LATEST NEWS
తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు.  తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం (ఏప్రిల్ 29)న ఘనంగా జరిగింది.  మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో  పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నూతనంగా ఎంపికైన నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.   యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  లోకేష్ తో పాటుగా   కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.  నూతన కార్యవర్గంలో మొత్తం 29 మందికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించగా, 18 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, పార్టీ వాణిని బలంగా వినిపించేందుకు 10 మంది జాతీయ అధికార ప్రతినిధులను నియమించారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుండటంతో, కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేవలం పదవులు ఇవ్వడమే కాకుండా..  రాబోయే రోజుల్లో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఎలా ఉండాలనే దానిపై ఈ సందర్భంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.    
  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత కొంతకాలంగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న రాజకీయ రణక్షేత్రం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా, బుధవారం (ఏప్రిల్ 29)  రెండో, చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది.  ఈ విడతలో   142 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్ లకు భారీగా ఓటర్లు తరలివచ్చారు.  అధికార తృణమూల్ కాంగ్రెస్  తన  అధికారాన్ని నిలబెట్టుకోవాలని, ఈ సారి ఎలాగైనా బీహార్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీఎంసీ, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.  అదలా ఉంచితే బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో     దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.  గత పదిహేనేళ్లుగా ఈ ప్రాంతం మమతా బెనర్జీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే, ఈసారి ఈ కోటను బద్దలు కొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.   ఇక పోతే..  భవానీపూర్ స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.   ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలో నిలిచారు. గతంలో నందిగ్రామ్ వేదికగా మమతను ఓడించిన సువేందు, మరోసారి ఆమెను సొంత గడ్డపై సవాల్ చేస్తున్నారు. దీంతో ఈ పోరు కేవలం ఒక స్థానానికే పరిమితం కాకుండా, ఇద్దరు నేతల ప్రతిష్టకు సంబంధించిన విషయంగా మారింది.    ప్రభుత్వ వ్యతిరేకత,  అవినీతి అంశాలను ఈ సారి ఎన్నికలలో బీజేపీ ప్రచారాస్త్రాలుగా సంధిస్తే..  సంక్షేమ పథకాలు,  బెంగాలీ సెంటిమెంట్‌తో మమతాబెనర్జీ ప్రచారాన్ని హోరెత్తించారు.  వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు మే 4న విడుదల అవుతాయి.
బ్యాంకింగ్ నిబంధనలు ప్రజలకు సాయపడాలి కానీ, వారిని క్షోభకు గురిచేయకూడదు. కానీ ఒడిశాలో ఓ బ్యాంకు అధికారుల మొండితనం ఒక వ్యక్తిని తన సోదరి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకు గడపకు తీసుకువచ్చేలా చేసింది.  అసలేం జరిగిందంటే.. ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై  వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు. అయితే అందుకు అధికారులు అంగీకరించలేదు. బ్యాంకులో సొమ్ము విత్ డ్రా చేయాలంటే.. ఖాతాదారుడు స్వయంగా వచ్చి తీరాలన్నారు. అలా రాలేని పక్షంలో సంతకం, లేదా వేలిముద్రకావాలని చెప్పారు.  తన సోదరి చనిపోయిందని, ఆమె రాలేదని  ఆ వ్యక్తి బ్యాంకు అధికారుల కాళ్లావేళ్లా పడినా ఫలితం లేకపోయింది. డెత్ సర్టిఫికేట్ ఉందని చెప్పినా బ్యాంకు అధికారులు వినకపోవడంతో..  తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకుని అమలు చేశాడు. బ్యాంకు నుంచి నేరుగా తన సోదరిని పూడ్చిపెట్టిన సమాధి వద్దకు వెళ్లాడు. ఆమె సమాధిని తవ్వి ఆమె అవశేషాలను (అస్తిపంజరం) వెలికి తీసి..మోసుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు అధికారులకు తన సోదరి అస్తిపంజరాన్ని చూపుతూ.. ఆమె వచ్చింది.. ఇప్పుడు డబ్బులు ఇవ్వండంటూ డిమాండ్ చేశాడు.   ఈ సంఘటన అందరి చేతా కన్నీళ్లు పెట్టించింది.  వివరాలిలా ఉన్నాయి.. కియోన్‌ఝర్‌ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన గిరిజనుడు జితు ముండా సోదరి కక్రా ముండా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం కూడా ముందే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరు మీద మల్లీపసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా, అందులో రూ.19,300 ఉన్నాయి. ఆ సొమ్ము తీసుకునేందుకు జితు ముండా బ్యాంకుకు వస్తే.. అధికారులు  నిబంధనల ప్రకారం అడ్డు చెప్పారు. ఈ ఘటనపై నెటిజనులు బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలకే విలువఇస్తూ మానవత్వాన్ని మరిచారని దుమ్మెత్తి పోస్తున్నారు. 
