LATEST NEWS
మావాళ్ళు కొడితే కొట్టించుకోండి, చంపితే చచ్చిపోండి.. నేను నేనే.. నా టూర్ నాదే అంటూ జగన్ సతీ సమేతంగా లండన్ వెళ్ళిపోయాడు. రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తికి వారసుడిలా మిగిలాడు.
ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు. ‘సిట్’ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి (శ్రీకాకుళం), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు (ఒంగోలు), ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి (తిరుపతి), వి.భూషణం (గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్), వెంకటరావు (విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్), రామకృష్ణ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్), జి.ఎల్.శ్రీనివాస్ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్), మోయిన్ (ఒంగోలు పీటీసీ), ప్రభాకర్ (అనంతపురం ఏసీబీ), శివప్రసాద్(ఏసీబీ ఇన్‌స్పెక్టర్) వున్నారు. ఈ ‘సిట్’ రేపటిలోగా ఈసీకి నివేదిక ఇవ్వనుంది. 
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది. కవిత జైలు నుంచి విడుదల అవ్వకపోయినా పర్లేదుగానీ, ఏపీలో చంద్రబాబు మాత్రం అధికారంలోకి రాకూడదని తెలంగాణలో కేసీఆర్ అండ్ కంపెనీ ముక్కోటి దేవతలకు మొక్కుకున్నారు. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిసిపోవడంతో, ఈ బ్యాచ్ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఏపీలో  చంద్రబాబు అధికారంలోకి రాగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. చంద్రబాబు గురువు, రేవంత్ రెడ్డి శిష్యుడు కాబట్టి, గురువుకు అనుకూలంగా శిష్యుడు వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నాడని అరచి గోలచేసి, తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.  ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడంటే తనకు ఎంతో గౌరవం వుందే తప్ప, రాజకీయంగా ఆయనకీ తనకి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని ఆయన సందర్భం దొరికినప్పుడల్లా చెబుతున్నారు. ఈ మధ్య రేవంత్ మీడియా వాళ్ళని కలసినప్పుడు ఓ నోటి తుత్తరగాడు ఇలా అడిగాడు.. తెలంగాణలో పోటీ పెట్టకుండా గురువు సహకరించారు.. ఇప్పుడు అక్కడ గురువు పోటీ చేస్తున్నారు. శిష్యుడు సహకరిస్తారా? అని అడిగాడు. దాంతో రేవంత్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం లాగా సీరియస్సయిపోయి వార్నింగ్ ఇస్తూ, ‘‘ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేవాడు.. శిష్యుడెవరు, గురువెవరు? నేను సహచరుడిని అని చెప్తున్నాను. ఎవడైనా బుద్ధిలేని గాడిద కొడుకు శిష్యుడు, గురువు అని మాట్లాడితే బుడ్డిమీద పెట్టి తంతా. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన సహచరుడిని నేను. నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళాను. నేను ఆయనకు సహచరుణ్ణి.  వారంటే అపారమైన గౌరవం వుంది ఇప్పటికి కూడా చెప్తున్నా.. అంతే తప్ప గురువు, శిష్యుడు అంటే ఊరుకునేది లేదు. నేను తెలంగాణ వాణ్ణి, కాంగ్రెస్ పార్టీ వాడిని. తెలంగాణ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాను’’ అని స్పష్టంగా చెప్పారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ ఏపీకి, తెలంగాణకి ఉమ్మడి రాజధాని కాదు కాబట్టి, ప్రస్తుతం హైదరాబాద్‌లో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో వున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కుదరాల్సిన పంపకాల విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు మీద గౌరవం గౌరవమే, తెలంగాణ ప్రయోజనాలు ప్రయోజనాలే అన్నట్టుగా వ్యవహరించి, కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయకుండా కంట్రోల్ చేయాలన్న వ్యూహంలో రేవంత్ వున్నారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.  తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పిటిషన్ విచారణను జులైకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2022లో విఠల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది. దీనిపై రాజేశ్వర్ రెడ్డి అప్పుడే హైకోర్టుకు వెళ్లారు. తాను నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని, కాబట్టి విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో విఠల్‌కు ఊరట లభించింది.  
శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది.  దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జగన్ గాలి వీచిన సమయంలో కూడా ఆయన సునాయాసంగా విజయం సాధించారు. ఆ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్ సభ స్థానంతో పాటు.. టెక్కలి, ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. ఇదే నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న విశ్వాసాన్ని కింజారపు వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఈ సారి ఎలాగైనా కింజారపును ఓడించాలన్న లక్ష్యంతో జగన్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న కలింగ సమాజిక వర్గానికి చెందిన పెరడ తిలక్ ను శ్రీకాకుళం నుంచి వైపీపీ అభ్యర్థిగా పోటీలో దించారు. ఈ పేరాడ తిలక్ గత ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజారపు అచ్చెన్నాయుడి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ సారి జగన్ ఆయనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే  ఇక్కడ నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా కళింగ సామాజిక వర్గానికే చెందిన పేరాడ పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దీంతో ఆ సమాజికవర్గ ఓట్లు భారీగా చీలిపోచే అవకాశాలున్నాయి. అలాగే వైసీపీ నుంచి  శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించిన సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి   కిల్లి కృపారాణి సీటు దక్కక పోవడంతో  సరిగ్గా ఎన్నికలకు ముందు ఆమె వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కిల్లి కృపారాణి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  దీంతో ఆమె టెక్కలిలో వైసీపీ ఓట్లకు బారీగా గండి కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అలాగే ఇంత కాలం వైసీపీకి మద్దతుగా ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు కూడా వైసీపీకి దూరమైన పరిస్థితి కనిపిస్తోందనీ, దీంతో శ్రీకాకుళం పార్లమెంటు నియోజవర్గంలో వార్ వన్ సైడ్ గా కింజారపు రామ్మోహన్ నాయడికి సానుకూలంగా మారిపోయిందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.   అంతే కాకుండా పలువురు వైసీపీ మద్దతుదారులు కూడా వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  మొత్తం మీద వైసీపీ ఓట్లను కాంగ్రెస్ భారీగా చీల్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
ఈ సమ్మర్‌ ఎండిరగ్‌లో అందరిలోనూ వేడి పుట్టిస్తున్న సినిమా ‘కల్కి 2898ఎడి’. పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో ఎవరూ ఊహించని స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘కల్కి’కి సంబంధించిన ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసేశారు. ఇప్పటివరకు ఈ సినిమా సంబంధించి ఇచ్చిన అప్‌డేట్స్‌ అన్నీ ఎంతో ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేసేలా ఉన్నాయి. మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌గా తెరకెక్కుతునన ‘కల్కి’ భారతీయ సినిమాలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ సినిమాలోని ప్రభాస్‌ చేస్తున్న భైరవ గెటప్‌ని రిలీజ్‌ చేసి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను భారీగా పెంచేశారు. మే 18 సాయంత్రం 5 గంటలకు భైరవకి సంబంధించిన వాహనం బుజ్జి రోల్‌ను రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ‘డార్లింగ్స్‌.. నా బుజ్జిని కలిసేందుకు మిమ్మల్ని వెయిట్‌ చెయ్యనివ్వలేను’ అంటూ ప్రభాస్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారుతోంది. స్క్రాచ్‌ ఎపిసోడ్‌ 4 పేరుతో ఓ వీడియోను రిలీజ్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేయబోతోంది చిత్ర యూనిట్‌. ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ని ఈ నెలాఖరులో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి హేమాహేమీలు నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 
