LATEST NEWS
హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ రాజశేఖర్, శైలేష్‌ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అలాగే తులసీనగర్‌లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌వోఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రోహిత్‌, తిలక్‌ సింగ్‌ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ ప‌ట్టుబ‌డింది. దాంతో ఆ ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.ఇటీవల కాలంలో హైదరాబాద్ డ్రగ్స్ విక్రయాలకు అడ్డాగా మారింది. మూడు నెలల క్రితం గసగసాల గడ్డితో తయా చేసిన గడ్డిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గడ్డి సేవిస్తే మంచి కిక్ వస్తుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా రెచ్చిపోతూనే ఉంది. చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం చర్చనీయాంశమైంది.  
ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో. మరొకటి  ఏపీలో పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటాల గ్రామంలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ అయిన మంజులారెడ్డి అనే  మహిళపై వైసీపీ మూకలు గొడ్డలితో దాడి చేసి నరికితే నుదుటిపై రక్తం గాయంతో కూడ నిర్భయంగా నిలబడిన ఫొటో. ఆమె అంతటి గాయంతోనూ ఆసుపత్రికి కాదు.. పోలింగ్ ఏజెంట్ ను పోలంగ్ బూత్ లోకే వెడతానని చెప్పింది. ఇప్పుడు ఈ రెండు ఫొటోలనూ, రెండు సంఘటనలనూ పోలుస్తూ  జగన్ పులివెందుల పులి కాదు పిల్లి అంటూ నెటిజనులు ఏకి పారేస్తున్నారు. గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఊరూ వాడా ఏకం చేసేయడమే కాకుండా  ఆసుపత్రికి వెళ్లి ఆ గాయానికి ఓ అరడజనుకు పైగా వైద్యుల బృందంతో చికిత్స చేయించుకుని, నుదుటిపై బ్యాండేజీ వేయించుకున్న జగన్ ఎక్కడ.. నుదుటిపై అంగుళం లోతు గాయంతో.. ముఖమంతా ధారగా కారిన రక్తంతో కూడా ధైర్యంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి తెలుగుదేశం ఏజెంట్ గా కూర్చున్న మంజులారెడ్డి ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు. జగన్ నుదుటిపై గాయమైతే ఒక్కటంటే ఒక్క రక్తం చుక్క కారిన దాఖలాలు లేవు. ఏక్కడో దూరం నుంచి గులకరాయితో దాడి చేస్తేనే హత్యాయత్నం అంటూ నానాయాగీ చేసిన జగన్, తనకు తగిలిన గాయానికి రోజుకో సైజులో ప్లాస్టర్ తో దర్శనమిస్తే.. మంజులారెడ్డి నుదుటిపై   అంగుళం మేర లోతు గాయంతో ధారగా కారుతున్న రక్తంతో , దెబ్బలతో వాచిపోయిన ముఖంతో చలించకుండా  ఆసుపత్రికి పరుగులు తీయకుండా  పోలింగ్ బూత్‌లోనే కూర్చుంది.  ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మంజులారెడ్డి ధైర్యాన్ని ప్రస్తుతిస్తూ జగన్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. 
మామూలుగా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వుంటాయి. కానీ, కొంతమంది అనంతకోటి దరిద్రాల కోసం శతకోటి ఉపాయాలను ఆలోచిస్తారు. ఈ జనరేషన్ యూత్ ఇలా ఆలోచించే వాళ్ళలో ముందుంటారు. ముఖ్యంగా అమెరికన్ యూత్ అయితే ఏ మెంటల్ పని చేయడానికైనా రెడీగా వుంటారు. అలా ఇప్పుడు అమెరికన్ కుర్రోళ్ళు చేస్తున్న ఒక మెంటల్ పని ‘వన్ చిప్ ఛాలెంజ్’. అసలేంటీ ‘వన్ చిప్ ఛాలెంజ్’. మన టీవీ షోలలో అప్పుడప్పుడు మిరపకాయలను తినే పోటీలు వుంటాయి చూశారా అలాంటి పోటీనే. కాకపోతే మిరపకాయల కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ఘాటు వున్న చిప్ తినే పోటీ. పాఖీ అనే చిప్స్ తయారు చేసే సంస్థ అత్యంత ఘాటుగా వుండే పదార్థాలతో ఒక చిప్ తయారు చేస్తూ వుంటుంది. దాన్ని శవపేటిక ఆకారంలో వుంటే ఒక ప్యాక్‌లో వుంచుతుంది. ఈ సంస్థ అమెరికన్ యూత్‌కి ఒక ఛాలెంజ్ చేసింది. తమ చిప్‌ని తింటూ వీడియో చేయాలి. తమ చిప్ తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా, పంచదార లాంటి ఏ పదార్థాలూ తినకుండా ఐదు క్షణాలు వుండగలగాలి. ఇదీ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవాళ్ళని నోరు మండిపోవడం తప్ప వచ్చేదీ చచ్చేదీ ఏమీ వుండదు. అయినప్పటికీ అమెరికన్ వెర్రి యూత్ ఈ ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేస్తూ వుంటారు. తమ ఫోన్లలో వీడియో కెమెరా ఆన్ చేసుకుని, బ్యాక్ గ్రౌండ్లో కౌంట్ డౌన్ టైమర్ పెట్టుకుని చిప్ తింటూ వుంటారు. ఐదు క్షణాలు కౌంట్ డౌన్ అయ్యే వరకూ ఆ చిప్ ధాటికి కుయ్యో మొర్రో అంటారు. ఐదు క్షణాలు దాటిన తర్వాత ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఎక్స్.ప్రెషన్ ఇస్తారు. ఇదీ ఈ ‘వన్ చిప్ ఛాలెంజ్’ వ్యవహారం.  ఈ దిక్కుమాలిన ఛాలెంజ్‌లో కుర్ర సన్నాసులతోపాటు అమెరికాలో వున్న సెలబ్రిటీస్ కూడా పాల్గొనడంలో ఇది బాగా పాపులర్ అయిపో్యింది. వన్ చిప్ ఛాలెంజ్ చేయనివాడు యూత్ కాదన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ ఛాలెంజ్ అంత ఈజీగా వుండదు. ఆ దిక్కుమాలిన చిప్ తినగానే నోరు మండిపోతుంది. ఐదు క్షణాలపాటు కూడా భరించలేనంత మండిపోతుంది. ఐదు క్షణాలపాటు అలాగే వున్నవారి సంగతి అలా వుంచితే, చిప్ తినగానే భళ్ళున వాంతులు చేసుకున్నవాళ్ళు, కళ్ళుతిరిగి పడిపోయినవాళ్ళు, నోరు మండిపోయి చాలారోజులు ఏమీ తినలేక తంటాలుపడిన వాళ్ళు కోకొల్లలు.  సరే, ఎవరి పిచ్చి వారికి ఆనందం అని ఊరుకోవచ్చు. కానీ, 2023 సెప్టెంబర్లో ఒక ఘోరం జరిగింది. ఈ వన్ చిప్ ఛాలెంజ్‌లో పాల్గొన్న వొలోబా అనే కుర్రాడు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రమైన ఘాటు వల్ల అతని గుండెపోటు వచ్చి చనిపోయాడు. దాంతో పాఖీ కంపెనీని అందరూ తిట్టిపోయడంతో ఈ కంపెనీ ఈ ‘వన్ చిప్ ఛాలెంజ్‌’ని ఉపసంహరించుకుంది. మార్కెట్లో వున్న తమ కంపెనీ చిప్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని ప్రకటించింది. అయితే, ఈ చిప్స్ స్టాక్‌ని చాలామంది వెనక్కి ఇవ్వలేదు. సీక్రెట్‌గా అమ్మకాలు జరుగుతూనే వున్నాయి. ‘వన్ చిప్ ఛాలెంజ్’ వీడియోలు వస్తూనే వున్నాయి. ఈ దారుణమైన ఛాలెంజ్ వల్ల ఇంకా ఎంతమంది చనిపోతారో అని అమెరికా పేరెంట్స్ భయపడుతున్నారు. యూత్‌కి ఈ మెంటల్ ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఏపీలో టీడీపీ విజయం ఫిక్సయిపోయింది. ఏపీలో దారిన పోయే దానయ్యని ఆపి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటావ్ అని అడిగితే, ఆ దానయ్య ఎగాదిగా చూసి ‘టీడీపీ రాబోతోందని ఇంకా అర్థం కాలేదా’ అని అంటాడు. మరి పామరులకే అసలు విషయం అర్థమైపోయినప్పుడు వైసీపీ నాయకులకు అర్థం కాకుండా వుంటుందా? అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాలు, బిల్డప్పులు ఫలితాలు వచ్చే వరకూ ప్రదర్శించాలి కదా. ప్రస్తుతం వైసీపీ నాయకులు ఆ పనిలోనే బిజీగా వున్నారు. మేమే గెలుస్తున్నాం అని వాళ్ళు చెబుతున్నారు. అయితే, ఆ గొంతుల్లో నమ్మకం ధ్వనించడం లేదు. సోషల్ మీడియాలో ఈమధ్య ఒక పాయింట్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే, జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని.. ఈ పాయింట్‌ని బేస్ చేసుకుని ఆపద్ధర్మ మంత్రి బొత్స సత్యనారాయణ  నేను కూడా వున్నా అంటూ రంగంలోకి దిగారు. ఈసారి కూడా వైసీపీ గెలుస్తుందని ఆశిస్తున్నానని, ఈనె 9న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. బొత్స స్టేట్‌మెంట్ చూసి జనం నవ్వుకుంటున్నారు. గెలుస్తున్నాం.. ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పకుండా, గెలుస్తారని ఆశిస్తున్నానని, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను అన్నప్పుడే బొత్సకి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మకం పోయిందని అనుకుంటున్నారు. మొన్నామధ్య జగన్ పబ్లిక్ మీటింగ్‌లో బొత్స తన తండ్రి లాంటి వాడు అని అన్నప్పటి నుంచి బొత్స ఎమోషనల్‌గా ఫీలైపోతున్నట్టున్నారు. అందుకే, మిగతా మంత్రులందరూ విజయం మీద మాట్లాడే శక్తి లేక నవ డాష్‌లూ మూసుకుని కూర్చుంటే, బొత్స మాత్రం బయటకి వచ్చి ‘గెలుస్తామని ఆశిస్తున్నాను’ లాంటి బలహీన స్టేట్‌‌మెంట్ ఇచ్చారు. బొత్స స్టేట్‌మెంట్ వల్ల వైసీపీకి లాభం జరగకపోగా, మరింత నష్టం జరిగింది. పోలింగ్‌కి ముందు రోజు మీడియాతో మాట్లాడిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మన బొత్స గారిని మామూలుగా తిట్టలేదు. బొత్సలాంటి వాళ్ళ వల్లే జగన్ పూర్తిగా నాశనమయ్యాడని చెప్పారు. కరెక్టే... ‘గెలుస్తామని ఆశిస్తున్నాను.. ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను’ అని స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటి? వైసీపీని మరింత నాశనం చేయడానికి కాకపోతే!?
నిన్నటి వరకు ఉక్కపోతగా  వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శుక్రవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో ప్రారంభమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.   దీంతో తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణశాఖ. రానున్న ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక జారీచేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో ఐదు రోజులపాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడటం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణశాఖ. దీంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
ALSO ON TELUGUONE N E W S
  ముంబై లో అంతే.. ముంబై లో అంతే..  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun)తాతయ్య లెజండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ ని అటు ఇటుగా మార్చి సినిమా ఫీల్డ్ లో అంతే..సినిమా ఫీల్డ్ లో అంతే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ లాంటి బడా స్టార్ సినిమాలో నుంచి ఒక బడా టెక్నీషియన్ తప్పుకున్నాడు.దీంతో ఈ న్యూస్ ఎవరి సపోర్ట్  లేకుండా స్వయంకృషి తో హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ నయా మూవీ పుష్ప 2(pushpa 2) ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షక లోకం మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంది. సుకుమార్ డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. మరి ఇలాంటి సినిమాకి మెయిన్ టెక్నీషియన్ గా పని చేయడం అంటే గర్వంగానే భావించాలి. కానీ ఎడిటర్ గా పని చేస్తున్న ఆంటోనీ రూబెన్ మూవీ నుంచి తప్పుకున్నాడు. వేరే చిత్రాల కమిట్ మెంట్స్ ఉండటంతోనే తప్పుకుంటున్నానని  ఈ విషయంలో ఎలాంటి రూమర్స్ కి తావు లేదని ఆయన తెలిపాడు.  ఆంటోనీ రూబెన్ (Antony Ruben)సాదా సీదా వ్యక్తి కాదు. ఇండియా లో ఉన్న టాప్ మోస్ట్ ఎడిటర్స్ లో  ఒకడు. ఆయన ఎడిట్ చేసాడంటే ఇక ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అనే నానుడి సినీ వర్గాల్లో ఉంది. 2011 లో  వచ్చిన  కందెన్ అనే తమిళ సినిమా ఆయన ఫస్ట్ మూవీ. 2013 లో వచ్చిన ఆర్య, నయనతార ల రాజా రాణి తో దేశ వ్యాప్తంగా ఆయన  పేరు మారుమోగిపోయింది. అజిత్  వేదాళం, వివేగం, విశ్వాసం, విజయ్  తేరి, మెర్సిల్, బిగిల్,  షారుక్  జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన లిస్ట్ లో ఉన్నాయి. పుష్ప పార్ట్ వన్ కి కూడా ఎడిటర్ గా వ్యవహరించాడు. ఇక ఆయన స్థానంలో  నవీన్ నూలి  ఎడిటర్ గా ఎంట్రీ ఇచ్చాడు  లేటెస్ట్ గా  గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ వంటి హిట్ మూవీస్ ఆయన నుండి  వచ్చాయి. బన్నీ అల వైకుంఠ పురం కూడా ఆయన ఖాతాలో ఉంది   
