LATEST NEWS
  క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి  సెంటిమెంట్లు బాగా  ఎక్కువ‌. ఎందుకంటే  ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి  సెంటిమెంట్ల  ద్వారా. అలా త‌న తండ్రి  తెలంగాణ  రాష్ట్ర స‌మితి అనే పార్టీని ఏప్రిల్ 27, 2001లో స్థాపించ‌గా.. కూతురు క‌విత, పాతికేళ్ల త‌ర్వాత‌.. అంటే 2026, ఏప్రిల్ 25న పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సుముహుర్తం ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.ఇంత‌కీ ఈ పార్టీ పేరు ఏమై ఉంటుంది? అంటే, తెలంగాణ ప్రజా జాగృతి అని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమె తెలంగాణ  జాగృతి అనే సామాజిక సంస్థ‌ను న‌డుపుతున్నారు. దీనికే ప్ర‌జా అనే ప‌దం  చేర్చుతూ దాన్ని రాజ‌కీయ పార్టీగా మార్చుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.   ఇక పార్టీ గుర్తులు ఏవి ఉంటాయో ప‌రిశీలిస్తే.. ధ‌ర్మ గంటను ఖ‌రారు చేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. జెండా, అజెండా  ఎలాంటివో గ‌మ‌నిస్తే ఇప్ప‌టికే జాగ్ర‌త్తికంటూ తెలుపు, లేత ప‌చ్చతో కూడిన జెండా రంగులున్నాయి. వీటికి అజెండాను జోడిస్తే.. సామాజిక తెలంగాణ లేదా తెలంగాణ  ఫ‌స్ట్.. ఆమె తీసుకున్న రాజ‌కీయ విధానంగా స‌మాచారం.  ఇక యువ‌త‌, మ‌హిళ‌లు, అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కులు, మ‌రీ ముఖ్యంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు అండ‌గా నిల‌బ‌డ్డం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక బీసీ  సంగ‌తి స‌రే స‌రి. మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల‌పై పోరాటం కూడా ఆమె తీసుకుంటున్న పొలిటిక‌ల్ లైన్ల‌లో భాగ‌మే.  వ‌చ్చే ఎన్నిక‌ల  నాటికి డీలిమిటేష‌న్లో భాగంగా తెలంగాణ నియోజ‌క‌వ‌ర్గాలు సైతం పెర‌గ‌నుండ‌టంతో ఆమె పార్టీ నుంచి కూడా ఎంద‌రో కొత్త రాజ‌కీయ నాయ‌కులు పుట్టుకొచ్చేలా  తెలుస్తోంది.ఇక ఏప్రిల్ 25న ఎందుకు? ఈ ముహుర్తం  ఖ‌రారు చేయ‌డం వెనక ఉన్న ఉద్దేశ‌మేంటో ప‌రిశీలిస్తే.. కొన్ని జ్యోతిష శాస్త్ర ప‌ర‌మైన అంశాలు ఇందులో దాగి  ఉన్నట్టు స‌మాచారం. ఏప్రిల్ ఇర‌వై ఐదున రాజ‌యోగాన్నిచ్చే గ్ర‌హ‌గ‌తుల సంచారం  క‌నిపిస్తోందని అంటారు పండితులు. కొత్త  ప‌నులు ప్రారంభించ‌డానికి  ఇది సుదినంగా  చెబుతున్నారు.  దానికి తోడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వానికి కూడా ఈ తేదీతో కొంత సంబంధ‌ముంది. పాతికేళ్ల క్రితం కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్రారంభించారు క‌విత తండ్రి కేసీఆర్. అదే తేదీకి అటు ఇటుగా తెలంగాణ ప్ర‌జా జాగృతి ప్రారంభిస్తున్నారు కేసీఆర్ త‌న‌య‌ క‌విత‌. ఆ పార్టీ  ఆనాడు ఎంతగా ఎదిగిందో, త‌న పార్టీ  కూడా అంతేలా  ఎదుగుతుంద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు క‌విత‌. ఉగాది త‌ర్వాత వ‌చ్చే శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల అనంత‌రం త‌న పార్టీ  జెండా ఎగుర‌వేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌వ‌చ్చ‌న్న  న‌మ్మ‌కాలు కూడా క‌విత‌కు ఉన్న‌ట్టు స‌మాచారం.  బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు అన్యాయం జ‌రిగింది. అలాంటి వారికి త‌మ పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాన‌ని అంటున్నారు క‌విత‌. ఇక చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా సాధికార‌త‌ను తీసుకొచ్చేలా 33 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు కూడా ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ప్ర‌త్యేకించీ యువ‌త కోసం ఉద్యోగ నోటిఫికేష‌న్లు.. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం కూడా క‌విత త‌న విధానంగా  చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌విత  పార్టీ ఎఫెక్ట్ ఎంత‌?  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి దీటుగా ఆమె పార్టీ టీపీజే  ఎదిగే అవ‌కాశం ఎంత‌? ద‌క్షిణాది నుంచి జ‌య త‌ర్వాత ఆ స్థాయిలో ఒక మ‌హిళ‌గా ఆమె రాజ‌కీయంగా ఎదిగి సీఎం కాగ‌ల‌రా?  తేలాల్సి ఉంది.
  తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా పార్టీగా నామకరణం చేసిన నూతన పార్టీని ఏప్రిల్ 25 తేదీన ఉదయం 10గం.లకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్‌లోని మునిరాబాద్‌లో పార్టీ ప్రకటిస్తానని, అదే రోజు పార్టీ జెండా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తం ఉందన్నారు.  రాముని ఆశీర్వాదంతో పార్టీ ప్రకటన తేదీని నిర్ణయించామని ముహుర్తాలపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. వారణాసి వెళ్లి గంగా స్నానం చేసి పార్టీ నీ లంచ్ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు స్పష్టం చేశారు.  వాస్తవానికి ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందు పార్టీని, జెండాను ఆవిష్కరించనున్నట్లు కవిత ప్రకటించడం విశేషం. ఏఏ అంశాలపై కొత్త పార్టీ పోరాటం చేయాలో తమ దృష్టికి తీసుకురావాలని కవిత శ్రీరామ నవమి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందంటున్న కవిత, తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత  ఉద్యోగాల కోసం వేచి చూడాల్సి వస్తోందని పరోక్షంగా బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.  తమ కొత్తపార్టీ ద్వారా యువత కోసం ఏం చేయబోతున్నామో చెబుతామని. యువత, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కవిత వెల్లడించారు.  జాగృతి సంస్థ ద్వారా బీసీలు, దళితుల హక్కుల కోసం పోరాటం చేశామని,  పార్టీ ఆవిర్భావం నాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు,యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత కోరారు.  మొత్తానికి తెలంగాణ జాగృతి సంస్ధ...రాజకీయ పార్టీగా మారబోతుందిప్పుడు. తమ పార్టీ ఎవరికీ బీ పార్టీ కాదని ....తమది నెంబర్ వన్ పార్టీగా ఉండబోతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. కొత్త పార్గీ నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో సలహాలు ఇవ్వాలని ,   అందుకోసం ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేస్తామని, అలాగే మెయిల్‌కి మేసేజ్ చేయవచ్చన్నారు. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత,  అప్పటిలోగా.. అంటే రానున్న 28 రోజుల్లో ప్రతి ఒక్కరినీ కలుస్తానని ప్రకటించారు.. తెలంగాణ ఉద్యమకారులు, యువత, మహిళలు, మెథావులు, కవులు, పాత్రికేయులు అందరితో చర్చిస్తామన్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్రగడ పద్మనాభరెడ్డితో భేటీ అయ్యారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం కిర్లంపూడి చేరుకున్న అంబటి నేరుగా ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో  రాజకీయ పరిస్థితులపై వారిరువురూ చర్చించారని తెలుస్తోంది. భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.   అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఈ సందర్భంగా అంబటి విమర్శలు గుప్పించారు.   గతంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులు ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో అలాగే ఇప్పుడు వైసీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీరును  తప్పుపట్టిన అంబటి రాంబాబు.. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు తగ్గేదేలే అంటూ పుష్పసినిమా స్టైల్ లో చెప్పారు.   వైఎస్సార్సీపీ తరపున, తన సామాజికవర్గం తరపున పోరాడుతూనే ఉంటానన్నారు. ప్రభుత్వ అణిచివేత ధోరణిని ప్రజలంతా గమనిస్తున్నారని అంబటి రాంబాబు చెప్పారు.   
  తెలుగువన్ ‘వాస్తవ వేదిక’  సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత జగన్ కమ్మ, కాపు కులాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలపై కంఠంనేని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, రాజకీయాల్లో ఓటమి చెందిన నేతలు మళ్లీ ప్రయత్నించడం సహజమని అన్నారు. వైసీపీ హయాంలో కుల ద్వేషం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కుల ప్రభావం ఎప్పటినుంచో ఉన్నదని, అయితే జగన్ ఐదేళ్ల పాలనలో అహంకారం మితిమీరిందని విమర్శించారు. కుల రాజకీయాలు ఉన్మాద స్థాయికి చేరి ఇతర కులాలపై విమర్శలు చేయించారని అన్నారు.దీనికి ప్రతిస్పందించిన రవిశంకర్, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై దాడులు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. ఈ విధానం వల్లే జగన్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయని, అనవసరంగా శత్రువులను సృష్టించుకున్నారని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇదే కారణంగా వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కుల రాజకీయాలు తక్కువగా ఉంటాయని, జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల్లో కుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. కుల అభిమానం వేరు, కుల ద్వేషం వేరు అని, ప్రతి ఒక్కరూ తమ కులాన్ని గౌరవించుకోవచ్చు కానీ ఇతర కులాలను ద్వేషించకూడదని సూచించారు. అమరావతి విషయంలో కూడా అన్ని కులాల ప్రజలు భూములు ఇచ్చారని, ఎస్సీ, బీసీ, ఓసీ అన్న తేడా లేకుండా అందరూ భాగస్వాములయ్యారని రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం నగరాల్లో కులం కంటే ఆర్థిక స్థితి ప్రభావం ఎక్కువగా ఉందని, డబ్బు ఉంటే కుల భేదాలు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించారు.ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.  
  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఎన్నికల బరిలోకి దిగుతూ తమ అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 23 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి  ప్రకటించారు. ఈ జాబితాలో అనుభవజ్ఞులైన నేతలకు, ముఖ్యంగా మాజీ మంత్రులకు పార్టీ పెద్దపీట వేయడం గమనార్హం. ఈ తొలి జాబితాలో పార్టీ అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత గడ్డ అయిన 'ఎడప్పాడి' నియోజకవర్గం నుంచే మళ్ళీ పోటీ చేయనున్నారు. ప్రకటించిన 23 మంది అభ్యర్థులలో ఏకంగా 21 మంది మాజీ మంత్రులు ఉండటం విశేషం. తమకున్న అనుభవం, నియోజకవర్గాలపై పట్టును దృష్టిలో ఉంచుకుని పాత వారికే ఈపీఎస్ మొగ్గు చూపారు. డీ జయకుమార్ రాయపురం నుండి, సీవీ షణ్ముగం మైలం నుండి, ఎస్పీ వేలుమణి తొండముత్తూరు నుండి బరిలోకి దిగుతున్నారు. ముఖ్య నేతల విషయానికి వస్తే.. కేపీ మునుసామి వేపనహళ్లి నుంచి, దిండిగల్ శ్రీనివాసన్ దిండిగల్ నుంచి, నథమ్ విశ్వనాథన్ నథమ్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ మంత్రులు సెల్లూరు రాజు (మదురై వెస్ట్), సి. విజయభాస్కర్ (విరాలిమలై), ఓఎస్ మణియన్ (వేదారణ్యం) తమ పాత నియోజకవర్గాల నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెజారిటీ నేతలు తమ పాత స్థానాల్లోనే కొనసాగుతుండగా, ముగ్గురు మాజీ మంత్రుల నియోజకవర్గాలను మాత్రం పార్టీ మార్చింది. కూటమి లెక్కల ప్రకారం అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే సింహభాగం స్థానాల్లో అంటే సుమారు 178 సీట్లలో పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలైన బీజేపీకి 27, పీఎంకేకు 18, ఏఎమ్ఎంకేకు 11 స్థానాలను కేటాయించారు. డీఎంకే కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు పళనిస్వామి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ మార్చి 30 నుంచి ప్రారంభం కానుండటంతో, మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపికను పార్టీ వేగవంతం చేసింది. మరో రెండు రోజుల్లో రెండో జాబితా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రులపై భారం వేసిన అన్నాడీఎంకే, ఈసారి అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉంది.మే 4వ తేదీన వెలువడే ఫలితాలు తమిళనాడులో ఎవరికి పట్టం కడతాయో వేచి చూడాలి. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని అప్పుడే మొదలుపెట్టేశారు.  
