LATEST NEWS
ఆ సాయంత్రం... రాక్సీలో నార్మా షేరర్‌, బ్రాడ్వేలో కాంచనమాల; ఎట కేగుటో సమస్య తగిలిం దొక విద్యార్థికి! ఇవి మహాకవి శ్రీశ్రీ రాసిన సంధ్యా సమస్యలు కవితలోని పంక్తులు.. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సమస్యే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఎదుర్కొన్నారు. నారా లోకేష్.. యువతలో, అలాగే సోషల్ మీడియా ట్రెండ్స్ తో  ఎప్పుడూ టచ్ లో ఉండే లోకేష్  తాజాగా.. టీనేజర్లు, యువతతో ఓ సరదా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా  తమదైన శైలిలో  లోకేష్‌ను సరదా ప్రశ్నలతో టీజ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే యువత ప్రశ్నలకు లోకేష్ వారి కంటే సరదాగా.. ఎదురు వారినే టీజ్ చేసేలా ఆసక్తికర సమాధానాలిచ్చారు.  ఈ క్రమంలోనే లోకేష్ అత్యంత క్లిష్టమైన, అంతకు మించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదుర్కొన్నారు.  అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్..  అలాగే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు. పైకి సరదాగా కనిపించినా.. ఈ ప్రశ్న రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్న ప్రశ్నగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్.. నందమూరి వంశానికి చెందిన స్టార్ హీరో.  ఈ ఇరువురిలో ఏ ఒకరి సినిమా ముందుగా చూస్తానని లోకేష్ చెప్పినా దానికి రాజకీయ రంగు పులమడానికి ఆయన ప్రత్యర్థులు రెడీగా ఉంటారు. అయితే వారికి అటువంటి అవకాశం ఇసుమంతైనా ఇవ్వకుండా లోకేష్ సమయస్ఫూర్తితో లౌక్యంగా ఇద్దరి సినిమాలూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. యూత్ సరదా ప్రశ్నకు లోకేష్ ఇచ్చిన స్మార్ట్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది.  ఇది ఒక్కడే కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దేశ ప్రధానిగా  చూడాలనుకుంటున్నారా,  రాష్ట్రపతిగా చూడాలని ఉందా అన్న ప్రశ్నకు లోకేష్ అనితర సాధ్యమైన రీతిలో..  ఆ రెండు పదవులు కాకుండా, చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ఉంటూ, తాను ఎల్లప్పు డూ చేసే విధంగానే నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపించడమే తనకు ఇష్టమని బదులిచ్చారు.  ఇక ఆహారంలో తనకు రాగి సంకటి అత్యంత ఇష్టమని లోకేష్ చెప్పారు. పొలిటికల్ గా 2029 ఎన్నికలలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో భారీ విజయాన్ని సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.  
  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం మరియు పాలనపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం, వ్యవసాయ రంగంలో రైతుల అవస్థలు ఈ చర్చల్లో ప్రధానాంశాలుగా మారాయి. ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమవుతోందా, లేక నిజమైన మార్పు కోసం అడుగులు వేస్తోందా అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు లోతుగా పరిశీలిస్తున్నారు. కేవలం అప్పుల ద్వారా పథకాలను అమలు చేయడం తప్ప, శాశ్వత సంపద సృష్టి జరగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఈ అంశాలపై  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ‘తెలుగువన్ వాస్తవ వేదిక’లో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ తన అభిప్రాయలు వ్యక్తం చేశారు. రాజకీయ వ్యూహాలు మరియు వాటి అంతరార్థాలురాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులే రాజకీయ నాయకులుగా చలామణి అవుతుండటంతో ప్రభుత్వ విద్యా విధానంలో ఆశించిన మార్పులు రావడం లేదనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ బడులు లేదా ఆసుపత్రులు బాగుపడితే ప్రైవేట్ వ్యాపారాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదా తాము ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడం వంటివి కేవలం ప్రజల కళ్లకు పొరలు కమ్మే వ్యూహాత్మక చర్యలుగానే కనిపిస్తున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పూ రావడం లేదు.  దాదాపు అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు, బ్లాక్‌బోర్డులు లేని దుస్థితి ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద కొన్ని స్కూళ్లను బాగు చేసినంత మాత్రాన మొత్తం విద్యా వ్యవస్థ మారదని, దీనికి బలమైన విధానపరమైన నిర్ణయాలు అవసరమని స్పష్టమవుతోంది.మరోవైపు, వ్యవసాయ రంగంలో కూడా ఇదే విధమైన వ్యూహాత్మక వైఫల్యం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా బియ్యం ధరలు బాగున్నప్పటికీ, రాష్ట్రంలో రైతులు మాత్రం ధాన్యం అమ్ముకోవడానికి గోనె సంచుల దగ్గర నుండి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థల మందకొడితనం వల్ల రైతులు దళారులను, మిల్లు యజమానులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది. ఇది సంపదను సృష్టించడం కాదు, శ్రమను దోపిడీ చేయడమే అవుతుంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంత కాలం గడుస్తున్నా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా నిర్దిష్టమైన ప్రణాళికలు కనిపించడం లేదు. రాబోయే కాలంలో ఈ వైఫల్యాలు ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సవాలుగా మారే ప్రమాదం ఉంది. సంక్షేమ పథకాలైన పెన్షన్లు, అమ్మవడి వంటివి ఓట్ల పరంగా తాత్కాలికంగా మేలు చేసినప్పటికీ, ఉపాధి కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదల, నాణ్యమైన వైద్యం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చలేకపోతే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాబోయే మూడేళ్ల కాలం కూటమి ప్రభుత్వానికి అత్యంత కీలకం. ఈ లోగా విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో వ్యవస్థాగత మార్పులు తీసుకురాకపోతే, భవిష్యత్తు ఎన్నికల్లో అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంత సులువు కాకపోవచ్చు. అంశాలపై కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.  
 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జాడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే.. ఇప్పడు కాదు.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.  సోమవారం (జూన్ 29) భీమవరంలోని తన కార్యాలయంలో  మీడియతో మాట్లాడిన ఆయన..  జడ శ్రవణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలను  ఖండించారు. తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందన్న ఆయన,  రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఒకవేళ ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకోకపోయినా, తనపై ఉన్న అభిమానంతో ఎవరో ఒకరు తప్పకుండా ఫిర్యాదు చేస్తారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఇక తాను ఫిర్యాదు చేయాల్సి వస్తే.. ఇప్పుడు చేయబోనని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణం రాజు చెప్పారు. రాష్ట్ర హోంమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపడతారని ఆయనీ విధంగా హింట్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర హోంమంత్రిగా తాను ఉంటే.. రాష్ట్రంలో...
ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో హోం మంత్రి మార్పు జరగనుందా?  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్ర హోంమంత్రిగా  బాధ్యతలు చేపట్టనున్నారా అంటే.. రాజకీయవర్గాలు ఔననే అంటున్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నాయి.   అసలీ చర్చకు మూలం ఏమిటంటే.. గత వారం ఒక బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..  రాష్ట్రంలో నేరగాళ్లు చాలా అదృష్టవంతులన్నారు.  తాను రాష్ట్ర హోం మంత్రి కాకపోవడం వల్లే నేరస్థఉలు   స్వేచ్ఛగా తిరుగుతున్నారనీ,   ఒకవేళ తానే గనుక హోం మంత్రిని అయి ఉంటే నేరగాళ్ల ఆటలు సాగేవి కావని పవన్ అన్నారు. పవన్ మాటలు అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి.  ఇక పవన్ వ్యాఖ్యలపై తాజాగా డిప్యూటీ స్పీకర్  రఘురామకృష్ణ రాజు స్పందిస్తూ..  పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడరనీ, ఆయన తాను హోంమంత్రిని అయితే.. అంటూ పవన్ అన్నారంటూ.. ఆయన  ఆ పదవి చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లేనంటూ రఘురామకృష్ణం రాజు అన్నారు.  దీంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హోంమంత్రిగా పవన్ కల్యాణ్ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారన్న సమాచారం నేపథ్యంలో హోంమంత్రి మార్పు తథ్యమన్న చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది.   పవన్ కళ్యాణ్ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే..  ఆయన  దూకుడు,  పారదర్శకమైన శైలి కారణంగా రాష్ట్ర శాంతిభద్రతల విభాగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పరిశీలకులు అంటున్నారు.  ఆయన చూపే చొరవ రాష్ట్రంలో నేర నియంత్రణకు నిస్సందేహంగా దోహదపడుతుం దని అంటున్నారు.   హోం శాఖ వంటి అత్యంత సున్నితమైన,  కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహించడానికి అవసరమైన ఓర్పు పవన్ కు ఉందా అన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జరుగుతోంది.  
  తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చెన్నైలో నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో ఏఐఏడీఎంకే మాజీ మంత్రి బెంజమిన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదని స్టాలిన్ ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సి ఉండగా, అధికార పక్షానికి కేవలం 108 మంది సభ్యుల బలమే ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని అన్నారు. గత కొన్ని నెలలుగా తమిళనాడులో అభివృద్ధి మందగించిందని స్టాలిన్ ఆరోపించారు. శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు, పెట్రోల్ బాంబు దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల విషయంలో వెనుకంజ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రకటన కోసం ఎదురుచూడకుండా, ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని, డీఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్టాలిన్ సూచించారు. మరోవైపు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తమిళనాడు పాలన నేడు గాడితప్పిందని వ్యాఖ్యానించారు. ప్రజలు తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలకే పరిమితమైందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించే వేదికలుగా కాకుండా, రాజకీయ ప్రదర్శనల వేదికలుగా మారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.  
ALSO ON TELUGUONE N E W S
Days after a video of his altercation with a food delivery partner went viral, Raju Weds Rambai actor Akhil Raj has issued a clarification, saying the incident has been presented without its full context. In a video shared on his Instagram account, Akhil denied claims that he assaulted the delivery executive over a wrong food order for no reason. According to the actor, the delivery partner was allegedly under the influence of alcohol and verbally abused his mother during the argument. Akhil claimed that he reacted only after hearing the abusive remarks, stating that he could not remain silent when his mother was insulted. He also stated that he did not attack him but his family panicked that the person is making a video and he should let it go. The actor further explained that his residence has frequently received incorrect food deliveries because of confusion caused by another address in the locality. He said the recurring issue has led to several misunderstandings with delivery personnel. He remarked that he also did delivery partner jobs earlier in his life and he is not irresponsible. He mentioned that he has gone to police regarding the issue. Responding to criticism on social media, Akhil urged people not to judge him based solely on the viral clip. He said many have branded him arrogant and self-centred without hearing his side of the story. The actor appealed to the public to consider the complete context before forming an opinion. While Akhil has now shared his version of events, the controversy continues to generate debate online, with social media remaining divided between those supporting the delivery partner and those who believe the actor deserves to have his explanation heard before conclusions are drawn. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.     https://www.instagram.com/reel/DaNGQ7pvUVj
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రాంతీయ భాషల సరిహద్దులు పూర్తిగా చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో పాన్ ఇండియా క్రేజ్ సాధించిన దక్షిణాది సినిమా, ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మలయాళ చిత్ర పరిశ్రమ ఇప్పుడు తన వ్యాప్తిని మరింతగా విస్తరిస్తోంది. వైవిధ్యమైన కథలు, సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ దర్శకులు ఇప్పుడు తమ సినిమాల్లోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను దించుతున్నారు. గడిచిన కొద్ది కాలంలోనే బాలీవుడ్‌కు చెందిన టాప్ క్రేజీ భామలు మలయాళ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు భారతీయ సినీ వర్గాల్లో ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రెండ్‌కు బలమైన పునాది వేస్తూ కన్నడ స్టార్ యాష్ హీరోగా గీతూ మోహన్ దాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్' చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. దాదాపు ₹850 కోట్ల నుండి ₹1000 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ఖరీదైన చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో కియారాతో పాటు హుమా ఖురేషి, తారా సుతారియా వంటి బాలీవుడ్ భామలు కూడా కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. మలయాళ దర్శకురాలైన గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో మలుస్తుండటంతో ఉత్తరాది నటీనటులు కూడా మాలీవుడ్ మేకర్స్ పనితనానికి ఫిదా అవుతున్నారు. కేవలం భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా, వైవిధ్యమైన కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలలో నటించడానికి కూడా బాలీవుడ్ హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ విప్లవం తర్వాత మలయాళ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న అపూర్వ ఆదరణే ఈ భారీ మార్పుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సబ్‌టైటిల్స్ సంస్కృతి పెరిగిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కంటెంట్‌ను ఆదరిస్తుండటంతో, బాలీవుడ్ భామలు సైతం తమ నటనకు స్కోప్ ఉన్న పాత్రల కోసం మాలీవుడ్ వైపు చూస్తున్నారు. సౌత్ సినిమా మార్కెట్ భారీగా విస్తరించడం, ఇక్కడి సినిమాల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల వారు ఇక్కడి ప్రాజెక్టులను అంగీకరిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లు కేవలం మలయాళ మార్కెట్‌ను పెంచడమే కాకుండా, బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మాలీవుడ్ కంటెంట్‌కు మరింత దగ్గర చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో ఈ పాన్ ఇండియా విస్తరణ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫుడ్ డెలివరీ బాయ్ పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్ దాడి చేశాడంటూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డెలివరీ బాయ్స్‌ ఎదుర్కొంటున్న కష్టాలను, వారిపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ టాలీవుడ్ నటుడు నరేశ్ విజయకృ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ప్రముఖులు లేదా సెలబ్రిటీలు ఈ తరహా విషయాల్లో పాలుపంచుకున్నప్పుడు మాత్రమే ఇవి వార్తల్లో నిలుస్తున్నాయని, కానీ తెరవెనుక ఎంతోమంది సామాన్య డెలివరీ పార్ట్‌నర్స్‌పై