LATEST NEWS
  వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డారు. ఇందులో వీరి పై సుమారు 36 కేసులు నమోదు అయినాయి. ఇప్పటికే వీరు పాల్పడ్డ మోసాలపై బాధితులు ఒక్కొక్కరు వచ్చి ఫిర్యాదులు చేస్తుండంతో వీరి మోసాలు బయటపడ్డాయి. కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడడమే కాక ఆర్థిక నేరాలకు పాల్పడడం జరిగింది. దీనితో దాల్ మిల్ సూరి పై కలెక్టర్  ఉత్తర్వులు మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేసామని జిల్లా  ఎస్పీ తెలియజేసారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ విజయ కుమార్ తో కలిసి ఈ కేసు వివరాలను ఎస్పీ విలేకర్ల సమావేశంలో తెలియజేసారు.  కొత్తచెరువుకు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్‌ నమోదు తెలిపారు. జిల్లాలో వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డ దాల్ మిల్ సూరిపై 36 కేసులు నమోదయ్యాయి. కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని.. సూరిపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని వెల్లడించారు.
  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు  భారత్‌ ప్రధాన నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా రష్యా- ఉక్రెయిన్ యుద్దానికి సంబంధంచిన తాజా పరిమాణాలను పుతిన్ ప్రధానికి వివరించారు. అయితే, ఈ సంక్షోభానికి శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ తన స్థిరమైన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. వివాద పరిష్కారానికి హింస మార్గం కాదని భారత్ మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్-రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, ఈ ఏడాది చివర్లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు రావాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ కోరారు. ఈ సానుకూల వాతావరణంలోనే ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. 2019 తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవలే చైనాలో పర్యటించారు.  ముఖ్యంగా ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడనాడాలని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అజిత్ దోవల్ ఎస్సీఓ భద్రతా సలహాదారుల సమావేశంలో గట్టిగా చెప్పారు. కాగా భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ సహా మొత్తం పది దేశాలు సభ్యులుగా ఉన్న షాంఘై సహకార సంస్థను 2001లో స్థాపించారు. ఈ ఏడాది టియాంజిన్‌లో జరిగే సదస్సు SCO చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా నిలవనుందని చైనా వెల్లడించింది. సుమారు 20 దేశాల అధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆ‌ర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అయినప్పటికీ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని అని విమర్శించారు. బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు హద్దు మీరాయని కేటీఆర్‌ అన్నారు. చిల్లర, బజారు మాటలు మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతో వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు నాటకాలకు తెరదీశారని మండిపడ్డారు.  ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కోర్టుకు లాగాల్సి ఉంటుందని హెచ్చరించారు.నువ్వు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నప్పటికీ.. ఆయనకు ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోవడం విచారకరమని అన్నారు.  హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారని దీనికి కారణమైన  ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు, రాధాకిషన్‌రావును ఉరి తీయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. సిట్ అధికారులు చూపించిన ఆధారాలు చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. ఫోన్ ట్యాప్ జరుగుతుందని మొదటి సారి నేనే గుర్తించాని బండి సంజయ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో భార్యభర్తలు ఫోన్లును కూడా విన్నారని తెలిపారు. వావి వరుసలు లేకుండా సొంత కూతురు ఎమ్మెల్సీ కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. 6 వేల 500 మంది ఫోన్ ట్యాప్‌కు గురియ్యాని చెప్పారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లూ సైతం ఉన్నాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు. 
  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు బాంబు పేల్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉనన్నారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వారు పార్టీలో చేరే తేదీలను కూడా త్వరలో వెల్లడిస్తామన్నారు. దీంతో రాంచందర్రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వీళ్లే కాకుండా మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు.  మరోవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈనెల 10న కమలం గూటికి చేరనున్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. కేసులు, సిట్‌లు, కమిషన్లు, విచారణలు, దర్యాప్తులు అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనికితోడు బీజేపీ కూడా అటు బీఆర్ఎస్‌పై.. ఇటు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసుపైనా రాంచందర్ రావు స్పందించారు. ఈ కేసును సిట్ కాకుండా సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటికి వస్తుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల్లో ఓడిపోతామనే భయంతోనే..రేవంత్ రెడ్డి ఎన్నికలు నిర్వహించడం లేదని టీ బీజేపీ చీఫ్ ఆరోపించారు.  
  బీఆర్‌ఎస్ నేత దుబ్బాక ఎమ్మెల్యే  కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి మండిపడ్డారు.  శుక్రవారం నాంపల్లిలోని గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కమీషన్లలో వాటా ఇవ్వలేదని జగ్గారెడ్డి కార్యకర్తల మీటింగ్ ఏడ్చారని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై  జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభాకర్ రెడ్డి.. నీవ్వుంతా నీ బతుకెంతా?, వ్యక్తిత్వంలో నాతో సరిపోడు. నీ మాదిరిగా నేను ప్యాకేజీ ఇచ్చి బీ ఫామ్ తెచ్చుకోలేదు. బీఆర్ఎస్ 40 దొంగల్లో ప్రభాకర్ కూడా ఓ దొంగ'. అని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఎవర్ని అడిగినా నా క్యారెక్టర్ గురించి చెబుతారన్నారు. నా క్యారెక్టర్‌కి, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత ఆస్తి నా వద్ద ఉంటే ప్రజలకి ఎప్పుడో పంచేసే వాడినని తెలిపారు. పంచే గుణం మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి అని చెప్పారు. భవిష్యత్తులో నేను రూ. వేల కోట్లు సంపాదించినా వాటిని ప్రజలకే పంచుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నా ఆస్తి నా పిల్లల కోసం కాదని.. ప్రజల కోసమని తెలిపారు. రూ. 1000 కోట్లు కొన్ని గంటల్లోనే పంచేస్తానన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఎలా పంచాలో కూడా తెలియదని ఆక్షేపించారు.  నేను ఎలాంటి వాడినో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుని అడిగి తెలుసుకోవాలంటూ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి.. నీవు మగాడవయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డిది నా స్థాయి కాదన్నారు. కొన్ని విషయాల్లో ఎమోషనల్ కావ్వడం నా బలహీనత అని తెలిపారు. ప్రజల సమస్య వింటే వాళ్ళ కంటే ముందు నాకే ఏడుపు వస్తుందన్నారు. నా చుట్టూ పేదలు ఉంటారని.. నా వద్దకు క్యాన్సర్ పేషెంట్లు సైతం వస్తారని చెప్పారు. నేమైనా ప్యాకేజీల లీడర్‌ నా అంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ALSO ON TELUGUONE N E W S
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'ది రాజా సాబ్', 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. రాజా సాబ్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 'ఫౌజి' షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది.    ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఫౌజి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫిల్మ్.. పెద్దగా హడావుడి లేకుండా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 50 శాతం పూర్తయిందని తెలుస్తోంది. ప్రభాస్ మరో 30 రోజులు కేటాయిస్తే.. ఆయన పార్ట్ పూర్తవుతుందని సమాచారం. ప్రభాస్ లేని సన్నివేశాల చిత్రీకరణకు మరో 20 రోజులు పట్టే అవకాశముంది అంటున్నారు.    ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్లు ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలు చేయడం అరుదైపోయింది. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఓ వైపు 'రాజా సాబ్' చేస్తూ.. మరోవైపు 'ఫౌజి' షూటింగ్ ఇంత పూర్తి చేయడం మామూలు విషయం కాదు. 'ఫౌజి' చిత్రాన్ని 2026, ఏప్రిల్ 3న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.  
