LATEST NEWS
వైసీపీ మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం (మే28) షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై ఆయనపై నమోదైన కేసులో ఇప్పటికే హైకోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే పిన్నెల్లిపై తెలుగుదేశం ఏజెంట్ పై దాడి ఘటనకు సంబంధించి మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఇలా ఉండగా ఆ మూడు కేసులలో కూడా పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ మూడు కేసులలో కూడా ఏపీ హైకోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసింది. ఈ ఏ కేసులలోనూ కూడా జూన్ 6వ తేదీ వరకూ పిన్నెల్లిపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. బెయిలు మంజూరు చేస్తూ కోర్టు పిన్నెల్లికి కొన్ని షరతులు విధించింది. కోర్టు విధించిన షరతుల మేరకు పిన్నెల్లి ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ మాచర్లలో అడుగు పెట్టకూడదు. అలాగే  నరసరావుపేటలో ఆయన ఉండే నివాసం చిరునామా ఇవ్వాలనీ, అదే విధంగా ఆయన పాస్ పోర్టును సరెండర్ చేసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజు హాజరు వేయించుకోవాలి. అయితే కౌంటింగ్ రోజు మాచర్లకు వెళ్లోచ్చని కోర్టు పేర్కొంది. అయితే ఆ రోజు కూడా ఆర్వో ముందు హాజరవ్వాలని పేర్కొంది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి కనుకనే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కోర్టు తన ఉత్తర్వ్యులలో స్పష్టం చేసింది. 
జనం మర్చేపోయారు.. వైసీపీ దండుపాళ్యం బ్యాచ్’లో ఈ ‘నగ్న శిఖామణి’ ఒకడు వున్నాడు కదూ.. తన దిశ మొలతో దేశం దశదిశలూ నిర్ఘాంతపోయేలా చేసిన ‘వీడియో స్టార్’ గోరంట్ల మాధవ్ నేనూ ఉన్నానంటూ లైన్లోకి వచ్చేశాడు. ఈయనగారి ముఖం చూసినా ‘ఆ వీడియో’ గుర్తొచ్చే స్థాయిలో పాపులర్ అయిన ఈ అందగాడు ఈ ఎన్నికలలో జగన్ పార్టీకి జాతీయ స్థాయిలో జనం నిర్ఘాంతపోయే స్థాయిలో సీట్లు వస్తాయని చెబుతున్నాడు. కొద్దికాలం క్రితం ఫోన్లో ఈయన వీడియో చూసి జనాలు ఒక పూట భోజనం చేయడం కూడా మానుకున్నారు. అలాంటి పెద్దమనిషి ఇప్పుడు ఫ్యూచర్ చెప్పడానికి బయల్దేరాడు. ఈయనకి మళ్ళీ ఎంపీ టిక్కెట్ వస్తుందో రాదో ఈయనకే తెలియక జగన్ గేటు దగ్గర పడిగాపులు కాసిన గోరంట్ల, జగన్ టిక్కెట్ ఇవ్వను పొమ్మంటే వెర్రి నవ్వు నవ్వుకుంటూ తప్పుకున్న మాధవ్... ఇప్పుడు తనకు అన్నీ తెలిసినట్టుగా బిల్డప్పు ఇస్తున్నాడు. వైసీపీలో అందరూ మళ్ళీ గెలుస్తామని బిల్డప్పు ఇస్తున్నారు కాబట్టి, నేను కూడా ఇవ్వకపోతే బాగోదు అన్నట్టుగా తాను కూడా గప్పాలు పలుకుతూ ఆత్మానందం చెందుతున్నాడు. వైసీపీలో వున్న ప్రతి అడ్డమైన వాడికీ ఒక దిక్కుమాలిన ముహూర్తం దొరికింది. ప్రతివాడూ ఆ ముహూర్తానికి జగన్ ప్రమాణ స్వీకారం వుంటుందని చెబుతూ నోటి తుత్తర తీర్చుకుంటున్నారు. ఆ బ్యాచ్‌లో ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా చేరాడు. జూన్ 9న ఉదయం 9 గంటల 35 నిమిషాలకు రుషికొండలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాడని కూడా ఈయన చెప్పేస్తున్నాడు. జగన్ మళ్ళీ సీఎం అవుతాడంటూ జోస్యం చెప్పడం కాదు.. రాబోయే రోజుల్లో ఈయనగారి బూతు వీడియో సంగతి మళ్ళీ తవ్వి తీస్తారు.. అప్పుడుంటది అసలు సినిమా.
సీఎస్ జవహర్ రెడ్డి నిబంధనలకు నిలువుపాతరేసి.. అడ్డగోలుగా జగన్ తో అంటకాగిన జవహర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు ఎవరకూ కూడా ఆయనకు మద్దతుగా నోరు మెదపడం లేదు. విశాఖలో భూ దందాకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఇప్పుడు అండగా నిలిచి మాట్లాడే వారే కరవయ్యారు. వైసీపీ అనుకూల అధికారిగా ముద్రపడిన ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఖండించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆయనకు కూడా తనపై ఆరోపణలను ఖండించి ఊరుకోవడమే కానీ, ఆరోపణలు చేసిన వారిపై పోలీసు కేసు పెట్టడం కానీ, కోర్టుకు వెళ్లడం కానీ చేయడానికి రెడీగా లేనట్లు కనిపిస్తున్నది. తొలుత జనసేన నాయకుడు ఒకరు భూ దందా వ్యవహారాన్ని బయటపెట్టగానే జవహర్ రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ ఓ లేఖ రాశారు. తక్షణం ఆరోపణలను ఉపసంహరించుకోకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే తన ఆరోపణలకు ఆధారాలున్నాయనీ, తగ్గేదే లేదనీ సదరు జనసేన నేత మీడియా ముఖంగా ప్రకటించడంతో జవహర్ రెడ్డి మౌనం దాల్చారు.  సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కూడా జవహర్ రెడ్డికి అన్ డ్యూ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. జవహర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, కరోనా సమయంలో హెల్త్ సెక్రటరీగా కీలక పదవులను అనుభవించిన జవహర్ రెడ్డిని సీఎం జగన్ సీనియర్లను సైతం తోసి రాజని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.  ఇక ఆ క్షణం నుంచీ జవహర్ రెడ్డి జగన్ ఆడమన్నట్లల్లా ఆడారన్న విమర్శలు ఉన్నాయి. జవహర్ రెడ్డి నిర్ణయాలన్నీ జగన్ ను మెప్పించడం కోసమే అన్నట్లుగా ఉన్నయని తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తోంది.  ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రలో ఎస్సీ భూములను బినామీల పేరిట కొనుగోలు చేశారన్న ఆరోపణలకు ఆయన ఇటీవల విశాఖ ప్రైవేటు పర్యటన బలం చేకూర్చింది.  కాగా భూముల దందాలో వైసీపీ నేతల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఖండించడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదు.  సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలను ఖండించడానికి ఇంత వరకూ జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నారు.   తన అధికారాలను దుర్వినియోగం చేసి మరీ వైసీపీకి పూర్తి మద్దతుగా నిలిచిన జవహర్ రెడ్డి ఇప్పుడు ఎటువైపు నుంచీ మద్దతూ అండా లేకుండా ఒంటరిగా మిగిలిపోయారు. జవహర్‌రెడ్డి చీఫ్‌ సెక్రటరీ కాదు..చీప్‌ సెక్రటరీ అంటూ  సోమిరెడ్డి చంద్రమేహన్ రెడ్డి వంటి వారు విమర్శలు గుప్పిస్తున్నా వైపీపీ నుంచి  ఎక్కడా సౌండ్ వినిపించడం లేదు.  మొత్తం మీద ఎవరి ప్రాపకం కోసం జవహర్ రెడ్డి తన హోదాను, ప్రతిష్టను ఫణంగా పెట్టి పని చేశారో వారే వదిలేయడంతో ఆయన పూర్తిగా ఒంటరి అయిపోయారు.
