LATEST NEWS
కేంద్ర ప్రభుత్వం వాహనాల పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని పెంచుతూ తీసుకుంటున్న నిర్ణయాలపై  దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలకు ఆజ్యం పోశారు  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.   నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు. విమానాల ఇంధనంలోనూ ఇథనాల్ మిశ్రమం చేస్తే..   విమానాల ప్రయాణ భద్రతపై తీవ్రమైన ప్రభావం పడుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ ఆరోపణ చేశారు.   తనకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు విమాన రవాణా రంగానికి సరఫరా చేసే ఇంధనంలో ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసిందని పేర్కొన్న కేజ్రీవాల్..  విమానయాన రంగానికి చెందిన నిపుణులు,  టెక్నాలజీ ఎక్స్ పర్ట్ ల అభిప్రాయం ప్రకారం విమాన ఇంధనంలో ఇథనాల్ వంటి పదార్థాలను మిశ్రమం చేయడం వల్ల ఇంజన్ల పనితీరు దెబ్బతినడమే కాకుండా..  గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశం ఉందన్నారు కేజ్రీవాల్. దీనివల్ల వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు  ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా నేలపై నడిచే వాహనాలకు వాడే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడానికీ, ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమాన ఇంధనంలో కలపడానికీ చాలా వ్యత్యాసం ఉంటుందన్న కేజ్రీవాల్.. విమానాలు   ప్రతికూల వాతావరణ పరిస్థితులలో,  అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ప్రయాణిస్తాయనీ,  ఇలాంటి పరిస్థితులలో ఇంధనంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నా అది ఇంజన్ స్తంభించిపోవడానికి లేదా ఇతర సమస్యలకూ దారితీసే అవకాశం ఉంటుందన్నారు.  నిపుణులు ఈ తరహా ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కేజ్రీవాల్ తన పోస్టులో పేర్కొన్నారు.  ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న ఈ-20 విధానంపై ఇప్పటికే వాహనదారుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇథనాల్ శాతం పెరగడం వల్ల వాహనాల ఇంజన్లు త్వరగా పాడైపోతున్నాయని, మైలేజ్ తగ్గిపోతోందని వినియోగదారులు ఆరోపించడమే కాదు..  నిపుణులు కూడా ఈ 20 వినియోగం వల్ల ఇంజన్లు పాడైపోతాయనీ, మైలేజీ తగ్గుతుందనీ ధృవీకరిస్తున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా పార్లమెంటు వేదికగా మైలేజీ తగ్గుతుందని అంగీకరించారు కూడా. ఆ సమస్య పరిష్కరించకుండానే.. ఇప్పుడు ఎన్డీయే సర్కార్.. ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని విమానాలకు కూడా వర్తింప చేయడానికి కసరత్తు చేస్తోందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.  శాస్త్రీయ అధ్యయనం లేకుండా మోడీ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు సిద్ధపడుతోందన్నవిమర్శలు వ్యక్తమౌతున్నాయి. ముందుకు సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్   స్వచ్ఛమైనదిగా ఉండాలని, అందులో ఎలాంటి మార్పులు చేసినా విమానయాన సంస్థలకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.  అదలా ఉండగా.. కేజ్రీవాల్   ఆరోపణలపై   కేంద్రం నుంచి కానీ,  పౌర విమానయాన మంత్రిత్వ శాఖనుంచి కానీ ఎటువంటి స్పందనా ఇప్పటి వరకూ రాలేదు. దీంతో విమానాల ఇంధనంలో కూడా ఇథనైల్ మిశ్రమం అన్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతోందని పరిశీలకులు అంటున్నారు.   Arvind Kejriwal lleges E20 in flights,   Ethanol Blending, Aviation Turbine Fuel ATF,  Modi Government, Flight Safety
నీట్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఆందోళనల కారణంగా విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  కాక్రోచ్ ల ఉద్యమం విజయం సాధిండంతో.. కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచే దిశగా హస్తినలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాకుడు రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు.   ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయకుండా కేవలం ఒక్క మంత్రి రాజీనామాతో సరిపెట్టడంఏమిటని నిలదీస్తున్నారు. దీని  వెనుక ఉన్న అసలు సూత్రధారులు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  జూలై 20న ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు  బలప్రయోగం చేయడాన్ని లోక్ సభ వేదికగా రాహుల్  ఖండించారు.   పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ నేరుగా హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అమిత్ షా  ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై దాడికి దిగారని ఆరోపించారు. భారత భవిష్యత్తు  యువతపై పెల్లెట్లు ప్రయోగించడం దారుణమని, ఈ హింసాత్మక ఘటనలకు అమిత్ షా బాధ్యత వహించి   తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ వేదికగా రాహుల్ చేసిన ఈ డిమాండ్ దుమారం రేపింది.  కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ వ్యాఖ్యలపై  అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ  డిమాండ్ చేశారు.  మరోవైపు జూలై 21న ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నాకు దిగిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియం డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చెప్పులు లేకుండా మెట్లపై కూర్చుని రికార్డు చేసిన 2 నిమిషాల 15 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.  విద్యార్థులకు, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యక్ష సందేశం పేరిట విడుదల చేసిన ఆ వీడియోలో.. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం  ఆసక్తి చూపడంలేదని ఆరోపించారు. నాణ్యమైన విద్య సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోందని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోందని, తరచూ ప్రశ్నపత్రాలు లీక్ కావడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారమౌతోందని రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నారు.  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జూలై 25న   ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్   జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాతో సహా పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ 10 జనపథ్ నివాసంలో సమావేశమయ్యారు. విద్యార్థులు కోరుతున్నది ఉచిత, నాణ్యమైన, పారదర్శకమైన విద్యావ్యవస్థ అనీ, కానీ   ప్రభుత్వం విద్యాసంస్థలను నాశనం చేస్తోందని విమర్శించారు.  విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియమకాల నుంచి పరీక్షల నిర్వహణ వరకు వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయంటూ రాహుల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ  విద్యార్థుల తరఫున పోరాటాన్ని  లోక్ సభలోనూ, వీధుల్లోనూ కూడా మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.   Rahul Gandhi demand , Amit Shah resignation,  Dharmendra Pradhan Resignation, Student Protests Delhi, Paper Leak Controversy, Lok Sabha Debate 2026
