LATEST NEWS
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకే క్యాబినెట్ నుంచి ఆమెను బర్తరఫ్ చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా రాజ్‌భవన్‌కు అధికారిక లేఖ పంపించారు. తాజా సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీఎస్ హుటాహుటిన గవర్నర్‌కు సమాచారం అందించారు. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉంది. మంత్రి సురేఖ తొలగింపు ప్రతిపాదనపై గవర్నర్ అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని, ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాలనా యంత్రాంగంలోనూ, పలు కీలక పదవుల్లోనూ ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న జి. చిన్నారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నూతన వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ నూతన అధిపతిగా నేరెళ్ల శారదకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, వారి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు శారదను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ వరుస నియామకాలతో కాంగ్రెస్ వర్గాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాలనాపరమైన శైలిని వేగవంతం చేయడంతో పాటు, పార్టీలోని పలు కీలక సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే సర్కార్ ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో విపరీతమైన చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా మంత్రుల తీరు మరియు పార్టీ అంతర్గత రాజకీయాలపై విస్తృత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, సీఎం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా బీసీ నేతలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. రాజ్‌భవన్‌ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ ఆమోదముద్ర పడిన వెంటనే కొత్త మంత్రి వర్గ విస్తరణపై ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే గంటల్లో తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.     (Konda Surekha Bartaraf, CM Revanth Reddy, Telangana Cabinet, Telangana Politics, Revanth's Sensational Decision)
తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉందా? లేక ఖాళీ అవ్వబోతోందా? అన్న అనుమానాలు రేకెత్తేలా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన తాజాగా తాను తెలంగాణ సీఎం కావడం ఖాయం, దానిని ఎవరూ అడ్డుకోలేరంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతే కాకుండా ఆయన వ్యాఖ్యలు తెలంగాణ అధికార కాంగ్రెస్ లో  అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్నీ బహిర్గతం చేశాయి.  దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  తమ కుటుంబం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉందనీ,  పార్టీ కోసం కష్టపడిన అసలు సిసలైన నాయకులకు  గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందన్నారు.  అంతే కాకుండా  తాను   రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతానని, ఆ పదవిని తాను కచ్చితంగా చేపడతానని విస్పష్టంగా చెప్పారు.  ప్రజా సేవలో  శ్రమిస్తున్న తమ లాంటి నాయకులకు ప్రజల మద్దతు ఉన్నంతవరకు  పదవులు దక్కకుండా ఎవరూ అడ్డుకోలేరన్న కోమటిరెడ్డి..  తెలంగాణలో కొందరు నేతలు పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు.  గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, సీఎం మార్పు చర్చల నేపథ్యంలో  రాజగోపాల్ రెడ్డి  వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పార్టీలో తొలి నుంచీ ఉన్న నాయకులు, మధ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి కీలక స్థానాలలో కొనసాగుతున్న నాయకుల మధ్య ఆధిపత్య పోరు అంటూ జరుగుతున్న ప్రచారానికి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి.  సొంత పార్టీ నాయకత్వ శైలిని ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు  రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశాయి. ఓ వైపు కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం చేశాయి.  రానున్నరోజులలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరింత పెచ్చరిల్లే అవకాశాలున్నాయని పరిశీలకులు రాష్ట్ర పార్టీలో ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు.   [Sensation in Telangana Politics, Komatireddy, CM Comments, Telangana CM, Telugu One]
  తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇందుకు బుధవారం (సెప్టెంబర్ 2) రోజంతా ఢిల్లీ వేదికగా జరిగిన హై డ్రామాయే కారణం. కొండా సురేఖ వ్యవహారంపై  హస్తినలో బుధవారం (సెప్టెంబర్ 2) కీలక పరిణామాలు జరిగాయి. ఒక వైపు ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించారు. మరో వైపు కొండా సురేఖ కోరినప్పటికీ వారి అప్పాయింట్ మెంట్ ఆమెకు దొరక లేదు. దీనిని బట్టే కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన ఖాయమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ కాకుండా పరిశీలకుల్లో సైతం వ్యక్తమైంది. అయితే ఈ విషయంలో  కొండా సురేఖ.. హైకమాండ్ నిర్ణయంతో సంబంధం లేకుండా సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విష్లేసిస్తున్నారు. ఇందుకు ఆమె మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా చూపుతున్నారు. హస్తిన వేదికగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణిలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరునూ నిలదీశారు. హైకమాండ్ బీసీలపై ఆరోపణలు వస్తే ఒకలాగా, ఇతరులపై ఆరోపణలు వస్తే మరొకలాగా స్పందిస్తారా అని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పేరెత్తకుండానే నిలదీశారు.  ఇక తన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ.. పార్టీ తీసుకునే నిర్ణయంపైనే తన కార్యాచరణ అధారపడి ఉంటుందని అన్యాపదేశంగా ఒక వేళ తనను కేబినెట్ నుంచి తొలగిస్తే.. పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని చెప్పారు.  ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ఈ పరిణామం నిస్పందేహంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా పరిణమిస్తుందని అంటున్నారు.  చూడాలి మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఏం నిర్ణయిస్తుందో.. కొండా సురేఖ ఏ నిర్ణయం తీసుకుంటారో? [Konda Surekha Goodbye to Congress, Resign, MLA, Warangal East, By Election, Telangana Politics, Telugu One]
  నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..! తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం..! ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, తన కుమార్తె మాట్లాడిన అంశానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. “నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు..? నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దు” అని ఆమె పేర్కొన్నారు. నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. ఆమెను వద్దని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను బీసీ మహిళా మంత్రినని.. తన భర్త మున్నూరు కాపు, తాను పద్మశాలి కులానికి చెందినవారినని తెలిపారు. తమ కులానికి 16 శాతం ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండానే తన శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నానని అన్నారు. ఒకవైపు కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరంటూ ఆందోళన జరుగుతోందని.. మరోవైపు తనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై ప్రెస్‌మీట్లు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కొండా సురేఖ అన్నారు. అధిష్ఠానం కూడా ఈ విషయాలను ఆలోచించాలని సూచించారు. మీనాక్షి మేడంకు తాను చెప్పాల్సిందంతా చెప్పానని తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని అన్నారు. తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏఐసీసీనే తీసుకోవాలని.. తాను ఏఐసీసీ సభ్యురాలినని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కే.సీ. వేణుగోపాల్‌ అపాయింట్‌మెంట్‌ తనకు దొరకలేదని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, తనపై వచ్చిన అంశాలపై ఆయనకు వివరణ ఇచ్చానని చెప్పారు.“ నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి” అని కొండా సురేఖ అన్నారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క భార్యకు సంబంధించిన కమీషన్ల అంశాలపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు.  “ఆ ఫిర్యాదులపై ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు. చాలామంది రెడ్లు మాట్లాడిన సందర్భాల్లో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. తన విషయంలో మాత్రమే చర్యల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ఆమె నిలదీశారు. మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలపై మరోసారి చర్చకు దారితీశాయి.   Konda Surekha Delhi visit, CM Revanth Reddy, Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news, K.C. Venugopal, Meenakshi Natarajan
  ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..! మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ చెప్పుకోవడం మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీ హస్తిన వీధులకు చేరింది. కొండా సురేఖ ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యల దుమారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం  పార్టీ క్రమశిక్షణపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై స్పష్టత నిమిత్తం సురేఖకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుమారు 60 నిమిషాల (1 గంట) పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ నియమావళిని దాటి వ్యవహరించే నేతలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి మరియు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. అయితే ఊహించని మలుపు తిరుగుతూ మంత్రి కొండా సురేఖ కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడంతో వరంగల్ రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కొండా సురేఖ అత్యంత ఘాటుగా స్పందించారు. "నన్ను అధిష్టానం పిలవలేదు, నేనే స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్ అడిగి ఢిల్లీకి వచ్చాను. పార్టీలో ఉన్నది మాట్లాడితే చర్యలు ఎందుకు తీసుకుంటారు?" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టించాయి. పార్టీ శ్రేణుల సంక్షేమం మరియు ప్రాంతీయ సమతుల్యత కోసమే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశామని, నిజ నిజాలు చెప్పడం క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో విడివిడిగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ వివాదానికి వీలైనంత త్వరగా స్వస్తి చెప్పాలని అధిష్టానం భావిస్తోంది. మంత్రి వర్గంలో 100 శాతానికి పైగా క్రమశిక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా కుటుంబం తమ స్వరాన్ని బలంగా వినిపిస్తోంది. పార్టీ మూలాలకు హాని కలగకుండా, సురేఖ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలా? లేక కేవలం వివరణతో సరిపెట్టి వ్యవహారాన్ని సర్దుమణిగేలా చేయాలా? అనే అంశంపై ఏఐసీసీ పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ తీవ్ర చర్యలు తీసుకుంటే ఉమ్మడి వరంగల్ పరిధిలోని దాదాపు 12 నియోజకవర్గాల్లో పార్టీ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ హైడ్రామాలో రాబోయే 24 గంటల్లో వెలువడే అధిష్టానం నిర్ణయమే మంత్రి కొండా సురేఖ భవిష్యత్తును నిర్ణయించనుంది.   Konda Surekha Delhi visit, Revanth Reddy Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news  
ALSO ON TELUGUONE N E W S
తమిళంలో క్రైమ్ మరియు సస్పెన్స్ కథాంశాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అదే బాటలో ఇవానా, వెంకట్ సెంగుట్టువన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'మథి మారన్'. మంత్ర వీరపాండియన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ఓటీటీ వీక్షకులను ఏ మేర మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే.. సుందరం అనే పోస్ట్‌మ్యాన్‌కు మథి (ఇవానా), నెడుమారన్ (వెంకట్) అనే కవల పిల్లలు ఉంటారు. అయితే నెడుమారన్ శారీరక ఎదుగుదల లేక పొట్టిగా ఉండిపోతాడు. సమాజంలో ఎదురయ్యే అవహేళనలను తట్టుకుంటూ అక్క మథి మద్దతుతో అతను పెరుగుతాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో మథి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడం, తల్లిదండ్రులు మనస్తాపంతో చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. తన అక్కను వెతుక్కుంటూ చెన్నై నగరానికి చేరుకున్న నెడుమారన్‌కు అక్కడ వరుసగా జరుగుతున్న దారుణ హత్యల గురించిన నిజాలు తెలుస్తాయి. ఓవైపు అక్క జాడ కనుక్కోవడం, మరోవైపు పోలీస్ వ్యవస్థతో కలిసి ఆ హంతకుడిని పట్టుకోవడానికి నెడుమారన్ ఏం చేశాడు? తన తెలివితేటలతో ఆ మిస్టరీని ఎలా చేధించాడు అనేది మిగతా కథాంశం. మనిషి ప్రతిభకు రూపం లేదా ఎత్తు ప్రమాణం కాదని, కేవలం తెలివితేటలే ముఖ్యమనే ఆసక్తికరమైన లైన్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నటుడిగా వెంకట్ తన పాత్రలో ఒదిగిపోగా, ఇవానా గ్లామర్ మరియు నటనతో అలరించింది. సాంకేతికంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తాయి. అయితే, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన ఉత్కంఠత ఈ చిత్రంలో కాస్త కొరవడింది. సాధారణ పౌరుడైన కథానాయకుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించడం వంటి సన్నివేశాలు సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో మెరుపులు లేకపోవడం, నెమ్మదించిన కథనం సినిమా గ్రాఫ్‌ను తగ్గిస్తాయి. ఓటీటీ వేదికలపై సరికొత్త కథలను చూడాలనుకునే ప్రేక్షకులు, తమిళ క్రైమ్ డ్రామాలను ఇష్టపడేవారు ఒకసారి ప్రయత్నించవచ్చు. అయితే కమర్షియల్ హంగులు, రొటీన్ మాస్ ఎలిమెంట్స్ ఆశించేవారికి ఇది అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తానికి 'మథి మారన్' ఒక మంచి ఆశయంతో తీసిన ప్రయత్నం అయినప్పటికీ, లీడ్ సీన్లు మరియు బలహీనమైన కథనం వల్ల సగటు క్రైమ్ డ్రామాగానే మిగిలిపోయింది. వీకెండ్‌లో ఓటీటీలో ఏదైనా భిన్నమైన లైన్ ఉన్న సినిమా చూడాలనుకుంటే ఒకసారి వీక్షించవచ్చు.     [Mathi Maran Movie Review, Mathi Maran Amazon Prime, Ivana Mathi Maran Telugu Review, Mathi Maran OTT Release, Venkat Senguttuvan Mathi Maran]
Allari Naresh’s upcoming fantasy comedy Ramba Oorvasi Menaka has completed its censor formalities ahead of its theatrical release. The film has been awarded a U/A certificate by the censor board and has locked a runtime of 2 hours and 20 minutes. Directed by Chandra Mohan, the film combines fantasy and comedy with a mother sentiment track. While Allari Naresh leads the narrative, the film also features senior actor Naresh VK, with their combination scenes reportedly forming an important part of the comedy. The fantasy portions revolve around Rashi Singh as Ramba and Vennela Kishore as Lord Indra. Their track is said to feature several comedy sequences and one-liners. Vishnu Priya and Trisha Singh play Oorvasi and Menaka respectively, while Surbhi is the female lead. Produced by Annapurna Studios and Hasya Movies, Ramba Oorvasi Menaka also relies heavily on fantasy elements and VFX. The film is scheduled to release worldwide tomorrow, with the makers looking to position it as a family-oriented comedy entertainer. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ నటుడిగా గుర్తింపు పొంది, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన దునియా విజయ్ వైవాహిక జీవితం ముగిసింది. గత కొంతకాలంగా సాగుతున్న విజయ్ మరియు ఆయన భార్య నాగరత్న వివాదానికి న్యాయస్థానం ఎండ్ కార్డ్ వేసింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. ఈ విడాకుల పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం నాగరత్నకు ఏకమొత్తంగా రూ.2 కోట్ల భరణం చెల్లించాలని దునియా విజయ్‌ని ఆదేశించింది. రెండు నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని అందించాలని, ఒకవేళ ఆలస్యమైతే ఏటా 6 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ డి.కె. సింగ్, జస్టిస్ హెచ్. శాంతి భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. పిల్లల భవిష్యత్తు, నాగరత్న పరిస్థితులు మరియు నటుడిగా విజయ్ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఫ్యామిలీ కోర్టు విజయ్ విడాకుల అభ్యర్థనను తోసిపుచ్చినప్పటికీ, దంపతుల నడుమ సత్సంబంధాలు దెబ్బతిని తిరిగి కలిసే అవకాశం లేకపోవడంతో హైకోర్టు ఈ కేసును పరిష్కరించింది. ఈ సందర్భంగా రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ప్రముఖులు మంచి విలువలు పాటించాలని కోర్టు వ్యాఖ్యానించింది. సొంతంగా నటుడిగా ఎదిగిన దునియా విజయ్ 2007లో వచ్చిన 'దునియా' సినిమాతో కన్నడలో తిరుగులేని ఇమేజ్ సాధించారు. ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రలు, యాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'వీరసింహారెడ్డి'లో ప్రతినాయకుడిగా ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'సిటీ లైట్స్' అనే ప్రాజెక్ట్ ద్వారా విజయ్ కుమార్తె మోనిషా కథానాయికగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. దునియా విజయ్ విడాకుల వ్యవధి తీర్పు వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, కన్నడ సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఈ పరిణామంపై భిన్న రకాలుగా స్పందిస్తూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ, విజయ్ తన రాబోయే చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయన కుమార్తె మోనిషా ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని విశేషాలు వెలువడనున్నాయి.