జరుగుతున్న దాడులు ఎవరికీ తెలియకుండా కనుమరుగైపోతున్నాయని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో ఉన్నప్పుడు లేదా ఏదైనా అర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్డర్ ఆలస్యమైతే కస్టమర్ల సహనం నశించడం సహజమే కావచ్చు, కానీ అదే సమయంలో డెలివరీ పార్ట్‌నర్స్ పడే కష్టాన్ని కూడా మనం గుర్తించాలని ఆయన కోరారు. ఒక పూట నిజాయితీగా జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం వారు ట్రాఫిక్, భారీ వర్షాలు, మండే ఎండలు, రోడ్డు ప్రమాదాల వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తారని గుర్తుచేశారు. కేవలం కొద్ది నిమిషాల ఆలస్యం కోసం ఒకరి గౌరవాన్ని, ప్రాణాల రక్షణను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని నరేశ్ ప్రశ్నించారు. కోపానికి ప్రాధాన్యత ఇవ్వకుండా సాటి మనుషుల పట్ల కాస్త మానవత్వాన్ని, సానుభూతిని చూపించాలని ఆయన కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. గౌరవం ఇవ్వడానికి ఎటువంటి ఖర్చు కాదని, కానీ మానవత్వం అనేది వెలకట్టలేనిదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో స్విగ్గీ, జొమాటో వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా తమ ఫ్రంట్‌లైన్ కార్మికులను రక్షించడానికి, వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డెలివరీ పార్ట్‌నర్స్‌ రక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ #RespectDeliveryPartners & #HumanityFirst వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో నరేశ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సమాజంలో ఒక కొత్త చర్చకు తెరలేపింది.   https://x.com/ItsActorNaresh/status/2071843079343198458
Raju Weds Rambai actor Akhil Raj has landed in controversy after a video of his heated altercation with a food delivery executive went viral on social media. The incident, reportedly triggered by the delivery of a wrong food order, has sparked widespread criticism, with many questioning the actor's behaviour towards the delivery partner. Amid the growing debate, senior actor V. K. Naresh shared a heartfelt message, urging people to treat food delivery workers with empathy and respect. Without naming Akhil Raj, Naresh said attacks on delivery partners are becoming increasingly common and receive attention only when celebrities are involved, while several similar incidents go unnoticed. He acknowledged that delayed or incorrect deliveries can be frustrating, but reminded customers that delivery executives brave traffic, heavy rain, scorching heat and the constant risk of accidents every day just to earn an honest living. "Let's choose empathy over anger. A few extra minutes are never worth someone's dignity or safety," Naresh wrote. The senior actor also appealed to Swiggy and Zomato to strengthen measures that protect and support their frontline workers. Concluding his message, Naresh wrote, "Respect is free. Humanity is priceless." Naresh's comments have struck a chord with many on social media, shifting the conversation beyond one viral incident to the everyday challenges faced by thousands of delivery partners across the country. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి మురళీమోహన్. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యం. ఇటీవల భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ' అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక అవార్డు మురళీమోహన్ వ్యక్తిత్వాన్ని, ఆయన సీనియారిటీని మరింతగా గౌరవించింది. అయితే, ఈ పద్మశ్రీ పురస్కారం ఆయనను వరించడం వెనుక ఒక ఆసక్తికరమైన, అంతకంటే ఎక్కువగా ఉత్కంఠభరితమైన ఒక రహస్య కథ దాగి ఉంది. అవార్డుల ప్రకటనకు సరిగ్గా ఒకరోజు ముందు జరిగిన ఆ సంఘటనను మురళీమోహన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పంచుకోవడంతో ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవార్డుల ప్రకటన వెలువడే దానికి ముందు రోజు అర్ధరాత్రి మురళీమోహన్ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో ఆయన మొబైల్ ఫోన్‌కు ఒక గుర్తుతెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. సాధారణంగా అర్ధరాత్రి వేళల్లో వచ్చే ఫోన్ కాల్స్ ఎవరినైనా కాస్త ఆందోళనకు గురిచేస్తాయి. మురళీమోహన్ కూడా మొదట కాస్త ఆశ్చర్యపోతూనే ఫోన్ ఎత్తారు. అవతలి వైపు నుండి మాట్లాడిన వ్యక్తి హిందీలో సంభాషణను ప్రారంభించారు. ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి మాట్లాడుతున్నానని, మురళీమోహన్గారికి ఒక ముఖ్యమైన సమాచారం అందించాలని సదరు అధికారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మురళీమోహన్‌ను 'పద్మశ్రీ' అవార్డుకు ఎంపిక చేసిందని, ఈ అవార్డును స్వీకరించడానికి ఆయనకు సమ్మతమేనా అని ఆ అధికారి ప్రశ్నించారు. ఢిల్లీ నుండి వచ్చిన ఆ అర్ధరాత్రి ఫోన్ కాల్‌తో మురళీమోహన్ ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు. అయితే, ఆ అధికారి ఆయనకు ఒక కఠినమైన షరతును కూడా విధించారు. మరుసటి రోజు సాయంత్రం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జాబితాను విడుదల చేసే వరకు ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాలని, కనీసం కుటుంబ సభ్యులకు లేదా అత్యంత ఆప్తమిత్రులకు కూడా చెప్పకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ సమాచారం ముందే లీక్ అయితే అవార్డు ప్రకటనలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించారు. దాంతో మురళీమోహన్ ఆ సంతోషాన్ని గుండెల్లోనే దాచుకుని, నిబంధనలకు కట్టుబడి ఆ రాత్రంతా ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఎంతో ఉత్కంఠగా గడిపారు. మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల అధికారిక జాబితాను విడుదల చేసింది. అందులో మురళీమోహన్ పేరును చూడగానే ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఆనంద ఆశ్చర్యాలకు లోనయ్యారు. అప్పటివరకు ఈ విషయాన్ని గుప్తంగా ఉంచిన మురళీమోహన్, ఆ తర్వాతే అసలు విషయాన్ని అందరికీ చెప్పారు. సాధారణంగా అవార్డుల కోసం చాలామంది రికమండేషన్లు, గట్టి ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ మురళీమోహన్ విషయంలో ఎలాంటి సిఫార్సులు లేకుండానే, కేవలం ఆయన అర్హతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించడం విశేషం. దశాబ్దాల సినీ ప్రయాణంలో వందలాది చిత్రాల్లో నటించి, జయభేరి బ్యానర్‌పై ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన మురళీమోహన్‌కు ఈ పద్మశ్రీ పురస్కారం దక్కడం పట్ల టాలీవుడ్ యావత్తు గర్విస్తోంది.  
    సమంత(Samantha)దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 'మా ఇంటి బంగారం'(తో  వెండితెరపైకి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇవ్వడమే కాదు రికార్డుల వర్షం కురిపిస్తుంది. సంప్రదాయబద్ధమైన గృహిణి క్యారక్టర్ లో కనిపిస్తూనే, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పాత గతాన్ని తవ్వి తీసే మాస్ యాక్షన్ అవతారంలో ప్రదర్శించిన  సమంత పెర్ఫార్మ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కేవలం 10 రోజుల్లోనే ఏకంగా 80.87 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులని  సృష్టిస్తోంది. రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని త్రిలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు మరియు హిమాంక్ రెడ్డి దువ్వురు సంయుక్తంగా నిర్మించారు. థియేటర్లలో ఘన విజయం సాధించి దూసుకుపోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకి  వచ్చింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' డిజిటల్ రైట్స్‌ని భారీ ఫ్యాన్సీ ధరకి దక్కించుకుంది. సాధారణంగా టాలీవుడ్ లో పెద్ద సినిమాల థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు నుండి ఆరు వారాల విండో పాటిస్తుంటారు. ఈ లెక్కన చూసుకుంటే, థియేట్రికల్ రన్ విజయవంతంగా ముగిసిన తర్వాత జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో మా ఇంటి బంగారం ప్రీమియర్ కానుందనేది టాక్.అయితే దీనిపై మేకర్స్ లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్.. బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్  మరోవైపు శాటిలైట్  హక్కులని ప్రముఖ టెలివిజన్ ఛానల్ 'స్టార్ మా' (Star Maa) దక్కించుకుంది. ఓటీటీ విడుదల పూర్తయిన తర్వాత ఏదైనా ఒక పండుగ లేదా ప్రత్యేక వీకెండ్ స్లాట్‌లో  బుల్లితెరపై సందడి చేయనుంది. సంతోష్ నారాయణన్ అద్భుతమైన సంగీతం, ఓం ప్రకాష్ పవర్‌ఫుల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళంలో 'ఎంగళ్ తంగమ్' పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ నెల 19 న  రిలీజైన మా ఇంటి బంగారంకి  నందినీరెడ్డి దర్శకురాలనే విషయం తెలిసిందే.  
