LATEST NEWS
ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంపై నిరసనలు భగ్గుమంటున్న వేళ కర్నాటక ప్రభుత్వం కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయించింది. అయితే రాజధానులను మార్చకుండానే ప్రస్తుతం బెంగళూరులో ఉన్న పలు రాష్ట్ర స్ధాయి కార్యాలయాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకున్న సీఎం యడ్యూరప్ప కర్నాటక అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణకు అనుకూలంగా తీర్మానం కూడా ఆమోదింపజేశారు. ఏపీలో మూడు రాజదానుల వ్యవహారం ఓవైపు కాకరేపుతుండగానే పొరుగున ఉన్న కర్నాటక ప్రభుత్వం ఇదే బాటలో పయనిస్తోంది. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాలనా వికేంద్రీకరణలో జగన్ బాటనే అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ అనుభవాల నేపథ్యంలో ఒకటికి మించి రాజధానులు కాకుండా బెంగళూరును మాత్రమే రాజధానిగా ఉంచి అక్కడి నుంచి కొన్ని రాష్ట్రస్ధాయి కార్యాలయాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. దీంతో పాలనా వికేంద్రీకరణ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. కర్నాటలో స్ధానికంగా అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న కారణంతో అక్కడి యడ్యూరప్ప ప్రభుత్వం వికేంద్రీకరణకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి అనుమతి తీసుకున్న సీఎం యడ్యూరప్ప వివిధ రాష్ట్ర స్ధాయి కార్యాలయాలను పాలనా వికేంద్రీకరణ పేరుతో తరలించేందుకు కర్ణాటక అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదింపజేశారు. కర్నాటక ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం త్వరలో బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు రాష్ట్ర స్ధాయి కార్యాలయాలు తరలిపోనున్నాయి. వీటిలో నీటిపారుదలశాఖకు చెందిన కృష్ణభాగ్య జల నిగమ్, కర్నాట నీరవరి నిగమ్, పవర్ లూమ్ కార్పోరేషన్, షుగర్ డైరెక్టరేట్, షుగర్ కేన్ డెవలప్ మెంట్ కమిషనర్ కార్యాలయం, కర్నాటక మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, ఉప లోకాయుక్త కార్యాలయం ఉన్నాయి. వీటిని బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు తరలించనున్నట్లు యడ్యూరప్ప ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు. వీటిని ఎప్పటి కల్లా తరలించాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అసెంబ్లీ తీర్మానం మేరకు త్వరలోనే వీటి తరలింపు ఉంటుందని మాత్రం మంత్రులు చెబుతున్నారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అనుసరించడం కర్ణాటకలోని యడ్యూరప్ప ప్రభుత్వానికి ఇదే తొలిసారి కాదు. జగన్ ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టిన వెంటనే తీసుకున్న పరిశ్రమల్లో 75 శాతం స్ధానిక కోటా నిర్ణయాన్ని కర్ణాటకలోనూ అమలు చేయాలని ఇప్పటికే యడ్యూరప్ప సర్కారు నిర్ణయించింది. దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా రాష్ట్రంలో పలు వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా స్ధానిక కోటాను అనుకూలంగా కొందరు ఆందోళనకారులు ఏపీ టూరిజం బస్సుపై దాడికి కూడా పాల్పడ్డారు. ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా పాలనా వికేంద్రీకరణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రావడం లేదు. రాజధానుల విస్తరణ పేరు వాడకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఏపీలోనూ తెలంగాణ తరహాలో భారీగా ఈఎస్ఐ స్కామ్ జరిగింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జరిపిన దర్యాప్తులో మందుల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఆరేళ్లుగా కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను అక్రమార్కులు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్లతో రేట్ కాంట్రాక్టులో లేని సంస్ధలకు సైతం ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం మందుల కొనుగోళ్ల కోసం మొత్తం 89 కోట్లు చెల్లించగా.. అందులో 38 కోట్లు నిబంధనల ప్రకారం చెల్లించినట్లు, మరో 51 కోట్లు మాత్రం అక్రమార్కులు మింగేశారు. అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడికీ ఇందులో పాత్ర ఉన్నట్లు తేలింది. తెలంగాణలో కొన్నినెలల క్రితం చోటుచేసుకున్న ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ మరకవకముందే ఏపీలోనూ అదే తరహా అవినీతి చోటుచేసుకున్నట్లు తాజాగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈఎస్ఐలో కీలకంగా ఉన్న పలువురు అధికారులు కుమ్మక్కై దాదాపు 51 కోట్ల మేర అక్రమ కొనుగోళ్లు జరిపినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం రేట్ కాంట్రాక్టులో ఉన్న సంస్ధల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా.. అందులో లేని సంస్ధల నుంచి కూడా 51 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేసి మందులు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అదీ వాస్తవ ధర132 శాతం అధికంగా చెల్లింపులు జరిపినట్లు విజిలెన్స్ విచారణ నివేదికలో తెలిపింది. ఈ మొత్తం స్కామ్ లో కీలక పాత్ర పోషించిన సరఫరాదారులు తెలంగాణ ఈఎస్ఐ స్కామ్ లో నిందితులుగా ఉన్నవారే కావడం ఇక్కడ మరో విశేషం. ఏపీలో చోటు చేసుకున్న ఈఎస్ఐ స్కామ్ లో అప్పట్లో డైరెక్టర్లుగా వ్యవహరించిన రవికుమార్, విజయ్ కుమార్ తో పాటు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్ ను అధికారులు బాధ్యులుగా తేల్చారు. వీరిపై తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ ముగ్గురు డైరెక్టర్లు గా వ్యవహరించిన సమయంలో 975 కోట్ల రూపాయల మందుల కొనుగోలు చేస్తే, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులకు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలుకు ప్రభుత్వం 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ఈ ముగ్గురు డైరెక్టర్లు 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వానికి 404 కోట్ల రూపాయలు నష్టం కలిగేలా వ్యవహరించారు. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలే రెండు రాష్ట్రాల్లో భారీగా ఈఎస్ఐ స్కామ్ కు పాల్పడ్డాయి. ఈ మూడు సంస్థలకు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్ల రూపాయలను అక్రమంగా చెల్లించినట్లు తేలింది. లెజెండ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ల్యాబ్ పరికరాల కోసం ఎలాంటి టెండర్లు లేకుండానే 2 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఇడెంట్లు సృష్టించారని విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. 2018 19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉం టే , అందులో కేవలం 8 కోట్లు మాత్రమే వాస్తవ ధర అయితే 10 కోట్లు అదనంగా నిధులు స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించారు. మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు, ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టు కూడా విజిలెన్స్ నివేదికలో తేలింది. ఒక్కో బయోమెట్రిక్ మిషన్ వాస్తవ ధర 16,000 అయితే ఏకంగా 70 వేల చొప్పున ఇండెంట్లు సృష్టించినట్లు విజిలెన్స్ నిర్ధారించింది. జర్సన్ ఎంటర్ప్రైజెస్ అనే నకిలీ సంస్థను సృష్టించి కందుల కొనుగోలు పేరుతో నిధులు మళ్లించినట్లు తేలింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉందదని విజిలెన్స్ నివేదికలో తేల్చారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని, నామినేషన్ పద్ధతిలో ఆర్డర్లు కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించిట్లు నివేదిక తెలిపింది.
