LATEST NEWS
తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్‌ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి, నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తమిళనాడు వంటి రాష్ర్టాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తుండటంతో ఇప్పుడు అదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిచాలని భావిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలుస్తుండగా, రేపో.. మాపో ఆర్డినెన్స్‌ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఇప్పటికే ఎన్నికలను పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇవ్వగా.. ఆలోపే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతానికి పంచాయతీలకంటే ముందు పరిషత్‌ ఎన్నికలే నిర్వహిస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే ఓటర్‌ జాబితా సిద్ధం కాగా.. కావాల్సిన బ్యాలెట్‌ బాక్సులు, సామగ్రి, ప్రింటింగ్‌ కూడా అధికారులు పూర్తిచేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా.. మెజారిటీ స్థానాలను ఆ పార్టీనే దక్కించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ పార్టీకి సింహభాగం స్థానాలు దక్కాయి. వేరే పార్టీల్లో గెలిచిన వారు సైతం అప్పట్లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికీ..  ఇంకా బీఆర్‌ఎస్‌లో తాజా మాజీ ప్రజాప్రతినిధుల శాతం అధికంగానే ఉంది. గ్రామాల్లో ఇంకా ఆ పార్టీ కేడర్‌ బలంగా ఉండగా, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ను బలోపేతం చేసుకోవడం వంటి పరిణామాలతో పోటీ హోరాహోరీగా ఉండనుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామనే అంశంతో కాంగ్రెస్‌ ముందుకు వెళ్లనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఇటీవలి కాలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎక్కువ సంఖ్యలో నిర్మించడం, సన్న బియ్యం పథకం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే బీఆర్‌ఎస్‌ తమకున్న కేడర్‌, గతంలో చేసిన పనులు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తరచూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే పక్షంలో తమ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది. ఇక గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు గేట్‌వేగా ఉంటాయని ఆ పార్టీ నాయకత్వం అనుకుంటోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును సద్వినియోగం చేసుకుని.. సరైన అభ్యర్థులను నిలిపితే ఫలితం ఉంటుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పంచాయతీలను పార్టీ గుర్తుపై కాకుండా ఇతర గుర్తులపై గెలుచుకోవాల్సి ఉంటుంది. పరిషత్‌ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తులు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ ముందుగా పరిషత్‌ ఎన్నికలను నిర్వహించి, ప్రభుత్వ పని తీరుకు గెలుపు అని చెప్పాలని భావిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తుండగా.. గతంలో రిజర్వేషన్లు తక్కువగా ఉన్న సమయంలోనూ బీసీలు జనరల్‌ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. ఒకవేళ బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వలేని పక్షంలో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ గతంలో భావించింది. దానిపై కొంత విమర్శలు రావడంతో ఎలాగైనా చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కేబినెట్‌ తీర్మానం చేసింది. దాంతో ఆశావహులు అప్పుడే పల్లెల్లో ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేస్తున్నారు. మరి ఈ ట్రయాంగిల్ ఫైట్లో అధికార పక్షం విపక్షాలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిలు మంజూరు చేయలేమని పేర్కొంటూ కోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్న మిథున్ రెడ్డి ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు   సుప్రీంను ఆశ్రయించారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొంటూ.. అప్పటి వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు  ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ మంగళవారం (జులై 15) తీర్పు ఇచ్చింది. దీంతో మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ లేకుండా పోయింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   మద్యం కుభకోణంలో పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారు.ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా అరెస్టయ్యారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. అయితే మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ ను సుప్రీం తిరస్కరించడంతో ఆయన ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 
వైయస్సార్ కడప జిల్లాలో  ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణం జరిగింది.ఇక్కడ ఇంటర్ విద్యార్థిని   దారుణ హత్యకు గురైంది. హత్య గురైన బాలిక మృతదేహం ముళ్ళపొదల్లో నగ్నంగా పడి ఉండడం  చూస్తే హంతకుడు హత్యాచారానికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి.అందిన సమాచారం మేరకు  బాలిక ప్రొద్దుటూరులోని  గీతం జూనియర్ కాలేజీలో  ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి   ఇంటి నుంచి వెళ్లింది. ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామానికి చెందిన లోకేష్,  అదే గ్రామానికి చెందిన  బాలికను తన ద్విచక్ర వాహనంపై ఉదయం  ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో గండికోట కు తీసుకువెళ్లాడు. తరువాత 10:47 గంటల సమయంలో లోకేష్ ఒక్కడే తన ద్విచక్ర వాహనంపై గండికోట నుంచి వెనక్కు వచ్చేసినట్లు  సిసి ఫుటేజీలో రికార్డు అయ్యింది. కాగా ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో   బాలిక కాలేజీకి రాలేదని  కళాశాల యాజమాన్యం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు . ఉదయం 8 గంటలకే తమ కుమార్తె కాలేజీకి వచ్చిందని  చెప్పిన కుటుంబ సభ్యులు ఆ వెంటనే కాలేజీకి వచ్చి విచారించారు.  లోకేష్ ఆ బాలికను బైక్ పై తీసుకు వెళ్లాడని తెలియగానే వారు గండికోటకే వెళ్లి ఉంటారని భావించిన  కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి , గండికోటకు వెతికేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు వైష్ణవికి సంభంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు.సాయంత్రం గండికోట పై భాగంలో మైనర్ విద్యార్థిని కాలేజీ బ్యాగు , చున్ని కనిపించాయి. దీంతో ఆ చుట్టుపక్కల వెతికినా మైనర్ విద్యార్థిని ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. అతని ఇచ్చిన సమాచారం మేరకు మైనర్ బాలిక మృతదేహం ఉన్న ప్రాంతాన్ని పోలీసులు, కుటుంబ సభ్యులు మంగళవారం (జులై 15) ఉదయం గుర్తించారు. మైనర్ విద్యార్థినిని  హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
బాలీవుడ్ నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్  ముంబై పేళ్లలకు సంబంధించి  మరోసారి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సంజయ్‌దత్ తలుచుకుని ఉంటే ముంబై పేలుళ్లను ఆపి ఉండేవారని ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా ఓ నేషనల్  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో 1993లో జరిగిన పేలుళ్ల కేసును వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా  చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. న్యాయవాదిగా పలు సంచలన కేసులను వాదించిన ఉజ్వల్ నికమ్ ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముంబై పేలుళ్ల గురించి, నటుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్ గురించి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.   1993, మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు సంజయ్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ వచ్చింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూం సలేం తీసుకొచ్చిన ఆ వ్యాన్‌లో హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే 47 తుపాకులు, బాంబులు ఉన్నాయి. వాటిని సంజయ్ పరిశీలించారు. వాటిల్లో నుంచి ఒక ఏకే 47 తుపాకీని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నారు. అయితే..అప్పుడే ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగి,  అంత మంది చనిపోయి ఉండేవారు కాదని ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉందనే కారణంతో సంజయ్‌పై అప్పట్లో టాడా కేసు నమోదైంది. సంజయ్ ఉగ్రవాది అని ఆరోపణలు వచ్చాయి. కోర్టు మాత్రం సంజయ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం   రుజువు కావడంతో సంజయ్‌ను దోషిగా నిర్దారిస్తూ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. పుణెలోని యరవాడ జైల్లో శిక్ష అనుభవించిన సంజయ్ 2016లో విడుదల అయ్యాడు. కాగా..  న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీలో చేరి 2024లో ముంబై నార్త్-సెంట్రల్ లోక్‌సభ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయనను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సంజయ్‌దత్‌తో పాటు బీజేపీ అధిష్టానం సైతం ఉజ్వల్ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడినట్లైంది.
తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తి వ్యవహారంలో వాస్తవాలను వెలికి తీయడం లక్ష్యంగా సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబర్ లో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ సిట్ కు సీబీఐ డైరెక్టర్ నేతృత్వం వహిస్తుండగా, రాష్ట్ర పోలీసు శాఖ, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు.  సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యింది.  తన దర్యాప్తులో కనుగొన్న విషయాలను సిట్ సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదించింది.  లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి సిట్ 14 మందిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిలో  బోలెబాబా డెయిరీ, ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. అలాగే సిట్ తన దర్యాప్తులో బాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న సహా పలువురు టీటీడీ ఉద్యోగులను విచారించింది.  ఈ విషయాన్ని కూడా సిట్ సుప్రీంకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఈ కేసులో నిందితులు దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను సవివరంగా ఆ నివేదికలో పొందుపరిచింది.   ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కేసులో దర్యాప్తు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుని రాజకీయ ఒత్తిడిని తీసుకువస్తోందని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. కాగా సుబ్బారెడ్డి బెయిలు పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు లిస్ట్ చేయవలసిందిగా.. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ నిలయ్ విపిన్ చంద్రఅంజారియాల ధర్మాసనం కోరింది. అదలా ఉంచితే.. లడ్డూ ప్రసాదం తీయారీలో వినియోగిచిన నెయ్యిలో కల్తీ వ్యవహారంలో తనను అరెస్టు చేస్తారన్న భయం సుబ్బారెడ్డిలో పెరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
Many actors have been unleashing their hidden talents in different films. Some turn to singing, some to writing, some to writing lyrics. Dhanush and Sivakarthikeyan have been lyricists and singers as well. Now, Ram Pothineni has turned into a lyricist for his next film, Andhra King Taluka.  The movie has been highly promoted film among Ram's films in recent times as his team is leaving no stone unturned on social media to amp up promotions. There have been rumors about his alleged romantic link up with leading lady Bhagyashri Borse, as well.  Now, he has turned into a lyricist and that too, the song is stated to be a melody. Vivek-Marvin have composed the song and Anirudh Ravichander has sung it. The makers are talking highly about the song. Mahesh Babu P, the director is stating that the movie has a never before seen novel point for Indian Cinema, in the story.  Well, looks like the producers Mythri Movie Makers are making sure that the movie will be something special for Ram. Upendra is playing a superstar in the movie, while Ram will be his die-hard fan. The makers did not reveal the release date yet. The first single is releasing on 18th July.   
Vidya Balan has been recognised as one of the strong female actors and leads, who did not resort to glamour show in films. While she did Dirty Picture, where she did bold and highly glamorous actress role, she never resorted to do similar films.  But she is turning heads with her captivating beauty in pink color. In the dress, she looks stunning and her glamour in this dress is being highly talked about. She looks stunningly beautiful and this photo is going viral on social media. The timeless beauty gave an interview for an English magazine and she said, "I was at the right place at the right time—but more importantly, I made the most of the opportunities that came my way, because I’ve always been incredibly hungry for work."  "I genuinely love what I do. I feel blessed to be living this dream every single day. Even now, 20 years since I started, I’m just as excited about the work I get to do," said Vidya Balan talking about her hunger to keep herself inspired in her career. Well, she still has a lot to offer and hope to see her in many films.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పుష్ప పార్ట్ 1 ,పార్ట్ 2 తో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న మలయాళీ నటుడు 'ఫాహద్ ఫాజిల్'(Fahadh Faasil). ఎస్ పి షెకావత్ క్యారక్టర్ లో ఫాహద్ ఆ రెండు పార్టుల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడని చెప్పవచ్చు. దీంతో ఫాహద్ హీరోగా తెరకెక్కిన కొన్ని మలయాళ చిత్రాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యాయి. ఫాహద్ నటనకి ఏర్పడిన క్రేజ్ కి ఒక  ఉదాహరణగా చెప్పుకోవచ్చు . రజనీకాంత్(Rajinikanth)నాగార్జున(Nagarjuna)కాంబోలో 'లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)దర్శకత్వంలో  తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ 'కూలీ'(Coolie)ఆగస్ట్ 14 న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మలయాళ నటుడు మంజుమ్మేల్ బాయ్స్' ఫేమ్ 'సౌభిన్ షాబీర్' ఒక కీలకమైన క్యారక్టర్ ని పోషిస్తున్నాడు. సౌబిన్ క్యారక్టర్ లో లోకేష్ మొదట 'ఫాహద్ ఫాజిల్ ని అనుకున్నాడట. ఈ మేరకు సదరు క్యారక్టర్ ని లోకేష్ చాలా కష్టపడి ఆరునెలల పాటు డిజైన్ చేసుకున్నాడని, కానీ డేట్స్ కుదరకపోవడంతో ఫాహద్ ఆ ఛాన్స్ ని వదులుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా 'పూజాహెగ్డే'(Pooja Hegde)పై చిత్రీకరించిన 'మోనికా' అనే స్పెషల్  సాంగ్ రిలీజయ్యింది. ఈ సాంగ్ లో 'సౌభిన్ షాబీర్' పూజాతో పాటు డాన్స్ చేసాడు. పూజా ని డామినేట్ చేసేలా డాన్స్ చేసాడంటే అతిశయోక్తి కాదు. పైగా ఈ సాంగ్ కేవలం సౌభిన్, పూజా ల మధ్య మాత్రమే చిత్రీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సాంగ్ వీడియోలో కూడా ఆ ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుండటంతో  ఫాహద్ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని అభిమానులతో పాటు, సినీ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్(Kamal Haasan)కాంబినేషన్ లో వచ్చిన 'విక్రమ్' తోనే ఫాహద్ పాన్ ఇండియా ప్రేక్షకులకి దగ్గరైన విషయం తెలిసిందే.    
  నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు. నటుడిగా ఎంతో పేరు ప్రతిష్టలు పొందిన కోట.. 83 ఏళ్ళ వయసులో జూలై 13న కన్నుమూశారు. ఈ క్రమంలో సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు కోట జర్నీని గుర్తు చేసుకుంటున్నారు. నటుడిగా కోట పోషించిన విభిన్న పాత్రల గురించి, అలాగే తెలుగు వారికి అవకాశాలు ఇవ్వాలంటూ కోట బలంగా తన గళాన్ని వినిపించడం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కోట ఆస్తుల గురించి కూడా చర్చ జరుగుతోంది.   1978 లో వచ్చిన 'ప్రాణం ఖరీదు' సినిమాతో నటుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు కోట శ్రీనివాసరావు. అందులో చిన్న పాత్రే చేసిన కోట.. 1985 నుంచి బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అప్పటినుంచి నాలుగు దశాబ్దాల పాటు ప్రతి ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే వయసు రీత్యా కొన్నేళ్లుగా ఆయన సినిమాలు తగ్గించారు. కోట నటించిన చివరి చిత్రం జూలై 24 విడుదల కానున్న 'హరి హర వీరమల్లు'.   కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా ఏ పాత్రకైనా న్యాయం చేయగల కోట డేట్స్ కోసం అప్పట్లో నిర్మాతలు పోటీ పడేవారు. కోట కూడా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ.. నటుడిగా ఎప్పుడూ బిజీగా ఉండేవారు. దాంతో కోట బాగానే సంపాదించారని అంటారు. కోట శ్రీనివాసరావుకి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో పెద్ద ఇల్లు ఉంది. దాని విలువ కోట్లలో ఉంటుందని చెబుతారు. అలాగే రియల్ ఎస్టేట్ లోనూ బాగానే పెట్టుబడులు పెట్టారట. కోట మొత్తం ఆస్తుల విలువ రూ.80 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఎంత పేరు, డబ్బు సంపాదించినప్పటికీ.. ఆ అహాన్ని చూపించకుండా.. కోట స్నేహానికి ఎంతో విలువ ఇస్తారని సన్నిహితులు చెబుతుంటారు.   అలాగే, కోట జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. తన భార్య సైకియాట్రిక్‌ సమస్యలతో బాధపడి.. కొన్నేళ్లపాటు కోటను కూడా గుర్తుపట్టలేదు. ఒక రోడ్డు ప్రమాదంలో కూతురు కాలు పోగొట్టుకోగా, మరో రోడ్డు ప్రమాదంలో కుమారుడు మరణించారు. ఇలా తన జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నప్పటికీ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు కోట.  
తమిళ స్టార్ హీరో 'ధనుష్'(Dhanush)రీసెంట్ గా 'నాగార్జున'(Nagarjuna)తో కలిసి 'కుబేర'(Kuberaa)తో మరోసారి తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో 2023 లో వచ్చిన 'సార్' మూవీ తర్వాత ధనుష్ స్ట్రెయిట్  తెలుగులో కుబేర తో రెండో విజయాన్ని అందుకున్నట్లయ్యింది. ప్రస్తుతం తమిళంలో 'ఇడ్లీ కడై'(Idli Kadai)అనే విభిన్న కథతో కూడిన చిత్రం చేస్తున్నాడు. డాన్ పిక్చర్స్  నిర్మిస్తుండగా ధనుష్ నే దర్శకత్వం వహిస్తున్నాడు. రాయన్ తర్వాత ధనుష్ దర్శకత్వంలో వస్తున్న రెండో మూవీ ఇడ్లీ కడై కావడంతో, పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'రఘువరన్ బిటెక్ నుంచి, ధనుష్ ప్రతి చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా 'ఇడ్లీ కడై' కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇడ్లీ కడై' అంటే తెలుగులో 'ఇడ్లి కొట్టు' అని అర్ధం. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తెలుగు హక్కుల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్ టైన్ మెంట్స్,'(Sithara Entertainments)'శ్రీ వెంకటేశ్వర సినిమాస్  ఎల్ ఎల్ పి'(Sri Venkateswara Productions LLP)సంస్థలు పోటీ పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆసక్తి కరమైన విషయం ఏంటంటే సితార సంస్థ సార్ ని నిర్మించగా, శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పి కుబేర ని నిర్మించింది. దీంతో 'ఇడ్లీ కడై' తెలుగు హక్కులు ఆ ఇద్దరిలో  ఎవరకి దక్కుతాయనే ఆసక్తి ఏర్పడింది. మరికొన్ని సంస్థలు కూడా ఈ విషయంలో  పోటీకి వస్తునట్టుగా సమాచారం. 'ఇడ్లీ కడై' కథ విషయానికి వస్తే ఇడ్లి అమ్ముకుని జీవినాన్ని కొనసాగించే వ్యక్తి క్యారక్టర్ లో ధనుష్ కనిపించనున్నాడు. ఇడ్లి వ్యాపారి తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సవాళ్లు మరియు విజయాల నేపధ్యాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పనున్నారు. ధనుష్ సరసన 'నిత్య మీనన్'(Nithya menon)జత కడుతుంది. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో తిరు, తను నీ నాన వంటి హిట్ చిత్రాలు వచ్చి ఉండటంతో 'ఇడ్లీ కడై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, సముద్ర ఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఏప్రిల్ 10 న రిలీజ్ కావాల్సిన 'ఇడ్లీ కడై' అక్టోబర్ 1 కి వాయిదా పడింది.     