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో ఒక భారీ పౌరాణిక చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అని పిలుస్తున్నారు.  అయితే, ఈ సినిమాకు సంబంధించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో వదిలిన ఒక కాన్సెప్ట్ క్యాప్షన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక పెద్ద వివాదానికి, చర్చకు దారితీసింది. పౌరాణిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. “ఉత్తరాదిన జన్మించాడు.. హృదయభూమిలో రూపుదిద్దుకున్నాడు.. దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు.. ఇప్పుడు విశ్వానికి చెందాల్సిన కథ” అంటూ నాగవంశీ పెట్టిన పోస్ట్ ముఖ్యంగా తమిళ నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తమిళ సంస్కృతిలో మురుగన్ దేవుడికి అత్యంత ప్రత్యేకమైన, భావోద్వేగభరితమైన స్థానం ఉంది. తమిళ ప్రజలు ఆయనను 'తమిళ్ కడవుల్' (తమిళుల దేవుడు) అని ఎంతో భక్తితో పిలుచుకుంటారు. ప్రాచీన సంగం సాహిత్యంలో (క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు శకం 300 వరకు) మురుగన్‌ను 'సేయోన్' అని, కొండ ప్రాంతాలైన కురింజి భూములకు, యుద్ధానికి, యవ్వనానికి అధిపతిగా అభివర్ణించారు. అందువల్ల, "ఉత్తరాదిన జన్మించాడు" (Born in the North) అనే వాక్యం తమ సంస్కృతిని, చరిత్రను విస్మరించడమేనని, సినిమా వాణిజ్య ప్రయోజనాల కోసం, పాన్-ఇండియా మార్కెట్ కోసం చరిత్రను తప్పుగా చిత్రీకరిస్తున్నారని తమిళ నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరైతే ఈ చిత్రాన్ని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ వివాదం నేపథ్యంలో అసలు ప్రశ్న ఏమిటంటే.. స్కందుడు, కార్తికేయుడు, మురుగన్, సుబ్రహ్మణ్య స్వామి అందరూ వేర్వేరు దేవుళ్ళా? లేక ఒక్కరేనా? హిందూ పురాణాలు, చారిత్రక ఆధారాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి? విస్తృతమైన హిందూ పురాణాలను, వేద సంప్రదాయాలను పరిశీలిస్తే.. స్కందుడు, కార్తికేయుడు, మురుగన్ అందరూ ఒక్కరేనని స్పష్టమవుతుంది. అయితే కాలక్రమంలో భిన్న ప్రాంతీయ సంస్కృతులు ఆయనను తమదైన శైలిలో స్వీకరించాయి. ఉత్తరాది పురాణాల ప్రకారం, పరమశివుడు-పార్వతీ దేవిల తేజస్సు నుండి, తారకాసురుడిని వధించడానికి హిమాలయాల్లోని శరవణ భవ అనే సరస్సులో కార్తికేయుడు జన్మించాడు. ఆరు ముఖాలు ఉన్నందున ఆయనను షణ్ముఖుడని, కృత్తిక నక్షత్ర దేవతల పెంచబడటం వల్ల కార్తికేయుడని, శివుని శక్తి స్కందం (జారిపడటం) వల్ల జన్మించడం వల్ల స్కందుడని పిలిచారు. ఉత్తరాది మరియు సంస్కృత పురాణాలైన స్కంద పురాణంలో ఈ కథే ప్రముఖంగా కనిపిస్తుంది. ఉత్తర భారతంలో ఈయన్ను ప్రధానంగా కార్తికేయుడు లేదా స్కంద దేవుడిగా గుర్తిస్తారు. ఇక్కడే ఉత్తరాది పురాణ మూలాలకు, దక్షిణాది ఆరాధనా పద్ధతులకు మధ్య ఉన్న అనుసంధానం స్పష్టమవుతుంది. మరోవైపు దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడులో మురుగన్ ఆరాధన అనేది కేవలం ఒక మతపరమైన అంశం మాత్రమే కాదు, అదొక సాంస్కృతిక అస్తిత్వం. ప్రాచీన ద్రావిడ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉన్న మురుగన్ ఆరాధనను, కాలక్రమంలో వైదిక సంప్రదాయంలోని శివపార్వతుల కుమారుడైన స్కందుడి కథతో సమన్వయం చేశారు. తమిళనాడులో మురుగన్‌కు గల ఆరు పవిత్ర క్షేత్రాలను 'ఆరుపడై వీడు' అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈయన్ను సుబ్రహ్మణ్య స్వామిగా లేదా కుమారస్వామిగా పూజిస్తారు. అంటే, ఉత్తరాదిన పుట్టిన పౌరాణిక గాథను, దక్షిణాది తన భక్తి సంప్రదాయంలో అత్యున్నత శిఖరానికి చేర్చి విశ్వవ్యాప్తం చేసింది.  నిర్మాత నాగవంశీ తన పోస్ట్‌లో పేర్కొన్న "ఉత్తరాదిన జన్మించాడు, దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు" అనే మాట హిందూ పురాణాల్లోని భౌగోళిక ప్రయాణాన్ని సూచిస్తుందే తప్ప, తమిళ సంస్కృతిని తక్కువ చేయడం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ కొన్ని నెలల క్రితమే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆనంద్ బాలసుబ్రమణియన్ రాసిన "మురుగన్: ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విస్డమ్" అనే పుస్తకంతో కనిపించడం, ఆయన ఈ పాత్ర కోసం ఎంత లోతుగా రీసెర్చ్ చేస్తున్నారో తెలియజేస్తుంది. ఈ సినిమా కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాకుండా భారతదేశం గర్వించేలా అద్భుతమైన పౌరాణిక కావ్యంగా రూపుదిద్దుకుంటుందని సినీ ప్రియులు భావిస్తున్నారు.  
