LATEST NEWS
శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది.  దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జగన్ గాలి వీచిన సమయంలో కూడా ఆయన సునాయాసంగా విజయం సాధించారు. ఆ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్ సభ స్థానంతో పాటు.. టెక్కలి, ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. ఇదే నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న విశ్వాసాన్ని కింజారపు వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఈ సారి ఎలాగైనా కింజారపును ఓడించాలన్న లక్ష్యంతో జగన్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న కలింగ సమాజిక వర్గానికి చెందిన పెరడ తిలక్ ను శ్రీకాకుళం నుంచి వైపీపీ అభ్యర్థిగా పోటీలో దించారు. ఈ పేరాడ తిలక్ గత ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజారపు అచ్చెన్నాయుడి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ సారి జగన్ ఆయనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే  ఇక్కడ నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా కళింగ సామాజిక వర్గానికే చెందిన పేరాడ పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దీంతో ఆ సమాజికవర్గ ఓట్లు భారీగా చీలిపోచే అవకాశాలున్నాయి. అలాగే వైసీపీ నుంచి  శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించిన సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి   కిల్లి కృపారాణి సీటు దక్కక పోవడంతో  సరిగ్గా ఎన్నికలకు ముందు ఆమె వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కిల్లి కృపారాణి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  దీంతో ఆమె టెక్కలిలో వైసీపీ ఓట్లకు బారీగా గండి కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అలాగే ఇంత కాలం వైసీపీకి మద్దతుగా ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు కూడా వైసీపీకి దూరమైన పరిస్థితి కనిపిస్తోందనీ, దీంతో శ్రీకాకుళం పార్లమెంటు నియోజవర్గంలో వార్ వన్ సైడ్ గా కింజారపు రామ్మోహన్ నాయడికి సానుకూలంగా మారిపోయిందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.   అంతే కాకుండా పలువురు వైసీపీ మద్దతుదారులు కూడా వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  మొత్తం మీద వైసీపీ ఓట్లను కాంగ్రెస్ భారీగా చీల్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  
మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.  ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్నాడు తదితర జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసీ కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసింది.తాజాగా, అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్ మన్లను కూడా వదిలేసిన ఆయన తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ పరిణామంతో పిన్నెల్లి గన్ మన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 
రోమ్ నగరం తగలబడి పోతుంటే అప్పటి రోమన్ కింగ్ నీరో (nero) ఏం చేశాడో ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. రోమ్ తగలబడిపోతే తగలబడిపోనీ నాకేంటి అనుకుంటూ, చక్కగా తన రాజమందిరంలో ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ వింత చర్య గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు. మళ్ళీ ఇన్నాళ్ళకు నీరో రేంజ్‌లో మన సమాజానికి దక్కిన మరో పాలకుడు వై.ఎస్.జగన్! పోలింగ్‌ సందర్భంగా, పోలింగ్ తర్వాత వైసీపీ గూండా మూకలు భారీ స్థాయిలో దాడులు చేసి వందల మందిని గాయపరిచాయి. సాక్షాత్తూ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని హత్య చేయడానికి ప్రయత్నించాయి. తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం సానుభూతిపరుల మీద, తెలుగుదేశానికి ఓటు వేశామని చెప్పినవాళ్ళ మీద దాడులు చేసి రక్తాన్ని పారించారు. ఎన్నికల ఫలితాలు వెలువడేలోపు, ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రాష్ట్రంలో రక్తపాతం ఇంకా జరిగే ప్రమాదం వుందని ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా చెబుతున్నాయి.  రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా జగన్ ఎంతమాత్రం స్పందించలేదు. దారుణాలు ఆపే ప్రయత్నాలు చేయలేదు. తీవ్రంగా గాయపడిన అనేకమందిని పరామర్శించే సంగతి అటుంచి, కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. ఇలాంటి అల్లర్లను ఆపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయలేదు.. ఎంచక్కా తనంతట తాను విహారయాత్రలు చేయడానికి విదేశాలకు చెక్కేస్తున్నారు. ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.
ఎబిటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు  మల్లేపల్లి లక్ష్మయ్య పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు  ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని  మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం (మే 17) భూటాన్ లోని థింపూలో జరిగిన బంగ్లాదేశ్ భూటాన్ లోనిథింపూలో జరిగిన బంగ్లాదేశ్, భూటాన్ , ఇండియా, నేపాల్ , మయన్మార్(బిబిఐఎన్ఎమ్) దేశాల పర్యాటక సమాఖ్య, అసోసియేషన్ ఆఫ్ బుద్దిస్ట్ టూర్ ఆపరేటర్స్ (ఏబీటీవో) సంయుక్తంగా నిర్వహించిన ‘ఆసియా రహదారిపై బౌద్ద పర్యాటకం’ అన్న సదస్సుకు ఆయన ఏబీటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్ష హోదాలో  ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు.  తెలంగాణలోని ప్రముఖ బౌద్ద పర్యాటక స్థలాలతో పాటు  బుద్ద వనాన్ని  ఆసియాదేశాలకు పరిచయం  చేసి, అధిక సంఖ్యలో బౌద్ద పర్యాటకులను తెలంగాణకు రప్పించటానికి ఏబీటీవో ఇప్పటికే ప్రణాళికలను సిద్దం చేసిందని సంబంధిత దేశ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించిందని అన్నారు.  ఏబీటీవో ప్రదానకార్యదర్శి డాక్టర్ కాలేష్ కుమార్ సదస్సు ఉద్దేశాలను  వివరిస్తూ  ఆసియా హైవే 2025 చివరకు అందుబాటులోకి వస్తుందన్నారు.  స్థానిక ఏబీటీవో అధికార ప్రతినిధులు పరశురాం, మణి, ట్రావెల్ ఏజెంట్లు , టూర్ ఆపరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో మల్లే పల్లి లక్మయ్య, త్వరలో పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నుంచి  భూటాన్ వరకు అంతర్జాతీయ హపీనెస్ యాత్ర( ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ మార్చ్ )  నిర్వహించటానికి భూటాన్ బౌద్ద సంస్థల ప్రతినిధులతో సన్నాహక చర్యలను ప్రారంభించినట్లు చెప్పారు. 
నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది.  హైదరాబాద్‌లో సాయంత్రం ఆరు గంటల తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వారు వర్షం, ట్రాఫిక్ తీవ్రతను చూసుకుని ప్లాన్ చేసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు. . గత కొన్ని గంటలుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు గడిచిన గంట సేపట్లో 70కి పైగా ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు
ALSO ON TELUGUONE N E W S
ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం ఖచ్చితంగా వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఆ  టైం వచ్చిన వాళ్లకి  టైం ఉండదు. పట్టు మని పది నిముషాలు కూడా ఉపిరిపీల్చుకోలేనంత బిజీగా ఉంటారు.ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ రష్మిక పరిస్థితి ఇదే. షూటింగ్ నిమిత్తం ముంబై టూ హైదరాబాద్ తిరుగుతు చాలా బిజీగా ఉంది. ఇంత బిజీలో కూడా మూవీకి సంబంధం లేదని వీడియో ఒకటి చేసింది. ప్రధానమంత్రి మోదీ నుంచి ప్రశంసలు అందుకుంది   ముంబై లోని సముద్ర తీరం మీద మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం అటల్ సేతు పేరుతో ఒక భారీ వంతెన ని నిర్మించింది. ఇది  దేశంలోనే అతి పెద్ద మూడవ బ్రిడ్జ్ కూడా. రెండు గంటల ప్రయాణాన్ని కేవలం  ఇరవై నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. రీసెంట్ గా  అటల్ సేతు మీద ప్రయాణం చేస్తు రష్మిక ఒక వీడియో చేసింది. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు అందరి హృదయాలు కలుపుకుంటు వెళ్లాలంటు ట్విట్టర్ లో అప్ లోడ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియోకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నుంచి రిప్లై వచ్చింది. ఖచ్చితంగా  మనుషుల్ని కలుపుకుంటూ వెళుతు వారి జీవితాల్ని మెరుగు పరచడం కంటే ఏది సంతృప్తి ఇవ్వదు  అంటూ తెలిపారు.  ఇప్పుడు  ఈ పోస్ట్  వైరల్ అవుతుంది.  12 గంటల్లోపే 90 వేలకి పైగా లైక్స్ ని కూడా సాధించింది.  ఇక రష్మిక ఇటీవల యానిమల్ తో భారీ విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. పుష్ప 2 , గర్ల్ ఫ్రెండ్,కుబేర లు షూటింగ్ దశలో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ నూతన చిత్రం సికిందర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ (Prabhas) పెళ్లి గురించి చర్చ ఓ రేంజ్ లో జరుగుతోంది. దానికి కారణం తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ ఓ స్టోరీ పెట్టాడు. "డార్లింగ్స్.. మొత్తానికి ఒక స్పెషల్ పర్సన్ జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి" అంటూ రాసుకొచ్చాడు. దీంతో ప్రభాస్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని, తన లైఫ్ పార్టనర్ గురించి ఈ స్టోరీ పెట్టాడని అందరూ భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) కూడా డార్లింగ్ అంటూ ఓ పోస్ట్ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టడానికి కొద్ది గంటల ముందు.. సోషల్ మీడియాలో ఒక రీల్ షేర్ చేసిన పాయల్.. "నేను ఖచ్చితంగా ఒకరి డార్లింగ్ ని.. ఎనీ గెస్?" అంటూ రాసుకొచ్చింది. మొదట ఆమె తన బాయ్ ఫ్రెండ్ గురించో లేక ఏదైనా మూవీ ప్రమోషన్ కోసమో పోస్ట్ చేసి ఉంటుందని భావించారంతా. కానీ ఎప్పుడైతే ప్రభాస్ "డార్లింగ్స్.. స్పెషల్ పర్సన్ రాబోతున్నారు" అంటూ స్టోరీ పెట్టాడో.. ఒక్కసారిగా పాయల్ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. "ప్రభాస్, పాయల్.. సంథింగ్ సంథింగ్..." అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు యాదృచ్ఛికంగా పోస్ట్ చేశారా? లేక ఏమైనా హింట్ ఇస్తున్నారా? లేక ఏదైనా కొత్త మూవీ ప్రమోషనా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు చేసిన డార్లింగ్ పోస్ట్ లు మాత్రం.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
డైలీ వినిపించే సినిమా వార్తల్లో చిరంజీవి (chiranjeevi) సినిమాకి సంబంధించిన న్యూస్ ఉంటే ఆ కిక్కే వేరు. నాలుగు దశాబ్దాల  నుంచి ఫ్యాన్స్  ఆ కిక్ ని అనుభవిస్తూనే  ఉన్నారు. కాకపోతే కొన్ని రోజుల నుంచి అలాంటి వాతావరణం లేకపోవంతో కొంచం డల్ అయ్యారు. లేటెస్ట్ గా ఒక వార్త వచ్చి  వాళ్ళల్లో ఆనందాన్ని తెచ్చింది  విశ్వంభర(vishwambhara)మెగాస్టార్ అప్ కమింగ్ మూవీ. కళ్యాణ్ రామ్  బింబిసార (bimbisaara)ని  తెరకెక్కించిన వశిష్ఠ దర్శకుడు. త్రిష ఒక హీరోయిన్ గా చేస్తుంది. కొన్ని రోజుల క్రితం త్రిష కి సంబంధించిన సన్నివేశాలని కూడా  తెరకెక్కించారు. చిరు కూడా అందులో పాల్గొన్నాడు. ఇక మూవీలో  చిరంజీవి అక్కయ్య క్యారక్టర్ ఒకటి ఉంది. కథ కి ఆ క్యారక్టర్ చాలా ముఖ్యమైనది కూడా  ఒకప్పటి టాప్ హీరోయిన్  కుష్బూ ఆ పాత్రలో  కనపడబోతుంది. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది.  ఈ వార్తతో చిరు అభిమానులు,  ప్రేక్షకులు ఒక్కసారిగా పదిహేడు ఏళ్ళు వెనక్కి వెళ్లారు చిరు అండ్ కుష్బూ  (kushboo)లో కలిసి స్టాలిన్ లో నటించారు.పైగా అక్కాతమ్ముడి గానే అందులో నటించారు.ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ కూడా  సూపర్ గా ఉంటుంది. నిజమైన అక్కా తమ్ముడు ని చూస్తున్నామనే స్థాయిలో నటించారు. దాంతో విశ్వంభర మీద అంచనాలు మరింత పెరిగాయి. కొన్ని రోజుల క్రితం సీనియర్ నటి విజయశాంతి ని విశ్వంభర కోసం అడిగారు. కానీ ఆమె నో చెప్పింది. మరి  ఆ క్యారక్టర్ లోనే కుష్బూ  చేస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.కొంత మంది మాత్రం విజయశాంతి ని  అక్క క్యారక్టర్ కి అడిగి ఉండరని అంటున్నారు. ఎందుకంటే చిరు, విజయశాంతి లు జంటగా  సిల్వర్ స్క్రీన్ మీద ఎన్నో రికార్డు లు సృష్టించారు. పైగా ఆ ఇద్దరి ఫెయిర్ ప్రేక్షకుల దృష్టిలో చాలా బలంగా నాటుకు పోయిందని అంటున్నారు. 2025  జనవరి 10 న విశ్వంభర విడుదల అవుతుంది. యువి క్రియేషన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.  అయిదుగురు తోబుట్టువులకు అన్నయ్యగా భీమవరం దొరబాబు పేరుతో చిరంజీవి కనిపిస్తున్నారనే  టాక్ అయితే సినీ సర్కిల్స్ లో వినబడుతుంది      
ఒక స్థలం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ని ఓ మహిళ మోసం చేసిందంటూ ఉదయం నుంచి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ టీం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆ స్థలంతో ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.  2003లో సుంకు గీత అనే మహిళ నుంచి స్థలం కొనుగోలు చేశాడు ఎన్టీఆర్. అయితే ఆ స్థలాన్ని 1996లోనే బ్యాంకులకు తనఖా పెట్టి రుణం తీసుకున్న గీత.. ఆ విషయాన్ని దాచి, ఎన్టీఆర్ కి స్థలం అమ్మారు. అంతేకాదు, ఆమె రుణాలు ఎగ్గొట్టడంతో బ్యాంక్ లు 'డెట్ రికవరీ ట్రిబ్యునల్'ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన ట్రిబ్యునల్.. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కు ఉంటుందని తీర్పు ఇచ్చింది. దీంతో తనను మోసం చేశారంటూ గీతపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, ట్రిబ్యునల్ తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు, ఈ వివాదంలో ఉన్న స్థలం.. ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబం నివాసముంటున్న ఇంటి స్థలంగా ప్రచారం జరిగింది. ఒకవేళ హైకోర్టులో చుక్కెదురైతే.. ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కోల్పోయే ప్రమాదం ఉందని న్యూస్ వినిపించింది. ఈ వార్తల నేపథ్యంలో, ఎన్టీఆర్ టీం కీలక ప్రకటన చేసింది. ఆ ప్రాపర్టీని 2013 లోనే ఎన్టీఆర్ అమ్మేశారని, ప్రస్తుతం అది ఆయన పేరు మీద లేదని క్లారిటీ ఇచ్చింది. అంటే.. ఆ స్థలం, ఎన్టీఆర్ నివాసముంటున్న ఇంటి స్థలం ఒకటి కాదన్నమాట. ఎన్టీఆర్ టీం చెప్పినదానిని బట్టి చూస్తే.. ఆయన ఎవరికైతే స్థలం అమ్మారో వారికి బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చి ఉంటాయి. బ్యాంక్ నోటీసులు, ట్రిబ్యునల్ తీర్పుతో ఖంగుతిన్న వారు.. ఎన్టీఆర్ ని సంప్రదించి ఉంటారు. ఎన్టీఆర్ ద్వారా ఆ ప్రాపర్టీ మాజీ ఓనర్ గీత పేరు వెలుగులోకి వచ్చి.. ఆమెపై కేసు నమోదై ఉంటుంది.
