LATEST NEWS
మునిసిపోల్స్ లో పులివెందులలో వైసీపీకి ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే పరిషత్ ఎన్నికలలోనూ ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. పులివెందుల మునిసిపాలిటీని కోల్పోయిన రోజుల వ్యవధిలోనూ వైసీపీ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయింది. . తాజాగా నిర్వహించిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పులివెందుల జడ్పీటీసీ   స్థానాన్ని టీడీపీ  భారీ ఆధిక్యతతో గెలుచుకుంది.   ఈ పరిషత్ పోరులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి భారతి ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై నిలకడగా ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. తుది ఫలితం వెలువడేసరికి ఆమె తన  సమీప ప్రత్యర్థి  వైసీపీ అభ్యర్థిపై 1,463 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఫలితం వెలువడగానే కౌంటింగ్ కేంద్రం వెలుపల అలాగే నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కొద్దిరోజుల క్రితమే నిర్వహించిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతంలో లభించిన ఆ అనూహ్య మద్దతు కాకతాళీయం కాదని, గ్రామీణ ప్రాంత పరిధిలోకి వచ్చే ఈ జడ్పీటీసీ ఎన్నికలలోనూ తెలుగుదేశం విజయం, పులివెందులలో వైసీపీ పట్టు కోల్పోయిందనడానికి తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా మున్సిపాలిటీ, పరిషత్ స్థానాల్లో   వైసీపీ పరాజయం పాలుకావడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర  ఆందోళనకు గురిచేయడమే కాకుండా, వారిలో నిరాశను, నిస్ఫృహను నింపింది.   ఫలితాలు అధికారికంగా వెలువడిన వెంటనే స్థానిక నాయకులు బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయి  తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. స్థానిక స్థాయిలో  సాధించిన ఈ వరుస విజయాలు రాబోయే రోజుల్లో పులివెందుల రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తాయని తెలుగుదేవం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  ఇది కూడా చదవండి: ఎస్కార్ట్ నంటూ నీడలా వెంబడించి: చెవిరెడ్డికి చెమటలు పట్టించి, చుక్కలు చూపించిన సుధారెడ్డి.! వైసీపీకి కంచుకోట అయిన పులివెందులలో చోటుచేసుకున్న ఈ రాజకీయ మార్పు   వెనుక స్థానిక ప్రజల నాడిలో వచ్చిన మార్పే కారణమంటున్నారు.  వరుస ఓటములతో వైసీపీకి తమ సొంత నియోజకవర్గంలోనే ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందా అన్న అంతర్మథనంలో వైసీపీ ఉంది.  రాబోయే రోజుల్లో   పులివెందులలో తెలుగుదేశం పార్టీ తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు. నియోజకవర్గవ్యాప్తంగా   స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు, వరుస పరాజయాల నుంచి కోలుకుని తిరిగి పుంజుకునేందుకు వైసీపీ ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది.   మీకు నచ్చవచ్చు: పోటీ నుంచి వైదొలగిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థలు: మైదుకూరు, చిన్నమండెంలో వైసీపీకి బిగ్ షాక్.! పులివెందులలో ఉద్రిక్తత: పార్నపల్లె వద్ద అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.! [Telugudesham Bags Pulivendula ZPTC, Jagan Bastion, Collapse, YCP, Shock, TeluguOne]
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది. తమ అభిమాన నేతను కళ్లారా చూడాలని, ఒక్కసారైనా మాట్లాడాలని కొందరు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అపారమైన గౌరవంతో ఓ యువకుడు చేసిన సాహసయాత్ర అందరినీ విస్మయానికి గురిచేసింది.    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తాయన్న అనే యువకుడు సీఎం రేవంత్ రెడ్డికి వీరాభిమాని. తన ఇష్టమైన నాయకుడిని నేరుగా కలిసి మనసులోని భావాలను పంచుకోవాలన్న బలమైన కోరిక ఆయనలో నాటుకుపోయింది.    ఈ లక్ష్యంతోనే తాయన్న ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వాహనాలను ఆశ్రయించకుండా, ఏకంగా అక్టోబర్ 29వ తేదీన ఆదోని నుంచి హైదరాబాద్‌కు తన కాలినడక ప్రయాణాన్ని ప్రారంభించారు. దారి పొడవునా ఎండ, అలసట వంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు.    దాదాపు 350 కిలోమీటర్ల సుదూర మార్గాన్ని అలుపెరగకుండా తొమ్మిది రోజుల పాటు నడుస్తూ ఆయన పూర్తి చేశారు. అంత దూరం నడవడం వల్ల కాళ్లకు బొబ్బలు ఎక్కినప్పటికీ, తన ఆశయం ముందు ఆ నొప్పులన్నీ లెక్కలోకి రాలేదని ఆయన నిరూపించారు.    చివరకు తొమ్మిది రోజుల ప్రయాణం ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తాయన్న, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా కలుసుకుని తన ఆనందాన్ని పంచుకున్నారు.    అంత దూరం నుంచి కేవలం తనను చూడటానికే నడుచుకుంటూ వచ్చిన అభిమాని తపస్సును ముఖ్యమంత్రి అభినందించారు. ఆప్యాయంగా పలకరించి శాలువా కప్పి సత్కరించడంతో పాటు కొద్దిసేపు ముచ్చటించారు.    ప్రజల నుంచి లభించే ఇలాంటి స్వచ్ఛమైన అభిమానమే తనకు మరింత బాధ్యతను పెంచుతుందని, ప్రజాసేవలో నిరంతరం ముందుకు సాగేందుకు ఇది కొండంత బలాన్ని ఇస్తుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.   నాయకులపై ప్రజల చూపే ఇలాంటి నిస్వార్థమైన ప్రేమ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తన ఆరాధ్య నేతను కలిసేందుకు ఓ సామాన్య యువకుడు పడిన తపన అందరినీ ఆకట్టుకుంటోంది.          [ CM Revanth Reddy fan, Adoni to Hyderabad walk, Jubilee Hills residence, Telangana political news, Kurnool fan meets CM ]
