LATEST NEWS
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రతినిథులకు ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం (ఫిబ్రవరి 23) ఇచ్చిన ఆత్మీయ విందు నవ్వుల విందుగా, పరిచయాలు, పలకరింపుల మేళవింపులుగా మారింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పరస్పరం కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది.  ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు. తమతమ ప్రాంతాల ప్రత్యేకతలను పంచుకున్నారు.   శ్రీకాకుళం వెటకారం, విజయనగరం చతురతతో సంభాషణలు రక్తి కట్టాయి. మంత్రి నారా లోకేష్ ఈ విందు సమావేశంలో  మంగళగిరి చేనేత ప్రమోషన్  చేస్తూ శ్రీకాకుళం ప్రజాప్రతినిథులు  పొందూరు ఖాదీతో బదులిచ్చారు. ఆత్మీయ వేదికకు హాజరైన ప్రజాప్రతినిథుల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలు లోకేష్ బహుకరించారు.  ఈ ఆత్మీయ విందు సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామమోహన నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  ఎమ్మెల్యేలు  బెందాళం అశోక్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి సాయి శ్రీనివాస్, కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలి ఆర్ఎస్వీకేకే రంగారావు బేబీనాయన, కిమిడి కళా వెంకటరావు, పి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం మాధవి, నడికుదిటి ఈశ్వరరావు కుటుంబసభ్యులతో హాజరయ్యారు.  
తమిళనాడు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పూర్తి కావడంతో   ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను సోమవారం (ఫిబ్రవరి 23)   విడుదల చేసింది. సవరించిన జాబితా కింద రాష్ట్రంలోని 74 లక్షల మంది ఓట్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. తుది జాబితాలో మొత్తం 5.67 కోట్ల మంది   బాజితాలో ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 6.41 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. సోమవారం ఫిబ్రవరి 23)  చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు చీఫ్ ఎలక్షన్ అధికారి అర్చనా పట్నాయక్ ఈ జాబితాను విడుదల చేశారు. తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. 2025 డిసెంబర్ 19 నుంచి 2026 జనవరి 30 వరకూ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాల్సిందిగా 4.38 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 4.23 లక్షల ఎంట్రీలను వెరిఫికేషన్ అనంతరం తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించామని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదేజరగనున్న సంగతి తెలిసిందే. అలాగే కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలు ఈ ఏడాదే జరుగుతాయి. 
రాజమహేంద్రవరం జిల్లా జైలు నుంచి బెయిలుపై ఇటీవల విడుదలైన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సోమవారం (ఫిబ్రవరి 23) పరామర్శించారు. మాజీ మంత్రులు, వైసీపీనాయకులతో కలిసి గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లిన ముద్రగడ అంబటి రాంబాబును పరార్శించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభఉత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు.  గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన  మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రతిరోజూ అబద్ధాలాడుతున్నారంటూ చంద్రబాబు, తెలుగుదేశం నేతలపై విమర్శలు గుప్పించారు.  ఇప్పటికైనా  భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభరెడ్డి.. అంబటి రాంబాబు కుమార్తె మౌనికను ప్రత్యేకంగా పలకరించి.. ఆమె ధైర్యాన్ని అభినందించారు.  
ALSO ON TELUGUONE N E W S
  -మార్చి 19 న సిల్వర్ స్క్రీన్ పైకి లాండింగ్  -ధురంధర్ 2 vs టాక్సిక్  -పోటీ తప్పదా -సోషల్ మీడియా తాజా టాక్ ఏంటి బాక్స్ ఆఫీస్ వద్ద అసలు సిసలైన సినీ మజాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు వేదికగా నిలిచిన ధురంధర్ 2 , టాక్సిక్ శరవేగంగా  ముస్తాబవుతున్నాయి. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో ఆ రెండు చిత్రాలపై ఆసక్తి నెలకొని ఉంది. ఆసక్తి నెలకొని ఉందని మనం చెప్తుంటే భలే విషయాన్నీ కనిపెట్టావు బాబు సన్మానం ఏమైనా చేయమంటావా అని ఈ న్యూస్ చదువుతున్న వాళ్ళు   అడుగుతారు.  గొప్ప అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఆ రెండు చిత్రాల కోసం ఎప్పట్నుంచో ఎంతో ఆశతో ఎదురుచూస్తు వస్తున్నారు.ఆ రెండు చిత్రాలపై  అంత క్యాపబిలిటీ  ఉంది.మనమేదో కొత్త విషయం కనిపెట్టామని  ఎగతాళిగా సన్మానం అని అంటున్నారు.మరి ధురంధర్ 2 , టాక్సిక్ కి సంబంధించిన కొత్త న్యూస్ ఏంటో చూద్దాం. ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2),టాక్సిక్(Toxic)మార్చి 19 న ఒకే రోజు పాన్ ఇండియా వ్యాప్తంగా అడుగుపెడుతున్నాయి. ధురంధర్ హిందీ ఒరిజినల్ కాబట్టి హిందీలో ఎక్కువ క్రేజ్, టాక్సిక్ కన్నడ మూవీ కాబట్టి కన్నడలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఓన్ భాష సినీ ప్రేమికులు  తమ సినిమానే ఎక్కువగా ఆదరిస్తారని అనుకునే జమానా రోజులు పోయి చాలా కాలం అవుతుంది. ఒక మాదిరిగా ఉన్న చిత్రాల కంటెంట్ బాగుంటేనే పాన్ ఇండియా ప్రేక్షకులు తమ నెత్తిన పెట్టుకోని ప్రమోషన్స్ చేస్తున్న రోజులు. అలాంటిది ధురంధర్ పార్ట్ 2 , టాక్సిక్ లాంటి బడా హీరోల సినిమాలకి ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఈ  నేపథ్యంలో ఈ రెండు ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబడతాయో అనే ఆసక్తి అందరిలో ఉంది.  also read: ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య సినీ సమాజంలో అభిమానులు సహజం కాబట్టి ఆ రెండు చిత్రాల్లో తమ అభిమాన చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాల వారిలా ఏరియా లెక్కలు వేసి మరి  చెప్తున్నారు. మరి తెలుగు అభిమానులు అందరి కంటే ముందుంటారు కాబట్టి వాళ్ళు కూడా తమకి ఇష్టమైన సినిమా తెలుగు నాట ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందనే కామెంట్స్ తో సోషల్ మీడియాని బాగానే యూజ్ చేస్తున్నారు. కాని ఎవరు కూడా రెండు సినిమాల్లో ఒక సినిమా వల్ల  ఇంకో సినిమా ప్లాప్ అవుతుందని చెప్పటం లేదు. దీంతో  సినీ రంగం బాగుండాలనే వాళ్ళ సినీ మానవత్వం అర్ధమవుతుంది. ధురంధర్ 2 , టాక్సిక్ లని చూడాలంటే పెట్టి పుట్టాలనే  సామెత కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదే ధురంధర్ 2 , టాక్సిక్ ల తాజా న్యూస్.      
  - మహేష్, రాజమౌళి  ఎందుకు కొట్టుకున్నారు? - రామ్‌గోపాల్‌వర్మ వల్లే మహేష్, రాజమౌళి మధ్య ఫైట్ - ప్రస్తుతం ‘వారణాసి’ పరిస్థితి ఏంటి?   సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రాజమౌళి మధ్య భీకర యుద్ధం జరిగింది. సినిమా యాక్షన్ సీన్‌ని మరిపించే స్థాయిలో ఇద్దరూ కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు మహేష్, రాజమౌళి ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? వారిద్దరి మధ్య ఏం జరిగింది అని ఆ వీడియో మాత్రమే చూసినవారు ఆసక్తిగా ఆరా తీశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అది ఎఐ లో క్రియేట్ చేసిన వీడియో. దాన్ని పోస్ట్ చేసింది రామ్‌గోపాల్‌వర్మ.  ఇటీవలికాలంలో ఎఐ సష్టిస్తున్న విచిత్రాలు, విధ్వంసాలు మనం చూస్తున్నాం. నేచురల్‌గా కనిపించే కొన్ని వీడియోలు ఎఐ ద్వారా క్రియేట్ చేసినవి అని చెప్పేవరకు మనకు తెలీదు. అంత సహజంగా ఆ వీడియోలు ఉంటున్నాయి. అలాంటి ఓ వీడియోను ఆర్జీవీ పోస్ట్ చేశారు. మొదటి నుంచీ ఎఐపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన వర్మ.. చాలా ఇంటర్వ్యూల్లో దాని గురించి చర్చించారు. ఎఐను ఏ స్థాయిలో వినియోగించుకోవచ్చో తెలిపేందుకు మహేష్, రాజమౌళి మధ్య జరిగిన ఫైట్‌ను ఉదాహరణగా చూపించారు. ఈ పోస్ట్‌కి ‘సినిమా ఈజ్ డెడ్‌’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.  సాధారణంగా మన సినిమాల్లో హీరో, విలన్ ఎంత బీభత్సంగా కొట్టుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం. టేబుల్స్ విరిగిపోతాయి. కొన్నిసార్లు గోడలు కూడా బ‌ద్ద‌లైపోతాయి. ఆ స్థాయిలో మహేష్, రాజమౌళి మధ్య ఫైట్ జరిగింది. ఒకరిపై ఒకరు పవర్‌ఫుల్ పంచ్‌లు ఇచ్చుకుంటూ సినిమా యాక్షన్ సీన్‌ను మరిపించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వర్మ ఇచ్చిన క్యాప్షన్‌కి రిప్లయ్ ఇస్తూ.. ఎఐ వల్ల సినిమా రంగమే కాదు అన్ని రంగాలూ డెడ్ అయ్యాయని వ్యాఖ్యానిస్తున్నారు.  ఇదిలా ఉంటే.. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో భారత దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ జార్జియాకు బయల్దేరింది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ‘వారణాసి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీ రిలీజ్ అవ్వని రేంజ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా, పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ ‘వారణాసి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
