LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పోలింగ్ రోజే వెల్లడైపోయింది. ఓటరు ఉత్సాహంలో  ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను విస్పష్టంగా కనిపించింది. దేశ, విదేశాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి మరీ వచ్చి తమ ఓటు హక్కను వినియోగించుకున్న ప్రజలు. ప్రలోభాలు కాదు, తమకు రాష్ట్ర ప్రగతి, పురోభివృద్ధి ముఖ్యమని విస్పష్టంగా చాటారు. నిజమే సోమవారం ఆంధ్రప్ర ఎన్నడూ లేని విధంగా విదేశాల నుంచి, దేశంలోని వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన ఆంధ్రులు లక్షల సంఖ్యలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో స్థిరపడిన ఆంధ్రులు లక్షల సంఖ్యలో రాష్ట్రానికి వచ్చి తమ స్వస్థలాలలో క్యూలో నిలుచుని మరీ ఓటు వేశారు. సోమవారం మధ్యాహ్నం కూడా రైళ్లలో బస్సుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి ఓటు హక్కు వినియోగించుకు తీరాలన్న పట్టుదలతో వస్తున్న జనంలో ఓటింగ్ సమయానికి చేరుకుంటామా లేదా అన్న ఆత్రుత, ఆందోళన కనిపించిందంటే రాష్ట్రంలో మార్పు కోసం, రాష్ట్రం ప్రగతి కోసం వారెంతగా తహతహలాడుతున్నారో అర్ధమౌతున్నది.  గత ఐదేళ్లుగా   వైసీపి పాలనలో నరకం చూసిన జనం ఈ ఎన్నికల కోసమే చకోర పక్షుల్లా ఎదురు చూశారు.  ‘ఎన్నికల కోసం ఓటరు ఎదురు చూపు’ అనే శీర్షికన తెలుగువన్ గత ఏడాది సెప్టెంబర్ లోనే చెప్పింది. చివరకు అదే జరిగింది. ఎన్నికల రోజు జనం ఓటెత్తారు.   సోమవారం (మే13) తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి క్యూలలో నిలుచున్నారు. రాత్రి పొద్దు పోయిన తరువాత కూడా వేల మంది పోలింగ్ బూత్ ల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలలో నిలుచుని ఉండటం కనిపించింది. రాత్రి 11 గంటల వరకూ కూడా దాదాపు 3500 పోలింగ్ బూత్ ల వద్ద ప్రజలు క్యూలైన్ లో ఉండటం కనిపించింది.  ఈవీఎంలు మొరాయించినా జనం విసిగి వెళ్లిపోలేదు. గంటల తరబడి పోలింగ్ బూత్ ల వద్దే క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు.  ఎన్నికల సంఘం ఈ సారి 80శాతానికి మించి పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది.   ఇక అనంతపురం, అన్నమయ్య, పల్నాడు జిల్లాలలో వైసీపీ అరాచకత్వం పరాకాష్టకు చేరినా జనం మాత్రం అదరలేదు, బెదరలేదు.   కసితో ఓట్లు వేయడానికి వచ్చిన్నట్లు వచ్చి ఓట్లు వేస్తూనే ఉన్నారు.  అల్లర్లు, దాడులకు టిడిపి, వైసీపిలు పరస్పరం ఆరోపించుకున్నాయి.   ఈ అల్లర్లు, విధ్వంసం వైసీపి ఓటమిని సూచిస్తుంటే, పెరిగిన పోలింగ్‌ శాతం టిడిపి, జనసేన, బీజేపీల విజయాన్ని సూచిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (మే 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఎనిమిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని 70వేల 815 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 245 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 16లక్షల రూపాయలు వచ్చింది. 
వైసీపీ భ్రమలు తొలగిపోయాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులూ ఆ పార్టీకీ ఛీ కొట్టేశారు. సంక్షేమం అంటూ తమ ఇంత కాలం భ్రమల్లో ఉంచి చేసిన నిర్వాకం చాలన్నట్లుగా వైసీపీకి వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లకు పోటెత్తారు. సంక్షేమ లబ్ధాదారులు కదా, మనకే ఓటేస్తారు అన్న భ్రమల్లో ఉన్న వైసీపీకి తామెటు వైపో తమ ధిక్కారం ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. నమస్కారానికి ప్రతినమస్కారం, తిరస్కారానికి తిరస్కారం అన్నట్లుగా ఏకంగా పోలింగ్ బూత్ లలోనే వైసీపీ నేతలపై తిరగబడ్డారు. మాటకు మాట చెబుతూ మీ పనైపోయిందన్న సంకేతాలు ఇచ్చారు.  సరిగ్గా అలాంటి తిరస్కారమే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ఎదురైంది. తమ వాళ్లేకదా అని ఓ ఓటరు వేసుకున్న ఎర్రకండువా తీసేయమని చెప్పిన వంగా గీతకు సదరు ఓటరు దిమ్మతిరిగిపోయేలా బదులిచ్చారు.   నేను తీయను అయినా నా కండువా ఊసు మీకేందుకు అంటూ నిలదీశారు.   ఇలా ఒంటిపై ఉన్న దుస్తులను చూసి కూడా భయపడే పరిస్థితి వైసీపీ  నేతలకు స్వయంగా ఆ పార్టీ అధినేత జగనే కనిపించారు. నలుపు అంటే నిరసన, పసుపు అంటే తెలుగుదేశం అన్న భయాన్ని వారిలో ఏర్పడేలా చేసింది స్వయంగా జగనే. అందుకే ఆయన పార్టీ నేతలెవరూ నల్ల రంగు దుస్తులు వేసుకోరు. అది ఆ పార్టీలో అప్రకటిత నిషేధం. అంతెందుకు జుట్టుకు నల్ల రంగు వేసుకోవడానికి కూడా అంబటి వంటి వారు భయపడతారు. జగన్ కు ఎక్కడ కోపమొస్తుందోనని. ఇటీవల జగన్ ఓ ప్రచార సభలో చెల్లెలు షర్మిల పసుపు చీర కట్టుకోవడాన్ని కూడా ఆక్షేపించి భంగపడిన సంగతి తెలిసిందే. తన చీరపై కామెంట్ చేసిన అన్న జగన్ ను షర్మిల ఉతికి ఆరేశారు. పసుపు రంగు టీడీపీ పేంటంట్ హక్కా..? ఆ రంగుని బాబు కొనుక్కున్నారా..? ఏపీలో పసుపు రంగు నిషేదించారా..? అంటూ షర్మిల ప్రశ్నలతో జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేసేశారు. దీంతో ఆమె చీర ఊసెందుకెత్తాన్రా అంటూ జగన్ తలబాదుకున్న పరిస్థితి. ఒక్క షర్మిల మాత్రమే కాదు, విపక్ష పార్టీలూ, చివరాఖరికి సొంత పార్టీ శ్రేణులూ కూడా జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టాయి.  ఇప్పుడు ఎర్ర కండువా లేదా తుండుపై పోలింగ్ బూత్ లోనే పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ వంగా గీత ఓటరుతో పంచాయతీ పెట్టుకున్నారు. వంగా గీత ఎర్ర తువ్వాలు తీసేయమంటూ ఓటరును దబాయించడం, నా ఒంటి మీద తువ్వాలు రంగుతో మీకేం పని అంటూ అతను తిరగబడటం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.  గీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో   వైసీపీ కి ఎర్ర తుండు ఓటమి భయం చూపించేసింది అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో వంగా గీతపై సెటైర్లు గుప్పిస్తున్నారు. గబ్బర్ సింగ్ అనే సినిమాలో హీరో పవన్ కల్యాణ్  వేసుకున్న ఎర్ర తువ్వాలు ఆ తరువాత ఆయన అభిమానులకు ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఇప్పుడు ఆ రంగు తుండు పోలింగ్ బూత్ లో కనిపించేసరికి వంగా గీతకు భయం పట్టుకుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.   వంగా గీత ఎర్ర తువ్వాలు పంచాయతీపై  జనసేన నేత నాగబాబు  ఎర్ర తువాల్ ను కాశీ తువ్వాలు అంటారు. దీనిని కష్టం చేసే ప్రతి కార్మికుడు ధరిస్తాడు. ఇది ధరించడం వారి హక్కు. తువ్వాలు ను వేసుకోవడాన్ని అడ్డుకోవడం చట్ట వ్యతిరేకమే  తర్వాత మీ ఇష్టం అంటూ సోషల్ మీడియా వేదికగా వంగా గీతకు నాగబాబు చురకలంటించారు.   
వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోవ‌టం ఖాయ‌మైంది. ఐదేళ్ల‌ పాటు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌, అరాచ‌క పాల‌న‌కు విసిగిపోయిన ఏపీ ప్ర‌జలు ఓటు ద్వారా వీడ్కోలు ప‌లికేశారు. వైసీపీ శ్రేణుల హింసకు పాల్పడుతూ రెచ్చిపోయి భ‌యాందోళ‌న‌కు గురిచేసినా, ప‌లు పోలింగ్ కేంద్రాల్లో దాడుల చేసినా బెద‌రకుండా, అద‌ర‌కుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ ల వ‌ద్ద‌కు ఓట‌ర్లు పోటెత్తారు. రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు మ‌హిళ‌లు, యువ‌తులు సైతం క్యూలైన్ల‌లో నిల‌బ‌డి ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. అరాచ‌క ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేందుకు కంక‌ణం క‌ట్టుకొని మ‌రీ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉండ‌టంతో ఓట‌మి ఖాయ‌మ‌ని ముందే ఊహించిన వైసీపీ గ్యాంగ్‌ పోలింగ్‌ ఎక్కువ‌ శాతం న‌మోదు కాకుండా అడ్డుకునేందుకు అనేక‌ ప్ర‌య‌త్నాలు చేసింది. పోలింగ్ ప్రారంభం నుంచి గొడ‌వలు సృష్టించ‌డం మొద‌లు పెట్టారు. టీడీపీ నేత‌ల వాహ‌నాల‌పై దాడులు, పోలింగ్ బూత్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన టీడీపీ నేత‌ల‌ను అడ్డుకోవ‌టం, కూట‌మి త‌ర‌పున పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్ల‌ను కిడ్నాప్ లు, దాడులు చేయ‌డం ద్వారా భ‌యాన‌క వాతావ‌ర‌ణంను సృష్టించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఓట‌ర్లు వైసీపీ కుట్ర‌ల‌ను తిప్పికొట్టి పోలింగ్ కేంద్రాల వ‌ద్ద గంట‌ల‌ కొద్దీ కూలైన్ల‌లో నిల్చొని మ‌రీ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. రాత్రి 11 గంట‌ల‌కు వ‌ర‌కు ప‌లు పోలింగ్ కేంద్రాల్లో కూలైన్లు క‌నిపించాయి. పోలింగ్ ప్రారంభ‌మైన స‌మ‌యం నుంచి రాత్రి వ‌ర‌కు వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌ను అడ్డుకోవ‌టంలో పోలీసులు విఫ‌ల‌మ‌య్యారు. ఉద‌యం నుంచి వైసీపీ నేత‌లు ఘ‌ర్ష‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న‌ప్ప‌టికీ పోలీసులు అల‌ర్ట్ కాక‌పోగా ప‌లు ప్రాంతాల్లో వైసీపీ నేత‌ల‌కు కొంద‌రు పోలీసులు మ‌ద్ద‌తుగా నిలిచారు.  వైసీపీ పార్టీని ఓట‌మి భ‌యం ఎంత‌లా వెంటాడిందంటే తెనాలి ఘ‌ట‌న ప్రధాన ఉదాహ‌ర‌ణ‌. క్యూలైన్ లో వ‌చ్చి ఓటు వేయాల‌ని ప్ర‌శ్నించినందుకు తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి అన్నబత్తుని శివ కుమార్ ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. స‌హ‌నం కోల్పోయి ఓట‌రు పై చేయిచేసుకున్నాడు. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు శివకుమార్ పై తిర‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓట‌మి భ‌యంతో స‌హ‌నం కోల్పోయి వైసీపీ నేత‌లు ఓట‌ర్ల‌పై దాడులు చేయ‌డం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు సాగాయి. క‌డ‌ప జిల్లాలోనూ వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. క‌డ‌ప న‌గ‌రంలోని గౌస్ న‌గ‌ర్ లో దొంగ ఓట్లు వేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ వైసీపీ నేత‌ల‌ను అడ్డుకునేందుకు టీడీపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నం చేయ‌గా ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్ల‌ దాడికి దిగి ఓట్ల‌ర్ల‌ను, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను భ‌య‌ బ్రాంతుల‌కు గురిచేశారు. ఒంగోలులో టీడీపీ ఏజెంట్ల‌పై వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు య‌త్నించ‌గా టీడీపీ నేత‌లు అడ్డుకున్నారు.. దీంతో మాజీ మంత్రి బాలినేని కోడ‌లు శ్రీ‌కావ్య ఆధ్వ‌ర్యంలో టీడీపీ ఏజెంట్ల‌పై వైసీపీ అల్ల‌రిమూక‌లు దాడుల‌కు దిగారు. అదే విధంగా మ‌న్యం జిల్లా వీర‌ఘ‌ట్టం మండ‌లం తెట్టంగి గ్రామంలో ఎస్సీల‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఇళ్ల‌లోకి చొర‌బ‌డి క‌ర్ర‌లు, రాళ్ల‌తో వైసీపీ శ్రేణులు దాడుల‌కు దిగారు. ప్ర‌కాశం జిల్లాలో వీర‌భ‌ద్ర‌పురంలో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పోలింగ్ బూత్ వ‌ద్ద బెదిరింపుల‌కు దిగాడు. పోలింగ్ అధికారుల‌పైనా బెదిరింపుల‌కు పాల్ప‌డి పోలింగ్ త‌మ‌కు అనుకూలంగా జ‌రిగేలా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు.  