వైసీపీ సోషల్ మీడియా విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడులు, అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న ఆర్థిక మూలాల గురించి పోలీసులు సజ్జల భార్గవ్‌రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా ఈ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నెట్‌వర్క్‌ను నడపడానికి ఎవరెవరు సహకరించారు? అనే కోణంలో దర్యాప్తు సాగింది.  విచారణ సమయంలో పోలీసులు ముఖ్యంగా నిధుల వ్యవహారంపై ఆరా తీశారు. సోషల్ మీడియా వింగ్ నడపడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుందని, ఆ నిధులను ఎవరు సమకూర్చారనేది ఇప్పుడు కేసులో కీలకంగా మారింది.  ఏ1 నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే విచారణకు సజ్జల భార్గవ్ రెడ్డి సహకరించలేదనీ, చాలా ప్రశ్నలకు ఆయన  తెలియదు, గుర్తులేదు' అని సమాధానమిచ్చినట్లు సమాచారం.ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే..  నిందితులు వాడిన పరికరాల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలు. పోస్టులు పెట్టడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అప్పగించాలని పోలీసులు కోరగా..  భార్గవ్‌రెడ్డి   నిరాకరించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు ఉంటేనే వాటిని ఇస్తానని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు. రాజకీయ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన అసభ్యకర పోస్టుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిల, విజయమ్మ వంటి వారిపై జరిగిన వ్యక్తిగత దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ పోస్టుల తయారీ మరియు వ్యాప్తి కోసం ప్రత్యేక టీమ్‌లు పనిచేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ వంటి సున్నితమైన అంశాలపై కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు కేవలం పోస్టులకే పరిమితం కాకుండా, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఆర్థిక వనరులపై కూడా ఫోకస్ పెట్టింది. తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భార్గవ్‌రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు, తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో మరికొంత మంది వైసీపీ నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  
  బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమించబోయే కమిటీలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు… తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం పాటించారని విమర్శించారు. “వాళ్లు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా?” అని ప్రశ్నించారు.“ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా… క్షమాపణ చెప్పించేవాళ్లం” అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం పౌరుషం లేని వ్యవహారమని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణను వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టామని… ఇప్పుడు మాత్రం భూముల కబ్జాలు, కూల్చివేతల్లో నెంబర్ వన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని… రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తే జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేశారు కేసీఆర్.  
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలు గడిచినా ఆయన సినిమాల్లోని కొన్ని పాత్రలు, పాటలు నేటికీ ట్రెండ్‌ సెట్టర్‌గానే నిలుస్తాయి. ముఖ్యంగా 1985లో వచ్చిన 'దొంగ' సినిమాలోని 'గోలీమార్' (Golimaar) సాంగ్ ఒక సంచలనం. మైఖేల్ జాక్సన్ (Michael Jackson) 'థ్రిల్లర్' స్టైల్‌లో సాగే ఈ సాంగ్ చిరు కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్. ఇప్పుడు ఈ ఐకానిక్ లుక్‌కు అమెరికాలో ఒక అరుదైన గౌరవం లభించింది. గ్లోబల్ మార్కెట్‌లోకి 'గోలీమార్' యాక్షన్ ఫిగర్! సాధారణంగా హాలీవుడ్ సూపర్ హీరోలైన స్పైడర్ మ్యాన్, బాట్‌మ్యాన్ వంటి పాత్రలకు మాత్రమే యాక్షన్ ఫిగర్స్ (బొమ్మలు) వస్తుంటాయి. కానీ తొలిసారిగా మన తెలుగు సినిమా ఐకాన్ చిరంజీవి 'గోలీమార్' గెటప్‌ను యాక్షన్ ఫిగర్‌గా రూపొందించారు. అమెరికాలోని ఒక ప్రముఖ కంపెనీ ఈ ఫిగర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ పాటలో చిరంజీవి ధరించిన రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్, అలాగే ఆ స్పెషల్ మేకప్‌ను ప్రతిబింబించేలా ఈ బొమ్మను తయారు చేశారు. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు ఈ యాక్షన్ ఫిగర్ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో మెగా అభిమానులు రచ్చ చేస్తున్నారు. గతంలోనే గ్లోబల్ స్థాయిలో 'గోలీమార్' సాంగ్ రీమేక్ అవ్వడం, ఇప్పుడు ఏకంగా యాక్షన్ ఫిగర్ రూపంలో రావడం మెగాస్టార్ ఇంటర్నేషనల్ రేంజ్‌కు నిదర్శనమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా యూఎస్ లో ఉన్న తెలుగు వారు ఈ యాక్షన్ ఫిగర్‌ను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కేవలం ఒక బొమ్మ మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక మరపురాని జ్ఞాపకమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర', 'మెగా 158' వంటి సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన పాత సినిమాల ప్రభావం ఇప్పటికీ తగ్గలేదని ఈ ఘటన నిరూపిస్తోంది. ఒక భారతీయ నటుడి సిగ్నేచర్ స్టెప్ గెటప్ ఇలా గ్లోబల్ స్థాయిలో కలెక్టబుల్ వస్తువుగా మారడం నిజంగా గర్వించదగ్గ విషయం.  
