LATEST NEWS
  సింగరేణి సంస్థకి బంగారు అవకాశం లభించిందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ దక్కినట్లు సీఎండీ తెలిపారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించిందని బలరామ్ వెల్లడించారు.ఆన్‌లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్‌గా నిలిచిందని పేర్కొన్నారు.  సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణ పూర్తి చేస్తామని తెలిపారు. దేవదుర్గ్‌లోని బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధన చేయనుంది. వివిధ రకాల అన్వేషణల అనంతరం తుది ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించవలసి ఉంటుంది.  ఆ గనులను సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది.ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75 శాతాన్ని ఆ గని జీవితకాలం పాటు సింగరేణికి చెల్లించవలసి ఉంటుంది. బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం రూ. 90 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు ఉండగా, రూ. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది.  
  ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలివేటెడ్ ట్రాక్‌పై నడిచే మోనో రైలు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా మైసూర్ కాలనీ భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ట్రైన్ దాదాపు గంటకుపైగా ఆగిపోయింది. ఆ సమయంలో 100 మంది ప్రయాణికులు అందులోోో చిక్కున్నట్లు సమాచారం. ఈఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమైన సహాయక చర్యలు చేపట్టారు. వరుసగా నాలుగో రోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నగరంలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అనేక ప్రదేశాలలో రైల్వే ట్రాక్‌లు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు విమాన ప్రయాణాలపైనా తీవ్ర ప్రభావం పడింది. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే 304 విమానాలు ఆలస్యంగా నడిచాయి. పది విమానాలు రద్దు కాగా, 198 విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంబై, థానే, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 
  నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణా రెడ్డిపై హత్యాయత్నం కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. అన్నవరంలోని గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరుల హల్చల్ చేసినట్లు టాక్. డ్రోన్ లతో వీడియోలు తీస్తున్న వేణు, వినోద్ అనే మాజీ ఎమ్మెల్యే అనుచరులు. వీరికి క్రషర్స్ పాయింట్ ని చూపించిన దామెర్ల శ్రావణ్ అనే వ్యక్తి డ్రోన్ లతో వీడియోలు తీసి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశాడు దుండగుడు.  ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.స్థానికులు, క్రషర్ వద్ద సిబ్బంది వారిని ప్రశ్నించడంతో కత్తులతో దాడికి దిగిన వేణు,వినోద్ ..క్రషర్ శివార్లలో కారు వేసుకుని రెక్కీ నిర్వహిస్తున్న గుర్తుతెలియని నలుగురు దుండగులు. పోలీసులు విచారణలో తమని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పంపించారని,ఎవరు అడ్డొచ్చినా ఏదైనా చేయమని చెప్పారని నిందితులు ఒప్పుకున్నరని తెలుస్తోంది.ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డిని హత్య చేసేందుకు కావలిలో సుఫారి గ్యాంగ్ దిగినట్టు సమాచారం.
  అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద తొలి విడత పెట్టుబడి సాయం విడుదలైన సందర్భంగా నెల్లూరు జిల్లా  సర్వేపల్లిలో  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.వెంకటాచలం సమీపంలోని ఇసుక డంపింగ్ యార్డు వద్ద నుంచి ఎర్రగుంట టోల్ ప్లాజా దగ్గరలోని కమ్యూనిటీ హాలు వరకు ర్యాలీ సాగింది. 900  ట్రాక్టర్లతో రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారు. సంప్రదాయ పంచెకట్టుతో విజయోత్సవంలో ఉత్సాహంగా రైతులు పాల్గోన్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భాగస్వాములైరు
  కరీంనగర్‌లో ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమర్చిన జాతీయ జెండాను పట్టుకుని ఓ పక్షి పట్టుకొని ఆకాశంలో విహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. కరీంనగర్‌లో మానేరు డ్యాం గేట్ల పైనుండి పక్షి విహరించింది. ఈ వింతను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  
ALSO ON TELUGUONE N E W S
AR Murugadoss is interacting with various media outlets promoting his upcoming biggie, Madharaasi. The movie starring Sivakarthikeyan is projected to be his big comeback after many duds. His latest release, Sikandar starring Salman Khan, became a huge disaster and hence, he is expecting Madharaasi to change fortunes.  In an interview, he blamed Salman Khan for not being so professional and only coming to sets in night time. He remarked that it changed his vision and had to shoot many scenes in green screen studio. Now, he revealed that Ajith is the reason for six pack revolution in Indian Cinema.  