LATEST NEWS
మూడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ప్రముఖ నేతలు ఒకే వేదికపై కనిపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ లు ఒకే వేదికపై కనిపించడం మూడు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారింది.  చెన్నైలో గురువారం (నవంబర్ 5) జరిగిన ఓ వివాహవేడుకలో ఈ  ముగ్గురూ పక్కపక్కనే నిలబడి ముచ్చటించుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి.  చెన్నైలోని  లీలా ప్యాలెస్ హోటల్‌లో వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ కుటంబానికి చెందిన అనిల్ రెడ్డి కుమార్తె  వివాహం జరిగింది.   ఈ వేడుకకు దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.   ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న వైఎస్ జగన్, తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ బలమైన గళం వినిపిస్తున్న కేటీఆర్, అలాగే తమిళనాట సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించిన సీఎం విజయ్ ఒకే వేదికను పంచుకోవడం అందరినీ ఆకర్షించింది.   గతంలోనూ కేటీఆర్,  జగన్ మధ్య మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో కేటీఆర్ బహిరంగంగానే జగన్‌ను సోదరుడిగా సంబోధిస్తూ తన ఆప్యాయతను చాటుకున్నారు. ఇప్పుడు వారికి తమిళనాడు సీఎం విజయ్ కూడా తోడవడంతో ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: చంద్రబాబుపై కేటీఆర్ పొగడ్తల వర్షం: ఖండించలేక, సమర్థించలేక జగన్ సతమతం.! అన్నిటికీ మించి జగన్, కేటీఆర్, విజయ్ లతో ముచ్చటిస్తున్న ఫొటోలు, వీడియోలను ఏపీలో వైసీపీయులు ఏ రకంగా తమ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకుంటారో అన్న ఆసక్తి వ్యక్తమౌతోంది. ఎందుకంటే..  గతంలో కూడా చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు జగన్  హాజరు కావడం.. ఆ పెళ్లికి టీవీకే అధినేత విజయ్ కూడా హాజరు కావడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఆ వివాహ వేడుకలో విజయ్, జగన్ లు పక్కపక్కనే ఉన్నఫొటోలను వైసీపీయులు సోషల్ మీడియాలో పోస్టు చేసి జగన్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ విజయం సాధించి సీఎం అయిన తరువాత కూడా ఈ  ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి జగన్ వల్లనే విజయ్ తమిళనాడు సీఎం అయ్యారన్న రేంజ్ లో వైసీపీయులు ప్రచారం చేసుకున్నారు.  ఆ తరువాత ఇంత కాలానికి మళ్లీ చెన్నైలోనే జగన్, విజయ్ లు ఒకే వేదిక మీద పక్కపక్కనే కనిపించడంతో  ఈ సారి ఏ రేంజ్ లో జగన్ కు ఎలివేషన్ ఇవ్వడానికి వైసీపీయులు ప్రయత్నిస్తారో అన్న ఆసక్తి ఏపీలో వ్యక్తమౌతోంది. ఇక ఇఖ్కడ కొసమెరుపేంటంటే.. ఈ వివాహ వేడుకకు విజయ్ తన ఫ్రెండ్ సినీనటి త్రిషతో కలిసి హాజరయ్యారు.   మీకు నచ్చవచ్చు: విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్.. కనకదుర్గమ్మ దర్శనానికి రాబోతున్న దళపతి? జగన్ చొక్కా మడతపెట్టడం కాదు: జనం జగన్ ను మడతపెట్టేశారు.! [Jagan Vijay KTR  One Frame, YS Family Wedding,  Chennai, South Indian Politics, YCP, Allivations Telugu One] 
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బ్యారేజీల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల మేరకే మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ఈ ఏడాది డిసెంబర్‌లోనే పునరుద్ధరణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా బ్యారేజీలను సురక్షితంగా పునరుద్ధరించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని సీఎం పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని లిఫ్ట్ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నీటిని సాంకేతికంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు వివరించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, నిర్మాణ లోపాలున్న ఈ రెండు బ్యారేజీల గేట్లను తెరిచే ఉంచాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. దిగువ గోదావరి జలాల సద్వినియోగం.! దిగువ గోదావరిలో లభించే నీటిని వృథా కాకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా సమర్థంగా వినియోగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకాల ద్వారా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించినట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయగా, ఈ మూడేళ్లలో సగటున 18.13 టీఎంసీల నీటిని వినియోగించినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ఇది 89 శాతం అధికమని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టు ద్వారా 8.10 టీఎంసీలు.. మొత్తంగా 24.81 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకున్నట్లు వెల్లడించారు. రూ.4,193 కోట్లతో పునరుద్ధరణ ప్రణాళిక.! మూడు బ్యారేజీల పునరుద్ధరణకు రూపొందించిన ప్రణాళికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మేడిగడ్డ కుంగుబాటుకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణ లోపాలే కారణమని సీఎం పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే కరువు పరిస్థితుల్లోనూ నీటి ఇబ్బందులు తలెత్తేవి కాదని అభిప్రాయపడ్డారు.  ప్రాణహిత జలాలను తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉండేదని చెప్పారు.మేడిగడ్డ దెబ్బతిన్న తర్వాత మూడు బ్యారేజీల పరిస్థితిపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయించినట్లు అధికారులు తెలిపారు. జాతీయ స్థాయి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల సహకారంతో అవసరమైన పరిశోధనలు పూర్తి చేసినట్లు వివరించారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ కోసం సుమారు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ లోపాల కారణంగా చేపట్టాల్సిన మరమ్మతుల వ్యయాన్ని సంబంధిత నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయాన్ని ప్రభుత్వం భరించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు. డిసెంబర్‌లో పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం.! మూడు బ్యారేజీల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరులోగా తుది అనుమతులు పొందేందుకు ప్రయత్నించాలని, డిసెంబర్‌లో పనులు ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బ్యారేజీల నీటి వినియోగ సామర్థ్యాన్ని పునరుద్ధరించే పనులు, రక్షణ చర్యలను రెండు దశలుగా విభజించి చేపట్టాలని సూచించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, టన్నెల్స్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.   ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ తప్పులు చేస్తున్నారా.. ఆరోగ్యానికి ప్రమాదమే..! [ Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation ]