   విలక్షణ నటుడిగా, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న హీరో నటుడు జెడి చక్రవర్తి(JD Chakravarthy). ఆయన మాటల్లో ఉండే వాడి, వేడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన నటించిన  'గాయపడ్డ సింహం'(Gaayapadda Simham)చిత్రం  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జెడి చక్రవర్తి ఎప్పటిలాగే తనదైన శైలిలో చమత్కారాన్ని, గంభీరతని జోడించి  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.అవేంటో చూద్దాం జెడి చక్రవర్తి మాట్లాడుతూ  మా సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ట్రంప్ ఏ ఐ వీడియోలు ఉపయోగించాం. దీంతో ఇక్కడి గవర్మెంట్ నుంచి ఒత్తిడి వచ్చింది. మా సినిమా రిలీజ్ చేయకూడదంటూ ఎన్నో ఫోన్స్ వచ్చాయని సరదాగా చెప్పే సరికి అందరూ నవ్వుకున్నారు. తన మాటల ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే 'గాయపడ్డ సింహం" అనే టైటిల్ వినడానికి చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మా మూవీలో వర్క్  చేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. వారి కష్టం తెరపై కనిపిస్తుంది. Also read: Bhoot Bangla: బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా హవా.. వారంలో ఎన్ని కోట్లు అంటే    సింహం గాయపడితే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది ఒక యుద్ధం వంటిది. ఈ 'సింహం' ఆ యుద్ధంలో గెలుస్తుందని  జెడి  ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ మూవీ నుంచి  విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ ఇప్పటికే  పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేశాయి. జెడి చక్రవర్తి వంటి సీనియర్ నటుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంత గొప్పగా మాట్లాడటం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తన గర్జనను ఏ స్థాయిలో వినిపిస్తుందో వేచి చూడాలి. తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా కీలక రోల్స్ .      
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తమిళ, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. ఆయన నటించిన తాజా చిత్రం 'కర' (Kara) రేపు (ఏప్రిల్ 30) థియేటర్లలో అడుగుపెడుతోంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అటు అభిమానులను, ఇటు ట్రేడ్ వర్గాలను కలవరపెడుతున్నాయి. ధనుష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వీక్ గా ఉన్నాయి. (Kara Movie) 'కర' సినిమాకి సంబంధించి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఇప్పటివరకు కేవలం ₹2.5 కోట్ల గ్రాస్ మార్కును మాత్రమే ఈ సినిమా అందుకోగలిగింది. ధనుష్ రేంజ్ హీరో సినిమాకు విడుదల ముందు రోజు భారీ స్థాయిలో బుకింగ్స్ జరగాల్సి ఉండగా, ఈ నెమ్మదైన ట్రెండ్ చూస్తుంటే ఓపెనింగ్ డే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో సరైన వేగం లేకపోవడం లేదా ఆడియన్స్‌లో సినిమా పట్ల ఆసక్తి కలగకపోవడం దీనికి కారణం కావొచ్చు. సాధారణంగా ధనుష్ సినిమాలు కంటెంట్ బలంగా ఉంటే పుంజుకుంటాయి. 'కర' సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలంటే మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావాలి. ఒకవేళ విడుదల తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే, ఈవినింగ్ షోల సమయానికి బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది. అలా జరగని పక్షంలో సినిమా కమర్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ప్రస్తుతానికి 'కర' బాక్సాఫీస్ జర్నీ కష్టంగానే కనిపిస్తోంది. రూ.2.5 కోట్ల అడ్వాన్స్ అనేది ధనుష్ లాంటి హీరోకు చాలా తక్కువ మొత్తం. మరి రేపు థియేటర్లలో బొమ్మ పడ్డాక పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. కేవలం 'పాజిటివ్ మౌత్ టాక్' మాత్రమే ఈ సినిమాను బాక్సాఫీస్ గండం నుంచి గట్టెక్కించగలదు.   
    హయమ్మ ఎట్టకేలకు అక్షయ్ కుమార్(Akshay kumar)కి భూత్ బంగ్లా(Bhoot Bangla)తో హిట్ వచ్చింది. హిట్ అని చెప్పడం కంటే బాలీవుడ్ లో అక్షయ్ ని నిలబెట్టిందని చెప్పవచ్చు. అంతలా వరుస పరాజయాలతో జైత్రయాత్రని కొనసాగిస్తున్నాడు. దీన్ని బట్టి అక్షయ్ కి భూత్ బంగ్లా ఇచ్చిన కిక్ ని అర్ధం చేసుకోవచ్చు. దర్సకుడు మన సౌత్ డైరెక్టర్  ప్రియదర్శన్(Priyadarshan) . అదేనండి లోక చాప్టర్ యక్షిణి కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి. మరిఈ నెల 17 న విడుదలై ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ సాధించిందో చూద్దాం.  పక్కా హారర్ కామెడీ అయిన 'భూత్ బంగ్లా' వరల్డ్ వైడ్ గా 188 .75 కోట్ల గ్రాస్ ని వసులు చేసింది. ఈ మధ్య కాలంలో ధురంధర్ 2 తర్వాత మంచి వసూళ్లు సాధించిన మూవీ భూత్ బంగ్లానే.  నిజానికి ప్రారంభంలో  మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, కామెడీ ప్రియులను థియేటర్లకు రప్పించడంలో అక్షయ్ సక్సెస్ అయ్యాడు. మరి పన్నెండు రోజులకే 200 కోట్లకి చేరువలో ఉన్నాడంటే లాంగ్ రన్ లో కనివిని ఎరుగని కలెక్షన్స్ సాధించడం పక్కా. Also read: vrutika patel: అబ్బాయిలు జాగ్రత్త..  విష్ణుప్రియని మించి కుర్రాళ్లకి షాకిస్తున్న ముద్దుగుమ్మ  అక్షయ్ కుమార్ సరసన టబు జత కట్టగా  వమికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు ముఖ్యమైన క్యారక్టర్స్ లో చేసారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ తో కలిసి అక్షయ్ కుమార్ నే నిర్మించాడు.  