Suriya has been struggling to deliver a blockbuster success at the box office over past 13 years. He released his most popular films - Soorarai Pottru and Jai Bhim, directly on OTT platforms. His previous theatrical releases - Kanguva and Retro, did not become successful. He is hoping to change that with his Karuppu.  While the movie has been looking at release date from past Diwali to till date, he finished 90% of his next movie with Mamitha Baiju in the direction of Venky Atluri. Suriya is also busy shooting with his cop drama in the direction of Jithu Madhavan, in his own production. Karuppu delay is hurting release dates of other two.  So, Karuppu makers are under pressure to release as soon as possible. Reports suggest that they have locked in 10th April release date but as election notification and schedule is yet to be released, they are considering 1st May, as the probable date. If they lock 1st May, then, it would be his big release after Retro, exactly after one year.  While Karuppu is said to be an action entertainer with Suriya in dual role as a village head and lawyer, RJ Balaji is directing the film with Trisha Krishnan in leading lady role. We have to wait and see, how Suriya will plan his releases as each movie will be very crucial for his market going forward.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    సంచలనం సృష్టిస్తున్న హత్య  టూరిస్టులుగా వచ్చి దారుణానికి పాల్పడిన వైనం  శోక సంద్రంలో విష్ణుప్రియ కుటుంబసభ్యులు  చంపిన ఆ ఐదుగురు ఎవరు! ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రోజులతో పాటు, తెలియని వ్యక్తుల విషయంలో ఎవర్ని నమ్మాలో,నమ్మకూడదో కూడా అర్ధం కానీ పరిస్థితి. దీంతో ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో బాధిత కుటుంబసభ్యులు శోక సంద్రంలో ఉండాల్సిన పరిస్థితి. ప్రముఖ నటి విష్ణుప్రియ(Vishnu Priya)ప్రస్తుతం ఆ పరిస్థితినే ఎదుర్కొంటుంది.  విష్ణుప్రియ తండ్రి పేరు సూర్య నారాయణ(Suryanarayana). తమిళనాడులోని కొడైకెనాల్(Kodaikenal)సమీపంలో ఉన్న ఆండవర్ కోయిల్ ఏరియాలో నివసిస్తూ ఉంటాడు. గత శనివారం ఐదుగురు వ్యక్తులు  విహారయాత్ర కోసం వచ్చి సూర్యనారాయణ నివాసముంటున్న దగ్గరలోనే రూమ్ తీసుకున్నారు. అదే రోజు రాత్రి సదరు ఐదుగురు వ్యక్తులు సూర్యనారాయణ ఉంటున్న ఇంటికి వచ్చి ఊపిరి ఆడకుండా చేసి చంపేసి, అనంతరం ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న ఉంగరం తీసుకొని వెళ్లిపోయారు. సిసి టీవీ ఫుటేజ్ ని కూడా తీసుకెళ్లడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. aslo read: Manchu Manoj: మంచు మనోజ్ మంచి మనసు.. పునర్విక కోసం రంగంలోకి  2018 లో విష్ణుప్రియ ప్రేమించిన వ్యక్తి హత్యకి గురయ్యాడు. ఆ హత్యకి, ఇప్పటి సూర్యనారాయణ హత్యకి ఏమైనా సంబంధం ఉందేమో అనే అనుమానాలు మొదలవ్వడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2005 లో సూర్య, జ్యోతిక జంటగా వచ్చిన మాయావి లోని సిగప్పి క్యారక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత అనేక తమిళ చిత్రాల్లో చేసి మంచి పేరు సంపాదించింది.      
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ రంగంలోకి వివిధ భాషలకు చెందిన స్టార్స్  ప్రత్యేక పాత్రలో అక్కినేని హీరో! జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్'(Dragon) టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఇటీవల జోర్డాన్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. త్వరలో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ కావడంతో 'డ్రాగన్'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను పెంచే న్యూస్ వినిపిస్తోంది. ఇందులో అక్కినేని హీరో అఖిల్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Akhil Akkineni) 'డ్రాగన్'లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టోవినో థామస్ విలన్ గా నటిస్తున్నాడు. అనిల్ కపూర్, బిజు మీనన్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. అలాగే 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి అతిథి పాత్రలో మెరవనున్నాడని తెలుస్తోంది.  ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కథకు కీలకమైన ప్రత్యేక పాత్రలో అఖిల్ కనిపించనున్నాడట. నిడివి తక్కువ అయినప్పటికీ ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్, అఖిల్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ రోల్ అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా అఖిల్ ఓకే చెప్పినట్లు టాక్. కాగా, అఖిల్ ప్రస్తుతం 'లెనిన్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. మే 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, జూన్ కి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. Also Read: 24 ఏళ్ళ క్రితం బండ్ల గణేష్ హీరోగా భారీ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?
