LATEST NEWS
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాను ప్రభావం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. బలమైన గాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాను పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. అక్టోబర్ 28వ తేదీ ఉదయం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని హెచ్చరించింది.  చెట్లు నేలకొరిగి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం.! తుఫాను ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖ నగరంలో చెట్లు విరిగిపడటం, రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే, నగరంలో ఎక్కడెక్కడ చెట్లు నేలకొరిగాయి? ఎన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది? అనే వివరాలపై అధికారిక సమాచారం ధ్రువీకరించాల్సి ఉంది. తీర ప్రాంతాలకు హెచ్చరికలు.. అప్రమత్తమైన యంత్రాంగం. ! తుఫాను ముప్పును దృష్టిలో ఉంచుకుని విపత్తు నిర్వహణ యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధమవుతోంది. అవసరమైన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు.! తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రానున్న 24 గంటలు కీలకం.! అర్నాబ్ తుఫాను తీరం వైపు కదులుతున్న నేపథ్యంలో రానున్న గంటలు కీలకంగా మారనున్నాయి. ప్రజలు వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసే అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలి. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే అనుసరించాలి. ప్రజలకు సూచన: తుఫాను సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడవద్దు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సహాయం తీసుకోవాలి. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యంగా అప్రమత్తంగా ఉండాలి.           [ Cyclone Arnab, Cyclone Arnab Update, Visakhapatnam Heavy Rain, Cyclone Alert Andhra Pradesh, Andhra Pradesh Weather Update, Visakhapatnam Strong Winds, North Andhra Cyclone Alert, Bay of Bengal Cyclone, IMD Weather Alert, Cyclone Landfall, Bapatla Coast, Visakhapatnam Coast, Heavy Rainfall Alert, Power Supply Disruption, Trees Uprooted, NDRF, SDRF ]  
దేశవ్యాప్తంగా  రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ల దాఖలు గడువును పొడిగించాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన ప్రత్యేక అభ్యర్థనను సుప్రీంకోర్టు స్పష్టంగా తోసిపుచ్చింది. ఈ కీలక పరిణామానికి సంబంధించి ధర్మాసనం విచారణను పూర్తిగా ముగించినట్లు ప్రకటించింది. గతంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను తాము తూచా తప్పకుండా అమలు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. నామినేషన్ల గడువు గడిచిపోయినందున, ఇక రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల బరిలోకి దిగి పోటీని ఎదుర్కోవాలని ప్రధాన న్యాయస్థానం నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు 'ఆల్ ది బెస్ట్' చెబుతూ విచారణను ముగించడం గమనార్హం. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలకు నామినేషన్లు వేసే విషయంలో తగిన స్వేచ్ఛ, అవకాశాలు లభించడం లేదని వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంపై గతంలో వెలువడిన ఆదేశాల అమలు తీరును ఎన్నికల సంఘం తరఫున సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది కూడా తమ వాదనలను ధర్మాసనం ముందుంచారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలని, ఆ రికార్డింగ్ ఫుటేజ్‌ను సురక్షితంగా భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. న్యాయస్థానం నుంచి ఎలాంటి వెసులుబాటు లభించకపోవడంతో, ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ యథావిధిగా ముందుకు సాగనుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ తీర్పు నేపథ్యంలో తమ వ్యూహాలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల గడువు పొడిగింపు ముగియడంతో, ఇక పూర్తిగా ఎన్నికల పోరుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.       [ Supreme Court, YSRCP, Andhra Pradesh Local Body Elections, AP Election Commission, Nomination Deadline, CM Chandrababu, Naralokesh, YS Jagan ]  
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో కొంతమంది చేసే పిచ్చి పనులు చూస్తే వీళ్లకు ఏకంగా మైండ్ బ్లాంక్ కావడం ఖాయం అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి కోవకే చెందిన ఓ విచిత్రమైన, షాకింగ్ ఘటన ఈజిప్ట్ దేశంలో వెలుగు చూసింది. సాధారణంగా పరీక్షల్లో ఫెయిల్ అయితే స్టూడెంట్స్ తీవ్రంగా బాధపడతారు, లేదా వారి తల్లిదండ్రులు వారిని మందలిస్తారు. కానీ ఇక్కడ ప్రియురాలు పరీక్షల్లో తప్పిందని ఏకంగా ఓ యువకుడు కక్షగట్టి బడికే నిప్పు పెట్టిన వైనం అందరినీ విస్మయానికి గురిచేసింది.  ఈజిప్ట్ దేశంలోని మెనోఫియా (Menoufia) గవర్నరేట్‌లో ఈ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొద్ది రోజుల క్రితం జరిగిన పరీక్షల్లో ఆ యువకుడి కాబోయే భార్య అనగా ప్రియురాలు ఫెయిల్ అయినట్లు అతనికి తెలిసింది. ఈ వార్త విన్న ఆ యువకుడు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ప్రియురాలు ఫెయిల్ కావడానికి ఆమె చదువుకున్న పాఠశాల సిబ్బంది, అక్కడి విద్యా విధానమే కారణమని నమ్మాడు. తన ప్రేయసి ఫెయిల్ అయిందన్న కోపంతో రగిలిపోయిన ఆ ప్రియుడు.. ఏకంగా ఆ పాఠశాల భవనానికి నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా రాత్రి సమయంలో ఆ స్కూల్ వద్దకు వెళ్లి భవనానికి నిప్పు అంటించాడు.  ఈ ప్రమాదంలో పాఠశాలలోని కొంత భాగం అగ్నిప్రమాదానికి గురైంది. అయితే, అదృష్టవశాత్తు ఈ భారీ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక అధికారులు తెలిపారు. పాఠశాలలో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీనివల్ల పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే భవనానికి జరిగిన ఆస్తి నష్టం వేల డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.  నిప్పు పెట్టిన తర్వాత ఆ యువకుడు అక్కడి నుండి తన సొంతూరికి పరారయ్యాడు. అయితే, స్కూల్ దగ్గరే అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఈజిప్ట్ పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలి కోసం బడికి నిప్పు పెట్టిన ఈ పిచ్చి ప్రేమికుడి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనను చూసిన నెటిజన్లు.. "అరే ఏంట్రా బాబు ఈ కిడ్స్ ఇలా ఉన్నారు, ప్రేమ పేరుతో ఇంతటి మూర్ఖపు పనులా" అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.       [ boyfriend sets school on fire, girlfriend fails exam, Egypt news, dumbest criminals, bizarre news, school fire revenge, Telug One, Telugu News ]
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.! పాడైపోయిన రూ.50 పెరుగు ప్యాకెట్‌కు రీఫండ్ వస్తే చాలని భావించింది. కానీ అదే ప్రయత్నం ఆమెకు రూ.98 వేల నష్టాన్ని మిగిల్చింది. నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఓ మహిళ.. సైబర్ నేరగాళ్ల మాయలో పడి భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆన్‌లైన్ వినియోగదారులను కలవరపెడుతోంది. రూ.50 రీఫండ్ కోసం వెతుకులాట.! బెంగళూరులోని వసంత్ నగర్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ అక్టోబర్ 17న క్విక్ కామర్స్ యాప్ బ్లింకిట్ ద్వారా కొన్ని నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ అయిన వస్తువుల్లో రూ.50 విలువైన పెరుగు ప్యాకెట్ పాడైపోయి ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఆ మొత్తాన్ని రీఫండ్‌గా పొందాలని నిర్ణయించుకున్నారు. అంతే.. గూగుల్‌లో బ్లింకిట్ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికారు. అక్కడ కనిపించిన ఓ నంబర్‌కు ఫోన్ చేయడమే ఆమెను సైబర్ నేరగాళ్ల ఉచ్చులోకి నెట్టింది. నమ్మకంగా మాట్లాడి.. మోసపు వలలోకి.! ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి తాను బ్లింకిట్ కస్టమర్ కేర్ ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. బాధితురాలి నమ్మకాన్ని పొందేందుకు ఎంతో నమ్మకంగా మాట్లాడాడు. పాడైపోయిన పెరుగు ప్యాకెట్ ఫొటోను వాట్సాప్‌లో పంపాలని చెప్పి ఓ లింక్‌ను పంపించాడు.  అది నిజమైన రీఫండ్ ప్రక్రియేనని భావించిన మహిళ.. ఆ లింక్ ద్వారా ఫొటోను అప్‌లోడ్ చేశారు. ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి రీఫండ్ ప్రక్రియ కొనసాగుతోందని నమ్మించాడు. గూగుల్ పే లేదా మరో డిజిటల్ పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేయాలని సూచించాడు.సైబర్ నేరగాళ్లు చెప్పినట్లుగానే ఆమె చేయడంతో.. అసలు మోసం అప్పుడే మొదలైంది. ఒక్క నిమిషంలో రూ.98 వేలు మాయం.! తనకు రావాల్సిన రూ.50 రీఫండ్ కోసం ప్రయత్నిస్తున్న ఆ మహిళకు.. తన బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తం మాయమవుతుందని అస్సలు ఊహించలేదు. చూస్తుండగానే బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతా నుంచి ఏకంగా రూ.98,000 డెబిట్ అయ్యాయి. చిన్న మొత్తాన్ని తిరిగి పొందాలన్న ఆశతో మొదలైన ప్రయత్నం.. చివరకు జీవితకాల సంపాదనలో భాగమైన భారీ మొత్తాన్ని కోల్పోయేలా చేసింది. ఖాతాలో డబ్బులు మాయమైనట్లు గుర్తించిన ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రూ.50 కోసం చేసిన ప్రయత్నం రూ.98 వేల నష్టాన్ని మిగల్చడంతో లబోదిబోమన్నారు. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.! తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు అక్టోబర్ 23న బెంగళూరులోని సెంట్రల్ సైబర్ ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ (CEN) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్న పొరపాటు.. భారీ నష్టం.! ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేయడం ఎంత సులభమో.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే డబ్బులు కోల్పోవడం కూడా అంతే వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా గూగుల్ సెర్చ్‌లో కనిపించే కస్టమర్ కేర్ నంబర్లన్నీ అధికారికమైనవని భావించడం ప్రమాదకరం.       [ Blinkit Refund Scam, Cyber Fraud, Bengaluru Cyber Crime, Google Customer Care Scam, ₹98000 Fraud, Online Refund Scam, Bank of Baroda, UPI Fraud, Cyber Criminals, Online Shopping Fraud, CEN Police, Digital Payment Scam, Cyber Security Awareness, Vasanth Nagar Bengaluru ]
ఫ్రీ బస్సులో భార్య.. నవ్వులు పూయిస్తున్న భర్త ఆవేదన. !    తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యంపై ఎన్నో రకాల అనుభవాలు నిత్యం వెలుగుచూస్తుంటాయి. తాజాగా ఈ పథకానికి సంబంధించి ఓ వినూత్న సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య ఇంటి నుంచి కోపంగా వెళ్లిపోవడం, ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం సాధారణ విషయమే. అయితే ఇక్కడ ప్రభుత్వ పథకం తోడవడంతో ఆ వ్యథ కాస్తా నవ్వులు పూయిస్తోంది. సిద్దిపేట జిల్లా రేగులపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘ప్రజల వద్దకు ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై ఓ వ్యక్తి తన ఇబ్బందిని అందరి ముందు సరదాగా వెళ్లగక్కారు. భార్యతో చిన్నపాటి గొడవ జరగడంతో ఆమె అలిగి ఉచిత బస్సు ఎక్కి ఎటో వెళ్లిపోయిందని ఆ వ్యక్తి తెలిపారు. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక, క్షేమంగా ఇంటికి రప్పించేందుకు తాను నానా తంటాలు పడ్డానని వాపోయారు. అలిగిన భార్యను వెతికి పట్టుకునే క్రమంలో తనకు రూ.2 వేల వరకు ఖర్చు అయిందని ఆయన చెప్పిన తీరు సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. "మహిళలకు ఫ్రీ బస్సుతో మా బతుకులు ఆగం అయ్యాయి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తుంటే, మరోవైపు దీనివల్ల భర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇలాంటి సరదా ఘటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో విపరీతంగా ప్రచారమవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల దైనందిన జీవితాల్లో ఎలాంటి ఆసక్తికర అనుభవాలను పంచుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఏది ఏమైనప్పటికీ, ఈ ఉదంతం స్థానికంగా నవ్వులు పంచడంతో పాటు అందరినీ ఆకట్టుకుంది.       [ Telangana free bus travel, Siddipet news, Cavumpalli Satyanarayana, MLA to the people, RTC Mahalaxmi scheme, CM Revanth reddy, Minister ponnam prabhakar, Telugu One, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
