LATEST NEWS
  తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తమిళనాడు రాజకీయాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నకు స్పందించిన డోలేంద్ర ప్రసాద్.. “తమిళనాడులో చిన్న భూకంపం వచ్చినా ఏపీలో ప్రకంపనలు కనిపిస్తాయి” అని వ్యాఖ్యానించారు.  దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను శాసించిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు విజయ్ నేతృత్వంలోని టీవీకే గట్టి సవాల్ విసిరిందన్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికలను “జెన్-జీ ఎలక్షన్స్”గా అభివర్ణిస్తూ, యువ ఓటర్లు భారీగా విజయ్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే, యాక్సిస్ మై ఇండియా అంచనాలు చాలా వరకు కరెక్ట్‌గా ఉన్నాయని, విజయ్ పార్టీకి 100కు పైగా సీట్లు వచ్చే అవకాశాన్ని ముందుగానే సూచించిందని చెప్పారు. గతంలో తమిళనాడులో కరుణానిధి, జయలలిత మధ్య అధికార మార్పిడి కొనసాగేదని, ఇప్పుడు ఆ రాజకీయ సమీకరణాల్లో మార్పు కనిపిస్తోందన్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా గెలవలేదని, ఎన్నికల కమిషన్ సహకారంతో గెలిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ముస్లిం ఓట్ల విభజన కారణంగా మమతా బెనర్జీకి నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడిన డోలేంద్ర ప్రసాద్.. కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని ప్రజలు పూర్తిగా అంగీకరించలేదని, అలాగే చంద్రబాబు తర్వాత నారా లోకేష్‌ను ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారో 2029 ఎన్నికల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు.  అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో లోకేష్ కీలక శక్తిగా ఎదుగుతున్నారని చెప్పారు. గత ఎన్నికల తర్వాత లోకేష్‌లో వచ్చిన పరిణతి, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో సంపాదించుకున్న ఆదరణ ఆయనను పార్టీ భవిష్యత్ నాయకుడిగా నిలబెడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవంతో లోకేష్‌ను వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. బెంగాల్‌,  తమిళనాడు ఎన్నికల ఫలితాలపై  వివరాలు కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.      
  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో అక్కడ సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో 'హంగ్' ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఎలా ఉంటుంది? గతంలో ఇలాంటి పరిస్థితుల్లో మైనార్టీ ప్రభుత్వాలు ఎలా కొలువుదీరాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ పార్టీకీ మెజార్టీ రాని పక్షంలో గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగిస్తారు. అతిపెద్ద పార్టీని గానీ లేదా ఎన్నికల అనంతర కూటమిని గానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. గత దశాన్నర కాలంలో మహారాష్ట్ర, కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాల్లో ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2019లో మహారాష్ట్రలో దాదాపు 34 రోజుల పాటు రాజకీయ హైడ్రామా కొనసాగింది. అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్నాయి. మూడు రోజులకే కూలిన ప్రభుత్వం.. 2018లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోనూ ఇదే తరహా రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం 222 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌కు 80, జేడీఎస్‌కు 37 స్థానాలు దక్కాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 స్థానాల మెజార్టీ ఎవరికీ రాలేదు. దీంతో నాటి గవర్నర్ వాజూభాయ్ వాలా బీజేపీ నేత యడియూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.  ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు వెలువడ్డాయి. బీజేపీకీ తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు ముందే యడియూరప్ప ప్రభుత్వం కేవలం మూడు రోజులకే కూలిపోయింది. తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్‌కు షాక్.. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలుండగా, 2017 ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ 17, బీజేపీ 13 స్థానాలు గెలుచుకున్నాయి. అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా నాటి గవర్నర్ మృదులా సిన్హా బీజేపీ నేత మనోహర్ పారికర్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో 2017లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. గవర్నర్ తన విచక్షణ మేరకు స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చే అవకాశం ఉన్న పార్టీని ఆహ్వానించడం ఇక్కడ కీలకంగా మారింది.  2013లో ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 28 సీట్లతో కాంగ్రెస్ మద్దతుతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.ప్రస్తుతం తమిళనాడులో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విజయ్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టలేకపోతే, రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజేత ఎవరనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.  
మెజార్టీకి అవసరమైన మద్దతు కూటగట్టుకుంటామని, ప్రమాణస్వీకారానికి అనుమతి ఇవ్వాలని టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్‌ను కోరితే.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ ప్రస్తుతం టీవీకే వద్ద లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టం చేస్తూ అనుమతి తిరస్కరించారు. ఆ క్రమంలో విజయ్‌కు రాజకీయ మద్దతు పెరుగుతూ.. , రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే సింగిల్ లార్జెస్ట్  పార్టీగా అవతరించినప్పటికీ..  ప్రభుత్వ  ఏర్పాటు   విషయంలో గవర్నర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు. మరోవైపు, అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్‌కే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో..  ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విజయ్ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారనీ,  మరే ఇతర కూటమి  కోరనప్పుడు గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని.. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ వ్యవస్థను వాడుకుంటోందని సీపీఎం తీవ్రంగా ఆరోపించింది.  విజయ్‌కు కేవలం సీపీఎం మాత్రమే కాకుండా, ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సీపీఐ, వీసీకే పార్టీలు కూడా ప్రజా తీర్పును గౌరవించి విజయ్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..  తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలని హితవు పలికింది. మరో వైపు డీఎంకే కూడా కొత్త పార్టీ ప్రభుత్వ ఏర్పాటునకు తాము అడ్డపడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు డీఎంకే అధినేత స్టాలిన్ స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామని, అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న వార్తలు పూర్తిగా నిరాధారమని కొట్టి పారేశారు. 