తమ అభిమాన హీరోని కలవడం కోసం అభిమానులు పాదయాత్ర చేయడం చూస్తుంటాం. అలా పాదయాత్ర చేసి హీరోని కలిసిన వారుంటారు. పాదయాత్ర చేసి కూడా హీరోని కలవలేకపోయిన వారుంటారు. అయితే తాజాగా ఓ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్.. పాదయాత్ర చేసి, తన ఫేవరెట్ హీరోని కలుసుకున్నాడు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఎన్టీఆర్ ను కలవడం కోసం ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ కు చెప్పుల్లేకుండా పాదయాత్ర చేశాడు. 300 కిలోమీటర్ల ఈ పాదయాత్ర తొమ్మిది రోజుల పాటు సాగింది. అసలే వేసవి కాలం కావడం, పైగా చెప్పుల్లేకుండా పాదయాత్ర చేయడంతో.. నాగేంద్రబాబు కాళ్లకు బొబ్బలు కూడా వచ్చాయి. అయినప్పటికీ అతను వెనకడుగు వేయలేదు. ఎండని లెక్క చేయకుండా పాదయాత్ర చేసి, ఎన్టీఆర్ నివాసానికి చేరుకున్నాడు.  అయితే తారక్ ప్రస్తుతం 'దేవర' (Devara), 'వార్ 2' (War 2) సినిమాలతో బిజీగా ఉన్నాడు. సరిగ్గా 'వార్ 2' షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లిన సమయంలోనే.. నాగేంద్రబాబు పాదయాత్ర చేస్తూ ఆయన నివాసానికి చేరుకున్నాడు. హీరో ఇంట్లో లేడని తెలిసినా ఆ అభిమాని ఏమాత్రం నిరాశ చెందలేదు. హీరో రాక కోసం రెండు వారాల పాటు ఆయన ఇంటి ముందే ఎదురుచూశాడు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. ముంబై నుంచి రాగానే తన అభిమాని నాగేంద్రబాబుని కలిసి ఆప్యాయంగా పలకరించాడు. అతనితో కలిసి ఫొటోలు దిగాడు. మొత్తానికి, తన అభిమాన హీరోని కలిసి ఫొటో దిగాలన్న కోరిక నెరవేరడంతో నాగేంద్రబాబు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అలీతో సరదాగా ఈవారం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లయ వచ్చింది. ఆలీ, లయ కలిసి స్వయంవరం మూవీలోని సాంగ్ కి స్టెప్స్ కూడా వేశారు. ఈ సాంగ్ తర్వాత ‘‘ఇప్పుడు వచ్చిన ఈ పాటలు మీ అమ్మవి. లయగారు వచ్చారా ?’’ అని లయనే అడుగుతూ కాసేపు ఫన్ చేసాడు ఆలీ. దానికి నవ్వుతూ ‘‘నేనే లయ’’ అని సమాధానమిచ్చింది. అది విన్న ఆలీ షాకయ్యాడు. ‘‘నేను శ్లోక అనుకున్నారా’’ అని నవ్వేసింది లయ. ‘స్వయంవరం’ మూవీ వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లయకు కంగ్రాట్స్ చెప్పాడు ఆలీ. లయ కూడా తిరిగి ఆలీకి కంగ్రాట్స్ చెప్పారు. లయ పర్సనల్ లైఫ్ గురించి అడిగారు. ‘‘లయ చాలా ఇబ్బందుల్లో ఉంది. అమెరికాలో రోడ్లపై ఉంటోంది అనే కామెంట్స్ విన్నప్పుడు ఎలా అనిపించింది’’ అని ఆడిగాడు ఆలీ.  ‘‘ఎందుకు ఇదంతా. ఇలాంటివి వినేటప్పుడు చాలా బాధేస్తుంది. అడుక్కు తింటున్నాను అనే కాదు ఇంకా చాలా చేస్తున్నానని కూడా అన్నారు. అవన్నీ తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంది’’ అని పాపం ఫీలయ్యింది లయ. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ "2005లో మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఆంటీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అని నన్ను అడిగారు. ఇప్పుడు కాదు అని చెప్పడంతో మా ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదనుకున్నారు’’ అంటూ తమ పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇండియాకు రావడానికి కారణమేంటి అని అడిగాడు ఆలీ ‘‘నేను నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు మూవీతో  రీఎంట్రీ ఇస్తున్నాను’’ అని అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత తను, ఆలీ కలిసి నటించిన సినిమాలను గుర్తుచేసుకున్నారు. ఇలా లయ ఎన్నో విషయాలు చెప్పారు.  