నిధి అగర్వాల్.. నిండు చందమామని తలపించేలా ముగ్ధ మనోహర రూపంతో తొణికిసలాడుతూ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన 'హరిహర వీరమల్లు'నే వన్ ఆఫ్ ది ఎగ్జంపుల్. ప్రీవియస్ మూవీ  ప్రభాస్ 'ది రాజాసాబ్' తో కూడా మెప్పించిన  నిది నుంచి కొత్త ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏమి రాకపోవడంతో నిధి పని అయిపోయిందా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఆ రూమర్స్ కి దవడ వాసేలా అరడజను ప్రాజెక్ట్స్ ని ప్రకటించి ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌లలో ఒకరిగా నిధి దూసుకుపోతుంది. రాబోయే రెండేళ్ల కాలంలో ఆమె నటించిన మరియు నటిస్తున్న దాదాపు ఆరు చిత్రాలు వరుసగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన భాషా పరిశ్రమలని కవర్ చేస్తూ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టులని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఆమె చేతిలో ప్రస్తుతం మూడు బాలీవుడ్ చిత్రాలు, ప్రముఖ 'స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్' నిర్మిస్తున్న తమిళ చిత్రం, తెలుగులో ఒక యంగ్ హీరో సినిమాతో పాటు ప్రతిష్టాత్మక లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇది కూడా చదవండి:  వైలెన్స్ వద్దు, ఫ్యామిలీ చిత్రాలే ముద్దు:  పీచే మూడ్!       మరి  రాబోయే రెండేళ్లలో దాదాపు అరడజను సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు నిధి అగర్వాల్ సిద్ధమవుతుంది. దీన్ని బట్టి ఆమె పని అయిపోలేదు. ఇప్పుడు మరింత స్పీడ్ అయ్యిందని చెప్పవచ్చు.   [Nidhhi Agerwal Silences Rumours With Six Films, Nidhhi Agerwal, Hari Hara Veera Mallu, The Raja Saab, Nidhhi Agerwal upcoming movies, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]  
Ritika Nayak is playing leading lady inSundeep Kishan’s Powerpeta, with the makers introducing her as Padamataveeti Janaki through a first-look poster released on her birthday. Dressed in a traditional half-saree, Ritika appears graceful and composed, hinting at a character deeply connected to the film’s rustic setting. She has gone complete glamorous too having two to three sequences where she is playing in rain, comes out completely drenched in a shirt. Looks like the actress is showcasing the more glam side of her, not just sticking to the regular roles.  Following the success of Mirai and Korean Kanakaraju, Ritika has emerged as a promising choice for Telugu filmmakers. Her entry into Powerpeta brings another interesting dimension to the project, which brings Sundeep Kishan and director Krishna Chaitanya together for an action drama. With love, honour and politics at its core, the film promises a narrative driven by intense conflicts and strong character dynamics. The makers are mounting it on a grand scale, with Vijay Chilla and Shashi Devireddy producing the project. Mani Sharma is composing the music. The shoot is progressing rapidly, with 60% of the filming completed. The team is expected to announce further details about the film in the coming days.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
వైలెన్స్.. ఫ్యామిలీ జోనర్.. కంటెంట్ బాగుంటే రెండు జోనర్స్ హిట్ అవుతాయి. కాకపోతే  వైలెన్స్ కంటే ఫ్యామిలీ జోనర్ సేఫ్. కడుపులో నీళ్లు కదలకుండా సినిమాని హిట్ చేయవచ్చు . పైగా ఫ్యామిలీ జోనర్ లో విలువలు, ఆప్యాయతలు ఉంటాయి కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు చలో టూ థియేటర్స్ అంటారు. పైగా రిపీట్ ఆడియెన్స్ సైతం పక్కా.     అందుకే  టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ జోరందుకుంది. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద కేవలం భీభత్సమైన యాక్షన్, రక్తపాతం, వైలెన్స్ సినిమాలే రాజ్యమేలుతున్నాయనే విమర్శలు వినిపించిన తరుణంలో, టాలీవుడ్ హీరోలు ఇప్పుడు రూటు మార్చుతున్నారు. "వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్" అంటూ కేవలం యాక్షన్ చిత్రాల చుట్టూనే తిరిగిన హీరోలంతా ఇప్పుడు ఒక్కసారిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కేవలం కత్తులు, బాంబులే కాకుండా మనసుకు హత్తుకునే ఎమోషనల్ కంటెంట్ ముఖ్యం అని టాలీవుడ్ స్టార్స్ స్పష్టంగా గ్రహిస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కుటుంబం కలిసి చూడగలిగే కుటుంబ కథా చిత్రాలకు మళ్లీ ప్రాధాన్యత ఇస్తున్నారు.   ఈ అనూహ్య మార్పుకు మాస్ మహారాజా రవితేజ వంటి స్టార్స్ కూడా తమ రూటు మార్చడమే నిదర్శనం. మాస్ చిత్రాలతోనే కెరీర్ బిల్డ్ చేసుకున్న రవితేజ సైతం ఫ్యామిలీ మరియు డిఫరెంట్ కాన్సెప్ట్ కథల వైపు దృష్టి పెట్టడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే బాటలో చాక్లెట్ బాయ్ నితిన్ కూడా యాక్షన్ జోనర్‌కు కాస్త బ్రేక్ ఇస్తున్నాడు. 'భీష్మ' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వరుస ప్రయోగాలు చేసి కొంతమేర వెనకబడ్డ నితిన్, ఇప్పుడు సాలిడ్ కంబ్యాక్ కోసం నేచురల్ స్టార్ నాని సమర్పణలో 'అలియాస్ రుక్మిణి' అనే క్రేజీ ఫ్యామిలీ లవ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  ఈ ప్రాజెక్ట్ కోసం నితిన్ పూర్తిస్థాయి ఫ్యామిలీ మ్యాన్‌లా మేకోవర్ అయ్యాడు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతగా వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న నాని జడ్జ్‌మెంట్ మీద నమ్మకంతో నితిన్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. కేవలం సీనియర్ లేదా మిడ్-రేంజ్ హీరోలే కాకుండా, యంగ్ హీరోలు సైతం వైలెన్స్ చట్రం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. భీభత్సమైన వైలెన్స్ జోలికి వెళ్ళకపోయినా, కిరణ్ అబ్బవరం కూడా యాక్షన్ హీరో అనిపించుకోవాలని తెగ ప్రయత్నాలు చేశాడు. అయితే అవి పూర్తిస్థాయిలో వర్కవుట్ కాకపోయేసరికి వెంటనే యూ టర్న్ తీసుకుని 'క', 'K రాంప్', 'చెన్నై లవ్ స్టోరీ' వంటి వైవిధ్యమైన లవర్ బాయ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఒకే రకమైన యాక్షన్ జోనర్‌లో ఇరుక్కుపోకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సాగాలని నటీనటులు అందరూ ఇప్పుడు గట్టిగా ఫిక్స్ అయ్యారు.  