LATEST NEWS
గొడ్డలి పార్టీ. ఈ పదం ప్రధానంగా వైసీపీని విమర్శించడానికి కూటమి నేతలు తరచూ వాడుతున్నారు. ఇక చంద్రబాబు అయితే.. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అని మరో మారు కామెంట్ చేశారు. గొడ్డలి పార్టీ నెవర్‌ అగైన్‌ అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు.  రప్పారప్పా రంకెలు.. జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలా? సీబీఎన్‌ దగ్గర తోక జాడిస్తే.. ప్రజాహితం కోసం తోక కట్ చేస్తానని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటులేదని కూడా అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకొక నాటకమాడుతున్నారు. అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కోడి కత్తి, గులకరాయి నాటకాలు గుర్తున్నాయి కదా? దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన వారికి సన్మానాలా? కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు.. తల్లి, చెల్లికి ఆస్తులివ్వకుండా వేధించారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వారు.. ప్రజలను ఏం చూస్తారని ప్రశ్నించారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. నేను ప్రజల సేవకుణ్ణి.. పెత్తందారు కాదు. నిరంతరం పనిచేసి పేదల రుణం తీర్చుకుంటా. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించింది- ఎన్డీయే కూటమి  అంటూ కామెంట్ చేశారు ఏపీ సీఎం. దీనంతటికీ కారణం.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గొడ్డలి వాడకం తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటినుంచి ప్రత్యర్థి పార్టీలు వైసిపిని టార్గెట్ చేస్తూ గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీ సంస్కృతిని గొడ్డలి సంస్కృతి అని పిలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రాబు తదితర కూటమి పార్టీల నేతలు.. ఇక పోతే కాక్రోచ్ ఆర్ బొద్దింక. ఇటీవల దేశ రాజకీయాల్లో బాగా వైరల్ అయిందీ పదం. ఎలా పుట్టింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ? అని చూస్తే.. సుప్రీం కోర్ట్  కోర్టు విచారణల సందర్భంలో దేశంలోని నిరుద్యోగ యువతను, కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉద్దేశించి బొద్దింకలు, సమాజ పరాన్న జీవులు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నా.. అది కాక్రోచ్ జనతా పార్టీ అంటూ కొత్త రూపు తీసుకుని ఫాలోయర్స్ సంఖ్య అమాంతం పెంచుకుని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుత కాలమాన పరిస్థితులపై ఒక వ్యంగ్యాస్త్రంగానూ నిలుస్తోంది.  ఇలాంటివే మరికొన్ని పదాలను చూస్తే.. పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని.  ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని,  మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు  పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో  ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు. ఇక పోతే ఇటీవలి కాలంలో బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఇంకో పదం..  మెలోడీ- ఇది మరీ ఇంటర్నేషనల్ క్రేజ్. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితమైన పదం కాదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన   నేమ్ మెలోడీ.  అంతర్జాతీయ సదస్సుల్లో వీరిద్దరూ కలిసినప్పుడు దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక సంభాషణలు, నవ్వులను చూసి నెటిజన్లు  మెలోడీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వేల సంఖ్యలో రీల్స్, మీమ్స్ సృష్టించారు. స్వయంగా ఇటలీ ప్రధాని మెలోని కూడా ఒక సెల్ఫీ వీడియో పెడుతూ " హలో ఫ్రం మెలోడీ టీమ్’  అనడంతో ఈ పదం గ్లోబల్ ట్రెండ్ అయిపోయింది. టాఫీ డిప్లమసీ లేదా చాక్లెట్ రాజకీయం కూడా ఇదే కోవలోకి వచ్చే పదమే.  ఇక రీల్స్ మంత్రి, బిర్యానీ పాలిటిక్స్ అంటూ రకరకాల మీమ్స్ కమ్ వర్డ్స్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఒకప్పుడు రాజకీయం అంటే కేవలం సీరియస్ ఉపన్యాసాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు.. గొడ్డలి పార్టీ, కాక్రోచ్ పార్టీ అంటూ సెటైరికల్ కామెంట్లతో పాటు మెలోడీ, టాఫీలాంటి సిల్లీ పదాల వల్ల పాలిటిక్స్ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌గా, మీమ్స్ మెటీరియల్‌గా మారిపోయాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట  పర్యటన తీవ్ర రాజకీయ దుమారానికి,  ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పరిసరాల్లో ప్రతిష్టాత్మకమైన శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు  శనివారం (మే23) యాదగిరిగుట్ట పర్యటన చేపట్టారు. అయితే..  అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ అధికారిక పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులకు,  కీలక అధికారులకు  సమాచారం ఇవ్వలేదనీ, తగిన ఆహ్వానం అందలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ   ప్రొటోకాల్ లోపం తలెత్తిందని ప్రతిపక్షాలు, కొందరు స్థానిక నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.   అదలా ఉండగా, సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా,  అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు   కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఏకంగా 15 నిమిషాల పాటు హెలికాప్టర్ లోనే వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీ పర్యటనలో స్థానిక యంత్రాంగం ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడంపై సచివాలయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఎం పర్యటనలో జిల్లా కలెక్టరేట్, పోలీస్ యంత్రాంగం వైఫల్యంపై ఉన్నతాధికారులు నివేదిక కోరినట్లు సమాచారం. 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ నిజానికి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ అన్నారు.  కడప పర్యటనలో భాగంగా లోకేష్, రాయలసీమ అభివృద్ధి, గత ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడారు.  జగన్   మాటలు తప్పడం, మడమ తిప్పడంలోనే దిట్ట అన్న లోకేష్..   ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని   గణాంకాలతో సహా ఎండగట్టారు. జగన్ హయాంలో సీమ ప్రాంత ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.   రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో   టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించారు. గతంలో అంటే 2014 - 2019 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 11,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తుచేశారు.  అయితే.. సీమ బిడ్డనని గొప్పలు చెప్పుకునే జగన్ తాను సీఎంగా ఉన్న  ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో కేవలం రూ. 2,700 కోట్లు మాత్రమే కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించినప్పుడు, దానివల్ల రాయలసీమకు జరిగే నష్టాన్ని ఆపడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిన డ్రిప్ ఇరిగేషన్  అంటే బిందు సేద్యం ) వ్యవస్థను జగన్  రద్దు చేసి రైతుల పొట్ట కొట్టారని విమర్శించారు.   టీడీపీ  హయాంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో, అలాగే మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందించి అండగా నిలిచిందని గుర్తు చేశారు.  తన  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన నటన చూస్తే  ఆయనకు భాస్కర్ అవార్డు ఖాయంగా వస్తుందని ఎద్దేవా చేశారు.  సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైతే, ఆ ఘోరమైన నిజాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుపైకి నెట్టేందుకు జగన్ ఎంతటి డ్రామాలు ఆడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.  మిషన్ రాయలసీమ  పేరుతో ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్,  డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నామన్న లోకేష్ . పుట్టపర్తిలో  ఐదో తరం యుద్ధ విమానాల (ఎఎంసీఏ) తయారీ కేంద్రానికి రూ. 15,803 కోట్లతో శంకుస్థాపన చేయడం రాయలసీమ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు. జగన్ పాలన కేవలం ఫ్యాక్షనిజం, కమిషన్ల చుట్టూ తిరిగితే, తమ కూటమి ప్రభుత్వం ఫైటర్ జెట్ల తయారీతో సీమ యువతకు ఉపాధి కల్పిస్తోందని గర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ పునరుద్ఘాటించారు.