ఏపీ రాజకీయాల్లో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కీలక మార్పులు చేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ (ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ)ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కమిటీ నియామకంపై కసరత్తును పార్టీ హై కమాండ్ ప్రారంభించింది. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది.  కూటమి రాజకీయాల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన  తెలుగుదేశం హైకమాండ్..   క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు తగ్గకుండా ఉండేందుకే ఈ   మార్పులు చేసినట్లు పార్టీ  వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గ పరిధిలో జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రొటోకాల్ వివాదం తీవ్ర  చర్చనీయాంశమైంది. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో  వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఇన్చార్జ్‌గా తనను తప్పించడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పలురకాల సమీకరణాలతో టీడీపీలో మార్పులు జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. ఫైనల్‌గా పార్టీ బాగుండేలా హై కమాండ్ చూడాలని అన్నారు. మంత్రి నారా లోకేశ్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటును నిర్ణయించారన్న వర్మ.. టీడీపీలో నాయకులే ఇక్కడ నిర్వహణ చేస్తారని.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను పూర్తిగా సహకరిస్తానని  స్పష్టం చేశారు.  పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో పోటీ నుంచి  అయిష్టంగానే తప్పుకున్న వర్మ.. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు. అప్పట్లో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని తెలుగుదేశం అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇంత వరకు వర్మకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన వర్గం అసంతృప్తితో ఉంది. ఆ క్రమంలో పిఠాపురంలో ఎప్పటికప్పుడు కూటమి పార్టీల మధ్య విభేదాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వర్మను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఈ పరిణామం ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాము అడ్డుకోబోమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రజల తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందన్న ఆయన..  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు. అన్నాడీఎంకేతో కలిసి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోందంటూ జరుగుతున్న ప్రచారాన్నిన ఆయన కొట్టిపారేశారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదనీ, అవన్నీ వదంతులేనని స్టాలిన్ స్పష్టం చేశారు.  కొత్త పార్టీ ప్రభుత్వ ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Marking actor Sundeep Kishan’s birthday, the makers of his upcoming film Power Peta released a brief but impactful glimpse into its gritty world. Directed by Krishna Chaitanya, the project is shaping up to be an intense character-driven action drama, moving away from conventional hero tropes to explore morally grey territories. The newly released footage establishes Sundeep’s character through a distinct visual analogy, comparing his dominance to a wild lion ruling its territory. The narrative makes it clear that his character relies heavily on fear to maintain control over his enemies.  A standout moment in the teaser is the unconventional reveal of his name, Senapathy Ravi, spelled out through bursting firecrackers. This visual sequence is heavily anchored by veteran composer Mani Sharma’s background score, which effectively sets a dark and brutal tone for the film. Currently, the shoot for Power Peta is progressing at a brisk pace.  Backed by 70 MM Entertainment, the production appears to be investing in strong visual aesthetics and technical quality to match the heavy demands of the script. With Sundeep Kishan adopting a rugged body language for this role, the glimpse successfully builds curiosity around how Krishna Chaitanya will navigate this raw, grey-shaded drama.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్లు) మరియు నిర్మాతలు/డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వివాదం ముదురుతోంది. ముఖ్యంగా 'రెంట్ వర్సెస్ పర్సంటేజ్' పద్ధతిపై జరుగుతున్న చర్చపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనదైన శైలిలో స్పందించారు. రామ్ చరణ్ నటించబోయే 'పెద్ది' సినిమా థియేటర్ల ఇష్యూపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'జెట్లీ' సినిమా విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. నైజాం ప్రాంతంలో థియేటర్ల అద్దె విషయంలో ఎగ్జిబిటర్లు పట్టుబడుతుంటే, నిర్మాతలు మాత్రం పర్సంటేజ్ పద్ధతిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి చిత్రం 'పెద్ది'కి కూడా థియేటర్ల సమస్య ఎదురవుతుందా అనే దానిపై నట్టి కుమార్ స్పష్టతనిచ్చారు.  నట్టి కుమార్ మాట్లాడుతూ, "సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కంటెంట్ ఉన్నవాడే ఓనర్. చిన్న సినిమాలకు నిర్మాతలు థియేటర్ల దగ్గరకు వెళ్లాలి, కానీ పెద్ద సినిమాలకు ఎగ్జిబిటర్లే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరకు వస్తారు" అని పేర్కొన్నారు. పెద్ద సినిమాల విషయంలో ఎగ్జిబిటర్లు డిక్టేట్ చేయడం కుదరదని, సినిమా వేయాలా వద్దా అనేది నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తమను మల్టీప్లెక్స్‌లతో పోల్చుకోవడం సరికాదని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. మల్టీప్లెక్స్‌లలో నిర్వహణ ఖర్చు, టికెట్ ధరలు మరియు ఆక్యుపెన్సీ వేరుగా ఉంటాయని, అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు ఉన్నా షో వేస్తారని, కానీ సింగిల్ స్క్రీన్స్‌లో 30 టికెట్లు తెగనిదే షో వేయని పరిస్థితి ఉంటుందని గుర్తు చేశారు. నిర్మాతలు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే, అది ఫ్లాప్ అయితే నిర్మాత రోడ్డున పడతాడే తప్ప ఎగ్జిబిటర్లు వచ్చి ఆదుకోరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "మొన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి సినిమాల విషయంలో కోట్లలో నష్టం వచ్చినప్పుడు ఏ ఎగ్జిబిటర్ అయినా డొనేషన్ ఇచ్చారా?" అని ప్రశ్నించారు. నిర్మాత విలువను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. చిన్న సినిమాను ఆదరించని థియేటర్లకు పెద్ద సినిమాలు ఇవ్వకూడదని, ఆ ధైర్యం నిర్మాతలు చూపాలని నట్టి కుమార్ సూచించారు. అప్పుడే పరిశ్రమలో సమతుల్యత ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన ఇంట‌ర్యూల కోసం మా Teluguone cinemaను Subscribe చేసుకోండి. 