He stated that he met Ajith at Ji film shooting and narrated story as Mirattal. While he enjoyed it, he stated to the director that he would transform into a six pack body for the film. While they started shooting with Ajith as Sanjay Ramaswamy, the movie had to be halted due to the actor's other commitments.  Later, the movie went to Suriya and became Ghajini. AR Murugadoss stated that he learnt a lot in the two days of shoot with Ajith and it is his idea to develop six pack and hence, he asked Aamir Khan and Suriya, for such a body. He remarked that post Ghajini, six pack became a trend in Indian Cinema and Ajith planted the idea.  Madharaasi is gearing up for a big release on 5th September 2025. AR Murugadoss stated that he concentrated on writing and presentation for this film and it came out as he envisioned. Hence, he confident that it would work like magic at the box office.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Coolie starring Superstar Rajinikanth and King Nagarjuna released on 14th August. Sun Pictures, the producer, has officially announced that the movie collected huge Rs.404 crores gross in 4 days. But on 5th day, the movie dropped huge at all centres and it might struggle to maintain the momentum further, say experts.  Interestingly, Nagarjuna as Simon, took over the Tamil Instagram and Internet. Many youngsters are producing reels on social media with his edits. Also, they are vibing to Soniya Soniya song, from his Ratchagan from 1997. The song and Simon visuals from Coolie are being edited in a big way.  Many women, girls of various ages and boys are producing reels on Instagram with his visuals and edits. The actor even at 65 years of age, is able make a striking impression and lasting impact on hearts of Tamil people. Boys have made his hairstyle a trend on Instagram as well.  Looking at all this, it is apparent that Nagarjuna with his swag and looks made an impact on Tamil youth. Well, Lokesh Kanagaraj succeeded in presenting Nagarjuna as Simon but if you could have written a great character, it would have been huge blast.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఎన్టీఆర్ కెరీర్ లో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమా 'వార్-2' కావడం విశేషం.   'ఆర్ఆర్ఆర్'తో మొదటిసారి ఈ ఫీట్ సాధించాడు ఎన్టీఆర్. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.1300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'దేవర' కూడా దాదాపు రూ.500 కోట్లు సాధించింది. ఇక ఇప్పుడు 'వార్-2' ఐదు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరి.. 400 కోట్ల దిశగా పయనిస్తోంది.   ఇప్పటిదాకా హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ కలిగి ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ గా ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ ఏకంగా రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు. మొదటిసారి 'బాహుబలి-1', 'బాహుబలి-2', 'సాహో' సినిమాలతో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' చిత్రాలతో మరోసారి హ్యాట్రిక్ 300 కోట్లు సాధించాడు. ప్రభాస్ తర్వాత హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ ఉన్న టాలీవుడ్ హీరోగా ఇప్పుడు ఎన్టీఆర్ నిలిచాడు.  
Director Munna Dhulipudi, who delivered a blockbuster with his film '30 Rojullo Preminchadam Ela', is back with another entertainer, 'Bad Girlz', which comes with the tagline 'But Very Good People'. The film is produced by Sashidhar Nalla, Emmadi Soma Narsaiah, Ramisetti Rambabu, and Ravula Ramesh under the banners of Neeli Neeli Aakasam Creations, Prashwita Entertainment, and NVL Creations.   After the massive success of the song 'Neeli Neeli Aakasam', the team is now ready to release a new sequel melody for 'Bad Girlz' titled 'Ila Chusukuntane'. Oscar-winning lyricist Chandrabose has penned the lyrics, and melody king Anup Rubens has composed the music, while the song has been beautifully sung by Sid Sriram.   The director, Munna Dhulipudi, expressed his immense confidence in the new song. "We are ready to release the song 'Ila Chusukuntane' from our film 'Bad Girlz'. Chandrabose's lyrics, Anup Rubens's music, and Sid Sriram's voice have created a song that is even greater than 'Neeli Neeli Aakasam'."   The film's motion poster has already garnered over 5 million views on social media, creating a strong buzz. According to the director, the film is a complete entertainer, imagining what a hilarious film like Jathi Ratnalu or Mad would be like if made with a female cast.  