 రాజకీయ విశ్లేషకుడిగా, విద్యావేత్తగా   గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఎప్పుడూ తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణలు  చేసే ఆయన, తాజాగా ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,  మంత్రి నాదెండ్ల మనోహర్‌లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. . అమిత్ షా పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని  జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయనపై కేసు పెట్టారు.  కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు, ఆ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రసారం చేసిన  టీవీ ఛానెల్‌పై కూడా పోలీసులు కేసు నమోదు అయ్యింది.   ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల జరిగిన ఒక టెలివిజన్ డిబేట్‌లో   గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. గతంలో ఒకానొక సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్   ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారనీ,   ఆ సందర్భంగా వారు మాజీ సీఎం జగన్ ను అరెస్టు చేయాలని   అమిత్ షాను కోరారనీ చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్..   అమిత్ షా రాజకీయాల్లో  ఇన్‌స్టంట్ ఫ్రెండ్,  లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనే వ్యత్యాసాలు ఉంటాయనీ,  చంద్రబాబు నాయుడు ఇన్‌స్టంట్ ఫ్రెండ్,   జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని పవన్, నాదెండ్ల మనోహర్ లకు తేల్చి చెప్పారనీ అన్నారు.   అంతే కాకుండా జగన్ విషయంలో వైఖరి మార్చుకోవాలని కూడా అమిత్ షా పవన్, నాదెండ్లకు సలహా ఇచ్చారని నాగేశ్వర్ ఆ డిబేట్ లో చెప్పారు.   ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.  అమిత్ షా అసలు అనని మాటలను అన్నట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కల్పించి చెబుతున్నారని..  కావాలనే కూటమి నేతల మధ్య, ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు  తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమిత్ షా, పవన్ కల్యాణ్‌ల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ జనసేన కార్యకర్తలు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌,  ఆ చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసిన టీవీ ఛానెల్ పై కేసు నమోదు చేశారు. 
    తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన తెలుగువన్ వాస్తవ వేదికలో ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై ఆసక్తికరమైన  విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని సాగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలజీవన్ మిషన్’ పథకం చుట్టూ ఇప్పుడు వివాదం ముదిరింది. పవన్ కళ్యాణ్ తన శాఖ పరంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపి, రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకురావడంలో విజయం సాధించారు. అయితే, కేంద్రం నుంచి విడుదలైన ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి చేరిన కేవలం అరగంట వ్యవధిలోనే మళ్ళించబడ్డాయనే ఆరోపణలు రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ నిధులు నేరుగా ‘మెఘా కృష్ణారెడ్డి’కి చెందిన సంస్థల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయనే అంశం ఇప్పుడు ప్రభుత్వ పారదర్శకతపై పెద్ద ప్రశ్న మార్క్‌గా నిలిచింది. రాజకీయ వ్యూహాలు మరియు అంతరార్థాలు: ఈ వ్యవహారంలో తెరవెనుక నడుస్తున్న రాజకీయ వ్యూహాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ నిధుల సాధన కోసం శ్రమిస్తుంటే, మరోవైపు ఆ నిధులు కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోవడం వెనుక ఉన్న శక్తులెవరనేది మిస్టరీగా మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న అంతర్గత సత్సంబంధాలను, ఏపీ కార్బైడ్స్ వంటి పరిశ్రమల్లో భాగస్వామ్యాలను గుర్తుచేస్తూ ప్రస్తుత రాజకీయ నాయకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఎన్నికల ముందు ప్రత్యర్థులుగా కనిపించే నాయకులు, తెరవెనుక ఒకే మంచం ఒకే కంచం అన్నట్లుగా వ్యవహరిస్తారనే వాదనకు బలం చేకూరుతోంది. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయనే భావన వ్యక్తమవుతోంది. ఇసుక రవాణాలో ప్రతి టిప్పర్‌కు భారీగా వసూళ్లు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా కాంట్రాక్టర్ల పెత్తనం మారకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే సంకేతాలు అందుతున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావం: ఈ నిధుల మళ్ళింపు ఉదంతం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక రాష్ట్ర మంత్రి కష్టపడి తెచ్చిన నిధులు, ఆయన ప్రమేయం లేకుండానే మళ్ళిపోవడం వల్ల ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణను వ్యతిరేకిస్తూ, ఎక్కువ మంది పిల్లలను కనాలని, మూడో బిడ్డకు రూ. 30 వేలు, నాలుగో బిడ్డకు రూ. 40 వేలు ఇస్తామని సరికొత్త పథకాలను ప్రకటిస్తున్నప్పటికీ, ప్రజల్లో నమ్మకం కలిగించడంలో విఫలమైతే ఆశించిన ఫలితం ఉండదు.  ప్రజల చదువు, ఆరోగ్యం, ఎదుగుదలకు ప్రభుత్వం అండగా ఉంటుందనే సంకేతాలు ఇవ్వనంత కాలం ఇటువంటి పథకాలు కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోతాయి. పాలనలో పారదర్శకత లోపిస్తే, రాబోయే రోజుల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, అది వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది. ఇలాంటి వివరాలు కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.  