ALSO ON TELUGUONE N E W S
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్-2' హవా కొనసాగుతోంది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల తాకిడి లేదు. చిన్న సినిమాలే విడుదలయ్యాయి. దాదాపు ఆ సినిమాలన్నీ పరవాలేదనే టాక్ కే పరిమితమయ్యాయి. ఈ వారం బ్యాండ్ మేళం, సుయోధనతో పాటు డబ్బింగ్ సినిమాలు యూత్, హ్యాపీ రాజ్ థియేటర్లలో అడుగుపెట్టాయి. వీటిలో సుయోధన సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, మిగతా మూడు సినిమాలు రొమాంటిక్ డ్రామా జానర్ లోనే రూపొందడం విశేషం     ఓటీటీలో మాత్రం జానర్లలో పలు సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. ఓటీటీలో సందడి చేస్తున్న సినిమా/సిరీస్‌లు: హే బల్‌వంత్‌ (Hey Balwanth) - ZEE5: సుహాస్, నరేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కామెడీ డ్రామా మార్చి 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రి నడిపే బిజినెస్ వెనుక ఉన్న అసలు రహస్యం కొడుకుకు తెలిస్తే ఏం జరుగుతుందనేదే ఈ కథ. సంప్రదాయని సుప్పిణి సుద్దపూసని - ETV Win: శివాజీ, లయ జంటగా నటించిన ఈ క్రైమ్ కామెడీ డ్రామా మార్చి 26 నుండి అందుబాటులోకి వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ చాలా కాలం తర్వాత మళ్ళీ రిపీట్ కావడం విశేషం. ముత్తు అలియాస్ కాట్టాన్ (Muthu Alias Kaattan) - JioHotstar: విజయ్ సేతుపతి నటించిన ఈ పక్కా విలేజ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా మార్చి 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. డేర్ డెవిల్: బోర్న్ ఎగైన్ సీజన్ 2 - JioHotstar: మార్వెల్ ఫ్యాన్స్ కోసం ఈ పాపులర్ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. వలతు వశతే కల్లన్ (Manorama Max): ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మలయాళ డబ్బింగ్ మూవీ థ్రిల్లర్ లవర్స్ కు బెస్ట్ ఛాయిస్. రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ (Netflix): పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాణి ముఖర్జీ, మరోసారి శివానీ శివాజీ రాయ్ పాత్రలో ‘మర్దానీ 3’ తో అలరించేందుకు వచ్చేశారు. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మూడు నెలల కాలంలోనే 93 మంది అమ్మాయిలు మిస్ అయిన కేసును శివానీ ఎలా చేధించింది? హ్యూమన్ ట్రాఫికింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సాగుతుంది. షాహిద్ కపూర్ ‘ఓ రోమియో’ (Amazon Prime Video): షాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం ‘ఓ రోమియో’. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. 1990ల నాటి ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్‌లో షాహిద్ కపూర్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే మహిళగా త్రిప్తి డిమ్రి నటించింది.  మొత్తానికి ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడి ఉంటే, ఓటీటీలో మాత్రం పలు సినిమాలు, సిరీస్ లతో మెగా జాతర కనిపిస్తోంది. సస్పెన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా ప్రతి జానర్ లోనూ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.  
  -బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ చిత్రంతో బిజీ  -ఈ సారి రికార్డులు సృష్టించడమే లక్ష్యం  -బాలయ్య వీడియో వైరల్  గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna) అఖండ 2(Akhanda 2)తో ఆగిపోయిన రికార్డులని తిరిగి సెట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే గోపీచంద్ మలినేని(Gopinchand Malineni)మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. రీసెంట్ గా బాలకృష్ణ ఢిల్లీలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ' కార్యక్రమంలో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లోనే బాలకృష్ణ చేసిన ఒక పనితో బాలయ్య మనస్తత్వం ఎలా ఉంటుందో బయటపడింది. అభిమానులు అయితే మా బాలయ్య సీనియర్ నటీమణులకి ఇచ్చే గౌరవంతో మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారని కొనియాడుతున్నారు. మరి పూర్తి మ్యాటర్  ఏంటో చూద్దాం. బాలకృష్ణ ఈవెంట్ కి హాజరైన సమయంలో అలనాటి అందాల లెజండ్రీ నటీమణి హేమమాలిని గారు కూడా ఈవెంట్ ప్రాంగణంలోకి వచ్చారు. ఆ సమయంలో హేమ మాలిని గారిని బాలకృష్ణ చూసి ఆమె పాదాలకి నమస్కరించాడు. దీంతో హేమమాలిని(Hemamalini)గారు బాలకృష్ణని ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో లేటుగా అయినా బయటకొచ్చి లేటెస్ట్ గా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. Also read: Samantha: మహిళలంటే చిన్నచూపు, సమానత్వం లేదు..  క్షమాపణలు చెబుతున్నాం హేమమాలిని గారు బాలీవుడ్ ని 70 ,80 ,90 వ దశకంలో చెడుగుడు ఆడుకుంది. ఆమె అందానికి, అంతకంటే అందమైన పెర్ఫార్మ్ కి అభిమాని కానీ వాడు భారతీయ సినీ ప్రేమికుడే కాదనే టాక్ కూడా నడిచింది. మరి ఈ లెక్కన  బాలకృష్ణ కూడా అభిమాని అయ్యి ఉంటాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇదే ఈవెంట్ లో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని హేమామాలినితో పాటు ఆమె భర్త లెజెండ్రీ హీరో ధర్మేంద్ర కి కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.     