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా, తాజాగా ఆ జాబితాలోకి మరో క్రేజీ హీరో చేరబోతున్నారు. 'హనుమాన్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అసాధారణ గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన సినీ కెరీర్‌లో విజయాల జోరుమీదున్న ఈ యువ నటుడు, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో అత్యంత కీలకమైన కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు పూర్తిగా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే తేజ సజ్జా తన పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తన నిశ్చితార్థ వేడుకకు హాజరుకావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వివాహ నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకను విజయవంతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డితో తేజ సజ్జా భేటీ అయిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా యంగ్ హీరోకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న తేజ సజ్జా జీవితంలో ఈ కొత్త ఘట్టం ప్రారంభమవుతుండటంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. ఈ వివాహం పూర్తిగా పెద్దలు కుదిర్చిన సంబంధమని తేజ సజ్జా ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన అమ్మాయితోనే తన వివాహం నిశ్చయమైనట్లు ఆయన తెలిపారు. త్వరలోనే జరగనున్న ఈ నిశ్చితార్థ వేడుకను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లోని సుందరమైన ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుకను జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. సినిమా పరిశ్రమకు దూరంగా ఉండే ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని తేజ సజ్జా వివాహం చేసుకోబోతున్నారు. కాబోయే వధువు కుటుంబం టెక్నాలజీ వ్యాపార రంగంలో ఉండగా, ఆమె తన తండగ్రితో కలిసి ఆ బిజినెస్‌లో భాగస్వామ్యంగా ఉన్నారు. అమెరికాలో పెరిగిన ఆమెకు సినిమా ప్రపంచంతో ఎలాంటి పరిచయం లేకపోవడం విశేషం. కేవలం కుటుంబ నేపథ్యానికి, వ్యక్తిగత గోప్యతకు పెద్దపీట వేస్తూ ఈ వేడుకను అత్యంత నిరాడంబరంగా కానీ ప్రైవేట్‌గా నిర్వహించాలని భావిస్తున్నారు. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనున్న ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ వేడుక పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. వెండితెరపై అద్భుతమైన విజయాలతో ప్రేక్షకులను అలరిస్తున్న తేజ సజ్జా, రియల్ లైఫ్‌లోనూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండటంతో ఆయన అభిమానులు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       [Teja Sajja Engagement, Revanth Reddy, Tollywood News, Teja Sajja Wedding, Telugu Cinema, Telugu 
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం. అయితే ఆనందాన్ని పంచే ఈ టపాసుల మోతలు మన చెవులపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం టపాసుల శబ్దం నిర్దిష్ట పరిమితిలో ఉండాలని ఉన్నప్పటికీ, ఆ మోతాదు కూడా చెవులకు హానికరమే కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ నిబంధనల ప్రకారం మార్కెట్లో లభించే బాణసంచా గరిష్టంగా 125 డెసిబుల్స్‌ వరకు శబ్దం చేసేందుకు అనుమతి ఉంది. అయితే చట్టం అనుమతించినంత మాత్రాన ఆ స్థాయి శబ్దం చెవులకు పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా టపాసులు పేలే ప్రాంతానికి అతి సమీపంలో ఉండటం వల్ల వినికిడి శక్తి దెబ్బతినే ముప్పు తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా మనుషులు మాట్లాడుకునే సాధారణ ధ్వని 60 డెసిబుల్స్‌ ఉంటే, రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో అది 85 డెసిబుల్స్‌కు చేరుకుంటుంది. కానీ టపాసుల మోత ఏకంగా 125 డెసిబుల్స్‌ వరకు ఉంటుంది. డెసిబుల్స్ పది పాయింట్లు పెరిగినప్పుడు శబ్ద తీవ్రత పది రెట్లు పెరుగుతుందనే నిజాన్ని ఎవరూ విస్మరించకూడదు. సాధారణంగా బాణసంచా శబ్ద తీవ్రతను నాలుగు మీటర్ల దూరం నుంచి కొలుస్తారు. కానీ పండగ సమయంలో చాలామంది ఆ దూరాన్ని పాటించకుండా టపాసులను చేతులతో పట్టుకుని కాల్చడం లేదా అతి దగ్గరగా నిలబడటం చేస్తుంటారు. దీనివల్ల చెవులపై పడే ఒత్తిడి ఊహించినదాని కంటే ఎక్కువుగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం పెద్దలకు 140 డెసిబుల్స్‌, పిల్లలకు 120 డెసిబుల్స్‌ మించిన ఆకస్మిక శబ్దాలు అత్యంత ప్రమాదకరం. మనం పేలుడు కేంద్రానికి ఎంత దగ్గరగా ఉంటే శబ్ద తీవ్రత అంతగా పెరుగుతుంది. ఉదాహరణకు నాలుగు మీటర్ల దూరంలో 125 డెసిబుల్స్‌ ఉన్న శబ్దం, అర మీటరు దూరానికి వచ్చేసరికి సుమారు 143 డెసిబుల్స్‌ దాటుతుంది. మన చెవి లోపల ఉండే సూక్ష్మమైన కణాలు తీవ్రమైన శబ్దాలను తట్టుకోలేవు. బాణసంచా పేలే సమయంలో వచ్చే ఆకస్మిక మరియు తీవ్రమైన శబ్దాల వల్ల కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంది. లోపలి చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతింటే అవి మళ్లీ సాధారణ స్థితికి రావు, దీనివల్ల శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇరుకైన వీధుల్లో టపాసులు కాల్చినప్పుడు గోడల వల్ల ప్రతిధ్వని ఏర్పడి శబ్ద తీవ్రత మరింత పెరుగుతుంది. కాబట్టి పండగ వేళ చిన్నారులను దూరంగా ఉంచడం, తగిన చెవి రక్షణ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ అనర్థాల నుంచి రక్షణ పొందవచ్చు.       [ Firecrackers noise decibels, Diwali ear safety precautions, Hearing loss from fireworks, Danger of firecracker noise, Diwali ear precautions, Telugu One, Telugu News ]
