LATEST NEWS
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. రాజకీయాలలో మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలవ లేకపోయినా ఆయన సభలకు వేలాదిమందిగా జనం వస్తుంటారు. ఈ ఫాలోయింగ్ వాడుకోవాలని.. దాంతో బిజెపి విధానాలనూ జనంలోకి బలంగా తీసుకెళ్లాలనేది బీజేపీ జాతీయ నాయకత్వం ప్లాన్. ఇదే విషయం ఇరు తెలుగు రాష్ట్రాల బీజేపీ శ్రేణులకు సూచించారట బీజేపీ జాతీయ నేతలు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రాజధాని అంశంపై జనసేనతో కలిసి పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది బిజెపి. తెలంగాణలో కూడా  పవన్ తో కలిసి పని చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. దీంతో జనసేనాని సేవలను వినియోగించుకోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పవన్ తో కలిసి పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ బీజేపీకి దీర్ఘకాలంలో నష్టం ఉంటుందంటున్నారు కొంత మంది నేతలు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సెంటిమెంట్ ఇంకా జనంలో ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర లీడర్ వచ్చి టిఆర్ఎస్ ను గానీ.. కేసీఆర్ నుగానీ విమర్శిస్తే మొదటికే మోసం వస్తుంది అనేది కొంత మంది నేతల వాదన. ప్రస్తుతం బిజెపి రెండు కార్యక్రమాల్ని చేపట్టింది. సీఏఏను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం తెలంగాణ ప్రభుత్వ పని తీరు, పథకాలను నిశితంగా పరిశీలిస్తూ లోపాలను ఎండగట్టడం ఈ రెండు కార్యక్రమాల్లో పవన్ ను పాల్గొనేలా చేస్తే కొత్త ఇబ్బందులు తప్పవని బీజేపీలో కొందరు చెప్తున్నారు. అంతేకాకుండా పవన్ ను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావటం వల్ల జాతీయస్థాయి నేతలైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్య దర్శి మురళీధర్ రావుల ప్రభావాన్ని తగ్గించిన వారౌతామని కూడా అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను దూరంగా ఉంచితేనే మంచిదని సలహాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ కారణాలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపితో పొత్తు వల్లనే కాంగ్రెస్ నష్ట పోయిందని ఇప్పుడు పవన్ తో కలిసి వెళ్తే.. అదే పరిస్థితి బిజెపికి ఎదురౌతోందని గుర్తు చేస్తున్నారు. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ సేవలను తెలంగాణ బీజేపీ వినియోగించుకుంటుందా? లేకా కొత్త తలనొప్పులు తెచ్చుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కరోజు గ్యాప్‌లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లిన జగన్.... ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంపై పెద్దఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైసీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో చేరబోందన్న ప్రచారంతో... అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అదే సమయంలో, ఢిల్లీ పరిణామాలపై ఏపీ బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ...నిజంగా ఎన్డీఏలో చేరుతుందో లేదో తెలియదు గానీ, వార్తలు మాత్రం రాజకీయంగా మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. వైసీపీ... ఎన్డీఏ అండ్ కేంద్ర కేబినెట్‌లో చేరుతుందంటూ విస్తృత ప్రచారం జరుగుతుండటంతో తెలుగుదేశం తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. సీబీఐ అండ్ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఎన్డీఏలో చేరుతున్నారంటూ ఆరోపిస్తోంది. ఇక, సెక్యులరిజం పేరుతో ముస్లిం మైనారిటీ దళితుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి.... ఇకనైనా ముసుగు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం విమర్శలతో డిఫెన్స్‌లో పడిన వైసీపీ.... ఎన్డీఏలో చేరతామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. మొదట్నుంచీ జగన్‌కు బీజేపీ రంగు పులిమి, ముస్లిం మైనార్టీ దళితులను వైసీపీకి దూరంగా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడుతున్నారు. బీజేపీతో వైసీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ జగకట్టబోదని డిప్యూటీ సీఎం అంజద్ బాషా చెప్పుకొచ్చారు. అయితే, తమకున్న సమాచారం ప్రకారం వైసీపీతో ఎలాంటి మైత్రి ఉండబోదని ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ సునీల్ దేవదర్... అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఏపీ బీజేపీ సారధుల మాట ఇలాగుంటే, ఆ పార్టీ టీజీ వెంకటే‌శ్ మాత్రం... ఏమో ఏమైనా సాధ్యమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇదిలా ఉంటే, వైసీపీ.... ఎన్డీఏలో చేరొచ్చంటూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, టీడీపీ అనుకూల మీడియా కావాలనే తన మాటలను వక్రీకరించిందని మంత్రి బొత్స మండిపడుతున్నారు. అయితే, బొత్స మాట మార్చారని, డ్యామేజ్ జరగడంతోనే ఇప్పుడు వైసీపీ నేతలంతా ఖండిస్తున్నారని సీపీఐ రామకృష్ణ మండిపడుతున్నారు. మొత్తానికి, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్‌ అనేక ఊహాగానాలకు తావిచ్చింది. ఒక్కరోజు గ్యాప్‌లో రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి... ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంతో ఆంధ్రా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
హైదరాబాద్‌ మెట్రో రైల్‌తో ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట పొందుతున్న నగర వాసులకు చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. రోజుకి నాలుగు లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్న మెట్రోలో ప్రయాణికులను ఇబ్బందులు వెంటాడుతున్నాయి. చిన్నచిన్న అవాంతరాలతో వేగంగా గమ్యాన్ని చేరుకోవాలన్న ప్రయాణికుల ఆశ నీరుగారిపోతోంది. ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి హైదరాబాద్ వాసులకు ఊరట కలిగిస్తూ రెండేళ్ల క్రితం అందుబాటులో వచ్చిన మెట్రో రైల్‌ మంచి సత్ఫలితాలను ఇస్తోంది. అయితే, కొత్తగా ప్రారంభించిన జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ రూట్లో మాత్రం మెట్రో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలా రైళ్లలో డిస్‌ప్లే బోర్డులు లేకపోవడంతో తమ గమ్యాన్ని తెలుసుకోలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు, టికెట్ల కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు క్యూఆర్‌కోడ్ అమల్లోకి తెచ్చినా, చాలా మెట్రో స్టేషన్లలో స్కానర్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండుమూడుసార్లకు పైగా స్కాన్ చేసిన తర్వాతే గేట్లు ఓపెన్ అవుతుండటంతో క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న సమస్యలతో మెట్రో జర్నీ ఆలస్యమవుతోందని, వాటిని పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