Director Sudha Kongara has approached the Madras High Court over alleged non-payment of her remuneration for Parasakthi. The filmmaker has claimed that she is yet to receive ₹8.39 crore from the film's producer and has sought legal intervention to recover the dues. According to reports, Sudha filed a petition against producer Aakash Baskaran, stating that despite repeated requests, the agreed remuneration remains unpaid. She also sought an interim direction restraining the producer from releasing his next production, Idhayam Murali, until the outstanding amount is cleared. The Madras High Court, however, did not grant an interim stay on the release of Idhayam Murali. Instead, it has taken up the matter for hearing and is expected to hear the case further on July 8. Parasakthi, starring Sivakarthikeyan, has already witnessed its share of legal hurdles.  Ahead of its release, the film faced a copyright dispute after a writer alleged that the story resembled his work. The court later refused to stay the film's release, allowing it to hit theatres as scheduled. The latest development has once again put Parasakthi in the spotlight, this time over a financial dispute.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కేవలం నటిగానే కాకుండా ఒక పారిశ్రామికవేత్తగా, నిర్మాతగా తన సరిహద్దులను విస్తరించుకుంటూ వెళ్తోంది. మయోసైటిస్ అనే అరుదైన ఆరోగ్య సమస్య కారణంగా గతేడాది సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన సమంత, ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది. నటనతో పాటు నిర్మాణ రంగంలో కూడా తనదైన ముద్ర వేయాలనే బలమైన సంకల్పంతో ఆమె గతంలో 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' అనే సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్‌ను ప్రకటించినప్పటి నుండి సమంత ఎలాంటి కథలను ఎంచుకోబోతోంది, ఆమె నిర్మించే మొదటి సినిమా ఎవరితో ఉండబోతోంది అనే ఆసక్తి సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ విపరీతంగా నెలకొంది. తాజాగా ఈ నిర్మాణ సంస్థ నుండి రాబోతున్న అఫీషియల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. సమంత తన సొంత బ్యానర్‌లో కేవలం కమర్షియల్ హంగులు ఉన్న చిత్రాలు మాత్రమే కాకుండా, నేటి తరం ఆలోచనలకు అద్దం పట్టే వైవిధ్యమైన, కొత్త తరహా కథలను ప్రోత్సహించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఆమె ఇప్పటికే రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టినట్లు ఇండస్ట్రీ సమాచారం. ఈ రెండు చిత్రాలు కూడా విభిన్నమైన జోనర్లలో, ప్రేక్షకులు ఊహించని సరికొత్త కంటెంట్‌తో రాబోతున్నాయని టాక్. ఒక సినిమాను పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేయగా, మరొకటి కొత్త నటీనటులు మరియు వినూత్నమైన కాన్సెప్ట్‌తో సాగే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా కొత్త ప్రతిభను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనేది సమంత ముఖ్య ఉద్దేశం. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కంటెంట్‌ను అందించడమే తన 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' ప్రధాన లక్ష్యమని సమంత గతంలోనే స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ చర్చలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాల్లో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సమంత అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. నిర్మాతగా సమంత తీసుకోబోతున్న ఈ సరికొత్త అడుగు ఆమె కెరీర్‌ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరోవైపు నటిగా కూడా సమంత వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీ అవుతోంది. గ్లోబల్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' లో యాక్షన్ అవతారంలో మెప్పించిన ఈ బ్యూటీ, త్వరలోనే మరికొన్ని భారీ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లు మరియు పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటు నటనను, అటు నిర్మాణ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ సమంత దూసుకుపోతున్న తీరు ఇండస్ట్రీలో అందరినీ ఆకట్టుకుంటోంది. సమంత ఓన్ బ్యానర్‌లో రాబోయే ఈ క్రేజీ అప్‌డేట్స్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
Actor, choreographer and filmmaker Raghava Lawrence has finally broken his silence on his political future through a video message, ending speculation surrounding his next move. While confirming his intention to enter politics, Lawrence made it clear that his announcement has nothing to do with the Trichy East by-election. For the past few weeks, reports had linked Lawrence with the Trichy East constituency, which fell vacant after Chief Minister Vijay retained another seat following the Tamil Nadu Assembly elections. However, Lawrence categorically denied the rumours, stating that he is **not contesting the Trichy East bypoll** and urged people not to believe unverified reports. In the emotional video, Lawrence said he never aspired to become a politician or hold power. His only objective, he said, has always been serving society through his charitable initiatives. However, changing circumstances have convinced him that politics could become a larger platform to continue that service. Lawrence also revealed that his mother had initially opposed his entry into politics, believing that he could help people without joining public life. Over time, however, she changed her stance and gave him her blessings, encouraging him to take the next step. Interestingly, the actor has left the final decision to his fans and the public. He requested everyone to watch his complete video and tell him honestly whether he should enter politics. If people feel he is not suited for politics, he said he would continue serving society through his charitable work. If they support the move, he is ready to begin his political journey. By ruling out the Trichy East bypoll while simultaneously confirming his political aspirations, Lawrence has made it clear that his focus is on a long-term public service mission rather than an immediate electoral contest. While he is yet to reveal whether he will float his own party or align with an existing political outfit, his latest statement confirms that a significant chapter in his life is about to begin. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.     Do your duty. Don’t expect anything in return. As announced earlier, here is my clarification regarding the Trichy election and my recent press meet. Thank you all for your love and support 🙏🏼#serviceisgod pic.twitter.com/JlIlkxVKdr — Raghava Lawrence (@offl_Lawrence) June 30, 2026
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది  మనుషులను దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు  తెలియకుండానే అవతలి వ్యక్తికి అసౌకర్యం కలిగించే ప్రశ్నలు అడుగుతుంటారు. అడిగేవారి  ఉద్దేశాలు తప్పు కాకపోయినా, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు ఇతరులకు నచ్చకపోవచ్చు , పైగా ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఎదుటివారు బాధపడతారు కూడా.  నేటికాలంలో  గతంలో కంటే తమ వ్యక్తిగత జీవితాల పట్ల చాలా మందికి ఎక్కువ శ్రద్ధ ఉంటోంది. అయితే  ప్రతి వ్యక్తికి వారి స్వంత హద్దులు , వ్యక్తిగత గోప్యత ఉంటాయి, వాటిని గౌరవించాలి. కొన్నిసార్లు, మనం కేవలం కుతూహలంతో ప్రశ్నలు అడుగుతాము, కానీ అవతలి వ్యక్తి దానిని తమ పర్సనల్  విషయాల్లోకి చొరబడినట్లుగా భావించే అవకాశం ఉంటుంది. ఇది సంబంధాలు చెడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఎవరినీ అడగకూడని నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ఎవరినీ నొప్పించకుండా ఉండగలం. అవేంటంటే.. జీతం.. ఒకరి ఆదాయం లేదా జీతం గురించి అడగడం చాలా సున్నితమైన ప్రశ్నలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.  ఈ ప్రశ్న ఎదుటి వ్యక్తికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు.  ఇలాంటి ప్రశ్న వేయడం  వల్ల ఇతరులతో  తనను పోలుస్తున్నారని లేదా అంచనా వేస్తున్నారని ఎదుటివారికి  అనిపించవచ్చు. అందుకే ఎవరి సంపాదన గురించి ఎప్పుడూ అడగకూడదు. పెళ్ళెప్పుడు.. పెళ్లెప్పుడు అనే ప్రశ్నను భారతీయులు చాలా  తరచుగా అడుగుతుంటారు, కానీ ప్రతి వ్యక్తి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.  కొందరు తమ వృత్తిపై దృష్టి పెడుతుండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.  ఈ ప్రశ్నను పదేపదే అడగడం వల్ల ఎదుటి  వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడి పడవచ్చు. వయసు.. వయస్సు అడగడం సాధారణంగా అనిపించినప్పటికీ, చాలా మంది దానిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట  లేదా మొదటి సారి ఎవరితోనైనా కలిసినప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తే అది ఎదుటి వారిని   ఇబ్బందికి గురిచేస్తుంది. అవసరం ఉంటే తప్ప  వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవడమే మంచిది. పిల్లలు.. భారతదేశంలో పెళ్లైన చాలా మంది మహిళలు ఎదుర్కునే  ప్రశ్న ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు ఏమిటి అని.  ఇది  చాలా  భావోద్వేగపరమైన,  సున్నితమైనదిగా  ప్రశ్న. కొంతమందికి వారు మాట్లాడటానికి ఇష్టపడని వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య కారణాలు లేదా కుటుంబ పరిస్థితులు ఉండవచ్చు. అందువల్ల, ఇలాంటి ప్రశ్నలు సంబంధాలలో దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ఆడపిల్లను  ఎవరు ఈ ప్రశ్న అడగకూడదు.                                 *రూపశ్రీ.