Naga Vamsi, the renowned active producer of Telugu Cinema, has been confident about his upcoming biggie, Kingdom. Vijay Deverakonda, Bhagyashri Borse are starring in this tale of a spy leading an uprising in an island. Gowtam Tinnanuri is directing this film after his highly appreciated Jersey.  In a media interaction, Naga Vamsi expressed his fear about negativity surrounding Vijay Deverakonda. He stated that there are unanimous trolls and high amount of negativity surrounding Vijay and they have to work hard to push the film beyond all these trolls and negativity.  His tone appeared concerned about Vijay's recent duds and even more about the negative comments, trolls surrounding Vijay in social media. While he is stating that the film will work well with the audiences, at the same time, he is making such statements. Several onlookers are commenting that he is unable to hide his fear.  It is common for producers to feel nervous about their investment when a big film is releasing. But with a great track record of hits in recent times, a producer like Naga Vamsi making such a statement about Vijay's credibility and his negative image among audiences, is giving opportunity to several onlookers to spread even more negativity about the film.  While we cannot be sure about film's quality prior to the release, producers and directors do have an understanding about the product in hand. Reports suggest that Kingdom did undergo several reshoots and these kind of remarks could be a strategy to cover up any misses and throw blame on negative image of the actor?  He seems to be worried that Kingdom will be affected by this negative image and maybe this could be his way of asking people to be kind. Well, let's hope the movie releasing on 31st July will answer to every question and let it just be a random comment made by Naga Vamsi and not something profound.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Meher Ramesh doesn't need an introduction as he gave unforgettable disasters in Telugu Cinema. He directed Kantri, Billa, Shakti, Shadow, and Bhola Shankar with big stars. Kantri and Billa ended up being average grossers to an extent but Shakti, Shadow turned to be career worst films for NTR, Venkatesh, respectively.  He returned back to direct Megastar Chiranjeevi for Bhola Shankar. The movie became career worst of Chiranjeevi as well. He earned the reputation of being a director who delivers career worst films of big stars and fans are scared about a film with him.  He is the only director in Telugu Cinema to earn such a bad reputation that fans like to dislike. Now, he stated in an interview that he achieved his lifetime dream to work with Megastar Chiranjeevi and he wants to direct Pawan Kalyan, as well. After his revelation, Pawan Kalyan fans are scared if Meher Ramesh will get the opportunity.  Sarcastically, several fans are making fun comments against such a film being end of many careers. Even some are trying to state that if Pawan Kalyan decides to be a part of Meher's film, he could directly announce retirement and they can just think about his political career.  Pawan Kalyan did not care about giving Harish Shankar an opportunity, even after Mr. Bachchan, he did not care about giving Bheemla Nayak to Saagar K. Chandra, and BRO to Samuthirakani. So, fans are afraid if Meher Ramesh will also get an opportunity.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  కొందరి మాటలు ఎప్పుడూ వివాదాస్పదమవుతూ ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్ నుండి విజయ్ దేవరకొండకు ఈ సమస్య ఉంది. తెలిసీ తెలియకుండా అన్న మాటలు కాంట్రవర్సీ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో కూడా రెండు వివాదాలు ఎదురయ్యాయి. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పహల్గామ్ ఉగ్ర దాడి గురించి మాట్లాడుతూ ట్రైబ్ అనే పదం ఉపయోగించగా అది వివాదాస్పదమైంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల స్క్రిప్ట్ ల విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని విజయ్ చెప్పగా.. అది కూడా కాంట్రవర్సీ అయింది. ఓ రకంగా విజయ్ ఏదీ మాట్లాడినా వివాదమే అన్నట్టుగా తయారైంది. ఇదే విషయాన్ని తాజాగా నిర్మాత నాగవంశీ ప్రస్తావించారు. విజయ్ మీద కొంచెమైనా జాలి చూపించాలని అన్నారు.   విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'కింగ్ డమ్'. ఈ యాక్షన్ డ్రామా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   "అసలు విజయ్ గారిని జనం ఎందుకు టార్గెట్ చేస్తారో తెలీదు. పాపం అసలే ఆయన సినిమాలు ఆడక డౌన్ లో ఉన్నారు. రెట్రో ఈవెంట్ లో చిన్న మాట అంటే దాన్ని హంగామా చేశారు. హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూలో ఏదో అంటే దాన్ని ఇంకోలా తీసుకున్నారు. అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన్ని? ఏం అవసరం?. ఇదివరకు అంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడేం మాట్లాడట్లేదు కదా. ఆఫ్ కెమెరా ఆయనసలు చాలా మంచిగా ఉంటారు. జనాలకు అసలు హీరో మీద జాలి కూడా లేదు. ఓ పక్క హిట్లు లేక ఆయన అలా ఉంటే.. ఆయన ఏం మాట్లాడినా భూతద్దంలో చూస్తూ కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు." అని నాగవంశీ చెప్పుకొచ్చారు.  
ఎనర్జిటిక్  స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)హీరోగా వచ్చిన 'ది వారియర్', 'స్కంద' వంటి చిత్రాలతో పాటు నాగార్జున(Nagarjuna),నాగ చైతన్య(Naga Chaitanya) లతో 'నా సామి రంగ', 'కస్టడీ' వంటి పలు విభిన్న చిత్రాలని నిర్మించిన నిర్మాణ సంస్థ 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్'. ఈ సంస్థ అధిపతి పేరు 'చిట్టూరి శ్రీనివాసా'(Srinivasaa Chitturi).  ఈ రోజు ఉదయం శ్రీనివాసా సోదరుడు 'చిట్టూరి కాశీవిశ్వనాథ్'(Chitturi Kashi Vishwanath)ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం పసివేదులలో చనిపోవడం జరిగింది. కాశీ విశ్వనాధ్ గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు. దీంతో పలువురు చిత్ర ప్రముఖులు చిట్టూరి శ్రీనివాసాకి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు. చిట్టూరి శ్రీనివాసా 2018 లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'యూటర్న్'తో సినీ రంగ ప్రవేశం చేసాడు. గోపీచంద్, తమన్నా, సంపత్ నంది కాంబోలో వచ్చిన 'సిటీ మార్' అనే చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది.    