'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో గురింపు సంపాదించుకున్న రాకింగ్ స్టార్ యశ్ (Yash), ప్రస్తుతం తన తదుపరి సినిమా 'టాక్సిక్' (Toxic) తో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్ర విడుదల తేదీకి సంబంధించి యశ్ కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా వాయిదా పడిందని తెలుపుతూ అభిమానులకు యశ్ షాక్ ఇచ్చారు. గ్లోబల్ రిలీజ్ కోసం కొత్త ప్లాన్! నిజానికి 'టాక్సిక్' సినిమాను 2026, జూన్ 4న విడుదల చేస్తామని గతంలో చిత్ర బృందం ప్రకటించింది. కానీ తాజాగా యశ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన లెటర్ ప్రకారం, సినిమా విడుదల వాయిదా పడింది. దీనికి గల కారణాన్ని వివరిస్తూ, "సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే, సినిమాకాన్‌లో (CinemaCon) మా సినిమాకి వచ్చిన గ్లోబల్ రెస్పాన్స్ చూశాక, ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రభావవంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్, అంతర్జాతీయ భాగస్వామ్యాలను సమన్వయం చేసుకోవడానికి మాకు మరికొంత సమయం అవసరం" అని యశ్ పేర్కొన్నారు. ఇండియన్ సినిమా సత్తా చాటడమే లక్ష్యం ఈ లెటర్ లో యశ్ తన బాధ్యతను కూడా గుర్తు చేసుకున్నారు. "భారతీయ సినిమా గ్లోబల్ స్టేజిపై తన గొంతును వినిపిస్తున్న తరుణంలో, దానిని మరో స్థాయికి తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. ఒక నటుడిగా, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడేలా 'టాక్సిక్' ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే రిలీజ్ కు మరికొంత సమయం తీసుకుంటున్నాం" అని తెలిపారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు యశ్ వెల్లడించారు. సినిమా కోసం వేచి చూస్తున్న అభిమానులకు ఓపిక పట్టాలని యశ్ విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రయాణాలకు సమయం పడుతుందని, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని, హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ దీని కోసం పనిచేస్తున్నారని సమాచారం. ఏదేమైనా, యశ్ నిర్ణయం భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో కూడుకున్నది కాబట్టి, అభిమానులు ఈ వాయిదా విషయంలో సానుకూలంగానే స్పందించే అవకాశముంది.  
అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'లెనిన్' (Lenin). మే 1న విడుదల కావాల్సిన ఈ మూవీ, జూన్ 26కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 25న 'పెద్ది' విడుదలవుతుండటంతో.. 'లెనిన్' మళ్ళీ వాయిదా పడటం ఖాయమని ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో నాగార్జున (Nagarjuna) కీలక ప్రకటన చేశారు. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమాపై తాజా అప్‌డేట్‌తో కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో సందడి చేశారు. ఈ సినిమా ఫస్ట్ కట్ చూసిన నాగ్.. తన ఆనందాన్ని, నమ్మకాన్ని అభిమానులతో పంచుకున్నారు. అలాగే పోస్ట్ పోన్ రూమర్స్ కి చెక్ పెట్టారు. నాగార్జున ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "నిన్న రాత్రి మా సినిమా 'లెనిన్' ఫస్ట్ కట్ చూశాను. పూర్తి ఆత్మవిశ్వాసంతో, గర్వంతో చెబుతున్నాను.. జూన్ 26, 2026న మీరు ఒక సరికొత్త అఖిల్‌ను వెండితెరపై చూడబోతున్నారు. ఈ తేదీని గుర్తుపెట్టుకోండి. థియేటర్లలో కలుద్దాం" అంటూ పోస్ట్ చేశారు. అఖిల్ బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో విభిన్నంగా ఉండబోతున్నాయని నాగ్ మాటలను బట్టి అర్థమవుతోంది.  'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, థమన్ అందించిన పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. అఖిల్ తన గత చిత్రం 'ఏజెంట్' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. అందుకే అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 26న విడుదల కానుందని క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ 'పెద్ది' వంటి భారీ మూవీ పోటీలో ఉన్నప్పటికీ, అవుట్‌పుట్‌పై ఉన్న నమ్మకంతో 'లెనిన్' టీమ్ బాక్సాఫీస్ వార్ కి సై అంటుంది. మరి ఈ 'లెనిన్' మూవీ అఖిల్ కి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.  
  ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా విష్ణుప్రియ, అనన్య నాగళ్ళ నెలకి లక్షలకి లక్షలు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. మరి  తాడిని తన్నే వాళ్ళుంటే తలని తన్నే వాళ్ళు ఉంటారనే కోణంలో ఆ ఇద్దర్ని మించి తన అందచందాలతో ఒక ముద్దుగుమ్మ లక్షల రూపాయలని సంపాదిస్తుంది. మరి ఆ ముద్దుగుమ్మ, సుగుణుల రాశి వివరాలు చూద్దాం. వృత్తిక పటేల్(vrutika patel)..అందానికి వెన్నపూస కలిపినంత సుతిమెత్తని సౌందర్య వతి. ముట్టుకుంటే కందిపోయేంత అందం. తను మనతో మాట్లాడుతుంటే చూపు కూడా పక్కకి తిప్పుకోలేం. రంభ, ఊర్వశి మేనక కూడా చాలరు. ఈ విధంగా  ఇన్‌స్టాగ్రామ్‌లో రన్ అవుతున్న వృత్తికప్రొఫైల్‌ను చూస్తే ఎవరైనా సరే ఆమెని  ఒక మోడల్ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ అని నమ్ముతారు. ట్రెండీ డ్రెస్సులు, అందమైన లోకేషన్లు, రీల్స్‌తో ఆమె ఖాతా కళకళలాడుతుంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. వృత్తిక పటేల్ అనే అమ్మాయి నిజంగా లేదు. ఇది పూర్తిగా AI టెక్నాలజీతో సృష్టించిన ఒక బొమ్మ.కొంత మంది అపరమేధావులు వృతిక పటేల్ పేరుతో నిర్వహిస్తూ, టెక్నాలజీ సాయంతో ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. వృత్తిక పటేల్ ఖాతాకు ప్రస్తుతం లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే కేవలం ఫాలోవర్లే కాదు, కంటెంట్ కోసం డబ్బులు చెల్లించే 'సబ్‌స్క్రిప్షన్' మోడల్‌ ని  కూడా ఈ ఖాతా రన్ చేస్తోంది. దాదాపు 300 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉండగా ఒక్కో యూజర్ నెలకు దాదాపు 390 రూపాయల నుండి 399 వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే, కేవలం సబ్‌స్క్రిప్షన్ల ద్వారానే నెలకు దాదాపు 1,19,700 ఆదాయం వస్తోంది. ఇది కాకుండా బ్రాండ్ ప్రమోషన్లు, ఇతర యాడ్స్ ద్వారా వచ్చే సంపాదన అదనం. విష్ణుప్రియ వంటి వారు నిజమైన వ్యక్తులు కాబట్టి వారిపై ట్రోల్స్ లేదా కేసులు వచ్చాయి. కానీ వృత్తిక పటేల్ లాంటి AI ఖాతాలను ఎవరు నడుపుతున్నారో తెలియదు కాబట్టి, సబ్‌స్క్రిప్షన్ల పేరుతో డబ్బులు చెల్లించే అబ్బాయిలు మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.  aslo read: Payal rajput: ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్.. అసలు నిజం ఇదే  వృత్తిక పటేల్ ఉదంతం చూస్తుంటే భవిష్యత్తులో సోషల్ మీడియా రంగం ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం పనిముట్టుగానే కాకుండా, మనుషుల ఆదాయ వనరులను దెబ్బతీసేలా ఎదుగుతోంది. ఫోటోలు చూసి, రీల్స్ చూసి మోసపోకుండా.. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు, ఎవరికి డబ్బులు చెల్లిస్తున్నారు అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీ అద్భుతమే కానీ, అది మన విచక్షణను మించిపోకూడదు. ఏది ఏమైనా  వృత్తిక పటేల్ ఏఐ బొమ్మ అని తెలిసిన ఆమె అభిమానులు దేవదాసులుగా మారిపోయి మాటి మాటికీ ఆమెనే చూస్తూ ఏఐ నే నిజమైన వృత్తికని ఇన్ స్టాగ్రామ్ లోకి పంపిస్తే ఎంత బాగుండనే వేదనలో ఉన్నారు.       