మే 20 డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటి. ఈ మాట ఎవరినైనా అడిగితే కొంచం ఆలోచిస్తారేమో గాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అసలు ఆలోచించరు. ఎందుకంటే ఆ రోజు వాళ్ల సెమి గాడ్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.  రెండున్నర దశాబ్దాల నుంచి తన అద్భుతమైన నటనతో, డాన్స్ తో అభిమానుల గుండెల్లో గాడ్ గా కొలువుతీరాడు. ఈ పుట్టిన రోజు తన అభిమానుల్లో మరుపురాని గుర్తుగా ఉండబోతుంది ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రెండు చిత్రాల షూటింగ్  శరవేగంగా జరుగుతుంది. ఈ రెండిటి తర్వాత ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతున్నాడు. ఆ కాంబో మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ మూవీకి  డ్రాగన్ అనే పవర్ ఫుల్ టైటిల్ ని  ఫిక్స్ చేశారనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20 న టైటిల్ ని  అధికారకంగా ప్రకటించబోతున్నారని కూడా  అంటున్నారు. ఇప్పుడు  డ్రాగన్  వార్త సోషల్ మీడియాలో వస్తుండటంతో ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా టైటిల్ ఉందని  అభిమానుల అంటున్నారు. సోషల్ మీడియాలో  డ్రాగన్ ఇండియన్ రికార్డు లు బద్దలు  కొట్టడం ఖాయమంటూ పోస్ట్ లు పెడుతున్నారు  పైగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా ఏంటంటే  పుట్టినరోజుకి వన్ డే బి ఫోరే  దేవర నుంచి  ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ ప్రొడ్యూసర్ నాగ వంశీ  మాట్లాడుతు దేవర సాంగ్ రిలీజ్ అయ్యాక రజనీకాంత్ రీసెంట్ బ్లాక్ బస్టర్   జైలర్‌లోని  టైగర్ కా హుకుం పాటని అందరు మర్చిపోతారంటు చెప్పాడు.దీంతో ఫ్యాన్స్ రెండు రోజుల పాటు ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్ని జరిపించాలనే మూడ్ తో ఉన్నారు  
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'SSMB 29'. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా ఇది. పైగా 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లకుండానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా చాలని ఎదురుచూస్తున్న వారు ఎందరో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ గురించి కొన్ని గాసిప్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ కీలక ప్రకటన చేశారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న 'SSMB 29' చిత్రానికి కాస్టింగ్ డైరెక్టర్ గా విరేన్ స్వామి వర్క్ చేస్తున్నట్లు ఇటీవల నేషనల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. 'SSMB 29'లో మహేష్ బాబు పాత్రకి సమానంగా ఓ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర ఉంటుందని, ఆ పాత్రతో పాటు కొన్ని ఇతర కీలక పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసే బాధ్యతను విరేన్ స్వామికి అప్పగించినట్లు కొందరు రాసుకొచ్చారు. అయితే ఈ వార్తలకు మేకర్స్ చెక్ పెట్టారు. 'SSMB 29' సినిమాకి విరేన్ స్వామి పని చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తమ నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే పట్టించుకోవాలని మేకర్స్ పేర్కొన్నారు.
  ముంబై లో అంతే.. ముంబై లో అంతే..  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun)తాతయ్య లెజండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ ని అటు ఇటుగా మార్చి సినిమా ఫీల్డ్ లో అంతే..సినిమా ఫీల్డ్ లో అంతే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ లాంటి బడా స్టార్ సినిమాలో నుంచి ఒక బడా టెక్నీషియన్ తప్పుకున్నాడు.దీంతో ఈ న్యూస్ ఎవరి సపోర్ట్  లేకుండా స్వయంకృషి తో హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ నయా మూవీ పుష్ప 2(pushpa 2) ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షక లోకం మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంది. సుకుమార్ డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. మరి ఇలాంటి సినిమాకి మెయిన్ టెక్నీషియన్ గా పని చేయడం అంటే గర్వంగానే భావించాలి. కానీ ఎడిటర్ గా పని చేస్తున్న ఆంటోనీ రూబెన్ మూవీ నుంచి తప్పుకున్నాడు. వేరే చిత్రాల కమిట్ మెంట్స్ ఉండటంతోనే తప్పుకుంటున్నానని  ఈ విషయంలో ఎలాంటి రూమర్స్ కి తావు లేదని ఆయన తెలిపాడు.  