హీరో అంటే ఆరడుగుల ఎత్తు ఉండాలి. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. సాధారణంగా ఇవీ ఒక సినిమా హీరోకి ఉండాల్సిన అర్హతలు. కానీ, మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలన్నా, హీరోగా నిలబడాలన్నా అవేవీ అక్కర్లేదని, కేవలం టాలెంట్ ఉంటే సరిపోతుందని ఎంతో మంది హీరోలు ఇప్పటికే ప్రూవ్ చేశారు. అలా ఇప్ప్పుడు మరో హీరో తమిళ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. అతనే ప్రదీప్ రంగనాథన్.  ప్రదీప్ హీరో మాత్రమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైలాగ్ రైటర్, లిరిక్ రైటర్, సింగర్.. ఇలా బహుముఖంగా తన ప్రజ్ఞను ప్రదర్శిస్తున్న టాలెంటెడ్ పర్సన్. 2019లో రవిమోహన్ హీరోగా తమిళ్‌లో వచ్చిన ‘కోమలి’ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు ప్రదీప్. అంతకుముందు ప్రదీప్ కొన్ని షార్ట్ ఫిలింస్ రూపొందించాడు. వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదీప్ డైరెక్ట్ చేసిన కొన్ని షార్ట్ ఫిలింస్‌ని చూసి ఇంప్రెస్ అయిన రవిమోహన్ అతనికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు. అలా మొదలైన ప్రదీప్ కెరీర్ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయింది.  2022లో తనే హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘లవ్ టుడే’ చాలా పెద్ద హిట్ అయింది. తను అంతకుముందు చేసిన షార్ట్ ఫిలిం కథాంశంతోనే లవ్ టుడే చిత్రాన్ని రూపొందించాడు. ఆ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చి ఆ తర్వాత డ్రాగన్, డ్యూడ్ చిత్రాల్లో నటించి స్టార్ హీరో అయిపోయాడు. హీరోగా తనకంటూ ఒక స్ట‌యిల్‌ని క్రియేట్ చేసుకున్న ప్రదీప్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతను హీరోగా చేసిన సినిమాలు తెలుగులోనూ పెద్ద విజయం సాధించాయి. తమిళ ఇండస్ట్రీలో ప్రదీప్ అంటే మరో ధనుష్ అనే పేరు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం తమిళ్‌లో ఎక్కువ బిజీగా ఉన్న యంగ్ హీరో ప్రదీపే. అతనితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. దానికి తగ్గట్టుగానే తన రెమ్యునరేషన్‌ని పెంచి సినిమాకి పాతిక కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. అయినా అతనితో సినిమాలు చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ 8 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. అందులో పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ప్రదీప్‌కి మంచి డిమాండ్ ఉంది. అందుకే అతను అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ, ప్రదీప్‌కి ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా సినిమా చేసేంత టైమ్ అతనికి లేదు. ఇటీవలికాలంలో ఇంత డిమాండ్ ఏర్పడిన యంగ్ హీరో ప్రదీప్ తప్ప మరొకరు కనిపించడం లేదు. 
--పునర్విక కోసం రెండు తెలుగు రాష్టాల ప్రజల ప్రార్థనలు  తోచిన సాయం కూడా చేస్తున్నారు  -ఈ విషయంలో మంచు మనోజ్ అభినందనలు  -ఒక్క ఇంజక్షన్ 16 కోట్ల రూపాయలు   ఊహ తెలియని పసిపిల్లలు దైవంతో సమానమని అంటారు. అందరూ ఆ దశ దాటి వచ్చిన వాళ్ళమే. అందుకే మన పిల్లలతో పాటు వేరే వాళ్ళ పిల్లలని చూసినప్పుడు ఆనందంతో వాళ్ళ బుగ్గలని స్పృశించకుండా ఉండలేం.అదే టైంలో హెల్త్ పరంగా వారికి ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే ఎంతగానో తల్లడిల్లిపోతాం.ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంవత్సరం కూడా నిండని కర్నూల్(Kurnool)జిల్లాకి చెందిన పునర్విక(Punarvika)విషయంలో అదే విధంగా తల్లడిల్లిపోతు తమకి చేతనైన సాయం చేస్తున్నారు.ఈ విషయంపై మంచు మనోజ్ స్పందిస్తు మరిన్ని సూచనలు చేసాడు. ఆ వివరాలేంటో చూద్దాం ఎక్స్ వేదికగా స్పందిస్తు 'పునర్విక విషయం తెలిసి నా హృదయం ముక్కలైంది. తెలుగు రాష్టాల యువత మొత్తం పాప కోసం ఫండ్ కలెక్ట్ చేయడం అభినందనీయం.పునర్విక పరిస్థితి బాగాలేదు. ఆమెని కలవడానికి ఎవరు ప్రయతించవద్దు. చిన్నారి ప్రాణాలు కాపాడగలిగితే పాప కుటుంబంతో పాటు అందరం గెలిచినట్టే అని తెలిపాడు.పునర్వక కి సాయం అందించాలంటూ  పిఏంవో,తెలుగు రాష్ట్రాల సిఏం లకి కూడా ట్యాగ్  చేసారు. also read: Ram charan: రామ్ చరణ్ కి అండగా అల్లు శిరీష్.. ట్రోల్ల్స్ ఆగాయా! పునర్విక ఆరోగ్య విషయానికి వస్తే స్పైనల్ మస్యులర్ ఆట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. సదరు వ్యాధి నయం కావడానికి 16 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజక్షన్ కావాలి. ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల రూపాయలు కలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్విక ఆరోగ్య బాధ్యతలు తీసుకోబోతునట్టుగా వార్తలు వస్తున్నాయి.  