  నిర్మాణ సంస్థలకి డై హర్డ్ ఫ్యాన్స్ ఉంటారని నిరూపించిన సంస్థ 'వైజయంతీ మూవీస్’. హీరోల అభిమానులకైతే తమ హీరో  'వైజయంతీ మూవీస్’ లో సినిమా చేస్తున్నాడని అనౌన్స్ మెంట్ రావడం ఆలస్యం అభిమానులు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి ప్రెస్టేజియస్ట్ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి 2 తెరకెక్కిస్తుంది.  ఇప్పుడు  ఈ సంస్థ  పేరు ఉపయోగించి  నటీనటులుగా మారాలనుకునే అమాయక యువతని కొంత మంది మోసం చేస్తున్నారు. దీంతో  'వైజయంతీ' నుంచి ఒక నోట్ రిలీజయ్యింది.  ఆ నోట్ లో 'తమ బ్యానర్ నిర్మిస్తున్న ఏ సినిమాకూ ఎలాంటి మూడో వ్యక్తి, ఏజెన్సీ లేదా థర్డ్ పార్టీ కాస్టింగ్ ఏజెంట్లను నియమించలేదు. మా నిర్మాణ సంస్థ పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి, ఆడిషన్స్ ఇప్పిస్తామని, అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలికినా, డబ్బులు లేదా ఇతర రుసుములు డిమాండ్ చేసినా  నమ్మకండి. సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో 100 శాతం అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. వైజయంతీ మూవీస్ చేపట్టే ప్రతి ఒక్క అధికారిక ఆడిషన్, కాస్టింగ్ కాల్ ప్రకటన కేవలం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్, వెరిఫైడ్ ఖాతాల ద్వారా మాత్రమే వెలువడుతుంది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వచ్చే అన్  వెరిఫైడ్ పోస్టులు, ఈమెయిళ్లు, ఫోన్ కాల్స్ నమ్మి ఎవరూ మోసపోవద్దని, తమ వ్యక్తిగత సమాచారాన్ని లేదా సొమ్మును ఎవరికీ అందజేయవద్దని గట్టిగా హెచ్చరించింది.     Also read: చిరంజీవి రుద్రవీణ గుర్తుకొచ్చింది: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్  అంతేకాకుండా తమ సంస్థ పేరుని  అక్రమంగా వాడుకుంటూ ఫేక్ కాస్టింగ్ కాల్స్ నిర్వహిస్తున్న వారిపై, ప్రజలను మభ్యపెడుతున్న సైబర్ క్రిమినల్స్‌పై కఠినమైన చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే బాధ్యులపై ఐటీ చట్టాల ప్రకారం ఫిర్యాదు చేయడానికి చర్యలు సిద్ధం చేశామని వైజయంతి సంస్థ పేర్కొనడం సంచలనం సృష్టిస్తుంది.  [ Vyjayanthi Movies, Prabhas, Ashwinidutt, Fake Casting Calls, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews ]  
నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాయదు లోహర్, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, ఆంటోనీ వర్గీస్, కదిర్ సాంకేతిక బృందం: స్క్రీన్ ప్లే: ఇస్మాయిల్ అబూబకర్, సంజీర్ బాబా, బిలాల్ మొయిదు సంగీతం: జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: జిమ్షీ ఖలీద్ ఎడిటింగ్: చమన్ చాకో దర్శకత్వం: నహాస్ హిదాయత్ నిర్మాతలు: దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ తెలుగు రాష్ట్రాల్లో దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) కు మంచి క్రేజ్ ఉంది. 'కింగ్ ఆఫ్ కోత' తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న ఆయన, ఎట్టకేలకు ఐ యామ్ గేమ్ (I'M Game)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలు వాయిదాల తర్వాత ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి 'RDX' ఫేమ్ నహాస్ హిదాయత్ (Nahas Hidayath) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. కథ: డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) గ్యాంబ్లింగ్‌కు బానిస. అందరూ అతన్ని 'లూజర్' అని పిలుస్తుంటారు, అతని తండ్రి కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. అప్పుల నుంచి బయటపడేయడానికి అతని తల్లి (Jayasudha) తన జీవితకాలపు పొదుపు మొత్తాన్ని ఇస్తుంది. కానీ అతను ఆ డబ్బును కూడా సీపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై పందెం కాసి, ఏకంగా రూ. 2 కోట్ల అప్పుల్లో కూరుకుపోతాడు. ఆ బెట్టింగ్ గ్యాంగ్స్టర్‌ను బెదిరించబోయి, ఒక ప్రమాదంలో తన కుడి చేతిని కోల్పోతాడు. దాత విక్కీ (Anthony Varghese) చేతిని డాన్‌కు అమరుస్తారు. అయితే ఆ కొత్త చేయి తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ, డాన్ జీవనశైలిని మార్చేలా చేస్తుంది. దాని ప్రభావం నుంచి డాన్ బయటపడలేకపోతాడు. ఆ చేతి ప్రభావంతోనే డాన్, డేవిడ్ (Mysskin) అనే గ్యాంగ్స్టర్‌ను వెంటాడతాడు. అసలు విక్కీకి, డేవిడ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పూర్తి నిజం తెలుసుకున్న తర్వాత డాన్ ఏం చేశాడు? అనేది మిగతా కథ. విశ్లేషణ: యాక్షన్ సన్నివేశాల్లో దుల్కర్ సల్మాన్ నటన బాగుంది. తెరపై అతని ప్రెజెన్స్ వల్ల సీన్స్ అన్నీ సహజంగా అనిపిస్తాయి. చాలా సన్నివేశాల్లో అతని ఛార్మ్ ఆకట్టుకున్నా, కొన్నిచోట్ల యాక్షన్ సీన్స్ మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. కాయదు లోహర్, సంయుక్త విశ్వనాథన్, కదిర్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్ తమ పాత్రల పరిధి మేర నటించారు, కానీ ఎవరూ అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. కదిర్ పాత్రను ఇంకాస్త మెరుగ్గా రాసుకోవాల్సింది. దర్శకుడు నహాస్ హిదాయత్ మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ, రొటీన్ సన్నివేశాలతో దాన్ని కేవలం యాక్షన్ కోసమే వాడుకున్నట్లు అనిపిస్తుంది. క్రికెట్ బెట్టింగ్ ట్రాక్, ఆ తర్వాత వచ్చే ఫైట్ బాగా డిజైన్ చేసినా... ఆ తర్వాత స్క్రీన్ ప్లే సాధారణంగానే సాగుతుంది. క్లైమాక్స్ వైపు వెళ్తున్నప్పుడు కథ బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. దుల్కర్ తన నటనతో సినిమాను నిలబెట్టడానికి ప్రయత్నించినప్పటికీ, ఫస్ట్ హాఫ్ ఇచ్చిన మంచి కిక్ సెకండ్ హాఫ్‌లో మిస్ అవుతుంది. యాక్షన్ ఎక్కువున్న ద్వితీయార్థం ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా మారిపోయింది. టెక్నికల్ గా జేక్స్ బిజోయ్ సంగీతం, సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. కానీ ఎడిటింగ్ కొన్ని చోట్ల అతుకులు అతికించినట్లుగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే, మంచి కథాంశం ఉన్నప్పటికీ రొటీన్ స్క్రీన్ ప్లే సినిమా స్థాయిని తగ్గించేసింది. ప్లస్ పాయింట్స్: దుల్కర్ సల్మాన్ నటన కాయదు లోహర్ సన్నివేశాలు ఆంటోనీ వర్గీస్ ఫ్లాష్ బ్యాక్ సంగీతం కొన్ని యాక్షన్ సన్నివేశాలు మైనస్ పాయింట్స్: రొటీన్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ సాగదీత కొన్ని రొటీన్ సన్నివేశాలు ఎడిటింగ్ లోపాలు కథాంశం పక్కదారి పట్టడం బాటమ్ లైన్: దుల్కర్ సల్మాన్ నటన బాగున్నప్పటికీ, రొటీన్ కథనం వల్ల కాస్త నిరాశే మిగులుతుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. రేటింగ్:  2.5/5   డిస్క్లైమర్: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి. దీనికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