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.    ఒకరిద్దరి ప్రయోజనాల కోసం పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించినప్పటికీ, తనను మానసికంగా ఇబ్బంది పెట్టేలా పరిస్థితులు సృష్టించారని ఆయన వాపోయారు.    తాను స్వచ్ఛందంగా పార్టీని వీడలేదని, అక్కడి వాతావరణం వల్ల బయటకు వచ్చేలా బలవంతం చేశారని ఆయన స్పష్టం చేశారు. ఏనాడూ లేనివిధంగా పార్టీలో తనను ఇబ్బందులకు గురిచేస్తూ, మానసిక క్షోభ కలిగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు దక్కిన గౌరవం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో కరువైందని ఆయన గుర్తు చేసుకున్నారు. కొందరి తప్పుడు మాటలు నమ్మి తనను దూరం పెట్టారని, ఇది తనను తీవ్రంగా బాధిచించిందని ఆయన పేర్కొన్నారు.    ఎన్నికల సమయంలోనూ, అంతర్గత సమావేశాల్లోనూ తనను కించపరిచేలా వ్యవహరించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 70కి పైగా అవమానాలను మౌనంగా భరించానని, ఇక ఆత్మగౌరవాన్ని చంపుకుని అక్కడ కొనసాగలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.    రాజకీయాల్లో ఎవరికైనా ఆత్మగౌరవం ముఖ్యం అని, దానిని తాకట్టు పెట్టి బతకలేమని ఆయన స్పష్టం చేశారు. కూర్చున్న కొమ్మను నరికేసేలా కొందరు వ్యవహరించిన తీరు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.     ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్న పార్టీలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.    భవిష్యత్తులో నూతన రాజకీయ వేదిక ద్వారా ప్రజల గొంతుకగా మారుతామని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే పాలనను అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.          [ Vijay Sai Reddy, Jagan Mohan Reddy, YSRCP, New Political Party Andhra Pradesh, Andhra Pradesh Politics, Sumathi Reddy, Andhra Pradesh politics, New political party AP ]  
ALSO ON TELUGUONE N E W S
కమెడియన్ గా ధూసుకుపోతున్నాడు సత్య. ప్రస్తుతం ఆదర్శ కుటుంబంతో మరో సారి తనదైన కామెడీ పండించి అభిమానులు, ప్రేక్షకులని నవ్వుల జడివానలో ముంచెత్తుతున్నాడు. టైమింగ్,  బాడీ లాంగ్వేజ్ సత్య ప్రధాన బలం. ఇంకో సునీల్ అనే మాటలు సైతం ప్రేక్షకుల నుంచి వినిపిస్తూ ఉంటాయి.  ట్రేడ్ నివేదికల ప్రకారం, సత్య ఒక్కో సినిమాకి రోజుకి 3 లక్షల నుండి  4 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లుగా  తెలుస్తోంది. దీంతో డిమాండ్‌కి తగినట్టుగానే నిర్మాతలు కూడా పారితోషికం చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఆయన క్రేజ్ చూస్తుంటే టాలీవుడ్‌లో రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.    కామెడీతో పాటు విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న సత్య, తన కష్టంతో నేడు టాలీవుడ్‌లోని టాప్ కమెడియన్ల సరసన నిలిచారు. ఈ భారీ రెమ్యునరేషన్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది. ఇది కూడా చదవండి: రామాయణపై సల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు: ఆ వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిందే!    సత్య చేతిలో ప్రస్తుతం ఏకంగా డజనుకు పైగా భారీ ప్రాజెక్టులు క్యూ కట్టాయి. వరుస సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉన్న ఈ నటుడు, టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడం ఖాయం.    ఇండస్ట్రీకి ఎన్నో ఏళ్ళ క్రితమే వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఈ స్టార్ కమెడియన్ గా మారాడు. స్వామి రారా మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. మీకు నచ్చవచ్చు: సౌందర్య చనిపోయాక ఆ ఇంట్లో జరిగిన సంఘటన ఇదే!  మీకు నచ్చవచ్చు: రెమ్యురేషన్ తక్కువయిందని సీతాదేవి రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్!    [Comedian Satya Remuneration, Comedian Satya, Satya remuneration, Tollywood comedians, Actor Satya movies, Mathu Vadalara Satya,Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]
‘ఆర్ఆర్ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడైన కాలభైరవ.. నటి కావ్య కల్యాణ్‌రామ్‌ను వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాలభైరవ, కావ్య తమ ప్రేమ విషయాన్ని ఆగస్టు 31న సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఇద్దరూ ప్రత్యేక పోస్టులు పెట్టారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు అప్పట్లో వెల్లడించారు. అదే సమయంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి.  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి కూడా ఈ వేడుకకు హాజరై కాలభైరవ, కావ్యలను ఆశీర్వదించారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న కాబోయే వధూవరుల ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు.  ఇక కాలభైరవ విషయానికి వస్తే.. తండ్రి కీరవాణి సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి ఆయన అందించిన గాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ‘మత్తు వదలరా’, ‘కలర్ ఫోటో’, ‘కార్తికేయ 2’ వంటి సినిమాలకు సంగీతం అందించి తన ప్రతిభను చాటుకున్నారు.  