  ఇండియన్ సినిమాలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ లో ఒకటి 'వార్-2'. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ మూవీ.. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భారీ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ నటించడంతో తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. (War 2)   'వార్-2'ను తెలుగునాట సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం సితార సంస్థ రూ.80 కోట్లకు పైగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర'ను కూడా తెలుగునాట సితారే విడుదల చేసి, మంచి లాభాలను పొందింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు 'వార్-2'ని కూడా భారీస్థాయిలో విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు ప్లాన్ చేస్తున్నారట. పాజిటివ్ టాక్ వస్తే.. ఈ సినిమా సంచలన ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం.   'వార్-2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం(ఆగస్టు 10) హైదరాబాద్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, హృతిక్ హాజరు కానున్నారు. బుకింగ్స్ కూడా ఆదివారం నాడే ఓపెన్ కానున్నాయి.   
Telugu Film Chamber have announced their firm decision to not enter into discussions or any sort of negotiations with Film Workers and employees Federation. They are hurt by the federation's decision to unilaterally announce strike. Seems like producers are firm on their decision to not yield to workers' demands.  In the official press release, they wrote, "All members of the Telugu Film Chamber of Commerce are hereby advised not to engage in any discussions or negotiations with any individual Unions of the Telugu Film Industry Employees Federation that have called for a unilateral strike, until further notice. Studios, Outdoor Units, and Infrastructure Unit members are strictly instructed not to provide any services without prior intimation and explicit approval from the Telugu Film Chamber of Commerce. Producers and Studio Sector members are requested to treat this matter with utmost seriousness and strict compliance." This seems like a huge move against Federation and unions with Chamber looking to strictly impose their decision. Let's see how things will be resolved in coming days as many medium budget films will be largely effected by these moves.   
  సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి అంత మొత్తంలో వేతనాలు పెంచడానికి నిర్మాతలు సుముఖంగా లేరు. మరోవైపు ఫెడరేషన్ ఏక పక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంపై ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ మరో సంచలన ప్రకటన చేసింది. ఛాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు యూనియన్లతో నిర్మాతలు సంప్రదింపులు జరపవద్దని ఆదేశించింది. స్టూడియోలు సైతం ఎలాంటి సేవలూ అందించకూడదని స్పష్టం చేసింది.   "తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌ ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చిన దృష్ట్యా.. యూనియన్లతో చర్చలు లేదా సంప్రదింపులు జరపకుండా ఉండాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులకు సూచిస్తున్నాము. ఫిల్మ్ ఛాంబర్ నుండి అనుమతి లేకుండా ఎలాంటి సేవలూ అందించకూడదని.. స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్లకు కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేస్తున్నాము. ఫిల్మ్ ఛాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. నిర్మాతలు మరియు స్టూడియో విభాగ సభ్యులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని పాటించాలి." అంటూ ఫిల్మ్ ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది.   
  తారాగణం: ప్రవీణ్, హర్ష చెముడు, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగర్, షైనింగ్ ఫణి తదితరులు సంగీతం: వికాస్ బాడిస డీఓపీ: బాల సరస్వతి ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ రచన, దర్శకత్వం: ఎస్.జె. శివ నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్ధన ఆచారి బ్యానర్: ఎస్.జె. మూవీస్  విడుదల తేదీ: ఆగస్టు 8, 2025   కమెడియన్ ప్రవీణ్ హీరోగా నటించిన చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. హర్ష చెముడు, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం టైటిల్, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Bakasura Restaurant Review)   కథ: పరమేష్(ప్రవీణ్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రెస్టారెంట్ పెట్టాలనేది అతని కోరిక. కానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా ఇష్టంలేకపోయినా.. జాబ్ చేస్తుంటాడు. నలుగురు స్నేహితులతో కలిసి రూమ్ లో రెంట్ కి ఉంటాడు. వీరంతా కలిసి డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ హంటింగ్ వీడియోలు చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఒక వీడియో కోసం ఓ బంగ్లాకు వెళ్ళగా.. అక్కడ తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకంలో రాసి ఉన్నట్టుగా పూజలు చేయగా.. ఎప్పుడో 200 ఏళ్ళ క్రితం చనిపోయిన బక్క సూరి అలియాస్ బకాసుర (హర్ష చెముడు) ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ పరమేష్ రూమ్ కి వచ్చిన అంజి(షైనింగ్ ఫణి) శరీరంలోకి ప్రవేశిస్తుంది. అసలు ఆ బకాసుర ఎవరు? అతని కథ ఏంటి? బకాసుర ఆత్మ అంజి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత పరమేష్, అతని స్నేహితులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? రెస్టారెంట్ పెట్టాలనే పరమేష్ కోరిక నెరవేరిందా లేదా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: తెలుగులో హారర్ కామెడీ జానర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. హారర్ కామెడీ సినిమాలు దాదాపు ఒకే టెంప్లేట్ లో సాగుతుంటాయి. ఒక ఆత్మ ఎవరైనా శరీరంలోకి ప్రవేశించడం, దాని ద్వారా కలిగే భయం నుంచి కామెడీని పుట్టించడం, ఆ ఆత్మకు ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉండటం, ఆత్మ పగను తన పగలా భావించి మెయిన్ లీడ్ పోరాడటం.. దాదాపు హారర్ కామెడీ సినిమాలన్నీ ఇదే ఫార్ములాలో ఉంటాయి. 