    రుద్రవీణ.. నటనకి, పాటలకి, సాహిత్యానికి, దర్శకత్వానికి మరణం ఉండదని నిరూపించిన ఆణిముత్యం లాంటి సినిమా.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినీ శిఖరం కూడా. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన అభిమానులకి ఫేవరేట్ మూవీతో పాటు సాంగ్స్ అయితే నిత్యం ఎక్కడో ఒక చోట వినిపిస్తుండంతో పాటు ఎంతో మందిలో దైర్యం, కరుణ, ప్రేమ, సమాజంపట్ల బాధ్యతగా ఉండేలా చేసింది.  'డెడ్ పిక్సెల్స్', 'కుమారి శ్రీమతి', 'హాస్టల్ డేస్' వంటి హిట్ సిరీస్‌లలో తన నటనతో అలరించిన  అక్షయ్ లగుసాని  'ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రాబోతున్న 'జగమే సంగీతం' అనే మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ 'నాకు ఈ కథ ఆఫర్ రాగానే మొదటగా గుర్తుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి  క్లాసిక్ మూవీ  'రుద్రవీణ' . సంగీతం నేపథ్యంగా సాగే కుటుంబ బంధాలు, సాంప్రదాయాలు, తరాల మధ్య ఘర్షణ అనేవి తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుండెకు హత్తుకునే అంశాలు. 'జగమే సంగీతం'లో నటించడం నా కెరీర్‌లోనే అత్యంత భావోద్వేగాలతో కూడిన ప్రయాణం. వైకుంఠపురం అనే పుణ్యక్షేత్రం నేపథ్యంలో సాగే ఈ కథలో సంగీత వారసత్వాన్ని కాపాడుకోవడం, సొంత గుర్తింపును వెతుక్కోవడం వంటి కీలకమైన అంశాలను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్ చెప్పుకొచ్చాడు.     Also Read: ఇక నుంచి థియేటర్స్ లో సరికొత్త వెర్షన్: ఈ సారి రొమాన్స్ అంతకు మించి  ఈ సిరీస్‌ను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుస్మిత కొణిదెల నిర్మించగా, ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్,  శ్రీకాంత్, మధుబాల, సుస్మిత శెట్టి కీ రోల్స్ . సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన వీనులవిందైన స్వరాలు  ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక శతాబ్ద కాలపు సంగీత సాంప్రదాయాన్ని, పాప్ సంగీత ప్రపంచాన్ని జతచేస్తూ రూపొందించిన ఈ వెబ్ సిరీస్, ఓటీటీ వేదికపై ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని చిత్రబృందం కూడా ప్రచార కార్యక్రమాల్లో  ధీమా వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 4 నుండి ఏమినిది  ఎపిసోడ్ల వెబ్ సిరీస్ గా రానుంది.      [ Chiranjeevi, Prakash Raj, Palnati Surya Pratap, Jagamae Sangeetham, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews]      
భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న విశ్వనటుడు ఉలగనాయగన్ కమల్ హాసన్ ఎప్పటికప్పుడు కొత్త తరం దర్శకులను ప్రోత్సహిస్తూ సరికొత్త ప్రాజెక్టులతో అలరిస్తుంటారు. తాజాగా ఆయన మరో సెన్సేషనల్ డైరెక్టర్‌తో చేతులు కలిపి అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'పన్నైయారుమ్ పద్మినియుమ్', 'సేతుపతి', 'చిత్తా' (సిద్ధా), మరియు విక్రమ్ హీరోగా వచ్చిన 'వీర ధీర సూరన్' వంటి వైవిధ్యమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన యంగ్ డైరెక్టర్ ఎస్.యు.అరుణ్ కుమార్‌ దర్శకత్వంలో కమల్ హాసన్ ఒక పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' (RKFI) బ్యానర్‌పై ఆర్‌. మహేంద్రన్ మరియు టర్మెరిక్ మీడియాతో కలసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. "హియర్ ఐ కమ్" అనే క్యాప్షన్‌తో చేతిలో ఆయుధం పట్టుకున్న కమల్ హాసన్ ఇంటెన్స్ పోస్టర్‌తో నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసింది. దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ రాసుకునే కథలు చాలా గ్రౌండెడ్‌గా, బలమైన ఎమోషన్స్ మరియు క్యారెక్టర్ డ్రైవెన్ ఎలిమెంట్స్‌తో కూడుకుని ఉంటాయి. అలాంటి సెన్సిబుల్ మేకర్ కమల్ హాసన్ లాంటి విశ్వనటుడిని ఏ రేంజ్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారనేది ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రచారం ప్రకారం.. కమల్ హాసన్ ఇమేజ్‌కు తగినట్లు ఒక పవర్ ఫుల్ పోలీస్/యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉండబోతున్నట్లు సమాచారం. గతంలో విశ్వనటుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సొంత బ్యానర్‌లో వరుసగా యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్ ఎలిమెంట్స్, లోతైన ఎమోషన్స్ ఉండే కథలకు ప్రాధాన్యమిచ్చే అరుణ్ కుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఖాతాలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. ఈ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో రాగానే అభిమానులు మరియు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. సిద్ధా, సేతుపతి వంటి చిత్రాలతో రియలిస్టిక్ టేకింగ్‌ను చూపించిన అరుణ్ కుమార్ - కమల్ హాసన్ తోడు కావడంపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఇతర పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.       [Kamal Haasan SU Arun Kumar Movie, RKFI New Project Announcement, Kamal Haasan Next Movie Updates, Chithha Director SU Arun Kumar, Ulaganayagan Kamal Haasan Kollywood News]
  యష్ వన్ మాన్ షో ‘టాక్సిక్'  ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 322 కోట్ల క్లబ్ లో ఉంది. మరి ఈ లెక్కన పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే 322 కోట్ల నెంబర్  కాస్తా 622 కోట్ల నెంబర్ గా మారేదని ట్రేడ్ సర్కిల్స్ తో పాటు అభిమానుల అభిప్రాయం. అయితే టాక్సిక్  విడుదలైనప్పటి నుంచి సినీ ప్రియుల మధ్య ఒకటే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేంటంటే, ఈ చిత్రాన్ని కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా ఒకేసారి చిత్రీకరించారు. కానీ, ఇండియన్ థియేటర్లలో కేవలం ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజ్  చేయడంతో ఇంగ్లీష్ వెర్షన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ  అభిమానుల ఆ నిరీక్షణకి  తెరదించుతూ  ‘టాక్సిక్’ ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌ సెప్టెంబర్ 4న భారతీయ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్  అధికారికంగా వెల్లడించారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, తిరువనంతపురం వంటి ప్రధాన నగరాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఉండబోతున్నాయి. అయితే ఈ ఇంగ్లీష్ వెర్షన్‌లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే దాని రన్‌టైమ్. భారతీయ భాషల్లో విడుదలైన ఒరిజినల్ వెర్షన్ రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 14 నిమిషాలు (194 నిమిషాలు) ఉండగా, చాలామంది ప్రేక్షకులు సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.        Also Read: రష్మిక షాకింగ్ కామెంట్స్: మూడు నెలల పాటు విజయ్, రష్మిక దూరంగా ఉన్నారా!  ఇప్పుడు రాబోతున్న ఇంగ్లీష్ వెర్షన్‌  దాదాపు 17 నిమిషాల నిడివి తక్కువతో రాబోతుంది. కన్నడ మరియు ఇంగ్లీష్ వెర్షన్లు రెండూ సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికేట్ పొందినప్పటికీ, ఈ కొత్త వెర్షన్ వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో మరింత ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది. సినిమాను ఒరిజినల్ మేకింగ్ టోన్, డెప్త్ మరియు ఎమోషన్స్‌తో ఇంగ్లీష్ భాషలోనే నేరుగా అనుభూతి చెందేందుకు ఇది మంచి అవకాశమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  ఇప్పటికే ఈ వెర్షన్ బుకింగ్స్ ఆన్‌లైన్ వేదికల్లో ప్రారంభమయ్యాయి. మరి  ఇంగ్లీష్ వెర్షన్ విడుదల తర్వాత కలెక్షన్ల విషయంలో ఎలాంటి ఊపు అందుకుంటుందో చూడాలి.    [Toxic, yash, Kaira Adwani, Geethu Mohandas, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews]  