50రోజుల ఆర్టీసీ సమ్మెతో యాజమాన్యం భారీ గుణపాఠాన్నే నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత సమూల ప్రక్షాళన చేపట్టిన యాజమాన్యం... సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, అలాగే ప్రయాణికులకు దగ్గరయ్యేందుకు సరికొత్త విధానాలను అవలంభిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్ధం ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల దగ్గర మార్పులకు శ్రీకారం చేపట్టారు. బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు సమాచారం అందించేందుకు మెగాఫోన్ వ్యవస్థను మొదలుపెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్సుల షెడ్యూల్‌ను మార్చడమే కాకుండా, ఏ బస్సు ఎక్కడ ఆగుతుంది... ఏ సమయంలో వస్తుంది... ఏ నెంబర్ బస్సు ఎక్కడి వెళ్తుంది... ఇలా, ప్రయాణికులకు సమాచారం అందించడానికి, ప్రతి బస్టాండ్‌లో గైడ్స్‌‌ను ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్లంతా మెగా ఫోన్ల ద్వారా... ఆయా బస్సుల వివరాలు అందిస్తూ ప్రయాణికులకు సహాయపడేలా చర్యలు చేపట్టారు.  ఒకవేళ బస్సుల్లో తగినంతమంది ప్రయాణికులు లేకపోతే ప్రీక్వెన్నీ నియంత్రిస్తూ ఓఆర్ పెంచేందుకు రెండుమూడు నిమిషాలు నిలిపి పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత చేపట్టిన చర్యలతో సంస్థ మెల్లమెల్లగా గాడిలో పడుతోందని అంటున్నారు. సర్వీసుల క్రమబద్ధీకరణతో నష్టాలు గణనీయంగా తగ్గుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా ఆర్టీసీ కార్మికులు బోనస్ తీసుకునేలా సకల చర్యలు చేపడుతున్నారు. మరి, తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో మున్ముందు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతోంది. అధికార వైసిసి పట్ల ఏం వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసిపి లోక్ సభ సభ్యులతో బిజెపికి పని లేకపోయినా రాజ్యసభ సభ్యులతో మాత్రం ఆ పార్టీకి ఇంకా పని ఉంది. పైగా వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్లు బాగా తగ్గి అన్ని సీట్లూ వైసీపీకి రాబోతున్నాయి. అందువల్ల వైసిపి రాజ్యసభ సభ్యులతో బిజెపికి పని ఉంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. ఈ బలహీనతతో బాటు వైసిపిని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం, బెంగ  బిజెపిని పట్టి పీడిస్తున్నాయి.  అందుకోసం కూడా బిజెపి అనుకున్న విధంగా వైసీపీని కట్టడి చేయలేకపోతున్నట్టు కనపడుతుంది. వైసిపికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం కనపడుతోంది.. పవన్ కల్యాణ్ వెనుక ఉండేది అందరూ యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి  విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్ధిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని జనసేన తమ ఆధీనంలోకి వచ్చే విధంగా బిజెపి చేసుకుంది. ఈ ఎత్తుగడతో వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్ కల్యాణ్ ను కూడా కట్టడి చేసి వైసిపిని బిజెపి అన్ని రకాలుగా రక్షిస్తున్నట్టు సామాన్యులు సైతం అనుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడం పై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బిజెపి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా మాట్లాడారని ప్రజలు అనుకుంటున్నారు. జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బిజెపి పూర్తిగా నీరుగారి పోయింది. ఉద్యమం చేస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బిజెపి తొలి ఐదేళ్లలో ఏపిలో బిజెపి పెరిగే అవకాశాన్ని చేజేతులా కొల్పోవడమే కాక  ఏపి ప్రజలకు విరోధిగా మారింది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత  బీజేపీకి ఏపిలో మళ్లీ పెరిగే అవకాశం వచ్చింది. అయితే అమరావతి తరలింపు తదితర అంశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ బిజెపి తన పెరుగుదలకు తానే పాతర వేసుకుంటోంది.  ఆంధ్రా రాజకీయాల్లో కమలం పార్టీ కన్స్యూజన్ లో ఉందని, తాజా పరిణామాలతో నేతలు అయోమయంలో వున్నారన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆంధ్ర నాయకులు ఒకలా.. ఢిల్లీ నాయకులు మరోలా మాట్లాడుతూ నానా  గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.  మూడు రాజధానుల నుంచి మండలి రద్దు అంశం వరకూ  బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కమలం పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకాక నేతలతో పాటు జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీలను వ్యతిరేకించినా ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
ధర్మాన ప్రసాదరావు. ఏ పార్టీలో ఉన్నా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆయననే పెద్దదిక్కుగా చెప్పుకుంటారు. అలాంటి ధర్మాన ప్రసాదరావు, వైసీపీ అధికారంలోకి వచ్చాక, మంత్రి పదవి ఆశించి భంగపడ్డాక, ఎమ్మెల్యేగానే మిలిగిపోయారు. అయితే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ధర్మాన... తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారనే వార్తలు, ఇప్పుడు సిక్కోలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలో నాలుగు వర్గాలున్నాయి. అందులో మూడు వర్గాలు అధికార వైసీపీకి మద్దతు తెలుపుతుండగా, మిగిలిన ఆ ఒక్క వర్గం మాత్రం టీడీపీకి మద్దతు తెలుపుతోంది. అయితే, ఆ ఒక్క వర్గాన్నీ తమవైపు తిప్పికోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశాయి. అయితే, వర్తక సంఘంలో తమ ఆధిపత్యం నడవాలంటే అన్ని వర్గాలు తమవే అయ్యుండాలని చోటా నాయకులు ధర్మానకు నూరిపోశారు. దాంతో ధర్మాన సైతం తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారట. అయితే, ఇది, అధికార పార్టీకి మద్దతుగా ఉన్న వర్తకుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తిని రాజేసింది. ఇటీవల శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలో ధర్మాన వర్గం, ఆయన వ్యతిరేక వర్గం పోటాపోటీగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇది బహిర్గతమైంది. ధర్మాన అనుకూల వర్గం నిర్వహించిన రక్తదాన శిబిరంలో కేవలం 20మంది మాత్రమే పాల్గొనగా, ఆయన వ్యతిరేక వ్యాపార వర్తక సంఘం నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం, 200మందికి పైగా పాల్గొన్నారు. దాంతో, ధర్మాన ప్రసాదరావుకు ఇది తీవ్ర అవమానమన్న చర్చ శ్రీకాకుళంలో జరుగుతోంది. శత్రువుల్లో కూడా సానుభూతిపరులను దగ్గర చేసుకునే ధర్మాన, ఈసారి మాత్రం ఆ లాజిక్ మిస్సయ్యారని అంటున్నారు. సొంత పార్టీలో ఉన్నవారినే కాదు, వైరి పక్షాల్లో ఉన్న సానుభూతిపరులను కూడా దగ్గర చేర్చుకోవడమే ధర్మాన గెలుపు మంత్రమని చెప్పుకుంటారు. ప్రధానంగా 2004, 2009, 2019 ఎన్నికల్లో ఇటువంటి అంశాలే ధర్మాన విజయానికి సూత్రమని చెప్పుకుంటారు. అలాంటి ధర్మాన... మార్కెట్ వర్తక సంఘం వ్యవహారంలో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారని చర్చించుకుంటున్నారు. అయితే, అనవసరమైన విషయంలో జోక్యం చేసుకుని, ధర్మాన పలుచన అవుతున్నారని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఎంత బలవంతుడైనా, అనువుగాని చోట అధికులమనరాదన్న మాటను, ధర్మాన మరచిపోయారని పార్టీ నేతలు అంటున్నారట. ఓవరాల్ గా వర్తక సంఘంలో అనుకున్నది ఒక్కటైతే, జరిగింది మరొకటని అంటున్నారు. మరి, ఈ మార్కెట్ అవమానం నుంచి ధర్మాన ఎలా బయటపడతారో చూడాలంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  'క్రాక్' టీజర్‌లోని "అప్పిగా.. సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా!" డైలాగ్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇది మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ 'క్రాక్' మూవీలోంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ మహా శివరాత్రి సంద‌ర్భంగా శుక్రవారం సాయంత్రం యూట్యూబ్‌లో రిలీజైంది. 'డాన్ శీను', 'బలుపు' సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్ కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమా 'క్రాక్'. రవితేజ మునుపటి సినిమాలు వరుసగా నాలుగు ఫ్లపైనా ఈ మూవీకి పాజిటివ్ బజ్ నడుస్తుండటం విశేషమే. 'బలుపు' తర్వాత రవితేజకు జోడీగా మరోసారి శ్రుతి హాసన్ నటిస్తోంది.   "ఒంగోలులో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.." అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. "అప్పిగా.. సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా!" అంటూ తనదైన శ్టైల్‌తో రవితేజ చెప్పిన డైలాగ్, టీజర్‌లోని యాక్షన్ సీన్లు సినిమాపై అంచనాలను బాగా పెంచేలా ఉన్నాయి. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సినిమాకు ప్లస్సవనున్నాయని ఆ డైలాగ్‌తో అర్థమవుతోంది. ఈ టీజర్‌ను రామానాయుడు స్టూడియోస్‌లోని ప్రివ్యూ థియేటర్‌లో మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, "మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా మే 8న 'క్రాక్' మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. రవితేజ నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు  ఉంటాయి. టీజర్‌లో చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా చాలా ఉంటుంది. మా యూనిట్‌కి మంచి కమర్షియల్ సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. మా సినిమాటోగ్రాఫర్ విష్ణు అధ్బుతమైన విజువల్స్ అందించారు. టీజర్ లాగే మూవీలో కూడా తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాం" అని చెప్పాడు. సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేలను గోపీచందే సమకూర్చాడు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్‌తో డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారని నిర్మాత బి. మధు చెప్పారు. టీజర్ ప్రకారం సముద్రకని ఒక పవర్‌ఫుల్ రోల్‌లొ కనిపించనుండగా, విజిల్ వేస్తూ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ మరో ఆసక్తికరమైన పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ సినిమాకు ఎస్సెట్ అవడం ఖాయమని టీజర్‌తో తెలుస్తోంది. 'టచ్ చేసి చూడు' నుంచి మొదలైన రవితేజ పరాజన పరంపరకు 'క్రాక్' బ్రేక్ వేస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగిస్తోంది. మే 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
  యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ 'డొలమైట్స్'. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. తాజాగా 'రెడ్‌' సినిమా షూటింగ్‌ ఇక్కడ జరిగింది. రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం 'రెడ్'. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మి స్తున్న ఈ చిత్రం కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్ని డోలమైట్స్‌లో షూట్‌ చేయడం విశేషం.  ఈ విషయాన్ని 'స్రవంతి' రవికిశోర్‌ వివరిస్తూ, "ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్‌లో రామ్‌, హీరోయిన్ మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభి మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇటలీలోని టుస్కాన్, ఫ్లారెన్స్, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. డోలమైట్స్ అనేది సముద్ర తీర పర్వత ప్రాంతం. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో, మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే! ఈ రెండు పాటలూ చాలా బాగా వచ్చాయి. అలాగే ఇటలీలో ప్రతి ఏటా సూపర్బ్‌గా జరిగే వెనీడియా కార్నివాల్‌లో కూడా అనుమతి తీసుకుని పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. దీంతో ఒక పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీకరిస్తాం" అని తెలిపారు.  చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ "ఇస్మార్ట్ శంకర్‌ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌ నుంచి వస్తున్న ఈ చిత్రం క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఓపెనింగ్‌ రోజున ప్రకటించినట్టుగానే ఏప్రిల్‌ 9న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం" అని చెప్పారు. రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌. ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌.
