LATEST NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనకు తానే   రేటింగ్ ఇచ్చుకుని  సంచలనానికి తెరలేపారు ఒక జాతీయ మీడియా సదస్సులో  ఆయన తన పాలనకు  65 శాతం మార్కులు ఇవ్వొచ్చని ప్రకటించారు.   ఇంకా చేయాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని, రాబోయే రెండేళ్లలో వాటిని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు రేవంత్ చెప్పారు.  సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు. అలా అతి విశ్వాసంతో తమ పాలన బ్రహ్మాండంగా ఉందంటూ గొప్పలు చెప్పుకున్న చాలా మంది ముఖ్యమంత్రులకు ఎన్నికలలో ప్రజలు తన ఓటు ద్వారా వాస్తవ పరిస్థితిని తెలియజెప్పిన సంఘటనలు దేశంలో చాలా ఉన్నాయి.  అయితే..  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలకు తాను ఏమి చేశాను? ఇంకా చేయాల్సింది ఏమిటి? ఎంత వరకూ చేయగలను? అన్న అంశాలపై స్పష్టత ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకే ఇప్పటి వరకూ తన పాలన ఎలా ఉందో అన్న విషయంలో ఆయన చాలా చాలా వాస్తవంగా, నిజాయితీగా చెప్పారు.    జాతీయ మీడియా సదస్సులో, ఇప్పటివరకు మీ  పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారన్న ప్రశ్న ఎదురైనప్పుడు రేవంత్ రెడ్డి ఏ మాత్రం తడుముకోకుండా, తడబడకుండా నూటికి 65 మార్కులు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు తానే తక్కువ మార్కులు ఇచ్చుకోవడం ద్వారా వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరిస్తానని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లైంది. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉందనీ, చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయనీ చెప్పిన రేవంత్ వాటిని కచ్చితంగా పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.  సాధారణంగా ముఖ్యమంత్రులు తాము చేయగలిగినదంతా చేశామని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెబుతూ, తమకు తామే వంద శాతం రేటింగ్ ఇచ్చుకుంటూ స్వోత్కర్షకు ప్రాధాన్యత ఇస్తుంటారు.  రేవంత్ రెడ్డి మాత్రం తాను చేయాల్సినది ఇంకా ఉందనీ, మూడేళ్ల పాలనా కాలంలో కేవలం 65శాతం మాత్రమే తాను అనుకున్నది చేయగలిగాననీ నిస్సంకోచంగా అంగీకరించి పరిశీలకులను సైతం విస్మయపరిచారు.  ఇది కూడా చదవండి:   బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.! తాను ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందని చెప్పడం, ప్రజాభిప్రాయం ప్రకారం కూడా తనకు నూటికి 64 మార్కులే పడ్డాయని ధైర్యంగా చెప్పగలగడం  ద్వారా తాను వాస్తవాలను వాస్తవాలుగా అంగీకరించడానికి భయపడనని చాటినట్లైంది.  అదే సమయంలో మిగిలిన రెండేళ్ల పాలనా కాలంలో ప్రజల అంచనాలను చేరుకుని మిగిలిన 35 మార్కులూ కూడా సాధిస్తానని అంతే ధైర్మంగా చెప్పడం ద్వారా.. తాను వందశాతం ప్రజామోదాన్ని పొందడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ చెప్పినట్లైంది. మొత్తం మీద తనకు తాను రేటింగ్ ఇచ్చుకుని రేవంత్ రెడ్డి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారని రాజకీయవర్గాలలో  చర్చ జరుగుతోంది. మీకు నచ్చవచ్చు:  మహిళా శక్తే నా శక్తి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి డీ లిమిటేషన్ దక్షిణాదికి గొడ్డలి పెట్టు: అమిత్ షా దమ్ముంటే ఒవైసీపై పోటీకి దిగు.!  [TelanganaCM, Revanth Reddy, Selfrating, Governence,  TeluguOne]
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యత ప్రస్ఫుటమైంది.   రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  మరోవైపు   వైసీపీ కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాకే పరిమితమైంది. స్థానిక సంస్థల అత్యున్నత వేదికలైన జిల్లా పరిషత్‌లపై కూటమి సాధించిన ఈ విజయంపై కూటమి పార్టీల్లో ఆనందోత్సాహలు వ్యక్తమతౌతున్నాయి. సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.  ఇక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. అత్యధిక స్థానాలలో  తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం 22 జడ్పీ చైర్‌పర్సన్ పదవులతో పాటు 20 వైస్ చైర్‌పర్సన్ పదవులను తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇక జనసేన జనసేన నాలుగు జడ్పీ చైర్‌పర్సన్ పదవులు, ఐదు వైస్ చైర్‌పర్సన్ పదవులను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఒక జడ్పీ చైర్‌పర్సన్ పదవితో పాటు రెండు వైస్ చైర్‌పర్సన్ స్థానాలను గెలుచుకుంది. ఇక   అల్లూరి సీతారామరాజు జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైసీపీ దక్కించుకుంది.   పొత్తులో భాగంగా కొన్ని జిల్లాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడంతో సమీకరణాలు మారిపోయాయి. తొలి నుంచి ఆయా పదవులను ఆశించిన నాయకుల్లో కొంత అసంతృప్తి తలెత్తింది. ముఖ్యంగా కాకినాడ,   కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూటమి శ్రేణుల్లోని అసమ్మతి బయటపడింది. పదవుల కేటాయింపు విషయంలో నెలకొన్న మార్పులు కొన్ని చోట్ల చర్చనీయాంశంగా మారాయి. కాకినాడ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని ఆశించిన కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జి పిల్లి అనంతలక్ష్మికి  పొత్తు కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఆ పదవి జనసేనకు వెళ్లడంతో ఆమెకు వైస్ చైర్‌పర్సన్ అవకాశం కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే అసంతృప్తికి గురైన ఆమె ఎన్నిక ప్రక్రియకు హాజరుకావడానికి తొలుత నిరాకరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎంపీ సానా సతీశ్ తదితరులు ఆమెతో మాట్లాడి బుజ్జగించినప్పటికీ, సమావేశ మందిరానికి వచ్చిన అనంతరం ఆమె ప్రమాణస్వీకారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వైస్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలు పంపన రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.! పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పదవుల కేటాయింపుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్‌కు జడ్పీ చైర్‌పర్సన్ పదవి వస్తుందని తొలుత అంచనాలు ఉన్నప్పటికీ, పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీనిని నిరసిస్తూ కురుపాంలో బంద్ నిర్వహించారు. అనంతరం వీరేశ్ చంద్రదేవ్‌కు వైస్ చైర్మన్ పదవి దక్కగా, ఆయన ఎన్నికై ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల స్థాయిలో పట్టు పెంచుకునే దిశగా జరిగిన ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిత్రపక్షాల మధ్య సమన్వయంతో   మెజారిటీ జడ్పీలను చేజిక్కించుకోవడం కూటమికి సానుకూలాంశంగా మారింది.   జిల్లా పరిషత్‌ల పాలకమండళ్లు పూర్తిస్థాయిలో కొలువుదీరిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. తాగునీరు, రహదారులు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జడ్పీల పాత్ర కీలకంగా ఉంటుంది. మున్ముందు జడ్పీ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల అమలులో కూటమి నేతల మధ్య సమన్వయం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో తలెత్తిన అసంతృప్తులను సమర్థవంతంగా సర్దుబాటు చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య ఐక్యతను కాపాడుకోవడం కూటమి నాయకత్వానికి కీలకంగా మారనుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో కొత్తగా ఎన్నికైన జడ్పీ పాలకవర్గాలు ఏ మేరకు వేగంగా పనిచేస్తాయో వేచి చూడాలి. మీకు నచ్చవచ్చు: చీరాల మునిసిపోల్ ఫలితాలు: సోదిలో కూడా కనిపించని వైసీపీ.! ఏపీలో వైసీపీ కంటే బీజేపీయే బెటర్: స్థానిక సమరంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జగన్ పార్టీ.! [Andhra Pradesh Zilla Parishad Elections,  Alliancevictory, ZP chairpersons, YCP,  Alluri Sitarama Raju Zilla Parishad]
కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థి: కేటీఆర్ ను లైట్ తీసుకుంటా.. సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిజంగా ఆత్మవిశ్వాసం ఉంటే హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై విజయం సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి సవాల్ చేశారు.  హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ, ప్రాంతీయ రాజకీయాలకు సంబంధించి  కీలక వ్యాఖ్యలు చేశారు.  మతపరమైన ఓట్ల చుట్టూనే బీజేపీ, ఎంఐఎం రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్  మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతోందన్నారు. ఈ వేదికపై జరిగిన సంభాషణలో లోక్‌సభ సీట్ల పునర్విభజన, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యర్థులపై ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు.  నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)   ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయంగా కాకుండా, యావత్ దక్షిణ భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద సవాలుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. లోక్‌సభ స్థానాలను యాభై శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని, కేవలం ఉత్తరాది సీట్ల ఆధారంగానే అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి ఏర్పడుతుందని  హెచ్చరించారు. పునర్విభజన తర్వాత మొత్తం 850 లోక్‌సభ స్థానాలు ఏర్పడితే.. వాటిలో ఉత్తరాదికి దాదాపు  650 సీట్లు, దక్షిణాదికి దాదాపు 195 సీట్లు దక్కే అవకాశం ఉందని గణాంకాలతో సహా వివరించారు. కేరళలో 20, ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో 60 సీట్ల తేడా ఉండగా, యాభై శాతం పెంపు జరిగితే కేరళలో 30, యూపీలో 120 సీట్లతో ఆ వ్యత్యాసం 90 సీట్లకు పెరుగుతుందని ఉదాహరించారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కీలకమని గుర్తు చేస్తూ, గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పడిపోయిన సందర్భం ఉన్నప్పటికీ, దక్షిణాది ప్రాధాన్యతను దెబ్బతీసేలా సీట్ల సంఖ్యలో భారీ అసమతుల్యత రావడం దేశానికి  ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లు ఆంధ్ర ప్రాంతానికి, 119 సీట్లు తెలంగాణకు ఉన్న సమీకరణంలో మెజారిటీ బలంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఆ కారణంగానే పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, రాష్ట్రాలు, జనాభా, జీడీపీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని యాభై శాతం ఫార్ములాను అనుసరించాలని గట్టిగా డిమాండ్ చేశారు.  మహిళా రిజర్వేషన్ల అమలుకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే కొత్త చట్టాలు లేదా రాజ్యాంగ సవరణల అవసరం లేకుండానే, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లో 181 స్థానాలను మహిళలకు కేటాయించవచ్చన్నారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ సహకరించినప్పటికీ, సంఖ్యాబలంతో ముందుకెళ్తూ భవిష్యత్తులో డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి నష్టం కలిగించేలా వ్యవహరించడం తగదన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని  విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ గా అభివర్ణిస్తూ, ఆయన తరచూ విదేశీ పర్యటనల్లో ఉంటున్నారన్న రేవంత్ రెడ్డి,  కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలను రాజకీయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని, జాతి, మతం, భాష పేరిట విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుల కృషితో సామాన్యులకు లభించిన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓట్ చోర్ - గద్దీ చోర్' నినాదానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు. ఇక విదేశాల్లో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడంపై,  పేదల హక్కుల కోసం వివిధ దేశాల్లో పోరాడిన చేగువేరా స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై తాము నిలబడతామని సమర్ధించారు.   ఇది కూడా చదవండి: బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.!   అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.  ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంబంధాలపై మాట్లాడుతూ,  కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న రేవంత్ రెడ్డి  బీజేపీ ముఖ్యమంత్రుల పేర్లు గుర్తుకురాక నీతి ఆయోగ్ సమావేశాల్లో నేమ్ బోర్డులు చూడాల్సి వస్తోందని చమత్కరించారు.  కేసీఆర్‌ను తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తానని, అయితే కేటీఆర్‌ను సీరియస్‌గా తీసుకోనని రేవంత్ చెప్పారు.  తాను పదిహేడేళ్ల వ్యవధిలో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగి స్వయంశక్తితో ముఖ్యమంత్రి పదవిని చేరుకున్నానని, కేటీఆర్ మాత్రం తండ్రి అండతో  మేనేజ్‌మెంట్ కోటా లో నాయకుడయ్యారని ఎద్దేవా చేశారు.  తన రాజకీయ కథలో కేసీఆర్‌ను  రావణాసురుడిగా అభివర్ణించారు.   ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్‌ను కొనసాగిస్తున్నామని, లేదంటే ఎప్పుడో ఖాళీ చేసేవారమని స్పష్టం చేశారు. మీకు నచ్చవచ్చు: రేవంత్ టార్గెట్ కేసీఆర్ కాదు.. కేటీఆర్, హరీష్.​ కేటీఆర్ ఆస్తులివీ: సిరిసిల్ల వేదకగా బయటపెట్టిన సీఎం రేవంత్.!  [Southern Rising Summit, Revanth Reddy,   Delimitation,   Amit Shah, Oyaisi, KCR,  KTR, TeluguOne] 
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే  కడప  ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైఎస్ అవినాష్ రెడ్డికి పెలీసులు నోటీసులు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నివాసం నుంచి  బయటకు రావద్దని పోలీసులు ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే , ఆ ఆంక్షలను ఖాతరు చేయకుండా  ఆయన భారీ వాహనశ్రేణితో పర్యటనకు బయలుదేరారు.  వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో వైఎస్ అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరుకు శుక్రవారం (నవంబర్ 20) చేరుకున్నారు. పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది.  ఈ పరిణామాలకు ముందురోజు అంటే గురువారం (నవంబర్ 19)  టీడీపీ నేత బీటెక్ రవి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన వ్యవహార శైలిని తక్షణమే కట్టడి చేయాలని  డిమాండ్ చేశారు. ఇది జరిగిన  మరుసటే అవినాష్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి కాన్వాయ్‌తో పర్యటనకు వెళ్లడాన్ని టీడీపీ శ్రేణులు, స్థానికులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తూ   ఖండించారు. అదలా ఉండగా,  అంకాలమ్మ గూడూరు వద్ద తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘటనలో ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందంటూ వైసీసీయులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. అయితే ఎంపీ కాన్వాయ్ పై పెట్రోల్ బాంబు దాడి వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు ఖండించారు.  ఆలా ఉండగా అంకాలమ్మ గూడురులో జరిగిన ఘర్షణలో తెలుగుదేశం కార్యకర్త ఒకరు గాయపడ్డారు.  ఇది కూడా చదవండి:  అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై బాంబుదాడి: సింహాద్రిపురంలో ఉద్రిక్తత.! ప్రస్తుతం అంకాలమ్మ గూడూరులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఘర్షణ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘర్ణణకు దిగిన వారిని స్వల్పంగా లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పులివెందులలోనూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆంక్షలు విధించి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిబంధనలను, ఆంక్షలను ఉల్లంఘిస్తూ కఠిన చర్యలు తప్పవని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో పంచాయతీ ఎన్నికలలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిందని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మీకు నచ్చవచ్చు:   పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా? పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.! [Kadapa MP YS Avinash Reddy, Violate, estrictions, HugeCanvoy, Ankalamma Guduru, Pulivendula, TeluguOne]
తెలుగుదేశం పార్టీతోనూ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనూ ఉన్న సన్నిహిత సంబంధాన్ని తాను ఎప్పుడో తెంచుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన  ప్రజా పాలన  ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ప్రయోజనాలే తనకు  ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.     ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి   తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీతో తాను ఏనాడో తెగదెంపులు చేసుకున్నానని, బాబుతో సన్నిహిత సంబంధాన్ని ఎప్పుడో విచ్ఛిన్నం చేసుకున్నానని  పునరుద్ఘాటించారు. తాను తెలంగాణ బిడ్డనని, తనను ముఖ్యమంత్రిని చేసిన ఈ గడ్డకు నీటి విషయంలో   అన్యాయం ఎలా చేస్తానని, ఎందుకు చేస్తానని  ప్రశ్నించారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని గతంలో సంతకం చేసింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు కాదా అని నిలదీశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డిని ప్రగతిభవన్‌కు ఆహ్వానించి విందు ఇచ్చి, రాయలసీమ ప్రాజెక్టులకు సహకరించింది కేసీఆరేనని  ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావుల రాజకీయ ప్రస్థానం, కుటుంబ ఆస్తులు, ప్రాజెక్టుల వ్యవహారాలపై రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.  