  గతేడాది 'కల్కి 2898 AD'తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 'ది రాజా సాబ్', 'ఫౌజి', 'స్పిరిట్' వంటి పలు సినిమాలు ఉన్నాయి. వీటిలో 'రాజా సాబ్', 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 'ఫౌజి' సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో లీక్ అయింది. ఈ ఫొటోలో ప్రభాస్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.   ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఫౌజి'. ఈ పీరియడ్ ఫిల్మ్ ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తయింది. జూన్ లో ఈ మూవీ సెట్స్ నుంచి ప్రభాస్ పిక్ ఒకటి లీక్ అయింది. ఫార్మల్ డ్రెస్ వేసుకొని 'మిర్చి' మూవీ లుక్ ని గుర్తు చేశాడు ప్రభాస్. తాజాగా 'ఫౌజి' సెట్స్ నుంచి మరో పిక్ లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇందులో టీ షర్ట్ ధరించి లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు ప్రభాస్.   'డార్లింగ్', 'మిర్చి' వంటి సినిమాల్లో ప్రభాస్ లుక్స్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు 'ఫౌజి' నుంచి లీకైన పిక్స్ వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేస్తున్నాయి. ప్రభాస్ లుక్ విషయంలో డైరెక్టర్ హను తీసుకుంటున్న స్పెషల్ కేర్ పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  
Suriya is one of the biggest stars of Tamil Cinema and he has huge craze in Telugu and Malayalam languages. He has been facing major crisis at the box office from past decade. He is currently working in Venky Atluri's direction for his first Telugu-Tamil bilingual, produced by Suryadevara Naga Vamsi.  He completed shooting for his massive biggie, Karuppu, in the direction of RJ Balaji. The movie is produced by Dream Warrior Pictures and many anticipated it to release for Diwali. But the recent reports from Tamil Cinema state that the movie is being postponed to next year, either Pongal or Summer.  The financial issues have been so prominent that the producers are working to clear the debts. Also, as Suriya's previous films, Kanguva and Retro, ended up being unsuccessful leaving distributors in huge losses, the problem for Karuppu have also grown prominent. Even Dream Warrior Pictures are facing some cash crunch, say reports.  Well, Karuppu teaser did not really impress many and it seemed like a regular mass commercial film. Hence, the makers are not highly confident they want a solo release date and time to build huge promotional campaign to create hype, say reports. Let's wait for official confirmation from the makers about the release date.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Prabhas is currently busy shooting for his next in the direction of Hanu Raghavapudi. Post Sita Ramam, the young director got this huge chance to direct the Pan-India star on a massive scale. Mythri Movie Makers are producing the film and a leaked pic of Prabhas is creating sensation.  A pic from the shooting spot has been leaked with Prabhas looking drop-dead handsome. The actor's looks from Radhe Shyam, Adipurush have attracted huge trolls. His Kalki 2898 AD avatar has given good respite to his fans but they have been waiting to see vintage looks of the actor back on big screens.  The leaked pic looked promising as Prabhas seems to have worked on his looks to bring back the stylish swag back on screen. The movie is said to be a romantic war drama and hence, Prabhas needed to work on his apperance. Now, the movie shoot is progressing at a rapid pace.  