
నిధి అగర్వాల్.. నిండు చందమామని తలపించేలా ముగ్ధ మనోహర రూపంతో తొణికిసలాడుతూ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన 'హరిహర వీరమల్లు'నే వన్ ఆఫ్ ది ఎగ్జంపుల్. ప్రీవియస్ మూవీ ప్రభాస్ 'ది రాజాసాబ్' తో కూడా మెప్పించిన నిది నుంచి కొత్త ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏమి రాకపోవడంతో నిధి పని అయిపోయిందా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఆ రూమర్స్ కి దవడ వాసేలా అరడజను ప్రాజెక్ట్స్ ని ప్రకటించి ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌లలో ఒకరిగా నిధి దూసుకుపోతుంది. రాబోయే రెండేళ్ల కాలంలో ఆమె నటించిన మరియు నటిస్తున్న దాదాపు ఆరు చిత్రాలు వరుసగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన భాషా పరిశ్రమలని కవర్ చేస్తూ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టులని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఆమె చేతిలో ప్రస్తుతం మూడు బాలీవుడ్ చిత్రాలు, ప్రముఖ 'స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్' నిర్మిస్తున్న తమిళ చిత్రం, తెలుగులో ఒక యంగ్ హీరో సినిమాతో పాటు ప్రతిష్టాత్మక లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి: వైలెన్స్ వద్దు, ఫ్యామిలీ చిత్రాలే ముద్దు: పీచే మూడ్!

మరి రాబోయే రెండేళ్లలో దాదాపు అరడజను సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు నిధి అగర్వాల్ సిద్ధమవుతుంది. దీన్ని బట్టి ఆమె పని అయిపోలేదు. ఇప్పుడు మరింత స్పీడ్ అయ్యిందని చెప్పవచ్చు.
[Nidhhi Agerwal Silences Rumours With Six Films, Nidhhi Agerwal, Hari Hara Veera Mallu, The Raja Saab, Nidhhi Agerwal upcoming movies, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]






