whether the movie can successfully maintain this high-energy absurdity for its entire runtime will be known when it releases in theaters on May 1st.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్, మధుమేహం, PCOD వంటి సమస్యలు మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. మందులు వాడుతున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదా? అయితే మీకు 'థెరప్యూటిక్ యోగా' ఒక అద్భుతమైన మార్గం. ఇది కేవలం శరీరాన్ని కదిలించడం మాత్రమే కాదు, మీ మనస్సును మరియు ఆత్మను పునరుజ్జీవింపజేసే ఒక దివ్యౌషధం. మనం థెరప్యూటిక్ యోగాను ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) రోజంతా ఉత్సాహం: మీరు రోజుకు కేవలం గంటన్నర సమయం యోగాకు కేటాయిస్తే, మిగిలిన 22.5 గంటల సమయం ఎంతో శక్తివంతంగా మరియు ఆనందంగా గడుస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి: థైరాయిడ్ సమస్య ఉన్నవారు కేవలం 3 నెలల్లో మార్పును గమనించవచ్చు, అలాగే PCOD సమస్యలు 4 నుండి 5 నెలల్లో నయమయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత: ఈ ప్రపంచంలో మానసిక సమస్యలను సమూలంగా నయం చేసే శక్తి కేవలం యోగాకు మాత్రమే ఉంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, బద్ధకాన్ని వదిలిస్తుంది. అంతర్గత మార్పు: యోగా మిమ్మల్ని లోపలి నుండి మారుస్తుంది. అది ఒక చిన్న పిల్లవాడి నవ్వులో ఉండే స్వచ్ఛతను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఏం చేయకూడదు? (What Not to Do) నియమాలను విస్మరించవద్దు: మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు యోగా చేస్తున్నాం కదా అని ఆహార నియమాలను పూర్తిగా వదిలేయకూడదు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తక్షణ ఫలితాల కోసం ఆరాటపడవద్దు: యోగా అనేది ఏటీఎం మిషన్ నుండి డబ్బులు వచ్చినట్లు తక్షణమే రాదు, కానీ సాధన మొదలుపెట్టిన కొద్దిసేపటికే మీరు ఆ మార్పును అనుభూతి చెందుతారు. ఆనందాన్ని వదులుకోవద్దు: జీవితంలో దేనికైనా రాజీ పడండి కానీ మీ సంతోషం విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడకండి. ప్రారంభించడం ఎలా? (How to Start) శ్వాసపై ధ్యాస: మన శ్వాస మరియు మనస్సు భార్యాభర్తల వంటివి. శ్వాస దీర్ఘంగా, ప్రశాంతంగా ఉంటే మనస్సు కూడా అంతే ప్రశాంతంగా మారుతుంది. సరైన భంగిమలు: 'సుప్త ఆసనం' (Subtasana) వంటి భంగిమలు కేవలం 10 నిమిషాల్లోనే మిమ్మల్ని ఎంతో రిలాక్స్‌గా మరియు శక్తివంతంగా మారుస్తాయి. ఆధారాలతో సాధన (Props): శారీరక ఇబ్బందుల వల్ల ఆసనాలు వేయలేకపోయేవారు రకరకాల ప్రాప్స్ (Props) సహాయంతో సులభంగా యోగా చేయవచ్చు. ఇది క్యాన్సర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: థైరాయిడ్ సమస్య యోగాతో నయమవుతుందా?  జ: అవును, క్రమం తప్పకుండా థెరప్యూటిక్ యోగా చేయడం ద్వారా 3 నెలల్లో థైరాయిడ్ మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. ప్ర: క్యాన్సర్ రోగులకు యోగా ఎలా సహాయపడుతుంది?  జ: యోగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయకపోవచ్చు, కానీ రోగిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరంలో ప్రాణవాయువును (Oxygenation) పెంచి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ప్ర: వ్యాయామం చేయడానికి సమయం లేని వారి పరిస్థితి ఏంటి?  జ: మీ శరీరం కోసం మీరు రోజుకు కనీసం గంటన్నర కేటాయించలేకపోతే, అనారోగ్యం పాలైనప్పుడు అంతకంటే ఎక్కువ సమయాన్ని ఆసుపత్రుల్లో గడపాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. మీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఆత్మవిశ్వాసంతో మెరవాలన్నా యోగా ఒక్కటే మార్గం. మాటల కంటే సాధన ద్వారానే మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలరు. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు యోగా ప్రాక్టికల్ వీడియోల కోసం మా యూట్యూబ్ (YouTube) ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి మరియు ఆరోగ్యవంతులుగా మారండి.