LATEST NEWS
తెలంగాణ రాజకీయాల్లో   భారత రాష్ట్ర సమితి  అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ గత నెల 25న టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె తన కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాలలోనే కాదు, ఏపీ రాజకీయాలలో కూడా పెను సంచలనం సృష్టించారు. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా కల్వకుంట్ల కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రిని మరమనిషి అన్నారు, గుంటనక్కల చేతిలో బందీ అని విమర్శించారు. ఈ పరిణామం సహజంగానే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ లో పెను ప్రకంపనలకు కారణమైంది.  అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది.   టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ   ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మధ్య ఒక అవగాహన ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వారిరువురూ ఒకరికొకరు అందించుకున్న సహకారం సంగతి తెలిసిందే.  ఆ సహకారం, స్నేహం ఇప్పుడు.. అంటే రెండు పార్టీలూ కూడా వాటి వాటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతోందని పరిశీలకులు సోదాహరణంగా ఉదహరి స్తున్నారు. అటువంటిది.. ఇప్పుడు కవిత సొంతంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ సందర్భంగా తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. బీఆర్ఎస్ ను ఆత్మ లేని పార్టీగా అభివర్ణించారు.  ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. కవితను విమర్శించ లేక, ఆమె విమర్శలను తిప్పి కొట్టలేక నాయకత్వం మౌనాన్ని ఆశ్రయిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు ఒక బలమైన మిత్రుడి అండ లేకుండా చేసిందంటున్నారు పరిశీలకులు.   అదే సమయంలో..   టీడీపీ, జనసేన పార్టీలు.. కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన విభేదాలను ఉదహరిస్తూ..  కుటుంబ రాజకీయాల వల్ల పార్టీలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి కవిత ఉదంతాన్ని టీడీపీ-జనసేన శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అదే తెలంగాణలో కవిత తిరుగుబాటును చూపిస్తూ, ఏపీలో కూడా వైసీపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇదొక సంకేతమని   ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అధికారం ఒకే కుటుంబం చుట్టూ తిరిగితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను తమ ప్రసంగాల్లో వాడుకుంటున్నారు. జగన్ కూడాతన సొంత తల్లి, చెల్లిని దూరం పెట్టి అధికారం కోసం పాకులాడిన తీరును ఎత్తి చూపుతూ.. కవిత తన తండ్రికి అధికారంపై అపేక్ష మమకారాన్ని దూరం చేసిందని విమర్శించడాన్ని ప్రస్తావిస్తున్నారు.  ఇక పోతే.. తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడటమే తన లక్ష్యమని కవిత చెబుతున్నప్పటికీ..  ఆమె అడుగులు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే, గతంలో బీఆర్ఎస్ నుంచి వైసీపీకి  అందిన, ప్రస్తుతం అందుతున్న, నైతిక సహకారం ఇకపై అందే అవకాశం వైసీపీకి ఉండదు.  ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగించుకోవడానికి సహాయపడుతుంది.    భవిష్యత్తులో కవిత పార్టీ వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, ఏపీలో మాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి సానుకూల పవనాలను ఇస్తోంది. పొరుగురాష్ట్రంలో మిత్రుడి  బలం తగ్గడం, అంతర్గత కలహాలతో బలహీనపడటం వంటివి వైసీపీకి రాబోయే కాలంలో  సవాళ్లను విసిరేలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలైన ఈ రాజకీయ తుపాను  ఏపీలో వైసీపీని బలహీనపరిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గత విడతలో జరిగిన పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో మే 2వ తేదీన (శనివారం) రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలపై ఈ ప్రభావం పడింది. మగ్రాహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, అలాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లోనూ తిరిగి ఓటింగ్ జరగనుంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక లేఖ రాసింది. గత నెల 29న జరిగిన రెండో దశ ఎన్నికల సమయంలో పలు చోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఓటర్లను అడ్డుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యంగా డైమండ్ హార్బర్ పరిధిలోని కొన్ని బూత్‌లలో బీజేపీ గుర్తుపై టేపులు అంటించి, ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయకుండా అడ్డుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. దీనిని 'డైమండ్ హార్బర్ మోడల్' అక్రమంగా ఆయన అభివర్ణించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ రీ-పోలింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బెంగాల్ ఎన్నికలు ఎప్పుడూ హింసాత్మక ఘటనలకు వేదికవుతుంటాయి. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం రీ-పోలింగ్ జరుగుతున్న కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజలకు చాటింపు ద్వారా ఓటింగ్ గురించి అవగాహన కల్పించాలని కూడా ఈసీ సూచించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ పరిధిలో ఈ అక్రమాల ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడటమే తమ బాధ్యతని ఎన్నికల యంత్రాంగం పేర్కొంటోంది. మే 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ లోపు ఈ 15 కేంద్రాల్లో జరిగే రీ-పోలింగ్ ఫలితాల సరళిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల తుది ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. మరి ఈ రీ-పోలింగ్ ప్రక్రియ ఎంతవరకు ప్రశాంతంగా ముగుస్తుందో వేచి చూడాలి.