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరులోని మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన తనిఖీలు పూర్తయ్యాయి. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 17 కింద హైదరాబాద్ జోనల్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. 84 రోజుల పాటు రిసార్ట్‌లోనే జవాబు పత్రాలు.! ఈ కేసులో గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌లాండ్ రిసార్ట్ వ్యవహారం కీలకంగా మారింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకన బాధ్యతను కామ్‌సైన్ మీడియా అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను రిసార్ట్‌కు తరలించి, 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఏకంగా 84 రోజుల పాటు అక్కడే ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మూల్యాంకనం చేయకుండానే రూ.1.14 కోట్లు.? ఈడీ ప్రాథమిక విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా మూల్యాంకనం చేయకుండానే పాత మార్కులను కొత్త మార్కులుగా నమోదు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, అప్పటి కార్యదర్శి సంతకంతో కామ్‌సైన్ సంస్థకు రూ.1.14 కోట్ల ప్రజాధనం చెల్లించిన వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. ఆ తర్వాత ఆ మూల్యాంకనాన్ని రద్దు చేసి, సీసీటీవీ నిఘాలో మరోసారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించినట్లు సమాచారం. ఏడు చోట్ల సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం.! కామ్‌సైన్ మీడియా ఎండీ మధుసూదన్ రావుకు సంబంధించిన ప్రదేశాలు, హాయ్‌లాండ్ రిసార్ట్, ట్రూగ్రేడర్ సర్వీసెస్ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. రూ.1.14 కోట్ల చెల్లింపులను నేరం ద్వారా సంపాదించిన సొమ్ము (Proceeds of Crime) కోణంలో పరిశీలిస్తోంది. సీతారామాంజనేయులుతో పాటు పలువురి వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు, సంబంధిత ఆస్తుల పత్రాలనూ పరిశీలిస్తున్నారు. మొత్తంగా 84 రోజుల పాటు రిసార్ట్‌లో జవాబు పత్రాలను ఉంచడం వెనుక అసలు కారణమేంటి? మూల్యాంకనం చేయకుండానే రూ.1.14 కోట్లు ఎలా చెల్లించారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే ప్రశ్నలకు ఈడీ దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది. ఈ సోదాలతో గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.   ఇది కూడా చదవండి: మయోనైజ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఏడాది పాటు బ్యాన్.!   [ APPSC Group-1 Scam, ED Investigation, Group-1 Evaluation Scam, Resort Controversy, 84 Days Resort Stay, APPSC Papers, Enforcement Directorate, Evaluation Irregularities, Andhra Pradesh Politics, Group-1 Case ]
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పచ్చిగుడ్లతో తయారు చేసే మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ఆహార కలుషిత ఘటనలు, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తయారీ నుంచి విక్రయాల వరకు నిషేధం.! రాష్ట్రవ్యాప్తంగా పచ్చిగుడ్లతో తయారయ్యే మయోనైజ్ తయారీ, నిల్వ, విక్రయాలపై ఈ నిషేధం వర్తించనుంది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006లోని సెక్షన్ 30(2)(ఎ) ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు 2026 అక్టోబర్ 30 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను నవంబర్ 4న విడుదల చేశారు. ఫుడ్ పాయిజనింగ్ ముప్పుతోనే నిర్ణయం.! పచ్చిగుడ్లతో తయారుచేసే మయోనైజ్‌ను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, తయారీ సమయంలో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఆహార కలుషితం జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. హోటళ్లు, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు.! ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార విక్రయ సంస్థలు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. నిషేధాన్ని ఉల్లంఘించి పచ్చిగుడ్ల మయోనైజ్‌ను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయించినా సంబంధిత సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మొత్తంగా ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పచ్చిగుడ్ల ఆధారిత మయోనైజ్ తయారీ, సరఫరా, విక్రయాలకు ఏడాది పాటు బ్రేక్ పడనుంది. అయితే ఈ నిషేధం పచ్చిగుడ్లతో తయారైన మయోనైజ్‌కే వర్తిస్తుందని, ఇతర ప్రత్యామ్నాయ ఉత్పత్తుల విషయంలో ఉత్తర్వుల నిబంధనలను పరిశీలించాలని ఆహార వ్యాపారులు గుర్తుంచుకోవాలి. ఇది కూడా చదవండి: ఇకపై సంక్షేమ పథకాలు పొందాలంటే ఆ గుర్తింపు కార్డు ఉంటేనే అర్హత.!       [ Telangana Mayo Ban, Raw Egg Mayonnaise Ban, Telangana Food Safety, Mayonnaise Ban 2026, Food Poisoning, Telangana Government Orders, Food Safety Commissioner, Hyderabad Food News, FSSAI Act 2006 ]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం దేశవ్యాప్తంగా సంక్షేమ ఫలాలు అందాలంటే ఆధార్ కార్డు  తెల్ల రేషన్ కార్డులను మాత్రమే ప్రామాణికంగా పరిగణిస్తూ వచ్చారు.  అయితే, ప్రస్తుత మారుతున్న కాలానికి అనుగుణంగా అర్హుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు కేంద్రం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, ఇకపై రేషన్ లేదా ఆధార్ కార్డుల స్థానంలో ఓటరు గుర్తింపు కార్డును ప్రధాన ప్రామాణికంగా మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ సులభంగా ఉండటం  చాలా చోట్ల తేలికగా పొందగలుగుతుండటంతో కొన్ని లోపాలు తలెత్తుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.దీనివల్ల నిజమైన అర్హులకు లబ్ది చేకూర్చడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఓటరు ఐడీతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించాలని పరిశీలిస్తున్నారు. ఈ కొత్త నిబంధన అమలైతే బోగస్ లబ్దిదారులకు అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ ధనం వృథా కాకుండా నేరుగా అర్హులకే చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.త్వరలోనే ఈ ప్రతిపాదనలపై అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఇది అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా అమలు కానున్న సంక్షేమ విధానాలపై భారీ ప్రభావం చూపనుంది.     [ Welfare scheme benefits Voter ID, Voter ID vs Aadhaar, Central government schemes, Indian government news, Telugu news updates, Indian government news, Telugu News, Telugu One ]
ALSO ON TELUGUONE N E W S