ALSO ON TELUGUONE N E W S
  జననాయగన్ రేపో మాపో థియేటర్స్ లోకి వస్తుందని విజయ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కాచుకొని కూర్చున్నారు. కానీ రీసెంట్ గా నిర్మాత  వెంకట్ కె. నారాయణ రిలీజ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు  నెట్టింట వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ అయితే ఒక రకమైన షాక్ లో ఉండిపోయి విజయ్  ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు ముఖ్యమంత్రి కదా అంటున్నారు. మరి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. తాజాగా వెంకట్ కె. నారాయణ ఒక దేవాలయ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతు జన నాయగన్ కి ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. త్వరలోనే సెన్సార్  క్లియరెన్స్ ఇస్తుందని, సర్టిఫికేట్ చేతికి రాగానే రిలీజ్ డేట్ ని  ప్రకటిస్తామని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాము ఏ ఉద్దేశంతో అయితే  'జన నాయగన్' (ప్రజా నాయకుడు) అని పేరు పెట్టామో, సరిగ్గా అలాగే విజయ్ ఇప్పుడు తమిళనాడుకు నిజమైన జననాయకుడయ్యారని, సీఎం కావడంతో దేవుడి ఆశీస్సుల కోసం గుడికి వచ్చానని ఆయన పేర్కొన్నారు. Also read: Janaki ramudu: పంచాయతీలో అల్లుడికి షాక్ ఇచ్చిన అత్త   వెంకట్ కె. నారాయణ జననాయగన్ ని సుమారు 400 కోట్ల భారీ వ్యయంతో నిర్మించాడు. మెగాస్టార్ చిరంజీవి, బాబీ అప్ కమింగ్ మూవీని కూడా వెంకట్ కె. నారాయణనే నిర్మిస్తున్నాడు.   
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. రామ్ చరణ్ (Ram Charan) ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi) విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.  ఇకపై థియేటర్లలో ఏ సినిమా ప్రదర్శించాలన్నా పాత రెంటల్ విధానం కుదరదని, మల్టీప్లెక్స్ తరహాలోనే కచ్చితంగా 'పర్సంటేజ్ సిస్టమ్' అమలు చేయాల్సిందేనని అసోసియేషన్ తేల్చి చెప్పింది. 'పెద్ది' అయినా, లేక మరే ఇతర పెద్ద సినిమా అయినా సరే.. ఈ నిబంధన అందరికీ వర్తిస్తుందని థియేటర్ల యజమానులు ఖచ్చితంగా చెబుతున్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ ఆవేదనను పంచుకున్నారు. పెద్ది సినిమాపై తమకు పగ లేదని, ఈ సినిమా తర్వాత మళ్ళీ తమను పట్టించుకోరనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. "గతంలో 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ సమయంలోనే రెండు నెలల్లో మా సమస్యను పరిష్కరిస్తామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీ హామీ ఇచ్చింది, కానీ ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదు" అని సభ్యులు గుర్తు చేశారు.  పర్సంటేజ్ విధానాన్ని కావాలనే కొందరు నిర్మాతలు ఆలస్యం చేస్తున్నారని, 120 మందికి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారు పేర్కొన్నారు. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఈ పర్సంటేజ్ విధానం విజయవంతంగా నడుస్తోందని, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దీనిని ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఎగ్జిబిటర్లు ప్రశ్నించారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి ఎగ్జిబిటర్లకు పైసా ఆదాయం మిగలడం లేదని, అదే సమయంలో నిర్మాతలకు మాత్రం థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రూపంలో 14 రకాలుగా ఆదాయం వస్తోందని వారు గుర్తుచేశారు.  ఈ సమస్యపై అవసరమైతే మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ బాధలను చెప్పుకుంటామని, నిర్మాతలు పర్సంటేజ్ సిస్టమ్‌పై సంతకం పెడితేనే 'పెద్ది' సినిమా రిలీజ్‌కు సహకరిస్తామని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది.  టికెట్ ధరల పెంపు విషయంలోనూ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా ఇచ్చినట్లు తెలిపింది. ఈ పరిణామాలతో రాబోయే పెద్ద సినిమాల విడుదలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.  