ఇది కూడా చదవండి: లెజండ్రీ దర్శకుడి మృతి: కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులని పరిపాలించిన చక్రవర్తి!    ప్రేక్షకుల పల్స్ ఎక్కడ ఉందో పక్కాగా అంచనా వేస్తున్న టాలీవుడ్ మేకర్స్, ఇప్పుడు కత్తిపోట్లు, విపరీతమైన రక్తపాతం కంటే హృదయానికి హత్తుకునే అనుబంధాలు, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తున్నారు. థియేటర్స్‌కి క్యూ కట్టే ఫ్యామిలీ ఆడియన్స్‌ను మళ్లీ వెనక్కి రప్పించడమే లక్ష్యంగా టాలీవుడ్ హీరోలు చేస్తున్న ఈ సాహసోపేతమైన మార్పు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. కేవలం ఒకరిద్దరు హీరోలకే పరిమితం కాకుండా టాలీవుడ్ వ్యాప్తంగా ఈ ట్రెండ్ కొనసాగుతుండటం విశేషం. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల జోరు రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, మన హీరోల ప్లానింగ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.     [Tollywood Heroes latest Family Entertainer movies, Tollywood heroes shift, family entertainers tollywood, Nithiin Alias Rukmini, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]    
నితిన్ హీరోగా నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా ‘అలియాస్ రుక్మిణి’. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘రుకు రుకు రుక్మిణి’ ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆఫియా సయ్యద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఇప్పుడు కృష్ణ, రుక్కుల ప్రేమకథను పరిచయం చేస్తూ ఈ పాట వచ్చింది. ‘రుకు రుకు రుక్మిణి’ పాటలో ప్రధానంగా ఆకట్టుకునేది దాని పెప్పీ మ్యూజిక్. విజయ్ బుల్గానిన్ తనదైన స్టైల్‌లో క్యాచీ ట్యూన్‌తో పాటను కంపోజ్ చేశారు. వినగానే హమ్ చేసుకునేలా ఉండే పదాలు, రిథమ్‌కు తగ్గట్టుగా సాగే సంగీతం ఈ పాటకు ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తున్నాయి. పూర్ణాచారి అందించిన లిరిక్స్‌లో కృష్ణుడు, రుక్మిణి పేర్లను ఉపయోగిస్తూ ప్రేమకథకు ఒక ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చారు. అనురాగ్ కులకర్ణి వాయిస్ కూడా ఈ పాటలోని ఎనర్జీకి సెట్ అయింది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా సింపుల్‌గా, సరదాగా సాగే పాటగా దీన్ని రూపొందించారు. ఈ పాటలో నితిన్ కృష్ణగా, ఆఫియా సయ్యద్ రుక్మిణిగా కనిపిస్తున్నారు. నితిన్ లుక్ కాస్త రిఫ్రెషింగ్‌గా ఉండగా.. ఆఫియా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆఫియా ఈ సినిమాలో టీచర్ పాత్రలో కనిపించనుందని ఆమె గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. నితిన్ మాత్రం రచయిత కృష్ణగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో పాటలోని కృష్ణ, రుక్కుల ప్రేమకథ సినిమా కథకు ఎలా కనెక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. నితిన్ కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు, నాని బ్యానర్ లో రూపొందుతుండటంతో ‘అలియాస్ రుక్మిణి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 4, 2026న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇది కూడా చదవండి: ఉన్నంతలో మనకున్నంతలో.. ‘భజగోవిందం’ పాట వెనుక ఉన్న గొప్ప అర్థం తెలుసా.?       [Alias Rukmini First Single, Ruku Ruku Rukmini Song, Alias Rukmini Movie, Nithiin, Aafiya Syed, Vijay Bulganin, Anurag Kulkarni, Natural Star Nani, Telugu Film News]  
Nithiin’s upcoming romantic drama Alias Rukmini makers have released the first single, Rukku Rukku. Sung by Anurag Kulkarni and composed by Vijai Bulganin, the romantic number showcases Krishna expressing his love for Rukmini and promising to treat her like a queen if she accepts his marriage proposal. Director Murali Kanth Devasoth has beautifully picturised the song, with every frame reflecting Krishna’s affection and his eagerness to build a life with Rukmini. Nithiin is a natural fit for the role, sporting a simple look that captures the everyday employee vibe perfectly.  His effortless dance moves, charming screen presence and subtle naughtiness add to Krishna’s innocent yet devoted character. He also elevates Vijai Bulganin’s soulful composition with his performance.The chemistry between Nithiin and debutante Aafiya Sayed is another highlight, adding to the appeal of this romantic ballad and building curiosity around their pairing on the big screen.  Presented by Nani and produced by Deepthi Ganta, Alias Rukmini is directed by Murali Kanth Devasoth. The film has completed the majority of its shoot and is currently in post-production. The makers have scheduled its worldwide theatrical release for December 4. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక గొప్ప శకం ముగిసింది. ఎన్నో తరాల ప్రేక్షకులకి  దశాబ్దాలుగా ఉత్కంఠభరితమైన దర్యాప్తులతో కట్టిపడేయ్యడంతో పాటు, దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందిన ‘సీఐడీ’ (CID) ధారావాహిక సృష్టికర్త, ప్రముఖ నిర్మాత, దర్శకుడు బ్రిజేంద్ర పాల్ సింగ్ (బీపీ సింగ్) అకస్మాత్తుగా కన్ను మూసారు. ఈ రోజు ఉదయం ముంబైలోని శాంతాక్రూజ్ ఆసుపత్రిలో 77 సంవత్సరాల వయసులో తీవ్ర గుండెపోటుతో  తుదిశ్వాస విడిచారని సినీ ప్రముఖులు వెల్లడించారు.  మరణవార్త తెలియగానే టెలివిజన్ రంగంలోనూ, లక్షలాది మంది సీఐడీ అభిమానులలోనూ తీవ్ర విషాదం అలుముకుంది.  బ్రిజేంద్ర పాల్ సింగ్ కేవలం ఒక సాధారణ దర్శకుడు మాత్రమే కాదు, భారతీయ టెలివిజన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ రూపురేఖలను పూర్తిగా మార్చివేసిన సంచలన సృష్టికర్త. ప్రఖ్యాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) నుంచి డైరెక్షన్‌లో పట్టా పుచ్చుకున్న ఆయన, తన అద్భుతమైన ప్రతిభతో టెలివిజన్ తెరపై విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.  ఆయన సృష్టించిన ‘సీఐడీ’ సీరియల్ భారతీయ టెలివిజన్ చరిత్రలోనే అత్యంత కాలం పాటు (రెండు దశాబ్దాలకు పైగా, 1998 నుంచి నిరంతరంగా) విజయవంతంగా ప్రసారమైన రికార్డు సృష్టించింది. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఉత్కంఠను నింపుతూ కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ధారావాహికలో ప్రసిద్ధ పాత్రలైన ఏసీపీ ప్రద్యుమన్, దయా, అభిజీత్, మరియు డాక్టర్ సాలుకేలతో పాటు, స్వయంగా బీపీ సింగ్ డిసీపీ శమషేర్ సింగ్ చిత్రోలే క్యారక్టర్ పోషించి విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు.కేవలం క్రైమ్ థ్రిల్లర్స్‌ మాత్రమే కాకుండా, ప్రేక్షకులకి వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త హారర్ అనుభూతిని అందించిన ‘ఆహట్’ (Aahat) ధారావాహికను కూడా 1995 నుంచి ఆయన ఘనవిజయవంతంగా నిర్మించారు. సుదీర్ఘకాలం పాటు ప్రసారమైన ఈ హారర్ షో కూడా టీవీ ప్రేక్షకులను ఎంతగానో భయపెడుతూనే విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే భారతదేశపు మొట్టమొదటి సైలెంట్ కామెడీ షో అయిన ‘గూటూరు గు’ (Gutur Gu, 2010) తో పాటు ‘షపత్’ వంటి విభిన్నమైన టెలివిజన్ ప్రాజెక్ట్‌లని సైతం  విజయవంతంగా తెరకెక్కించి తన బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు.  ఇది కూడా చదవండి: పవన్ వైఫ్ అన్నా లెజినోవా షాకింగ్ డెసిషన్: డిలీట్ ఎందుకు చేసింది!   ఎఫ్‌టీఐఐ (FTII) అధ్యక్షుడిగా కూడా సేవలందించిన ఆయన, ఎంతోమంది యువ టెక్నీషియన్లకు, సృష్టికర్తలకు మార్గదర్శిగా నిలిచారు. బీపీ సింగ్ అకస్మాత్ మరణం పట్ల ప్రముఖ చలనచిత్ర దర్శకుడు అశోక్ పండిత్ తదితర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారతీయ విజువల్ మీడియా రంగానికి, ముఖ్యంగా టెలివిజన్ పరిశ్రమకి తీరని లోటని అభివర్ణించారు. క్రైమ్ మరియు సస్పెన్స్ జోనర్‌లలో ఆయన వేసిన బలమైన ముద్ర ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుందని కొనియాడారు.  అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు సమాచారం.      [Cid Director Bp Singh Passed Away, CID director BP Singh, Brijendra Pal Singh passed away, CID creator dead, Aahat producer BP Singh, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా  సోషల్ మీడియా (ఇన్ స్టాగ్రామ్) వేదికగా అభిమానులతో అందుబాటులో ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుండంతో పాటు పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.    ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా తన సోషల్ మీడియా ఖాతాని డీయాక్టివేట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది . ఆమె తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటనే దానిపై నెట్టింట రకరకాల ఊహాగానాలు, చర్చలు జోరుగా సాగుతున్నాయి. సాధారణంగా పబ్లిక్ లైఫ్‌, మీడియా ప్రచారానికి చాలా దూరంగా, అత్యంత ప్రశాంతమైన వ్యక్తిగత జీవితాన్ని గడపడానికి ఇష్టపడే అన్నా కొణిదెల, గతంలో అన్నా లెజినోవా పేరుతో అందరికీ సుపరిచితురాలయ్యారు. ఆ తర్వాత కాలంలో తన పేరుని అధికారికంగా అన్నా కొణిదెలగా మార్చుకుని, మెగా అభిమానులతో పాటు జనసామాన్యంతో మరింత దగ్గరగా మెలగాలనే ఉద్దేశంతో సరిగ్గా 2026 మార్చి నెలలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టారు. ఇది కూడా చదవండి:  హీరో అవ్వకముందే గౌతమ్ కి యాంటీ ఫ్యాన్స్: వాళ్ళు  వీళ్లేనా!   అంతేకాకుండా తనని అందరు ఇకపై 'అన్నా కొణిదెల' అని మాత్రమే పిలవాలని కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రత్యేకంగా కోరారు. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా, పోస్ట్‌లకి విపరీతమైన స్పందన లభించింది. అయితే ఇంతలోనే హఠాత్తుగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిజిటల్ ప్రపంచంలో కనిపించకుండా పోవడం మెగా, పవన్  అభిమానుల్లో, నెటిజెన్స్ లో షాకింగ్ న్యూస్ గా మారింది.    [Anna Konidela Instagram Deactivated, Anna Konidela, Pawan Kalyan wife, Anna Lezhneva Instagram, Anna Konidela deactivated, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటవారసుడిగా గౌతమ్ సెల్యులాయిడ్ పై తన హవా చాటాలని అభిమానులు కోరుకోవడం అనేది సహజం. ఒక రకంగా అభిమానుల హక్కు. ప్రస్తుతానికైతే గౌతమ్ సినిమాలపై ఉన్న అభిమానంతో 'లెటర్‌బాక్స్' (Letterboxd) అనే గ్లోబల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తాను చూసిన వివిధ భాషల చిత్రాలకి రేటింగ్స్ ,రివ్యూలు ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.  కానీ ఇటీవల పలు సినిమాలకు లెటర్ బాక్స్ లో రివ్యూలు ఇస్తూ వైరల్ అవుతున్నాడు. సినిమాలకు రివ్యూ, రేటింగ్ లు ఇచ్చే లెటర్ బాక్స్ యాప్ లో గతంలో పలు సినిమాలకు రేటింగ్స్ ఇచ్చి, తన తండ్రి ఫ్లాప్ సినిమాలకు తక్కువ రేటింగ్స్ ఇచ్చి వైరల్ అయ్యాడు. నాని  'ది ప్యారడైజ్' సినిమాపై రాసిన రివ్యూ టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపుతోంది.  ఈ నెల 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభించగా, ఈ మూవీని వీక్షించిన గౌతమ్ దీనికి కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే కేటాయించారు. ఈ సినిమాపై తన సమీక్షను వివరిస్తూ, చిత్రంలో సినిమాటోగ్రఫీ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లోని నటన మాత్రమే తనకు ఆకట్టుకున్నాయని, మిగతా సినిమా అంతా తీవ్రంగా నిరాశపరిచిందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ముఖ్యంగా ఈ చిత్ర ఎడిటింగ్ చాలా దారుణంగా మరియు చెత్తగా ఉందని  లెటర్‌బాక్స్ ఖాతాలో ఘాటుగా రాసుకొచ్చారు.  కేవలం నాని సినిమానే కాకుండా, గతంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన అత్యంత భారీ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' కి కూడా  కనిష్టంగా 0.5 స్టార్ రేటింగ్ ఇవ్వడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలా స్టార్ హీరోల సినిమాలకు సైతం ఎలాంటి మొహమాటం లేకుండా అత్యల్ప రేటింగ్స్ ఇస్తుండటంతో సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా విపరీతమైన ట్రోల్స్, విమర్శలు ఎదురవుతున్నాయి. గౌతమ్ ఇప్పటివరకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సుమారు 400కు పైగా సినిమాలకు పైగా  వ్యక్తిగత రేటింగ్స్, సమీక్షలను నమోదు చేయడం విశేషం. ఇందులో ఆయన తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్స్ అయిన 'పోకిరి', అలాగే యాక్షన్ థ్రిల్లర్ '1: నేనొక్కడినే' లాంటి చిత్రాలకు అత్యధికంగా 5 స్టార్స్ రేటింగ్ ఇచ్చి తన తండ్రి సినిమాలంటే ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం' సినిమాకి 2.5 స్టార్స్ రేటింగ్ ఇవ్వడం ద్వారా తాను ఎవరికీ భయపడకుండా కేవలం సినిమా కంటెంట్ ఆధారంగానే రేటింగ్స్ ఇస్తానని నిరూపించారు.  