LATEST NEWS
తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గత జగన్ సర్కార్ స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10)కి సరిగ్గా మూడేళ్ల అుతున్న సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా  నిజం గెలిచింది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో  జరిగిన  లీడర్‌షిప్ కాంక్లేవ్ సదస్సు వేదికగా ఆయనీ పిలుపు ఇచ్చారు.  సుదీర్ఘ పోరాటాలు, క్లిష్ట పరిస్థితుల్లో శ్రేణులు చేసిన త్యాగాల ఫలితంగానే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తల శ్రమను ఎప్పటికీ మరువలేమని లోకేష్ పునరుద్ఘాటించారు.  జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో యాభై మూడు రోజుల పాటు అన్యాయంగా నిర్బంధించిన విషయాన్నిగుర్తు చేసిన లోకేష్.. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే  నాడు ఆ అరెస్ట్ జరిగిందన్నారు.  చివరికి న్యాయస్థానాలు,  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి తప్పు జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమే గెలిచిందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక సత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు. ఈ సదస్సు వేదికగా పార్టీ నాయకులకు లోకేశ్  పార్టీ, పర్సనల్, ప్రభుత్వం  అనే  3-పీ  మార్గదర్శకాలను నిర్దేశించారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు..  పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కార్యకర్తలంతా క్రియాశీలకంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నత స్థానాలకు ఎదిగే కొద్దీ మరింత వినయంగా ఉంటూ, ప్రతి ఒక్కరితోనూ మానవతా దృక్పథంతో మమేకం కావాలన్నారు.  జగన్ హయాంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న ఇబ్బందులను ఎత్తి చూపిన లోకేష్. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య   వ్యత్యాసం కూడా తెలియని గత పాలకుల విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయిలో   తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, అహంకారాలకు  ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్న నారా లోకేష్.. ప్రస్తుతం పార్టీని  టీడీపీ 3.0 వెర్షన్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.  అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని, కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు.  [TDP P3 Vertion, Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Nijam Gelichindi program, Telugu Desam Party, AP Leadership Conclave, Telugu One]
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..!  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ అలియాస్ తాత మధు, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఒక్కొక్క రికి రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.  ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిని ధులుగా సభా కార్యక్రమా లకు హాజరుకావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన చేపట్టిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ కోరుతూ పోలీసులు సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలను ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటికే ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో స్పీకర్‌ను దూషించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరిం చుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులను అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వివాదం కొనసాగుతోంది.  ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలా స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీల అరెస్టు, నాంపల్లి కోర్టు బెయిల్, అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణ, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై వివాదం వంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.       (BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు. సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు. జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.       (Minister  Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆయనను మరింత ఏకాకిగా మార్చేలా ఉన్నాయి.  సోమవారం (సెప్టెంబర్ 7) ఆయన ఆర్భాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త పార్టీ ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండాలను రివీల్ చేయలేదు. అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.   విజయకొత్త పార్టీ ప్రకటన చేసి కూడా పార్టీ పేరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  ఇక ఆయన అనుసరిస్తున్న విధానాలు, పార్టీ లక్ష్యాలపై ఆయనలోనే అయోమయం, గందరగోళం ఉందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. పార్టీ  స్థాపిస్తారట కానీ, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదంటున్నారు విజయసాయిరెడ్డి.  అసలు రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి పార్టీలు క్రియాశీలంగా ఉన్న సమయంలో  విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేసి.. తాను కాదు మరో నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాను.. తాను వెనుకుండి సలహాలూ, సూచనలూ ఇస్తాననడం ఆయనలోని గందరగోళానికి  అద్దంపడుతున్నట్లుగా ఉంది. సీఎం అభ్యర్థి స్థాయి నాయకుడు   పార్టీలోకి వచ్చి తన  నాయకత్వంలో పని చేసేంత సీన్ విజయసాయిరెడ్డికి ఉందా అన్న అనుమానాలు రాజకీయపరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  రాష్ట్ర రాజకీయాల్లో   బలంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలను కాదని మరీ.. బలమైన నేత ఎవరైనా.. విజయసాయి నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.  ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రజాదరణ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న బలమైన నేతను ముందు పెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలన్నది విజయసాయి ఆలోచనగా కనిపిస్తోంది.   తనను తాను శివసేన వ్యవస్థాపకుడు  బాల్ థాక్రే తో పోల్చుకోవడం కూడా విస్తుగొలుపుతోంది. బాల్ థాకరే మహారాష్ట్రలో హిందుత్వ ఐకాన్, అలాగే.. మరాఠా సెంటిమెంట్ ఆయనకు అప్పట్లో పెద్ద బలంగా నిలిచింది. కానీ ఇక్కడ అంటే ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసు సహా పలు కేసులలోఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులు ముందు ముందు విజయసాయి పొలిటికల్ జర్నీకి అడ్డంకులుగా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేము.  ఈ విషయాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని ఆలోచిస్తే.. ఇంకా నామకరణం కూడా జరగని విజయసాయి కొత్త పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకగా మారే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు.   [Vijayasai Reddy Bal Thackeray  Strategy, New Political Party, AP Politics, YCP, Telugudesham, Janasena, Ap Politics, Telugu One]
తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు.   ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు.  ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో  ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి,  రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు.   [Vijayasai Reddy Say  YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి' కోసం సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది? మహేష్ బాబు పార్ట్ ఎంత మిగిలింది? అనుకున్న డేట్‌కి రిలీజ్ అవుతుందా? అంటూ అభిమానులు చర్చించుకుంటూనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా గురించి నెట్టింట ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను 90 శాతానికి పైగా పూర్తి చేశారని సమాచారం. మనం ఇంకా షూటింగ్ ఏ దశలో ఉందో అని అనుకుంటుంటే, జక్కన్న మాత్రం సైలెంట్‌గా మెజారిటీ పార్ట్ పూర్తి చేసేశారు. మరో విశేషం ఏంటంటే.. మహేష్ బాబుకు సంబంధించిన కీలకమైన మేజర్ పోర్షన్స్ షూటింగ్ ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయిపోయింది. కేవలం మహేష్ బాబుకు సంబంధించిన ఒక క్రూషియల్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో ఎంట్రీ సీన్లు థియేటర్లలో సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాయి. ఇప్పుడు 'వారణాసి'లో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కూడా అంతర్జాతీయ స్థాయిలో, మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో ప్లాన్ చేశారట. ఈ ఒక్క షెడ్యూల్ పూర్తయితే మహేష్ బాబు టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్లే. ఒకవైపు షూటింగ్ నడుస్తుండగానే.. మరొకవైపు డబ్బింగ్, ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, VFX పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఎక్కడా టైమ్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ VFX కంపెనీలతో జక్కన్న టీమ్ నిరంతరం వర్క్ చేస్తోంది. ఈ గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ లో ప్రపంచస్థాయి ప్రొడక్షన్ వాల్యూస్, కళ్లు చెదిరే విజువల్స్ ఉండబోతున్నాయి. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని రఫ్ లుక్‌లో పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు రాజమౌళి. ఇప్పటికే పూర్తి చేసుకున్న పోర్షన్స్ చూసిన యూనిట్ వర్గాలు అవుట్‌పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాయట. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ షూటింగ్ పూర్తి కావడంతో.. ముందుగా ప్రకటించినట్టుగానే 'వారణాసి' మూవీ ఏప్రిల్ 7, 2027న విడుదల కావడం ఖాయమనిపిస్తోంది.         [Varanasi Movie, Shooting Update, Mahesh Babu, Introduction Scene, SS Rajamouli, Telugu Film News, Tollywood News, Telugu News]  
  రాహుల్ రాయ్.. 90’sలో స్టార్ డమ్ హోదాని అనుభవించిన బాలీవుడ్ నటుడు. ముఖ్యంగా ఆషిఖీ’ చిత్రంతో లెక్కలేనంత మంది అభిమానులని సంపాదించడమే కాకండాప్రత్యేకమైన రూపం హెయిర్‌స్టైల్‌తో తనకంటూ ఒక 'ఆరా' క్రియేట్ చేసుకున్నాడు. ‘జునూన్’, ‘ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ’ వంటి  సూపర్ హిట్ చిత్రాలు కూడా తన ఖాతాలో ఉన్నాయి.  సుమారు 37 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఘనతలు సాధించిన ఈ నటుడి జీవితం 2020లో ఊహించని విషాద మలుపు తిరిగింది. కార్గిల్‌లో ‘ఎల్‌ఏసీ – లైవ్ ది బ్యాటిల్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా  బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ ప్రాణాంతకమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ, నీ కెరీర్ మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఈ విషాదకర సంఘటన తర్వాత దాదాపు ఐదేళ్లపాటు ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాడాల్సి వచ్చింది. అనారోగ్యం నుంచి కోలుకుని, శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. అయితే, ఈ ఐదేళ్ల కాలంలో ఆయనకు చిత్ర పరిశ్రమలో ఎలాంటి అవకాశాలు లభించలేదు. అనారోగ్యం కారణంగా సినిమాలు దూరం కావడంతో ఆర్థిక ఇబ్బందులు, నిత్యం వాడాల్సిన మందుల ఖర్చులు, ఇంటి నిర్వహణ భారం రాహుల్ రాయ్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేసాయి. మరోవైపు తన ఆస్తులన్నింటినీ మాజీ భార్య పేరిట రాయాల్సి రావడంతో, ప్రస్తుతం 60 ఏళ్ల వయస్సులో ఆయన మళ్లీ మొదటి నుంచి తన లైఫ్ స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. పైగా బ్రెయిన్ స్ట్రోక్ రాకముందు నుంచి ఉన్న  చట్టపరమైన వివాదాలు, కోర్టు ఖర్చులు  అదనపు భారంగా మారాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో జీవనోపాధి కోసం, కుటుంబ పోషణ కోసం ఆయన ఎలాంటి సంకోచం లేకుండా తనకు దొరికిన పనిని స్వీకరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే పెళ్లిళ్లలోతో పాటు శుభకార్యాలలో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇస్తూ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఒక పెళ్లిలో ఇచ్చే ప్రదర్శనకు గానూ  2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు పారితోషికం పొందుతారు. ఆ వచ్చిన డబ్బుతోనే నెలకు కావలసిన మందుల ఖర్చులు, నిత్యావసరాలు మరియు ఇతర కుటుంబ వ్యయాలను నెట్టుకొస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.   Also read: వామ్మో వారణాసి తెలుగు రైట్స్ అన్ని కోట్లా: అసలు ఆ బిజినెస్ నిజమేనా!  అయితే, ఆయన పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది నెటిజన్లు ఆయనను దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ విమర్శలపై రాహుల్ రాయ్ ఎంతో నిగ్రహంతో, ప్రశాంతంగా స్పందించారు. "ఇంట్లో ఏసీ గదుల్లో కూర్చుని నన్ను ట్రోల్ చేసేవాళ్లకు, అనారోగ్యం తర్వాత ఈ వయసులో నిలబడి డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో తెలియదు. నేను ఎవరి ముందూ చేతులు చాచడం లేదు, స్వశక్తితో కష్టపడి నిజాయితీగా నా కడుపు నింపుకుంటున్నాను" అని గట్టిగా సమాధానమిచ్చారు.        [Rahul Roy, brain stroke, Marriage Dance, Ashiqui, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]    