The Telangana Exhibitors and the Telugu Film Chamber of Commerce have given a major shock to the makers of Peddi. Producer Venkata Satish Kilaru had asked for the rental system to be continued for the film in the Telugu States, and during the Film Chamber mediation, he agreed to give a nominal percentage as well. However, today, the Telangana Exhibitors appeared before the press and stated that they will not allow the exhibition of Peddi or any other film in Telangana from here on if the producers do not accept the percentage system. The exhibitors stated that producers should immediately decide on the percentage they are ready to give for Peddi and all future films. They opined that the active guild is trying to sweep the issue under the carpet, just like they did during Hari Hara Veera Mallu, and are firing from the shoulders of Peddi. Furthermore, shocking everyone, they announced that they have written a letter to the state's CM, Revanth Reddy, requesting that ticket price hikes should not be awarded to any film. Due to the recent hikes, family audiences are avoiding walking into single screens and even multiplexes. They also requested the CM to provide some tax benefits, as single-screen theatres are bleeding and the industry needs incentives to carry on. On the other hand, the Peddi team is in Bhopal for the Hellallalo song launch event. A.R. Rahman is going to perform live at the event. Ram Charan and Janhvi Kapoor have arrived in the city. Directed by Buchi Babu Sana, the movie has generated huge anticipation and buzz.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    పునర్జన్మల నేపథ్యంతో వచ్చిన అరుదైన దృశ్యకావ్యాల్లో 'జానకిరాముడు' కి ప్రత్యేక స్థానం ఉంటుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, యువచిత్ర ఆర్ట్స్ పై అభిరుచిగల నిర్మాత కె .మురారి నిర్మించగా 1988 ఆగస్టు 19న విడుదలై ఘనవిజయం సాధించింది. కింగ్ అక్కినేని నాగార్జున, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా చేయగా, కథని మలుపు తెప్పే మరో కీ రోల్ లో జీవితా రాజశేఖర్ కనిపించింది. నటీనటులందరూ పోటాపోటీగా నటించడం ఈ చిత్రం స్పెషాలిటీ. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ సాగే ఎమోషనల్ సీన్లు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇక పైన ఉన్న వీడియోలో సన్నివేశాన్ని చూస్తే రంగడు(నాగార్జున), లక్ష్మి (విజయశాంతి) ప్రేమించుకుంటారు.తల్లి తండ్రుల సమక్షంలో నిచ్చితార్ధం ఏర్పాటు చేసి పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. కానీ లక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి అయిందని బావ బలవంతరావు(మోహన్ బాబు) అతని తల్లి సాక్షాలతో సహా నిరూపిస్తారు. పంచాయితీలో పెట్టినా కూడా లక్ష్మి, బలవంతరావు భార్య భర్తలని అంటారు. దీంతో రంగడు, లక్ష్మి ల పెళ్ళికి అడ్డుకట్ట పడుతుంది. లక్ష్మి తండ్రికి పక్షవాతం రావడంతో లక్మి కూడా బలవంతరావు  గీసిన గీత దాటి వెళ్లలేకపోతుంది. ఈ సన్నివేశంలో నటీనటుల నటన, డైలాగ్స్, దర్శకత్వం సూపర్ గా ఉంటాయి     కె. వి. మహదేవన్ అందించిన అద్భుతమైన సంగీతం ఈ చిత్రానికి కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, నంది అవార్డుని  గెలుచుకుంది. సినిమా విడుదలైన ఈ 38 ఏళ్ల కాలంలో ఎన్నో ప్రేమకథలు వచ్చినా, జానకిరాముడు చిత్రంలోని ఎమోషనల్ సీన్స్,  నటన ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.   
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు కానుకగా మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'NTRNeel' అధికారిక టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన 'డ్రాగన్' (Dragon) ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్, తారక్‌ను మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్, డార్కెస్ట్ అవతారంలో ప్రెసెంట్ చేశారు. దాదాపు 4 నిమిషాల పైగా నిడివితో వచ్చిన ఈ గ్లింప్స్ వీడియో కేవలం టీజర్ మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ సృష్టించిన ఒక సరికొత్త రక్తపాత సామ్రాజ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ కథ 1967 నాటి అంతర్జాతీయ ఓపియం (నల్లమందు) వ్యాపారం, స్మగ్లింగ్ నేపథ్యంతో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశ సరిహద్దుల్లో డ్రగ్స్ మాఫియాను శాసించిన అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య జరిగే సుప్రీమసీ వార్‌ను ఈ గ్లింప్స్‌లో అద్భుతంగా చూపించారు.  అయితే 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చిన తర్వాత 'Chasing the Dragon' గురించి తెగ చర్చ జరుగుతోంది. 'Chasing the Dragon'... వినడానికి ఏదో హాలీవుడ్ ఫాంటసీ సినిమా పేరులా ఉంది కదూ? కానీ దీని వెనుక ఉన్నది ఒక భయంకరమైన, నెత్తుటి డ్రగ్ హిస్టరీ! ఈ డ్రాగన్ వెనుక ఉన్న అసలు విలన్ 'Opium Poppy' అంటే నల్లమందు గసగసాల మొక్క. దీని కాయల నుండి వచ్చే తెల్లటి జిగురుతోనే అఫిమ్, మార్ఫిన్, చివరకు ప్రపంచాన్ని వణికించే మోస్ట్ డేంజరస్ డ్రగ్ 'హెరాయిన్ (Heroin)' తయారుచేస్తారు. అయితే, ఈ హెరాయిన్ లేదా నల్లమందును కాల్చి, ఆ పొగను పీల్చే ఒక చైనీస్ ట్రెడిషనల్ పద్ధతి ఉంది. అల్యూమినియం ఫాయిల్ మీద ఆ డ్రగ్ పౌడర్ వేసి కింద మంట పెడితే... అది కరిగి ద్రవ రూపంలోకి మారి, ఒక చైనీస్ డ్రాగన్‌లా మెలికలు తిరుగుతూ పైకి పాకుతుంది. ఆ వచ్చే తెల్లటి పొగను ఒక పైప్ ద్వారా పీలుస్తారు. ఆ పొగ పైకి వెళ్తుంటే... డ్రగ్ అడిక్ట్స్ దాన్ని వదలకుండా పీల్చడానికి ఆ పొగ వెనుక పరిగెడతారు. అందుకే ఈ ప్రాసెస్‌కు 'Chasing the Dragon' (డ్రాగన్‌ను వేటాడటం) అనే పేరు వచ్చింది. అందుకే ఈ సినిమాకు 'డ్రాగన్‌' అనే టైటిల్ పెట్టారని అర్థమవుతోంది. అంతర్జాతీయ క్రైమ్ వరల్డ్‌లో 'డ్రాగన్' అనేది అపరిమితమైన పవర్, డిస్ట్రాక్షన్ (విధ్వంసం)కు చిహ్నంగా భావిస్తారు. ఈ డ్రగ్ తీసుకునేటప్పుడు మెదడుకు వచ్చే ఆ ఊహాజనిత కిక్ కోసం అడిక్ట్స్ ఎంతటి దారుణమైన క్రైమ్ చేయడానికైనా వెనకాడరు. ఒక్కసారి ఆ డ్రాగన్ ట్రాప్‌లో పడ్డారా ఇక జీవితం ముగిసిపోయినట్లే. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ అండ్ డార్క్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లలో ఆడియన్స్ సీట్ల అంచున కూర్చోవడం ఖాయం. ఒక చిన్న మొక్క ప్రపంచాన్ని శాసించే అంతర్జాతీయ మాఫియాగా ఎలా మారింది అనేది నిజంగానే ఒక పవర్‌ఫుల్ సినిమా స్క్రిప్ట్‌కు పర్ఫెక్ట్ మెటీరియల్.  ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో కేజీఎఫ్ కోసం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, సలార్ కోసం ఖాన్సార్ వంటి డార్క్ వరల్డ్‌లను సృష్టించినట్లే, ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో ఈ ఓపియం పాపీ చేసింగ్ ది డ్రాగన్ నెట్‌వర్క్‌ను హీరో ఎలా చేదించాడు, ఆ పాయిజనస్ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడు అనేది చూపించబోతున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన చీఫ్ అస్సాసిన్ 'లూగర్' (Luger) పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ రగ్గడ్ అండ్ వయోలెంట్ లుక్ గ్లింప్స్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా విజువల్ వండర్ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.   