ఇకపై  ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతా..  ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకుంటే వారు పద్దతి మార్చుకోవాలి... లేకపోతే వారికి ఇంకో ఛాన్స్ ఉండదు. ఇదీ తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు ముఖ్మమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్త్రాంగ్ వార్నింగ్.  పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకుచంద్రబాబు శుక్రవారం (మే 1)  కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించారు.  వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం సీఎం చంద్రబాబు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమావేశాల సందర్భంగా ఆ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.   మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  శుక్రవారం (మే1) నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అంతర్గత సర్వేల ద్వారా టీడీపీ అధినేత నివేదికలు తెప్పించుకుంటున్నారు. పనితీరు సరిగా లేని వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రజా క్షేత్రంలో ఉండాలంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలను కూడా నిర్వహించారు. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ఇక నుంచి నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు.  ఎమ్మెల్యే పనితీరు గురించి ఈ రోజు నుంచి సమావేశాల్లోనే ప్రజలను అడుగుతా. ప్రజలు అనుకూలంగా చేతులెత్తకపోతే ఎమ్మెల్యే తన పనితీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యేలు పనితీరును సరిదిద్దుకోకపోతే ప్రజల తరుఫున ఉంటాను కానీ.. ఎమ్మెల్యేల తరుఫున ఉండను. వారికి మళ్లీ ఛాన్స్ ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు థియేటర్ల దొరకడం ఒక ఎత్తైతే, రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం మరో పెద్ద సవాలుగా మారింది. ఈ విషయంపై తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు (Ravi Babu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రవిబాబు నటిస్తూ దర్శకత్వం వహించిన 'రేజర్' (Razor) సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆయన తెలుగువన్ (TeluguOne) కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో.. తమ సినిమా విడుదలతేదిపై రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) ఎలాంటి ప్రభావాన్ని చూపిందో తెలిపారు. మే 1 రిలీజ్ అనుకుంటే.. హడావుడి చేశారు! నిజానికి 'రేజర్' సినిమాను మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు రవిబాబు చెప్పారు. "అయితే, అదేదో పెద్ద సినిమా వస్తుంది అని చెప్పి హడావుడి చేశారు. ఈ పెద్ద సినిమాలన్నీ ఇంతే.. చెప్పిన డేట్ కి రావు పెట్టవు. మిగతా చిన్న సినిమాలన్నీ ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాయి." అని అన్నారు. ఏప్రిల్ 30న 'పెద్ది'ని విడుదల చేయాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఒకసారి వస్తుందని, ఒకసారి వాయిదా పడుతుందని ఇలా కొద్దిరోజుల పాటు తెగ వార్తలొచ్చాయి. ఈ గందరగోళం కారణంగానే 'రేజర్' రిలీజ్ డేట్ ను మార్చామని రవిబాబు చెప్పుకొచ్చారు.  అయితే 'రేజర్' కొత్త విడుదల తేదీని మే 8 గా ఎంచుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉందని రవిబాబు చెప్పారు. తన తండ్రి, దివంగత నటుడు చలపతి రావు పుట్టినరోజు మే 8. ఆయన జయంతి సందర్భంగా 'రేజర్'ను విడుదల చేస్తుండటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.  