  ఆర్ఎక్స్ 100 , మంగళవారం మూవీతో  తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput).కొంత గ్యాప్ తర్వాత 'ఫస్ట్ టైమ్ 01.01.01(First Ttime)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సదరు ఈవెంట్ లో పాయల్ మాట్లాడుతూ ఫుల్  ఎమోషనల్ అయింది. ఈవెంట్ మధ్యలోనే స్టేజ్ కూడా దిగి వెళ్లిపోయింది. ఆ డిటైల్స్ ఏంటో చూద్దాం.     ఈ వేడుకలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి పాయల్ సమాధానమిస్తు మా నాన్న క్యాన్సర్ బారిన పడటంతో  మా కుటుంబానికి అత్యంత కష్ట కాలంగా మారింది. ఒకవైపు ఆయన అనారోగ్యం, మరోవైపు మానసిక వేదన నన్ను చుట్టుముట్టాయి. నా బెస్ట్ క్రిటిక్ నాన్నే  ఆర్ఎక్స్ 100 చూసి ఎంతో మెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి చనిపోయి ఏడాది కావస్తోంధీ ఆ ఒత్తిడిని భరించలేకే  జైపూర్‌లో 'విపాసన' ట్రీట్‌మెంట్ కోసం వెళ్ళాను. అక్కడి ధ్యానం, చికిత్స నాకు కొంచెం ఊరటనిచ్చాయి" అని మాట్లాడుతుండగానే ఆమె  గొంతు మూగబోయింది. తన తండ్రి పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయానని వెక్కి వెక్కి ఏడ్చింది.    also Read:  ఆల్ ఈజ్ వెల్.. 3 ఇడియట్స్ సీక్వెల్‌ కన్ఫర్మ్ చేసిన అమీర్ ఖాన్ పాయల్ ఉద్వేగానికి లోనవడంతో పక్కనే ఉన్న మూవీ టీమ్, హీరో ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ తన తండ్రి జ్ఞాపకాలు, ఆ బాధాకరమైన రోజులను తలచుకుని ఆమె నియంత్రణ కోల్పోయారు. తన మనసు కలత చెందడంతో ఇక ఏమాత్రం అక్కడ ఉండలేనని చెబుతూ.. కన్నీళ్లు తుడుచుకుంటూనే వేదికపై నుండి మధ్యలోనే వెళ్ళిపోయారు.   
ఈ వీడియో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన సింహ‌బ‌లుడు చిత్రంలోని ప‌వ‌ర్‌ఫుల్ ఇంట‌ర్వెల్ సీన్ ఇది. విలన్ గ్యాంగ్ హీరో తండ్రిని వేధిస్తూ, ఆయుధ పూజలో ఉన్న హీరోను బయటకు రమ్మని సవాలు చేయడంతో ఈ సన్నివేశం మొదలవుతుంది. హీరో జయసింహ తన పూజను పూర్తి చేసుకుని, నరసింహ స్తోత్రం నేపథ్యంగా వినిపిస్తుండగా ఎంతో ఉగ్రంగా ఎంట్రీ ఇచ్చి శత్రువుల ఆట కట్టించే తీరు ఈ వీడియోలో హైలైట్‌గా నిలుస్తుంది. టాలీవుడ్‌లో యాక్షన్ కింగ్ అంటే గుర్తొచ్చే పేరు అర్జున్ సర్జా. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్స్‌ను పండించడంలో కూడా ఆయన స్టైలే వేరు. తాజాగా 'తెలుగువన్' సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సింహ‌బ‌లుడు సినిమాలోని 'ఆయుధ పూజ' ఇంటర్వెల్ సీన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీన్ చూస్తుంటే మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది. ఈ సన్నివేశం విలన్ల అరాచకంతో మొదలవుతుంది. హీరో జయసింహ తండ్రిని బంధించి, ఊరందరి ముందు అవమానిస్తూ హీరోను బయటకు రమ్మని విలన్ గ్యాంగ్ సవాలు చేస్తుంది. "నీ కొడుకు పూజలో ఉన్నాడు, పూజ అయ్యాకే బయటకు వస్తాడు" అని తండ్రి చెబుతున్నా వినకుండా, అతడిని హింసిస్తూ జయసింహను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అయితే, లోపల ఆయుధ పూజలో ఉన్న హీరో, తన తండ్రి పడుతున్న బాధను గమనిస్తాడు. సరిగ్గా అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే "ఉగ్రం వీరం మహావిష్ణుం.." అనే నరసింహ స్తోత్రం సన్నివేశానికి వేరే లెవల్ ఎనర్జీని ఇస్తుంది. పూజ ముగించుకుని రౌద్ర రూపంతో హీరో ఎంట్రీ ఇవ్వడం సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో అర్జున్ తన మార్క్ యాక్షన్ స్కిల్స్‌తో అలరించారు. కత్తులు, గొడ్డళ్లతో శత్రువులను చీల్చి చెండాడుతుంటే చూసే ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కేవలం కండబలమే కాదు, తండ్రిపై ఉన్న ప్రేమను, శత్రువుపై ఉన్న పగను తన కళ్లలోనే చూపించి నటుడిగా అర్జున్ మరోసారి మెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్ సాధిస్తోంది. పాత సినిమాల్లోని ఇటువంటి పవర్‌ఫుల్ సీన్స్‌ను మళ్లీ చూస్తుంటే ఆ కిక్కే వేరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయుధ పూజ నేపథ్యంలో వచ్చే ఈ ఫైట్ సీన్ అర్జున్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇలాంటి ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
దక్షిణాది సినిమాల సత్తా ఇప్పుడు బాలీవుడ్ హద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. మన స్టార్ హీరోలు హిందీ మార్కెట్‌పై కన్నేసి అక్కడ కూడా జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ మైథలాజికల్ జంగిల్ డ్రామాలో విలక్షణ నటుడు ధనుష్ హీరోగా ఎంపికైనట్లు సమాచారం. నిజానికి ఈ కథ ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. భన్సాలీ కాంబినేషన్‌లో చరణ్ ఒక పీరియడ్ అడ్వెంచర్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ కథకు ధనుష్ అయితే పర్ఫెక్ట్ అని భావించిన మేకర్స్, ఆయనను సంప్రదించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు. 