2002లో బండ్ల గణేష్ హీరోగా సినిమా అప్పట్లో ఆ లాంచ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ కమల్ హాసన్ లాంటి నటుడు చేయాల్సిన పాత్రలో బండ్ల కొంత షూటింగ్ జరిగాక సినిమా ఎందుకు ఆగిపోయింది? పెద్ద హీరో కావాల్సిన బండ్ల గణేష్ ఫేట్ మార్చింది ఎవరు? నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు బండ్ల గణేష్(Bandla Ganesh). ఏవో కారణాల వల్ల కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. త్వరలో రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో బండ్ల గణేష్ గురించి ఆసక్తికర న్యూస్ తెరపైకి వచ్చింది. నిర్మాతగా మారకముందు బండ్ల గణేష్ చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆయన పేరు వింటే.. కామెడీ రోల్స్, చిన్న చిన్న పాత్రలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ, ఎప్పుడో 24 ఏళ్ళ క్రితమే బండ్ల గణేష్ కి హీరోగా అవకాశం వచ్చిందని, కొంత షూటింగ్ జరిగాక ఆ సినిమా ఆగిపోయిందని అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. 2002లో బండ్ల గణేష్ హీరోగా 'శీనుగాడు' అనే సినిమా ఘనంగా ప్రారంభమైంది. కొంత షూటింగ్ జరిగాక సడన్ గా ఆ చిత్ర నిర్మాత చనిపోవడంతో సినిమా ఆగిపోయింది. ఆ సినిమా విడుదలై ఉంటే బండ్ల గణేష్ మంచి హీరోగా నిలదొక్కుకునే వాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉండేది. తాజాగా ఇదే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు బాబ్జీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "2002 లో సోదరుడు బండ్ల గణేష్ హీరోగా 'శీనుగాడు' అనే సినిమా నా దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత ఘనంగా ప్రారంభమయింది. ప్రముఖు హీరోలు, హీరోయిన్ లు, దర్శకులు, నిర్మాతలతో అన్నపూర్ణ స్టూడియో కిటకిట లాడింది. ఆ ప్రారంభోత్సవం జరిగిన విధానం గురించి చాలా రోజుల వరకు పరిశ్రమ వర్గాలు గొప్పగా మాట్లాడుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన బండ్ల గణేష్ గారి పాత్ర కమల్ హాసన్ లాంటి గొప్ప నటులు పోషించాల్సిన పాత్ర. కొంత షూటింగ్ జరిగాక సడన్ గా ఆ చిత్ర  నిర్మాత చనిపోవడంతో సినిమా ఆగిపోయింది. అలా జరిగి ఉండకపోతే... ఆ సినిమా అనుకున్నట్లుగా రూపొంది విడుదలయి ఉంటే మిత్రులు బండ్ల గణేష్ ఒక సక్సెస్ ఫుల్ హీరోగా తనదైన జెండాను ఎగరేసి ఉండేవారు. నాకు కూడా ఆ సినిమా దర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చి ఉండేది. అలా పెద్ద హీరోగా సక్సెస్ సాధించాల్సిన బండ్ల గణేష్ గారు అనుకోకుండా నిర్మాతగా మారి ప్రస్తుతం ఒక అగ్ర నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం నాకు సంతోషకరం." అని దర్శకుడు బాబ్జీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 2002లో బండ్ల గణేష్ కి హీరోగా అవకాశం రావడం, అది కూడా కమల్ హాసన్ లాంటి గొప్ప నటులు పోషించాల్సిన పాత్ర రావడం అనేది మామూలు విషయం కాదు. నిజంగానే ఆ సినిమా విడుదలై, హిట్ కొడితే.. సక్సెస్ ఫుల్ హీరోగా బండ్ల గణేష్ నిలిచేవాడేమో.    