'బకాసుర రెస్టారెంట్' కూడా ఇదే టెంప్లేట్ లో నడుస్తుంది. అయితే ఇందులో దెయ్యాన్ని తిండిబోతుగా చూపించడం ప్రత్యేకంగా నిలిచింది.  దర్శకుడు ఎంచుకున్న కథ, దాని కోసం చేసిన రీసెర్చ్ బాగున్నాయి. కానీ, ఆ కథను ఆసక్తికరంగా తెరమీదకు తీసుకురావడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. హీరో పాత్ర పరిచయం, యూట్యూబ్ వీడియోలు వంటి సీన్స్ తో ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. కొన్ని సన్నివేశాలు బాగానే నవ్వించాయి. పరమేష్ రూమ్ కి అంజి రావడం, అతని శరీరంలోకి బకాసుర ఆత్మ ప్రవేశించడంతో కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది. నిజానికి సెకండ్ హాఫ్ లో కామెడీ పరంగా, ఎమోషన్ పరంగా మంచి స్కోప్ ఉంది. కానీ, రైటింగ్ లో ఆ మ్యాజిక్ కనిపించలేదు. కొన్ని చోట్ల బాగానే నవ్వులు పంచినప్పటికీ, కొన్ని సీన్స్ మాత్రం రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని, పతాక సన్నివేశాలను మరింత ఎఫెక్టివ్ గా రాసుకొని ఉండాల్సింది.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: కథానాయకుడిగా సినిమాని తన భుజాలపై మోసే బాధ్యతను ప్రవీణ్ తీసుకున్నాడు. పరమేష్ పాత్రలో తనదైన నటనతో మెప్పించాడు. వైవా హర్ష కనిపించేది తక్కువసేపే అయినప్పటికీ.. తన మార్క్ చూపించాడు. అంజి పాత్రకు షైనింగ్ ఫణి పూర్తి న్యాయం చేశాడు. చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన కృష్ణ భగవాన్.. తనదైన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.  సాంకేతిక విభాగాల పనితీరు బాగానే ఉంది. బాల సరస్వతి కెమెరా వర్క్ మెప్పించింది. పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వికాస్ బాడి.. నేపథ్య సంగీతంతో ప్రభావం చూపించాడు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంటాయి.    ఫైనల్ గా... కథాకథనాల్లో పెద్దగా మెరుపులు లేనప్పటికీ.. అక్కడక్కడా బాగానే నవ్వించింది. అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమా నచ్చే అవకాశముంది.   రేటింగ్: 2.5/5   
గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్  తమ ప్రొడక్షన్ నెం.1గా  "పెళ్లిలో పెళ్లి"(Pellilo Pelli)చిత్రాన్ని నిర్మిస్తోంది. శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణుప్రియ, ఉమామహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో చేస్తున్నారు. గణేష్ కోలి(Ganesh KOli)నిర్మాత కాగా 'శ్రీకాంత్ సంబరం'(Srikanth Sambaram)దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ తో పాటు బ్యానర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.   ఈ సందర్భంగా తనికెళ్ల భరణి(Tanikella bharani) మాట్లాడుతు 'పెళ్లిలో పెళ్లి"లో సినిమా ఈవెంట్ జరుగుతుంటే బయట కుండపోత వర్షం కురుస్తోంది. ఆ పరమేశ్వరుడు గంగ రూపంలో ఆశీర్వాదం పంపించాడు అనిపిస్తోంది. ఈ సినిమా బ్యానర్ పేరు సుఖకర్త..అంటే సుఖాన్ని అందించేవాడు అని అర్థం. దర్శకుడు శ్రీకాంత్ కొద్దిరోజుల క్రితం ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. షోలాపూర్ లో సినిమా చేస్తున్నామని చెప్పాడు. అక్కడ తెలుగు వాళ్లు చాలా మంది ఉంటారు. నన్ను ఈ టీమ్ ఎంతో గౌరవంగా చూసుకున్నారు. పెద్దలను గౌరవించడం అనే గొప్ప గుణం వీళ్లందరిలో కనిపించింది. గణేష్ కోలి లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ కు సక్సెస్ వస్తే మరిన్ని మంచి చిత్రాలు యంగ్ స్టర్స్ తో నిర్మిస్తారు. ఆయన "పెళ్లిలో పెళ్లి" సినిమాతో హిట్ అందుకుని బాలీవుడ్ లో సినిమాలు చేసేంతగా ఎదగాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం ప్రతిభావంతుడు. హైదరాబాద్ లో సినిమా చేయడం సులువే కానీ షోలాపూర్ కు 24 క్రాఫ్టుల వాళ్లను తీసుకెళ్లి చాలా స్పీడ్ గా సినిమా రూపొందించాడు. అతనికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా అని మాట్లాడారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా మాట్లాడుతు "పెళ్లిలో పెళ్లి" ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ మూవీకి   మంచి కథ కథనాలతో పాటు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరాయి. ఇంత మంచి సినిమాకి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారికి థ్యాంక్స్. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. తనికెళ్ల భరణి గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. నెక్ట్స్ రాబోయే ఈవెంట్స్ లో ఈ చిత్రం గురించి మరింతగా మాట్లాడుతా అన్నారు. హీరోయిన్ సంస్కృతి గోరే మాట్లాడుతు "పెళ్లిలో పెళ్లి" సినిమా మా అందరికీ ఎంతో ఇంపార్టెంట్. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా పట్ల మేమంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మీ అందరినీ ఆకట్టుకునేలా "పెళ్లిలో పెళ్లి"  ఉంటుంది. మీ సపోర్ట్ మా టీమ్ కు ఉండాలని కోరుకుంటున్నా.ను అని మాట్లాడింది.  