LATEST NEWS
తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేతత్రి కల్వకుంట్ల కవిత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను అనుసరిస్తున్నారు. ఎన్నికల బరిలో దిగిన తొలి ప్రయత్నంలోనే  ఘన విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించిన టీవీకే అధినేత విజయ్ అడుగు జాడల్లో నడుస్తూ కవిత కూడా తెలంగాణ రక్షణ సేనను గెలుపు బాటలో నడిపించి తెలంగాణ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు.  ఇందుకోసం ఆమె తాజాగా తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.  తమిళనాడు రాజకీయాల్లో రిక్కీ రాధన్ పండిట్ పాత్ర   కీలకమైనదిగా భావిస్తారు. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతికూలంగా వ్యాఖ్యానించినప్పటికీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ  విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని రికీ రాధన్  జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రిక్కీ రాధన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాధన్‌ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా నియమించారు. అయితే ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆ నియామకాన్ని ఉపసంహరించుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే విజయ్ రాజకీయ నిర్ణయాల్లో రాధన్ పండిట్ సలహాలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటారు.  ఇటువంటి రాధన్ పండిట్ చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   కవిత తన కుమారుడితో కలిసి రిక్కీ రాధన్ పండిట్‌ను శాలువాతో సత్కరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి.   తెలంగాణ రక్షణ సేన భవిష్యత్తు, రాబోయే రోజుల్లో కవిత రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందనే అంశాలపైనే  కవిత రాధన్ పండిట్ సలహాలు కోరినట్లు తెలుస్తోంది.    తమిళనాడులో విజయ్‌కి తిరుగులేని రాజకీయ విజయం లభిస్తుందని ముందుగానే జోస్యం చెప్పిన  రాధన్ పండిట్ ను కవిత ఆశ్రయించారని అంటున్నారు.  తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై కవిత  ఇటీవల  బహిరంగంగానే ప్రశంసలు కురిపించడం, తెలంగాణలో  అమ్మ పాలన  అందిస్తామని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాధన్ పండిట్ తో కవిత భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   Kalvakuntla Kavitha follows Tamilnadu CM Vijay, Ricky Radhan Pandit, CM Vijay Astrologer, Kavitha Ricky Radhan Meeting, Telangana Rakshana Samithi, Telangana Politics
 గన్నవరం నియోజకవర్గంలో  తిరుగులేని నేతగా చక్రం తిప్పిన వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు ఆయన ప్రత్యర్థులకు సైతం జాలికలిగేలా మారిపోయింది.  రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పంచన చేరిన తరువాత వల్లభనేని వంశీ రాజకీయ జీవితం మెట్టుమెట్టుగా దిగజారుతూ వచ్చచింది. ఇప్పుడు ఆయన పరిస్ధితి వైసీపీలో ఓ సామాన్య కార్యకర్తతో సమానంగా మారిపోయింది.    గతంలో  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కన్నూమిన్నూ గానకుండా వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు  ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ చట్టపరంగానూ, రాజకీయంగానూ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. రెండో సారి అంటే 2019 ఎన్నికలలో విజయం సాధించిన  అనంతరం  తెలుగుదేం వీడి వైసీపీ పంచన చేరారు.  రాజకీయాలలో ఓ నాయకుడు పార్టీ మారడం సాధారణమే అయినా, ఆయన పార్టీ మారిత తరువాత   టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని  చేసిన  వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే.. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై   దాడి సాక్షులను బెదిరించడం, కిడ్నాప్ ఆరోపణలు వంటి పలు కేసుల్లో ఆయన జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.   ఇక రాజకీయంగానూ ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ వంశీకి కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేట్ వద్దకు కూడా అనుమతించని పరిస్థితి ఉంది.  ఇటీవలి కాలంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లిన సమయంలో వంశీ ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన ఎదురుచూడాల్సిన వచ్చిన తీరు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యింది.  ఒకప్పుడు గన్నవరం నియోజకవర్గాన్ని శాసించిన వల్లభనేని వంశీకి ఇప్పుడు అక్కడ ఇసుమంతైనా గుర్తింపు లభించడంలేదు.  ఆయనపై నమోదైన వరుస కేసులు, అరెస్టుల భయంతో ముఖ్య అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వంశీకి దూరంగా జరుగుతున్నారు.  తాజాగా జగన్ కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన సందర్భంగా  వంశీ ఒక సాధారణ కార్యకర్తలా బారికేడ్ల వెనుక నిలబడి తోసుకుంటూ.. అధినేత చూపుల్లో ఒక్కసారి పడేందుకు తాపత్రేయపడుతున్న దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇంతగా ప్రాధాన్యత కోల్పోయి, అవమానాలు ఎదుర్కొంటూ కూడా వైసీపీలో వంశీ ఎందుకు కొనసాగుతున్నారు అన్న ప్రశ్నకు వంశీకి వైసీపీ తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఉండటమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   2019 ఎన్నికల తర్వాత వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీలోకి ఫిరాయించిన తర్వాత ఆయన పరువు, ప్రతిష్టలతో పాటు రాజకీయ భవిష్యత్తును కూడా కోల్పోయారంటున్నారు.  అన్ని వైపులా తలుపులు మూసుకు పోవడంతో వంశీకి వైసీపీలోనే కొనసాగాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  Jagan ignoe Vallabhaneni Vamsi, YCP, Gannavaram Politics, YSJagan,  AP Politics, TeluguOne
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఈ ఎన్నికలను   ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు.  స్థానిక  పోరుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చిన ఆయన.. కూటమి భాగస్వామ్య పక్షాలతో సీట్ల కేటాయింపు చర్చలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు.  కూటమిలో సీట్ల పంపకాలపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. 80, 15, 5 నిష్పత్తిలో సీట్ల పంపకాల ప్రతిపాదన లేదన్నారు.  2024  ఎన్నికల సమయానికి.. , ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందన్న పవన్ కల్యాణ్..  అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ఐక్యత, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా  త్యాగాలకు సిద్ధపడ్డామన్న ఆయన.. క్షేత్రస్థాయిలో   శ్రమించిన పార్టీ శ్రేణులకు, నాయకులకు ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పిస్తానన్నారు. స్థానిక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేలా ముందుకుసాగుతానన్న ఆయన  కూటమి ఐక్యతకు   భంగం వాటిల్లకుండానే, అధిక స్థానాలలో జనసేన పోటీ చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.  క్షేత్రస్థాయి బలాబలాలు, అభ్యర్థుల గెలుపు అవకాశాలను పరిగణనలోనికి తీసుకునే  స్థానిక ఎన్నికలలో సీట్ల సర్దుబాటు ఉంటుందని పవన్ చెప్పారు.   Pawan Kalyan Strategy for local body elections, Janasena Party, AP Local Body Elections, TDP Janasena Alliance, Seat Sharing Strategy