ప్రముఖ హిందీ హీరోయిన్ శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా దంపతులకు ఫిబ్రవరి 15న కుమార్తె పుట్టింది. ఇద్దరికీ ఇది రెండో సంతానం. వీళ్లకు 7 ఏళ్ళ కుమారుడు వియాన్ ఉన్న సంగతి తెలిసిందే. అమ్మాయికి శమిషా శెట్టి కుంద్రా అని పేరు పెట్టారు. విచిత్రం, విశేషం ఏమిటంటే... శిల్పాశెట్టి గర్భవతి కాలేదు. మరి, కుమార్తె ఎలా పుట్టింది? అనుకుంటున్నారా!? ఈ దంపతులు ఇద్దరు సరోగసీ ద్వారా కుమార్తెను కన్నారు. ఇంతకుముందు బాలీవుడ్ సెలబ్రెటీలు షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఇదేవిధంగా పిల్లల్ని కన్నారు. పెళ్లి చేసుకొని ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్, నటుడు తుషార్ కపూర్, నిర్మాత ఏక్తా కపూర్ కూడా సరోగసీ ద్వారా సంతానాన్ని పొందారు. అయితే... సరోగసీ ద్వారా కుమార్తెను కన్న తొలి హిందీ హీరోయిన్ శిల్పా శెట్టి అని సమాచారం. తెలుగులోనూ శిల్పాశెట్టి కథానాయికగా నటించారు. సాహస వీరుడు సాగర కన్య, వీడెవడండీ బాబోయ్, ఆజాద్, భలేవాడివి బాసు చిత్రాలు ఆమె నటించారు. ఇటీవల అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంములో' చిత్రంలోని బుట్ట బొమ్మ సాంగ్ కు టిక్ టాక్ వీడియో చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Cast: Nitin, Rashmika, Ananta Nag, Vennela Kishore, Brahmaji and others Music Director: Mahati Swarasagar Editor: Navin Nooli Cinematographer: Sai Sri Ram Producer: Suryadevara Naga Vamshi Director: Venky Kudumula Release Date: 21st February 2020 Last 3 movies from Nitin, did not give the expected results. But still people had hopes on his flick Bheeshma. So has it yielded the expected results. Has Director Venky given his second hit? Let us read the review. Story Bheeshma ( Ananta Nag) is the MD of Bheeshma Organics is a bachelor. He declares to announce the CEO of the 50years old complaint whose turnover is 8000 crores. In the same company works Chaitra(Rashmika). Bheeshma (Nitin) is a boy who has failed in degree. Chaitra falls in love with him. How does Chaitra fall in love with a guy who is not even a graduate is a big question. Even bigger question is how did he become the CEO Bheeshma Organics. The only task assigned to Bheeshma would be to prove himself in 30days as CEO. Will he prove himself? Answers to these questions form the movie Bheeshma. Analysis As a story, there is nothing new in the movie Bheeshma. But it has a nice comedy track. Besides, this movie is worth watching with entire family. Though the movie's beginning is not that great, the conversations are a bit interesting. Comedy by Vennela Kishore is good and more that the story, certain scenes are very good in the movie. The only saviour for the movie is Cinematography and the music. In the second half fights are also good. Plus Points Comedy,Direction Nitin - Rashmika Chemistry Vennela Kishore track Conversations Songs, Fights Nice performance by all the artists Minus Points Story, Screenplay Conflicts in the story Performances This is not a challenging role for Nitin, but it is a movie which will bring recognition in his career. He looks stylish in the movie and dances well in the movie. Comedy timing is good. Chemistry between Rashmika and Nitin is good. After them, Vennela Kishore's role is noteworthy. He has made the audience laugh heart out. All the others have done a decent job.  TeluguOne Perspective Bheeshma is a simple and stylish movie. Though the movie story is not that great, it has good comedy which will make the audience laugh. This movie can be happily enjoyed with family. Rating: 3/5
హిందీ హీరో ఆయుష్మాన్ ఖురానా, నటుడు జితేంద్ర కుమార్ జంటగా నటించిన బాలీవుడ్ సినిమా 'శుభ్ మంగళ్ జ్యాదా సావదాన్'. ఇద్దరు మగాళ్ళు జంటగా నటించిన సినిమా అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ఇదొక గే ఎంటర్ టైనర్. ఇద్దరు అబ్బాయిల ప్రేమ కథతో రూపొందిన సినిమా. అరబ్ దేశాలు  అయినా దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ సినిమాపై నిషేధం విధించారు. అక్కడ సినిమా విడుదల కాకుండా బ్యాన్ విధించారు. అక్కడికి నిర్మాతలు సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరిస్తామని తెలిపారట. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. హోమో సెక్సువల్ కథతో రూపొందిన ఈ సినిమాకి అక్కడ నిషేధం విధించినట్లు సమాచారం. సినిమాలో ఆయుష్మాన్, జితేంద్ర మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. వాటిని తొలగిస్తామని నిర్మాతలు అరబ్ దేశాల్లో సెన్సార్ అధికారులు చెబితే... హోమో సెక్సువల్ దీని కారణంగా సినిమాపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారట.
నటీనటులు: సాయి రోనక్, ప్రీతి అస్రాని, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, సివిఎల్ నరసింహారావు తదితరులు ఎడిటింగ్: నరేష్ రెడ్డి జొన్న  సినిమాటోగ్రఫీ: నగేష్ బనెల్, అనిత్ ఎమ్ నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, సమ్రన్ హర్షవర్ధన్ రామేశ్వర్  నిర్మాతలు: అప్పిరెడ్డి, సుజోయ్, సుశీల్  రచన-దర్శకత్వం: సుజోయ్-సుశీల్  విడుదల తేదీ: 21 ఫిబ్రవరి 2020 పాటలు, ప్రచార చిత్రాలు 'ప్రెషర్ కుక్కర్' సినిమాకు బజ్ తీసుకొచ్చాయి. 'అమెరికా పొయ్యి నువ్వైతవుర లంగ' అంటూ రాహుల్ సిప్లిగంజ్ చేసిన ప్రమోషనల్ సాంగ్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. మరి, సినిమా ఎలా ఉంది? కథ: కిషోర్ (సాయి రోనక్) గోల్ ఒక్కటే... అమెరికా పోవడం! ఎందుకంటే... చిన్నతనం నుండి అమెరికా వెళ్లమని తండ్రి నూరిపోస్తాడు కాబట్టి. బీటెక్ పూర్తి చేసిన తర్వాత... ఉద్యోగాలు ఏవీ చేయకుండా యుఎస్ వీసా కోసం కిషోర్ రెండు మూడు ప్రయత్నాలు చేస్తాడు. కానీ, వీసా రాదు. రెండు తప్పులు  చేయడంతో తండ్రి ఇచ్చిన పాతిక లక్షలు పోవడంతో పాటు, ఆ తర్వాత ఏడాది పాటు అమెరికా వీసా రాకుండా బ్యాన్ విధిస్తారు. కిషోర్ చేసిన ఆ రెండు తప్పులు ఏంటి? ఏడాది వీసా ఇవ్వకూడదని అమెరికన్ ఎంబసీ బ్యాన్ విధిస్తే... అమెరికన్ ప్రభుత్వం గ్రీన్ కార్డ్ ఎందుకు ఇచ్చింది? మధ్యలో కిషోర్ ఏం చేశాడు? అనిత (ప్రీతి అస్రాని)తో ప్రేమకథ ఏంటి? తనికెళ్ల భరణి పాత్ర హీరోలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది? చివరకు, హీరో అమెరికా వెళ్లాడా? లేదా? అనేది సినిమా.    విశ్లేషణ: హీరో అమెరికా వీసా కోసం ప్రయత్నించాడు. రాలేదు. మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ రాలేదు. ఇంకోసారి ప్రయత్నించాడు. ఈసారీ  వీసా రాలేదు. మరోసారి ప్రయత్నించాడు. హీరో వీసా కోసం అప్లై చేయడం, రిజెక్ట్ కావడం...  ఫస్టాఫ్ అంతా ఇదే లొల్లి. కథ కొంచెం కూడా ముందుకు వెళ్ళదు. సెకాండఫ్ కి వస్తే... అమెరికాలో సెటిల్ అయిన పిల్లలు తల్లితండ్రులను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారనేది మెయిన్ గా చూపించారు. ఆల్రెడీ 'శతమానం భవతి', ఇటీవల వచ్చిన 'ప్రతిరోజూ పండగే'లో అదే అంశాన్ని భావోద్వేగంగా చూపించారు. అంతకంటే గొప్పగా 'ప్రెషర్ కుక్కర్'లో ఏమీ చూపించలేదు. గొప్ప డైలాగులు కూడా లేవు. ఫస్టాఫ్ లోని డైలాగుల్లో అమెరికా అనే పదం ఒక వందసార్లు వచ్చి ఉంటుందేమో. అమెరికా సౌండింగ్ విన్న ప్రతిసారీ విరక్తి వచ్చేలా ఆ డైలాగులు రాశారు. అవుట్ డేటెడ్ కామెడీ డైలాగులు గురించి చెప్పుకోకుండా ఉండడం మంచిది. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను, సినిమాను తీయడంలో దర్శక ద్వయం, అన్నదమ్ములు సుజోయ్, సుశీల్ ఫెయిల్ అయ్యారు. ప్రొడక్షన్ వేల్యూస్ కొన్ని సన్నివేశాల్లో ఎంత ఘోరంగా ఉన్నాయంటే... రాహుల్ రామకృష్ణకు విగ్ పెట్టారు. అతడు జుట్టు పెంచుకున్నప్పుడు కొన్ని సీన్స్ తీసినట్టు ఉన్నారు. తర్వాత కొన్ని సీన్స్ తీసేటప్పుడు అతడు హెయిర్ కట్, షేవింగ్ చేయించుకున్నట్టు ఉన్నాడు. విగ్, పెట్టుడు గడ్డంతో షూటింగ్ చేశారు. స్క్రీన్ మీద అది క్లియర్ గా తెలుస్తుంది. ప్లస్‌ పాయింట్స్‌: ప్రీతి అస్రాని, తనికెళ్ల భరణి నటన 'గమనించింది ఈ చల్ల గాలి', 'రా రా కొడకా' పాటలు   మైనస్‌ పాయింట్స్‌: హీరో సాయి రోనక్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నిర్మాణ విలువలు కామెడీ సీన్లు సన్నివేశాల్లో సాగదీత     నటీనటుల పనితీరు: సాయి రోనక్ హైట్, కలర్, స్టయిల్ హీరోకి తగ్గట్టు ఉన్నాయి. కానీ, అతడి ఫేస్ లో పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ పలకలేదు. నటుడిగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. హీరోయిన్ ప్రీతి అస్రాని క్యూట్ గా, బ్యూటిఫుల్ గా ఉంది. పెర్ఫార్మన్స్ పరంగానూ బాగా చేసింది. 'గమనించింది' పాటలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ సింప్లీ సూపర్బ్ అండ్ క్యూట్. తనికెళ్ల భరణి అనుభవం పాత్రకు ఉపయోగపడింది. ఆయన నటన వల్ల సెకండాఫ్ లో, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగా వచ్చాయి. రాహుల్ రామకృష్ణకు సరైన సన్నివేశాలు పడలేదు. సినిమాలలో రెగ్యులర్  గా కనిపించే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ టైపులో అతడి పాత్ర ఉంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మరో నటుడు రాజై రోవన్ విసిగించాడు.   తెలుగుఒన్‌ పర్ స్పెక్టివ్‌: సినిమా చూస్తున్నంత సేపూ ఆడియన్స్ పరిస్థితి 'ప్రెషర్ కుక్కర్'లో ఉన్నట్టు ఉంటుంది. థియేటర్ అనే ప్రెషర్ కుక్కర్ లో మంట గట్టిగా పెట్టి కూర్చోబెట్టినట్టు ఉంటుంది. ప్రేక్షకులారా... తస్మాత్ జాగ్రత్త!  రేటింగ్‌: 1.25/5
నటీనటులు: నితిన్, రష్మిక, అనంత్ నాగ్, వెన్నెల కిషోర్, రఘుబాబు, బ్రహ్మాజీ, సంపత్ తదితరులు ఎడిటింగ్: నవీన్ నూలి  సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ సంగీతం: మహతి స్వర సాగర్ సమర్పణ: పీడీవీ ప్రసాద్  నిర్మాత: సూర్యదేవర నాగవంశీ కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: వెంకీ కుడుముల విడుదల తేదీ: 21 ఫిబ్రవరి 2020 నితిన్ హీరోగా నటించిన లాస్ట్ మూడు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయినా... 'భీష్మ'పై క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా సినిమా ఉందా? దర్శకుడిగా తొలి సినిమా 'ఛలో'తో  హిట్ కొట్టిన వెంకీ కుడుముల ద్వితీయ విఘ్నం దాటాడా? రెండో సినిమాతో హిట్ అందుకున్నారు? రివ్యూ చదివి తెలుసుకోండి.  కథ:  భీష్మ ఆర్గానిక్ ఎండీ భీష్మ (అనంత్ నాగ్) బ్రహ్మచారి. యాభై ఏళ్ల చరిత్ర, ఎనిమిది వేల కోట్ల ఆస్తి కల తన కంపెనీకి సరైన వారసుణ్ణి, కాబోయే సీఈవోను త్వరలో ప్రకటిస్తానని చెప్తాడు. అదే కంపెనీలో ఏసీపీ దేవా (సంపత్ రాజ్) కుమార్తె చైత్ర (రష్మిక) పని చేస్తుంటుంది. డిగ్రీ ఫెయిల్ అయిన కుర్రాడు భీష్మ (నితిన్)తో ఆమె ప్రేమలో పడుతుంది. డిగ్రీ ఫెయిల్ అయిన కుర్రాడిని మంచి ఉద్యోగంలో అమ్మాయి ఎలా ప్రేమించిందనేది ఒక క్వశ్చన్ అయితే... అతడిని పెద్ద భీష్మ కంపెనీ సీఈవోగా ఎలా ప్రకటించారనేది మరో క్వశ్చన్. కంపెనీ ఆపరేషనల్ సీఈవోగా 30 రోజుల్లో భీష్మ తన ప్రతిభను నిరూపించుకోకపోతే ఉద్యోగం నుండి తీసేస్తామని ఒక షరతు పెడతారు. యంగ్ భీష్మ తన ప్రతిభను ఎలా నిరూపించుకున్నాడు? మధ్యలో భీష్మ ఆర్గానిక్స్ కంపెనీకి, రాఘవన్ (జిష్షు సేన్ గుప్తా)కి చెందిన ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ కంపెనీకి మధ్య గొడవ ఏంటి? అనేది సినిమా. విశ్లేషణ:  కథగా చెప్పుకోవాలంటే భీష్మలో పెద్ద విషయం లేదు. కానీ, కామెడీ బావుంది. అన్నిటి కంటే ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా సినిమా ఉంది. సినిమా ప్రారంభం చాలా సాదాసీదాగా ఉంది. ఒక ప్రీ వెడ్డింగ్ పార్టీకి వెళ్లిన హీరో, పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఐఏఎస్ అని చెబితే... ఆమె హీరోతో వచ్చేయడం వంటివి నమ్మశక్యంగా అనిపించవు. కానీ, అక్కడ దర్శకుడు రాసిన కొన్ని డైలాగులు నవ్విస్తాయి. తర్వాత ఆ సీన్ బేస్ చేసుకుని రాసిన వెన్నెల కిషోర్ ట్రాక్ బావుంది. నిజం చెప్పాలంటే... కథ కంటే కథలో సన్నివేశాలు బావుంటాయి. సమయం, సందర్భం చిక్కిన ప్రతిసారీ దర్శకుడు నవ్వించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో విజయం సాధించారు కూడా! మీమ్స్ మీద బేస్ చేసుకుని రాసిన డైలాగులు నవ్వు తెప్పిస్తాయి. అయితే... కథ విషయంలో చిన్న అసంతృప్తి ఉంటుంది. ఇంటర్వెల్ వరకూ కథ పెద్దగా ముందుకు కదలదు. హీరో నితిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ రష్మికకు అతడు లైన్ వేసే సీన్స్, మధ్యలో కొంచెం కంపెనీ గొడవలు టచ్ చేస్తూ సరదా సరదాగా వెళుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథలోకి వెళ్లడంతో కొంచెం వినోదం తగ్గుతుంది. అక్కడక్కడా బోరింగ్ మూమెంట్స్ తగ్గుతాయి. కానీ, పాటలు స్టయిలిష్ ఫైటులతో మేనేజ్ చేశారు. అయితే... రైతుల భావోద్వేగాలు, రసాయనాలతో పంటలు పండించడం వల్ల వచ్చే అనర్థాలను కొంచెం లోతుగా చూపిస్తే బావుండేది. క్లైమాక్స్ తేల్చేసినట్టు ఉంటుంది. ఒక్క డైలాగ్ కి అమ్మాయి ప్రేమలో పడిపోవడం మరీ సినిమాటిక్ గా ఉంది. విలనిజం కూడా సరిగా పండలేదు. సినిమాలో అడుగడుగునా దర్శకుడి టేకింగ్, కామెడీ రైటింగ్ కనిపిస్తాయి. అతడికి సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ చక్కటి సహాయ సహకారాలు అందించారు. సెకండాఫ్ లో వెంకట్ మాస్టర్ డిజైన్ చేసిన ఫైట్ బావుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌: వినోదం, దర్శకత్వం ముఖ్యంగా సంభాషణలు నితిన్-రష్మిక కెమిస్ట్రీ 'వెన్నెల' కిషోర్ ట్రాక్ నటీనటులంతా బాగా చేశారు పాటలు, ఫైట్లు  మైనస్‌ పాయింట్స్‌: కథ, స్క్రీన్ ప్లే  కథలో కాంఫ్లిక్ట్స్  విలనిజం రైతుల ఎమోషన్స్ ఇంకా చూపించాల్సింది.  నటీనటుల పనితీరు: నటుడిగా నితిన్ కి సవాల్ విసిరే పాత్ర కాదు. కానీ, నటుడిగా అతడిని చక్కగా చూపించిన పాత్ర భీష్మ. సినిమాలో నితిన్ చాలా స్టయిలిష్ గా ఉన్నారు. డాన్సులు బాగా చేశారు. కామెడీ టైమింగ్ బావుంది. నితిన్-రష్మిక మధ్య కెమిస్ట్రీ కుదిరింది. 'వాటే వాటే బ్యూటీ'లో నితిన్ కంటే ఆమె డాన్సు బాగా చేసింది. వీళ్లిద్దరి తర్వాత అంతగా ఆకట్టుకున్న నటుడు 'వెన్నెల' కిషోర్. తనదైన శైలిలో నవ్వించాడు. మిగతా నటీనటులందరూ బాగా చేశారు. హెబ్బా పటేల్ రెండు సన్నివేశాల్లో కనిపించింది.   తెలుగుఒన్‌ పర్ స్పెక్టివ్‌: ఒక సింపుల్ అండ్ స్టయిలిష్ సినిమా 'భీష్మ'. గొప్ప కథ, కథనాలు లేవు. కానీ, కామెడీ విషయంలో ఏ లోటు చేయకుండా నవ్విస్తుంది. నితిన్-సంపత్ మధ్య వాట్సాప్ చాట్ సీన్ కావొచ్చు, కారులో రష్మికకు ముద్దులు పెడుతున్నట్టు నితిన్ కలరింగ్ ఇచ్చే సీన్ కావొచ్చు. 'వెన్నెల' కిషోర్ ట్రాక్ కావొచ్చు... సినిమాలో నవ్వులకు లోటు ఉండదు. సరదాగా ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లి కాసేపు కాలక్షేపం చేయవచ్చు. ప్రతి సన్నివేశంలో కన్వీనియంట్ గా కామెడీ చేశారు దర్శకుడు. రేటింగ్‌: 3/5
లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి తన గొప్ప స్వభావాన్ని చాటుకున్నారు. 'ఇండియన్ 2' సెట్స్ లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు టెక్నీషియన్లకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆ ముగ్గురి కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయా కుటుంబాల్లో చోటుచేసుకున్న నష్టానికి పరిహారం గా ఈ డబ్బు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తాను ఇస్తున్న కోటి రూపాయలు నష్టపరిహారం కాదని ఆర్థిక సాయం మాత్రమేనని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఏదైనా కుటుంబంలోని కీలక వ్యక్తి ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం బ్రతుకు సాగించడం ఎంత కష్టంగా ఉంటుందో తనకు తెలుసునని ఆయన అన్నారు. భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకునే విధంగా పరిశ్రమ ప్రముఖులతో మాట్లాడినట్లు కమల్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ఇతరులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి ఆయన వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. సినిమా కోసం కష్టపడి పనిచేసే వాళ్లకు రక్షణ ఇవ్వలేకపోతున్న అందుకు వ్యక్తిగతంగా సిగ్గుపడుతున్నానని కమల్ తెలిపారు.
