LATEST NEWS
యువకులపై హోటల్ సిబ్బంది, యాజమాన్యం అనుచరుల దాడి.! నలుగురు స్నేహితులు కలిసి సరదాగా బిర్యానీ తినేందుకు హోటల్‌కు వెళ్లారు. కాసేపు మాట్లాడుకుంటూ, భోజనం చేసి ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్నారు. కానీ వారికి అక్కడ ఎదురైన అనుభవం మాత్రం జీవితంలో మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. బిర్యానీ రావడం ఆలస్యమైందని అడిగినందుకు కత్తులతో దాడి చేస్తారని వారు ఊహించి ఉండరు. హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మిధాని కాలనీకి చెందిన రమేష్ గౌడ్, మల్లేష్, శివ, రాకేష్ కలిసి బీఎన్‌రెడ్డి నగర్‌లోని అతిథి బిర్యానీ సెంటర్‌కు వెళ్లారు. నలుగురూ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే ఎంతసేపటికీ ఆర్డర్ రాకపోవడంతో.. బిర్యానీ తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకవుతోందని హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అక్కడితో విషయం సర్దుకుపోతుందని భావించారు. కానీ చిన్నపాటి ప్రశ్న కాస్తా మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో హోటల్ సిబ్బంది, యువకుల మధ్య ఘర్షణ మొదలైంది. ఇంతలో హోటల్ యాజమాన్యం అనుచరులు కూడా అక్కడికి చేరుకుని యువకులపై దాడికి దిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మాటలతో మొదలైన వివాదం కాస్తా కత్తులతో దాడి చేసే స్థాయికి చేరింది. విచక్షణ కోల్పోయిన దుండగులు యువకులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మల్లేష్ కనుబొమ్మతో పాటు వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కత్తులతో దాడి.. బీరు బాటిళ్లతో బెదిరింపులు.! కత్తులతో దాడి చేయడమే కాకుండా బీరు బాటిళ్లతో బెదిరిస్తూ చంపేస్తామంటూ హంగామా సృష్టించినట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. బిర్యానీ కోసం హోటల్‌కు వచ్చిన యువకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తమ వద్ద ఉన్న రూ.25 వేల నగదుతో పాటు సెల్‌ఫోన్లు కూడా కనిపించడం లేదని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో బాధితులు.. పోలీసుల దర్యాప్తు.! దాడిలో గాయపడిన వారిని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మల్లేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారి వివరాలు, ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. బిర్యానీ ఆలస్యమైతే మరోసారి అడగొచ్చు.. లేదా ఆర్డర్ రద్దు చేసుకుని వెళ్లిపోవచ్చు. కానీ అంతమాత్రానికే కత్తులు చేతబట్టి దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం? హోటల్‌కు భోజనం చేయడానికి వెళ్లినవారికి ప్రాణభయం కలిగించే పరిస్థితులు ఎందుకు రావాలి? చిన్నపాటి సహనం లేకపోతే ఇలాంటి దాడులు ఎక్కడికి దారితీస్తాయి? బిర్యానీ కోసం వెళ్లిన యువకులకు చివరకు ఆసుపత్రే దిక్కయింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇది కూడా చదవండి: ఒక రహస్యం.. మరో బాలుడి జీవితాన్ని బలితీసుకుంది.!   [ Hotel staff attacked with knives when asked about the delay in biryani, Hyderabad Crime, BN Reddy Nagar, Athithi Biryani Centre, Biryani Hotel Attack, Knife Attack, Vanasthalipuram Police, Ramesh Goud, Mallesh, Hyderabad News, Hotel Staff Attack, Telangana Crime News ]
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత కాలంలో చర్చనీయాంశంగా మారిన పరిణామాలపై ప్రధాన రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖుల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయకూడదనే కోణంలో పార్టీల నాయకత్వాలు స్పందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఆయన మాజీ అర్ధాంగి అన్నా కొణిదెల తమ వైవాహిక జీవితానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వారు ప్రకటించిన తరుణంలో, ఈ అంశంపై విభిన్న రీతిలో చర్చలు నడిచాయి. ఈ సున్నితమైన అంశంపై తెలుగుదేశం పార్టీకి చెందిన అనుబంధ విభాగం ఐటీడీపీ తక్షణమే స్పందించింది. ఏ నాయకుడి వ్యక్తిగత జీవితంపై కూడా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని పార్టీ కేడర్‌కు అత్యంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా హద్దు దాటి ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. పార్టీకి చెందిన అధికారిక లేదా అనధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి వ్యక్తిగత దూషణలు వస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్సీపీ కూడా ఇదే ఒరవడిని కొనసాగించడం విశేషం. రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలను విమర్శనాస్త్రాలుగా మలచవద్దని, వారి గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆ పార్టీ వర్గాలు కూడా సూచించినట్లు సమాచారం వెలువడింది. ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్స్ చేయడం సర్వసాధారణంగా మారిన తరుణంలో, ఇటు అధికార కూటమి పార్టీలు, అటు ప్రతిపక్షం కూడా సంయమనం పాటించడం పట్ల రాజకీయ పరిశీలకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన హుందాలైన సంప్రదాయానికి నాంది పలుకుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ రాజకీయ విమర్శలు కేవలం విధానాలు, పరిపాలనపైనే ఉండాలి కానీ వ్యక్తిగత జీవితాలపై ఉండకూడదనే స్పష్టమైన సందేశం ఈ ఘటన ద్వారా ప్రజల్లోకి వెళ్లింది. ఇది కూడా చదవండి: సోనియా ఆత్మకథలో అసలు నిజాలెన్ని.. వైట్‌వాషింగ్ అంటూ బీజేపీ విమర్శలు.!       [ Pawan Kalyan personal matter, TDP orders on Pawan Kalyan, Anna Konidela divorce, ITDP warning social media, AP politics news Telugu ]
రాజకీయాలు  కుటుంబ సభ్యుల మధ్యే అడ్డంకులను సృష్టించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇందుకు  వైఎస్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం  ఉదాహరణలుగా చెప్పవచ్చు. కుటుంబంలోనే రాజకీయాలలో ఆధిపత్యం కోసం కుమ్ములాటలూ, తగాదాలు, విభేదాలు. అటువంటి కారణాలతోనే కేసీఆర్ కుటుంబం నుంచి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) ఏర్పాటు చేశారు.  సరిగ్గా అటువంటి తాగాదాలతోనే వైఎస్ రాజశఖరరెడ్డి కుమార్తె, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా చెల్లెలు అయిన వైఎస్ షర్మిల అన్నతో వేరుపడి సొంత బాటలో నడుస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఇగో సమస్యలు, పైచేయి కోసం ఆరాటాలు ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.    సరిగ్గా ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, నారా లోకేష్ చెప్పారు.   తన తండ్రి, ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు.. కుటుంబ సభ్యులందరికీ వారి వారి బాధ్యతలను స్పష్టంగా విభజించారు. తామందరం ఆయన మాటను శిరసావహిస్తున్నామని లోకేష్ ఆ ఇంటర్యూలో చెప్పారు.   తమది  చాలా సన్నిహితమైన ఉమ్మడి కుటుంబమని వివరించిన నారా లోకేష్.. కుటుంబంలో, బంధాలు, బాధ్యతలు అన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటామన్నారు. చంద్రబాబుతమ బాధ్యతలను స్పష్టంగా విభజించారనీ, ఆ బాధ్యతలను తాము చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తున్నామనీ వివరించారు.  