  "డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది. వెరీ క్యూట్ ఫిల్మ్ అనిపించింది. ప్రేక్షకులు కూడా కచ్చితంగా అదే ఫీలవుతారు. సాంగ్స్ కూడా బాగా నచ్చాయ్. సినిమా మొత్తం ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది" అన్నారు రష్మికా మందన్న. నితిన్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్శ్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా 'భీష్మ'లో ఆమె నాయికగా నటించారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రష్మికతో మీడియా ప్రతినిధుల మాటామంతీ... 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ మీకు యాప్ట్ ఏమో ఇప్పుడు? అవును కదూ.. నితిన్ ఎంగేజ్ అయిపోయారు.. డైరెక్టర్ వెంకీ, నేను కూర్చొని ఈ సినిమాని మన కోసం చేసుకున్నాం అని సరదాగా అనుకున్నాం. సినిమా చూశారా? లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నా పోర్షన్ మాత్రం చూశాను. సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా. 'భీష్మ'లో ఎలాంటి రష్మికను ఆశించవచ్చు? మంచి వినోదాన్ని మీరు ఆశించవచ్చు. అయితే నా సినిమాని నేను జడ్జ్ చెయ్యలేను. ఇందులో నేను చైత్ర అనే క్యారెక్టర్ చేశాను. నైస్ క్యారెక్టర్. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. నా పాత్ర నుంచి మీకు అది లభిస్తుంది, ఇది లభిస్తుంది.. అని చెప్పలేను. జనరల్ గా చెప్పాలంటే సినిమా మాత్రం సూపర్ గా నవ్విస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ అనుకుంటారు.  అనంత్ నాగ్ గారితో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది? ఆయన ఫాదర్ ఫిగర్ లాంటివారు. ఆయన కాంబినేషన్ లో నాలుగైదు రోజులు పనిచేశాను. ఆయన కూడా కర్ణాటక నుంచి వచ్చినవాళ్లు కాబట్టి ఇద్దరం ఎప్పుడూ కన్నడలో మాట్లాడుకొనేవాళ్లం. నా సినిమాల గురించి అడిగేవారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని బాగా ఆస్వాదించాను. 'భీష్మ' అంటే ఎవరు? అనంత్ నాగ్ గారా? నితినా? అనంత్ నాగ్ గారే. క్యారెక్టర్ పరంగా నితిన్ గారు కూడా. అదెలా జరుగుతుందనేది నాకు తెలీదు. ఈ సినిమాలో ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పడం ఎలా అనిపించింది? మా ఫ్రెండ్స్ తో ఈ కథ చెప్పినప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారే?.. అని అన్నారు. కానీ 'భీష్మ'లో తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి వెంకీ చాలా బాగా చెప్పాడు. ఇందులో ఎక్కడా దాని గురించి లెక్చర్స్ ఉండవు. 'భీష్మ' అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం. ఆర్గానిక్ వయసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే 'భీష్మ' చాలా మంచి ఫిల్మ్.  వ్యవసాయం గురించిన యథార్థ ఘటనలను కూడా ఈ సబ్జెక్టులో జోడించారా? రైతులు ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్లనూ, పిల్లల స్కూళ్లు ఫీజు చెల్లించడానికి కూడా నానా కష్టాలు పడుతున్నవాళ్లనూ మనం చూస్తున్నాం. వాటిని సూచనప్రాయంగా ఈ కథలో డైరెక్టర్ చెప్పాడు. నాకు కథ చెప్పినప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఒక అంతర్లీన సందేశంగానే ఉంటుందనీ, ప్రధానంగా ఇది ఫన్ ఫిల్మ్ అనీ చెప్పాడు. నేను డబ్బింగ్ చెప్పేప్పుడు అదే ఫీలయ్యాను. వ్యవసాయం అనేది చాలా సున్నిత అంశం. దాన్ని ప్రేక్షకులు ఆమోదించేలాగా వెంకీ తీశాడు.  నితిన్.. పవన్ కల్యాణ్ అభిమాని అని మీకు తెలుసా? మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కల్యాణ్ గారికి వీరాభిమానినని నితిన్ చెప్పారు. చిన్నప్పట్నుంచీ ఆయన పవన్ కల్యాణ్ గారికి ఫ్యాన్. ఇప్పుడు తను యాక్టర్ అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్ గానే ఉండటం ముచ్చటగా అనిపించింది. 'పవన్ గారిని ఎప్పుడైనా కలిశారా?' అనడిగాను. రెండు మూడుసార్లు పవన్ కల్యాణ్ గారిని కలిశానని చెప్పారు. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బాయ్.  నితిన్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది? నేను సరదాగా చెప్పడం లేదు. 'అ ఆ'లో నితిన్, సమంతను చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే, ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకొన్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా అనిపించారు ఆ సినిమాలో. హఠాత్తుగా ఇప్పుడు నితిన్ తోటే ఈ సినిమా చేశా. మొదటిరోజు సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా, లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం. మీకు నితిన్ లవ్ స్టోరీ గురించి ఎప్పుడు తెలిసింది? నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే తెలిసింది. అప్పటిదాకా తను నాకూ ఈ విషయం చెప్పలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ఏం చెబుతారు? ఈ సినిమా చేసేటప్పుడు నాలుగైదు సార్లు నిర్మాత నాగవంశీ గారిని కలిశాను. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ సినిమా చూసినవాళ్లు ప్రొడక్షన్ విలువల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంత క్వాలిటీతో నాగవంశీ గారు 'భీష్మ'ను నిర్మించారు. 'ఛలో' నుంచి చూసుకుంటే మూడేళ్లలోనే మీకు స్టార్ డం రావడాన్ని ఎలా ఫీలవుతున్నారు? నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నాకు నచ్చినవి చేసుకుంటూ పోతున్నానంతే. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో నాకు తెలీదు. వేలంటైన్స్ డేని ఎలా గడిపారు? వేలంటైన్స్ డేకి ఫుల్ వర్క్ ఉంటుందని మార్నింగ్ జిమ్ కు వెళ్లొచ్చా. కానీ అన్ని వర్క్స్ కేన్సిల్ అయ్యాయి. అప్పుడే ఏం చేశానో తెలుసా? ఇంటికెళ్లి ఒక రొమాంటికి ఫిల్మ్ చూసి, ఆ ఫీల్ లో ఉందామనుకున్నా. ఒక ఇంగ్లీష్ సినిమాని 20 నిమిషాలు చూసేసరికి విసుగొచ్చేసింది. ఎవరో నాకు కథను వినిపించడానికి వచ్చారు. పది నిమిషాలు టైమిస్తే ముఖం కడుక్కొని వస్తానని లేచాను. అలా నా వేలంటైన్స్ డే ఎప్పుడూ లేనంత బోరింగ్‌గా గడిచింది. ఎవరూ ఎప్పుడూ అలాంటి బోరింగ్ వేలంటైన్స్ డేని గడిపి ఉండరు. పాత్రల ఎంపికలో ఇప్పుడు వేటికి ప్రాధాన్యమిస్తున్నారు? కథకు ప్రాధాన్యమున్న పాత్రల్ని, మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటున్నా. ఇది చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించినా చేస్తున్నా. ఇప్పుడు పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. ఇది ప్రయోగాలు చెయ్యడమే. తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా. రెండు విషయాలు నేను నమ్ముతాను. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేటట్లయినా ఉండాలి.  కడుపు నొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి. 'భీష్మ' ఈ రెండో రకానికి చెందిన సినిమా. డబ్బింగ్ చెప్పేప్పుడు నేనే నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నా. బసవతారకం హాస్పిటల్లో బాలకృష్ణ గారిని కలిశారు కదా? ఆయన మీతో ఏం మాట్లాడారు? ఆయన 'గీత గోవిందం' చూశారంట. అది బాగా నచ్చిందని చెప్పారు. నా సినిమాలు చూశానని చెప్పారు. 'భీష్మ' గురించి అడిగారు. ఆయనను ఒక మంచి సందర్భంలో కలవడం, మాట్లాడటం హ్యాపీగా అనిపించింది. నాకు సలహాల్లాంటివేవీ ఆయన ఇవ్వలేదు. అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మార్చి మధ్యలో జాయినవుతాను. అందులో పూర్తిగా మరో రష్మికను మీరు చూస్తారు.
  విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేసిన 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైంది. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నలుగురు హీరోయిన్లు - రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీటే నటించారు. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు ప్రెజెంట్ చేసిన ఈ మూవీ ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేయడంలో విఫలమైందని రిపోర్ట్స్ వస్తున్నాయి. యూఎస్‌లో ప్రీమియర్ షోస్ పడగానే, అక్కడ్నుంచే నెగటివ్ టాక్ వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో తర్వాత అదే తరహా బ్యాడ్ టాక్ విస్తరించింది. దాంతో తర్వాతి షో నుంచే కలెక్షన్లు డ్రాప్ అవడం ప్రారంభించాయి. శనివారం అనూహ్య స్థాయిలో టికెట్ సేల్స్ పడిపోయాయని విశ్లేషకులు తెలిపారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నప్పటికీ, కథా కథనాలు ప్రేక్షకులకు నచ్చలేదని తెలుస్తోంది. సెన్సిటివ్ డైరెక్టర్ అయిన క్రాంతిమాధవ్ ఈ తరహాలో సన్నివేశాల్ని చూపించడాన్ని ప్రేక్షకులు ఏమాత్రం మెచ్చలేదు. విజయ్, రాశీ ఖన్నా, క్యాథరిన్ పాత్రలేవీ వాళ్లను ఆకట్టుకోవడం లేదు. సువర్ణ క్యారెక్టర్ చేసిన ఐశ్వర్య నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఆమె పాత్రను, ఆ ఎపిసోడ్‌లో విజయ్ చేసిన శీనయ్య పాత్రను డైరెక్టర్ చక్కగా మలచాడు. కాలేజీలో విజయ్, రాశీ మధ్య సన్నివేశాల్ని బాగానే తీసిన దర్శకుడు, వాళ్లిద్దరూ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టాక తీసిన సీన్లు తలనొప్పి కలిగిస్తున్నాయని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. రాశీ ఏడుపు సీన్లు, ఆ సీన్లలో ఆమె చెప్పే డైలాగ్స్ వాళ్లని చికాకు పరుస్తున్నాయి. విజయ్, రాశీ మధ్య ప్రేమకథ 'అర్జున్ రెడ్డి' తరహాలో సాగడం సినిమాకి మరింత నష్టం చేకూర్చింది. తాను సిక్స్ కొట్టాలనే సినిమా చేస్తాననీ, 'వరల్డ్ ఫేమస్ లవర్'ను కూడా అలాగే చేశాననీ, కాకపోతే బాల్ గాల్లో ఉందనీ విడుదలకు ముందు విజయ్ చెప్పిన విషయం గమనార్హం. ఆ బాల్ ఇప్పుడు బౌండరీ దాటకుండా విజయ్ క్యాచ్ అవుట్ అయ్యాడు! సాధారణంగా ఒక సినిమా రిలీజైతే అదే రోజో, ఆ మరుసటి రోజో సక్సెస్ మీట్ నిర్వహించడం మన సినిమావాళ్లకు ఆనవాయితీ. అలాంటిది 'వరల్డ్ ఫేమస్ లవర్' యూనిట్ మొత్తం నిర్మాతలతో సహా మౌనం వహించడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. శుక్రవారం కానీ, శనివారం కానీ ఈ సినిమాకు పనిచేసిన ప్రధాన వ్యక్తులెవరూ ఈ సినిమా గురించి పెదవి విప్పలేదు. విజయ్ సైలెంట్ అయిపోయాడు. నిర్మాతలు సైలెంట్ అయిపోయారు. డైరెక్టర్ ఏం మాట్లాడలేదు. సినిమా విడుదల తర్వాత ప్రమోషన్స్‌ను పూర్తిగా గాలికొదిలేశారు. నెగటివ్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా బాగా పడిపోవడమే దీనికి కారణమని అంటున్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ సినిమా విడుదలయ్యాక ఇంత నిశ్శబ్ద వాతావరణం కనిపించడం ఇదే. దీనిబట్టే 'వరల్డ్ ఫేమస్ లవర్' ఏ రేంజిలో 'ఇన్‌ఫేమస్' అయ్యాడో ఊహించుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
  టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా శేఖర్ కమ్ములకు ఎలాంటి పేరుందో మనకు తెలిసిందే. సున్నిత హృదయుడిగా పేరున్న శేఖర్, దానికి తగ్గట్లే సున్నిత కథాంశాలతో, సున్నిత సన్నివేశాలతో సినిమాలు రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 'ఫిదా' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఆయన ఇప్పుడు 'లవ్ స్టోరి' అనే సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి లవ్ స్టోరీని ఆయన చూపిస్తున్నారు. వేలంటైన్స్ డే సందర్భంగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన 'ఏయ్ పిల్లా పరుగున పోదామా..' అనే సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూకు అమిత ఆదరణ లభించింది. ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ దాటి ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో చైతు, సాయిపల్లవి మధ్య కెమెస్ట్రీ చూడ ముచ్చటగా అనిపిస్తోంది.  'ఫిదా'తో పల్లవిని టాలీవుడ్‌కు పరిచయం చేసిన శేఖర్.. ఇప్పుడు 'లవ్ స్టోరి'లో చైతూకు జోడీగా ఆమెతో మరోసారి మ్యాజిక్ చేయిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోలో మెట్రో ట్రైన్‌లో చైతూను పల్లవి ముద్దాడగా, చైతూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పవన్ సిహెచ్. స్వరాలు కూర్చిన ఈ పాటను చైతన్య పింగళి రాయగా, హరిచరణ్ అద్భుతంగా ఆలపించాడు. ఈ మ్యూజికల్ ప్రివ్యూ చూస్తుంటేనే.. ఈ సినిమాలో సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది. కాగా ఇది బంపర్ హిట్ కావడంతో చైతూ కూడా ఖుషీ అయిపోయాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్‌కు సినిమా సెట్స్ మీదే ఒక చిన్న కానుక ఇచ్చాడు. అది విలువైన నల్ల కళ్లద్దాలు! చైతూ తనకు ఆ స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్న ఫొటోతో పాటు, ఆ కళ్లద్దాలను ధరించిన తన ఫొటోను కూడా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు శేఖర్. "నువ్వు చూపించిన ఈ ప్రేమకు థాంక్యూ చై. నన్ను టచ్ చేశావ్. తర్వాతి టీజర్‌కి ఇంకో గిఫ్ట్ రెడీ చేస్కో" అని ట్వీట్ చేశాడు. ఏప్రిల్ 2న 'లవ్ స్టోరి' మన ముందుకు వస్తోంది.
  నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తనపై మీడియా సృష్టిస్తున్న ప్రచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలతో తన ఆత్మ గౌరవాన్ని, తన నిజాయితీని దెబ్బతీస్తున్నారని బాధపడ్డారు. పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత తన నివాసాన్ని స్వస్థలం పూణేకు మార్చిన ఆమె, ఇటీవలే హైదరాబాద్‌లో ఒక ఇల్లు కొన్నారు. అయితే రూ. 5 కోట్లు పెట్టి ఆ ఇంటిని ఆమెకు పవన్ కల్యాణ్ కొనిచ్చారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారంలోకి తెచ్చాయి. దీంతో ఈ విషయంపై ఆరా తీయడానికి పలువురు ఆమెకు ఫోన్లు చెయ్యడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ వస్తున్నారు. సహజంగానే ఇది రేణూ దేశాయ్‌కి ఇబ్బందికరంగానే మారింది. తన కష్టార్జితంతో ఇల్లు కొనుక్కుంటే, అది తన మాజీ భర్త కొనిచ్చాడంటూ జరుగుతున్న ప్రచారం ఆమెను కలవరపెట్టింది. దాంతో ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఫేస్‌బుక్ వేదికగా ఆ ప్రచారాన్ని ఖండిస్తూ, సుదీర్ఘ వివరణ ఇచ్చారు రేణు. ఆమె ఆవేదనకు అద్దం పట్టిన ఆ పోస్ట్... "నేను ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం గురించి వివరణ ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం, నిన్నటి నుండి నాకు మీడియా వాళ్ళ నుండి, స్నేహితుల నుండి వస్తున్న ఎన్నో మెసేజెస్, ఫోన్ కాల్స్ ఆధారంగా నాకు ఈ విషయం చాలా సీరియస్ అయింది అని అర్థమయ్యింది. వాళ్ళు చెప్పింది విని నాకు చాలా బాధ వేసింది. అందుకే ఈ వివరణ... ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మగౌరవం.. ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయితీ.. ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం.. ఇది మీకు తెలియనిదా..? నేను, నా జీవిత మనుగడ కోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్ధతతో ఎంతగానో శ్రమిస్తున్నాను… శ్రమిస్తూనే పోరాడుతున్నాను. ఇప్పటి వరకూ కనీసం మా తండ్రి గారి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించలేదు, పొందలేదు. అలాగే, నేనిప్పటివరకూ నా మాజీ భర్త దగ్గర్నుంచి కూడా ఎలాంటి అన్యాయపూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు. అది నా వ్యక్తిత్వం!!! అయినప్పటికీ మీరు నా గురించి అన్యాయంగా, అసంబద్ధమైన అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తూనే ఉన్నారు! మీరందరూ అనుకుంటున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టు ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకీ, ఆత్మగౌరవానికీ, నా అస్తిత్వానికీ, చివరగా నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా? నాకు తెలిసినంతవరకూ.. ఈ వార్తకూ, నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధం ఉండి ఉండదు. కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు. అలాంటిది, ఒక వార్తను రాసేటప్పుడు, అది నిజమో కాదో నిర్ధారించుకోకుండానే, అత్యుత్సాహంతోనో, తొందరపాటుతోనో, లేక మీ సంస్థల మనుగడ కోసమో, ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం?  ఇలాంటి వార్తలు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయో మీకు తెలియదా? ప్రజలు ఈ అబద్దపు వార్తను నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం మసకబారదా? ఏది జరిగినా చెక్కు చెదరని నా అస్తిత్వం, వ్యక్తిత్వం, నా ఆత్మగౌరవం, నేను అనే ఒక నిజం అసత్యం అయిపోదా? నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది! ఎంతలా చితికిపోతుంది!? దయచేసి ఆలోచించండి.. నా ఈ జీవితంలో ఇప్పటివరకూ ఏ మగవాడి సాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన గమనానికీ, పోరాటానికీ గౌరవం ఇవ్వకపోయినా సరే… దయచేసి, ఇలా కించపరచకండి. నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్ళీ నాకూ, నా మాజీ భర్త అభిమానులకూ మధ్య, దయచేసి ఎలాంటి గొడవలూ సృష్టించకండి. మీ రేణూ దేశాయ్"  
  హీరో నితిన్ త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. ఐదేళ్లుగా తను ప్రేమిస్తోన్న శాలిని అనే యువతిని పెళ్లి చేసుకొనేదుకు సిద్ధమవుతున్నాడు. దుబాయ్‌లో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్‌లో శాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు నితిన్. కాగా శనివారం హైదరాబాద్‌లోని నితిన్ ఇంట్లో 'పసుపు కుంకుమ' వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన్ నితిన్ "పెళ్లిపనులు మొదలయ్యాయి. మ్యూజిక్ మొదలయ్యింది. మీ ఆశీర్వాదం కావాలి" అని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోల్లో లైట్ పింక్ కలర్ షేర్వాణీ ధరించిన నితిన్, గ్రీన్-ఎల్లో కాంబినేషన్ డిజైనర్ శారీలో శాలిని మెరిసిపోతున్నారు. ఇద్దరి మెడల్లోనూ దండలున్నాయి. సంప్రదాయబద్ధంగా పురోహితుడు చెప్తున్న వాటిని ఆ ఇద్దరూ పాటిస్తూ కనిపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం నితిన్, శాలిని ప్రేమలో పడ్డారని సమాచారం. సినిమా స్టైల్లోనే ఆమెకు నితిన్ ప్రపోజ్ చేశాడంట. ఏప్రిల్ 16న పెళ్లాడటానికి ఆ జంట సిద్ధమవుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ, "దుబాయ్‌లో మా పెళ్లి జరుగుతుంది. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 'రంగ్ దే' షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల పెళ్లి థీమ్ ను ఇంకా డిసైడ్ చెయ్యలేదు. అయితే అది స్పెషల్‌గా ఉంటుందని చెప్పగలను. పెళ్లయ్యాక, హైదరాబాద్‌లో నా ఫ్రెండ్స్ అందరితో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి రిసెప్షన్ ఉంటుంది" అని చెప్పాడు. దాన్ని బట్టి నితిన్, శాలిని పెళ్లి కొద్దిమంది సన్నిహిత మిత్రులు, బంధువుల సమక్షంలో జరుగుతుందని అర్థమవుతోంది. తన లైఫ్‌లో గొప్ప రోజు శాలినికి ప్రపోజ్ చేసిన రోజేననీ, అప్పుడు శాలిని ఓకే చేసిందనీ అతను అంటున్నాడు. ప్రేమలో పడ్డ నాలుగేళ్ల తర్వాత వాళ్లు తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. మొదట ఆశ్చర్యపోయిన వాళ్లు, ఆ తర్వాత తమ అంగీకారం తెలిపారు. ఈ మార్చి 30వ తేదీకి నితిన్‌కు 37 ఏళ్లు నిండుతున్నాయి.
ఇస్మార్ట్ స్పీడుతో రామ్ కొత్త సినిమా షూటింగ్ చేస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ నటిస్తున్న సినిమా 'రెడ్'. అక్టోబర్ 30న సినిమా ప్రారంభమైంది. నవంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. జస్ట్... ఈ నాలుగు నెలల్లో రామ్ సినిమాను ఫినిష్ చేశాడు. 'రెడ్' సినిమా టాకీ పూర్తయింది. ప్రస్తుతం ఇటలీలో సాంగ్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ నెలాఖరుకు సాంగ్స్ షూటింగ్ ఫినిష్ అవుతుంది.  "ఈ నెల 12 నుండి ఇటలీలోని టస్క్, ఫ్లారెన్స్, డోలో మైట్స్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నాం. ఈ నెల 20 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఇందులో రామ్, మాళవిక శర్మపై శోభి మాస్టర్ కోరియోగ్రఫీలో రెండు పాటలు చిత్రీకరిస్తున్నాం.  ఈ షెడ్యూల్ తో ఒక్క పాట మినహా సినిమా పూర్తవుతుంది. హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత మరో పాటని చిత్రీకరించనున్నాం" అని 'రెడ్' నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ తెలిపారు. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాల తర్వాత రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేయనున్నారు.
వెండితెరపై నయనతార చాలా ప్రేమకథల్లో నటించింది. అందుకే, రియల్ ప్రేమకథకు ఐదేళ్లు అని చెప్పింది. ఆఫ్ కోర్స్... రియల్ లైఫ్ లో కూడా నయనతారకు రెండు మూడు ప్రేమకథలు ఉన్నాయి. హీరో శింబు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటల వరకూ వెళ్లి ఆగాయి. తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్, ఆమె ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకథకు, ప్రేమ ప్రయాణానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఐదేళ్ల క్రితం ప్రేమికుల రోజున నయనతారకు విఘ్నేష్ శివన్ ప్రపోజ్ చేశాడట. ఈ ఏడాది ప్రేమికుల రోజు ఉదయాన ప్రేయసి కథానాయికగా, సమంత మరో కథానాయికగా విఘ్నేష్ శివన్ ఒక సినిమా అనౌన్స్ చేశాడు. సాయంత్రం సోషల్ మీడియాలో మరో పెద్ద పోస్ట్ పెట్టాడు. "నా క్యూటీ (నయనతార) స్టోరీకి ఐదేళ్లు నిండాయి. ఐదేళ్ళలో నయనతారతో అంతులేని ప్రేమతో ఎన్నో అందమైన జ్ఞాపకాలు తలపుల వెనుకాల నిండి ఉన్నాయి. నువ్ చూపించే అన్ కండీషనల్ లవ్, అఫెక్షన్ తో ప్రతిరోజూ ప్రేమికుల రోజే" అని విఘ్నేష్ శివ పోస్ట్ చేశాడు.
