LATEST NEWS
కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆమె స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరుపై భారీ ఎత్తున అభ్యంతరాలు వచ్చిన కారణంగా పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు పార్టీకి అధికారిక సమాచారం ఇచ్చింది.  ఈసీ ఆదేశాల మేరకు   కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.   తన పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర్కొంటూ..  రిజిస్ట్రేషన్ కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. అయితే..  ఈ పేరుపై  వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని అందువల్ల మూడు ప్రత్యామ్నాయ పేర్లను  కు సర్పించాలని ఈసీ  కవితకు లేఖ రాసింది.   కాగా ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలపై స్పందించిన కవిత..  ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదనీ..  ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామనీ తెలిపారు.  గత ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి  పేర్లను సూచిస్తూ కవిత సీఈసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా  ప్రకటించిన కవిత, అదే సభలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకు కవిత కొత్త పార్టీ పేరును  తెలంగాణ రక్షణ సేన గా ఈసీ ప్రాథమికంగా గుర్తించింది.  తాజాగా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ..  ప్రత్యామ్నాయ పేర్లు ఎంపిక చేసుకోవాలని సూచించడం తెలంగాణలో రాజకీయ సంచలనానికి తేరతీసింది.  ECI, Kalvakuntla, Kavitha, TRSname, Teluguone, Telangana Politics
వైసీపీ వచ్చే ఎన్నికలలోనూ ఓటమి ఖరారని ఇప్పుడే మానసికంగా ఫిక్సైపోయిదా? వచ్చే ఎన్నికలలో కూడా పరాజయం తప్పదన్న నిర్ణయానికి వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు తాజాగాకేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో   చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) విషయంలో ఆ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, చేస్తున్న విమర్శలను ఎత్తి చూపుతూ పరిశీలకులు ఔననే అంటున్నారు.  కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు అధికార పక్షానికి కొమ్ముకాసేలా ఉన్నాయంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.   కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే ప్రక్రియను గత నెల 15 నుండి ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, ఓటర్ల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దీని ఆధారంగా జూలై 21న ఓటర్ల ప్రాథమిక ముసాయిదా  విడుదల కానుంది. ఆ తర్వాత అభ్యంతరాలు, చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిశాక, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను   ప్రకటిస్తారు. అయితే ఈ 3 నెలల సుదీర్ఘ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైసీపీ విమర్శిస్తోంది.  ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే..  క్షేత్రస్థాయిలో  తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ  మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.    బూత్‌కు 50 చొప్పున తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందనీ సర్ గడువు నెల రోజులు పెంచాలంటూ వైసీపీ  వినతిపత్రాలు ఇస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో ఓటమికి ఇప్పటి నుంచే రెడీ అయిపోతోందా? అన్న అనుమానాలు కలిగేలా చేస్తున్నదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ ఎలా జరుగుతుందన్న విషయంలో రహస్యమేదీ ఉండదు.. రాజకీయ పార్టీలకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రక్రియ పట్ల సంపూర్ణ అవగాహన ఉంటుంది.  కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు  ప్రతి ఇంటికీ వెళ్లి..  నివాసం ఉంటున్న వారినే ఓటర్లుగా గుర్తిస్తూ   పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిశీలనలో  అర్హులైన ఏ  పౌరుడి ఓటు పోయే అవకాశమే ఉండదు.   పోతే గీతే..  ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు..  చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు, మూడు నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఇదే వైసీపీని భయపెడుతోంది. అలా తొలగిపోయే ఓట్లన్నీ తమవేనని చెప్పుకుంటోంది. అలా చెప్పుకోవడం ద్వారా.. ప్రతి బూత్ కూ తమవి దాదాపు 50 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పకనే చెప్పుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో..    వైసీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి బూత్‌లోనూ భారీగా  దొంగ ఓట్లను చేర్పించారన్న బలమైన ఆరోపణలను చూపిస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ద్వారా ఆ దొంగ ఓట్లు తొలగిపోతుండటంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందంటున్నారు.     YSRCP Allegations on ECI, Voter Verification Process AP, Special Intensive Revision