కుటుంబ వ్యాపారాలు, ఆర్థిక విషయాలను చూసుకునే బాధ్యత బ్రహ్మణిది అని చెప్పిన లోకేష్, బ్రహ్మణి ఆరోగ్యం, ఆదాయం, వ్యయాలకు సంబంధిచిన వ్యవహారాలు పర్యవేక్షిస్తారనీ, ఇక అమ్మ భువనేశ్వరి  ఎన్టీఆర్ ట్రస్ట్‌ను నిర్వహిస్తారనీ చెప్పారు.   కుటుంబ భద్రత, లాజిస్టికల్ వ్యవహారాలు, అలాగే రాజకీయ వ్యూహాలకు సంబంధించిన బాధ్యతలు తనపై ఉన్నాయని లోకేష్ చెప్పారు.  కుటుంబ సభ్యులందరికీ బాధ్యతలను సమానంగా విభజించడమే కాకుండా,   ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.  ఇది కూడా చదవండి: కనకదుర్గమ్మకి చంద్రబాబు కుటుంబం పట్టువస్త్రాల సమర్పణ!  తమ కుటుంబంలో ఎలాంటి అభద్రతా భావాలు, ఈగో క్లాష్‌లు, అభిప్రాయ భేదాలకు తావులేకుండా మా మా బాధ్యతలకు కట్టుబడి   విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.   అన్ని వ్యాపార లావాదేవీలు, వ్యక్తిగత విషయాలను పరస్పరం పంచుకుంటామని వివరించారు.  ఈ కారణంగానే  కుటుంబంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సజావుగా సాగిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబంలో ఎవరికి ఏ బాధ్యత ఎవరిదన్న  దానిపై  స్పష్టత ఉండటం వల్ల ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటామన్నారు.   రాజకీయ రంగంలో తాను బిజీగా ఉంటూనే, కుటుంబ పరమైన వ్యాపార వ్యవహారాలను, ఇతర సామాజిక కార్యక్రమాలను అందరూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. రాజకీయాలతో పాటు కుటుంబ పరంపరను, వ్యాపారాలను ఒక క్రమపద్ధతిలో నడిపించడంలో చంద్రబాబు దూరదృష్టి ఎంతగానో దోహదపడుతోందని లోకేష్ చెప్పారు.  రాష్ట్ర రాజకీయాలలో బిజీగా గడుపుతూనే కుటుంబ వ్యవహారాలను ఇంత పకడ్బందీగా సమన్వయం చేసుకోవడంపై నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు   రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కుటుంబ వ్యవస్థ పట్ల, బాధ్యతల పట్ల నారా కుటుంబం అనుసరిస్తున్న   విధానం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.   మీకు నచ్చవచ్చు: నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న చంద్రబాబు కుటుంబం ది లెజండ్.. ది విజనరీ.. ది లీడర్.. ఒకే ఒక్కడు చంద్రబాబు   [Nara Lokesh Family Responsibilities,  Chandrababu Naidu, Nara Brahmani, Nara Bhuwaneswari, Lokesh, Interview,  Politics And Family, Telugu One]
ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకూడదని హెచ్చరించడమే ఆయన చేసిన నేరమైంది. రోడ్డుపై బాణసంచా కాల్చొద్దని చెప్పడమే ఆయన పాలిట శాపమైంది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ పోలీసు అధికారి.. కొందరు యువకుల విచక్షణారహిత దాడికి బలయ్యారు. పండుగ పూట ఇంటికి తిరిగొస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చారు. రీల్స్ పిచ్చి, క్షణికావేశం కలిసి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తమిళనాడులో జరిగిన ఈ దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలో దీపావళి వేళ ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారే.. చివరకు కొందరు యువకుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని తేని డీఎస్పీ కార్యాలయంలో స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సెంథిల్ కుమార్‌గా గుర్తించారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకున్న సెంథిల్ కుమార్ సాధారణ దుస్తుల్లో తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. రోజంతా విధుల్లో గడిపిన ఆయన.. కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవాలనే ఆలోచనతో ప్రయాణం సాగిస్తున్నారు. కానీ మార్గమధ్యంలో కనిపించిన ఓ దృశ్యం ఆయన ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తుందని ఊహించలేదు. సమాధర్మపురం ప్రధాన రహదారిపై కొందరు యువకులు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ బాణసంచా కాలుస్తున్నారు. పండుగ సంబరాల పేరుతో నడిరోడ్డుపై నిప్పులు చిమ్ముతూ.. వాటిని వీడియోలు, రీల్స్‌గా చిత్రీకరిస్తున్నారు. అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారుల భద్రతకు ముప్పు ఏర్పడటాన్ని గమనించిన సెంథిల్ కుమార్ వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై బాణసంచా కాల్చడం ప్రమాదకరమని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. వారి చర్యలను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసేందుకు ప్రయత్నించారు. అంతే.. అప్పటివరకు పండుగ సంబరాల్లో ఉన్న యువకుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. హెచ్చరించినందుకు అంతటి కక్షా.? ఒక పోలీసు అధికారి అన్న గౌరవం కూడా లేకుండా ఆ యువకులు సెంథిల్ కుమార్‌పై మూకుమ్మడిగా దాడికి దిగారు. విచక్షణ కోల్పోయి తీవ్రంగా కొట్టారు. ఊహించని ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. కాసేపటి క్రితం వరకు ప్రజల భద్రత కోసం ఆలోచించిన ఆ ఖాకీ అధికారి.. ఇప్పుడు తన ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ విధి మరోలా తలచింది. ఆసుపత్రికి చేరుకునేలోపే సెంథిల్ కుమార్ ప్రాణాలు విడిచారు. ఓ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి.. ఇంటికి చేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. పండుగ వేళ ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు ఆయన మరణవార్త పిడుగులా తగిలింది. దీపావళి దీపాల వెలుగులు నిండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న పోలీసు అధికారి.. చివరకు రోడ్డుపై బాణసంచా కాల్చవద్దని చెప్పినందుకే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు.! ఈ ఘటనపై తమిళనాడు సౌత్ జోన్ ఐజీ విజయేంద్ర బిదారీ తీవ్రంగా స్పందించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక క్రైమ్ బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలించి ఈ హత్యతో సంబంధం ఉన్న ప్రధాన నిందితులతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు, దీపావళి వేళ తమిళనాడు వ్యాప్తంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, బాణసంచా ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పలు ప్రాంతాల్లో పది హత్య కేసులు నమోదుకాగా, బాణసంచా ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అగ్నిమాపక శాఖకు కూడా 160 అత్యవసర కాల్స్ వచ్చాయి.! పండుగ అంటే ఆనందం.. కుటుంబంతో కలిసి గడిపే మధుర క్షణాలు. కానీ ఇతరుల భద్రతను పట్టించుకోకుండా చేసే నిర్లక్ష్యం, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. కేవలం రీల్స్ కోసం నడిరోడ్డుపై బాణసంచా కాల్చడం.. వారించిన వారిపై దాడికి దిగడం ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ఒక్క క్షణం ఆవేశం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక కుటుంబానికి జీవితాంతం కన్నీటిని మిగిల్చింది. ఇది కూడా చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు     [ SI Senthil Kumar Murder,Tamil Nadu News, Theni District,Tamil Nadu Police, Police Officer Killed, Special Sub Inspector, Diwali Murder Case, Diwali Violence, Firecracker Dispute, Firecracker Attack, Social Media Reels, Reels Addiction, Police Officer Attack, Theni Crime News, Tamil Nadu Crime News, Four Arrested, Police Investigation, CCTV Footage, Law and Order, South Zone IG, Vijayendra Bidari ]