ప్రపంచ వాణిజ్య రవాణాకు గుండెకాయ వంటి  హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రత,  ప్రయాణం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  కీలకమైన  ఈ  సముద్ర మార్గంలో  కొత్త  వాణిజ్య నౌకాయాన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్,  ఒమన్ దేశాల మధ్య  అంగీకారం కుదిరింది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నడుమ, గల్ఫ్ లో గ్లోబల్  సరఫరా గొలుసు పునరుద్ధరించేందుకు ఈ ద్వైపాక్షిక దోహదపడనుంది. గత కొన్ని  నెలలుగా ఇరాన్,  ఒమన్ మధ్య   ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా  కొత్త    రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది.  సాంకేతిక, చట్ట, భద్రతా  కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు  సంబంధించి  ఇరు దేశాలు  ఓ అవగాహనకు వచ్చాయి. హర్మూజ్ జలసంధిలో సురక్షితమైన వాణిజ్య నౌకాయానానికి వీలు కల్పించే దిశగా ఒమన్‌తో జరిపిన సంప్రదింపుల్లో   పురోగతి సాధించామని  రాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మీడియాకు వెల్లడించారు.    ఎటువంటి  అంతరాయాలు,  ఒత్తిళ్లు లేకపోతే.. అంగీకరించిన ప్రధాన మార్గదర్శకాలతో త్వరలోనే  ఈ విషయంపై ఇరాన్, ఒమన్ లు ఉమ్మడి   ప్రకటనను  విడుదల చేస్తాయి. గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల కదలికలకు భద్రత  కల్పించేందుకు దాదాపు రెండు నెలలు  సాగిన  చర్చలు దాదాపు ఫలవంతమయ్యాయి.   ద్వైపాక్షిక అంగీకారం కుదిరినప్పటికీ, జలసంధిలో ప్రస్తుతానికి నూటికి నూరు శాతం   భద్రత ఏర్పడినట్లు భావించలేం.   అమెరికా వైఖరిలో మార్పు రానంత వరకు,  సముద్ర దిగ్బంధనాలు తొలగనంత వరకు జలసంధిలో నౌకల రవాణా  సురక్షితం కాదనే చెప్పాలి.  మరోవైపు..  ప్రాంతీయ ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు,  చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరాన్   దౌత్య మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే రెండు మూడు రోజులలో   ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ,  పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ పాకిస్థాన్,  ఖతార్ లలో పర్యటించనున్నారు.  Strait of Hormuz, Iran Oman shipping route, commercial maritime security, Esmaeil Baghaei statement, Middle East shipping tension, Gulf trade route
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్  చాలా కాలం విరామం తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. ఇంత కాలం బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై అడపాదడపా చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లతో సరిపెట్టేశారు. మధ్యలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో పరామర్శల పేరుతో బయటకు వచ్చినా గత రెండేళ్లుగా పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ లేదనే చెప్పాలి. ఇప్పుడు ఇక ఆయన   నెమ్మదిగా   బయటకు వస్తున్నారు. తాజాగా బుధవారం (ఆగస్టు 4) పొగాకు రైతులకు మద్దతుగా ఆయన  దేవరపల్లి  వచ్చారు. వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది. ఒక విధంగా చెప్పాలంటే.. తెలుగుదేశం కూటమిపై విమర్శలు,  వెన్నుపోటు, అక్రమ అరెస్టుల వ్యాఖ్యలతో ఆవు కథే మళ్లీ మళ్లీ  చెప్పారనిపించేలా ఆయన ప్రసంగం ఉంది.   చంద్రబాబును,  తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పార్టీగా అభివర్ణించారు. చాలా చాలా ఏళ్లుగా జగన్ విమర్శలు ఇవే. ఇక అక్రమ అరెస్టుల గురించి ఆయన చేసిన విమర్శలు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైసీపీ మద్దతుదారులను, నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నదనీ, అక్రమకేసులు బనాయిస్తోందని జగన్ విమర్శించారు. అయితే జగన్ విమర్శలలో పస లేదని పరిశీలకులు అంటున్నారు. సీదిరి అప్పలరాజు అరెస్టు, తమ్మినేని సీతారాంపై కేసులను ప్రస్తావిస్తూ పరిశీలకులు వాటిలో రాజకీయం ఎక్కడుందనీ, నేరాలకు పాల్పడినా వైసీపీయులు అని చట్టం వదిలేయాలా అని ప్రశ్నిస్తున్నారు.  అదలా ఉంచితే గత రెండేళ్లుగా జగన్  వారానికో రెండు వారాలకో ఓసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇవే మాటలు చెబుతున్న సంగతిని ప్రస్తావిస్తూ.. దేవరపల్లిలో జగన్ ప్రసంగం రొటీన్ గా ఉందని విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రసంగాలు, విమర్శల పట్ల జగన్ మద్దతు దారులు కూడా పెదవి విరుస్తున్నారు.   YS Jagan Devarapalli Tour, TDP Governmen, t Tobacco Farmers Issue,   Jagan Political Comments, APnews, TeluguOne 
 వైసీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్  తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందా? ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  వైసీపీలో  కీలక నేతగా గుర్తింపు పొందిన తమ్మినేని  ఇటీవలి కాలంలో వరుస వివాదాలు, న్యాయపరమైన చిక్కులతో సతమతమౌతున్నారు. అలాగే వైసీపీలో కూడా ఆయనకు పెద్దగా ప్రాముఖ్యత లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసే ఉద్దేశంలో ఉన్నారన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.   ఇటీవల వెలుగుచూసిన   ఆస్తి వివాదం,  నకిలీ  డెత్ సర్టిఫికెట్ తో  భూ కబ్జా కుట్ర ఆరోపణలు తమ్మినేని ప్రతిష్ఠను బాగా దెబ్బతీశాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో తమ్మినేనితో పాటు ఆయన సతీమణి వాణిశ్రీ, కుమారుడు వెంకట శ్రీరామ్ లు నిందితులుగా ఉన్నారు. అరెస్టును తప్పించుకోవడానికి తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు కూడా.  పరారీలో ఉండగానే కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందిన తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ముందస్తు బెయిలు లభించని ఆయన కుమారుడు  శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయి బెయిలు పొందారు.   హైకోర్టు ధర్మాసనం కూడా తమ్మినేని సీతారాం,  ఆయన భార్యపై తదుపరి విచారణ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది.  ఇదంతా ఒకెత్తయితే.. ఈ కేసు విషయంలో తమ్మినేనికి వైసీపీ నుంచి ఎటువంటి మద్దతూ లభించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.   2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు.   వైసీపీ అధినేత జగన్ కూడా  తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అన్నిటినీ ఓర్చుకుంటూ పార్టీలో కొనసాగుతున్న తనకు క్లిష్ట సమయంలో పార్టీ నుంచి కనీస మద్దతు లభించకపోవడంతో తమ్మినేని మనసు విరిగి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి నిర్ణయించుకున్నారంటున్నారు.  ఏ క్షణంలోనైనా తమ్మినేని సీతారాం వైసీపీకి రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. Thammineni Seetharam,   Resignation, AP Former Speaker,  Srikakulam Property Dispute  
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్‌లో ప్రమోషన్ వేదికలపై ఎన్నో ఆసక్తికర సంఘటనలు జరుగుతుంటాయి. కానీ, ఇటీవల జరిగిన ఓ చిత్ర ప్రెస్‌మీట్‌లో ఒక నటుడు వేదికపైనే కన్నీటి పర్యంతమై, భావోద్వేగాన్ని ఆపుకోలేక తన చెంపలు తానే కొట్టుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యూత్‌ఫుల్ మూవీ 'హుషార్ పిట్టలు'. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రయూనిట్ ఇటీవలే ఓ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో నటుడు పుట్టా భాను మైక్ అందుకుని మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మాటల మధ్యలోనే తనను తాను నియంత్రించుకోలేక పుట్టా భాను తన చెంపలపై గట్టిగా వాయించుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో స్టేజ్ పై ఉన్న మిగతా నటీనటులు, మైక్ ముందే ఉన్న మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత తను అలా చేయడానికి గల బలమైన కారణాన్ని వెల్లడిస్తూ భాను కంటనీరు పెట్టుకున్నారు. "చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఎంతో పిచ్చి. వెండితెరపై నటులను చూసి నవ్వుకునేవాడిని. ఈ రోజు అదే వెండితెరపై నన్ను నేను చూసుకుని, ప్రేక్షకులు నవ్వుతుంటే ఇది కలా లేక నిజమా అని నమ్మలేకపోయాను. అందుకే నన్ను నేను గిల్లుకోవడానికి బదులుగా ఇలా కొట్టుకున్నాను" అంటూ భాను ఎమోషనల్ అయ్యారు. గడిచిన ఎనిమిదేళ్లుగా సినీ అవకాశాల కోసం ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇక 'హుషార్ పిట్టలు' విషయానికి వస్తే, భిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో అన్ష్, వాసవి గణేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. గోవర్ధన్, సునీత మనోహర్, రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌కు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. మరోవైపు, భాను పడ్డ కష్టాన్ని, ఆయన ఆవేదనను చూసి చిత్రబృందం వెంటనే ఆయనను ఓదార్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో చూసిన నెటిజన్లు "సినిమా అంటే ఎంత పిచ్చి ఉంటే అంతలా ఎమోషనల్ అవుతారు", "కష్టపడే ప్రతీ నటుడికి తగిన గుర్తింపు దక్కాలి" అంటూ భానుకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న థియేటర్లలోకి రానున్న ఈ 'హుషార్ పిట్టలు' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి, పుట్టా భాను లాంటి యంగ్ టాలెంట్‌కు టాలీవుడ్‌లో మరిన్ని మంచి అవకాశాలు తెచ్చిపెడుతుందేమో వేచి చూడాలి!
విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన మూవీ ‘అనకాపల్లి’. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మించిన ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకుడు. ఆగస్టు 7న విడుదల కావాల్సి ఉంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. అయితే విడుదలకు కొద్దిగంటల ముందు మూవీ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘అనకాపల్లి’ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి గల కారణాలను కూడా వెల్లడించింది. ఇటీవల ఈ చిత్రానికి ప్రత్యేకంగా నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్స్ షోకు అద్భుతమైన స్పందన లభించింది. సినిమా కంటెంట్ చూసిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని కేవలం తెలుగు వరకే పరిమితం చేయకుండా, ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అదే సమయంలో చిత్రంపై OTT ప్లాట్‌ఫామ్స్ నుంచి కూడా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, తొందరపడి విడుదల చేయడం కంటే సినిమాకు లభిస్తున్న అవకాశాలను పూర్తిగా పరిశీలించి, సరైన ప్రణాళికతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఓ వైపు సినిమా విడుదల వాయిదా వేస్తూనే, మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ‘అనకాపల్లి’ టీమ్. “ముందు ప్రజల తీర్పు… ఆ తర్వాత రిలీజ్” అనే నిర్ణయంతో టీమ్ ముందుకు వెళ్తోంది. "ఈ సినిమా పేరు ‘అనకాపల్లి’. ఈ సినిమా కథకు, షూటింగ్‌కు వేదిక అనకాపల్లి. ఈ చిత్ర నిర్మాత కూడా అనకాపల్లి బిడ్డే. అందుకే ఈ సినిమా మీద మాకున్న నమ్మకంతో, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అనకాపల్లి పట్టణంలో 4 నుంచి 5 ప్రత్యేక పబ్లిక్ షోలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం." అని తెలిపింది. "డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన, OTT ప్లాట్‌ఫామ్స్ చూపిస్తున్న ఆసక్తి, ఇతర భాషల్లో విడుదల చేసే అవకాశాలు, అన్నింటికంటే ముఖ్యంగా అనకాపల్లి ప్రజల నుంచి వచ్చే తొలి తీర్పు — వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొత్త విడుదల తేదీని నిర్ణయించనున్నాం. కొత్త విడుదల తేదీని ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తాం." అని అనకాపల్లి మూవీ టీమ్ పేర్కొంది.  