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ చాలా ప్రత్యేకమైనది.  చాలామంది రిలేషన్లో ఉన్నప్పుడు తమ బాగస్వామిని చాలా ప్రేమిస్తుంటారు. కానీ ఏదైనా సందర్బం వస్తే నువ్వు నన్ను ప్రేమించడం లేదు అనే మాటను ఎదుర్కుంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే.. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయకపోవడం వల్ల.  ప్రేమించడం గొప్ప కాదు.. కానీ ప్రేమను సరైన విదంగా వ్యక్తం చేయకపోవడం వల్లే అసలైన సమస్య వస్తుంది. ప్రేమను సరైన విధంగా వ్యక్తం చేస్తే ఆ బంధాలు ఎంతో పదిలంగా పదికాలల పాటు సంతోషంగా ఉంటాయి.  బంధాలను బలంగా మార్చుకోవడానికి ప్రేమను వ్యక్తం చేసే పద్దతులు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. మనసులో కాదు.. మాటల్లో చెప్పాలి.. ప్రేమను మనసులో దాచుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కొంతమందికి ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలే మంచి ఆయుదం. “నాకు నీ పట్ల గర్వంగా ఉంది”, “నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి”, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” వంటి చిన్న వాక్యాలు కూడా ఎదుటి వారి హృదయాన్ని టచ్ చేస్తాయి.  భాగస్వామి  తమ ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరుస్తుంటే, వారిని మెచ్చుకోవడం, వారి ప్రయత్నాలను అభినందించడం, ప్రేమ సందేశాలు పంపడం వంటివి ఆ బంధాన్ని బలపరుస్తాయి. ఇలాంటి వ్యక్తులు విమర్శలను కూడా మరింత లోతుగా తీసుకుంటారు, కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు పాజిటివ్  పదాలను ఎంచుకోవడం ముఖ్యం. సమయం.. కొంతమందికి ప్రేమను వెలిబుచ్చడానికి  అత్యంత విలువైనది వారి సమయం. వారికి ఖరీదైన బహుమతుల కంటే, ఎలాంటి ఆటంకం  లేకుండా వారితో సమయం గడపడమే ముఖ్యం. ఫోన్‌ను పక్కన పెట్టి మాట్లాడుకోవడం, కలిసి నడవడం, కాఫీ డేట్‌కు వెళ్లడం లేదా కేవలం కలిసి కూర్చుని ఆ రోజు జరిగిన సంఘటనలను షేర్ చేసుకోవడం వంటివి కొందరికి   చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి వారికి, లైప్ పార్ట్నర్ ఉనికే చాలా పెద్ద బహుమతి. స్పర్శ.. చాలా మంది కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం లేదా భుజంపై చేయి వేయడం వంటి టచింగ్  ద్వారా ప్రేమను అనుభూతి చెందుతారు. ఒకరినొకరు స్పృశించుకోవడం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు, భావోద్వేగ భద్రత , అనుబంధం కూడా ఇందులో భాగమే. అలాంటి వ్యక్తులు ప్రేమతో కూడిన టచింగ్ ను  పొందినప్పుడు, వారు తమ సంబంధంలో మరింత భద్రతగా, అనుబంధంగా , సంతోషంగా ఫీలవుతారు. మెమరీస్.. బహుమతులు ఇష్టపడేవారు బయటి విషయాలలోనే ప్రేమను చూస్తారని  చాలామంది తరచుగా అనుకుంటారు, కానీ ఈ నమ్మకం ఎప్పుడూ సరైనది కాదు. ఇది కూడా ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మార్గం.  ఇందులో  బహుమతి ధర ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న భావనే ముఖ్యం. ఒక చిన్న పువ్వు, ఇష్టమైన చాక్లెట్, లేదా ప్రయాణం నుండి తెచ్చుకున్న ఒక చిన్న గిఫ్ట్  కూడా వారికి చాలా ప్రత్యేకంగా అనిపించవచ్చు. ఇది  వారి గురించి ఆలోచిస్తున్నారని, వారిని గుర్తుంచుకుంటున్నారని  వారికి తెలియజేస్తుంది. సహాయం.. కొంతమందికి, “నేను నీకు సహాయం చేస్తాను” అని చెప్పడం కంటే, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.   భాగస్వామి సహాయానికి లేదా సపోర్ట్ ఇవ్వడానికి  విలువ ఇస్తే, వారికి చిన్న చిన్న పనులలో సహాయం చేయడం, వారి బాధ్యతలను తేలికపరచడం లేదా అవసరమైనప్పుడు సపోర్ట్  ఇవ్వడం వంటివి వారిని ఎంతగానో ప్రేమిస్తున్నారనే భావనకు గురి చేస్తాయి. వారికి మాటల కన్నా చేతలే గొప్పవి. కష్టసమయాలలో.. ప్రతి సంబంధం కేవలం సంతోషకరమైన క్షణాలపై మాత్రమే ఆధారపడి ఉండదు.  కష్ట సమయాల్లో ఒకరికొకరు మానసికంగా  అండగా ఉండటం కూడా అంతే ముఖ్యం. తమ మాటలను ఎలాంటి జడ్జ్ చేయకుండా  విన్నప్పుడు, వారి భావాలను అర్థం చేసుకున్నప్పుడు,  కష్ట సమయాల్లో వారికి అండగా నిలిచినప్పుడు, కొంతమంది తాము ప్రేమించబడ్డామని భావిస్తారు. అలాంటి వారికి ఏ బహుమతి లేదా ప్రేమను వ్యక్తపచడానికి స్పెషల్ గా వేరే ఏ పని చేయకపోయినా , ఎమోషనల్ సందర్భాలలో మద్దతుగా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది. ప్రేమను ఎలా గుర్తించాలి?  ఎక్కువ ప్రేమగా అనిపించే విషయాల పట్ల శ్రద్ధ వహించాలి.  భాగస్వామి తరచుగా ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారో గమనించాలి.   ఏది లోపించిందని అనిపిస్తుందో, ఏది మిమ్మల్ని బాధపెడుతుందో అది కూడా ఒక సంకేతం కావచ్చు.  నిష్కపటంగా మాట్లాడాలి , ఒకరి ఎమోషన్ సపోర్ట్ ను  మరొకరు అర్థం చేసుకోవాలి.                                 *రూపశ్రీ.