తన స్టార్ డమ్ కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా, ఏ క్యారక్టర్ లోకైనా అవలీలగా ప్రవేశించి, ఆయా క్యారెక్టర్స్ కి  స్టార్ డమ్ ని తెచ్చే హీరో 'నాగార్జున'(Nagarjuna). ఆయన నుంచి ఇప్పటి వరకు వచ్చిన   చిత్రాలే అందుకు ఉదాహరణ. సిల్వర్ స్క్రీన్ పై 'నాగ్' టచ్ చెయ్యని జోనర్ లేదు. రీసెంట్ గా  కుబేరతో సత్తా చాటిన నాగ్, అగస్ట్ 14 న 'కూలీ'(Coolie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో 'సైమన్' అనే నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో కనిపిస్తుండటంతో, నాగ్ క్యారక్టర్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.  రీసెంట్ గా 'కూలీ' దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(lokesh Kanagaraj)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'కూలీలో నాగ్ సర్ క్యారక్టర్ చాలా కొత్తగా ఉండబోతుంది. క్యారక్టర్ కి సంబంధించిన ఐడియాని మొదట నాగ్ సర్ కి  చెప్పాను. ఆయనకెంతో నచ్చింది. కానీ సర్ ని ఒప్పించడం అంత తేలిక కాదు. చాలా కష్టంతో ఒప్పించాను. సుమారు ఏడెనిమిది సార్లు వరకు నారేషన్ ఇచ్చాను. సదరు  క్యారక్టర్ ని తీర్చిదిద్దటం కూడా సవాలుగా మారిందని లోకేష్ చెప్పుకొచ్చాడు. లోకేష్ చెప్పిన ఈ మాటలతో నాగార్జున కథల విషయంలో, తన క్యారక్టర్ కి సంబంధించిన విషయంలో ఎంత సిన్సియర్ గా ఉంటారో అర్ధమవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'కూలీ'లో రజనీకాంత్(Rajinikanth),నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోనుండటంతో, పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ఇద్దరి అభిమానులు 'కూలీ' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శృతి హాసన్(Shruthi haasan)హీరోయిన్ గా చేస్తుండగా మరో హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde)ఒక స్పెషల్ సాంగ్ లో చేస్తుంది. 'మోనికా' అంటూ ఇటీవల రిలీజైన ఆ సాంగ్, సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. అగ్ర హీరో 'అమీర్ ఖాన్'(Amir Khan)గెస్ట్ రోల్ లో కనిపిస్తున్న 'కూలీ' ని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(kalanithi Maaran)భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. అనిరుద్ సంగీతాన్ని అందించడం జరిగింది.    
నేటి జనరేషన్ లో  యువ జంటలలో విడాకులు తీసుకోవడం పద్దతి వేగంగా పెరుగుతోంది. గతంలో వివాహం చేసుకుంటే జీవితాంతం కలిసుండేవారు. కానీ ఇప్పుడు చాలా జంటలు వివాహం అయిన కొన్ని సంవత్సరాలు, నెలల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్,  పారుపల్లి కశ్యప్   విడిపోతున్నట్లు ప్రకటించారు. 7 సంవత్సరాల వివాహ బంధాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు స్పష్టం చేశారు. కేవలం సెలబ్రిటీలే కాదు.. నేటి కాలంలో సాధారణ కుటుంబాలలో కూడా వివాహం తర్వాత విడాకుల తంతు చాలా ఎక్కువగానే జరుగుతోంది.  యువ జంటలు విడిపోవడానికి అనేక సామాజిక, మానసిక,  ఆచరణాత్మక కారణాలు ఉండవచ్చు. అలాంటి 5 ప్రధాన కారణాలు తెలుసుకుంటే..  సహనం  ఓర్పు.. నేటి యువ జంటలలో  మునుపటి కాలంతో పోలిస్తే సహనంలో చాలా లోపాలు కలిగి ఉన్నారు. చిన్న సమస్యలకు వాదించుకోవడం,  దానిని పరిష్కరించుకోవడానికి  బదులుగా సంబంధాన్ని వదిలివేయడం ఒక సాధారణ ధోరణిగా మారింది. గొడవ నుండి పారిపోవాలనే ధోరణి కారణంగా బార్యాభర్తల మధ్య విడాకుల సమస్యకు దారితీస్తోంది.  స్వేచ్ఛ,  సెల్ఫ్ స్పేస్.. నేటి యువకులు ఎక్కువ స్వేచ్ఛ,  పర్సనల్ స్పేస్ కావాలని  కోరుకుంటారు. వివాహం తర్వాత, భాగస్వామి యొక్క అంచనాలు వారి స్వేచ్ఛకు అడ్డంకిని సృష్టిస్తే వారు దానిని తట్టుకోలేక విడాకులు తీసుకోవడం లేదా విడిపోయే మార్గాన్ని ఎంచుకోవడం చేస్తున్నారు. కెరీర్,  ఆర్థిక ఒత్తిడి.. పెరుగుతున్న పోటీ, కెరీర్ గురించి ఆలోచనలు,  ఆర్థిక అస్థిరత కారణంగా యువ జంటలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి సంబంధాలను ప్రభావితం చేస్తుంది.  కొన్నిసార్లు పరస్పర అవగాహన లేకపోవడం జరుగుతుంది. సోషల్ మీడియా,  బాహ్య ప్రభావాలు.. సోషల్ మీడియాలో కనిపించే ఆదర్శ జీవితం,  గ్లామర్ జంటలలో తప్పుడు అంచనాలను ఏర్పరుస్తాయి. వారు తమ సంబంధాన్ని ఇతరులతో పోల్చుకుంటారు. ఇది అసంతృప్తికి,  భార్యాభర్తల మధ్య  దూరం ఏర్పడటానికి  దారితీస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్,  భావోద్వేగ సంబంధం లేకపోవడం.. సంబంధాలకు కమ్యూనికేషన్ అతిపెద్ద పునాది. కానీ భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ తగ్గడం ప్రారంభించినప్పుడు, అపార్థాలు పెరుగుతాయి. ఇది కాకుండా ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సంబంధం లేకపోవడం కూడా సంబంధం విచ్ఛిన్నానికి దారితీస్తుంది.                       *రూపశ్రీ.
ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాలసీ అనేది కామన్ అయిపోయింది. ఏ రోజు సంపాదన ఆరోజు సరిపోయి ఏదో జీవితం అట్లా సాగుతున్నవాళ్ళు తప్ప పేదల నుండి, మధ్యతరగతి, ధనవంతుల వరకు ఈ పాలసీలలో మునిగి తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి వారి మీదనే ఈ పాలసీ సంస్థలు కూడా నడుస్తున్నాయంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ధనవంతులకు ఈ పాలసీలు ఉన్నా లేకపోయినా ఏమి సమస్య లేదు. పెద్దలు వెనుకేసిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, వ్యాపార లాభాలు వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల వారికి పాలసీల గురించి పెద్ద ఆసక్తి కూడా తక్కువే.  అయితే వ్యక్తి నుండి వాహనాలకు, వస్తువులకు, ఇళ్లకు, సంస్థలకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది మొదలయ్యాక ఈ ధనవంతులు కూడా వీటితో బాగానే ప్రయోజనాలు పొందుతున్నారు. ఇకపోతే చాలా చోట్ల చాలా కుటుంబాలలో కనిపించే అతి సాధారణ సమస్య ఒకటుంది. శ్రీరామ్ చిట్స్ ఎల్.ఐ.సి హెచ్.డి.ఎఫ్.సి ఇంకా ఇంకా వివిధరకాల బోలెడు సంస్థలు ఎన్నో ఇన్సూరెన్స్ లు అందిస్తున్నాయి. వీటిలో పాలసీలు తీసుకుని వాటిని కడుతున్న వారిలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయి. అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య పాలసీ చెల్లింపు గడువు రాగానే పైసల కోసం వెతుక్కోవడం. నిజానికి ఈ పాలసీలు కట్టడం మొదలుపెట్టినప్పుడు తప్ప మిగిలిన సందర్భాలలో డబ్బు సమకూర్చుకోవడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిక్కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సగటు మధ్యతరగతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి మూడువేల రూపాయల పాలసీ కట్టడానికి నిర్ణయించుకుంటే అతడి నెలవారీ సంపాదనలో ఐదువందల రూపాయలను పక్కన పెడుతుండాలి. ఆ ఆరు నెలల మొత్తం పాలసీ చెల్లింపును ఎలాంటి ఆందోళన లేకుండా చేస్తుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు ఈ విషయం గూర్చి ఎక్కువ ఆలోచించరు. తీరా చెల్లింపు గడువు ముందుకొచ్చినప్పుడు అప్పు చేసో లేక వేరే చెల్లింపుల నుండి దీనికి డబ్బు మరల్చడమో చేస్తుంటారు. ఫలితంగానే ఒకవైపు ఇన్సూరెన్స్ లు కడుతూ మరోవైపు అప్పులు చేస్తూ ఉంటారు. ఇదీ సగటు మధ్యతరగతి పాలసీదారుని పితలాటకం. హెల్త్ ఇన్సూరెన్స్ లు వచ్చినప్పటి నుండి ఓ ఆలోచన పురుగులా మెదడును తొలిచేది. చావుకు అగ్రిమెంట్ రాసుకున్నట్టు చస్తే ఆ ఇన్సూరెన్స్ తాలూకూ డబ్బులు బోల్డు వస్తాయని కదా ఇవన్నీ అని. కానీ నిజానికి  పేద, మధ్యతరగతి వ్యక్తులు ఎప్పుడూ ఇంతే కదా కుటుంబచట్రంలో ఇరుక్కుపోయిన జీవులు కదా అనిపిస్తుంది. ఇకపోతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచనలు చేసే మధ్యతరగతి జీవుల వల్ల హాయిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి.  సంవత్సరంలో ఈ పాలసీలు కట్టాలనే కోణంలో తమ సంతోషాలు కూడా వధులుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. మనిషికోక పాలసీ, కానీ సంపాదన ఒకే ఒకరిది. ఇబ్బందులున్నా కట్టడానికే ముందుకు వెళ్తారు. కారణం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండటమే.  పాలసీలతో జాగ్రత్త! కొందరుంటారు. ఈ పాలసీ సంస్థలలో పనిచేసే ఎంజెంట్లు. వీళ్ళు పాలసీలు తీయించడం, డబ్బులు వసూలు చేయడం పనిగా చేస్తుంటారు. అదే వారి ఉద్యోగం కూడా. అయితే పాలసీ తీయించేటప్పుడు 90% మంది ఆ పాలసీ వల్ల లాభాలు మాత్రమే చెబుతారు. కానీ దాని వల్ల వచ్చే నష్టాలు ఎవరూ ఏమీ చెప్పరు. చివరకు దానివల్ల ఏదో ఒక నష్టం ఎదురయ్యే దాకా దాని గురించి పాలసీదారుడికి తెలియదు కూడ. ఇలాంటి సంఘటనలు బోలెడు జరుగుతూ ఉంటాయి. సగటు మధ్యతరగతి ఒక సంస్థమీద ఎంతకని పోరాడతాడు. కాబట్టి ఒకటికి బట్టి నాలుగైదు సార్లు తిరుగుతాడు, ఆ తరువాత మోసం చేసిన వాడి నాశనం వాడిదే  అనుకుని కొన్నిరోజులు బాధపడి తిరిగి జీవితమనే పోరాటంలో పడిపోతాడు. కానీ నిజానికి ఆ సంస్థవాడు హాయిగా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు అందులో ప్లస్ పాయింట్స్ మాత్రమే కాదు మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మొదట అందరూ తెలుసుకోవాలి. పైన చెప్పుకున్న విషయమంతా చదివాక పాలసీ అంటే భరోసా ఇవ్వాలి కానీ అది చిరాకు పెట్టించేదిగా ఉండకూడదని అందరికీ ఆర్గమయ్యే ఉంటుందనుకుంటా! ◆ వెంకటేష్ పువ్వాడ  
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా.. ప్రతి ఒక్కరూ పరిపూర్ణ భాగస్వామి కావాలని కోరుకుంటారు. అలా కోరుకున్నప్పటికీ కొంతమందికి వారి హృదయాలను ముక్కలు చేసే భాగస్వాములు  జీవితంలోకి వస్తుంటారు.  ఇలాంటి పరిస్థితిలో హృదయంతో పాటు, మనస్సును కూడా  చురుగ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు, భాగస్వామి సరిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి, వారి విషయంలో తీసుకునే నిర్ణయాలు తప్పా, ఒప్పా అనే విషయం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది.  చాలా సార్లు ప్రేమ గా ఉన్నప్పుడు ఎదుటివారు ఏదైనా తప్పు చేసినా సరే.. ఆ తప్పులను  విస్మరిస్తుంటారు. అలా తప్పులను పట్టించుకోకపోవడం అనేది సరైనదే.. కానీ అన్నిసార్లు అది సరైనది కాదు.  మగవాళ్లలో ఉండే మూడు లక్షణాలు పైకి చెప్పుకొన్నంత సాధారణమైని కావు. ఇవి అమ్మాయిల జీవితాలను నరకప్రాయంగా మారుస్తాయి.  అబ్బాయిలలో ఉండే అలాంటి లక్షణాలు ఏంటి తెలుసుకుంటే.. నియంత్రణ.. కొంతమంది అబ్బాయిలు నియంత్రణ స్వభావం కలిగి ఉంటారు. వారు ప్రతి విషయంలోనూ భార్యలను  నియంత్రించాలని కోరుకుంటారు. ఇది అబ్బాయిలలో పెద్ద చెడు లక్షణం.  