Home

»

Latest News

రుకు రుకు రుక్మిణి: కృష్ణ ప్రేమ పాట భలే క్యూట్‌గా ఉంది.!

Oct 27, 2026 5:36PM

నితిన్ హీరోగా నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా ‘అలియాస్ రుక్మిణి’. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘రుకు రుకు రుక్మిణి’ ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆఫియా సయ్యద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఇప్పుడు కృష్ణ, రుక్కుల ప్రేమకథను పరిచయం చేస్తూ ఈ పాట వచ్చింది.

‘రుకు రుకు రుక్మిణి’ పాటలో ప్రధానంగా ఆకట్టుకునేది దాని పెప్పీ మ్యూజిక్. విజయ్ బుల్గానిన్ తనదైన స్టైల్‌లో క్యాచీ ట్యూన్‌తో పాటను కంపోజ్ చేశారు. వినగానే హమ్ చేసుకునేలా ఉండే పదాలు, రిథమ్‌కు తగ్గట్టుగా సాగే సంగీతం ఈ పాటకు ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తున్నాయి.

పూర్ణాచారి అందించిన లిరిక్స్‌లో కృష్ణుడు, రుక్మిణి పేర్లను ఉపయోగిస్తూ ప్రేమకథకు ఒక ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చారు. అనురాగ్ కులకర్ణి వాయిస్ కూడా ఈ పాటలోని ఎనర్జీకి సెట్ అయింది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా సింపుల్‌గా, సరదాగా సాగే పాటగా దీన్ని రూపొందించారు.

ఈ పాటలో నితిన్ కృష్ణగా, ఆఫియా సయ్యద్ రుక్మిణిగా కనిపిస్తున్నారు. నితిన్ లుక్ కాస్త రిఫ్రెషింగ్‌గా ఉండగా.. ఆఫియా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఆఫియా ఈ సినిమాలో టీచర్ పాత్రలో కనిపించనుందని ఆమె గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. నితిన్ మాత్రం రచయిత కృష్ణగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో పాటలోని కృష్ణ, రుక్కుల ప్రేమకథ సినిమా కథకు ఎలా కనెక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

నితిన్ కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు, నాని బ్యానర్ లో రూపొందుతుండటంతో ‘అలియాస్ రుక్మిణి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 4, 2026న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇది కూడా చదవండి: ఉన్నంతలో మనకున్నంతలో.. ‘భజగోవిందం’ పాట వెనుక ఉన్న గొప్ప అర్థం తెలుసా.?

 

 

 

[Alias Rukmini First Single, Ruku Ruku Rukmini Song, Alias Rukmini Movie, Nithiin, Aafiya Syed, Vijay Bulganin, Anurag Kulkarni, Natural Star Nani, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com