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరో సారి తన అజ్ణానాన్ని బయటపెట్టుకుని ట్రోలింగ్ కు కేంద్ర బిందువయ్యారు. పాపం జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు అంటూ నెటిజనులు ఆటపట్టిస్తున్నారు. గురువారం (ఆగస్టు 20) మీడియాతో మాట్లాడిన జగన్  డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)కి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( ఏపీపీఎస్సీ) రెండూ ఒకటేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈయనా ఏపీ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు వెలగబెట్టారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  మెగా డీఎస్సీపై విమర్శలు గుప్పించే క్రమంలో  ఆయన తన అజ్ణానాన్ని బయటపెట్టుకున్నారు.  ఓ వైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పారదర్శనంగా నిర్వహించామని చెబుతూ.. పక్కా ఆధారాలు చూపుతున్నా.. డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ వేసిన పిటిషన్లను కోర్టులు డిస్మిస్ చేసినా.. జగన్ మాత్రం తన మీడియా సమావేశంలో మెడా డీఎస్సీలోఅక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ఐటీ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంత వరకూ అయితే ఓకే.. కానీ ఆయన ఆ క్రమంలో అసలు   ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్,    టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ రెండూ ఒకటేనన్నారు.  తన హయాంలో  నిర్వహించిన ఏపీపీఎస్సీ, తెలుగుదేశం హయాంలో నిర్వహించిన డీఎస్సీ ఒకటేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పని చేసిన జగన్   ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరిజ్ణానం కూడా లేకపోవడమే ఆయన హయాంలో పాలన ఎంత ‘దివ్యం’గా సాగిందో తేటతెల్లం చేస్తోందంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. ఒక మాజీ సీఎం అయ్యి ఉండి కూడా ఏపీపీఎస్సీ, డీఎస్సీలకు మధ్య ఉన్న వ్యత్యాసం తెలియపోవడమేంటని నిరుద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైగా జగన్ తన అజ్నానాన్ని, విషయపరిజ్ణానం లేని తనాన్ని బయటపెట్టుకుంటూ డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండూ ఒకటేనని చెబుతున్న సమయంలో ఆయనను కరెక్ట్ చేయడానికి పక్కనే ఉన్నవారు ఎంత ప్రయత్నించినా జగన్ మాత్రం రెండూ ఒకటే కదా అంటూ వారిని నోరుమూయించారు.   నెటిజనుల ట్రోలింగ్, నిరుద్యోగల విమర్శలు పక్కన పెడితే.. జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్.. ప్రెస్ మీట్ క్లిప్పింగ్ లను షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు.  మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.    రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఏల్ల తరబడా గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతుంటే, మాజీ సీఎం, పైగా ప్రతిపక్ష హోదా కావాలంటూ మంకుపట్టు పడుతున్న జగన్ కు ఏపీపీఎస్సీ, డీఎస్సీల మధ్య ఉన్న తేడా తెలియకపోవడం విస్మయం గొలుపుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం జగన్ చేసిన ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటే అన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారడమే కాదు.. జగన్ ప్రతిష్టను దిగజార్చాయి.  Jagan APPSC DSC comments, Nara Lokesh trolls Jagan, AP Mega DSC news,   Jagan press conference, Andhra Pradesh, TeluguOne
తెలంగాణ అధికార కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అంటే చెప్పలేకపోయినా.. ఏదో జరుగుతోందని మాత్రం అందరికీ అర్ధమౌతోంది. రాష్ట్ర పార్టీలోఅంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా నేతలు గళమెత్తుతున్నారు. విమర్శల స్థాయి, ఆరోపణల తీరు ఒకింత తీవ్రంగానే ఉన్నాయి.  స్వయంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా అంటూ చేసిన వ్యాఖ్యలు  హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి పదవి దక్కగానే రేవంత్‌కు అహంకారం పెరిగిందని, కళ్ళు నెత్తికెక్కాయా అంటూ ఆమె ఘాటుగా విమర్శించడం, అలాగే సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం రేవంత్ వనపర్తి టికెట్ తనకు ఇవ్వకుండా అమ్ముకున్నారు అని వ్యాఖ్యానించడం చూస్తుంటే.. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి రగులుతోందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విషయంలో.. తెలుగువన్  న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు వీవీ రావు  మాట్లాడారు.  సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు. తమ నియోజకవర్గాల్లో పనులు కావడం లేదని, మంత్రులు, సలహాదారులు తమను కనీసం లెక్కచేయడం లేదని వారు బాహాటంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలు రేవంత్ పై అసంతృప్తి పెచ్చరిల్లుతోందనడానికి నిదర్శనమన్నారు. చిన్నారెడ్డి అయితే.. తనకు వనపర్తి టికెట్ ఇవ్వమని సోనియా గాంధీ స్వయంగా చెప్పినా రేవంత్ ఆ టికెట్ తనకు ఇవ్వకుండా అమ్ముకున్నారని విమర్శించిన విషయాన్నీ,  అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రేవంత్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.   కాంగ్రెస్‌లో పాత నేతలు వర్సెస్ వలస నేతల మధ్య సాగుతున్న ఈ   సమరం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే పార్టీలో ఉందని వీవీరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత ఈ అంతర్గత తిరుగుబాటుపై ఎలా స్పందింస్తారు? ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉందన్నారు.  ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ తీరు పట్లా, ఆయనపై రాష్ట్ర నేతల్లో వ్యక్తం అవుతున్న అసంతృప్తి పట్లా స్పందించకుండా మౌనంగా ఉండటం చూస్తుంటే.. ముందస్తు ఎన్నికల అంశాన్నీ కొట్టిపారేయలేని పరిస్థితి ఉందని వీవీరావు అన్నారు.  Konda Sushmitha Comments, Revanth Reddy Konda Sushmitha, Telangana Congress Politics, Pocharam, Chinnareddy 
ALSO ON TELUGUONE N E W S
Cast: Ravi Teja, Priya Bhavani Shankar, Sai Kumar, Baby Nakshathra, Ajay Ghosh, Ramesh Indira, Swasika, Meesala Lakshman   Crew:  Cinematography by Vishnu Sarma  Editing by Prawin Pudi  Music by GV Prakash Kumar Written & Directed by Shiva Nirvana Produced by Naveen Yerneni & Y Ravi Shankar Banner - Mythri Movie Makers   Ravi Teja has been crowned as Mass Maharaja of Telugu Cinema but his recent films did not live up to the hype and buzz surrounding them. But Irumudi has been different as movie got huge positive buzz from the beginning. Joining hands with a director like Shiva Nirvana and divine connection seems to have changed things for Ravi Teja. Let's discuss about the film in detail.    Plot:  Trinath (Ravi Teja) is an alcoholic but he loves his wife (Priya Bhavani Shankar) and daughter Manikanta (Baby Nakshatra) to the core. Every year he observes Ayyappa Deeksha and stays away from every vice for 41 days and he is popular as a singer. On the other hand, Sileru High school becomes a problematic aspect for the girls commuting from the Trinath's village.  They have to go by bus to near by Donkapadu forest and then travel 5 KM by walk or bicycle. Guru Swamy (Sai Kumar)'s daughter Gayathri complains about this and he asks MLA (Ramesh Indra) to sanction at least bus. Meanwhile, high school girls are terrified by teacher (Swasika Vijay) and her special classes. Why? How Trinath and his daughter are connected to all this? Watch the movie to know more.    Analysis:  Ravi Teja has delivered his career best performance in the film. It is hard to find Ravi Teja as he completely immersed himself into the role of Trinath. We see only Trinath in his body language and his dialogue delivery too. We never saw Ravi Teja this restrained and in character and that is the biggest strength of the film.  Baby Nakshatra is cute and her performance is life of the film. Priya Bhavani Shankar is good, Ramesh Indra, Sai Kumar and everyone did their best. GV Prakash Kumar's music and BGM stand-out. They carry the film flawlessly and create the necessary atmosphere for the thriller.  