హైదరాబాద్ మహా నగరంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్.. ప్రస్తుత ప్రజాభవన్‌లోనే బాంబు పెట్టామని అగంతకులు హెచ్చరించారు. మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు హుటాహుటీన చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలంగాణ డిప్యూటీ భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. బాంబు బెదిరంపుతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సిబ్బంది సహా అందరినీ భవన్ నుంచి ఖాళీ చేయించి బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు జరుపుతోంది.  మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్‌ చేసిన ఆగంతకుడిని ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.బెయిల్ పొడిగింపు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. బెయిల్ పొడిగింపు పిటిషన్ పై తక్షణ విచారణ కోరుతూ ఆయన తరపు లాయర్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. ఈ పిటిషన్ గురించి గత వారం ప్రధాన బెంచ్‌ ముందుకు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. ఈ కేసులో తీర్పు రిజర్వ్ లో ఉన్నందుకు పిటిషన్‌ లిస్టింగ్ పై తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసులో జూన్ 1 వరకూ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.  అయితే, వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన బరువు నెల రోజుల వ్యవధిలో అకారణంగా 7 కేజీల మేర తగ్గిందన్నారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు ఇతర వైద్య పరీక్షల కోసం ఏడు రోజుల సమయం పడుతుందని, ఇందుకు అనుగుణంగా బెయిల్ పొడిగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్టు తెలిపారు. మే 10 న ఆయన తీహాడ్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. 
ALSO ON TELUGUONE N E W S
నందమూరి కళ్యాణ్ రామ్.. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత  మంది హీరోలున్నా కూడా  తన కంటూ ఒక  ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఎప్పటి కప్పుడు విభీమన్నమైన సినిమాలు చేస్తు క్రేజ్ ఉన్న  హీరోగా మారాడు.అదే రీతిలో క్వాలిటీ హీరోగా కూడా మారాడు. వరుసగా  బింబిసార, డెవిల్ లతో హిట్ కొట్టి ఇప్పుడు  హ్యాట్రిక్ కి సిద్దమవుతున్నాడు. ఈ రోజు కళ్యాణ్ రామ్ తాత దివంగత నందమూరి తారకరామారావు పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అంటు కళ్యాణ్ రామ్  న్యూ మూవీకి సంబంధించిన వీడియో ఒక దాన్ని రిలీజ్ చేసారు. కళ్యాణ్ రామ్ పూర్తిగా కనపడకపోయినా ఆయన కళ్ళు మాత్రం సినిమా ఎలా ఉండబోతుందో చెప్తున్నాయి. చేతులకి చిన్న సైజు రుద్రాక్షలు ధరించి  శత్రువులకి చాలా బలమైన పంచ్ ఇవ్వబోతున్నాడని అర్ధం అవుతుంది.  ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అంటే  పిడికిలి మంట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన రాజా చెయ్యి వేస్తే ప్రదీప్ ఫస్ట్ మూవీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ అశోక క్రియేషన్స్ పై ముప్పా వెంకయ్య చౌదరి నిర్మిస్తున్నాడు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా చేస్తుండగా ఒకప్పటి టాప్ హీరోయిన్ విజయ శాంతి ఒక కీలక పాత్రని పోషిస్తుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21 వ సినిమా.  
  తెలుగు సినిమాలతో  పాటు ఇతర భాషా చిత్రాలని మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. ఓటీటీలోకి ఏ కొత్త సినిమా వచ్చిన చూడాలని అనుకునేవారు పెరిగిపోయారు. థియేటర్లలో కంటే ఇంట్లో కుర్చొని సినిమాలని ఓటీటీలో చూడటం బెటర్ అని చాలా మంది చూస్తుంటారు. కొన్ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీలో భారీగా వీక్షకాధరణ పొందతున్నాయి. ఫోరెన్సిక్, అన్వేషిప్పన్ కండేతుమ్, బ్రహ్మయుగం లాంటి  ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే కోవలోకి కన్నడ మూవీ వచ్చేసింది. అదే 'శాకాహారి'. కన్నడలో రూపొందిన ఈ సినిమాకి సందీప్ దర్శకుడు. రంగాయన రఘు సినిమాలో కీలక పాత్ర పోషించాడు. గోపాలకృష్ణ దేశ్ పాండే,  వినయ్, నిధి హెగ్డే తదితరులు నటించారు. మర్డర్ మిస్టరీలో ఈ మూవీని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్బ లో ఈ వారమే అడుగుపెట్టగా అత్యదిక వీక్షకాధరణ లభించింది. కోటిరూపాయలలోపు బడ్జెతో నిర్మించిన ఈ 'శాకాహారి' అక్కడ థియేటర్లలో భారీ వసూళ్ళను రాబట్టుకుంది.  మరి అంతగా ఈ సినిమాలో ఏం ఉంది. సుబ్బన్న ఒక చిన్న శాకాహార హోటల్ నడుపుతుంటాడు. ఒకసారి వినయ్ అనే వ్యక్తిని పోలీసులు తరుముతూ రావడంతో.. అతను సుబ్బన్న హోటల్లో తలదాచుకుంటాడు. భార్య హత్యకేసు నుంచి పారిపోయి వచ్చిన ఆ వ్యక్తికి సుబ్బన్న ఆశ్రయం ఇస్తాడు. ఆ తర్వాత సుబ్బన్న లైఫ్ ఎలా మారిపోయింది ? సుబ్బన్న గతమేమిటి అనేది మిగతా కథ. అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ మూవీని మీరు చూసేయ్యండి.