'తండేల్' సూపర్ సక్సెస్ తర్వాత అక్కినేని నాగ చైతన్య తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ'. 'విరూపాక్ష' లాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కి సంబంధించి ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ షెడ్యూల్స్ వేగంగా పూర్తవుతుండగా.. రాజస్థాన్‌లోని రాజభవనాల్లో భారీ యాక్షన్ సీన్స్, మిస్టరీ సీక్వెన్సెస్ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ రేస్‌లో మిగతా పాన్-ఇండియా సినిమాల డేట్లు అటూ ఇటూ మారే అవకాశాలు కనిపిస్తుండటంతో, 'వృషకర్మ' టీమ్ ఖాళీగా ఉన్న డిసెంబర్ ఫస్ట్ వీక్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ప్రభాస్, హను రాఘవపూడి భారీ 'ఫౌజీ' మూవీ వాయిదా పడుతుందన్న సమాచారంతో.. 'వృషకర్మ' టీం ఆ డేట్ పై కన్నేసినట్లు సమాచారం. 'విరూపాక్ష'తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన కార్తీక్ దండు, ఈసారి 'వృషకర్మ' కోసం మైథాలజీ, హిస్టారికల్ ఎలిమెంట్స్, మిస్టరీని మిక్స్ చేసి అంతకుమించిన గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్ చేశారట. ఈ సినిమాలో నాగ చైతన్య ఒక ట్రెజర్ హంటర్‌గా కనిపిస్తుండగా, మీనాక్షి చౌదరి 'లక్ష్య' అనే ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తోంది. ఇక 'లపాతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించబోతున్నారు.  సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మిస్టికల్ థ్రిల్లర్ గా వస్తున్న 'వృషకర్మ' నాగచైతన్య కెరీర్‌లోనే మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి డిసెంబర్ 3న బాక్సాఫీస్ దగ్గర 'వృషకర్మ' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.       [Vrushakarma Release Date, Naga Chaitanya, Karthik Dandu, Meenakshi Chaudhary, Prabhas, Fauzi Movie, Telugu Film News, Telugu News]  
Yash after KGF franchise, became one of the biggest Pan-India stars. But his recent film, Toxic, his career biggest risk ended up being a forgettable disaster. The discussions are going about how big of a loss the movie ended up being for everyone involved. Yash, very confidently, even produced the film along with KVN Productions.  Now, he is answerable to exhibitors and distributors as well. Dubbing artist Jaidev Mohan in an interview revealed that when he spoke to Yash post release, the actor stated that he need to accept the audiences final judgement. He revealed that Yash looked upset but discussed about his upcoming Ramayana Part-1.  Also, few inside reports suggest that Yash did promise to compensate to producer Venkata Narayana with a new film. He is planning to keep this experience in mind and plan a better script but again he will be choosing an action film, state reports. Currently though, he is concentrating on finishing all his portions for Ramayana.  As Ravana, he has a very important part in the film and he will travel around India and world to promote the film in coming days. It is stated that he is determined to look ahead and not restrict to one failure. He did tell to Jaidev that when people did not connect they should learn and move on but not stop themselves.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    మహేష్, రాజమౌళి  'వారణాసి' గురించి డైలీ మాట్లాడుకోవడం అభిమానులు, మూవీ లవర్స్ కే కాదు భారతీయ సినిమాకే గర్వకారణం అని చెప్పుకోవచ్చు. వరల్డ్ సినిమా టార్గెట్ గా కూడా తెరకెక్కుతున్న వారణాసికి సంబంధించిన బిజినెస్ న్యూస్ ఇప్పుడు  హీట్ ని రాజేస్తోంది.  తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 350 కోట్లకి ఫైనల్ అయ్యాయనే ప్రచారం జరుగుతుంది. మరి ఇదే నిజమైతే బిజినెస్ పరంగా 'వారణాసి' చరిత్ర సృష్టించినట్టే    . రాజమౌళి ప్రీవియస్ మూవీ 'ఆర్ఆర్ఆర్'  తెలుగు స్టేట్స్ లో 200 కోట్లు బిజినెస్ జరుపుకోగా 270 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 2’ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 122 కోట్ల థియేట్రికల్ బిజినెస్ సాధించగా ఇప్పుడు వారణాసి చిత్రం రూ. 320 కోట్ల నుండి రూ. 350 కోట్ల రేంజ్‌లో బిజినెస్ ఆఫర్లు అందుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా మారుతోంది.     Also Read: టాలీవుడ్ లో సొంత ఇల్లు లేని స్టార్ హీరోలు వీళ్ళే ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి కేవలం హోమ్ మార్కెట్ నుంచే ఈ స్థాయి డిమాండ్ రావడం భారతీయ సినీ చరిత్రలోనే అపూర్వం.  కె.ఎల్. నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ వండర్‌లో మహేష్ బాబు 'రుద్ర' మరియు 'శ్రీరాముడు' వంటి రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.     [Varanasi, Mahesh Babu, Rajamouli, Priyanka Chopra, Telugu Rights, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]
  ఇల్లు కట్టుకొని మురిపోని వారంటూ ఉండరు. తమ జీవితం ధన్యమైపోయిందనుకునే వారికైతే లెక్కే ఉండదు.  కానీ  మన టాలీవుడ్ హీరోలలో కొంతమందికి... ఇప్పటివరకు తమకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదంటే మీరు నమ్ముతారా? "ఏంటి కామెడీ చేస్తున్నారా?" అని అనుకుంటున్నారేమో..ఇది అక్షరాలా నిజం! మనందరికీ తెలిసిన ఫేమస్ హీరోలు, కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే నటులు కూడా నేటికీ అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు.అసలు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? అంతటి స్టార్డమ్ ఉన్న నటులకు సొంత ఇల్లు లేకపోవడానికి కారణం ఏమిటి?  