ఆంటోనీ రూబెన్ (Antony Ruben)సాదా సీదా వ్యక్తి కాదు. ఇండియా లో ఉన్న టాప్ మోస్ట్ ఎడిటర్స్ లో  ఒకడు. ఆయన ఎడిట్ చేసాడంటే ఇక ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అనే నానుడి సినీ వర్గాల్లో ఉంది. 2011 లో  వచ్చిన  కందెన్ అనే తమిళ సినిమా ఆయన ఫస్ట్ మూవీ. 2013 లో వచ్చిన ఆర్య, నయనతార ల రాజా రాణి తో దేశ వ్యాప్తంగా ఆయన  పేరు మారుమోగిపోయింది. అజిత్  వేదాళం, వివేగం, విశ్వాసం, విజయ్  తేరి, మెర్సిల్, బిగిల్,  షారుక్  జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన లిస్ట్ లో ఉన్నాయి. పుష్ప పార్ట్ వన్ కి కూడా ఎడిటర్ గా వ్యవహరించాడు. ఇక ఆయన స్థానంలో  నవీన్ నూలి  ఎడిటర్ గా ఎంట్రీ ఇచ్చాడు  లేటెస్ట్ గా  గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ వంటి హిట్ మూవీస్ ఆయన నుండి  వచ్చాయి. బన్నీ అల వైకుంఠ పురం కూడా ఆయన ఖాతాలో ఉంది   
తమ అభిమాన హీరోని కలవడం కోసం అభిమానులు పాదయాత్ర చేయడం చూస్తుంటాం. అలా పాదయాత్ర చేసి హీరోని కలిసిన వారుంటారు. పాదయాత్ర చేసి కూడా హీరోని కలవలేకపోయిన వారుంటారు. అయితే తాజాగా ఓ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్.. పాదయాత్ర చేసి, తన ఫేవరెట్ హీరోని కలుసుకున్నాడు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఎన్టీఆర్ ను కలవడం కోసం ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ కు చెప్పుల్లేకుండా పాదయాత్ర చేశాడు. 300 కిలోమీటర్ల ఈ పాదయాత్ర తొమ్మిది రోజుల పాటు సాగింది. అసలే వేసవి కాలం కావడం, పైగా చెప్పుల్లేకుండా పాదయాత్ర చేయడంతో.. నాగేంద్రబాబు కాళ్లకు బొబ్బలు కూడా వచ్చాయి. అయినప్పటికీ అతను వెనకడుగు వేయలేదు. ఎండని లెక్క చేయకుండా పాదయాత్ర చేసి, ఎన్టీఆర్ నివాసానికి చేరుకున్నాడు.  అయితే తారక్ ప్రస్తుతం 'దేవర' (Devara), 'వార్ 2' (War 2) సినిమాలతో బిజీగా ఉన్నాడు. సరిగ్గా 'వార్ 2' షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లిన సమయంలోనే.. నాగేంద్రబాబు పాదయాత్ర చేస్తూ ఆయన నివాసానికి చేరుకున్నాడు. హీరో ఇంట్లో లేడని తెలిసినా ఆ అభిమాని ఏమాత్రం నిరాశ చెందలేదు. హీరో రాక కోసం రెండు వారాల పాటు ఆయన ఇంటి ముందే ఎదురుచూశాడు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. ముంబై నుంచి రాగానే తన అభిమాని నాగేంద్రబాబుని కలిసి ఆప్యాయంగా పలకరించాడు. అతనితో కలిసి ఫొటోలు దిగాడు. మొత్తానికి, తన అభిమాన హీరోని కలిసి ఫొటో దిగాలన్న కోరిక నెరవేరడంతో నాగేంద్రబాబు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అలీతో సరదాగా ఈవారం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లయ వచ్చింది. ఆలీ, లయ కలిసి స్వయంవరం మూవీలోని సాంగ్ కి స్టెప్స్ కూడా వేశారు. ఈ సాంగ్ తర్వాత ‘‘ఇప్పుడు వచ్చిన ఈ పాటలు మీ అమ్మవి. లయగారు వచ్చారా ?’’ అని లయనే అడుగుతూ కాసేపు ఫన్ చేసాడు ఆలీ. దానికి నవ్వుతూ ‘‘నేనే లయ’’ అని సమాధానమిచ్చింది. అది విన్న ఆలీ షాకయ్యాడు. ‘‘నేను శ్లోక అనుకున్నారా’’ అని నవ్వేసింది లయ. ‘స్వయంవరం’ మూవీ వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లయకు కంగ్రాట్స్ చెప్పాడు ఆలీ. లయ కూడా తిరిగి ఆలీకి కంగ్రాట్స్ చెప్పారు. లయ పర్సనల్ లైఫ్ గురించి అడిగారు. ‘‘లయ చాలా ఇబ్బందుల్లో ఉంది. అమెరికాలో రోడ్లపై ఉంటోంది అనే కామెంట్స్ విన్నప్పుడు ఎలా అనిపించింది’’ అని ఆడిగాడు ఆలీ.  ‘‘ఎందుకు ఇదంతా. ఇలాంటివి వినేటప్పుడు చాలా బాధేస్తుంది. అడుక్కు తింటున్నాను అనే కాదు ఇంకా చాలా చేస్తున్నానని కూడా అన్నారు. అవన్నీ తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంది’’ అని పాపం ఫీలయ్యింది లయ. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ "2005లో మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఆంటీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అని నన్ను అడిగారు. ఇప్పుడు కాదు అని చెప్పడంతో మా ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదనుకున్నారు’’ అంటూ తమ పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇండియాకు రావడానికి కారణమేంటి అని అడిగాడు ఆలీ ‘‘నేను నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు మూవీతో  రీఎంట్రీ ఇస్తున్నాను’’ అని అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత తను, ఆలీ కలిసి నటించిన సినిమాలను గుర్తుచేసుకున్నారు. ఇలా లయ ఎన్నో విషయాలు చెప్పారు.  