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా రాబోతోందనే వార్త గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీని ఊపేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మించడానికి పూనుకుంది. దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ ఫార్మాలిటీస్‌ను ప్రారంభించాలని మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.  అయితే, ఇప్పుడు నందమూరి అభిమానులకు ఒక ఊహించని షాకింగ్ న్యూస్ వినబడుతోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల బాలయ్య, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ సినిమా పూర్తిగా అటకెక్కింది (Shelved). ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పటికీ బయటకు రానప్పటికీ, ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. ఆయన ఇటీవల మాస్ మహారాజా రవితేజను కలిసి ఒక అద్భుతమైన లైన్ వినిపించారు. వివేక్ ఆత్రేయ చెప్పిన కథ రవితేజకు విపరీతంగా నచ్చేయడంతో, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  విశేషం ఏంటంటే, బాలకృష్ణతో సినిమా చేయాలనుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఇప్పుడు రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబో ప్రాజెక్ట్‌ను కూడా బ్యాంక్రోల్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రాబోతోంది.  ప్రస్తుతం రవితేజ, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇరుముడి' (Irumudi) అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తిగా పూర్తయిన తర్వాత, అంటే ఈ ఏడాది చివర్లో వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.  
Producer Namit Malhotra's highly anticipated epic, Ramayana, is getting ready for an early release. Originally planned for a Diwali 2026 release, the movie is now moving its theatrical debut to October 30, which is exactly a week before the main festival. Moving the release date is a strategic move to get the most out of the holiday season. Explaining this strategy, a source stated, "Namit Malhotra wants the film to establish itself before the Diwali period. He wants the word of mouth to spread all across, so that the business peaks in the second week. He is here to redefine business by not just bringing a pre-Diwali release, but also a film that scores a bigger second week than the first due to the festive period. The conversation to pre-pone by a week is underway, and a final decision will be taken soon." Directed by Nitesh Tiwari, this massive project features a brilliant star cast. Ranbir Kapoor plays the lead role of Lord Ram, with Sai Pallavi as Goddess Sita and Yash as Ravana. The talented supporting cast includes Sunny Deol as Lord Hanuman, Ravi Dubey as Lakshman, Arun Govil as King Dashrath, and Lara Dutta as Kaikeyi. Shridhar Raghavan has written the screenplay, while the music is composed by legends Hans Zimmer and A.R. Rahman.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  రాజకీయాలకి, సినిమాలకి ఉన్న బంధాన్ని దూరం చేయడం అసాధ్యమని రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్(Vijay)మరో సారి నిరూపించాడు. పైగా ఎన్నికల బరిలోకి దిగిన మొదటిసారే ఘన విజయాన్ని అందుకుని తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విజయ్ సాధించిన ఈ అద్భుతమైన విజయం తర్వాత ఇప్పుడు కోలీవుడ్‌లో నటీనటుల పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే సీనియర్ నటి వనితా విజయ్‌కుమార్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha)కృష్ణన్ రాజకీయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అవుతున్నాయి.   రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వనితా మాట్లాడుతు త్రిషకి రాజకీయాల్లోకి రావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. పరిశ్రమలో దాదాపు 20 సంవత్సరాలకి  పైగా అగ్ర కథానాయికగా కొనసాగుతూ, 50కి పైగా వైవిధ్యమైన సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. ఇదేమి సామాన్యమైన విషయం కాదు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె సంపాదించుకున్న అపారమైన ప్రజాదరణ, మానసిక పరిపక్వత ఆమెని ఒక గొప్ప నాయకురాలిగా నిలబెడతాయి. Also read: Peddi: పెద్ది ఊచకోత.. పుష్ప-2 రికార్డులని బ్రేక్ చేస్తుందా? సమాజంలో ఎంతోమంది అభిమానులని  సంపాదించుకున్న త్రిష, ప్రజా సేవలోకి వస్తే అద్భుతాలు చేయగలదు. ప్రజల నాడిని పట్టుకోవడంలో, వారి సమస్యలను అర్థం చేసుకోవడంలో సినిమా రంగం ఇచ్చిన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది.   దళపతి విజయ్ మాదిరిగానే త్రిష కూడా ప్రజల మద్దతుతో రాజకీయాల్లో సంచలనాలు సృష్టించగలదు. దివగంత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చదువుకున్న స్కూల్ లోనే త్రిష కూడా చదువుకుందని వనితా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి. వనితా తెలుగులో చేసిన 'దేవి' తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం వనితా తెలుగు ప్రేక్షకుల మనసుల నుంచి వెళ్లిపోదు.  
