
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. "కిల్లర్" సినిమా ఈ నెల 30న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్.
- "కిల్లర్" రిచ్ కంటెంట్ ఉన్న సినిమా. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. యు సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూశాక సెన్సార్ వాళ్ల మొహాలు ఆహ్లాదకరంగా కనిపించాయి. అంటే మా మూవీ వారికి నచ్చిందని అనుకున్నాం. మా సినిమాలో బ్లడ్ షెడ్ లేదు. రక్తం చూస్తే నాకే కళ్లు తిరుగుతాయి. కథలో హింస ఉన్నా, అది పాత్రలు ఎదుర్కొనే దాంట్లో కనిపించాలి గానీ పాత్రలను చిత్రహింసలు పెట్టినట్లు చూపించడం నాకు నచ్చదు.
- మా సినిమా టీమ్ లోని వారు మా కిల్లర్ మూవీని క్రిస్టోఫర్ నొలన్ ఒడిస్సీ సినిమాతో పోల్చారు. అది కొంచెం అతి అనిపించవచ్చు కానీ మా మూవీ చూసి బయటకు వచ్చాక ఒడిస్సీతో మీరే పోల్చుకుంటారు. మా సినిమాను ఒడిస్సీతో పోల్చడం ఒక స్పాయిలర్ కూడా. కొన్నేళ్ల కిందట నేను స్క్రూడ్ అనే కాన్సెప్ట్ తో కథ రాసుకున్నాను. అది అప్పటికి నాకున్న రిసోర్సెస్ కు రూపొందించడం కుదరలేదు. అదే స్క్రిప్ట్ ను ఇప్పుడున్న ఆడియెన్స్ టేస్ట్ కు తగినట్లు మార్పులు చేసి కిల్లర్ సినిమా రూపొందించాను.
- కిల్లర్ సినిమాలో ప్రతి పాత్ర ఆర్ లెటర్ తోనే స్టార్ట్ అవుతాయి. ప్రాజెక్ట్ రూట్ అనే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంగా ఈ సినిమా ఉంటుంది. హీరోయన్ జ్యోతి చేసిన రక్తిక, రనైన, రియా..ఇలా పేర్లు ఆర్ తో ఉంటాయి.
- మా సినిమా సెకండాఫ్ లో ట్విస్ట్ చెప్పినవారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించాం. దీని మీద ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. హైకోర్టు లాయర్స్ కూడా అందులో పాల్గొంటారు. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు మా మూవీ ప్రీమియర్స్ పడతాయి. 11 గంటలకు ఆ ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ చేయాలి. ఎవరు త్వరగా ఆన్సర్ పంపిస్తే వారి పేరు మా మూవీ సక్సెస్ మీట్ లో ఎల్ఈడీ స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తాం.

- ఈ నెల 30న రిలీజ్ అవుతున్న సినిమాల్లో రిచ్ కంటెంట్ ఉన్న సినిమా మాది అని చెబుతున్నాం. ట్రైలర్ రిలీజ్ చేశాక కూడా మా సినిమా స్టోరీ ఎవరికీ అందడం లేదు. అది సినిమాలోనే చూడాలి. కొత్తగా చేశామని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. వీళ్లు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుసుకునేందుకైనా ఆడియెన్స్ మాకు ఒక ఛాన్స్ ఇస్తారని నమ్ముతున్నాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ తో పాటు ఆనంద్ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. అలాంటి సందర్భాలు మనకు ఉన్నాయి.
- న్యూరోలింక్ మీద ఎలాన్ మస్క్ పరిశోధనలు చేస్తున్నాడు. అయితే మిషిన్స్ మీద చేస్తున్నాడు. మనిషి మీద చేస్తే ఎలా ఉంటుందనేది మా సినిమా కాన్సెప్ట్. అయితే ఎంటర్ టైనింగ్ గా చెబుతున్నాం కాబట్టి ప్రతి సీన్ ప్రేక్షకులకు సులువుగా అర్థమవుతుంది. ఈ సినిమాను 25 రోజుల్లో చిత్రీకరించాను.
- థ్రిల్లర్ సినిమాలంటే ప్రీ క్లైమాక్స్ వరకు మిమ్మల్ని హుక్ చేసి ఉంచే కంటెంట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అన్ని ట్విస్ట్ లు రివీల్ అవుతూ సర్ ప్రైజ్ చేస్తాయి. మా కిల్లర్ కూడా అదే తరహా మూవీ. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అనే పాయింట్ ను మాస్ ఎలిమెంట్స్ తో కలిపిన కథతో మీకు కన్విన్సింగ్ గా చూపించే చిత్రమిది. మా సినిమా చూస్తున్నప్పుడు థ్రిల్ తో పాటు చిన్న స్మైల్ కూడా మీకు వస్తుంది. కథలోని అసలైన పాయింట్ కు షాక్ అవుతారు. ఇలా కూడా సినిమాను తీయొచ్చా అనుకుంటారు.
[Killer Movie, Director Poorvaaj Interview, Killer Movie 1 Crore Reward, Jyoti Poorvaj, Christopher Nolan, The Odyssey, Elon Musk, Telugu Film News]