    -గత నెల 30 న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయిన జై కృష్ణ  -తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్  -కానీ కలెక్షన్స్ మాత్రం డల్ -కారణం అదేనా! సెల్యులాయిడ్ కి,ఘట్టమనేని బ్రాండ్ కి ఉన్న అనుబంధం తెలిసిందే. రికార్డులైతే ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్సాహంతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఘట్టమనేని మూడో తరం వారసుడు జై కృష్ణ 'శ్రీనివాస మంగాపురం'పై ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కలెక్షన్స్ మాత్రం షాక్ కి గురి చేస్తున్నాయి. గత నెల చివర జులై 30 న రిలీజవ్వగా పర్లేదనే టాక్ అయితే  సొంతం చేసుకుంది. కానీ సరైన ప్రమోషన్స్ లేవు. అసలు  రిలీజ్ కి ముందు చేసిన ప్రమోషన్స్ విషయంలోనే   ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. ఇందుకు కారణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ హాజరు అవుతాడని అనుకున్నారు. ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నే క్యాన్సిల్ చేసారు. దీంతో     సినిమాకి  దక్కాల్సిన స్థాయి ప్రమోషన్లు దక్కకపోవడమే అతిపెద్ద ప్రతిబంధకంగా మారింది. నేటి డిజిటల్ యుగంలో ఎంత పెద్ద స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, సరైన పబ్లిసిటీ వ్యూహాలు లేకపోతే ప్రేక్షకులకి సినిమాని  రీచ్ చేయడం అత్యంత కష్టతరంగా మారుతోంది.అభిమానులు ఎలాగూ ఉంటారు. కానీ అంతిమంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావాలి.  అసలు వాళ్లంతా ముందు సినిమా గురించి మాట్లాడుకోవాలి కదా!. అలా జరిగేది ప్రమోషన్స్ వల్లనే అని మేకర్స్ కి తెలియని విషయం కాదు. రిలీజ్ తర్వాత ఒకే ఒక్క ప్రెస్ మీట్ నిర్వహించడం గమనార్హం. Also read: dhurandhar: ధురంధర్ పార్లమెంట్ దాడిలో చనిపోయిన కమలేష్ కుమారి యాదవ్ ఎవరో తెలుసా!   ప్రమోషన్ల ఖర్చులతో కలిపి సుమారు 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం   , బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కనీసం 15 కోట్ల బ్రేక్ ఈవెన్ రాబట్టాల్సి ఉంది.  మొదటి రోజు  వరల్డ్ వైడ్ గా రెండున్నర కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఘట్టమనేని బ్యాక్ గ్రౌండ్ కి ఇది చాలా తక్కువ. ఇప్పటికి వచ్చి ఏమైంది రోజులు కాగా 5 .46 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి . పబ్లిసిటీ లోపమే కలెక్షన్స్ తక్కువగా రావడానికీ ప్రధాన కారణమని సినీ విశ్లేషకుల టాక్. . జై  కృష్ణ పెర్ ఫార్మెన్స్ అయితే  హీరో మెటీరియల్ రేంజ్ లోనే ఉంది.  Srinivasa Mangapuram, Jai Krishna, Rasha Thadani
మెగా అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్. తండ్రీ కొడుకులు తొలిసారి కలిసి వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్‌ను స్వయంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రివీల్ చేశారు.  వరుణ్ తేజ్ లేటెస్ట్ హర్రర్ కామెడీ ప్రాజెక్ట్ 'కొరియన్ కనకరాజు' రేపు విడుదల కాగా, ఈ రోజు ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా వరుణ్ NRI ఫ్యాన్స్, ఇన్ఫ్లుయెన్సర్లతో జూమ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ మీటింగ్‌లో అభిమానులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇస్తూ.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ 'బరి' గురించి ఒక క్రేజీ న్యూస్ బయటపెట్టారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "మా నాన్న నాగబాబు గారితో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా స్పెషల్ అండ్ ఎక్సైటింగ్‌గా ఉంది. 'బరి' సినిమాలో మేమిద్దరం కలిసి కనిపించబోతున్నాం" అని వెల్లడించడంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పై ఈ సినిమాను నిర్మిస్తుంటే.. అన్న వరుణ్ తేజ్ హీరోగా, నాన్న నాగబాబు కీలక పాత్రలో నటిస్తుండటంతో 'బరి' పక్కా మెగా ఫ్యామిలీ వెంచర్‌గా మారిపోయింది. రూరల్ స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్‌తో 'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'బరి' మూవీ ఇప్పటికే అఫీషియల్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా, వరుణ్ కాలికి గాయమైంది. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ లో పాల్గొననున్నారు.     Korean Kanakaraju, Varun Tej, Naga Babu, Bhari Movie, Niharika Konidela  
  ధురంధర్(Dhurandhar)ని చూసిన వాళ్ళకి పార్లమెంటుపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసి కొంత మందిని చంపిన విషయం తెలిసిందే. ఆ దాడిలో అక్కడే డ్యూటీ చేస్తున్న సీఆర్‌పీఎఫ్ మహిళ కూడా కాల్పుల్లో  చనిపోతుంది. రేపు రిటైర్ కాబోతుందని స్వీట్స్ పంచుతూ ఉండగా ఆమె చనిపోవడం ప్రతి ఒక్కర్ని ఎంతగానో కలిచివేస్తుంది. అంత ఇదిలో కూడా ఆమె గేట్ కనుక మూయకుండా ఉంటే ప్రమాద తీవ్రత ఊహకి కూడా అందని విధంగా మరింత ఘోరంగా ఉండేది.ఇదంతా నిజ జీవితంలో మన ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ హౌస్‌పై  ఉగ్రవాదులు దాడి చేసిన నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.  ఆ చీకటి  రోజుని మన  దేశప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. 2001 డిసెంబర్ 13వ తేదీ ఉదయం సుమారు 11:50 గంటల సమయంలో న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం అంతా ఎంపీలు, విఐపీల రాకపోకలతో ఎంతో కోలాహలంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు 'DL 3C J 1527' నంబర్ గల నకిలీ స్టిక్కర్ ఉన్న అంబాసిడర్ కారులో ఐరన్ గేట్ నంబర్ 1 ద్వారా బిల్డింగ్ గేట్ నంబర్ 11 వైపు దూసుకొచ్చారు. దేశ అగ్ర నాయకులు, పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులు లోపల ఉన్న ఆ కీలక సమయంలో, ఉగ్రవాదులు భారీ ఆయుధాలు, ఆత్మాహుతి బాంబులతో  దాడి చేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. కానీ ఆ ఉగ్రముఠా రక్తాన్ని పారించేందుకు సిద్ధమైన వేళ, ఒక ధైర్యవంతురాలైన మహిళా సీఆర్‌పీఎఫ్  వారి కుట్రకు గోడలా అడ్డు నిలిచారు. ఆమెనే  సీఆర్‌పీఎఫ్ (CRPF) 88వ మహిళా బెటాలియన్‌కు చెందిన వీర నారి కమలేష్ కుమారి యాదవ్.  ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా సికందర్‌పూర్ గ్రామానికి చెందిన కమలేష్ కుమారి, 1994లో సీఆర్‌పీఎఫ్‌లో కాన్స్టేబుల్‌గా చేరారు. మొదట అలహాబాద్‌లోని 104 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) లో సేవలు అందించిన ఆమె, 2001 జులై 12న 88వ మహిళా బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. పార్లమెంట్ భద్రతా బాధ్యతల్లో భాగంగా బ్రావో కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కమలేష్ కుమారి, డిసెంబర్ 13న ఐరన్ గేట్ నంబర్ 1 వద్ద డ్యూటీలో ఉన్నారు. కారు వేగంగా గేటు వైపు రావడాన్ని గమనించిన కమలేష్, ఏదో విపత్తు జరగబోతోందని క్షణాల్లో పసిగట్టారు. ఆమె వద్ద ఎటువంటి భారీ ఆయుధం లేదు. Also read: పెద్ది బుచ్చిబాబు నెక్స్ట్ హీరో ఇతనే!  కేవలం ఒక వాకీ-టాకీ మాత్రమే ఉంది. అయినప్పటికీ ఆమె కొంచెం కూడా భయపడకుండా కారును నిరోధించడానికి వెంటనే ముందుకు ఉరికి, గేటును లాక్ చేసేందుకు ప్రయత్నించారు.  తన వద్ద ఉన్న వాకీ-టాకీ ద్వారా ఇతర సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, గట్టిగా కేకలు వేసి అలారమ్‌ మోగించారు. తమ ప్లాన్ బయటపడిందని గ్రహించిన ఉగ్రవాదులు వెంటనే కమలేష్ కుమారిపై విచక్షణారహితంగా ఏకే-47 తుపాకీలతో కాల్పులకు తెగబడ్డారు. ఆ దాడిలో కమలేష్ కుమారి శరీరంలోకి ఏకంగా 11 బుల్లెట్లు దూసుకెళ్లాయి. శరీరం రక్తాసిక్తమైనా, ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ ఆమె చూపిన అపారమైన సమయస్ఫూర్తి వల్ల లోపల ఉన్న భద్రతా దళాలు తక్షణమే అప్రమత్తమయ్యాయి. కమలేష్ సమయానికి గేటు మూసి హెచ్చరించకపోతే, ఆత్మాహుతి బాంబర్ పార్లమెంట్ లోపలికి ప్రవేశించి వందలాది మంది ప్రజాప్రతినిధుల ప్రాణాలను తీసి ఉండేవాడు. ఆమె ప్రాణత్యాగం ఉగ్రవాదుల యత్నాన్ని పూర్తిగా భగ్నం చేసింది.ఈ ఘోర దాడిలో మొత్తం తొమ్మిది మంది భద్రతా సిబ్బంది మరియు పౌరులు వీరమరణం పొందగా, ఐదుగురు ఉగ్రవాదులు సైన్యం చేతిలో మరణించారు. కమలేష్ కుమారి భర్త అవధేష్ యాదవ్, ఇద్దరు కుమార్తెలు జ్యోతి, శ్వేతలను విడిచిపెట్టి దేశం కోసం అమరురాలయ్యారు. ఆమె చూపించిన అసమాన ధైర్యసాహసాలకుగాను 2002 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఆమెకు శాంతియుత కాలంలో ఇచ్చే అత్యున్నత మిలిటరీ పురస్కారం 'అశోక చక్ర'ను మరణానంతరం ప్రదానం చేసింది. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు అశోక చక్ర పొందిన కేవలం ఇద్దరే ఇద్దరు మహిళల్లో కమలేష్ కుమారి ఒకరు కావడ విశేషం (మరొకరు నీర్జా భానోత్). కమలేష్ కుమారి త్యాగం భారత చరిత్ర పుటల్లో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది.మరి  నెల నెల సాలరీ తీసుకుంటూ డిస్పాచ్ టైం కంటే పది నిముషాలు ఎక్కువసేపు ఆఫీస్ లో  ఉంటే దేశానికి సేవ చేసినట్టుగా ఫీలయ్యే వాళ్ళు కమలేష్ కుమారి యాదవ్ పోరాట స్ఫూర్తి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.  Dhurandhar, Ranveersingh,  kamlesh kumari yadav
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ కామెడీ ఫిల్మ్ 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆగస్టు 7 విడుదల తేదీ కాగా, నేడు(ఆగస్టు 6) ప్రీమియర్స్ వేస్తున్నారు.  'కొరియన్ కనకరాజు' మూవీ ప్రీమియర్ బుకింగ్స్‌ పరంగా వరుణ్ తేజ్ కెరీర్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం గత 24 గంటల్లోనే బుక్‌మైషోలో దాదాపు 10,000 టిక్కెట్లు అమ్ముడై.. ఫాస్ట్ ఫిల్లింగ్ అండ్ సోల్డౌట్ షోలు దర్శనమిస్తున్నాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ అన్ని ప్రధాన సెంటర్లలో కొత్త షోలను యాడ్ చేస్తున్నారు. కేవలం గడిచిన 24 గంటల్లోనే దాదాపు 10,000 టిక్కెట్లు ఒక్క బుక్‌మైషోలోనే అమ్ముడైపోయాయి అంటే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఓవర్సీస్ లో కూడా బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాయలసీమ మాస్ కుర్రాడికి కొరియా దెయ్యానికి కనెక్షన్ ఏంటి అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ హర్రర్ కామెడీ సినిమా కోసం ఆడియన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ఈ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా.. ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి కమ్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.    Korean Kanakaraju, Bookings, Varun Tej, Merlapaka Gandhi  
సెకండ్ మూవీకే మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో 'పెద్ది' చేసి అందరి దృష్టి ఆకర్షించాడు  దర్శకుడు బుచ్చిబాబు.పైగా భారీ బడ్జెట్ తో,పాన్ ఇండియా రేంజ్ లో 'పెద్ది'ని ముస్తాబు చేసి కమర్షియల్ దర్శకుడిగా కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమైన 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇండియాలోనే ఏకంగా 200 కోట్లకి పైగా నెట్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా, విమర్శకుల పరంగా, కంటెంట్ పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంది.  ఈ నేపధ్యంలో బుచ్చిబాబు తన మూడో సినిమాని  ఎవరితో చేయబోతున్నాడనే ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్‌లో వేగంగా మొదలైంది.  ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు మరియు విశ్లేషకుల అంచనాల ప్రకారం బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రధానంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు గట్టిగా వినిపిస్తోంది. పెద్ది సక్సెస్ మీట్స్ మరియు ఇంటర్వ్యూలలో మెగాస్టార్ చిరంజీవితో సరదాగా మాట్లాడిన విషయాలు వైరల్ అయినప్పటికీ, మహేష్ బాబుతో సినిమా ఊహాగానాలపై బుచ్చిబాబు ఎంతో జాగ్రత్తగా స్పందించారు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి 'వారణాసి' ప్రాజెక్ట్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.  