పల్నాడు జిల్లాలో వైసీపీ గూండాలు బీభ‌త్సం సృష్టించారు. తంగెడ‌లో నాటు బాంబులు, పెట్రోల్ సీసాల‌తో దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో భ‌యాందోళ‌న‌తో పోలింగ్ కేంద్రం నుంచి ఓట‌ర్లు ప‌రుగులు తీశారు. నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలుపై రాళ్లదాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు రావటానికి వీలులేదని వైసీపీ వర్గీయులు వారించగా.. వచ్చే హక్కు ఉందని ట్రైనీ కలెక్టర్ చెప్పారు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన వైసీపీ మూక‌లు శ్రీకృష్ణ దేవరాయలు కాన్వాయ్ పై రాళ్ల‌దాడి చేశాయి. అదే విధంగా అంబ‌టి రాంబాబు అనుచ‌రులు వీరంగం సృష్టించారు. పోలింగ్ బూత్ ల వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించి ఓట‌ర్ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశారు. న‌ర్స‌రావుపేట ప‌ట్ట‌ణంలోని మున్సిప‌ల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వ‌ద్ద వైసీపీ శ్రేణులు హ‌ల్ చ‌ల్ చేశాయి. చ‌ద‌ల‌వాడ కారుపై దాడికి దిగాయి. పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీ శ్రేణులు పేట్రేగిపోయాయి. దొంగ ఓట్లు వేసేవారిని టీడీపీ నేత‌లు అడ్డుకోవ‌టంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడికి దిగారు. మంత్రి జోగి ర‌మేష్‌, ఆయ‌న కుమారుడు రాజీవ్ ఓట‌మి భ‌యంతో పోరంకి ఎన్నిక‌ల బూత్‌ల వ‌ద్ద వారి అనుచ‌రుల‌తో అల‌జ‌డి సృష్టించి పోలింగ్ ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఓట‌ర్లు మాత్రం ఘ‌ర్ష‌ణ‌ల‌కు భ‌య‌ప‌డ‌కుండా త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌పై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో 120కిపైగా ప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణుల‌పై దాడులు జ‌రిగాయ‌ని, వైసీపీ మూక‌లు పోలింగ్ ను అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేశార‌ని ఈసీకి లేఖ రాశారు. ప‌లు ప్రాంతాల్లో పోలీసుల తీరును చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టారు. కొంద‌రు పోలీసులు కావాల‌ని వైసీపీకి మ‌ద్ద‌తు ప‌నిచేశార‌ని ఈసీకి రాసిన లేఖ‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్ష‌క పాత్ర వ‌హించ‌డం ప‌ట్ల చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  అనంత‌పురం జిల్లాలోనూ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. తాడిప‌త్రిలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ప‌రిస్థితి త‌లెత్తింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొంద‌రు పోలీసుల అండ‌తో తెలుగుదేశం నేత‌ల‌పై దాడుల‌కు య‌త్నించారు. తెలుగుదేశం శ్రేణులు ఎదురుతిర‌గ‌డంతో పోలీసులు రంగంలోకిదిగి ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్త‌కుండా అడ్డుకున్నారు. అయినా ప‌లు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు తెలుగుదేశం నేత‌ల‌పై దాడుల‌కు దిగారు. శ్రీ‌కాకుళం జిల్లా ఆముదాల వ‌ల‌స‌లో తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లపై వైసీపీ నేత‌లు దాడికి దిగారు. ప‌లువురు  కార్య‌క‌ర్త‌లకు గాయాల‌య్యాయి. అన్న‌మ‌య్య జిల్లా ల‌క్కిరెడ్డిప‌ల్లి మండ‌లం చౌట‌ప‌ల్లెలో తెలుగుదేశం ఏజెంట్ల‌పై వైసీపీ మూక‌లు రాళ్ల‌దాడికి దిగాయి. అదేవిధంగా మాచ‌ర్ల‌లోని పోలింగ్ ఏజెంట్ల‌పైనా వైసీపీ గూండాలు దాడుల‌కు పాల్ప‌డ్డారు. క‌డ‌ప జిల్లాలో తెలుగుదేశం ఏజెంట్ పైనా వైసీపీ గూండాలు దాడి చేశారు. రాష్ట్రం వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు దాడుల‌తో పోలింగ్ భారీగా జ‌ర‌గ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఓట‌ర్లు రాత్రి 11గంట‌ల దాటినా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద క్యూలైన్ల‌లో నిల‌బ‌డి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. దీంతో వైసీపీ పెద్ద‌లు ఓట‌మి ఖాయ‌మ‌నే భావ‌న‌కు వ‌చ్చేశారు. మొత్తానికి ఐదుళ్లుగా అరాచ‌క పాల‌న‌ను కొన‌సాగించిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలింగ్ బూత్ ల వ‌ద్ద ఓట‌ర్ల ఉత్సాహంతో గ‌ద్దెదిగ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది.
ముంబైలో పలు ప్రాంతాల్లో భారీ గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల కారణంగా ఘట్కోపర్ ప్రాంతంలో ఒక భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ హోర్డింగ్ పక్కనే వున్న పెట్రోల్ బంక్‌పై పడటంతో ఎనిమిది మంది మరణించారు. వర్షం కారణంగా పెట్రోల్ బంక్‌లో తల దాచుకున్న 60 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్.డి.ఆర్.ఎఫ్., అగ్నిమాపక బృందాలు దుర్ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని రక్షించాయి. భారీ గాలులు, వర్షం కారణంగా ముంబైలో జనజీవనం అతలాకుతలం అయింది. ఒక గంటసేపు విమాన సర్వీసులను కూడా నిలిపేశారు.