వెబ్ సిరీస్ : బ్యాచ్ మేట్స్  నటీనటులు : సాయి శ్రీరామ్ వెంపరాల, సింధు రెడ్డి, గీర్వాణి రెడ్డి, ఆంథోని కార్తీక్, బిందు మాధవి తదితరులు సంగీతం : సాయి దేవా హర్ష ఛాయాగ్రహణం : సాయి తేజ కళ్ల ఎడిటింగ్ : రాగం సత్య నితేష్    నిర్మాతలు : సకమూరి నారాయణ స్వామి, నితిన్ సాయి చల్లాగుల్ల దర్శకుడు : శ్రీ హర్ష శెట్టి ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : జియో హాట్ స్టార్ కథ : హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సిద్దార్థ్(సాయి శ్రీరామ్ వెంపరాల), సామ్మి(సింధు రెడ్డి), మిల్కీ మహేష్(ఆంథోని కార్తీక్) బీటెక్ లో కొత్తగా జాయిన్ అవుతారు. అక్కడ వారికి అంతా కొత్తగా ఉంటుంది. ఇక అదే కాలేజీలో వారి క్లాస్ లో కొత్తగా గోల్డీ అనే అమ్మాయి వస్తుంది. తను ఆ ముగ్గురి గ్రూప్ తో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. అయితే కాలేజీలో ఉన్న ఒక పెద్ద సర్ కొడుకు ప్రెషర్స్ ని ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు. అది తెలియని మిల్కీ యాదవ్ నేరుగా అతని దగ్గరికే వెళ్ళి కాస్త ఎక్స్ ట్రాలు చేస్తాడు. ఆ తర్వాత ఆ ముగ్గురి కాలేజీ లైఫ్ ఎలా మారిపోయిందనేది మిగతా కథ.  విష్లేషణ:  నాలుగు ఎపిసోడ్ లతో ఈ సిరీస్ మొదలైంది. అయితే ఒక్కో ఎపిసోడ్ నిడివి ఇరవై నిమిషాలు మాత్రమే. ఈ సిరీస్ కథ చాలా సింపుల్. ముగ్గురు స్నేహితులు ఇంటర్ కాలేజీ పూర్తి చేసుకొని బీటెక్‌లో జాయిన్ కావడం.. అక్కడ వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేది పాయింట్. ఇది చాలా రొటీన్ అయినప్పటికి, యూత్‌ను ఎంగేజ్ చేయగల ఒక్క స్పార్క్ తగిలితే ఇలాంటి కథలకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది కానీ ఇందులో అలాంటిది ఏమీ లేదు.  ఇక ఈ వెబ్ సిరీస్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య ఉండే స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్, వారి మధ్య సాగే సీన్స్ ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కావు. ఈ సిరీస్ మొత్తంలో మిల్కీ మహేష్ పాత్ర చేసే కామెడీ కాస్త ఊరట. మిగతాదంతా డొల్ల. స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో నటించిన వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి స్ట్రాంగ్ డైలాగ్స్ , స్ట్రాంగ్ క్యారెక్టర్ డిజైన్ చేయాలి కానీ ఏదో మాములు సైడ్ యాక్టర్స్ ఎలాగో అలాగే వారి నటన ఉంటుంది. అందుకే ప్రేక్షకులకు కనెక్ట్ కాలేరు. మెయిన్ లీడ్ డబ్బింగ్, లిప్ సింకింగ్ కుదరలేదు. స్లో సీన్లు ఎక్కువగా ఉండటం వల్ల అవి ప్రేక్షకులను ఇర్రిటేట్ చేస్తుంది. సీనియర్స్-జూనియర్స్ మధ్య వచ్చే క్లాష్ సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. ఇక హీరో అండ్ గ్యాంగ్‌కు సీనియర్స్ ఇచ్చే టాస్క్ దానిని పూర్తి చేసే క్రమం కూడా ఆకట్టుకోదు. కాలేజీ సీన్స్ కొంతవరకు మాత్రమే వర్కవుట్ అయ్యాయి. ఫ్లాట్ కథను ఎంచుకోవడంతో ఆయన దానిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. కథలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోవడంతో ఈ సిరీస్ చాలా రొటీన్‌గా సాగుతుంది. ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త వహించాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా :  బ్యాచ్‌మేట్స్ ఒక బోరింగ్ కాలేజీ లైఫ్. జస్ట్ ఒకే. రేటింగ్ : 1.5 /5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  -సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మహేష్ పిక్స్  -ఆ దేశం వెళ్ళింది సరదా కోసం కాదా -బ్లాక్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది -పూర్తి డీటెయిల్స్ చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ఇటీవల ఫ్యామిలీతో కలిసి జర్మనీ(Germany)వెళ్లిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ పిక్స్ వైరల్ గా కూడా మారాయి. దీంతో అక్కడ్నుంచి రాగానే వారణాసి(Varanasi)షూట్ ని స్టార్ట్ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ మహేష్ వెళ్ళింది జర్మనీలో ఎంజాయ్ చేయడానికి కాదు.   