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  విజయసాయిరెడ్డి స్టైలే వేరు. ఆయన రూటే సెపరేటు. రాజకీయ సన్యాసం అని ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమన్న చాటిన తరువాత కూడా విజయసాయి..   రాజకీయాలే మాట్లాడుతున్నారు. మనిషిగా ఆయన రాజకీయాలకు దూరం అని చెబుతున్నా.. ఆయన మనసు మాత్రం రాజకీయాలతోనే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.  ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఖరారైన తరువాత కూడా జగన్ కు అనుకూలంగా.. విజయసాయిరెడ్డి తాజాగా రాజధాని విషయంలో చేసిన కొత్త ప్రతిపాదన ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది.  నిన్నటి వరకు వైస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన ఆయన, ఇప్పుడు జగన్ మనసులోని ఆలోచనలను ప్రతిబింబించేలా, రాజధాని విషయంలో  కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చి.. జగన్ పై తనకున్న భక్తిని, అభిమానాన్నీ చాటుకున్నారు.  ఇటీవల జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు తమ నినాదంమావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు)  అని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టుగా సాగుతాయని కూడా జగన్ చెప్పారు. ఇక్కడే విజయసాయి రెడ్డి పైకి మావిగన్ ను వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తూనే..  జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలకు అదనంగా  మంగళగిరిని కూడా చేర్చి, మచిలీపట్నాన్ని తొలగించి తెనాలి పేరును తీసుకువచ్చి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి  (వీజీటీఎమ్) ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు.  గతంలో శివరామకృష్ణ కమిషన్ కూడా ఈ వీజీటీఎం  ప్రాంతాన్ని రాజధానిగా  అభివృద్ధి చేయాలని సూచించిన విషయం తెలిసిందే. కేవలం ఒకే చోట అమరావతిని నిర్మించడం కంటే.. ఈ నాలుగు  నగరాలను సమగ్రంగా విస్తరిస్తూ కనెక్టివిటీని పెంచితే, అది ఆటోమేటిక్‌గా రాష్ట్రానికి ఒక అద్భుతమైన మెగా రాజధాని అయిపోతుందంటూ విజయసాయి సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఒకవైపు అమరావతిపై  విమర్శలు చేస్తూ, అక్కడ భారీగా అవినీతి జరిగిందని ఆరోపించడమే కాకుండా, ఈ వివాదంపై త్వరలోనే న్యాయస్థాన్ని ఆశ్రయిస్తానంటూ.. జగన్ చెప్పిన మాటలనే మరో డిక్షన్ తో విజయసాయి చెబుతున్నారు.   విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి విదితమే.  అప్పట్లో అమరావతిని ఏకాభిప్రాయంతో రాజధానిగా నిర్ణయించినప్పుడు గానీ, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు గానీ ఆయన ఎన్నడూ వీజీటీఎం ప్రస్తావన తీసుకు రాలేదు. ఇప్పుడు.. వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత...వీజీటీఎమ్ అంటూ మాట్లాడటం విజయసాయి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  AP Capital Row, Amaravati Controversy, VGTM Proposal, Mavigan Concept
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ చాలెంజ్ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలను డిఫెన్స్ లో పడేసింది. జనాలకు ముఖం ఎలా చూపించాలో తెలియనంతగా ఆత్మరక్షణలో పడ్డారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో ఒకప్పుడు తిరుగులేని నేతగా చక్రం తిప్పిన ధర్మానను జగన్ తీరు మరీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వైఎస్ హయాంలో ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో కూడా చక్రం తిప్పిన ధర్మా ప్రసాదరావు జగన్ మావిగన్ చాలెంజ్ పై అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నారు.   2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావమంతమైన నాయకుడు.   ప్రజల్లో కూడా ఆయన పట్ల అభిమానం, గౌరవం ఉండేవి. తన వాగ్ధాటితో,  విశ్లేషణలతో ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ, బయటా గళం విప్పి ప్రజామన్ననలు అందుకున్నారు. అయితే అదంతా గతం.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ధర్మాన ప్రభ రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. అందుకు కారణం.. జగన్మోహన్ రెడ్డి నాయకత్వ శైలిని, ఏకపక్ష పోకడలను  ధర్మాన ప్రసాదరావు అంతర్గతంగా విభేదించడమేనని వైసీపీ వర్గాలే చెబుతుంటాయి.    ఆ కారణంగానే  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ధర్మానకు అంత సీనియర్ అయి ఉండి కూడా  తొలి మూడేళ్లలో  మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కిందనుకోండి. అది వేరే సంగతి.   విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు.  ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.  అయినా ధర్మాన ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను వదల లేదు. కానీ ఇప్పుడు జగన్  మావిగన్ అనడం ధర్మానకు మింగుడు పడటం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనతో ధర్మాన పూర్తి ఆత్మరక్షణలో పడిపోయారనీ,  జగన్ తీరు కారణంగా తన సొంత ఇమేజ్ దెబ్బతింటోందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు.  నాడు విశాఖ రాజధాని అంశంపై గట్టిగా నిలబడిన తాను ఇప్పుడు జగన్ మావిగన్ అనడంతో ప్రజలలో చులకన అయ్యాననీ బాధపడుతున్నారని చెబుతున్నారు.  మొత్తం మీద జగన్ మావిగన్ నినాదంతో ధర్మాన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మావిగన్ ను బాహాటంగా వ్యతిరేకించాలన్న ఆగ్రహంతో ఆయన ఉన్నారని అంటున్నారు. 
ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేతగా రాష్ట్రంలో ఈ పేరు చిరపరిచితం. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున క్రియాశీలంగా పని చేసిన ఆయన.. ఉమ్మడి తూర్పుగోదావరిలో వైసీపీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించారు. వైసీపీ పరాజయం పాలైతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించి, అంత పనీ చేశారు. అయితే ఆయన  విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుసరించిన వైఖరి   ఎవరికీ అర్ధం కావడం లేదు. వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన  ముద్రగడ..  కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు.  అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.  పైగా జగన్మోహన్ రెడ్డి వస్తే తామే వద్దు అన్నాం అంటూ ఆయన కుమారుడితో  చెప్పించారు.  ముద్రగడ పద్మనాభంకు  రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే ఎక్కువ గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు ముద్రగడ సమకాలీనుడు. వారితో పాటే..  1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు.  మంత్రిగా, ఎంపీగా కూడా పని చేశారు. అయితే తదననంతర పరిణామాలలో ఆయన ఎమ్మెల్యేగా కూడా పరాజయం పాలయ్యారు. దీంతో చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటువంటి ముద్రగడ..  2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమే కాకుండా,   కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకు వెళ్లారు. అయితే ఆ ఉద్యమం కాపులకు  ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చలేదు సరికదా.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చింది. అసలు చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా ముద్రగడ ఆ కాపు ఉద్యమాన్ని నడిపారన్న వాదన కూడా అప్పట్లో బలంగా వినిపించింది.  ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే.. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ.. కాపు రిజర్వేషన్ నినాదాన్ని, ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు.  ఇంత చేసినా ముద్రగడకు వైసీపీలో వీసమెత్తు ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్.  అయినా కూడా ముద్రగడ.. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విస్తృతంగా ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించకుండా తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ అద్భుతమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో అన్నట్లుగానే ముద్రగడ తన పేరును ముద్రగడ పద్మనాభంగా అధికారికంగా మార్చుకున్నారు. జగన్ కోసం ఇంత చేసిన ముద్రగడకు.. జగన్ నుంచి వీసమెత్తు గుర్తింపు కూడా లేకుండా పోయిందని కాపు సామాజికవర్గ నేతలు, ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడను జగన్ కనీసం పరామర్శించను కూడా పరామర్శించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. జగన్ పరామర్శించకుంటే పోయె.. కానీ జగన్ తమకు అన్నివిధాలుగా అండగా నిలిచారనీ, ఆయన ముద్రగడను పరామర్శించడానికి వస్తానంటే.. తామే వద్దన్నామంటూ ముద్రగడ కుమారుడు వీడియో  విడుదల చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శిస్తామంటే ఎవరైనా ఎలా, ఎందుకు వద్దంటారు? అంటూ, జగన్ ఒత్తిడి మేరకే ముద్రగడ కుమారుడు ఆ వీడియో విడుదల చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ముద్రగడను పరామర్శించడానికి జగన్ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
ALSO ON TELUGUONE N E W S
  'కోర్ట్' మూవీతో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ శ్రీదేవి. ప్రీవియస్ మూవీ బ్యాండ్ మేళం తో కూడా సత్తా చాటిన శ్రీదేవి ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.తాజాగా  డిజిటల్ మోసంపై స్పందిస్తూ తన అభిమానులని. నెటిజన్లని  అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా ప్రపంచంలో తన పేరుతో జరుగుతున్న కొన్ని తప్పుడు ప్రచారాలు మరియు డిజిటల్ అవకతవకలపై శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కీలకమైన ప్రకటనని  విడుదల చేశారు. కొంతమంది కేటుగాళ్లు నా  అనుమతి లేకుండా, నాపేరు, ఫొటోలు, గుర్తింపుని  అక్రమంగా వాడుకుంటూ కొన్ని నకిలీ యూట్యూబ్ ఛానెళ్ల ని నడుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ  మోసగించే ప్రమాదం ఉంది. ఆ  యూట్యూబ్ ఛానెళ్లతో నాకు  ఎలాంటి సంబంధం లేదు.ఎవరైనా సరే యూట్యూబ్‌లో తన పేరుతో ఉన్న ఛానెళ్లని  చూస్తే, వాటిని తన అధికారిక ఛానెళ్లుగా భావించి మోసపోవద్దు. అవన్నీ నూటికి నూరు శాతం నకిలీవి. ఎలాంటి వివరాలైన నా ఇనిస్టా పేజీ నుంచి వచ్చాయని తెలిపింది. also read: Mohanlal: క్షమాబిక్ష పథకంలో మోహన్ లాల్ పేరు..ఇక కథ ముగిసినట్టేనా!    
  మలయాళ మెగాస్టార్ అనే టాగ్ లైన్ కి తగ్గట్టుగానే యువ హీరోలకి పోటీ ఇస్తూ మోహన్ లాల్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 14 ఏళ్లుగా మోహన్ లాల్ పై ఉన్న  ఏనుగు దంతాల వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.మోహన్ లాల్   కేరళ అటవీ శాఖ ప్రవేశపెట్టిన వన్ టైమ్ క్షమాభిక్ష పథకంని  ఆశ్రయించారు. ఈ ప్రత్యేక పథకం ద్వారా తన వద్ద ఉన్న వన్యప్రాణి వస్తువులను అధికారికంగా ప్రకటించి, చట్టపరమైన రక్షణ పొందాలని ఆయన భావిస్తున్నారు. ఈ వివాదం  2011 డిసెంబర్ 21న ప్రారంభమైంది. ఆ సమయంలో కొచ్చిలోని థేవరాలో ఉన్న మోహన్‌లాల్ నివాసంపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఊహించని విధంగా 2 జతల ఏనుగు దంతాలు, ఏనుగు దంతాలతో చేసిన 13 విలువైన విగ్రహాలు బయటపడ్డాయి. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం, ముందస్తు అనుమతి లేదా యాజమాన్య పత్రాలు లేకుండా ఇలాంటి వస్తువులని  ఉంచుకోవడం తీవ్రమైన నేరం. దీని ఆధారంగా 2012లో కేరళ అటవీ శాఖ మోహన్‌లాల్ మరియు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసింది. అప్పటి నుండి ఈ వ్యవహారం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. also read: Bandla Ganesh: నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారు.. సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్న బండ్ల గణేష్  గతంలో ఈ కేసును ఉపసంహరించుకోవాలని కేరళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలని  పెరుంబావూర్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించడంతో పాటు మోహన్ లాల్ కి అనుకూలంగా ప్రభుత్వం జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలని సైతం కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అయితే వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 40(4) ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న ఇలాంటి వస్తువులను స్వచ్ఛందంగా డిక్లేర్ చేయడానికి ప్రభుత్వం ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిని బేస్ చేసుకుని కేరళ అటవీ శాఖ ఈ వన్ టైమ్ అమ్నెస్టీ స్కీమ్‌ని తీసుకురావడంతో మోహన్‌లాల్  కొచ్చి నివాసంలో ఉన్న ఏనుగు దంతాలను అటవీ శాఖ అధికారుల వద్ద డిక్లేర్ చేశారు.  