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు.  రిలేషన్ లో ఉండే ఈ పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు ట్రామా బాండింగ్ అనే పదాన్ని లైఫ్ స్టైల్ నిపుణులు వాడుతూ ఉంటారు.  అయితే నేటి కాలంలో మాత్రం ఈ ట్రామా బాండింగ్ అనేది మానసిక భావనగా మారింది.  చాలామంది తమను మానసికంగా ప్రభావితం చేసే బంధాలలో చాలామంది ఉండిపోతారు. కానీ ఇలాంటి బంధాల నుండి బయటపడటం కష్టంగా ఉంటుంది. ఇది మనిషి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం,  ఏదైనా అర్థం చేసుకునే తత్వం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. బంధాలలో వాస్తవాన్ని గుర్తించి,  సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలంటే ట్రామా బాండింగ్ ను అర్థం చేసుకోవాలి.  అసలు ట్రామా బాండింగ్ అంటే ఏమిటి?  దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా ఏర్పడుతుంది? దీన్నుండి ఎలా బయటపడాలి లేదా దీనికి లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?  తెలుసుకుంటే.. ట్రామా బాండింగ్.. ట్రామా బాండింగ్ అనేది ఒక మానసిక పరిస్థితి. దీనిలో ఒక వ్యక్తి, తమకు మానసిక ఒత్తిడి, బాధ లేదా స్థిమితంగా ఉండలేక పోవడం వంటివి  కలిగించే రిలేషన్ కు  ఎమోషన్ గా  అతుక్కుపోయి ఉంటారు. ఈ పరిస్థితిలో ప్రేమ, ఆప్యాయత, ఆపై ఆకస్మిక అవమానం లేదా ఎమోషన్ గా దెబ్బ తినడం  అనే ఒక చక్రం ఉంటుంది. ఇది ఆ వ్యక్తిని చిక్కుకుపోయినట్లుగా, గందరగోళంగా భావించేలా చేస్తుంది. క్రమంగా, వారు దానికి అలవాటుపడి, దాని నుండి బయట పడటం కష్టంగా మారుతుంది. ట్రామా బాండింగ్ ఎలా ఏర్పడుుతంది? ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేని  సంబంధాలలో సాధారణంగా ట్రామా బాండింగ్ ఏర్పడుతుంది. ఇది అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. వాటిలో కొన్ని.. రిలేషన్ లో  పదేపదే పాజిటివ్, నెగిటివ్ ప్రవర్తన ఉంటుంది.  ఇవి మారుతూఉంటాయి.  కొన్నిసార్లు చాలా  ప్రేమ కనిపిస్తుంది,   మరికొన్నిసార్లు ఉన్నట్టుండి  దూరం  పెరిగినట్టు లేదా అగౌరవం జరిగినట్టు జరుగుతుంది. ఎమోషన్ పరంగా బాగా ఎక్కువై ఇతరుల మీద ఆదారపటం,  భయం, ఒంటరితనం, అభద్రతా భావంతో కూడిన వాతావరణం ఉంటుంది.  ఆత్మగౌరవం క్రమంగా బలహీనపడుతుంది.   భాగస్వామి ద్వారా భావోద్వేగ నియంత్రణ లేదా తారుమారు అవుతుంది. ట్రామా బాండింగ్ సిగ్నల్స్.. ట్రామా బాండింగ్ ను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.    సంబంధాన్ని వదిలిపెట్టలేకపోవడం,   మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్లడం లేదా వెళ్లాలని అనిపించడం. ప్రతి సమస్యకు తనను తాను నిందించుకోవడం,  ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళన లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించడం.  సంబంధంలో ఉన్నప్పటికీ అసంతృప్తిగా , సంతోషంగా లేకపోవడం.  ఇతరులు చెప్పేది పట్టించుకోకుండా, కేవలం ఆ సంబంధంలోనే లీనమై ఉండటం. ఎలా బయట పడాలి.. ట్రామా బాండింగ్‌ను అధిగమించడం అంత సులభం కాదు, కానీ సరైన చర్యలతో అది సాధ్యమేనని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు.    మొదట, పరిస్థితిని అంగీకరించాలి. నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం  మానసిక ఆరోగ్య నిపుణుడు లేదా కౌన్సిలర్ నుండి సహాయం కోరడం మంచిది.  ట్రామా బాండింగ్ లో చిక్కుకున్న  వ్యక్తికి క్రమంగా దూరమవ్వాలని.  ఆత్మగౌరవంతో,  ఆత్మవిశ్వాసంతో  పనిచేయాలి.  తమ కోసం తాము  సురక్షితమైన , సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ట్రామా బాండింగ్ గుర్తించడం ఎందుకు ముఖ్యం.. ట్రామా బాండింగ్ అనేది ఒక తీవ్రమైన భావోద్వేగ పరిస్థితి, ఇది ఒక వ్యక్తి  మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం , జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన , సమతుల్యమైన జీవితం వైపు పయనించగలుగుతారు.                                  *రూపశ్రీ.
 నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది జిమ్ చేస్తుంటారు, మరికొందరు యోగా చేస్తుంటారు. గుండె ఆరోగ్యం కోసం కొత్తగా వ్యాయామం  మొదలు పెట్టాలని అనుకునేవారు జిమ్ చేయాలా, యోగా చేయాలా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు.    కొంతమంది జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు యోగానే ఉత్తమ పద్ధతిగా భావిస్తారు. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జిమ్ లేదా యోగా..  ఈ రెండింటిలో  గుండె ఆరోగ్యానికి ఏది బాగుంటుంది?  తెలుసుకుంటే.. జిమ్ లేదా యోగా ఏది మంచిది? గుండెను కాపాడుకోవడానికి జిమ్ , యోగా రెండూ అవసరమైనవే. అయితే, అవి పనిచేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఒకదానిని మించి మరొకటి ఎంచుకోవడం కంటే, రెండింటినీ  ఫిట్‌నెస్ లైఫ్ స్టైల్ లో  చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు.. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, రోయింగ్ , స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి జిమ్ వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా చేసే  వ్యాయామం గుండెను బలపరుస్తుంది , శరీరమంతటా రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది.  జిమ్ వర్కౌట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి , కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి. అవి బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.  తద్వారా గుండె జబ్బులు , పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి స్టామినాను బాలెన్స్ ను  కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా  కార్డియో వ్యాయామాలు చేస్తే  గుండెను బలపరుస్తాయని , శరీరమంతటా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా ఎందుకు ముఖ్యం..? యోగా శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడం, సరైన శ్వాస, బాలెన్స్ ను  కాపాడుకోవడం , మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది. కార్డియో వ్యాయామాల మాదిరిగానే  యోగా ఏరోబిక్ ఫిట్‌నెస్‌ను అందిస్తుంది.  అయితే యోగా  గుండె ఆరోగ్యానికి ఇంకా అనేక  విధాలుగా కూడా  ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యోగా ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా  ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీర సౌలభ్యాన్ని , శరీరాకృతిని  మెరుగుపరుస్తుంది, శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది , మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బులకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా మనస్సును , నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం యోగాతో గుండె ఆరోగ్యం బాగుంటుందా? యోగా వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి అవసరమైన ఏరోబిక్ వ్యాయామాన్ని కేవలం యోగా మాత్రమే శరీరానికి అందించలేదు.  ఈ విషయాన్ని ఆరోగ్య  నిపుణులే చెబుతున్నారు.  ఆరోగ్య  నిపుణుల ప్రకారం, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి వారానికి  కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి మధ్యస్థం నుండి  తీవ్రత గల వ్యాయామం చేయాలి. మెరుగైన ఫిట్‌నెస్ , గుండె ఆరోగ్యం కోసం యోగాను ఇతర శారీరక కార్యకలాపాలతో కలిపి చేయడం మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి? జిమ్ , యోగాలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని  గుండె ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు.  ఫిట్‌నెస్ దినచర్యలో రెండింటినీ చేర్చుకోవడం మంచిదట. ఒక బాలెన్స్డ్  ఫిట్‌నెస్ ప్రణాళికలో వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు, వారానికి కనీసం రెండు రోజులు స్ట్రెం్ ట్రైనింగ్,  కోలుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఉంటాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్ , శ్వాస వ్యాయామాలను కూడా చేర్చుకోవాలి. ఈ దినచర్య గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని ,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.                                       *రూపశ్రీ.