ఇది కూడా చదవండి: ‘కల్ట్’రిలీజ్ బాధ్యతలు వీరికే: ఏరియా వారిగా లిస్ట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!      కేవలం సొంత సినిమాలకే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇతర హీరోల సినిమాలకి  కూడా తన నిజాయితీతో కూడిన రేటింగ్స్ ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.   అయితే, సోషల్ మీడియాలో కొందరు కరడుగట్టిన అభిమానులు ఈ రేటింగ్స్‌ను అస్సలు జీర్ణించుకోలేక గౌతమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ యాంటీ ఫ్యాన్స్‌గా మారుతున్నారు. నాని మరియు యశ్ లాంటి స్టార్ హీరోల సినిమాలను బహిరంగంగా విమర్శించడం వల్ల ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో 'టాక్సిక్' సినిమాకు 0.5 రేటింగ్ ఇచ్చినప్పుడు కూడా ఇలాగే భారీ ఎత్తున ట్రోల్స్ రావడంతో గౌతమ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ బయో నుంచి లెటర్ బాక్స్ లింక్‌ను కొద్దిసేపు తొలగించాల్సి వచ్చింది. అయినప్పటికీ, సినిమాలపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఎవరికీ భయపడకుండా నిక్కచ్చిగా చెప్పాలనే ఆయన తత్వమే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.  ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కిడ్స్ తోటి హీరోల సినిమాలను ఎప్పుడూ గుడ్డిగా పొగుడుతూనే ఉంటారు. కానీ గౌతమ్ మాత్రం సినిమా బాగోకపోతే మొహమాటం లేకుండా బాగోలేదని, నచ్చలేదని స్పష్టంగా చెప్పడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సినిమా నచ్చితే మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూనే, లోపాలను నిర్భయంగా ఎత్తిచూపే ఆయన పారదర్శకత కొందరికి ప్రశంసలు తెస్తుంటే, మరికొందరికి ఆగ్రహం తెప్పిస్తోంది. హీరోగా అధికారికంగా ఎంట్రీ ఇవ్వకముందే ప్రేక్షకుల మధ్య ఇంతలా ట్రెండింగ్‌లో నిలుస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్న గౌతమ్ ఘట్టమనేని రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో నని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.    [Gautam Ghattamaneni Getting Trolls Regarding Letter Box Reviews, Gautam Ghattamaneni Trolls, Gautam Ghattamaneni ABout Mahesh Babu, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. "కిల్లర్" సినిమా ఈ నెల 30న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్. - "కిల్లర్" రిచ్ కంటెంట్ ఉన్న సినిమా. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. యు సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూశాక సెన్సార్ వాళ్ల మొహాలు ఆహ్లాదకరంగా కనిపించాయి. అంటే మా మూవీ వారికి నచ్చిందని అనుకున్నాం. మా సినిమాలో బ్లడ్ షెడ్ లేదు. రక్తం చూస్తే నాకే కళ్లు తిరుగుతాయి. కథలో హింస ఉన్నా, అది పాత్రలు ఎదుర్కొనే దాంట్లో కనిపించాలి గానీ పాత్రలను చిత్రహింసలు పెట్టినట్లు చూపించడం నాకు నచ్చదు. - మా సినిమా టీమ్ లోని వారు మా కిల్లర్ మూవీని క్రిస్టోఫర్ నొలన్ ఒడిస్సీ సినిమాతో పోల్చారు. అది కొంచెం అతి అనిపించవచ్చు కానీ మా మూవీ చూసి బయటకు వచ్చాక ఒడిస్సీతో మీరే పోల్చుకుంటారు. మా సినిమాను ఒడిస్సీతో పోల్చడం ఒక స్పాయిలర్ కూడా. కొన్నేళ్ల కిందట నేను స్క్రూడ్ అనే కాన్సెప్ట్ తో కథ రాసుకున్నాను. అది అప్పటికి నాకున్న రిసోర్సెస్ కు రూపొందించడం కుదరలేదు. అదే స్క్రిప్ట్ ను ఇప్పుడున్న ఆడియెన్స్ టేస్ట్ కు తగినట్లు మార్పులు చేసి కిల్లర్ సినిమా రూపొందించాను. - కిల్లర్ సినిమాలో ప్రతి పాత్ర ఆర్ లెటర్ తోనే స్టార్ట్ అవుతాయి. ప్రాజెక్ట్ రూట్ అనే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంగా ఈ సినిమా ఉంటుంది. హీరోయన్ జ్యోతి చేసిన రక్తిక, రనైన, రియా..ఇలా పేర్లు ఆర్ తో ఉంటాయి. - మా సినిమా సెకండాఫ్ లో ట్విస్ట్ చెప్పినవారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించాం. దీని మీద ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. హైకోర్టు లాయర్స్ కూడా అందులో పాల్గొంటారు. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు మా మూవీ ప్రీమియర్స్ పడతాయి. 11 గంటలకు ఆ ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ చేయాలి. ఎవరు త్వరగా ఆన్సర్ పంపిస్తే వారి పేరు మా మూవీ సక్సెస్ మీట్ లో ఎల్ఈడీ స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తాం.  - ఈ నెల 30న రిలీజ్ అవుతున్న సినిమాల్లో రిచ్ కంటెంట్ ఉన్న సినిమా మాది అని చెబుతున్నాం. ట్రైలర్ రిలీజ్ చేశాక కూడా మా సినిమా స్టోరీ ఎవరికీ అందడం లేదు. అది సినిమాలోనే చూడాలి. కొత్తగా చేశామని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. వీళ్లు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుసుకునేందుకైనా ఆడియెన్స్ మాకు ఒక ఛాన్స్ ఇస్తారని నమ్ముతున్నాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ తో పాటు ఆనంద్ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. అలాంటి సందర్భాలు మనకు ఉన్నాయి. - న్యూరోలింక్ మీద ఎలాన్ మస్క్ పరిశోధనలు చేస్తున్నాడు. అయితే మిషిన్స్ మీద చేస్తున్నాడు. మనిషి మీద చేస్తే ఎలా ఉంటుందనేది మా సినిమా కాన్సెప్ట్. అయితే ఎంటర్ టైనింగ్ గా చెబుతున్నాం కాబట్టి ప్రతి సీన్ ప్రేక్షకులకు సులువుగా అర్థమవుతుంది. ఈ సినిమాను 25 రోజుల్లో చిత్రీకరించాను.  - థ్రిల్లర్ సినిమాలంటే ప్రీ క్లైమాక్స్ వరకు మిమ్మల్ని హుక్ చేసి ఉంచే కంటెంట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అన్ని ట్విస్ట్ లు రివీల్ అవుతూ సర్ ప్రైజ్ చేస్తాయి. మా కిల్లర్ కూడా అదే తరహా మూవీ. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అనే పాయింట్ ను మాస్ ఎలిమెంట్స్ తో కలిపిన కథతో మీకు కన్విన్సింగ్ గా చూపించే చిత్రమిది. మా సినిమా చూస్తున్నప్పుడు థ్రిల్ తో పాటు చిన్న స్మైల్ కూడా మీకు వస్తుంది. కథలోని అసలైన పాయింట్ కు షాక్ అవుతారు. ఇలా కూడా సినిమాను తీయొచ్చా అనుకుంటారు.        [Killer Movie, Director Poorvaaj Interview, Killer Movie 1 Crore Reward, Jyoti Poorvaj, Christopher Nolan, The Odyssey, Elon Musk, Telugu Film News]  