ప్రపంచ సినిమా చరిత్రలో అద్భుత సృష్టించిన ‘అవతార్’ సినిమా గురించి తెలియని వారు ఉండరు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. అవతార్‌లోని ప్రధాన పాత్ర అయిన 'నైటిరి' రూపాన్ని తన అనుమతి లేకుండా వాడేశారంటూ ఒక నటి సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కిన వార్త ఇప్పుడు హాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ప్రముఖ హాలీవుడ్ నటి క్వారియాంకా కిల్చర్ తాజాగా జేమ్స్ కామెరూన్‌తో పాటు డిస్నీ సంస్థపై చట్టపరమైన చర్యలకు దిగింది. 2005లో వచ్చిన ‘ద న్యూ వరల్డ్’ సినిమాలో తను నటించినప్పుడు తీసిన ఫోటోల ఆధారంగానే ‘అవతార్’ హీరోయిన్ పాత్రను డిజైన్ చేశారని ఆమె ఆరోపిస్తోంది. తన ముఖ కవళికలను, బయోమెట్రిక్ ఫీచర్లను ఎటువంటి అనుమతి తీసుకోకుండా వాణిజ్య పరంగా వాడుకున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివాదం మరింత ముదరడానికి కారణం గతంలో కామెరూన్ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్. అందులో ఆయన ఒక స్కెచ్ చూపిస్తూ, నైటిరి పాత్రను రూపొందించడానికి క్వారియాంకా కిల్చర్ ముఖమే ప్రేరణ అని చెప్పడం విశేషం. అయితే ఆమెకు ఎటువంటి క్రెడిట్ ఇవ్వకపోవడమే కాకుండా, కనీసం నష్టపరిహారం కూడా చెల్లించకుండా కోట్ల లాభాలు గడించారని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఒక చిన్న వయసున్న అమ్మాయి ముఖాన్ని డిజిటల్ పద్ధతిలో కాపీ చేయడం మోసమేనని వారు అంటున్నారు. జేమ్స్ కామెరూన్ అంటేనే భారీతనానికి మారుపేరు. టైటానిక్ నుంచి నేటి అవతార్ వరకు ఆయన తీసిన ప్రతి సినిమా ఒక రికార్డు. అవతార్ మొదటి భాగం దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయగా, రెండో భాగం కూడా సంచలనం సృష్టించింది. మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కూడా రిలీజ్ అయింది. ఇలాంటి కీలక సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరు ఇది జస్ట్ ఇన్‌స్పిరేషన్ మాత్రమే అని కామెరూన్‌కు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం అనుమతి లేకుండా ఒకరి రూపాన్ని వాడటం తప్పేనని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసుపై జేమ్స్ కామెరూన్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే మాత్రం ‘అవతార్’ ఫ్రాంచైజీకి భారీ మూల్యం చెల్లించక తప్పదు. మరోవైపు వచ్చే ఏడాది విడుదల కాబోతున్న అవతార్ తదుపరి భాగాలపై ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఏవైటెడ్ స్పై థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి సీజన్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్ 2 తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. రిచర్డ్ మాడెన్, స్టాన్లీ టుచీ వంటి హాలీవుడ్ దిగ్గజాలు నటించిన ఈ సిరీస్ పై మొదటి నుంచి ఇండస్ట్రీలో భారీ బజ్ నెలకొంది. ఈ రెండో సీజన్ కథ విషయానికి వస్తే.. సిటాడెల్ ఏజెన్సీ పతనమైన తర్వాత నాడియా సిన్హా (ప్రియాంక చోప్రా), మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్) ఎదుర్కొన్న సవాళ్ళను దర్శకులు రూసో బ్రదర్స్ చాలా స్టైలిష్‌గా చూపించారు. తమ గతాన్ని వెతుక్కుంటూనే శత్రువుల ఆట కట్టించే క్రమంలో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి కథలో ఎమోషన్స్ కు కూడా పెద్దపీట వేయడం విశేషం. ప్రియాంక చోప్రా తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆమె చేసిన ఫైట్స్ హాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. ఇక రిచర్డ్ మాడెన్ తనదైన స్టైల్ లో సిరీస్ ని నడిపించగా, కీలక పాత్రలో నటించిన స్టాన్లీ టుచీ తన మార్క్ నటనను కనబరిచారు. మొదటి సీజన్ తో పోలిస్తే ఇందులో యాక్షన్ డోస్ పెంచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నేపథ్యం గురించి చెప్పాలంటే.. అవెంజర్స్ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన రూసో బ్రదర్స్ ఈ సిరీస్ ని ఒక భారీ యూనివర్స్ లా డిజైన్ చేశారు. ఇందులో భాగంగానే ఇండియాలో వరుణ్ ధావన్, సమంతలతో 'సిటాడెల్: హనీ బన్నీ' అనే స్పిన్ ఆఫ్ కూడా రూపొందించారు. ఈ సీజన్ 2 లో కొన్ని భారతీయ మూలాలను టచ్ చేయడం మన తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే అంశం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సిరీస్ పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. యాక్షన్ ప్రియులకు ఇది ఒక విందు భోజనం అని కొందరు అంటుంటే, కథనం కొంచెం నెమ్మదిగా సాగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రియాంక చోప్రా క్రేజ్ దృష్ట్యా ఈ సిరీస్ ఓటీటీలో భారీ వ్యూస్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి 7 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ రెండో సీజన్ స్పై థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారిని అలరిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యూనివర్స్ నుండి మరిన్ని సిరీస్ లు వస్తాయా లేదా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగింది. వీకెండ్ లో ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే 'సిటాడెల్ 2' పై ఒక కన్నేయొచ్చు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం మ్యూజిక్ అంటే తమన్, తమన్ అంటే మ్యూజిక్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తనదైన మాస్ బీట్స్ మరియు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా రేంజ్‌ను పెంచే తమన్, తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటల జాబితాలో మొదటి మూడు స్థానాలను తన ఖాతాలోనే వేసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఒక పాట క్లిక్ అయితే ఆ సినిమాకు వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. తాజాగా మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ యూట్యూబ్‌లో 600 మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది. అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న పాటల్లో ఒకటిగా ఇది నిలిచింది. దీంతో టాప్ 3 స్థానాల్లో ఉన్న తెలుగు పాటలన్నీ తమన్ స్వరపరిచినవే కావడం విశేషం. ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలు అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రానివే కావడం గమనార్హం. ఆ సినిమాలోని 'బుట్టబొమ్మ' సాంగ్ సుమారు 890 మిలియన్ల వ్యూస్‌తో అగ్రస్థానంలో ఉండగా, 'రాములో రాములా' సాంగ్ 695 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు వీటికి 'కుర్చీ మడతపెట్టి' తోడవ్వడంతో తమన్ రికార్డుల హాట్రిక్ పూర్తి చేశారు. ఒక వైరల్ డైలాగ్‌ను తీసుకుని దానికి మాస్ ట్యూన్ జోడించి సామాన్యులను సైతం స్టెప్పులు వేయించేలా చేయడంలో తమన్ రూటే వేరు. 