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలని 'బాహుబలి-2' కోసం అప్పుడు ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూశారో.. ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా? అని అందరూ అంతలా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఆరోజు రాబోతుంది. స్వయంగా ప్రభాసే ఈ విషయాన్ని రివీల్ చేశాడు. రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పటికే నలభైల్లోకి అడుగుపెట్టాడు. బాహుబలి రాకముందు నుంచే పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి (Prabhas Marriage) గురించి చర్చ నడుస్తోంది. ఒకసారి ప్రముఖ హీరోయిన్ తో పెళ్లి అని, మరోసారి బంధువుల అమ్మాయితో అంటూ.. ఇలా ఎన్నోసార్లు ప్రభాస్ పెళ్లి వార్తలు వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు. ఇటీవల కనీసం అలాంటి వార్తలు కూడా రావడం లేదు. దీంతో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లా ప్రభాస్ కూడా సింగిల్ గా మిగిలిపోతాడా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో ఊహించని ప్రకటనతో సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ ఓ స్టోరీ పెట్టాడు. అందులో "డార్లింగ్స్.. మొత్తానికి ఒక స్పెషల్ పర్సన్ జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ రాసుకొచ్చాడు. దీంతో ఆ స్పెషల్ పర్సనా ఎవరా? అని అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కొందరు అభిమానులైతే అనుష్క శెట్టి (Anushka Shetty) అయ్యుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ప్రభాస్ జీవితంలోకి రాబోతున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? అనేది త్వరలోనే రివీల్ అయ్యే అవకాశముంది.
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  
నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని
ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.  వీటిని తెలుగు రాష్ట్రాలలో తాటిముంజలు అంటారు.  లేతగా ఉన్న తాటి ముంజలు తియ్యగా, మృదువుగా, లోపల కాసిన్ని తియ్యని నీళ్లలో తినడానికి ఎంతో బాగుంటాయి. వేసవి కాలంలో మాత్రమే అందుబాటులోకి రావడంతో అందరికీ వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. తాటిముంజలను ఈ వేసవి కాలంలో తప్పకుండా ఎందుకు తినాలో చెప్పే కారణాలు బోలెడు ఉన్నాయి. ఈ కారణాలు తెలిస్తే అస్సలు వదలకుండా తాటిముంజలను ఈ సీజన్ లో రుచి చూస్తారు. తాటిముంజలు తింటే శరీరానికి కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. హైడ్రేట్.. మండిపోతున్న ఎండల కారణంగా వేడి కూడా అధికంగా ఉంటుంది.  ఈ వేడి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది.  దీని కారణంగా  శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీన్నే శరీరం డీహైడ్రేట్ అవ్వడం అంటారు. తాటిముంజలు  తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు. తాటిముంజలు తింటే శరీరం కోల్పోయిన తేమ శాతం తిరిగి భర్తీ అవుతుంది. ఉదర సమస్యలు.. ఈ మండే వేసవి కాలంలో చాలామంది ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కుంటారు. చాలామందికి కడుపులో వేడి పుట్టి అది కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది.   అయితే తాటిముంజలు తింటే పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల  జీర్ణవ్యవస్థ బలపడుతుంది.  మలబద్ధకం, అజీర్ణం,  గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.   రోగనిరోధక శక్తి.. చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే వ్యాధులు, జబ్బులు తొందరగా వస్తాయి. అంతేకాదు ఇలా వచ్చిన జబ్బులు అంత తొందరగా తగ్గవు కూడా. కానీ తాటి ముంజలు తింటే  రోగనిరోధక శక్తి  బలపడుతుంది. తాటిముంజలలో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీవక్రియను..   జీవక్రియ బలహీనంగా ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాక శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణంగా  బరువు పెరుగుతారు.   ఊబకాయం బాధితులుగా మారతారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే తాటిముంజలను  తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది.  ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. తద్వారా అధికంగా తినకుండా కూడా నివారిస్తుంది. డయాబెటిస్‌.. తాటిముంజలు  మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను  నియంత్రిస్తుంది.                                                                   *రూపశ్రీ.  