చింతమడకలో ఉన్న కేసీఆర్‌కు తొలిసారి రాజకీయ అవకాశం కల్పించింది దివంగత కాంగ్రెస్ నేత ఆనంతుల మదన్ మోహన్ అనీ,   అలాంటి వ్యక్తిపైనే కేసీఆర్ పోటీ చేశారని విమర్శించారు. ఆయన జ్ఞాపకార్థం సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెడతామని ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలుగా మామ, అల్లుడు, బావమరిది అంటూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయన్న రేవంత్ రెడ్డి.. 2004లో వార్డు మెంబర్ కూడా కాని హరీశ్ రావు, నాడు కాంగ్రెస్ దయతో  రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారని గుర్తుచేశారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, జన్వాడ ప్రాంతాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్‌లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సమకూరాయని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపైనా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ముందుండి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లకే కుప్పకూలిపోయిందని విమర్శించారు. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే కారణంతోనే, 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఆమె అడగకపోయినా పిలిచి పదవి ఇచ్చి గౌరవించామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతూ, ఇకపై సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారబోతోందని రేవంత్  ధీమా వ్యక్తం చేశారు.  ఇది కూడా చదవండి: తెలంగాణలో పాలసీ పెరాలసీ లేదు..పెట్టుబడులకు సంపూర్ణ భద్రత: సీఎం రేవంత్ రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట కార్యకర్తలు, నాయకులు చర్చించి సూచించిన అభ్యర్థికే కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తామని, ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేకు కీలకమైన మంత్రి పదవి అందిస్తామని హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లోనూ తెలంగాణలో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తాము రద్దు చేయలేదని, పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా  5 లక్షల రూపాయల బీమా కవరేజీతో  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంచామన్నారు. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు.. సిద్దిపేట సభలో ప్రగల్భాలు, వ్యక్తిగత విమర్శలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన  దేవుళ్లపై ఒట్లు వేసి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి..  ఇప్పుడు ఒట్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, హరీశ్ రావు కౌంటర్‌తో సిద్దిపేటలో జరిగిన ఈ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.    మీకు నచ్చవచ్చు:   మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ: ఏం చర్చించారో తెలుసా.?​ తెలంగాణ విద్యావిధానంలో సమూల మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం.! [Revanth Reddy, Siddipetpublicmeeting, Chandrababu, Harish Rao, IndirammaFamily LifeInsurance]
ALSO ON TELUGUONE N E W S
రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నటించిన క్లాసిక్‌ చిత్రం ‘భక్త కన్నప్ప’కు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ)లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. తన పెదనాన్న నటించిన సినిమా ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రదర్శితం కావడంపై పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘భక్త కన్నప్ప’ సినిమా తన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేకమైనదని ప్రభాస్‌ పేర్కొన్నారు. పెదనాన్న కృష్ణంరాజు నటించిన ఈ చిత్రాన్ని తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు నిర్మించారని, బాపు గారు అద్భుతంగా తెరకెక్కించారని గుర్తు చేసుకున్నారు. ఎన్నేళ్లు గడిచినా కొన్ని కథలు ఎప్పటికీ నిలిచిపోతాయని, ఈ సినిమాకు ఇఫీలో గౌరవం దక్కడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఇది తమ కుటుంబానికి అందమైన వారసత్వం, నిజమైన గౌరవం అని భావోద్వేగంగా రాసుకొచ్చారు. 1976 మే 26న విడుదలైన ‘భక్త కన్నప్ప’ ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా ఇఫీ 2026లో భారతీయ సినిమాల స్వర్ణోత్సవ విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణంరాజు భక్త కన్నప్ప పాత్రలో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కన్నప్ప భక్తి, శివుడిపై ఆయనకున్న అపారమైన విశ్వాసం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ప్రభాస్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, భాను చందర్‌, జయప్రద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రకటించారు. మరోవైపు పెదనాన్న కృష్ణంరాజు నటించిన క్లాసిక్‌ సినిమాకు ఇఫీలో గౌరవం దక్కడం ప్రభాస్‌ అభిమానులకు కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. [Prabhas, BhaktaKannappa, IFFI2026, KrishnamRaju BhaktaKannappa50Years, IFFIGoldenJubileeFilms]
నభా నటేష్.. సెల్యులాయిడ్ పై తను పెర్ఫార్మ్ చేస్తుంటే అభిమానులు వెంటనే సింగర్స్ గా మారిపోయి 'కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. రాసే నీకే ముందుగా మదిలో మాట తియ్యగా'  అనే అద్భుతమైన మెలోడీని పాడుకుంటూ ఉంటారు. అంత హృద్యంగా నభా పెర్ఫార్మ్ ఉంటుంది.ఇస్మార్ట్ శంకర్ తో పాటు ప్రీవియస్ మూవీ నాగబంధం లాంటి సినిమాలే జస్ట్ శాంపిల్ పీసెస్.  ఈ బ్యూటీ  సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక "అధికారిక ప్రకటన" ఇప్పుడు నెట్టింట విపరీతమైన చర్చకు దారితీసింది. మొదట "అధికారిక ప్రకటన" అని చూడగానే అభిమానులు, సినీ ప్రేక్షకులు ఏదో పెద్ద సినిమానో, లేక తీవ్రమైన వ్యక్తిగత విషయమో అనుకుని ఆందోళన పడ్డారు. కానీ లోతుగా చదివిన తర్వాత అసలు విషయం వేరే ఉందని అర్థమైంది. నభా నటేష్ తన తల్లికి బహిరంగ క్షమాపణ చెబుతూ ఒక హృద్యమైన, అదే సమయంలో సరదాగా సాగే నోట్‌  పంచుకుంది. ఎన్నో ఏళ్లుగా తన తల్లి చెప్పిన మాటలను, సలహాలను పట్టించుకోకుండా తాను చేసిన పొరపాటును ఆమె ఈ పోస్ట్‌లో నిజాయితీగా ఒప్పుకున్నారు. "నాకే ఎక్కువ తెలుసు" అని ఎన్నో ఏళ్లుగా భావించానని, కానీ ఇప్పుడు ఆ నిజాన్ని ఒప్పుకోక తప్పడం లేదని నభా తన మనసులోని మాటను బయటపెట్టారు. ముఖ్యంగా "మా అమ్మ చెప్పేది కరెక్టే" అంటూ ఆమె రాసిన వాక్యం ఇప్పుడు ప్రతి ఇంట్లోని పరిస్థితిని గుర్తు చేస్తోంది.   రోజువారీ జీవితంలో ఏం తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, అతిగా ఆలోచించడం ఎప్పుడు ఆపాలి అనే విషయాల నుంచి మొదలుకొని, ఆఖరికి కడుపు నొప్పి వచ్చినా లేదా కడుపు సహకరించనప్పుడు ఏం చేయాలన్న దానికి అమ్మ దగ్గరే ఖచ్చితమైన సమాధానం ఉంటుందని నభా స్పష్టం చేశారు. అయినప్పటికీ తాను మాత్రం మొదట అడగాల్సిన అమ్మను పక్కన పెట్టి, ఇంటర్నెట్‌లో గూగుల్‌లో వెతకడం, సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, అవసరమైతే స్నేహితులను అడగడం వంటి పనులు చేసి ఏవేవో చిట్కాలు ప్రయత్నిస్తుంటానని సరదాగా చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్‌లో అందరినీ ఎక్కువగా ఆకట్టుకున్నది ఆమె చెప్పిన క్షమాపణ తీరు. అందరి ముందూ ఈ విషయాన్ని ఒప్పుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నా, ఈసారి కూడా అమ్మే కరెక్ట్ అని, అమ్మ మాట విననందుకు ఇదే తన బహిరంగ క్షమాపణ అని నభా పేర్కొన్నారు. అంతేకాకుండా, అమ్మ "నేను ముందే చెప్పాను కదా!" అనేలోపే ముందే సారీ చెప్పేస్తున్నానంటూ సరదాగా ముగించారు. కొన్ని క్షమాపణలు చెప్పడం మరికొన్నింటి కంటే కష్టమని, ముఖ్యంగా అమ్మ చెప్పిందే మొదటి నుంచి సరైనదని ఒప్పుకోవాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజీలతో ఆమె పెట్టిన క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అసలు ఏమైందని ఆరా తీస్తుండగా, మరికొందరు ఇది ఏదైనా సినిమా ప్రమోషన్ కోసమా అని సరదాగా ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు నభా తెలుగులో ఇంత చక్కగా రాయడం చూసి ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో అమ్మాయిల పరిస్థితి ఇంతేనంటూ యువతులు, నెటిజన్లు ఈ పోస్ట్‌కి బలంగానే  కనెక్ట్ అవుతున్నారు. ఇటీవల కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న నభా నటేష్, ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్  "స్వయంభూ"లో ఆమె సుందరవల్లి అనే క్యారక్టర్ లో కనిపించనుంది. అలాగే తన మాతృభాష కన్నడ సినీ రంగంలోనూ విశాల్ ఆత్రేయ దర్శకత్వంలో ధ్రువ సర్జా సరసన నటిస్తూ మరో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. https://www.instagram.com/p/Df_-EKqPeIF/   మీకు నచ్చవచ్చు:జనరల్ రైలులో విజయ్ ఆంటోనీ! మీకు నచ్చవచ్చు:సినిమాకి ఆ ప్రేక్షకులు ఎందుకు దూరమయ్యారు? వాళ్ల పుణ్యమేనా!   [Nabha Natesh ,  public apology to mother, Swayambhu, Tollywood]  
ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల అనుబంధం.. ఇలా మొదలయ్యే కథ ఒక్కసారిగా సర్వైవల్‌ థ్రిల్లర్‌గా మారితే ఎలా ఉంటుంది? తమిళంలో అశోక్‌ సెల్వన్‌, ప్రీతీ ముకుందన్‌ జంటగా నటించిన ‘అన్బిల్ అవన్’ సినిమా ఇలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తికేయన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదలైంది. నవంబర్‌ 20 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రొమాన్స్‌, యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. సూర్య (అశోక్‌ సెల్వన్‌), ఇందు (ప్రీతీ ముకుందన్‌) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తూ ఉద్యోగ ఒత్తిడిని, అవమానాలను ఎదుర్కొంటుంటారు. నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన ప్రదేశంలో హోమ్‌స్టే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఓ పాత బంగ్లా వారికి నచ్చుతుంది. ఒకప్పుడు రాణి పద్మిని (రేవతి) నివసించిన ఆ బంగ్లాను ఆమె నుంచి సూర్య అతికష్టం మీద కొనుగోలు చేస్తాడు. అయితే ఆ బంగ్లాపై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే రాజనాయగం మాత్రం దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు. బంగ్లా కొనుగోలు చేసినప్పటి నుంచి సూర్య దంపతులకు సమస్యలు మొదలవుతాయి. ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడులు చేయడం, పోలీస్‌ అధికారి తవసి కూడా ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించడం, ఇందుతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరుగుతాయి. చివరికి సూర్య ఇంట్లో ఏనుగు దంతాలు, మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు పెట్టించి అతడిని కేసులో ఇరికించాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ఓ హత్యను సూర్య తన ఫోన్‌లో రికార్డు చేయడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. భార్యను, తాము ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని కాపాడుకోవడానికి ఓ సాధారణ యువకుడు చేసే పోరాటం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతాయి. రాజకీయ నాయకుడు, వకీలు, పోలీస్‌ అధికారి కలిసి సూర్య దంపతులను చుట్టుముట్టే సమయంలో కథ వేగం పుంజుకుంటుంది. క్లైమాక్స్‌ను రూపొందించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అశోక్‌ సెల్వన్‌, ప్రీతీ ముకుందన్‌ తమ పాత్రల్లో సహజంగా నటించారు. గౌతమ్‌ రాజేంద్రన్‌ కెమెరా పనితనం, గోవింద్‌ వసంత నేపథ్య సంగీతం, కార్తికేయన్‌ టేకింగ్‌ సినిమాకు బలంగా నిలుస్తాయి. అయితే కథలోని కొన్ని అంశాలు మరింత బలంగా ఉండాల్సింది. రొమాన్స్‌తో మొదలైన కథలోకి థ్రిల్లర్‌ అంశాలు వచ్చిన తర్వాత కొన్ని సన్నివేశాలు సాధారణంగా అనిపిస్తాయి. అయినప్పటికీ భార్యాభర్తల అనుబంధం, తమ కలను కాపాడుకోవడానికి వారు చేసే పోరాటం, చివరి భాగంలోని ఉత్కంఠ సర్వైవల్‌ థ్రిల్లర్‌ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఈ జోనర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ‘అన్బిల్ అవన్’ ఓసారి చూడదగిన చిత్రంగా చెప్పొచ్చు.     [AnbilAvan, SonyLIV, AshokSelvan, Preity Mukhundhan, TamilSurvivalThriller]
ప్రముఖ యాంకర్‌, నటి ఉదయభాను తాజాగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ భేటీ అనంతరం తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు ఉదయభాను. లోకేశ్‌ ఆలోచనా విధానం, సమాజం పట్ల ఆయనకున్న దృక్పథం, తన మాటలను శ్రద్ధగా విన్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆయనపై గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా పోస్ట్‌ పెట్టారు. నారా లోకేశ్‌ను దూరదృష్టి కలిగిన నాయకుడిగా అభివర్ణించిన ఉదయభాను.. ఆయన ఆలోచనల్లో స్పష్టత, ప్రగతిశీల దృక్పథం, ఇతరుల పట్ల చూపించే నిజమైన శ్రద్ధ తనకు ఎంతో నచ్చాయని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తాను ఆలోచించిన కొన్ని ఆశయాలు, కార్యక్రమాలను ఆయనతో పంచుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అయితే ఈ సమావేశంలో తనను ఎక్కువగా ఆకట్టుకున్నది లోకేశ్‌ స్పందించిన తీరేనని ఉదయభాను చెప్పారు. తాను చెప్పిన విషయాలను ఎంతో శ్రద్ధగా వినడమే కాకుండా, వాటిపై లోతుగా అవగాహన చేసుకుని ఆలోచనాత్మకంగా స్పందించారని వెల్లడించారు. మెరుగైన భవిష్యత్తు కోసం మనం పెట్టుకున్న ఆశయాలను ఎదుటివారు అంతే నిబద్ధతతో స్వీకరించినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకంగా ఉంటుందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కొన్ని సంభాషణలు మనసులో చిరకాలం నిలిచిపోతాయని, మరికొన్ని భవిష్యత్తులో గొప్ప మార్పులకు బాటలు వేస్తాయనే ఆశను కలిగిస్తాయని ఉదయభాను రాసుకొచ్చారు. ఇది కూడా చదవండి: ‘డ్రాగన్‌’లో చర్చి సీక్వెన్స్‌.. ఎన్టీఆర్‌, రుక్మిణి వసంత్‌పై భారీ పెళ్లి వేడుక! ఉదయభాను తెలుగు టెలివిజన్‌ ప్రేక్షకులకు యాంకర్‌గా సుపరిచితురాలు. తనదైన మాటతీరుతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఆమె సినిమాల్లోనూ నటించారు. తాజాగా నారా లోకేశ్‌తో భేటీ, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఉదయభాను ప్రస్తావించిన సామాజిక కార్యక్రమాలు ఏమిటి? వాటిని అమలు చేసే దిశగా ఏమైనా ముందడుగు పడుతుందా? అనేది తెలియాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు: మహేష్ బాబు, అనిల్‌ రావిపూడి కాంబో రిపీట్‌.. అసలు ట్విస్ట్ ఏంటంటే.? ప్రశాంత్‌ వర్మకు బిగ్ షాక్.. మరో ‘హనుమాన్‌ 2’ ప్రకటించిన ప్రొడ్యూసర్స్! https://www.instagram.com/reel/DgAL-4NyL2Z/       [Udaya Bhanu, Nara Lokesh, Meeting, Andhra Pradesh, Amaravati]  
Dhanush’s O.M: Operation Mole has opened its theatrical run on a strong note, collecting an estimated ₹31.55 crore gross worldwide on Day 1. The film, which arrived in theatres on November 20, earned ₹17.70 crore net in India, with its overseas gross contributing another ₹11 crore to the total. The opening marks a significant jump for Dhanush, with O.M registering higher Day 1 collections than his previous Tamil releases Idli Kadai and Kara. The film recorded ₹20.55 crore gross in India, while overseas markets accounted for nearly 35 per cent of its worldwide opening. The Tamil version led the domestic business with ₹13.35 crore net, followed by the Telugu version with ₹4 crore. The Hindi version contributed around ₹35 lakh. The film played across 6,628 shows in India, recording an overall occupancy of 45.6 per cent. Also Read: VHP seeks ban on Ramayana from Government Directed by Rajkumar Periasamy, who previously helmed Amaran, O.M: Operation Mole is an action crime thriller set against the backdrop of a red sandalwood smuggling network. The story follows a covert operation targeting the syndicate operating in the forest regions between Tirupati and Thiruvannamalai. The film brings together Dhanush and Mammootty in prominent roles, with Sai Pallavi playing a police officer. The ensemble cast also includes Sreeleela, Naseeruddin Shah, Renu Desai and Indrans. With music composed by Sai Abhyankkar, O.M: Operation Mole is produced by Wunderbar Films and RTake Studios. The film’s opening-day performance gives it a strong start as it heads into its first weekend. Check Out:  Suriya expresses his gratitude to audiences                       Are King100 and Dada being postponed?   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మాటకి  ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక హోదా ఉంటాయని నిరూపించాడు త్రివిక్రమ్. ఆ పెన్ను నుంచి వచ్చిన  మాటని పలకడం  చాలా మంది గౌరవంగా భావించే వాళ్ళు. గౌరవం కూడా దొరికేది. అంత శక్తీ ఉంది త్రివిక్రమ్ మాటకి. అందుకే  'మాటల మాంత్రికుడు' అనే పేరు తనంతట తానుగా వచ్చి అయస్కాంతంలా పక్కనే అంటిపెట్టుకుంది.  