"బరువు తగ్గమంటే తగ్గుతాను. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ, బరువు పెరగడం అని చెబితే అస్సలు పెరగను" అని రకుల్ ప్రీత్ సింగ్ చెబుతున్నారు. ఏదైనా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బరువు తగ్గడానికి 'ఎస్' అంటున్న ఈమె.... బరువు పెరగడానికి మాత్రం నో అంటున్నారు. హిందీలో 'దే దే ప్యార్ దే' సినిమా కోసం రకుల్ 45 రోజుల్లో 10 కిలోలు బరువు తగ్గారు. ఆ సినిమాలో క్యారెక్టర్ కోసం ఆమె చాలా కష్టపడ్డారు. గత సినిమాలతో పోలిస్తే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. ఆ విధంగా ఏదైనా సినిమా కోసం బరువు తగ్గడానికి తనకి ఎటువంటి సమస్య లేదని ఆమె అంటున్నారు. మరి, పెరగడానికి ఎందుకు నో చెబుతున్నారు? అనే ప్రశ్న రకుల్ ముందుంచితే... "నా ఫిట్ నెస్, ఆరోగ్యానికి హాని చేసే పనులు ఏవి నేను చేయను. బరువు పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ప్రతిరోజూ వర్కౌట్ చేయకపోతే, జిమ్ లో చెమట చిందించ కపోతే నా బాడీ పనిచేయదు" అని సమాధానం ఇచ్చారు. అది సంగతి.
ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్ర‌హీత, క‌ళావాహిని శ్రీమ‌తి విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా లోని సూప‌ర్ స్టార్‌ కృష్ణ విజయ నిర్మల నివాసంలోఏర్పాటు చేసిన విజయనిర్మల  కాంస్య విగ్రహాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు.  తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినిరెడ్డికి  కృష్ణంరాజు, మహేష్ బాబు అందచేశారు. ఈ సంద‌ర్భంగా... రెబెల్ స్టార్ కృష్ణంరాజు  మాట్లాడుతూ  - ``నాకు బాగా ఇష్టురాలు, స్నేహితురాలు ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే విజయ నిర్మల మనమధ్య లేకపోవడం బాధాకరం. ఆ పేరు లోనే విజయం ఉంది.  ఆ పేరు లోనే నిర్మలత్వం ఉంది. ఆ విజయం కూడా అనితర సాధ్యం. 46 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి అంత ఎంతో ఎత్తుకి ఎదిగారు. విజయ నిర్మల నాకు బుద్దిమంతుడు సినిమాతో పరిచయం. నేను కృష్ణ గారు విజయ నిర్మల క‌లిసి  ఎన్నో సినిమాలు చేశాం. ఆమె సాధించిన విజయాల్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి తల్లితండ్రులు అంటే అభిమానం ఉంటుంది.  అలా నరేష్ తన తల్లికి బంగారు పాదాలు చేయించి పూజించడం గొప్ప విషయం" అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ  - ‘‘విజయ నిర్మల గారు 50 సినిమాలు చెయ్యడం ఒక చరిత్ర. ఈరోజు ఆవిడ వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు’’ అన్నారు. విజయ నిర్మల స్త్రీ శక్తి  అవార్డ్ గ్ర‌హీత, ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ  ‘‘విజ‌య‌నిర్మ‌ల గారి పేరు మీద  విజయ నిర్మల స్త్రీ శక్తి అవార్డు మొద‌టి సంవ‌త్స‌రం నేను  తీసుకోవడం చాలా ఆనందంగా వుంది. రాబోయే రోజుల్లో మరింత మంది ఈ అవార్డు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను.  మహేష్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా హ్యాపీ’’ అన్నారు. నరేష్ విజ‌య‌కృష్ణ‌ మాట్లాడుతూ : ‘‘ప్రతి తల్లి ఒక అమ్మవారు. అమ్మ దీవెనలు వున్న వారు శిఖరాన్ని అందుకుంటారు. మా అమ్మ కృష్ణ గారి దీవెనలతో ఇద్దరు కలసి ఒక రోల్ మోడల్‌గా నిలిచారు. నాకు ఎప్పుడూ మంచి చెబుతూ ధైర్యం నిచ్చారు. అమ్మదీవెనలు అందరికీ వుండాలి. మా వెల్ఫేర్ కోసం నేను ఎప్పుడూ ముందు వుంటాను. అమ్మ పేర అవార్డుని నటీ నటులకు ప్రతి సంవత్సరం అందించనున్నాం’’ అన్నారు మాజీ ఎంపి మురళి మోహన్ మాట్లాడుతూ - " అతి సున్నితమైన మనసున్న మన కృష్ణ గారిని విజయనిర్మల దాదాపు 50 సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూవచ్చారు. ఈరోజు ఆవిడ మనమధ్య లేకపోయినా విజయ నిర్మల పుట్టినరోజుని ఇంత ఘనంగా జరపడం నిజంగా అభినందనీయం. ఈ సంవత్సరం లాగే ప్రతి ఏడాది ఆమె పుట్టినరోజు నాడు కళాకారులకు ఆమె పేరు మీద అవార్డ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ - "కృష్ణ గారితో నెంబర్ వన్ సినిమా చేస్తున్నప్పుడు ఎవ్వరికి దక్కని అదృష్టం నాకు దక్కింది. అదేంటంటే విజయ నిర్మల గారి చేతి వంట తినే అవకాశం. ఆవిడ చూపించిన ప్రేమ,ఆవిడ వంటలో ఆ రుచి ఒకటి కాదు ఆ అనుభూతిని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఆ అదృష్టం కృష్ణ గారి మూలంగా నాకు దక్కింది. అంతటి ప్రేమానుభూతులు ఉన్నటువంటి విజయ నిర్మల గారు దర్శకత్వ శాఖలో ఉండడం మా అందరికి ఒక అమ్మ ఉన్నట్టుగా అనిపించేది" అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ - "విజయ నిర్మల గారు నాకు తెలిసి వన్ ఆఫ్ మోస్ట్ గ్రేటెస్ట్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ ఎవర్. నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రతి సారి ఫస్ట్ నాన్నగారు మార్నింగ్ షో చూసి నాతో మాట్లాడేవారు. తరువాత విజయనిర్మల గారు మాట్లాడి కంగ్రాట్స్ చెప్పేవారు. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తరువాత నాన్న గారు కంగ్రాచ్యులేట్ చేశారు తరువాత ఆవిడ మాట్లాడబోతుంది అనుకోని వెంటనే రియలైజ్ అయ్యాను. ఆరోజు ఆ లోటు కనిపించింది. ఈరోజు మనందరం ఆవిడను మిస్ అవుతున్నాం. ప్రతిఏటా ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించే వాళ్లం. ఈ ఏడాది విగ్రహావిష్కరణతో ఆమెకు మేము ఇస్తున్న చిన్న నివాళి. ఇవ్వాళ ఆవిడ ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటారు" అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ - "విజయనిర్మల ఐదారు సినిమాలలో నటించినప్పుడే నేను డైరెక్ట్ చేస్తాను అంది. నేను ఒక సలహా ఇచ్చాను. ఇప్పుడే తొందరపడి డైరెక్ట్ చేయనవసరం లేదు ఒక వంద సినిమాలలో నటించి ఆ తర్వాత నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నాను. అలాగే వంద సినిమాలు అయిపోయినతరువాత డైరెక్ట్ చేసింది. మొట్టమొదటి సినిమా బడ్జెట్ తక్కువలో అవుతుందని మలయాళంలో `కవిత` అనే సినిమా చేసింది. అది అద్భుతమైన విజయం సాధించింది. దాని విజయోత్సహంతో తెలుగులో `మీనా` సినిమా తీసింది. అది వందరోజులు ఆడి సూపర్ హిట్ అయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా 46 సినిమాలు తను తీస్తే అందులో 95 శాతం హిట్ సినిమాలే తీసింది. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం. ఈరోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. విజయ నిర్మల మీద ఉన్న అభిమానంతో ఈ సభకి విచ్చేసిన  అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అన్నారు. ఈ కార్యక్రమంలో నమ్రత, అచ్చిరెడ్డి, రేలంగి న‌ర్సింహా రావు, గల్లా జయదేవ్, పివిపి, సుధీర్ బాబు,  ఆదిశేషగిరరావు, శివకృష్ణ, మారుతి, బ్రహ్మాజీ, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా తొలిసారి పరిమిత మీడియాతో జగన్ మాటా మంతి.. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం: జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.                                          ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది: సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి మనముందున్న లక్ష్యం విశాఖను  టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే: జగన్ మోహన్ రెడ్డి .మొత్తానికి సి ఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిమిత మీడియా తో అయినా, అపరిమితమైన అంశాలను షేర్ చేసుకున్నారు. పెన్షన్ల దగ్గర నుంచి పోలవరం దాకా, ఇంగ్లిష్ మీడియం నుంచి రాజధాని నిర్మాణం దాకా....అనేకానేక విషయాలను స్పృశించిన జగన్ మోహన్ రెడ్డి , తన మనసులో మాటలను, ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు. పెన్షన్లగురించి మాట్లాడుతూ.. ఒకరికి  ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ... అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుందాని చెప్పుకొచ్చారు. ప్రజల ముందే లబ్ధిదారుల జాబితా పెడుతున్నామనీ, సామాజిక తనిఖీకోసం గ్రామ ప్రజలముందే, గ్రామ సచివాలయంలో పెడుతున్నామనీ, ఎవరుకూడా తప్పులు చేసే అవకాశం లేకుండా చేస్తున్నామనీ చెప్పుకొచ్చారు సి.ఎం. ప్రతి పథకంకూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చిన సి.ఎం, పెన్షన్‌ ఇంతకుముందు కావాలంటే మూడు నెలల పెన్షన్‌ డబ్బు లంచంగా ఇవ్వాల్సి వచ్చేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పధకాల గురించి మాట్లాడుతూ, మేం ఏంచెప్పామో అదే చేస్తున్నామన్నారాయన. మేం ప్రతి పథకాన్నీ పెడుతున్నామంటే.. మేం చెప్తున్నదాన్ని అమలుచేస్తున్నామని కదా? ప్రతి ఏటా రెవిన్యూ ఎంతోకొంత పెరుగుతుంది. నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చుకాని, పెరుగుదలైతే ఉంటుందని కూడాభరోసాఇచ్చారు... ఇంగ్లిషు మీడియంపైన మాట్లాడుతూ, "న్యూట్రల్‌ మనిషిని ఎవరైనా అడగండి...కచ్చితంగా మా విధానాలను బలపరుస్తారు, మద్దతిస్తారు. ఇవాళ ఇంగ్లిషు మీడియం పెడితేనే... 20ఏళ్లలో మార్పులు వస్తాయి.ఇవాళ ఫస్ట్‌క్లాస్‌ చదవే వ్యక్తి.. 20 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తిచేస్తారు. ఇవాళ ఫోన్‌ఆన్‌  చేస్తే..