LATEST NEWS
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు,  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసినట్లే.  గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి నేడు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే తన నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించి, కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  తాజాగా బీఆర్ఎస్ నేతలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం ద్వారా తను కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నట్లు చాటారని భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  పార్టీ మారతానని ప్రకటించిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు.  మంత్రులు అడ్డూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబులు జగిత్యాల వెళ్లి మరీ ఆయనతో భేటీ అయ్యారు.  పార్టీ మారే ఆలోచన వీడాలని సూచించారు. సమస్య ఏదైనా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామనీ వారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమచారం. అయితే ఈ రాయబారంపై జీవన్ రెడ్డి ఎలా స్పందించారన్నది తెలియరాలేదు.  ఇంతకు ముందే జీవన్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్లో నటరాజ్ భేటీ అయ్యారనీ, పార్టీలో ప్రాధాన్యత ఇస్తామనీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి జీవన్ రెడ్డి పార్టీ మార్పు విషయంలో తన వైఖరిని మార్చుకుంటారా.. లేక గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారా?  
 మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టామహేష్  తనకు తెలుగుదేశం హైకమాండ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు.  ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీకి వెళ్లినదానిపై పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో  ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలనీ, అప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనీ పుట్టా మహేష్ ను పార్టీ అధిష్ఠానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ తనకు  జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఎంపీ పుట్టా మహేష్ లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు.  కాగా పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.  మొయినాబాద్ ఫామ్ హౌస్  డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా  ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే  ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది. ఈ నేపథ్యంలో  పుట్టా మహేష్ యాదవ్ తన వివరణను అధిష్టానానికి పంపారు.  ఆ వివరణలో తనకు డ్రగ్స్ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని పుట్టా పేర్కొన్నట్లు చెబుతున్నారు.  పార్టీకి రమ్మని ఆహ్వానిస్తే వెళ్లాననీ, తాను డ్రగ్స్ తీసుకోలేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా పుట్టా మహేష్ ఇచ్చిన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. కాగా ఈ విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.  
తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రి కేసీఆర్ టార్గెట్ గా తాజాగా సంధించిన వమర్శనాస్త్రాలు రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  తన తండ్రి కేసీఆర్ ను, ప్రధాని మోడీనీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ ఒకే సమయంలో విమర్శలతో చెరిగేయడం   తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  డాడీ, మోడీ, చిన్న మోడీ అంటూ ఆమె ప్రయోగించిన పదాలు ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి.  డాడీ' అంటే తన తండ్రి కేసీఆర్ అని, 'చిన్న మోదీ' అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా  అయినా స్పష్టంగా చెప్పారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను   ఆమె తూర్పారబట్టారు. అలాగే తన తండ్రి కేసీఆర్ సీఎంగా ఉండగా రాష్ట్ర ప్రగతి కుంటుపడిందంటూ విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ నూ ఆమె వదల లేదు.   కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కొద్ది కాలం పాటు తన తండ్రి కేసీఆర్ ను మాత్రం మినహాయించి బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్, తన అన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లు లక్ష్యంగా ఆమె విరుచుకుపడ్డారు. అంతే కాకుండా బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులను సైతం వదలకుండా విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇక సొంత పార్టీ పెట్టడానికి ముందు ఆమె ఏకంగా బీఆర్ఎస్ కుంభ స్థలాన్నే గురిపెట్టారన్నట్లుగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఆయన మానసపుత్రిక అయిన కాళేశ్వరాన్ని దండగమారి ప్రాజెక్టు గా అభివర్ణించారు. కాళేశ్వరం అవినీతిపై విచారణకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన కవిత ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టును ఇసుమంతైనా ఉపయోగం లేని ప్రాజెక్టు అని దుయ్యబట్డడమే కాకుండా.. ప్రజాధనం దుర్విని యోగమయ్యిందంటూ విమర్శలు చేశారు. కాళేశ్వరంలో అవినీతికి హరీష్ రావును బాధ్యుడిని చేయాలంటూ డిమాండ్ చేయడం ద్వారా ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. దీంతో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీపై కవిత విమర్శలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కవిత విమర్శలు, ఆరోపణలపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్పందించకపోవడంతో మౌనం అర్ధాంగీకరం అన్న చందంగా కవిత ఆరోపణలల్లో వాస్తవం ఉందా అన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణులలోనే మొదలైంది. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి  బ్యాక్ టు వైసీపీ అన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.  అయితే తాజా పరిణామాలను బట్టి బాలినేనికి శ్రీనివాసరెడ్డికి వైసీపీ తలుపులు పర్మినెంట్ గా క్లోజ్ అయిపోయానని తేటతెల్లమైపోంది. గత ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం.. తాను స్వయంగా తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడంతో బాలినేని.. వైసీపీకి గుడ్ బై చెప్పేసి  జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని  శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు.  అయితే  గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది. జగన్ సైతం ఆయనను దూరం పెట్టారు. ఇటు బాలినేని కూడా తన అసంతృప్తినీ, అసమ్మతినీ బాహాటంగానే సాగారు. అయినా ఇటు బాలినేని కూడా మెడపట్టి బైటకు గెంటినా చూరుపట్టుకు వేళాడినట్లుగా ఎన్ని అవమానాలు ఎదురైనా వైసీపీని వీడకుండా అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ  2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. జనసేన గూటికి చేరడమైతే చేరారు కానీ.. అక్కడ ఆయనకు సరైర గుర్తింపు లభించలేదు. దీంతో బాలినేని తిరిగి వైసీపీ గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే అది ఉత్తి ప్రచారం మాత్రమేనని తాజా పరిణామంతో తేలిపోయింది.  అదెలా అంటే తాజగా జగన్  ఒంగోలు పార్టీ బాధ్యతలను చుండూరు రవి బాబుకు అప్పగిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో వైసీపీలో బాలినేని చాప్టర్ క్లోజేనని రాజకీయవర్గాలు అంటున్నాయి.  అలాగే బాలినేని కూడా తన రాజకీయ భవిష్యత్తుపై తన తాజా పోస్టు ద్వారా స్పష్టత ఇచ్చారు.  తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో  కలిసి జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను  ఇటీవల కలిసిన బాలినేని.. ఆ తరువాత సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించారు. జనసేనాని కేవలం పార్టీ అధినేత మాత్రమే కాదనీ, తన నమ్మకం, ఆశ్రయం అంటూ పేర్కొన్నారు. తద్వారా బాలనేని తాను  జనసేనను వీడుతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని పూర్వపక్షం చేశారు.   ఒంగోలు రాజకీయాల్లో ఈ మార్పులు   సంచలనంగా మారాయి. బాలినేని అనుచరులు కూడా ఆయన నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో రవి బాబు నాయకత్వంలో వైసీపీ ఏ విధంగా ముందుకు సాగుతుందీ, అలాగే  నియోజకవర్గంలో బాలినేని తన పట్టును ఏలా నిలుపుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. 