'గుంటూరు కారం' సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, తమన్ అందించిన పాటలు మాత్రం మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా ఈ సాంగ్‌లో మహేష్ బాబు ఎనర్జీ, శ్రీలీల డ్యాన్స్ తోడవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పాట ట్రెండ్ అయ్యింది. గతంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' ఆల్బమ్ తెలుగు సినీ చరిత్రలోనే ఒక సంచలనం. ఆ పాటలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇప్పటికీ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో ఈ పాటలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ కు ఉన్న క్రేజ్ ఏమిటో ఈ వ్యూస్ లెక్కలే నిరూపిస్తున్నాయి.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన నటి అసిన్. 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న ఈ కేరళ కుట్టి, 'గజిని' సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఒకప్పుడు అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే అసిన్ అనూహ్యంగా సినిమాలకు స్వస్తి పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్లామర్ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆమె ఎంచుకున్న ఆ కొత్త జీవితం ఎలా ఉంది? ప్రస్తుతం ఆమె ఏం చేస్తోంది? అన్న విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసిన్ రియల్ లైఫ్ లవ్ స్టోరీ కూడా ఒక సినిమాను తలపిస్తుంది. 'గజిని' సినిమాలో సెల్ ఫోన్ కంపెనీ యజమానితో ప్రేమలో పడినట్లుగానే, నిజ జీవితంలోనూ మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మతో ఆమె ప్రేమలో పడింది. వీరిద్దరిని కలిపింది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. 2016లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 1400 కోట్ల నికర ఆస్తులున్న వ్యాపార సామ్రాజ్యానికి కోడలిగా వెళ్లినా, అసిన్ తన నిరాడంబరతను కోల్పోలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన అసిన్, తన సమయాన్ని కుటుంబానికి మరియు తన కుమార్తె 'అరిన్' పెంపకానికి కేటాయిస్తోంది. తన భర్తకు వ్యాపార విషయాల్లో అండగా నిలుస్తూనే, ఒక గృహిణిగా తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తోంది. పారిశ్రామికవేత్తగా రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ మాత్రమే కాకుండా, 'రివోల్ట్' ఎలక్ట్రిక్ బైక్స్ వంటి రంగాల్లో కూడా రాణిస్తున్నారు. రాహుల్ తన భార్య అసిన్‌ను కేవలం జీవన సహచరిగానే కాకుండా, తన జీవితానికి 'కో-ఫౌండర్'గా అభివర్ణించడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం. సాధారణంగా నటీమణులు స్టార్ డమ్ ఉన్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తారు. కానీ అసిన్ మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆమె షేర్ చేసే ఫోటోలలో గ్లామర్ కంటే కుటుంబ అనుబంధాలే ఎక్కువగా కనిపిస్తాయి. తన కుమార్తె అరిన్ చదువు, క్రీడలు మరియు డ్యాన్స్ పట్ల చూపిస్తున్న ఆసక్తిని అసిన్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆమెను ప్రోత్సహిస్తోంది. ఒక స్టార్ హీరోయిన్‌గా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న అసిన్, ఇప్పుడు తన చిన్నపాటి కుటుంబ ప్రపంచంలోనే అసలైన సంతోషాన్ని వెతుక్కుంది. కోట్ల ఆస్తులు, హోదా ఉన్నప్పటికీ ఆమె గడుపుతున్న నిరాడంబరమైన జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. వెండితెరపై ఆమెను మిస్ అవుతున్నప్పటికీ, ఒక గృహిణిగా ఆమె సాధిస్తున్న ఈ 'పర్సనల్ సక్సెస్' నిజంగా అభినందనీయం.
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియడ్ డ్రామా 'పవర్‌పేట' (Powerpeta). కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి సందీప్ కిషన్ పుట్టినరోజు (మే 7) సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ గ్లింప్స్‌లో సందీప్ కిషన్ లుక్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఆయన 'సేనాపతి రవి' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. "అడవిలో సింహం ఉ** పోసి ఇది నా చోటు అని చెప్తుంది. ఇక్కడ ఉ** పోయిస్తే గానీ ఈ చోటు నీది కాదు" అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తున్నాయి.  సందీప్ కిషన్ టపాసులతో థియేటర్ లోకి ఎంటరై అందరినీ భయపెట్టడం, స్క్రీన్ ని తగలబెట్టడం, దాని మీద 'పవర్‌పేట' అని టైటిల్ పడటం ఆకట్టుకుంది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ విజువల్స్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని స్పష్టం చేస్తున్నాయి. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన బలం అని చెప్పొచ్చు.  70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య మార్క్ డైలాగ్స్, పొలిటికల్ అండ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ, గౌరవం, రాజకీయం (Love, Honour, Politics) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాలో సందీప్ కిషన్ మూడు భిన్నమైన వయసు గల పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ బర్త్ డే గ్లింప్స్ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది.  
  నేడు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) తన కొత్త సినిమా 'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రెస్ మీట్ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు, తన వ్యక్తిగత జీవితం మరియు తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.   తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్  పార్టీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఎందుకు  ఆహ్వానించడం లేదు.  విజయ్‌(VIjay)ని సీఎం కాకుండా అడ్డుకోవడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. ఆయన్ని కురుక్షేత్రంలోని అభిమన్యుడిలా పద్మవ్యూహంలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విజయ్ నాకు 1996 నుండి తెలుసని, ఆయన ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారని,  అధికారం కోసం ఆశపడే వ్యక్తి కాదని కొనియాడారు.   Also read: Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య  కావ్య రెడ్డి చేసే బిజినెస్ ఇదేనా!   చాలా కాలం తర్వాత  ఆపరేషన్ అరుణారెడ్డి చేస్తున్నాను. నేనే ద‌ర్శ‌కుడ్ని  ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ కథ ప్రస్తుత సమాజంలో నిజాయితీగా ఉంటే ఎవరూ మెచ్చుకోరని, బలం ఉన్న దొంగలే గొప్పవాళ్లవుతున్నారు. నన్ను ప్రశాంతంగా సినిమాలు చేసుకోనివ్వండి, అనవసరంగా రోడ్డు మీదకు లాగొద్దు. న‌న్ను ఎవరైనా తిడితే మాత్రం గట్టిగా రియాక్ట్ అవుతానని హెచ్చరించారు. పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు  సినీ వర్గాల్లోనూ,రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి..