Shiva Nirvana did his best in writing dialogues for the film. Each scene carries forward the emotion and delivers a strong humanitarian angle that the director posses. But screenplay wise after the big twist movie gets into predictable zone but climax emotion elevates the feel. The thought process on how two fathers' handle education and upbringing of girl child is beautifully presented by the director.  Technically, movie is good as cinematography is handled very well. Production design and values by Mythri Movie Makers are perfect too. But editing could have been better in the second hour. Overall, the movie is worth a watch for the social message it intertwines into a thriller aspect. Ayyappa songs help the movie big time.    Positives:  Ravi Teja's Performance  Baby Nakshatra scenes  Strong emotional core  Gayathri - Manikanta scenes GV Prakash Kumar music  Socially Relevant Concept Negatives: Drag in second hour  Slight predictability post big twist  Sluggish narrative at places.    Bottomline:  A good and honest film that talks about women safety   Rating: 3/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా మరి నటించిన మొదటి మూవీ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగష్టు 7న థియేటర్లలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ రెండు వారాల్లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. కథలో 'దాస్' పాత్రలో లోకేష్ కనకరాజ్, 'చంద్ర' పాత్రలో వామికా గబ్బి నటించారు. వీరిద్దరి పేర్లలోని మొదటి అక్షరాల కలయికే ఈ 'DC'. లోకేష్ ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేస్తున్నారని తెలిసినప్పుడు మొదట్లో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా, లోకేష్ తన ఇంటెన్స్ పర్‌ఫార్మెన్స్‌తో, రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో అందరినీ మైండ్ బ్లాక్ చేశారు, ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ కావడానికి కారణం కేవలం లోకేష్ క్రేజ్ మాత్రమే కాదు. అరుణ్ మాథేశ్వరన్ మార్క్ కల్ట్ విజువల్స్, వామికా గబ్బి పవర్‌ఫుల్ యాక్టింగ్, అనిరుధ్ రవిచందర్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అసలైన ప్రాణం పోశాయి. అనిరుధ్ ఇచ్చిన బిజీఎమ్ థియేటర్లలో సీన్స్ ప్లే అవుతున్నంతసేపు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఒక సెన్సేషనల్ ఫిల్మ్‌మేకర్ తన తొలి ప్రాజెక్ట్‌తోనే నటుడిగా ఈ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించిన 'DC' చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.     DC Movie, Lokesh Kanagaraj, Wamiqa Gabbi, Arun Matheswaran, Anirudh Ravichander  
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్, ప్రత్యేక పాత్రలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ఒక కీలక పాత్ర గురించి వస్తున్న వార్తలకు నిర్మాతల వైపు నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. గతంలో వచ్చిన టీజర్‌లో ఆయన వాయిస్ ఓవర్ వినిపించడంతో, ఈ భారీ కాప్‌ యాక్షన్ డ్రామాలో ఆయన ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే కథనంలో ఉన్న ఒక పవర్ ఫుల్ జైలర్ పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్‌ను సంప్రదించిన మాట వాస్తవమే అని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదని ప్రణయ్ వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు అధికారికంగా బలం చేకూరినట్లయింది. ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యామియో చేయనున్నారని సాగుతున్న ప్రచారానికి కూడా ప్రణయ్ ముగింపు పలికారు. 'స్పిరిట్' లో చిరంజీవి ఎలాంటి అతిథి పాత్ర చేయడం లేదని తేల్చి చెప్పారు. కాస్టింగ్ పరంగా క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ వివరాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో 'స్పిరిట్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ తొలిసారిగా పూర్తిస్థాయి రోషకలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండడం మెగా మాస్ ఎలిమెంట్స్‌ని పెంచేస్తోంది. నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్‌ను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. సందీప్ వంగా మేకింగ్ టేస్ట్ ప్రకారం ప్రకాష్ రాజ్ ప్లేస్‌లోకి వచ్చే కొత్త నటుడు ఎవరుంటారోననే కుతూహలం ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. త్వరలోనే ఈ మూవీలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల అధికారిక వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
  -సినిమా పేరు: ఇరుముడి -న‌టీన‌టులు:రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, శ్వాసిక విజయ్, అజయ్ ఘోష్  తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు శర్మ  -ఎడిటింగ్: ప్రవీణ్ పూడి   -మ్యూజిక్: జివి ప్రకాష్ కుమార్  -నిర్మాత‌లు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి  -బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్  -రచన,దర్శకత్వం: శివ నిర్వాణ -రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026  మాస్ మహారాజా రవితేజ ఈ రోజు ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి 'ఇరుముడి' తో  థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్  ఉన్న  ఇరుముడి  ఎలా ఉందో చూద్దాం. కథ త్రినాధ్( రవితేజ) ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పచ్చని అటవీ ప్రాంతంలో ఉండే  పొల్లూరు అనే విలేజ్ కి చెందిన వ్యక్తి.  ట్రాలీ ఆటోలో తన పొలంలోనే పండించిన అరటిగెలలని తన ఊరు పక్కన ఉండే టౌన్ లో అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నా మంచి వ్యక్తి. అయ్యప్పస్వామి దీక్ష తీసుకునే టైంలో మాత్రం ఆల్కహాల్ జోలికి వెళ్ళడు. ఆడవాళ్ళ అందర్నీ తన కూతురుగా భావించడంతో పాటు చెడుని అంతం చేయడం త్రినాధ్ నైజం. భార్య పేరు కావేరి. కూతురుపేరు మణికంఠ. తొమ్మిదేళ్ల వయసు ఉన్న మణికంఠ ఐదవ క్లాస్ చదువుతుంటుంది. ఏవైనా చెడు సంఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు చూసినా తండ్రికి చెప్పడం అలవాటు. ఆ విధంగా చెప్పడం చిన్నప్పట్నుంచి తండ్రి, కూతురు   మధ్య ఉన్న ఒప్పందం కూడా. మరి ఆ ఒప్పందం తండ్రి కూతుళ్ళ జీవితంలో ఏమైనా  మార్పులు తీసుకొచ్చిందా? వస్తే ఆ మార్పులు ఏంటి? పరిచయమైన కొత్త క్యారెక్టర్స్ ఎవరు? సమాజానికి ఏమైనా మంచి జరిగిందా అనేదే ఇరుముడి ఎనాలసిస్  సీలేరు లాంటి ఏరియాలో కంప్లీట్ లైవ్ లొకేషన్స్ లో ప్రశాంతమైన వాతావరణంలో  మూవీ ఫస్ట్ నుంచి చివరి వరకు బోర్ కొట్టకుండా సాగింది. ఫుల్ ఫ్లెడ్డ్ ఎమోషనల్ రైడ్.  కూతుళ్ళని పెంచే  ఇద్దరు తండ్రుల పెంపకం గురించి చెప్పిన విధానం ఆలోచింపచేయడంతో పాటు కట్టిపడేస్తుంది. మూవీ మొత్తం రవితేజ కనిపించలేదు. త్రినాధ్  మాత్రమే కనిపించాడు.దర్శక నిర్మాతలు తాము ఎంచుకున్న కథని దైర్యంగా ప్రతి సీన్ ని ఎలా చెప్పాలో ఆ విధంగా చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ నుంచి వచ్చిన కథకి తగ్గ లిరిక్స్, ఆర్ ఆర్  ఇరుముడిని మన హృదయాల్లో  నిలుపుతుంది.ముఖ్యంగా స్కూల్ వయసు ఉన్న పిల్లలు, తల్లి తండ్రులు తప్పక చూడాల్సిన మూవీ. ఈ కలియుగంలో  ఇలాంటి మూవీ రావాల్సిన అవసరం కూడా ఉంది.  ఫస్ట్ హాఫ్  చూసుకుంటే స్టార్టింగ్ సీన్ నార్మల్ గానే ఉందని అనిపించినా, ఆ సీన్ ఇంపాక్ట్  సెకండ్ హాఫ్ లో తెలిసాక కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాం. మణికంఠ, త్రినాధ్ తో వచ్చిన సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండటంతో పాటు కథ ఏ విధంగా రన్ అవ్వబోతుందో అనే క్యూరియాసిటీ ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు, అయ్యప్ప స్వామి దీక్ష సమయంలో వచ్చిన సన్నివేశాలు, గోపరాజు( సాయికుమార్) , 10 th క్లాస్ చదివే   అతని కూతురుతో త్రినాద్, మణికంఠ సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. టీచర్ గా చేసిన శ్వాసిక విజయ్ సీన్స్ అంత ఇంపాక్ట్ అనిపించలేదు.  