తెలంగాణ వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర విత్తమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఆయన తన బడ్జెట్ లో ఆరోగ్య శాఖకు సముచిత బడ్జెట్ కేటాయించారు. తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు.  ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం   3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో  రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు కాగా, తలసరి ఆదాయం   రూ.4,18,931 కోట్లు, వృద్ధి రేటు వృద్ధి రేటు 10.2శాతంగా ప్రతిపాదించారు.  మల్లు తన బడ్జెట్ లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.  - ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పథకానికి రూ.4,000 కోట్లు - పంట బీమా పథకానికి రూ.1,886 కోట్లు - మూసి రివర్ ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు - ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు - ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకానికి  రూ.1,056 కోట్లు  - పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు - రోడ్లు భవనాల శాఖకు రూ.6,416 కోట్లు - యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి రూ.5,000 కోట్లు కేటాయించారు. అలాగే..  - ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు - పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు - బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు - హ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు - రీజనల్ రింగ్ రోడ్డుకు రూ1,525 కోట్లు - రాజీవ్ యువ వికాసానికి రూ.5,800 కోట్లు కేటాయించారు.  ఇక పోతే... - కల్యాణలక్ష్మి / షాది ముబారక్ రూ.3,683 కోట్లు - విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.2,170 కోట్లు - స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు  - రైతు భరోసాకు రూ.18,000 కోట్లు - చేయూతకు రూ.14,861 కోట్లు - మహాలక్ష్మికి రూ.4,305 కోట్లు - సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు కేటాయించారు.   అలాగే..  - శాంతి భద్రతలు - రూ.11,907 కోట్లు - గోదావరి పుష్కరాలు - రూ.500 కోట్లు - పర్యాటక శాఖ - రూ.1,224 కోట్లు కేటాయించారు. 
ALSO ON TELUGUONE N E W S
- రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం..  - ప్రభాస్ సినిమాకు ఆ 5 కేసులు శాపమయ్యాయా?  - రాజా సాబ్ రిలీజ్ రోజు జరిగిన హైడ్రామా ఇదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజా సాబ్' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదలైన సమయం కంటే, అంతకు ముందు రోజు రాత్రి జరిగిన ‘పెయిడ్ ప్రీమియర్స్’ రచ్చ టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రీమియర్ షోల విషయంలో నెలకొన్న గందరగోళంపై తాజాగా మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధి శశి స్పందించారు. నిజానికి 'ది రాజా సాబ్' ప్రీమియర్స్ కోసం నైజాం ఏరియాలో భారీ ఏర్పాట్లు జరిగాయి. కానీ చివరి నిమిషంలో షోలు రద్దు కావడం, టికెట్ రేట్లపై స్పష్టత లేకపోవడంతో థియేటర్ల వద్ద అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇస్తూ.. ఆ సమయంలో కోర్టులో ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని శశి పేర్కొన్నారు. ఆ కేసులను క్లియర్ చేసి, డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసరికి సమయం మించిపోయిందని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయని ఆశించినప్పటికీ, కోర్టు ఉత్తర్వుల కాపీలు చేతికి అందేసరికి బుధవారం రాత్రి అయ్యిందని శశి తెలిపారు. దీంతో గురువారం ఉదయం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జీవో రావడంలో జాప్యం జరిగిందని చెప్పారు. "అధికారులు వస్తుందని చెబుతున్నా, సాంకేతిక కారణాల వల్ల అది లేట్ నైట్ అయింది. స్టార్ హీరో సినిమా కావడంతో రిస్క్ తీసుకోలేక షోలు రద్దు చేయాల్సి వచ్చింది" అని ఆయన ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ కొండంత ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూపిస్తామని మేకర్స్ ఇచ్చిన హామీతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, ప్రీమియర్స్ సమయంలో జరిగిన ప్లానింగ్ లోపం వల్ల అభిమానులు థియేటర్ల వద్ద నానా హంగామా చేశారు. విమల్ థియేటర్ వంటి ప్రధాన కేంద్రాల్లో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రభాస్ నటించిన 'సలార్', 'కల్కి' వంటి చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చిన నేపథ్యంలో, 'రాజా సాబ్' కూడా అదే రేంజ్‌లో వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు ఆశించాయి. కానీ ఈ ప్రీమియర్ షోల ఎఫెక్ట్ సినిమా టాక్‌పై కూడా కొంత ప్రభావం చూపిందని ఇండస్ట్రీ టాక్. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పెద్ద సినిమాల విషయంలో కనీసం రెండు వారాల ముందే అనుమతులు పొందేలా జాగ్రత్తలు తీసుకుంటామని శశి వెల్లడించారు. ప్రస్తుతం ఈ గందరగోళం ముగిసినా, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆ 'కాళరాత్రి'ని అంత సులభంగా మర్చిపోలేకపోతున్నారు. మరోవైపు ప్రభాస్ తన తదుపరి చిత్రాలైన 'సలార్‌2', 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉండగా, మారుతి తన తర్వాతి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. 