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్త (Gayathri Gupta). కెరీర్ పరంగా ఎంత ధైర్యంగా కనిపిస్తారో, వ్యక్తిగత జీవితంలో అంతకు మించిన పోరాటాన్ని ఎదుర్కొన్నారు. తాజాగా ఆమె తెలుగువన్‌(TeluguOne)కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటి కోణాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గాయత్రి వెనుక ఇంతటి వేదన ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూలో గాయత్రి తన బాల్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి చాలా కఠినంగా ఉండేవారని, చిన్నతనంలో తన తల్లిని కొట్టడమే కాకుండా.. ఏకంగా కరెంట్ షాక్‌లు పెట్టడం, వాతలు పెట్టడం వంటి భయంకరమైన పరిస్థితుల మధ్య తాను పెరిగానని చెబుతూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కేవలం 16 ఏళ్ల వయసుకే తన తల్లికి తాను పుట్టానని, ఆ పరిస్థితుల్లో తన తల్లి కూడా ఎన్నో ఇబ్బందులు పడిందని గాయత్రి వివరించారు. ఇక తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. తనకు పెళ్లైన వారం రోజులకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అది ఒక టాక్సిక్ మ్యారేజ్ అని, అక్కడ శారీరక, మానసిక వేధింపులు ఎక్కువగా ఉండటం వల్లే అంత త్వరగా ఆ బంధం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. పెళ్లి అనేది ఒక పెద్ద స్కామ్ అని, ఆడపిల్లలకు రక్షణ లేని చోట ఉండటం కంటే ఒంటరిగా పోరాడటమే మిన్న అని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా గాయత్రి నిర్మొహమాటంగా పంచుకున్నారు. టాలెంట్ ఉన్నప్పటికీ నిజాలు మాట్లాడటం వల్లే తనను కమర్షియల్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారని ఆమె ఆరోపించారు. కాస్టింగ్ కౌచ్ వంటి ఇష్యూలపై గళం ఎత్తడం వల్ల కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు తనను పక్కన పెట్టాయని, అయినప్పటికీ తాను వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. టాలెంట్ చూసి అవకాశాలు ఇవ్వాలి కానీ, ఒక అమ్మాయిని శారీరకంగా ఉపయోగించుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం 'ఫస్ట్ టైమ్' అనే సినిమాలో ఒక ఆసక్తికరమైన పాత్ర పోషిస్తున్నానని, త్వరలోనే సొంతంగా ఒక ప్రేమకథను డైరెక్ట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నానని ఆమె వెల్లడించారు. గాయత్రి గుప్త ఫుల్ ఇంటర్వ్యూతో పాటు, మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
  బెల్లంకొండసాయి శ్రీనివాస్(Sai Sreenivas)వివాహం కావ్య రెడ్డి(Kavya Reddy)తో జరిగిన విషయం తెలిసిందే. జనరల్ గా మనకి తెలిసిన వాళ్లే పెళ్లి చేసుకుంటే ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ సంపాదించాలి కాబట్టి అబ్బాయ్, అమ్మాయి ఏ వర్క్ చేస్తుంటారని అడిగే పరిస్థితి. అలాంటిది సాయి శ్రీనివాస్ చేసుకున్న కావ్య రెడ్డి ఏ పని చేస్తుందో తెలుసుకోవాలని కూడా ఉంటుంది కదా! మరి అలా తెలుసుకోవాలనే వాళ్లందరి కోసం కొన్ని డీటెయిల్స్   కావ్యరెడ్డి ఒక లాయర్.  మరోవైపు అరటి చెట్టు నుంచి వచ్చే నారని దారాలుగా మార్చి చీరలను తయారు చేసి  విదేశాలకి పంపిస్తుందంట. దీంతో కావ్యకి  నెలకు సుమారు 90 లక్షల ఆదాయం వస్తుందట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో  తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట  వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డినే స్పందించాలి. కావ్యరెడ్డి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యాయవాది కూతురు అనే విషయం తెలిసిందే. Also read: Rajinikanth: అభిమానులని బాధకి గురి చేస్తున్న రజీనీకాంత్ మాటలు    
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు. మీ ఆరోగ్యాన్ని తిరిగి మీ చేతుల్లోకి తెచ్చుకోవడానికి, ఈ VIDEO మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం హార్మోన్ల ఆరోగ్యంపై ఎందుకు దృష్టి పెట్టాలి? (Why Should We?) మన శరీరంలోని పిట్యూటరీ మరియు హైపోథాలమస్ వంటి గ్రంథులు సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. గ్లూకోజ్ నియంత్రణ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే (Hyperglycemia) అది శరీరంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది. జీవనశైలి వ్యాధులు: దీర్ఘకాలిక హార్మోన్ల సమస్యలు కేవలం అలసటకే పరిమితం కావు, అవి పెద్ద ఆరోగ్య రుగ్మతలుగా మారుతాయి. సహజమైన శక్తి: హార్మోన్లు సమతుల్యంగా ఉంటే, కృత్రిమ ఉత్ప్రేరకాలు లేకుండానే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఏమి చేయకూడదు? (What Not to Do) మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు హార్మోన్లను దెబ్బతీస్తాయి: జంక్ ఫుడ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఫుడ్: ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు జంక్ ఫుడ్ గ్లూకోజ్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తాయి. కెమికల్ కాస్మెటిక్స్: ప్రతిరోజూ అధికంగా మేకప్ వాడటం మంచిది కాదు. వీటిలోని జీనోబయోటిక్స్ (Xenobiotics) మరియు జీనోఈస్ట్రోజెన్స్ (Xenoestrogens) హార్మోన్ల పనితీరును గందరగోళానికి గురిచేస్తాయి. నిద్రను నిర్లక్ష్యం చేయడం: రాత్రిపూట సినిమాలు చూడటం లేదా ఫోన్ చూడటం వల్ల మీ సర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) దెబ్బతింటుంది. వ్యసనాలు: ధూమపానం, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలు మీ నాడీ వ్యవస్థను దెబ్బతీసి, హార్మోన్ల సమతుల్యతను పాడుచేస్తాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How to Balance) మీ హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి ఈ 5 సూత్రాలను పాటించండి: వ్యాయామమే మందు: "Movement is medicine". ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు జిమ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయండి. గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోవడానికి ఇది అవసరం. ప్రకృతితో అనుసంధానం: ఉదయాన్నే ఎండలో గడపడం మరియు రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. సేంద్రీయ పద్ధతులు: రసాయనాలతో కూడిన క్లీనర్లు మరియు వంటపాత్రలకు బదులుగా ఆర్గానిక్ పద్ధతులకు మారడానికి ప్రయత్నించండి. ఒత్తిడి నిర్వహణ: శ్వాస వ్యాయామాలు (Breathwork), జర్నలింగ్ మరియు ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వ్యక్తిగత ప్రణాళిక: అందరికీ ఒకే రకమైన వ్యాయామం సరిపోదు. మీ శరీరానికి ఏది సరిపోతుందో (వెయిట్ ట్రైనింగ్ లేదా కార్డియో) నిపుణుల సమక్షంలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో తెలుసుకోండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: వ్యాయామం వల్ల హార్మోన్లు ఎలా మెరుగుపడతాయి?  జ: వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ సరిగ్గా ఖర్చవుతుంది, దీనివల్ల హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రావు మరియు హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. ప్ర: కాస్మెటిక్స్ నిజంగా హార్మోన్లను దెబ్బతీస్తాయా?  జ: అవును, చాలా సౌందర్య సాధనాలలో ఉండే రసాయనాలు ఈస్ట్రోజెన్ లాగా ప్రవర్తించి మెదడులోని గ్రంథులను గందరగోళానికి గురిచేస్తాయి. ప్ర: నైట్ షిఫ్ట్ చేసే వారికి హార్మోన్ల సమస్యలు వస్తాయా?  జ: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పగలు-రాత్రి చక్రానికి (Circadian Rhythm) విరుద్ధంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత అనేది ఒక రోజులో వచ్చే మార్పు కాదు, ఇది ఒక జీవనశైలి. ఈ చిన్న చిన్న మార్పులతో మీ జీవితాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు వ్యాయామ చిట్కాల కోసం మా TeluguOne Health ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే (సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)
  పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది.  ఎంత వయసు పెరిగినా తల్లిదండ్రులకు పిల్లల గురించి ఆలోచన ఉంటుంది.  అబ్బాయిల విషయానికి వస్తే..  18 ఏళ్లలోకి వచ్చినప్పుడు వారి జీవితం చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది.  18 ఏళ్లకు మేజర్ గా గుర్తించబడతారు.  చట్ట ప్రకారం పిల్లల నుండి వయోజనులుగా మారుతారు.  అదే విధంగా మానసికంగా కలిగే మార్పులు కూడా వారిని బాధ్యతగా ఉండటంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేయడమే కాకుండా.. చాలా వరకు ఇండిపెండెంట్ గా ఉండటానికి కూడా ఇక్కడే కీలక మలుపు వస్తుంది. 18 ఏళ్ల వయసులో పిల్లలకు మార్గదర్శకత్వం చాలా అవసరం అవుతుంది. తల్లిదండ్రులు ఈ వయసు పిల్లలతో ఎంత సున్నితంగా, ఎంత ఆలోచించే విదంగా మాట్లాడగలుగుతారో.. పిల్లలతో విషయాలను షేర్ చేసుకోగలుగుతారో..  పిల్లల జీవితం కూడా అంత సరైన దిశలో నడవడానికి సహాయపడుతుంది.   18 ఏళ్లు నిండిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుంటే.. బాధ్యత.. 18 ఏళ్లు రాగానే నువ్వేం పెద్దాడివి కాదు అని తరచుగా తల్లిదండ్రులు అంటూ ఉంటారు. కానీ ఇది తప్పు.. 18 ఏళ్ల వయసు పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి అవకాశం దొరితే మొదటి దశ.. అయితే  తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలని వారు తెలుసుకోవాలి. తన ఖర్చులను తాను చూసుకోవడం, , సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, ఇంటి పనులలో పాలుపంచుకోవడం వంటి చిన్న చిన్న పనులు 18 ఏళ్ల వయసు పిల్లలకు నేర్పిస్తే.. అవి అతన్ని బాధ్యత గల వ్యక్తిని చేస్తాయి. డబ్బు విలువ.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. 18ఏళ్ల వయసులోనే పిల్లలకు స్నేహాలు, బయటటి ఖర్చులు వంటివి చాలా పెరుగుతాయి. నిజం చెప్పాలంటే.. డబ్బు కారణంగా పిల్లలు పాడైపోయే మొదటి దశ ఇదే.. అందుకే పిల్లలకు బడ్జెట్ రూపొందించుకోవడం, అనవసరమైన ఖర్చులను నివారించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటి అలవాట్లు నేర్పించాలి. ఇవి వారిని ఆర్థికంగా బలంగా చేస్తాయి. సరైన స్నేహాలు.. ఈ వయసులో స్నేహాలు, సంబంధాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మంచి స్నేహాలు..  నమ్మకమైన వ్యక్తులతో ఎలా ఉండాలో, మంచి స్నేహాలు ఎలా ఉంటాయో.. , చెడు స్నేహాలకు ఎలా దూరంగా ఉండాలో చెబుతూ ఉండాలి.  దీని వల్ల జీవితంలో వారు దెబ్బ తినే చాలా పెద్ద నష్టం నుండి బయటపడవచ్చు. డిజిటల్ జీవితం.. చిన్న పిల్లల్లా వారిని తిట్టి, కొట్టి కంట్రోల్ చేసే వయసు కాదు 18 ఏళ్ల పిల్లలది. అందుకే సోషల్ మీడియా , ఇంటర్నెట్‌ను తెలివిగా, అవగాహనతో ఉపయోగించడం చాలా ముఖ్యం.  అలాగే ఎలాంటి విషయాలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసుకోవాలి?  ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలి? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం జీవితం మీద ఎంత వరకు ఉండాలి వంటి విషయాలు వారికి అర్థమయ్యే లాగా వివరించి చెప్పాలి. మోటివేట్.. జీవితంలో ప్రతిఒక్కరూ వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. వైఫల్యం అనేది అంతం కాదని, అది నేర్చుకోవడానికి ఒక అవకాశమని వారికి వివరించాలి. ఎందుకంటే వైఫల్యాల కారణంగా తొందర పాటు నిర్ణయాలు తీసుకునే భావేద్వేగం వారిలో ఉంటుంది.  అందుకే ఎప్పుడూ స్పోర్టివ్ గా ఉండమని చెప్పాలి. ఈ ఆలోచన వారికి జీవితంలో ముందుకు  సాగడానికి బలాన్ని ఇస్తుంది.                             *రూపశ్రీ.