భర్త భార్యను   ప్రతిదానిలోనూ నియంత్రిస్తుంటే..  ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏమి తినాలి? ఇలాంటివి అనిపిస్తుంటే అప్పుడు  అమ్మాయిల ఆలోచన  ఎలా అనిపిస్తుంది? ప్రారంభంలో, అలాంటి స్వభావం మంచిగా అనిపించవచ్చు. కానీ క్రమంగా  అలాంటి సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇలా  నియంత్రించడం ప్రేమ లేదా శ్రద్ధ కాదు, అది  బలవంతం. అలాంటి భాగస్వాములు భార్యల నమ్మకాన్ని నాశనం చేస్తారు.  దీని కారణంగా  క్రమంగా తమను తాము కోల్పోయామని అమ్మాయిలు బాధపడతారు. టే, ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏమి తినాలి? అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రారంభంలో, అలాంటి స్వభావం మంచిగా అనిపించవచ్చు. కానీ క్రమంగా మీరు అలాంటి సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ప్రకృతిని నియంత్రించడం ప్రేమ లేదా శ్రద్ధ కాదు, బలవంతం. అలాంటి భాగస్వాములు మీ విశ్వాసాన్ని నాశనం చేయవచ్చు, దీని కారణంగా మీరు క్రమంగా కోల్పోయినట్లు అనిపించడం ప్రారంభిస్తారు. ప్రతి విషయంలోనూ తాము సరైనవారని నిరూపించుకునే అలవాటు.. అబ్బాయిలు ఏ విషయంలో అయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా, వారివైపు ఎలాంటి తప్పిదం ఉన్నా సరే.. వారు ఏ పోరాటంలోనైనా, చర్చలోనైనా లేదా సంభాషణలోనైనా తమ తప్పులను చూడరు. వారు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు. అలాంటి వ్యక్తులు తమ సొంత మాటలను మాత్రమే సరైనవిగా భావిస్తారు.  వాటిపై చర్య తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తులతో జీవితం నరకం.  అలాంటి వ్యక్తులు మానసికంగా పరిణతి చెందరు. అలాంటి వ్యక్తితో జీవించడం చాలా నిరాశకు గురి చేస్తుంది. అమ్మాయిలు కోరుకునే అందమైన జీవితం ఇవ్వడంలో ఇలాంటి అబ్బాయిలు కంప్లీట్ గా ఫెయిల్ అవుతారు. అలాంటి వ్యక్తి  మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడు చేసే అవకాశం ఉంది. అతిగా అనుమానించే అబ్బాయిలు.. భార్యలను అనుమానించే భర్తలు చాలానే ఉంటారు.  ఇలా అతిగా అనుమానించే భర్తలు భార్యలకు నరకం పరిచయం చేస్తారు. భాగస్వామి గురించి కొంచెం ఆందోళన చెందడం సరే, కానీ ప్రతిదానిపైనా సందేహం లేదా అసూయ కలిగి ఉండటం చాలా తప్పు. అలాంటి అబ్బాయిలకు తమ భాగస్వామి స్నేహంతో సమస్యలు మొదలవుతాయి.  చేసే ప్రతి పనికి  అనుమానంగా చూస్తారు. అలాంటి సంబంధం నెమ్మదిగా పాయిజన్ గా  మారుతుంది.                                *రూపశ్రీ.  
  వర్షాకాలం చాలామందికి బాగా ఇష్టంగా ఉంటుంది.  వాతావరణం బాగా చల్లగా ఉంటుందనే కారణంతో దీన్ని ఇష్టపడతారు. అయితే వర్షాకాలం విషజ్వరాలను,  వైరల్ ఇన్ఫెక్షన్లను మోసుకొచ్చే కాలం. ఈ కాలంలో విషజ్వరాలు స్వైర విహారం చేస్తాయి. అందుకే ఈ సీజన్ మార్పుకు అనుగుణంగా అలవాట్లు మార్చుకోవాలి.  జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా విషజ్వరాలలో డెంగ్యూ ప్రముఖమైనది. లో ప్లేట్ లెట్ ల కౌంట్ తగ్గుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్ 10,000 కంటే తక్కువగా ఉంటే, దానిని పెంచాల్సిన అవసరం ఉంటుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆహారం,  శుభ్రమైన నీటిని మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.   త్రాగే నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీరు స్వచ్చంగా లేవని అనిపిస్తే  వాటిని మరిగించి చల్లార్చి తీసుకోవాలి. వర్షాకాలంలో ఫ్లూ ఎక్కువగా వస్తుంది. దీనివల్ల జ్వరం,  శరీర నొప్పులు వస్తాయని ఆయన అన్నారు. దీనితో పాటు జ్వరం చాలా ఎక్కువగా ఉండి, తలనొప్పి నిరంతరంగా ఉంటే డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు నాలుగు నుండి ఐదు గంటల్లోపు మందులు తీసుకున్న తర్వాత జ్వరం తగ్గితే, మలేరియా వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.  నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో  టైఫాయిడ్, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా వంటివి ముఖ్యమైనవి. వాటిని నివారించడానికి  ఎల్లప్పుడూ మరిగించి చల్లార్చిన లేదా  ఫిల్టర్ చేసిన  నీటిని తాగాలి.  నీటి పాత్రను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి పాత్ర మీద ఎల్లప్పుడూ కప్పి ఉంచాలి.  తినడానికి ముందు,  తిన్న తర్వాత, మలవిసర్జన చేసిన తర్వాత  నీటిని తాకే ముందు సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలి. పిల్లలు  క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్లు ఆటల నేపథ్యంలో చేతులను ఉపయోగించే విధానం వేరుగా ఉంటుంది. ఆహారం ఎప్పుడూ బాగా ఉడికినదై ఉండాలి.  పచ్చి లేదా సగం ఉడికించిన ఆహారాన్ని నివారించాలి. పండ్లు,  కూరగాయలను తినేముందు శుభ్రమైన నీటితో కడగాలి. బయట ఆహారాన్ని తినడం మానేయడం మంచిది. బావులు, నదులు లేదా చెరువుల దగ్గర మలవిసర్జన చేయవద్దు. నీటి వనరులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.  ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది దోమలు,  బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. స్థానిక ఆరోగ్య కేంద్రం నుండి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి సమాచారం పొందాలి. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి.  వీలైనంత వరకు పరిశుభ్రతే శ్రీరామ రక్ష అనే విషయం మరవకూడదు.  ఈ చర్యలు తీసుకోవడం ద్వారా, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..    