'సర్దార్', 'అభిమన్యుడు' వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిత్రన్, ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తొలుత 'రౌడీ రాథోడ్ 2' కోసం చర్చలు జరిగినా, చివరకు ఒక కొత్త తరహా పౌరాణిక జంగిల్ అడ్వెంచర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భన్సాలీ నిర్మాణ విలువలకి తోడు మిత్రన్ మేకింగ్ స్టైల్ తోడైతే ఈ సినిమా మరో విజువల్ వండర్ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ధనుష్‌కు బాలీవుడ్‌లో ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'రాంఝూనా', 'అత్రంగి రే' చిత్రాలతో హిందీ ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ప్రస్తుతం 'తేరే ఇష్క్ మే' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు భన్సాలీ వంటి పెద్ద నిర్మాణ సంస్థలో ఇలాంటి ఒక భారీ మైథలాజికల్ డ్రామాలో నటించే అవకాశం రావడం ఆయన కెరీర్‌కు మరో కలిసొచ్చే అంశం. అడవి నేపథ్యంలో సాగే పౌరాణిక అంశాలతో ఈ సినిమా కథ ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందట. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవ్వడంతో ధనుష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ మిస్ చేసుకున్న ఈ భారీ అవకాశాన్ని ధనుష్ ఏ రేంజ్‌లో ఉపయోగిస్తారో చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అటు చరణ్ కూడా ప్రస్తుతం బుచ్చిబాబు సన మరియు సుకుమార్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు కాక ఈ సినిమాకు నో చెప్పి ఉండవచ్చని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది,  ఇష్టంగా అనిపిస్తుంది,  తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది.  ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి.  పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు.  ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి.  అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే.. బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు,  పెరిగిన వాతావరణం,  గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్  చేసే ఒక ప్రయోగం.  గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే  మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే  ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా  అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా  పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు,  ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు.  అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి.  ఇలాంటి వారు  భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.   ప్రేమలో లేదా రిలేషన్ లో  అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి  అలవాట్లు,  ఆలోచనా విధానం ఇచ్చే  ఫలితం. ప్రతి వ్యక్తి తన  పద్ధతులను గుర్తించి, తమను తాము  సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు,  పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం,  పాత ఆలోచనలు, సిద్దాంతాలలో  చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.                                    *రూపశ్రీ.
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్, మధుమేహం, PCOD వంటి సమస్యలు మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. మందులు వాడుతున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదా? అయితే మీకు 'థెరప్యూటిక్ యోగా' ఒక అద్భుతమైన మార్గం. ఇది కేవలం శరీరాన్ని కదిలించడం మాత్రమే కాదు, మీ మనస్సును మరియు ఆత్మను పునరుజ్జీవింపజేసే ఒక దివ్యౌషధం. మనం థెరప్యూటిక్ యోగాను ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) రోజంతా ఉత్సాహం: మీరు రోజుకు కేవలం గంటన్నర సమయం యోగాకు కేటాయిస్తే, మిగిలిన 22.5 గంటల సమయం ఎంతో శక్తివంతంగా మరియు ఆనందంగా గడుస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి: థైరాయిడ్ సమస్య ఉన్నవారు కేవలం 3 నెలల్లో మార్పును గమనించవచ్చు, అలాగే PCOD సమస్యలు 4 నుండి 5 నెలల్లో నయమయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత: ఈ ప్రపంచంలో మానసిక సమస్యలను సమూలంగా నయం చేసే శక్తి కేవలం యోగాకు మాత్రమే ఉంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, బద్ధకాన్ని వదిలిస్తుంది. అంతర్గత మార్పు: యోగా మిమ్మల్ని లోపలి నుండి మారుస్తుంది. అది ఒక చిన్న పిల్లవాడి నవ్వులో ఉండే స్వచ్ఛతను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఏం చేయకూడదు? (What Not to Do) నియమాలను విస్మరించవద్దు: మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు యోగా చేస్తున్నాం కదా అని ఆహార నియమాలను పూర్తిగా వదిలేయకూడదు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తక్షణ ఫలితాల కోసం ఆరాటపడవద్దు: యోగా అనేది ఏటీఎం మిషన్ నుండి డబ్బులు వచ్చినట్లు తక్షణమే రాదు, కానీ సాధన మొదలుపెట్టిన కొద్దిసేపటికే మీరు ఆ మార్పును అనుభూతి చెందుతారు. ఆనందాన్ని వదులుకోవద్దు: జీవితంలో