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి.  స్టిక్కర్లను అలాగే ఉంచడం ఇష్టం ఉండదు, పోనీ వాటిని తీసేద్దాం అనుకుంటే స్టిక్కర్ల తాలూకు గమ్ వాటి మీద కనిపిస్తూ వస్తువుల లుక్ పాడు చేస్తుంది.  పైగా ఈ గమ్ మీద దుమ్ము దూళి చాలా తొందరగా పేరుకుపోతుంది.  అయితే కొత్త వస్తువుల మీద స్టిక్కర్లు సులువుగానే తొలగించవచ్చని చాలా మందికి తెలియదు. కేవలం కొన్ని టిప్స్ ఫాలో కావడం వల్ల స్టిక్కర్లను వాటి మూలాలు కనిపించకుండా తొలగించవచ్చు.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. హెయిర్ డ్రైయర్ వేడి.. స్టిక్కర్‌ను వేడి చేయడం వల్ల దాని జిగట మృదువుగా మారుతుంది, దీని వలన స్టిక్కర్ తీయడం సులభం అవుతుంది.  మీడియం వేడి మీద హెయిర్ డ్రైయర్‌ను ఆన్ చేయాలి. స్టిక్కర్ కు 2-3 అంగుళాల దూరంలో 30-40 సెకన్ల పాటు హెయిర్ డ్రైయర్ ను పట్టుకోండి. తర్వాత ఒక మూల నుండి స్టిక్కర్‌ను పట్టుకుని మెల్లిగా లాగితే   స్టిక్కర్ సులువుగా వచ్చేస్తుంది.  ఒకవేళ స్టిక్కర్ సరిగా రాకపోతే మరికొంతసేపు డ్రైయర్ తో స్టిక్కర్ ఉన్న ప్రాంతాన్ని వేడి చేయాలి. బేకింగ్ సోడా, నూనె పేస్ట్.. ఈ ఇంట్లో తయారుచేసిన బేకింగ్ సోడా,  నూనె పేస్ట్ స్టిక్కర్ల జిగటను తొలగిస్తుంది. బేకింగ్ సోడా,  వంట నూనె లేదా కొబ్బరి నూనె సమాన భాగాలుగా కలిపి పేస్ట్ లా చేయాలి. దానిని స్టిక్కర్ లేదా జిగురు మరక ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఒక గుడ్డతో రుద్దాలి.  ఎలాంటి ఆనవాళ్లు లేకుండా స్టిక్కర్ కానీ దాని తాలూకు జిగురు కానీ తొలగిపోతుంది. వెనిగర్ వాటర్.. వెనిగర్ స్టిక్కర్ మీద ఉన్న జిగురును వదిలిస్తుంది. ఒక కాటన్ బాల్ లేదా క్లాత్ ను వెనిగర్ లో ముంచి స్టిక్కర్ మీద ఉంచాలి. 10-15 నిమిషాల తర్వాత స్టిక్కర్ సులభంగా ఊడిపోతుంది. తర్వాత  మృదువైన గుడ్డతో ఆ ప్రాంతాన్ని తుడవాలి. నెయిల్ పాలిష్ రిమూవర్.. గట్టి స్టిక్కర్లకు నెయిల్ పాలిష్ రిమూవర్  ఒక గొప్ప ఛాయిస్. దీన్ని ఉపయోగించడానికి నెయిల్ పాలిష్  రిమూవర్‌ను ఒక కాటన్ బాల్‌పై అద్ది, స్టిక్కర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత  సున్నితంగా గీకాలి. జిగురు గుర్తులు పూర్తిగా మాయమవుతాయి. వేడినీరు..  వాటర్ ప్రూఫ్ ఉన్న ప్రాంతాలలో స్టిక్కర్లు ఉంటే వేడి నీరు చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం  గోరువెచ్చని నీటితో కొద్దిగా డిష్ సోప్ కలపాలి. ద్రావణంలో స్పాంజ్ ముంచి స్టిక్కర్ మీద సున్నితంగా రుద్దాలి. స్టిక్కర్ లేదా జిగురు   పదార్థం సులభంగా తొలగిపోతాయి.                                    *రూపశ్రీ.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు. భారతదేశంలో ఉపవాసం సాధారణంగా మరుసటి రోజు ప్రారంభమవుతుంది. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల.  దీనిని అత్యంత పవిత్రమైన మాసంగా  పరిగణిస్తారు. ఈ నెల చాలా ప్రత్యేకమైనది.  ఈ సమయంలోనే పవిత్ర ఖురాన్ అవతరణ ప్రారంభమైందని చెబుతారు. రంజాన్ ఉపవాసం,  దాహం గురించి మాత్రమే కాదు, రంజాన్ మాసంలో చెయవలసిన పనులు,  చేయకూడని పనులు కూడా ఉంటాయి.  అవేంటో తెలుసుకుంటే.. రంజాన్ ప్రాముఖ్యత.. రంజాన్ మాసం దయ, ఆశీర్వాదం,  క్షమాపణల మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ముస్లింలు ఉపవాసం ఉండి, తమ పాపాలకు క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. ఉపవాసం సహనం, క్రమశిక్షణ,  స్వీయ నియంత్రణను నేర్పుతుంది. రోజంతా ఆకలితో,  దాహంతో ఉండటం వల్ల పేదవారి కష్టాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనుషులలో స్పందించే గుణం పెరుగుతుంది. రంజాన్ నెలలో జకాత్,  సదఖా (దానధర్మాలు) ఇవ్వడం  చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. పేదలకు  ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వడం సమాజంలో సమానత్వాన్ని,  సోదరభావాన్ని పెంపొందిస్తుంది.  