1. 'పెద్ది'కి షాకిచ్చిన సెన్సార్ బోర్డు 'పెద్ది' సినిమాలోని 'చికిరి' పాట సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. అయితే అందులో 'స‌రుకు - సామాను' ప‌దంపై కొంత అభ్యంత‌రం వ్యక్తమైంది. సెన్సార్ బోర్డు కూడా పాట‌లో ఈ ప‌దానికి క‌త్తెర వేసింది. ఆ స్థానంలో కొత్త మాట వినిపించ‌బోతోంది. 'U/A' స‌ర్టిఫికెట్ తో.. 3 గంట‌ల 9 నిమిషాల డ్యూరేష‌న్ తో.. జూన్ 4న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.  2. ఆగిపోయిన బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్! నందమూరి బాలకృష్ణ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాలనుకున్న భారీ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ.. మాస్ మహారాజా రవితేజకు ఒక సరికొత్త కథను వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. 3. 'సలార్‌ 2'పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్! ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి సీక్వెల్ గా రావాల్సిన 'సలార్‌ 2' ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటికి చెక్ పెడుతూ తాజాగా ప్రశాంత్ నీల్ 'సలార్ 2' పై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఎన్టీఆర్‌తో చేస్తున్న 'డ్రాగన్' పూర్తయిన తర్వాత, 'సలార్ 2' షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. 4. ఫేక్ బికినీ ఫోటోలపై రుక్మిణి వసంత్ ఫైర్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన బికినీ ఫోటోలపై హీరోయిన్ రుక్మిణి వసంత్ స్పందించారు. ఆ బోల్డ్ విజువల్స్ ఫేక్ అని, AIను ఉపయోగించి కొందరు ఆకతాయిలు ఈ మార్ఫింగ్ కు పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు. ఏఐ డీప్‌ఫేక్ చేసిన వారిని, వాటిని ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించేందుకు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెటిజన్లు ఎవరూ ఇలాంటి ఫేక్ ఫోటోలను షేర్ చేయవద్దని రుక్మిణి వసంత్ విజ్ఞప్తి చేశారు. 5. అక్కినేని అఖిల్ 'లెనిన్' టీజర్ రివ్యూ అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లెనిన్' టీజర్ విడుదలైంది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లో.. అఖిల్ సరికొత్త మాస్ మేకోవర్‌, చిత్తూరు యాసలో అఖిల్ పలికిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో సాగే క్యూట్ లవ్ ట్రాక్, సరదా సంభాషణలు టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివర్లో వచ్చే ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ సినిమా రేంజ్‌ను పెంచేశాయి. ఈ సినిమా జూన్ 26న థియేటర్లలోకి రానుంది. 6. 'బాహుబలి' బాటలో 'స్వయంభు'  టాలీవుడ్ లో 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి విజువల్ వండర్స్ తర్వాత అత్యధిక గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న చిత్రాల జాబితాలో ఇప్పుడు 'స్వయంభు' చేరిపోయింది. ఈ సినిమాలో ఏకంగా 2,700కు పైగా VFX షాట్స్ ఉండబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దాదాపు 750 మంది CG ఆర్టిస్టులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఒక మిడ్-రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో గ్రాఫిక్స్ పనులు జరగడం హాట్ టాపిక్ గా మారింది. 7. 'రౌడీ జనార్దన' కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్! విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 'రౌడీ జనార్దన' మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు వర్క్ చేయబోతున్నారు. 'యానిమల్', 'టాక్సిక్' చిత్రాల ఫేమ్ విశాల్ మిశ్రా ఈ సినిమాలోని పాటలకు స్వరకల్పన చేస్తుండగా.. 'భ్రమయుగం' ఫేమ్ క్రిస్టో జేవియర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను తీసుకోనున్నారు. 8. 200 కోట్ల క్లబ్‌లో 'కరుప్పు'! కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా డైరెక్టర్ ఆర్జే బాలాజీ తెరకెక్కించిన 'కరుప్పు' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో సూర్య సినీ కెరీర్‌లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా 'కరుప్పు' నిలిచింది. ప్రస్తుత కలెక్షన్ల జోరు చూస్తుంటే.. ఈ సినిమా లాంగ్ రన్‌లో రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 9. 'జన నాయగన్‌'కు ఇంకా రాని సెన్సార్ క్లియరెన్స్.. ! దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్‌' సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సెన్సార్ బోర్డుతో తలెత్తిన వివాదాల కారణంగా ఈ సినిమా గత ఐదు నెలలుగా ల్యాబ్‌కే పరిమితమైంది. దీనిపై తాజాగా స్పందించిన నిర్మాత వెంకట్ కె. నారాయణ.. ఇప్పటికీ సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ రాలేదని స్పష్టం చేశారు. సినిమాను త్వరగా విడుదల చేయడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 10. సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న కంగనా రనౌత్? బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ తన పెళ్లి రూమర్లపై స్పందించారు. ఇటీవల ఆమె మెడలో నల్లపూసల గొలుసు, చేతులకు మట్టిగాజులతో సాంప్రదాయబద్ధంగా కారు ఎక్కుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ వార్తలొచ్చాయి. అయితే, ఆ ప్రచారంలో వాస్తవం లేదని, అది కేవలం సినిమా షూటింగ్ గెటప్ మాత్రమేనని కంగనా క్లారిటీ ఇచ్చారు.  