ALSO ON TELUGUONE N E W S
RK Celluloids Director KS Ravikumar and RGC presents 'Hit List' audio launch was held yesterday in Chennai. The event was inaugurated by the families of the production team. An exclusive screening of the film's trailer and two lyrical videos were aired. Special guests like Directors Desingu Periyasamy, Ponram, Mithran R. Jawahar, Karthik Subbaraj, 'Siruthai' Siva, Pererasu, Kathir, Saran, Ezhil, Rajakumaran, Subramaniam Siva, Vasantha Balan, Mysskin, R.V. Udayakumar, P. Vasu, Director and Actor Santhana Bharathi, R. Parthipan, K. Bhagyaraj, Ramesh Khanna, Actors 'Supreme Star' Sarathkumar, Jiiva, Jayam Ravi, Actor and Producer Jayaprakash, Producers Kalaipuli. S. Thanu, T. Siva, Suresh Kamatchi and G Dhananjayan graced the event with their esteemed presence. Laer, directors K. Bhagyaraj and P Vasu felicitated the director duo of the film- Sooryakathir Kaakkallar and K Karthikeyan. Actor Jayam Ravi introduced Vijay Kanishka, the protagonist of the film and felicitated him on stage. Then the crew was introduced and welcomed one by one. While welcoming everyone, the producer of the film K.S. Ravikumar said, "I thank Ramesh Grand Creations Karthik, Kamalakannan, Srinivasan, Vijayakumar, who are responsible for making this movie. First of all I would like to thank 'Supreme Star' Sarathkumar for loving me and director Vikraman sir and agreeing to play an important role in this film. I am grateful to both Gautham Vasudev Menon and Samuthirakani for agreeing to the story and character. Many thanks to Sithara who agreed to play an important role and to all those who played supporting roles. Even though I made my assistant directors work as the directors of this movie, they made the screenplay very good. I also asked Sarathkumar and Gautham for their feedback. Thank you everyone for making it happen," he said. *Director Desingh Periyasamy:* "The quality of the film, which is being developed amidst various obstacles, is evident from the trailer. Rather than Vijay Kanishka playing the lead role, Sarathkumar and Gautham Menon have acted better as characters. I wish this film a huge success." *Director Perarasu:* "I see this event as a family festival. Director Vikraman was introduced by a big production company like Super Good Films and today to express his devotion to him, Director KS Ravikumar has made a film with his son under his home production. This is the love between Vikraman and K.S. Ravikumar. Vijay Kanishka will be a successful hero and the film will be a huge success," he said. *Producer Kalaippuli S Thanu:* "The films directed by Vikraman and K.S. Ravikumar have brought good revenue to the producers. I wish the achievements of them both will reach Vijay Kanishka". *Actor Jayam Ravi:* "It is because of the love of directors K.S. Ravikumar and Vikraman that so many directors have attended the event here. Both are great personalities of Indian cinema. I hope that Vijay Kanishka will live up to their name and become one of the popular names in Indian cinema. You have received the same support that I received when I made my debut. Also, I am very proud to have the opportunity to introduce you. I wish this film a success", he said. *Actor Jiiva:* "I have acted as a child artiste in the direction of K.S. Ravikumar and Vikraman, so this feels like a family event. Everyone came to congratulate me even when I made my debut. I also managed to give great films. Their greetings will be a great blessing to you Kanishka. I wish you all the best. My best wishes to the directors and RK Celluloids", he said. *Director Karthik Subbaraj:* “My best wishes to Vijay Kanishka, music director C. Sathya and the directors. I would also like to thank Vikraman sir who was the main reason behind the release of my second film Jigarthanda", he said. *Director K. Bhagyaraj:* "This is more like a thanksgiving ceremony than an audio launch. We have to thank Super Good Films R.B. Choudhary. He has served Tamil cinema by introducing new directors. I had watched Hit List and the film has indeed come out well. I wish Vijay Kanishka the best", he said. *Director Mysskin:* "Vikraman Sir has named his son after a great king. I love all the titles of his films like Vanathaippola, Poove Unakkaga. They are very poetic. I congratulate Vijay Kanishka and the directors and wish this movie all success. I request all the fans to go and see the movie in theatres", he said. *'Supreme Star' Sarath Kumar:*  "Both director K.S. Ravikumar and Vikraman are important people in my life who have given me unforgettable moments. They are the best people and I want to be associated with them forever. No matter how many problems K.S. Ravikumar and I face, we sort it out as he is a golden person. This is a family event. Vijay Kanishka has excelled as a debutant. C Sathya's music is excellent. I wish the film 'Hitlist' a huge success," he said. *Producer Suresh Kamatchi:* "This stage is filled with positivity as it's been graced by people like K. Bhagyaraj, R Parthiban, Vikraman, K.S. Ravikumar and others. Vijay Kanishka has a great future. I hope the film will be successful", he said. *Director R.V. Udhayakumar:* "I have travelled together with director K.S. Ravikumar and director Vikraman. Vikraman is also one of the reasons for the success of the directors' association. He has set his son on the right track in the film industry amidst various family circumstances. To make the film 'Hit List' a success, it's up to the audience and the fans," he said. *Director Vikraman:* "K.S. Ravikumar himself spoke about everything I wanted to share. I express my sincere gratitude to him for making this film. I am not speaking as a father, but as a director; Vijay Kanishka has acted well. This film will definitely be a hit. I wish him more success."
కొంతకాలంగా సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు ఆ లిస్టులో ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాష్ కుమార్ - సైంధవి జంట కూడా చేరిపోయింది. జి.వి. ప్రకాష్.. తన బాల్య స్నేహితురాలు, సింగర్ సైంధవిని 2013 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 లో ఈ జంటకి కూతురు పుట్టింది. అయితే పెళ్లయిన 11 ఏళ్ళ తర్వాత విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించి షాకిచ్చారు జి.వి. ప్రకాష్, సైంధవి దంపతులు.  ఎంతో ఆలోచించిన తర్వాత, తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు జి.వి. ప్రకాష్, సైంధవి ప్రకటించారు. మానసిక ప్రశాంతత మరియు తమ జీవితాలు మెరుగ్గా ఉండటం కోసం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "మేము విడిపోవాలని తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని నమ్ముతున్నాం. మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకొని, మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉంటారని కోరుకుంటున్నాం." అని జి.వి. ప్రకాష్, సైంధవి అన్నారు.
సాయి వరుణవి క్రియేషన్స్‌, ఖరిష్మ డ్రీమ్స్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ పై  గెటప్‌ శ్రీను హీరో గా రూపొందిన చిత్రం ‘‘రాజు యాదవ్‌ ‘‘. నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి కె దర్శకుని గా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా మే 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్బంగా రాజు యాదవ్‌ టీం ప్రమోషన్స్‌ విషయంలో జెట్‌ స్పీడ్‌ లో దూసుకుపోతుంది. రీసెంట్‌ గా హనుమాన్‌ సినిమా తో ప్యాన్‌ ఇండియా హీరో గా ఎదిగిన సూపర్‌ హీరో ‘‘తేజ్‌ సజ్జా’’ చేతులు మీదగా విడుదలైన ట్రైలర్‌ కి అధ్బుతమైన రెస్పాన్స్‌ వస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండిరగ్‌ లో వుంది. ఇప్పుడు రాజు యాదవ్‌ టీం నుండి మరో సాంగ్‌ రిలీజ్‌ చేశారు. నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్‌ అవార్డు అందుకున్న అక్షర తపస్వి చంద్ర బోస్‌ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సాహిత్యం అందించి, స్వయంగా ఆయనే పాడిన ‘‘లేదే లేదే ప్రేమసలే’’ పాటని విడుదల చేశారు.   చిత్ర నిర్మాతలైన ప్రశాంత్‌ రెడ్డి , రాజేష్‌ కల్లెపల్లి మాట్లాడుతూ ఇప్పటివరకు మా సినిమా నుండీ విడుదలైన ప్రతి కంటెంట్‌ ప్రేక్షకులని మెప్పించిందని.. రీసెంట్‌ గా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ కి వస్తున్న రెస్పాన్స్‌ మా సినిమా మీద మాకు మరింత నమ్మకం కలిగించిందని, చిన్న సినిమాగా మొదలైనా మా సినిమాని ఇంతమంది సినీ ప్రముఖులు, మీడియా వ్యక్తులు సపోర్ట్‌ చెయడం తో మాకు చాలా సంతోషంగా వుందని, ఖచ్చితంగా మీ మా అంచనాలను దాటి పెద్ద హిట్‌ అవుతుందని, త్వరలోనే భారీ ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తామని చెప్పారు.