అగ్ర హీరోల కాల్ షీట్లు రాబోయే 2 ఏళ్ల వరకు పూర్తిగా లాక్ అయిపోవడంతో, మహేష్ బాబుతో సినిమా ఓకే అవ్వాలంటే రాజమౌళి చిత్రం పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.మరోవైపు టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్ అందరూ పాన్-ఇండియా ప్రాజెక్టులతో కనీసం 2027 లేదా 2028 వరకు బిజీగా ఉన్నారు. ఈ పరిణామాల మధ్య బుచ్చిబాబు ముందు రెండు స్పష్టమైన మార్గాలు కనిపిస్తున్నాయి. మొదటిది అగ్ర హీరోల డేట్స్ కోసం రెండేళ్లు నిరీక్షించి  మరో పాన్ ఇండియా చిత్రం చేయడం. రెండవది నాని, విజయ్ దేవరకొండ లేదా సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలతో తెరకెక్కించడం. సౌత్ ఇండియా వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉన్న హీరో లభిస్తే బిజినెస్ పరంగా కూడా తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు. బుచ్చిబాబు మేకింగ్ స్టైల్, ఎమోషనల్ గ్రిప్ దృష్ట్యా, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బాక్సాఫీస్ వద్ద మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. Peddi, Ram Charan, Buchibabu, Mahesh Babu
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'రాకా' గురించి ప్రజెంట్ ఒక మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవలే ముంబైలో 'రాకా' కొత్త షెడ్యూల్ చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్, దీపికా పదుకొణెలపై కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీపికా తన ప్రసూతి విరామానికి (Maternity Break) వెళ్లేముందు నటించే ఆఖరి షూటింగ్ షెడ్యూల్ ఇదే కావడం గమనార్హం. అందుకే మేకర్స్ ఆమెకు సంబంధించిన సన్నివేశాలన్నీ ఏమాత్రం ఆలస్యం కాకుండా ప్రాధాన్యత ఇచ్చి చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు నెలాఖరు నాటికే దీపికా పోర్షన్స్ మొత్తాన్ని పూర్తి చేసి, ఆమెకు గ్రాండ్‌గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి టీమ్ రాత్రింబవళ్లు కష్టపడుతోంది. షారుఖ్ ఖాన్‌తో తీస్తున్న 'కింగ్' సినిమా షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసిన దీపికా, ప్రస్తుతానికి తన పూర్తి దృష్టిని కేవలం 'రాకా'పైనే పెట్టింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తన మాతృత్వపు తీపి జ్ఞాపకాలను అనుభవిస్తూ కొన్ని నెలల పాటు తన వ్యక్తిగత జీవితానికే సమయాన్ని కేటాయించబోతోంది. తిరిగొచ్చే వరకు కొత్త ప్రాజెక్ట్‌లేవీ సైన్ చేయకూడదని నిర్ణయించుకుంది. మరొకవైపు, అల్లు అర్జున్ కూడా ఈ సినిమా విషయంలో స్పీడు పెంచేశారు. 'పుష్ప'తో గ్లోబల్ రేంజ్‌కి వెళ్లిన బన్నీ, 'రాకా' షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ 'AA23'కి షిఫ్ట్ అవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారు. దర్శకుడు అట్లీ అయితే మరింత క్లారిటీతో ఉన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా డిసెంబర్ నాటికే 'రాకా' షూటింగ్‌ను ఎండ్ కార్డ్ వేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నారు.  సన్ పిక్చర్స్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తోంది. ఈ సినిమాలో కేవలం దీపికా మాత్రమే కాదు.. మృణాళ్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయిన వెంటనే అఫీషియల్‌గా సన్ పిక్చర్స్ గ్రాండ్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తుందని సమాచారం.     Raaka Movie, Allu Arjun, Deepika Padukone, Atlee  
Varun Tej's upcoming horror comedy Korean Kanakaraju has begun its box office journey on a promising note. After generating strong buzz with its teaser, trailer, chartbuster songs and innovative promotions, the film's advance bookings have opened with encouraging response across the Telugu states and overseas. Premiere shows scheduled for August 6 are witnessing rapid bookings, with several shows filling up quickly. In North America, the film has already crossed the US$50K mark in advance sales, and trade expects the premieres to comfortably touch US$100K before the first show. The positive trend comes as a welcome sign for Varun Tej, whose recent releases failed to meet expectations at the box office. This time, however, the film has managed to create genuine excitement among audiences, thanks to its unique horror-comedy premise and consistent promotional campaign led by Varun Tej, director Merlapaka Gandhi and comedian Satya. Adding to the confidence are the early industry reports, which have praised the film's entertainment quotient. Varun Tej's dual shades as an Anantapur youngster and a Korean mobster, Satya's comic timing and Merlapaka Gandhi's blend of humour and horror are said to be among the film's biggest highlights. Thaman's music and background score have also received positive feedback. With audience interest peaking just ahead of release, Korean Kanakaraju appears to have built the momentum needed for a strong opening. The film is all set for a worldwide theatrical release on August 7, and all eyes are now on whether the positive pre-release buzz translates into a much-needed box office comeback for Varun Tej. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Karthik Subbaraj has always been known for telling unconventional stories, but the title teaser of his milestone 10th directorial, Dorothy, suggests he is venturing into a completely different space. Headlined by Keerthy Suresh, the teaser is intriguing, symbolic and leaves audiences with more questions than answers. Unlike the filmmaker's signature gangster dramas and action entertainers, Dorothy appears to be an emotional relationship drama wrapped in Karthik's unique storytelling style. The biggest talking point in the teaser is the recurring imagery of a cockfight, which seems to act as a metaphor rather than just a visual element. It hints at a conflict between the two male characters, played by Sananth and Rishikanth, seemingly competing for Dorothy's affection, making the film look like a love triangle with an unconventional narrative. Keerthy Suresh commands attention despite the teaser revealing very little about her character. Her screen presence, combined with the mysterious tone, makes Dorothy an intriguing central figure whose choices could drive the entire story. Karthik Subbaraj's decision to keep the narrative under wraps only adds to the curiosity. Another major highlight is the music by Maestro Ilaiyaraaja, who composes the original score for his landmark 1,540th film. The veteran composer's haunting background score perfectly complements the teaser's mood, creating an atmosphere of mystery and emotion rather than spectacle. Adding to the film's prestige, Dorothy has been selected for its World Premiere at the 2026 Toronto International Film Festival (TIFF) in the Centrepiece section, becoming the first Indian Tamil film in a decade to achieve the honour.  Presented by Jio Studios and Sikhya Entertainment, and produced by Jyoti Deshpande, Guneet Monga Kapoor and Achin Jain, Dorothy is slated for a worldwide theatrical release on September 25, 2026. Going by the title teaser, Karthik Subbaraj seems to have crafted a film that is refreshingly different from his previous works, making it one of the most anticipated Tamil releases of the year. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సహాయం.. మనిషికి ఉండాల్సిన మంచి గుణాలలో సహాయం చేయడం కూడా ఒకటి. ఆపదలో ఉన్నవారికి,  అవసరం లో ఉన్నవారికి,  ఇబ్బందులలో ఉన్నవారికి సహాయం చేయడం చాలామంచి లక్షణం.కానీ కొన్నిసార్లు, ఆలోచించకుండా చేసే సహాయం పెద్ద తలనొప్పిగా మారవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారని, అంతే కాకుండా కొందరు వ్యక్తులకు సహాయం చేస్తే.. సహాయం చేసిన వారే నాశనం అవుతారని, తీవ్ర సమస్యలో చిక్కుకుంటారని చెబుతారు. అలాంటి మూడు రకాల వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దుర్మార్గులు, చెడ్డ గుణం కలిగిన స్త్రీ, పురుషులు.. చెడ్డ మనసు లేదా చెడు గుణం కలిగిన , కోపిష్టి స్వభావం ఉన్నవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారికి సహాయం చేయడం అంటే మన కాళ్ళను  మనమే కాల్చుకోవడం లాంటిది. చెడ్డ   స్వభావం ఉన్నవారు ఎవరికీ స్నేహితులు కారు.  వారికి ఎంత దయ చూపినా,  అవకాశం దొరకగానే తిరిగి హాని చేయడానికి  వెనుకాడరు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం  వల్ల సామాజిక హోదా , ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఏ విషయాలకు అయినా దూరంగా ఉండాలి. ఎప్పుడూ విచారంగా ఉండేవారు.. ఈ ప్రపంచంలో కొందరు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పటికీ, వారు తమ విధిని, పరిస్థితులను ఎప్పుడూ  నిందించుకుంటూ ఉంటారు. ఇలాంటి నెది నెగిటివ్  మనస్తత్వం ఉన్నవారికి సహాయం చేయడం మానుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండలేరు.  అలాంటి  వారికి సహాయం చేస్తే, వారి ప్రతికూల శక్తి  జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా వారికి సహాయం చేసేవారు కూడా మానసిక ఒత్తిడికి గురై  సంతోషాన్ని కోల్పోతారు. మూర్ఖుడు.. మూర్ఖుడికి , బుద్ధిహీనుడికి ఏదైనా చెప్పడం,  మూర్ఖుడికి సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం అత్యంత మూర్ఖపు పనిగా చెబుతారు. తమ మంచి చెడులను తాము తెలుసుకోలేని వ్యక్తికి ఏదైనా వివరించడం పూర్తిగా సమయం వృధా చేసినట్టే. అలాంటి   సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పుడు, వారు తరచుగా  చెప్పేదాన్ని అపార్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు సహాయం అందించే వ్యక్తిని తమ శత్రువుగా భావిస్తారు. వారితో వాదించడం లేదా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వల్ల  మనశ్శాంతిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. సహాయం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. ఇతరులకు సహాయం చేయడం అంటే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం కాదు. సహాయం చేసే గుణం మంచిదే అయినప్పటికీ, ,తెలివిని  ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా సహాయం చేసే ముందు, వారి ఉద్దేశాలను, ప్రవర్తనను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి మీ సహాయం చేసే గుణాన్ని  దుర్వినియోగం చేయవచ్చని మీకు అనుమానం వస్తే, వెంటనే వెనక్కి తగ్గడం మంచిది. మీ దయా గుణాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేలా మీ హద్దులను మీరే ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి. సరైన వ్యక్తికి సహాయం చేయడం సరైన వ్యక్తి సహాయం చేయడం చాలా మంచిది. మీరు అవసరంలో ఉన్న, నిజాయితీపరుడైన, నిష్కపటమైన వ్యక్తికి సహాయం చేసినప్పుడు,  తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు. సరైన వ్యక్తికి సహాయం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది , సమాజంలో  గౌరవాన్ని పెంచుతుంది. మన సహాయ గుణాన్ని సరైన చోట ఉపయోగించాలని చాణక్య నీతి  బోధిస్తుంది. మీరు మీ శక్తిని, ధనాన్ని సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అందువల్ల, ఎల్లప్పుడూ  మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి.                                    *రూపశ్రీ.  
 తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి..!++ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు, తల్లిదండ్రులకు తెలియకుండానే వారి కొన్ని అలవాట్లు, వారి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. ఏ తల్లిదండ్రులు కూడా ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కోరుకోరు.. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది,  వారు తమ పరిసరాల నుండి త్వరగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఏమైనా మాట్లాడితే అది వారి భవిష్యత్తును చాలా గందరగోళంగా మారుస్తుంది.  చిన్నతనంలో పిల్లలకు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తేనే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. తాము కూడా తెలియకుండానే తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.. పిల్లల తప్పుకు పోల్చి తిట్టడం.. చాలా మంది తల్లిదండ్రులు, తమ పిల్లల తప్పుకు కోపం తెచ్చుకుని, వారిని ఇతర పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు.  ఇలా పోల్చడం ఎప్పుడైతై  మొదలవుతుందో అప్పుడు పిల్లలు ఇతరులను చూపించి, వారితో పోల్చి తిడతారు కూడా.  మార్కుల విషయంలో కావచ్చు,  తెలివి తేటల విషయంలో కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో కావచ్చు,  చురుగ్గా ఉండే విషయంలో కావచ్చు..  ఇలా  ప్రతిదానికి తల్లిదండ్రులు పిల్లలను పోల్చి మాట్లాడితే..  పిల్లలు చాలా బాధపడతారు, తమను తాము పనికిరానివారిగా భావిస్తారు. ఇక్కడే వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. తిట్టడం.. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను తప్పులు చేసినందుకు కఠినంగా తిడతారు. కానీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినది.. వారు పిల్లలని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని, అలాంటప్పుడు  తరచుగా తప్పులు జరుగుతాయని అర్థం చేసుకోవాలి.   పిల్లలను తప్పులకు పదేపదే తిడితే, వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి భయపడతారు. తప్పు చేయడం చెడ్డ విషయమని, మళ్ళీ తిట్లు పడతాయని భావించి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి, లేదా ప్రయత్నించడానికి కూడా భయపడి ప్రయత్నాలు మానేస్తారు. ఎమోషన్స్ ను లైట్ తీసుకోవడం.. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.  వారు భయపడినప్పుడు, బాధపడినప్పుడు లేదా కలత చెందినప్పుడు,  "ఇంత చిన్న విషయానికి ఏడవకు"  అనడం లేదా "ఇది పెద్ద విషయమేమీ కాదు" అని తోసిపుచ్చేయడం.. వంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు.  దీనివల్ల  తమ భావాలకు విలువ లేదని  పిల్లలు భావిస్తారు. దీనివల్ల, తమను ఎవరూ అర్థం చేసుకోరనే భావనతో వారు తమ భావాలను, ఆలోచనలను దాచుకుంటారు. ఇది వారి నమ్మకాన్ని బలహీనపరుస్తుంది, దాని ప్రభావం వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా పడుతుంది ఓవర్ ప్రొటెక్షన్,  హెల్పింగ్.. చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు సహాయం చేసే నెపంతో, వారి స్కూల్ బ్యాగులు సర్దడం, పిల్లల ఇష్టాలతో పని లేకుండా  తామే బట్టలు షాపింగ్ చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రతి పనిని తామే చేస్తారు. దీనివల్ల పిల్లలు తమ పనులు తాము చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. పిల్లలు ఏదైనా పనిని  తామే చేసినప్పుడు వారికి తమ సామర్థ్యం పెరుగుతుంది. అలా కాకుండా అన్నీ తల్లిదండ్రులే చేస్తుంటే పిల్లలకు వారి సామర్థ్యం గురించి తెలియదు.  క్రమంగా, వారు చిన్న చిన్న విషయాలకు కూడా తమ తల్లిదండ్రులపై ఆధారపడతారు తక్కువ చేసి మాట్లాడటం.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తిడతారు లేదా బంధువులు, స్నేహితులు లేదా అతిథుల ముందు వారి బలహీనతలను  బయటపెడతారు. దీనివల్ల పిల్లలు చాలా షేమ్ గా ఫీలవుతారు. తమను తాము తక్కువగా భావించుకుంటారు. పదేపదే అందరి ముందు  అవమానపడటం వల్ల,  అందరి ముందు ఓపెన్ మాట్లాడటానికి , ఏదైనా చెప్పడానికి భయపడతారు. అది వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అభిరుచులు రుద్దడం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు విషయంలో గానీ, అభిరుచుల విషయంలో గానీ తమకు నచ్చినది చేయాలని కోరుకుంటారు. పిల్లల సొంత ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను  పట్టించుకోరు. పిల్లలకు తమకు నచ్చింది ఎంచుకోవడం,  నచ్చిన పని చేయడం వంటి అవకాశాలు లేనప్పుడు తమ నిర్ణయాలకు విలువ లేదని పిల్లలు భావిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి, అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయడానికి  దారితీస్తుంది.                                *రూపశ్రీ  
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
మన శరీరం అనేది ప్రకృతి సృష్టించిన అత్యంత అద్భుతమైన జీవ వ్యవస్థ. మనకు కనిపించని స్థాయిలో శరీరంలో సుమారు 36 లక్షల కోట్ల కణాలు (36 Trillion Cells) ప్రతి క్షణం పనిచేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఈ కణాలన్నీ సమన్వయంతో పనిచేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఒక్క కణం పనితీరులో లోపం వచ్చినా, అది క్రమంగా ఇతర కణాలపై ప్రభావం చూపి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే నిజంగానే "ఉన్నది ఒకటే జబ్బు... అది సెల్ అనారోగ్యం" అనే భావన వెనుక శాస్త్రీయ కారణం ఏమిటి? ప్రతి వ్యాధి కణాల స్థాయిలోనే మొదలవుతుందా? కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు లభిస్తాయి. ఈ వీడియోలో Cell Health Clinics Founder డా. రవి కుమార్ చింత సెల్ హెల్త్ (Cell Health) యొక్క ప్రాముఖ్యతను సులభమైన ఉదాహరణలతో వివరిస్తున్నారు. మన ఆహారం, నిద్ర, వ్యాయామం, మానసిక ఒత్తిడి, కాలుష్యం, జీవనశైలి వంటి అంశాలు కణాల పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన వివరించారు. అంతేకాదు, చాలా మంది ఎదుర్కొనే మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యల వెనుక కణాల ఆరోగ్యం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో కూడా ఈ చర్చలో తెలుసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించాలంటే కేవలం వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడటం సరిపోదని, కణాల స్థాయిలో శరీరాన్ని బలపరిచే జీవనశైలిని అలవర్చుకోవడం అవసరమని డా. రవి కుమార్ చింత సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మీ శరీరాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచే సెల్ హెల్త్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు బలపడటమే కాకుండా, గుండె పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతాయి. రోజూ అలసట, ఒత్తిడి, ఆందోళన, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి భస్త్రిక ప్రాణాయామం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లోతుగా, వేగంగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపడి శక్తి పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సహజంగా బయటకు పంపే శరీర ప్రక్రియలకు కూడా ఇది తోడ్పడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్ స్రవంతి రఘు భస్త్రిక ప్రాణాయామాన్ని సరైన విధంగా ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనే అంశాలను సులభంగా వివరించారు. మీ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసి, నిపుణుల సూచనల ప్రకారం భస్త్రిక ప్రాణాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా కొత్త యోగా సాధన ప్రారంభించే ముందు వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం.  ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డా. పూర్ణిమ నాగరాజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి, పిల్లల్లో నమ్మకాన్ని ఎలా పెంచాలి, వారు ఏ పరిస్థితిలోనైనా తమ మనసులోని మాటను చెప్పేలా ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, విమర్శించకుండా స్పందించడం, భయపెట్టకుండా మార్గనిర్దేశం చేయడం, కుటుంబంలో ఓపెన్ కమ్యూనికేషన్‌ను పెంపొందించడం వంటి ముఖ్యమైన పేరెంటింగ్ సూచనలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో పిల్లలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)