  మూవీ : క్రూ నటీనటులు: టబు, కృతి సనన్,‌ కరీనాకపూర్ ఖాన్, దిల్జిత్ దొసాంజె, కపిల్ శర్మ,  రాజేశ్ శర్మ, స్వాస్థ చటర్జీ, ఇవాన్ రోడ్రిగస్ తదితరులు రచన : నిధి మెహ్ర, మెహుల్ సూరి సినిమాటోగ్రఫీ: అనుజ్ రాజేశ్ ధావన్ మ్యూజిక్: దిల్జిత్ దోసాంజ్, బాధ్షా ఎడిటింగ్: మనన్ సాగర్ దర్శకత్వం : రాజేశ్ ఏ కృష్ణన్ ఓటీటీ : నెట్ ఫ్లిక్స్ కథ: గీతూ సేథీ, జాస్మిన్ కోహ్లి, దివ్య రాణా అనే ముగ్గురు అమ్మాయిలు కోహినూర్ ఎయిర్‌లైన్స్ లో పని చేస్తుంటారు. ఆ ఎయిర్‌లైన్స్ యజమాని అయినటువంటి విజయ్ వాల్యా వల్ల అది తీవ్ర నష్టాల్లోకి వెళ్తుంది. దాంతో అందులో పనిచేసే సిబ్బందికి సరైన జీతాలు కూడా అందవు. ఇక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన గీతూ, జాస్మిన్, దివ్య రాణా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి డీల్ కుదుర్చుకుంటారు. అలా వాళ్ళు సక్సెస్ ఫుల్ గా స్మగ్లింగ్ చేస్తుండగా ఒకరోజు వారు పనిచేసే కోహినూర్ ఎయిర్‌లైన్స్ దివాళ తీసినట్లు ప్రకటిస్తుంది. దాంతో అందులో పనిచేసే సిబ్బంది రోడ్డున పడతారు. ఆ సంస్థ యజామని అయినటువంటి విజయ్ పాల్య విదేశాలకు పారిపోతాడు.  గీతూ, జాస్మిన్, దివ్యలు ఏం చేసారు? విజయ్ పాల్య విదేశాలకు ఎందుకు పారిపోయాడో తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లోని ఈ మూవీ చూడాల్సిందే. విశ్లేషణ: సాధారాణ కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిలు సొంతంగా జాబ్ చేస్తుండగ.. ఒకరోజు సడన్ గా వారి లైఫ్ రోడ్డున పడటంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఇక కడుపు మండి వారు చేసిన పనులు ఆద్యంతం నవ్వులు కురిపించాయి. అయితే అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు రాజేశ్ ఏ కృష్ణన్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు.  పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడనిపిస్తుంది. గోల్డ్  స్మగ్లింగ్ లో వారు వేసే ప్లాన్స్ ఆకట్టుకుంటాయి. బ్యాంకుల్లో వేలకోట్లు అప్పు తీసుకొని విదేశాలకి  ఎంతోమంది పారిపోయారు. అలాంటి వాళ్ళని ఏం చేయలేక ఇండియాలోని పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ మీద బ్యాంకులు వేసే ట్యాక్స్ లు మాములు అయిపోయాయి. ఇలాంటి ఓ పాయింట్ ని తీసుకొని కథనం నడిపించిన తీరు బాగుంది. అయితే సినిమాలో మైనస్ అనిపించేదేదంటే.. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు కలిసి వేలకోట్లున్న విజయ్ పాల్యాని  ఇండియాకి తీసుకురావడం‌. ఇక అదొక్కటి తప్పితే మిగతాదంతా ఒకే. అలా సాగిపోతుంది. స్క్రీన్ ప్లే అదనపు బలాన్నిచ్చింది.  ప్రథమార్ధంలో కథనం కాస్త నెమ్మదిగా సాగినా ఇంటర్వెల్ కి గాడిన పడుతుంది. అక్కడి నుండి ఆ ముగ్గురు విదేశానికి వెళ్ళడం, విజయ్ పాల్యా దిగిన హోటల్ లోనే స్టాఫ్ గా పనిచేయడం.. అక్కడ వారు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ కూడా కామెడీగా సాగుతాయి. అయితే అక్కడక్కడ కాస్త బోల్డ్ సీన్స్ ఉంటాయి. అవి స్కిప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద వీరి ముగ్గురి నటనకి ప్రేక్షకులు ఫిధా అవుతారు. క్లైమాక్స్ విషయంలో కాస్త లాజిక్ మిస్ అయింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. మ్యూజిక్ పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: గీతూ సేథి గా టబు, జాస్మిన్ కోహ్లిగా కరీనాకపూర్ ఖాన్, దివ్య రాణాగా కృతి సనన్ మూవీకి ప్రధాన బలంగా నిలిచారు. విజయ్ వాల్యాగా స్వాస్థ్ ఛటర్జీ ఒదిగిపోయాడు. ‌ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.  ఫైనల్ గా : కామెడీతో పాటు మెసెజ్ ఇచ్చే ఎంటర్‌టైనర్ రేటింగ్ : 2.75  / 5 ✍️. దాసరి మల్లేశ్
ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి..టైటిల్స్ పెట్టడంలో  వర్సటైల్ డైరెక్టర్ గుణ శేఖర్(gunasekhar) తర్వాతే ఎవరైనా..తన మొదటి సినిమా రామాయణం మినహాయిస్తే సొగసు చూడతరమా, చూడాలని ఉంది, మనోహరం, మృగరాజు, నిప్పు, ఒక్కడు, సైనికుడు, అర్జున్, వరుడు,రుద్రమదేవి, శాకుంతలం. ఇలా వెరైటీ టైటిల్స్  ఫిక్స్ చెయ్యడంలో  గుణశేఖర్ దిట్ట. రీసెంట్ గా తన కొత్త మూవీ టైటిల్ ని ప్రకటించాడు.   యుఫోరియా.. పేరు వింటేనే  చాలా వెరైటీ ఉంది కదు. ఇప్పుడు ఆ పేరునే గుణశేఖర్ తన కొత్త సినిమా టైటిల్ గా అనౌన్స్ చేసాడు. గ్రాండ్ గా  ఒక వీడియో విడుదల చేసి మరి చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో యు ట్యూబ్ ని షేక్ చేస్తుంది. నిమిషాల వ్యవధిలోనే రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని తెలియచేసారు.  గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ పై  నీలిమ గుణ నిర్మిస్తుంది. ఈమె  గుణశేఖర్ కూతురు. గతంలో రుద్రమదేవి, శాకుంతలం చిత్రాలని కూడా  నిర్మించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే  షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. హీరోతో పాటు  ఇతర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ వివరాలు  కూడా మరికొద్ది రోజుల్లో తెలియనున్నాయి. యుఫోరియా పక్కా యూత్‌ఫుల్ సోషల్ డ్రామాగా  తెర‌కెక్క‌నుంది. దీంతో గుణ శేఖర్ ఏం చెప్పబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఉంది.ఎందుకంటే ఆయన సినిమాలన్నీ కూడా   ఒక దానికొకటి అసలు  సంబంధం ఉండదు.దేనికవే విభిన్నమైనవి. డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ లైన్ తో కూడి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలుగచేస్తాయి.ఈ నేపథ్యంలో యుఫోరియా స్టోరీ మీద ప్రేక్షకుల్లో  ఆసక్తి నెలకొని ఉంది. సబ్జట్ కి తగ్గ టేకింగ్ గుణశేఖర్ స్పెషాలిటీ. హీరోగా ఎవరు చేస్తారు అనే క్యూరియాసిటీ కూడా అందరిలో ఉంది.  
VYRL సౌత్ అనేది యూనివర్శల్ మ్యూజిక్ ఇండియా నుండి వచ్చిన ఒక ప్లాట్‌ఫాం. సౌత్ ఇండియాలో ఐపాప్ మ్యూజిక్ కల్చర్ ని పరిచయం చేసి, దానికంటూ ఒక బేస్ ఉండేలా కృషి చేస్తుంది. ఒరిజినల్ కంటెంట్ తో, అర్ధ వంతమైన మ్యూజిక్ తో, క్లట్టర్ బ్రేకింగ్ స్లిక్ వీడియోస్ తో ఐపాప్ మ్యూజిక్ కోసం ఎదురు చూసే మ్యూజిక్ లవర్స్ అందరికీ ఏకైక డేష్టినేషన్ Vyrl సౌత్. ఈ లేబుల్ తన మొదటి రెండు సింగిల్స్ విడుదలతో తెలుగు సంగీత రంగంలో సంచలనాత్మక ప్రవేశం చేసింది. రెండు పాటలు సంగీత ప్రియుల హృదయాలను గెలిచి ఇంటర్నెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. మొదటి సింగిల్ "ఓసెలియా" కి గణేష్ క్రోవ్విది, రిక్కీ బి మరియు ఫిరోజ్ ఇజ్రాయెల్ సంగీతం అందించగా, ఇటీవల టాలీవుడ్ సంచలనం కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. ఈ మెలోడీ సంగీత ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, Vyrl సౌత్ తన రెండవ సింగిల్, "సిన్నదాని సూపులే"ని విడుదల చేసింది. టెలివిజన్ సెన్సేషన్ శ్రీ సత్య మరియు వినోద్ కుమార్ ఎస్ నటించిన ఈ పాట అద్భుతమైన విజువల్స్ తో వినడానికి శ్రవణానందంగా ఉంది. ఈ పాటకి యాడిక్రీజ్ సంగీతం అందించడంతో పాటు, సిన్నదాని సుపులే సాంగ్ లో కనిపించారు. వీరితో పాటు సాకేత్ కొమండురి, దాసరి మేఘన నాయుడు కూడా ఈ పాటలో పెర్ఫార్మన్స్ చేశారు. ఇప్పుడు ఈ పాట కూడా త్వరలో పెద్ద హిట్ గా మారబోతుంది. ఓ సెలియా, సిన్నదాని సుపులే ఈ రెండు పాటలు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. సంగీత అభిమానులు వీక్షించి వినూత్న సంగీత మాయజాలంలో మునిగి తేలొచ్చు.