నటి దివిజ మాట్లాడుతు "పెళ్లిలో పెళ్లి" సినిమాలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మా ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారు లేకుంటే ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యేది కాదు. ఈ టీమ్ తో కలిసి వర్క్ చేసిన ఎక్సీపిరియన్స్ మర్చిపోలేను. త్వరలోనే మంచి మూవీతో మీ ముందుకు రాబోతున్నాం అన్నారు. హీరో శివ సాయిరిషి మాట్లాడుతు 'మా మూవీ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. భరణి గారికి, ఆకాష్ జగన్నాథ్ అన్నకు థ్యాంక్స్. నన్ను ఈ వేదిక మీద చూసి మా అమ్మ సంతోషిస్తోంది. నేను ఈ సినిమా చేసేందుకు మా ప్రొడ్యూసర్ గణేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో సపోర్ట్ చేశారు. షోలాపూర్ నాకు మరో ఇల్లులా మారింది. ఈ టీమ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. ఎంఎల్ రాజా గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. మా మూవీ గురించి నెక్ట్స్ ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతా, త్వరలోనే రిలీజ్ కు వస్తున్న మా "పెళ్లిలో పెళ్లి" సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రొడ్యూసర్ గణేష్ కోలి మాట్లాడుతు'మేము మహారాష్ట్రలో ఉంటాం. కానీ తెలుగు సినిమాలు చూస్తుంటాం. తెలుగు భాషను అభిమానిస్తాం. తెలుగులో తెరకెక్కే కుటుంబ కథా చిత్రాలంటే చాలా ఇష్టపడతాం. సినిమా మేకింగ్ మీద అభిరుచితో "పెళ్లిలో పెళ్లి" చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా రూపకల్పన బాధ్యత మొత్తం మా దర్శకుడు శ్రీకాంత్ చూసుకున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటనేది ఇంకా నాకు కూడా రివీల్ చేయలేదు. నేనూ మీతో పాటే థియేటర్స్ లో చూడబోతున్నాను. ఈ టీమ్ అందరికీ మంచి పేరు రావాలి, గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు. డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం మాట్లాడుతు మా ఈవెంట్ కి  పిలవగానే వచ్చిన ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్స్. ఆయనను ఇన్వైట్ చేసేప్పుడు నేను దేవుడిలా భావించే పూరి జగన్నాథ్ గారిని కలిశాను. షోలాపూర్ కు తెలుగు వాళ్లు వెళ్లి వందేళ్లవుతోంది. కానీ అక్కడి నుంచి ఒక తెలుగు సినిమాను చేసింది మాత్రమే మేమే. నేను గణేష్ మండపం దగ్గర ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారిని కలిశాను. ఇప్పుడు పోస్టర్ లాంఛ్ ఈవెంట్ చూస్తుంటే ఆ వినాయకుడే మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాడని అనిపిస్తోంది. భరణి గారు మా మూవీలో కీ రోల్ చేశారు. ఈ చిత్రం మా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. ఎంఎల్ రాజా గారు ఇచ్చిన మ్యూజిక్ మా మూవీకి సోల్ లాంటిది. మాలాంటి కొత్త వాళ్లకు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాల్సింది మీరే. అన్నారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతు 'ఇది పోస్టర్ లాంఛ్ లా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా గ్రాండ్ గా చేశారు. ఈ సినిమా టీమ్ చూస్తుంటే అంతా యంగ్ స్టర్స్ ఉన్నారు. ఇలాంటి యంగ్ టీమ్ కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ గారికి నా అభినందనలు. ఈ సినిమాలో కీ రోల్ చేసి ఈ టీమ్ కు సపోర్ట్ గా ఉన్న భరణి గారికి కూడా థ్యాంక్స్. "పెళ్లిలో పెళ్లి" సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ పుల్ గా ఇంప్రెస్ చేస్తోంది. సినిమా కూడా మంచి కంటెంట్ తో ఆకట్టుకుంటుందనే నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.  శివ సాయి,సంస్కృతి గోర్, దివిజ, తనికెళ్ల భరణి లతో పాటు విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్: వేణుగోపాల్ ప్రశాంత్, ప్రొడక్షన్ మేనేజర్ : కె.దత్తాత్రేయ, డీవోపీ : శుభం గుండ్ల, పీఆర్ఓ - సతీష్. కె, డిజిటల్: నరేష్, ఉదిత్ సాయి, శివ, కో ప్రొడ్యూసర్: రూపాలీ కొల్లి.    
Coolie starring Superstar Rajinikanth, King Nagarjuna, Upendra, Shruti Haasan, Satyaraj and Aamir Khan has set box office on huge fire in Kerala. The movie ticket sales have been opened in several single screens in Kerala. Audiences have rushed to ticket counters for their share of tickets.  The maddening rush has struck Internet like a huge storm. Scenes from the theatres, booking counters and the online advances have been a brilliant example for the craze of Superstar and Coolie. Looking at the rush, box office experts are in shock. While many thought there is sky-high hype for the film, this is beyond imagination. Within hours of opening the bookings, the sales have crossed over Rs.2 crores and it is trending with 6.5K tickets sold per hour on BMS app. That too just from Kerala. Soon, Hindi and Telugu markets could open while Tamil theatres are announcing that from next week, they will open bookings.  Well, even though none of the cast members are young and happening, also, each one of them have been facing disasters but this kind of rush to see them all together cements the saying, "Legends are beyond recent box office results".  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
'రిషబ్ శెట్టి'(Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార'(Kantara)ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కాంతార' కి ఫ్రీక్వెల్ గా  'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)ముస్తాబవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని రిషబ్ శెట్టి అత్యంత భారీ వ్యయంతో,ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి 'కాంతార' కి సంబంధం ఉన్న నటీనటులు వరుసగా మరణిస్తు వస్తున్నారు. ఆ కోవలోనే రీసెంట్ గా 'కాంతార'లో మహాదేవ క్యారక్టర్ లో కనిపించిన 'టి ప్రభాకర్ కళ్యాణి'(T. Prabhakar Kalyani)గుండెపోటుతో తన నివాసంలో  మృతి చెందాడు. తొలుత నాటక రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రభాకర్, ఆ తర్వాత, సినిమాల్లోకి ప్రవేశించి అనేక చిత్రాల్లో నటించాడు. ఆయనకి  భార్య, కుమారుడు ఉండగా, కొన్ని రోజుల క్రితం ప్రభాకర్ కి హార్ట్ ఆపరేషన్ జరిగినట్టుగా తెలుస్తుంది.కర్ణాటక ఉడిపి జిల్లాలోని హిరియాడికా 'ప్రభాకర్' స్వస్థలం. కాంతార చాప్టర్ 1 కి సంబంధించి మే నెలలో ముప్పై నాలుగు సంవత్సరాల 'రాకేష్ పూజారి'(Rakesh Poojary)గుండెపోటుతోనే మరణించాడు. ఇదే నెలలో పాతికేళ్ళు కూడా లేని జూనియర్ ఆర్టిస్ట్, కాంతారా షూటింగ్ ని ముగించుకొని ఇంటికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న ఒక నదిలో ఈతకి దిగి చనిపోయాడు. జూన్ లో 'కళాభవన్ నిజూ'(Kalabhavan Niju)అనే మరో ఆర్టిస్ట్ కూడా ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయాడు.ఈ విధంగా  కాంతార సిరీస్ లో నటించిన వాళ్ళందరు వరుసగా చనిపోతుండటం వైరల్ గా మారింది.        