అవును... గాంధీకి నితిన్ ఛాన్స్ ఇచ్చాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అతడు ఓ సినిమా చేయనున్నాడు. అయితే... అది స్ట్రయిట్ సినిమా కాదు. ఒక రీమేక్. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా 'అంధాదున్'. తెలుగులో ఈ సినిమాను నితిన్ రీమేక్ చేయనున్నాడనేది తెలిసిన మాటే. ఈ రీమేక్ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని మధ్యలో ప్రచారం జరిగింది. అటువంటిది ఏమీ లేదని నితిన్ తెలిపాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'అంధాదున్' రీమేక్ చేస్తున్నట్టు స్పష్టం చేశాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన 'భీష్మ' ఈ నెల  21న విడుదల అవుతుంది. ఇది కాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. కృష్ణచైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అని మరో సినిమా అంగీకరించాడు. ఇవన్నీ పూర్తయిన తర్వాత 'అంధాదున్' రీమేక్ స్టార్ట్ కానుంది.
ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా తొలిసారి పరిమిత మీడియాతో జగన్ మాటా మంతి.. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం: జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.                                          ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది: సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి మనముందున్న లక్ష్యం విశాఖను  టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే: జగన్ మోహన్ రెడ్డి .మొత్తానికి సి ఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిమిత మీడియా తో అయినా, అపరిమితమైన అంశాలను షేర్ చేసుకున్నారు. పెన్షన్ల దగ్గర నుంచి పోలవరం దాకా, ఇంగ్లిష్ మీడియం నుంచి రాజధాని నిర్మాణం దాకా....అనేకానేక విషయాలను స్పృశించిన జగన్ మోహన్ రెడ్డి , తన మనసులో మాటలను, ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు. పెన్షన్లగురించి మాట్లాడుతూ.. ఒకరికి  ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ... అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుందాని చెప్పుకొచ్చారు. ప్రజల ముందే లబ్ధిదారుల జాబితా పెడుతున్నామనీ, సామాజిక తనిఖీకోసం గ్రామ ప్రజలముందే, గ్రామ సచివాలయంలో పెడుతున్నామనీ, ఎవరుకూడా తప్పులు చేసే అవకాశం లేకుండా చేస్తున్నామనీ చెప్పుకొచ్చారు సి.ఎం. ప్రతి పథకంకూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చిన సి.ఎం, పెన్షన్‌ ఇంతకుముందు కావాలంటే మూడు నెలల పెన్షన్‌ డబ్బు లంచంగా ఇవ్వాల్సి వచ్చేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పధకాల గురించి మాట్లాడుతూ, మేం ఏంచెప్పామో అదే చేస్తున్నామన్నారాయన. మేం ప్రతి పథకాన్నీ పెడుతున్నామంటే.. మేం చెప్తున్నదాన్ని అమలుచేస్తున్నామని కదా? ప్రతి ఏటా రెవిన్యూ ఎంతోకొంత పెరుగుతుంది. నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చుకాని, పెరుగుదలైతే ఉంటుందని కూడాభరోసాఇచ్చారు... ఇంగ్లిషు మీడియంపైన మాట్లాడుతూ, "న్యూట్రల్‌ మనిషిని ఎవరైనా అడగండి...కచ్చితంగా మా విధానాలను బలపరుస్తారు, మద్దతిస్తారు. ఇవాళ ఇంగ్లిషు మీడియం పెడితేనే... 20ఏళ్లలో మార్పులు వస్తాయి.ఇవాళ ఫస్ట్‌క్లాస్‌ చదవే వ్యక్తి.. 20 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తిచేస్తారు. ఇవాళ ఫోన్‌ఆన్‌  చేస్తే..కమ్యూనికేషన్‌ అంతా ఇంగ్లిషే. కంప్యూటర్లు.. ఇంటర్నెట్‌అంతా ఇంగ్లిష్‌లోనే. డ్రైవర్‌లెస్‌కార్లు వస్తున్నాయన్నది రియాల్టీ. ఇవాళ మనం మార్పు చేసుకుంటేనే.. భవిష్యత్‌తరాలకు మంచి జరుగుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి," అని హితవు కూడా చెప్పారు.  అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యాకమిటీలు పూర్తిగా ఇంగ్లిషు మీడియం పెట్టాలని వారంతా తీర్మానాలు చేసి పంపారని, ఎవర్ని అడిగినా ఇంగ్లిషుమీడియం కావాలనే చెప్తారని కూడా సి.ఎం. చెప్పుకొచ్చారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై  మాట్లాడుతూ... "రాజధానిపై నేను చెప్పాల్సింది అంతా అసెంబ్లీలోనే చెప్పాను. రాజధానిని ఎంచుకున్న ప్రాంతాన్ని చూడండి. అటు విజయవాడా కాదు, ఇటు గుంటూరూ కాదు... రాజధాని ప్రాంతం ఎక్కడ వస్తుందీ ముందే తనవారికి, తన అనుచరులకీ చెప్పి.. వేలాది ఎకరాలు కొనుగోలుచేయడం, క్యాబినెట్‌ సబ్‌కమిటీ ప్రాథమిక పరిశీలనలోనే 4వేలకుపైగా ఎకరాలు బటయపడ్డం.. అదంతా వేరే కథ.మరికొన్ని కీలక అంశాలను చూస్తే.. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే ఇవ్వాళ్టికీ మనం సింగిల్‌ రోడ్డుమీదే వెళ్లాలి. కరకట్టమీదున్న సింగిల్‌ రోడ్డుమీదనుంచే పోవాలి. నేనేమీ అబద్ధాలు చెప్పడంలేదు. మీడియా ప్రతినిధులుగా మీరుకూడా అదే దారివెంబడి వెళ్లాలి. సమీకరించిన భూమిని డెవలప్‌ చేయడానికి, కరెంటు, రోడ్లు, పైపులైన్‌తో నీరు ఇవ్వడానికి ఎకరాకు కనీసం రూ.2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వం వాళ్లే చెప్పారు. రూ. 1,09,000 కోట్ల అంచనా వేశారు. కాని అదే ప్రభుత్వం ఐదేళ్లకాలంలో రూ.5600 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. మరో రూ.2–3 వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించమని మాకు అప్పగించి వెళ్లిపోయారు. ఇందులోనూ రూ.500 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాల్సిన పరిస్థితి," అని గణాంకాలతో సహా వివరించారు జగన్ మోహన్ రెడ్డి. . ప్రతి ఏటా రూ.6 నుంచి 7 వేల కోట్లరూపాయలు రాజధాని మీద పెడితే.. అది సముద్రంలో వేసిన నీటిబొట్టే అవుతుంది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఇక్కడి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కోసం వేసిన అంచనాలో 10శాతం డబ్బును విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకైనా మనం హైదరాబాద్‌తోగాని, చెన్నైతోగాని, బెంగుళూరుతోగాని పోటీపడే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటుంది. అయినా సరే.. ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా కొనసాగిస్తామని చెప్పాం. మహారాష్ట్రలోని నాగపూర్, కర్ణాటకలోని బెల్గాంల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది. సీఎం అక్కడనుంచి పనిచేయాలి? ఇక్కడ నుంచి పనిచేయాలి? అని ఎవ్వరూ చుప్పలేరు. మంత్రివర్గానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలను పాలనాయంత్రాంగం అమలు చేస్తుంది. విశాఖలో నీటికి కొరత ఉందనేది వాస్తవం కాదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ.. పోలవరం నుంచి మరింత నీటిని అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. తుపాన్ల సమస్య రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాలకూ ఉందని చెప్పిన సి.ఎం., ఇదే కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉప్పెన వచ్చిన ఘటనలూ ఉన్నాయన్నారు. విజయవాడకు కేవలం 60 కి.మీ దూరంలో సముద్రం కూడా ఉంది. అలాగే కరవు పీడిత ప్రాంతాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి మనం చూడాల్సిన అంశం మరొకటి ఉంది. విశాఖపట్నం అనేది రాష్ట్రంలో నంబర్‌ ఒన్‌ సిటీ. దేశవ్యాప్తంగా టైర్‌ –2 సిటీల్లో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పుడు మనముందున్న లక్ష్యం దీన్ని టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం. దేవుడు మనకు ఈస్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే అదికూడా తప్పే అవుతుంది. దానికి ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.మనం విశాఖపట్నం వెళ్లకూడదు, ఇక్కడా అభివృద్ధికాదు. దీనివల్ల నష్టం మన పిల్లలకే. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్డీఏను ఏఎంఆర్‌డీఏగా మార్పుడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టం.