  నటీనటులు: సముద్రఖని, శివదా, రాజ్ తిరందాస్, సుందర్ పాండియన్, మున్నార్ రమేశ్ తదితరులు ఎడిటింగ్: దినేశ్ కుమార్ మ్యూజిక్:  విబిన్ భాస్కర్ సినిమాటోగ్రఫీ: కేకే నిర్మాతలు: అజయ్ కృష్ణ రచన, దర్శకత్వం: నవీన్ కుమార్ పళనివేల్ ఓటీటీ : జీ 5 ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లపై ఎప్పుడూ ఆసక్తే ఉంటుంది. ఆ క్యూరియాసిటీని మరింత పెంచుతూ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ 5' లో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ సిరీస్ 'తడయం'. సముద్రఖని, శివదా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథేంటో ఓ సారి చూసేద్దాం. కథ: ఆంధ్ర - తమిళనాడు సరిహద్దులోని ఒక గ్రామం అది. అక్కడ పోలీస్ స్టేషన్ లో అధియమాన్ (సముద్రఖని) ఎస్.ఐ.గా పనిచేస్తుంటాడు . 20 ఏళ్లలో అతనికి ఎప్పుడూ ఎలాంటి ప్రమోషన్స్ రావు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా, తనకేమీ పట్టనట్టుగా అతను వ్యవహరిస్తుంటాడు. ఎప్పుడు చూసిన అతను 'టీ' కొట్లోనే కూర్చుని ఉంటాడనే ఒక విమర్శ ఉంటుంది. త్వరలో అతను వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉంటాడు. ఆ సమయంలోనే అతని పైఅధికారిగా కొత్తగా డ్యూటీలో చేరుతుంది లక్ష్మీ (శివదా). అధియమాన్ ధోరణి శివదాకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హత్య కేసుల విషయంలో కూడా అతను కూల్ గా వ్యవహరించడంపై మండిపడుతుంది. అయితే అధియమాన్ చాలా తెలివైనవాడని , అతను ఏ విషయానికీ పెద్దగా చెలించకపోవడానికి కారణం ఉందని ఓ పోలీస్ ద్వారా లక్ష్మీ తెలుసుకుంటుంది. అదే సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. కొత్తగా డ్యూటీలోకి చేరిన లక్ష్మీ ఈ మిస్టరీని ఛేదించాలని అధియమాన్ ను తన టీమ్ లోకి తీసుకుంటుంది. వరుసగా జరుగుతున్న హత్యలపై అతని అభిప్రాయం అడుగుతుంది. అప్పుడు అధియమాన్ ఏం చెప్తాడు? హంతకులు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారనేది మిగతా కథ. విశ్లేషణ: తడయం అంటే క్లూ.. అంటే ఒక్కో క్రైమ్ కి ఒక్కో క్లూ ఉంటుంది. దానిని పోలీసులు కనిపెట్టారా లేదా అని ఈ సిరీస్ లో ఉంటుంది.   ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్ లు ఉన్నాయి. ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ పద్దెనిమిది నుండి ఒరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది. ఆరు ఎపిసోడ్ లు కలిపి మొత్తంగా  నిడివి  రెండు గంటల ఏడు నిమిషాలు. ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్.  ఎక్కడా కమర్షియల్ హంగులకి వెళ్ళకుండా కథని వాస్తవికతకు దగ్గరగా చూపించారు. సిరీస్ లో అక్కడక్కడా కొంత రక్తపాతం సీన్లు ఉంటాయి‌. అయితే ఆ రక్తపాతం సీన్లు క్రైమ్ ఎలా జరిగిందనే పాయింట్ ని వివరిస్తూ తీసారు కాబట్టి అది ఒకే అనిపిస్తే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. తక్కువ అంచనాలతో ఈ సిరీస్ ని చూస్తే మంచి క్రైమ్ థ్రిల్లర్ ని చూసిన ఫీలింగ్ వస్తుంది. సిరీస్ ని కాస్త స్లోగా మొదలు పెట్టిన దర్శకుడు.. ప్రతీ ఎపిసోడ్ కి ఒక్కో క్లూని చూపిస్తూ నెక్స్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందోననే క్యూరియాసిటీని రేకెత్తించాడు. అయితే కేస్ ఇన్వెస్టిగేషన్ ని ఇంకాస్త ఎంగేజింగ్ గా గ్రిప్పింగ్ గా తీస్తే బాగుండేది. ముఖ్యంగా నేరస్తుడు ఎవడో తెలిసాక కూడా సీన్లు రిపీటెడ్ గా వస్తుంటాయి‌. వాటిని తగ్గించి , విలన్ తో హీరో డైలాగ్స్ ఇంకాస్త ఆడ్ చేస్తే ఇది బెస్ట్ థ్రిల్లర్ గా నిలిచిపోయేది. అయితే కథా వస్తువు బాగుంది. ఫ్రెష్ ఫీల్ ని తెప్పించేలా కథని మలిచారు దర్శకుడు. కేకే సినిమాటోగ్రఫీ, విబిన్ భాస్కర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ థ్రిల్లర్ కు మరింత బలాన్ని చేకూర్చాయి. అసభ్య పదజాలం వాడలేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ సీన్లు లేవు. మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిడివి కూడా తక్కువే కాబట్టి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూసేయొచ్చు. నటీనటుల పనితీరు: సముద్రఖని నటన మరోసారి ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. కళ్ళతోనే భావాలు పలికించడం ఆయన ప్రత్యేకత. ఇక శివద సపోర్టింగ్ క్యారెక్టర్ కాకుండా ఇన్వెస్టిగేషన్ లో కీలకపాత్ర పోషించారు. మిగతా వారు తమ పాత్రలకి న్యాయం చేశారు. ఫైనల్ గా : మస్ట్ వాచెబుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రేటింగ్: 2.75 / 5 ✍️. దాసరి మల్లేశ్