Imanvi Esmali is playing the leading lady role in the film and Anupam Kher is playing an important role. The makers did not lock a release date but they are planning for a Summer 2026 release in multiple languages. Many are anticipating Hanu Raghavapudi to deliver another masterpiece like Sita Ramam. "As the leaked pic is unethical to share, we did not post here. "  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  ఆగస్టు 14న 'వార్-2', 'కూలీ' అనే రెండు భారీ సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టాయి. ఈ రెండు సినిమాలపైనా మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే 'వార్-2'తో పోలిస్తే 'కూలీ'పై హైప్ ఇంకా ఎక్కువ ఉంది. అది అడ్వాన్స్ బుకింగ్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపించింది. అయితే విడుదల తర్వాత ఈ రెండు సినిమాలు డివైడ్ టాక్ నే సొంతం చేసుకున్నాయి. అయినప్పటికీ మొదటి వీకెండ్ లో 'వార్-2' దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబడితే.. 'కూలీ' మాత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటింది. ఇలా అడుగడుగునా కూలీ డామినేషన్ కనిపిస్తోంది. దీంతో ఇక 'వార్-2' పని అయిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ, ఇలాంటి టైంలో 'వార్-2' అనూహ్యంగా పుంజుకొని షాక్ ఇచ్చింది.   ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా పాజిటివ్ టాక్ రాకపోతే వీక్ డేస్ లో భారీ డ్రాప్ కనిపించడం సహజం. 'వార్-2', 'కూలీ' సినిమాల విషయంలోనూ అదే జరిగింది. సోమవారం నాడు ఈ రెండు సినిమాల కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ముఖ్యంగా 'వార్-2' పూర్తిగా చేతులెత్తేసినట్లు అనిపించింది. ఇలాంటి సమయంలో ఊహించని విధంగా పుంజుకొని బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది వార్-2.     మంగళవారం నాడు బుక్ మై షోలో బుకింగ్స్ ని గమనిస్తే.. 'వార్-2' టికెట్లు గంటకు 9.2K బుక్ అవ్వగా, 'కూలీ' టికెట్లు మాత్రం 4.9K బుక్ అయ్యాయి. అంటే బుక్ మై షోలో 'కూలీ'కి దాదాపు రెట్టింపు స్థాయిలో 'వార్-2' టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ఫుల్ రన్ లో 'కూలీ'కి 'వార్-2' షాకిచ్చినా ఆశ్చర్యంలేదు.     ఓవరాల్ గా ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'వార్-2'కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించినప్పటికీ తెలుగు బుకింగ్స్ లో ఆ జోష్ లేదు. నార్త్ లో మాత్రం జోష్ కనిపిస్తోంది. హిందీ సినిమా కావడం, ప్రస్తుతం అక్కడ ఇతర స్టార్ల సినిమాలు లేకపోవడంతో.. వార్-2 చూడటానికి నార్త్ ఆడియన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే బుక్ మై షోలో 'కూలీ'ని 'వార్-2' ఈ రేంజ్ లో డామినేట్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
స్టార్ హీరోయిన్ 'రష్మిక'(Rashmika Mandanna)పుష్ప పార్ట్ 1 , పార్ట్ 2 ,యానిమల్, చావా, సికందర్, కుబేర వంటి సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించింది. కొన్ని సంవత్సరాలుగా రష్మిక సాధించిన విజయాలు పాన్ ఇండియా స్థాయిలో మరో హీరోయిన్ కి లేవన్నా అతిశయోక్తి  కాదు. అంతలా వరుస విజయాలతో దూసుకుపోతు చాలా బిజీగా ఉంది.  రష్మిక అప్ కమింగ్ చిత్రాల్లో 'థామ'(Thama)అనే హిందీ చిత్రం ఒకటి.  హర్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో 'ఆయుష్మాన్ ఖురానా'(ayushmann khurrana)కి జోడిగా చేస్తుంది. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి, టీజర్ రిలీజ్ అయ్యింది. వరల్డ్ ఆఫ్ 'థామ' పేరుతో నిమిషం ముప్పైఎనిమిది సెకన్ల నిడివి ఉన్న టీజర్ చూస్తుంటే అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ జోనర్ లో 'థామ' తెరకెక్కినట్టుగా అర్ధమవుతుంది. రష్మిక క్యారక్టర్ చూస్తుంటే దుష్ట శక్తులపై పోరాటం చేసే యువతిగా, ప్రేమని పంచే యువతిగా, రెండు భిన్నమైన క్యారెక్టర్స్ ని పోషించినట్టు అర్ధమవుతుంది. దీంతో రష్మిక డ్యూయల్ రోల్ లో కనిపిస్తుందేమో అనే క్యూరియాసిటీతో పాటు,  కథ ఏమై ఉంటుందనే ఆసక్తి కూడా కలుగుతుంది. ఆయుష్మాన్ క్యారక్టర్ తో పాటు డైలాగ్స్ ఇంట్రస్ట్ గా ఉన్నాయి. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా కూడా 'థామ' ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతుందని అర్ధమవుతుంది. సీనియర్ నటుడు పరేష్ రావెల్, నవాజుద్దీన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.    చావా, స్త్రీ 2 ,తెహ్రాన్, భూల్ ఛుక్ మాఫ్, బేధీయా, లవ్ ఆజ్ కల్ వంటి విభిన్న చిత్రాలని తెరకెక్కించిన మ్యాడ్‌డాక్‌ ఫిలింస్‌ ప్రైవేట్ లిమిటెడ్ పై దినేష్ విజన్(Dinesh Vijan)నిర్మిస్తుండగా, 'ఆదిత్య సర్పోత్దార్'(Aditya Sarpotdar)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విభిన్న చిత్రాలని తెరకెక్కించిన ఆదిత్య గత ఏడాది జూన్ లో అంతా కొత్త వారితో తెరకెక్కించిన 'ముంజ్యా' అనే  కామెడి హార్రర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోగా 132 కోట్లు వసూలు చేసింది. దీంతో 'థామ'పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.    