ఇది కూడా చదవండి: ‘దాదా’ ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్: ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్ రెడీ.! మరోవైపు కావ్య కల్యాణ్‌రామ్ బాలనటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి ‘మసూద’, ‘బలగం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా ‘బలగం’ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు కాలభైరవతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుండటంతో ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో కాలభైరవ, కావ్యల వివాహాన్ని డిసెంబర్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. మొత్తానికి కీరవాణి ఇంట్లో మొదలైన ఈ పెళ్లి సందడి సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మీకు నచ్చవచ్చు: ‘రామాయణ’పై సల్మాన్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు: ఆ వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిందే       [Kaala Bhairava Engagement, Kaala Bhairava Wedding, MM Keeravani Son, Kavya Kalyanram, Kavya Kalyanram Wedding, Kaala Bhairava Kavya Engagement, Balagam Actress Kavya, SS Rajamouli, Tollywood Celebrity Weddings, Kaala Bhairava Marriage, December Celebrity Weddings]
Suriya has been on a generational comeback as a star at the box office after 13 years, this year. With Karuppu, Vishwanath & Sons and Scene, he completed hat-trick of hits. Scene released with glowing critical appreciation and positive audience reception.  Now, he is concentrating on his next film in the direction of TJ Gnanvel, produced by Hombale Films. The movie shoot has begun three months ago and recent reports state that the team is flying to Japan to shoot next portions. This schedule will last for twenty days and it is highly important state reports.  Already, Gnanavel worked with Suriya and delivered a cult film like Jai Bhim. The movie won National award and this time, the combo is coming up with the story of a doctor who works tirelessly for the patients and tries to treat them charging least possible fee.  There is a real life doctor from Tamil Nadu who lived by these principles and Gnanvel has written a commerically viable content driven film that suits Suriya, perfectly, state makers. Further reports, state that the movie is aiming for May release and final date will be announced post Sankranti.  Also Read: Raaka: Allu Arjun works on Diwali and shocks entire team Meanwhile, Suriya and Karthi will go on a holiday trip during Christmas and New Year holidays with their respective families, together, state reports. Suriya is jubiliant after going through humiliation at the box office with Kanguva kind of disasters.  His fans are expressing their jubiliation on social media praising his guts for choosing a film like Scene. Jithu Madhavan directed the film with Nazriya Nazim and Naslen in prominent characters. Their performances are being loved by all.  Check Out: Nithiin stuns with a decade-younger look in Alias Rukmini                      Ramayana drops on Day 2 but crosses big milestone  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Nithiin is set to surprise audiences with a refreshing romantic entertainer, Alias Rukmini, presented by Nani. The makers have now unveiled his ten-years-younger look as Krishna, creating considerable curiosity around the character and the film. A special Diwali video captures director Murali Kanth Devasoth speaking to leading lady Aafia Sayed about how Krishna was before meeting her. Nithiin then makes an entry in a completely transformed avatar, sporting a slim pencil moustache and a youthful boy-next-door appearance. The transformation is particularly striking, with Nithiin reportedly losing considerable weight to get into the younger version of Krishna. His effortless transition into the look has become a talking point, with Aafia herself appearing visibly surprised in the video. The film introduces Krishna as a writer who pens edgy novels under the female pseudonym Rukmini. Aafia plays Rukmini, a schoolteacher with a strict yet playful personality, setting up an intriguing premise for this unusual romantic story. Also Read: Raaka: Allu Arjun works on Diwali and shocks entire team The character glimpses and the first single, Rukku Rukku, have already generated interest. The film's novelistic approach to romance and the contrast between its lead characters have further strengthened curiosity. Produced by Deepthi Ganta under Unanimous Productions, with Nani presenting the film, Alias Rukmini is directed by Murali Kanth Devasoth. Featuring Aafia Sayed as the female lead, the film is scheduled for a worldwide theatrical release on December 4. Check Out: Priyanka Chopra to produce Ventilator sequel                      Ramayana drops on Day 2 but crosses big milestone Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