ఇంటర్వెల్ సీన్ పర్లేదు.   సెకండ్ హాఫ్ లో చూసుకుంటే అసాంఘిక  శక్తుల నుంచి  ఏ నిమిషానికి  ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో అనే టెన్షన్ కలుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే సస్పెన్సు కి కన్నీళ్లు ఆపుకోలేం. అది నిజం కాకపోతే బాగుండని మన ఇష్ట దైవాలని ప్రార్దిస్తాం. సీన్ తో సీన్ తో పాటు  ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో కుదిరాయి. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  త్రినాధ్ గా రవితేజ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఎమోషనల్, లవ్, యాక్షన్ సీన్స్ లో రఫ్ఫాడించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో రవితేజ పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది. అభిమానులకి ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. ప్రియా భవాని శంకర్ హోమ్లీ క్యారక్టర్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా బేబీ నక్షత్ర అయితే తన క్యూట్ నటనతో థియేటర్ నుంచి బయటకి వచ్చినా తన గురించే ఆలోచించేలా అదిరిపోయే పెర్ఫార్మ్ చేసింది. తన వల్ల రిపీట్ ఆడియెన్స్ కూడా పక్కా. దీన్ని బట్టి ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.  మిగతా క్యారెక్టర్స్ లో చేసిన సాయికుమార్, అజయ్ ఘోష్, శ్వాసిక విజయ్,  నెగిటివ్ రోల్ లో చేసిన ఎం ఎల్ ఏ క్యారక్టర్ కూడా తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు నటించారు.  శివ నిర్వాణ దర్శకుడిగా, రచయితగా సక్సెస్ అయ్యాడు. తెలుగు సినిమాకి సరికొత్త ట్రెండ్ ని కూడా క్రియేట్ చేసినట్టే. మైత్రి నిర్మాణ విలువలు, ఎడిటింగ్,  జి వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ ఇరుముడి కోసమే పుట్టినట్టుగా కుదిరాయి.  బలాలు    1 . రవితేజ, బేబీ నక్షత్ర పెర్ ఫార్మెన్సు  2 . సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్  3 . సెకండ్ హాఫ్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ లు  4 . యాక్షన్ సీక్వెన్స్  5 . ప్రీ క్లైమాక్స్  6 . క్లైమాక్స్   చివరిగా చెప్పుకోవాలంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నివర్గాల ప్రేక్షకులు చూసే  విధంగా తెరకెక్కిన ఎమోషనల్ బాండింగ్ జర్నీ ఇరుముడి. రేటింగ్ 3 /5                                                                                                             అరుణాచలం 
మాస్ మహారాజా రవితేజ నుంచి ఒక సాలిడ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ లోటుని తీరుస్తూ నేడు గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ సునామీ సృష్టిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న ఒకే ఒక్క మాట.. "ఇది రవితేజకు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్". సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రతీ సీన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే 'మల్లెపూల పల్లకి' పాట థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. ఆ పాట స్క్రీన్ మీద ప్లే అవుతుంటే ప్రేక్షకులు సీట్లలో అసలు కూర్చోలేకపోతున్నారు. థియేటర్లన్నీ ఒక్కసారిగా ఊగిపోతున్నాయి. కొందరు ఏకంగా థియేటర్లలో హారతులు ఇస్తుండగా, మరికొందరు భజనలు చేస్తున్నారు. కొందరైతే ఉత్సాహాన్ని ఆపుకోలేక స్క్రీన్ ముందుకు వెళ్ళి స్టెప్పులేస్తున్నారు. చాలారోజుల తర్వాత థియేటర్లు జాతరను తలపిస్తున్నాయి. ఒక మాస్ హీరో పవర్‌ఫుల్ కథతో, హై-వోల్టేజ్ ఎమోషన్‌తో వస్తే థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో 'ఇరుముడి' మరోసారి నిరూపించింది. రవితేజ యాక్టింగ్, ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' పాట ఇచ్చే గూస్‌బంప్స్ స్టఫ్.. ఖచ్చితంగా థియేటర్లో ఆస్వాదించాల్సిందే.       Irumudi Movie, Mallepula Pallaki Song, Ravi Teja, Shiva Nirvana  
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద రికార్డు బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. బుక్‌మైషోలో గంటకి ఏకంగా 27 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ నటన, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, ఎమోషనల్ కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ టైమ్‌లో ఒక పవర్ ఫుల్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాకి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం చూడలేదు. అసలు గంటకి 27.64K+ టికెట్స్ బుక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం ఒక బుకింగ్ నంబర్ మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న నమ్మకం, క్రేజ్. మొదటి షో సమయానికే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంది, పైగా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిని బట్టి చుస్తే, 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఈ సినిమాకి ఇంతటి భారీ హైప్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. మొదటిది, మన మాస్ మహారాజా రవితేజ యాక్టింగ్. ఎక్కువగా మాస్ సినిమాలతో అలరించే రవితేజ, ఈసారి రూట్ మార్చారు. 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి ఎమోషనల్ బ్లాక్‌బస్టర్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ అనగానే అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి మొదలైంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. రవితేజను ఒక విభిన్నమైన, మనసుకి హత్తుకునే రోల్‌లో చూపించడంలో శివ నిర్వాణ వంద శాతం సక్సెస్ అయ్యారని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. రెండోది, సినిమాలోని ఎమోషనల్ కంటెంట్, పెరెంటింగ్ కాన్సెప్ట్. తండ్రీకూతుళ్ల అనుబంధం, భక్తి, సొసైటీకి అవసరమైన ఒక పవర్ ఫుల్ మెసేజ్‌ని చాలా ఎంగేజింగ్‌గా చూపెట్టారు. త్రినాథ్ గా రవితేజ నటన, చిన్నారి బేబీ నక్షత్ర యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఆడపిల్ల తండ్రి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. మూడోది, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్. 'మల్లెపూల పల్లకి' పాట మొదలుకొని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు సినిమా ఎమోషన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లాయి. అంతేకాకుండా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్‌గా ఉన్నాయి. ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్, ఇంకోవైపు మాస్ ఆడియన్స్.. ఇద్దరినీ థియేటర్లకు రప్పించడంలో 'ఇరుముడి' సక్సెస్ అయింది. ఫస్ట్ షోలు, సెకండ్ షోలు, మార్నింగ్ షోలు అనే తేడా లేకుండా బుక్‌మైషోలో ఓ రేంజ్ లో బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద రవితేజ కెరీర్‌లోనే ఇది ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలవబోతోంది. సరైన కంటెంట్ పడితే రవితేజ బాక్సాఫీస్ పవర్ ఎలా ఉంటుందో 'ఇరుముడి' మరోసారి నిరూపిస్తోంది.       Irumudi Movie, Bookings, Ravi Teja, Shiva Nirvana  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ ప్రతీ చిన్న వార్త నెట్టింట సంచలనమే సృష్టిస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అసలు సందీప్, దీపికా మధ్య ఏం జరిగింది? ఆమెను ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పించారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ తాజాగా ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా సంచలన విషయాలు బయటపెట్టారు. 