'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' వరుస విజయాలతో జోరు మీదున్న తమిళ స్టార్ సూర్య.. ఇప్పుడు ‘సీన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘ఆవేశం’, ‘రోమాంచమ్’ వంటి సినిమాలతో తనదైన మేకింగ్ స్టైల్ చూపించిన మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. ఇక సూర్య, నజ్రియా, నస్లేన్ కాంబినేషన్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవంబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి స్పందనే లభిస్తోంది. ‘సీన్’లో సూర్య ఇన్బరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. గతంలో పరిష్కారం కాని ఓ కేసును ఛేదించేందుకు ఆయన మళ్లీ రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో విచిత్రమైన వ్యక్తిత్వాలు ఉన్న ఓ టీమ్‌తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. నస్లేన్ పోషించిన ఈశ్వరన్ పాత్రతో సూర్యకు ఎదురయ్యే పోరాటం కథలో కీలకంగా నిలుస్తుంది. సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సూర్య క్యారెక్టరైజేషన్, ఆయన ఇంట్రడక్షన్ సీక్వెన్స్, స్టైలిష్ నటన ఆకట్టుకున్నాయని అంటున్నారు. నస్లేన్ పాత్రను కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారని, అతడి బాడీ లాంగ్వేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. నజ్రియా కామెడీ టైమింగ్, సూర్యతో ఆమె వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించాయని చెబుతున్నారు. సినిమాలోని ట్విస్టులు, సర్‌ప్రైజ్ కామియో ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాయని పోస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని, అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. జిత్తు మాధవన్ తన మార్క్ కామెడీ, క్రైమ్ ఎలిమెంట్స్‌ను కొత్తగా కలిపారని, సుషిన్ శ్యామ్ సంగీతం కూడా సినిమాకు బాగా సెట్ అయిందని ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ మరోవైపు కొంతమంది మాత్రం సినిమాపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కథలో బలం తక్కువగా ఉందని, ఇన్వెస్టిగేషన్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని కొందరు అంటున్నారు. నస్లేన్ పాత్రను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగాయని, కామెడీ కూడా అన్ని చోట్లా వర్కవుట్ కాలేదని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా చూస్తే ‘సీన్’కు సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎక్కువగా పాజిటివ్ స్పందనే కనిపిస్తోంది. సూర్య నటన, నస్లేన్ క్యారెక్టరైజేషన్, నజ్రియా కామెడీ, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా చెబుతున్నారు. అయితే కథనం, సెకండాఫ్ విషయంలో కొంతమంది ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటోందో చూడాలి. మీకు నచ్చవచ్చు: రామాయణ మూవీ రివ్యూ బిగ్ సర్‌ప్రైజ్‌.. అప్పుడే ఓటీటీలోకి ‘జైలర్ 2’.!       [Suriya Scene Twitter Review, Scene Review Telugu, Scene Movie Review, Scene Movie Public Talk, Suriya, Nazriya Nazim, Naslen, Jithu Madhavan, Scene Movie]  
  అయోధ్య రాముడు నిన్న సెల్యులాయిడ్ పై కాలు మోపిన విషయం తెలిసిందే. టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో  ఆల్ ఓవర్ ఇండియాలోని సింగిల్ స్క్రీన్స్, మల్టి ప్లెక్స్ లు అభిమానులు, ప్రేక్షకులతో కళకళ లాడతున్నాయి.  దీంతో మొదటి రోజు  వరల్డ్ వైడ్ గా 150 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుని ట్రేడ్ వర్గాలని  సైతం ఆశ్చర్యపరిచింది. భాషల వారీగా చూస్తే, హందీ వెర్షన్ రికార్డు స్థాయిలో  47.50 కోట్ల షేర్‌తో సింహభాగం ఆక్రమించింది. కన్నడ వెర్షన్ 7.25 కోట్లు సాధించగా, తెలుగు ప్రాంతాలలో . 6 కోట్ల వసూళ్లను రాబట్టి దక్షిణాది మార్కెట్‌లో కూడా బలమైన పునాది వేసింది. థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా విశేషంగా నమోదైంది. ముఖ్యంగా ఈవెనింగ్ అండ్ నైట్ షోలలో హిందీ 3డి ఫార్మాట్‌లో అత్యధికంగా 38.08% ఆక్యుపెన్సీ నమోదవ్వగా, హైదరాబాద్‌లో 37.3%, కోల్‌కతాలో 38% పైగా థియేటర్ల సీట్లు నిండిపోయాయి.   ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సందడి మొదలైంది. నార్త్ అమెరికాలో మొదటి రోజు తొలి సగం సమయానికే $940,000 డాలర్లు వసూలు చేయగా, మొదటి రోజు మొత్తం ఓవర్సీస్ ప్రీమియర్లతో కలిపి సుమారు $3.5 మిలియన్ డాలర్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఘనంగా జరిగిన సాయి దుర్గాతేజ్ నిశ్చితార్థ వేడుక: అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్! సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ మరియు రాబోయే దీపావళి లాంగ్ వీకెండ్ తోడుకావడంతో, ఫస్ట్ వీక్ లోనే  375 కోట్ల నికర కలెక్షన్ల మార్కును దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. లైఫ్‌టైమ్ బాక్సాఫీస్ రన్ పరంగా గ్లోబల్ మార్కెట్‌లో ఏకంగా1,600 కోట్ల నుంచి రూ. 1,800 కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా చూపిస్తున్న అద్భుతమైన అభినయం, సీతగా సాయి పల్లవి ఒదిగిపోయిన తీరు,రావణాసురుడిగా యష్ చూపించిన రాజసం,ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే రిపీట్ ఆడియన్స్ పక్కా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.   మీకు నచ్చవచ్చు:ఘనంగా జరిగిన సాయి దుర్గాతేజ్ నిశ్చితార్థ వేడుక: అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్! మీకు నచ్చవచ్చు :సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ    [Ramayana Part 1 First Day Collections, Ramayana first day box office collections, Ramayana Part 1 Day 1 collection, Ranbir Kapoor Ramayana box office, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]
రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "యద్భావం తద్భవతి".  వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్ గా నటిస్తుండగా సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల విడుదల కానుంది. శ్యామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మిహిరామ్ సంగీతం అందించారు. విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా "యద్భావం తద్భవతి" చిత్ర టీజర్ ను ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ గారి చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది.  ఇది కూడా చదవండి: బాలయ్య ‘దాదా’ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.! "యద్భావం తద్భవతి" టీజర్ ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక వరుణ్ సందేశ్ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది. ఆ పాత్ర వెనుక ఏదో కథ దాగి ఉంది? అనే క్యూరియాసిటీ కలిగేలా మలిచారు. టీజర్ లాంచ్ ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఇప్పుడే యద్భావం తద్భవతి చిత్ర టీజర్ చూసాను. ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి గారు నిర్మించిన ఈ చిత్ర టీజర్ చూస్తుంటే చిన్న సినిమా అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఒక పాట కూడా చూడటం జరిగింది. రమేష్ జక్కల  గారి దర్శకత్వం, మిహిరామ్ గారి సంగీతం చాలా బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కళ పట్ల ఉన్న అభిమానంతో సినిమా తీయడం చాలా పెద్ద విషయం.  ఈ సినిమాలో నటించిన వరుణ్ సందేశ్ అలాగే ఇతర నటీనటులకు చిత్ర బృందానికి నా అభినందనలు. లోహిత్, శ్రీకాంత్ అయ్యంగర్ వంటి ఎంతో సీనియర్ నటులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి నిర్మాత మరో సినిమా తీసేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అన్నారు.  మీకు నచ్చవచ్చు: 'ఇట్లు అర్జున' హీరో అనీష్ ఎవరు?.. నాగార్జున, ఎన్టీఆర్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదేనా.? బాంబు పేల్చిన రెజీనా.. బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్లని ఇంత దారుణంగా చూస్తారా.?       [Yad Bhavam Tad Bhavathi Teaser, Yadbhavam Tadbhavathi Teaser, Varun Sandesh, Inaya Sultana, Ramesh Jakkala, Sridhar Lagadapati, Telugu Movies 2026, Telugu Film News]  
మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. నిన్న గురువారం నాడు హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ వేదికగా తన స్నేహితురాలు అయిన కిరణ్మయితో నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది.   కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య  ఉంగరాలు మార్చుకుని వివాహ బంధానికి తొలి అడుగు వేశారు. ఈ వేడుక మెగా కాంపౌండ్‌లో పండుగ ವాతావరణాన్ని నింపింది.నిశ్చితార్థ వేడుకకు అత్యంత ప్రాధాన్యత లభించడానికి ప్రధాన కారణం కొణిదెల మరియు అల్లు కుటుంబాల గ్రాండ్ రీ-యూనియన్. గత కొంతకాలంగా వేర్వేరు కార్యక్రమాల్లో కనిపించిన మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ శుభకార్యం కోసం ఒకే చోట చేరి సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   వీరితో పాటు నాగబాబు, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల, అల్లు శిరీష్, అలాగే పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మరియు కుమార్తె ఆద్య ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఇది కూడా చదవండి: Summer Holidays Movie Review Telugu: సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ  వేడుక ముగిసిన వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా నిశ్చితార్థ ఫోటోను పంచుకుంటూ నూతన జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. "#KiranTejForever"అనే హాష్‌ట్యాగ్‌తో చరణ్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.   సోషల్ మీడియాలో మెగా, అల్లు హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో నిలిచిన పిక్చర్ టాలీవుడ్ వర్గాల్లోను, అభిమానుల్లోను విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అలాగే సినీ ప్రముఖులు మంచు మనోజ్-భూమా మౌనిక, నటుడు నవదీప్, దర్శకుడు వెంకీ కుడుముల, కమెడియన్ హర్ష చెముడు తదితరులు హాజరై జంటని ఆశీర్వదించారు. మీకు నచ్చవచ్చు : ఇద్దరిలో బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చింది ఆ హీరోనే: ఆ హీరో ఫ్యాన్స్ ఫీలవ్వద్దు! మీకు నచ్చవచ్చు :గత రామాయణ చిత్రాలకి, ఇప్పటి రామాయణకి ఉన్న తేడా ఇదే!    [Sai Durgha Tej Engagement, sai durgha tej fiancée kiranmayi, mega family engagement photos, ram charan allu arjun mega reunion, sai dharam tej wedding date, Tollywood, Tolywood News, Telugu Cinema, Telugu Cinema News]
-సినిమా పేరు : 'సమ్మర్ హాలిడేస్' -నటీనటులు : రోహన్, అరుణ్, జయసుధ, వాసుకి, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, ఖుషి, హర్షిణి తదితరులు.. -మ్యూజిక్ : శింజిత్ ఎర్రమిల్లి -ఎడిటింగ్ : సంతోష్ నాయుడు -ఫొటోగ్రఫీ : సాయి ప్రకాష్ -బ్యానర్ నేమ్ : ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ -నిర్మాతలు : ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని -రచన, దర్శకత్వం: శ్రీకర్ నయన్ -విడుదల తేదీ :  నవంబర్ 6 , 2026  ప్రచార చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న 'సమ్మర్ హాలిడేస్' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.  కథ  రావూరి వెంకటేష్ ఉరఫ్ ఆర్. వి (అరుణ్ దేవ్) . వయసు సుమారు పదమూడేళ్లు.. కల్మషం అంటూ లేని స్వచ్ఛమైన మనసు తన సొంతం. క్రికెట్ అంటే ప్రాణం. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే బాగానే చదువుతాడు. కానీ ర్యాంకుల కోసం తండ్రి( హర్షవర్ధన్) ఫోర్స్ చేస్తుంటాడు. కానీ ఆర్. వికి అంత సీన్ లేదు. తల్లి పేరు (వాసుకి) ఆర్ వి కి ఫుల్ సపోర్ట్. తోటవారిపాలెం అనే గ్రామానికి చెందిన  కాశీ వెంకటేశ్వర్లు ఉరఫ్ కెవి (రోహాన్ ). ఆర్. వి వయసే. బాగా పేదవాడు. తాగుడుకి బానిసై చిన్న వయసులోనే తండ్రి చనిపోతాడు.  దాంతో అప్పులు తీర్చడానికి స్కూల్ కి వెళ్తూనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడు ఫేస్ లో డల్ నెస్ కనిపించదు. తల్లి( హర్షిణి) ఉంటుంది. తన తల్లికి మంచి చీర కొనిపెట్టాలనే ది తన లక్ష్యం. అలాంటి లైఫ్ తో కుస్తీ పడుతున్న ఆర్. వి, కెవి ఇద్దరు తోటవారిపాలెంలో కలుస్తారు. ఆ ఇద్దరు తోటవారిపాలెం లో ఎలా కలిశారు? ఏం చేసారు? ఎవరెవరు పరిచమయ్యారు? లైఫ్ లో కొచ్చిన అదనపు సంతోషాలేంటి? నేర్చుకున్న పాఠాలు ఏంటి? అసలు సమ్మర్ హాలిడేస్ ఏ పర్పస్ తో తెరకెక్కింది అనేదే మూవీ. ఎనాలసిస్  పాన్ ఇండియా దినుసులతో  తెరకెక్కుతున్న సినిమాల మధ్య సమ్మర్ హాలిడేస్ లాంటి చిన్న సినిమా రావడం నిజంగా గ్రేట్.. ఈ విషయంలో మేకర్స్ ని నూటికి నూరుశాతం  మెచ్చుకోవలసిందే. గలగల పారే సెలయేరులా కథ, కథనం సాగింది. కాకపోతే సెలయేరు కూడా వంపులు, పాయలు గా మారుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా! సేమ్ సమ్మర్ హాలిడేస్ పరిస్థితి కూడా అదే. సినీ ట్రిక్ లా స్క్రీన్ ప్లేలో మెరుపులు లేకపోవడం కొంచం ఇబ్బంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఆర్ వి , తండ్రి, తల్లి మధ్య వచ్చిన సీన్స్ రొటీన్. చాలా సినిమాల్లో చూసేసాం. తోటివారి పాలెంకి కథ షిఫ్ట్ అవ్వగానే ఆర్. వి, కె వి మధ్య వచ్చిన అన్ని సీన్స్ బాగున్నాయి. చాలా మందికి బాల్యం గుర్తుకొస్తుంది. కాకపోతే కెవి ఫ్యామిలీ కష్టాలని కథ రన్ అవ్వడం కోసం కావాలని పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో మేకర్స్ మరింత జాగ్రత్త పడాల్సిందేమో. ఆర్ వి అమ్మమ్మ( జయసుధ) సీన్స్ కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్స్ టార్డినరీ. సెకండ్ హాఫ్ చూసుకుంటే వచ్చిన అన్ని సీన్స్ బాగానే ఉన్నా,మనకి ముందుగానే తేలిపోస్తుంటాయి. మామిడి చెట్ల ఓనర్( రాజీవ్ కనకాల)  తో పాటు ఆ సందర్భంగా వచ్చిన  సీన్స్ , పుట్టిన రోజు వేడుకలు, తల్లికి చీర కొనాలన్నా కోరిక నెరవేరడం ఇలా కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ పర్లేదు.  నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు    ఆర్. వి గా అరుణ్ దేవ్ జీవించి పడేసాడు. తనకి నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందో మరోసారి చాటి చెప్పాడు. కెవి గా  రోహన్ సైతం తగ్గేదెలే అనేలా చేసాడు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టేసాడు.  హర్షవర్ధన్,  వాసుకి,  రాజీవ్ కనకాల బాగానే చేసినా అలాంటి నటన చాలా సినిమాల్లోనే చేసేసారు. అమ్మమ్మగా సహజ నటి  జయసుధ గారు సహజమైన నటనతో మెప్పించింది. స్కూల్ అమ్మాయిగా ఖుషి, రోహన్ తల్లిగా హర్షిణి, మహేష్ ఆచంటతో పాటు మిగతా నటీనటులు తమ క్యారక్టర్ ల  పరిధి మేరకు నటించారు.ఫోటిగ్రఫీ బాగుంది. సాంగ్స్ యావరేజ్ అయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  బాగుంది. శ్రీకర్ నయన్  దర్శకుడుగా భారీగా సక్సెస్ అయ్యాడు. కాకపోతే డైలాగ్స్, స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది.నిర్మాణ విలువలు సూపర్ బలాలు 1 .కథ  2 .పల్లెటూరి నేపథ్యం  3 . రోహన్, అరుణ్ పెర్ఫార్మెన్స్ 4 . దర్శకత్వం  బలహీనతలు  1 .ఎలాంటి కథనం వస్తుందో ముందుగానే తెలిసిపోతుండటం  చివరిగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత చిన్న పిల్లల ఆనందాలు, భావోద్వేగాలని బాగానే చెప్పింది.  రేటింగ్ 2 .5 /5                                                                                                                                                                                                                                                          అరుణాచలం   