పెళ్లి చూపులు, డియర్‌ కామ్రేడ్‌, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో వంటి డిఫరెంట్‌ మూవీస్‌ నిర్మించి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ బ్యానర్‌ బిగ్‌ బెన్‌ సినిమాస్‌. ఈ సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్‌ ను లాంఛ్‌ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సంస్థలో ఇప్పటికే తరుణ్‌ భాస్కర్‌, భరత్‌ కమ్మ, కేవి మహేంద్ర, సంజీవ్‌ రెడ్డి వంటి పలువురు యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌ ను పరిచయం చేశారు నిర్మాత యష్‌ రంగినేని. తాజాగా మరో డైరెక్టర్‌ ను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ఉప్పెన సినిమాలో హీరోయిన్‌ కృతి శెట్టికి డబ్బింగ్‌ చెప్పిన ఆర్జే శ్వేత పీవీఎస్‌ ను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ రేపు ఉదయం 11.07 నిమిషాలకు రివీల్‌ చేయబోతున్నారు. బిగ్‌ బెన్‌ సినిమాస్‌ గత సినిమాల్లాగే రిచ్‌ కంటెంట్‌, న్యూ కాన్సెప్ట్‌ తో ఈ సినిమా తెరకెక్కనుంది.
హారర్‌, కామెడీ మిక్స్‌ చేసి తీస్తోన్న సినిమాలకు అన్ని వర్గాల ఆడియన్స్‌ నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం హారర్‌, కామెడీ జానర్లలో వచ్చే చిత్రాలకు ఇటు ఓటీటీ, అటు థియేటర్లో మంచి డిమాండ్‌ ఏర్పడిరది. ఇప్పుడు అదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఓఎంజి’(ఓ మంచి ఘోస్ట్‌) మూవీ. హార్రర్‌ సన్నివేశాలకు హాస్యం జోడిరచి నేటితరం ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యేలా సరికొత్తగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.      మార్క్‌సెట్‌ నెట్‌వర్క్స్‌ బ్యానర్‌పై హాస్యభరితమైన హార్రర్‌ సినిమాగా ఓ మంచి ఘోస్ట్‌ రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ కమీడియన్‌ వెన్నెల కిషోర్‌, నందితా శ్వేత, షకలక శంకర్‌, నవమి గాయక్‌, నవీన్‌ నేని, రజత్‌ రాఘవ్‌, హాస్యనటుడు రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్‌, లిరికల్‌ సాంగ్‌ ఇలా ప్రతీ ఒక్కటీ ప్రేక్షకుల్లో బజ్‌ను క్రియేట్‌ చేశాయి. ఇక తాజాగా రిలీజ్‌ చేసిన టీజర్‌ అయితే అందరినీ నవ్విస్తోంది. భయపెట్టేస్తోంది.  ‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్‌తో టీజర్‌ ఓపెన్‌ అయింది. ‘ఒసేయ్‌ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌వైనా, కాంచన కజిన్‌వైనా’ అంటూ వెన్నెల కిషోర్‌ చేసే కామెడీ.. ‘నేను మోహిని పిశాచి మోహం తీర్చా..కామిని పిశాచి కామం తీర్చా.. శంకిని పిశాచి సంక నాకా.. సంక నాకించా’ అంటూ షకలక శంకర్‌ చేసే కామెడీ ఈ టీజర్‌కే హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఇక ఘోస్ట్‌గా నందితా శ్వేతా అందరినీ భయపెట్టేలా ఉంది. 
‘క్వీన్‌ ఆఫ్‌ మాసెస్‌’ కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌ లో నటిస్తున్న సినిమా ‘‘సత్యభామ’’. నవీన్‌ చంద్ర అమరేందర్‌ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘‘మేజర్‌’’ చిత్ర దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ ప్లే అందించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు సుమన్‌ చిక్కాల రూపొందించారు. ‘‘సత్యభామ’’ సినిమా త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు వస్తోంది. ఈ రోజు ‘‘సత్యభామ’’ సినిమా నుంచి థర్డ్‌ సింగిల్‌ ‘వెతుకు వెతుకు..’ రిలీజ్‌ అనౌన్స్‌ మెంట్‌ చేశారు. ఈ పాటను ఈ నెల 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నేరస్తులను పట్టుకోవడంలో పోలీస్‌ ఆఫీసర్‌ గా సత్యభామ చేసే సెర్చింగ్‌ నే ఈ పాటకు నేపథ్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా రిలీజ్‌ చేసిన టీజర్‌, లిరికల్‌ సాంగ్స్‌ తో ‘‘సత్యభామ’’ సినిమా మీద మంచి ఎక్స్‌ పెక్టేషన్స్‌ ఏర్పడుతున్నాయి.
వెర్సటైల్‌ హీరో సత్యదేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేశాయి.  సత్యదేవ్‌లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన చిత్రంగా కృష్ణమ్మ మనన్నలు అందుకుంటోంది. సినిమాలో సత్యదేవ్‌ రగ్డ్‌ లుక్‌, రస్టిక్‌ యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. సత్యదేవ్‌ సినీ కెరీర్లో ‘కృష్ణమ్మ’ సినిమా ఓ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తొలి రోజునే 1 కోటి రూపాయల గ్రాస్‌ వసూళ్లను సినిమా రాబట్టుకుంది. ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఐపీఎల్‌ క్రికెట్‌ ఫీవర్‌ నేపథ్యంలో విడుదలైన ‘కృష్ణమ్మ’కు మంచి కలెక్షన్స్‌ రాబట్టుకోవటం మంచి పరిణామం. సత్యదేవ్‌ కెరీర్‌ లో బెస్ట్‌ మూవీ ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ ఇవే. ‘కృష్ణమ్మ’ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుంచే కాదు, అటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. మంచి మౌత్‌ వచ్చింది. దీంతో సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంది. మే నెలాఖరు వరకు పెద్దగా రిలీజెస్‌ లేనందు వల్ల కృష్ణమ్మ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర విజయాన్ని సాధిస్తుందనటంలో సందేహం లేదు. ప్రేక్షకులను చక్కటి యాక్షన్‌ ఎలిమెంట్స్‌ తో ఆకట్టుకుంటూ థియేటర్స్‌ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది కృష్ణమ్మ.
మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కళ్యాణ్‌, రవీంద్ర విజయ్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘‘ఆరంభం’’. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌ పై అభిషేక్‌ వీటీ నిర్మించారు. అజయ్‌ నాగ్‌ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ‘‘ఆరంభం’’ నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో సినిమా సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అభిషేక్‌ వీటీ మాట్లాడుతూ - మా సినిమాకు ప్రతి షో 60, 70 పర్సెంట్‌ ఫిల్‌ అవుతున్నాయి. నిన్న ఈవెనింగ్‌ థియేటర్స్‌ నుంచి మంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. ప్రేక్షకులు ఇంకా మరింత మంది మా మూవీ చూసేందుకు రండి. మీరు ఆదరిస్తేనే ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్‌ తో సినిమాలు చేయగలం. మీ సపోర్ట్‌ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు. సంగీత దర్శకుడు సింజిత్‌ యెర్రమిల్లి మాట్లాడుతూ - మా మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంది. రివ్యూస్‌ కూడా అప్రిషియేట్‌ చేస్తూ వచ్చాయి. నా ఫేవరేట్‌ రివ్యూవర్స్‌ చాలా మంది మూవీ బాగుందని రాశారు. మంచి ప్లెజెంట్‌ మూవీ మీరు థియేటర్‌ లో చూస్తే ఎంజాయ్‌ చేస్తారు. అన్నారు. దర్శకుడు అజయ్‌ నాగ్‌ వి మాట్లాడుతూ - ఎక్కువ థియేటర్స్‌ లో మా సినిమా రిలీజ్‌ కాలేదు. అదొక్కటే ప్రేక్షకుల నుంచి వస్తున్న కంప్లైంట్‌. మూవీ చూసిన వాళ్లు మాత్రం బాగుందని చెబుతున్నారు. మేము వేసిన ప్రీమియర్‌ షోలో స్నేహితులు, బంధువులు సినిమాను మెచ్చుకున్నారు. నిన్న ఒక థియేటర్‌ కు వెళ్లి చూస్తే క్లైమాక్స్‌ కు స్టాండిరగ్‌ ఒవేషన్‌ వస్తోంది. మేమంతా కొత్త వాళ్లం. మా సినిమాకు ప్రేక్షకులు అలా రెస్పాన్స్‌ ఇవ్వడం హ్యాపీగా అనిపించింది. మౌత్‌ టాక్‌ తో పాటు కలెక్షన్స్‌ ఇంప్రూవ్‌ అవుతున్నాయి. మరో ఒక ట్రెండు రోజుల్లో షోస్‌ ఫుల్‌ అవుతాయని ఆశిస్తున్నాం’’ అన్నారు.