Cast: Praveen, Harsha Chemudu, Garuda Ram, Krishna Bhagawan, Shining Phani Crew:  Music Director: Vikas Badisa Cinematographer: Bala Saraswathi Editor:  Marthand K. Venkatesh Director: SJ Shiva Producers: Lakshmaiah Achari, Janardhan Achari   Comedian Praveen turned into leading man with Bakasura Restaurant movie. Harsha Chemudu, Krishna Bhagwan and several others have been cast in this comedy. As many comedians have been turning into leading men, the movie turns out to be another big jump for yet another popular actor. The movie released today and let's discuss about the movie in detail. Plot:  Paramesh (Praveen) dreams about opening his own restaurant. He is a software employee and starts small term savings to fulfil his dream. His friends also decide to join him but their attempts fail at regular intervals. To make quick money, they think ghost hunting videos and vlogs on YouTube would yield thier neccessity. During one video, they find a Tantra Sastra book and use it for money. But they awaken a spirit and hence, their lives turn into chaos. Watch the movie to know more.  Analysis:  Praveen is good in few scenes. In dialogue based comic scenes, he performed at his best. But these sparks are limited. He couldn't really elevate all the scenes but as an actor, he tried his best. Harsha Chemudu did get few laughs but his scenes did not really bring the house down as makers anticipated. Many scenes seem good on paper but some failed in execution.  Few scenes have worked out better but many scenes lost their charm in the second hour. Each scene seem to have been dragged out to bits and it feels like we are watching a short film stretched out to the maximum. Also, the movie starts to feel repetitive in the second hour. The emotional scenes in the second hour feel forced. The plotline reminds us an in-form SV Krishna Reddy from early 90's and it needed similar flair in writing to sustain. Slight misses harm the flow.  Drag in second hour and repetitiveness of few punch lines work against the start. Realistically, the movie could have been worked out better with innovative writing and execution, in the second hour. Technically, movie suffered at few places but largely, the team worked their best to give a novel experience. As the idea had a lot of potential, the ending and second hour could have been planned even better. We can appreciate the makers for their attempt even with flaws. Bottomline:  Potential storyline could have been executed much better. Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.
కింగ్ 'నాగార్జున'(King Nagarjuna)ఈ నెల 14 న 'రజనీకాంత్'(Rajinikanth)తో కలిసి 'కూలీ'(Coolie)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. పైగా తన కెరీర్ లో ఫస్ట్ టైం 'కూలీ'లో  విలన్ గా చేస్తుండటంతో నాగ్ రోల్ పై అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. స్వయంగా ఇటీవల నాగ్ రోల్ ని ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడుతు 'కూలీ సబ్జెట్ విన్నప్పుడు విలన్ క్యారక్టర్ లో నేనే  చేద్దామని అనుకున్నాను. అంత పవర్ ఫుల్ గా నాగ్ పోషించిన సైమన్ క్యారక్టర్  ఉంటుందని చెప్పాడు. దీన్ని బట్టి నాగ్ క్యారక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని అర్ధం చేసుకోవచ్చు. ఇక కూలీ తర్వాత నాగ్ కొత్తగా ఒప్పుకున్న అప్ కమింగ్ సినిమాల గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ బుల్లితెర రియాలిటీ షో  'బిగ్ బాస్ సీజన్ 9(Big Boss season 9)ద్వారా మరోసారి అలరించనున్నాడు. సుదీర్ఘ కాలం నుంచి నాగ్ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ కి నాగార్జున సుమారు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తమిళ, కన్నడ, మలయాళ బిగ్ బాస్ హోస్ట్ లు తీసుకునే రెమ్యునరేషన్  కంటే నాగార్జునే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. బిగ్ బాస్ కోసం నాగార్జున  సుమారు మూడు నెలల సమయాన్ని కేటాయియిస్తాడనే విషయం తెలిసిందే. నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 నుంచి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు దిగ్విజయంగా తొమ్మిదవ సీజన్ లోకి అడుగుపెడుతున్నాడు. నాగార్జున యొక్క  అద్భుతమైన యాంకరింగ్ వలన బిగ్ బాస్ విశేష ప్రేక్షాదరణ తో దూసుకుపోతుంది. టిఆర్పి రేట్ ల పరంగా కూడా బిగ్ బాస్ అనేక రికార్డులని నెలకొల్పుతుంది. ఈ సారి ఎవరి ఊహలకి అందని కంటెస్ట్ లు సీజన్ 9 కి రాబోతున్నారు.      
తెలుగు పంచాంగంలో ఒకో మాసంలో వచ్చే పూర్ణిమకు ఒకో ప్రత్యేకత ఉంటుందనే విషయం బాగా గమనిస్తే అర్థమవుతుంది. మాఘ పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, వీటిని బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని జరుపుకుంటారు.  ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం అంతా సందడిగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది.  అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, వ్రతాలు వీటితో ఉండే సందడి వేరు. ఈ మాసంలో అన్నా, చెల్లెళ్లను పలకరించే రాఖీ పూర్ణిమ వేరు.  అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని, వారి మధ్య ఒకరిమీద మరొకరికి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేసేది రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే రక్షా బంధన్ అని కూడా అంటారు. రక్ష అంటే ఎలాంటి ఆపదలు, సమస్యలు రాకుండా కాపాడేది. బంధన్ అంటే కట్టి ఉంచేది. రక్షా బంధన్ అంటే ఎలాంటి సమస్యలు రాకుండా కట్టి ఉంచే బంధనం. ఆ బంధనమే రాఖీ. అందరూ తమ సోదరులకు రాఖీ కట్టడం వల్ల  వాడుక భాషలో అందరూ రాఖీ పండుగ అంటున్నారు. రాఖీ పండుగ వెనుక కథనాలు!! ఈ పండుగకు వెనుక విభిన్న కథనాలు ప్రచారంలో  ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చెప్పుకునేది ఇంద్రుడి కథనం. ఇంద్రుడి కథ!! పూర్వం రాక్షసులు రెచ్చిపోయి మూడు లోకాల మీద దండయాత్ర చేసి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన పరివారం, తన లోకంలో ఉన్న వాళ్ళందరితో కలసి తన నివాసమైన అమరావతిలో దాక్కున్నాడు. ఇంద్రుడి పరిస్థితి చూసి ఆయన భార్య శచీదేవికి బాధ కలిగింది. దేవాదిదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ప్రార్థించి, నా భర్తను సమస్య నుండి గట్టెక్కించు అని అడిగింది. సరే అయితే నీ భర్తకు ఎరుపు రంగు దారంతో  రక్ష తయారుచేసి దాన్ని చేతికి కట్టు, అతను విజయం సాధిస్తాడు అని చెబుతాడు. శచీదేవి విష్ణుమూర్తి చెప్పినట్టు ఎరుపురంగు దారంతో రక్ష తయారుచేసి ఇంద్రుడికి కట్టి ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన వీరతిలకం దిద్ది యుద్ధానికి వెళ్లమంది. అది తెలిసి అమరావతిలో ఉన్న మిగిలిన వారు కూడా రక్షలు తయారుచేసి ఇంద్రుడికి కట్టి, వీరతిలకం దిద్దారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి మూడు లోకాల ఆధిపత్యాన్ని సంపాదించాడు. దీనికి గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటున్నారని చెబుతారు. దీని వెనుక ఉన్న మరొక కథ ద్రౌపతి, కృష్ణుల కథ!! కృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిశుపాలుడిని వధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలు తెగితే ద్రౌపతి తన చీర కొంగు చింపి కట్టు కడుతుందట. అప్పుడు కృష్ణుడు ద్రౌపతితో నీ సమస్యలలో నేను అన్నగా తోడుంటాను అని చెబుతాడు. ఆ కారణంతోనే ద్రౌపతి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను కాపాడాడు అని చెబుతారు. పురుషోత్తముడి కథ!! అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించి రాఖీ కడుతుంది. అలెగ్జాండర్ ప్రపంచానికి అధిపతి కావాలనే అత్యాశతో తక్షశిల మీద దండెత్తినప్పుడు పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండర్ ని చంపకుండా వదిలేసాడు. రాఖీ కట్టినవారికి భయం దొరుకుతుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇలా చరిత్రలో రాఖీ పౌర్ణమి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఇందులో ఉన్న అర్థం చెల్లెలు కట్టే రక్ష అన్నకు ఆరోగ్యాన్ని, ఆయుష్షును, అన్నిటికీ మించి క్షేమాన్ని కోరుకుంటే, అన్న చేతిలో ఉండే రక్ష అన్నకు తన చెల్లి విషయంలో ఉండాల్సిన బాధ్యత, చెల్లికి ఇవ్వాల్సిన రక్షణ, భరోసాను స్పష్టం చేస్తాయి. ఇదీ రాఖీ వెనుక ఉన్న అనుబంధం.                                    ◆నిశ్శబ్ద.