Actor Sai Durgha Tej and Kiran got engaged at Hilton Hyderabad Genome Valley Resort on 5th November, 2026.  The couple got engaged in the presence of their families and loved ones. The ceremony was a cherished family occasion, bringing together members of the Konidela and Allu families, along with close relatives and friends, to celebrate the couple as they embark on a new chapter in their lives. Ram Charan wished the couple on X and shared the pic, "Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning. Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you! #KiranTejForever" The wedding of Sai Durgha Tej and Kiran is scheduled to take place on December 10, 2026, in Hyderabad. The engagement was attended by Sai Durgha Tej’s parents, Dr. Siva Prasad and Vijaya Durga, and his brother Vaishnav Tej. Chiranjeevi and Surekha Konidela; Ram Charan; Allu Arjun and Sneha Reddy; Allu Bobby and Neela Shah; Varun Tej, Lavanya Tripathi and Vaayuv Tej; Naga Babu and Padmaja; Niharika Konidela; Allu Aravind and Allu Nirmala; Allu Sirish and Nayanika Reddy; and Akira Nandan and Aadhya, attended as special guests.  Close friends and colleagues, including Manchu Manoj and Bhuma Mounika Reddy; Naveen Vijay Krishna; Harsha Chemudu; Venky Kudumula; Navdeep; and Harshith Reddy, were also present.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితేశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ చిత్రాన్ని చూసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ‘రామాయణ’ సినిమా భారీ స్థాయి, తెరపై కనిపించే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని రాజమౌళి పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్ద తెరపై ఈ దృశ్యాలను చూస్తుంటే గొప్ప అనుభూతి కలుగుతుందని తెలిపారు. ఇక శ్రీరాముడి పాత్రలో నటించిన రణ్‌బీర్ కపూర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా వనవాసం ఘట్టం మొదలైన తర్వాత రణ్‌బీర్ నటన ఎంతో ప్రశాంతంగా, అదే సమయంలో గంభీరంగా ఉందని ప్రశంసించారు. ఇక రావణుడి పాత్రలో యశ్ తనదైన ఉనికితో ఆకట్టుకున్నారని రాజమౌళి అన్నారు. రావణుడిగా యశ్ తెరపై కనిపించిన తీరు భయపెట్టేలా ఉందని కొనియాడారు. మరోవైపు సీత పాత్రలో సాయిపల్లవి ఎంతో హుందాగా కనిపించారని ప్రశంసించారు. ఈ ముగ్గురు నటీనటులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారన్న అభిప్రాయాన్ని రాజమౌళి తన రివ్యూలో వ్యక్తం చేశారు. సినిమాలోని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు తనకు ఎంతగానో నచ్చాయని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని రాజమౌళి పేర్కొన్నారు. ఇంతటి భారీ ఆలోచనను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఇద్దరిలో బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చింది ఈ హీరోనే.. ఆ హీరో ఫ్యాన్స్ ఫీలవ్వద్దు ఇక ‘రామాయణ’లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన ప్రయత్నం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌పై కూడా రాజమౌళి సానుకూలంగా స్పందించారు. ప్రతి భారతీయ కథకుడు చెప్పాలని కలలు కనే కథ రామాయణమని, ఇలాంటి గొప్ప ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్న చిత్ర బృందాన్ని అభినందించారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మరోసారి ప్రశంసలు కురిపించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మరి రాజమౌళి ప్రశంసలకు తగ్గట్టుగానే ‘రామాయణ’ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: నెల రోజులపాటు రజనీకాంత్ బర్త్‌డే వేడుకలు.. లారెన్స్ ప్లాన్ వెనుక కారణం ఇదే.!   [SS Rajamouli Ramayana Review, Ramayana Part 1, Ranbir Kapoor, Yash, Sai Pallavi, Nitesh Tiwari, Namit Malhotra, Rajamouli Praises Ramayana]
‘కేజీఎఫ్’ సినిమాలో యశ్ తల్లిగా నటించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కన్నడ నటి అర్చనా జోయిస్. ఆ సినిమాలో ఆమె నటన, ముఖ్యంగా రాఖీ భాయ్‌ చిన్నప్పటి ఎమోషనల్ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అలాంటి అర్చనా జోయిస్ ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా ఆమె నటించబోయే కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. అర్చనా జోయిస్ హీరోయిన్‌గా అలరించనున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘అమీతుమీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అతిథి మైకల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకుడు వి.వి. వినాయక్, హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేయగా.. నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాతో దివాకర్ యడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రెండు మనసుల మధ్య పుట్టే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా వినోదాత్మక అంశాలను కూడా జోడిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, కేరళలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఇది కూడా చదవండి: రామాయణ మూవీ రివ్యూ! ఇక ఈ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న అర్చనా జోయిస్ మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు తనపై ఎంతో ప్రేమ చూపించారని, ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.  కన్నడలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఆమెకు ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మరి ‘కేజీఎఫ్’లో ఎమోషనల్ తల్లిగా గుర్తుండిపోయిన అర్చనా జోయిస్.. ఈసారి తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి. మీకు నచ్చవచ్చు: ట్విన్ సిస్టర్స్‌తో రొమాన్స్.. ఒకరిని ప్రేమించి మరొకరితో.? టైటిల్స్‌పై సెన్సార్ ఫోకస్: విడుదలకు ముందు సినిమాలకు మళ్ళీ బారసాల.!       [Archana Jois Heroine Debut, KGF Actress Archana Jois, Archana Jois Telugu Debut, Archana Jois, Vijay Raj Kumar, Divakar Yedla, Telugu Movies 2026, Telugu Film News]  