  ఇంకెంత పది అంటే పదే రోజుల్లో పాన్ ఇండియా సెల్యులాయిడ్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)పెద్ది(peddi)తో తన సత్తా చాటనున్నాడు. ఆల్రెడీ పెద్ది సూపర్ హిట్ అనే పాజిటివ్ టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో వినిపిస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో ఈ రోజు 'పెద్ది కీ ఆవాజ్" మ్యూజికల్ ఈవెంట్‌ జరుగుతుంది.  గతంలో అల్లుఅర్జున్ "పుష్ప 2"(Pushpa 2) పాట్నా ఈవెంట్ సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. సదరు ఫంక్షన్ ఫుల్ సక్సెస్ అవ్వడం వలనే పుష్ప 2 నార్త్ లో భారీగా కలెక్షన్స్ ని రాబట్టింది. అలాగే పెద్ది  భోపాల్ ఈవెంట్ కూడా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ల్యాండ్‌మార్క్ ప్రమోషన్‌గా నిలిచిపోయి నార్త్ లో భారీ కలెక్షన్స్ ని రాబడుతుందా  అని ఇండస్ట్రీ వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈవెంట్ కోసం మేకర్స్ నిర్వహిస్తున్న ఖర్చు ,ప్లానింగ్ చూసి టాలీవుడ్, బాలీవుడ్ సైతం షాక్ అవుతోంది. భోపాల్‌లోని భేల్ దసరా మైదానంలో సుమారు 50 ఎకరాల భారీ విస్తీర్ణంలో 1 లక్షకు పైగా జనాన్ని తలపించేలా  ఈవెంట్‌ ని  ప్లాన్ చేశారు. సదరు ఈవెంట్ కి 4 కోట్ల రూపాయల  కేటాయించడం విశేషం. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ లైవ్ కాన్సర్ట్ ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందుకోసం హైదరాబాద్ నుండి భోపాల్‌కు చిత్ర యూనిట్, రెహమాన్ టీమ్ కోసం 2 ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్స్‌ ని  ఏర్పాటు చేశారు. అలాగే భోపాల్ లో ఏకంగా 200 లగ్జరీ హోటల్ రూమ్‌లని  బుక్ చేశారు. సాంకేతిక హంగుల కోసం ఇండోర్ నుండి భారీ ఎల్‌ఈడీ ఎక్విప్‌మెంట్, హైదరాబాద్ నుండి ప్రత్యేక లైటింగ్, ముంబై నుండి అత్యాధునిక మ్యూజిక్ సిస్టమ్స్ తరలించారు. ఈ ఈవెంట్‌లో ఉపయోగించే రెహమాన్ పర్సనల్ సౌండ్ ఎక్విప్‌మెంట్ విలువ దాదాపు 150 కోట్ల రూపాయలు కాగా, కేవలం ఒక్క రోజు రెంటల్ కోసమే మేకర్స్ 1 కోటి రూపాయల వరకు చెల్లిస్తున్నట్టు సమాచారం. Also read: swayambhu: బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సరసన స్వయంభూ.. నిఖిల్ అరుదైన రికార్డ్ దీంతో పుష్ప 2 ని మించి ఫంక్షన్ సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన 'పెద్ది' అఫీషియల్ ట్రైలర్ యూట్యూబ్‌లో కేవలం 24 గంటల్లోనే 101 మిలియన్ల వ్యూస్ సాధించి హిస్టారికల్ రికార్డ్ సృష్టించింది. ఇక నిన్న ప్రోమోతో వచ్చిన  'హెల్లాల్లో' పూర్తి స్పెషల్ సాంగ్  ఈ రోజు రిలీజ్ కానుంది. బహుశా ఈవెంట్ లోనే రిలీజ్ అవ్వచ్చేమో.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం దీనిని 'పిత్త దోషం' అధికమవ్వడం అంటారు. శరీరం వేడెక్కినప్పుడు కళ్ల మంటలు, కాళ్లల్లో నొప్పులు, నీరసం, చర్మంపై చెమటకాయలు, అజీర్తి వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ సమస్య నుండి ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఎలా ఉపశమనం పొందాలో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో క్లియర్ గా వివరించారు. 👇 🌟శరీరంలో వేడి తగ్గడానికి ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలు: మజ్జిగ మరియు సబ్జా గింజలు: ప్రతిరోజూ పల్చటి మజ్జిగ తాగడం లేదా నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీరం తక్షణమే చలవబడుతుంది. ధనియాల నీరు: రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో చెంచా ధనియాలు నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల పిత్త దోషం అదుపులోకి వస్తుంది. కొబ్బరినీళ్లు: వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అంది, వేడి తగ్గుతుంది. తీసుకోవలసిన ఆహారాలు: పుచ్చకాయ, కీరదోసకాయ, సొరకాయ, బీరకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను డైట్‌లో భాగం చేసుకోవాలి. దూరంగా ఉంచాల్సినవి: మిరపకాయలు, మసాలాలు, పచ్చళ్లు, టీ మరియు కాఫీలను కాస్త తగ్గించడం చాలా మంచిది. మీ శరీర తత్వాన్ని బట్టి పిత్త దోషం తీవ్రత మారుతూ ఉంటుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి! 🙌
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది శరీరానికి మేలు చేయడానికి బదులుగా హాని కలిగించే  పదార్థాలను బ్రేక్పాస్ట్ లో తింటారు. ఖాళీ కడుపుతో కొన్ని రకాల బ్రేక్పాస్ట్ లను  తినడం  జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. రోజంతా నీరసంగా, చిరాగ్గా  ఉంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన, సమతుల్యమైన అల్పాహారం శక్తిని అందించడమే కాకుండా, బరువు నియంత్రణ, మెరుగైన జీవక్రియ , మానసిక ఏకాగ్రతకు కూడా సహాయపడుతుంది. బ్రేక్పాస్ట్ లో  ఏ పదార్థాలను నివారించాలో , ఏ అలవాట్లు  ఆరోగ్యానికి హాని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుంటే.. వేయించిన, నూనే ఆహారాలు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేయించిన, నూనెతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. పూరీలు, కచోరీలు, సమోసాలు,  బజ్జీలు  వంటి వేయించిన ఆహారాలు  కడుపులో భారంగా అనిపించేలా చేస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ ఆలస్యం అయి, ఎసిడిటీ, గ్యాస్, నీరసం పెరగవచ్చు. దీర్ఘకాలంలో, ఇలాంటి అలవాట్లు బరువు పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా దారితీయవచ్చు. ప్యాకింగ్ జ్యూసులు.. ఉదయం పూట తీపి బ్రెడ్ లేదా తృణధాన్యాలతో చేసిన బ్రెడ్ వంటివి లేదా  ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడం ఆరోగ్యకరమని చాలామంది అనుకుంటారు.  