దేనికైనా రాజీ పడండి కానీ మీ సంతోషం విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడకండి. ప్రారంభించడం ఎలా? (How to Start) శ్వాసపై ధ్యాస: మన శ్వాస మరియు మనస్సు భార్యాభర్తల వంటివి. శ్వాస దీర్ఘంగా, ప్రశాంతంగా ఉంటే మనస్సు కూడా అంతే ప్రశాంతంగా మారుతుంది. సరైన భంగిమలు: 'సుప్త ఆసనం' (Subtasana) వంటి భంగిమలు కేవలం 10 నిమిషాల్లోనే మిమ్మల్ని ఎంతో రిలాక్స్‌గా మరియు శక్తివంతంగా మారుస్తాయి. ఆధారాలతో సాధన (Props): శారీరక ఇబ్బందుల వల్ల ఆసనాలు వేయలేకపోయేవారు రకరకాల ప్రాప్స్ (Props) సహాయంతో సులభంగా యోగా చేయవచ్చు. ఇది క్యాన్సర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: థైరాయిడ్ సమస్య యోగాతో నయమవుతుందా?  జ: అవును, క్రమం తప్పకుండా థెరప్యూటిక్ యోగా చేయడం ద్వారా 3 నెలల్లో థైరాయిడ్ మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. ప్ర: క్యాన్సర్ రోగులకు యోగా ఎలా సహాయపడుతుంది?  జ: యోగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయకపోవచ్చు, కానీ రోగిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరంలో ప్రాణవాయువును (Oxygenation) పెంచి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ప్ర: వ్యాయామం చేయడానికి సమయం లేని వారి పరిస్థితి ఏంటి?  జ: మీ శరీరం కోసం మీరు రోజుకు కనీసం గంటన్నర కేటాయించలేకపోతే, అనారోగ్యం పాలైనప్పుడు అంతకంటే ఎక్కువ సమయాన్ని ఆసుపత్రుల్లో గడపాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. మీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఆత్మవిశ్వాసంతో మెరవాలన్నా యోగా ఒక్కటే మార్గం. మాటల కంటే సాధన ద్వారానే మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలరు. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు యోగా ప్రాక్టికల్ వీడియోల కోసం మా యూట్యూబ్ (YouTube) ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి మరియు ఆరోగ్యవంతులుగా మారండి.
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో తీసుకునే ఆహారాలు కేవలం కడుపు నిండినట్టు లేదా రుచి కోసం తీసుకుంటూ ఉంటారు. కానీ శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగమైన పేగు ఆరోగ్యం బాగుండటం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఉదయాన్నే తీసుకునే ఆహారమే పేగు ఆరోగ్యాన్ని, రోజు మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని ఎంతో సేఫ్ గా ఉంచే కొన్ని బ్రేక్ ఫాస్ట్ లు ఉన్నాయి.  ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలు తీసుకుంటే రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది. అవేంటో తెలుసుకుంటే.. ఓట్స్, చియా సీడ్స్ స్మూతీ.. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది,  మెరుగుపరుస్తుంది. ఓట్స్ ను  చియా విత్తనాలతో కలిపితే, ఫైబర్ కంటెంట్ రెట్టింపు అవుతుంది. చియా విత్తనాలు నీటిని గ్రహిస్తాయి,  జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ రాగి ఇడ్లీ లేదా దోశ.. రాగులు ఫైబర్,  కాల్షియం పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే, రాగులలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. తురిమిన క్యారెట్లు, బీన్స్,  పాలకూరను రాగి పిండిలో కలపాలి. ఆవిరి మీద ఉడికించి ఇడ్లీగా తినవచ్చు.  లేదంటే దీంతో దోశ కూడా ట్రై చేయవచ్చు. . ఇది తేలికగా ఉంటూనే  జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. మొలకెత్తిన ధాన్యాలు.. పెసలు, శనగలు లేదా బొబ్బర్లు వంటివి  మొలకెత్తడం వల్ల వాటి ఫైబర్,  ఎంజైమ్ కంటెంట్ పెరుగుతుంది. మొలకెత్తిన ధాన్యాలు ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి. మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మొలకెత్తిన పెసలను దోసకాయ, టమోటా, నిమ్మరసం,  కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఇది ఫైబర్‌ను అందించడమే కాకుండా ప్రోటీన్ కూడా పుష్కలంగా అందిస్తుంది. మల్టీగ్రెయిన్ వెజిటబుల్ ఉప్మా.. సెమోలినాకు బదులుగా మల్టీగ్రెయిన్ గంజి లేదా ఓట్ ఉప్మా తయారు చేయడం వల్ల ఫైబర్  మరింత మెరుగవుతుంది. బఠానీలు, కాలీఫ్లవర్,  బీన్స్ వంటి కూరగాయలను జోడించడం వల్ల ఫైబర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. తక్కువ నూనె,  ఆకుపచ్చ కూరగాయలను పుష్కలంగా జోడిండం వల్ల దీనిలో హెల్తీ బెనిఫిట్స్ మెరుగవుతాయి. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా భావించే కరివేపాకును జోడిస్తే మరీ మంచిది. జొన్న రోటీ, పెరుగు.. చిరు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిరు ధాన్యాలు,  జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పెరుగు అనేది పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచే ప్రోబయోటిక్. చిరు ధాన్యాల రోటీతో ఒక గిన్నెడు తాజా పెరుగు కలిపి తింటే చాలా మంచిది. ఈ కాంబో ఫైబర్,  ప్రోబయోటిక్స్ రెండూ కలిగి ఉంటుంది.                            *రూపశ్రీ.