    -థియేటర్స్ వద్ద కొనసాగుతున్న ఉస్తాద్ హంగామా -టాక్ పరిస్థితి ఏంటి  -సెకండ్ డే ఎంత!   పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఉస్తాద్ భగత్ సింగ్'(UStaad Bhagat singh)రాకతో 'ఉగాది శోభ' థియేటర్స్ కి కూడా వచ్చిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం  చేసుకున్న ఉస్తాద్ అదే టైంలో కొద్దిగా నెగిటివ్ టాక్ ని కూడా అందుకుంది. కానీ నిన్న రెండవ రోజు  ఫ్యామిలీ ఆడియన్స్ ఉస్తాద్ బాట పట్టారు. ఇప్పుడు వాళ్లంతా  క్లీన్ మాస్ ఎంటర్టైనర్ అనే టాక్ ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఉస్తాద్ రెండు రోజు కలెక్షన్స్ ఎంతో చూసేద్దాం. ఉస్తాద్ రెండు రోజులకి వరల్డ్ వైడ్ గా  65 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ వ్యక్తం చేస్తున్నాయి. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 52 కోట్ల గ్రాస్ ని సాధించినట్టుగా అదే ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేసాయి. అలాంటిది సెకండ్ డే 13 కోట్లు మాత్రమే రాబట్టడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో టోటల్ లోన్ రన్ లో ఎంత వసూళ్లు రాబడుతుందనే ఆసక్తి అందరిలో ఉంది.  also read: Dhurandhar 2: ధురంధర్ 2 పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. వారణాసి వస్తుంది కదా మర్చిపోరులే  నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ అయితే సుమారు 150 కోట్ల బడ్జెట్ తో ఉస్తాద్ ని  రూపొందించింది. హరీష్ శంకర్(Harish Shankar)టేకింగ్ కి మంచి పేరు వస్తుండటంతో పాటు శ్రీలీల, రాశి ఖన్నా, కె ఎస్ రవికుమార్, రావు రమేష్, పార్తీబన్  పెర్ ఫార్మెన్సు , థమన్ బిజిఏం, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కి మంచి పేరు వస్తుంది.  
    -ధురంధర్ 2 ని చూసిన రాజమౌళి  -నచ్చిందా! నచ్చలేదా! -రాజమౌళి రివ్యూలో ఏముంది  ధురంధర్ 2(Dhurandhar 2).. ఇప్పుడు ఇండియా వైడ్ గా ఎక్కడ చూసినా ఇదే సౌండ్ సర్క్యులేట్ అవుతూ వస్తుంది. పైగా ఈ రోజు నుంచి తెలుగు వెర్షన్ థియేటర్స్ లో ప్రత్యక్షమవ్వడంతో థియేటర్స్ అన్ని ధురంధర్ తెలుగు ఫ్యాన్స్ తో ఫుల్ రష్ గా ఉన్నాయి. ఇక పార్ట్ 2 గురించి ఎన్టీఆర్(Ntr),అల్లు అర్జున్(Allu Arjun),మహేష్ బాబు(Mahesh Babu)వంటి స్టార్స్ సైతం సినిమా సూపర్ గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ కోవలోనే ఆస్కార్ విన్నర్ దర్శక ధీరుడు రాజమౌళి(Ss Rajamouli)ధురంధర్ 2 గురించి ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. మరి రాజమౌళి రివ్యూలో ఏముందో చూద్దాం. నాకు ధురందర్ 1 చాలా నచ్చింది, కానీ పార్ట్ 2 పరిమాణంలోను, ఆత్మలోను పార్ట్ 1 ని మించిపోయింది. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక నైపుణ్యం, సంగీతం,సన్నివేశాల  రూపకల్పన, దర్శకత్వం అన్నీ ఎలాంటి కల్మషం లేనివిగా కుదిరాయి. కానీ భావోద్వేగభరితమైన అంశాలు మూవీకి అసలైన ఆధారాన్ని ఇచ్చాయి. నిజమైన ఉత్కంఠని  సృష్టించేలా కథలో మలుపులని కూడా అద్భుతంగా అల్లింది. ఆదిత్య ధర్ గారు దర్శకుడిగా  అదరగొట్టారు. 4 గంటల నిడివితో రిలీజ్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటిది మూవీ చూస్తున్నంత సేపు ఫస్ట్ ఫ్రేమ్ టూ చివరి ఫ్రేమ్ వరకు సీట్లకి అతుక్కుపోతాం. స్నేహితుడు రణవీర్ అద్భుతమైన పెర్ఫార్మ్ కనపరిచాడు. స్టార్టింగ్ లో తన సోదరితో చేసిన సన్నివేశంలో అయితే  మాస్టర్ క్లాస్ పెర్ఫార్మ్. అది మొదలు హార్ట్ ని పిండేసే క్లైమాక్స్ వరకు, హంజా, జస్కిరత్‌గా రణవీర్ మంత్రముగ్ధులని చేసాడు. Also read:  Dhurandhar 2: ధురంధర్ 2 విసుగు పుట్టించే సినిమా.. మీ డబ్బు వృధా చేసుకోవద్దు మాధవన్  గారు తన క్యారక్టర్ ద్వారా దేశం యొక్క నిస్సహాయతని, నిరాశని ఎంతో  అద్భుతంగా ప్రదర్శించారని రాజమౌళి తన ఎక్స్ వేదికగా తెలిపాడు. ఇప్పడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు స్పందిస్తు 'మరి మీరు కూడా 'వారణాసి'(Varanasi)ని ధురంధర్ 2 ని మించే పోయేలా చిత్రీకరించి ఇండియన్ సినిమా కీర్తిని మరోసారి వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద చాటి చెప్పాలనే కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు.  https://x.com/ssrajamouli/status/2035210972089262351?s=20         