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' (LENIN) సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ రేపు అత్యంత వైభవంగా నిర్వహించబోతోంది.  తిరుపతిలోని ప్రముఖ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ ఈ ఈవెంట్ కు వేదిక కానుంది. రేపు సాయంత్రం 5:00 గంటల నుండి ప్రారంభం కానున్న ఈ వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అక్కినేని నాగార్జునతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మాస్ యాక్షన్ డ్రామాను మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. అఖిల్ నటనను సరికొత్త కోణంలో ఆవిష్కరించేలా ఆయన ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కింగ్ నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  'లెనిన్' మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. జూలై 10 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. అందులో భాగంగానే తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో రేపు సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించబోయే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినిమాపై అంచనాలను మరింత స్కై హైకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అఖిల్ కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ మాస్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.   https://x.com/AnnapurnaStdios/status/2073285993197879368
  -బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు  -నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారంటు వేదన  -సుప్రీంకోర్టుకి సైతం వెళ్తానంటూ ట్వీట్  ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌(Bandla Ganesh)కి  తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉన్న ఆయన కుటుంబానికి చెందిన విలువైన నివాస ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. గతంలో ఈ వేలాన్ని రద్దు చేస్తూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలని  జస్టిస్ మౌషమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. గణేష్ ఆస్థి విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిపిన వేలం ప్రక్రియ చట్టబద్ధమేనని స్పష్టం చేస్తూ, బ్యాంకు రికవరీ చర్యలని కూడా  హైకోర్టు పునరుద్ధరించింది. ఈ పరిణామం టాలీవుడ్‌తో పాటు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆస్థి వేలం వివాదంపై గణేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ట్వీట్ లో బ్యాంకు వాళ్ళు అన్యాయంగా, లోపాయికారి ఒప్పందంతో నా ఆస్తిని తక్కువ ధరకి  విక్రయించారు. ఈ అన్యాయాన్ని సవాలు చేస్తూ 2022 లో నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. డిఆర్ టిలో నాకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. కానీ హైకోర్టులో వ్యతిరేకతీర్పు రావడం బాధాకరం. నాకు న్యాయవ్యవస్థలపై ఇంకా నమ్మకం ఉంది. కాబట్టి సుప్రీం కోర్టుని ఆశ్రయించి నాకున్న హక్కుల ద్వారా న్యాయం సాధిస్తాననే నమ్మకం నాకుందని ట్వీట్ లో పేర్కొన్నాడు. Also read: Trisha: త్రిష పోస్ట్ వైరల్.. ఆ విధమైన తపన తగ్గిపోయింది  గణేష్ ఇటీవల వరంగల్ లోని హనుమకొండకి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని, ఆరోగ్య అవసరాల కోసం పది లక్షలు అందించిన విషయం తెలిసిందే.        
ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీ వేదికగా రీసెంట్‌గా విడుదలైన వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. 'బేబీ' ఫేమ్ విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు వినోద్ గాలి మలిచారు. మొత్తం 7 ఎపిసోడ్‌లుగా, ప్రతి ఎపిసోడ్ సుమారు 30 నిమిషాల నిడివితో ఈ సిరీస్ రూపొందింది. శరత్ చంద్ర నాయుడు నిర్మించిన ఈ నోస్టాల్జియా డ్రామా, గతంలో సూపర్ హిట్ అయిన '90s' వెబ్ సిరీస్ తరహాలోనే ప్రేక్షకులను తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. (Gurthukosthunnayi Review) కథ: సంతోష్ (విరాజ్ అశ్విన్) చిన్నప్పటి నుంచి తన స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) కూతురైన వైశాలి (యశశ్రీ రావు)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఎన్నో కష్టాలు పడి, రఘునాథ్ పెట్టిన కఠినమైన టెస్టులన్నీ పాసై ఎట్టకేలకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ సాధిస్తాడు. పెళ్లి ఖరారైన ఆనందంలో సంతోష్ తన చిన్ననాటి స్నేహితులైన గణేష్ (వైవా రాఘవ), ఆనంద్ (గోదావరి గోపి), శ్రీకాంత్ (పవన్ సిద్ధు)లతో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం గోవా ప్లాన్ చేస్తాడు. అయితే, "జాతకం ప్రకారం పెళ్లికి ముందు సిటీ దాటకూడదు" అని మామగారు స్ట్రిక్ట్‌గా ఆర్డర్ వేసినా సంతోష్ వినకుండా దొంగచాటుగా గోవా బయల్దేరతాడు. కానీ దారిలో ఊహించని యాక్సిడెంట్ జరిగి సంతోష్ తలకి బలమైన గాయమై గతం మర్చిపోతాడు. ఇంకో వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని హీరో ఇలా గజినీలా మారిపోయాడనే విషయం తెలిస్తే మామగారు రఘునాథ్ పెళ్లి క్యాన్సిల్ చేయడం ఖాయం. మరి ఈ నిజాన్ని దాచిపెట్టి ఫ్రెండ్స్, ఫ్యామిలీ కలిసి ఆ పెళ్లిని ఎలా జరిపించారు? సంతోష్‌కి గతం గుర్తుకొచ్చిందా? అనేదే మిగిలిన కథ. విశ్లేషణ: దర్శకుడు వినోద్ గాలి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా, దాని చుట్టూ అల్లిన వినోదం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్ టైటిల్ వినగానే రవితేజ 'నా ఆటోగ్రాఫ్' సినిమాలోని సాంగ్ గుర్తొస్తుంది. ఈ సిరీస్ కూడా 90s, 2000s కిడ్స్‌కి తమ స్కూల్ రోజులను గుర్తుచేస్తూ మంచి నోస్టాల్జియా ఫీలింగ్‌ను ఇస్తుంది. మామగారిని ఒప్పించడానికి హీరో పడే పాట్లు, గోవా ట్రిప్ వంటి సీన్లతో సిరీస్ కూల్‌గా స్టార్ట్ అవుతుంది. బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. ఎప్పుడైతే హీరోకి యాక్సిడెంట్ అయి మెమొరీ లాస్ అవుతుందో, అప్పటినుంచి అసలైన వినోదం మొదలవుతుంది. గతాన్ని మర్చిపోయిన హీరో చేసే పనులు, మామగారికి దొరికిపోకుండా ఫ్రెండ్స్ బ్యాచ్ చేసే కవరింగ్‌లు నవ్వులు పూయిస్తాయి. కేవలం కామెడీనే కాకుండా చివరి ఎపిసోడ్స్ వైపు వెళ్లేకొద్దీ వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. మొదటి నాలుగు ఎపిసోడ్లు.. చిన్ననాటి జ్ఞాపకాలు, అక్కడక్కడా కామెడీతో పరవాలేదు అన్నట్టుగా నడుస్తాయి. కానీ, చివరి మూడు ఎపిసోడ్లు మాత్రం కట్టిపడేశాయి. అమ్మమ్మ ఎపిసోడ్ అయితే.. ప్రతి ఒక్కరికి మళ్ళీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి రావాలనే ఫీలింగ్ ను కలిగిస్తుంది. అలాగే, ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్ హృదయాలను హత్తుకునేలా ఉంది. సిరీస్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: రాజ్ అశ్విన్ మెమరీ లాస్ బాధితుడిగా కామెడీ, సెంటిమెంట్ సీన్స్‌లో చక్కని నటన కనబరిచాడు. వైవా రాఘవ అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ పండించిన కామెడీ సిరీస్‌కు ప్రధాన బలం. హెడ్ మాస్టర్ రఘునాథ్ పాత్రకు ప్రియదర్శిని రామ్ సరిగ్గా సరిపోయారు. రోహిణి హట్టంగడి, శుభలేఖ సుధాకర్, గోపరాజు రమణ వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు వినోద్ గాలి మెమొరీ లాస్ అనే పాత కాన్సెప్ట్‌నే తీసుకున్నప్పటికీ.. దానికి నోస్టాల్జియా, వెడ్డింగ్ బ్యాక్‌డ్రాప్ జోడించి.. కామెడీ, ఎమోషన్స్ తో బోర్ కొట్టకుండా ఫ్రెష్‌గా ప్రెజెంట్ చేశారు. అజయ్ అరసాడ అందించిన సంగీతం కథలోని ఫీల్‌ని బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్: నటీనటుల పర్ఫార్మెన్స్ స్కూల్ డేస్ నోస్టాల్జియా & క్లీన్ కామెడీ చివరి ఎపిసోడ్స్ లో ఎమోషన్స్ మైనస్ పాయింట్స్: నెమ్మదిగా సాగే స్టార్టింగ్ ఎపిసోడ్స్ ఫైనల్ గా..  స్టార్టింగ్ ఎపిసోడ్స్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. కాసేపు హాయిగా నవ్వుకుంటూ, కాస్త ఎమోషనల్ ఫీల్ అయ్యే వెబ్ సిరీస్ చూడాలనుకుంటే 'గుర్తుకొస్తున్నాయి' మంచి ఛాయిస్. రేటింగ్: 2.5/5 Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.     Gurthukosthunnayi, Web Series, Review, Viraj Ashwin, ETV Win, TeluguOne  
స్టార్ హీరోయిన్ అనే టాగ్ లైన్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇంకా చాలా టైం ఉందంటూ త్రిష వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కరుప్పు అలియాస్ వీరభద్రుడుతో రీసెంట్ గా భారీ విజయాన్ని అందుకున్న త్రిష త్వరలోనే మెగాస్టార్ తో కలిసి విశ్వంభరతో రాబోతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే త్రిష  రీసెంట్ గా  ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా చేసిన ఒక సంచలన పోస్ట్ ఇప్పుడు  హాట్ టాపిక్‌గా మారింది.   త్రిష ఇటీవల జారా ఆన్‌లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కొన్ని ప్రీమియం దుస్తులని  ఆర్డర్ చేశారు. ఎంతో ఇష్టపడి ఆర్డర్ చేసిన పార్సిల్ ఇంటికి రాగానే ఆమె ఎంతో ఆత్రుతగా ఓపెన్ చేశారు. కానీ, ఆ బాక్స్ ఓపెన్ చేయగానే  తీవ్ర నిరాశ, అసహ్యం కలిగాయి. ఆ దుస్తుల నుంచి భరించలేనంతగా చెమట దుర్వాసన వచ్చింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. వరుసగా ఇది మూడోసారి అంట.అలా ఏకంగా మూడు సార్లు వరుసగా హోమ్ డెలివరీలో ఇలాంటి కంపు కొట్టే బట్టలనే జారా సంస్థ పంపించిందని త్రిష స్వయంగా వెల్లడించారు. సాధారణంగా ఎవరో వాడి రిటర్న్ చేసిన బట్టలను లేదా ట్రయల్ రూమ్‌లలో కస్టమర్లు వేసుకుని వదిలేసిన దుస్తులను సరైన క్వాలిటీ చెక్, వాషింగ్ లేకుండా మళ్లీ ప్యాక్ చేసి కొత్తవాటిలా డెలివరీ చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. Also read: social media influencer: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ దారుణ హత్య  దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సౌత్ క్వీన్ త్రిష.. జారా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌తో పాటు వారి కస్టమర్ కేర్ అకౌంట్‌ ని  కూడా ట్యాగ్ చేస్తూ ఘాటుగా పోస్ట్ పెట్టారు. "డియర్ జారా.. ఇదొక చిన్న విన్నపం మాత్రమే. మేము తదుపరిసారి హోమ్ డెలివరీ కోసం ఆర్డర్ చేసినప్పుడైనా బట్టల నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా చూసుకోండి. ఇది వరుసగా మూడోసారి ఇలా జరగడం. నిజంగా ఇది చాలా అసహ్యంగా ఉంది. కనీసం కస్టమర్లకు ప్యాక్ చేసి పంపించే ముందైనా ఆ బట్టలు ఎలాంటి వాసన వస్తున్నాయో ఒకసారి స్మెల్ చూసి పంపించండి" అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ వయసులో ఇతరులని మెప్పించాలనే తపన తగ్గిపోయి, ఎవరి గురించి పట్టించుకోని స్ట్రాంగ్ ఆటిట్యూడ్ (IDGAF attitude) వస్తుందంటూ పెరిమెనోపాజ్ గురించి ఒక డాక్టర్ చెప్పిన కోట్‌ ని  కూడా ఆమె షేర్ చేస్తూ.. దానికి 'ఫ్యాక్ట్' అని క్యాప్షన్ ఇచ్చింది.  Trisha fires on zara brand apparel issue post, trisha latest post, Trisha latest news, karuppu, vishwambhara, chiranjeevi