భారతీయ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం అరికట్టేందుకు, అవినీతిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పెద్ద నోట్ల రద్దు అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి.  దేశంలో పేరుకుపోతున్న అవినీతిని అంతం చేయాలంటే అత్యున్నత విలువ కలిగిన రూ. 500 రూ.  నోట్లను రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని బలంగా కోరారు. సమాజంలో పారదర్శకత పెరగాలంటే కఠినమైన ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్న నల్లధనం మరియు సమాంతర ఆర్థిక వ్యవస్థ (parallel economy) మూలాలను దెబ్బతీయాలంటే పెద్ద నోట్ల రద్దు ఒక్కటే సరైన మార్గమని ఆయన పలు వేదికల ద్వారా స్పష్టం చేశారు.    ఎన్నికల సమయాల్లో కొందరు అక్రమార్కులు ముంబై లేదా బెంగళూరు వంటి నగరాల నుండి భారీగా నగదు మూటలను తీసుకువచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం రూ. 100 నోట్లతో మాత్రమే లావాదేవీలు జరిగే వాతావరణం వస్తేనే ఎన్నికల్లో డబ్బు పాత్రను పూర్తిగా నియంత్రించవచ్చని ఆయన విశ్లేషించారు.  రాష్ట్ర అభివృద్ది కోసం తాము రేయింబవళ్లు కష్టపడుతుంటే, అక్రమ సంపాదనతో వచ్చే శక్తులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అవినీతి రహిత సమాజం ఏర్పడినప్పుడే ప్రపంచ దేశాల నుండి నిజాయితీగల పెట్టుబడిదారులు ముందుకు వస్తారని, దీనివల్ల రాష్ట్రాలతో పాటు దేశం కూడా ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన బలంగా నొక్కిచెప్పారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావచ్చని చంద్రబాబు సూచించారు. కేవలం నగదు ఆధారిత చెల్లింపుల వల్ల లెక్కల్లో చూపని ఆదాయం పెరిగిపోతుందని, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఆయన పేర్కొన్నారు. అవినీతిపై పోరాటం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణాత్మక చర్యలు ఉండాలని, అందులో భాగంగానే పెద్ద నోట్లపై ఉక్కుపాదం మోపాలని ఆయన అభిప్రాయపడ్డారు.  అప్పట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, ఆర్థిక నిపుణుల మధ్య కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకునే ఇలాంటి కఠిన నిర్ణయాలు దీర్ఘకాలంలో సామాన్యులకు మేలు చేస్తాయని, వ్యవస్థలో సంచలనాత్మక మార్పులకు నాంది పలకగలవని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేశాయి. ఇది కూడా చదవండి: కూర బాగోలేదన్న భర్త.. కత్తితో పొడిచి చంపిన భార్య.. రిటైర్డ్ ఆర్మీ జవాన్ దారుణ హత్య.!   [ Rs. 500 notes should be abolished CM Chandrababu, Chandrababu Naidu statements, demonetization of 500 and 1000 notes, black money curb, AP CM currency ban, digital payments India, corruption free India, Telugu One, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా జరిగితే చాలు.. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా విడాకులు, కుటుంబ సమస్యలు వంటి సున్నితమైన విషయాలపై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వార్తల నేపథ్యంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి చర్చే జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై పవన్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ స్పందించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కష్టాల్లో ఉన్న వ్యక్తిని మరింతగా దూషించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా పవన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె తన పోస్ట్‌లో కొన్ని విషయాలను చాలా ఘాటుగా ప్రస్తావించారు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింతగా తిట్టడం, విమర్శించడం నైతికంగా సరైనది కాదని అన్నారు. ఇప్పటికే కిందపడిపోయిన వ్యక్తిని మళ్లీ తొక్కడం అమానవీయమని పేర్కొన్నారు. వారు ఏ స్థాయిలో ఉన్నా మనలాంటి మనుషులేనని.. ఎవరికో ఒకరికి బిడ్డలని, తల్లిదండ్రులని, తోబుట్టువులని గుర్తుంచుకోవాలని సూచించారు. అంతేకాదు.. తన పోస్ట్‌లో రేణూ దేశాయ్ చెప్పిన ఓ మాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "మనమే ఎన్నో లోపాలున్న గాజు ఇళ్లలో నివసిస్తూ.. ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరకూడదు" అంటూ ట్రోలర్స్‌కు చురకలు అంటించారు. ఎదుటివారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే ముందు మన జీవితాల్లోని లోపాలను కూడా చూసుకోవాలని ఆమె చెప్పకనే చెప్పారు. ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా సంచలన నిర్ణయం.! ఇక ఈ పోస్ట్‌లో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. తాను ఇలా మాట్లాడినందుకు ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని రేణూ స్పష్టం చేశారు. ముఖ్యంగా తనకు ఎలాంటి పేటీఎం పేమెంట్స్ రాలేదని సెటైరికల్‌గా పేర్కొన్నారు. తన మెదడులో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా పనిచేస్తోంది కాబట్టే మానవత్వంతో స్పందిస్తున్నానంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో తన పోస్ట్‌ను చూసి అనవసరమైన ఊహాగానాలు చేయొద్దని కూడా ముందుగానే హెచ్చరించారు. తాను చెప్పాలనుకున్నది కేవలం సమాజంలో మనుషులకు ఉండాల్సిన కనీస దయ, సానుభూతి గురించేనని స్పష్టం చేశారు. కాగా పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2012లో విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో ఇద్దరూ తమ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పవన్, అన్నా లెజినోవా విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రేణూ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. మీకు నచ్చవచ్చు: రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. అలా అంటారనే ఆరోజు మౌనంగా ఉన్నా.! బిగ్ ట్విస్ట్.. విడాకుల తర్వాత మళ్ళీ కలిసిపోయిన స్టార్ కపుల్.?       [Renu Desai Instagram Post, Pawan Kalyan Anna Lezhneva Divorce, Pawan Kalyan Divorce, Pawan Kalyan Separation, Pawan Kalyan, Anna Lezhneva, Renu Desai, Divorce News, Telugu Film News]  