ఇక్కడ వారికీ న్యాయం చేస్తున్నాం, దీంతోపాటు మిగిలిన ప్రాంతాలకూ న్యాయం చేస్తున్నామని, అందరికీ మంచి చేస్తున్నామని చెప్పడానికే బిల్లులు పెట్టాం. ఒక్క ఏఎంఆర్‌డీఏ చట్టంకోసమే బిల్లు పెడితే ప్రస్తతు రాజధాని ప్రాంతం వారికి తప్పుడు సంకేతం పోతుందని చెప్పాం. ఈ బిల్లులను ఎవ్వరూ ఆపలేరు. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవ్వరూ అడ్డుకోలేరు. స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టే బిల్లునుకూడా ఇలాగే మండలిలో అడ్డుకున్నారు. ఆగిపోయిందా? అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు బిల్లును కూడా అడ్డుకున్నారు.. ఆగిపోయిందా?, అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కాని, ప్రజలకు మంచిచేసే బిల్లులను ఆమాత్రం ఆలస్యం కూడా ఎందుకు చేయాలి? ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు?ప్రజలకు మంచి చేసే బిల్లులను ఆలస్యం చేయాలన్నదేవారి ఉద్దేశం అయినప్పుడు, నిబంధనలను కూడా ఉల్లంఘించి వాళ్లు బిల్లులను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు మండలి అవసరం ఎందుకు? కేవలం మండలిలో ఒక పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారని రాజకీయపరమైన ఆలోచనలు చేశారు.  అసలు మండలిని అసెంబ్లీ సృష్టిస్తుంది, అసెంబ్లీకి సహాయపడుతుంది. మండలి అనేది అసెంబ్లీకి సలహా ఇచ్చే ఒక సభ. ఈ పనిని విడిచిపెట్టి రాజకీయంగా ఆలోచించి ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహాసం చేస్తామంటే.. ఎలా? ఒక్క మండలి నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఏడాదిపోతే..., శాసనమండలిలో మాక్కూడా మెజార్టీ వస్తుంది. కాని, ఈ ఏడాది సమయాన్నికూడా ఎందుకు వదులుకోవాలి? ప్రజలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల వచ్చే మంచిచేరాలి. ఇంగ్లిషు మీడియం బిల్లును ఆమోదిస్తే ఎవరికి లాభం?ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉంటే ఎవ్వరికి లాభం? రాజధానికార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఎవ్వరికి లాభం? విశాఖను అభివృద్ధి చేస్తే ఎవ్వరికి లాభం? ఇవన్నీ కూడా మన పిల్లలకి లాభం కదా? మన ప్రజలకు లాభం కాదా? అన్నది ఆలోచించాలి. అమరావతి రైతుల నుద్దేశించి ప్రశ్నలపై మాట్లాడుతూ, అమరావతి రైతులకు ఏం చేయదలుచుకున్నామో అసెంబ్లీలోనే చెప్పాం. ఎవ్వరికీ అన్యాయం చేయం. రైతులికిచ్చే యాన్యునిటీని పదేళ్ల నుంచి పదిహేనేళ్లకు పెంచాం. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే జీవనభృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచాం. అసైన్డ్‌దారులకు పట్టాదారులతో సమానంగా ప్లాట్ల కేటాయింపులు చేస్తాం. మేం గత ప్రభుత్వం మాదిరిగా బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌ చూపించడంలేదు.  వాస్తవాలను ముందు పెడుతున్నాం. అమరావతి లెజిస్లేచర్‌ కేపిటల్‌గా కొనసాగుతుందని చెప్పామన్నారు ముఖ్యమంత్ర బీజేపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ, 2019లో బీజేపీ మేనిఫెస్టో ఏంచెప్పిందో ఒక్కసారి చూడండి.రాజధాని భూముల్లో అవినీతి జరిగింది... వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. కాని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. అదే పార్టీకి చెందిన జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెప్తున్నారన్నారు సి.ఎం. ప్రత్యేక హాదా గురించి మాట్లాడిన సి.ఎం., ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదన్నారు.  ముగిసిపోయిన అధ్యాయం అనే పదం వాడ్డం సరికాదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. ప్రతిసారి మేం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మా అవసరం వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం.  కేంద్రానికి అవసరమైన రోజున మన ఎంపీల పాత్ర కీలకం అవుతుంది. ఆ సమయంలో మనకున్న డిమాండ్‌ ప్రత్యేక హోదా మాత్రమే. కియా.. వ్యవహారంపై మాట్లాడుతూ, కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చారు. అనైతికమైన రిపోర్టింగ్‌ చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తా కథనం ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కథనం ఇది. తాము ఎక్కడికీ వెళ్లడంలేదంటూ కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా... వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాలకోసం వ్యవస్థలను మేనేజ్‌చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. నామీద బురదజల్లడం, నిందలు వేయడం ఇప్పడు మొదలుపెట్టింది కాదు. ఇవన్నీ నాకు అలవాటే. నిజాలతో పనిలేకుండా ఒక మనిషికి చెడ్డపేరును ఆపాదించాలని ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కచ్చితంగా మాకు తోడుగా ఉంటాడు.  గతంలో మా పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను  కొనుగోలుచేశారు. ఎన్నికల తర్వాత వారికి వచ్చిన సీట్లు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే. దేవుడు రాసిన గొప్ప స్క్రిప్టు ఇది. వాళ్లు చేసే కొద్దీ దేవుడు అయ్యో పాపం అంటూ.. మన పక్కనే ఉంటాడు. 2014 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించలేదు.  ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్‌ వెళ్లాడు, మార్కెటింగ్‌కోసం కోట్లు ఖర్చుచేశాడు. రాష్ట్రంలో నడుస్తున్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా మనం అదిచేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటనలు చేసీ ఏం లాభం. మా  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సింది ప్రధానంగా సరసమైన ధరలకు భూములు, నీళ్లు, కరెంటు. అవినీతిలేని పాలన, సానుకూల దృక్పథం ఉన్న ప్రభుత్వం, విధానాల్లో పారదర్శకత. ఇవన్నీ ఉన్న ప్రభుత్వం మాది. పైగా అబద్ధాలు చెప్పే అలవాటు మా ప్రభుత్వానికి లేదు. పరిశ్రమలకు ఇవన్నీ సానుకూల అంశాలు. మిగిలినవన్నీ సహజంగానే వస్తాయి.  విషయాలన్నింటికీ ఎప్పటికప్పుడు మేం చెప్తూనే ఉన్నాం. కాకపోతే మాకు మీడియా బలం తక్కువన్నారు సి.ఎం. . సీఎంగా అతి పెద్ద సవాల్‌ ఏమి ఉంటుందన్న ప్రశ్నకు,ప్రతిరోజూ సవాలే. మంచి సమర్థతతో ఆ సవాలను అధిగమించాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, హౌసింగ్‌... వీటిని ప్రాధాన్యతలుగా పెట్టుకున్నాం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను బాగా అభివృద్దిచేస్తున్నాం? ఇది అభివృద్దికాదా? ఇంగ్లిషు ల్యాబ్‌ సహా 9 రకాల సదుపాయాలను ప్రతిస్కూళ్లలో కల్పిస్తున్నాం. ప్రతి స్కూళ్లో ఇంగ్లిషు మీడియం పెడుతున్నాం.మధ్యాహ్న భోజనంలో నాణ్యత బాగా పెంచాం.  గ్రీన్‌ఛానళ్లో పెట్టి బిల్లులు పెండింగులో లేకుండా చూస్తున్నాం.ఆయాల జీతాలు రూ.వేయి నుంచి రూ.3వేలకు పెంచాం. అమ్మ ఒడి అమలు చేశాం.ఫీజు రియంబర్స్‌మంట్‌ పూర్తిగా ఇస్తున్నాం. పాఠ్యప్రణాళికలో పూర్తిగా మార్పులు తీసుకు వస్తున్నాం. డిగ్రీ విద్యార్థులకు ఏడాదిపాటు అదనంగా అప్రెంటిస్‌ ఇప్పిస్తున్నాం.ఇది అభివృద్ది కాదా, అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ పోలవరం మీద ఎంతో «ధ్యాసపెడుతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం ప్రాజెక్టును మిస్‌ హ్యాండిల్‌ చేసిందని, త ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణలో విజన్‌ లోపించిందని చెప్పారు. "స్పిల్‌వే పూర్తికాకుండానే కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టింది. దీనివల్ల వరదనీరు అటు స్పిల్‌వేగుండా పోవడంవల్ల పనులు చేయలేని పరిస్థితి. నవంబర్‌ వరకూ పనులు నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2021 జూన్‌ నాటికి పనులు పూర్తవుతాయి," అని వివరించారు.  