Movie : Darshini Starring : Vikas, Shanti Priya, Satya Prasad etc. Cinematography : Ravi Milky Editor : Praveen Jairaj, Chandu Chalamala Music : Nijani Anjan Background Score : Shiva Prasad Producer : Dr. LV Suryam Director : Dr. Pradeep Allu   "Darshini," a science-fiction thriller produced by Dr. LV Suryam and directed by Dr. Pradeep Allu, features Vikas, Satya Prasad, and Shanti in the lead roles. Released by V4 Cine Creations, the film combines elements of suspense, intrigue, and moral dilemmas. Here's an in-depth look at this recent theatrical release. Plot: Best friends Santosh (Vikas), Priya (Shanti), and Livingstone (Satya Prasad) decide to spend time at a farmhouse owned by Dr. Darshini. During their stay, they discover a machine that reveals their future. As they watch the next day's events unfold on the monitor, Dr. Darshini mysteriously vanishes, adding to the suspense. A police officer arrives at the farmhouse, claiming to be on patrol, further confusing the trio. What happened to Dr. Darshini? What is the secret behind the future-predicting machine? Who is the cop, and what is his sister's involvement? Can the trio escape their predicament?   Performances: The film primarily focuses on the characters of Vikas, Satya Prasad, and Shanti. Vikas effectively portrays a possessive boyfriend, while Shanti, who is affectionately called Tingari for her innocence, brings a sense of naivety to her role. Satya Prasad plays an overweight character who often freezes and uses a stress ball to cope. However, the performances could have been stronger to better suit the sci-fi genre. The supporting cast, including the actor playing Dr. Darshini, has a minimal impact.   Technical Department: Ravi Milky’s cinematography suffers due to inadequate production values. Editors Praveen Jairaj and Chandu Chalamala maintain a tight pace, ensuring the film doesn't drag. While Nijani Anjan’s music and Siva Prasad’s background score are serviceable, they could have been enhanced with better production quality.   Analysis: Director Dr. Pradeep Allu crafts a cerebral narrative that transitions from mere entertainment to a thought-provoking experience. The female lead’s character arc is filled with suspense, while a male character's struggle with lustful tendencies adds depth to the storyline. "Darshini" brings a novel perspective to the sci-fi genre, blending techno-horror elements with manipulated voices and enigmatic CCTVs. The presence of an unseen character and Dr. Darshini’s premonition of her death, intertwined with the watchful cop, adds layers of intrigue.   The second half of the film delves into a darker tone, with a jungle scene intensifying the mystery. Hidden motives and character secrets introduce further twists. Verdict "Darshini" offers an innovative take on the sci-fi genre with a compelling narrative. However, its impact is diminished by its production values. Rating: 2.25/5
తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలలో నటించిన సినిమా 'హిట్ లిస్ట్'. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్.కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా.. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను కోలీవుడ్ స్టార్ సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు. యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. ప్రెసెంట్ ఆడియన్స్ ని ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ జానర్ మూవీస్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇది కూడా ఆ జానర్ లోకి రావడం అదే విధంగా టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది. టీజర్ చూసిన అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ.. "టీజర్ చాలా బాగుంది. సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా విజయ్ కనిష్క కి ఈ టీం కి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు. మునిష్కాంత్ కింగ్స్ లే, సితార, స్మృతి వెంకట్, రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ), రామచంద్రన్, ఐశ్వర్య దత్త, అభి నక్షత్రం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సి. సత్య సంగీతం అందిస్తుండగా.. డీఓపీగా కె. రామ్ చరణ్, ఎడిటర్ గా జాన్ అబ్రహం వ్యవహరిస్తున్నారు.