  'టెంపర్'కి ముందు ఎన్టీఆర్ వేరు.. 'టెంపర్' తర్వాత ఎన్టీఆర్ వేరు. 2015లో వచ్చిన 'టెంపర్' మొదలుకొని, 2024లో వచ్చిన 'దేవర' వరకు.. ఏడు సినిమాలు చేశాడు ఎన్టీఆర్. అందులో ఒక్క పరాజయం కూడా లేదు. ఇటీవల కాలంలో ఇలా వరుసగా ఏడు విజయాలు అందుకున్న స్టార్స్ ఎవరూ లేరనే చెప్పాలి. అంతటి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ కి ఇప్పుడు 'వార్-2' రూపంలో ఊహించని షాక్ తగిలింది.   ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ మొదటి వీకెండ్ లో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. అయితే ఎన్టీఆర్-హృతిక్ కాంబోకి, ఆ బడ్జెట్ కి ఈ కలెక్షన్స్ తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 'వార్-2' ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయట్లేదు.   'వార్-2' తెలుగు థియేట్రికల్ రైట్స్ ని నిర్మాత నాగవంశీ దాదాపు రూ.80 కోట్లకు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. రూ.50 కోట్ల లోపు షేర్ కే పరిమితమవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే భారీ నష్టాలు తప్పవు. మరి 'వార్-2' తెలుగునాట అనూహ్యంగా పుంజుకొని హిట్ అనిపించుకుంటుందో లేక పదేళ్ల తర్వాత ఎన్టీఆర్ ఖాతాలో ఫ్లాప్ పడేలా చేస్తుందో చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
కొందరు సమస్యలకు అంతగా టెన్షన్ పడరు. తేలికగా తీసుకుని పరిష్కరించుకుంటారు. కొందరైతే భయాందోళనకు గురవుతారు. ప్రతివ్యక్తి జీవితంలో ఏదొక సమయంలో కష్టాలను ఎదుర్కొవల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో ప్రతి వ్యక్తి కూడా తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధమవుతాడు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా భావిస్తుంటారు. అలాంటివారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి: ఏవ్యక్తినైనా సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు..అతను పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఎందుకంటే మీరు సంక్షోభం నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్న వ్యూహాన్ని కలిగి ఉన్నట్లయితే..ఆ సమస్య నుంచి తేలికగా బయటపడతారు. ముందుగానే సిద్ధంగా ఉండాలి: ఆచార్య చాణక్యుడు తెలిపిన ప్రకారం..ఒక వ్యక్తికి కష్టాలు వచ్చినప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు చుట్టిముట్టినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తుందని ముందే ఊహించాలి. అందుకు తగ్గట్లుగానే సిద్ధపడాలి. సమస్య నుంచి పారిపోవడం కంటేనూ దానిని ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఓపిక పట్టాలి: చాణక్య విధానం ప్రకారం...ఒక వ్యక్తి తన ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ సహనంకోల్పోకూడదు. ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. మరీ ముఖ్యంగా పరిస్థితి ఏమైనప్పటికీ ఆ సమయంలో సహనం కోల్పోకూడదు. మీకు మంచి రోజులు వచ్చేంత వరకు ప్రశాంతంగా వేచి ఉండాలి. కుటుంబ సభ్యులతో బాధ్యతగా: చాణక్య నీతి ప్రకారం, సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కూడా వ్యక్తి మొదటి కర్తవ్యం. కుటుంబ సభ్యులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకోవాలి. డబ్బు ఆదా చేయాలి: ఎప్పుడూ డబ్బు ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.  
  వివాహం అనేది జీవితాంతం కొనసాగే సంబంధం. ఇది ఒక వ్యక్తితో జీవితాన్ని గడపడానికి వేసే పెద్ద అడుగు.  అందువల్ల వివాహానికి ముందు  భావాల గురించి కాబోయే  భాగస్వామితో మాట్లాడటం చాలా ముఖ్యం. ఇది ఇద్దరూ ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  అంతేకాదు.. వివాహం తర్వాత వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది.  