Cast: Dulquer, Kayadu Lohar, Mysskin, Samyuktha Viswanathan, Antony Varghese, and Kathir  Crew:  Screenplay: Ismail Aboobacker, Sanjeer Baba, Bilal Moidu  Music Composer: Jakes Bejoy  Cinematography:Jimshi Khalid  Editor: Chaman Chakko Director : Nahas Hidhayath  Producer: Dulquer Salmaan and Jom Varghese    Dulquer Salmaan has a good market in Telugu States and he took time off from Malayalam films for 3 years post King of Kotha. Now, he is back with I'M Game and the movie released after many delays today. RDX fame Nahas Hidayath directed the film. Let's discuss about it in detail.    Plot:  Dan John (Dulquer Salmaan) is a gambling addict and keeps being called as a Loser. His rich father also treats him the same way. His mother (Jayasudha) gives him her life-long savings to bail himself out from a betting debt. But he gambles it on a CPL Final match and ends up with 2 crores debt. He chooses to threaten the gangster running the racket and ends up losing his right hand in an accident.  His hand is transplanted using a donor Vicky (Anthony Varghese)'s hand. But it starts behaving like an individual entity and forces Dan to change his lifestyle. He is unable to bring himself out of its influence. But under its influence he chases a mob boss David (Mysskin). What is the relation between Vicky and David? What would Dan do after knowing the entire truth? Watch the movie to know more.    Analysis:  Dulquer Salmaan is good in action sequences and he brought a unique character to the proceedings. His likeable screen presence makes them all believable. His charm is good in many scenes but action sequences seem to have been stretched too much at places.  Kayadu Lohar, Samyuktha Viswanathan, Kathir, Mysskin, Anthony Varghese are good in their roles. But none of them leave an impact. Samyuktha's close ups tend to be her weakness. Kathir role could have designed even better.  Writing wise, Nahas Hidayath takes a novel core plot but goes into cliched scenes and action sequences making it all an excuse to do action. While the cricket betting angle, immediate fight are well designed, after that the screenplay never really rises above the mediocrity.  It feels like it is dragging the obvious a bit too much towards the climax. While Dulquer Salmaan tries to save it with his magnetic presence, the action heavy second half becomes more template commercial cinema after its good start.  Technically, Jakes Bejoy's music, Cinematography and VFX are good enough but editing at places feels random. Overall, movie has a good premise undermined by too template driven screenplay towards the end.    Positives:  Dulquer Salmaan's performance  Kayadu Lohar scenes  Anthony Varghese backstory  Music Few action sequences    Negatives:  Template driven narrative  Drag in second hour  Few scenes being too cliched  Editing is random  Impressive premise looses steam.    Bottomline:  DQ is good but too much template driven narrative spoils fun. Watchable for Action lovers.    Rating: 2.5/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
    అభిమానుల ఆశలు, ప్రార్థనలు ఫలించి విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  కెరీర్ పరంగా ఇద్దరు బిజీగా ఉన్నారు. అయితే  కొన్ని రోజుల క్రితం 'మైసా' షూటింగ్ లో గాయాలపాలవ్వడంతో రష్మిక ప్రస్తుతం రెస్ట్  మోడ్ లో ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన  ఒక ఇంటర్వ్యూ లో తమ వివాహం తర్వాత జరిగిన విషయాలు చెప్పడంతో ఇప్పుడు అభిమానులు షాక్ కి గురయ్యే పరిస్థితి.   రష్మిక మాట్లాడుతు 'పెళ్లయిన తర్వాత దాదాపు 3 నెలల పాటు నేను, విజయ్ ఒకరినొకరం నేరుగా చూసుకోలేదు.నిరంతరం సినిమాల షూటింగ్‌లు, అవుట్‌డోర్ షెడ్యూల్స్, ప్రయాణాల వల్ల పని ఒత్తిడిలో ఉండిపోయాం. కేవలం ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా మాత్రమే పలకరించుకునే వాళ్ళం. అయితే ‘మైసా’ షూటింగ్ లో గాయమవడంతో  డాక్టర్లు  కొన్నివారాల పాటు కదలకుండా విశ్రాంతి తీసుకోమని సూచించారు. కెరీర్ ప్రారంభించిన దాదాపు 8 ఏళ్ల తర్వాత  ఇన్ని రోజులు ఒకే చోట ఇంట్లోనే ఉండటం ఇదే తొలిసారి.   Also Read: జైలర్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ డేట్ కి ఉన్న స్పెషల్ ఇదే  ఈ విశ్రాంతి సమయాన్ని  ఒక రకమైన ఆశీర్వాదంగానే భావించాను . "మా ఇద్దరికీ పెళ్లి తర్వాత ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కలేదు, అందుకే ఆ దేవుడే లేదా విశ్వమే నన్ను ఇంట్లో కూర్చోబెట్టి విజయ్‌తో సమయాన్ని గడిపేలా ప్లాన్ చేసిందేమో" అని ఆమె సంతోషంగా చెప్పుకొచ్చారు. ఈ బ్రేక్ వల్ల పెళ్లయిన 6 నెలల తర్వాత మొదటిసారిగా ఇద్దరూ కలిసి ఇంట్లో ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకుని క్వాలిటీ టైమ్ గడిపినట్లు వివరించారు.     [ Rashmika Mandanna, Vijay Deverakonda, Three months, Rashmika Injury, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews ]   