    -పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్ 2  -కానీ రమ్య ఇచ్చిన రివ్యూ వైరల్  -తన రివ్యూలో ఏముంది  మనుషులే అందరకి అందరు నచ్చరు. అలాంటిది సినిమాలది ఏముంది చెప్పండి. నచ్చే వాళ్లకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. కానీ అంతిమంగా మెజారిటీ ప్రేక్షకుల మౌత్ టాక్ నే ప్రధానం. అనాదిగా వస్తున్న ఆ మెజారిటీ ప్రేక్షకుల నిర్ణయానికే బాక్స్ ఆఫ్ ఆఫీస్ తలవంచి రికార్డు కలెక్షన్స్ ని అందచేస్తుంది. ఈ క్రమంలోనే  రీసెంట్ గా విడుదలైన ధురంధర్ 2 కి మెజారిటీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ బజ్ వస్తుండటంతో కలెక్షన్స్ ఏ మేర వస్తాయనే ఆత్రుతతో అందరు ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ టైం లో అసలు ధురంధర్ 2 బాగోలేదు.వేస్ట్ సినిమా అని  ప్రముఖ నటి రమ్య చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఆమె పోస్ట్ లో ఏముందో ఒకసారి చూద్దాం. ఎక్స్ వేదికగా రమ్య(Ramya)స్పందిస్తు 'ఇప్పుడే ధురందర్ 2(Dhurandhar 2)చూశాను, వావ్! ఆశాజనకంగా ఉన్న మూవీని సహనపరీక్షగా ఎలా మార్చవచ్చో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ధురంధర్ 2 చూస్తున్నంత సేపు అంతులేని అధ్యాయాలతో ఉన్న అత్యంత విసుగు పుట్టించే పాఠ్యపుస్తకాన్ని చదివినట్లుగా ఉంది. ఒకానొక దశలో, మీ కళ్ల ముందు జరుగుతున్న అఘాయిత్యాన్ని చూసి, మీ మెదడు ఇక ఏమీ చేయలేక నిరాశతో నవ్వడం మొదలుపెడుతుంది. మీరు నిజంగా ఈ సినిమా చూడాలనుకుంటే, దయచేసి థియేటర్‌లో మీ సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోకండి. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో చూస్తేనే ఉత్తమంగా ఉంటుంది. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ నాసిరకంగానే ఉన్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు పడకుండానే   హడావిడిగా సినిమాని రిలీజ్ చేశారేమో అనిపిస్తుంది. ధురందర్ పార్ట్ 1లో జనం కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ, ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక ఎనర్జీ ఉంది. ప్రేక్షకులు అందులో లీనమయ్యారు. పార్ట్ 2 లో మాత్రం  ఆడియన్స్ దేన్నీ పట్టించుకోలేదు. థియేటర్‌లో ఉన్న వారందరి సామూహిక నిరాశని మీరు స్పష్టంగా చూసి  అనుభూతి చెందవచ్చు. మూవీ మొత్తాన్ని రణ్‌వీర్ మోస్తున్నాడని చెప్పే ప్రతి ఒక్కరికీ-అసలు అతను ఏమి మోస్తున్నాడు? ఎందుకంటే నాకు కనిపించిందల్లా అతని జుట్టే. మొదటి భాగంలో, అతని జుట్టుకు ఒక వ్యక్తిత్వం, ఆకర్షణ, ఒక ప్రత్యేకత ఉండేవి. ఈ భాగంలో, అది ఊరికే ఉంది. సన్నివేశాలని బ్లాక్ చేస్తూ ప్రతీదానికి అడ్డుగా ఉంది. బహుశా సహాయ నటుడి నామినేషన్‌కు అర్హమైనదేమో.  ఇక ఆ హింస. ఇది ఒక సినిమా కాదు, ఇది ప్రాథమికంగా చుట్టూ పడి ఉన్న ఏ వస్తువుతోనైనా ఎంత సృజనాత్మకంగా హింసను సృష్టించవచ్చో చూపించే ఒక దృశ్య మార్గదర్శి. సిరంజి వాడారు. స్పానర్ వాడారు. కత్తులు, ముళ్ల బంతులు, కొడవళ్లు, గొలుసులు, తుపాకులు, బాంబులు, బాజూకాలు, షట్టర్లు - మీరు ఏది చెప్పినా, దాన్ని ఆయుధంగా మార్చేశారు. గత సన్నివేశం కంటే తర్వాతి సన్నివేశాన్ని మరింత హింసాత్మకంగా హాస్యభరితంగా ఎలా చేయాలి? అని దర్శకుడు తనతో తానే నిరంతరం పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. అది షాకింగ్‌గా ఉండటం మానేసి, నవ్వు తెప్పించే స్థాయికి చేరుకుంటూనే ఉంటుంది'' also read: Dhurandhar 2: ధురంధర్ 2 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. శంకర్ డైరెక్ట్ చేసే ఎలా ఉండేదో! మీరు రెండు కాళ్ళూ నరికేసి, మొండెం మీద కిరోసిన్ పోసినా కూడా, ఆ వ్యక్తి ఏదో టెడ్ టాక్ మధ్యలో ఉన్నట్టుగా డైలాగులు చెబుతూనే ఉన్నాడు. మెడికల్ సైన్స్ జిందాబాద్. ఆస్కార్ సంగతి మర్చిపోండి, నోబెల్ బహుమతి రాబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ధురందర్ 2 ఒక పెద్ద నిరాశపరిచే సినిమా. ఇది ఒక బోరింగ్ కామెడీ. మొదటి భాగం మిమ్మల్ని నవ్వించి ఉంటే, ఈ భాగం చూశాక 'ధురందర్ 2 ఎందుకు?' అని ప్రశ్నించుకుంటారు. రణ్‌వీర్, నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. మీ మితిమీరిన జాతీయవాదం, ప్రొపగాండా పాతబడిపోయాయి. వాటి నుంచి బయటకు రండి'' అని ప్రియ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ సుదీర్ఘ పోస్ట్  ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.  కన్నడ చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగిన రమ్య  కర్ణాటకలోని మాండ్య పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీ గా ప్రాతినిధ్యం వహించింది. తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యు అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. ఈ ఏడాది జనవరిలో ఉపేంద్రతో కలిసి రక్త్ బ్రహ్మాండ్ లో చేసింది.    https://x.com/divyaspandana/status/2034864618456432777?s=20  