రంజాన్ చివరి పది రాత్రులు ప్రత్యేకంగా పరిగణించబడతాయి. షబ్-ఎ-ఖదర్ రాత్రి వెయ్యి నెలల కంటే మెరుగైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్ మాసంలో ఏం చెయ్యాలి.. ఐదుసార్లు ప్రార్థన చేయడం చాలా ముఖ్యం అని చెబుతారు.  అది కూడా  సరైన సమయానికి చేయాలి. ప్రతిరోజూ ఖురాన్‌లో కొంత భాగం చదవడం లేదా వినడం చేయాలి. ఈ నెల ఖురాన్‌తో అనుసంధానం కావడానికి ఉత్తమ సమయం. ఖర్జూరం,  నీటితో ఉపవాసం విరమించడం సున్నత్‌గా పరిగణించబడుతుంది. జకాత్,  సదఖా ఇవ్వడం ద్వారా పేదవారికి సహాయం చేయాలి.  ప్రవర్తనను నియంత్రించుకోవాలి. కోపం, వాదనలు,  కఠినమైన మాటలు నివారించాలి. ఇఫ్తార్ సమయంలో  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి,  సమతుల్య భోజనం తినాలి. రంజాన్ లో చేయకూడనివి.. అబద్ధాలు చెప్పడం, గాసిప్ చెప్పడం,  ఇతరులను   బాధపెట్టడం మానుకోవాలి. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకూడదు. ఇఫ్తార్ సమయంలో ఆహారం వృధా చేయకూడదు.  లేదా వృధా ఖర్చులు చేయకూడదు. ప్రార్థనలో అజాగ్రత్తగా ఉండకూడదు. పనికిరాని కార్యకలాపాలలో లేదా చెడు అలవాట్లలో సమయాన్ని వృధా చేయకూడదు.                                                     *రూపశ్రీ
  నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒక విలాసం కాదు, అది ఒక అవసరం. మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడానికి ఈ క్రింది సమగ్ర సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం: మీ ఫిట్‌నెస్ ప్రయాణం ఇక్కడే మొదలు! మన పూర్వీకులు జిమ్ అంటే ఏంటో తెలియకపోయినా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే వారి జీవనశైలిలో శారీరక శ్రమ ఒక భాగంగా ఉండేది. కానీ నేటి కాలంలో మనం చిన్న పనికి కూడా స్విగ్గీ లేదా జెప్టో వంటి యాప్స్ పై ఆధారపడుతూ, కనీసం నడవడానికి కూడా బద్ధకిస్తున్నాము. మన శరీరం కదలడానికి పుట్టింది, కూర్చోవడానికి కాదు. కదలిక లేని జీవితం వ్యాధులకు నిలయంగా మారుతోంది. మనం ఎందుకు వర్కవుట్ చేయాలి? • మనుగడ కోసం: నడక అనేది ఒక వ్యాయామం కాదు, అది మన మనుగడకు ప్రాథమిక అవసరం. మనం ఆరోగ్యంగా బతకాలంటే శారీరక కదలిక తప్పనిసరి. • ఒత్తిడిని జయించడానికి: నిత్యం ఉండే మానసిక ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం పొందడానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. • శరీర పునరుజ్జీవనం కోసం: సరైన వర్కవుట్ మరియు తగినంత నిద్ర మీ బాడీని రిజూవినేట్ (Rejuvenate) చేసి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఏం చేయకూడదు?  • లిఫ్ట్‌లు మరియు యాప్స్ పై అతిగా ఆధారపడటం: చిన్న దూరాలకు కూడా వాహనాలు వాడటం లేదా లిఫ్ట్‌లు వాడటం మానేయండి. మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న పనులను వ్యాయామంగా కాకుండా దైనందిన కృత్యంగా మార్చుకోండి. • రాత్రిపూట ఆలస్యంగా వర్కవుట్ చేయడం: వీలైనంత వరకు రాత్రి 7 గంటల తర్వాత భారీ వర్కవుట్స్ చేయకండి. దీనివల్ల బాడీలో కార్టిసోల్ లెవెల్స్ పెరిగి, మీ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. • నిద్రకు ముందు స్క్రీన్ చూడటం: నిద్రలేమి (Insomnia) సమస్యలను నివారించడానికి పడుకునే ముందు ఫోన్ లేదా టీవీ చూడటం మానేయాలి. • వర్కవుట్ సమయంలో నీళ్లు తాగకపోవడం: వర్కవుట్ చేసేటప్పుడు లిక్విడ్స్ తీసుకోకూడదనేది తప్పుడు ప్రచారం. నీరు తాగకపోతే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి నీరసం (Dizziness) వచ్చే ప్రమాదం ఉంది. సరైన పద్ధతిలో వర్కవుట్ ఎలా చేయాలి? • సరైన సమయం: జిమ్ చేయడానికి ఉదయం 5 నుండి 9 గంటల లోపు అత్యంత అనుకూలమైన సమయం. • వ్యాయామ కాలపరిమితి: రోజుకు కనీసం ఒక గంట వెయిట్ ట్రైనింగ్ మరియు ఆ తర్వాత 20 నుండి 30 నిమిషాల కార్డియో చేయడం ఉత్తమం. మొత్తం మీద 1.5 గంటల రొటీన్ సరిపోతుంది. • సహజ ఎలక్ట్రోలైట్స్: వర్కవుట్ మధ్యలో ఉప్పు నీరు, నిమ్మరసం లేదా పుదీనా కలిపిన నీటిని సిప్ చేస్తూ ఉండటం వల్ల కోల్పోయిన లవణాలు తిరిగి లభిస్తాయి. • ఆహారం మరియు విశ్రాంతి: ఒకవేళ సాయంత్రం వర్కవుట్ చేసినా, ఆ తర్వాత ప్రోటీన్ మరియు ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారం తీసుకుని, వేడి నీటి స్నానం చేసి పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ప్రశ్నలు - సమాధానాలు  1. నడకను ఫిట్‌నెస్‌లో భాగంగా చూడవచ్చా:  లేదు, నడక అనేది మన శరీరం ప్రాథమికంగా చేసే పని. ఫిట్‌నెస్ కోసం అదనపు వ్యాయామాలు అవసరం. 