Hero Allari Naresh is set to enthrall in an intense role in his upcoming film Bachchala Malli being helmed by Subbu Mangadevvi of Solo Brathuke So Better fame. Razesh Danda and Balaji Gutta are producing the movie under the Banner of Hasya Movies which delivered the blockbusters Samajavaragamana and Ooru Peru Bhairavakona. The makers today unveiled the film’s first look poster. Allari Naresh appears in a never-before-seen mass avatar with messy hair and an uneven beard. While sitting on the rikshaw and smoking a cigarette, Naresh is seen giving a serious look with intensity in his eyes. He wore sacred threads to his neck and hand. In the background, we can observe a carnival with fireworks and people in ferocious Gods get-ups. This striking first look poster from a high-voltage fight sequence designates that Bachchala Malli will be an intense and first-of-its-kind action entertainer. The movie stars Amritha Aiyer playing the lead actress opposite Allari Naresh. Rohini, Rao Ramesh, Achyuth Kumar, Balagam Jayaram, Hari Teja, Praveen, Viva Harsha, etc. are playing important roles. Bachchala Malli to be made on a grand scale will have some popular technicians handling different departments. Vishal Chandrasekhar of Sita Ramam fame will score the music, while Richard M Nathan who worked for films like Maanaadu, Rangam, and Matti Kusthi will crank the camera. Chota K Prasad is the editor and Brahma Kadali is the production designer. While the story and dialogues were penned by Subbu himself, Vipparthi Madhu penned the screenplay, and the additional screenplay was written by Viswanetra. The story is an emotional journey of the protagonist and it is set in the backdrop of 1990. The shoot of the movie is happening in RFC, Hyderabad. The production works have reached the final stages.
  మెగాస్టార్ చిరంజీవి( chiranjeevi)హీరో స్టేజ్ ని దాటుకొని తెలుగు ప్రజల కుటుంబ సభ్యుడుగా మారి సుదీర్ఘ కాలం అవుతుంది. అదే విధంగా అభిమానుల స్థానంలో భక్తులు ఏర్పడి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది.  టు డే చిరు  ఏం చేస్తున్నాడని ఆలోచించేవాళ్ళు  లక్షల్లోనే ఉంటారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు  చేస్తు  చిరు ఆ ఘనతని  సాధించాడు. చిరు సాయానికి ఎల్లలు ఉండవు. సినిమా వాళ్ళకే  కాకుండా బయట వాళ్ళకి కూడా ఎంతో సాయం చేసారు. ఆ విలువ  లక్షలు కోట్ల రూపాయిల  దాకా ఉంటుంది.కానీ  ఏనాడూ చెప్పుకోరు. ప్రకృతి మాత్రం వేరే వాళ్ళకి ఇన్ స్ప్రేషన్  అవ్వాలని ప్రపంచానికి తెలియచేస్తుంది. అలా రీసెంట్ గా ఒక  సాయం బయటకి వచ్చింది.   ప్రభు(prabhu)సినిమా ఇండస్ట్రీ చెన్నై లో ఉన్నప్పట్నుంచి ఫిలిం జర్నలిస్ట్ గా  కళామ తల్లికి తన వంతు  సేవలందిస్తు వస్తున్నారు. సినిమా దర్శకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన జెనరల్ మెడికల్ చెకప్ చేయించుకోగా  హార్ట్ లో  ఎనభై శాతం  బ్లాకులు ఉన్నాయని తెలిసింది. దీంతో  చిరంజీవిని సంప్రదించి విషయాన్నీ తెలియచేసాడు.  చిరు వెంటనే  హైదరాబాద్ లోని  స్టార్ హాస్పిటల్ లో  ప్రభుని జాయిన్ చెయ్యడం జరిగింది.అంతే కాకుండా  చిరునే దగ్గరుండి  అన్ని ఎరేంజ్ మెంట్స్  చేయించి  ప్రభు చేత పైసా ఖర్చు కూడా పెట్టించలేదు. ఎలాంటి బైపాస్ సర్జరీ లేకుండా స్టంట్స్ వేసి డాక్టర్స్ ప్రభు  ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ప్రభు  ఆరోగ్యం బాగానే ఉంది. సమయానికి హాస్పిటల్ లో జాయిన్ కావడంతో  పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్స్  చెప్పారు. మెగా స్టార్ తీసుకున్న చొరవ వల్లే ప్రభు ప్రాణాలు దక్కాయి.  తెలుగు సినిమా ఫిల్మ్ జర్నలిస్ట్ ఈ సందర్భంగా చిరు కి  ధన్యవాదాలు తెలియచేసింది.ఇక చిరు కి ప్రభు కి మధ్య ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రభు కూతురు పెళ్ళికి కూడా చిరు హాజరయ్యాడు. చిరు కి సంబంధించిన ఎన్నో ఇంటర్వూస్ కి ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. చిరు ప్రస్తుతం విశ్వంభర(vishwambhara)తో బిజీగా ఉన్నాడు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతుంది  
Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises to be a captivating social drama, resonating with the youth and addressing contemporary issues in a dynamic and engaging manner. "Euphoria" will be produced by Neelima Guna under the banner of Guna Handmade Films, a production house known for its commitment to quality and innovation. The pre-production work is progressing rapidly, ensuring that all aspects of the film are meticulously planned. The shooting of "Euphoria" is slated to begin soon, with the makers promising to reveal the cast and technical crew shortly. This announcement is eagerly awaited, as fans and industry insiders speculate about the talent that will bring this exciting project to life. With Gunasekhar at the helm and a dedicated production team behind it, "Euphoria" is poised to be a significant addition to contemporary cinema, blending youthful energy with poignant social commentary.
Anand Deverakonda's latest movie is "Gam..Gam..Ganesha." Pragathi Srivastava and Nayan Sarika will be seen as the heroines opposite Anand. This movie is being produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the banner Hy-Life Entertainment. Uday Shetty is debuting as a director with this film. "Gam..Gam..Ganesha" is coming for a grand theatrical release on the 31st of this month. National crush Rashmika Mandanna was the chief guest at this film's pre-release event in Hyderabad. During this program, Anand Deverakonda had quick questions for Rashmika and he asked about her favourite co-star.  The actress smiled and said "Neeyabba" asked him that he is her family and why he was putting her at a spot. After smiling, the actress replied ‘Rowdy Boy’ is her favourite co-star. The crowds cheered up louder during that moment. During her speech, she also heaped praise on Baby director Sai Rajesh for his work. “I would like to work with Sai Rajesh garu if given a chance. I loved his direction and dedication. I would love to play a mental role if given a chance in your film. It made me curious as an actress” told the top actress. Rashmika is busy with Pushpa 2: The Rule and she is also busy with a couple of women-centric films.