'స్పిరిట్' నుంచి దీపికా పదుకొనేను తీసేయడంపై ఇన్నాళ్లూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కానీ, రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత, సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి షాకింగ్ నిజాలు వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ ఏదైనా ఒక సినిమా అనుకున్నారంటే.. పాత్రల విషయంలో ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్పిరిట్' కథ రాసుకుంటున్న సమయంలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఆయన మొదట అనుకున్నది దీపికా పదుకొనేనే. సుమారు సంవత్సరంన్నర పాటు సందీప్, దీపికా ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్‌లో ట్రావెల్ చేశారు. ఆమె టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే అంత సమయం కేటాయించారు. అయితే, ఆ సమయానికి దీపికా నటించిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డు హిట్లుగా నిలిచాయి. దాంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ హిట్ల తర్వాత దీపికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని ప్రణయ్ రెడ్డి తెలిపారు. కేవలం భారీ రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా.. సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం ప్రాఫిట్ షేర్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసిందట. దాంతో పాటు షూటింగ్ డేట్స్, రోజువారీ కాల్షీట్ టైమింగ్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కానని కండీషన్స్ పెట్టింది. సరే, ఒక స్టార్ హీరోయిన్ అంత డిమాండ్ చేసినా బిజినెస్ పరంగా ఓకే అనుకోవచ్చు. కానీ, అసలు సమస్య అక్కడ రాలేదు. కథా చర్చల సమయంలో సందీప్ రెడ్డి సీక్రెట్ గా ఉంచాలనుకున్న కొన్ని కీలకమైన ప్రాజెక్ట్ డీటైల్స్‌ను దీపికా కావాలనే బయటకు లీక్ చేయించిందట. ఒక సినిమా విజయంలో ప్రమోషన్ ప్లానింగ్, కంటెంట్ సీక్రెసీ ఎంత కీలకమో సందీప్ రెడ్డికి బాగా తెలుసు. అలాంటిది సినిమా మెయిన్ ప్లాన్స్ అన్నీ ఇలా లీక్ అవ్వడం చూసి వంగ బ్రదర్స్ తీవ్రంగా అప్సెట్ అయ్యారట. దీపికా ప్రవర్తన వల్ల తమ ప్లాన్స్ అన్నీ తారుమారవుతున్నాయని గ్రహించిన సందీప్ అండ్ ప్రణయ్.. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సినిమా ప్రొడక్షన్ డిసిప్లిన్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి పక్కన పెట్టేశారు. ఆ తర్వాతే వేరే ప్రత్యామ్నాయ హీరోయిన్ల వేట మొదలుపెట్టినట్లు ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు.       Prabhas, Spirit Movie, Sandeep Reddy Vanga, Deepika Padukone, Pranay Reddy Vanga  
మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఇరుముడి'. ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. "రవితేజ ఈజ్ బ్యాక్" అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  సినిమా మొదలవ్వడమే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ చుట్టూ నేచురల్‌గా నడుస్తుంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇందులో రవితేజ ఒక సిన్సియర్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపారు. తండ్రిగా ఆయన పండించిన ఎమోషన్స్ థియేటర్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తున్నాయి. ఆయన కూతురిగా నటించిన బేబీ నక్షత్ర యాక్టింగ్ అయితే ఈ సినిమాకే మెయిన్ హైలైట్ అని నెటిజన్లు పొగిడేస్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ స్లో అండ్ స్టెడీగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లోకి ఎంటర్ అవ్వగానే కథ మలుపు తిరుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఆ కీలకమైన ట్విస్ట్ థియేటర్లలో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' సీక్వెన్స్ థియేటర్లను షేక్ చేస్తోందట. మాస్ ఆడియన్స్ కేరింతలు కొట్టేలా ఆ ఫైట్ బ్లాక్‌ను డిజైన్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లిందట. డైలాగ్ కింగ్ సాయికుమార్ పవర్‌ఫుల్ డైలాగ్స్, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్ పాత్రలు కథకు మరింత బలాన్నిచ్చాయి. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్యను ఎంచుకుని, దానికి ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి శివ నిర్వాణ ఈ చిత్రాన్ని మలిచిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ట్విట్టర్‌లో రివ్యూవర్స్ మాటల్లో చెప్పాలంటే.. "ఇరుముడి ఒక పవర్‌ఫుల్ అండ్ హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ థ్రిల్లర్". కొన్ని చోట్ల  రైటింగ్ కాస్త స్లో అయినప్పటికీ, క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం ఆ లోపాలను పూర్తిగా మరిపించేలా ఉన్నాయి. చాలా మంది ట్విట్టర్ రివ్యూవర్లు ఇది రవితేజకి కచ్చితంగా ఒక గ్రాండ్ కమ్‌బ్యాక్ మూవీ అని తేల్చిచెబుతున్నారు. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూలు చేసే సత్తా ఉన్న సినిమా అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 'ఇరుముడి' సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి షోకే ఆ అంచనాలు నిజమవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.       Irumudi Review, Ravi Teja, Shiva Nirvana  
Cast: Veda Jalandhar, Hari Munnangi, Manoj Aavula, Shashidhar Kotcharla Kota, Ravan Nitturu, Viswendar Reddy, Pawan Ramesh Crew: Cinematography by Saliganti Vijay Kumar Music by Smaran Sai Edited by Rohit Penumatsa Written & Directed by Ramana Reddy Soma Produced by Madhavi Reddy Soma   Ameer Log arrives in theaters promising an authentic story about Hyderabad's youth. With good buzz from its promotions and premieres, let's discuss how the movie fares.   Plot: Srinu (Hari Munnangi), Rafiq (Manoj Aavula), and Mallesh (Shashidhar Kotcharla Kota) are childhood friends from an Old City basti. Though jobless and wandering aimlessly, they are innocent and good-hearted. Geetha (Veda Jalandhar), a software employee living in their area, is like a caring older sister to them.  Geetha is in love with her team leader Ravi (Ravan Nitturu). However, when Ravi does a major injustice to the three friends, Geetha breaks up with him. Why did Ravi wrong these jobless youths, and how do they deal with it? Watch the movie to find out.   Analysis: Even though the core story is simple, the movie runs smoothly with an engaging screenplay that never feels boring. The body language and dialogues of the characters feel incredibly natural. The first half easily pulls you into their world, highlighted by great character introductions, authentic gully boy moments, and fun cricket sequences.  The interval and second half take a compelling turn, though the main conflict where the friends revolt against Ravi could have been presented stronger. The pre-climax and climax are handled well. The performances are a major highlight. Newcomers Hari, Manoj, and Shashidhar perfectly justify their roles, acting with the ease of seasoned professionals. Veda delivers a decent performance as Geetha, while the supporting cast does well within their limits.  Director Ramana Reddy Soma succeeds well in his execution, though he could have focused a bit more on dialogues and entertainment. The editing is crisp and a big plus. While the production values are basic, the music and songs feel remarkably fresh and elevate the film.   Positives: Lead actors' performances Engaging screenplay Fresh songs Direction Negatives: Underutilized scope for entertainment Conflict establishment could be stronger Basic production and cinematography values   Bottomline: A simple, honest, and decently engaging tale of innocent Hyderabad basti boys.   Rating: 2.75/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.      
