Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
posted on: Aug 20, 2026 4:26PM
.webp)
తెలంగాణ అధికార కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అంటే చెప్పలేకపోయినా.. ఏదో జరుగుతోందని మాత్రం అందరికీ అర్ధమౌతోంది. రాష్ట్ర పార్టీలోఅంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా నేతలు గళమెత్తుతున్నారు. విమర్శల స్థాయి, ఆరోపణల తీరు ఒకింత తీవ్రంగానే ఉన్నాయి.
స్వయంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి పదవి దక్కగానే రేవంత్‌కు అహంకారం పెరిగిందని, కళ్ళు నెత్తికెక్కాయా అంటూ ఆమె ఘాటుగా విమర్శించడం, అలాగే సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం రేవంత్ వనపర్తి టికెట్ తనకు ఇవ్వకుండా అమ్ముకున్నారు అని వ్యాఖ్యానించడం చూస్తుంటే.. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి రగులుతోందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విషయంలో.. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు వీవీ రావు మాట్లాడారు. సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్ ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
తమ నియోజకవర్గాల్లో పనులు కావడం లేదని, మంత్రులు, సలహాదారులు తమను కనీసం లెక్కచేయడం లేదని వారు బాహాటంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలు రేవంత్ పై అసంతృప్తి పెచ్చరిల్లుతోందనడానికి నిదర్శనమన్నారు. చిన్నారెడ్డి అయితే.. తనకు వనపర్తి టికెట్ ఇవ్వమని సోనియా గాంధీ స్వయంగా చెప్పినా రేవంత్ ఆ టికెట్ తనకు ఇవ్వకుండా అమ్ముకున్నారని విమర్శించిన విషయాన్నీ, అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రేవంత్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
కాంగ్రెస్‌లో పాత నేతలు వర్సెస్ వలస నేతల మధ్య సాగుతున్న ఈ సమరం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే పార్టీలో ఉందని వీవీరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత ఈ అంతర్గత తిరుగుబాటుపై ఎలా స్పందింస్తారు? ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉందన్నారు.
ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ తీరు పట్లా, ఆయనపై రాష్ట్ర నేతల్లో వ్యక్తం అవుతున్న అసంతృప్తి పట్లా స్పందించకుండా మౌనంగా ఉండటం చూస్తుంటే.. ముందస్తు ఎన్నికల అంశాన్నీ కొట్టిపారేయలేని పరిస్థితి ఉందని వీవీరావు అన్నారు.
Konda Sushmitha Comments, Revanth Reddy Konda Sushmitha, Telangana Congress Politics, Pocharam, Chinnareddy