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేదికపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి(R Narayana Murthy) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఏపీలో నంది అవార్డుల పునరుద్ధరణ గురించి వారు చేసిన విజ్ఞప్తులపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనదైన శైలిలో స్పందించారు.  నట్టి కుమార్ తాజాగా 'తెలుగువన్ సినిమా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్. నారాయణమూర్తిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించడంలో తప్పు లేదని, కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్ర వేదికపై ఉండి మరో రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడటం హుందాతనం అనిపించుకోదని ఆయన పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఏపీ నుంచి 68 శాతం రెవెన్యూ వస్తుందని, కానీ ఇండస్ట్రీ పెద్దలు ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం ఏం చేశారని నట్టి కుమార్ ప్రశ్నించారు. విభజన తర్వాత ఇన్ని ఏళ్లలో ఏపీలో ఒక్క స్టూడియో అయినా కట్టారా? లేదా ఒక్క డబ్బింగ్ థియేటర్ అయినా నిర్మించారా? అని ఆయన నిలదీశారు. కేవలం షూటింగ్‌ల కోసం టూరిస్టుల్లా వెళ్లి వస్తున్నారు తప్ప, అక్కడ శాశ్వత ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఆయన ఇండస్ట్రీ ప్రతినిధిగా చాలా హుందాతనంగా మాట్లాడారని నట్టి కుమార్ అన్నారు. చిరంజీవి ఎక్కడా ఎవరినీ తక్కువ చేయలేదని, రెండు రాష్ట్రాల్లోనూ అవార్డులు ఇస్తే కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మాత్రమే చెప్పారని గుర్తు చేశారు.  అయితే, ఇండస్ట్రీలో కొందరు ద్రోహులు ఉన్నారని, వారు ఏపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పకుండా అడ్డుపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించడానికి పిలిచినప్పుడు ఎంతమంది హీరోలు, నిర్మాతలు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వైపు నుంచి సానుకూలత ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ పెద్దలే వెనకాడుతున్నారని నట్టి కుమార్ ఆరోపించారు.  ఏపీలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలంటే కేవలం అవార్డులు మాత్రమే సరిపోవని, మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టాలని నట్టి కుమార్ చేసిన సూచనలు చర్చనీయాంశంగా మారాయి. Also Read: బుజ్జితల్లితో విజయ్-రష్మిక క్యూట్ మూమెంట్!  
- పూజా హెగ్డే అందాల జాతర - ట్రెండీ లుక్‌లో నెటిజన్ల మనసు దోచుకుంటున్న క్రేజీ బ్యూటీ. - మళ్ళీ ఫామ్‌లోకి వస్తున్న పూజా..  - తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న వైనం. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సందడి మామూలుగా ఉండదు. తనదైన స్టైల్ మరియు గ్లామర్‌తో కెమెరా కళ్లను తనవైపు తిప్పుకోవడం పూజాకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో పూజా హెగ్డే హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. తన గ్లామరస్ అప్పియరెన్స్‌తో ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్ కోసం పూజా ఒక అద్భుతమైన లైట్ స్కై బ్లూ కలర్ డ్రెస్సును ఎంచుకుంది. ఈ ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆమె మెరిసిపోతూ కెమెరాలకు ఫోజులిచ్చింది. పూజా స్టైలింగ్, ఆమె చిరునవ్వు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ఒక లెవల్లో ఉంటుందని ఈ ఫోటోలు చూస్తే మరోసారి స్పష్టమవుతోంది. నెటిజన్లు సైతం "పూజా మళ్ళీ తన పాత గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే, పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రైమ్ ఈవెంట్‌లో ఆమె నటించబోతున్న కొత్త చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వెలువడ్డాయి. అహన్ శెట్టి సరసన ‘సంకి’ అనే బాలీవుడ్ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందని, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా పూజా ధీమా వ్యక్తం చేసింది. ఇకపోతే ఈమె ఈవెంట్‌కి  హాజరవుతున్న క్రమంలోనే అక్కడున్న అభిమానులు, కెమెరామెన్ ఈమెను ఫోటోలు తీసే ప్రయత్నం చేశారు.. అయితే ఆ సమయంలో ఒక అభిమాని మిమ్మల్ని కలవాలి ఉంది అన్నాడు. దానికామె రండి అని పిలిచింది. అంత‌టితో ఆగ‌కుండా మిమ్మ‌ల్ని పెళ్లి చేసుకోవాల‌ని ఉంది అన్నాడు. పెళ్లా అంటూ న‌వ్వుకుంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది పూజా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కొంతకాలం పాటు సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడిన పూజా, ఇప్పుడు మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది. తెలుగులో కూడా అగ్ర హీరోల సరసన నటించేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. కేవలం సినిమాలే కాకుండా, ఇలాంటి భారీ ఈవెంట్లలో తన గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. ప్రస్తుతం పూజా ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె తదుపరి సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో తన స్ట్రాంగ్ కమ్ బ్యాక్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వరుస ఫోటోషూట్లు, సినిమా అప్డేట్లతో పూజా