Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొత్త పార్టీ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోబోం.. స్టాలిన్ స్పష్టీకరణ
posted on: May 7, 2026 12:08PM

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాము అడ్డుకోబోమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రజల తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందన్న ఆయన.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
అన్నాడీఎంకేతో కలిసి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోందంటూ జరుగుతున్న ప్రచారాన్నిన ఆయన కొట్టిపారేశారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదనీ, అవన్నీ వదంతులేనని స్టాలిన్ స్పష్టం చేశారు. కొత్త పార్టీ ప్రభుత్వ ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామన్నారు.



.webp)