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలని 'బాహుబలి-2' కోసం అప్పుడు ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూశారో.. ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా? అని అందరూ అంతలా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఆరోజు రాబోతుంది. స్వయంగా ప్రభాసే ఈ విషయాన్ని రివీల్ చేశాడు. రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పటికే నలభైల్లోకి అడుగుపెట్టాడు. బాహుబలి రాకముందు నుంచే పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి (Prabhas Marriage) గురించి చర్చ నడుస్తోంది. ఒకసారి ప్రముఖ హీరోయిన్ తో పెళ్లి అని, మరోసారి బంధువుల అమ్మాయితో అంటూ.. ఇలా ఎన్నోసార్లు ప్రభాస్ పెళ్లి వార్తలు వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు. ఇటీవల కనీసం అలాంటి వార్తలు కూడా రావడం లేదు. దీంతో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లా ప్రభాస్ కూడా సింగిల్ గా మిగిలిపోతాడా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో ఊహించని ప్రకటనతో సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ ఓ స్టోరీ పెట్టాడు. అందులో "డార్లింగ్స్.. మొత్తానికి ఒక స్పెషల్ పర్సన్ జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ రాసుకొచ్చాడు. దీంతో ఆ స్పెషల్ పర్సనా ఎవరా? అని అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కొందరు అభిమానులైతే అనుష్క శెట్టి (Anushka Shetty) అయ్యుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ప్రభాస్ జీవితంలోకి రాబోతున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? అనేది త్వరలోనే రివీల్ అయ్యే అవకాశముంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ ఇద్దరు కలిసినా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు కొణిదెల నాగబాబు. నటుడు, నిర్మాత కంటే మెగా బ్రదర్ గానే ఎక్కువ గుర్తింపుని పొందాడు. ఎలాంటి ఇష్యు మీద అయినా ఎంతటి  పర్సన్ మీద అయినా  డేర్ అండ్ డాషింగ్ గా  మాట్లాడటం ఆయన స్టైల్.  అంతటి వ్యక్తి  తాజాగా  తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ ఉరఫ్ బన్నీకి, నాగబాబు కి ఉన్న రిలేషన్ గురించి అందరకి తెలిసిందే.  బన్నీ ఇటీవల  తన స్నేహితుడు ఎంఎల్ఏ గా పోటీ చేస్తుంటే అతని గెలుపు కోసం ప్రచారానికి వెళ్ళాడు. ఆ తర్వాత నాగ బాబు తన ట్విట్టర్ లో  మాతో  ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మా వాడే  అంటూ  ట్వీట్ చేసాడు.  ఇది  అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిందనే విషయం అందరకి అర్ధమయ్యింది. దాంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబు కి రివర్స్ కౌంటర్లు వేస్తు ట్వీట్ ల మీద ట్వీట్లు చేస్తు వస్తున్నారు.  ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఉన్న బన్నీ అభిమానులు ట్వీట్ లు చేస్తున్నారు. దీంతో  నాగబాబు ట్విటర్ నుంచి వైదొలిగాడు. నాగ బాబు సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయం  సినీ పరిశ్రమలలోను పబ్లిక్ లోను వైరల్ గా మారింది నాగబాబు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గా పని చేస్తున్నాడు. ఆ హోదాలోనే బన్నీ మీద ట్వీట్ చేసాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మెగా ఫ్యాన్స్ చాలా మంది బన్నీ జనసేన తరుపున కాకుండా వేరే పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడం మీద కోపంగానే  ఉన్నారు. వాళ్ళ కోపం పుష్ప 2 కి ఎంత వరకు పని చేస్తుందో  చూడాలి. లేక సినిమా వేరు రాజకీయం వేరు అనే కాన్సెప్ట్ కి దాసోహం అవుతారో  
స్థలాల విషయంలో సామాన్యులు మోసపోవడం తరచూ చూస్తుంటాం. అయితే ఒక్కోసారి ఎంతో పలుకుబడి ఉన్నవారు, సెలబ్రిటీలు కూడా మోసపోతుంటారు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి అలాంటి అనుభవమే ఎదురైంది. 2003లో సుంకు గీత అనే మహిళ నుంచి జూబ్లీహిల్స్ లో 681 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశాడు ఎన్టీఆర్. ఆ స్థలంలోనే తన డ్రీం హౌస్ ని కట్టుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆ స్థలం, అందులో నిర్మించిన ఇంటి ఖరీదు కొన్ని కోట్లల్లో ఉంటుంది. అలాంటిది ఆ ఇంటి స్థలం ఓ వివాదంలో చిక్కుకుంది. ఆ స్థలాన్ని అమ్మిన సుంకు గీత.. 1996లోనే బ్యాంకులకు తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. ఆమె ఆ విషయాన్ని దాచి, ఎన్టీఆర్ కి స్థలం అంటగట్టి దారుణంగా మోసం చేశారు. పైగా గీత రుణాలు ఎగ్గొట్టడంతో.. ఆమెకి రుణాలు ఇచ్చిన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లు.. 'డెట్ రికవరీ ట్రిబ్యునల్'ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన ట్రిబ్యునల్.. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కు ఉంటుందని తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్.. స్థలాన్ని, అందులో నిర్మించుకున్న ఇంటిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ న్యాయ పోరాటానికి దిగాడు. తనని మోసం చేశారంటూ ఆయన ఫిర్యాదు చేయడంతో.. గీతపై కేసు నమోదైంది. అలాగే ట్రిబ్యునల్ తీర్పుపై కూడా ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించాడు. జూన్ 6న దీనిపై విచారం జరగనుంది. కాగా, ఓ స్టార్ హీరో.. దానికితోడు రాజకీయంగానూ ఎంతో పలుకుబడి ఉన్న ఎన్టీఆర్ కి ఇలా జరగడం సంచలనంగా మారింది.
తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ (Allu Arjun) మద్దతు తెలపడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి నుంచి సోషల్ మీడియా.. 'మెగా వర్సెస్ అల్లు' అన్నట్టుగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఒకే వేదికపై చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ కనిపించనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4వ తేదీని 'డైరెక్టర్స్ డే'గా జరుపుకుంటారు. ఈ ఏడాది డైరెక్టర్స్ డే ని భారీగా నిర్వహించాలని దర్శకుల సంఘం భావించగా.. ఎన్నికల కోడ్ కారణంగా మే 4న పర్మిషన్ రాలేదు. ఇప్పుడు ఈ ఈవెంట్ ను మే 19న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో పాటు.. దర్శకులంతా హాజరు కానున్నారు. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి, అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచే అవకాశముంది. 'మెగా వర్సెస్ అల్లు' అంటూ అభిమానుల మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో.. ఒక వేదికపై చిరంజీవి, బన్నీ కలవనుండటం ఆసక్తి కలిగిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంతవరకు ఒక్క సాంగ్ కూడా విడుదల చేయకపోవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న 'కల్కి 2898 AD' ఆడియో రైట్స్ ని సరిగమ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా మేకర్స్.. 15 సెకన్ల మ్యూజిక్ బిట్ ని విడుదల చేశారు. ఆ షార్ట్ మ్యూజిక్ బిట్ అలా విడుదలైందో లేదో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చింది. అంతేకాదు ఈ వారంలోనే ఈ మూవీ మొదటి సాంగ్ విడుదల కానుందని సమాచారం.
ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు, చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) విషయంలో అలాంటిదే జరగబోతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐకాన్ స్టార్ గా తనకంటూ ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. తనపై మెగా హీరో అనే ముద్ర లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అందుకే బన్నీ.. మెగా బ్రాండ్ కి, మెగా కుటుంబానికి దూరంగా జరుగుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొందరు మెగా అభిమానులు ఎప్పటినుంచో బన్నీపై గుర్రుగా ఉన్నారు. ఇక ఇటీవల బన్నీ చేసిన ఓ పని.. మెగా అభిమానులందరి ఆగ్రహానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 'మెగా వర్సెస్ అల్లు' వార్ కి దారితీశాయి. మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి అండగా నిలబడితే.. అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లి తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు. అసలే జనసేన, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దానికితోడు బన్నీ తీరుతో ఇప్పటికే కొందరు మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎప్పుడూ లేని విధంగా బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక నుంచి బన్నీతో తమకు సంబంధం లేదని, అతని సినిమాలు చూసేది లేదని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాదు, 'పుష్ప-2'ని బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ పీక్స్ లో ఉంది. 'పుష్ప'తో పాన్ ఇండియా హీరోగా అవతరించిన బన్నీ.. త్వరలో 'పుష్ప-2'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలున్నాయి. 'పుష్ప-2' ఆశించిన విజయాన్ని అందుకుంటే.. అల్లు అర్జున్ స్టార్డం ఎన్నో రెట్లు పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి తరుణంలో మెగా ఫ్యాన్స్ 'పుష్ప-2'ని బాయ్ కాట్ చేస్తే మాత్రం.. కలెక్షన్ల పరంగా తెలుగునాట తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. మెగా హీరోలు చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్ ల అభిమానగణం భారీగా ఉంటుంది. వారిలో మెజారిటీ అభిమానులు అల్లు అర్జున్ సినిమాలను కూడా చూస్తుంటారు. అయితే ఇప్పుడు వారు 'పుష్ప-2'ని బాయ్ కాట్ చేస్తే.. ఖచ్చితంగా వసూళ్లపై ఎంతోకొంత ప్రభావం ఉంటుంది. పైగా 'పుష్ప పార్ట్-1'.. ఓవరాల్ గా హిట్ అయినప్పటికీ, భారీ బిజినెస్ కారణంగా తెలుగునాట మాత్రం నష్టాలనే చూసింది. ఇప్పుడు 'పుష్ప-2'కి ఓ రేంజ్ లో బిసినెస్ జరిగే అవకాశముంది. ఆ స్థాయి బిజినెస్ కి లాభాలు రావాలంటే అల్లు, మెగా అభిమానులు మాత్రమే కాకుండా.. అందరు హీరోల అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆదరించాల్సి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మెగా అభిమానుల సపోర్ట్ లేకుండా.. తెలుగునాట 'పుష్ప-2' లాభాలను చూస్తుందో లేదో చూడాలి.