హీరో సుధీర్‌ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘హరోం హర’ మేకర్స్‌ మురుగడి మాయ అనే కొత్త పాటను విడుదల చేశారు. టైటిల్‌ సూచించినట్లుగా, ప్రపంచంలో జరిగే ప్రతిచర్యకు కారణమైన మురుగన్‌ శక్తిని ఈ పాట నిర్వచిస్తుంది. చైతన్‌ భరద్వాజ్‌ స్కోర్‌ చేసిన ఈ మెస్మరైజింగ్‌ నెంబర్‌ సుధీర్‌ బాబు, సునీల్‌  స్నేహాన్ని చూపుతుంది. రఘు కుంచె ఆ పాటను అద్భుతంగా పాడారు. భరద్వాజ పాత్రుడు కుప్పం యాసలో ఆకట్టుకునే లిరిక్స్‌ రాశారు. మొత్తంమీద, మురుగడి మాయ  అద్భుతమైన కంపోజిషన్‌, అర్థవంతమైన సాహిత్యం, ఆకట్టుకునే వోకల్స్‌ తో ఇన్స్టంట్‌ హిట్‌ అయ్యింది. సుధీర్‌ బాబు , సునీల్‌ బాండిరగ్‌ మరింత ఇంపాక్ట్‌ ని క్రియేట్‌ చేసింది. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌) బ్యానర్‌పై సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో మాళవిక శర్మ కథానాయిక. అరవింద్‌ విశ్వనాథన్‌ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ రవితేజ గిరిజాల. పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శేరిలింగంపల్లి లోని పవన్‌ మోటార్స్‌ షోరూమ్‌లో మారుతి యెక్క సరికొత్త స్విఫ్ట్‌ కారును సినీనటి సోనియా సింగ్‌ చేతుల మీదుగా మరియు మారుతి సుజుకి రీజినల్‌ మేనేజర్‌ బిక్రమ్‌ సటాపతి, పవన్‌ మోటార్స్‌ ఎమ్‌.డి చంద్ర పవన్‌ రెడ్డి కలిసి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సినీనటి సోనియా సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ మారుతి కార్లు బెస్ట్‌ మేంటనెన్స్‌ ఫ్రీ కార్లని, ఎక్కువ మైలేజ్‌ను కూడా ఇస్తాయని, తనకు మారుతీ కార్లంటె ఇష్టమని తెలిపారు. పవన్‌ మోటార్స్‌ మానేజింగ్‌ డైరెక్టర్‌ చంద్ర పవన్‌ మాట్లాడుతూ.. ఇక్కడ  శేరిలింగంపల్లి లోని మా పవన్‌ మోటార్స్‌ షోరూమ్‌లో ఈ కొత్త స్విఫ్ట్‌ని మార్కెట్లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందని,కొత్త స్విఫ్ట్‌ ఇప్పుడు మరింత సేఫ్టీతో వచ్చిందని,ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ స్టాండర్డ్‌గా అందిస్తున్నారని,మైలేజ్‌లో కూడా దిబెస్ట్‌ అని..మానువల్‌ ట్రాన్స్‌మిషన్‌లో 24.8 %సఎజూశ్రీ , Aమీ%లో ఏకంగా 25.75 %సఎజూశ్రీ% మైలేజ్‌ దొరుకుతుందని మీడియాకు తెలిపారు.ఇంకా ఇందులో హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌,ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాం,రివర్స్‌ కెమెరా పార్కింగ్‌,ఎ.బి.ఎస్‌ విత్‌ ఈ.బీ.డీ లాంటి ఎడ్వాన్స్‌ ఫీచర్స్‌నిచ్చారు.6 సింగిల్‌ టోన్‌ మరియు 3 డ్యుయల్‌టోన్‌ కలర్స్‌లతో..మెత్తం 9 వారియంట్స్‌లలో ఇది అందుబాటులో ఉంది.పెట్రోల్‌లో మాత్రమే అందుబాటులో ఉండే కొత్త స్విఫ్ట్‌లో 1197సీసీ నిచ్చారు.దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర 6,49,000. ఇంకా ఈ కార్యక్రమంలో పవన్‌ మోటార్స్‌ బిసినెస్‌ హెడ్‌ రవి రెడ్డి,షోరూమ్‌ సిబ్బంది మరియు కస్టమర్లు పాల్గొన్నారు.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పనే. చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించేవారు ప్రస్తుతం తక్కువే. పట్టణాలలో మంచి మంచి కంపెనీలలో గౌరవప్రదమైన వేతనంతో, హుందాగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కారణం ఇంటర్వ్యూ లో సక్సెస్ కాకపోవడం. ఎంతో బాగా చదివి, మంచి ర్యాంక్ లు సాధించిన వారు కూడా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూ లో సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి??  ఎంపిక: కొంతమంది ఖాళీగా ఉన్నాం ఏదో ఒక జాబ్ తొందరగా చూసుకోవాలి, ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా అనే ఆలోచనతో వరుసపెట్టి అన్నిటికి అప్లై చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నెలకొనేదే పెద్ద గందరగోళం. కాన్ఫిడెంట్ లేకుండా పది కంపెనీలలో ఇంటర్వ్యూ కు వెళ్లడం కంటే కాన్ఫిడెంట్ తో ఒక్కదానికి అటెండ్ అవ్వడం మంచిదనే విషయం మర్చిపోకండి.  నాట్ ఓన్లీ దట్: ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుండి అందరూ చేసే పని, తాము అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మననం చేసుకుంటూ వాటిని బట్టి పట్టడం. దీనివల్ల ఒనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ మిగిలిన వాటిని ఎంతో సులువుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది సంస్థకు సంబంధించిన వారి ఇష్టం. వారు పూర్తి జాబ్ కు సంబంధం లేని విషయం అయినా అడగవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసింది పని చేయడం మాత్రమే కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక అంశం మాత్రమే. మరింకేం కావాలి?? నమ్మకం ఇవ్వగలగాలి. బాధ్యతాయుతంగా ఉండగలరు అనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. చాలా సంస్థల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా ఇదే.  పని చేయబోయే సంస్థ  విషయంలో, చేయబోయే వృత్తి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరు అనే విషయం మీదనే ఎంపిక ఎక్కువగా జరుగుతుంది. అలాగే పని పట్ల నిబద్ధత ఎంతో అవసరం. పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి వైపు కంపెనీ మొగ్గు చూపుతుంది. కాబట్టి పని విషయంలో భరోసా ఇవ్వగలగాలి. స్పృహ కలిగి ఉండాలి: ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కంపెనీ భవంతిలో అడుగుపెట్టినప్పటి నుండి చుట్టుపక్కల వాతావరణం ను గమనించుకుంటూ వెళ్ళాలి. కంపెనీలలో ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉంటుందనే విషయం మరువకూడదు. మనిషి కదలిక నుండి ఆహార్యం వరకు ప్రతి విషయంలో ఒక నిజాయితీ కనిపించాలి. నటించాలని చూస్తే ఖాళీ చేతులతో బయటకు రావడం ఖాయం. తన పని మాత్రమే చూసుకుని పోయే వాళ్లకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో ఉన్న క్యాబిన్ లలో ఎవరు లేకుండా ఉండి, ఫ్యాన్ లు, లైట్ లు వంటివి ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం. నీటిని వృథా చేయకపోవడం, లిఫ్ట్ సౌకర్యం ఉన్నా మెట్లెక్కి వెళ్లడం. మంచినీళ్లు వంటివి ఇచ్చే బాయ్ ని నవ్వుతూ పలకరించడం, థాంక్స్ చెప్పడం. ముఖ్యంగా సంస్థ గూర్చి ఇంటర్వ్యూ కు వచ్చిన తోటి వ్యక్తులతో ఎలాంటి చర్చా చేయకుండా ఉండటం. సంస్థ గురించి ముందుగానే వివరంగా తెలుసుకోవడం. అంటే సంస్థ స్థాపన నుండి ప్రస్తుతం అధికారుల వరకు అన్నిటి గూర్చి వారి కృషి గురించి కూడా అధ్యయనం చేసి తెలుసుకోవడం. స్కిల్స్ ఎప్పుడు కిల్ చేయకూడదు: కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ లో అధికారులతో మాట్లాడేటపుడు కావాలని వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే మీ స్కిల్స్ ను మీరే కిల్ చేసుకున్నట్టు అవుతుంది.  