అవును మహేష్ జర్మనీ వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి కాదు. వారణాసికి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఈ విషయం మహేష్ రీసెంట్ గా చేసిన పోస్ట్ లతో అర్ధమవుతుంది.ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటు వారణాసి కోసం సిద్దమవుతున్నట్టుగా క్యాప్షన్ ఉంచాడు. దీంతో మహేష్ తన స్టైల్లోనే జర్మనీకి వెళ్తుంది ఎంజాయ్ చేయడానికని   ఎవడికాడు కథలు అల్లుకుంటే ఎలా అన్నాయ్. అసలు నిజం ఇది అని చెప్పినట్లయింది.  మహేష్ వెంట తన  ఫిట్ నెస్, వెల్ నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కొనిగ్ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తుండటంతో అభిమానులు జోష్ లో ఉన్నారు. మహెష్ గతంలో కూడా జర్మనీ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేసిన విషయం తెలిసిందే. Also read: Harish Shankar: నెక్స్ట్ ఏంటి అన్నయ్య... అనౌన్స్ మెంట్ ఎప్పుడు  దర్శక ధీరుడు రాజమౌళి(ss Rajamouli)అమ్ముల పొది నుంచి వస్తున్న వారణాసి  2027 ఏప్రిల్ 7 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. తెలుగు సినిమానే కాదు, భారతీయ సినిమా కూడా ఇంతవరకు అడుగుపెట్టని ప్రపంచ లొకేషన్స్ లో వారణాసి ఎంట్రీ ఇవ్వబోతుంది.   
తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, భూమన అభినయ్ రెడ్డి (Bhumana Abhinay Reddy) చేపట్టిన ఒక నిరసన ర్యాలీ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. పెట్రోల్, డీజిల్ కొరతకు వ్యతిరేకంగా ఆయన వినూత్న రీతిలో నిరసన తెలపాలని భావించారు. అయితే, ఈ క్రమంలో ఆయన చేసిన పని జంతు ప్రేమికులను, ముఖ్యంగా ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్‌(Rashmi Gautam)ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తిరుపతిలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి ఒక ఎడ్లబండిపై ఆటోను ఉంచి, ఆ ఎడ్లబండిని ఎద్దులతో లాగించారు. భారీ బరువున్న ఆటోను మోయలేక ఎద్దులు పడుతున్న ఇబ్బందిని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నోరు లేని మూగ జీవాలను ఇలా హింసించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. యాంకర్ రష్మీ ఘాటు స్పందన జంతువుల హక్కుల కోసం ఎప్పుడూ గొంతు విప్పే యాంకర్ రష్మీ గౌతమ్, ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఆ ఎద్దు పడుతున్న వేదన కంటే మీరు వెయ్యి రెట్లు అధికంగా బాధపడాలి" అంటూ ఆమె భూమన అభినయ్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నిరసనల పేరుతో జంతువులను వాడుకోవడం క్రూరత్వమని ఆమె అభివర్ణించారు. అంతేకాకుండా, ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ 'PETA India' సంస్థను కూడా ఆమె ట్యాగ్ చేశారు. యాంకర్ రష్మీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.  పెరిగిన వ్యతిరేకత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికుల నుంచి భూమన అభినయ్ రెడ్డికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరసన తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కానీ ఇలా మూగ జీవాలను చిత్రహింసలకు గురిచేయడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా పలువురు నాయకులు ఇలాంటి విన్యాసాలు చేసి విమర్శల పాలైన సందర్భాలు ఉన్నాయి.   https://x.com/rashmigautam27/status/2049770747179221454