మలయాళ ఇండస్ట్రీలో ‘థ్రిల్లర్ సినిమాల కింగ్’గా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph). ముఖ్యంగా 'దృశ్యం' ఫ్రాంచైజ్ ఆయనకు నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆలాంటి జీతూ జోసెఫ్ నుంచి వచ్చిన మరో ఆసక్తికర క్రైమ్ థ్రిల్లర్ ‘వలతు వశతే కల్లన్’ (Valathu Vashathe Kallan).  బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జనవరి 30న థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేస్తోంది. ఈరోజు(మార్చి 27) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మనోరమ మాక్స్, లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. కథ ఏంటంటే.. ఆంటోనీ జేవియర్ (బిజు మీనన్) ఒక అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్. తన వృత్తిలో ఎన్నో అక్రమాలకు పాల్పడుతుంటాడు. మరోవైపు సామ్యూల్ జోసెఫ్ (జోజు జార్జ్) తన కూతురు ఐరీన్‌తో ఎంతో సంతోషంగా గడుపుతుంటాడు. అయితే ఒకరోజు ఐరీన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది, ఆ తర్వాత ఆమె శవమై కనిపిస్తుంది. ఈ కేసు ఆంటోనీ దగ్గరికి వస్తుంది, కానీ అతని ఇన్వెస్టిగేషన్ తీరుపై సామ్యూల్‌కు అనుమానం కలుగుతుంది. తన కూతురి మరణానికి ఆంటోనీకి ఏదో సంబంధం ఉందని భావించిన సామ్యూల్, అతన్ని చిక్కుల్లో పడేయడానికి ఒక పక్కా ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో ఆంటోనీ కొడుకు ఫిలిప్ (కె.ఆర్. గోకుల్) ఈ గొడవలోకి ఎలా వచ్చాడు? ఆంటోనీ తన కొడుకుని ఎలా కాపాడుకున్నాడు? అసలు సామ్యూల్ మరణానికి కారణమేంటి? అనేదే మిగిలిన కథ. జీతూ జోసెఫ్ మార్క్ సస్పెన్స్ జీతూ జోసెఫ్ అంటేనే స్క్రీన్‌ప్లే మ్యాజిక్. ‘దృశ్యం’ సిరీస్‌తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈ సినిమాలో కూడా ‘పేరెంటింగ్’ అనే పాయింట్‌ను థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు జోడించాడు. దీను థామస్ ఈలన్ అందించిన కథకు జీతూ జోసెఫ్ తనదైన శైలిలో మెరుగులు దిద్దాడు. ఒక తండ్రి తన బిడ్డ కోసం ఎంత దూరం వెళ్తాడు? ఒక తండ్రి తప్పులు తన బిడ్డ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అనే అంశాలను ఇందులో చర్చించారు. ఇక టాలెంటెడ్ యాక్టర్స్ బిజు మీనన్, జోజు జార్జ్ ఎదురు పడే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో లేనా, నిరంజన అనూప్, లియోనా లిషోయ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ‘ఆడుజీవితం’ సినిమాతో మెప్పించిన కె.ఆర్. గోకుల్ ఇందులో పోలీస్ ఆఫీసర్ కొడుకుగా నటించాడు. విష్ణు శ్యామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయింది.  క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి, ముఖ్యంగా ‘దృశ్యం’ తరహా మైండ్ గేమ్స్ ఆశించే వారికి ఈ వీకెండ్ లో ‘వలతు వశతే కల్లన్’ ఒక మంచి ఛాయిస్.  
    -సమంత స్పీచ్ వైరల్  -మన శక్తీ మనకి తెలియడం లేదు  -రాజ్ నిడిమోరు  ప్రస్తుతం ఏం చేస్తున్నాడు సినిమా అనే బలమైన ఆయుధం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్థానాన్ని పొందిన సమంత(Samantha)కొన్ని నెలల క్రితం దర్శకుడు 'రాజ్ నిడిమోరు'(Raj Nidimoru)ని పెళ్లి చేసుకొని లైఫ్ లో కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ తో జీవితం బాగుందని ఇప్పటికే చాలా సార్లు వెల్లడి చేసిన సమంత రీసెంట్ గా సినిమా వార్తలని ప్రచురించే ప్రముఖ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'(The Hollywood reporter India)ఏర్పాటు చేసిన ఉమెన్ ఇన్ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమంలో పాల్గొంది. సదరు కార్యక్రమంలో సమంత చెప్పిన మాటలు ఇప్పుడు తెలుగుతో పాటు సౌత్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి తను ఏం మాట్లాడిందో చూద్దాం. సమంత మాట్లాడుతు మహిళా క్యారెక్టర్స్ కేవలం హీరోకు మద్దతుగానో, ప్రేరణ ఇచ్చే వాటిగానే  పరిమితం కాకుండా, నిజ జీవితంలోని క్లిష్టమైన మనస్తత్వాలను ప్రతిబింబించేలా ఉండాలి. షూటింగ్ లొకేషన్లలో మహిళా కళాకారుల భద్రత ఒక చర్చాంశం కాకూడదు. ఇండస్ట్రీలో అదొక అత్యంత ఖచ్చితత్వంగా ఉండాలి. మహిళా ప్రధాన చిత్రాలని ఫీమేల్ లీడ్ క్యారక్టర్ లో చూడకుండా వాటిని కూడా కథలాగే పరిగణించే రోజు రావాలి. మహిళలు ఎవరి ప్రశంస కోసమో వేచి చూడకుండా తమ ప్రతిభతో సంపాదించుకున్న గౌరవాన్ని గర్వంగా స్వీకరించాలి. తమ హక్కుల కోసం నిరంతరం పోరాడటం కంటే, ఆ హక్కులని  స్వేచ్ఛగా అనుభవించే స్థితికి రావాలి. మనం ఇతరుల కోసం మన షెడ్యూళ్లని, అభిప్రాయాలని మార్చుకోవడమే కాకుండా, మన లక్ష్యాలను కూడా త్యాగం చేస్తున్నాం. విచారకరమైన విషయం ఏమిటంటే, మనం చేసేది  త్యాగం అని కూడా గుర్తించలేనంతగా అలవాటు పడిపోయాం. పురుషుల కంటే మనమే  పదిరెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతున్నాం. భవిష్యత్తులో సినిమాలని చూసే ధోరణిలో మార్పు రావాలని సమంత చెప్పుకొచ్చింది. Also read: Happy raj Movie Review: హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ  ఇక సమంత సినీజర్నీని చూసుకుంటే సొంత సంస్థలోనే 'మా ఇంటి బంగారం' చేస్తుంది. కొత్త షెడ్యూల్ త్వరలోనే స్టార్ కానున్నట్టుగా తెలుస్తుండగా సమంత లీడ్ రోల్. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ కూడా సమంత చేస్తున్నట్టుగా టాక్. ఆ ఇద్దరి పరిచయం కూడా ఫామిలీ మెన్ వెబ్ సిరీస్ లోనే ఏర్పడిన విషయం తెలిసిందే.    