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి.  అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. కొన్ని పనులను అస్సలు వాయిదా వేయకూడదని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త,  తత్వవేత్త.. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలను ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఎంతో క్షుణ్ణంగా వివరించి చెప్పాడు.  లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏ పనులను వాయిదా వేయకూడదు? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ముఖ్యమైన పనులు.. ఒక మనిషి  సక్సెస్ ఫుల్  వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తి తన ముఖ్యమైన పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి.  తమకు ముఖ్యమైన పనుల విషయంలో  వారు చూపించే చురుకుదనమే వారిని ఆ పనిలో విజయం సాధించేలా చేస్తుంది.ముఖ్యమైన పనులు ఏవైనా సరే.. మళ్లీ చేద్దాంలే అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు.  సమయం చాలా విలువైన ఆస్తి అని,  పనులను వాయిదా వేయడం వల్ల ఎంతో గొప్ప ఆస్తిని కోల్పోయినట్టేనని, దీని వల్ల  ఒత్తిడి పెరగడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. నేర్చుకోవడం.. నేర్చుకోవడాన్ని అభ్యాసం అని అంటారు. చాణక్యుడి  ప్రకారం, జ్ఞానమే మనిషి  నిజమైన శక్తి. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. వారు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఎందుకంటే, ఈ రోజు తాము సంపాదించే జ్ఞానమే రేపటి విజయానికి పునాది వేస్తుందని వారికి తెలుసు. కష్టం.. విజయానికి కష్టపడటమే ఏకైక, ప్రధాన  మార్గం. సక్సెస్ కావాలంటే.. పనులను భారంగా కాకుండా.. వాటిని చాలెంజ్ గా తీసుకుని పూర్తీ చేయాలి. తమకు ఎదురొచ్చే ప్రతి పని, తమ ఎదుగుదలకు ఒక గొప్ప మార్గంగా చూడాలి. సోమరితనం , వాయిదా వేయడం మానవ పతనానికి దారితీస్తాయి. అందుకే చాణక్యుడు ప్రతి  పనిని సమయానికి పూర్తి చేయమని సలహా ఇస్తాడు. తప్పులు.. తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా పారిపోవడం  వైఫల్యానికి ప్రదాన కారణం అవుతుంది.   తన తప్పుల గురించి తెలుసుకుని,  వెంటనే వాటిని అంగీకరించి, ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరిదిద్దుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించగలుగుతాడు. తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే, అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అవకాశాలు.. జీవితంలో సువర్ణావకాశాలు కాలంతో పాటు వస్తూ ఉంటాయి. అలాగే కాలంతో పాటు చేజారి పోతాయి కూడా. ఒకసారి అవకాశం చేజారితే అది తిరిగి రాదని తెలిసి, దానిని గుర్తించి ఆలస్యం చేయకుండా వినియోగించుకోవడంలో నేర్పరి అయినవాడే విజయం సాధిస్తాడని చాణక్య నీతి చెబుతుంది.                            *రూపశ్రీ.
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. డబ్బు సంపాదన, కార్పొరేట్ ఒత్తిడి, మరియు మారుతున్న సామాజిక విలువల మధ్య మన వ్యక్తిగత జీవితం చితికిపోతోంది. ఈ VIDEO ద్వారా మీకు సెక్స్ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించడమే మా లక్ష్యం. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) సెక్స్ అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది మన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. మానసిక ప్రశాంతత: మనం సుఖంగా, ఆనందంగా ఉండాలన్నా, మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మెదడు: ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటి. పశుపక్షాదులు కూడా తమ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఆనందాన్ని పొందుతాయి, కానీ మనిషి మాత్రమే కంప్యూటర్ల ముందు కూర్చుని ఈ బేసిక్ ఫండమెంటల్స్‌ను మర్చిపోతున్నాడు. సంతానోత్పత్తి: సరైన హార్మోనల్ సెక్రేషన్ (ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్) ఉండటం వల్ల సంతానోత్పత్తి మరియు నెలసరి సక్రమంగా ఉంటాయి. ఏమి చేయకూడదు? (What Not to Do?) చాలా మంది తమకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి: ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురావద్దు: ఆఫీసు ఆలోచనలు ఇంటికి తీసుకురావడం వల్ల భాగస్వామిపై ధ్యాస తగ్గుతుంది, ఇది జడత్వానికి (Inertia) దారితీస్తుంది. సొంత వైద్యం వద్దు: ఎటువంటి అవగాహన లేకుండా పిల్స్ లేదా పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: హార్మోన్ల మార్పుల వల్ల గడ్డం దగ్గర వెంట్రుకలు రావడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, అంతేకానీ కేవలం బ్యూటీ పార్లర్లకు వెళ్లి తాత్కాలిక పరిష్కారాలు వెతకకూడదు. జనరిక్ మందుల పట్ల అపోహలు: జనరిక్ మందులు తక్కువ నాణ్యత గలవి అని అనుకోవద్దు; అవి కూడా అదే ఫార్ములాతో పనిచేస్తాయి. సమస్యను ఎలా అధిగమించాలి? (How to Improve?) జీవనశైలి మార్పులు: పిజ్జాలు, పాస్తాల వంటి వెస్ట్రన్ ఫుడ్ కంటే మన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోర్ ప్లే (Foreplay) ప్రాముఖ్యత: భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవడానికి మరియు ప్రేరేపించబడటానికి ఫోర్ ప్లే అనేది చాలా అవసరం. సరైన రోగ నిర్ధారణ: ఏదైనా సమస్య ఉన్నప్పుడు సీనియర్ ఫిజీషియన్‌ను కలిసి కనీసం అరగంట పాటు మీ కేస్ హిస్టరీని వివరించండి. సరైన డయాగ్నోసిస్ ద్వారా ఎటువంటి సుఖవ్యాధినైనా 15-20 రోజుల్లో నయం చేయవచ్చు. డైరీ నిర్వహణ: రోజూ పడుకునే ముందు ఆ రోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఒక డైరీలో రాసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్ర: సెక్స్ పట్ల కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి?  