  మనదేశంలో చాలామందికి ఉదయాన్నే లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ పడాల్సిందే. అలసటను పారద్రోలి శరీరానికి, మనస్సుకు తక్షణ ఉత్సాహాన్ని ఇవ్వడంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఒకటి రెండు కప్పుల టీ తాగడం సాధారణ అలవాటు అయినప్పటికీ, చాలామంది రోజులో పదే పదే టీ తాగుతుంటారు. అయితే, ఇలా పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని, శరీరంలో కాల్షియం స్థాయిలు గణనీయంగా పడిపోతాయని సోషల్ మీడియాలో నిరంతరం వార్తలు ప్రచారమవుతుంటాయి. ఈ ప్రచారం వినగానే టీ ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. అసలు టీ తాగడానికి, ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి? అతిగా టీ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయా? ఈ విషయాలపై వైద్య నిపుణులు మరియు పరిశోధకులు వెల్లడించిన శాస్త్రీయ నిజాలను వివరంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. పరిశోధనల ప్రకారం టీలో  కెఫిన్  అనే సమ్మేళనం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రతి కప్పు టీలో దాదాపు 30 నుండి 50 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. మనం అధిక మొత్తంలో కెఫిన్ తీసుకున్నప్పుడు, అది మూత్రపిండాల (కిడ్నీల) ద్వారా శరీరంలోని కాల్షియం మూత్రం రూపంలో బయటకు విసర్జించబడేలా చేస్తుంది. సాధారణంగా మనం ప్రతి 60 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకున్నప్పుడు, శరీరం నుండి సుమారు 1 నుండి 2 మిల్లీగ్రాముల కాల్షియం నష్టపోతామని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే రోజుకు 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో టీ తాగే వారిలో కాల్షియం లోపం ఏర్పడే అవకాశాలు స్వల్పంగా పెరుగుతాయి. ముఖ్యంగా, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కాల్షియం శాతం తక్కువగా ఉన్నప్పుడు, ఈ కెఫిన్ ప్రభావం ఎముకల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎముకల నుండి కాల్షియం కరిగిపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు లొసుగుబారి, త్వరగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఇక్కడే మరొక ఆసక్తికరమైన సైంటిఫిక్ కోణం దాగి ఉంది. టీలో కేవలం కెఫిన్ మాత్రమే కాకుండా  ఫ్లేవనాయిడ్లు  (Flavonoids) మరియు  ఫైటోఈస్ట్రోజెన్లు  అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల క్షీణతను అడ్డుకోవడంలో మరియు ఎముకల సాంద్రతను (Bone Mineral Density) మెరుగుపరచడంలో ఎంతో సాయపడతాయి. ముఖ్యంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే కాంపౌండ్లు ఎముకలను పునర్నిర్మించే  ఆస్టియోబ్లాస్ట్  కణాల పనితీరును వేగవంతం చేస్తాయని, అదే సమయంలో ఎముకలను కరిగించే  ఆస్టియోక్లాస్ట్  కణాల చర్యలను అదుపు చేస్తాయని రీసెర్చ్‌లో తేలింది. కాబట్టి మిితంగా అంటే రోజుకు 2 నుండి 3 కప్పుల టీ తాగే వారిలో ఎముకలు బలహీనపడటం అటుంచి, పైగా ఎముకల ఆరోగ్యం మరింత బలపడుతుందని బహుళ అధ్యయనాలు నిరూపించాయి. మరి టీ తాగే అలవాటు ఉన్నవారు ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది టీ తాగే పరిమాణాన్ని రోజుకు 2 లేదా 3 కప్పులకు పరిమితం చేసుకోవడం చాలా మంచిది. రెండవది, టీ చేసేటప్పుడు అందులో తగినంత పాలు ఉపయోగించడం వల్ల, టీ ద్వారా కోల్పోయే స్వల్ప కాల్షియంను పాలలోని ఉత్కృష్టమైన కాల్షియం భర్తీ చేస్తుంది. భోజనం చేసిన వెంటనే లేదా ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు తీసుకునే సమయంలో టీ తాగకపోవడం ఉత్తమం, ఎందుకంటే టీలోని టాన్సిన్లు పోషకాల శోషణను అడ్డుకుంటాయి. మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు మరియు విటమిన్ డి లభించే పదార్థాలను సమృద్ధిగా చేర్చుకుంటే టీ వల్ల ఎముకలకు ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి టీని పరిమితంగా, సరైన పద్ధతిలో ఆస్వాదిస్తే ఆరోగ్యానికి ఎలాంటి భయం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. How much tea is safe for bones,tea and bone health myths vs reality.
  మన శరీరం మన ఆరోగ్య స్థితికి సంబంధించి నిరంతరం అనేక రకాల సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థలో ఉత్పత్తయ్యే శ్లేష్మం లేదా తెమడ (Phlegm) రంగును బట్టి మన ఊపిరితిత్తులు మరియు గొంతు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చాలా సులభంగా అంచనా వేయవచ్చు. వర్షాకాలం, చలికాలం లేదా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు దగ్గుతో పాటు తెమడ రావడం సర్వసాధారణం. అయితే చాలామంది ఈ తెమడ రంగును ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం శ్లేష్మం రంగు మన శరీరంలో ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి ముదిరిందో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి తెమడ వేర్వేరు రంగుల్లోకి మారడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను, వైద్య సంకేతాలను ప్రతీ ఒక్కరూ అవగాహన చేసుకోవడం ఎంతైనా అవసరం. సాధారణంగా ఆరోగ్యకరమైన మనుషుల్లో తెమడ స్పష్టంగా, పారదర్శకంగా (Clear Phlegm) లేదా స్వల్పమైన తెలుపు రంగులో ఉంటుంది. నీరు, ప్రొటీన్లు, యాంటిబాడీలు మరియు లవణాలతో కూడిన ఈ పారదర్శక తెమడ శ్వాసకోశ మార్గాలను తేమగా ఉంచడానికి, బయటి నుండి వచ్చే దుమ్ము ధూళిని అడ్డుకోవడానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ఒకవేళ ఈ తెమడ విపరీతంగా పెరిగితే అలర్జీలు లేదా ఎలర్జిక్ రినిటిస్ వంటి సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక తెమడ కాస్త చిక్కగా మారి తెల్లటి రంగులోకి (White Phlegm) మారితే, శ్వాసనాళాల్లో వాపు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని సూచిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కైటిస్ లేదా నెమ్ము (Congestion) చేసినప్పుడు పిండం లాంటి చిక్కటి తెల్ల తెమడ రావడం కనిపిస్తుంది. అత్యంత సాధారణంగా చాలామందిలో కనిపిచేది పసుపు లేదా ఆకుపచ్చ రంగు తెమడ (Yellow or Green Phlegm). తెమడ పసుపు రంగులోకి మారడం అనేది మన నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌తో పోరాడటం ప్రారంభించిందనడానికి స్పష్టమైన సంకేతం. శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ (తెల్ల రక్త కణాలు) బాక్టీరియాతో పోరాడి చనిపోయినప్పుడు అందులోని మైలోపెరాక్సిడేస్ అనే ఎంజైమ్ వల్ల శ్లేష్మం పసుపు నుంచి క్రమంగా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇది తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, సైనసైటిస్, నిమోనియా లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు నిదర్శనం. కాబట్టి తెమడ ఆకుపచ్చగా మారి కొన్ని రోజులకు పైగా ఉంటే వెంటనే యాంటీబయోటిక్ చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి.       Blood in phlegm symptoms and lung health, phlegm color meaning and infection signs.