జీవిత సత్యాలు, పురాణాల విశ్లేషణలకి  సున్నితమైన హాస్యాన్ని మేళవించి ఆయన రాసే మాటల కోసమే ప్రేక్షకులు పదేపదే థియేటర్లకు వెళ్లేవారు కోకోల్లలు. "నువ్వు నాకు నచ్చావు", "మల్లీశ్వరి", "అతడు", "జల్సా", "ఖలేజా", "అత్తారింటికి దారేది" వంటి చిత్రాలు కేవలం కథలతోనే కాకుండా, ఆయన పదునైన సంభాషణల బలంతోనే ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ఒక దశలో తెలుగు సినిమా చరిత్రలోనే కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి రచయితగా త్రివిక్రమ్ రికార్డు సృష్టించారంటే ఆయన మాటలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. "యుద్ధం గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం", "అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు", "ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు" లాంటి వందలాది డైలాగులు నేటికీ యువతరం సోషల్ మీడియా స్టేటస్‌లుగా, నిత్యజీవితంలో సామెతలుగా మారిపోయాయి. కథలో భారీ యాక్షన్ లేకపోయినా కేవలం తన మార్క్ డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో బాక్సాఫీస్ వద్ద 100 శాతం సక్సెస్ కొట్టే సత్తా ఆయన సొంతం.   అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో, సగటు సినీ అభిమానుల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకప్పుడు మాటలతోనే సినిమాని  గెలిపించిన త్రివిక్రమ్ కలానికి ఇప్పుడు మునుపటి పదును తగ్గిందా అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన రూపొందించిన సినిమాలలో కమర్షియల్ హంగులు, స్టార్ హీరోల ఎలివేషన్లు ఎక్కువయ్యాయి తప్ప, గుండెను హత్తుకునే లోతైన సంభాషణలు కరువయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పాత సినిమాలను టీవీల్లో పదిసార్లు చూసినా బోర్ కొట్టని ఆ మ్యాజిక్, కొత్త సినిమాల విషయంలో ఎందుకు మిస్ అవుతోందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: జనరల్ బోగీలో హీరో విజయ్ ఆంటోనీ: ఎందులో తెలిస్తే సెల్యూట్ కొడతారు!  ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత, భారీ బడ్జెట్, యాక్షన్ సీక్వెన్స్‌ల వైపు దర్శకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ కూడా తన సహజ శైలిని పక్కన పెట్టి, కమర్షియల్ ఫార్ములాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. గతంలో ఒక్క పంచ్ డైలాగ్‌తో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి, ఆ వెంటనే ఒక చిన్న వాక్యంతో కంటతడి పెట్టించే ఆయన మార్క్ టచ్ ఇప్పుడు తగ్గిపోయిందని సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేయబోతున్న భారీ ప్రాజెక్ట్ "గాడ్ ఆఫ్ వార్" విషయంలోనైనా త్రివిక్రమ్ తన పాత శైలిని బయటకు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భారీ యాక్షన్ సినిమాలు తీయడానికి ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు కానీ, అక్షరానికి హోదా తెచ్చి, మనుషుల మధ్య బంధాలను అందంగా చెప్పగల దర్శకుడు త్రివిక్రమ్ ఒక్కరేనని అభిమానులు గుర్తు చేస్తున్నారు. రాబోయే చిత్రాల్లోనైనా మాటల మాంత్రికుడు తన పెన్నుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చి, ఆడియన్స్‌ని  మంత్రముగ్ధులని చేస్తారో లేదో చూడాలి. చేయాలనీ కూడా కోరుకుందాం.   మీకు నచ్చవచ్చు: సినిమా సూపర్ బాబోయ్ సూపర్: మరి కలెక్షన్స్  ఎక్కడ! మీకు నచ్చవచ్చు:సచిన్ టెండూల్కర్ కాబోయే అల్లుడు సినిమా హీరో: డీటెయిల్స్ ఇవే!   [Trivikram, Tollywood, pawan Kalyan, Ntr, Tollywood]
ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్‌’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘సలార్‌’, ‘కేజీఎఫ్‌’ చిత్రాలతో తనదైన యాక్షన్‌ ప్రపంచాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్‌ను 1967 నాటి కథలో చూపించబోతున్నారు. అప్పటి నల్లమందు వ్యాపారం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ‘లూగర్‌’ అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 70 రోజులకు పైగా నిరంతరంగా చిత్రీకరణ కొనసాగించిన చిత్ర బృందం.. ఇప్పుడు కథలో కీలకమైన చర్చి సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.  ఈ సన్నివేశాలకు అనుసంధానంగా ఎన్టీఆర్‌-రుక్మిణి వసంత్‌ భారీ పెళ్లి వేడుకను కూడా చిత్రీకరిస్తున్నారట. కథలో ఈ సన్నివేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, రుక్మిణి వసంత్‌, బిజు మీనన్‌ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.  ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ నార్కోటిక్స్‌ చీఫ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్‌ పాత్రకు, ఆయన పాత్రకు మధ్య ఎలాంటి సంఘర్షణ ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు బలమైన కథ, భావోద్వేగాలకు కూడా ప్రశాంత్ నీల్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు టాక్‌. ఇది కూడా చదవండి: తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.! మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 2027 జూన్‌ 11న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తానికి రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ చర్చి, పెళ్లి వేడుకల ఎపిసోడ్‌ ‘డ్రాగన్‌’లో కీలకమైన భాగం కానుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌ మార్క్‌ మేకింగ్‌, ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ పాత్ర, భారీ తారాగణంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. మీకు నచ్చవచ్చు: టాలీవుడ్‌కి ఏమైంది.. ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా! పైరసీ కలకలం.. రిలీజ్ రోజే ఆన్‌లైన్‌లోకి ‘ఆకాశంలో ఒక తార’.!       [Jr NTR, Dragon Movie, Church Sequence, Rukmini Vasanth, Prashanth Neel]  
Suriya has thanked audiences for making 2026 a memorable year for him, as his three consecutive releases, Karuppu, Vishwanath & Sons and Scene, have turned out to be box-office successes. The actor shared a video message expressing his gratitude for the support extended to his films. Suriya's latest release, Scene, has added another success to his impressive run this year. The Jithu Madhavan-directed crime comedy opened strongly during the Diwali season and has continued to draw audiences, further strengthening the actor's box-office momentum. In his message, Suriya thanked viewers for watching the film in theatres, sharing their reviews and discussing it from different perspectives. He said the audience's enthusiasm for Scene had made the entire team happier than they could have imagined. The actor also acknowledged theatre owners, the press, media, reviewers, critics, social media influencers and fans across languages for supporting the film. He extended his gratitude on behalf of the entire team, recognising the collective effort behind its success. Also Read: Nani promises big comeback for Nithiin Earlier this year, Suriya scored a major hit with RJ Balaji's fantasy action drama Karuppu, followed by Venky Atluri's family entertainer Vishwanath & Sons. The success of these films across different genres made his 2026 theatrical run particularly noteworthy. With Scene completing a hat-trick of successful releases, Suriya has enjoyed a significant turnaround at the box office. The actor concluded his message by thanking audiences for celebrating his films and promising to meet them again soon. Check Out:  Are King100 and Dada being postponed?                      Jan 12 Vidudala: Diviki celebrates sister-in-law bond Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     https://www.instagram.com/reel/DgAAyoxOVrQ