కమ్యూనికేషన్‌ అంతా ఇంగ్లిషే. కంప్యూటర్లు.. ఇంటర్నెట్‌అంతా ఇంగ్లిష్‌లోనే. డ్రైవర్‌లెస్‌కార్లు వస్తున్నాయన్నది రియాల్టీ. ఇవాళ మనం మార్పు చేసుకుంటేనే.. భవిష్యత్‌తరాలకు మంచి జరుగుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి," అని హితవు కూడా చెప్పారు.  అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యాకమిటీలు పూర్తిగా ఇంగ్లిషు మీడియం పెట్టాలని వారంతా తీర్మానాలు చేసి పంపారని, ఎవర్ని అడిగినా ఇంగ్లిషుమీడియం కావాలనే చెప్తారని కూడా సి.ఎం. చెప్పుకొచ్చారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై  మాట్లాడుతూ... "రాజధానిపై నేను చెప్పాల్సింది అంతా అసెంబ్లీలోనే చెప్పాను. రాజధానిని ఎంచుకున్న ప్రాంతాన్ని చూడండి. అటు విజయవాడా కాదు, ఇటు గుంటూరూ కాదు... రాజధాని ప్రాంతం ఎక్కడ వస్తుందీ ముందే తనవారికి, తన అనుచరులకీ చెప్పి.. వేలాది ఎకరాలు కొనుగోలుచేయడం, క్యాబినెట్‌ సబ్‌కమిటీ ప్రాథమిక పరిశీలనలోనే 4వేలకుపైగా ఎకరాలు బటయపడ్డం.. అదంతా వేరే కథ.మరికొన్ని కీలక అంశాలను చూస్తే.. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే ఇవ్వాళ్టికీ మనం సింగిల్‌ రోడ్డుమీదే వెళ్లాలి. కరకట్టమీదున్న సింగిల్‌ రోడ్డుమీదనుంచే పోవాలి. నేనేమీ అబద్ధాలు చెప్పడంలేదు. మీడియా ప్రతినిధులుగా మీరుకూడా అదే దారివెంబడి వెళ్లాలి. సమీకరించిన భూమిని డెవలప్‌ చేయడానికి, కరెంటు, రోడ్లు, పైపులైన్‌తో నీరు ఇవ్వడానికి ఎకరాకు కనీసం రూ.2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వం వాళ్లే చెప్పారు. రూ. 1,09,000 కోట్ల అంచనా వేశారు. కాని అదే ప్రభుత్వం ఐదేళ్లకాలంలో రూ.5600 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. మరో రూ.2–3 వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించమని మాకు అప్పగించి వెళ్లిపోయారు. ఇందులోనూ రూ.500 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాల్సిన పరిస్థితి," అని గణాంకాలతో సహా వివరించారు జగన్ మోహన్ రెడ్డి. . ప్రతి ఏటా రూ.6 నుంచి 7 వేల కోట్లరూపాయలు రాజధాని మీద పెడితే.. అది సముద్రంలో వేసిన నీటిబొట్టే అవుతుంది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఇక్కడి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కోసం వేసిన అంచనాలో 10శాతం డబ్బును విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకైనా మనం హైదరాబాద్‌తోగాని, చెన్నైతోగాని, బెంగుళూరుతోగాని పోటీపడే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటుంది. అయినా సరే.. ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా కొనసాగిస్తామని చెప్పాం. మహారాష్ట్రలోని నాగపూర్, కర్ణాటకలోని బెల్గాంల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది. సీఎం అక్కడనుంచి పనిచేయాలి? ఇక్కడ నుంచి పనిచేయాలి? అని ఎవ్వరూ చుప్పలేరు. మంత్రివర్గానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలను పాలనాయంత్రాంగం అమలు చేస్తుంది. విశాఖలో నీటికి కొరత ఉందనేది వాస్తవం కాదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ.. పోలవరం నుంచి మరింత నీటిని అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. తుపాన్ల సమస్య రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాలకూ ఉందని చెప్పిన సి.ఎం., ఇదే కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉప్పెన వచ్చిన ఘటనలూ ఉన్నాయన్నారు. విజయవాడకు కేవలం 60 కి.మీ దూరంలో సముద్రం కూడా ఉంది. అలాగే కరవు పీడిత ప్రాంతాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి మనం చూడాల్సిన అంశం మరొకటి ఉంది. విశాఖపట్నం అనేది రాష్ట్రంలో నంబర్‌ ఒన్‌ సిటీ. దేశవ్యాప్తంగా టైర్‌ –2 సిటీల్లో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పుడు మనముందున్న లక్ష్యం దీన్ని టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం. దేవుడు మనకు ఈస్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే అదికూడా తప్పే అవుతుంది. దానికి ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.మనం విశాఖపట్నం వెళ్లకూడదు, ఇక్కడా అభివృద్ధికాదు. దీనివల్ల నష్టం మన పిల్లలకే. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్డీఏను ఏఎంఆర్‌డీఏగా మార్పుడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టం.ఇక్కడ వారికీ న్యాయం చేస్తున్నాం, దీంతోపాటు మిగిలిన ప్రాంతాలకూ న్యాయం చేస్తున్నామని, అందరికీ మంచి చేస్తున్నామని చెప్పడానికే బిల్లులు పెట్టాం. ఒక్క ఏఎంఆర్‌డీఏ చట్టంకోసమే బిల్లు పెడితే ప్రస్తతు రాజధాని ప్రాంతం వారికి తప్పుడు సంకేతం పోతుందని చెప్పాం. ఈ బిల్లులను ఎవ్వరూ ఆపలేరు. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవ్వరూ అడ్డుకోలేరు. స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టే బిల్లునుకూడా ఇలాగే మండలిలో అడ్డుకున్నారు. ఆగిపోయిందా? అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు బిల్లును కూడా అడ్డుకున్నారు.. ఆగిపోయిందా?, అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కాని, ప్రజలకు మంచిచేసే బిల్లులను ఆమాత్రం ఆలస్యం కూడా ఎందుకు చేయాలి? ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు?ప్రజలకు మంచి చేసే బిల్లులను ఆలస్యం చేయాలన్నదేవారి ఉద్దేశం అయినప్పుడు, నిబంధనలను కూడా ఉల్లంఘించి వాళ్లు బిల్లులను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు మండలి అవసరం ఎందుకు? కేవలం మండలిలో ఒక పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారని రాజకీయపరమైన ఆలోచనలు చేశారు.  అసలు మండలిని అసెంబ్లీ సృష్టిస్తుంది, అసెంబ్లీకి సహాయపడుతుంది. మండలి అనేది అసెంబ్లీకి సలహా ఇచ్చే ఒక సభ. ఈ పనిని విడిచిపెట్టి రాజకీయంగా ఆలోచించి ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహాసం చేస్తామంటే.. ఎలా? ఒక్క మండలి నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఏడాదిపోతే..., శాసనమండలిలో మాక్కూడా మెజార్టీ వస్తుంది. కాని, ఈ ఏడాది సమయాన్నికూడా ఎందుకు వదులుకోవాలి? ప్రజలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల వచ్చే మంచిచేరాలి. ఇంగ్లిషు మీడియం బిల్లును ఆమోదిస్తే ఎవరికి లాభం?ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉంటే ఎవ్వరికి లాభం? రాజధానికార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఎవ్వరికి లాభం? విశాఖను అభివృద్ధి చేస్తే ఎవ్వరికి లాభం? ఇవన్నీ కూడా మన పిల్లలకి లాభం కదా? మన ప్రజలకు లాభం కాదా? అన్నది ఆలోచించాలి. అమరావతి రైతుల నుద్దేశించి ప్రశ్నలపై మాట్లాడుతూ, అమరావతి రైతులకు ఏం చేయదలుచుకున్నామో అసెంబ్లీలోనే చెప్పాం. ఎవ్వరికీ అన్యాయం చేయం. రైతులికిచ్చే యాన్యునిటీని పదేళ్ల నుంచి పదిహేనేళ్లకు పెంచాం. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే జీవనభృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచాం. అసైన్డ్‌దారులకు పట్టాదారులతో సమానంగా ప్లాట్ల కేటాయింపులు చేస్తాం. మేం గత ప్రభుత్వం మాదిరిగా బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌ చూపించడంలేదు.  వాస్తవాలను ముందు పెడుతున్నాం. అమరావతి లెజిస్లేచర్‌ కేపిటల్‌గా కొనసాగుతుందని చెప్పామన్నారు ముఖ్యమంత్ర బీజేపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ, 2019లో బీజేపీ మేనిఫెస్టో ఏంచెప్పిందో ఒక్కసారి చూడండి.రాజధాని భూముల్లో అవినీతి జరిగింది... వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. కాని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. అదే పార్టీకి చెందిన జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెప్తున్నారన్నారు సి.ఎం. ప్రత్యేక హాదా గురించి మాట్లాడిన సి.ఎం., ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదన్నారు.  ముగిసిపోయిన అధ్యాయం అనే పదం వాడ్డం సరికాదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. ప్రతిసారి మేం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మా అవసరం వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం.  కేంద్రానికి అవసరమైన రోజున మన ఎంపీల పాత్ర కీలకం అవుతుంది. ఆ సమయంలో మనకున్న డిమాండ్‌ ప్రత్యేక హోదా మాత్రమే. కియా.. వ్యవహారంపై మాట్లాడుతూ, కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చారు. అనైతికమైన రిపోర్టింగ్‌ చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తా కథనం ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కథనం ఇది. తాము ఎక్కడికీ వెళ్లడంలేదంటూ కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా... వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాలకోసం వ్యవస్థలను మేనేజ్‌చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. నామీద బురదజల్లడం, నిందలు వేయడం ఇప్పడు మొదలుపెట్టింది కాదు. ఇవన్నీ నాకు అలవాటే. నిజాలతో పనిలేకుండా ఒక మనిషికి చెడ్డపేరును ఆపాదించాలని ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కచ్చితంగా మాకు తోడుగా ఉంటాడు.  