  నేటి ఆధునిక జీవనశైలిలో వేగంగా బరువు తగ్గడానికి మరియు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి అనేకమంది ఆశ్రయిస్తున్న ప్రసిద్ధ పద్ధతుల్లో  డిటాక్స్ వాటర్  ఒకటి. నీళ్లలో నిమ్మకాయ ముక్కలు, దోసకాయ, అల్లం, పుదీనా, లేదా రకరకాల పండ్ల ముక్కలు వేసి నానబెట్టి, ఆ నీటిని రోజంతా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి బరువు తగ్గుతారనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతోంది. అయితే డిటాక్స్ వాటర్ నిజంగానే బరువు తగ్గిస్తుందా లేక ఇదొక సాధారణ మార్కెటింగ్ భ్రమ మాత్రమేనా అనే అంశంపై ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు స్పష్టమైన సైంటిఫిక్ నిజాలను వెల్లడిస్తున్నారు. ఎలాంటి నిజాలు దాగి ఉన్నాయో శాస్త్రీయంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ముందుగా డిటాక్స్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు లేదా టాక్సిన్లు దానంతట అవే బయటకు వెళ్తాయని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. మన మానవ శరీరంలో కాలేయం (లివర్) మరియు మూత్రపిండాలు (కిడ్నీలు) నిరంతరం పనిచేస్తూ వ్యర్థాలను బయటకు పంపే అద్భుతమైన సహజ సిద్ధమైన వ్యవస్థను కలిగి ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి డిటాక్స్ పానీయాలు తాగాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, క్రమం తప్పకుండా డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరానికి ఒక ప్రధానమైన మేలు జరుగుతుంది. అది నీటి శాతాన్ని పెంచడం లేదా హైడ్రేషన్‌గా ఉంచడం. సాధారణ నీటిని సరిగా తాగలేని వారు, పండ్లు మరియు మూలికల సువాసన ఉన్న ఈ నీటిని రుచికరంగా భావించి ఎక్కువ మొత్తంలో తాగుతారు. శరీరం సరిగ్గా హైడ్రేట్ అయినప్పుడు మెటబాలిజం అంటే జీవక్రియ రేటు స్వల్పంగా మెరుగుపడుతుంది, ఇది పరోక్షంగా కేలరీలను వేగంగా ఖర్చు చేయడానికి తోడ్పడుతుంది. డిటాక్స్ వాటర్‌లో వేసే నిమ్మకాయ, పుదీనా, అల్లం వంటి పదార్థాల వల్ల నీటికి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు శోథ నిరోధక (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ) గుణాలు లభిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, కడుపు ఉబ్బరం తగ్గించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి కొంతవరకు సహాయపడతాయి. ముఖ్యంగా భోజనానికి ముందు తగినంత నీరు తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి, ఆహారం తక్కువగా తింటారు. దీనివల్ల క్యాలరీల గ్రహంపు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. అంతే తప్ప, కేవలం ఈ నీరు తాగడం వల్లే పొట్టలోని కొవ్వు కరిగిపోతుందని భావించడం శాస్త్రీయంగా నిరూపించబడలేదు. నిలకడైన బరువు తగ్గుదల అనేది సరైన పోషకాహారం, శారీరక వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది.       Detox drinks benefits and side effects guide, scientific truth about belly fat detox water.
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి. కానీ  ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కొందరు అనారోగ్యం చేసినప్పుడు లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్ లలో ఉన్నప్పుడు పత్యం చేయమని చెబుతారు.   పత్యం ఆహారంలో ఉన్నప్పుడు వంకాయను తినకూడదని చెబుతూ ఉంటారు.  సాధారణంగా  సాంప్రదాయ ఆయుర్వేదం, నాటు వైద్యంలో కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి వంకాయ తినకూడదని సిఫారసు చేస్తారు.  సాధారణ రోజుల్లో వంకాయ రుచికరమైన, పోషకాలున్న కూరగాయ అయినప్పటికీ, పత్యం వేళల్లో దీనిని మినహాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంకాయను పత్యం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదో వివరంగా తెలుసుకుంటే.. వంకాయ.. వంకాయను ఆయుర్వేదంలో వాత, పిత్త దోషాలను పెంచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్నప్పుడు లేదా రోగ నివారణకు పత్యం ఉంటున్నప్పుడు వంకాయ తింటే వాత దోషం పెరిగి నొప్పులు, జాయింట్లలో ఇబ్బందులు వస్తాయి. వంకాయ విత్తనాల్లో , తోలులో కొన్ని రకాల సహజ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో, లేదా ఇప్పటికే దద్దుర్లు, దురదలు, అలర్జీలతో బాధపడుతున్న వారిలో సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఔషధాల ప్రభావం సరిగ్గా పనిచేయాలన్నా చర్మ సంబంధిత పత్యంలో వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో సులభంగా అరగని వంకాయను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు నాటు వైద్యంలో ప్రత్యేక పత్యం సూచిస్తారు. వంకాయ శరీరంలో వేడిని,   దురదను పెంచి పుండ్లు త్వరగా మానకుండా అడ్డుకుంటుందని చెప్తారు. వంకాయ సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ. ఇందులో సోలనైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, పత్యం చేసేవారిలో , మందులు వాడేవారిలో ఇది జీర్ణ వ్యవస్థపై , నాడీ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పత్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, ఔషధాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయడానికి వంకాయకు దూరంగా ఉండాలని పెద్దలు , ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తారు. పత్యం పూర్తయి శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాతే వంకాయను ఆహారంలో తిరిగి చేర్చుకోవడం మంచిది.                          *రూపశ్రీ.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ, మన తాతల తండ్రుల కాలంలో ఎలాంటి ప్రొటీన్ పౌడర్లు ఉండేవి కావు. అయినా వారు ఎంతో బలంగా, శక్తివంతంగా, దీర్ఘకాలిక ఆరోగ్యంతో జీవించారు. దానికి కారణం వారు రోజూ తీసుకునే సంప్రదాయ భారతీయ ఆహారమే! మన ప్రాంతీయ వాతావరణం, రుతుపవనాలు , పాతకాలపు వంట పద్ధతుల ఆధారంగా మన పళ్లెంలో చేరే రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించేవి. ఆధునిక ఆహార అలవాట్ల వల్ల కాలక్రమేణా మనం మరచిపోయిన, కానీ మన తాతల కాలంలో క్రమం తప్పకుండా తిన్న 10 శక్తివంతమైన ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయి.  నిజానికి ఇవన్నీ ప్రోటీన్ సూపర్ ఫుడ్స్.. అవేంటో తెలుసుకుంటే..  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:  ఉలవలు.. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట్లో క్రమం తప్పకుండా వాడే ధాన్యాల్లో ఉలవలు ముఖ్యమైనవి. శాకాహారంలో ప్రోటీన్ అత్యధికంగా లభించే ఆహారాల్లో ఇది ఒకటి. మన తాతలు రోజంతా కష్టపడి పనిచేయడానికి అవసరమైన శక్తిని ఈ ఉలవలే ఇచ్చేవి. ఉలవ చారు, ఉలవ పప్పు, చట్నీలు లేదా గుగ్గిళ్ల  రూపంలో వీటిని తీసుకునేవారు. ప్రోటీన్‌తో పాటు ఇందులో ఐరన్, పీచు పదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ రాళ్లను నివారించడంలోనూ, శరీరంలో కొవ్వును తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. సత్తు పిండి.. ఇది శనగలను వేయించి, మెత్తగా పొడి చేసి తయారుచేసే సంప్రదాయ ఆహారం. ప్రోటీన్ షేక్స్‌కు ఇది పూర్వీకుల కాలం నాటి దేశీ వెర్షన్ అని చెప్పవచ్చు. వేసవికాలంలో సత్తు పిండిని నీళ్లు, నిమ్మరసం, మసాలాలతో కలిపి  తాగేందుకు వాడేవారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. నాణ్యమైన ప్రోటీన్ , ఫైబర్ ఉన్న సత్తు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నల్ల శనగలు.. ఈ రోజుల్లో తెల్ల శనగలు వాడకం పెరిగినప్పటికీ, పూర్వకాలంలో నల్ల శనగలదే హవా రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే గుడాలుగా  తినడం లేదా కూరల్లో వాడటం చేసేవారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వేయించిన నల్ల శనగలను తీసుకెళ్లేవారు. ఇవి త్వరగా పాడవవు, తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఇవి ప్లాంట్ బేస్డ్   ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను సమృద్ధిగా అందిస్తాయి.  బొబ్బర్లు / అలసందలు.. బొబ్బర్లు లేదా అలసందలు ఒకప్పుడు ప్రతీ ఇంట్లోనూ రెగ్యులర్‌గా వండే కూర ధాన్యం. వీటిలో అత్యధిక మోతాదులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ , ఐరన్ ఉంటాయి. నాటు దినుసులు , మసాలాలతో నెమ్మదిగా ఉడికించి చేసే బొబ్బర్ల కూర లేదా గుడాలు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మట్కీ / మోత్ బీన్స్.. రాజస్థాన్ వంటి పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా పండే మట్కీ లేదా మోత్ బీన్స్ చిన్నగా ఉన్నప్పటికీ పోషకాల గని. ఇవి చూడటానికి పెసల సైజ్ లో ఉంటాయి. కానీ వీటి రంగు మాత్రం భిన్నంగా ఉంటుంది.  తక్కువ నీటితో పండే ఈ పంట రైతులకు, ప్రజలకు ప్రధాన ప్రోటీన్ మూలంగా ఉండేది. వీటిని మొలకలెత్తించి తినడం లేదా కారంగా కూర వండుకోవడం చేసేవారు. ధాన్యాలను మొలకెత్తించడం వల్ల వాటిలోని ప్రోటీన్ , ఇతర పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుందని మన పూర్వీకులకు ముందే తెలుసు. మినపప్పు.. నేడు మినపప్పును కేవలం ఇడ్లీ, దోస పిండి లేదా పోపులకే పరిమితం చేశాం. కానీ, పూర్వకాలంలో మినపప్పుతో వడలు, మినప రొట్టెలు, మినప సున్నుండలు వంటి బలమైన పదార్థాలు తయారుచేసి తినేవారు. మినపప్పులో ప్రోటీన్‌తో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ మెండుగా ఉంటాయి. బియ్యం లేదా తృణధాన్యాలతో కలిపి మినపప్పును తిన్నప్పుడు అది శరీరానికి పూర్తిస్థాయి ప్రోటీన్‌ను అందిస్తుంది.  ఇంట్లోనే తయారుచేసిన తాజా పనీర్.. పాకెట్లలో లభించే ప్యాక్ చేసిన పనీర్ కాకుండా, మన అమ్మమ్మలు గేదె లేదా ఆవు పాల నుంచి తాజా నిమ్మరసం పిండి పనీర్ తయారు చేసేవారు. ఈ తాజా పనీర్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది నాణ్యమైన ప్రోటీన్ , క్యాల్షియంను ఉచితంగా శరీరానికి అందిస్తుంది. ఎముకల గట్టితనానికి, కండరాల పునరుద్ధరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  వేయించిన వేరుశనగలు..   నట్స్ అనగానే ఈ రోజుల్లో బాదం, జీడిపప్పు, పిస్తా గుర్తుకొస్తాయి. కానీ పేదవాడి బాదం పప్పు అయిన వేరుశనగలు పోషకాల్లో దేనికీ తీసిపోవు. సాయంత్రం పూట తినుబండారంగా, లేదా బెల్లంతో కలిపి పల్లీ పట్టీ రూపంలో పూర్వీకులు వీటిని రోజూ తినేవారు. వేరుశనగల్లో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రాజగిరా / అమరాంత్ గింజలు.. రాజగిరాను  ఉపవాసాల సమయంలో ఎక్కువగా తింటుంటారు. కానీ పూర్వకాలంలో దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకునేవారు. రాజగిరా గింజల్లో శరీరం స్వయంగా తయారుచేసుకోలేని 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ప్రోటీన్ కలిగిన అతికొద్ది వృక్షాహారాలలో ఒకటి. రాజగిరా లాడ్డు, జావ, రొట్టెల రూపంలో  తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. నువ్వులు .. పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ నువ్వులలో ఉండే పోషకాలు అపారం. నువ్వుల పొడి, నువ్వుల చట్నీ, నువ్వుల ఉండలు మన సంప్రదాయ ఆహారంలో భాగం. నువ్వులలో కేవలం క్యాల్షియం, మంచి కొవ్వులే కాకుండా విలువైన ప్రోటీన్ కూడా ఉంటుంది. నువ్వులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్‌నెస్ అంటే విదేశీ ఆహార అలవాట్లను లేదా ప్యాక్ చేసిన హెల్త్ పౌడర్లను గ్రైండ్ చేయడం కాదు. మన ఇంట్లోనే, మన పూర్వీకులు తిన్న సంప్రదాయ ధాన్యాలు , పప్పు దినుసులలోనే శరీరానికి అవసరమైన అసలైన బలం దాగి ఉంది.  దైనందిన ఆహారంలో మళ్లీ ఈ పాతకాలపు ఆహారాలను భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుంది.  
రోజూ కొన్ని నిమిషాలు ఓం చాంటింగ్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఉద్గీత్ ప్రాణాయామం (Udgitha Pranayama) లో లోతుగా శ్వాస తీసుకుని, నెమ్మదిగా శ్వాసను వదులుతూ “ఓం” అని దీర్ఘంగా ఉచ్చరిస్తారు. ఈ ప్రక్రియ శ్వాసపై దృష్టిని కేంద్రీకరించడంతో పాటు మనసును రిలాక్స్ చేయడంలో సహాయపడవచ్చు. ఈ వీడియోలో ఉద్గీత్ ప్రాణాయామం అంటే ఏమిటి? దీన్ని ఎలా చేయాలి? ఓం చాంటింగ్ తర్వాత 2–3 సెకన్ల పాటు ఉండే విరామానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అలాగే స్ట్రెస్, బీపీ, గుండె ఆరోగ్యం, నిద్రలేమి వంటి అంశాలపై దీని ప్రభావం గురించి తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కరికీ అన్ని రకాల ప్రాణాయామాలు ఒకే విధంగా సరిపోవు. ఎవరెవరు ఉద్గీత్ ప్రాణాయామం చేయకుండా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గమనిక: ప్రాణాయామం ఆరోగ్యానికి సహాయకరంగా ఉండవచ్చు కానీ ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. బీపీ, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం ప్రారంభించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)