చేనేత చాలా గొప్ప కళ.. ఒక దారం కలుస్తుంది, ఆకారం తీసుకుంటుంది, మలుపులు తిరుగుతుంది, కొన్నిసార్లు విప్పుతుంది, విరిగిపోతుంది,  తరువాత మళ్ళీ కలుస్తుంది.  అంతా అయ్యాక ఒక అద్బుతం ఆవిష్కారం అవుతుంది.  అదే చేనేత అందం. జాతీయ చేనేత దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా కనిపించే విభిన్న స్వదేశీ వస్త్రాల గురించి,  చేనేత నైుణ్యం గురించి, భారతదేశానికి చేనేత తెచ్చిపెట్టిన ప్రత్యేక గుర్తింపు గురించి తెలుసుకుంటే.. పెళ్లి, పండుగ, శుభకార్యం.. ప్రత్యేక సందర్భం ఏదైనా పట్టు వస్త్రాలు కట్టుకోవాలి అనుకుంటారు. అయితే మిషన్ వస్త్ర పనితనానికంటే.. చేత పనితనం చాలా అద్బుతాలను ఆవిష్కరిస్తుంది.  ఇది వ్యక్తిలో సృజనాత్మకతను, కళను, పనితనాన్ని వెలికితీస్తుంది. నిజానికి చేనేత అనేది ఒక అద్బుతమైన కళ. కేవలం దారాలతో వస్త్రాలు నేయడం కాదు.. రంగులు,  డిజైన్లు ఇందులో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.  చేనేత అనేది దేశం యావత్తు ఆవరించి ఉంది. పశ్చిమ భారతదేశంలో  గుజరాత్‌లోని దంగాసియా,  భార్వాడ్ కమ్యూనిటీలు తంగాలియా నేతను ఆచరిస్తారు. ఇది వార్ప్ దారాల చుట్టూ చుట్టబడిన అదనపు దారాలను ఉపయోగించి సృష్టించబడిన చుక్కల నమూనాలకు ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలో విదర్భ..  క్లిష్టమైన కార్వతి కినార్ నేత  చాలా ప్రత్యేక కలిగి ఉంది. నేత కళాకారిణి శ్రుతి సాంచెటికి ఈ కళను కాపాడుకుంటూ వస్తోంది. తాను ఈ చేనేత పనిని సంరక్షించడం తన బాధ్యత అనుకుంటోంది. "ఈ కళారూపం నాకు చాలా విలువైనది" అని ఆమె చెబుతుంది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ నుండి వచ్చిన ఇకత్-రంగు వేసిన, నూనెతో  చేయబడిన టెలియా రుమల్ ఫాబ్రిక్ ఎరుపు, నలుపు,  తెలుపు రేఖాగణిత,  పూల నమూనాలను కలిగి ఉంటుంది. ఇక ధర్మవరం పట్టు,  బనారస్,  కంచి,  ఉప్పాడ వంటివి వస్త్రాలలో చీరల స్థానాన్ని ఎప్పుడూ ఒక మెట్టు కాదు.. వంద మెట్లు పైన ఉంచుతున్నాయి. నిజానికి చీర అనే వస్త్రం కూడా తరతరాలుగా ఇట్లా నిలబడటానికి కారణం పట్టు వస్త్రాలు.. అందులోనూ సాంప్రదాయత, భారతీయతనం ఈ చీరలలో ఉట్టిపడటమే.. ఈ కారణంగానే ఎన్ని రకాల వస్త్రాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినా  చీరకు ఒక స్పెషల్ స్టేటస్ ఉండనే ఉంది. కేవలం చీరలు అనే కాదు.. పురుషుల వస్త్రాలు,  పిల్లల వస్త్రాలను సాంప్రదాయంగా ఉంచడంలో చేనేత వస్త్రాలు ఎప్పుడూ ముందుంటాయి. అందుకే చేనేతలను ఎప్పుడూ గౌరవించాలి. ఆదరించాలి, ప్రోత్సహించాలి.                                            *రూపశ్రీ.