Anand Deverakonda's latest movie is "Gam..Gam..Ganesha." Pragathi Srivastava and Nayan Sarika will be seen as the heroines opposite Anand. This movie is being produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the banner Hy-Life Entertainment. Uday Shetty is debuting as a director with this film. "Gam..Gam..Ganesha" is coming for a grand theatrical release on the 31st of this month. National crush Rashmika Mandanna was the chief guest at this film's pre-release event in Hyderabad. During this program: Actor Krishna Chaitanya said, "'Gam..Gam..Ganesha' is a film made by a new team to prove themselves. It is not just a heroic story; all roles have importance. There are about 35 characters in this movie. It will be a different movie for Anand Deverakonda." Lyricist Suresh Banisetti said, "In the movie 'Gam..Gam..Ganesha,' I wrote a song called 'Picchi Nachchashave.' Chetan Bharadwaj has given a good tune for this song, sung by Anurag Kulkarni. I enjoyed writing the lyrics for this song. Rashmika Mandanna is happy to be a guest at this program." Dance master Vijay Polaki said, "It is always a pleasure to work with Anand Anna. I want to continue working with him like this. Director Uday is going to achieve a hit with this movie. All the best to the team." Actor Satyam Rajesh said, "Our director Uday has made this film as beautifully as the sculpture of Lord Ganesha. He checked every scene and re-shot it to perfection. Uday will definitely become a good director. All the best to hero Anand, the two heroines, and the other cast and crew. I hope 'Gam..Gam..Ganesha' becomes a big hit." Actor Yavar said, "'Gam..Gam..Ganesha' made my dream of acting in movies come true. I would like to thank Anand, the director, and the producer for giving me a chance in this film. The movie will release on the 31st of this month. We want your support." Heroine Nayan Sarika said, "Our director Uday worked very hard from the script to the making of 'Gam..Gam..Ganesha.' It was a pleasure to work with Anand. In this movie, you will see Anand in a new type of character not seen before. Music director Chetan Bharadwaj gave life to the movie with the BGM. My favorite song is 'Madly Nachchashave.' Heroine Pragathi is a beautiful girl. I have no scenes with her, but I saw her performance, and it was very good. I hope the hard work of our team pays off with this film." Heroine Pragathi Srivastava said, "'Gam..Gam..Ganesha' is a special movie in my career. It was a pleasure to work with Anand. He is a supportive co-star. Thanks to director Uday for giving me a chance in such a good project. 'Gam..Gam..Ganesha' is a wholesome entertainer. Sidh Sriram is my favorite singer. I felt happy when he sang the 'Brundavanive' song in our movie. Chetan Bharadwaj gave good music. Watch our movie in theaters and enjoy." Jabardast Emmanuel said, "I will never forget the movie 'Gam..Gam..Ganesha.' Anand's friend character is very important in this movie. Thanks to our director Uday who believed that I could do such a key role. He has written a very good script for this movie. The audience who comes out after watching the movie will remember the names of most of the characters. Anand Anna believed in me and supported me in playing this character. Everyone who knows him knows what a good person Anand is. I wish 'Gam..Gam..Ganesha' great success." Director and producer Madhura Sreedhar Reddy said, "I saw 'Gam..Gam..Ganesha' two days ago. It entertained me throughout. This is a movie to watch without looking away. It will provide cool entertainment to family audiences in this hot summer. Anand's performance will impress you. With movies like 'Dorasari,' 'Middle Class Melodies,' 'Baby,' and now 'Gam..Gam..Ganesha,' Anand has a strong lineup. Each movie he selects is unique. I would like to congratulate the entire team before the release because I have seen the movie." Astrolazer RMP Shetty said, "'Gam..Gam..Ganesha' is the name of success. Those who take the name of Ganesha will not have any problems. This film will also fetch name and money without any issues. I really liked Anand's performance in 'Baby.' It seems that the entire movie team made this movie with love instead of hard work." Director Anudeep K.V. said, "Director Uday is my friend. He should achieve good success with 'Gam..Gam..Ganesha.' I hope Anand will have 'Gam..Gam..Ganesha' as one of his memorable movies. All the best to the team." Director Sai Rajesh said, "'Baby' is an emotional movie, while 'Gam..Gam..Ganesha' is an entertaining one. When Anand transitioned to 'Gam..Gam..Ganesha' after doing our 'Baby' movie, I asked him about the experience of the two films. Anand said he was emotionally stressed during 'Baby' but felt very fun and relaxed on the set of 'Gam..Gam..Ganesha.' Not many people have seen Anand in 'Pushpaka Vimanam,' but his comedy timing is perfect. I can strongly say that 'Gam..Gam..Ganesha' will make you laugh with its good entertainment." Producer Vamsi Karumanchi said, "Vijay Madduri was the person who supported Kedar and me for 'Gam..Gam..Ganesha.' Thank you to him. Anand always has a smile on his face. Even after 10-12 hours of hard work on a movie, he never shows any frustration. Anand has been seen as a middle-class boy and a middle-class husband until now. But with this movie, he will be seen in a funky character. It's said that Anand can handle emotions well, but with this movie, he proves he can impress with comedy too. 'Gam..Gam..Ganesha' is definitely something you will enjoy." Producer Kedar Selagamshetty said, "Thanks to Rashmika and all the other guests who came to our event. Anand and I are family friends, and I was happy to have the opportunity to produce this film. This is a new movie showing Anand in a different light on screen. It was satisfying to see our first movie shaping up to everyone's liking." Co-producer Anurag Parvataneni said, "Rashmika is a lucky charm. We hope that luck will come to us with her presence at our event. Along with regular movie lovers, both family and youth audiences will like 'Gam..Gam..Ganesha.'" Director Uday Shetty said, "Our producers have given us a lot of support since the story of 'Gam..Gam..Ganesha.' Cinematographer Aditya is my strength. Choreography, music, art work—these will impress you in every aspect of the movie. I was lucky to get a hero like Anand for my first film. He used to call even after shooting and going home, saying if I liked the scene or not, let's do it again, don't get tensed. Such support was given and anchored. 'Gam..Gam..Ganesha' will thrill you if you think of it as a comedy movie, make you laugh if you think of it as a thriller, and surprise you if you think of it as a regular action comedy. There is a guest role in this movie. Be ready to be shocked to see that role in the theater. 'Gam..Gam..Ganesha' will be a movie loved by all family and youth audiences." Producer Bunny Vas said, "Kedar, Vamsi, and Anurag are happy to come as producers from Anand and Vijay's family circle. Nayan Sarika is also acting in the movie 'Ma Ai.' I wish Anand's next post-'Baby' movie, 'Gam..Gam..Ganesha,' a success. Our Srivalli Rashmika is happy to attend this event. All the best to director Uday and the team." Producer SKN said, "'Gam..Gam..Ganesha' producers Vamsi and Kedar supported Vijay, who are good friends of mine. Co-producer Anurag is also a good friend. Anand is the most passionate hero I have ever worked with, showing great dedication towards cinema. I wish to see him achieve success beyond 'Baby' with 'Gam..Gam..Ganesha.' Hero Anand Devarakonda said, "In interviews, some people asked why I did 'Gam..Gam..Ganesha.' Instead of asking why, I started asking why not. If you find a story with a funky character mixed with family emotions in a crime comedy, you don't want to pass it up. I have never appeared in any other movie as energetically as I have in this one. Director Uday brought out that energy in me. Thanks to Uday for bringing this story to me. I used to call SKN, Sai Rajesh, Dheeraj, and Maruti regularly when 'Baby' was in post-production, asking if the movie would do well. I lacked confidence and took confidence from those around me. Maruti said, 'Do you know what movie you have done? Your career will change after the release of 'Baby.' It happened as he said. Maruti gave me a lot of confidence with his words. I used to call Uday even during 'Gam..Gam..Ganesha' and ask if the movie is good. Yesterday, we showed the movie to a hundred youth and family audiences who have nothing to do with our movie. They all enjoyed the twists and turns in the movie. The perfect family entertainer for this summer is 'Gam..Gam..Ganesha.' Two more films are coming out on the 31st. There should be healthy competition. I want all the movies to be popular. This summer has been dry, and the industry will thrive only if at least two medium and small films are popular every month. Everyone gets employment. We have made a good movie with 'Gam..Gam..Ganesha.' We are happy with the output. Go to the theater and watch the movie. Tell others if you like it. This is not just my film; many characters are good. The movie will have a unique presentation. Thanks to Rashmika and all our team." National crush Rashmika Mandanna said, "'Gam..Gam..Ganesha,' I know how important this team is to everyone. We should support each other. I felt this when I entered the film industry. Anand is like a brother to me. He doesn't know that I depend on him a lot. Anand will have a smile on his face if this movie succeeds. I want to see that smile. I danced to the songs of 'Gam..Gam..Ganesha.' Chetan Bharadwaj's music is very good. Director Uday should achieve big success with this movie. Rudra and Emmanuel's performances in 'Gam..Gam..Ganesha' are impressive. You can't stop laughing when you watch Emmanuel's videos. Producers Vamsi, Kedar, and Anurag should see profits from this movie. After watching 'Baby,' I felt that I must act under the direction of Sai Rajesh."
