Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...18ఏళ్ళలో అడుగుపెట్టిన కుర్రాళ్ళకు ఈ విషయాలు తప్పక చెప్పండి!
posted on: May 6, 2026 3:51PM

పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి, పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది. ఎంత వయసు పెరిగినా తల్లిదండ్రులకు పిల్లల గురించి ఆలోచన ఉంటుంది. అబ్బాయిల విషయానికి వస్తే.. 18 ఏళ్లలోకి వచ్చినప్పుడు వారి జీవితం చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది. 18 ఏళ్లకు మేజర్ గా గుర్తించబడతారు. చట్ట ప్రకారం పిల్లల నుండి వయోజనులుగా మారుతారు. అదే విధంగా మానసికంగా కలిగే మార్పులు కూడా వారిని బాధ్యతగా ఉండటంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేయడమే కాకుండా.. చాలా వరకు ఇండిపెండెంట్ గా ఉండటానికి కూడా ఇక్కడే కీలక మలుపు వస్తుంది.
18 ఏళ్ల వయసులో పిల్లలకు మార్గదర్శకత్వం చాలా అవసరం అవుతుంది. తల్లిదండ్రులు ఈ వయసు పిల్లలతో ఎంత సున్నితంగా, ఎంత ఆలోచించే విదంగా మాట్లాడగలుగుతారో.. పిల్లలతో విషయాలను షేర్ చేసుకోగలుగుతారో.. పిల్లల జీవితం కూడా అంత సరైన దిశలో నడవడానికి సహాయపడుతుంది. 18 ఏళ్లు నిండిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుంటే..
బాధ్యత..
18 ఏళ్లు రాగానే నువ్వేం పెద్దాడివి కాదు అని తరచుగా తల్లిదండ్రులు అంటూ ఉంటారు. కానీ ఇది తప్పు.. 18 ఏళ్ల వయసు పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి అవకాశం దొరితే మొదటి దశ.. అయితే తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలని వారు తెలుసుకోవాలి. తన ఖర్చులను తాను చూసుకోవడం, , సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, ఇంటి పనులలో పాలుపంచుకోవడం వంటి చిన్న చిన్న పనులు 18 ఏళ్ల వయసు పిల్లలకు నేర్పిస్తే.. అవి అతన్ని బాధ్యత గల వ్యక్తిని చేస్తాయి.
డబ్బు విలువ..
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. 18ఏళ్ల వయసులోనే పిల్లలకు స్నేహాలు, బయటటి ఖర్చులు వంటివి చాలా పెరుగుతాయి. నిజం చెప్పాలంటే.. డబ్బు కారణంగా పిల్లలు పాడైపోయే మొదటి దశ ఇదే.. అందుకే పిల్లలకు బడ్జెట్ రూపొందించుకోవడం, అనవసరమైన ఖర్చులను నివారించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటి అలవాట్లు నేర్పించాలి. ఇవి వారిని ఆర్థికంగా బలంగా చేస్తాయి.
సరైన స్నేహాలు..
ఈ వయసులో స్నేహాలు, సంబంధాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మంచి స్నేహాలు.. నమ్మకమైన వ్యక్తులతో ఎలా ఉండాలో, మంచి స్నేహాలు ఎలా ఉంటాయో.. , చెడు స్నేహాలకు ఎలా దూరంగా ఉండాలో చెబుతూ ఉండాలి. దీని వల్ల జీవితంలో వారు దెబ్బ తినే చాలా పెద్ద నష్టం నుండి బయటపడవచ్చు.
డిజిటల్ జీవితం..
చిన్న పిల్లల్లా వారిని తిట్టి, కొట్టి కంట్రోల్ చేసే వయసు కాదు 18 ఏళ్ల పిల్లలది. అందుకే సోషల్ మీడియా , ఇంటర్నెట్‌ను తెలివిగా, అవగాహనతో ఉపయోగించడం చాలా ముఖ్యం. అలాగే ఎలాంటి విషయాలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసుకోవాలి? ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలి? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం జీవితం మీద ఎంత వరకు ఉండాలి వంటి విషయాలు వారికి అర్థమయ్యే లాగా వివరించి చెప్పాలి.
మోటివేట్..
జీవితంలో ప్రతిఒక్కరూ వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. వైఫల్యం అనేది అంతం కాదని, అది నేర్చుకోవడానికి ఒక అవకాశమని వారికి వివరించాలి. ఎందుకంటే వైఫల్యాల కారణంగా తొందర పాటు నిర్ణయాలు తీసుకునే భావేద్వేగం వారిలో ఉంటుంది. అందుకే ఎప్పుడూ స్పోర్టివ్ గా ఉండమని చెప్పాలి. ఈ ఆలోచన వారికి జీవితంలో ముందుకు సాగడానికి బలాన్ని ఇస్తుంది.
*రూపశ్రీ.


.webp)