  టాయిలెట్ సీట్.. వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చాక ఇంట్లో అందరూ ఒకే సీటు మీద కూర్చుని టాయిలెట్ వెళ్లడం తప్పనిసరి. అయితే ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంత శుభ్రం చేస్తున్నా టాయిలెట్ సీట్ తొందరగా మురికిగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా టాయిలెట్ శుభ్రంగా లేకపోతే వచ్చినవారు చాలా అసహ్యించుకుంటారు. అయితే టాయిలెట్ ను, టాయిలెట్ సీట్ ను కేవలం 10 రూపాయల విలువ చేసే పానీయంతో సులువుగా శుభ్రం చేయవచ్చు. దీనికి కావాల్సిందల్లా కూల్ డ్రింక్ అంటే షాకయ్యేవారు ఎక్కువ. కానీ దీని వెనుక నిజాలు తెలుకుంటే.. కూల్ డ్రింక్.. వేసవి కాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేస్తాయి అనే విషయం పక్కన పెడితే.. టాయిలెట్ ను, టాయిలెట్ సీట్ ను మాత్రం అద్భుతంగా క్లీన్ చేస్తాయి. నిజానికి కూల్ డ్రింక్స్ లో  కార్బోనిక్ ఆమ్లం,  ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటాయి. ఈ ఆమ్లాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అవి టాయిలెట్ సీటుపై ఉన్న మొండి మరకలు,  ధూళిని సులువుగా కరిగిస్తాయి . దీని కారణంగా మురికిగా ఉన్న టాయిలెట్‌ను శుభ్రం చేయడం సులభం. దీన్ని ఉపయోగించడం వల్ల శుభ్రపరిచేటప్పుడు  ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. ఎలా క్లీన్ చేయాలి.. కూల్ డ్రింక్స్ ను ఉపయోగించి టాయిలెట్ ను క్లీన్ చేయడానికి కూడా పెద్ద యుద్దం చేయాల్సిన పని లేదు.  టాయిలెట్ సీట్ పైన ఎక్కడెక్కడ మురికి ఎక్కువ కనిపిస్తోందో.. అక్కడ కూల్ డ్రింక్ ను కాస్త ఎక్కువ పోయాలి. మిగిలిన ప్రాంతంలో సాధారణంగా వేస్తే సరిపోతుంది.  ఇలా పోసిన తరువాత దాన్ని ఒక 15 లేదా 20 నిమిషాలు అలాగే వదిలేయాలి.  కూల్ డ్రింక్ లో ఉండే ఆమ్లం చర్య జరిపి మురికి, మరకలు మొదలైనవాటిని కరిగిస్తుంది.  15 నిమిషాల తరువాత టాయిలెట్ బ్రష్ తీసుకుని స్ర్కబ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేశాక నీళ్ళు పోసి కడిగితే సరిపోతుంది.  ఇలా చేస్తే టాయిలెట్ కొత్త దానిలా మెరిసిపోతుంది కూడా.  అయితే కూల్ డ్రింక్ లోని తీపి బాగా పోయేలా కాస్త నీరు ఎక్కువ వినియోగిస్తే సరిపోతుంది.  టాయిలెట్ శుభ్రంగా, దుర్గంధం లేకుండా  ఉండటానికి, నిమ్మ తొక్క, ఉప్పు,  నీటిని కలిపిన ద్రావణాన్ని టాయిలెట్‌లో పోయాలి. ఓడోనిల్ వంటి ఉత్పత్తులకు బదులుగా, మీరు నిమిషాల్లో దుర్వాసనను తొలగించడానికి  డిఫ్యూజర్‌ను ఉపయోగించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. టాయిలెట్ లో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, టాయిలెట్ లో వివిధ రకాల ఉత్పత్తులు, వస్తువులు ఉంచడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే టాయిలెట్ శుభ్రంగా, దుర్గంధం లేకుండా ఉంటుంది.                                   *రూపశ్రీ.  
  మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పడమే కాకుండా ఆరోగ్యం మీద స్పుహ ఉన్న ప్రతి ఒక్కరూ అదే చెబుతారు.   ఏది తిన్నా అది  ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు తీసుకునే ఆహారం పోషకాలతో సమతుల్యంగా ఉండాలని చెబుతారు. అంతేకాదు.. తీసుకునే ఆహారమే కాకుండా ఆహారం తీసుకునే  సమయం  కూడా అంతే ముఖ్యమని చాలా మంది చెబుతారు. కానీ అధిక శాతం మంది తీసుకునే ఆహారం విషయంలో చూపించిన శ్రద్ద ఆహారం తీసుకునే సమయం విషయంలో అస్సలు చూపించరు. నేటి బిజీ లైఫ్ లో రోజంతా హడావిడిగా పనులు చేయడమే కాదు.. హడావిడిగా తినడం కూడా జరుగుతోంది. రాత్రి సమయంలో  కొన్నిసార్లు  9 గంటలకు, కొన్నిసార్లు 10 లేదా 11 గంటలకు తింటుంటారు.  తిన్న  వెంటనే నిద్రపోతారు. కానీ  రాత్రి 7 నుండి 8 గంటల మధ్య ఆహారం తీసుకుంటే ఆరోగ్య పరంగా అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. 7-8 మధ్య భోజనం ఎందుకంటే.. 7-8 గంటల మధ్య భోజనం చేయడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. త్వరగా భోజనం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా నిద్ర, గుండె, జీర్ణక్రియ,  చక్కెర నియంత్రణకు కూడా చాలా మంచిది.  త్వరగా భోజనం చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందని,  అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం 19% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితో పాటు, బరువు తగ్గడం, జీర్ణ ఆరోగ్యం,  నిద్ర నాణ్యతకు కూడా ఇది 7-8 మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది.   రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల షుగర్ సమస్య వచ్చే ప్రమాదం సాధారణం కంటే 20 శాతం ఎక్కువ ఉంటుందట. జీర్ణశక్తి.. త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. రాత్రి 8 గంటల ముందు భోజనం చేసినప్పుడు, శరీరం దానిని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకుంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి దాదాపు 2 నుండి 4 గంటలు పడుతుంది. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది,  గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలు ఏర్పడతాయి. త్వరగా భోజనం చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) ప్రమాదం 50% తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వాత జీర్ణక్రియ మందగిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది, కాబట్టి రాత్రిపూట తేలికగా,  త్వరగా తినాలి. నిద్ర.. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో బిజీగా ఉండటం వల్ల విశ్రాంతి లభించదు. దీని ప్రభావం నిద్రపై కూడా కనిపిస్తుంది.  నిద్రపోవడానికి 2-3 గంటల ముందు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది.  నిద్ర గాఢంగా పడుతుంది. 7-8 మధ్య రాత్రి భోజనం చేసేవారికి నిద్రలో గ్యాస్, గుండెల్లో మంట లేదా భారం తక్కువగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర మానసిక,  శారీరక ఆరోగ్యానికి మంచిది. బరువు.. బరువు తగ్గాలనుకునేవారు ఆహారం మాత్రమే కాదు, తినే సమయం కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ (2013) ప్రకారం, సాయంత్రం 7 గంటలకు ముందు తినేవారిలో శరీరం కేలరీలను శక్తిగా మార్చగలదు కాబట్టి బరువు తగ్గడం వేగంగా ఉంటుంది. రాత్రి ఆలస్యంగా  భోజనం చేయడం వల్ల ఆహారం కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. త్వరగా తినడం వల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది.  ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత  శారీరక శ్రమ లేదా కాస్త వాకింగ్ చేయడానికి కూడా సమయం దొరుకుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు సమయానికి రాత్రి భోజనం చేయడం  చాలా ముఖ్యం. ఆలస్యంగా భోజనం చేసేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం  సిర్కాడియన్ సైకిల్ కు భంగం కలుగుతుంది, ఇది హార్మోన్ల అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది.                              *రూపశ్రీ.