    -సినిమా పేరు: అమీర్ లోగ్ -న‌టీన‌టులు: వేద జలంధర్, హరి మున్నంగి, మనోజ్ ఆవుల, శశిధర్ కొచ్చర్ల కోట, రావణ్ నిట్టూరు, -విశ్వేందర్ రెడ్డి, పవన్ రమేష్ తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: సాలిగంటి విజయ్ కుమార్  -ఎడిటింగ్: రోహిత్ పెనుమత్స  -మ్యూజిక్: స్మరన్ సాయి  -నిర్మాత‌: మాధవి రెడ్డి సోమ -బ్యానర్ : అవాళ్ నెంబర్ ప్రొడక్షన్స్  -రచన,దర్శకత్వం: రమణా రెడ్డి సోమ  -రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026  హైదరాబాద్ పోరగాళ్ల కథ అంటు 'అమీర్ లోగ్' థియేటర్స్ లోకి వచ్చేసింది. రిలీజ్ డేట్ ఇరవై ఒకటి అయినా, ప్రమోషన్స్ తో వచ్చిన క్రేజ్ తో ప్రీమియర్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ శ్రీను( హరి మున్నంగి), రఫీక్(మనోజ్ ఆవుల), మల్లేష్( శశిధర్ కొచ్చర్ల కోట) చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక బస్తీ వాళ్ళ అడ్డా. ముగ్గురు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా కావడంతో పాటు పని పాట లేకుండా తిరుగుతుంటారు. కానీ అమాయకత్వం, మంచితనం ఆ ముగ్గురి సొంతం. సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే గీత(వేద జలంధర్) ఆ ముగ్గురికి ఆత్మీయురాలు లాంటిది. తమ బస్తీలోనే ఉండే గీతని అక్క అని పిలుస్తుండటంతో పాటు తమ కష్ట సుఖాలని పంచుకుంటూ ఉంటారు. గీత తన ఆఫీస్ లోనే పని చేసే టీం లీడర్ రవి(రావణ్ నిట్టూరు) ని ప్రేమిస్తూ ఉంటుంది. రవి వల్ల శ్రీను, రఫీక్, మల్లేష్ కి అన్యాయం జరుగుతుంది. దీంతో రవికి గీత బ్రేక్ అప్ చెప్తుంది. జులాయిగా తిరిగే శ్రీను, రఫీక్, మల్లేష్ కి రవి అన్యాయం చేయడం ఏంటి? అసలు ఆ ముగ్గురి స్నేహితుల కథ మొత్తం ఏంటి? వాళ్ళ జీవితంలో ఎవరెవరు ఉన్నారన్నదే అమీర్ లోగ్.  ఎనాలసిస్   కథలో గొప్పతనం లేకపోయినా ఎక్కడ ఎలాంటి హడావిడి లేకుండా మంచి కథనంతో మూవీ చివరి వరకు బోర్ కొట్టకుండా సాగింది. క్యారక్టర్ ల యొక్క మాటలు, బాడీ లాంగ్వేజ్ మనకి తెలిసిన వాళ్ళు స్క్రీన్ పై ఉన్నారా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే శ్రీను, రఫీక్, మల్లేష్ ల ఇంట్రడక్షన్ సీన్స్ బాగున్నాయి. దీంతో మనకి తెలియకుండానే అమీర్ లోగ్ లో లీనమవుతాం. చాచా( విశ్వేందర్ రెడ్డి) వచ్చిన సీన్స్ బాగుండటంతో పాటు గల్లీ బస్తీలలో ఉన్న పోరగాళ్ళు ఎలా ఉంటారో అలాగే వచ్చిన సీన్స్ హైలెట్. క్రికెట్ గేమ్  సీన్స్ కూడా బాగా వచ్చాయి. ముఖ్యంగా శ్రీను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత రఫీక్, మల్లేష్ లు బోర్ కొడుతుందని శ్రీనుకి ఫోన్ చేస్తే మీరు కూడా ఉద్యోగం చుసుకోండిరా అనే సన్నివేశం, డైలాగ్స్ బాగున్నాయి. కాకపోతే ఈ ఎపిసోడ్ ని ఇంకాస్త రన్ టైం పెంచి బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ఇంటర్వెల్ సీన్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఆ ముగ్గురి జీవితం గీత వల్ల మరో వైపు టర్న్ అవ్వడం, ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ బాగున్నాయి. కాకపోతే ఫ్రాంచైజ్ ని గీత లవర్ రవి వేరే వాళ్ళకి అమ్మేయాలని నిర్ణయించుకున్నప్పుడు శ్రీను ,రఫీక్, మల్లేష్ లు రవికి ఎదురు తిరగడం చూపించాల్సింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. నటీనటులు సాంకేతిక నిపుణల పనితీరు హరి మున్నంగి, మనోజ్ ఆవుల, శశిధర్ కొచ్చర్ల కోట ముగ్గురు కొత్తవాళ్ళైనా సరే తమ క్యారక్టర్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేసారు. డెబ్యూ అయినా సరే  ఎంతో  అనుభవమున్న వారిలా నటించారని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గీత క్యారక్టర్ లో  వేద జలంధర్ నటనలో మెరుపులు లేకపోయినా ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసింది. మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, పవన్ రమేష్ కూడా క్యారక్టర్ పరిధి మేరకు నటించి మెప్పించారు. రమణా రెడ్డి సోమ  దర్శకుడిగా, రైటర్ గా  కొంత మేర సక్సెస్ అయ్యాడు. కాకపోతే డైలాగ్స్ , ఎంటర్ టైన్ మెంట్  విషయంలో ఇంకొంచం కేర్ తీసుకోవాల్సింది. ఫొటోగ్రఫీ విషయంలో కూడా అంతే.  ఎడిటింగ్  ప్లస్ పాయింట్. ఇలాంటి చిత్రాలకి నిర్మాణ విలువలు కనపడవు. సాంగ్స్  కొత్తగా, ఫ్రెష్ గా ఒక రేంజ్ లో ఉన్నాయి. బలాలు  1 .నటీనటుల పెర్ ఫార్మెన్స్  2 . కథనం 3 . సాంగ్స్  4 . డైరెక్షన్  బలహీనతలు  1 .ఎంటర్ టైన్ మెంట్ కి అవకాశం ఉండి కూడా బాగా ఎస్టాబ్లిష్ చెయ్యకపోవడం  చివరిగా చెప్పాలంటే మనసులో ఎలాంటి కల్మషం లేని పక్కా హైదరాబాదీ బస్తీ పోరగాళ్ళు బోర్ కొట్టించకుండా ఉండటంలో ఒక మాదిరిగానే సక్సెస్ అయ్యారు   రేటింగ్ 2 .75 /5                                                                                   అరుణాచలం   