Allu Arjun has been one of the most dedicated and workaholic persons from Telugu and Indian Cinema. He is currently working on Raaka, his big budget sci-fi fantasy spectacle in the direction of Atlee Kumar. The movie is produced by Sun Pictures and recently, it created a Guinness Book record for shooting with most people at a time using motion capture.  Reports from Tamil media state that the team is not taking a Diwali break and they are shooting on Diwali weekend. It is a huge festival for Tamil people, as most of the team working is from Tamil industry, many are surprised that Atlee asked them to work during such a festival time.  But the reports answer that as Hollywood technicians have been employed and brought to India for shooting, the team could not afford them to send back during this gap. So, they have decided to continue shoot and even Allu Arjun agreed to this, and he is working even during this festival time.  He took one day break for Sai Durgha Tej engagement and this schedule will continue till third week of November. As team members are not taking a break even during festival time, Allu Arjun has decided to give each crew member a Rs.10,000 gift bonus with a memorabilia to remember. Also Read: Priyanka Chopra to produce Ventilator sequel  Allu Arjun's gesture has impressed the team members and they have thanked him for such valuable gifts, say reports. Till date, Raaka team completed only 40-45% of the shoot and still there is a lot to complete. Meanwhile, Allu Arjun could also join AA23 sets from February, in short gaps.  Lokesh Kanagaraj is fine-tuning the script before going to the sets. Atlee's Raaka team is promising to take Indian Cinema to the world with many surprises. Deepika Padukone is confirmed to be starring as one leading lady while reports suggest Rashmika Mandanna and Mrunal Thakur are also cast in other prominent roles.  Check Out:  Ramayana drops on Day 2 but crosses big milestone                      Scene Movie Review  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ తన అభిమానులకి 'అఖండ 2 ' ఇచ్చిన డల్ నెస్ ని 'దాదా' తో పోగొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలలో బాలయ్య జోరు చూస్తుంటేనే ఆ విషయం స్పష్టమవుతూ ఉంది.  షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చిన తరుణంలో, మేకర్స్ నుండి ఫస్ట్ సాంగ్ విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది.ఈ విషయంపై  దర్శకుడు గోపీచంద్ మలినేని కీలక అప్డేట్ ఇచ్చా డు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట బాలయ్య అభిమానులకి  ప్రత్యేకమైన ట్రీట్‌గా ఉండబోతోందని తెలిపారు. అంతేకాకుండా వచ్చే వారాంతంలోనే ‘దాదా’ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో బాలయ్య అభిమానుల్లో దాదా సందడి వాతావరణం నెలకొని ఉంది.   మరోవైపు ఈ ఫస్ట్ సాంగ్ ఓ స్పెషల్ ఐటెం నంబర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎవరు కనిపించబోతున్నారు? పాట ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. వచ్చే వారంలో పాట విడుదలైతే ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: సౌందర్య చనిపోయాక ఆ ఇంట్లో జరిగిన సంఘటన ఇదే: ఆలస్యంగా వెలుగులోకి!  సినిమాకు సంబంధించి మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఎటువంటి ఆలస్యం లేకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారమే షూటింగ్ పూర్తి చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.    ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా అందిస్తున్న పదునైన సంభాషణలు, బాలయ్య మాస్ కటౌట్‌కు తగ్గట్టుగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే రానున్న ఫస్ట్ సాంగ్  రికార్డుల వేటని ఖాయం చేస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. మంచు మనోజ్ ప్రతినాయకుడి ఛాయలున్న రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. మీకు నచ్చవచ్చు: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనక ఎవరున్నారో తెలుసా! మీకు నచ్చవచ్చు: నితిన్ నార్నె శస్త్ర చికిత్స డీటెయిల్స్ ఇవే!
సౌందర్య.. సౌందర్యమే పొంగిపోయేంతలా  24 క్యారెట్స్ బంగారపు మెరుపుతో ఎప్పుడు ధగధగా మెరుస్తూ ఉండే నటి. స్వయంకృషితో నటనలో ఆమె ఏర్పాటుచేసుకున్న సామ్రాజ్యం అమోఘం. సౌందర్య కోసమే ఫస్ట్ డే మార్నింగ్ షోస్ కి వెళ్లిన మహిళా, మగ అభిమానుల కౌంట్ కి లెక్కే లేదు.  సౌందర్య స్నేహితురాలు ప్రముఖ నటి ఆమని రీసెంట్ గా ఒక  ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడుతు 'ఇద్దరిదీ బెంగుళూరు నేపథ్యం కావడంతో కన్నడ భాషపై ఉన్న మమకారంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడిందని, షూటింగ్ సమయంలోనూ కన్నడలోనే మాట్లాడుకుంటూ ఎంతో సరదాగా గడిపేవాళ్ళం. 