Prepare for a spine-tingling experience on May 25th as Ashish gears up to captivate audiences with the intriguing romantic horror, "Love Me - If you Dare." Confident in delivering a blockbuster this summer, the team promises a spine-chilling ghost love story that will keep viewers on the edge of their seats. The film stars Ashish and Vaishnavi Chaitanya played the lead roles. Today makers launched the trailer. The trailer commences by introducing Ashish, portraying the daredevil Arjun, known for his adrenaline-pumping stunts. Arjun's insatiable quest for thrills is evident as he ventures into an abandoned house with the daring intention of romancing the ghost, Divyavathi. The electrifying encounters between Arjun and Divyavathi only serve to heighten anticipation among viewers. In addition to Ashish, the trailer features Virupaksha fame Ravikrishna and Simran Choudhary in pivotal roles, adding depth to the storyline. With its rapid-fire editing and spine-chilling sequences, the trailer ignites curiosity about the film's premise, hinting at a one-of-a-kind romantic horror experience. This sneak peek offers a glimpse into the captivating world of "Love Me," promising thrills, romance, and supernatural encounters. Oscar winning Musician MM Keeravaani scored the tunes. Blockbuster "Balagam" makers Harshith Reddy and Hanshitha Reddy are producing the film under "Dil Raju Productions" in association with Naga Mallidi. This romantic horror film is helmed by newcomer Arun Bhimavarapu. Shirish is presenting the film.
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  
నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని
ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.  వీటిని తెలుగు రాష్ట్రాలలో తాటిముంజలు అంటారు.  లేతగా ఉన్న తాటి ముంజలు తియ్యగా, మృదువుగా, లోపల కాసిన్ని తియ్యని నీళ్లలో తినడానికి ఎంతో బాగుంటాయి. వేసవి కాలంలో మాత్రమే అందుబాటులోకి రావడంతో అందరికీ వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. తాటిముంజలను ఈ వేసవి కాలంలో తప్పకుండా ఎందుకు తినాలో చెప్పే కారణాలు బోలెడు ఉన్నాయి. ఈ కారణాలు తెలిస్తే అస్సలు వదలకుండా తాటిముంజలను ఈ సీజన్ లో రుచి చూస్తారు. తాటిముంజలు తింటే శరీరానికి కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. హైడ్రేట్.. మండిపోతున్న ఎండల కారణంగా వేడి కూడా అధికంగా ఉంటుంది.  ఈ వేడి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది.  దీని కారణంగా  శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీన్నే శరీరం డీహైడ్రేట్ అవ్వడం అంటారు. తాటిముంజలు  తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు. తాటిముంజలు తింటే శరీరం కోల్పోయిన తేమ శాతం తిరిగి భర్తీ అవుతుంది. ఉదర సమస్యలు.. ఈ మండే వేసవి కాలంలో చాలామంది ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కుంటారు. చాలామందికి కడుపులో వేడి పుట్టి అది కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది.   అయితే తాటిముంజలు తింటే పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల  జీర్ణవ్యవస్థ బలపడుతుంది.  మలబద్ధకం, అజీర్ణం,  గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.   రోగనిరోధక శక్తి.. చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే వ్యాధులు, జబ్బులు తొందరగా వస్తాయి. అంతేకాదు ఇలా వచ్చిన జబ్బులు అంత తొందరగా తగ్గవు కూడా. కానీ తాటి ముంజలు తింటే  రోగనిరోధక శక్తి  బలపడుతుంది. తాటిముంజలలో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీవక్రియను..   జీవక్రియ బలహీనంగా ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాక శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణంగా  బరువు పెరుగుతారు.   ఊబకాయం బాధితులుగా మారతారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే తాటిముంజలను  తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది.  ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. తద్వారా అధికంగా తినకుండా కూడా నివారిస్తుంది. డయాబెటిస్‌.. తాటిముంజలు  మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను  నియంత్రిస్తుంది.                                                                   *రూపశ్రీ.  
