Home

»

Latest News

సౌందర్య చనిపోయాక ఆ ఇంట్లో జరిగిన సంఘటన ఇదే: ఆలస్యంగా వెలుగులోకి! 

Nov 7, 2026 2:29PM


సౌందర్య.. సౌందర్యమే పొంగిపోయేంతలా  24 క్యారెట్స్ బంగారపు మెరుపుతో ఎప్పుడు ధగధగా మెరుస్తూ ఉండే నటి. స్వయంకృషితో నటనలో ఆమె ఏర్పాటుచేసుకున్న సామ్రాజ్యం అమోఘం. సౌందర్య కోసమే ఫస్ట్ డే మార్నింగ్ షోస్ కి వెళ్లిన మహిళా, మగ అభిమానుల కౌంట్ కి లెక్కే లేదు. 

సౌందర్య స్నేహితురాలు ప్రముఖ నటి ఆమని రీసెంట్ గా ఒక  ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడుతు 'ఇద్దరిదీ బెంగుళూరు నేపథ్యం కావడంతో కన్నడ భాషపై ఉన్న మమకారంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడిందని, షూటింగ్ సమయంలోనూ కన్నడలోనే మాట్లాడుకుంటూ ఎంతో సరదాగా గడిపేవాళ్ళం.

'అన్నదమ్ముల అనుబంధం', అమ్మదొంగ' వంటి 4 నుంచి 5 చిత్రాలలో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సౌందర్యకి ఎంత పెద్ద స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఆమె మాత్రం చాలా ఒదిగి ఉండేదని, బెంగళూరులోని ప్రశాంత్ కుటీర్ తనకు ఎంతో సెంటిమెంట్ అని ఆమని తెలిపారు. సౌందర్య అకస్మాత్తుగా మరణించిన విషాద వార్త విన్న సమయంలో తాను 'శ్రీ కళ్యాణ్' గారి 'స్వామి' సినిమా షూటింగ్‌లో నటి మీనాతో కలిసి ఉన్నానని, ఆ వార్తను అసలు నమ్మలేక వెక్కివెక్కి ఏడ్చానని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు.

 సౌందర్య మరణించిన సుమారు నెల రోజుల తర్వాత ఆమె ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన పరిణామాలు తన గుండెను కోసేలా చేశాయి. సౌందర్య కుటుంబంలో ఒక ప్రధాన పిల్లర్ కోల్పోయామని బాధపడుతూ, తనను చూడగానే సౌందర్య కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు చిన్నపిల్లల్లా బోరున ఏడ్చేశారని, ఆ సమయంలో వారిని ఓదార్చడం తనవల్ల కాలేదని ఆమని కంటతడి పెట్టారు.

ఇది కూడా చదవండి: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనక ఎవరున్నారో తెలుసా!

నిజానికి సౌందర్యకు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, కేవలం తండ్రి కోరిక మేరకే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిందని, ఎప్పుడూ ఒక సాధారణ గృహిణిలా కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకునేదని ఆమని వెల్లడించారు. కానీ అంతటి మంచి మనసున్న మనిషి విధి నిర్వహణలో అనుకోని ప్రమాదంలో తనువు చాలించడం టాలీవుడ్‌కే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు.

 నేటికీ ఎక్కడైనా సౌందర్య పేరు వినిపించినా, ఆమె ఫోటో కంటపడినా తన మనసు తట్టుకోలేదని, కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని చెప్పడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఇద్దరు దిగ్గజ నాయికల మధ్య ఉన్న ఈ స్వచ్ఛమైన ఆత్మీయత సినిమా పరిశ్రమలో అరుదైన బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.


మీకు నచ్చవచ్చు: మహాశక్తి రివ్యూ  
మీకు నచ్చవచ్చు : సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ 
 

[Aamani Emotional Memories With Soundarya, Aamani About Soundarya Soundarya, Aamani about Soundarya, Tollywood actress, Soundarya best friend, Telugu cinema news]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com