'అన్నదమ్ముల అనుబంధం', అమ్మదొంగ' వంటి 4 నుంచి 5 చిత్రాలలో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సౌందర్యకి ఎంత పెద్ద స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఆమె మాత్రం చాలా ఒదిగి ఉండేదని, బెంగళూరులోని ప్రశాంత్ కుటీర్ తనకు ఎంతో సెంటిమెంట్ అని ఆమని తెలిపారు. సౌందర్య అకస్మాత్తుగా మరణించిన విషాద వార్త విన్న సమయంలో తాను 'శ్రీ కళ్యాణ్' గారి 'స్వామి' సినిమా షూటింగ్‌లో నటి మీనాతో కలిసి ఉన్నానని, ఆ వార్తను అసలు నమ్మలేక వెక్కివెక్కి ఏడ్చానని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు.  సౌందర్య మరణించిన సుమారు నెల రోజుల తర్వాత ఆమె ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన పరిణామాలు తన గుండెను కోసేలా చేశాయి. సౌందర్య కుటుంబంలో ఒక ప్రధాన పిల్లర్ కోల్పోయామని బాధపడుతూ, తనను చూడగానే సౌందర్య కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు చిన్నపిల్లల్లా బోరున ఏడ్చేశారని, ఆ సమయంలో వారిని ఓదార్చడం తనవల్ల కాలేదని ఆమని కంటతడి పెట్టారు. ఇది కూడా చదవండి: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనక ఎవరున్నారో తెలుసా! నిజానికి సౌందర్యకు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, కేవలం తండ్రి కోరిక మేరకే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిందని, ఎప్పుడూ ఒక సాధారణ గృహిణిలా కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకునేదని ఆమని వెల్లడించారు. కానీ అంతటి మంచి మనసున్న మనిషి విధి నిర్వహణలో అనుకోని ప్రమాదంలో తనువు చాలించడం టాలీవుడ్‌కే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు.  నేటికీ ఎక్కడైనా సౌందర్య పేరు వినిపించినా, ఆమె ఫోటో కంటపడినా తన మనసు తట్టుకోలేదని, కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని చెప్పడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఇద్దరు దిగ్గజ నాయికల మధ్య ఉన్న ఈ స్వచ్ఛమైన ఆత్మీయత సినిమా పరిశ్రమలో అరుదైన బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. మీకు నచ్చవచ్చు: మహాశక్తి రివ్యూ   మీకు నచ్చవచ్చు : సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ    [Aamani Emotional Memories With Soundarya, Aamani About Soundarya Soundarya, Aamani about Soundarya, Tollywood actress, Soundarya best friend, Telugu cinema news]  
ఓటీటీలో ఈ మధ్యకాలంలో బెంగాలీ వెబ్ సిరీస్‌ల జోరు పెరుగుతోంది. ముఖ్యంగా థ్రిల్లర్, హారర్, సూపర్ నేచురల్ కథాంశాలతో రూపొందుతున్న సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన మరో బెంగాలీ వెబ్ సిరీస్ 'కౌరిబురి: ది కర్స్‌డ్ టెంపుల్'. సయంతన్ ఘోషల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. నవంబర్ 6 నుంచి తెలుగు ఆడియోతోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కథాకథనాలు ఎలా ఉన్నాయి? భవతారణ్ ముఖర్జీ (జీతూ కమల్)కు జ్యోతిష్యంతో పాటు కొన్ని మంత్రశక్తులు కూడా తెలుసు. భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలను ముందుగానే పసిగట్టగలడు. ఒకరోజు అతని తండ్రి అస్సాంలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న మాధురి (సోలంకీ రాయ్) అనే యువతి గురించి చెబుతాడు. ఆమె ప్రమాదంలో ఉందని, వెళ్లి కాపాడాలని సూచిస్తాడు. గతంలో భవతారణ్, మాధురి ఒకే ప్రాంతంలో నివసించేవారు. అప్పట్లో ఇద్దరి మధ్య ఆకర్షణ కూడా ఏర్పడుతుంది. తండ్రి మాట ప్రకారం భవతారణ్ అస్సాం అడవుల్లోని మాధురి ఇంటికి చేరుకుంటాడు. అయితే ఆమెను ఏదో దుష్టశక్తి పీడిస్తోందని తెలుసుకుంటాడు. మాధురికి అనీర్ బన్‌తో వివాహం జరిగిందని, అతను ఏమయ్యాడో తెలియడం లేదని ఆమె తల్లిదండ్రులు చెబుతారు. ఈ క్రమంలో భవతారణ్‌కు పరాఖ్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. అతని ద్వారా ఒక వృద్ధుడిని కలుస్తాడు. ఆ అడవిలోని భయంకరమైన గుహలో ఒక మాంత్రికురాలు కౌరిబురి దేవిని పూజిస్తుంటుందని, అక్కడ గోలోక్ పుష్పం అనే అద్భుతమైన పుష్పం ఉందని వృద్ధుడు చెబుతాడు. విషానికి విరుగుడుగా పనిచేసే ఆ పుష్పం మాధురిని కాపాడగలదని వివరిస్తాడు. అయితే దానిని సంపాదించడం అంత సులభం కాదని హెచ్చరిస్తాడు. అసలు ఆ మాంత్రికురాలు ఎవరు? ఆమె లక్ష్యం ఏమిటి? మాధురి భర్తకు ఏమైంది? భవతారణ్ ఆ మాయా పుష్పాన్ని సంపాదించి మాధురిని కాపాడగలిగాడా? అనేదే మిగతా కథ. బెంగాలీ జానపద కథల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌లో సూపర్ నేచురల్ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. దట్టమైన అడవి, భయంకరమైన గుహ, క్షుద్రపూజలు, నరబలులు, మంత్రించిన కాకులు, రక్తస్పర్శతో వికసించే మాయా పుష్పం వంటి అంశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కొంత ఉత్కంఠను కలిగిస్తాయి. కౌరిబురి దేవి ఎవరు? మాంత్రికురాలి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలకు ఇచ్చిన వివరణ కూడా కొంతవరకు కనెక్ట్ అవుతుంది. అయితే కథలోని కొన్ని కీలకమైన అంశాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇది కూడా చదవండి: 22 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు అదే పేరుతో కమల్‌హాసన్ కొత్త సినిమా.! ఇక లోపాల విషయానికి వస్తే.. ఇలాంటి సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథల్లో సాధారణంగా దుష్టశక్తుల వెనుక బలమైన లక్ష్యం ఉంటుంది. కానీ ఈ సిరీస్‌లో మాంత్రికురాలి లక్ష్యం విషయంలో దర్శకుడు ఎంచుకున్న అంశం అంతగా ఆసక్తికరంగా అనిపించదు. మరోవైపు దుష్టశక్తులు ఆవహించిన వ్యక్తులు వింతగా ప్రవర్తించడం వంటి సన్నివేశాలు కూడా పెద్దగా కనిపించవు. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తాయి.  ప్రధాన పాత్రల్లో నటించిన జీతూ కమల్, సోలంకీ రాయ్ సహా మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఇలాంటి కథల్లో ప్రేక్షకులు ఆశించే స్థాయిలో క్లైమాక్స్‌ను రూపొందించలేకపోయారు. దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటాన్ని మరింత ఉత్కంఠభరితంగా చూపించి ఉంటే బాగుండేది. మొత్తంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ, కథనం, క్లైమాక్స్ విషయంలో నిరాశ పరుస్తుంది ఈ 'కౌరిబురి: ది కర్స్‌డ్ టెంపుల్'. మీకు నచ్చవచ్చు: సురేఖవాణి వైరల్ వీడియో.. అందులో ఉన్న మ్యాటర్‌పై అదిరిపోయే రిప్లై ఇచ్చేసింది       [Kauriburi The Cursed Temple Review, Kauriburi Web Series, Netflix New Series, Bengali Thriller Series, Kauriburi Telugu Review, Jeetu Kamal, Solanki Roy, Sayantan Ghosal, Netflix Telugu Dubbed Series]