అహ హ అహ హ హ హసిని నీ నవ్వులో ఎవరు ఉన్నట్టు అని పాడుకుంటూ సినీ ప్రేమికులు సినిమా చూస్తుంటారు. అలాంటి సినిమా ఇప్పుడు మీరు ఎక్కే రైలులోకి వచ్చేసింది. అందుకు దారి తీసిన పరిస్థితులేంటో చూద్దాం. సాధారణంగా సినీ తారలు ప్రమోషన్ల కోసం లగ్జరీ కార్లు, చార్టర్డ్ విమానాలు లేదా ప్రత్యేక ఏర్పాట్లను ఎంచుకుంటారు. కానీ 'బిచ్చగాడు', 'బిచ్చగాడు 2'  ఫేమ్  హీరో విజయ్ ఆంటోనీ మాత్రం ఎప్పుడూ విభిన్నంగా ఆలోచించాడు. ఇటీవల విడుదలైన తన తాజా చిత్రం 'అప్పా కుట్టి' సినిమాను మరింత మంది సామాన్య ప్రేక్షకులకు చేరువ చేయడానికి ఆయన ఒక ఆసక్తికరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక సాధారణ ప్రయాణికుడిలా రైలు జనరల్ బోగీలో ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'అప్పా కుట్టి' చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్న వేళ, చిత్ర బృందంతో కలిసి విజయ్ ఆంటోనీ చెన్నై నుంచి కోయంబత్తూర్ వెళ్లే కోవై ఎక్స్‌ప్రెస్ రైలులోని అన్‌రిజర్వ్‌డ్ బోగీలో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో సహ ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించడం విశేషం. సాధారణ జనరల్ బోగీలో కూర్చుని ప్రజల మధ్యే తన సినిమా విశేషాలను, కథలోని ఆసక్తికర అంశాలను వారితో పంచుకున్నారు. సినీ హీరో తమ పక్కనే కూర్చుని సరదాగా మాట్లాడుతుండటంతో అక్కడి ప్రయాణికులు ఉత్సాహంతో ఆయనతో మాట్లాడారు, ఫోటోలు తీసుకున్నారు.   ముమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీతో పాటు ప్రీతి అస్రాని రోల్ లో కనిపించాడు. విడుదల కాకముందే ఈ సినిమా లాభాల బాట పట్టడం మరో విశేషంగా నిలిచింది. సాధారణ ప్రజల జీవితాలను ప్రతిబింబించే కథలతో ముందుకొచ్చే విజయ్ ఆంటోనీ, నిజ జీవితంలోనూ వారితో మమేకమయ్యే ప్రయత్నం చేయడం సినీ వర్గాల్లోనూ, నెటిజన్లలోనూ చర్చనీయాంశంగా మారింది. జనరల్ బోగీలో ఆయన ప్రయాణిస్తున్న దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారాయి. ఇది కూడా చదవండి: దృశ్యం 3 ఓటీటీ డేట్ వచ్చేసింది.. ఇండియన్ సినీ ప్రేమికులని ఏకం చేసేసింది!   ఈ రైలు ప్రయాణంలో తనకు ఎదురైన ఆసక్తికర అనుభవాలను, తోటి ప్రయాణికులతో జరిపిన సంభాషణలను విజయ్ ఆంటోనీ ఒక ప్రత్యేక ట్రావెల్ వ్లాగ్‌గా చిత్రీకరించారు. ఈ వ్లాగ్‌ను త్వరలోనే సోషల్ మీడియా వేదికలపై విడుదల చేయనున్నట్లు ఆయన టీమ్ వెల్లడించింది. అంతేకాకుండా, కోయంబత్తూర్‌లోని పలు థియేటర్లను సందర్శించి సినిమా చూస్తున్న ప్రేక్షకుల ప్రత్యక్ష స్పందనని తెలుసుకోవాలని కూడా ఆయన ప్లాన్ చేశారు.   సినిమా విడుదలైన తర్వాతి రోజు, నవంబర్ 21న ఈ ప్రమోషన్ వార్తలు బయటకు రావడంతో అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ప్రచారం కోసమే కాకుండా, అసలైన సినీ ప్రేమికులైన సాధారణ ప్రజల మనసుల్లోని మాటను వినడానికి ఆయన చేసిన ఈ ప్రయత్నం నిజంగా ప్రత్యేకమైనది. కోవై ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో సాగిన ఈ ప్రయాణం, విడుదలైన ట్రావెల్ వ్లాగ్ ద్వారా 'అప్పా కుట్టి' చిత్రానికి మరింత బజ్ తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. సరళత్వంతో కూడిన విజయ్ ఆంటోనీ ప్రమోషన్ స్టైల్ మరోసారి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటోంది మీకు నచ్చవచ్చు :థియేటర్లకి గ్రామీణ ప్రేక్షకులు దూరమయ్యారా? దగ్గరయ్యారా? మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార ఫస్ట్ డే కలెక్షన్స్! .  [Vijay Antony, Appa Kutty, Kovai Express, kollywood]  
భారతీయ సినీ ప్రేమికులని అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు ఏకతాటి పైకి తీసుకొస్తాయి. అలాంటి ఒక చిత్రమే దృశ్యం 3 . సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి  కేరాఫ్ అడ్రస్‌గా కూడా  నిలిచిన ' దృశ్యం 3: ఓటీటీలోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ  నెల  27 (శుక్రవారం) నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో  మిస్ అయిన ప్రేక్షకులతో పాటు, మరోసారి ఈ మైండ్ గేమ్‌ను ఇంట్లోనే చూడాలనుకునే సినీ అభిమానులకు ఇది నిజంగా పెద్ద పండుగ వార్త అనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన అధికారిక లిస్ట్‌లో 'కమింగ్ ఆన్ ఫ్రైడే' ట్యాగ్‌తో ఈ విడుదల తేదీని స్పష్టం చేయడంతో, ఓటీటీ విడుదలపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కగా అక్టోబర్ 2 న   థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. దాదాపు 100 కోట్ల నుంచి  110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి తొలి రోజే  66.75 కోట్ల భారీ వసూళ్లతో సంచలన ఆరంభాన్ని అందుకుంది. తొలి వారంలోనే ఇండియా నెట్ కలెక్షన్లు 245.50 కోట్లకు చేరుకున్నాయి. పూర్తి రన్‌లో ఈ చిత్రం భారత్‌లో రూ. 380 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 590 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి అజయ్ దేవగన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, ఈ ఏడాది బాలీవుడ్‌లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. ఇది కూడా చదవండి: థియేటర్లకి గ్రామీణ ప్రేక్షకులు ఎందుకు దూరమయ్యారు?  మొదటి రెండు భాగాలు మలయాళ 'దృశ్యం' సిరీస్‌కు రీమేక్‌లుగా రాగా, ఈ మూడో భాగం మాత్రం సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టింది. విజయ్ సల్గావ్కర్ పాత్రలో అజయ్ దేవగన్ తన తెలివితేటలు, సమయస్ఫూర్తితో కుటుంబాన్ని కాపాడుకునే తీరు మరోసారి హైలైట్‌గా నిలిచింది. సామ్ దేశ్‌ముఖ్ హత్య కేసు మళ్లీ తెరపైకి రావడం, కొత్త ఆధారాలతో రంగంలోకి దిగిన ఎస్పీ రాజ్‌వీర్ సింగ్ తోమర్ (జైదీప్ అహ్లావత్)తో మీరా దేశ్‌ముఖ్ (తబు) చేతులు కలపడం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. శ్రియా శరణ్, ఇషితా దత్తా, రజత్ కపూర్ వంటి నటులు కీ రోల్స్ లో  మెరిశారు. https://x.com/OTT_Trackers/status/2124002252079898747 ఈ సందర్భంగా ప్రేక్షకులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అజయ్ దేవగన్ నటించిన హిందీ 'దృశ్యం 3: ద కన్‌క్లూజన్' నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుండగా, మోహన్ లాల్ నటించిన మలయాళ 'దృశ్యం 3' మాత్రం జూన్ 18, 2026 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. రెండు చిత్రాలకు ఒకే ఫ్రాంచైజీ పేరు ఉన్నప్పటికీ, తారాగణం మరియు ఓటీటీ వేదికలు వేరువేరు. అందువల్ల వెతికేటప్పుడు పొరబడకుండా సరైన మూవీని ఎంచుకోవడం మంచిది .ఆల్ ది బెస్ట్.   మీకు నచ్చవచ్చు :ఆ సినిమాకి  కలెక్షన్లు ఎందుకు రావడం లేదు! మీకు నచ్చవచ్చు: అలియాస్ రుక్మిణి నితిన్ కి ఏ గిఫ్ట్ ఇవ్వబోతుంది!   [ Drishyam 3, Ajay Devgn, Tabu,Sriya, Bollywood]
సాధారణంగా ఇంట్లో పొట్లకాయ కూర అనగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. కానీ అదే పొట్లకాయకు పచ్చిశనగపప్పు తోడైతే ఆ రుచి ఎక్కడికో వెళ్లిపోతుంది. ఒకసారి ఈ పద్ధతిలో పొట్లకాయ పచ్చిశనగపప్పు కూర వండితే మాంసం కూరలను కూడా మర్చిపోవాల్సిందేనన్నంత అద్భుతమైన రుచి సొంతమవుతుంది. వేడివేడి అన్నం, చపాతీ, లేదా రోటి దేనిలోకి తిన్నా ఈ కూర అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కూర కావాలనిపించేలా చేసే ఈ వంటకం మన వంటింట్లో ఉండే సాధారణ దినుసులతోనే సులభంగా సిద్ధమవుతుంది. కేవలం 5 దశల్లో ఈ వంట విధానాన్ని పూర్తి చేయవచ్చు. ఈ కూర రుచికి అసలు పునాది పచ్చిశనగపప్పును సరిగ్గా ఉడికించడంలోనే ఉంది. ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పును తీసుకుని, తగినన్ని నీళ్లు మరియు కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పప్పును మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా ఒక మాదిరిగా గింజ చెదరకుండా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇలా మధ్యస్థంగా ఉడికిన పప్పు పొట్లకాయ ముక్కలతో కలిసినప్పుడు కూరకు ప్రత్యేకమైన పోకడ, రుచి వస్తాయి. తాలింపు వేసే విధానం కూర ఘుమఘుమలకు ప్రాణం పోస్తుంది. పాన్‌లో నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మరియు శనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఈ తాలింపు గింజలు చక్కగా వేగిన వెంటనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు లేత బంగారు రంగు వచ్చేవరకు ఓపికగా వేపుకుంటే కూరకు సహజమైన తీపి, కమ్మదనం చేరుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి అవి బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు గుజ్జులా మగ్గాక, అందులో నాలుగు పొట్లకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరియు కారం వేసి బాగా కలపాలి. మసాలాలు, ఉప్పు, కారం పొట్లకాయ ముక్కలకు చక్కగా పట్టేలా కలిపితే ప్రతి ముక్కా రుచిగా మారుతుంది. ఇది కూడా చదవండి:రోజూ ఉదయం, ఇలా పసుపు నీళ్లు తాగితే. చర్మం మెరిసిపోవడంతో పాటు బోలెడు లాభాలు! ఇప్పుడు మూత పెట్టి సన్నని మంటపై పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు బాగా ఉడికించాలి. పొట్లకాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిశనగపప్పును ఇందులో కలపాలి. పప్పు వేసిన తర్వాత కూరను మరో 4 నిమిషాలు సిమ్‌లో ఉంచి దించేయాలి. ఆ 4 నిమిషాల సమయం పప్పు, కూర కలిసిపోవడానికి ఎంతో కీలకం. చివరగా తాజా కొత్తిమీర చల్లి దింపేస్తే ఘుమఘుమలాడే పొట్లకాయ పచ్చిశనగపప్పు కూర సిద్ధం. తక్కువ శ్రమతో, తక్కువ సమయంలోనే ఇంటిల్లిపాదికీ నచ్చే ఈ కూరను తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆంధ్ర రుచుల ఇష్టపడేవారికి ఇది ఖచ్చితంగా ఫేవరెట్ డిష్‌గా నిలిచిపోతుంది. మీకు నచ్చవచ్చు:ఆముదం ఆకుల, రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు! ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!                                    రోజ్ వాటర్ తో, మీ చర్మం మెరిసిపోవాలంటే, ఇలా ట్రై చేయండి!       Potlakaya Senagapappu Kura, Snake Gourd Chana Dal Curry, Andhra Veg Curries, Traditional Telugu Recipes, Vegetarian Meat Alternative, Healthy Lunch Curry, Cooking Recipes In Telugu.  