  కళ్ళు మన శరీరంలో అతి ముఖ్యమైన,  సున్నితమైన భాగం. ప్రపంచాన్ని చూడటానికి, అర్థం చేసుకోవడానికి,  అనుభూతి చెందడానికి, అర్థం చేసుకోవడానికి కళ్లే ఆధారం. అయితే నేటి కాలంలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి, వీటిలో కంటి చూపు మందగించడం, కంటి ఒత్తిడి, చికాకు, ఎరుపు వంటివి ఉన్నాయి. స్క్రీన్ సమయం పెరగడం వల్ల కూడా ఈ కంటి సమస్యలు వస్తున్నాయి. పెద్దల  నుండి పిల్లల  వరకు ప్రతిదానికీ డిజిటల్ పరికరాలు చాలా అవసరం అయ్యాయి. గంటల తరబడి వాటి ముందు గడపడం వల్ల కళ్ళపై చాలా ఒత్తిడి వస్తుంది,  కళ్ళు అలసిపోతాయి. వీటి వల్ల కంటి ఒత్తిడి, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.  దీని నుండి ఉపశమనం కలగడానికి, కంటి చూపు మెరుగవ్వడానికి 20-20-20 టెక్నిక్ భలే సహాయపడుతుంది.  దీని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. 20-20-20 టెక్నిక్.. స్క్రీన్ చూస్తున్నప్పుడు కంటి ఒత్తిడిని నివారించడానికి 20-20-20 నియమం ఒక గొప్ప మార్గం . ఈ నియమంలో   స్క్రీన్ నుండి 20 సెకన్ల విరామం తీసుకుంటారు.  ఇది కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడాలి. ఇది ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్‌లను చూడటం వల్ల కలిగే కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయోజనాలు.. ప్రతిరోజూ 20-20-20 నియమాన్ని పాటించడం ద్వారా, కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు లేదా నిరోధించవచ్చు. దీనికి సంబంధించిన ఆధారాలు అనేక అధ్యయనాలలో కూడా కనుగొనబడ్డాయి. 20-20-20 నియమం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్‌ను నివారించడానికి,  దీర్ఘకాలిక కంప్యూటర్ లేదా డిజిటల్ పరికర వినియోగం వల్ల కలిగే డిజిటల్ కంటి ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే సరళమైన,  ప్రభావవంతమైన టెక్నిక్. స్క్రీన్ ను చూస్తున్నప్పుడు ఇటువంటి చిన్న విరామాలు తీసుకోవడం వల్ల కంటి దృష్టి కేంద్రీకరించే కండరాలు సడలించబడతాయి. ఇది కంటి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతర మార్గాలు.. కంటి ఒత్తిడిని కొన్ని ఇతర మార్గాల ద్వారా కూడా తగ్గించవచ్చు.  స్క్రీన్ చూస్తున్నప్పుడు లైటింగ్ ను అడ్జెస్ట్ చేసుకోవాలి.  టీవీ, ఫోన్, ల్యాప్‌టాప్ చూడటం చాలా మసక వెలుతురు లేదా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు   కంటి ఒత్తిడిని పెంచుతుంది.  కంప్యూటర్‌ను ఉపయోగించడం లేదా చదవడానికి వైద్యులు సూచించిన  అద్దాలు ధరించడం వల్ల కంటి ఒత్తిడి తగ్గుతుంది. పెద్దలు స్క్రీన్ సమయాన్ని కంట్రోల్ పెట్టుకుంటే పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయవచ్చు. తాము ఆచరిస్తూ పిల్లలకు చెప్పడం మంచిది.   ఎక్కువసేపు స్క్రీన్ వాడటం వల్ల కంటి ఒత్తిడి,  నొప్పి వస్తుంది. దీన్ని పై చిట్కా తో అధిగమించవచ్చు. కంటి సమస్యలు ఉన్నవారు  క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలు చేయాలి.  ఇది కంటి ఒత్తిడిని తగ్గించగలదు.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నేటి బిజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది ప్రజలు ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  డిప్రెషన్ కు ఒక నిర్ణీత ఔషధం అంటూ ఏమీ లేకపోవడం చాలామంది దీన్నుండి బయటపడక పోవడానికి కారణం అవుతోంది. డిప్రెషన్ రావడం ఎంత సులువో దాన్నుండి బయట పడటం అంత కష్టం అనే విషయం చాలామందికి తెలుసు.   అయితే డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.  ఒక పరిశోధనలో బయటపడిన ఈ విషయం రోజువారీ వాకింగ్ డిప్రెషన్ చక్కని ఔషధంలా పనిచేస్తుందట.  రోజూ వాకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ (వాకింగ్ హెల్త్ బెనిఫిట్స్) తగ్గించడంలో చాలా సహాయపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని గురించి మరింత లోతుగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నప్పుడు స్టెప్ కౌంట్ ను క్రమంగా  కొద్ది మొత్తంలో పెంచడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. రోజువారీ నడక  మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నడిచినప్పుడు స్ట్రెస్ హార్మోన్ చాలా వరకు తగ్గుతుంది.  శరీరం చురుకుగా ఉంటుంది.  వాకింగ్ చెయ్యాలి అనుకునే వారు దాన్నొక భారంగా కాకుండా చక్కని ఔషధం తీసుకుంటున్నాం అనే ఆలోచనతో మొదలుపెడితే డిప్రెషన్ ను అధిగమించడం చాలా సులువని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు ఎన్ని అడుగులు.. సాధారణంగా వాకింగ్ గోల్ పెట్టుకునే వారు రోజుకు ఇన్ని అడుగుల చెప్పున నడుస్తుంటారు.  కొందరు కిలోమీటర్ల చెప్పున కౌంట్ వేసుకుంటారు.  ఇప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా  ఈ స్టెప్ కౌంట్ అనేది ప్రతి ఫోన్ లో ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ కూడా. రోజుకు ఆరువేల అడుగులతో మొదలు పెట్టి క్రమంగా స్టెప్ కౌంట్ ను పెంచుతూ వెళ్లాలి. గూగుల్ ఫిట్ వంటి హెల్త్ ట్రాకింగ్ యాప్స్ లో  వాకింగ్ చేసే వ్యవథి.. వేగాన్ని బట్టి హార్ట్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇవి గుండె ఆరోగ్య పరిరక్షణకు సహాయపడతాయి. స్టెప్ కౌంట్ ను మొదలుపెట్టిన తరువాత క్రమంగా పెంచుకుంటూ 10 వేల  అడుగులకు చేరుకోవాలి. ఇది డిప్రెషన్ స్థాయిని క్రమంగా తగ్గిస్తుంది. వాకింగ్ వల్ల డిప్రెషన్ తగ్గుతుందని మరీ ఎక్కువగా నడవడం అయితే మంచిది కాదు.. 10వేల అడుగులకు మించి వాకింగ్ చేసినా మరీ అంత ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ దశలో శరీరం చాలా అలసిపోతుంది.   కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా  యోగా, వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ మొదలైనవి కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, డిప్రెషన్ స్థాయిలను తగ్గించడానికి  ఎంతగానో తోడ్పడతాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...