మన జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలకు కారణం పెద్ద గొడవలు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు. కొన్నిసార్లు ఇతరులు చెప్పిన మాటలను నమ్మడం, ఒకరి గురించి మరొకరికి చెప్పడం, అపార్థాలు కలిగించడం కూడా కుటుంబాల్లో, స్నేహాల్లో, ఉద్యోగ సంబంధాల్లో సమస్యలకు దారితీస్తాయి. వీటినే సాధారణంగా “చెప్పుడు మాటలు” అని అంటుంటాం. అయితే ప్రతి సలహా చెప్పుడు మాట కాదు. మన మంచిని కోరుతూ చెప్పే సలహా వేరు. ఇద్దరి మధ్య అనుమానం, కోపం లేదా విభేదాలు పెంచే ఉద్దేశంతో చెప్పే మాటలు వేరు. ఈ తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. చెప్పుడు మాటలు అంటే.. ఒక వ్యక్తి గురించి మరొకరి వద్ద ప్రతికూలంగా చెప్పడం, ఒకరి మాటలను మరొకరికి వక్రీకరించి చెప్పడం, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి అపార్థం కలిగించడం లేదా ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతినేలా మాట్లాడటాన్ని సాధారణంగా చెప్పుడు మాటలు అంటారు. చెప్పుడు మాటల వల్ల జరిగే నష్టాలు.. భార్యాభర్తల మధ్య అనుమానాలు పెరుగుతాయి.. కుటుంబ వ్యవహారాల్లో మూడో వ్యక్తి మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే భార్యాభర్తల మధ్య మూడవ మనిషి ప్రమేయం ఉండకూడదని చెబుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది.. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులు-పిల్లలు లేదా ఇతర బంధువుల మధ్య ఒకరి గురించి మరొకరు చెప్పే మాటలు నమ్మడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. ఇది బంధాల మీద నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. స్నేహాలు చెడిపోవచ్చు.. స్నేహితుల మధ్య చెప్పుడు మాటలు సాగితే అది అనుమానాలకు దారితీస్తాయి. ఎవరైనా ఏదైనా విషయం గురించి చెప్పినప్పుడు..   ఆ విషయాన్ని తెలుసుకోకుండానే స్పందిస్తే మంచి స్నేహం కూడా దెబ్బతినవచ్చు. నమ్మకం కోల్పోయే ప్రమాదం.. చెప్పుడు మాటలు పదేపదే వినడం వల్ల మన చుట్టూ ఉన్నవారిపై నమ్మకం తగ్గుతుంది. కొన్నిసార్లు నిజాయితీగా మాట్లాడే వ్యక్తిపైనా అనుమానం కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.. ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడుతున్నారని పదేపదే వింటే కోపం, బాధ, ఆందోళన వంటి భావాలు కలగవచ్చు. దాంతో మనశ్శాంతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే చోట సమస్యలు రావచ్చు.. ఉద్యోగ చేసే ప్రదేశంలో ఒక ఉద్యోగి గురించి మరొకరికి తప్పుగా చెప్పడం వల్ల సహోద్యోగుల మధ్య విభేదాలు ఏర్పడవచ్చు. టీమ్‌లో పరస్పర నమ్మకం తగ్గే ప్రమాదం ఉంటుంది.  చిన్న సమస్యలు పెద్ద గొడవలుగా మారవచ్చు.. చిన్న విషయాన్ని ఒకరి దగ్గర నుంచి మరొకరికి చెప్పేటప్పుడు మాటలు మారిపోవచ్చు. చివరకు అసలు విషయం కంటే పూర్తిగా భిన్నమైన అర్థం ఏర్పడి గొడవకు దారితీయవచ్చు. ఎవరైనా చెప్పుడు మాటలు చెబుతున్నారని ఎలా తెలుసుకోవాలి? ఒక్క లక్షణాన్ని చూసి ఎవరినైనా చెప్పుడు మాటలు చెప్పేవారు అని నిర్ణయించలేం. అయితే ప్రవర్తనను బట్టి కొన్ని గ్రహించవచ్చు. ప్రతి వ్యక్తి గురించి ఏదో ఒక నెగిటివ్ విషయం చెబుతుంటారు మీ దగ్గర ఒకరి గురించి చెబుతారు. మరో వ్యక్తి దగ్గర మీ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారని తెలుస్తే జాగ్రత్తగా ఉండాలి.  “ఇది ఎవరికీ చెప్పొద్దు” అని తరచుగా చెబుతుంటారు వ్యక్తిగత విషయాలను రహస్యంగా చెప్పడం తప్పు కాదు. కానీ ప్రతి విషయాన్నీ “రహస్య సమాచారం” పేరుతో ఒకరి నుంచి మరొకరికి తీసుకెళ్లే అలవాటు ఉంటే అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆధారాలు లేకుండా అనుమానాలు కలిగిస్తారు. ఇతరుల గురించి ఆధారాలు ఏమీ లేకపోయినా ఊరికే అనుమానంతో ఊహగానాలు సృష్టించి చెబుతుంటారు.  ఇలా  స్పష్టమైన ఆధారం లేకుండా మాటలు చెప్పడం చెప్పుడు మాటలకు సంకేతం కావచ్చు.  ఒకరి మాటలను మరొకరికి వేరే విధంగా చెబుతారు ఒక వ్యక్తి చెప్పిన మాటను యథాతథంగా చెప్పకుండా, తమకు నచ్చిన విధంగా మార్చి చెప్పడం వల్ల అపార్థాలు ఏర్పడతాయి.  ఇతరుల గొడవల గురించి తెలుసుకోవడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు.  ఎవరికి ఎవరితో గొడవ, ఇంట్లో ఏం జరిగింది, ఎవరు ఎవరితో మాట్లాడటం లేదు వంటి విషయాలను పదేపదే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే కొంత జాగ్రత్త అవసరం.                                                                                                                                                   *రూపశ్రీ.