హెగ్డే మళ్ళీ టాలీవుడ్ మరియు బాలీవుడ్ మీడియాలో సెన్సేషన్‌గా నిలుస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే కేవలం వెండితెరపైనే కనిపించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు తమ రూటు మార్చారు. కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా ఓటీటీ, టెలివిజన్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా తమ జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారు. పక్కా ప్లానింగ్‌తో మల్టీ-ప్లాట్‌ఫామ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమా నిర్మాణానికి ఏడాది నుండి రెండేళ్ల సమయం పడుతోంది. ఈ గ్యాప్‌లో ప్రేక్షకుల కంటికి కనిపించకపోతే క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని గ్రహించిన హీరోలు, స్మార్ట్ మూవ్ వేస్తున్నారు. ఇటీవల 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, 'ది ట్రైటర్స్' అనే పాపులర్ రియాలిటీ షోకి హోస్ట్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం సినిమాలే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు అక్కినేని నాగచైతన్య ఇప్పటికే 'దూత' వంటి వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు దానికి సెకండ్ సీజన్ కూడా సిద్ధమవుతోంది. అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం డిజిటల్ ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇలా కేవలం ఒకే మాధ్యమానికి అతుక్కుపోకుండా అన్ని వైపులా తమ బ్రాండ్ వాల్యూని పెంచుకోవడానికి ఇదొక చక్కని మార్గంగా మారింది. ఈ మల్టీ-ప్లాట్‌ఫామ్ విధానం వల్ల హీరోలకు ఆర్థికంగా లాభించడమే కాకుండా, వారి రీచ్ కూడా అద్భుతంగా పెరుగుతోంది. ఓటీటీ మరియు టీవీ షోల ద్వారా సామాన్య ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తోంది. ఒకప్పుడు వెండితెర నటులు బుల్లితెరపై కనిపిస్తే ఇమేజ్ తగ్గుతుందని భయపడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎక్కడ కంటెంట్ బాగుంటే అక్కడ ప్రేక్షకులు ఉన్నారని మన స్టార్స్ గుర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. "మా హీరో సినిమా కోసం రెండేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి షోలు లేదా సిరీస్‌ల ద్వారా తరచూ చూడవచ్చు" అని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. భవిష్యత్తులో మరికొందరు అగ్ర హీరోలు కూడా వెబ్ ఒరిజినల్స్ మరియు టాక్ షోలలో మెరవబోతున్నారు. మొత్తానికి టాలీవుడ్‌లో  వస్తున్న ఈ మార్పులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో హీరోలు కేవలం యాక్ట‌ర్స్‌గానే కాకుండా హోస్టులుగా, డిజిటల్ స్టార్స్‌గా మల్టీ టాలెంట్ చూపిస్తారని స్పష్టమవుతోంది. మరి ఈ కొత్త బాటలో ఇంకా ఎవరెవరు అడుగులు వేస్తారో వేచి చూడాలి!
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే "విజయ్-రష్మిక పెళ్ళి భోజనానికి నన్ను పిలవలేదని, వారి ఫ్యాన్ అయిన నన్ను కూడా పిలవాలి కదా" అంటూ ఓ చిన్నారి బుజ్జి బుజ్జి మాటలతో వీడియో చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా, విజయ్ కి కూడా చేరువైంది. ఆ చిన్నారి వీడియో కింద విజయ్ ఓ క్యూట్ కామెంట్ చేశాడు. "బుజ్జితల్లి.. ఇంటికి పిలుస్తా లంచ్ కి.. నీ ఫేవరెట్ ఫుడ్, స్వీట్స్ నాకు చెప్పు, అన్నీ ఇంట్లో చేపించి మంచిగా తిందాము" అని విజయ్ రిప్లై ఇచ్చాడు. విజయ్ మాట ఇవ్వడమే కాదు, ఆ మాట మీద నిలబడ్డాడు కూడా. రీసెంట్ గా ఆ చిన్నారిని ఇంటికి పిలిచి.. తనకి ఇష్టమైన లడ్డులు, పులిహోర వంటి ఐటమ్స్ స్వయంగా వడ్డించారు. విజయ్, రష్మిక ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ముద్దాడటమే కాకుండా, ఎత్తుకొని సరదాగా కుబుర్లు చెప్పారు.  ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి బుజ్జి కోరికను తీర్చి, తనకు జీవితంలో మర్చిపోలేని మెమొరీ ఇచ్చారంటూ.. విజయ్, రష్మికపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Also Read: క్రేజీగా 'హ్యాపీ రాజ్' ట్రైలర్.. అబ్బాస్ కంబ్యాక్ అదిరిందిగా! https://x.com/Theteluguone/status/2034961769861718291