డైరెక్టర్.. సినిమాని ఫ్యాషన్ గా, ప్రాణంగా భావించి ఎంతో కష్టపడి తొలి అవకాశం సంపాదిస్తాడు. సూపర్ హిట్ కూడా అందుకొని ప్రేక్షకులు, సినీ ప్రేమికుల మనసుల్లో తెలుగు సినిమాకి మంచి క్రియేటివిటీ ఉన్న  డైరెక్టర్ వచ్చాడు. ఇక మనకి  తన నుంచి వచ్చే ప్రతి సినిమా సరికొత్త సినీ పండుగని తీసుకొస్తుందని భావిస్తుంటారు.  కానీ  రెండో సినిమా లేదా ఆ తదుపరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొడుతున్నాయి. పైగా సినిమాలు  పూర్తి చేయడానికి 3 నుండి 6 ఏళ్ల సుదీర్ఘ సమయం తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. అసలు తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన దర్శకుల క్రియేటివిటీ ఆ తర్వాత ఎందుకు తగ్గిపోతోంది? వారి వరుస వైఫల్యాలు లేదా ఆలస్యాల వెనుక ఉన్న అసలైన పరిశ్రమ సమీకరణాలు ఏమిటో లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి సినిమా విజయం వెనుక దర్శకుడు ఏళ్ల తరబడి పడ్డ కష్టం, సుదీర్ఘమైన స్క్రిప్ట్ వర్క్ ఉంటాయి. దర్శకుడి వద్ద 5 నుంచి 10 ఏళ్లుగా రూపుదిద్దుకున్న ఒకే ఒక్క అత్యుత్తమ ఐడియా లేదా కలల ప్రాజెక్టుని  తొలి సినిమాగా తెరకెక్కిస్తారు. కానీ ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వగానే పరిశ్రమ వారిపై ఉంచే అంచనాల భారం ఊహించని రీతిలో పెరిగిపోతుంది.   ఇది కూడా చదవండి: సినిమా హీరోలకి పోలీసుల వార్నింగ్: కలికాలం అంటే ఇదే మరి!   మొదటి సినిమాకు దక్కిన విజయం ఇచ్చే ‘సెకండ్ సినిమా ఫోబియా’ వారి సృజనాత్మకతను ఒత్తిడికి గురిచేస్తుంది. దాంతో రెండవ కథను ఎంచుకునే క్రమంలో తీవ్రమైన అయోమయం నెలకొంటుంది. మొదటి చిత్రానికి ఉన్న సహజమైన డెడికేషన్, సమయం రెండో సినిమా స్క్రిప్ట్‌కు లభించకపోవడం వల్ల కథనం బలహీనపడి డిజాస్టర్లుగా మారుతుంటాయి. దీనికి తోడు ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్, పెరిగిన బడ్జెట్ సమీకరణాలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు తొలి హిట్ తర్వాత వెంటవెంటనే సినిమాలు చేసిన దర్శకులు, ఇప్పుడు స్టార్ హీరోల కాల్‌షీట్లు దక్కించుకోవాలనే మోజులో భారీ కాన్వాస్ వైపు పరుగులు తీస్తున్నారు.100 కోట్ల నుంచి  400 కోట్ల దాకా భారీ బడ్జెట్‌లతో ప్రాజెక్టులను నిర్మించడం వల్ల నిర్మాణం పూర్తి కావడానికి 2 నుండి 3 ఏళ్ల సమయం పడుతోంది. ఈ క్రమంలో కథలో ఉండాల్సిన అసలైన ఎమోషన్, స్క్రీన్‌ప్లే బలం కంటే విజువల్ గ్రాండియర్, మాస్ ఎలివేషన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు.   అలాగే మార్కెట్ ఒత్తిళ్లు కూడా వీరి క్రియేటివిటీని దెబ్బతీస్తున్నాయి. మొదటి సినిమా విజయం సాధించగానే స్టార్ హీరోలు, కార్పొరేట్ నిర్మాతలు ఆ దర్శకుడి చుట్టూ చేరి తమ ఇమేజ్, బిజినెస్ లెక్కలకు అనుగుణంగా మార్పులు చేయాలని ఒత్తిడి తెస్తారు. దీనివల్ల దర్శకుడు తన సొంత శైలిని, కథ చెప్పే విధానాన్ని కోల్పోయి వాణిజ్య సూత్రాల ఉచ్చులో పడిపోతాడు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా భారీ సినిమాలు లేదా స్టార్ హీరో చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో చిన్న, మధ్యస్థాయి కంటెంట్ ఆధారిత సినిమాలకు స్కోప్ తగ్గిపోతోంది. ఫలితంగా క్రియేటివిటీ తగ్గడం కంటే కూడా, విపరీతమైన అంచనాలు, మారిన ప్రేక్షకు అభిరుచికి తగ్గట్టుగా అప్‌డేట్ కాకపోవడం, మరియు భారీ బడ్జెట్ అదుపు తప్పడమే ఈ ‘వన్ ఫిలిం వండర్స్’ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కాకపోతే మొదటి సినిమా తర్వాత హిట్ అందుకున్న దర్శకులు కూడా ఉన్నారు. కానీ మెజారిటీగా కనపడే విషయమే ఎప్పుడు రాజ్యమేలుతుఉంటుంది.  మీకు నచ్చవచ్చు :నయనతారకి షాక్!     [Why Telugu Directors Fail After First Hit, Telugu Directors Failure, Tollywood One Film Wonders, First Movie Success Reasons, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
హీరో.. స్క్రీన్ పై విలన్స్ ని తుక్కు రేగకొడతాడు.. తొక్కి నార కూడా తీస్తాడు. దీంతో బయట కూడా హీరోని హీరోలాగే కొలిచే అభిమానులకి కొదవ ఉండదు. ఇప్పుడు ఆ అభిమానమే హీరో పాలిట శాపంగా మారింది. ఈ మాటని స్వయంగా పోలీసులే చెప్తుండటంతో పాటు చిన్న సైజు వార్నింగ్ కూడా ఇస్తున్నారు.     బాలీవుడ్ చిత్ర పరిశ్రమను వణికిస్తున్న వరుస సంఘటనల నేపథ్యంలో ముంబై పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రముఖ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన సంచలనాత్మక కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ముంబైలోని రద్దీ ప్రాంతమైన జుహులోని పుష్పా పార్క్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఫుట్‌బాల్ మ్యాచ్ ముగించుకుని తన లగ్జరీ బీఎండబ్ల్యూ కారులో టైగర్ ష్రాఫ్ వెళుతుండగా, బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.   క్షణాల వ్యవధిలో ఏకంగా ఐదు రౌండ్ల పాటు కాల్పులు జరపడంతో సినీ వర్గాల్లో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. మొదట ఈ శబ్దాలను గమనించిన స్థానికులు దీపావళి టపాసులు పేలుస్తున్నారని భావించినప్పటికీ, తర్వాత అది తుపాకీ కాల్పులని తేలడంతో షాక్‌కు గురయ్యారు. ఈ ఉద్దేశపూర్వక దాడిలో అదృష్టవశాత్తు టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడినప్పటికీ, ఆయన డ్రైవర్ తో పాటు మరో ఆటోరిక్షా డ్రైవర్ గాయపడ్డారు. ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం, అభిమానులు గుమికుడి ఉండటమే. దీంతో దుండగులు వాళ్ళలోకి ప్రవేశించి ఈ దాడి చేసారు.  దీంతో  హీరోలు ఎవరు అభిమానులతో కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదని,   సెల్ఫీలు, ఫోటోలు దిగకూడదని, అసలు రద్దీ ప్రాంతాలకి వెళ్లకూడదని కఠినమైన భద్రతా మార్గదర్శకాలని జారీ చేశారు. నటీనటులు తమ పబ్లిక్ మూవ్‌మెంట్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హెచ్చరించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా హీరోల అభిమానులు కలికాలం అంటే ఇదేనని  తెగ బాధపడుతున్నారు. మరి ఆ బాధ ఏంటో తెలిసిందే కదా!    మీకు నచ్చవచ్చు: సీన్ ఎందుకు హిట్ అయ్యిందో తెలుసా!   Tiger Shroff Firing Mumbai Police Alert, tiger shroff firing, mumbai police alert, bollywood security, lawrence bishnoi gang, juhu shooting incident  
ఓటీటీలో చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మా ఊరి పొలిమేర’.. ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ‘పొలిమేర 2’తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. చేతబడి, క్షుద్రపూజలు, ఊహించని మలుపులతో సాగిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ సిరీస్ నుంచి ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. అయితే ఈసారి కథను మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఏకంగా నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి సందర్భంగా వచ్చిన ఈ గ్లింప్స్‌లో ఆయన ‘విరావి’ అనే శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించారు. పాడుబడిన ఆలయంలోని చీకటి ప్రదేశాలు, అమావాస్య వాతావరణం, విష్ణుమూర్తి నుంచి పరమశివుడికి మారే దృశ్యాలు, అనంత పద్మనాభస్వామి దర్శనంతో గ్లింప్స్ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత కొమరయ్య పాత్రలో సత్యం రాజేశ్ క్షుద్రపూజలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో చేతిలో పదునైన కత్తి పట్టుకుని, గంభీరమైన యోధుడి వేషధారణలో అర్జున్ సర్జా ఎంట్రీ ఇస్తారు. ఆయన లుక్, హావభావాలు పాత్రపై ఆసక్తిని పెంచుతున్నాయి. కొమరయ్య చేసే క్షుద్రపూజలకు అడ్డుకట్ట వేసే వ్యక్తిగా విరావి కనిపించబోతున్నాడనే సంకేతాలు గ్లింప్స్‌లో కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి రెండు భాగాలకు కూడా ఆయనే దర్శకత్వం వహించగా.. మూడో భాగానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వంశీ నందిపాటి, భరత్ నారంగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కృష్ణ ప్రసాద్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. సత్యం రాజేశ్‌తో పాటు బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు తమ పాత పాత్రల్లోనే కనిపించనున్నారు. ఇటీవల ‘బ్లాస్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్జున్ సర్జా.. ఇప్పుడు ఈ మిస్టిక్ థ్రిల్లర్‌లో భాగం కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు చేరువైన ‘పొలిమేర’ ఫ్రాంచైజీని ఈసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సిరీస్‌ను మరింత విస్తృతమైన ప్రేక్షకులకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొమరయ్యగా సత్యం రాజేశ్, విరావిగా అర్జున్ సర్జా మధ్య ఎలాంటి పోరు ఉండబోతోంది? ఈ ఇద్దరి పాత్రల చుట్టూ కథ ఎలాంటి మలుపులు తిరగనుంది? అన్న ఆసక్తి తాజా గ్లింప్స్‌తో పెరిగింది. సినిమా విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.     [Polimera 3, Arjun Sarja, Satyam Rajesh, Polimera 3 Glimpse, Viraavi Character, Komaraiah, Dr Anil Vishwanath, Kamakshi Bhaskarla, Baladitya, Getup Srinu, Rakendu Mouli, Telugu Mystic Thriller, Polimera 3 Pan India Release]