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా  ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది నిషా చౌహాన్. నిన్న తన భర్త ప్రదీప్ కుమార్ చేతిలోనే దారుణ హత్యకి గురైంది.ప్రదీప్, నిషాకి  దాదాపు 18 ఏళ్ల క్రితం వివాహం కాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రదీప్  గతంలో దుబాయ్‌లో ఏసీ మెకానిక్‌గా పనిచేసి ఏడాది క్రితమే భారతదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే వారు కొత్తగా కొనుగోలు చేసిన ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో ఇద్దరి మధ్య మొదలైన గొడవ చివరకి  ప్రాణం తీసేవరకు వెళ్ళింది. నిషా చౌహాన్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. భూమి కొనుగోలులో మెజారిటీ వాటా డబ్బును తానే చెల్లించినందున, ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ తన పేరిట జరగాలని నిషా పట్టుబట్టింది. దీనికి ప్రదీప్ అంగీకరించలేదు. నిషా ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ప్రదీప్, ఒకవేళ ఆస్తి ఆమె పేరిట ఉంటే దాన్ని తీసుకుని తనని  వదిలేసి వెళ్ళిపోతుందేమోననే భయంతో ఉన్నాడు. ఈ విషయమై గురువారం రాత్రి ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఆ వివాదం మరుసటి రోజు కత్తితో పొడిచి చంపేశాడు. 17 ఏళ్ల పెద్ద కుమారుడుకి ఈ దాడిలో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆ అబ్బాయి సాయం కోసం కేకలు వేస్తూ పొరుగువారిని పిలవడానికి బయటకు పరుగెత్తాడు. Also read: Jagapati Babu: తెలివైన నిర్ణయం తీసుకున్న జగపతిబాబు.. ఆ దర్శకుడితో ఏం చెప్పాడంటే? పొరుగువారు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే జరగకూడని ఘోరం జరిగిపోయింది. భార్యను రక్తపు మడుగులో పడేసిన ప్రదీప్, ఆ తర్వాత అదే కత్తితో తన ఛాతిపై, పొట్టపై పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను మరియు అతని కుమారుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రదీప్ పరిస్థితి విషమంగానే ఉందని, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. నిషా వయసు 45 ఏళ్ళు కాగా బ్యూటీషియన్ గా వర్క్ చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్టున్నారు.  
  అతిశయోక్తిగా అనిపించినా కూడా కొంత మంది నటులు సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే తెలుగు సినిమా ఎంతో పెట్టి పుట్టింది కదా అనిపిస్తుంది. అలాంటి వాళ్లలో జగపతి బాబు(Jagapathi Babu)ఒకరు. హీరోగా అన్ని రకాల వేరియేషన్స్ తో కూడిన క్యారెక్టర్స్ లో కనిపించి సిల్వర్ స్క్రీన్ కి సరికొత్త సువాసనలు అద్దాడు. గాయం, మావిచిగురు, హనుమాన్ జంక్షన్, అల్లరి ప్రేమికుడు వంటి చిత్రాలే సింపుల్ ఎగ్జామ్ ఫుల్. ఇక ఒక్కోసారి తెలుగు చిత్రసీమలో ఒక్కోసారి నటీనటులు తీసుకునే నిర్ణయాలు వారి కెరీర్‌ని  ఊహించని మలుపు తిప్పుతాయి. అయితే ఆ నిర్ణయం ఎలాంటి సమయంలో తీసుకున్నామనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో జగపతి బాబుని తిరుగులేని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. చేసిన ఒకటి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో సరిగ్గా ఆడలేదు. అలాంటి క్లిష్ట సమయంలో జగపతి బాబు తన రూట్ మార్చి, క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా లెజెండ్ మూవీతో విలన్ క్యారెక్టర్స్ కి  సై అన్నారు. అప్పట్లో ఆయన తీసుకున్న ఆ ఒక్క సాహసోపేతమైన నిర్ణయం కెరీర్‌ని మరో ఉన్నత శిఖరానికి తీసుకెళ్లింది. హీరోగా  సంపాదించిన క్రేజ్ఒక ఎత్తయితే,విలన్‌గా మరియు పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత ఆయన అందుకున్న క్రేజ్ మరో ఎత్తు. నిజం చెప్పాలంటే, హీరోగా ఉన్నప్పటి కంటే ఇప్పుడున్న పొజిషన్ లోనే జగపతి బాబు యమ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ చేతినిండా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. మరి ఇలాంటి టైమ్ లో, ఈ విపరీతమైన క్రేజ్ తో ఆయన మరోసారి సోలో హీరోగా మారితే ఎలా ఉంటుంది? గతంలోనే కొంతమంది దర్శకులకు ఈ ఆలోచన రాగా, తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ దర్శక-నిర్మాతకు కూడా ఇదే తరహా ఆలోచన వచ్చింది. ఆ దర్శకుడి దగ్గరికి ఒక అద్భుతమైన, వైవిధ్యమైన స్టోరీలైన్ వచ్చింది. ఆ కథ విన్న వెంటనే, ఇందులో లీడ్ హీరోగా మన జగపతి బాబు అయితేనే వంద శాతం న్యాయం చేయగలరని ఆయన బలంగా ఫీల్ అయ్యారు. అనుకున్నదే తడవుగా జగపతి బాబును కలిసి కథను వివరంగా వివరించి, హీరోగా నటించాల్సిందిగా కోరారు. అయితే ఈసారి కూడా జగపతి బాబు తనదైన శైలిలో ఒక కీలకమైన మరియు అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నారు. తాను మరోసారి హీరోగా మారే ఆలోచన లేదని సదరు దర్శక నిర్మాతకి  ముఖం మీదే తెగేసి చెప్పేశారు. Also read: Rao bahadur: రావు బహదూర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే! ప్రస్తుతం తను ఉన్న పొజిషన్ కి, ఇండస్ట్రీలో తనకి  ఉన్న డిమాండ్‌కి  మళ్లీ సోలో హీరోగా ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదని ఆయన భావించారు. ఒకవేళ మళ్లీ హీరోగా మారి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడకపోతే, ఇప్పుడు కష్టపడి సంపాదించుకున్న విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. జగపతి బాబు తీసుకున్న ఈ నిర్ణయంపై చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇగోలకు పోకుండా, ప్రాక్టికల్‌గా ఆలోచించి జగపతి బాబు తీసుకున్న ఈ డెసిషన్ నిజంగా ఎంతో తెలివైందని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.  జగపతి బాబు ప్రస్తుతం థియేటర్ లో  నాగబంధంతో సందడి చేస్తున్నాడు.    