జ: అధిక పని ఒత్తిడి (24 గంటలు పనిచేయడం), హార్మోన్ల అసమతుల్యత, మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మారిన మానసిక స్థితి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్ర: యువతులలో కనిపిస్తున్న హార్మోన్ల సమస్యల లక్షణాలు ఏమిటి?  జ: 18-19 ఏళ్లకే నెలసరి ఆలస్యం కావడం, ముఖంపై (గడ్డం దగ్గర) దట్టమైన వెంట్రుకలు రావడం వంటివి హార్మోన్ల లోపానికి సంకేతాలు. ప్ర: ఎయిడ్స్ (HIV) సోకితే నయం కాదా?  జ: ఒకప్పుడు అది మహమ్మారిగా ఉండేది, కానీ ఇప్పుడు దానికి రెట్రోవర్టెడ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే మందుల ద్వారా దానిని కూడా నియంత్రించవచ్చు. ప్ర: సహజీవనం (Living Together) సెక్స్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?  జ: సహజీవనం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. పెళ్లి అనే బంధంలో ఉండే ఆకర్షణ, గౌరవం ఇక్కడ లోపించవచ్చు. డబ్బు వెనకాల పరిగెత్తే క్రమంలో మన శరీరానికి భగవంతుడు ప్రసాదించిన వరాన్ని (సెక్స్ మరియు ప్రేమ) నిర్లక్ష్యం చేయకండి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సరైన నిపుణులను సంప్రదించి సంతోషకరమైన జీవితాన్ని గడపండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు నిపుణుల సలహాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.జి.వి. సత్య (Dr. SGV Satya) గారు ఈ వీడియోలో శాస్త్రీయమైన సమాధానాలు ఇచ్చారు.       ఈ వీడియోలో ముఖ్యంగా చర్చించిన అంశాలు: 👇 అన్నం vs చపాతీ: రెండింటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మరియు గ్లైసీమిక్ ఇండెక్స్ మధ్య తేడాలు. సరైన ఆహార విధానం: షుగర్ ఉన్నవారు అన్నం తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యమైన సూచనలు: క్వాంటిటీ (పరిమాణం) మరియు క్వాలిటీ (నాణ్యత) విషయంలో మనం చేసే తప్పులేమిటి? షుగర్ కంట్రోల్ చిట్కాలు: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే భోజనంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి. ఆందోళన సహజమైనదే అయినప్పటికీ, దానిని కొనసాగనివ్వడం మానసిక,  శారీరక ఆరోగ్యానికి హానికరం.  నేటికాలంలో చాలా మంది ఈ ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకుంటున్నారు.  ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకున్నాక జీవితం చిన్నాభిన్నం అవుతుంది.  ఆందోళన ఉచ్చులో పడకుండా ఉండాలంటే.. కొన్నిమార్గాలు అనుసరించాలి.  దీని వల్ల  మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళనకు గురి కాకుండా ఉండగలుగుతారు. లోతైన శ్వాస.. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, రోజుకు 5-10 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవడం అత్యంత సులభమైన మార్గం.  లోతుగా, నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు, శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరిగి మనస్సు ప్రశాంతమవుతుంది.  ఇది గుండె కొట్టుకోవడాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి, శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది.  ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ద్యానం.. ప్రతిరోజూ 15-20 నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.  ఇది మానసిక ఏకాగ్రతను పెంచి, ప్రతికూల ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది.  క్రమంగా సాధన చేయడం ద్వారా  మనస్సు మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా మారుతుంది. యోగా, వ్యాయామం.. యోగా మరియు తేలికపాటి వ్యాయామం శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లను పెంచుతాయి. ఈ హార్మోన్లు సహజంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా నడవడం, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్చింగ్ వ్యాయాలు లేదా సాధారణ యోగాసనాలు వేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ చురుకుగా ఉంటాయి. ప్రతికూల ఆలోచన.. ప్రతికూల ఆలోచనల స్థానంలో సానుకూల ఆలోచనలను నింపడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన మార్గం.  ఎవరికి వారు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకోవాలి,   దేనికి కృతజ్ఞతతో ఉన్నారో గమనించాలి.  ఇది ఆందోళనను,  భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్ర, ఆహారం.. మానసిక ఆరోగ్యానికి తగినంత నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  నిద్రలేమి ఆందోళనను పెంచుతుంది. కెఫీన్, చక్కెర అధికంగా తీసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం వంటివి  మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటంలో సహాయపడతాయి. సహకారం.. మానసిక స్థితి చాలా బాగోలేదని అనిపించినప్పుడు, ఎప్పుడు ఆందోళనగా అనిపిస్తూ ఉన్నప్పుడు  కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడాలి. అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవాలి. ఒంటరిగా బాధపడటం కంటే నచ్చిన వారి దగ్గర మనసు విప్పి మాట్లాడటం ద్వారా ఊరట పొందవచ్చు.                              *రూపశ్రీ.