  కొంత మంది దర్శకుల సినీ జర్నీగురించి చెప్పుకోవడం స్టార్ చేస్తే చాలు నా ప్రతి అక్షరం పంచ్ లతో ఉండేలా చూడవా అని అక్షరమే అడిగే పరిస్థితి. అలాంటి  దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar). ఊహించని డైలాగ్స్, పంచ్ లకి బ్రాండ్ అంబాసిడర్. అందుకే భారీ అభిమాన ఘనాన్ని సంపాదించుకున్నాడు. మార్చి లో తన బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి  ఉస్తాద్ భగత్ సింగ్ గా వచ్చాడు. ప్రారంభంలో హిట్ సువాసనలతో కనపడిన ఉస్తాద్ తొలి రోజు ముగిసేసరికి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా హరీష్ శంకర్ అప్ కమింగ్ సినిమాల గురించి చర్చ జరుగుతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం  ప్రెజెంట్ హరీష్ శంకర్ నుంచి ఎలాంటి కొత్త చిత్రం ప్రకటన రాలేదు. కనీసం గాసిప్ గానైనా   ఏ హీరో పేరు వినపడటం లేదు. బాలకృష్ణతో మూవీ ఉండబోతోందనే న్యూస్ కొన్ని రోజుల క్రితం వచ్చింది. కానీ కొరటాల శివ(Koratal siva)కి బాలకృష్ణ(Balakrishna)కమిట్ అయ్యాడు. ఇతర బడా హీరోలెవరు ఖాళీగా లేరు. పైగా ఒక సినిమా స్టార్ట్ చేస్తే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూస్తూనే ఉన్నాం. తన మరో బాస్ రవితేజ కూడా ఫుల్ బిజీ. మరి ఈ  టైంలో హరీష్ శంకర్ ముందున్న మార్గం మెగా కాంపౌండ్. ఆ కాంపౌండ్ లో ఉన్న వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో అవకాశం వస్తుందేమో. ఈ ముగ్గరు బిజీగా ఉన్నా హరీష్ శంకర్ కథ చెప్పి ఒప్పిస్తే చేసే అవకాశం ఉండవచ్చని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  Also read: 2026 లో ఇప్పటి వరకు తొలి రోజు హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాలివే   ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ పరాజయాలతో ప్రస్తుతం హరీష్ శంకర్ పెన్ను హిట్ కోసం పొద్దుటూరు ఖద్దర్ లాగా కుత కుత లాడుతూ ఉండటం ఖాయం. ఈ నేపథ్యంలో ఏ హీరోతో వస్తాడో చూడాలి.  
  ఒక సంవత్సరంలో సీజన్స్ మార్పు అనేది కామన్.. కానీ సినీ సీజన్ లో ఎలాంటి  మార్పు ఉండదు. ప్రతి వారం సినీ సీజన్ వస్తూనే ఉంటుంది. సందడి వాతావరణాన్ని తెస్తూనే ఉంటుంది. సినీ న్యూస్ కూడా అంతే.. సీజన్ తో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ న్యూస్ తో సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే 2026 లో ఇప్పటి వరకు రిలీజైన సినిమాలు వరల్డ్ వైడ్ గా తొలి రోజు  ఎంత గ్రాస్ వసూలు చేశాయనే  క్రేజీ న్యూస్ సినీ ప్రియుల్లో ఆహ్లాదకర వాతావరణాన్నితీసుకొచ్చింది. మరి ఆ లిస్ట్ చూసేద్దాం. 1 . ది రాజా సాబ్ : 95 కోట్ల గ్రాస్  2 .మన శంకర వరప్రసాద్: 75 కోట్ల గ్రాస్  3 .ఉస్తాద్ భగత్ సింగ్:  52.8 కోట్ల గ్రాస్  4 . అనగనగ  ఒక రాజు: 14.8 కోట్ల గ్రాస్  5 . డెకాయిట్ : 13.75 కోట్ల గ్రాస్  6 . భర్త మహాశయులకు విజ్ఞప్తి : 5 కోట్ల గ్రాస్  7 . నారి నారి నడుమ మురారి: 5 కోట్ల గ్రాస్  8 .ఫంకీ : 4.5 కోట్ల గ్రాస్  9 .రాకాస : 4 కోట్ల గ్రాస్  10 . విష్ణు విన్యాసం :3.3 Crore గ్రాస్  Also read: Jetlee vs Gayapadda Simham: జెట్లీ, గాయపడ్డ సింహం ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!..మరి విన్నర్ ఎవరు  ఇలా పైన చెప్పుకున్న మొదటి పది చిత్రాలు గ్రాస్ పరంగా మిగతా చిత్రాలతో పోల్చుకుంటే బెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. మరి జూన్ 4 న రాబోతున్న పెద్ది, ఆ తర్వాత రాబోయే టాక్సిక్,  లెనిన్,ఏ పొజిషన్ లో ఉంటాయో చూడాలి.  