Hombale Films is expanding its diverse slate of ambitious Indian cinema by teaming up with Transcendental Films for an animated project titled Saranagati – The Life of a Surrendered Soul. The production house is bringing a culturally rooted narrative to the mainstream following its history of massive pan-India blockbusters.  This cinematic tribute honors the extraordinary life and spiritual mission of His Divine Grace A. C. Bhaktivedanta Swami Srila Prabhupada, the Founder-Acharya of the International Society for Krishna Consciousness. The venture aims to celebrate his complete surrender and lasting legacy. The narrative traces the inspiring journey of this revered spiritual leader who traveled from India to America in 1965. Carrying the timeless teachings of the Bhagavad-gītā, he was guided by his spiritual master to spread the divine message of Lord Krishna. His remarkable mission eventually introduced Krishna consciousness to millions across the globe. This story serves as a powerful testament to his unwavering faith, extreme perseverance, and selfless service. This animation feature integrates state-of-the-art AI Motion Capture technology to elevate the visual storytelling experience. By combining computer vision and artificial intelligence, the production captures real human expressions and gestures to map them onto 3D character skeletons.  Also Read: Ramayana creates history on First Monday This advanced technique ensures that the digital characters deliver incredibly natural performances. It creates a deeply immersive world that bridges modern filmmaking capabilities with profound civilizational wisdom. The movie is written and directed by Gaura Shakti Dasa, with production spearheaded by Rajesh Singh and Lohith Rao. Sridhar Shikaripura serves as the Visual Director for this Transcendental Films production, developed in association with Dive Deep AI Studio. Hombale Films is presenting and distributing the project worldwide with the blessings of Sri Narasingha Chaitanya Matha, ISKCON Bangalore, ISKCON, and the Bhaktivedanta Book Trust. The movie is scheduled for a global theatrical release in August 2027. Check Out: Shocking: Pawan Kalyan and Anna Konidela announce divorce                      Yash shares adorable family moments from Ramayana sets   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
సినిమా... ఇది ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి లైఫ్ లో బాగుపడే మెసేజ్ కూడా ఇస్తుంది. ఇవన్నీ సినిమా మనకి అందించాలంటే ఎంతో మంది రేయింబవళ్ళు  కష్టపడాలి. పెపైచ్చు చాలా ఖరీదైన వ్యాపార సామ్రాజ్యం అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.  తాజాగా ENE రిపీట్ 2 దర్శకుడు తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూ లో తన సినీ ప్రయాణం, ఎదురుచూపులు, ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సవాళ్లు మరియు విజయాల వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలను పంచుకున్నారు. కేవలం సాధారణ చిత్రాలు కాకుండా, నేటి యూత్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త కథలతో ముందుకు వెళ్తున్న తరుణ్ భాస్కర్ ఆలోచనల వెనుక పెద్ద కష్టమే దాగుంది. ఒక సాధారణ షార్ట్ ఫిలిం మేకర్‌గా కెరీర్ ప్రారంభించి, ఇండస్ట్రీలో ఎవరి సహాయం లేకుండా తన ప్రతిభను నమ్ముకుని అడుగుపెట్టిన ఆయన ప్రయాణం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. మొదటి సినిమా 'పెళ్లిచూపులు'తోనే నేషనల్ అవార్డులు సాధించి టాలీవుడ్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా యూత్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.    ఇది కూడా చదవండి: నయనతారకి షాక్ లపై షాక్‌లు.. క్రేజ్ ఉంది కానీ...!   చిత్రాల రూపకల్పనలో ఆయన పడిన కష్టం, నటీనటుల ఎంపికలో ఆయన అనుసరించిన విధానం ఇంటర్వ్యూలో హైలైట్‌గా నిలిచాయి. పరిశ్రమలో తనకంటూ ఒక జోనర్ సృష్టించుకోవడానికి ఆయన ఏకంగా వందల గంటల స్క్రిప్ట్ వర్క్ మరియు గ్రౌండ్ రీసెర్చ్ చేసినట్లు తెలిపారు. సినిమా రంగంలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికీ తరుణ్ భాస్కర్ ప్రయాణం ఒక చక్కటి పాఠం. కేవలం కమర్షియల్ హంగుల వెళ్లకుండా, సహజమైన పాత్రలు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే సంభాషణలతో సినిమాలను ఎలా తెరకెక్కించవచ్చో ఆయన నిరూపించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి కూడా మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు కోరుకునే విభిన్నమైన జోనర్లను టచ్ చేస్తూనే, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.  వెంట వెంటనే సినిమాలు తెరకెక్కించడానికి సినిమా అనేది సబ్బుల వ్యాపారం కాదు కదా! టాలీవుడ్ భవిష్యత్తును మార్చడంలో యువ దర్శకుల పాత్ర ఎంత కీలకమో ఆయన తన అనుభవాల ద్వారా పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సినిమా వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ENE రిపీట్ 2 ఈ నెల 19 న విడుదల కాబోతుంది.    మీకు నచ్చవచ్చు : ఆ హీరో స్టార్ పవర్ అదుర్స్!   [Tharun Bhascker Exclusive Interview, Tharun Bhascker, Telugu360 exclusive, Tollywood director, Pelli Choopulu, Ee Nagaraniki Emaindhi, Telugu cinema interview, Telugu cinema news,Telugu Cinema News, Latest Telugu Film News, TeluguOne Cinema News, TeluguOne Film News, TeluguOne]  
అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఇట్లు అర్జున’. అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్‌లో నాగార్జునతో పాటు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, అఖిల్ పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమాలో హీరో అనీష్ మూగవాడి పాత్రలో నటిస్తున్నారు. తొలి సినిమాతోనే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకోవడంపై నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. అనీష్ తన సినిమా గ్లింప్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగారని, అది తనకు నచ్చడంతో వాయిస్ ఓవర్ ఇచ్చానని నాగ్ తెలిపారు. అయితే డెబ్యూ సినిమాకే మూగవాడి పాత్ర చేయడం అవసరమా? అని తాను అనీష్‌ను అడిగానని చెప్పారు. ఎందుకంటే అలాంటి పాత్రల్లో మాటలు లేకపోయినా కళ్లతో, శరీర భాషతో భావాలను పలికించాల్సి ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, అఖిల్ సినిమాలను ఉదాహరణగా చెబుతూ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో చెవిటి వ్యక్తి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టిందని, అఖిల్ తన ఆరో సినిమా ‘లెనిన్‌’లో అంధుడి పాత్రలో నటించాడని గుర్తుచేశారు. ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేయడం అంత సులభం కాదని అనీష్‌కు చెప్పానన్నారు. అయితే అనీష్ తన పాత్రలో పూర్తిగా లీనమై నటించాడని, కళ్లతోనే మాట్లాడాడని ప్రశంసించారు. అతడి మౌనం కూడా తెరపై ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక సినిమా చూసిన తర్వాత తాను ఎంతో ఆశ్చర్యపోయానని నాగార్జున వెల్లడించారు. అనీష్ అద్భుతంగా నటించాడని, తెరపై అనీష్‌, అనశ్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుందని చెప్పారు. దర్శకుడు మహేష్ ఉప్పాల, నిర్మాత వెంకీ కుడుముల సహా సాంకేతిక బృందం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారని ప్రశంసించారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు తనకు బాగా నచ్చాయని, ‘లెనిన్’ సినిమాకు కూడా ఇలాంటి మంచి పాటలు ఇవ్వలేదేంటి అంటూ తమన్‌తో సరదాగా అన్నానని తెలిపారు. ఇది కూడా చదవండి: నలుగురు మహిళలపై లైంగిక దాడులు చేసిన న‌టుడు.. క‌ఠిన శిక్ష విధించిన కోర్టు.! ఈ వేడుకకు హాజరైన రామ్ చరణ్ గురించి కూడా నాగార్జున ప్రత్యేకంగా మాట్లాడారు. తాను కలిసిన మంచి మనుషుల్లో చరణ్ ఒకరని, ఎంతో హుందాగా, వినయంగా ఉంటారని ప్రశంసించారు. తాను రామ్ చరణ్‌ను పెద్దబ్బాయి అని పిలుస్తానని, కానీ చరణ్ మాత్రం తనను అన్నయ్య అని పిలుస్తాడని సరదాగా చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదని పేర్కొంటూ రామ్ చరణ్‌ను తన తమ్ముడిగా పరిచయం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ రాలేకపోయారని, అయితే ‘ఇట్లు అర్జున’ ట్రైలర్‌ను ఆయనే లాంచ్ చేశారని నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘ఇట్లు అర్జున’ సినిమాపై నాగార్జున ఎంతో నమ్మకంగా ఉన్నారు. అనీష్ నటన, అనశ్వర రాజన్‌తో కెమిస్ట్రీ, తమన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 13న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రేక్షకుల ఆశీస్సులు కోరారు. ఒక కొత్త హీరో తన తొలి సినిమాతోనే మూగవాడి పాత్రను ఎంచుకుని మెప్పించాడంటూ నాగార్జున చేసిన ప్రశంసలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి ఈ విభిన్నమైన కథతో ‘ఇట్లు అర్జున’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: విడుదలకు సిద్ధమైన మోహన్‌లాల్ సినిమా.. ఇంతలోనే విషాదం.!        [Akkineni Nagarjuna Speech, Itllu Arjuna Movie, Ram Charan Rangasthalam, Akhil Lenin Movie, Aneesh Itllu Arjuna, Anaswara Rajan, Nagarjuna Ram Charan, Nagarjuna Akhil, Venkuy Kudumula, Mahesh Uppala, Thaman Music, Itllu Arjuna Musical Concert, Telugu Cinema News]
టాలీవుడ్‌, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రానికి ‘ఆర్ఎక్స్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రెజీనా పసుపు రంగు చీరలో రద్దీగా ఉన్న రైలులో ప్రయాణికుల మధ్య నిలబడి కనిపిస్తున్నారు. ఆమె ముఖంలో కనిపిస్తున్న గంభీరమైన భావాలు, పోస్టర్‌పై ఉన్న ప్రత్యేకమైన డిజైన్ సినిమా కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ పోస్టర్‌లో ‘ట్రూత్ ఆల్వేస్ డిమాండ్స్ ఏ వాయిస్’ (నిజానికి ఎప్పుడూ ఒక గొంతుక అవసరం) అనే ట్యాగ్‌లైన్‌ను ఉంచారు. అలాగే గుండె స్పందనలను సూచించే ఈసీజీ తరహా గీతలు కూడా పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఏదో బలమైన అంశాన్ని, నిజం కోసం పోరాటాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. ఈ సినిమా గురించి రెజీనా కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కథలు కేవలం సినిమాలుగా మిగిలిపోవని, సమాజంలో చర్చించాల్సిన విషయాలను, వినిపించాల్సిన గొంతుకలను, వెలుగులోకి రావాల్సిన వాస్తవాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాయని పేర్కొన్నారు. ‘ఆర్ఎక్స్‌’ తనకు ఎంతో ప్రత్యేకమైన సినిమా అని, ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఈ చిత్రంలో రెజీనా ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సిల నేరంగళిల్ సిల మనిధర్గల్’, ‘బాంబ్‌’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈసారి ‘ఆర్ఎక్స్‌’తో మరో కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో రెజీనాతో పాటు నాజర్, రమేష్ తిలక్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరిహరన్ రాజు కథ అందించగా, ఆశమీర అయ్యప్పన్ సంభాషణలు రాశారు. ఇది కూడా చదవండి: ‘విజయ్‌లా రాజకీయాల్లోకి వస్తారా?..’ అభిమానుల ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన సూర్య.!  ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు చెందిన జీ స్క్వాడ్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, లోకేష్ కనగరాజ్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సెల్వకుమార్ ఎస్‌కే సినిమాటోగ్రఫీ, జీకే ప్రసన్న ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ‘ఆర్ఎక్స్‌’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం విడుదలకు సంబంధించిన తదుపరి వివరాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్‌తో పాటు రెండో లుక్ పోస్టర్ కూడా విడుదల కావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. రెజీనా ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారా? నిజం కోసం గొంతెత్తే కథలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా సంచలన నిర్ణయం.. పరస్పర అంగీకారంతో విడిపోయిన జంట!     [Regina Cassandra RX Movie, Regina Cassandra First Look, RX Movie 2026, Lokesh Kanagaraj G Squad, Mythri Movie Makers, Regina Cassandra Latest Movie, Vishal Venkat Director, Nasser RX Movie, Ramesh Thilak, Hesham Abdul Wahab, Regina Cassandra New Film, RX Movie Poster]