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదలైనా, పుట్టినరోజు వచ్చినా అభిమానులకు పండగే. అయితే ఈసారి తలైవా పుట్టినరోజు వేడుకలను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఓ భారీ ప్లాన్ సిద్ధం చేశారు. సాధారణంగా సెలబ్రిటీల పుట్టినరోజు వేడుకలు ఒకటి రెండు రోజులు జరుగుతుంటాయి. కానీ రజనీకాంత్ కోసం మాత్రం ఏకంగా నెల రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 12న రజనీకాంత్ తన 76వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా నవంబర్ 12 నుంచి డిసెంబర్ 12 వరకు నెల రోజుల పాటు తలైవా బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు రాఘవ లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఒక నెల.. ఒక వేడుక.. ఒకే ఒక్క తలైవా అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. రజనీకాంత్ పుట్టినరోజుతో పాటు ఆయన కెరీర్‌లో సాధించిన విజయాన్ని కూడా ఈ వేడుకల్లో భాగంగా జరుపుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి తాను రజనీకాంత్‌కు వీరాభిమానినని, తన సినీ జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఆయన స్ఫూర్తి ఎంతో ఉందని లారెన్స్ పేర్కొన్నారు. రజనీకాంత్ తనకు ఎంతో ఇచ్చారని, ఆయన వల్లే తాను ఈ పరిశ్రమలో ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ ఇండస్ట్రీ హిట్ అందుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అందుకే ఈసారి ఆయన 76వ పుట్టినరోజును, ఆ విజయాన్ని కలిపి అభిమానుల మధ్య ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ వేడుకలను రజనీకాంత్ సమక్షంలోనే నిర్వహించాలని రాఘవ లారెన్స్ కోరుకుంటున్నారు. స్వయంగా తలైవాను ఆహ్వానించి ఆయన ముందే ఈ వేడుకలు జరపాలనేది తన కోరిక అని తెలిపారు. అయితే రజనీకాంత్ చాలా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారని, తన కోసం భారీ వేడుకలు నిర్వహించుకోవడాన్ని ఆయన అంతగా కోరుకోరని లారెన్స్ అభిప్రాయపడ్డారు. అందుకే అభిమానుల ప్రేమాభిమానాలతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: బిగ్ సర్‌ప్రైజ్ అప్పుడే ఓటీటీలోకి ‘జైలర్2’ ఈ నెల రోజుల వేడుకల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని లారెన్స్ తెలిపారు. అభిమానులు కూడా ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రజనీకాంత్ పట్ల తనకున్న ప్రేమ, గౌరవం కారణంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ వేడుకల్లో అన్నదానం, సేవా కార్యక్రమాలు ఉంటాయా? అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారా? అనే విషయాలపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. మొత్తానికి రజనీకాంత్‌పై రాఘవ లారెన్స్‌కు ఉన్న అభిమానం మరోసారి బయటపడింది. ఒకప్పుడు తనకు స్ఫూర్తిగా నిలిచిన నటుడి కోసం నెల రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. నవంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకలపై తలైవా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ నెల రోజుల సెలబ్రేషన్స్‌ను లారెన్స్ ఏ విధంగా నిర్వహిస్తారో చూడాలి. మీకు నచ్చవచ్చు: పెళ్లి చేసుకుంటే రూ.30 వేలు నష్టం, హనీమూన్‌కు మరో రూ.30 వేలు.. ఇదేం లెక్క.?   [Rajinikanth Birthday 2026, Raghava Lawrence, Rajinikanth 76th Birthday, Thalaivar Birthday Celebrations, Raghava Lawrence Announcement, Rajinikanth Fans, Superstar Rajinikanth, Rajinikanth Birthday Plans, Kollywood News]
నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరోసారి రిలీజ్ డేట్ టెన్షన్ మొదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దాదా' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, బాలయ్యకు గతంలో గాయం కావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది. నిజానికి ఈ సినిమాను మొదట దసరా కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ కాకినాడ పోర్టులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణకు గాయమైంది. దీంతో ఆయన కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. షూటింగ్ ఆలస్యం కావడంతో క్రిస్మస్‌కు వాయిదా వేశారు.  గాయం నుంచి కోలుకున్న తర్వాత బాలయ్య తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. మైసూర్ షెడ్యూల్‌తో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా కీలకమైన యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశారు. అయితే కాకినాడలో చిత్రీకరించాల్సిన కొన్ని ఫైట్ సన్నివేశాలకు వర్షాలు, తుఫాను ఆటంకంగా మారినట్లు సమాచారం. ఇంకా బాలయ్య, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. దీంతో డిసెంబర్ 24 నాటికి అన్ని పనులు పూర్తవుతాయా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇది కూడా చదవండి: ‘దాదా’ ఫస్ట్ సింగిల్.. బాలయ్య ఫ్యాన్స్ కోసం తమన్ అదిరిపోయే ట్రీట్.! అయితే ఈ వాయిదా ప్రచారంపై తాజాగా చిత్ర బృందం స్పందించింది. 'దాదా' విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. డిసెంబర్ 24నే సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాదు.. ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కూడా వెల్లడించింది. టీమ్ చేసిన ప్రకటనతో వాయిదా వార్తలకు ప్రస్తుతానికి తెరపడింది. 'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'దాదా'పై మంచి అంచనాలున్నాయి. ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీకు నచ్చవచ్చు:  బాంబు పేల్చిన రెజీనా.. బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్లని ఇంత దారుణంగా చూస్తారా.?     బిగ్ సర్‌ప్రైజ్‌.. అప్పుడే ఓటీటీలోకి ‘జైలర్ 2’.!       [Dada Postponement Rumours, Balakrishna Dada Movie, NBK Dada Movie, Dada Release Date, Nandamuri Balakrishna, Gopichand Malineni, Kajal Aggarwal, Manchu Manoj, Telugu Film News]  
అమ్మమ్మల కాలం నాటి అరుదైన వంటకాల రుచి ఎప్పటికీ ప్రత్యేకమే. అందులోనూ నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పెసరపప్పు హల్వా పేరు వింటేనే నోట్లో నీళ్లుూరుతాయి. ఏ ప్రత్యేక సందర్భమైనా, పండగలైనా లేదా దేవునికి నైవేద్యం సమర్పించాలన్నా ఈ సంప్రదాయ తీపి వంటకం ఎప్పుడూ ముందుంటుంది. ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ అద్భుతమైన స్వీట్ తయారీ విధానం మరియు దానికి కావలసిన కచ్చితమైన కొలతలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అద్భుతమైన హల్వా తయారీ కోసం ప్రధానంగా ఒక టీ గ్లాస్ పెసరపప్పు, నాలుగు గ్లాసులు నీళ్లు, అర గ్లాసు కంటే కొద్దిగా తక్కువ స్వచ్ఛమైన నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి, రెండు గ్లాసులు చక్కెర, నాలుగు దంచిన యాలకులు మరియు చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ అవసరమవుతాయి. ఈ ప్రాచీన రెసిపీ తయారీలో మొదటి దశగా, ఒక మందపాటి పాన్‌లో ఒక టీ గ్లాస్ పెసరపప్పును తీసుకొని చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. పప్పును ఇలా వేయించడం వల్ల హల్వాకు అద్భుతమైన రుచి, కమ్మటి వాసన వస్తాయి. అయితే పప్పు మాడిపోకుండా చిన్న మంటపై నిరంతరం కలుపుతూ వేయించడం చాలా ముఖ్యం. చక్కగా వేగిన తర్వాత వీటిని కుక్కర్‌లోకి తీసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో సరిగ్గా నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి. సాధారణంగా మూడు గ్లాసులు పోస్తే పప్పు ముద్దగా మారుతుంది కాబట్టి, హల్వా కాస్త పల్చగా, సాఫ్ట్‌గా రావడానికి అదనంగా మరొక గ్లాసు నీళ్లు కలుపుకోవడం చాలా ముఖ్యం. కుక్కర్‌కు మూత పెట్టి మధ్యస్థ మంటపై 