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం.  శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి,  ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది.  శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు. ఇక మాంసాహారులు అయితే మాంసాన్ని తీసుకుంటారు. కానీ కాయ ధాన్యాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది. వీటిని తరచుగా పప్పు ధాన్యాలు అని పిలుస్తూ ఉంటాం. వంటింట్లో ఎన్నో రకాల పప్పు దాన్యాలు ఉంటాయి. వీటిలో ఏ ధాన్యాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. సోయాబీన్.. సోయాబీన్లో అన్ని పప్పు ధాన్యాల కంటే అత్యధికంగా వంద గ్రాముల సోయాబీన్ కు 36–40 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు (Essential Amino Acids) దాదాపు సమతుల్యంగా లభిస్తాయి. అందువల్ల దీనిని అత్యుత్తమ ప్లాంట్  ప్రోటీన్ ఆహారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. సోయాబీన్‌తో తయారయ్యే పాలు, టోఫూ, సోయా నగెట్స్ వంటి ఆహారాలు కూడా మంచి ప్రోటీన్ వనరులే. మినుములు.. ప్రోటీన్ అత్యధికంగా ఉండే ధాన్యాలలో మినుములు రెండవ స్థానంలో ఉంటాయి.  ఈ మినుములు ఒక  కప్పు మినుములలో సుమారు 25 నుండి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని చెబుతారు. ఇడ్లీ, దోశ వంటి పులియబెట్టిన ఆహారాల్లో మినప్పప్పు ఉపయోగించడం వల్ల జీర్ణక్రియకు కూడా మేలు జరుగుతుంది. పెసలు.. పెసలులో 23–24 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. మొలకలు వచ్చిన పెసలు విటమిన్ సి, కొన్ని బి విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు కూడా తినవచ్చు. శనగలు.. శనగలులో ప్రోటీన్‌తో పాటు పీచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువసేపు ఆకలి తగ్గి, బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. శనగలు ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలను కూడా అందిస్తాయి.   రాజ్మా.. రాజ్మాలో మంచి ప్రోటీన్, పీచు, పొటాషియం , ఐరన్  ఉంటాయి. అయితే వీటిని తప్పనిసరిగా బాగా నానబెట్టి, పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. లేకపోతే జీర్ణవ్యవస్థకు చాలా ఇబ్బంది అవుతుంది. కందిపప్పు.. కందిపప్పు మన తెలుగు ఇళ్లలో ఎక్కువగా వాడే పప్పు. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఫోలేట్, పొటాషియం, పీచు కూడా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చడం మంచి అలవాటు. ఎలా తింటే ప్రయోజనం.. పప్పులను కేవలం ఒకటే తినడం కంటే వాటిని బియ్యం, జొన్న, రాగి లేదా గోధుమ వంటి ధాన్యాలతో కలిపి తినడం మంచిది. ఇలా తినడం వల్ల శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాల సమతుల్యత మెరుగుపడుతుంది. అంతేకాదు.. పప్పులను కూరగాయలతో కూడా కలిపి తింటే మంచి సమతుల్య ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. అలాగే పప్పులను 6–8 గంటలు నానబెట్టి వండితే జీర్ణక్రియ సులభమవుతుంది. కొన్ని పప్పులను మొలకలు చేసి తింటే విటమిన్లు పెరగడంతో పాటు కొన్ని పోషకాల శోషణ కూడా మెరుగుపడుతుంది. రోజువారీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? ఒక సాధారణ ఆరోగ్యవంతుడికి రోజుకు శరీర బరువు ప్రతి కిలోకు సుమారు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు 60 కిలోల బరువు ఉన్న వ్యక్తికి రోజుకు సుమారు 48 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు, క్రీడాకారులు లేదా కండరాల పెరుగుదల లక్ష్యంగా పెట్టుకున్నవారికి అవసరం మరింత ఎక్కువగా అవసరం కావచ్చు.                             *రూపశ్రీ.
  ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు..  ఇది మాత్రమే కాదు..  రోజంతా  మనసు ఏదో మబ్బుపట్టినట్లుగా అనిపించడం వంటిది కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది దీన్ని పరధ్యానం అనో లేక జీవితంలో ఏదో కోల్పోయినట్టు అంత విరక్తిగా ఉండటం ఎందుకనో..  ఆరోగ్యం బాగాలేదేమో అనో.. ఇలా చాలా రకాలుగా సాకులు, కారణాలు చెప్పుకుని అప్పటికి సైలెంట్ అయిపోతూ ఉంటారు.  అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే.  ఒత్తిడి , ఆందోళన ఈ సమస్యలకు కారణం కావచ్చు. అయితే, ఎప్పుడో ఒకసారి అన్నట్టు కాకుండా.. పదే పదే ఎక్కువగా జరుగుతూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు వైద్యులు. తరచుగా మతిమరుపు, ఏకాగ్రత లోపం , మానసిక అలసట వంటి సమస్యలు బ్రెయిన్ ఫాగ్ యొక్క సంకేతాలుగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి?  ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఇబ్బందిగా మారుతుంది? ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? వివరంగా తెలుసుకుంటే.. బ్రెయిన్ ఫాగ్.. బ్రెయిన్ ఫాగ్ ఒక వ్యాధి కానప్పటికీ, ఇది తాత్కాలికంగా ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం , ఏకాగ్రత వహించడం వంటి మెదడు సామర్థ్యాలను దెబ్బతీసే ఒక పరిస్థితి.  వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామంది తరచుగా కొద్దికాలం పాటు బ్రెయిన్ ఫాగ్‌ సమస్యను ఎదుర్కుంటారు. వైద్య నివేదికల ప్రకారం, దీర్ఘకాలిక మానసిక అలసట, గందరగోళం , అయోమయం వంటి సమస్యకు 'బ్రెయిన్ ఫాగ్' అనే పదాన్ని ఉపయోగిస్తారు. బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది? తరచుగా ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం , శరీరంలో నీటి కొరత వంటి సమస్యల వల్ల ఇది వస్తుంది. చాలా సందర్భాలలో, విటమిన్ లోపం లేదా హార్మోన్ల మార్పులు వంటి అంతర్గత సమస్యల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ ఏర్పడవచ్చు. థైరాయిడ్, రక్తహీనత, విటమిన్ బి12 లోపం, డిప్రెషన్ వంటి వాటిలో కూడా బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు కనిపిస్తాయి, కాబట్టి బ్రెయిన్ ఫాగ్ సమస్య ఉన్నట్టు అనిపిస్తే వైద్యులను సంప్రదించి సమస్య తెలుసుకోవడం ఎంతో మంచిది. బ్రెయిన్ ఫాగ్ ఎలా గుర్తించాలి? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారవచ్చు, కానీ కొన్ని సంకేతాలు చాలా సాధారణంగా ఉంటాయి. చిన్న విషయాలు మర్చిపోవడం, ఇతరులతో మాట్లాడే సమయంలో సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, పని చేస్తున్నప్పుడు తరచుగా పరధ్యానానికి గురికావడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం అనేవి సర్వసాధారణమైన లక్షణాలు. కొంతమంది తాము ఇటీవల చదివిన విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మరికొందరు మీటింగ్స్ లేదా ఇతరులతో మాట్లాడే  సమయంలో విషయాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగి, రోజువారీ  జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే తప్పకుండా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. ఇవి కూడా తెలుసుకోవాలి.. మెదడు మొద్దుబారడం  అనేది ఎల్లప్పుడూ మర్చిపోవడానికి లేదా ఏకాగ్రత కోల్పోవడానికి సంకేతం కాదు. ఒత్తిడి లేదా ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల అప్పుడప్పుడు మతిమరుపు రావడం సాధారణమే. అయితే, నిరంతరంగా ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, మానసిక స్పష్టత లోపంతో పాటు, మతిమరుపు ఎక్కువగా  సంభవిస్తే, దానిని సీరియస్ గా తీసుకోవాలి. బ్రెయిన్ ఫాగ్ , డిమెన్షియా వంటి తీవ్రమైన సమస్యల  లక్షణాలు కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి, కాబట్టి వైద్యుడిని సంప్రదించి సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల  ప్రకారం గర్భధారణ , మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు మహిళల్లో బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలను కూడా కలుగజేస్తాయి. థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, రక్తహీనత , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                     *రూపశ్రీ.