  రుతుపవనాలు వచ్చాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాకాలం వచ్చిన వెంటనే, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ వర్షాకాలంలో ఆరోగ్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  వాటిలో రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం ఒకటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  రాగి పాత్రలో ఉంచిన నీరు ఈ సీజన్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాగి నీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఇది అమృతం లాంటిది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వర్షాకాలంలో నీటి కాలుష్యం ప్రమాదం పెరుగుతుంది, ఇది ఇన్ఫెక్షన్ లకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, రాగి నీరు సురక్షితమైన ఆయుర్వేద నివారణ. రాగి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది,  నీటిని శుద్ధి చేస్తుంది. రాగి పాత్రలోని నీరు స్వచ్ఛమైనది.  శరీరం నుండి విషాన్ని బయటకు పంపి, శరీరాన్ని ఆరోగ్యంగా,  మనస్సును ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది. రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం, అపానవాయువు,  అజీర్ణం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు ఈ నీరు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మూత్రపిండాలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. రాగి పాత్రలోని  నీరు రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇది వర్షాకాలంలో వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రాగి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది,  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం కూడా రాగి పాత్రలో నీరు త్రాగమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రాగి నీరు శరీరంలోని త్రిదోషాలను (వాత, పిత్త, కఫ) సమతుల్యం చేస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాగి పాత్రలో నీటిని రాత్రంతా ఉంచి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం ఉత్తమం.  కానీ పాత్ర తుప్పు పట్టకుండా ఉండటానికి దానిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. ఈ చిన్న మార్పుతో వర్షాకాలంలో కూడా నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..  
డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని సహాయంతో మందులను సక్రమంగా తీసుకుంటూ ఉండటమే కాకుండా ,  ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి,    తీవ్రమైన సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో గ్లూకోమీటర్‌తో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉంటారు.  ఇది ఆరోగ్యానికి మంచిదే.  కానీ చాలాసార్లు ఈ పరీక్ష తప్పుగా జరుగుతోందని డయాబెటిస్ నిపుణులు అంటున్నారు.  దీని కారణంగా రీడింగ్ కూడా తప్పుగా వస్తుంది. ఇంట్లో రక్తంలో చక్కెరను తనిఖీ చేసేటప్పుడు  చాలామంది చేస్తున్న తప్పులేంటి? వాటిని ఎలా నివారించాలి?తెలుసుకుంటే.. చేతులు కడుక్కోకపోవడం.. చాలా మంది చేతులు కడుక్కోకుండానే పరీక్షలు చేసుకుంటారు. చెమట, నూనె లేదా చేతులపై చిన్న ఆహారం ముక్క కూడా తప్పుడు రీడింగ్ ఇస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెరను తనిఖీ చేసే ముందు ఎల్లప్పుడూ  చేతులను సబ్బుతో కడుక్కోవాలి.  చేతులు పూర్తీగా ఆరిన తరువాత పరీక్ష చేసుకోవాలి.   వేలు గుచ్చడానికి ప్రతిసారీ ఒకే వేలును ఉపయోగించడం.. ప్రతిసారీ ఒకే ప్రదేశం నుండి రక్తాన్ని తీయడం వల్ల అక్కడి చర్మం కఠినంగా మారుతుంది. దీని వల్ల  రక్తాన్ని తీయడం కష్టమవుతుంది. వేళ్లను మారుస్తూ ఉండాలి.  ఒకే వేలును పదే పదే ఉపయోగించకూడదు. పాత స్ట్రిప్స్ వాడకం.. టెస్ట్ స్ట్రిప్స్ కు గడువు తేదీ ఉంటుంది. చాలా సార్లు  పాత లేదా తేమతో కూడిన స్ట్రిప్స్ వాడతారు. ఇది తప్పు రీడింగ్ లను ఇస్తుంది. స్ట్రిప్స్ ను ఎల్లప్పుడూ పొడి,  చల్లని ప్రదేశంలో ఉంచాలి.  అలాగే  గడువు తేదీని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. రక్త నమూనా తీసుకోవడానికి ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం.. కొన్నిసార్లు రక్తం బయటకు రానప్పుడు,  వేలిని చాలా గట్టిగా నొక్కుతారు, ఇది కణజాల ద్రవాన్ని రక్తంతో కలిపి రీడింగ్‌ను ప్రభావితం చేస్తుంది. మృదువుగా  గుచ్చాలి.  అవసరమైతే చేతిని కొద్దిగా రబ్ చేయాలి,  లేదా క్రిందికి వంచాలి. తప్పు సమయంలో తనిఖీ చేయడం.. ఖాళీ కడుపుతో, భోజనం చేసిన 2 గంటల తర్వాత లేదా నిద్రపోయే ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి సరైన సమయం. తప్పు సమయంలో తనిఖీ చేయడం వల్ల నివేదిక గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. ఇది తీసుకునే ఆహారం గురించి, వాడాల్సి మందుల గురించి కూడా గందరగోళం క్రియేట్ చేస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..