మాములు హీరో స్థాయి నుంచి పాన్ ఇండియా కట్ అవుట్ గా మారిన ధనుష్ సినీ జర్నీ జగమెరిగిన సినీ సత్యం. పైగా బడా హీరో ఇమేజ్ కి భిన్నంగా నటన మీద ప్రేమతో డి గ్రేడ్ క్యారెక్టర్స్ చేసిన అగ్ర హీరో టాగ్ లైన్ మాత్రం నీ వెంటే నేనుంటా అని పిచ్చి ప్రేమని చూపిస్తూ తన పక్కనే ఉండిపోయింది. దీన్ని బట్టి అభిమానులు, ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.  ఈ నెల 20 న ఓం మూవీతో మరో సారి బాక్స్ ఆఫీస్ ని తన వశం చేసుకోవడానికి వస్తున్నాడు. ఓం ఆడియో రిలీజ్ సందర్భంగా ధనుష్ మాట్లాడుతు 'నా గురించి రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. కొందరు నా వెనుక ఉన్నారని, మరికొందరు నాకు  మద్దతు ఇస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే, నన్ను నడిపించేది దేవుడే. నా వెనుక నా అభిమానులు ఉన్నారు. పక్కన ప్రజలు ఉన్నారు. వాళ్ళు నాతోనే ఉన్నారని ధనుష్ చెప్పుకొచ్చాడు. దీంతో  తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు ధనుష్ నేరుగా సమాధానం ఇవ్వకపోయినా.. బీజేపీ, మరే ఇతర రాజకీయ శక్తి తనను నడిపిస్తోందన్న ప్రచారాన్ని ఖండించినట్లయింది. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని, దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తుతో చేయనున్న D56 తన తదుపరి ప్రాజెక్ట్ అని ధనుష్ వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి  ధనుష్ రాజకీయ ప్రవేశం గురించిన చర్చలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో 'ధనుష్ నర్పణి మంద్రమ్' గా ఉన్న ఈ వేదికలను ఇప్పుడు 'ధనుష్ నర్పణి ఇయక్కమ్' గా మార్పులు చేసి, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో ధనుష్  పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లలో ధనుష్ ని  కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించడం ఈ చర్చలకు మరింత వేడిని పుట్టించింది. ఇది కూడా చదవండి: సురేఖవాణి వైరల్ వీడియో: అందులో ఉన్న మ్యాటర్ పై అదిరిపోయే రిప్లై ఇచ్చేసింది!   ఇదిలాఉండగా.. ధనుష్ తన అభిమాన సంఘం ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో నాలుగు ఉచిత ట్యూషన్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటిలో మూడు చెన్నైలో, మరొకటి కన్యాకుమారిలో ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా ఏసీ సదుపాయంతో ఉండే ఈ కేంద్రాలను రానున్న రెండేళ్లలో తమిళనాడు అంతటా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.  అయితే, ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ధనుష్‌ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు, ఆ పేరును ఎన్నికల సంఘం వద్ద కూడా నమోదు చేయించుకున్నారంటూ కూడా ఇంకో ప్రచారం జరుగుతుంది. సినిమా రంగం నుంచి ఇప్పటికే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మీకు నచ్చవచ్చు: పూజాహెగ్డే వరుడు ఎవరో తెలుసా! మీకు నచ్చవచ్చు: రెండో భర్తకి విడాకులు ప్రకటించిన సింగర్    [Dhanush Responds To Bjp Support Rumours, Dhanush ABout His Political entry, Dhanush About Om Movie, Tamil Nadu politics, Dhanush BJP support, Operation D Tamil Nadu, Vijay, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]
  సురేఖ వాణి.. బయట ఎక్కడ కనపడినా అరే మన సురేఖ వాణి అనుకునే రేంజ్ లోనే నటిగా పలు క్యారెక్టర్స్ ద్వారా గుర్తింపు పొందింది. సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న ట్రాక్ రికార్డు సైతం ఆమె సొంతం. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షం కావడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ అనూహ్య పరిణామంపై స్పందించిన నటి సురేఖా వాణి, తన సోషల్ మీడియా ఖాతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి హ్యాకింగ్‌కు గురైందని, తన ప్రమేయం లేకుండానే కొందరు వ్యక్తులు తన పర్సనల్ డేటాను బయటపెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వ్యూస్, లైక్స్, రీచ్ మరియు పబ్లిసిటీ కోసం తోటి మనుషుల వ్యక్తిగత గోప్యతను బలిపెట్టడం సరికాదని ఆమె హితవు పలికారు. ఆమె ఇంకా మాట్లాడుతు కేవలం నెటిజన్లు మాత్రమే కాకుండా ప్రముఖ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మీమ్ పేజీలు, యూట్యూబ్ ఛానెళ్లు కూడా ఆ వీడియోలని ఎక్కడా షేర్ చేయవద్దని గట్టిగా హెచ్చరించారు. ఎవరైనా సరే ఈ ప్రైవేట్ కంటెంట్‌ను రీపోస్ట్ చేసినా, అప్‌లోడ్ చేసినా లేదా సర్క్యులేట్ చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.    ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడే వారి ఖాతాలు మరియు వ్యక్తుల వివరాలను సాంకేతికంగా గుర్తిస్తున్నామని, ఇప్పటికే డిజిటల్ ఆధారాలు సేకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిబంధనలు అతిక్రమించి వీడియోలను ప్రచారం చేసే ప్రతి ఒక్కరిపై సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: రెమ్యునరేషన్ తక్కువైందని సీతాదేవి రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్! సినిమా రంగంలో 2005 నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన తాను ఎప్పుడూ నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని సురేఖా వాణి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ప్రవర్తించాలి.    వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ క్లిష్ట సమయంలో తనను అర్థం చేసుకుని అండగా నిలుస్తున్న నిజమైన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మీకు నచ్చవచ్చు : సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ  మీకు నచ్చవచ్చు :నటి దాడి కేసులో కీలక మలుపు!   [Surekha Vani Responds To Viral Video Claims Instagram Account Was Hacked, Surekha Vani, Instagram Hacked, Surekha Vani Viral Video, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు.. రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది. కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. గుర్తుంచుకోవాల్సిన విషయం.. కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                                                                                                                          *రూపశ్రీ*
వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు మనుషుల జీవన శైలిని , బాధ్యతలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ , గర్భనిరోధక బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే ఉంటూ వచ్చాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు లేదా పద్ధతులు అన్నీ మహిళల శారీరక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా వైద్య శాస్త్రం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పురుషుల కోసం ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలను తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త  ఆవిష్కరణ భవిష్యత్తులో గర్భనిరోధక పద్ధతులపై  చాలా అంచనాలు సృష్టిస్తోంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  గర్బనిరోధక మాత్రలు.. సాధారణంగా మహిళలు వాడే గర్భనిరోధక మాత్రలు వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో కొన్ని రకాల శారీరక మార్పులు లేదా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కోసం తయారు చేస్తున్న ఈ సరికొత్త  మాత్రల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి హార్మోన్ మార్పులకు గురిచేయవు. కేవలం పురుషుల శరీరంలో ఉండే శుక్రకణాల కదలికలను మాత్రమే నేరుగా ప్రభావితం చేసేలా ఈ మందులను రూపొందిస్తున్నారు. మానవ శరీరంలో , పురుషుల వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండే ఒక ఎంజైమ్ పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శుక్రకణాలు ముందుకు కదలడానికి , మహిళల అండం వరకు సులభంగా చేరుకోవడానికి ఈ ప్రత్యేక ఎంజైమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కనిపెడుతున్న  ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల శుక్రకణాలు సాధారణ పద్ధతిలో ముందుకు కదలలేవు. ఫలితంగా అవి అండం వరకు చేరే సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి  గర్భధారణ జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. పురుషుల కోసం కనిపెడుతున్న ఈ కొత్త  గర్భనిరోధక మాత్రల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మింగాల్సిన అవసరం ఉండదు. శారీరక సంబంధానికి కేవలం ముప్పై నిమిషాల ముందు ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిపిన పరీక్షల ప్రకారం ఈ మందు ప్రభావం శరీరంలో కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జరిగే క్లినికల్ పరీక్షలు , పరిశోధనలు విజయవంతమైతే పురుషులు రోజూ ఎలాంటి మందులు వాడకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మాత్రలు తీసుకుంటే పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని చాలా మందిలో ఒక  సందేహం కలుగుతుంది . అయితే ఈ మాత్రల ప్రధాన ఉద్దేశం పురుషులలో శుక్రకణాలు పుట్టకుండా చేయడం కాదు. కేవలం తాత్కాలికంగా వాటి కదలికలను నిలిపివేయడం లేదా మందగించడం మాత్రమే. ఈ  మాత్ర  ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత శుక్రకణాలు నార్మల్ గా  తమ సాధారణ స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ మందు ప్రభావం పోయిన తర్వాత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేదానిపై మరింత లోతైన పరీక్షలు అవసరం అంటున్నారు. ఈ కొత్త ఆవిష్కరణను ప్రస్తుతం జంతువులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వీటిని వాడే ముందు వాటి భద్రత , సరైన మోతాదును నిర్ణయించడం  చాలా ముఖ్యం. ఏవైనా దుష్ప్రభావాలు వస్తాయా లేదా అని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు అన్నీ విజయవంతమైతే భవిష్యత్తులో గర్భనిరోధక బాధ్యతలను కేవలం మహిళలు మాత్రమే కాకుండా  భాగస్వాములిద్దరూ సమానంగా పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ మాత్రలు కేవలం గర్భధారణను మాత్రమే నివారిస్తాయి కానీ ఎలాంటి లైంగిక  వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు                             *రూపశ్రీ.