కొత్త ఉద్యోగాలేమో గానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబీకే విధంగా జగన్ ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే... ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలూ వెళ్లేపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా... ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం... సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసుకుంది. దాంతో, మిలీనియం టవర్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మార్చి 30లోపు మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, 5వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం 300 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కాండ్యుయేట్ కంపెనీ.... ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం ఆపరేషన్సే షట్ డౌన్ చేయాలని కాండ్యుయేట్ కంపెనీ బోర్డు డెసిషన్ తీసుకుందని అంటున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న కాండ్యుయేట్ కంపెనీ.... హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లో పనిచేస్తున్న 2400మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  ఇక, మిలీనియం టవర్స్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ కూడా మార్చి 30 తర్వాత ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయనున్నాయి. దాంతో, మిలీనియం టవర్స్ నుంచి దాదాపు 18వేల మంది ఉద్యోగులు తరలిపోనున్నారని చెబుతున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన కాండ్యుయెంట్‌ సంస్థను విశాఖ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది. కానీ, ఇఫ్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో.... మొత్తం ఏపీనే వదిలివెళ్లిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎంతోకష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.  
సమ్మక్క సారాలమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివాసీలకు కాకతీయ రాజులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలోనే ఈ గాథలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొన్ని కథల్లో సమ్మక్క మరణించినట్లు ఉంటే... మరికొన్ని కథల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని చెబుతున్నాయి. ఇంకొన్ని గాథల్లో సమ్మక్క సహగమనం చేసినట్లు ఉంటుంది. కొన్ని కథల్లో ఆదివాసీలకు... కాకతీయ ప్రభువులకు మధ్య ఘర్షణ జరిగి... కప్పం కట్టకపోవడం కారణంగా చెప్పగా... మరికొన్ని కథల్లో సహజ వనరుల పంపకాల్లో వివాదం వచ్చినట్లు ఉంది. అయితే, ఆదివాసీల నుంచి కాకతీయ రాజులు కప్పం వసూలు చేసిన దాఖలాల్లేవని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ... ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న కథలు మాత్రం కప్పమే యుద్ధానికి కారణమని చెబుతున్నాయి. అయితే, అందరి నోళ్లలో ప్రసిద్ధి చెందిన కథ ఇలా ఉంది. ఏడో శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయ దొరలు వేట కోసం అడవికి వెళ్లగా, ఓ చోట పెద్ద పులులు కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ పసిపాప కనిపించిందని, ఆ పాపను కోయదొరలు తమ గూడేనికి తీసుకెళ్లి పెంచి పెద్దచేశారని, అయితే... ఆ పసిపాప వచ్చినప్పట్నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే తమకు పాప రూపంలో సాక్షాత్కరించిందని నమ్మి ఆ చిన్నారికి సమ్మక్కగా పేరు పెట్టారని చెబుతారు. అలా, పెరిగి పెద్దయిన సమ్మక్కను కోయ చక్రవర్తి అయిన మేడరాజు... కరీంనగర్ ప్రాంతాన్ని ఏలుతున్న తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి జరిపించాడని చెబుతారు. పగిడిద్ద రాజు, సమ్మక్కకు సారాలమ్మ, నాగులమ్మతోపాటు జంపన్న జన్మించారు. అయితే, మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరోజులు... ఓరుగల్లు రాజులకు సామంతులుగా ఉండేవారు. కరువు కాటకాలతో ఒక సంవత్సరం కోయరాజుల... కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయారు. దాంతో, కాకరాజు రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపాడు. అయితే, కాకతీయ సేనల ముందు గిరిజనులు నిలువలేకపోయారు. ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోపాటు వారి కుమార్తెలు సారాలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరణమరణం పొందుతారు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న... మేడారం సమీపంలోని వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. అయితే, సంపెంగ వాగు సమీపంలో జంపన్నను కాకతీయ సేనలు హతమార్చాయని మరో కథ ప్రచారంలో ఉంది. జంపన్న వీరమరణం పొందిన వాగు కావడంతో దాన్ని అప్పట్నుంచీ జంపన్న వాగుగా పిలుస్తారు. అయితే, భర్త పిల్లల మరణవార్త తెలుసుకున్న సమ్మక్క మహోద్రురాలిగా మారి కాకతీయ సేనలపై విరుచుకుపడిందని, కానీ... ఓ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క నెత్తురోడుతూనే ఈశాన్య వైపునున్న చిలుకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమైందని చెబుతారు. సమ్మక్కను కొందరు కోయలు అనుసరించినప్పటికీ జాడ తెలియలేదని, అయితే చిలుకలగుట్టపైనున్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించడంతో, సమ్మక్కే అలా మారిందనే నమ్మకంతో అప్పట్నుంచి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ముత్తయిదువల పండగ జరుపుకోవడం మొదలుపెట్టారని, ఇదే కాలక్రమేణా జాతరగా రూపొంతరం చెంది, సమ్మక్క సారాలమ్మ మేడారం మహా జాతరగా మారింది. అయితే, కోయవీరులు మరణించారంటే ఆదివాసీలు అంగీకరించరు. వాళ్లింకా బతికే ఉన్నారని... సమ్మక్క భరిణె రూపంలో రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందనేది వాళ్ల విశ్వాసం. అందుకే, ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ మేడారం నిర్వహిస్తున్నామని చెబుతారు. అలా, ఆదివాసీల్లో వీరవనితగా పేరుగాంచిన సమ్మక్క... కుంకుమభరిణె రూపంలో వెలిసి... భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోందని పురాణగాథలు చెబుతున్నాయి.