ఈ లిస్ట్‌లో అందరికంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి... పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి గారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంటూ, ఎన్నో సక్సెస్ ఫుల్ విప్లవాత్మక సినిమాలు తీసిన ఈయన, నిజ జీవితంలో ఎంత సాధారణంగా ఉంటారో మనందరికీ తెలుసు. తలచుకుంటే హైదరాబాద్‌లోనే పెద్ద బంగ్లాలు కట్టేయగల సత్తా ఆయనకు ఉంది. కానీ, ఇప్పటివరకు ఆయన తనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోలేదు. నేటికీ అమీర్‌పేట్‌లోని ఒక సాధారణ హాస్టల్‌లోనే నివాసముంటూ, తన దగ్గర ఉన్న డబ్బంతా సినిమాల పైనే పెడుతున్నారు. సినిమానే తన జీవితం, సినిమానే తన ఇల్లు అని నమ్మిన మహోన్నత నటుడు. ఇక కుర్ర హీరో రాజ్‌తరుణ్ కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు! అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, 'ఉయ్యాల జంపాల'తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. వరుస హిట్‌లతో కోట్లు సంపాదించిన రోజుల్లో చాలా ఆశగా ఒక మంచి కస్టమ్‌ హోమ్‌ను కొనుగోలు చేశాడు. కానీ పర్సనల్ లైఫ్‌లో వచ్చిన వివాదాల వల్ల, ఆ ఇంటిని తన మాజీ ప్రేయసి లావణ్యకు ఇచ్చేసి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసాడు. ప్రస్తుతం వరుస ప్లాపులు, రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన నిర్మాతల వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాజ్ తరుణ్... నేటికీ అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నాడు! "జాతి రత్నాలు" సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మోస్ట్ వాంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించీ మీకు తెలుసా? యూట్యూబర్ స్థాయి నుండి ఒక్కో సినిమాకు 8 నుండి 10 కోట్ల రూపాయల దాకా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు ఈ యంగ్ స్టార్! కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే... ఇంత స్టార్డమ్ ఉన్నా నవీన్ పొలిశెట్టికి కూడా హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేదు. అలాగే యంగ్ హీరో సంతోష్ శోభన్ కూడా ఇప్పటివరకు సొంత ఇంటిని నిర్మించుకోలేదు.     Also read: రికార్డులే తరువాయి: ఇరుముడి సక్సెస్, ది ప్యారడైజ్ కి ప్లస్ కాబోతుందా!  అయితే ఈ పరిస్థితి కేవలం యంగ్ హీరోలకే కాదు... మన టాలీవుడ్ లెజెండ్స్, పవర్ స్టార్స్‌ని కూడా వదల్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబు ప్రొడక్షన్‌లో తీవ్ర నష్టాల్లో ఉన్నప్పుడు... అన్నను ఆదుకోవడానికి తన సొంత ఇంటిని అమ్మేశాడు! దాదాపు రెండు మూడు ఏళ్ల పాటు దగ్గరలోని ఒక చిన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అద్దెకు ఉన్నాడు ! ఇక నిర్మాతల హీరోగా పేరుగాంచిన నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా భారీ బడ్జెట్ సినిమాల ప్లాపుల వల్ల తనకెంతో ఇష్టమైన 'పద్మాలయ స్టూడియోస్'తో పాటు తన సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది! మహేష్ బాబు ఇండస్ట్రీలో నిలదొక్కుకునే వరకు కృష్ణ గారు ఎన్నో ఆర్థిక కష్టాలని అనుభవించారు.       [Krishna, Pawan Kalyan, Naveen Polishetty, Raj Tharun,  R Narayana Murthy,Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]
దక్షిణాది చిత్రసీమలో తన అద్భుతమైన డాన్సులు, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో యూత్‌ను ఒక ఊపు ఊపిన ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టాలీవుడ్‌లో వరుస అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ఈ బ్యూటీ తన మకాంను పూర్తిగా ముంబైకి మార్చాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లోని గెస్ట్ అకామడేషన్‌లో ఉంటూ టాలీవుడ్‌లో దూసుకుపోయిన శ్రీలీల, ఇప్పుడు హిందీ చిత్రసీమపై పూర్తి దృష్టి సారించినట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి వరుసగా వస్తున్న ఆఫర్లతో ఆమె ముంబైలో ఒక పర్మినెంట్ అపార్ట్‌మెంట్ లేదా ఇల్లు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన అలాగే ఇబ్రహీం అలీ ఖాన్ నటిస్తున్న చిత్రంలోనూ ఈ టాలెంటెడ్ బ్యూటీ నటిస్తోంది. హిందీ ప్రాజెక్టులు పెరుగుతుండటంతో నిత్యం ప్రయాణాలు చేయడం కంటే ముంబైలోనే ఉంటూ షూటింగ్స్‌లో పాల్గొనడం సౌకర్యంగా ఉంటుందని ఆమె భావిస్తున్నారట. కాగా, గతంలో 'ధమాకా' సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న శ్రీలీల ఆ తర్వాత పలు భారీ సినిమాల్లో నటించారు. అయితే ఇటీవల కాలంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో టాలీవుడ్‌లో కొత్త ఆఫర్ల వేగం కొంత నెమ్మదించింది. మరోవైపు ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ కమ్ యాక్ట్రెస్ అయిన శ్రీలీల, తన భవిష్యత్తు కెరీర్ కోసం గ్లామర్ ప్రపంచంలో పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే నయనతార, త్రిష వంటి స్టార్ హీరోయిన్లు పలు నగరాల్లో ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లుగానే, శ్రీలీల కూడా వ్యాపార దృక్పథంతో ముంబై వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్‌లో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో, ఇక్కడి ఇండస్ట్రీని పక్కనపెట్టి ముంబైకి వెళ్లిపోవడం సరైనదేనా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. తెలుగు ప్రేక్షకుల్లో ఆమెపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సినిమాలను బ్యాలెన్స్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ముంబై మకాం మార్పుపై శ్రీలీల అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తారో, లేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో నేషనల్ స్థాయిలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాల్సిందే. త్వరలో రిలీజ్ కానున్న ఆమె హిందీ చిత్రాలు అమ్మడి కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది.     [Sreeleela Mumbai Shift, Sreeleela Bollywood Offers, Tollywood Heroine Sreeleela, Sreeleela New Movies, TeluguOne TMDB Entertainment News]
Dulquer Salmaan’s Sri Sri directed by Ravi Nelakuditi and produced by Sudhakar Cherukrui is a complete romantic entertainer. Pooja Hedge is starring as leading lady and the story follows the relationship between the lead characters across two different phases of their lives. Now, the inside buzz reveals that the makers are eyeing December 4, 2026 release. The date has been already locked for Prabhas starrer Fauzi and currently, the inside buzz states that the biggie might go for a later date. For now, Sri Sri along with Vishwak Sen's Legacy have locked this date says inside reports. The first single composed by GV Prakash Kumar, has picked up attention and has created good buzz for it. The contrasting looks of Dulquer and Pooja in the promotional material also indicate that the film will move between their college years and later adulthood, with their relationship evolving through these different periods. The shoot is currently progressing, with post-production work happening alongside it. The makers appear to be working towards having the film ready for the December window rather than announcing a date prematurely. We have to wait and see, how Fauzi makers will react to these developments in coming days.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