తెలుగు సినిమాకి ,నటనకి గాడ్ ఫాదర్ ఎవరంటే  మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు.  ఆయన రాకతోనే హీరోకి గుర్తింపు వచ్చింది. 1941 నుంచి 2014 వరకు నటిస్తు ఉన్నారంటే ఆయన నట స్టామినా ని అర్ధం చేసుకోవచ్చు. ఆయన  నటించిన ఆఖరి చిత్రం మనం..ఎనభై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఎంతో చలాకీగా నటించి ఏఎన్ఆర్ ని తలదన్నే నటుడు లేడనే మాటకి శాశ్వత స్థానాన్ని కూడా కలిపించాడు. ఇప్పుడు ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.     మే 23 ,2014 న  మనం రిలీజ్ అయ్యింది. అంటే మరికొన్ని రోజుల్లో పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా మూడు తరాలకి చెందిన హీరోలంతా కలిసి పోటాపోటీగా నటించారు. నటించారు అనే కంటే జీవించారు అని  చెప్పవచ్చు. పదేళ్లు పూర్తి చేసుకుంటున్న   సందర్భంగా  మే23న  రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి నగరాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో అక్కినేని అభిమానుల్లో పండుగ వాతావరణం వచ్చింది సినిమా విడుదలపై అన్నపూర్ణ స్టూడియోస్  పేరుతో  థియేటర్లలో మరోసారి సెలబ్రేట్ చేసుకుందాం అని ట్వీట్  వచ్చింది. అలాగే నాగ చైతన్య కూడా పది సంవత్సరాల వేడుకలను థియేటర్స్ లో జరుపుకుందాం. ఏ ఎన్ ఆర్ లైవ్స్ అంటు ట్వీట్ చేసాడు. అన్నపూర్ణ స్టూడియోస్  రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్  నిర్మించిన మనం కి  విక్రమ్ కుమార్ దర్శకుడు.  అక్కినేని నాగేశ్వరావు  తండ్రిగా నాగార్జున,  నాగార్జున తండ్రిగా నాగ చైతన్య, ఆ ముగ్గరిని కాపాడే  వ్యక్తిగా అఖిల్  మనం లో నటించారు
కిషోర్, శ్రుతి మీనన్ నటించిన 'వడక్కన్' మూవీ ప్రపంచ స్థాయి వేదికపై మెరిసింది. రసూల్ పూకుట్టి, కీకో నకహరా, బిజిబాల్, ఉన్నిఆర్ సంయుక్తంగా నిర్మించగా.. సాజీద్ ఎ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (BIFFF )లో స్థానం సంపాదించుకుంది. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ అనుబంధ సంస్థ ఆఫ్‌బీట్‌స్టూడియోస్ బ్యానర్‌పై వడక్కన్‌ను నిర్మించారు. ఈ చిత్రం ప్రాచీన ఉత్తర మలబార్ జానపద కథల నేపథ్యంలో సాగుతుంది. తమ సినిమాకు ఇంతటి గుర్తింపు రావడంతో భ్రమయుగం, భూతకాలం దర్శకుడు రాహుల్ సదాశివన్ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొన్నాడు. ‘వడక్కన్‌కి లభించిన అంతర్జాతీయ గుర్తింపు చాలా సంతోషకరమైనది. మలయాళ చిత్రసీమను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడం ఎంతో గర్వంగా ఉంది’ అని అన్నారు. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు & నిర్మాత,  జైదీప్ సింగ్  మాట్లాడుతూ.. ‘వడక్కన్‌తో ప్రపంచ స్థాయి కాస్ట్ & క్రూ మద్దతు ఉన్న గ్లోబల్ సెన్సిబిలిటీలతో హైపర్‌ లోకల్ కథనాలను చెప్పడం ద్వారా భారతీయ సినిమాని పునర్నిర్వచించడమే మా లక్ష్యం’ అని అన్నారు. వడక్కన్ ని ఈ సంవత్సరం కేన్స్‌లో మే నెలలో ప్రదర్శించనున్నారు. వడక్కన్ ని కన్నడ, తమిళం, తెలుగు భాషల్లోకి డబ్ చేయనున్నారు.
శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం  "డర్టీ ఫెలో". ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సంస్థ కార్యాలయంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' మూవీ దర్శకుడు మల్లిడి వశిష్ఠ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో శాంతిచంద్ర, చిత్ర దర్శకులు మూర్తి సాయి అడారి మరియు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.  దర్శకులు మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ.. "శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది. మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మూవీ టిమ్ సభ్యులందరికీ అభినందనలు" అని అన్నారు. చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ.. "మా డర్టీఫెలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి టిమ్ ని అభినందించిన మల్లిడి వశిష్ఠ గారికి ధన్యవాదములు. మే 24న డర్టీ ఫెలో సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఇటీవల మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన అన్ని పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది" అని అన్నారు. చిత్ర దర్శకులు మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ.. "డర్టీ ఫెలో ట్రైలర్ ను దర్శకులు వశిష్ఠ ఆవిష్కరించడం చాలా హ్యాపీగా ఉంది. మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయి" అని అన్నారు. శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ వాలా హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సతీష్ కుమార్.పి సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రామకృష్ణ. యస్, ఎడిటర్ గా జేపీ వ్యవహరించారు.