వివాహానికి ముందే కొన్నిప్రశ్నలకు సమాధానాలు, సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతే.. వివాహం తర్వాత తగాదాలు, అపార్థాలు.. దారితీసి.. అది కాస్తా  విడాకులకు కారణం అవుతుంది. వివాహానికి ముందు కాబోయే  భాగస్వామితో  ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయాలేంటో తెలుసుకుంటే.. పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా? నేటి కాలంలో చాలామంది అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా   సమాజం,  కుటుంబం నుండి ఎదురయ్యే  ఒత్తిడితో  పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ  ఉంటారు. ఇలా పెళ్లికి సిద్దపడేవారు మనస్ఫూర్తిగా వైవాహిక జీవితాన్ని అస్వాదించరు. దీని కారణంగా వారిని వివాహం చేసుకున్నందుకు ఇవతలి వ్యక్తి జీవితం కూడా ఎలాంటి సంతోషం లేకుండా సాగుతుంది. అందుకే   వివాహానికి ముందు కాబోయే భాగస్వామిని  పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఖచ్చితంగా అడగాలి.  అవతలి వ్యక్తి ఒత్తిడిలో పెళ్లికి సిద్దపడుతున్నట్టు తెలిస్తే..ఆ సంబంధాన్ని తిరస్కరించడం మంచిది. భవిష్యత్తు ప్రణాళిక.. వివాహం తర్వాత ఇద్దరూ కలిసి  ఇంటిని నడపాలి, బాధ్యతలు పంచుకోవాలి.  అటువంటి పరిస్థితిలో వివాహానికి ముందు భవిష్యత్తు ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆర్థిక లక్ష్యాల గురించి ఒకరితో ఒకరు ఖచ్చితంగా చర్చించుకోవాలి.  ఒకరి భవిష్యత్తు ప్రణాళిక, పొదుపు, ఖర్చు అలవాట్లను మరొకరు అర్థం చేసుకోవాలి. లేకపోతే వివాహం తర్వాత దీని గురించి వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల కారణంగా విబేధాలు ఎక్కువగా వస్తాయి. పిల్లల కోసం ప్రణాళిక.. వివాహం తర్వాత భాగస్వామితో కలిసి పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఈ విషయాన్ని చర్చించడానికి సిగ్గుపడతారు,  అదేదో మాట్లాడకూడని విషయం అన్నట్టు ఫీలవుతారు. ఎంత మంది పిల్లలు కావాలి, ఎప్పుడు కావాలి, పెళ్లైన వెంటనే ప్రయత్నం చేయాలా లేక కొంత గ్యాప్ తీసుకోవాలా  అనేది కాబోయే భాగస్వామితో ముందుగానే చర్చించాలి. పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడం గురించి ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఆలోచనలను కలిగి ఉండవచ్చు. కానీ ఇద్దరూ ఇలా మాట్లాడుకోవడం వల్ల ఒక అవగాహన ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే.. పిల్లల గురించి ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆర్థిక లక్ష్యాలు,  ఆర్థిక భద్రత కూడా ఒక అవగాహన వస్తుంది. ఇష్టాలు,  అయిష్టాలు.. ఒకరి ఇష్టాలు,  అయిష్టాలు వారి జీవనశైలి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరు వ్యక్తుల జీవనశైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇద్దరి ఇష్టాఇష్టాలు, జీవనశైలి గురించి తెలుసుకున్న తర్వాత  ఒకరిని ఒకరు  అర్థం చేసుకుంటూ,  ఒకరిని మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగవచ్చు.                             *రూపశ్రీ.
  ఆచార్య చాణక్యుడు ప్రతి మనిషికి ఉపయోగపడే ఎన్నో విషయాలను చెప్పాడు. వాటిని చాణక్య నీతి అని పిలుస్తారు.  చాణక్య నీతిలో చెప్పిన ఎన్నో విషయాలు  జీవితంలోని అనేక అంశాలను ఆచరణాత్మకంగా, సరళంగా ఉంచుతాయి. మతం, న్యాయం, సంస్కృతి, పాలన, ఆర్థిక శాస్త్రం, విద్య.. మానవ సంబంధాలు.. ఇలా ఆయన చెప్పని విషయమంటూ ఏదీ లేదు.  ఆయన బ్రతికిన కాలంలో చెప్పిన ఈ విషయాలు నేటికీ అంతే ప్రాముఖ్యంగా ఉన్నాయి. తాను చెప్పిన సూత్రాలను పాటించడం ద్వారా ఎలాంటి పరిస్థితినైనా అధిగమించి విజయపథంలో ముందుకు సాగవచ్చని చాణక్యుడు విశ్వసించాడు. చాణక్య నీతిలో ఒక వ్యక్తి ఎప్పుడూ సిగ్గుపడకూడని ఐదు సందర్భాలను ఆయన ప్రస్తావించారు. ఈ విషయాలేవో తెలుసుకుంటే.. జీవితంలో ఎంతో గొప్ప మార్పు చూడవచ్చు.  ఇంతకూ చాణక్యుడు చెప్పిన ఆ ఐదు సందర్భాలేవో తెలుసుకుంటే.. ధనం, ధాన్యం లావాదేవీలు, జ్ఞానం సంపాదించడం, తినడం, పరస్పర వ్యవహారాల్లో సిగ్గుపడని వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.  ఈ ఐదు విషయాల దగ్గర మొహమాటం పడటం,  సిగ్గు పడటం మానేయాలట. దాని గురించి వివరణ కూడా ఇచ్చారు.. మీరు ఎప్పుడూ సిగ్గుపడకూడని 5 విషయాలు ధనం, ఆహార లావాదేవీలు.. డబ్బు, ధాన్యం విషయంలో సంకోచించకూడదట.  