LATEST NEWS
  నెల్లూరు మేయ‌ర్ పై అవిశ్వాసం  పెట్టింది టీడీపీ. ఈ నెల  ప‌ద‌హారున ఈ అవిశ్వాస  తీర్మానం  జ‌రుగుతుండ‌టంతో.. అటు వారు ఇటు- ఇటు వారు అటు అనే నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.. ఇప్ప‌టి  వ‌ర‌కూ ఉన్న వారెంత‌?  లేని వారెంద‌రు? ఎవ‌రి  బ‌లాబ‌లాలేంటి? అన్న‌ది  ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు మారుతూనేఉన్నాయి. సంద‌ట్లో స‌డేమియాలా కొంద‌రు కార్పొరేట‌ర్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారుతూనే ఉన్నారు. ప్ర‌స్తుతం టీడీపీలోకి వెళ్లిన  ఐదుగురు వైసీపీ కార్పొరేట‌ర్లు ఇటు తిరిగి ఇటు వ‌చ్చేశారు. వీరిలో ఒక ఇద్ద‌ర్నిత‌మ పార్టీ అధినేత జ‌గన్ ముందు తీస్కెళ్లి  ప్ర‌వేశ పెట్టారు మాజీ మంత్రి అనిల్, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ ప‌ర్వ‌త‌రెడ్డి. దీంతో గ‌ణాంకాల్లో తేడా వ‌చ్చింది. మ‌రో ఇద్ద‌రుగానీ టీడీపీని వీడిపోతే.. అవిశ్వాస‌మేవీగిపోతుంది. కానీ ఇక్క‌డే టీడీపీ మేజిక్ చేయ‌గ‌లిగింది.. జ‌గ‌న్ ని క‌లిసిన ఆ ఇద్ద‌రూ తిరిగి టీడీపీలోకి వ‌చ్చేసిన‌ట్టు వారే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేశారు. ఇంత‌కీ నెల్లూరు మేయ‌ర్ వ్య‌వ‌హారంలో అస‌లేం జ‌రిగిందో చూస్తే..  నెల్లూరు మేయ‌ర్ పొట్లూరి స్ర‌వంతిపై అవిశ్వాస  తీర్మానం ఎందుకు పెట్టారో చూస్తే.. నాలుగేళ్ల క్రితం  నెల్లూరు కార్పొరేష‌న్లో 54 డివిజ‌న్ల‌ను వైసీపీసొంతం చేసుకుంది. ఈ పార్టీకి  చెందిన రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి  శ్రీధ‌ర్ రెడ్డి కూట‌మిలోకి వ‌చ్చారు. దీంతో కొంద‌రు కార్పొరేట‌ర్లు శ్రీధ‌ర్ రెడ్డి  వెంబ‌డి న‌డిచారు. దీంతో మేయ‌ర్ భ‌ర్త జ‌య‌వ‌ర్ధ‌న్ షాడో మేయ‌ర్ గా అధికారం చ‌లాయించాడు. అక్ర‌మాలు చేసి  ఫోర్జ‌రీ  కేసుల్లో జైలుకు వెళ్లాడు. దీంతో నెల్లూరు న‌యా అభివృద్ధి కోసం  కొత్త  పాల‌క వ‌ర్గాన్ని  ఎంపిక చేసేందుకు 42 మంది కార్పొరేట‌ర్లు సిద్ధ‌ప‌డ్డారు. మంత్రి నారాయ‌ణ‌, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని క‌లిసి  క‌లెక్ట‌ర్ అనుమ‌తి  పొందారు. చివ‌రికి అవిశ్వాస  తీర్మానం కోసం  రంగం సిద్ధ‌మైంది. ఈ ప‌రిస్థితుల్లో క్వార్జ్  అక్ర‌మాల విచార‌ణ‌లో ఉన్న జిల్లా నేత‌లు, వారికి అండ‌గా ఉన్న గంజాయి బ్యాచ్ కార్పొరేట‌ర్ల‌ను ప్ర‌లోభ  పెట్ట‌డం  ప్రారంభించారు. ఫోన్ల ద్వారా బెదిరింపులు చేయ‌డం ప్రారంభించారు. టీడీపీ లోకి వ‌చ్చిన వారిని బెదిరించ‌డంతో పాటు ప్ర‌లోభాలు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యం మంత్రి నారాయ‌ణ ఎమ్మెల్యే  కోటంరెడ్డి దృష్టికి వెళ్ల‌డంతో.. వారీ విష‌యం సీరియ‌స్ గా తీస్కున్నారు. బెదిరింపుల‌కు పాల్ప‌డే వారి వివ‌రాలివ్వాల్సిందిగా.. కోరారు. వారి డీటైల్స్ పోలీసుల‌కు అందించి క‌ఠిన  చ‌ర్య‌లు తీస్కోవ‌ల్సిందిగా ఆదేశించారు. ఇప్పుడ‌క్క‌డి ప‌రిస్థితి  ఎలా త‌యారైందంటే.. ఇటు వైసీపీ అటు టీడీపీ వ‌ర్గాలు కార్పొరేట‌ర్ల  నివాసాల ముందు నిఘా ఏర్పాటు చేశారు. మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయొద్దని వైసీపీ  చేయ‌ని  ప్ర‌య‌త్నం లేదు. మ‌రికొంద‌రు ఫోన్ల‌లోనే బేర‌సారాలు మొద‌లు పెట్టారు. ఏ కార్పొరేటర్​కి ఫోన్ చేసి బెదిరించినా వెంటనే సమాచారం అందించాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆదేశించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరగనున్న ప‌రిస్థితిలో మేయ‌ర్ ఎన్నిక‌ నగరంలో తీవ్ర‌ చర్చనీయంగా మారింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరిగే వరకు వైసీపీ నేతలు ఎలాంటి ప్ర‌లోభాల‌ ప్రయోగాలు చేస్తారో వేచి చూడాలి. మేయర్​గా ఉన్న పొట్లూరి స్రవంతికి, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది వ‌ర‌కే ప్రకటించారు. ఇక మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఈ విషయాన్ని గుర్తు చేశారు. అంతే  కాదు త‌మ‌కంత‌టి సంఖ్యాబ‌లం లేదంటూనే లోలోప‌ల లోపాయికారీ బేర సారాలు ఆడుతున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో నెల్లూరు మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారేలా క‌నిపిస్తోంది.
  తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే  కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఓ మండల అధ్యక్షుడిని టార్గెట్ చేసి వరుస వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి విమర్శలు గుప్పించారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి?  పేకాట క్లబ్ కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్‌కా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే ...నువ్వు నిజంగా రాయల్...అంటూ రాసుకొచ్చారు కొలికపూడి.  విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును ఉద్దేశించి ఈ స్టేటస్‌లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాయల సుబ్బారావు చాలా కాలంగా పేకాట ఆడిస్తున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించినట్లు తెలుస్తోంది.  రాయల సుబ్బారావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గమని ప్రచారం జరుగుతోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ల పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు.  
  పందెం కోళ్ల కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బినామీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారు? ఇవన్నీ నాకు తెల్వదా? ఆడపిల్ల కదా అని లైట్ తీసుకుంటున్నారేమో ఒక్కొక్కడి తోలు తీస్తాని కవిత హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.  తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తుందని నన్ను అంటున్నారు. అలా మాట్లాడే గుంటనక్కలకు చెప్తున్నా. నా మీద అనవసరమైన  దాడి చేస్తే మీ చిట్టా మోత్తం విప్పుతాని కవిత అన్నారు.  జనం బాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి,అక్రమాలు అన్నీ బయటికి వస్తున్నాయి. ఇది జస్ట్ టాస్ మాత్రమే. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఏదో ఒక రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అవినీతిపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. నాకు సమయం వస్తుంది. ఏదో ఒకరోజు సీఎం అవుతాను...2014 నుంచి ఇప్పుటి వరకు రాష్ట్రంలో జరిగిన స్కామ్‌లపై చర్యలు తీసుకుంటానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కరం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు
  తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి  ఘన విజయం సాధించారు. సూర్యపేట జిల్లా  తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామం పంచాయతీ నుంచి సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. హోరాహోరీ పోరులో ప్రత్యర్థి మీద విజయం సాధించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, సర్పంచ్ గా గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని బీఆర్ఎస్  అధినేత కేసీఆర్ అభినందించారు.  100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం, ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం, అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం అని కేసీఆర్ అన్నారు.   సంతోషం వ్యక్తం చేస్తూ,ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్ర రెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను,  మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలను, నాయకులను అధినేత కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని అధినేత అభిలషించారు. మొదటి విడత ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచి స్థానాల్లో గెలుపు పోందారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో హస్తం పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 1,146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. బీజేపీ మద్దతుదారులు రెండువందల లోపు స్థానాలకు పరిమితమైంది.తొలివిడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 3,834 సర్పంచి, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 84.28 శాతం ఓటింగ్‌ నమోదైంది
  తాజాగా కోటి  సంత‌కాల సేక‌ర‌ణ  చేసింది వైసీపీ. జ‌గ‌న్ పాల‌నికిదో రెఫ‌రెండంగానూ చెప్పుకొస్తున్నారు భూమ‌న‌, రోజా వంటి వైసీపీ  జ‌గ‌జ్జంత్రీలు. ఇదంతా ఇలా ఉంటే  ఈ పైపై మెరుగుల‌కు మోస  పోని... జ‌గ‌న్ లోలోప‌ల ఒక భారీ స‌ర్వే చేయించార‌ట‌. ఈ స‌ర్వేలో 18 నెల‌ల కూట‌మిపాల‌న ఎలా ఉందో ఒక తుల‌నాత్మ‌క ప‌రిశీల‌న చేయించార‌ట‌. ఈ ప‌రిశీల‌న‌లో తేలిన వాస్త‌వాలేంటో చూస్తే..  గ‌తంలో క‌న్నా ఎంతో మెరుగ్గా  కూట‌మి  పాల‌న ఉన్న‌ట్టు చెప్పార‌ట ఈ స‌ర్వేలో పాల్గొన్న ప్ర‌జ‌లు. త‌మ‌కు అన్నీ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని.. ఫించ‌న్లు స్వ‌యంగా బాబే ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మ‌నీ.. గూగుల్ వంటి సంస్థ‌లు రావ‌డంతో పాటు.. ఇటీవ‌ల పార్ట‌న‌ర్ స‌మ్మిట్ ద్వారా 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఒప్పందాలు జ‌రిగాయ‌ని.. ఇక సంక్షేమ‌ప‌థ‌కాలు కూడా పెద్ద ఎత్తున జ‌నానికి చేరుతున్నాయ‌నీ చెప్పార‌ట‌. మ‌రి  ప‌వ‌న్ క‌ళ్యాణ్ 15 ఏళ్ల పాటు ఈ కూట‌మి క‌లిసి  ఉండాల‌ని కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయ‌మేంట‌ని అడ‌గ్గా.. అలా ఉంటేనే రాజ‌ధానిపూర్త‌వుతుంది. పోల‌వ‌రం కూడా  కంప్లీట్ అవుతుంది. ఆపై కేంద్ర‌ప్ర‌భుత్వంతో ఉన్న  స‌ఖ్య‌త కార‌ణంగా ఇంకా ఎన్నో మంచి ప‌నులు జ‌రుగుతాయి కాబ‌ట్టి.. మాకీ ప్ర‌భుత్వ‌మే బాగుంద‌ని అన్నారట ఆంధ్ర‌ప్ర‌జ‌లు. ఇక చంద్ర‌బాబు అపార‌ అనుభ‌వం, లోకేష్ యువ‌నాయ‌క‌త్వం, ప‌వ‌న్ పాపులారిటీ కూట‌మి ప్ర‌భుత్వానికి పెట్ట‌ని కోట‌లుగా మారి.. ఏపీని సంక్షేమాబివృద్ధి దిశ‌గా  ప‌రుగులు తీయిస్తున్న‌ట్టుగానూ చెప్పుకొచ్చార‌ట స‌ర్వేలో పాల్గొన్న ప్ర‌జ‌లు. దీంతో జ‌గ‌న్ కి దిమ్మ తిరిగి భ‌విష్య‌త్ బొమ్మ క‌నిపించింద‌ట‌. ఆయ‌న అధికార‌పు ఆశ‌ల‌పై ఫ్రిడ్జ్ లోంచి బ‌య‌టకు తీసిన చ‌ల్ల చ‌ల్ల‌ని నీళ్లు కుమ్మ‌రించిన‌ట్ట‌య్యింద‌ట‌. బేసిగ్గా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏం భావించాడో చూస్తే.. ఆయ‌న‌కు ఉన్న 40 శాతం ఓటు బ్యాంకుకు కూట‌మి  వ్య‌తిరేఖ‌త ద్వారా మ‌రో 8 శాతం ఓటు బ్యాంకు త‌న పార్టీకి క‌లిసి  వ‌స్తుంది. కాబ‌ట్టి, సుమారు 50 శాతం ఓట్ల‌తో తాను 2029లో గెల‌వ‌బోతున్న‌ట్టుగా ఫీల‌య్యేవార‌ట ఇన్నాళ్లూ. ఇప్పుడా ఫీలింగ్స్ మొత్తం బూడిద‌లో పోసిన‌ట్టే అయ్యింద‌ట‌. ఆ స‌ర్వే ఫ‌లితాలు అలా అఘోరించాయ‌ట‌. ఇలా ఎందుకు జ‌రిగిందో కూపీ లాగిన  జ‌గ‌న్ కి న‌మ్మ‌లేని నిజాలెన్నో బ‌య‌ట ప‌డ్డాయ‌ట‌. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ మైండ్ సెట్లో ఆల్రెడీ ఉన్న హింసాత్మ‌క ప్ర‌వృత్తికి ర‌ప్పా ర‌ప్పా ఫ్లెక్సీల మోత కూడా తోడ‌య్యింద‌ట‌. అంతే  కాదు కొంద‌రు ఫ్యాను పార్టీ  మ‌ద్ద‌తు దారులు కౌంటింగ్ మొద‌ల‌య్యి ఫ‌లితాలు త‌మ  వైపున‌కు తిరుగుతున్నాయ‌ని తెలిసిన వెంట‌నే న‌*కుడు మొద‌ల‌వుతుంద‌ని చేస్తోన్న హెచ్చ‌రిక‌లు సైతం ఆయ‌న‌కు చేటు తెస్తున్న‌ట్టు బ‌య‌ట ప‌డింద‌ట‌.