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును బాగా ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి, ఉడికిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. కావాలనుకుంటే మిక్సీ జార్‌లో వేసి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఎనిపిన పప్పు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి, అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే వేడి నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసి చిన్న మంటపై బాగా వేయించాలి. గోధుమపిండి రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవడం ద్వారా ఇది హల్వాకు అద్భుతమైన బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. గోధుమపిండి సరిగ్గా వేగిన తర్వాత, ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని అందులో కలపాలి. మంటను చిన్న నుండి మీడియం స్థాయికి మార్చి, ఉండలు కట్టకుండా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి పప్పు మిశ్రమం బాగా చిక్కబడుతుంది. మిశ్రమం చిక్కబడుతూ ఉన్న సమయంలో, మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అదనంగా వేసి బాగా కలపాలి. అడుగు అంటకుండా నిరంతరం గరిటెతో కలుపుతూ ఉండటం ఈ వంటకంలో అత్యంత కీలకమైన భాగం. హల్వా మరింత చిక్కబడిన తర్వాత, ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో రెండు గ్లాసుల చక్కెరను వేసుకోవాలి. ఒకవేళ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కోరుకుంటే చక్కెర స్థానంలో బెల్లంతో కూడా ఈ హల్వాను ఎంతో రుచిగా చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి:https://teluguone.com/news/content/nethi-bobbatlu-recipe-35-236219.html చక్కెర వేసిన తర్వాత మంటను తగ్గించి, చక్కెర పూర్తిగా కరిగి హల్వా దగ్గర పడే వరకు కలపాలి. చక్కెర కరిగిన తర్వాత మిశ్రమం కొద్దిగా పల్చబడినట్లు అనిపించినా, నిరంతరం కలుపుతూ ఉంటే మళ్ళీ చక్కగా చిక్కబడుతుంది. ఈ దశలో మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. హల్వా పూర్తిగా చిక్కబడిన తర్వాత, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. హల్వా మరింత గట్టిపడిన తర్వాత, మరొక టేబుల్ స్పూన్ నెయ్యి మరియు దంచిన నాలుగు యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ స్టేజ్‌లో నెయ్యి పాన్ అంచుల నుండి విడిపోవడం, హల్వా పాన్‌కు అంటుకోకుండా సులువుగా రావడం ప్రారంభమవుతుంది. ఇలా పాన్ నుండి విడివడుతున్నప్పుడే పెసరపప్పు హల్వా పూర్తిగా రెడీ అయినట్లు భావించాలి. వెంటనే స్టవ్ ఆపివేసి, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులను అందులో వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో సువాసన వెదజల్లే, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే అచ్చమైన అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు హల్వా సిద్ధమవుతుంది. దీన్ని వేడి వేడిగా లేదా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే కుటుంబసభ్యులందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ప్రత్యేక పండగ రోజుల్లోనూ, అతిథులు వచ్చినప్పుడు ఈ ట్రెడిషనల్ స్వీట్‌ను చేసి మీ ఇంట్లో అందరి ప్రశంసలను అందుకుని ఆనందించండి. మీకు నచ్చవచ్చు:https://teluguone.com/news/content/crispy-rice-flour-murukku-35-236136.html                                 https://teluguone.com/news/content/masala-vada-recipe-35-235245.html       Moong Dal Halwa Recipe, Traditional Indian Sweets, Authentic Yellow Lentil Halwa, Grandmothers Special Recipe, Festival Dessert Ideas, Buttery Sweet Recipes, Food Articles In Telugu.  
నాన్ వెజ్ ప్రియులు ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలకు బదులుగా వైవిధ్యమైన రుచులను కోరుకుంటారు. సాధారణంగా ఎరుపు రంగు కారంతో చేసే కూరలకు భిన్నంగా, సరికొత్త పచ్చి కారం మరియు సువాసన వెదజల్లే పచ్చి మసాలాలతో తయారు చేసే గ్రీన్ మటన్ కర్రీ రుచి నూటికి నూరుపాటలు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రత్యేకమైన కూరను రుచి చూస్తే ఎవరైనా మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. ఈ అరుదైన మరియు కమ్మనైన రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రామాణికమైన గ్రీన్ మటన్ కర్రీ తయారీ కోసం ప్రధానంగా సరిగ్గా 1 కేజీ బరువున్న లేత మటన్ చాప్స్ లేదా బోన్ పీసెస్‌ను తీసుకోవాలి. దీనితో పాటు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కూర వేయించడానికి సరిగ్గా 4 టేబుల్ స్పూన్ల నూనె మరియు తగినంత నీరు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. నాన్ వెజ్ వంటకాల్లో ఈ కొలతలు పక్కాగా ఉంటేనే కూర యొక్క అసలైన రుచి మరియు పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇక ఈ కూరకు ప్రత్యేకమైన సువాసనను తెచ్చే పచ్చి మసాలా పేస్ట్ తయారీ చాలా కీలకం. దీనికోసం ముక్కలుగా కోసిన 4 ఉల్లిపాయలు, పొట్టు తీసిన 3 వెల్లుల్లి గడ్డలు, 3 అంగుళాల అల్లం ముక్క, కారానికి తగినట్లుగా 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 5 నుంచి 6 లవంగాలు, 2 యాలకులు, అర కప్పు తాజా పచ్చి కొబ్బరి తురుము, గుప్పెడు తాజా కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు తాజా పుదీనా ఆకులను సేకరించుకోవాలి. మొదటగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ మటన్ ముక్కలను గిన్నెలో వేసి, రుచికి సరిపడా ఉప్పు జోడించి అధిక మంటపై 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల మటన్‌లోని సహజమైన నీరంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత సరిగ్గా 1 గ్లాసు నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై సుమారు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా చదవండి:https://teluguone.com/news/content/chinta-chiguru-royyala-curry-35-236222.html ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి మరియు నల్ల మిరియాలు వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు వేయించాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత దానిని మిక్సీ జార్‌లోకి మార్చుకుని, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తటి పచ్చని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చివరగా ఒక వెడల్పాటి మందపాటి పాత్రలో ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను ఆ నీటితో సహా వేయాలి. ఆపై మనం ముందుగా సిద్ధం చేసుకున్న గుమగుమలాడే తాజా గ్రీన్ మసాలా పేస్ట్‌ను ఇందులో కలిపి మంటపై బాగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత దించుకుంటే నోరూరించే అచ్చమైన గ్రీన్ మటన్ కర్రీ సిద్ధమవుతుంది. మీకు నచ్చవచ్చు:https://teluguone.com/news/content/nalla-kura-fry-35-236225.html                               https://teluguone.com/news/content/senagapappu-mutton-curry-35-235799.html     Green Mutton Curry, Hariyali Mutton Recipe, Green Masala Mutton, Non Veg Recipes, Traditional Cooking Guide, Mutton Gravy Dishes, Food Articles In Telugu.