గతంలో మా పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను  కొనుగోలుచేశారు. ఎన్నికల తర్వాత వారికి వచ్చిన సీట్లు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే. దేవుడు రాసిన గొప్ప స్క్రిప్టు ఇది. వాళ్లు చేసే కొద్దీ దేవుడు అయ్యో పాపం అంటూ.. మన పక్కనే ఉంటాడు. 2014 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించలేదు.  ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్‌ వెళ్లాడు, మార్కెటింగ్‌కోసం కోట్లు ఖర్చుచేశాడు. రాష్ట్రంలో నడుస్తున్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా మనం అదిచేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటనలు చేసీ ఏం లాభం. మా  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సింది ప్రధానంగా సరసమైన ధరలకు భూములు, నీళ్లు, కరెంటు. అవినీతిలేని పాలన, సానుకూల దృక్పథం ఉన్న ప్రభుత్వం, విధానాల్లో పారదర్శకత. ఇవన్నీ ఉన్న ప్రభుత్వం మాది. పైగా అబద్ధాలు చెప్పే అలవాటు మా ప్రభుత్వానికి లేదు. పరిశ్రమలకు ఇవన్నీ సానుకూల అంశాలు. మిగిలినవన్నీ సహజంగానే వస్తాయి.  విషయాలన్నింటికీ ఎప్పటికప్పుడు మేం చెప్తూనే ఉన్నాం. కాకపోతే మాకు మీడియా బలం తక్కువన్నారు సి.ఎం. . సీఎంగా అతి పెద్ద సవాల్‌ ఏమి ఉంటుందన్న ప్రశ్నకు,ప్రతిరోజూ సవాలే. మంచి సమర్థతతో ఆ సవాలను అధిగమించాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, హౌసింగ్‌... వీటిని ప్రాధాన్యతలుగా పెట్టుకున్నాం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను బాగా అభివృద్దిచేస్తున్నాం? ఇది అభివృద్దికాదా? ఇంగ్లిషు ల్యాబ్‌ సహా 9 రకాల సదుపాయాలను ప్రతిస్కూళ్లలో కల్పిస్తున్నాం. ప్రతి స్కూళ్లో ఇంగ్లిషు మీడియం పెడుతున్నాం.మధ్యాహ్న భోజనంలో నాణ్యత బాగా పెంచాం.  గ్రీన్‌ఛానళ్లో పెట్టి బిల్లులు పెండింగులో లేకుండా చూస్తున్నాం.ఆయాల జీతాలు రూ.వేయి నుంచి రూ.3వేలకు పెంచాం. అమ్మ ఒడి అమలు చేశాం.ఫీజు రియంబర్స్‌మంట్‌ పూర్తిగా ఇస్తున్నాం. పాఠ్యప్రణాళికలో పూర్తిగా మార్పులు తీసుకు వస్తున్నాం. డిగ్రీ విద్యార్థులకు ఏడాదిపాటు అదనంగా అప్రెంటిస్‌ ఇప్పిస్తున్నాం.ఇది అభివృద్ది కాదా, అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ పోలవరం మీద ఎంతో «ధ్యాసపెడుతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం ప్రాజెక్టును మిస్‌ హ్యాండిల్‌ చేసిందని, త ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణలో విజన్‌ లోపించిందని చెప్పారు. "స్పిల్‌వే పూర్తికాకుండానే కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టింది. దీనివల్ల వరదనీరు అటు స్పిల్‌వేగుండా పోవడంవల్ల పనులు చేయలేని పరిస్థితి. నవంబర్‌ వరకూ పనులు నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2021 జూన్‌ నాటికి పనులు పూర్తవుతాయి," అని వివరించారు.  
కొత్త ఉద్యోగాలేమో గానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబీకే విధంగా జగన్ ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే... ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలూ వెళ్లేపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా... ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం... సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసుకుంది. దాంతో, మిలీనియం టవర్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మార్చి 30లోపు మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, 5వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం 300 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కాండ్యుయేట్ కంపెనీ.... ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం ఆపరేషన్సే షట్ డౌన్ చేయాలని కాండ్యుయేట్ కంపెనీ బోర్డు డెసిషన్ తీసుకుందని అంటున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న కాండ్యుయేట్ కంపెనీ.... హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లో పనిచేస్తున్న 2400మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  ఇక, మిలీనియం టవర్స్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ కూడా మార్చి 30 తర్వాత ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయనున్నాయి. దాంతో, మిలీనియం టవర్స్ నుంచి దాదాపు 18వేల మంది ఉద్యోగులు తరలిపోనున్నారని చెబుతున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన కాండ్యుయెంట్‌ సంస్థను విశాఖ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది. కానీ, ఇఫ్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో.... మొత్తం ఏపీనే వదిలివెళ్లిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎంతోకష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.  
సమ్మక్క సారాలమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివాసీలకు కాకతీయ రాజులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలోనే ఈ గాథలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొన్ని కథల్లో సమ్మక్క మరణించినట్లు ఉంటే... మరికొన్ని కథల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని చెబుతున్నాయి. ఇంకొన్ని గాథల్లో సమ్మక్క సహగమనం చేసినట్లు ఉంటుంది. కొన్ని కథల్లో ఆదివాసీలకు... కాకతీయ ప్రభువులకు మధ్య ఘర్షణ జరిగి... కప్పం కట్టకపోవడం కారణంగా చెప్పగా... మరికొన్ని కథల్లో సహజ వనరుల పంపకాల్లో వివాదం వచ్చినట్లు ఉంది. అయితే, ఆదివాసీల నుంచి కాకతీయ రాజులు కప్పం వసూలు చేసిన దాఖలాల్లేవని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ... ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న కథలు మాత్రం కప్పమే యుద్ధానికి కారణమని చెబుతున్నాయి. అయితే, అందరి నోళ్లలో ప్రసిద్ధి చెందిన కథ ఇలా ఉంది. ఏడో శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయ దొరలు వేట కోసం అడవికి వెళ్లగా, ఓ చోట పెద్ద పులులు కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ పసిపాప కనిపించిందని, ఆ పాపను కోయదొరలు తమ గూడేనికి తీసుకెళ్లి పెంచి పెద్దచేశారని, అయితే... ఆ పసిపాప వచ్చినప్పట్నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే తమకు పాప రూపంలో సాక్షాత్కరించిందని నమ్మి ఆ చిన్నారికి సమ్మక్కగా పేరు పెట్టారని చెబుతారు. అలా, పెరిగి పెద్దయిన సమ్మక్కను కోయ చక్రవర్తి అయిన మేడరాజు... కరీంనగర్ ప్రాంతాన్ని ఏలుతున్న తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి జరిపించాడని చెబుతారు. పగిడిద్ద రాజు, సమ్మక్కకు సారాలమ్మ, నాగులమ్మతోపాటు జంపన్న జన్మించారు. అయితే, మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరోజులు... ఓరుగల్లు రాజులకు సామంతులుగా ఉండేవారు. కరువు కాటకాలతో ఒక సంవత్సరం కోయరాజుల... కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయారు. దాంతో, కాకరాజు రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపాడు. అయితే, కాకతీయ సేనల ముందు గిరిజనులు నిలువలేకపోయారు. ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోపాటు వారి కుమార్తెలు సారాలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరణమరణం పొందుతారు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న... మేడారం సమీపంలోని వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. అయితే, సంపెంగ వాగు సమీపంలో జంపన్నను కాకతీయ సేనలు హతమార్చాయని మరో కథ ప్రచారంలో ఉంది. జంపన్న వీరమరణం పొందిన వాగు కావడంతో దాన్ని అప్పట్నుంచీ జంపన్న వాగుగా పిలుస్తారు. అయితే, భర్త పిల్లల మరణవార్త తెలుసుకున్న సమ్మక్క మహోద్రురాలిగా మారి కాకతీయ సేనలపై విరుచుకుపడిందని, కానీ... ఓ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క నెత్తురోడుతూనే ఈశాన్య వైపునున్న చిలుకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమైందని చెబుతారు. సమ్మక్కను కొందరు కోయలు అనుసరించినప్పటికీ జాడ తెలియలేదని, అయితే చిలుకలగుట్టపైనున్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించడంతో, సమ్మక్కే అలా మారిందనే నమ్మకంతో అప్పట్నుంచి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ముత్తయిదువల పండగ జరుపుకోవడం మొదలుపెట్టారని, ఇదే కాలక్రమేణా జాతరగా రూపొంతరం చెంది, సమ్మక్క సారాలమ్మ మేడారం మహా జాతరగా మారింది. అయితే, కోయవీరులు మరణించారంటే ఆదివాసీలు అంగీకరించరు. వాళ్లింకా బతికే ఉన్నారని... సమ్మక్క భరిణె రూపంలో రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందనేది వాళ్ల విశ్వాసం. అందుకే, ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ మేడారం నిర్వహిస్తున్నామని చెబుతారు. అలా, ఆదివాసీల్లో వీరవనితగా పేరుగాంచిన సమ్మక్క... కుంకుమభరిణె రూపంలో వెలిసి... భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోందని పురాణగాథలు చెబుతున్నాయి.