ALSO ON TELUGUONE N E W S
    -రికార్డు కలెక్షన్స్  -బాలయ్య జోరు  -పాజిటివ్ రెస్పాన్స్ అదనపు బలం -వీకెండ్ లో ఎంత!      గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.     అఖండ 2  తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ కూడా ఈ కలెక్షన్స్ ని అధికారకంగా తెలపడంతో పాటు 'అఖండ భారత్ బ్లాక్ బస్టర్' అంటు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ రికార్డు కలెక్షన్స్ పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ ట్రేడ్ వర్గాలు కూడా ఈ కలెక్షన్స్ పై స్పందిస్తు 'తొలి రోజే బాలయ్య  59 కోట్ల రూపాయలు దాకా సాధించడం చూస్తుంటే ఈ వీకెండ్ కి 100 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ. పైగా సంక్రాంతి వరకు ఎలాంటి పెద్ద తెలుగు సినిమాలు లేవు. టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది.      Also read:   రాజు వెడ్స్ రాంబాయి ఓటిటి డేట్ ఫిక్స్! మరి ఫ్యాన్స్ ఏమంటున్నారు     దీంతో బాలయ్య అఖండ 2 తో తన కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని చెప్తున్నారు.దీంతో అఖండ 2 సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. బాలయ్య గత చిత్రం 'డాకు మహారాజ్' వరల్డ్ వైడ్ గా 56 కోట్ల గ్రాస్ ని అందుకున్న విషయం తెలిసిందే.           
      -ఇదేనా ఆ డేట్ -అదే అయితే ఫ్యాన్స్ హ్యాపీ -థియేటర్స్ లో సంచలనం  -మరి ఓటిటి లో!     గత నెల నవంబర్ 21 న థియేటర్స్ లో అడుగుపెట్టిన మూవీ రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai). రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కగా అఖిల్ రాజ్, తేజస్విరావు జంటగా నటించారు. నటించారు అనే కంటే వాళ్లిదరు  రాజు, రాంబాయి గా జీవించారని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి హృదయాల్ని తాకిన సినిమాగా కూడా నిలిచింది.ముఖ్యంగా క్లైమాక్స్ చూసి బయటకి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఓటిటి సినీ ప్రియులకి ఒక గుడ్ న్యూస్ వచ్చింది.     రాజు వెడ్స్ రాంబాయి ఓటిటి హక్కులు ఈటీవీ విన్(Etv Win)దగ్గర ఉన్నాయి. సదరు స్ట్రీమింగ్ ని  డిసెంబర్ 19 నుంచి అందుబాటులోకి తీసుకొస్తునట్టుగా తెలుస్తోంది. నిజానికి తొలుత ఓ టిటి స్ట్రీమింగ్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో స్ట్రీమింగ్ కి వస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ నెల 19 నుంచే స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓటీటీ స్ట్రీమింగ్ పోస్టులు దర్శనమిస్తున్నాయి. మేకర్స్ అయితే ఈ డేట్ ని అధికారకంగా ప్రకటించలేదు.     Also read:  రోషన్ కనకాల ఆశలని మోగ్లీ 2025 నెరవేర్చిందా! లేదా!     తెలంగాణ(Telangana)లోని ఖమ్మం జిల్లా ఇల్లెందు రూరల్ ఏరియాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రాజు వెడ్స్ రాంబాయి తెరకెక్కింది.మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని 17 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది.   సాయిలు(Saailu)దర్శకుడు కాగా చైతన్య జొన్నలగడ్డ నెగిటివ్ క్యారక్టర్ లో చెయ్యగా శివాజీ రాజా, అనిత చౌదరి కథ కి ముఖ్యమైన క్యారెక్టర్స్ ని పోషించి మూవీ విజయంలో కీలక పాత్రలు పోషించారు.  