నార్త్ తో పాటు సౌత్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'దో దీవానే షహర్ మే'. విభిన్న ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం త్వరలో స్ట్రీమింగ్ కానుంది. (Do Deewane Seher Mein) ఈ చిత్ర కథాంశం ఒక మెట్రో సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. నేటి తరం యువతలో ఉండే ఇన్ సెక్యూరిటీస్, కెరీర్ ఒత్తిళ్లు, నిజమైన ప్రేమ కోసం వారు పడే తపనను దర్శకుడు రవి ఉద్యావర్ చాలా సహజంగా చూపించాడు. సిద్ధాంత్ చతుర్వేది ఇందులో ఒక అమాయకమైన, నత్తి సమస్యతో ఇబ్బంది పడే యువకుడి పాత్రలో అద్భుతంగా నటించాడు.  మృణాల్ ఠాకూర్ తనదైన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది తొలిసారి జంటగా నటించినప్పటికీ, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరాయి.  జీ స్టూడియోస్ తో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఈ మూవీ ఓటీటీ విడుదల ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి రానుంది. థియేటర్లలో కంటే ఓటీటీలో ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీలకు ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతారు. పైగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో రొమాంటిక్ డ్రామాలకు మంచి ఆదరణ ఉండటంతో, 'దో దీవానే షహర్ మే' కచ్చితంగా మంచి వ్యూయర్ షిప్‌ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.  కథేంటంటే.. శశాంక్ (సిద్ధాంత్ చతుర్వేది) ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. అతను తెలివైన వాడైనప్పటికీ, నత్తి సమస్యతో బాధపడుతుంటాడు. దాంతో పబ్లిక్ లో మాట్లాడటానికి  కూడా భయపడుతుంటాడు. మరోవైపు రోష్ని (మృణాల్ ఠాకూర్) ఒక కంటెంట్ క్రియేటర్. ఆమెలో కూడా తాను అందంగా లేనని ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది. అలాంటి వీరిద్దరూ కలుస్తారు. వీరి ప్రేమ కథ ఏంటి? ఆ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కిందా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక 'ఎన్టీఆర్ జాతీయ అవార్డు'ను అందుకున్న ఆయన, ఆ అవార్డుతో పాటు వచ్చిన రూ.10 లక్షల నగదు బహుమతిని పూర్తిగా సేవా సంస్థలకు విరాళంగా అందించారు. తన కుమారుడు రామ్ చరణ్(Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఈ విరాళాలను అందించడం విశేషం. సాధారణంగా సెలబ్రిటీల పుట్టినరోజులు అంటే ఆర్భాటాలు, వేడుకలు ఉంటాయి. కానీ చిరంజీవి మాత్రం చరణ్ పుట్టినరోజును ఐదు విభిన్న సేవా సంస్థలకు అండగా నిలబడటం ద్వారా సెలబ్రేట్ చేశారు.  సర్వ్ ఫౌండేషన్: వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వాళ్ళ అవసరాల కోసం చిరంజీవి విరాళం అందించారు. గతంలో 'గేమ్ చేంజర్' షూటింగ్ సమయంలో చరణ్‌ను కలిసిన వృద్ధులు, ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వారి కోరిక మేరకు 30 మంది వృద్ధులను బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు పెట్టి, విందు భోజనం ఏర్పాటు చేశారు. దేవ్నార్ ఫౌండేషన్: అంధుల సాధికారత కోసం కృషి చేస్తున్న ఈ సంస్థకు మెగాస్టార్ ఆర్థిక సాయం అందించారు. వాల్మీకి & నయశ్రీ ఫౌండేషన్లు: అనాథ పిల్లల సంరక్షణ, విద్యావకాశాల కోసం ఈ రెండు సంస్థలకు విరాళాలు అందజేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి: క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒక చిన్నారి చికిత్స నిమిత్తం చిరంజీవి విరాళం అందించారు.  రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేసిన ఈ సేవా కార్యక్రమాలపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  ప్రస్తుతం చిరంజీవి కెరీర్ పరంగా కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే, 'విశ్వంభర' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.  
  -సినిమా పేరు: హ్యాపీ రాజ్   -న‌టీన‌టులు: జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీప్రియ, అబ్బాస్, జార్జ్ మర్యన్, గీతా కైలాసం  త‌దిత‌రులు  -సినిమాటోగ్ర‌ఫీ:  మదన్ క్రిస్టోపర్ -ఎడిటింగ్: సెల్వ ఆర్ కే మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్  -నిర్మాత‌: జయవర్ద్   -బ్యానర్:  బియాండ్ పిక్చర్స్  -రచన,దర్శకత్వం: మరియ రాజా -రిలీజ్ డేట్ : మార్చి 27, 2026  మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే జివి ప్రకాష్ కుమార్(G.v Prakash kumar)మరోసారి హీరోగా సెల్యులాయిడ్ పై ఈ రోజు 'హ్యాపీరాజ్'(Happy Raj)తో అడుగుపెట్టాడు. రొమాంటిక్ డ్రామా కావడం, ప్రచార చిత్రాలతో హైప్ తో పాటు ప్రకాష్ కుమార్ కి  తెలుగమ్మాయి మాడ్ బ్యూటీ శ్రీ గౌరీప్రియ(Sri Gouri Priya)జత కట్టడం హ్యాపీ రాజ్ స్పెషల్. మరి మూవీ హ్యాపీని ఇచ్చిందా లేదా చూద్దాం  కథ రాజ్ ఉరఫ్ హ్యాపీరాజ్(జీవీ ప్రకాష్‌) మధ్యతరగతికి చెందిన యువకుడు. ప్రతి రోజు లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే మెంటాలిటీ. అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కొంత మంది కనెక్ట్ అయినా తన తండ్రి ముత్తు వల్ల (జార్జ్ మరియన్‌) పెళ్ళికి ఒప్పుకోరు. దాంతో తన తండ్రికి దూరంగా బెంగుళూరు వెళ్లి సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ లో చేరతాడు. టీమ్‌ మేనేజర్ కావ్య( శ్రీ గౌరీ ప్రియ)ని చూసి ఇష్టపడతాడు.  కావ్య కూడా రాజ్ ని ఇష్టపడుతుంది. కావ్య తండ్రి రాజేశ్(అబ్బాస్) రిచ్ పర్సన్. ప్రతి విషయంలోను స్టిట్ గా ఉండే వ్యక్తి. రాజ్, కావ్య పెళ్ళికి  ఒప్పుకొని రాజ్ తో తన తల్లితండ్రులని తీసుకొని రమ్మంటాడు. దీంతో రాజ్ లో టెన్షన్ మొదలవుతుంది. తండ్రి వల్ల రాజ్ కి టెన్షన్ ఎందుకు? ముత్తు ఎవరు? ముత్తు వల్ల ఎందుకు పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతున్నాయి? ముత్తుకి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? రాజ్, కావ్య చివరకి ఒక్కటయ్యారా లేదా? అనేదే హ్యాపీ రాజ్  ఎనాలసిస్  ఇలాంటి కథల్ని హీరోలు, మేకర్స్ ఓకే అనుకొని సెల్యులాయిడ్ పైకి రావాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. ఓల్డ్ ఫార్మేట్ కథ. తండ్రి వల్ల ప్రాబ్లమ్ అనేది కొంచం కొత్తగా ఉన్నా ఆ పాయింట్ కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పైగా ఓకే పాయింట్ పై కథనం నడుస్తుంది.   ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ప్రారంభంలోనే రాజ్ లవ్‌ ఫెయిల్యూర్‌ అవ్వడం.. అందుకు తండ్రి కారణం అని చెప్పడంతో కొంచం ఇంట్రెస్ట్ గానే సాగింది. ఇక ఆ తర్వాత వెళ్లే కొద్దీ రొటీన్ సీన్స్. రాజ్ సీన్స్ లో ఓవర్ డోస్ ఎక్కువ అయినట్టుగా అనిపించినా ముత్తు సీన్స్ నవ్వులు పూయించాయి. కథ బెంగుళూరుకి రాగానే కొంచం ఫ్రెష్ నెస్ వచ్చింది. కావ్య, రాజ్ మధ్య లవ్ సీన్స్ బాగున్నాయి. కావ్య తండ్రి రాజేష్ తో వచ్చిన సీన్స్ కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ పెద్దగా పేలింది లేదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బెటర్ అనేలా సాగింది. సారీ చెప్పించడం చుట్టూనే కథ మొత్తం రన్ అయ్యింది. పైగా ఓవర్  డ్రామా. ఎంటర్ టైన్ మెంట్ కూడా వర్కౌట్‌ కాలేదు. క్లైమాక్స్ తో పాటు   రాజ్ తన తండ్రి గొప్పతనం చెప్పే సీన్లు  గుండెని బరువెక్కిస్తాయి. ఈ క్లైమాక్స్ నే హ్యాపీ రాజ్ ని కొంత వరకు కాపాడాయి. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు హ్యాపీ రాజ్‌గా జీవీ ప్రకాష్‌ పెర్ఫార్మ్ సూపర్. ఆల్ వేరియేషన్స్ లోను టెంపో అనేది తగ్గకుండా మెస్మరైజ్ చేసి పడేసాడు. ముత్తుగా అలియాస్ గుర్రం గుడ్డుగా జార్జ్ మారియన్‌ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఒక పది ఆఫర్స్ మారియన్ కి వచ్చేంతలా సమ్మోహన పరిచాడు. కావ్యగా శ్రీ గౌరీప్రియ మరో సారి తన క్యూట్ అండ్ సింపుల్ పెర్ఫార్మ్ తో ఆకట్టుకుంది. అబ్బాస్‌ చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించి తన క్యారక్టర్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసాడు. మంచి కమ్‌ బ్యాక్‌ మూవీతో పాటు ఫాదర్ రోల్స్ లో బిజీ అవ్వడం ఖాయం. గీతా కైలాసంతో పాటు మిగిలిన ఆర్టిస్ట్ కూడా తమ రోల్స్ కి న్యాయం చేసారు. జస్టిన్‌ నుంచి వచ్చిన సాంగ్స్ తో పాటు బిజీఎం వర్క్ అవుట్ కాలేదు. మధన్‌ క్రిస్టోఫర్‌ ఫొటోగ్రఫీ   బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్. మరియా రాజా(Maria Raja) దర్శకుడిగా సక్సెస్ అయినా రచయితగా మెప్పించలేకపోయాడు.  బలాలు  ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్  ఎమోషనల్‌ సీన్స్  క్లైమాక్స్ ఎపిసోడ్  బలహీనతలు  కథ  కథనం  సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  ఎంటర్ టైన్ మెంట్ పండకపోవడం  సెకండాఫ్‌ సాగతీత  చివరిగా చెప్పాలంటే కథ, కధనం ఓల్డ్ ఫార్మేట్. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ సూపర్ rating 2.25/ 5 Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
Megastar Chiranjeevi, currently enjoying the blockbuster success of Mana Shankara Vara Prasad Garu and gearing up for multiple exciting projects, chose to celebrate his son, Mega Power Star Ram Charan’s birthday in a truly meaningful way. Recently honoured with the NTR Award by the Telangana Government, along with a cash prize of 10 lakh, Chiranjeevi donated the entire amount to five philanthropic organizations that align with his long-standing mission of social welfare. Chiranjeevi contributed to the Serve Foundation to support their daily needs. This gesture carried emotional significance, as the elderly residents were eager to celebrate Charan’s birthday after meeting him during the shooting of Game Changer. Fulfilling their wish, Chiranjeevi invited 30 residents to the Blood Bank, gifted them new clothes, and hosted them for a festive meal. The Devnar Foundation for the Blind received support for its relentless efforts in empowering visually impaired individuals, while the Valmiki Foundation and Nayasree Foundation were assisted in strengthening their care for orphaned children. Each contribution reinforced Chiranjeevi’s belief that true greatness lies in uplifting those who need it most. Adding another layer of compassion to the occasion, Chiranjeevi also donated to the Basavatarakam Indo-American Cancer Hospital, specifically to aid the treatment of a young girl bravely battling cancer. This gesture highlighted his enduring commitment to healthcare and to families navigating their most challenging moments. By turning a personal celebration into an opportunity for collective well-being, Chiranjeevi once again showed that birthdays are not just about receiving joy, but sharing it.
గ్లోబల్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’(Spider-Man: Brand New Day) ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ రికార్డు స్పష్టం చేస్తోంది. ట్రైలర్‌కు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం 'స్పైడర్ మ్యాన్' పట్ల ఉన్న గ్లోబల్ మేనియాకు నిదర్శనం అని చెప్పవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ప్రస్తుతం ఈ ట్రైలర్ చర్చలతోనే హోరెత్తుతున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో మోస్ట్ అవేటెడ్ మూవీగా వస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’కు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకుడు. ఈ చిత్రంలో టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించనున్నాడు. అతనితో జోడీగా జెండయా నటిస్తుండగా, జాకబ్ బాటలన్, సాడీ సింక్, జాన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోనీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే', 2026 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. 
Building on Spider-Man's enduring global legacy, Brand New Day is already making history before it even hits theatres. The film's trailer surpassed 1 billion views within days of its debut, an unprecedented milestone in cinematic history, underscoring the franchise's unmatched worldwide fanbase and the extraordinary anticipation surrounding this new chapter. For decades, Spider-Man has stood as one of the most beloved superheroes across generations, continuously evolving in storytelling, scale, and cultural resonance. Spider-Man: Brand New Day promises to honour that legacy while boldly charting new territory — and the world is already watching. Directed by Destin Daniel Cretton, Tom Holland returns as Spider-Man alongside Zendaya, Jacob Batalon, Sadie Sink, Jon Bernthal, Mark Ruffalo, Michael Mando and Tramell Tillman in pivotal roles. Produced by Sony Pictures Entertainment India, Spider-Man: Brand New Day swings into theatres on 31st July 2026 in English, Hindi, Tamil, Telugu, Kannada, and Malayalam across all premium formats.