కానీ వీటిలో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, కొద్దిసేపటికే అకస్మాత్తుగా పడిపోతాయి. ఇది శరీర శక్తి స్థాయిలను ప్రభావితం చేసి, త్వరగా ఆకలి వేయడానికి దారితీస్తుంది. అధిక చక్కెర ఉన్న ఆహారాలను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం , మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. టీ, కాఫీలు.. చాలామంది  రోజును కేవలం టీ లేదా కాఫీతో గడిపేస్తుంటారు. మరికొంతమంది  ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. వీటి  వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల ఎసిడిటీ , గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ఇది నీరసం, అలసట , ఏకాగ్రత లోపానికి దారితీయవచ్చు. ఇలా ఎక్కువ కాలం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. ప్రాసెస్ ఫుడ్స్.. ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ , ప్యాక్ చేసిన ఆహారాలలో ప్రిజర్వేటివ్‌లు , సోడియం అధికంగా ఉంటాయి. ఇవి తగినంత పోషణను అందించవు . పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణశక్తి బలహీనపడి, పోషకాహార లోపాలకు దారితీస్తుంది.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది. నిజానికి ఆయుర్వేదం అనేది వైద్య విదానంలా కాకుండా అది మనిషి జీవన విదానంలా చక్కగా కలిసిపోతుంది. మనిసి శరీరం  గురించి,  ఆరోగ్యం గురించి ఆయుర్వేదం ఎంతో గొప్పగా, మరెంతో లోతుగా, అదే విదంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. ఆయుర్వేదంలో ఉన్న రెండు శ్లోకాలు అర్థం చేసుకుంటే శరీరం వ్యాధులకు దూరంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఆ శ్లోకాలు ఏంటో తెలుసుకుంటే.. శరీరంలో పేరుకుపోయే విషపదార్థాలే అనేక వ్యాధులకు మూల కారణం.  ఉపవాసం, పంచకర్మ వంటి ప్రక్రియలు శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేయడానికి సహాయపడతాయి. నియంత్రణలో ఉండేలా  ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, , ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని శాస్త్రీయ పరిశోధనలు కూడా చూపిస్తున్నాయి. ప్రకృతి వైద్యం శరీరం  సహజంగా వ్యాధులను తనకు తాను రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది సమతుల్య ఆహారం, యోగా, ధ్యానం, , శరీరం శుద్ది చేసే  పద్ధతులను ఉపయోగిస్తుంది. శరీరం, మనస్సు,  ఆత్మ సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషి  నిజంగా ఆరోగ్యంగా ఉంటాడని ఆయుర్వేదం నమ్ముతుంది. శ్లోకం.. "లంఘనం పరం ఔషధం" అంటే ఉపవాసమే ఉత్తమమైన ఔషధం. శరీరాన్ని వ్యాధి రహితంగా ఉంచుకోవాలంటే  జంతువుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. అవి అనారోగ్యానికి గురైనప్పుడు తినడం మానేస్తాయి, కానీ మనం అనారోగ్యానికి గురైనప్పుడు అన్నీ తినేస్తుంటాము. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు 2-3 రోజులు ఉపవాసం ఉండటం నేర్చుకుంటే, తీవ్రమైన అనారోగ్యం వచ్చే ప్రమాదాన్ని కూడా తొలగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటే  కణితులు, గుండె సమస్యలు, ఫైబ్రాయిడ్ల వంటి సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావట. ఆయుర్వేదంలో ఉపవాసాన్ని శరీరం, మనస్సును శుద్ధి చేసే సాధనంగా పరిగణిస్తారు. ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండటం కాదు, శరీరానికి విశ్రాంతినిచ్చి, జీర్ణవ్యవస్థ తిరిగి క్రియాశీలం కావడానికి సమయం ఇవ్వడం. ఉపవాసం జీర్ణాశయ అగ్నిని బలపరుస్తుంది. శ్లోకం.. "సర్వేషాం రోగనాం నిదానం కూపిత మల" అంటే అన్ని వ్యాధులకు మూలం కూపిత మలం. శరీరంలోని వాత, పిత్త లేదా కఫ దోషాలు అసమతుల్యమై, కలుషితమైనప్పుడు వ్యాధులు వస్తాయి.  దీన్ని తగ్గించడం  కోసమే పంచకర్మ చేస్తారు. పంచకర్మ అనేది ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక శుద్ది ప్రక్రియ, దీని ముఖ్య ఉద్దేశ్యం శరీరం నుండి విషపదార్థాలను తొలగించి, శరీరాన్ని సమతుల్యం చేయడం. ఇందులో వామన, విరేచన, బస్తి, నస్య , రక్తమోక్షణ వంటి విధానాలు ఉంటాయి. శరీరం నుండి అసమతుల్య దోషాలను తొలగించడం, పేరుకుపోయిన విషపదార్థాలను తీసివేయడం , సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను అందించడం వీటి ప్రధాన లక్ష్యం. పంచకర్మ విశిష్టత.. శరీరంలో పేరుకుపోయిన 'ఆమ' లేదా విష పదార్థాలు అనేక వ్యాధులకు కారణమవుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ విష పదార్థాలను తొలగించడంలో పంచకర్మ సహాయపడుతుందని భావిస్తారు. పంచకర్మ తర్వాత చాలా మంది మంచి నిద్ర, తేలికదనం , శక్తిని పొందినట్లు భావిస్తారు.                          *రూపశ్రీ.