    -రోషన్ హిట్ అందుకున్నాడా! -మోగ్లీ ఎలా ఉంది. -ప్రేక్షకులు ఏమంటున్నారు -రివ్యూస్ పరిస్థితి ఏంటి!     ఎంతో మంది యాక్టర్స్ కి నటనలో ఓనమాలు దిద్దిన నటనాచార్యుడు దేవదాస్ కనకాల(Devadas kanakala). ఎన్నో చిత్రాల్లో కూడా నటించి ఆయా క్యారెక్టర్స్ కి ప్రాణ ప్రతిష్ట చేసాడు. కుమారుడు  రాజీవ్ కనకాల(Rajeevi Kanakala)సినీ రంగంలో తన సత్తా చాటుతు ముందుకెళ్తున్నాడు. ఎలాంటి క్యారెక్టర్ లో అయినా పరకాయప్రవేశం చేసి సదరు క్యారక్టర్ ని ప్రేక్షకుల మదిలో చాలా కాలం యాదుండేలా చెయ్యడంలో దిట్ట. రాజీవ్ సతీమణి సుమ కూడా యాంకర్ గా, నటిగా తన సత్తా చాటుతుంది. మరి ఈ కుటుంబం నుంచి వచ్చిన 'రోషన్ కనకాల' (Roshan Kanakala)2023 లో బబుల్ గమ్ తో హీరోగా పరిచయమయ్యాడు. అంతకు ముందు వచ్చిన 'నిర్మలా కాన్వెంట్' అనే మూవీతో సినీ రంగానికి పరిచయమైనా, సోలో హీరోగా మాత్రం 'బబుల్ గమ్' నే. బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది.     దీంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఈ రోజు 'మోగ్లీ 2025'(mowgli 2025) అనే విభిన్నమైన టైటిల్ తో కూడిన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కలర్ ఫొటోతో నేషనల్ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మోగ్లీ తో మెగా ఫోన్ చేపట్టడంతో పాటు ప్రచార చిత్రాలు బాగుండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  మేకర్స్ సినిమాపై నమ్మకంతో నిన్న నైట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. ప్రీమియర్స్ చూసిన చాలా మంది ప్రేక్షకులు మాట్లాడుతు 'పాత తరహాలో కథ, కథనాలు సాగడంతో పాటు సందీప్ దర్శకత్వం  మెప్పించలేకపోయింది.     రోషన్ నుంచి పెర్ ఫార్మెన్స్ ని రాబట్టడంలో కూడా సందీప్ ఫెయిల్ అయ్యాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా రివ్యూస్ కూడా నెగిటివ్ గానే వస్తున్నాయి. దీంతో హిట్ ని అందుకోవాలనుకున్న రోషన్ ఆశ మరోసారి నెరవేరకుండా పోయిందనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యక్తం చేస్తున్నారు.      Also Read:   మోగ్లీ 2025 మూవీ రివ్యూ      అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ లో రోషన్ సరసన మరాఠి భామ సాక్షి మడోల్ కర్(Sakkshi Mhadolkar) జత కట్టింది. తాను పోషించిన జాస్మిన్ క్యారక్టర్ కి మాత్రం  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. బండి సరోజ్ కుమార్ ప్రతి నాయకుడిగా కనిపించగా వైవా హర్ష మరో కీలకమైన క్యారక్టర్ లో చేసాడు.    
    సినిమా పేరు:  మోగ్లీ 2025 తారాగణం:  రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్ వైవా హర్ష  తదితరులు  ఎడిటర్: పీకె  మ్యూజిక్:  కాలభైరవ  రచన, దర్శకత్వం: సందీప్ రాజ్  సినిమాటోగ్రాఫర్: రామ్ మారుతీ ఎం  బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  నిర్మాతలు:విశ్వప్రసాద్, కృతి ప్రసాద్  విడుదల తేదీ: డిసెంబర్ 13    బబుల్ గమ్ మూవీ తర్వాత'రోషన్ కనకాల'(roshan Kanakala)రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్(Sandeep Raj)తో కలిసి ఈ రోజు మోగ్లీ 2025(Mowgli 2025)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.రాజా సాబ్ నిర్మాత విశ్వప్రసాద్ మోగ్లీ ని నిర్మించడం స్పెషల్ ఎట్రాక్షన్.  సినిమాపై నమ్మకంతో  మేకర్స్ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.   కథ మురళి అలియాస్ మోగ్లీ( రోషన్ కనకాల). చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడంతో తన ఊరు పక్కనే ఉన్న అడవిలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంటాడు. అందుకే అందరు మోగ్లీ అని పిలుస్తారు. పోలీస్ ఉద్యోగం సంపాదించాలనేది మోగ్లీ లక్ష్యం. కానీ బతుకు తెరువు కోసం తన ప్రాణస్నేహితుడు బంటి(వైవా హర్ష) తో కలిసి చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన ఏరియా వచ్చిన ఒక సినిమా బృందానికి  కాంట్రాక్టర్ గా ఉండటంతో పాటు సదరు చిత్రంలో డూప్ గా యాక్ట్ చేస్తాడు. షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ జాస్మిన్( సాక్షి మడోల్కర్) ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. జాస్మిన్ చెవుడు, మూగ అమ్మాయి. ఆమె కూడా మోగ్లీని ప్రేమిస్తుంది. క్రిస్టో ఫర్ నోలన్(  బండి సరోజ్ కుమార్) పేరుకి సమాజాన్ని కాపాడే పోలీస్ ఆఫీసర్. కానీ ఒక అసాంఘిక వ్యక్తి. శాడిస్ట్ లా బిహేవ్ చేస్తూ ఎంతో మంది జీవితాలని నాశనం చేసిన వ్యక్తి. అలాంటి నోలన్ మోగ్లీ, జాస్మిన్ లైఫ్ లోకి వస్తాడు. ఆ ఇద్దరి లైఫ్ లోకి నోలన్  ఎందుకు వచ్చాడు? నోలన్ రావడం వలన  మోగ్లీ, జాస్మిన్ ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి? వాటిని ఎలా ఫేస్ చేసారు? నోలన్ క్యారక్టర్ యొక్క లక్ష్యంతో పాటు చేసే దుర్మార్గాలు ఏంటి? చివరకి ఆ క్యారక్టర్ ఎలా ముగిసింది?  మోగ్లీ, జాస్మిన్ ల ప్రేమ గెలిచిందా లేదా అనేదే చిత్ర కథ.   ఎనాలసిస్     ఈ కథలో ఏముందని మేకర్స్ భావించారో తెలియదు గాని, అందరికి తెలిసిన కథ ని సినిమా ఫస్ట్ నుంచి చివరకి దాకా చుట్టిపడేసారు. మొదటి సీన్ నుంచి చివరకి సీన్ దాకా ఎన్నో సినిమాల్లో చూసినవే. అసలు కథ ఎలా ఉండబోతుందో అని ముందుగానే చెప్పేసి సీన్స్ రన్ చేస్తుంటే పెద్ద హీరోల సినిమాలే ఎవరు చూడటం లేదు. మరి రోషన్ లాంటి అప్ కమింగ్ హీరోతో కథ చెప్పేసి దర్శకుడు, రచయిత సందీప్ రాజ్  ఏ ధైర్యంతో తెరకెక్కించాడో అర్ధం కాదు. పోనీ సన్నివేశాలు బాగున్నాయా అంటే మూవీ మొత్తంపై ఒక్క సన్నివేశం బాగోలేదు.     మోగ్లీ క్యారక్టర్ కి కూడా ఒక విధి విధానం అంటూ ఉండదు. కోపం ఎక్కువ వస్తుందని చూపిస్తారు. మళ్ళీ తన జీవితాన్ని నాశనం చేసే వాళ్ళతో ఫైట్ చేసి కూడా నా జోలికి రాకండని బతిమాలతాడు. అసలు పోలీస్ ఆఫీసర్ అవుదామని అనుకున్న ఒక వ్యక్తి ఎంత దైర్యంగా ఉంటాడు. అతని బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉంటుంది. మరి అలాంటి మోగ్లీ ని అమాయకంగా చూపించడం ఏంటో అర్ధం కాదు.  క్యారక్టర్ కూడా ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా డల్ గా ఉంటుంది  కొద్దిలో గొప్ప జాస్మిన్  చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తండ్రి తో వచ్చిన సీన్స్ తో పాటు, జాస్మిన్ పెర్ ఫార్మెన్సు మాత్రమే సినిమా మొత్తంపై బాగున్నాయి. క్రిస్టోఫర్ నోలన్ క్యారక్టర్  కోసం సినిమాని తెరకెక్కించినట్టుగా అనిపించడం కూడా మైనస్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే  క్రిస్టోఫర్ నోలన్ చేసే ఒక దుర్మార్గంతో సినిమా ప్రారంభమైంది.     