- ఈ వేసవిలో స్టార్ హీరోయిన్ల కెరీర్ క్లాష్..  - అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మృణాల్, నభా! - సమ్మర్ రేసులో సుందరీమణులు..  - 'డెకాయిట్'గా మృణాల్, 'స్వయంభు'గా నభా నటేష్ రచ్చ! తెలుగు సినీ పరిశ్రమలో వేసవి కాలం అంటే కేవలం స్టార్ హీరోల సినిమాల సందడి మాత్రమే కాదు, హీరోయిన్ల మధ్య జరిగే కెరీర్ పోటీ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. 2026 సమ్మర్ సీజన్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు తమ విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో ముందుగా వినిపిస్తున్న పేరు మృణాల్ ఠాకూర్. 'సీతా రామం', 'హాయ్ నాన్న' వంటి సినిమాలతో క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తన రూట్ మార్చింది. మృణాల్ నటిస్తున్న తాజా చిత్రం "డెకాయిట్". ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేసిన ఆమె, ఈ సినిమాలో రఫ్ అండ్ టఫ్ అవతార్‌లో కనిపించబోతుండటం విశేషం. ఏప్రిల్ 10న ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు, టాలీవుడ్ 'ఇస్మార్ట్' బ్యూటీ నభా నటేష్ చాలా కాలం తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రోడ్డు ప్రమాదం కారణంగా సినిమాలకు కొంత కాలం దూరమైన నభా, ఇప్పుడు భారీ పీరియాడిక్ ఫాంటసీ చిత్రం "స్వయంభు"తో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కోసం నభా గుర్రపు స్వారీ, యుద్ధ విద్యల్లో శిక్షణ కూడా తీసుకోవడం విశేషం. ఆమె కెరీర్‌కు ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది. మృణాల్ ఠాకూర్ తన వర్సటాలిటీని నిరూపించుకోవాలని చూస్తుంటే, నభా నటేష్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో గ్రాండ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉంది. గతంలో 'మ్యాస్ట్రో' వంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో నభాకు ఈ 'స్వయంభు' రిజల్ట్ చాలా ముఖ్యం. అటు మృణాల్ తన మాస్ యాంగిల్‌తో ఏ మేరకు మెప్పిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ఇద్దరు భామల సినిమాలపై విపరీతమైన చర్చ నడుస్తోంది. నభా మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే, మృణాల్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉండబోతున్నాయో అన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. ఈ సమ్మర్ బాక్సాఫీస్ పోరులో ఎవరికి ప్రేక్షకులు పట్టం కడతారో చూడాలి. ఈ భారీ చిత్రాల విడుదల తర్వాతే ఈ ఇద్దరు భామల తదుపరి ప్రాజెక్టులు మరియు కెరీర్ గ్రాఫ్ ఆధారపడి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్స్ మరియు ప్రమోషన్స్ ఈ పోటీని మరింత వేడెక్కించనున్నాయి. రాబోయే వేసవిలో బాక్సాఫీస్ క్వీన్ ఎవరో తేలిపోనుంది.
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి.  దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు,  కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు.  ఎలా తిన్నా దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  మార్కెట్లలో దోసకాయలకు డిమాండ్  కూడా పెరిగే కాలం ఇది.  అయితే దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే చేదు దోసకాయలను ఎంపిక చేస్తుంటారు.   చేదు దోసకాయలు  అటు తినలేము, ఇటు డబ్బు కూడా వృధా అవుతుంది.  అలా కాకుండా మార్కెట్లో దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చేదు దోసకాయలు కాకుండా అన్నీ మంచి దోసకాయలు ఎంచుకోవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. చేదు దోసకాయలు అవాయిడ్ చేసి మంచి దోసకాయలు ఎంచుకునే టిప్స్.. రంగు,  ఆకారం..  దోసకాయల రంగు,  ఆకారం ను  బట్టి చేదు దోసకాయను సులభంగా గుర్తించవచ్చు. దోసకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే, అది తాజాగా ఉన్నట్లు. అది లేత పసుపు, తెలుపు రంగులో లేదా మచ్చలతో ఉంటే, అది పండిందని అర్థం, అలాగే  లోపల చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. నొక్కడం.. దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటే ఫర్వాలేదు, అదే అది మెత్తగా లేదా స్పాంజిలాగా అనిపిస్తే అది చెడిపోయినది,  చేదుగా కూడా ఉండవచ్చు. దోసకాయ నొక్కినప్పుడు అది గట్టిగా ఉండాలి. ఆకారం.. దోసకాయ ఆకారాన్ని చూసి  సులభంగా అది చేదు దోసకాయ లేదా మంచి దోసకాయ అనేది చెప్పవచ్చు. మందంగా లేదా పసుపు రంగులో ఉండే దోసకాయలు చేదుగా ఉండే అవకాశం ఉంది. ముదురు ఆకుపచ్చ రంగులో, గట్టిగా ఉండే దోసకాయలను మంచిగా ఉంటాయి. వాసన.. వాసనను బట్టి సులభంగా దోసకాయ చేదు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు.   దోసకాయ  తాజాగా ఉంటే లోపల కూడా తాజాగా ఉంటుంది.  దాని వాసన వింతగా లేదా ఘాటుగా ఉంటే, అది  లోపల చేదుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాండం.. దోసకాయ కొనుగోలు చేసినప్పుడు దోసకాయ కాండం దగ్గర కట్ చేయాలి. ఆ కాండం భాగాన్ని  దోసకాయ మిగిలిన భాగంలో రుద్దితే తెల్లని నరుకు వస్తే దోసకాయ చేదు ఉండే అవకాశం ఉంటుంది.  ఈ నుగురు బాగా బయటకు వెళ్లిపోతే దోసకాయలో చేదు తగ్గిపోతుందని చెబుతారు. అందుకే చాలామంది దోసకాయను కట్ చేసేటప్పుడు మొదట కాండం దగ్గర కట్ చేసి  రుద్దుతారు.  దీని వల్ల దోసకాయలో ఉండే చేదు పోతుందని చెబుతారు.                                 *రూపశ్రీ.
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.