ముందుగా మరింత ఉత్సాహంగా: ఇక చివరగా చెప్పుకున్నా అన్నిటికంటే ముందు చేయవలసిన పని. ఇంటర్వ్యూ కు హడావిడిగా చివరి నిమిషంలో వెళ్లకుండా, వీలైనంత ముందుగా వెళ్లడం. దీనివల్ల కంపెనీని అక్కడి వాతావరణాన్ని, పని విధానాన్ని అంతో ఇంతో గమనించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా సహజంగానే గందరగోళం తగ్గిపోతుంది.  ట్రస్ట్ యువర్ కాన్ఫిడెన్స్: మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఎవరో ఏదో భయపెట్టేలా చెప్పే మాటలు, విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిత్వం నుండి, పని విషయం వరకు మీ అభిప్రాయాలు నచ్చాయంటే ఏ కంపెనీ ఎం.డి కూడా మిమ్మల్ని వదులుకోడు.  సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ
ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా? అయితే మిమ్మల్ని త్వరలోనే మతిమరుపు పలకరిస్తుంది అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. రోజుకి గంటకన్నా తక్కువ సమయం మాత్రమే టీవీ చూస్తున్న వారికి మధ్య జ్ఞాపకశక్తి విషయంలో చాలా తేడా వుందని వీరి పరిశోధనలో తేలింది. కొన్ని వేలమందిపై రకరకాల పరీక్షలు నిర్వహించి తేల్చిన విషయమిది. చిన్న చిన్న విషయాలని కూడా టీవీని అతిగా చూసేవారు మర్చిపోతుండటం గమనించారట వీరు. ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిపై టీవీ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు వీరు. స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి కూర్చునే ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. మరి జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు అని వీరిని అడిగితే అందుకు చాలా మార్గాలున్నాయ్. అయితే టీవీ చూడటం తగ్గించమంటున్నాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరో మార్గం ఉంది. దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా స్వంతమవుతుంది జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అంటున్నారు. ‘కాల్పనిక సాహిత్యం’ చదివితే మెదడు పదునెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. నమ్మకం లేకపోతే ఓ 20 రోజులపాటు మేం చెప్పింది పాటించి చూడండి అని చెబుతున్నారు ఈ ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి టీవీ చూడటం తగ్గించి చదవటం మొదలుపెడదామా!? -రమ
  శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తినడం,  త్రాగడంలో ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కీళ్ళు,  ఎముకలలో నొప్పి, వాపు, పెరుగుతుంది. ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో విచ్ఛిన్నమైతే, యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అతిగా తాగడం, తక్కువ శారీరక శ్రమ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వేసవిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఏ పండ్లు తినాలో తెలుసుకుంటే.. బ్లాక్బెర్రీస్.. బ్లాక్బెర్రీస్  వేసవిలో సీజన్లో అందుబాటులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ లు అధికంహా ఉన్న బెర్రీ పండ్లు  అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి  ప్రయోజనకరంగా ఉంటాయి.  బెర్రీలు జీవక్రియను పెంచడంలో,  శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది.  యాసిడ్ స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది. అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు  బ్లాక్బెర్రీస్ తినవచ్చు. చెర్రీలు.. యూరిక్ యాసిడ్ రోగికి చెర్రీలు కూడా  చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆమ్లాన్ని నియంత్రించే మూలకాలు చెర్రీస్‌లో ఉంటాయి. విటమిన్ బి-6, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ,  విటమిన్ బి రెడ్  చెర్రీస్‌లో ఉంటాయి. చెర్రీస్ అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. అరటిపండు.. యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని నివారించాలనుకుంటే రోజూ అరటిపండ్లను తినడం మంచిది. అరటిపండ్లలో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. అరటిపండ్లు తినడం ద్వారా అధిక యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. గౌట్ సమస్యలో అరటిపండ్లు కూడా మేలు చేస్తాయి. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. కివీ.. పుల్లటి,  జ్యుసి పండ్లను తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే వాటి స్థానంలో  కివీని తినవచ్చు. కివి వినియోగం యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది. కివి తినడం వల్ల విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం,  ఫోలేట్ లభిస్తాయి. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. కివిని రోజూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. యాపిల్.. ఎండాకాలం అయినా, చలికాలం అయినా పండ్ల దుకాణంలో యాపిల్స్ ఎప్పుడూ దొరుకుతాయి. యాపిల్ ఫైబర్ అధికంగా ఉండే  పండు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్ రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. యాపిల్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రభావం తగ్గుతుంది.  రోజువారీ పనులు చేయడానికి తగినంత  శక్తి అందిస్తుంది. ప్రతిరోజూ ఒక యాపిల్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.                                                *రూపశ్రీ.  