After months of speculation and years of captivating fans across the globe with their romance, global pop icon Taylor Swift and NFL superstar Travis Kelce are officially husband and wife. The celebrity couple exchanged vows on July 3 in a lavish ceremony at New York City's Madison Square Garden, with Hollywood actor Adam Sandler officiating the wedding. The wedding turned into one of the biggest celebrity events of the year, bringing together some of the biggest names from music, Hollywood and sports. Selena Gomez, Ed Sheeran, Gigi Hadid, Bradley Cooper, Hugh Grant, Ethan Hawke and several NFL stars were among the high-profile guests who attended the private celebration, which reportedly welcomed nearly 1,000 invitees under tight security with a strict no-phone policy. Swift stunned in a custom Christian Dior couture wedding gown paired with Cartier jewellery and Christian Louboutin shoes, while Kelce looked elegant in a bespoke Dior suit. Breaking away from tradition, the couple skipped a conventional bridal party. Taylor's brother Austin Swift served as her "Man of Honor," while Travis' brother Jason Kelce stood beside him as the Best Man. The celebrations also featured unforgettable moments, including a special performance by legendary singer Stevie Nicks. As the ceremony concluded, Madison Square Garden lit up with the message "JUST T&T MARRIED," while the Empire State Building glowed in light blue to celebrate the newlyweds, creating a spectacular end to what many have dubbed the celebrity wedding of the year. Taylor Swift and Travis Kelce's love story began in 2023 after the Kansas City Chiefs star famously revealed on his podcast that he had unsuccessfully tried to give Swift a friendship bracelet during her Eras Tour. What started as a viral moment soon blossomed into one of the world's most-followed celebrity romances, culminating in their engagement in 2025 and now, their much-awaited wedding. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  విలక్షణ నటుడు సత్యదేవ్, విలక్షణ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో నిన్న థియేటర్స్ లో ల్యాండ్ అయిన మూవీ 'రావు బహదూర్'. సైకలాజికల్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన చిత్రం 'రావు బహదూర్' ని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో  సత్యదేవ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.  మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా 1.61 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సత్తా చాటుతూ 1.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లని  రాబట్టి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా  3.11 కోట్లకి సాధించినట్లయింది.  ఆక్యుపెన్సీ విషయానికి వస్తే, మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 27.65% ఆక్యుపెన్సీనమోదు కాగా, ఉదయం షోలకు 19.00% ఆక్యుపెన్సీతో నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. మధ్యాహ్నానికి 23.08%, సాయంత్రం షోలకు 25.46% కి పెరిగింది. ఇక నైట్ షోలకైతే ఏకంగా 38.08% ఆక్యుపెన్సీతో థియేటర్లు కళకళలాడాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దుమ్మురేపింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే మొదటి రోజు 1.45 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటకలో 13 లక్షలు, తమిళనాడులో  2 లక్షలు రాబట్టింది. ఒక వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రానికి ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. వీకెండ్‌లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  Also read: Nagabandham: నాగబంధం ఫస్ట్ డే కలెక్షన్స్.. ట్రేడ్ వర్గాలు సైతం షాక్!  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..! ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ేటి వేగవంతమైన కాలంలో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.   కాలం గడిచేకొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి,   లేదా శరీరం  బలహీనపడతుంది, చురుగ్గా ఉండలేకపోతాము, ఈ ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులన్నీ చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కొన్నిదేశాలలోనే ఎక్కువగా ఉన్నారు.  ఆ దేశాలు ఏంటి? ఆ దేశాలలో ప్రజలు ఎందుకు 100ఏళ్లు బ్రతకగలుగుతున్నారు? తెలుసుకుంటే.. బ్లూ జోన్స్.. ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభా కంటే ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవించే ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలను "బ్లూ జోన్స్" అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా, గ్రీస్‌లోని ఇకేరియా, కోస్టారికాలోని నికోయా , యునైటెడ్ స్టేట్స్‌లోని లోమా లిండా ప్రాంతాలలో నివసించే ప్రజలకు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి జీవనశైలిలో అలవాట్లు,  వారి జీవనవిధానం చాలా దగ్గరగా ఉంటుంది. వృద్ధాప్యానికి గురించిన రహస్యాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రతి ఏటా కొత్త విషయాలు వెలుగు చూస్తూనే  ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  దీర్ఘాయువు కోసం ఒక్క అద్భుత సూత్రం అంటూ ఏదీ లేదు.  కొన్నిరోజులు, నెలలు, ఏళ్ల పాటు పాటించిన అలవాట్లు, తీసుకున్న జాగ్రత్తలు,  జీవనవిధానం మీద ఇది ఆధారపడి ఉందని అంటున్నారు.                             *రూపశ్రీ.  