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
  ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు.. ఇలా సంతోషంగా ఉండటానికి చేయాల్సినవన్నీ చేస్తారు. కానీ ఇన్నిచేసినా సరే.. కొందరు సంతోషంగా ఉండరు.  ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మంది ఆలోచించరు.  కేవలం అసంతృప్తి దగ్గరే ఆగిపోతారు.  కానీ క్షుణ్ణంగా గమనిస్తే.. ఒక వ్యక్తి చుట్టూ ఎన్ని సౌకర్యాలు, ఎన్ని సంతోషపెట్టే విషయాలు ఉన్నా ఆ వ్యక్తి సంతోషంగా ఉండటం లేదంటే.. ఆ వ్యక్తి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులే కారణం అయ్యే అవకాశం ఉంటుంది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే ఓర్వలేని వ్యక్తులు కొందరు ఉంటారు.  ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సంతోషాన్ని చెదపురుగుల్లా తినేస్తుంటారు.  పైశాచిక ఆనందాన్ని లోలోపలే అనుభవిస్తారు.  పక్కవాళ్ల సంతోషాన్ని నాశనం చేసే ఆ వ్యక్తులు ఎవరు?  వారి లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. ఎప్పుడూ ఏడుస్తూ కంప్లైంట్లు చేసే వ్యక్తులు.. జీవితంలో ఏ మంచినీ చూడని వాళ్ళు వీళ్ళు. వాతావరణం బాగుంటే, ఎండ వేడిమి గురించి ఫిర్యాదు చేస్తారు. మంచి ఉద్యోగం వస్తే, తమ బాస్‌ను విమర్శిస్తారు. వారి దృక్పథం ఎంత ప్రతికూలంగా ఉంటుందంటే, వారి పక్కన కూర్చోవడం కూడా  మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సానుకూల శక్తిని హరించివేస్తారు. వీరికి దూరంగా ఉండటమే ఉత్తమం. స్వప్రయోజనాలు చూసుకునేవారు.. స్నేహితులలో, బంధువులలో చాలామంది స్వార్థంగా ఉంటారు.  మాట్లాడి చాలా  రోజులు అయింది అంటూ మాటలు కలిపి తమ స్వప్రయోజనాల కోసం సహాయం అడుగుతుంటారు.  ఇలాంటి వారు ప్రతి ఒక్కరి సర్కిల్లో ఉంటారు.వీళ్ళు కేవలం తమకు సహాయం కావాలన్నా లేదా ఏదైనా పని చేయించుకోవాలన్నా మాత్రమే ఎదుటి వ్యక్తిని గుర్తు చేసుకుంటారు. పని పూర్తయిన వెంటనే మాయమైపోతారు. ఇలాంటి స్వార్థపరులు  ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు. చాడీలు చెప్పేవారు.. ఒకరి గురించి ఇంకొకరు దగ్గర చాడీలు చెప్పేవారు.. ఏదో ఒకరోజు ఎదుటి వారికి మీ గురించి చాడీలు చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.  అలాంటి వారికి నిజాయితీ ఉండదు. వారు సంబంధాలను పాడుచేయడానికి కల్పిత కథలను మాత్రమే చెబుతారు.  జీవితంలో మనశ్శాంతి కావాలంటే అలాంటి వ్యక్తులకు  దూరంగా ఉండటం మంచిది. అసూయ పరులు.. మీరు సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేవాడే నిజమైన స్నేహితుడు. అయితే, కొంతమంది మీతో చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తారు, కానీ రహస్యంగా మీ పురోగతిని చూసి అసూయపడతారు. మీరు కొత్త కారు కొన్నా, పదోన్నతి పొందినా, వారు మిమ్మల్ని అభినందిస్తారు, కానీ వారి కళ్ళలో, మాటల్లో ఒక వింతైన అసూయ  స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి అసూయపడే వ్యక్తులు మీ మంచిని ఎప్పటికీ కోరుకోలేరు. నిరాశ పరిచేవారు.. నువ్వు చేయలేవు.. నీకు చేతకాద.. నీకు సాధ్యం కాదు.. నువ్వు ఫెయిల్ అవుతావు.. వంటి మాటలు చెప్పే వ్యక్తులే మీ కలలకు, ధైర్యానికి అతిపెద్ద శత్రువులు. మీరు ఏదైనా కొత్తగా, సానుకూలంగా చేయాలని అనుకున్నప్పుడల్లా, వాళ్ళు తమ మాటలతో మిమ్మల్ని భయపెట్టి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి, వాళ్ళ మాటలను ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయాలి. పైన చెప్పుకున్న లక్షణాలు గల వ్యక్తులు ప్రతి ఒక్కరి చుట్టూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఇలాంటి వ్యక్తుల మాటలను ఎంత తక్కువ పరిగణలోకి తీసుకుంటే అంత మంచిది. లేకపోతే సంతోషాన్ని చెదపురుగుల్లా తినేసి,  మనిషిని అశాంతికి గురిచేస్తారు.                                        *రూపశ్రీ.