ఈ సీన్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో అంచనాకి వస్తాం. మోగ్లీ ఇంట్రడక్షన్ తో పాటు, మోగ్లీ, జాస్మిన్ ల పరిచయం సన్నివేశం బాగున్నాయి. ఆ తర్వాత వచ్చే సీన్స్  కథ కోసం రన్ అయ్యాయి కానీ కథలో భాగం కాలేదు. తాను ప్రేమించిన అమ్మాయి క్యారక్టర్ బాడ్ అని శారీరకంగా తప్పు చేస్తుందని ఎవరో చెప్తే  మోగ్లీ నమ్మడాన్ని జీర్ణించుకోలేం. సినిమా షూటింగ్ సందర్భంగా వచ్చే సన్నివేశాల్లో ఎంటర్ టైన్ మెంట్ ని  సృషించవచ్చు. ఆ దిశగా చేసి ఉంటే ఫస్ట్ హాఫ్ కి న్యాయం జరిగేదేమో. బంటి, మోగ్లీ మధ్య వచ్చే ఫ్రెండ్ షిప్ సీన్స్ బాగున్నా, చాలా సినిమాల్లో అలాంటివి చూసేసాం. అల్లు అర్జున్ ఫ్యాన్ గా పుష్ప గెటప్ లో సుహాస్ కనపడిన సీన్, చెప్పిన డైలాగ్స్ మాత్రం బాగున్నాయి.     ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం క్రిస్టోఫర్ నోలన్ చుట్టూనే  తిరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చే సీన్స్ అన్ని చాలా ఇబ్బంది అనిపిస్తాయి. మోగ్లీ ని అక్రమంగా ఒక హత్య కేసులో ఇరికించి చిత్రహింసలకి గురి చేసే సన్నివేశం తర్వాత, మోగ్లీ ని యాక్టివ్ చెయ్యాల్సింది. ఆ దిశగా చెయ్యలేదు. ఇక్కడే సినిమా మరింత గాడి తప్పింది.ప్రీ క్లైమాక్స్ లో యాక్టీవ్ చేసినా  మళ్ళీ సింపతీ కోసం శత్రువు ని కూడా ఏమి అనని అమాయకుడు అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. బంటి చనిపోవడం, క్లైమాక్స్ కూడా మెప్పించలేదు.     నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు   మోగ్లీ క్యారక్టర్ లో రోషన్ సత్తా చాటగలడని స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా అర్థమవుతూనే ఉంటుంది. కానీ దర్శకుడు సందీప్ రాజ్ మోగ్లీ క్యారక్టర్ కి అన్యాయం చేసాడు.దీంతో రోషన్ నటన గురించి ఎక్కువగా చెప్పుకోలేం. ఇక మరాఠీ భామ సాక్షి మడోల్ కర్(Sakkshi Mhadolkar)తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించడంతో పాటు కళ్లతోనే భావాన్ని చెప్పగలిగే నటిగా నిరూపించుకుంది.క్రిస్టో ఫర్ నోలన్ గా బండి సరోజ్ కుమార్ యాక్టింగ్ కొంత వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఓవర్ యాక్టింగ్ కోటాలోకి  మారింది. డైలాగ్ మాడ్యులేషన్ లోను, పేస్ ఎక్స్ ప్రెషన్ లోను ప్రముఖ హీరో గోపీచంద్ కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా చేసిన క్యారెక్టర్స్ ని అనుకరించాడు. బంటి గా వైవా హర్ష మెప్పించాడు. ఇక మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన  పని లేదు. సందీప్ రాజ్ దర్శకుడిగా రచయితగా రెండు విభాగాల్లోను ఫెయిల్ అయ్యాడు.నాసిరకం కథ, కథనాలతో సినిమా ని చుట్టేసి మోగ్లీ కి అన్యాయం చేయడంలో ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. కాలభైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది.     ఫైనల్ గా ప్రేక్షకులని ఒక సినిమా మెప్పించాలంటే కథ, కథనాలు ఎలా ఉండకూడదో, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ఎలా ఉండకూడదో  మోగ్లీ అలా ఉంది. తలా ఒక చెయ్యి వేసి మోగ్లీ , ప్రేక్షకులకి మధ్య దూరాన్ని పెంచడంలో టీం సక్సెస్ సాధించింది.   రేటింగ్ 2 /5                                                                                                                                          అరుణాచలం   
Cast: Roshan Kanakala, Sakshi Sagar Mhadolkar, Bandi Saroj Kumar, Harsha Chemudu Crew:  Written by Rama Maruthi, Radhakrishna Reddy, Sandeep Raj Music by Kaala Bhairava Cinematography by Rama Maruthi Editing by Kodati Pavan Kalyan Directed by Sandeep Raj Produced by T.G. Vishwa Prasad, Krithi Prasad Sandeep Raj delivered an OTT hit with Colour Photo film, 5 years ago during pandemic. He took time due to various reasons to start his next film, Mowgli 2025. The movie stars Roshan Kanakala. Sakshi Sagar is playing as a specially abled female lead whose is deaf and mute while Bandi Saroj Kumar, who built a cult for himself with YouTube releases is playing a protagonist. People Media Factory have produced the film and movie released on 13th December 2025. Let's discuss about the film in detail.   Plot:  Murali Krishna aka Mowgli (Roshan Kanakala) is an orphan and he makes his living by staying in nearby forest village. He has a close friend Bunty (Harsha Chemudu), who is ready to give life for him. Mowgli has an aim to become a Police Officier, like his deceased father. To achieve that, he keeps helping a location co-ordinator. He is disrespected by some and respected by some but he doesn't care about it all. He keeps giving and loving people.  During a shoot, he meets dancer Jasmine (Sakshi Sagar) and woes her. He doesn't back out even after knowing she is deaf and mute. A police officer Christoper Nolan (Bandi Saroj Kumar) likes to use women and he decides to trap Jasmine. He uses all tricks to break the lovers but Mowgli gets to know the reality of all the misunderstandings and expresses his love for her. She experiences her father like love when she is with him and accepts him. But Nolan starts to plot against them. What will he do? How can Mowgli win against him? Watch the movie to know more.  Analysis: A routine story always needs a fresh perspective and presentation. Here, writer-director Sandeep Raj tried to infuse that freshness by making the lead a deaf and mute. But he did not write a very convincing love story between them. It just feels like rather them falling in love, the story is more about Nolan aka Bandi Saroj Kumar's character. There is no proper build-up or sequences that really stick to your heart about both the young leads falling in love.  The writing needed to be more focused on how these two got attracted to each other rather than trying to play the orphan card. The build of trust between both of them who know the hardships of life is just missing. The script writing looks more inspired from old movies than trying to build on something fresh with new characters. It is more like you know the beats and hence, we are going to play around with the same rather than offer you anything of significance.  