లావాదేవీల్లో సంకోచం ప్రదర్శిస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి అడగడం..  ఎవరికైనా ఇచ్చిన డబ్బును అడగడానికి సిగ్గుపడటం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని  చాణక్యుడు చెబుతాడు.  ఇలా మొహమాటానికి, సిగ్గుకు పోతే  దగ్గర డబ్బు కొరత ఏర్పడి చివరికి ఏమీ లేని వ్యక్తిగా మారతాడట. జ్ఞానం.. చాణక్యుడి ప్రకారం విద్యను పొందేటప్పుడు ప్రశ్నలు అడగడానికి సంకోచించడం జ్ఞానం సంపాదించడంలో ఆటంకం కలిగిస్తుందట.  నేర్చుకోవడం అనే ప్రక్రియను  అసంపూర్ణంగా చేస్తుందట.  టీచర్ ని నిర్భయంగా ప్రశ్నలు అడగాలి, సందేహ నివృత్తి చేసుకోవాలి అంటున్నారు. అలా చేస్తేనే అభ్యసనం సంపూర్ణంగా ఉంటుంది. జ్ఞానార్జన కూడా సజావుగా జరుగుతుంది.   ఆహారం తినడం.. ఆచార్య చాణక్యుడి ప్రకారం తినడానికి సంకోచించిస్తే కడుపు నింపుకోలేరు. ఎప్పటికీ ఆకలితో ఉన్నట్లేనట. అవసరమైనప్పుడు అంటే ఆకలి వేసినప్పుడు ,  ఎక్కడైనా మంచి భోజనం చేసే అవకాశం వచ్చినప్పుడు మొహమాటం లేకుండా   తినాలట. ఇది మనిషిని సంతోషంగా ఉంచుతుందట. సంభాషణ,  ప్రవర్తన..  చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు పరస్పర కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం,  సంబంధాలలో సంకోచం ఉండటం వల్ల  సంబంధాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు. స్పష్టంగా, మర్యాదగా,  ఓపెన్ గా మాట్లాడటం,  ఓపెన్ గా అభిప్రాయాలు చెప్పడం,  ఇతరులు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని వాటిని స్వీకరించడం   వల్ల  సంబంధాలు బలంగా ఉంటాయట.                           *రూపశ్రీ.
అశ్వగంధ ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలిక. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో,  శారీరక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దాని వేర్లు గుర్రపు వాసన రావడం వల్ల దీనికి అశ్వగంధ అనే పేరు వచ్చిందట. భారతదేశం, మధ్యప్రాచ్యం,  ఆఫ్రికాలో కనిపించే ఈ  మొక్క శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో భాగంగా ఉంది. పురాతన ఔషధమైన అశ్వగంధ శరీరానికి, మనస్సుకు కూడా గొప్ప వరంగా చెప్పవచ్చు.  అయితే అశ్వగంధ కొందరు వ్యక్తులకు చాలా డేంజర్ అని, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే.. అశ్వగంధ  ప్రయోజనాలు.. అశ్వగంధను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అశ్వగంధ అనేది ఒక అడాప్టోజెన్. ఇది ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) ను నియంత్రిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది,  నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది జలుబు,  సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది కండరాల బలం, ఓర్పు,  శక్తిని పెంచుతుంది.  ఇది వ్యాయామం చేసేవారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అశ్వగంధ మధుమేహ రోగులకు,  ఆరోగ్యవంతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది,  ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అశ్వగంధ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.  ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. అశ్వగంధ పొడిని అల్లం,  తులసితో టీలో కలిపి తాగడం వల్ల జలుబు,  దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి,  జ్వరం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎలా తీసుకోవాలి? అశ్వగంధను తీసుకునే పద్ధతి ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది. అశ్వగంధ  పొడిని వేడి పాలలో కలిపి తేనె లేదా బెల్లం తో తీసుకోవచ్చు.  అలాగే  అశ్వగంధ, అల్లం,  తులసి వేసి 5 నిమిషాలు మరిగించి టీగా కూడా తీసుకోవచ్చు. ఒత్తిడి, బలహీనత,  బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడేవారికి అశ్వగంధ ఒక వరం.  