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. 'ఉప్పెన' సినిమాతో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన ఈ యంగ్ హీరో, ఆ తర్వాత తనదైన శైలిలో కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు మహేష్ సూరపనేనితో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ గతంలో కథలో రాజకుమారి, హంట్ వంటి సినిమాలు చేశారు. వైష్ణవ్ తేజ్ కోసం ఆయన ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమా వైష్ణవ్ తేజ్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని టాక్. ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments) బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ ఏడాది 'నారీ నారీ నడుమ మురారి'తో హిట్ కొట్టి జోష్ లో ఉన్నారు అనిల్ సుంకర. అదే ఉత్సాహంతో మెగా హీరోతో హిట్ కొట్టాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. వైష్ణవ్ తేజ్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఈ కొత్త ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. మహేష్ మార్క్ టేకింగ్, అనిల్ సుంకర నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
  నిన్న వరల్డ్ వైడ్ గా జెట్లీ(Jetlee),గాయపడ్డ సింహం(Gayapadda Simham)చిత్రాలు ప్రేక్షకులు కూడా కార్మికులే కాబట్టి కార్మిక దినోత్సవం సందర్భంగా థియేటర్స్ లో తిష్ట వేద్దామని ల్యాండ్ అయ్యాయి. కానీ అనూహ్యంగా రెండు చిత్రాలకి నెగిటివ్ టాక్ చాలా బలంగానే స్ప్రెడ్ అవుతుంది. సాధారణంగా ఒకే రోజు రెండు చిత్రాలు రిలీజ్ అయినప్పుడు ఒక చిత్రం బాగోకపోతే మరో చిత్రం పర్వాలేదనే స్థాయిలో ఉన్నా  విజయం అంచున నిలబడుతుంది. కానీ ఆ సూత్రం మాకు వర్తించదులే, ఒకే రోజు వచ్చాం కాబట్టి రిజల్ట్ విషయంలో సమన్యాయం పాటిస్తామని ప్లాప్ ని గట్టిగానే పట్టుకున్నాయి.  మరి ఈ రెండు చిత్రాలు తొలి రోజు ఎంత కలెక్షన్స్ ని వసూలు చేశాయని రిపోర్ట్స్ వస్తున్నాయో చూద్దాం.  జెట్లీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా  1 .5 కోట్ల  గ్రాస్ ని సాధించట్టుగా వార్తలు వస్తున్నాయి. సినిమాకి వచ్చిన క్రేజ్ బట్టి ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చు. మరి ఎండింగ్ కలెక్షన్స్ ఎంతో చూడాలి. పదికోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టు టాక్.  గాయపడ్డ సింహం తొలి రోజు వరల్డ్ వైడ్ గా కోటి రూపాయల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తుంది. పన్నెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందనేది టాక్ కాగా మరి ఎన్ని రోజులు థియేటర్స్ లో ఉంటుంది, ఎంత రాబడుతుందో అనేది ఆసక్తిగా మారింది. రెండు చిత్రాల మేకర్స్ మాత్రం కలెక్షన్స్ వివరాలని అధికారకంగా  వెల్లడి చెయ్యలేదు.  
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.