2020-21 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముడుతున్న వేళ దేశం పై ఆర్థిక మందగమన ప్రభావం పడకుండా ఆర్థిక మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సామన్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుతున్న పొదుపుతో దిగాలుగా ఉన్న సగటు వేతన జీవి ఈసారైన ఆదాయపు పన్ను పై ఆర్థిక మంత్రి తీపికబురు అందిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న చర్యలు ఈ సారి ఎలాంటి మార్పులు చేసే అవకాశాలున్నాయో చూడాలి.  2014 బడ్జెట్ లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ లకు మినహాయింపు 2.5 లక్షల నుంచి మూడు లక్షలకు మార్చారు. 2015 బడ్జెట్ లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లకుండా ఆరోగ్య భీమపై డిటెక్షన్ ను రూ.15,000 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20,000 నుంచి రూ.30,000 లుగా మార్చారు. సంపద పన్ను తొలగించి సంపన్నుల పన్ను ఆదాయం కోటి దాటితే రెండు శాతం సర్ చార్జ్ విధించేలా నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్ లో సెక్షన్ 87 కింద ఐదు లక్షల ఆదాయం మించని వారికి పన్ను రిబేట్ ను రూ.2000 నుంచి రూ.5000 లకు పెంచారు. సెక్షన్ 80 జీజీ కింద అద్దెకు సంబంధించిన డిడక్షన్ ను రూ.24,000 నుంచి రూ.60,000 లకు పెంచారు. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. 2017 బడ్జెట్ లో 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి పన్నును ఐదు శాతం చేశారు. వార్షికాదాయం 3.5 లక్షలు ఉన్న వారికి పన్ను రిబేట్ ను రూ.5000 నుంచి రూ.2,500 చేశారు. 50 లక్షల నుంచి కోటి ఆదాయం పై 10 శాతం సర్ చార్జిని వేధించడం మొదలు పెట్టారు. 2018 లో మెడికల్ రీయంబర్స్ మెంట్ ట్రాన్స్ పోర్టు అలవెన్సుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40,000 పెంచారు. ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను పై ఉన్న మూడు శాతం విద్యాసెస్సు స్థానంలో 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. 2019 లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినా తాత్కాలిక బడ్జెట్ లో ఐదు లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 నుంచి రూ.50,000 లకు పెంచారు. మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చి అంచనాలున్నాయి. చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబులలో సవరణలు పరిమితుల పెంపు లేదు. రిబేట్ల లాంటి ప్రత్యామ్నాయాలు కాకుండా 5,10,20,30,35 శాతం శ్లాబులు తేవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని అయిదు శ్లాబులుగా విభజిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ.2,50,000 ఉన్న ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది
మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి కమిటీలు , నివేదికలతోనే కాలం గడిచిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండటం మంచిదని జగన్ చెప్పిన విధంగానే నివేదిక కూడా వెల్లడించింది. అలా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు రూ.5 కోట్ల 95 లక్షల ఫీజు చెల్లించింది ప్రభుత్వం. ఎటువంటి జీవో లేకుండా బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన కంపెనీతో రహస్య లావాదేవీలు జరిపింది వైసీపీ ప్రభుత్వం. మొత్తం వ్యవహారాలు ఈమెయిల్స్ ద్వారానే నడిపింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రణాకా విభాగం ద్వారా చేసింది. రాజధాని కేసులపై వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గీకి కూడా ప్రణాళికా విభాగం ద్వారానే రూ. 5 కోట్లు మంజూరు చేశారు. అది కాకుండా బోస్టన్ గ్రూప్‌కి కూడా దాదాపుగా రూ.6 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని కూడా ఈ ప్రణాళికా విభాగం ద్వారానే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన లేఖల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కంపెనీని సంప్రదించింది. మూడు రాజధానులపై అధ్యయనం చేసేందుకు 2019 , నవంబర్‌ 27వ తేదీన బోస్టన్ కమిటీని ఎంపిక చేసినట్లుగా అధికారులు ఈమెయిల్ పంపారు. ఆ తర్వాత జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా నెల రోజుల్లోనే బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. అసలు ఆ కమిటీ ఏపీలో ఉండే ఎటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక వెల్లడించిందో తెలియయటం లేదు. బోస్టన్ నివేదికలో కూడా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన బ్లూప్రింట్‌లోని అంశాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మూడు రాజధానుల అంశం కూడా ఉంది. అంటే ముందస్తుగా ఒక రిపోర్టును ప్రభుత్వమే సిద్ధం చేసి.. దానికి బోస్టన్ గ్రూప్ అనే ట్యాగ్ వేసి ఇచ్చేందుకు రూ. 6 కోట్లను సమర్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా బోస్టన్ నివేదిక గురుంచి గూగుల్ లో చాలా మంది వెతికినా దొరకలేదు.. అలానే ప్రభుత్వం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో ప్రభుత్వం నేరుగా జీవో ద్వారా కాకుండా.. మరో విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ చీకటి వ్యవహారాలు అంచనా వేయలేని విధంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి.
తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు.  ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత. ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.
శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా... శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చించి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉన్నాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే... ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసిన నేపథ్యంలో...  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.
      Papaya is a deliciously sweet fruit which has numerous nutritional benefits. It is very low in calories and also contains no cholesterol. Excellent for those who want to lose weight, consider eating papaya every day to maximize its health benefits.   Also a beauty food, papaya is low in fructose and is excellent for digestion! The antioxidant nutrients found in it, including Vitamins C and E and beta-carotene, are great at reducing inflammation and acne. Moreover, Vitamin C may also protect your skin against sun damage. Once considered quite exotic, they can now be found in markets throughout the year and if you have tree at home you can enjoy its benefits year long. The fruit, as well as the other parts of the papaya tree, contain papain, an enzyme that helps digest proteins. This enzyme is especially concentrated in the fruit when it is unripe. Health Benefits Papayas are a rich source of nutrients like carotenes, vitamin C and flavonoids; e B vitamin, folate and pantothenic acid; and rich in minerals like potassium, copper, and magnesium; and fiber. To categorize the health benefits without going into depth, the health benefits of papaya include: ·        It’s an antioxidant ·        Protection against Heart Disease ·        Promotes digestive health ·        Anti-Inflammatory ·        Supports the Immune system ·        Protection against Macular degeneration ·        Protects  against Rheumatoid arthritis ·        Protects against colon cancer   276.00 grams of Papaya contains 119 Calories Nutrient Values Vitamin C 224.1% Folate        25.5% Fiber         18.7% Vitamin A 14.5% Magnesium 14.4% Potassium    14.3% Copper        13.3% Pantothenic Acid  10.6%
India has emerged as the world's largest consumer of antibiotics, followed by China and the US, according to a new study on the growing alarm surrounding antibiotic-resistance. The study, Global Trends in Antibiotic Consumption 2000- 2010, according to Princeton University researchers found that worldwide antibiotic use has risen a staggering 36 per cent over the studied 10-year period. Among the 16 groups of antibiotics studied, cephalosporins, broad-spectrum penicillins and fluoroquinolones accounted for more than half of that increase, with consumption rising 55 per cent from 2000 to 2010. The study quantifies the growing alarm surrounding antibiotic-resistant pathogens and a loss of efficacy among antibiotics used to combat the most common illnesses. The report also highlights an increasing resistance to carbapenems and polymixins, two classes of drugs that have long been considered last-resort antibiotics for illnesses without any other known treatment. Overall, the study reviewed patterns, seasonality and frequency of use of antibiotics in 71 countries. "The data underscore the welcome evidence that more global citizens are able to access and purchase antibiotics. But that use is not being effectively monitored by health officials, from doctors to hospital workers to clinicians," the researchers noted. "Consequently, antibiotic use is both rampant and less targeted. That reality is driving antibiotic resistance at an unprecedented rate," researchers said. The five BRICS nations - Brazil, Russia, India, China and South Africa - have been held responsible for more than three-quarters of that surge. While India is the largest consumer of antibiotics, US accounts for the highest per capita consumption, with a rate of more than twice that of India. Source: PTI  
    Alternate healing methods for chronic pains and diseases are often considered as they provide treatment for various health issues. One such chronic problem which both men and women face are Varicose veins .This a condition where a person has dilated, tortuous and elongated veins, especially on the legs. The causes of varicose veins are mainly due to standing for long hours at work, genetic tendency, during pregnancy and due to obesity. Now there are various treatments for varicose veins. Through non-medical treatment where postural corrections and lifestyle changes are recommended, wearing suitable stockings to hold the legs and if the problem is too severe surgical treatment is also prescribed but in rare cases. Since the pain is persistent and takes time to cure, one could try Homeopathic treatment. This works very well for those who have mild to moderate cases of varicose veins.  It significantly helps to reduce pain and controls more varicosity and reduces swelling in the legs. Homeopathy is known to also help significantly in the cases where varicose leads to varicose ulcers. It is strongly recommended for all cases of varicose veins and though the dosage prescribed may be for two or three months they work well and show good results.