హీరోలకి మేము ఎందులోను తీసిపోము అనే రీతిలో నయనతార లేడీ సూపర్ స్టార్ హోదాలో తన చరిష్మాని సుదీర్ఘ కాలం నుంచి కొనసాగిస్తూ వస్తుంది. బడా హీరోలు ఏరి కోరి తమ సినిమాలో నయన్ ఉండాలని పట్టుబడతారంటే ఆ కట్ అవుట్ కెపాసిటీ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.   ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద  మంచి విజయాన్ని సాధించి  ఘనమైన ఆరంభాన్నిచ్చింది.కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లను సాధించడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా భారీ అంచనాల నడుమ సుందర్ సి దర్శకత్వంలో ఈ నెల 6 న రిలీజైన డివోషనల్ డ్రామా 'మూకుత్తి అమ్మన్ 2' (మహాశక్తి) చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. దీపావళి సీజన్‌లో విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, తొలి వారాంతం ముగిసినా కనీసం 10 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా దాటలేకపోవడం సినీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. దీనికి తోడు ఆగస్టు నెలలో విడుదలైన 'హాయ్' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. కెమెరా ముందు నటిగా మాత్రమే కాకుండా, కెమెరా వెనుక నిర్మాతగా తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' (LIK) సైతం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.   ఇది కూడా చదవండి: ఆ హీరో స్టార్ పవర్ అదుర్స్: వాళ్ళు దాన్నే ఫాలో అవ్వాలి..వర్మ వ్యాఖ్యలు వైరల్  పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యష్ 'టాక్సిక్' చిత్రంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, ఆ సినిమా ఫలితం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో నయన్ మార్కెట్ సమీకరణాలపై చర్చ మొదలైంది.  సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్, భారీ రెమ్యునరేషన్లు ఉన్నప్పటికీ ఆ క్రేజ్ ఇప్పుడు థియేటర్లలో టికెట్లుగా, కలెక్షన్లుగా మారడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, కేవలం కొన్ని చిత్రాల ఫలితాలతో టాలెంటెడ్ నటి అయిన నయనతార స్టార్‌డమ్‌ను తక్కువ అంచనా వేయలేమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రానున్న ప్రాజెక్ట్‌లతో ఆమె స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.   మీకు నచ్చవచ్చు :నరకానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది మీకు నచ్చవచ్చు:మళ్ళీ వస్తాయా? ఆ అద్భుతమైన మ్యూజికల్ హిట్ చిత్రాలు!   [Nayanthara Recent Box Office Failures, Nayanthara, Lady Superstar, Mookuthi Amman 2, Box Office Failures, Nayanthara movies, Tollywood news, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]    
పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌, ఆయన భార్య అన్నా కొణిదెల విడిపోతున్నట్లు ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ వార్త బయటకు వచ్చిన కొద్దిసేపటికే అన్నా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసలు ఆమె సోషల్ మీడియాకు ఎందుకు దూరమయ్యారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. పవన్‌ కల్యాణ్‌, అన్నా కొణిదెల సోమవారం రాత్రి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఎంతోకాలం కలిసి జీవించిన తర్వాత పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమ వైవాహిక బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని, పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ వ్యక్తిగత పరిణామాన్ని అర్థం చేసుకుని తమ ప్రైవసీని గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు. ఇక ఈ ప్రకటన వెలువడిన తర్వాత అన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి గత కొంతకాలంగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. పవన్‌ కల్యాణ్‌తో ఉన్న ఫొటోలు, కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పోస్టులు పెట్టేవారు. అంతేకాదు.. పవన్‌ ఇంటి పేరును స్వీకరించడం, కుటుంబ సభ్యులతో గడిపిన సందర్భాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా ఖాతా డీయాక్టివేట్ కావడం చర్చకు దారితీసింది. ఇది కూడా చదవండి: మూడు సార్లు రిజెక్ట్ చేశాను.. 12 ఏళ్ల త‌ర్వాత అత‌ని కోస‌మే మేక‌ప్ వేసుకున్నాను.! అన్నా కొణిదెల ఈ ఏడాది మార్చిలో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. అప్పట్లో పవన్‌ కల్యాణ్‌ కూడా ఆమెకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె పెట్టిన పోస్టులు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా పవన్‌ రాజకీయ ప్రయాణం, కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలను ఆమె పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పుడు విడిపోతున్నట్లు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆమె ఖాతాను డీయాక్టివేట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్‌ కల్యాణ్‌, అన్నా లెజినోవా 2013 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు 13 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయం వెనుక కారణాలను మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. తమ పిల్లల సంతోషం, భవిష్యత్తే ముఖ్యమని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అన్నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం కూడా ఈ వ్యక్తిగత పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తున్నప్పటికీ, దానిపై ఆమె నుంచి ప్రత్యేక వివరణ రాలేదు. మీకు నచ్చవచ్చు: నలుగురు మహిళలపై లైంగిక దాడులు చేసిన న‌టుడు.. క‌ఠిన శిక్ష విధించిన కోర్టు.!     [Anna Konidala, Anna Konidala Instagram Deactivated, Pawan Kalyan Anna Separation, Pawan Kalyan Divorce News, Anna Lezhneva Latest News, Pawan Kalyan Wife News, Anna Konidala Instagram, Pawan Kalyan Family News, Pawan Kalyan Separation Announcement, Telugu Cinema News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆరోగ్యానికి  శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే  సూత్రాలివి..!   నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయి రకరకాల వ్యాయామాలు, డైట్లు చేయడం సర్వసాధారణమైంది. అయితే సరైన అవగాహన లేకుండా చేసే కొన్ని పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ప్రాణాలను బలిగొంటున్న సమస్య గుండె జబ్బులు.. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే గుండె సమస్యలకు కూడా కారణం అవుతాయి. అవేంటో,  వైద్యులు వాటి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. నీరు.. రోజూ ఎంత నీరు తాగాలి అనే విషయంలో చాలా మందిలో రకరకాల అపోహలు ఉన్నాయి. రోజుకు ఐదు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగాలని కొందరు ప్రచారం చేస్తుంటారు. కానీ వైద్యపరంగా ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అవసరానికి మించి విపరీతంగా నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం , పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల హైపోనేట్రిమియా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంది. కేవలం ఒకటి రెండు లీటర్లకే నీటిని తాగడం  పరిమితం కాకుండా, ఎవరి శారీరక శ్రమ , వాతావరణ పరిస్థితులను బట్టి నీటి మోతాదు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం తాగే కేవలం మంచినీళ్లే కాకుండా, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సూప్స్, టీ, కాఫీ , ఇతర పానీయాలన్నీ కూడా శరీరానికి అందే ద్రవాల జాబితాలోనే లెక్కలోకి వస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన మూత్రం రంగు చక్కటి సూచికగా పనిచేస్తుంది. మూత్రం మరీ తెలుపుగా లేదా ముదురు పసుపు రంగులో కాకుండా, లేత పసుపు రంగులో ఉంటే శరీరం సరైన హైడ్రేషన్ స్థితిలో ఉన్నట్లు భావించవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని పాటించాలి. ఆహారం.. ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, మనం రోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ , ఇతర ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయం పూట తినే చాకోస్ లేదా రెడీమేడ్ సీరిల్స్ పాలలో కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం అనుకుంటాం. కానీ వాటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం ఎక్కువగా ఉండి, శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుండటం వల్ల అనారోగ్యకరమైన ఆహారం వైపు మనసు మళ్లుతుంది. దానికి బదులుగా ఉడికించిన గుడ్లు, మల్టిగ్రెయిన్ ఆహారాలు, ఇడ్లీ వంటి ప్రొటీన్తో కూడిన అల్పాహారం ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.  ఇది కూడా చదవండి మనసుపై ఒత్తిడి.. గుండెకు ప్రమాదం! అసలు నిజం ఇదే! అలాగే మనం ఇష్టపడి తినే బిర్యానీ, ఫ్రైస్ , బయట దొరికే టిఫిన్లు ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతాయి. ఏ ఆహారాన్ని అయినా ఇంట్లో తక్కువ నూనెతో, సహజమైన పద్ధతిలో వండుకుంటే అది ఆరోగ్యకరమైనదే అవుతుంది. హోటళ్లలో లేదా బయట లభించే తినుబండారాలు త్వరగా తయారవ్వడం కోసం ఎక్కువగా నూనెను వాడతారు. వీటిని అప్పుడప్పుడు రుచి కోసం తీసుకోవడంలో తప్పు లేదు కానీ, రోజూ  అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదు. అన్నం తినే విషయంలో కూడా వండే పద్ధతిని మార్చుకోవడం ద్వారా గ్లైసమిక్ ఇండెక్స్ ను తగ్గించవచ్చు. అన్నం వండేటప్పుడు గంజి వార్చడం మన పూర్వీకుల కాలం నుంచి ఉన్న పద్ధతి. దీని వల్ల అన్నంలో గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఇది షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుందట. వ్యాయామం.. ఫిట్నెస్ , మారథాన్ల పేరుతో విపరీతంగా శ్రమించడం, అలాగే రోజూ గంటల తరబడి ఒకే పొజిషన్ లో  కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఆఫీసుల్లో పని చేసేవారు లేదా సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి కాస్త నడవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎవరి సలహాలనో గుడ్డిగా అనుసరించకుండా, మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటూ సరైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.   మీకు నచ్చవచ్చు   ఆహారం తినేటప్పుడు.. మీకు ఈ జబ్బు ఉందేమో చెక్ చేస్కోండి..!                                                                                                                                            *రూపశ్రీ.
  శరీరంలో కఫం పేరుకుపోవడం వల్ల చాలామంది నిత్య జీవితంలో ఎన్నో రకాల శ్వాసకోశ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మారుతున్న కాలం, వాతావరణంలో వచ్చే మార్పులు, వివిధ రకాల అలర్జీల కారణంగా ముక్కు దిబ్బడ, గొంతులో గరగర, ఛాతీలో కఫం గడ్డకట్టుకోవడం వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రకరకాల మందులు, యాంటీబయోటిక్స్ వాడుతుంటారు.  వీటి వల్ల తాత్కాలికంగా ఫలితం కనిపిస్తుంది కానీ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన ఇంట్లోనే దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో  తయారు చేసుకునే పానీయం  తాగడం వల్ల ఈ సమస్యను  శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.  ఇంతకూ ఈ పానీయం ఏమిటి? దాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి?  ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కఫం.. మన శరీరంలో కఫం అనేది ఊపిరితిత్తులు, గొంతు, సైనస్ లేదా ముక్కు భాగాల్లో ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ పేరుకుపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమే కాకుండా శరీరం ఎంతో అలసటకు గురవుతుంది. దీనిని నివారించడానికి వంటింట్లో లభించే నాలుగు ముఖ్యమైన పదార్థాలతో ఒక అద్భుతమైన పానీయం తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు..  తేనె.. తేనెలో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతులో ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. గొంతును ప్రశాంతంగా ఉంచుతూ, పేరుకుపోయిన గట్టి కఫాన్ని పల్చగా మార్చడానికి తేనె ఎంతగానో సహాయపడుతుంది.  అల్లం.. అల్లంలో జింజిరాల్స్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఒక సహజమైన డికంజస్టెంట్ లా పనిచేస్తుంది. గొంతులో , చాతిలో పేరుకుపోయిన మందపాటి కఫాన్ని కరిగించి, అది సులభంగా శరీరం నుంచి బయటకు వచ్చేలా చేయడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది వాపులను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మిరియాలు.. మిరియాలు ముక్కు మార్గాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అక్కడ చిక్కుకున్న కఫాన్ని కరిగించి బయటకు పంపడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా, అల్లం , తేనెలోని పోషకాలు శరీరం త్వరగా గ్రహించేలా మిరియాలు సహాయపడతాయి. నిమ్మరసం.. నిమ్మరసంలో విటమిన్ సి  పుష్కలంగా  ఉండటం వల్ల ఇది శరీరానికి మంచి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. కఫానికి కారణమయ్యే అలర్జీలను అరికట్టి, గొంతు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా రక్షణ కల్పిస్తుంది. పై నాలుగు పదార్థాలను ఉపయోగించి ఈ కింది రెండు పద్ధతుల్లో దేనినైనా ఫాలో అవుతూ మంచి ఫలితం పొందవచ్చు.. మొదటి పద్దతి.. ఒక టీస్పూన్ తేనె తీసుకుని, అందులో తాజా అల్లం రసం లేదా అల్లం పొడి కలపాలి. ఆ తర్వాత చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి నేరుగా తీసుకోవాలి. ఇది గొంతులో కఫం ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం ఇస్తుంది. రెండవ పద్ధతి.. ఒక కప్పు నీటిని కొద్దిగా వేడి చేసి, అందులో అల్లం పొడి లేదా తురిమిన అల్లం, చిటికెడు మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం వేయాలి. చివరగా ఒక టీస్పూన్ తేనె జోడించి బాగా కలపాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తేనె కలిపిన తర్వాత నీటిని మరిగించకూడదు. ఈ డ్రింక్ ను గోరువెచ్చగా ఉన్నప్పుడు నెమ్మదిగా తాగితే గొంతుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పైన చెప్పుకున్న రెమిడీని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే తీసుకుంటే రాత్రంతా పేరుకుపోయిన కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకుంటే నిద్రలో కఫం అడ్డుపడకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తే ముక్కు దిబ్బడ, గొంతు సమస్యలు పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది.                                     *రూపశ్రీ.
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)