అయితే ఆరోగ్య నిపుణులు  దీనిని జాగ్రత్తగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలు,  పాలిచ్చే మహిళలు వైద్యుడిని సంప్రదించకుండా అశ్వగంధ వాడటం మంచిది కాదు.  ఇది థైరాయిడ్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. హైపర్ థైరాయిడ్ రోగులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అశ్వగంధ నిద్రను పెంచుతుంది. ఇది మందుల ప్రభావాన్ని పెంచుతుంది. కాబట్టి నిద్ర మాత్రలు తీసుకునేవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అధిక మొత్తంలో దీనిని తీసుకోవడం వల్ల కడుపులో చికాకు లేదా విరేచనాలు సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటోంది.  ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఒక్కొక్క ఫోన్ ఉంటుంది.  చాలా వరకు ఫోన్ ఎక్కడికి వెళ్లినా వెంట ఉంటుంది. ఇక చాలామందికి  ఉదయాన్నే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ఇదేమంత చెడ్డ అలవాటు కాదు కదా అనుకుంటారు కొందరు. ఉదయం లేవగానే వాట్సాప్ మెసేజ్లు, ఇమెయిల్స్.. వంటివి కొందరు చూస్తే.. ఉదయాన్నే యూట్యూబ్ ఓపెన్ చేయడం మరికొందరి అలవాటు.   ఇంకొందరు ఉదయాన్నే అలా బ్రౌజింగ్ చేస్తుంటారు.  ఇది చాలా చెడ్డ అలవాటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఉదయాన్నే ఫోన్ చూడటం  వల్ల కలిగే నష్టమేంటి? తెలుసుకుంటే.. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసే  అలవాటు  మెదడుకు సరైనది కాదని అంటున్నారు వైద్యులు.  నిద్రలేవగానే వెంటనే ఫోన్ చెక్ చేయడం వల్ల మనసుకు విశ్రాంతి లభించదు. ఉదయం నిద్రలేచిన తర్వాత  నిదానంగా రోజును ప్రారంభించాలి. అకస్మాత్తుగా ఫోన్ వాడటం,  సందేశాల ప్రవాహం మనస్సును అలసిపోయేలా చేస్తుంది.  ఆలోచించే,  అర్థం చేసుకునే మీ సామర్థ్యాన్ని తగ్గిస్తుందట. ఒత్తిడి.. పొద్దున్నే లేవగానే చాలా రకాల నోటిఫికేషన్లు వస్తుంటాయి. వీటిలో కొన్ని ఉపయోగకరమైన సందేశాలు, సోషల్ మీడియా లో కొత్త విషయాలు లేదా వార్తలు ఇలా ఏవైనా ఉండవచ్చు. ఇవన్నీ కలిసి  మనస్సులో ఒత్తిడిని కలిగిస్తాయి. ఉదయాన్నే ఈ ఒత్తిడి కారణంగా మనసు కలత చెందుతుందట. కాబట్టి ఉదయం నిద్రలేవగానే ఫోన్ వాడకుండా ఉండటం చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యం.. ఉదయాన్నే కళ్ళు  రిలాక్స్డ్ స్థితిలో ఉంటాయి.రాత్రంతా విశ్రాంతి తీసుకోవడం వల్ల కళ్లు ప్రశాంతంగా ఉంటాయి. అయితే కళ్లు విశ్రాంతిగా ఉన్నప్పుడు బయటి వాతావరణానికి, బయటి వెలుగుకు కూడా కళ్లు అలవాటు పడకముందే    ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల మీ కళ్ళలో నొప్పి లేదా పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఇది తలనొప్పికి కూడా కారణమవుతుంది.  కళ్ళ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. వ్యసనం.. నిద్ర లేచిన  వెంటనే పదేపదే ఫోన్ చూసే అలవాటు ఒక రకమైన వ్యసనంగా మారుతుంది. నోటిఫికేషన్లు చూసే వరకు మనసు, మెదడు ఆరాటపడుతూనే ఉంటాయి.  వీటిని శాంతపరచడం కోసం ఫోన్ ను పదే పదే చూడటం జరుగుతుంది.  ఇది కాస్తా  పదేపదే  ఫోన్ చూసేలా మెదడును, మనసును ప్రేరేపిస్తుంది.   ఇది వ్యసనానికి దారి తీయడం ద్వారా దృష్టి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నోటిఫికేషన్ల మాయ.. ఫోన్ లో నిరంతరం వచ్చే నోటిఫికేషన్ల వల్ల ఏ పని మీద ఏకాగ్రత నిలవదు. దీని వల్ల పదే పదే దృష్టి ఫోన్ వైపే వెళుతుంది. ఈ కారణంగా ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టలేరు. రోజు ప్రారంభం నుండి రోజు ముగిసేవరకు ప్రతి పని సంతృప్తిగా చేయలేరు. నిద్ర చక్రంపై చెడు ప్రభావం స్లీపింగ్ సైకిల్.. నిద్రపోయే ముందు, తర్వాత ఫోన్ చూస్తే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిద్రపోయే ముందు,  తర్వాత  మేల్కొన్న వెంటనే ఫోన్ చూస్తే నిద్ర చక్రం పాడవతుంది.  స్క్రీన్ నుండి వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇది  నిద్రపోవడం కష్టతరం చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లేకపోవడం,  అలసట వంటి సమస్యలు వస్తాయి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...