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ  ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ  ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే  శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు.  కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  నిద్ర నాణ్యత.. టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది.  టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు. ఎసిడిటి, గ్యాస్.. ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.   టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దంత ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన.. అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చర్మం..  టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం  వల్ల, టీ మానేయడం వల్ల  శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.  తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి,  చర్మం మెరుపు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం.. అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు.                                     *రూపశ్రీ.
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఆడవారిలో గర్బం నిలవకపోవడం లాగానే.. మగవారిలో వీర్యకణాల సమస్య వంటివి పిల్లలు పుట్టడంలో ఆటంకాలు కలిగిస్తాయి. కొందరికి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, మరికొందరికి వీర్యం సరిగా ఉత్పత్తి కాకపోవడం లాంటి చాలా సమస్యలు కూడా ఉంటాయి. అయితే మగవారిలో కొన్ని  అలవాట్లు వారిలో సంతాన అవకాశాలు తగ్గించేస్తాయని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. వేడి అసలు కారణం.. జీవశాస్త్రపరమైన కారణం వల్ల వృషణాలు శరీరం వెలుపల ఉంటాయని వైద్యులు చెబుతారు. వీర్య కణాల ఉత్పత్తి ఉత్తమంగా జరగాలంటే , వృషణాల ఉష్ణోగ్రత శరీర అంతర్గత ఉష్ణోగ్రత కంటే సుమారు 2 నుండి 4°C తక్కువగా ఉండాలట. ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం కొద్దిగా తగ్గినా కూడా, అది సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందట. వృషణాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల, వీర్య కణాలను ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం జరుగుతుందట. ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి, వీర్యకణాల DNA దెబ్బతింటుందట. భారతీయ పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి వేడికి గురికావడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వంటి రోజువారీ అలవాట్లు ముఖ్య కారణాలని చెబుతున్నారు. ఒడిలో ల్యాప్టాప్.. చాలా మంది మగవాళ్లు ల్యాప్‌టాప్‌ను నేరుగా తమ తొడలపై ఉంచుకుని గంటల తరబడి పనిచేస్తుంటారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే వేడి, కాలక్రమేణా వృషణాల ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచడానికి దారితీస్తుంది. కానీ వేడి ఒక్కటే సమస్య కాదు, ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం , ఫోన్‌ను ప్యాంటు జేబులో ఉంచుకోవడం వల్ల విద్యుదయస్కాంత వికిరణానికి గురై పిల్లలు పుట్టడంలో సమస్యలు   పెరగవచ్చట. లోదుస్తులు, జీన్స్..  బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించే పురుషులతో పోలిస్తే, వదులుగా ఉండే బాక్సర్ షార్ట్స్ ధరించే పురుషులలో మొత్తం వీర్య కణాల సంఖ్య 17% ఎక్కువగా , చురుకుగా ప్రయాణించే వీర్య కణాలు 33% ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తేల్చాయి. స్కిన్నీ లేదా బిగుతుగా ఉండే జీన్స్ పరిస్థితిని మరింత దిగజార్చుతాయని ఆయన ఇంకా తెలిపారు. అవి రోజంతా వృషణ ప్రాంతాన్ని శరీరానికి దగ్గరగా నొక్కి ఉంచుతాయి, దీనివల్ల వేడి లోపలే నిలిచిపోయి, శరీరం  ఉష్ణోగ్రత నియంత్రణకు అవకాశం లేకుండా పోతుంది. ఎప్పుడూ అవే ధరించడం వల్ల, కాలక్రమేణా ఈ ప్రభావం పెరిగి సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది. సహాయపడే మార్పులు.. వదులుగా ఉండే బాక్సర్ షార్ట్‌లకు మారడం,  ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవడాన్ని అవాయిడ్ చేయడం మంచిది.  ల్యాప్‌టాప్‌ను  ఒడిలో కాకుండా బల్లపై ఉంచుకోవడం మంచిది. వేడి ప్రాంతాలలో ఎక్కువ సేపు గడపకుండా ఉండటం కూడా మేలు చేస్తుంది.                            *రూపశ్రీ.