Comedy, emotions and characters are written in so amatuerish way that writing is the most disappointing part of the film. Roshan Kanakala as a performer is good and Sakshi Sagar has likeable energy. But their chemistry doesn't lit up the screen and it feels like more forced to come together. Bandi Saroj Kumar is exceptional and he has great screen presence. But the underwhelming writing, even undermines his performance big time.  Kaala Bhairava's music is good but it doesn't really fit the film. He tried his best to elevate and engage but writing and execution are too underwhelming. Sandeep Raj showcased that he has talent to carve out emotional scenes in Colour Photo but here he just goes over board and doesn't really engage in any emotion. Even editing and cinematography are sub-standard. Production values are fine but overall, the movie is a major disappoint.  Bottomline: Nothing works while Bandi Saroj Kumar, leads did try their best to elevate a disappointing script. Misfire.     Rating: 2/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకరంటే ఒకరు ప్రేమగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ అన్నదమ్ముల అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.   చిరంజీవి అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పవన్ కళ్యాణ్ నుండి రానున్న నెక్స్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని 2026 వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.     Also Read: 'అఖండ 2' ఫస్ట్ డే కలెక్షన్స్.. అఖండకు రెట్టింపు..!   'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ 'దేఖ్ లేంగే సాలా' డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ ని రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అదే టైంలో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ టీమ్ భారీ ప్రెస్ మీట్ ని ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.     డిసెంబర్ 13 సాయంత్రం 5:30 కి గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు తాజాగా ప్రకటించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మూవీ సాంగ్ లాంచ్ ఉండగా.. చిరంజీవి మూవీ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండటం ఏంటనేది అభిమానులకు అర్థం కావట్లేదు.    'ఉస్తాద్ భగత్ సింగ్' సాంగ్ లాంచ్ గురించి అవగాహన లేక 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారా? లేదా తెలిసే ఇలా చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.  
  'అఖండ 2: తాండవం'తో తాజాగా నందమూరి బాలకృష్ణ థియేటర్లలో అడుగుపెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది. (Akhanda 2: Thaandavam)   2021లో విడుదలైన 'అఖండ' కరోనా పాండమిక్ టైంలో తక్కువ టికెట్ ధరలతో విడుదలైంది. అయినప్పటికీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఫుల్ రన్ లో రూ.150 కోట్ల గ్రాస్ తో ఘన విజయం సాధించింది.   Also Read: 'అఖండ-2'లో శివుడిగా మెప్పించిన నటుడు ఎవరో తెలుసా?   'అఖండ'కి సీక్వెల్ గా 'అఖండ 2' రూపొందింది. అసలే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటంతో.. బుకింగ్స్ కి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. ఒక్క బుక్ మై షోలోనే గంటకు 20 వేల రేంజ్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.60-70 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవి అఖండ మొదటి భాగానికి రెట్టింపు ఓపెనింగ్స్ కావడం విశేషం.   ఫస్ట్ వీకెండ్ లోనే 'అఖండ 2' రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందనే అంచనాలున్నాయి. అంటే 'అఖండ' ఫుల్ రన్ కలెక్షన్స్ ని మొదటి వీకెండ్ లోనే సీక్వెల్ క్రాస్ చేయనుందన్నమాట.     
Akhanda 2 starring God of Masses Nandamuri Balakrishna, Samyuktha, Harshaali Malhotra, Aadhi Pinisetty released after an unforeseen delay last night, with special premieres. The producers Raam Achanta and Gopi Achanta have addressed press about the movie release and the box office collections.  They have apologised to NBK and his fans for the delay due to the uncontrollable circumstances. They announced that the movie has collected Rs.10 crores from special premieres on 11th December. They have remarked that this is huge for any senior hero film and they are thankful to Balayya, for giving such a golden opportunity.  They have stated that the film is gaining good positive word of mouth and they are happy with the response. Director Boyapati Sreenu did not come to press meet but makers stated that he is happy with the response and soon, the team will address press in a success meet, looking at the good response.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ 2: తాండవం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లన్నీ శివాలయాలను తలపిస్తున్నాయి. అఖండగా బాలయ్య చేసిన తాండవానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. (Akhanda 2: Thaandavam)   'అఖండ 2' విడుదలకు కొద్దిరోజుల ముందు నుంచి.. ఇందులో శివుడి పాత్ర గురించి చర్చ జరిగింది. టెక్నాలజీని ఉపయోగించి సీనియర్ ఎన్టీఆర్ ని శివుడిగా చూపిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని తేలిపోయింది. శివుని పాత్రలో ఒక ప్రముఖ నటుడు దర్శనమిచ్చాడు.   'అఖండ 2' చిత్రంలో శివుడిగా బాలీవుడ్ యాక్టర్ తరుణ్ ఖన్నా నటించాడు. వెండితెరపైనా, బుల్లితెరపైనా నటుడిగా తనదైన గుర్తింపు పొందిన తరుణ్ ఖన్నా.. పౌరాణిక పాత్రలతో ప్రత్యేక పేరుని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా టీవీ సిరీస్ లలో శివుడి పాత్రలకు పెట్టింది పేరు అన్నట్టుగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.   2015లో ప్రసారమైన 'సంతోషి మా'లో శివుడిగా మెప్పించిన తరుణ్ ఖన్నా.. ఆ తర్వాత దాదాపు పది టీవీ సిరీస్ లలో శివ పాత్రలో కనువిందు చేశాడు. శివుడిగా హిందీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తరుణ్ ఖన్నా.. ఇప్పుడు అఖండ-2లో మరోసారి శివ పాత్రలో నటించి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.  
  సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. సినీ సెలబ్రిటీల AI వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వాటిలో పాజిటివ్ గా ఉండే వీడియోలు కొన్నయితే.. సెలబ్రిటీల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉండే నెగెటివ్ వీడియోలు ఎన్నో. అందుకే వీటిపై పలువురు సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. (Pawan Kalyan)   ఇప్పటికే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా చేరారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.    పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొందరు AI వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయాన్ని పవన్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. AI వీడియోలను చూసిన న్యాయమూర్తి.. ఆ లింక్‌లను 48 గంటల్లోపు అందించాలని సూచించారు.    అలాగే, వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర సోషల్ మీడియా  ప్లాట్ ఫామ్ లకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేశారు.  
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే అనే ఫీలింగ్ కలిగిస్తుంది.  వారి ప్రవర్తన,  వారి స్వభావం ఇవన్నీ పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా వచ్చేవే అయినా పుట్టిన నెలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు, సంఖ్యా శాస్త్ర నిపుణులు,  జ్యోతిష్కులు. ఇంతకీ డిసెంబర్ నెలలో ఫుట్టిన వారి స్వభావం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటే.. సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి నెలలో జన్మించిన వ్యక్తులు  వేర్వేరు స్వభావాలు కలిగి ఉంటారు.  అలాగే డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు కూడా ఇతర నెలల్లో పుట్టిన వ్యక్తులకు భిన్నంగా ఉంటుంది.   సంఖ్యాశాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారట.  వీరిది సహజమైన ఆకర్షణ అని, డబ్బు, హోదా, పలుకుబడి ద్వారా వచ్చే ఆకర్షణ కాదని సంఖ్యాశాస్ర్త నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు వారి ప్రవర్తన,  హావభావాలు, వారి మాట తీరుతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారట.  ఇతరుల నుండి మెప్పు పొందడం, ఇతరులతో ఆకట్టుకునేలా మాట్లాడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు. డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఎమోషన్ పరంగా చాలా పీక్స్ లో ఉంటారట.  వీరు చాలా భావోద్వేగాలకు లోనవుతారు.  దీని వల్ల వారు చాలా సార్లు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇతరులతో సంబంధాల విషయంలోనూ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. మోసపోవడంలో కూడా డిసెంబర్ లో పుట్టిన వారు ఫస్ట్ అని చెప్పవచ్చు.  వీరు ఇతరులను చాలా తొందరగా నమ్మేస్తారు. అంతకు మించి వీరిది చాలా స్వచ్చమైన హృదయమట.  ఈ కారణంగా వీరు ఇతరుల విషయంలో  సులువుగా బోల్తా పడతారు.   డిసెంబర్ లో పుట్టిన వారితో ఎలాంటి సంకోచం లేకుండాస్నేహం చేయవచ్చట. ఎందుకుంటే ఈ నెలలో పుట్టిన వారు స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారట.  అలాగే నమ్మకమైన స్నేహితులుగా ఉంటారట. స్నేహం పట్ల పూర్తీ విధేయతతో ఉంటారట. కొందరు వ్యక్తుల చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ చాలా మెరుగ్గా ఉంటుంది. అలాంటి వారిలో డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు కూడా ఉంటారట.  వీరి చుట్టూ సానుకూల శక్తి ఉంటుందట.  ఈ కారణంగా వీరి చుట్టూ ఉండే వ్యక్తులకు మంచి జరుగుతుందని,  ఎవరికైనా మంచి సలహాలు, పరిష్కారాలు లభించి సమస్యలు కూడా దూరం అవుతాయని అంటారు. సలహాలు ఇవ్వడంలో డిసెంబర్ లో పుట్టిన వారు ది బెస్ట్ అని చెప్పవచ్చు. వీరు మంచి సలహా దారులు,  సమస్యను పరిష్కరించడానికి మంచి సలహాలు,  సరైన ప్రణాళిక ఇవ్వగలరట.కాకపోతే వీరిది చంచలమైన మనసు.. అలాగే వీరి స్వభావం కూడా మొండిగా ఉంటుంది. ఈ కారణంగా వీరు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.   ఇది డిసెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం. అందరూ ఇలానే ఉంటారని కాదు.. సంఖ్యా శాస్ర్తం ప్రకారం నిపుణులు పేర్కొన్న వివరాలే ఇవి.                                *రూపశ్రీ.
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి.  ఒకరు చాలా సీరియస్ గా భావిస్తే.. మరొకరు చాలా సులువుగా బంధాన్ని వదిలేస్తారు. మరీ ముఖ్యంగా మోసం చేయడం అనేది కొందరికి అలవాటుగా కూడా మారింది.  డబ్బు, వస్తువులు కోల్పోతే పోతే పోయాయని సర్థి చెప్పుకోవచ్చు. కానీ మనసుకు గాయం చేసి, నమ్మకాన్ని దెబ్బతీసి,  జీవితంలో ఆశల మీద నీళ్లు చల్లే పనులు చేసే మోసగాళ్లు ఉంటారు.  ఒకప్పుడు అమ్మాయిలు ఎక్కువగా మోసపోయేవారు. కానీ ఇప్పట్లో చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలను మోసం చేస్తున్నారు.  మోసం చేసేముందు అమ్మాయిలు కొన్ని పనులు చేస్తారట. అవేంటో తెలుసుకుంటే ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా అలాంటి సంఘటనలు ఎదురైతే జాగ్రత్త పడవచ్చు. మోసాన్ని గ్రహించి మనసు గాయపడకుండా కాపాడుకోవచ్చు. మాట్లాడే విధానం.. అమ్మాయిలు అబ్బాయిలకు దూరంగా జరిగేటప్పుడు కనిపంచే మొదటి మార్పు మాట్లాడే విధానం మారడం. ఒకప్పుడు ఆప్యాయంగా,  ఎక్కువగా కేర్ తీసుకుంటూ,  ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే అమ్మాయి,  ఒక్కసారిగా మాట్లాడటం తగ్గించడమే కాకుండా క్రమంగా కఠినంగా మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి తొందరలోనే బ్రేకప్ చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థం. ఫోన్ కాల్స్.. అమ్మాయిలు పదే పదే బంధువులు లేదా కుటుంబ సభ్యులు కాల్ చేశారని చెబుతూ దూరంగా వెళ్లి మాట్లాడుతూ ఉంటే అది ఖచ్చితంగా ఆమె దూరం అయ్యే సూచనలు ఇస్తుందట.  మోసం చేసే అమ్మాయిలు తరచుగా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ఇతరులతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారని అంటారు.   మాటల్లో మార్పు.. ప్రేమించిన అమ్మాయి మొదట్లో ఎంతో ఆప్యాయంగా,  కేరింగ్ గా మాట్లాడుతుంది. కానీ ఆ తరువాత ఆమె ఆ రిలేషన్ నుండి తప్పించుకోవాలని,  వేరే రిలేషన్ లోకి వెళ్లాలని అనుకున్నప్పుడు ఆమె మాటతీరు మారుతుందట.  ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ స్థానంలో చిరాకు, అసహనం,  వ్యంగ్యం వచ్చి చేరతాయట. కొన్ని సార్లు చాలా ఘాటుగా కూడా మాట్లాడతారట. సమయం తగ్గించడం.. బయట కలవడం అయినా,  ఫోన్ లో మాట్లాడటం అయినా ప్రేమించిన అమ్మాయి గతంలో లాగా ఎక్కువసేపు మాట్లాడటం, కబుర్లు చెప్పడం కాకుండా  కేవలం రెండు మూడు నిమిషాలలో మాట్లాడటం,  రెండు మూడు ముక్కలలో సమాధానం చెప్పి పోన్ పెట్టేయడం,  తర్వాత మాట్లాడతాను అని చెప్పడం.. వంటివి చేస్తుంటే ఆమె తొందరలోనే బ్రేకప్ చెప్పేస్తుందని అర్థమట. కారణాలు.. సమయం లేకపోవడం, పనిలో బిజీగా ఉండటం లేదా మూడ్ సరిగ్గా లేకపోవడం వంటి సాకులు చెబుతూ ఉంటే వాస్తవానికి ఆమెకు మాట్లాడే ఆసక్తి లేదని అర్థం. నేరుగా ఆ విషయాన్ని చెప్పలేక అలా కారణాలు చెబుతూ ఉంటారు. మార్పులు.. లైఫ్ స్టైల్ మార్చుకోవడం,  కొత్త అలవాట్లు,  సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వంటివి చేస్తుంటే ఆ అమ్మాయి మరొకరితో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టిందని అర్థం.  ఇవన్నీ కనివిస్తే ఆ అమ్మాయి మోసం చేస్తోందని అర్థం.  ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు అబ్బాయిలు జాగ్రత్త పడితే మనసుకు గాయం కాకుండా జాగ్రత్త పడవచ్చు.                                       *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు  చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన  ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు. మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు: లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు.   
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది.   అయితే ఈ మధ్య కాలంలో గుండె సంబంధ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గుండె  బలహీనంగా మారడం వల్ల తొందరగా గుండె జబ్బులు రావడం జరుగుతోంది.  అందుకే గుండెకు బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు.  గుండెకు బలాన్ని పెంచే ఆహారాలు ఏవి? ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే.. గుండెను బలంగా ఉంచే ఆహారాలు.. సాల్మన్.. సాల్మన్ వంటి కొవ్వు చేపలలో గుండెకు బలాన్ని చేకూర్చే  ఒమేగా-3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు EPA,  DHA లను అందిస్తాయి.  ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో, గుండె లయను స్థిరంగా ఉంచడంలో, రక్త నాళాల లైనింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  క్రమం తప్పకుండా తింటే హృదయ సంబంధ సమస్యలను చాలా వరకు   తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఒమేగా-3 లు గుండె కణ త్వచాలలో కలిసిపోయి ఆరోగ్యకరమైన విద్యుత్ కమ్యునికేషన్ కు సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్.. ఎక్స్టా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన ఆరోగ్యకరమైన  కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.  రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  ఆలివ్ నూనె తీసుకోవడం  వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అవకాడో.. అవకాడోలు సహజంగా ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్,  విటమిన్ E లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్,  రక్తపోటు స్థాయిలకు మద్దతు ఇస్తాయి. వాల్నట్స్. క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాల్‌నట్‌లలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్‌లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.  రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్లూబెర్రీస్.. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్లు,  పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట. ముదురు ఆకుకూరలు.. ముదురు ఆకుకూరలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.  సహజ నైట్రేట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండెను బలంగా మారుస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి,  అన్నింటికి మించి తలనొప్పి వచ్చినా,  ఫుడ్ లేటయినా కనీసం టీ  అయినా తాగాలి.  ఇలా టీ అనేది పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ లా మారిపోయింది. అయితే టీ తాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆరోగ్య నిపుణులు.  మరీ ముఖ్యంగా నెలరోజుల పాటు టీ తాగడం మానేయండి,  ఫలితాలు చూసి మీరే షాకవుతారు అని అంటున్నారు. ఇంతకూ నెలరోజుల పాటు టీ తాగడం మానేయడం వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. నెలరోజులు టీ తాగడం మానేస్తే.. ఒక నెల పాటు టీ తాగడం మానేయడం వల్ల శరీరం నుండి  హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందట. ఇది కడుపులో యాసిడ్ ఎఫెక్ట్,  ఉబ్బరాన్ని తొలగించడమే కాకుండా,శరీర శక్తి స్థిరంగా ఉండేలా చేస్తుందట. ఇలా శరీరంలోపల శుద్ది కావడం శరీరానికి  రీసెట్ బటన్ గా పనిచేస్తుంది. నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే  నాలుగు ముఖ్యమైన మార్పులు ప్రధానంగా చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ.. టీ మానేయడం వల్ల కలిగే మొట్టమొదటి,  అత్యంత ప్రయోజనకరమైన విషయం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవ్వడం. టీలోని కెఫిన్,  టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు నార్మల్ అవుతాయి. ఆమ్లత్వం, గుండెల్లో మంట,  అజీర్ణం దాదాపుగా తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఐరన్ శోషణ.. టీలోని టానిన్లు ఆహారం నుండి ఐరన్ ను గ్రహించడంలో  ఆటంకం కలిగిస్తాయి. టీ మానేసిన తర్వాత శరీరం ఆహారం నుండి ఐరన్ ను పూర్తి స్థాయిలో గ్రహిస్తుంది. రక్తహీనత లేదా అలసటతో బాధపడేవారికి ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. టీ మానేయడం వల్ల ఐరన్ గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం.. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల  నిద్ర చక్రం తిరిగి రికవర్ అవుతుంది. గాఢంగా,   నాణ్యమైన నిద్రను పొందడంలో  సహాయపడుతుంది. మంచి నిద్ర నేరుగా  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక కల్లోలం,  ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం, దంతాల ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాల మీద మరకలుగా మారి  దంతాల  రంగు మారుస్తాయి. టీ తాగడం మానేయడం వల్ల సహజంగా  దంతాలు శుభ్రంగా,  ప్రకాశవంతంగా కనిపిస్తాయి.  శరీరం హైడ్రేషన్ గా ఉండటం,  వాపు తగ్గడం మొదలైన వాటి వల్ల  పొడిబారడం తగ్గుతుంది.  చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...