చలికాలం రాగానే వాతావరణంలో చలిగాలులు పెరిగి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరినీ జలుబు, దగ్గు, కఫం సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో వచ్చే సాధారణ దగ్గు కూడా కొన్నిసార్లు త్వరగా తగ్గకుండా రోజుల తరబడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా గొంతు గరగర, ముక్కు కారడం, ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు మందులపైనే కాకుండా మన ఇంట్లో సులభంగా దొరికే సహజ పదార్థాలతో కూడిన సాంప్రదాయ ఇంటి చిట్కాలపై కూడా దృష్టి పెట్టడం ఎంతో మేలు చేస్తుంది. మన పెద్దలు తరతరాలుగా పాటిస్తున్న ఇంటి వైద్యంలో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. దగ్గులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి; అవి పొడి దగ్గు మరియు కఫంతో కూడిన దగ్గు. ఈ రెండు రకాల దగ్గులను అదుపులోకి తీసుకురావడానికి మన వంటగదిలో ఉండే పదార్థాలే చక్కగా పనిచేస్తాయి. కఫంతో కూడిన దగ్గుతో బాధపడేవారికి తమలపాకు, తేనె కలయిక ఒక అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తుంది. ఒక తాజా తమలపాకు తీసుకుని దాని తొడిమను తీసేసి, ఆకుపై ఒక స్పూన్ తేనె బాగా రాసి మడత పెట్టుకుని నెమ్మదిగా నమిలి రసాన్ని మింగాలి. ఇలా వరుసగా 2 రోజుల పాటు చేస్తే ఛాతీలో పేరుకుపోయిన కఫం కరిగి, దగ్గు నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు కరక్కాయ మరియు లవంగాలు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. కరక్కాయను చిన్నగా దంచి, అందులో ఒక చిన్న ముక్కను పంటి కింద పెట్టుకుని మెల్లిగా నములుతూ రసాన్ని మింగడం వల్ల గొంతులోని చికాకు తగ్గుతుంది. ఇలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తీసుకుంటే పొడి దగ్గు నుంచి మంచి ఊరట కలుగుతుంది. అలాగే పొడి దగ్గు ఉన్నప్పుడు 2 లవంగాలను పంటి కింద ఉంచుకుని నెమ్మదిగా నములుతూ రసం మింగడం కూడా గొంతుకు హాయిని ఇస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్ లేదా మంట అనిపించినప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు. కఫం త్వరగా బయటకు రావడానికి తేనె, లవంగాల పొడి చిట్కా కూడా ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. అర టేబుల్ స్పూన్ తేనెలో తాజాగా దంచి పెట్టుకున్న లవంగాల పొడిని కలిపి తీసుకుంటే కఫం కరిగి దగ్గు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ చిట్కాను వరుసగా 2 నుంచి 3 రోజుల పాటు పాటిస్తే దగ్గు, జలుబు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల కలిగే గొంతు నొప్పి, శ్వాసకోశ అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి ఈ సహజ పద్ధతులు సులభంగా ఆచరించదగినవిగా ఉంటాయి. ఇది కూడా చదవండి:ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర! చిన్నపిల్లల విషయంలో దగ్గు, జలుబు కనిపించినప్పుడు మరింత జాగ్రత్తగా సహజ నివారణలను ఎంచుకోవాలి. ఒక స్పూన్ తులసి ఆకు రసంలో 2 నుంచి 3 చుక్కల తేనె కలిపి ఉదయాన్నే పిల్లలకు తాగిస్తే జలుబు, దగ్గు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఏడాది లోపు శిశువులకు తేనె ఇవ్వకూడదనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అలాగే చిన్నపిల్లలకు లేదా ఎవరికైనా దగ్గు, జలుబు ఎక్కువ రోజులు కొనసాగినా, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అత్యంత అవసరం. మొత్తంగా చూస్తే, చలికాలంలో వచ్చే దగ్గు, కఫం, జలుబు సమస్యలను ఎదుర్కోవడానికి తమలపాకు, తేనె, లవంగాలు, కరక్కాయ, తులసి మరియు గోరువెచ్చని ఉప్పు నీరు వంటి సాంప్రదాయ ఇంటి చిట్కాలు మన పెద్దలు అందించిన విలువైన ఆయుర్వేద జ్ఞానం. సరైన మోతాదులో, క్రమం తప్పకుండా వీటిని పాటించడం ద్వారా సహజంగానే ఉపశమనం పొందవచ్చు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఈ చలికాలంలో దగ్గు, జలుబు బారి నుంచి మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. మీకు నచ్చవచ్చు:ముఖంపై, మచ్చలు పోవాలంటే పచ్చి ,పాలను ఇలా రాయండి!                               ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!         Betel Leaf For Cough And Cold, Tamalapaku Home Remedies, Winter Cold Remedies, Elders Health Tips, Natural Cough Relief, Traditional Home Remedies, Health Tips In Telugu.
చలికాలం రాగానే భుజాలపై తెల్లని పొట్టు రాలడం, తలలో తీవ్రమైన దురద, పదేపదే గోకాలనిపించడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ఉష్ణోగ్రతలు పడిపోగానే చుండ్రు అకస్మాత్తుగా మొదలవ్వడం లేదా మరింత తీవ్రంగా మారడం మనం తరచూ చూస్తుంటాం. చలి గాలి వల్ల తల చర్మం పొడిబారిపోతోంది కాబోలు అని చాలా మంది సులభంగా ఊహించేసుకుంటారు. కానీ తలలో పొట్టు రాలడానికి ప్రతిసారీ ఒకే కారణం ఉండదు. కొన్ని సందర్భాల్లో సాధారణ చుండ్రులా కనిపించేది నిజానికి సెబోర్రెయిక్ డెర్మటైటిస్ (Seborrhoeic Dermatitis) అనే వాపు సంబంధిత చర్మ సమస్య కావచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ రెండు సమస్యలకు చికిత్స విధానాలు వేర్వేరుగా ఉంటాయి. గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ డెర్మటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రూబెన్ భాసిన్ పాసి వివరాల ప్రకారం, తల చర్మంలో తేమ స్థాయి బాగా తగ్గిపోయినప్పుడు సాధారణంగా డ్రై స్కాల్ప్ లేదా పొడి తల చర్మం ఏర్పడుతుంది. చల్లని వాతావరణం, గాలిలో తక్కువ తేమ, ఘాటైన షాంపూలతో తరచూ తలస్నానం చేయడం, ఎక్కువసేపు వేడి నీటిని వాడటం వంటివి ఈ పొడిబారడానికి దారితీస్తాయి. ఇలాంటప్పుడు వచ్చే పొట్టు చాలా చిన్నదిగా, తెల్లగా, పౌడర్‌లా ఉంటుంది మరియు తల చర్మం బిగుతుగా లేదా స్వల్ప దురదతో అనిపిస్తుంది. డ్రై స్కాల్ప్ ఉన్నవారికి శరీరంలోని ఇతర భాగాల చర్మంపై కూడా పొడిబారడం కనిపించవచ్చు. మరోవైపు, సాధారణ చుండ్రు అనేది చర్మంపై సహజంగా ఉండే మలాసెజియా (Malassezia) అనే ఈస్ట్ అధికంగా పెరగడం లేదా దాని పనితీరు మారడంతో ముడిపడి ఉంటుంది. ఈ ఈస్ట్ చర్మంలోని నూనెలో ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. కొందరిలో ఈ ఈస్ట్, చర్మపు నూనెలు మరియు శరీరంలోని వాపు ప్రతిస్పందన కలిసినప్పుడు చర్మ కణాలు వేగంగా రాలిపోయి స్పష్టమైన పొట్టు, దురద ఏర్పడతాయి. ఈ సమస్య మరింత వాపుతో, దీర్ఘకాలం పాటు కొనసాగితే దానిని సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌గా నిర్ధారిస్తారు. సాధారణ పొడి తల చర్మానికి భిన్నంగా, సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌లో ఎరుపు రంగు, చికాకు మరియు కొంచెం జిడ్డుగా ఉండే తెలుపు లేదా లేత పసుపు రంగు పొట్టు కనిపించవచ్చు. ఇది తల చర్మం దాటి కనుబొమలు, ముక్కు పక్క భాగాలు, చెవుల వెనుక మరియు కొన్నిసార్లు ఛాతీపై కూడా ప్రభావం చూపవచ్చు. చలికాలంలో తక్కువ తేమ మరియు చల్లని ఉష్ణోగ్రతలు పొడిబారడాన్ని పెంచుతాయి, అలాగే హెయిర్ కేర్ అలవాట్లలో మార్పులు, ఒత్తిడి, అనారోగ్యం మరియు హార్మోన్ల ప్రభావాలు సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌ను మరింత తీవ్రతరం చేయవచ్చు. ఇది కూడా చదవండి:వింటర్ డైట్: చలికాలంలో బరువు తగ్గడానికి, పాటించాల్సిన సులువైన మార్గాలు! చాలా మంది చేసే సాధారణ తప్పులలో ఒకటి ప్రతి రకమైన పొట్టుకు మందపాటి హెయిర్ ఆయిల్స్ రాయడం. నూనె రాయడం వల్ల పొడి జుట్టు కొంత మృదువుగా అనిపించవచ్చు కానీ, సెబోర్రెయిక్ డెర్మటైటిస్ ఉన్న తల చర్మంపై ఎక్కువ నూనె నేరుగా రాస్తే కొందరిలో లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్ పాసి స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ సమస్యకు తల చర్మంలోని నూనె మరియు మలాసెజియా ఈస్ట్‌తో దగ్గరి సంబంధం ఉంటుంది. అందువల్ల పొట్టు స్వభావాన్ని, దురద తీవ్రతను మరియు వాపు లక్షణాలను గమనించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ డ్రై స్కాల్ప్ కోసం మైల్డ్ షాంపూ వాడటం, మరీ వేడి నీటిని నివారించడం, ఘాటైన ఉత్పత్తులను తగ్గించడం మరియు తల చర్మ అవసరానికి తగ్గట్టుగా తలస్నానాల వ్యవధిని సర్దుబాటు చేయడం మేలు చేస్తుంది. చుండ్రు మరియు సెబోర్రెయిక్ డెర్మటైటిస్ కోసం కెటోకొనజోల్ (Ketoconazole), సెలీనియం సల్ఫైడ్ (Selenium Sulphide) లేదా జింక్ పైరిథియోన్ (Zinc Pyrithione) వంటి యాంటీ ఫంగల్ మరియు మెడికేటెడ్ షాంపూలను సూచించవచ్చు. వీటిని తలకు పట్టించిన వెంటనే కడిగేయకుండా నిర్దేశించిన సమయం పాటు ఉంచి కడగాలి, లేదంటే వాటి ప్రభావం తగ్గుతుంది. దురద భరించలేనంతగా ఉన్నా తలను పదేపదే గట్టిగా గోకడం వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది, అలాగే తీవ్రమైన ఎరుపు, వాపు, మందపాటి ప్యాచెస్, నొప్పి లేదా జుట్టు రాలడం గమనిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం అత్యవసరం. మీకు నచ్చవచ్చు:మాయిశ్చరైజర్‌లో, SPF ఉంటే సరిపోతుందా? అసలు నిజాలు ఇవే!                                   