2. జిమ్ చేయడానికి రోజులో ఏ సమయం ఉత్తమం: ఉదయం వేళల్లో చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది. అయితే సమయం లేని వారు తగిన జాగ్రత్తలతో సాయంత్రం కూడా చేయవచ్చు. 3. బాడీ రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి: తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్రలోనే శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. నిద్ర తగ్గితే 'బ్రెయిన్ ఫాగ్' మరియు నీరసం వచ్చే అవకాశం ఉంది. ముగింపు: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కేవలం ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు, తగినంత కదలిక మరియు వ్యాయామం కూడా ఉండాలి. సీడ్ ఆయిల్స్ మరియు కల్తీ పాల పదార్థాలకు దూరంగా ఉంటూ, ఒత్తిడిని నియంత్రించుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం మా YouTube Channel (Video link: https://youtu.be/u4uDJUP7Fw0?si=j6YfUFILXu2eJwcc ) ని సందర్శించండి. అక్కడ మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోలు మరియు వర్కవుట్ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి!
చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.  కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు.  బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు.  ముఖ్యంగా వేసవి కాలంలో బాదం బంక వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది చిన్న బంక గడ్డల్లా ఉంటుంది. నీటిలో వేసి సుమారు 2 గంటల సేపు నానబెడితే బాదం బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీన్ని నేరుగా తింటారు,  నీటిలో కలిపి తాగుతారు,  ఇందులో సబ్జా, పంచదార వంటివి కూడా కలుపుకుని తాగుతారు.  వేసవిలో పానీయాలలో బాదం బంకను యాడ్ చేసుకుంటారు. ఇది శరీరానికి చలువ చేస్తుందని చెబుతారు. అయితే.. బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని కొందరు అంటుంటారు.  దీని వెనుక గల నిజం ఏమిటో తెలుసుకుంటే.. మొటిమలకు కారణం.. చర్మం మీద మొటిమలు, కురుపులు వంటివి వేడి వల్ల వస్తాయి. దీని వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది. ఈ వేడిని తగ్గించడం ద్వారా మొటిమలు, కురుపులు తగ్గించడంలో బాదం బంక చక్కగా.. ఔషధంలా పనిచేస్తుంది. బాదం బంక.. చర్మ ప్రయజనాలు.. బాదం బంకను తీసుకోవడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి.   బాదం బంకను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.  ఉదయానికి ఈ బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది.  దీనికి కొంచెం చల్లని నీరు కలపాలి.  ఇందులో కొంచెం నిమ్మరసం కలపాలి.  దీన్ని డీహైడ్రేట్ పానీయంలా తీసుకోవాలి.  కనీసం 3 నుండి 4 రోజులు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం బంక ఎందుకు మంచిది? బాదం బంక తినడం వల్ల సహజంగానే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది.  బాదం బంకలో ఉండే  యాంటీ-ఏజింగ్ లక్షణాల కారణంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది.  మొటిమలు, ముడతలు,  వడదెబ్బ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బాదం బంక తినడం వల్ల  చర్మానికి మెరుపు, యవ్వనం   లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.                                    *రూపశ్రీ.