'తెలుగువన్' అధినేత కంఠంనేని రవిశంకర్.. వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు, వందల మందిని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అవకాశాలు ఇవ్వడంలోనే కాదు.. కొత్త వారిని ప్రోత్సహించడంలో కూడా రవిశంకర్ ముందుంటారు. తాజాగా ఆయన యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ 'బిగ్ బ్రదర్' మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. విభిన్న చిత్రాలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న శివ కంఠంనేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'బిగ్ బ్రదర్'. జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె. శివశంకర రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బారావు గోసంగి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ 'తెలుగువన్' అధినేత కంఠంనేని రవిశంకర్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా ట్రైలర్ బాగుందని ప్రశంసించిన ఆయన, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.  రెండు కుటుంబాల మధ్య వైరం నేపథ్యంలో యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా 'బిగ్ బ్రదర్' చిత్రం రాబోతుంది. యాక్షన్, రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలతో పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాను అందించబోతున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. 'బిగ్ బ్రదర్' చిత్రంలో శివ కంఠంనేనితో పాటు శ్రీ సూర్య, ప్రియా హెగ్డే, ప్రీతి శుక్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవ్ సింగ్, హ్యారీ జోష్, గౌతమ్ రాజ్, గుండు సుదర్శన్, ఖుష్బూ తదితరులు ముఖ్య పాత్రలలో అలరించనున్నారు. ఓం ఝా స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు-సాహిత్యం దుర్గా ప్రసాద్ అందిస్తున్నారు. సూర్య ప్రకాష్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ఎడిటర్ గా సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ గా షేర వ్యవహరిస్తున్నారు. జీభు నేపథ్య సంగీతం అందిస్తున్నారు. తారాగణం: శివ కంఠంనేని, శ్రీ సూర్య, ప్రియా హెగ్డే, ప్రీతి శుక్లా, దేవ్ సింగ్, హ్యారీ జోష్, గౌతమ్ రాజ్, గుండు సుదర్శన్, ఖుష్బూ తదితరులు రచన, దర్శకత్వం: సుబ్బారావు గోసంగి సమర్పణ: జి. రాంబాబు యాదవ్ బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్  నిర్మాతలు: కె. శివశంకర రావు, ఆర్. వెంకటేశ్వర రావు సంగీతం: ఓం ఝా  నేపథ్య సంగీతం: జీభు డీఓపీ: సూర్య ప్రకాష్  ఎడిటర్: సంతోష్ ఆర్ట్ డైరెక్టర్: షేర కొరియోగ్రఫీ: రాజ్ పైడి ఫైట్ మాస్టర్: రామకృష్ణ  
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప..పరమేశ్వరుడి కళ్ళ వెంట రక్తం కారుతుంటే  దాన్ని  ఆపటానికి తన రెండు కళ్ళు సమర్పించి భక్త కన్నప్ప గా మారిన తిప్పడి జీవిత కథ ఆధారంగా  కన్నప్ప తెరకెక్కుతుంది.  ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి పాన్ ఇండియా నటుల చేరికతో  కన్నప్ప రేంజ్ హిమాలయ శిఖరాలంత ఎత్తుకి చేరింది. అది ఎంతలా అంటే చాలా మంది నటులు  కన్నప్ప లో కనపడాలని కోరుకునేంతలా. ఇప్పుడు ఆ అదృష్టం కాజల్ ని వరించింది  అవును.. చందమామ కాజల్ అగర్వాల్ కి కన్నప్ప లో నటించే అవకాశం వచ్చింది. ఈ మేరకు  ఆమెకి వెల్ కమ్ చెప్తు యూనిట్  ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుండంతో కాజల్ ఎలాంటి క్యారక్టర్ ని పోషిస్తుందనే దాని మీద అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. త్వరలోనే ఆమె క్యారక్టర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.  మగధీర లాంటి చారిత్రాత్మక మూవీలో నటించిన అనుభవం కూడా కాజల్ కి ఉంది 2007 లో వచ్చిన లక్ష్మి కళ్యాణం తో  కాజల్ తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పటి వరకు సుమారు యాభై సినిమాల దాకా చేసింది. 2020 లో గౌతమ్ అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది.ఒక బాబు కి కూడా జన్మనిచ్చింది. ఇక గత కొంత కాలంగా  పెద్దగా సినిమా ఆఫర్స్ ఏమి  రాలేదు. ప్రస్తుతం  సత్య భామ అనే  లేడీ  ఓరియంటెడ్ మూవీలో చేస్తుంది. ఈ తరుణంలో కన్నప్ప మంచి అవకాశం అని చెప్పవచ్చు మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన  ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా అత్యున్నతమైన  టీం పనిచేస్తోంది. న్యూజిలాండ్ లోని మంచు కొండల్లో  కూడా షూటింగ్ ని జరుపుకుంది  
సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు.  పెళ్లిలో ఉండే సంబరాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది పెళ్లి కల్చర్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు. కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం  కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్ లో ప్రారంభం అయ్యాయి. నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా స్టార్ట్ అయిన ఈ కార్యక్రమంలో సాయి రోనక్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ గా కృష్ణ, ఎడిటర్ గా బొంతల నాగేశ్వర రెడ్డి వ్యవహరిస్తున్నారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం సాహిత్యం అందిస్తున్నారు.