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఆహారాన్ని ఎలా తాగాలి? నీళ్లను ఎలా తినాలి? అని సందేహం రావచ్చు. అయితే ఈ మాటకు అర్థం అక్షరాలా తీసుకోవడం కాదు. ఆహారం, నీరు తీసుకునే విధానంలో జాగ్రత్త అవసరమనే ఆరోగ్య సూత్రం ఇందులో దాగి ఉంది.  ఆహారాన్ని “తాగాలి” అంటే.. ఆహారాన్ని తినేటప్పుడు తొందరగా మింగేయకుండా, బాగా నమిలి, నోటిలోనే మెత్తగా చేసి, లాలాజలంతో కలిసేలా చేయాలి అన్నది ఈ మాటలోని ప్రధాన ఉద్దేశం. మన జీర్ణక్రియ నోటిలోనే ప్రారంభమవుతుంది. ఆహారాన్ని బాగా నమలడం వల్ల అది చిన్న ముక్కలుగా మారుతుంది. లాలాజలంలోని జీర్ణ ఎంజైములు ఆహారంపై పనిచేయడం ప్రారంభిస్తాయి. దీంతో కడుపుపై పడే జీర్ణక్రియ భారం కొంత తగ్గుతుంది. అందుకే ఆహారాన్ని తాగాలి అని చెప్పడం ద్వారా ఆహారాన్ని ద్రవంలా మెత్తగా అయ్యేంత వరకు నమిలి తర్వాత మింగాలి అనే మంచి అలవాటును సూచించారు. ఆహారాన్ని బాగా నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆహారాన్ని బాగా నమిలి తింటే..  ఆహారం చిన్న ముక్కలుగా మారుతుంది.  లాలాజలంతో బాగా కలుస్తుంది.  ఆహారాన్ని నెమ్మదిగా తినే అలవాటు ఏర్పడుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.  అతిగా తినే అవకాశం తగ్గుతుంది.  జీర్ణక్రియకు సహకారం అందుతుంది. నీళ్లను తినాలి అంటే.. నీటిని నిజంగానే తినాలని దీని అర్థం కాదు. నీటిని కూడా నెమ్మదిగా, చిన్న చిన్న మోతాదుల్లో తాగాలిఅనే సూచనగా ఈ మాటను అర్థం చేసుకోవాలి. చాలామంది దాహం వేసినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో నీరు తాగేస్తుంటారు. కానీ సాధారణంగా దాహం తీర్చుకోవడానికి నీటిని నెమ్మదిగా, సౌకర్యంగా తాగడం మంచి అలవాటు. నీళ్లను తినాలి అనే పదప్రయోగం ద్వారా నీటిని కూడా గౌరవంగా, ఆచితూచి తీసుకోవాలని మన పెద్దలు చెప్పినట్లు అర్థం చేసుకోవాలి.                                                                                                                                                   *రూపశ్రీ.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఆహారాన్ని ఎలా తాగాలి? నీళ్లను ఎలా తినాలి? అని సందేహం రావచ్చు. అయితే ఈ మాటకు అర్థం అక్షరాలా తీసుకోవడం కాదు. ఆహారం, నీరు తీసుకునే విధానంలో జాగ్రత్త అవసరమనే ఆరోగ్య సూత్రం ఇందులో దాగి ఉంది.  ఆహారాన్ని “తాగాలి” అంటే.. ఆహారాన్ని తినేటప్పుడు తొందరగా మింగేయకుండా, బాగా నమిలి, నోటిలోనే మెత్తగా చేసి, లాలాజలంతో కలిసేలా చేయాలి అన్నది ఈ మాటలోని ప్రధాన ఉద్దేశం. మన జీర్ణక్రియ నోటిలోనే ప్రారంభమవుతుంది. ఆహారాన్ని బాగా నమలడం వల్ల అది చిన్న ముక్కలుగా మారుతుంది. లాలాజలంలోని జీర్ణ ఎంజైములు ఆహారంపై పనిచేయడం ప్రారంభిస్తాయి. దీంతో కడుపుపై పడే జీర్ణక్రియ భారం కొంత తగ్గుతుంది. అందుకే ఆహారాన్ని తాగాలి అని చెప్పడం ద్వారా ఆహారాన్ని ద్రవంలా మెత్తగా అయ్యేంత వరకు నమిలి తర్వాత మింగాలి అనే మంచి అలవాటును సూచించారు. ఆహారాన్ని బాగా నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆహారాన్ని బాగా నమిలి తింటే..  ఆహారం చిన్న ముక్కలుగా మారుతుంది.  లాలాజలంతో బాగా కలుస్తుంది.  ఆహారాన్ని నెమ్మదిగా తినే అలవాటు ఏర్పడుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.  అతిగా తినే అవకాశం తగ్గుతుంది.  జీర్ణక్రియకు సహకారం అందుతుంది. నీళ్లను తినాలి అంటే.. నీటిని నిజంగానే తినాలని దీని అర్థం కాదు. నీటిని కూడా నెమ్మదిగా, చిన్న చిన్న మోతాదుల్లో తాగాలిఅనే సూచనగా ఈ మాటను అర్థం చేసుకోవాలి. చాలామంది దాహం వేసినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో నీరు తాగేస్తుంటారు. కానీ సాధారణంగా దాహం తీర్చుకోవడానికి నీటిని నెమ్మదిగా, సౌకర్యంగా తాగడం మంచి అలవాటు. నీళ్లను తినాలి అనే పదప్రయోగం ద్వారా నీటిని కూడా గౌరవంగా, ఆచితూచి తీసుకోవాలని మన పెద్దలు చెప్పినట్లు అర్థం చేసుకోవాలి.                                                                                                                                                   *రూపశ్రీ.
గ్యాస్, ఎసిడిటీ, ఛాతిలో మంట, తరచూ తేన్పులు రావడం వంటి సమస్యలను చాలామంది సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇవే లక్షణాలు తరచూ లేదా ఎక్కువ కాలం కొనసాగితే GERD (Gastroesophageal Reflux Disease) వంటి సమస్యకు సంకేతం కావచ్చు. దీర్ఘకాలంగా ఉండే యాసిడ్ రిఫ్లక్స్‌ను నిర్లక్ష్యం చేస్తే అన్నవాహికపై ప్రభావం పడే అవకాశం ఉందా? GERDకు Esophageal Cancer కు ఏమైనా సంబంధం ఉందా? ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలి? ఈ వీడియోలో గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రాకేష్ ఈ విషయాలను సులభంగా వివరిస్తున్నారు. గ్యాస్, ఎసిడిటీ, GERD మధ్య తేడా ఏమిటి? దీర్ఘకాలిక లక్షణాలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? ఎలాంటి హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గ్యాస్ లేదా ఎసిడిటీ అని అనుకుని మీ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. తరచూ లేదా దీర్ఘకాలంగా లక్షణాలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. గమనిక: ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇందులోని సమాచారం వైద్యుల వ్యక్తిగత వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు నిరంతరంగా లేదా తీవ్రమైన లక్షణాలు ఉంటే అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)