'నందూస్ వరల్డ్' పేరుతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్ నందన వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. 'డెస్టినీ కన్సల్టెన్సీ' పేరుతో విదేశాల్లో ఉద్యోగాలు, లండన్ వీసాలు ఇప్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలతో ఆమె తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.  తన నుంచి రూ. 15 లక్షలు వసూలు చేసి మోసం చేశారంటూ క్రాంతికుమార్ అనే బాధితుడి ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తాజాగా ఆమెను విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారించారు. విచారణ సమయంలో "నాకు ఏమీ తెలియదు.. ఆ డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధించిన లావాదేవీలన్నీ నా భర్త మధుకర్, మా అకౌంటెంట్‌ మాత్రమే చూసుకుంటారు" అంటూ నందన చెప్పినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజు ఆధ్వర్యంలో దాదాపు నాలుగు గంటల పాటు నందనను క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఈ విచారణకు నందన తన తల్లి, లాయర్లతో కలసి హాజరయ్యారు. అయితే, కొన్ని కీలకమైన ప్రశ్నలకు ఆమె సరిగ్గా సమాధానాలు చెప్పకపోవడంతో పోలీసులు ఆమెకు మళ్లీ నోటీసులు జారీ చేసి, ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇదే సమయంలో పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన పలువురు బాధితులు తమను కూడా నందన దంపతులు లండన్ వీసాల పేరుతో మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విచారణ కవరేజ్ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులతో నందన లాయర్లు వాగ్వాదానికి దిగడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత లాయర్లు క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది. అయితే, సోషల్ మీడియాలో మరో ఊహాగానం జోరుగా నడుస్తోంది. లండన్‌లోనే ఉన్న నందన హఠాత్తుగా ఇండియాకి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు "ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇద్దామనే ప్లాన్‌తోనే వచ్చారు" అని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. లాయర్లను సంప్రదించి, అన్ని చర్చించిన తర్వాతే ఆమె ఇండియాకు వచ్చారని అంటున్నారు. విచారం పూర్తయిన కొద్దిరోజులకు ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని టాక్ నడుస్తోంది.        [Nandus World Nandana, Youtuber Nandana, Bigg Boss Telugu 10, Nandus World Case, Nandus World Couple Scam, Nandana Visa Scam, Visa Fraud Case, Telugu Film News, Telugu News]  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా మూవీ 'రాకా'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్, బన్నీ రెమ్యునరేషన్ గురించి హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు అల్లు అర్జున్ ఈ సినిమాకి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కాకుండా ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా సినిమా మొదలవడానికి ముందే తమ రెమ్యునరేషన్ సెటిల్ చేసుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం 'రాకా' మూవీకి పూర్తి భిన్నమైన రూట్‌ ఎంచుకున్నారు. ఫిక్స్డ్ పారితోషికం తీసుకునే బదులు, ప్రాఫిట్ షేరింగ్ పద్ధతికి మొగ్గు చూపినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో వాటా బన్నీ ఖాతాలోకి వెళ్తుంది. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో బంపర్ హిట్ కొడితే, ప్రాఫిట్ షేరింగ్ ద్వారా అల్లు అర్జున్ అందుకునే మొత్తం ఏకంగా*రూ. 300 కోట్లకు చేరుకునే అవకాశం ఉందట. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక హీరో ఒకే సినిమాకి ఇంతటి భారీ స్థాయిలో ప్రాఫిట్ షేరింగ్ అందుకోవడం డెఫినెట్‌గా ఒక రేర్ రికార్డ్ అనే చెప్పాలి. అయితే బన్నీ ఈ డిసిషన్ తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. 'రాకా' సినిమాను ప్రొడక్షన్ పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 600 కోట్లు ఉంటుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ దశలోనే దాదాపు 50 శాతం బడ్జెట్ పూర్తయిందని ప్రచారం సాగుతోంది. ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మించే సమయంలో ప్రొడ్యూసర్లపై అదనంగా ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో, బన్నీ తన అడ్వాన్స్ రెమ్యునరేషన్‌ను పక్కన పెట్టి ప్రాఫిట్ షేరింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది కేవలం ఆయన కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, నిర్మాతకు ఇచ్చే బిగ్గెస్ట్ సపోర్ట్ కూడా. హాలీవుడ్ లెవెల్ అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఇండియాలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్‌లోనూ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.       [Allu Arjun Remuneration, Allu Arjun 300 Crore, Raaka Remuneration, Raaka Movie, Profit Sharing, Raaka Budget, Telugu Film News, Telugu News]  