అరటి చాలా  శక్తివంతమైన పండు. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రాణశక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఓ అరటిపండు తింటే చాలాసేపటి వరకు ఆకలి బాధ దూరంగా ఉంటుంది. ఇది మెత్తగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ తినదగిన పండు. జీర్ణం కావడానికి సులువుగానే ఉంటుంది. ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కండరబలాన్ని, పోషకాలను ఇస్తుంది. వర్కౌట్ తర్వాత అరటిపండు తినడం ఫిట్నెస్ ఫాలో అయ్యేవారికి తప్పనిసరి. పైపెచ్చు అరటిపండు మిగిలిన పండ్లతో పోలిస్తే ధర తక్కువే. కాబట్టి అందరూ కొనుక్కుని తినగలుగుతారు. కానీ  అరటిపండు అందరికీ మంచిది కాదు. ఆయుర్వేదంలో అరటిపండు కొంతమందికి ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో? దీన్ని ఎవరు తినకూడదో  తెలుసుకుంటే.. పోషకాలు.. అరటిపండు తినడం వల్ల  విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ బి6తో పాటు గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడినిన్, రుటిన్, నారింగిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. 80వ్యాధులకు చికిత్స చేయగలదు.. పోషకాహార నిపుణులు అరటిపండులో ఉన్న గొప్పదానాన్ని చెబుతూ ఇది 80రకాల వ్యాధులకు చికిత్స చేయగలదని పేర్కొన్నారు. అరటి పండు వాత పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. వాతం క్షీణించడం వల్ల దాదాపు 80 రకాల వ్యాధులు వస్తాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది పొడిబారడం, ముడతలు పడటం, ఎముకలలో అంతరం, మలబద్ధకం, చేదు రుచి మొదలైన అనేక సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికి అరటిపండు చికిత్స చేయగలుగుతుంది. అరటిపండు ఎవరు తినాలంటే.. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు  చల్లని గుణం కలిగి ఉంటుంది. ఇది  జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది.   ఇది లూబ్రికేషన్‌గా పనిచేస్తుంది. శరీరం ఎండిపోయి, ఎప్పుడూ అలసిపోయినట్టు, బాగా నిద్రపోనట్టు, శరీరంలో ఎప్పుడూ మంటగా ఉన్నట్టు అనిపించేవారు, చాలా దాహంతో ఉన్నవారు,  ఎక్కువ  కోపంగా ఉన్నవారు అరటిపండును తినాలి. దీనివల్ల ఆ కోపస్వభావం, అతిదాహం వంటి సమస్యలు అణిచివేయబడతాయి. ఎవరు తినకూడదంటే.. అరటిపండు కఫ దోషాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక కఫ శరీర తత్వం గలవారు దీనిని తినకూడదు. పెరిగిన కఫం కారణంగా జీర్ణాశయంలో  అగ్నితత్వం  బలహీనంగా ఉంటే అరటి పండు దానిని మరింత నెమ్మదిస్తుంది. అధిక కొవ్వు, దగ్గు,  జలుబు ఉన్నవారు, ఆస్తమా రోగులు దీనిని తినకూడదు. ఒకవేళ తినాలని అనిపిస్తే  చాలా ఆలోచించి దీని పర్యావసానాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటేనే తినాలి.                                              *నిశ్శబ్ద
శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. , ప్రతిఒక్కరూ  ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలని వైద్యుల నుండి ఆరోగ్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు చెబుతారు. ఎండాకాలంలో  సాదారణం కంటే నీరు మరింత ఎక్కువ అవసరం అవుతుంది. ఎండవేడిమి  కారణంగా, శరీరం నుండి చాలా నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. పెద్దలు రోజుకు 3-4 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల  డీహైడ్రేషన్ ప్రమాదం నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. శరీరపనితీరు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  రక్షించడంలో సహాయపడుతుంది మరియు శరీర అవయవాల పనితీరును సరిగ్గా ఉంచుతుంది. నీరు తక్కువ తీసుకోవడం  వల్ల డీహైడ్రేషన్,  కిడ్నీలో రాళ్లు, పొడి చర్మం, పొడి  కళ్ళు వంటి అనేక దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఎక్కువ నీరు తాగేస్తుంటారు. దీని వల్ల బోలెడు ఆరోగ్యమని అనుకుంటారు కానీ.. శరీరానికి ఇది చాలా హాని కలిగిస్తుందని మీకు తెలుసా?  నీరు ఎక్కువగా తాగితే, దాని వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..  రోజుకు కచ్చితంగా ఇంత  నీరు త్రాగాలి అని నిర్ణయించడానికి ఎటువంటి సూత్రం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా రోజుకు మూడు నుండి మూడు లీటర్ల నీరు శరీరానికి అవసరం అవుతుంది. అది కూడా  వాతావరణం, వ్యాయామం, ఆహారం, మొత్తం ఆరోగ్యం, మహిళలు  గర్భంతో ఉండటం  లేదా మహిళలు పిల్లలకు పాలు ఇవ్వడం  వంటి పరిస్థితులపై శరీరానికి కావలసిన  నీటి పరిమాణం ఆదారపడి ఉంటుంది. కానీ నీరు అధికంగా తీసుకుంటే ఈ క్రింది అనర్థాలు కచ్చితంగా జరుగుతాయి.  నీరు ఎక్కువగా తాగుతుంటే  వాటర్ పాయిజనింగ్ సంభవించే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల  మూత్రపిండాల పనితీరును బాగా పెంచుతుంది, దీని ఫలితంగా  శరీరంలోని ఎలక్ట్రోలైట్లు కరిగిపోతాయి. ఉదాహరణకు, సోడియం (ఉప్పు) కరిగించినట్లయితే, హైపోనాట్రేమియా డవలప్ అవుతుంది. శరీరంలో చాలా తక్కువ సోడియం ఉంటే  కణాల లోపల నీరు చేరుతుంది.  ఇది శరీరం  వాపుకు దారితీస్తుంది. హైపోనాట్రేమియా  లక్షణాలు ఎలా ఉంటాయంటే.. హైపోనాట్రేమియా ను ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఓవర్ హైడ్రేషన్ యొక్క లక్షణాలు ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టం. అయితే, ఎక్కువ సార్లు  మూత్రవిసర్జన చేయాల్సి రావడం దీనికి ఒక సంకేతం. వాటర్ పాయిజన్ జరిగితే శరీరంలో ఈ క్రింది లక్షణాలు కనబడతాయి. వికారం మరియు వాంతులు. మెదడుపై ఒత్తిడి పెరిగి దాని కారణంగా తలనొప్పి. గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి వంటి మానసిక స్థితిలో మార్పులు. కండరాల తిమ్మిరి. తరచుగా మూత్రవిసర్జన సమస్య. వాంతులు కావడం. మన శరీరంలో మూత్రపిండాలు  ఒక సమయంలో ఎంత నీటిని విసర్జించాలనే పరిమితి కలిగి ఉంటాయి.  దీని ప్రకారం గరిష్టంగా గంటకు 800 నుండి 1,000 ml మూత్రం విసర్జించాలి.   ఎక్కువ నీరు తాగడం ప్రారంభిస్తే, శరీరం నుండి అదనపు నీటిని తొలగించడం మూత్రపిండాలకు కష్టమవుతుంది, దీని కారణంగా  అపానవాయువు, వికారం వంటి  సమస్యలు ఎదురవుతాయి.                                                                               *నిశ్శబ్ద.