2020-21 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముడుతున్న వేళ దేశం పై ఆర్థిక మందగమన ప్రభావం పడకుండా ఆర్థిక మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సామన్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుతున్న పొదుపుతో దిగాలుగా ఉన్న సగటు వేతన జీవి ఈసారైన ఆదాయపు పన్ను పై ఆర్థిక మంత్రి తీపికబురు అందిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న చర్యలు ఈ సారి ఎలాంటి మార్పులు చేసే అవకాశాలున్నాయో చూడాలి.  2014 బడ్జెట్ లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ లకు మినహాయింపు 2.5 లక్షల నుంచి మూడు లక్షలకు మార్చారు. 2015 బడ్జెట్ లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లకుండా ఆరోగ్య భీమపై డిటెక్షన్ ను రూ.15,000 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20,000 నుంచి రూ.30,000 లుగా మార్చారు. సంపద పన్ను తొలగించి సంపన్నుల పన్ను ఆదాయం కోటి దాటితే రెండు శాతం సర్ చార్జ్ విధించేలా నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్ లో సెక్షన్ 87 కింద ఐదు లక్షల ఆదాయం మించని వారికి పన్ను రిబేట్ ను రూ.2000 నుంచి రూ.5000 లకు పెంచారు. సెక్షన్ 80 జీజీ కింద అద్దెకు సంబంధించిన డిడక్షన్ ను రూ.24,000 నుంచి రూ.60,000 లకు పెంచారు. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. 2017 బడ్జెట్ లో 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి పన్నును ఐదు శాతం చేశారు. వార్షికాదాయం 3.5 లక్షలు ఉన్న వారికి పన్ను రిబేట్ ను రూ.5000 నుంచి రూ.2,500 చేశారు. 50 లక్షల నుంచి కోటి ఆదాయం పై 10 శాతం సర్ చార్జిని వేధించడం మొదలు పెట్టారు. 2018 లో మెడికల్ రీయంబర్స్ మెంట్ ట్రాన్స్ పోర్టు అలవెన్సుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40,000 పెంచారు. ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను పై ఉన్న మూడు శాతం విద్యాసెస్సు స్థానంలో 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. 2019 లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినా తాత్కాలిక బడ్జెట్ లో ఐదు లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 నుంచి రూ.50,000 లకు పెంచారు. మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చి అంచనాలున్నాయి. చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబులలో సవరణలు పరిమితుల పెంపు లేదు. రిబేట్ల లాంటి ప్రత్యామ్నాయాలు కాకుండా 5,10,20,30,35 శాతం శ్లాబులు తేవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని అయిదు శ్లాబులుగా విభజిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ.2,50,000 ఉన్న ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది
మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి కమిటీలు , నివేదికలతోనే కాలం గడిచిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండటం మంచిదని జగన్ చెప్పిన విధంగానే నివేదిక కూడా వెల్లడించింది. అలా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు రూ.5 కోట్ల 95 లక్షల ఫీజు చెల్లించింది ప్రభుత్వం. ఎటువంటి జీవో లేకుండా బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన కంపెనీతో రహస్య లావాదేవీలు జరిపింది వైసీపీ ప్రభుత్వం. మొత్తం వ్యవహారాలు ఈమెయిల్స్ ద్వారానే నడిపింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రణాకా విభాగం ద్వారా చేసింది. రాజధాని కేసులపై వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గీకి కూడా ప్రణాళికా విభాగం ద్వారానే రూ. 5 కోట్లు మంజూరు చేశారు. అది కాకుండా బోస్టన్ గ్రూప్‌కి కూడా దాదాపుగా రూ.6 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని కూడా ఈ ప్రణాళికా విభాగం ద్వారానే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన లేఖల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కంపెనీని సంప్రదించింది. మూడు రాజధానులపై అధ్యయనం చేసేందుకు 2019 , నవంబర్‌ 27వ తేదీన బోస్టన్ కమిటీని ఎంపిక చేసినట్లుగా అధికారులు ఈమెయిల్ పంపారు. ఆ తర్వాత జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా నెల రోజుల్లోనే బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. అసలు ఆ కమిటీ ఏపీలో ఉండే ఎటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక వెల్లడించిందో తెలియయటం లేదు. బోస్టన్ నివేదికలో కూడా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన బ్లూప్రింట్‌లోని అంశాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మూడు రాజధానుల అంశం కూడా ఉంది. అంటే ముందస్తుగా ఒక రిపోర్టును ప్రభుత్వమే సిద్ధం చేసి.. దానికి బోస్టన్ గ్రూప్ అనే ట్యాగ్ వేసి ఇచ్చేందుకు రూ. 6 కోట్లను సమర్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా బోస్టన్ నివేదిక గురుంచి గూగుల్ లో చాలా మంది వెతికినా దొరకలేదు.. అలానే ప్రభుత్వం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో ప్రభుత్వం నేరుగా జీవో ద్వారా కాకుండా.. మరో విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ చీకటి వ్యవహారాలు అంచనా వేయలేని విధంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి.
తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు.  ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత. ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.
శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా... శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చించి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉన్నాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే... ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసిన నేపథ్యంలో...  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.
    Pneumonia is the inflammatory disease of the structural unit of lung called alveoli – the microscopic air sacs. Every year about 7% of the world population is victimized by pneumonia and about 1% of the victims end up dying. Previously pneumonia was considered as the captain of mans death, but with the advent of drug and vaccines its killing spree is under-control. The main causes of pneumonia are bacteria and viruses, certain other microbes, certain drugs and autoimmunicity too cause pneumonia. It is mainly targeted to the geriatric and pediatric groups, nevertheless the chronically ill patients succumb to death because of pneumonia. Though, pneumonia is a respiratory disorder, its symptoms are wide spread in other system too. The most common symptom is the cough, it is productive and occasionally blood stains are also seen in the sputum. Other symptoms include: High fever accompanied by shaking chills, shortness of breath after mild exercise or during sleep, stabbing pain during deep respiration, frequent headache, nausea, abrupt mood swings, low blood pressure with high heart rate, vomiting, muscular aches, fatigue and joint pains. The most striking and prominent symptom is the blue-tinged skin! The preventive measures include the vaccination and environmental measures. There isn’t a specific vaccination. But the vaccines affective in shielding against pneumonia are: Influenza vaccines, pertussis, varicella and measeles. The environmental measure would be smoking cessation and air pollution control. The management of pneumonia is by the simple antibiotics, rest and analgesics. Take Care!! .....SIRI
Eating healthy, appreciating life, understanding true happiness and living well is a bigger issue than your waistline or looks - poor habits can also take a toll on your careers, claim few studies. When we eat well, take in proper nutrients and stay active, we are making the choice not only to ensure our long-term health, but also to impact our long-term success in the workplace. Simple changes can impact productivity at your workplace. 1. Whether it is a small choice between a fruit like banana and a bag of chips, or a larger lifestyle shift such as wiping out processed foods from your diet, it is important to start living a healthy lifestyle today. 2. There are seven differently coloured fruit and vegetable families. Each family contains different antioxidants, which is why it’s important to include a variety of colours. Aim for at least one portion each of red, purple, dark green, light green, yellow, orange and white fruit and vegetables every two days. 3. One handful of nuts a day is all it takes to slash your risk of heart disease and potentially add three years to your life, say American researchers. Nuts are packed with heart-healthy fats, plus loads of selenium - vital for all – round good health ,say nutritionists. Avoid buying chips, junk food and sodas during work hours and stuffing yourself with too many teas or coffees. 4. Never allow yourself to get past 11 on the hunger scale (which goes from 1 to 20) before eating. If you get too hungry, you’ll end up bingeing on fatty ,sugary foods for instant energy. Eating at regular intervals with not more than 3 hours gap may help boosting your metabolism. 5. Five portions of fruit and vegetables is the minimum you need each day for good health. Fruit and vegetables are packed with substances called antioxidants, which reduce the risk of serious illnesses such as cancer and heart disease. Antioxidants also help fight common infections. Try for three servings of vegetables and two of fruit, as vegetables have more fibre and less sugar. 6. Water helps your body with physical and mental performance, detoxification and digestion. Keep a water bottle at your desk and you’ll find it much easier to drink the recommended water each day as per your body and lifestyle needs. It will ease stress and result in sustained energy throughout the day. You can also supplement it with fresh lemonade and coconut water, etc, to avoid monotony. 7. Give yourself several reasons to take a break and move around after every 40 minutes at your workplace. Simply getting up and moving around for a few moments can keep you focused, less fatigued and feeling better. 8. Get down from your vehicle a few blocks before your office and walk the remaining distance use staircase more frequently than the lift to lead a more active lifestyle. 9. People who work at desks often face stress, back and joint pains and weight gain problems at work. To get rid of such health problems, while sitting in your chair, flex your feet and circle your ankles, stretch your legs and arms as frequent as you can. 10. Thinking positively is the best way to train our brain, lacking in brain stimulation thoughts may cause brain shrinkage and impact our behavior and actions. Also sufficient sleep allows our brain to rest. Long term deprivation from sleep will accelerate the death of brain cells. Courtesy Glow with health welness solutions