ఉల్లిపాయ బోలెడు వంటకాల్లో కనిపించే ఒక ముఖ్యమైన పదార్ధం. ఉల్లిపాయ పసుపు, తెలుపు, ఎరుపు వంటి రంగులలో లభిస్తుంది. ఉల్లిపాయ రుచి మాత్రమే కాకుండా, ఇందులో ఉన్న పోషకాల కంటెంట్ కారణంగా ఆహారంలో ప్రముఖంగా నిలిచింది. పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలవాటు లేనివారు కూడా తినడం మొదలు పెడతారు. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు విటమిన్ సి కి అద్భుతమైన మూలం, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి బాక్టీరియా, వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షించే తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడంలో పచ్చి ఉల్లిపాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయల తీసుకోవడం వల్ల  రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.. పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది సరైన జీర్ణక్రియకు మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి అవసరమైనది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది. మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, హేమోరాయిడ్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. వాపును తగ్గిస్తుంది.. క్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ యొక్క బాగా కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు కాల్షియం శోషణను ప్రోత్సహించడంలో, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి, ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఏకాగ్రత స్థాయిలకు దారితీస్తుంది.  క్యాన్సర్ నివారిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండే సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ మరియు అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలు అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ముడతలు, వయస్సు మచ్చలు, పిగ్మెంటేషన్ స్థాయిలు తగ్గుతాయి.  ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి ఇది దోహదపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. పచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది పచ్చి ఉల్లిపాయలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. అతిగా తినే పరిస్థితులను ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ తగ్గిస్తుంది. కేలరీలను భర్తీ చేస్తుంది.  చివరికి బరువు తగ్గడానికి. సహాయపడుతుంది.                                   ◆నిశ్శబ్ద.
భోజన ప్రియులకి నెయ్యి లేదా అంటూ ఉంటారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు.నెయ్యి తో పోపు పెట్టిన ఆహారం,నెయ్యితో కాల్చిన చపాతి నెయ్యితో కాల్చిన పెసరట్టు తప్ప మరేది వద్దు అంటూ ఉంటారు.ఇక కొంతమంది అయితే ముఖ్యంగా స్వీట్స్ లో నెయ్యి కారుతూ ఉండాలి. ముఖ్యంగా బొబ్బట్లు, బూరెలు  కూడా నెయ్యి తో చేసినవే బాగుంటాయి అంటారు భోజన ప్రియులు నెయ్యితో చేసిన పదార్ధాలు ఆస్వాదిస్తూ తిన్నప్పుడే వాటి మజా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో కుటుంబంలో పెళ్ళి ళ్ళు శుభకార్యాలలో సంబంధాలు కోసం వెళ్ళినప్పుడు మా నానమ్మ నెయ్యి వెన్నతో పెట్టింది.మీరేం పెడతారు చెప్పండి అంటు అడగడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మీరు ఇలాగే గనక నెయ్యి తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇకమీరు నెయ్యి జోలికే వెళ్ళరు. నెయ్యి ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో మీకు బాగా తెలుసు.వినిఉండచ్చు. ఇది కేవలం యాంటి ఏజింగ్ మాత్రమే కాదు మనసు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి లాభం కలిగించే అంశం అయితే నెయ్యి ప్రతి ఒక్కరికి సరిపడదు. అని అంటున్నారు నిపుణులు. భారత దేశం లో నెయ్యి చాలా ప్రాచుర్యం లో ఉంది.నెయ్యి కొంతమంది ప్రతిరోజూ తమ భోజనం లో చేరుస్తారు. నెయ్యి వాడడం కూడా చాలా కష్టం నేతిని బ్రెడ్ లో లేదా చపాతీలో పప్పు కూరలో నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. నెయ్యిని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడడం గమనించవచ్చు.నెయ్యి ఆరోగ్య పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. గుండె సంబందిత ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.ఖాళీ పొట్టతో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచెంద్రియాలలో శుభ్ర పరిచి ఉపసమనం ఇస్తుంది. నెయ్యిలో యాంటి ఏజింగ్ మరియు గుండె ను ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది దీనితో పాటు నెయ్యి మెదడు,జ్ఞాపక శక్తిని పెంచి పంచేంద్రియాలు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.