చాలామంది సంకల్పబలం, క్రమశిక్షణల గురించి ఓ అరగంట ప్రసంగించమంటే తడుముకోకుండా మాట్లాడతారు. కానీ వాటిని పాటించే విషయంలోనే వస్తాయి చిక్కులన్నీ. తమ దాకా వచ్చేసరికి అవి అందరికీ సాధ్యం కాదని తేల్చేస్తారు. అది పుట్టుకతోనే రావాలని చల్లగా జారుకుంటారు. అలాంటి వారికి సమాధనమే ఈ కింది విషయాలు.. దృఢనిర్ణయాలు తీసుకోవాలంటే? ...  మీ మానసిక బలాన్ని పరీక్షించుకొని, పెంపొందించుకొనే మార్గాల్లో ముఖ్యంగా ప్రతి నిత్యం జీవితంలో కొన్ని ఇష్టం లేని, కష్టంగా కనిపించే పనుల్ని చేయడం ఒకటి. అలా తరచూ సాధన చేయాలి. వీటి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా మీ మనసు ఆ పనుల్ని ఏదో ఒక వంకతో వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ పనులు చేయాలి. అలా చేయడం ద్వారా మీ మెదడులో నిక్షిప్తమైన వ్యతిరేక భావాలను అధిగమించగలుగుతారు. అంతర్గతంగా ఉన్న వ్యతిరేక శక్తులను అధిగమించడం ద్వారానే మనకు అవసరమైన అంతర్గత శక్తిని మేల్కొల్పగలం. ఉదాహరణకు మీరు బస్సులో ప్రయణిస్తున్నారనప్పుడు సీటు దొరికితే హాయిగా కూర్చుంటారు, లేకపోతే తప్పదు కాబట్టి నిలబడి ప్రయాణిస్తారు. ఒకవేళ మీకు సీటు దొరికినా సరే ఆ సీటును ఇంకొకరికి ఇవ్వండి. ఓ పదిహేను లేదా ఇరవై నిమిషాలు నిలబడి ప్రయాణించండి. ఈ చిన్న విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీలోని మానసిక నిరోధ భావాలను గమనించండి. అయినా మనస్సు మాట వినకుండా ఇంకొకరికి ఆ సీటు ఇచ్చి, ప్రయాణం చేయండి. ఆ తరువాత చూడండి. మీరు ఈ నిరోధ భావాల నుంచి బయటపడడానికి చేసిన సంఘర్షణ, చివరికి సాధించడం చూస్తే మీలో మీకే తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడితో మానసిక దౌర్బల్యాన్ని జయించాలని చెబుతూ ఎవరికైనా మనస్సును అదుపులో ఉంచుకోవడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస, వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చని బోధిస్తాడు. మీ ఇంట్లోని వారికి వారి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశారా?  ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి! నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో "అమ్మా! నేను ఏదైనా సహాయం చేయనా?” అని అడగండి, ఎప్పుడూ ఆ మాట అడగని మీరు ఈ ప్రశ్న వేసేసరికి ఆవతలివారు కాస్త కంగారు పడి, మిమ్మల్ని కొత్తగా చూడడం సహజమే. అయినా సరే, వంటిల్లు సర్దడంలోనో, కూరలు తరగడంలోనో, గిన్నెలు కడగడంలోనో సహాయం చేయండి. అది చిన్న పనే అయినా, మీకిష్టం లేని పని చేసిన తరువాత ఒక్కసారి వారి కళ్ళలోని ఆ వెలుగును చూడండి. రెండూ మిమ్మల్ని సంకల్ప బలం వైపు నడిపిస్తాయి.  ఒక్కోసారి మీరు అలసిపోయి ఇంటికొస్తారు. రాగానే మీ శరీరాన్ని సోఫాలో పడేసి అందుబాటులో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని, అలా ఎంతసేపు ఛానల్స్ మారుస్తూ కూర్చుంటారో మీకే తెలియదు. అప్పుడు స్నానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ బద్దకం మీ కన్నా బలమైంది కాబట్టి, అది అక్కడ నుంచి లేవనీయదు. అయితే ఈ సారి మీ బద్ధకం మాట వినకండి. కష్టమైనా సరే లేచివెళ్ళండి. చేయాలనుకున్న పని వాయిదా వెయ్యకుండా చేయండి. అప్పుడు చూడండి మీపై మీకే తెలియని దృఢత్వం,  ఒక నమ్మకం, ధైర్యం కలుగుతాయి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఒకరోజు మీరు కాఫీ, టీ, పాలల్లో చక్కెర లేకుండా తాగేందుకో లేదా కనీసం పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినేందుకో ప్రయత్నించండి. మీ కన్నా ముందు మీ నాలుక ఈ ప్రయోగానికి ఒప్పుకోదు. దాన్ని జయించడానికేగా ఈ ప్రయత్నమంతా! అలాగే వేడినీళ్ళ  స్నానం అలవాటున్న వాళ్ళు వరుసగా వారం రోజులు చన్నీటి స్నానం చేసి మీలోని శారీరక, మానసిక నిబ్బరాన్ని పరీక్షించి సాధించండి. చదువుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్టుతో వాయిదా వేయకుండా పోరాడండి. కొన్ని మాటలు మాట్లాడే కన్నా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి.  ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలో ఫాలో అయ్యారంటే మీ మీద మీరు విజయం సాధిస్తారు కచ్చితంగా.                                      ◆నిశ్శబ్ద.
నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగ జీవితాలు కూడా అంతే వేగంగా ఉంటాయి. పోటీ దృష్ట్యా ప్రతి సంస్థ 24 గంటలు తమ కార్యకలాపాలు కొనసాగించాలని అనుకుంటుంది. ఈ కారణంగానే సాధారణ పనివేళలు మాత్రమే కాకుండా నైట్ షిఫ్టులు కూడా కొనసాగిస్తుంది.  వేతనం గురించో ఇతర కారణాల వల్లనో చాలామంది నైట్ షిప్టులో పనిచేస్తుంటారు.  అయితే సాధారణ పని వేళల్లో పనిచేసేవారి కంటే నైట్ షిప్టులో పనిచేసేవారిలో చురుకుదనం తక్కువగా ఉంటుంది. అంతేనా సాధారణంగా నిద్రపోవాల్సిన సమయంలో ఉద్యోగాలు చెయ్యడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నైట్ షిఫ్టు డ్యూటీ చేసేవారు  ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండటానికి  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. నిద్ర.. నైట్ షిఫ్టు లో పనిచేసేవారు నిద్ర షెడ్యూల్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. నిద్రా చక్రమైన సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగితే  నిద్ర ఆటంకాలు, అలసట కలుగుతాయి.  ఈ సిర్కాడియన్ రిథమ్ గడియారాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సెలవు దినాలలో కూడా ఒకే సమయానికి పడుకోవాలి. ఆహారపు అలవాట్లు.. నైట్ షిఫ్టుల సమయంలో చాలామంది ఎనర్జీగా ఉండటం కోసం ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ తినడం మీద ఆసక్తి చూపిస్తారు. పైపెచ్చు సాధారణ భోజన సమయాలు కాకపోవడం వల్ల రాత్రి పూట ఆకలేసినప్పుడు ఇలాంటి ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. నైట్ షిఫ్ట్ అంతా చిన్న చిన్న మొత్తాలలో ఆహారం తీసుకోవాలి. నీరు బాగా త్రాగాలి. వ్యాయామం.. నైట్ షిప్టులలో పనిచేసేవారు ఉదయం సమయాల్లో పడుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలామంది ఉదయం వేళ చెయ్యాల్సిన వ్యాయామాన్ని స్కిప్ చేస్తుంటారు. లేదా పగటి సమయాన్ని లేజీగా గడిపేస్తూ  ఉంటారు. కానీ వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. జాకింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్ వంటివి మంచి ఎంపిక. ఒత్తిడి.. పనిచేసే సమయవేళలు మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఇది ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి రాకుండా చూడటం కోసం  లోతైన శ్వాస, శ్వాస వ్యాయామాలు,  ధ్యానం,  తీరిక సమయాలలో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి చేయాలి.  ఒకవేళ ఒత్తిడి సమస్య ఉంటే మానసిక నిపుణులను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవాలి. ప్లానింగ్.. నైట్ షిఫ్టులలో పనిచేసేవారు తమ పనిని చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. పని చేసేటప్పుడు అలసిపోకుండా పనిని ఏకధాటిగా కాకుండా చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ఫినిష్ చేయాలి. ఇది పక్కాగా అమలుకావడం కోసం కోలీగ్స్,  అధికారులతో సంప్రదించి వారి మద్దతు తీసుకోవాలి.                                     *నిశ్శబ్ద.  
జీవించడమూ ఒక కళ అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో మనిషి రెండు విధాలుగా బ్రతుకుతున్నాడు. ఒకటి, తనకు తోచిన విధంగా, రెండు ఓ పద్ధతి ప్రకారం. కానీ మూడవ పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్ధతిలో అమితమైన స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో బ్రతకడమే జీవించడం అంటే, ఈ పద్ధతినే జీవించే కళ అంటారు. ఇప్పుడు విదేశాలలో క్రొత్తరకం జీవనోపాధి ఒకటి స్వైరవిహారం చేస్తోంది. అదేమిటంటే మంచి వాక్చాతుర్యం కలిగి, జీవితంలో గొప్పగా సాధించిన ఒక వ్యక్తి ఇతరులకు ఎలా జీవించాలో, ఏ విధంగా జీవన పద్ధతి పాటిస్తే నిండైన విలువైన జీవితం దొరుకుతుందో వివరిస్తూ, అందులో శిక్షణా తరగతులూ, ప్రసంగాలూ ఇస్తూ ఎంతో మంచి పాతవైన, భారమైన జీవితాలని అందమైన తీరాలవైపు మళ్ళిస్తున్నారు. ఈ విధంగా జీవించేకళలో శిక్షణ ఇచ్చే మనిషిని లైఫ్ కోచ్ అని అంటున్నారు.  ఇప్పుడు ఈ లైఫ్ కోచ్ ల ఆవశ్యకత మన భారతదేశానికె అవసరం అంటున్నారు. ఎందుకంటే ప్రపంచానికే వెలుగు చూపింది మన భారతదేశం. ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రజలకు తలమానికంగా నిలచింది మన దేశమే. ఇప్పుడు కూడా ఏ దేశానికీ వెళ్ళనంత ఎక్కువ జనాభా, భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక జీవనం నేర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకొన్న గొప్ప విద్యను, జ్ఞానాన్ని వారి దేశాల్లో వినియోగిస్తూ, లైఫ్ కోచ్ లుగా, పబ్లిక్ స్పీకర్లుగా, ప్రేరణా రచయితలుగా మారి కోట్లకు కోట్లు సంపాదిస్తూ పదిమంది జీవితాలను ఉన్నతదిశగా మారుస్తూ తృప్తిగా హాయిగా జీవిస్తున్నారు. మన దేశంలో పూస్తున్న మల్లెల సువాసనను మన తుమ్మెదలు గ్రహించలేని స్థితిలో ఉంటే... విదేశాలనుండి వచ్చిన తుమ్మెదలు ఆ అద్భుత సౌరభాలను హాయిగా ఆస్వాదించి... తిరిగి మన తుమ్మెదలకే మల్లెల సువాసనలు గురించి పరిచయం చేస్తున్నాయి. ఈ విషయం ఎంత విచిత్రమో కదా అనిపించడం లేదూ... ఇక్కడ తప్పు మన తుమ్మెదలదా, విదేశీ తుమ్మెదలదా. ఆలోచిస్తే ముమ్మాటికీ మన తుమ్మెదలదే. మన దేశంలో దొరికిన కాసింత జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించి దాంతోటే వాళ్ళ దేశంలో అద్భుతాలు సృష్టిస్తుంటే, ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి మన భారతీయ విజ్ఞానంపై సర్వహక్కులూ కలిగి ఉండి,  నేర్చుకోగల అవకాశాలు ఉండికూడా భారతీయులు విఫలమవుతున్నారు.  ఈ అపాయకరమైన పరిస్థితిని గమనించి ఎందరో భారతీయ గురువులూ, తత్వవేత్తలూ, ఆధ్యాత్మిక ప్రవచకులూ గొంతు అరిగేలా అరిచి అరిచి చెప్తున్నా... కనీసం కొంచెమైనా పట్టించుకోలేని భయానకమైన స్థితిలో దేశప్రజలు దిగజారిపోతున్నారు. ఎందుకంటే... ప్రజలు తమకు తోచిన విధంగానే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా జీవించడం గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం ఒకటే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు అందుకే ఇలా చెబుతారు అని.  ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు  జీవించే పద్ధతిలో జీవితం వారిని కాలసర్పంలా కాటేస్తున్నా ఆ విషవలయాల మధ్య రొప్పుతూ బ్రతికేస్తున్నారు. విద్యార్థి దశనుండీ... పరీక్షల్లో ర్యాంకులైతే తెచ్చుకోగలరు కానీ జీవితంలో నిరంతరం పరాజయం పొందుతూనే ఉన్నారు. ఎందుకంటే జీవితం గురించిన పాఠాలు ఏ పాఠశాలలోనూ బోధించడం లేదు.  నేర్చుకుంటున్న విద్య  కడుపునిండా తిండి పెట్టగల్గుతోంది. కానీ ప్రశాంతమైన నిద్రను ఇవ్వడం లేదు. కలకాలం హాయిగా జీవించడానికి పనికిరాని విద్య... అసవరమే లేదు. ఆ విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదు. అటువంటి విద్యతో బ్రతకగలరేమోగానీ జీవించలేరు. ఎలాగైనా బ్రతికేయడం...  జీవితమవుతుందా?? జీవించడమంటే.... వెయ్యేళ్ళు ప్రజల గుండెల్లో వర్ధిల్లాలి. జీవితమే భావితరాలకు జీవితకళను నేర్పే పాఠం కావాలి. గొప్పగా జీవించలేకపోయినా కనీసం తన కుటుంబంలోని సభ్యులతో ఏ చీకూచింతా లేకుండా, నిండు ఆరోగ్యంతో, నీతిగా, ధర్మబద్దంగా ప్రతిరోజూ ఆనంద పరవశులౌతూ మనసారా తృప్తిగా జీవించగల్గితే చాలు. తమ బిడ్డలకు నైతిక విలువలు నేర్పిస్తూ, దయా, కరుణ, ప్రేమతత్వాన్ని వారికి అమృతంలా అందిస్తూ... వారు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తయారయ్యేలా చేస్తూ... కనీసం వెయ్యి మందిలో ఒక్కరైనా నిజంగా జీవించగలుగుతున్నారా?... ఇవన్నీ ప్రశ్నించుకుంటే జీవించడం గురించి ఓ అవగాహన వస్తుంది.                                      ◆నిశ్శబ్ద.