  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే 'కల్ట్' తో చాలా గట్టిగానే కొడుతున్నాడని అనిపిస్తూ ఉంది. ప్రమోషన్స్ నే అందుకు సాక్ష్యం. పైగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకుడు కూడా తనే కావడంతో అంచనాలు పీక్ లో ఉన్నాయి. తెలుగు బాక్స్ ఆఫీస్ కి ఇప్పటివరకు పెద్దగా పరిచయం లేని సరికొత్త స్లాషర్ థ్రిల్లర్ కథాంశంతో కల్ట్ తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీలో విపరీతమైన బజ్ క్రియేట్ కాగా తాజాగా విడుదలైన డిస్ట్రిబ్యూటర్ల అధికారిక జాబితా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ని మరింత పెంచేసింది.   తెలంగాణ ప్రాంత హక్కులని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సునీల్, వైజాగ్  ప్రాంతంలో  దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ (SVC) సంస్థ, ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లెజెండరీ సంస్థ సురేష్ మూవీస్, కృష్ణా జిల్లాలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అలంకార్ ప్రసాద్, గుంటూరు జిల్లాలో పద్మావతి ఫిలిమ్స్ సుబ్బారావు, సీడెడ్  తిరుపతి ప్రసాద్, నెల్లూరు శ్రీ వెంగమాంబ సినిమాస్. కర్ణాటక మార్కెట్‌లో బెంగళూరు కేంద్రంగా కుమార్ ఫిలిమ్స్ భారీ విడుదలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ చిత్రానికి అత్యుత్తమ టెక్నికల్ నిపుణుల బలం కూడా బలంగా తోడైంది. కన్నడలో ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్  సంగీతం, నేపథ్య సంగీతం సమకూరుస్తుండగా, టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ రైటర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి పదునైన డైలాగ్స్ అందించారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల  అత్యున్నత నిర్మాణ విలువులతో నిర్మించారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా చేస్తుండగా , తారక్ పొన్నప్ప, మురళీ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు ట్రైలర్ లో చూపించిన ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, భయానక వాతావరణం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అక్టోబర్ ౩౦ రిలీజ్ డేట్ .  ఇది కూడా చదవండి: కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' మూవీ ఆడియో రైట్స్‌కి రికార్డు ధర.. టాప్ హీరో రేంజ్ లో!     స్లాషర్ థ్రిల్లర్ అనేది హారర్, సస్పెన్స్ సినిమాల్లో దాగి ఉండే ఒక ప్రత్యేకమైన ఉప జానర్. ఈ రకమైన సినిమాల్లో సాధారణంగా ఒక సైకో కిల్లర్ లేదా ముసుగు ధరించిన వ్యక్తి ఒక సమూహాన్ని లేదా కొంతమంది వ్యక్తులని దారుణమైన ఆయుధాలతో వెంటాడి వేటాడి చంపడం ముఖ్య కథాంశంగా ఉంటుంది.    [vishwak Sen Cult Movie Distributors, Vishwak Sen Cult movie, Cult theatrical release, Vishwak Sen director, Asian Sunil Nizam rights, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
ఇంటి బాధ్యతలను మోస్తూ, కుటుంబం  కోసం నిరంతరం శ్రమిస్తున్న మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి పనులు, ఆఫీస్ బాధ్యతల ఒత్తిడిలో పడి మహిళలు తమ శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను, అనారోగ్య సూచనలను సాధారణంగా కొట్టిపారేస్తుంటారు. అయితే, మన శరీరం ప్రతి చిన్న విషయానికీ స్పందిస్తూ కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తూ ఉంటుంది. వాటిని సమయానికి గుర్తించి జాగ్రత్త పడకపోతే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అసలు కొందరు మహిళలు ఘాటైన వాసనలు పదే పదే చూడాలని ఎందుకు అనుకుంటారు? దీని వెనకున్న ఆరోగ్య సమస్య ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. ఘాటైన వాసనలు.. రోజూవారీ జీవితంలో మనలో చాలామందికి కొన్ని వింత అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా అమృతాంజనం, విక్స్ లేదా నీలగిరి తైలం వంటి ఘాటైన వాసనలను పదే పదే పీల్చాలని అనిపించడం, లేదా వాటిని దగ్గరగా పెట్టుకుని చూడటం చేస్తుంటారు. అలాగే వంటగదిలో ఉండే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలను , మసాలా దినుసులను సాధారణ మోతాదు కంటే ఎక్కువగా, నేరుగా నమిలి తినాలనిపించడం లాంటి కోరికలు కలుగుతుంటాయి. ఇవి కేవలం సాధారణ రుచికి సంబంధించిన అలవాట్లు కాకపోవచ్చు. ఎందుకు ఈ అలవాట్లు..? వైద్య శాస్త్రం ప్రకారం, శరీరంలో హిమోగ్లోబిన్ లేదా ఐరన్ శాతం తగ్గినప్పుడు ఇలాంటి ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. దీనిని 'పికా' (Pica) అనే ఆరోగ్య పరిస్థితిగా చెబుతారు. శరీరంలో రక్తం కొరత ఏర్పడినప్పుడు లేదా ఎర్ర రక్త కణాల నిర్మాణం మందగించినప్పుడు, మెదడుకు అందవలసిన పోషకాలు సరిగ్గా అందక ఇటువంటి వింతైన కోరికలు పుట్టుకొస్తాయి. మట్టి, సుద్ద, ఐస్ ముక్కలు తినాలనిపించడం ఎంత సాధారణమో, ఘాటైన వాసనలను పీల్చాలనిపించడం , మసాలా దినుసులను తినాలనిపించడం కూడా అదే కోవలోకి వస్తుంది. కారణాలు.. మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించడానికి ప్రధాన కారణాలు రకరకాలుగా ఉంటాయి. క్రమ పద్ధతిలో లేని జీవనశైలి, నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావం, పోషకాహార లోపం,  విశ్రాంతి సరిగా లేకపోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ మోతాదు వేగంగా పడిపోతుంది. దీనివల్ల ఎప్పుడూ నీరసం, తలతిరగడం, శరీరం తెల్లగా మారడం, ఏకాగ్రత తగ్గడం, పనులపై ఆసక్తి సన్నగిల్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి తోడు ఈ ఘాటైన వాసనలను పీల్చడం వల్ల లేదా మసాలా పదార్థాలను అధికంగా తినడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం దొరికినట్లు అనిపించినా, అది దీర్ఘకాలంలో కడుపులో మంట, అల్సర్ , జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి వింత లక్షణాలు లేదా అలవాట్లు మీలో లేదా మీ చుట్టూ ఉన్న మహిళల్లో కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దు. వెంటనే ఒకసారి వైద్యులను సంప్రదించి కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC) పరీక్ష చేయించుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలము. పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, బీట్రూట్, దానిమ్మ పండ్లు, ఖర్జూరాలు, బెల్లం, వేరుశెనగలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన ఆలోచనలే మహిళల నిజమైన ఎదుగుదలకు, సాధికారతకు బలమైన పునాది వేస్తాయి.                                                                                                                                                  *రూపశ్రీ.