మూవీ : విద్య వాసుల అహం నటీనటులు: శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస రెడ్డి రచన : వెంకటేశ్ రౌతు ఎడిటింగ్: సత్య గిడుతూరి మ్యూజిక్: కళ్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి నిర్మాతలు: నవ్య మహేశ్, రంజిత్ కుమార్ దర్శకత్వం: మణికాంత్ గెల్లి ఓటీటీ: ఆహా కథ:  విద్య(శివాని రాజశేఖర్) ఓ మధ్యతరగతి అమ్మాయి. తనకి కాబోయే భర్త గురించి ఎన్నో కలలు కంటుంది. వాసు(రాహుల్ విజయ్) కూడా మధ్యతరగతి అబ్బాయి. మెకానిల్ ఇంజనీర్ గా వాసు జాబ్ చేస్తుంటాడు. అయితే అదే సమయంలో శాస్త్రి వాసుకి, విద్యకి పెళ్ళిచూపులు ఫిక్స్ చేస్తాడు. ఇక ఇద్దరు ఒకే అనేసరికి పెళ్ళి జరుగుతుంది. వీళ్ళిద్దరు అనుకున్నట్లుగానే పెళ్ళి తర్వాత వేరు కాపురం పెడతారు. ఇక కొన్నిరోజులకి విద్యకి కొత్త జాబ్ వస్తుంది. పెళ్ళి తర్వాత హనీమూన్ కి వెళ్ళకపోవడంతో వాసు డిసప్పాయింట్ అవుతాడు. కొన్నిరోజులకి వాసుకి తన బాస్ ఇంక్రిమెంట్ తక్కువ ఇచ్చాడని జాబ్ కి రిజైన్ చేస్తాడు. ఇక ఇంటిపట్టునే ఉంటూ సీరియల్స్ చూస్తూ కాలం సాగిస్తుంటాడు. కొన్నిరోజులకి వాసు ప్రతీ చిన్న అవసరానికి తన భార్యని అడుగలేక అహం అడ్డొస్తుంటుంది. ఇక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని వాసు మీద విద్య కోప్పడుతుంది. అలా ఇద్దరి మధ్య రోజు రోజుకి గొడవలు పెరుగుతాయి. ఇక అదేసమయంలో వారింటికి ఇద్దరి పేరెంట్స్ వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది. విద్య-వాసులలో ఎవరి అహం గెలిచింది? ఇద్దరు అన్యోన్యంగా ఉండగలిగారా? ఇద్దరిలో ఎవరు కాంప్రమైజ్ అయ్యారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే... విశ్లేషణ: కొత్తగా పెళ్ళైన జంట మధ్యలో చిన్న చిన్న గొడవలు జరగడం కామన్. అలా గొడవ జరిగినప్పుడు ఒకరు కాకపోతే మరొకరు కాంప్రమైజ్ అవ్వాలి.. కానీ ఇద్దరికి అహం ఉంటే ఎలా? అనే చిన్న పాయింట్ తో దర్శకుడు మణికాంత్ గెల్లి ఈ మూవీని తీసుకొచ్చాడు. దీనిని ప్రేక్షకుల మెప్పు పొందేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే దర్శకుడు సినిమాలో భార్యభర్తల మధ్య జరిగే గొడవలు.. ఇగో మీద ఎక్కువ శ్రద్ధ చూపించాడు. కానీ ప్రేక్షకుడికి ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వాలని మరచిపోయాడు. గొడవ, ఇగో అనే అంశాల చుట్టూ కథ సాగడం వరకు ఒకే కానీ.. దానికి అదిరిపోయే కామెడీ కూడా తోడయినట్లైతే అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.  'మద్యం మద్యాహ్నం అలవాటు లేదు' వంటి కొన్ని డైలాగ్ లు బాగానే పేలాయి. పెళ్ళి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే బాండింగ్ ని, ఎమోషన్స్ ని పతాక సన్నివేశాల్లో బాగా చూపించారు. సినిమా అంతా కూడా అదే టెంపో మెయింటైన్ అయితే ఇంకా బాగుండేది. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ మీద, ఫన్ డైలాగ్స్ మీద మరింత ఫోకస్ పెట్టాల్సింది. నిడివి తక్కువ కావడం ఈ సినిమాకి ప్రధాన బలం. తెలియకుండానే సినిమా త్వరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు. ఒక ఐదు నిమిషాల పాటు సాగే సాంగ్ కాస్త రొమాంటిక్ ఉంటుంది. మిగతాదంతా ఓకే. అసభ్య పదజాలం ఎక్కడా వాడలేదు. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ బాగుంది. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సత్య గిడుతూరి ఎడిటింగ్ లో కాస్త శ్రద్ధ చూపాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందోనని జగపతిబాబు, ప్రియమణి ఎప్పుడో చూపించారు. ఇలాంటి కాన్సెప్ట్ తో పలు సినిమాలు వచ్చాయి. అయితే ఇది ఈ తరానికి తగ్గట్టుగా కాస్త కొత్తగా ఉంది. నటీనటుల పనితీరు: శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ఇద్దరు పోటీపడి నటించారు. అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస రెడ్డి, అభినయ తమ పాత్రలకి న్యాయం చేశారు. ఫైనల్ గా : వన్ టైమ్ వాచెబుల్. రేటింగ్ : 2.5 / 5 ✍️. దాసరి   మల్లేశ్
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  
నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని
ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.  వీటిని తెలుగు రాష్ట్రాలలో తాటిముంజలు అంటారు.  లేతగా ఉన్న తాటి ముంజలు తియ్యగా, మృదువుగా, లోపల కాసిన్ని తియ్యని నీళ్లలో తినడానికి ఎంతో బాగుంటాయి. వేసవి కాలంలో మాత్రమే అందుబాటులోకి రావడంతో అందరికీ వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. తాటిముంజలను ఈ వేసవి కాలంలో తప్పకుండా ఎందుకు తినాలో చెప్పే కారణాలు బోలెడు ఉన్నాయి. ఈ కారణాలు తెలిస్తే అస్సలు వదలకుండా తాటిముంజలను ఈ సీజన్ లో రుచి చూస్తారు. తాటిముంజలు తింటే శరీరానికి కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. హైడ్రేట్.. మండిపోతున్న ఎండల కారణంగా వేడి కూడా అధికంగా ఉంటుంది.  ఈ వేడి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది.  దీని కారణంగా  శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీన్నే శరీరం డీహైడ్రేట్ అవ్వడం అంటారు. తాటిముంజలు  తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు. తాటిముంజలు తింటే శరీరం కోల్పోయిన తేమ శాతం తిరిగి భర్తీ అవుతుంది. ఉదర సమస్యలు.. ఈ మండే వేసవి కాలంలో చాలామంది ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కుంటారు. చాలామందికి కడుపులో వేడి పుట్టి అది కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది.   అయితే తాటిముంజలు తింటే పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల  జీర్ణవ్యవస్థ బలపడుతుంది.  మలబద్ధకం, అజీర్ణం,  గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.   రోగనిరోధక శక్తి.. చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే వ్యాధులు, జబ్బులు తొందరగా వస్తాయి. అంతేకాదు ఇలా వచ్చిన జబ్బులు అంత తొందరగా తగ్గవు కూడా. కానీ తాటి ముంజలు తింటే  రోగనిరోధక శక్తి  బలపడుతుంది. తాటిముంజలలో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీవక్రియను..   జీవక్రియ బలహీనంగా ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాక శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణంగా  బరువు పెరుగుతారు.   ఊబకాయం బాధితులుగా మారతారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే తాటిముంజలను  తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది.  ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. తద్వారా అధికంగా తినకుండా కూడా నివారిస్తుంది. డయాబెటిస్‌.. తాటిముంజలు  మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను  నియంత్రిస్తుంది.                                                                   *రూపశ్రీ.  