ఉడికించిన అలసందలు తింటే, శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!       Winter Dandruff, Hair Oil And Dandruff, Winter Hair Care Mistakes, Scalp Flakes Treatment, Dermatologist Hair Advice, Dandruff Tips In Winter, Health Tips In Telugu.
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవిగా కనిపించినప్పటికీ ఎన్నో పోషక విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. వీటిలో సమృద్ధిగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids), డైటరీ ఫైబర్ (Dietary Fiber), ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా కీళ్ల ఆరోగ్యం, మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్థకు అవిసె గింజలు ఎలాంటి మేలు చేస్తాయి? వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి సమస్యలు ఉన్నవారికి అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉపయోగపడతాయి? శరీరంలో వాపు (Inflammation) తగ్గించడంలో వీటికి ఉన్న పాత్ర ఏమిటి? వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుకోవడానికి అవిసె గింజలు ఎలా తోడ్పడతాయి? వీటిలోని పోషకాలు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయి? అనే విషయాలను తెలుసుకుందాం. అంతేకాకుండా అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది? మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి? కొలెస్ట్రాల్ నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి అవిసె గింజలు ఎలా సహాయపడతాయి? వంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈ వీడియోలో వివరించారు. అయితే అవిసె గింజలను పచ్చిగా తినాలా? వేయించి తీసుకోవాలా? పొడి చేసుకుని తీసుకోవడం మంచిదా? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు అవిసె గింజలను తీసుకోవచ్చా? థైరాయిడ్ మందులు వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అందరూ వీటిని తీసుకోవచ్చా? ఎవరు ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి? అనే సందేహాలకు కూడా సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మగారు అవిసె గింజల్లోని పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు, తీసుకునే సరైన పద్ధతి, తగిన మోతాదు, తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేశారు. మరి గుప్పెడు అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి? కీళ్ల ఆరోగ్యం నుంచి మెదడు పనితీరు వరకు వీటి ప్రయోజనాలు ఏమిటి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని ఎలా తీసుకోవాలి? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి.
రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకుంటున్నారో తెలుసా? ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లకు ఆరోగ్యం గురించి, వాకింగ్ గురించి చెప్పగానే మొదట గుర్తొచ్చే మాట  సమయం లేదని చెప్పడం. రోజు ఒక గంట వ్యాయామం చేయండి, కడుపునిండా నిద్ర పోండి, సమయానికి ఆహారం తినండి అని చెప్పడం సులువే కానీ, పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని ఒత్తిడిలో ఉన్న మనిషికి అది ఎంతవరకు సాధ్యం?  చాలామంది  ఇదే విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. కానీ సమయం లేకపోవడం లేదా చేయలేకపోతున్నామని సాకులు చెప్పుకోవడం మాని,  చేతులు ముడుచుకుని కూర్చోకుండా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టవచ్చు. వ్యాయామం అంటే రోజుకు ఒక గంట తప్పనిసరిగా కేటాయిస్తేనే లాభం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా రోజుకు పది నిమిషాల నడకతో మొదలుపెట్టినా చాలు. వీలు కుదిరినప్పుడల్లా చిన్న చిన్న విడతలుగా నడవడం, నెమ్మదిగా వారానికి కనీసం నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం లాంటి వ్యాయామం అందేలా చూసుకోవాలి. పని మధ్యలో కాసేపు లేచి కదలడం, తినే ఆహారం గురించి ముందే చిన్న ప్లానింగ్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా వ్యాయామం కోసం ఉన్న కొద్దిపాటి నిద్రను మాత్రం తగ్గించుకోకూడదు.                                                                                                                                                 *రూపశ్రీ.
మన శరీర ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం ఎంతైనా అవసరం. పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరిగి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఫైబర్ లేదా పీచు పదార్థం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సరైన పీచు పదార్థాలు తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవడంతోపాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా డవలప్ అవ్వడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. జామ.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే జామకాయ ద్వారా సుమారు ఐదు నుంచి ఆరు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కరిగే మరియు కరగని.. రెండు  రకాల పీచు పదార్థాలు  సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ సజావుగా సాగేలా సహాయపడటంతోపాటు కడుపు నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. రాస్స్ బెర్రీస్.. రాస్స్ బెర్రీస్ పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక కప్పు రాస్స్ బెర్రీస్ లో దాదాపు ఎనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కరగని పీచు పదార్థం పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!​ చియా గింజలు.. చియా గింజలలో పీచు పదార్థం చాలా మెరుగ్గా ఉంటుంది. కేవలం రెండు టీస్పూన్ల చియా గింజల ద్వారా సుమారు పది గ్రాముల పీచు లభిస్తుంది. ఇవి కడుపులోకి వెళ్లిన తర్వాత ఒక జెల్ లాంటి రూపంలో తయారవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. నల్ల మినప్పప్పు.. మన దేశంలో సులభంగా లభించే పొట్టుతో కూడిన మినుములు లేదా నల్ల మినపప్పు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన ఒక కప్పు మినపప్పులో దాదాపు పదహారు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కూడా కరిగే , కరగని పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల పేగుల కదలికలు సజావుగా సాగి జీర్ణశక్తి మెరుగవుతుంది. వేయించిన శనగలు.. వేయించిన శనగలు పీచు పదార్థాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రతి వంద గ్రాముల వేయించిన శనగలలో సుమారు పదిహేడు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో పీచుతో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.                                                                                                                                            *రూపశ్రీ మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..                                  విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..!