కొలెస్ట్రాల్ అనేది ఒక ప్రధాన  సమస్యగా మారుతోంది.  దీనికి సరైన ఆహారం, దిగజారుతున్న జీవనశైలి, ఒత్తిడి. కారణం అవుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ విషయంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా బాధ్యత వహిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా గుండె  ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్‌లను తినకూడదని కొందరు హెచ్చరిస్తుంటారు. ఈ వాదనలో నిజమెంతో తెలుసుకుందాం.  జీడిపప్పులో ఉండే పోషకాల గురించి మాట్లాడితే, ఆరోగ్యానికి అవసరమైన 44 శాతం కొవ్వు, 30 శాతం కార్బోహైడ్రేట్స్, 18 శాతం ప్రోటీన్లను కలిగి ఉంటుంది. జీడిపప్పు పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. పోషకాలు అధికంగా ఉండే జీడిపప్పు వినియోగం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం.  జీడిపప్పు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది జీడిపప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.    బ్రెడ్ గులాబ్ జామూన్ తయారీ విధానం.. గులాబ్ జామున్ అనేది మన సాంప్రదాయ స్వీట్, భారతదేశంలో చాలా మంది అత్యంత ఇష్టపడే స్వీట్‌లలో గులాబ్ జామూన్ ఒకటి. ఈ ఇంట్లో తయారుచేసుకునే ఈ గులాబ్ జామూన్ ను మనం ఇప్పుడు బ్రెడ్, క్రీమ్, పాల పౌడర్‌తో తయారు చేయవచ్చు. ఇది రుచికరం మాత్రమే కాదు, తయారు చేయడం కూడా చాలా సులభం.   
కలబంద.. చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.దీనిని రోజూ తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. కలబందలో ఉండే విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధకం, రక్తహీనత వంటి తీవ్రమైన వ్యాధులకు చెక్ పెడుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అలోవెరాను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ సీజన్‌లో కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. చల్లటి వాతావరణంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఏయే వ్యాధులను దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం నుండి ఉపశమనం: ఆంత్రాక్వినోన్ అనే సమ్మేళనం కలబందలో ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా, కలబంద వినియోగం కడుపు తిమ్మిరిని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో, మీరు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి  అలోవెరా జ్యూస్ తాగవచ్చు. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది: ఈ సీజన్‌లో, చాలా మందిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా, అటువంటి వ్యక్తులు అనేక సీజనల్ వ్యాధులకు గురవుతారు. అందువల్ల, ఈ సీజన్‌లో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మీరు కలబంద జ్యూస్ తాగాలి. శరీరం నిర్విషీకరణ : అలోవెరా జ్యూస్ శరీరంలోని టాక్సిక్ ఎలిమెంట్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను ఆహ్వానించే అనేక విష పదార్థాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, కలబంద రసం తీసుకోవడం ఈ తొలగింపు ప్రక్రియలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగుతే ఆరోగ్యంతోపాటు అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. రక్తహీనత సమస్యకు చెక్: నేటికాలంలో చాలా మంది రక్తహీనతకు లోనవుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఒక గ్లాసు కలబంద రసం ఈ సమస్యను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది. నిజానికి కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది. పొడి చర్మం నుండి ఉపశమనం: చలికాలంలో తరచుగా చర్మం పొడిబారుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో కూడా మీ ముఖం పోషణతో ఉండాలంటే, కలబంద రసాన్ని మీ ముఖానికి అప్లై చేయడమే కాకుండా, దాని జ్యూస్ తాగండి. నిత్యం ఈ జ్యూస్ తాగడం వల్ల మీ ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ఎప్పుడు తాగాలి? మీరు కలబంద జ్యూస్‌ని సాయంత్రం పూట కూడా తాగవచ్చు. అయితే ఉదయం పూట కలబంద జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.  
సీజన్ల వారిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ప్రముఖమైనవి.  వేసవి కాలం ఇక ముగుస్తుందనగా మార్కెట్లలోకి చొచ్చుకువచ్చి సందడి చేసే నేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాదు, బోలెడు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వైలెట్ కలర్ లో ఉంటూ ఉప్పగా, వగరుగా ఉండే ఈ నేరేడు కాయలు  క్రమంగా నల్లగా మారి నిగనిగలాడుతూ చెప్పలేనంత తియ్యదనంగా మారుతాయి.  జామూన్ ఫ్రూట్ గా పిలిచే ఈ నేరేడు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం దీనికున్న ప్రత్యేక లక్షణం. అయితే నేరేడు పండ్లు అందరూ తింటారు. కానీ గింజలు ఉపయోగించే వారు తక్కువ. నేరేడు పండ్లలానే వాటి గింజలు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మధుమేహం నియంత్రించడంలో అద్భుతాలు చేయడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. నేరేడు గింజల పొడి ప్రయోజనాలను తెలుసుకుంటే నేరేడు పండ్లు తినగానే ఆ విత్తనాలను ఇకమీదట పడెయ్యరు. నేరేడు గింజలు పొడి తీసుకోవడం ద్వారా కలిగే అయిదు అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, గ్లైకోసూరియాను తగ్గించడానికి నేరేడు విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పండు గింజలు జంబోలిన్ మరియు జాంబోసిన్ అనే క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలోకి విడుదలయ్యే చక్కెర రేటును నెమ్మదిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. శాస్త్రీయంగా, ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఫలితంగా  మూత్రవిసర్జన, చెమటలను సహజంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.  నేరేడు విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి, కాలేయ కణాలను రక్షిస్తాయి. ఇంకా ఈ గింజలు పొడిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది కాలేయంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.  నేరేడు గింజల పొడిలో ఎల్లాజిక్ యాసిడ్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి రక్తపోటు వేగవంతమైన హెచ్చుతగ్గులను నియంత్రించడంలో  సహాయపడతాయి. నేరేడు గింజలు ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అయిదు ప్రయోజనాలు పొందడానికి నేరేడు గింజల పొడిని తీసుకోవడం మంచిది. ◆నిశ్శబ్ద