ఉల్లిపాయ బోలెడు వంటకాల్లో కనిపించే ఒక ముఖ్యమైన పదార్ధం. ఉల్లిపాయ పసుపు, తెలుపు, ఎరుపు వంటి రంగులలో లభిస్తుంది. ఉల్లిపాయ రుచి మాత్రమే కాకుండా, ఇందులో ఉన్న పోషకాల కంటెంట్ కారణంగా ఆహారంలో ప్రముఖంగా నిలిచింది. పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలవాటు లేనివారు కూడా తినడం మొదలు పెడతారు. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు విటమిన్ సి కి అద్భుతమైన మూలం, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి బాక్టీరియా, వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షించే తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడంలో పచ్చి ఉల్లిపాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయల తీసుకోవడం వల్ల  రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.. పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది సరైన జీర్ణక్రియకు మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి అవసరమైనది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది. మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, హేమోరాయిడ్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. వాపును తగ్గిస్తుంది.. క్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ యొక్క బాగా కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు కాల్షియం శోషణను ప్రోత్సహించడంలో, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి, ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఏకాగ్రత స్థాయిలకు దారితీస్తుంది.  క్యాన్సర్ నివారిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండే సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ మరియు అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలు అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ముడతలు, వయస్సు మచ్చలు, పిగ్మెంటేషన్ స్థాయిలు తగ్గుతాయి.  ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి ఇది దోహదపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. పచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది పచ్చి ఉల్లిపాయలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. అతిగా తినే పరిస్థితులను ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ తగ్గిస్తుంది. కేలరీలను భర్తీ చేస్తుంది.  చివరికి బరువు తగ్గడానికి. సహాయపడుతుంది.                                   ◆నిశ్శబ్ద.
భోజన ప్రియులకి నెయ్యి లేదా అంటూ ఉంటారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు.నెయ్యి తో పోపు పెట్టిన ఆహారం,నెయ్యితో కాల్చిన చపాతి నెయ్యితో కాల్చిన పెసరట్టు తప్ప మరేది వద్దు అంటూ ఉంటారు.ఇక కొంతమంది అయితే ముఖ్యంగా స్వీట్స్ లో నెయ్యి కారుతూ ఉండాలి. ముఖ్యంగా బొబ్బట్లు, బూరెలు  కూడా నెయ్యి తో చేసినవే బాగుంటాయి అంటారు భోజన ప్రియులు నెయ్యితో చేసిన పదార్ధాలు ఆస్వాదిస్తూ తిన్నప్పుడే వాటి మజా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో కుటుంబంలో పెళ్ళి ళ్ళు శుభకార్యాలలో సంబంధాలు కోసం వెళ్ళినప్పుడు మా నానమ్మ నెయ్యి వెన్నతో పెట్టింది.మీరేం పెడతారు చెప్పండి అంటు అడగడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మీరు ఇలాగే గనక నెయ్యి తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇకమీరు నెయ్యి జోలికే వెళ్ళరు. నెయ్యి ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో మీకు బాగా తెలుసు.వినిఉండచ్చు. ఇది కేవలం యాంటి ఏజింగ్ మాత్రమే కాదు మనసు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి లాభం కలిగించే అంశం అయితే నెయ్యి ప్రతి ఒక్కరికి సరిపడదు. అని అంటున్నారు నిపుణులు. భారత దేశం లో నెయ్యి చాలా ప్రాచుర్యం లో ఉంది.నెయ్యి కొంతమంది ప్రతిరోజూ తమ భోజనం లో చేరుస్తారు. నెయ్యి వాడడం కూడా చాలా కష్టం నేతిని బ్రెడ్ లో లేదా చపాతీలో పప్పు కూరలో నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. నెయ్యిని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడడం గమనించవచ్చు.నెయ్యి ఆరోగ్య పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. గుండె సంబందిత ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.ఖాళీ పొట్టతో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచెంద్రియాలలో శుభ్ర పరిచి ఉపసమనం ఇస్తుంది. నెయ్యిలో యాంటి ఏజింగ్ మరియు గుండె ను ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది దీనితో పాటు నెయ్యి మెదడు,జ్ఞాపక శక్తిని పెంచి పంచేంద్రియాలు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.