మన శరీరానికి ఎముకలు ఎంత బలంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా ఎముకలు , దంతాలు పటిష్టంగా ఉండటంలో కాల్షియం  చాలా అవసరం. ఇది కేవలం ఎముకలను గట్టిపరచడమే కాకుండా, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, నరాల ద్వారా మెదడుకు సంకేతాలు అందడంలో , రక్తం గడ్డకట్టే ప్రక్రియలోనూ కీలకపాత్ర  పోషిస్తుంది. అయితే చాలా మంది రోజూ పాలు, పెరుగు లాంటివి తీసుకుంటున్నప్పటికీ, వారి శరీరానికి తగినంత కాల్షియం అందడం లేదని ఆందోళన చెందుతుంటారు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పొరపాట్లు ఉండటం వల్ల, అది శరీరంలో కలిసిపోవడానికి బదులుగా నీటిలా కరిగిపోయి వృథాగా బయటకు వెళ్లిపోతుంటుంది. అలా జరగడానికి కారణాలు ఏంటో.. ఆ ఆహారపు పొరపాట్లు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. విటమిన్-డి లేకపోవడం.. శరీరంలో కాల్షియం లోపించడానికి ప్రధాన కారణాలలో విటమిన్ డి లేకపోవడం ఒకటి. మనం ఎంత కాల్షియం తీసుకున్నప్పటికీ, అది ఎముకలకు చేరాలంటే శరీరంలో తగినంత విటమిన్ డి ఉండటం చాలా అవసరం. ఒకవేళ విటమిన్ డి లోపిస్తే మాత్రం మనం తీసుకునే పోషకాలు పూర్తిగా శోషించబడవు. ఉదయం పూట ఎండలో కాసేపు గడపడం లేదా అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. విటమిన్ డి లేకపోతే క్యాల్షియం శరీరంలో పూర్తిగా వృథా అయిపోతుంది. ఉప్పు.. మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు మోతాదు ఎక్కువైతే అది ఎముకల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఉప్పులో ఉండే సోడియం  మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లేటప్పుడు, దానితో పాటు శరీరంలోని ముఖ్యమైన కాల్షియం కూడా కరిగిపోయి బయటకు వెళ్లిపోతుంది. చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, నిల్వ ఉంచిన పచ్చళ్ళు , అతిగా ఉప్పు ఉండే పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు క్రమంగా గుల్లబారే ప్రమాదం ఉంది. దీనితో పాటు అతిగా టీ లేదా కాఫీలు తాగే అలవాటు ఉన్నవారిలో కూడా కాల్షియం శోషణ మందగిస్తుంది. కాల్షియం ఆహారాలు తీసుకోకపోవడం..   డైట్ లో కాల్షియం సమృద్ధిగా ఉండే పదార్థాలను పూర్తిగా విస్మరించడం కూడా సమస్యను కలిగిస్తుంది. కేవలం ఏదో ఒకటి తింటున్నాము అనుకోకుండా పాలు, పెరుగు, పన్నీర్, ఆకుకూరలు, వివిధ రకాల గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరానికి అవసరమైన విభిన్న రకాల పోషకాలు అందాలంటే ఆహారంలో   వెరైటీగా  ఉండాలి. అవసరమైతే ఆహార నిపుణులను సంప్రదించి సరైన సప్లిమెంట్లను కూడా వాడుకోవచ్చు. ఆహారాలతో  పాటు ధూమపానం , మద్యం సేవించే అలవాట్లు కూడా ఎముకల బలాన్ని దెబ్బతీస్తాయి. ఇటువంటి వ్యసనాలు శరీరంలో కొత్త ఎముకల తయారీని మందగించి, ఉన్న ఎముకలు వేగంగా బలహీనపడేలా చేస్తాయి. దీనివల్ల శరీరానికి అందే కాల్షియం పూర్తిగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ సమస్యలన్నింటి నుంచి దూరంగా ఉండాలంటే వ్యసనాలకు దూరంగా ఉంటూ, రోజూ కాసేపు నడక వంటి వ్యాయామాలు చేస్తూ, సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.                                                                                                                                           *రూపశ్రీ.
శాకాహారం మంచిదా లేక మాంసాహారం మంచిదా అనే చర్చ చాలా సందర్భాలలో వస్తుంది. ముఖ్యంగా మాంసాహారాన్ని ఇష్టపడేవారు, శాకాహారాన్ని ఇష్టపడేవారు ఒకే దగ్గర చేరినప్పుడు ఈ రెండింటి మధ్య గల తేడా గురించి చాలా వాదించుకుంటూ ఉంటారు. దీర్ఘాయువుకు శాకాహారమే కీలకం అని కొందరు నమ్మితే..  మాంసంలో లభించే ప్రోటీన్ మరియు పోషకాలు మరింత ప్రయోజనకరమని మరికొందరు వాదిస్తారు. అయితే ఆరోగ్యం , దీర్ఘాయువు కోసం ఏ ఆహారం నిజంగా మంచిది? ఆరోగ్య నిపుణులు,  పరిశోధకులు దీని గురించి ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే..   శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు.. శాకాహారులకు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం , క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.  శాకాహారుల ఆహారంలో పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా , వల్ల, వారు సాధారణంగా తక్కువ బరువు మరియు తక్కువ బాడీ మాస్ ఇండెక్స్‌ను కలిగి ఉంటారు. కూరగాయలు , పండ్ల నుండి లభించే విటమిన్లు E, C , కెరోటిన్ శరీరాన్ని అంతర్గతంగా బలోపేతం చేయడానికి సహాయపడతాయి,  తక్కువ సంతృప్త కొవ్వులు గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. మాంసాహారం.. శాకాహారులు ఎక్కువ కాలం జీవిస్తారని చాలా కాలంగా నమ్మేవారు, కానీ చైనాలోని వృద్ధులపై ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ఈ భావనను సవాలు చేసింది. ఈ పరిశోధన ప్రకారం, మాంసాహారం తినేవారితో పోలిస్తే, కఠినమైన శాకాహారాన్ని పాటించేవారికి 100 ఏళ్ల వయస్సును చేరుకునే అవకాశం తక్కువగా ఉన్నట్లు కనుగొనబడిందట. దీని అర్థం, వృద్ధాప్యంలో శరీరానికి అవసరమైన పోషకాలను కేవలం మొక్కల ఆధారిత ఆహారంతో మాత్రమే పొందలేము. మధ్యేమార్గం.. మాంసాహారం తినేవారితో పోలిస్తే, చేపలు , పాల ఉత్పత్తులను తినేవారు లేదా చేపలు, పాల ఉత్పత్తులతో కూడిన శాకాహారాన్ని  తీసుకునేవారికి ఆరోగ్యపరంగా బాగుంటుందట. దీనిని బట్టి దీర్ఘకాలం  ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంలో, పూర్తిగా శాకాహారిగా లేదా పూర్తిగా మాంసాహారిగా ఉండటం కంటే, సమతుల్య ఆహారం తీసుకోవడమే ఎక్కువ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఇతర కారకాలు.. దీర్ఘాయువు కేవలం ఆహారపు అలవాట్లపై మాత్రమే ఆధారపడి ఉండదని పరిశోధకులు అంటున్నారు. జన్యుపరంగా, జీవనశైలి, శారీరక శ్రమ, మొత్తం ఆరోగ్యం వంటి అనేక అంశాలు కూడా సమాన పాత్ర పోషిస్తాయి. అందువల్ల, కేవలం శాకాహారిగా లేదా మాంసాహారిగా ఉండటం అనేది దీర్ఘాయువు నిర్ణయించబడదు అంటున్నారు.                                  *రూపశ్రీ