  వర్షాకాలం రాగానే చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పలు రకాల ఆరోగ్య, సౌందర్య సమస్యలు కూడా మొదలవుతాయి. వర్షంలో తడవడం, తేమతో కూడిన వాతావరణం వల్ల కాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య పగిలిన మడమలు మరియు పొడిబారిన పాదాలు. వర్షపు నీటిలోని బాక్టీరియా, బురద, మరియు వాతావరణంలో పెరిగే తేమ వల్ల పాదాల చర్మం నెర్రలు బారి పగుళ్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఈ పగుళ్ల నుంచి తీవ్రమైన నొప్పి, రక్తం కారడం లేదా ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో ముఖ సంరక్షణతో పాటు పాదాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. వర్షాకాలంలో పగిలిన మడమల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, పాదాలను మెరిసేలా మార్చుకోవడానికి నిపుణులు ఒక అద్భుతమైన చిట్కాను సూచిస్తున్నారు. అదే ఇంట్లోనే చేసుకునే సహజ సిద్ధమైన పెడిక్యూర్! ప్రతిరోజూ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా, ఇంట్లోనే లభించే వస్తువులతో వారానికి 2 సార్లు ఈ పెడిక్యూర్ చేసుకోవడం వల్ల పగిలిన మడమల సమస్య నుంచి 100 శాతం విముక్తి లభిస్తుంది. ఈ పెడిక్యూర్ ప్రక్రియ పాదాలలోని మృతకణాలను తొలగించి, చర్మానికి అవసరమైన తేమను అందించి పాదాలను ఎంతో మృదువుగామారుస్తుంది. ఈ హోమ్ మేడ్ పెడిక్యూర్ చేయడం అత్యంత సులభం. ముందుగా ఒక వెడల్పాటి బకెట్ లేదా టబ్‌లో పగిలిన పాదాలు మునిగేంత గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో 1 నుండి 2 చెంచాల ఎప్సమ్ సాల్ట్ లేదా సాధారణ ఉప్పు, కొద్దిగా మైల్డ్ షాంపూ మరియు ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఈ నీటిలో మీ పాదాలను దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. గోరువెచ్చని నీటి వల్ల పాదాలపై ఉన్న గట్టి చర్మం మరియు పగుళ్లు మృదువుగా మారుతాయి. నిమ్మకాయలోని యాంటీబాక్టీరియల్ గుణాలు బాక్టీరియాను అంతం చేస్తే, ఉప్పు అలసటను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పాదాలు బాగా నానిన తర్వాత ప్యూమిస్ స్టోన్ (Pumice Stone) లేదా ఫుట్ స్క్రబ్బర్ సహాయంతో మడమలను సున్నితంగా రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు (Dead Cells) సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్బింగ్ పూర్తయిన తర్వాత పాదాలను మంచి నీటితో కడిగి శుభ్రమైన తువ్వాలుతో తుడుచుకోవాలి. అనంతరం పాదాలకు తగినంత తేమను అందించడానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా మంచి మోయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాసి 2 నుండి 3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. రాత్రి పూట ఈ పెడిక్యూర్ చేసుకుని, ఆ తర్వాత సుతిమెత్తని కాటన్ సాక్స్ (Socks) ధరించి నిద్రపోవడం వల్ల నూనె చర్మంలోకి బాగా ఇంకి పాదాలు పట్టులాగా మారుతాయి. వారానికి కనీసం 2 సార్లు ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే కేవలం 2 వారాల్లోనే పగిలిన మడమలు పూర్తిగా నయమై, పాదాలు అందంగా తయారవుతాయి. దీనితో పాటు వర్షాకాలంలో తడి బూట్లు, తడి సాక్స్ ఎక్కువ సేపు వేసుకోకూడదు. వర్షంలో తడిసిన వెంటనే పాదాలను శుభ్రమైన నీటితో కడుక్కుని పొడిగా ఉంచుకోవాలి. సులభమైన ఈ జాగ్రత్తలు పాటిస్తూ, వారానికి రెండుసార్లు పెడిక్యూర్ చేయడం వల్ల వర్షాకాలంలో కూడా మీ పాదాల అందం, ఆరోగ్యం 100 శాతం పదిలంగా ఉంటాయి.     Pedicure twice a week for soft feet, monsoon foot care tips, and remedies.
  మన భారతీయ వంటకాల్లో పచ్చళ్లకు ఉన్న స్థానమే వేరు. రోజూ తినే ఆహారంలో కాస్త పచ్చడి నంచుకుంటే ఆ రుచే వేరు, మనసుకు కలిగే తృప్తి వేరు. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సమస్యలు లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల నూనె వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని భావిస్తున్నారు. సాధారణంగా తెలుగు ఇళ్లలో పచ్చళ్లు చేయాలంటే నూనెలో ఎండుమిర్చి, ఇతర దినుసులు వేయించడం లేదా పచ్చడికి భారీగా తిరగమాత (తాళింపు) వేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ నూనె ఒక్క చుక్క కూడా వాడకుండా, ఎంతో ఘుమఘుమలాడే సువాసనతో, నోరూరించే రుచితో పాటు 100 శాతం నిండు ఆరోగ్య ప్రయోజనాలను అందించే  ఆయిల్ ఫ్రీ కొత్తిమీర పచ్చడి  (Oil Free Coriander Chutney) ని క్షణాల్లో తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? పోషకాలతో నిండిన కొత్తిమీరతో చేసే ఈ సాంప్రదాయ వంటకం కేవలం నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి దివ్యమైన ఆరోగ్య వరప్రదాయినిగా పనిచేస్తుంది. కొత్తిమీరను ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు మరియు ఖనిజాలు అందుతాయి. కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్  సి, విటమిన్  కె లతో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు పీచు పదార్థం (ఫైబర్) సమృద్ధిగా ఉంటాయి. నూనె లేకుండా ఈ పచ్చడిని తయారు చేసినప్పుడు అందులోని పోషక విలువలు ఏమాత్రం నశించకుండా 100 శాతం శరీరానికి నేరుగా అందుతాయి. కొత్తిమీరలో ఉండే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్‌ను అంతం చేసి రోగనిరోధక శక్తిని విశేషంగా పెంపొందిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, హై బీపీని అదుపు చేయడంలో మరియు మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఈ ఆయిల్ ఫ్రీ పచ్చడి సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను వేగవంతం చేసి గ్యాస్, అసిడిటీ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఈ అద్భుతమైన నూనె లేని కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఎప్పుడూ లభించే దినుసులే సరిపోతాయి. ఈ పచ్చడి తయారీ కోసం 2 కప్పుల తాజా కొత్తిమీర (బాగా కడిగి తరిగినది), మీ కారానికి సరిపడా 4 నుండి 6 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండు, రుచికి సరిపడా రాతి ఉప్పు మరియు కొద్దిగా రుచిని పెంచడానికి 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు లేదా పుట్నాల పప్పును సిద్ధం చేసుకోవాలి. తయారీ విధానం అత్యంత సులభం! మొదటగా చింతపండును కొద్దిగా వేడి నీటిలో నానబెట్టుకోవాలి. అనంతరం ఒక బాణలిలో నూనె వేయకుండా కేవలం పచ్చిమిర్చి, జీలకర్రను డ్రై రోస్ట్ (డ్రైగా వేయించడం) చేసుకోవాలి. పల్లీలను కూడా విడిగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లేదా సాంప్రదాయ రోలు తీసుకుని మొదట వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, వేయించిన పల్లీలు, నానబెట్టిన చింతపండు మరియు ఉప్పు వేసి బరకగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత తాజా కొత్తిమీరను అందులో వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే! ఎలాంటి నూనె లేదా తాళింపు అవసరం లేకుండా ఘుమఘుమలాడే హెల్తీ కొత్తిమీర పచ్చడి సిద్ధమవుతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకుని తిన్నా, ఇడ్లీ, దోస, ఉప్మా, పెసరట్టు, గారెలు లేదా రోటీలలోకి నంచుకుని తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది. జీరో ఆయిల్ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మరియు డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారికి ఇది 100 శాతం పర్ఫెక్ట్ హెల్త్ డైట్ చట్నీగా నిలుస్తుంది.       Kothimeera pachadi without oil guide, healthy zero oil coriander green chutney.
  ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజల రోజువారీ జీవితం ఒక కప్పు కాఫీతోనే మొదలవుతుంది. పొద్దున్నే వేడివేడిగా కాఫీ తాగితే వచ్చే ఆ ఉత్సాహం, రిఫ్రెష్‌మెంట్ మాటల్లో చెప్పలేం. అయితే ఇప్పటివరకు కాఫీ తాగడం వల్ల నిద్రలేమి లేదా అసిడిటీ వస్తుందని చాలామంది భావించేవారు. కానీ మన ఆరోగ్యాన్ని, ముఖ్యంగా జీర్ణవ్యవస్థలో అత్యంత కీలకమైన కాలేయాన్ని (Liver) కాపాడడంలో కాఫీ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుందని ఇటీవలి వైద్య పరిశోధనలు వెల్లడించాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో కాఫీని తీసుకోవడం వల్ల లివర్ సమస్యల నుంచి 100 శాతం రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన శరీరంలో కాలేయం అనేది ఒక ప్రాకృతిక ఫిల్టర్ లాంటిది. మనం తినే ఆహారంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో, రక్త శుద్ధిలో లివర్ ది ముఖ్యమైన పాత్ర. అయితే మారిన జీవనశైలి, కొవ్వు పదార్థాల వినియోగం వల్ల ఫ్యాటీ లివర్ (Fatty Liver) వంటి సమస్యలు ఎంతోమందిని వేధిస్తున్నాయి. వైద్య నివేదికల ప్రకారం, రోజూ 2 నుండి 3 కప్పుల కాఫీ తాగేవారికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వచ్చే ప్రమాదం దాదాపు 20% నుండి 30% వరకు తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. కాఫీలో సమృద్ధిగా ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ సమ్మేళనాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా, తీవ్రమైన లివర్ వ్యాధులైన కాలేయ క్షయత (Liver Cirrhosis) మరియు లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కాఫీ సంచలనాత్మక ఫలితాలను చూపిస్తోంది. అధ్యయనాల ప్రకారం, రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వ్యక్తులలో లివర్ సిర్రోసిస్ వచ్చే అవకాశం ఏకంగా 40% నుండి 50% వరకు తగ్గుతుంది. కాఫీలోని కెఫీన్ కణాల వాపును (Inflammation) తగ్గించి, లివర్ కణజాలం గట్టిపడకుండా (Fibrosis) నిరోధిస్తుంది. సాధారణంగా రక్త పరీక్షలలో కాలేయ పనితీరును తెలిపే ALT, AST మరియు GGT వంటి ఎంజైమ్‌ల స్థాయిలు అధికంగా ఉంటే లివర్ దెబ్బతిన్నట్లు భావిస్తారు. అయితే కాఫీ క్రమం తప్పకుండా తాగే వారిలో ఈ ఎంజైమ్‌ల స్థాయిలు 100% సమతుల్యంగా ఉంటాయని వైద్యులు నిరూపించారు. అయితే కాఫీ తాగే పద్ధతిపైనే దాని ఆరోగ్య ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. కాలేయానికి పూర్తిస్థాయి రక్షణ లభించాలంటే కాఫీని ఎప్పుడూ పంచదార (Sugar), కృత్రిమ తీపి పదార్థాలు మరియు ఎక్కువ కొవ్వు ఉన్న పాలు లేకుండా తీసుకోవడం శ్రేష్ఠం. సాధారణ బ్లాక్ కాఫీ (Black Coffee) లేదా ఫిల్టర్ కాఫీ తాగడం వల్ల కాలేయానికి 100% గరిష్ట ప్రయోజనాలు అందుతాయి. అధికంగా చక్కెర మరియు మీగడ కలిపిన కాఫీలు తాగడం వల్ల ఉపయోగం కంటే హాని ఎక్కువ జరుగుతుంది. కాబట్టి రోజుకు 2 నుండి 3 కప్పుల బ్లాక్ కాఫీని మీ డైట్‌లో భాగం చేసుకుని, మీ లివర్ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోండి.       black coffee benefits for liver disease, prevent liver cirrhosis, drinking coffee.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మందులపైనే ఆధారపడటం సరిపోతుందా? మనం తీసుకునే ఆహారం, పోషకాలు, జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా? ఈ వీడియోలో హార్ట్ హెల్త్, పోషకాహారం (Nutrition), సమీకృత ఆహారం (Samikrutha Aharam) గురించి డాక్టర్ జి. లక్ష్మణరావు Consultant Herbalist వివరించారు. మన శరీరంలో కనిపించే లక్షణాలను, రోజువారీ జీవనశైలిని గమనించి ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పులు చేసుకోవడం గురించి ఆయన సూచనలు అందించారు. గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, సమతుల్యమైన మరియు సమీకృత ఆహారం, రోజువారీ జీవనశైలి వంటి అంశాలపై ఈ వీడియోలో చర్చించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారానికి ఉన్న ప్రాధాన్యతను ఈ వీడియో వివరిస్తుంది. అలాగే, ప్రతి ఆరోగ్య సమస్యకు వెంటనే మందులపైనే ఆధారపడకుండా, సమస్యకు సంబంధించిన లక్షణాలు, ఆహారం, జీవనశైలి వంటి అంశాలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ ప్రస్తావించారు. ముఖ్య గమనిక: ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇప్పటికే వైద్యుడు సూచించిన మందులను స్వయంగా ఆపడం లేదా మార్చడం చేయకండి. గుండెకు సంబంధించిన లక్షణాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారడమే కాకుండా నీరసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా దీని ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్ లేదా ఇతర మందులు వాడుతుంటారు, కానీ ఇవి ప్రతిసారీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఔషధాల ప్రమేయం లేకుండా, ఇంట్లోనే  రెండు  ప్రభావవంతమైన పద్ధతుల ద్వారా కొన్ని నిమిషాల్లోనే కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. వైద్యులు రికమెండ్ చేస్తున్న ఈ చిట్కాలు ఏమిటో తెలుసుకుంటే.. హెర్బల్ స్టీమ్.. సాధారణ నీటి ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాసనాళాలు కాసేపు రిలాక్స్ అవుతాయి కానీ.. గట్టిగా ఉన్న కఫం కరగదు. నీటిలో కొన్ని రకాల సహజ మూలికలను చేర్చి ఆవిరి పట్టినప్పుడు, ఆ ఆవిరి ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి కఫాన్ని సులభంగా కరిగిస్తుంది. కావాల్సిన పదార్థాలు.. పుదీనా ఆకులు.. 10 నుండి 12 తులసి ఆకులు..  10 నుండి 12 హిమాలయన్ పింక్ సాల్ట్..  1 టీస్పూన్ తురిమిన అల్లం..  అర అంగుళం నీరు.. ఆవిరి రావడానికి సరిపడా ఇందులోని పదార్థాల ప్రత్యేకత..  పుదీనాలో ఉండే మెంతోల్ శ్వాసనాళాలను తెరిచి కఫాన్ని పలుచన చేస్తుంది.  తులసిలోని యాంటీమైక్రోబయల్ గుణాలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను నశింపజేసి, వాపును తగ్గిస్తాయి.  హిమాలయన్ ఉప్పు కఫాన్ని కరిగించడానికి తోడ్పడతుంది.   అల్లం గొంతు మంటను తగ్గించి శ్వాసకోశాల్లోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తయారీ , ఉపయోగించే విధానం.. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. స్టవ్ ఆపివేసిన తర్వాత, ఆ వేడి నీటిలో పుదీనా, తులసి ఆకులు, హిమాలయన్ సాల్ట్ , తురిమిన అల్లం వేయాలి. వెంటనే పాత్రపై ఒక టవల్ మూసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల ఆ మూలికలలోని ఆరోమాటిక్ ఆయిల్స్ నీటిలోకి విడుదలవుతాయి. ఆ తర్వాత పాత్ర మూత తీసి, ముఖాన్ని   తగినంత దూరంలో ఉంచి, తలను టవల్‌తో లేదా దుప్పటితో  కప్పుకోవాలి. ముక్కు , నోటి ద్వారా లోతుగా శ్వాస తీసుకుంటూ 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చాలి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫం త్వరగా కరిగిపోతుంది. డీప్ ఎక్స్‌పాన్షన్ బ్రీతింగ్ వ్యాయామం.. ఆవిరి పద్ధతితో పాటు డీప్  ఎక్స్‌పాన్షన్ ప్రత్యేక శ్వాస వ్యాయామాన్ని కలిపి చేసినప్పుడు ఫలితం మరింత వేగంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల లోపలి భాగాల్లో చిక్కుకున్న కఫాన్ని పైకి నెట్టి, సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది. చేసే విధానం.. మొదట ఒక కుర్చీలో నిటారుగా, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి కూర్చోవాలి. ముక్కు ద్వారా శ్వాసను ఎంత వీలైతే అంత లోతుగా లోపలికి తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత, దానిని 3 నుండి 4 సెకన్ల పాటు ఊపిరితిత్తుల్లోనే పట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి, నాళాలకు అతుక్కుపోయిన కఫం వదులవుతుంది. తరువాత పెదవులను కొవ్వొత్తిని ఊదుతున్నట్లుగా చిన్నగా చేసి, నోటి ద్వారా గాలిని బలంగా బయటకు వదలాలి. ఈ పద్ధతిని వరుసగా 5 నుండి 7 సార్లు పునరావృతం చేయాలి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. ముగింపు.. జలుబు, దగ్గు లేదా మొండి కఫంతో బాధపడుతున్నప్పుడు ఈ రెండు సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి మందుల అవసరం లేకుండానే ఊపిరితిత్తులు శుభ్రపడి, హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు.                           *రూపశ్రీ.    
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అలాంటి వారికి శొంఠి పొడి (ఎండు అల్లం పొడి) ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదంలో చెబుతారు. అయితే శొంఠిని సరైన మోతాదులో, సరైన విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. తాజా అల్లంతో పోలిస్తే ఎండు అల్లం లేదా శొంఠికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియకు శొంఠి ఎలా సహాయపడుతుంది? మజ్జిగలో పావు టీస్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? పిల్లల నుంచి పెద్దల వరకు శొంఠిని ఎలా ఉపయోగించాలి? ఏ ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిది? ఈ విషయాలపై ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. శొంఠి పొడి వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకునే సరైన విధానం, మోతాదు వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు శొంఠిని ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏదైనా ఇంటి చిట్కా లేదా ఆయుర్వేద పదార్థాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)