Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వల్లభనేని వంశీ.. ఎలా ఉండేవారు.. ఎలా అయిపోయారు.!
posted on: Aug 21, 2026 11:17AM

గన్నవరం నియోజకవర్గంలో తిరుగులేని నేతగా చక్రం తిప్పిన వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు ఆయన ప్రత్యర్థులకు సైతం జాలికలిగేలా మారిపోయింది. రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పంచన చేరిన తరువాత వల్లభనేని వంశీ రాజకీయ జీవితం మెట్టుమెట్టుగా దిగజారుతూ వచ్చచింది. ఇప్పుడు ఆయన పరిస్ధితి వైసీపీలో ఓ సామాన్య కార్యకర్తతో సమానంగా మారిపోయింది.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కన్నూమిన్నూ గానకుండా వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ చట్టపరంగానూ, రాజకీయంగానూ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. రెండో సారి అంటే 2019 ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం తెలుగుదేం వీడి వైసీపీ పంచన చేరారు. రాజకీయాలలో ఓ నాయకుడు పార్టీ మారడం సాధారణమే అయినా, ఆయన పార్టీ మారిత తరువాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే.. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి సాక్షులను బెదిరించడం, కిడ్నాప్ ఆరోపణలు వంటి పలు కేసుల్లో ఆయన జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక రాజకీయంగానూ ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ వంశీకి కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేట్ వద్దకు కూడా అనుమతించని పరిస్థితి ఉంది. ఇటీవలి కాలంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లిన సమయంలో వంశీ ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన ఎదురుచూడాల్సిన వచ్చిన తీరు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యింది. ఒకప్పుడు గన్నవరం నియోజకవర్గాన్ని శాసించిన వల్లభనేని వంశీకి ఇప్పుడు అక్కడ ఇసుమంతైనా గుర్తింపు లభించడంలేదు. ఆయనపై నమోదైన వరుస కేసులు, అరెస్టుల భయంతో ముఖ్య అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వంశీకి దూరంగా జరుగుతున్నారు.
తాజాగా జగన్ కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన సందర్భంగా వంశీ ఒక సాధారణ కార్యకర్తలా బారికేడ్ల వెనుక నిలబడి తోసుకుంటూ.. అధినేత చూపుల్లో ఒక్కసారి పడేందుకు తాపత్రేయపడుతున్న దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇంతగా ప్రాధాన్యత కోల్పోయి, అవమానాలు ఎదుర్కొంటూ కూడా వైసీపీలో వంశీ ఎందుకు కొనసాగుతున్నారు అన్న ప్రశ్నకు వంశీకి వైసీపీ తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఉండటమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీలోకి ఫిరాయించిన తర్వాత ఆయన పరువు, ప్రతిష్టలతో పాటు రాజకీయ భవిష్యత్తును కూడా కోల్పోయారంటున్నారు. అన్ని వైపులా తలుపులు మూసుకు పోవడంతో వంశీకి వైసీపీలోనే కొనసాగాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Jagan ignoe Vallabhaneni Vamsi, YCP, Gannavaram Politics, YSJagan, AP Politics, TeluguOne






