
సురేఖ వాణి.. బయట ఎక్కడ కనపడినా అరే మన సురేఖ వాణి అనుకునే రేంజ్ లోనే నటిగా పలు క్యారెక్టర్స్ ద్వారా గుర్తింపు పొందింది. సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న ట్రాక్ రికార్డు సైతం ఆమె సొంతం.
ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షం కావడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ అనూహ్య పరిణామంపై స్పందించిన నటి సురేఖా వాణి, తన సోషల్ మీడియా ఖాతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి హ్యాకింగ్‌కు గురైందని, తన ప్రమేయం లేకుండానే కొందరు వ్యక్తులు తన పర్సనల్ డేటాను బయటపెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం వ్యూస్, లైక్స్, రీచ్ మరియు పబ్లిసిటీ కోసం తోటి మనుషుల వ్యక్తిగత గోప్యతను బలిపెట్టడం సరికాదని ఆమె హితవు పలికారు. ఆమె ఇంకా మాట్లాడుతు కేవలం నెటిజన్లు మాత్రమే కాకుండా ప్రముఖ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మీమ్ పేజీలు, యూట్యూబ్ ఛానెళ్లు కూడా ఆ వీడియోలని ఎక్కడా షేర్ చేయవద్దని గట్టిగా హెచ్చరించారు. ఎవరైనా సరే ఈ ప్రైవేట్ కంటెంట్‌ను రీపోస్ట్ చేసినా, అప్లోడ్ చేసినా లేదా సర్క్యులేట్ చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
.webp)
ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడే వారి ఖాతాలు మరియు వ్యక్తుల వివరాలను సాంకేతికంగా గుర్తిస్తున్నామని, ఇప్పటికే డిజిటల్ ఆధారాలు సేకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిబంధనలు అతిక్రమించి వీడియోలను ప్రచారం చేసే ప్రతి ఒక్కరిపై సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: రెమ్యునరేషన్ తక్కువైందని సీతాదేవి రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్!
సినిమా రంగంలో 2005 నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన తాను ఎప్పుడూ నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని సురేఖా వాణి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ప్రవర్తించాలి.

వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ క్లిష్ట సమయంలో తనను అర్థం చేసుకుని అండగా నిలుస్తున్న నిజమైన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మీకు నచ్చవచ్చు : సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ
మీకు నచ్చవచ్చు :నటి దాడి కేసులో కీలక మలుపు!
[Surekha Vani Responds To Viral Video Claims Instagram Account Was Hacked, Surekha Vani, Instagram Hacked, Surekha Vani Viral Video, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]