దీపావళి పండుగ అనగానే వెలుగులు, బాణసంచా మరియు ఉత్సాహం ఉరకలేస్తాయి. కానీ చిన్న క్షణం నిర్లక్ష్యం మొత్తం ఆనందాన్ని వైద్య అత్యవసర పరిస్థితిగా మార్చేయవచ్చు. ముఖ్యంగా టపాసులు కాల్చేటప్పుడు వెలువడే మంటలు, నిప్పు రవ్వలు మరియు ప్రమాదకర రసాయన కణాలు కంటికి తగిలి తీవ్రమైన గాయాలవుతుంటాయి. మేరెంగో ఆసియా హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శిబాల్ భర్తియా ప్రకారం, ఈ ప్రమాదాలు కంటిలోని కార్నియా, లెన్స్ లేదా రెటినాపై తీవ్ర ప్రభావం చూపి કీరమైన దృష్టి లోపానికి దారితీసే అవకాశం ఉంది. టపాకాయ పేలుడు సంభవించినప్పుడు కేవలం ఒక నిప్పు రవ్వ మాత్రమే కాకుండా, తీవ్రమైన వేడి, పేలుడు తరంగాలు, ఎగసిపడే తునకలు మరియు రసాయన అవశేషాలు ఒకేసారి కంటిపై దాడి చేస్తాయి. కార్నియాపై గీతలు పడటం లేదా కాలిపోవడం వంటి సాధారణ సమస్యల నుంచి, కంటిలోపల రక్తస్రావం కావడం (హైఫేమా), ఐరిస్ చిట్లడం, లెన్స్ స్థానభ్రంశం చెందడం లేదా రెటినా దెబ్బతినడం వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. ఈ గాయాల వల్ల కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. బయట కనిపించే చిన్న ఎరుపెక్కడం లేదా నొప్పి ఒక్కోసారి లోపలి తీవ్రతను పూర్తిగా బయటపెట్టవు. కొన్నిసార్లు రెటినా డిటాచ్‌మెంట్ వంటి సమస్యలు ప్రమాదం జరిగిన రోజుల లేదా వారాల తర్వాత బయటపడవచ్చు. అంతేకాకుండా, అంతర్గత నష్టం కారణంగా పెరిగే కంటి ఒత్తిడి నెలలు లేదా సంవత్సరాల తర్వాత కూడా సమస్యలను సృష్టించవచ్చు. అందువల్ల, కంటికి బలమైన దెబ్బ తగిలితే చూపు సాధారణంగా కనిపించినప్పటికీ తప్పనిసరిగా నేత్ర వైద్య పరీక్ష చేయించుకోవడం అత్యంత ముఖ్యం. టపాసులు కాల్చేవారే కాకుండా, చుట్టుపక్కల ఉండే ప్రేక్షకులు, బాల్కనీల నుండి వీక్షించే ఇటువంటవారు మరియు చిన్న పిల్లలు కూడా ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు. రాకెట్లు మరియు చక్రాలు వంటి బాణసంచా ఊహించని దిశలో దూసుకురావడం వల్ల దూరం నుండి చూసేవారికి కూడా హాని కలుగుతుంది. పిల్లలు దీనిలోని ప్రమాదాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వారు మరింత ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇది కూడా చదవండి:https://teluguone.com/news/content/diwali-pollution-35-236362.html కంటికి గాయమైన వెంటనే తక్షణ వైద్య సహాయం తీసుకోవడం ద్వారా చూపును కాపాడుకునే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో కంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్దకూడదు లేదా నొక్కకూడదు. కంటిలో ఏదైనా ముక్క ఇరుక్కుంటే దాన్ని అలాగే ఉంచి అత్యవసర సహాయం కోరాలి. వైద్య సలహా లేకుండా ఎలాంటి ఐ డ్రాప్స్, నూనెలు లేదా కాటుక వంటి ఇంటి చిట్కాలను ఉపయోగించకూడదు. రసాయనాలు లేదా పొడి కంటిలో పడితే వెంటనే శుభ్రమైన పారే నీటితో కడగాలి. పెద్ద లేదా లోతైన గాయాలు సంభవించినట్లు భావిస్తే వెంటనే సమీపంలోని నేత్ర వైద్య అత్యవసర విభాగానికి చేరుకోవాలి. టపాసులు కాల్చేటప్పుడు రక్షణ కళ్లద్దాలు ధరించడం, వెలిగించిన టపాసుల దగ్గర వంగకపోవడం మరియు వెలగని టపాసులను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయకపోవడం ద్వారా ఈ ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. మీకు నచ్చవచ్చు:https://teluguone.com/news/content/dhanteras-2026-shopping-35-236242.html                                 https://teluguone.com/news/content/dark-circles-remedy-35-236423.html       Diwali Eye Injury Safety, Cracker First Aid Tips, Fireworks Eye Care, Emergency Medical Precautions, Festival Safety Guide, Doctor Health Advice, Health Tips In Telugu.
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు.. రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది. కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. గుర్తుంచుకోవాల్సిన విషయం.. కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                                                                                                                          *రూపశ్రీ*
వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు మనుషుల జీవన శైలిని , బాధ్యతలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ , గర్భనిరోధక బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే ఉంటూ వచ్చాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు లేదా పద్ధతులు అన్నీ మహిళల శారీరక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా వైద్య శాస్త్రం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పురుషుల కోసం ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలను తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త  ఆవిష్కరణ భవిష్యత్తులో గర్భనిరోధక పద్ధతులపై  చాలా అంచనాలు సృష్టిస్తోంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  గర్బనిరోధక మాత్రలు.. సాధారణంగా మహిళలు వాడే గర్భనిరోధక మాత్రలు వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో కొన్ని రకాల శారీరక మార్పులు లేదా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కోసం తయారు చేస్తున్న ఈ సరికొత్త  మాత్రల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి హార్మోన్ మార్పులకు గురిచేయవు. కేవలం పురుషుల శరీరంలో ఉండే శుక్రకణాల కదలికలను మాత్రమే నేరుగా ప్రభావితం చేసేలా ఈ మందులను రూపొందిస్తున్నారు. మానవ శరీరంలో , పురుషుల వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండే ఒక ఎంజైమ్ పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శుక్రకణాలు ముందుకు కదలడానికి , మహిళల అండం వరకు సులభంగా చేరుకోవడానికి ఈ ప్రత్యేక ఎంజైమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కనిపెడుతున్న  ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల శుక్రకణాలు సాధారణ పద్ధతిలో ముందుకు కదలలేవు. ఫలితంగా అవి అండం వరకు చేరే సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి  గర్భధారణ జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. పురుషుల కోసం కనిపెడుతున్న ఈ కొత్త  గర్భనిరోధక మాత్రల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మింగాల్సిన అవసరం ఉండదు. శారీరక సంబంధానికి కేవలం ముప్పై నిమిషాల ముందు ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిపిన పరీక్షల ప్రకారం ఈ మందు ప్రభావం శరీరంలో కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జరిగే క్లినికల్ పరీక్షలు , పరిశోధనలు విజయవంతమైతే పురుషులు రోజూ ఎలాంటి మందులు వాడకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మాత్రలు తీసుకుంటే పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని చాలా మందిలో ఒక  సందేహం కలుగుతుంది . అయితే ఈ మాత్రల ప్రధాన ఉద్దేశం పురుషులలో శుక్రకణాలు పుట్టకుండా చేయడం కాదు. కేవలం తాత్కాలికంగా వాటి కదలికలను నిలిపివేయడం లేదా మందగించడం మాత్రమే. ఈ  మాత్ర  ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత శుక్రకణాలు నార్మల్ గా  తమ సాధారణ స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ మందు ప్రభావం పోయిన తర్వాత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేదానిపై మరింత లోతైన పరీక్షలు అవసరం అంటున్నారు. ఈ కొత్త ఆవిష్కరణను ప్రస్తుతం జంతువులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వీటిని వాడే ముందు వాటి భద్రత , సరైన మోతాదును నిర్ణయించడం  చాలా ముఖ్యం. ఏవైనా దుష్ప్రభావాలు వస్తాయా లేదా అని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు అన్నీ విజయవంతమైతే భవిష్యత్తులో గర్భనిరోధక బాధ్యతలను కేవలం మహిళలు మాత్రమే కాకుండా  భాగస్వాములిద్దరూ సమానంగా పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ మాత్రలు కేవలం గర్భధారణను మాత్రమే నివారిస్తాయి కానీ ఎలాంటి లైంగిక  వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు                             *రూపశ్రీ.