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేటికాలంలో చర్మ సంరక్షణలో భాగంగా చాలా రకాల క్రీములు వాడుతూ ఉంటారు.  ఇవి కూడా మూత్రపిండాల సమస్యకు కారణం అవుతాయి అనే మాట చాలా చర్చలకు దారి తీస్తోంది.   మూత్రపిండాల సమస్యకు అసలు కారణాలు ఏంటి? మూత్రపిండాల సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. రెండు రూపాలు.. మూత్రపిండాల వ్యాధులు రెండు రూపాలలో వస్తాయి.  మధుమేహం వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి మొదటిది. 50 శాతం మందికి మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు మరొక కారణం. మూత్రపిండాల్లో రాళ్లు,  ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి ఇతర కారణాలు. జన్యుపరంగా,  ఇతర మందులు తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల వ్యాధి రావచ్చు. తాత్కాలిక,  శాశ్వత మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయి. తాత్కాలిక మూత్రపిండాల వ్యాధి.. మలేరియా, డెంగ్యూ జ్వరం లేదా లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధి వచ్చినప్పుడు,  మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ అవసరం కావచ్చు. లేదా మందులతో దీనిని నయం చేయవచ్చు. ధీర్షకాల మూత్రపిండాల వ్యాధి.. కొంతమందికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉండవచ్చు. ఇది మధుమేహం,  అధిక రక్తపోటు కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, చివరికి  డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం  ఏర్పడుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల వ్యాధికి తరచుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే చాలామంది  దానిని పట్టించుకోరు. ఏదైనా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ లక్షణం కాళ్ళలో నీరు చేరడం. ఇతర లక్షణాలలో లైట్ గా చలి, నొప్పి, జ్వరం, లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చలి,  వెన్నెముకకు ఇరువైపులా నొప్పి వంటివి  ఉంటాయి. పాదాల వాపు మూత్రపిండాల వ్యాధి లక్షణం అని ఖచ్చితంగా చెప్పలేము. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా పాదాల వాపు రావచ్చు. జీవనశైలిలో మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తినడం,  ఊబకాయం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీసే పరిస్థితులు. మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం కనిపించడం,  మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణాలే. చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో మూత్రపిండ వ్యాధులు.. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగించే క్రీములు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. వైద్యపరంగా ఉపయోగించే క్రీములు సాధారణంగా పెద్ద సమస్యలను కలిగించవు.  కానీ చాలామంది అందం మీద పిచ్చితో సోషల్ మీడియాలో కనిపించే ప్రమోషన్ యాడ్స్,  ఇంటర్నెట్ లో కనిపించే పేక్ రివ్యూస్ చూసి సొంతంగా క్రీములు ఎంచుకుని వాడుతుంటారు. అలాంటి క్రీములలో అధిక పరిమాణంలో పాదరసం ఉండవచ్చని అంటున్నారు. పాదరసానికి చర్మాన్ని తెల్లగా చేసే గుణం ఉంది. పాదరసం మూత్రపిండాలకు ప్రమాదకరమైన పదార్థం. మూత్రపిండాలకు హాని కలిగించే మరొక పదార్థం ఆర్సెనిక్. చాలా క్రీములలో వీటన్నింటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు  వాడటం వల్ల, ఇది చర్మం ద్వారా రక్తంలో కలిసి మూత్రపిండాలకు చేరి ప్రమాదం కలిగిస్తుందని పరిశీలనలలో తేలింది. వైద్య సలహా లేకుండా ఎలాంటి క్రీములు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.  చాలామంది రోడ్ సైడ్ లేదా మాల్స్,  ఆఫీసుల దగ్గర దుకాణాలలో పిచ్చి  ఆహారాలకు బదులు ఫ్రూట్ చాట్ తినడం మంచిదని అనుకుంటారు. దుకాణాలలో కూడా వివిధ రకాల పండ్లను కలిపి ప్రూట్ చాట్ గా తయారు చేసి అమ్ముతుంటారు.  ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫ్రూట్ చాట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివని అనుకుంటారు.  కానీ ఫ్రూట్ చాచ్ గురించి వైద్యులు,  ఆహార నిపుణులు దిమ్మతిరిగే నిజాలు చెబుతున్నారు.  ముఖ్యంగా వేసవిలో అందరూ ఫ్రూట్ చాట్ ఎక్కువగా తినాలని అనుకుంటారు కాబట్టి ఫ్రూట్ చాట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోవాలి.. తొక్క వల్ల కలిగే నష్టం.. చాలా వరకు ఫ్రూట్ చాట్ లో పండ్ల మీద తొక్కను తొలగించి పండ్లను ముందుగానే ముక్కలు చేసి సిద్దంగా పెట్టి ఉంటారు. కస్టమర్లు రాగానే వాటిని అందిస్తుంటారు.  పండ్ల పై తొక్క పండ్లను చెక్కు చెదరకుండా రక్షిస్తాయి.  కానీ పండ్లను తొక్క తొలగించి  కోసిన తర్వాత ఈ రక్షణ పొర తొలగిపోతుంది. పండు లోపలి భాగం నేరుగా గాలి, దుమ్ము, కాలుష్యం,  మురికి మొదలైనవాటికి గురవుతుంది. ఈ పండ్లను ఎక్కువ కాలం పాటు, ముఖ్యంగా వేడి వాతావరణంలో  వదిలేస్తే, బ్యాక్టీరియా,  ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. పరిశుభ్రత లోపించడం వల్ల రోడ్డు పక్కన పండ్లు అమ్మే చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. నిల్వ.. కోసిన పండ్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే, అవి  తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ కలుషితమైన పండ్లను తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్,  కడుపునొప్పి,  వాంతులు విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఇంట్లో  చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వంటి  బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఇలాంటి ఫ్రూట్ చాట్ లేదా ముందే ముక్కలుగా కోసిన పండ్లు ఆరోగ్యానికి మరింత హాని చేసే అవకాశం ఎక్కువ. పోషణ ఉండవు..  శరీరానికి తగినంత పోషణ అందించడానికి  పండ్లు తింటాము, కానీ పండ్లను కోసి ఎక్కువ సేపు నిల్వ ఉంచడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. గాలికి నేరుగా గురికావడం వల్ల విటమిన్ సి వంటి సున్నితమైన, ప్రయోజనకరమైన పోషకాలు క్రమంగా నశించిపోతాయి. ముందుగా కోసిన పండ్లను తినడం వల్ల  అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉండటమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందవు. ప్యాక్ చేసిన కటింగ్ ఫ్రూట్స్.. సూపర్‌మార్కెట్లలో లభించే డబ్బాలలో ప్యాక్ చేసిన కోసిన పండ్లు, విడిగా అమ్మే పండ్ల కంటే కొంచెం సురక్షితమైనవిగా పరిగణించబడవచ్చు. అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేసేటప్పుడు  జాగ్రత్తగా ఉండాలి. వాటి గడువు తేదీని,  వాటిని నిల్వ ఉంచిన ఉష్ణోగ్రతను  తనిఖీ చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే.. మార్కెట్ నుండి  తాజాగా, కోయని పండ్లనే ఇంటికి తెచ్చుకోవాలి. పండ్లను శుభ్రమైన నీటితో బాగా కడిగి, ఆ తరువాతే కోయాలి. పండ్లను కోసిన తర్వాత వాటిని ఎక్కువ సేపు ఆరుబయట ఉంచకూడదు. కోసిన పండ్లు ఏవైనా మిగిలి ఉంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. రోడ్డు పక్కన ఎలాంటి శుభ్రత లేని చోట,  ముందుగానే పండ్లను కోసి నిల్వ చేసి అమ్మే చోట పండ్ల ముక్కలు కొనుగోలు చేసి తినడం మంచిది కాదు.                                    *రూపశ్రీ.