ఉల్లిపాయ బోలెడు వంటకాల్లో కనిపించే ఒక ముఖ్యమైన పదార్ధం. ఉల్లిపాయ పసుపు, తెలుపు, ఎరుపు వంటి రంగులలో లభిస్తుంది. ఉల్లిపాయ రుచి మాత్రమే కాకుండా, ఇందులో ఉన్న పోషకాల కంటెంట్ కారణంగా ఆహారంలో ప్రముఖంగా నిలిచింది. పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలవాటు లేనివారు కూడా తినడం మొదలు పెడతారు. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు విటమిన్ సి కి అద్భుతమైన మూలం, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి బాక్టీరియా, వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షించే తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడంలో పచ్చి ఉల్లిపాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయల తీసుకోవడం వల్ల  రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.. పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది సరైన జీర్ణక్రియకు మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి అవసరమైనది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది. మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, హేమోరాయిడ్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. వాపును తగ్గిస్తుంది.. క్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ యొక్క బాగా కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు కాల్షియం శోషణను ప్రోత్సహించడంలో, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి, ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఏకాగ్రత స్థాయిలకు దారితీస్తుంది.  క్యాన్సర్ నివారిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండే సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ మరియు అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలు అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ముడతలు, వయస్సు మచ్చలు, పిగ్మెంటేషన్ స్థాయిలు తగ్గుతాయి.  ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి ఇది దోహదపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. పచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది పచ్చి ఉల్లిపాయలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. అతిగా తినే పరిస్థితులను ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ తగ్గిస్తుంది. కేలరీలను భర్తీ చేస్తుంది.  చివరికి బరువు తగ్గడానికి. సహాయపడుతుంది.                                   ◆నిశ్శబ్ద.
భోజన ప్రియులకి నెయ్యి లేదా అంటూ ఉంటారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు.నెయ్యి తో పోపు పెట్టిన ఆహారం,నెయ్యితో కాల్చిన చపాతి నెయ్యితో కాల్చిన పెసరట్టు తప్ప మరేది వద్దు అంటూ ఉంటారు.ఇక కొంతమంది అయితే ముఖ్యంగా స్వీట్స్ లో నెయ్యి కారుతూ ఉండాలి. ముఖ్యంగా బొబ్బట్లు, బూరెలు  కూడా నెయ్యి తో చేసినవే బాగుంటాయి అంటారు భోజన ప్రియులు నెయ్యితో చేసిన పదార్ధాలు ఆస్వాదిస్తూ తిన్నప్పుడే వాటి మజా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో కుటుంబంలో పెళ్ళి ళ్ళు శుభకార్యాలలో సంబంధాలు కోసం వెళ్ళినప్పుడు మా నానమ్మ నెయ్యి వెన్నతో పెట్టింది.మీరేం పెడతారు చెప్పండి అంటు అడగడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మీరు ఇలాగే గనక నెయ్యి తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇకమీరు నెయ్యి జోలికే వెళ్ళరు. నెయ్యి ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో మీకు బాగా తెలుసు.వినిఉండచ్చు. ఇది కేవలం యాంటి ఏజింగ్ మాత్రమే కాదు మనసు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి లాభం కలిగించే అంశం అయితే నెయ్యి ప్రతి ఒక్కరికి సరిపడదు. అని అంటున్నారు నిపుణులు. భారత దేశం లో నెయ్యి చాలా ప్రాచుర్యం లో ఉంది.నెయ్యి కొంతమంది ప్రతిరోజూ తమ భోజనం లో చేరుస్తారు. నెయ్యి వాడడం కూడా చాలా కష్టం నేతిని బ్రెడ్ లో లేదా చపాతీలో పప్పు కూరలో నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. నెయ్యిని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడడం గమనించవచ్చు.నెయ్యి ఆరోగ్య పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. గుండె సంబందిత ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.ఖాళీ పొట్టతో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచెంద్రియాలలో శుభ్ర పరిచి ఉపసమనం ఇస్తుంది. నెయ్యిలో యాంటి ఏజింగ్ మరియు గుండె ను ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది దీనితో పాటు నెయ్యి మెదడు,జ్ఞాపక శక్తిని పెంచి పంచేంద్రియాలు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.