LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ నిజానికి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ అన్నారు.  కడప పర్యటనలో భాగంగా లోకేష్, రాయలసీమ అభివృద్ధి, గత ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడారు.  జగన్   మాటలు తప్పడం, మడమ తిప్పడంలోనే దిట్ట అన్న లోకేష్..   ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని   గణాంకాలతో సహా ఎండగట్టారు. జగన్ హయాంలో సీమ ప్రాంత ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.   రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో   టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించారు. గతంలో అంటే 2014 - 2019 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 11,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తుచేశారు.  అయితే.. సీమ బిడ్డనని గొప్పలు చెప్పుకునే జగన్ తాను సీఎంగా ఉన్న  ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో కేవలం రూ. 2,700 కోట్లు మాత్రమే కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించినప్పుడు, దానివల్ల రాయలసీమకు జరిగే నష్టాన్ని ఆపడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిన డ్రిప్ ఇరిగేషన్  అంటే బిందు సేద్యం ) వ్యవస్థను జగన్  రద్దు చేసి రైతుల పొట్ట కొట్టారని విమర్శించారు.   టీడీపీ  హయాంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో, అలాగే మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందించి అండగా నిలిచిందని గుర్తు చేశారు.  తన  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన నటన చూస్తే  ఆయనకు భాస్కర్ అవార్డు ఖాయంగా వస్తుందని ఎద్దేవా చేశారు.  సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైతే, ఆ ఘోరమైన నిజాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుపైకి నెట్టేందుకు జగన్ ఎంతటి డ్రామాలు ఆడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.  మిషన్ రాయలసీమ  పేరుతో ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్,  డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నామన్న లోకేష్ . పుట్టపర్తిలో  ఐదో తరం యుద్ధ విమానాల (ఎఎంసీఏ) తయారీ కేంద్రానికి రూ. 15,803 కోట్లతో శంకుస్థాపన చేయడం రాయలసీమ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు. జగన్ పాలన కేవలం ఫ్యాక్షనిజం, కమిషన్ల చుట్టూ తిరిగితే, తమ కూటమి ప్రభుత్వం ఫైటర్ జెట్ల తయారీతో సీమ యువతకు ఉపాధి కల్పిస్తోందని గర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ పునరుద్ఘాటించారు.
 రాజకీయ విశ్లేషకుడిగా, విద్యావేత్తగా   గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఎప్పుడూ తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణలు  చేసే ఆయన, తాజాగా ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,  మంత్రి నాదెండ్ల మనోహర్‌లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. . అమిత్ షా పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని  జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయనపై కేసు పెట్టారు.  కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు, ఆ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రసారం చేసిన  టీవీ ఛానెల్‌పై కూడా పోలీసులు కేసు నమోదు అయ్యింది.   ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల జరిగిన ఒక టెలివిజన్ డిబేట్‌లో   గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. గతంలో ఒకానొక సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్   ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారనీ,   ఆ సందర్భంగా వారు మాజీ సీఎం జగన్ ను అరెస్టు చేయాలని   అమిత్ షాను కోరారనీ చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్..   అమిత్ షా రాజకీయాల్లో  ఇన్‌స్టంట్ ఫ్రెండ్,  లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనే వ్యత్యాసాలు ఉంటాయనీ,  చంద్రబాబు నాయుడు ఇన్‌స్టంట్ ఫ్రెండ్,   జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని పవన్, నాదెండ్ల మనోహర్ లకు తేల్చి చెప్పారనీ అన్నారు.   అంతే కాకుండా జగన్ విషయంలో వైఖరి మార్చుకోవాలని కూడా అమిత్ షా పవన్, నాదెండ్లకు సలహా ఇచ్చారని నాగేశ్వర్ ఆ డిబేట్ లో చెప్పారు.   ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.  అమిత్ షా అసలు అనని మాటలను అన్నట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కల్పించి చెబుతున్నారని..  కావాలనే కూటమి నేతల మధ్య, ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు  తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమిత్ షా, పవన్ కల్యాణ్‌ల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ జనసేన కార్యకర్తలు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌,  ఆ చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసిన టీవీ ఛానెల్ పై కేసు నమోదు చేశారు. 
    తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన తెలుగువన్ వాస్తవ వేదికలో ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై ఆసక్తికరమైన  విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని సాగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలజీవన్ మిషన్’ పథకం చుట్టూ ఇప్పుడు వివాదం ముదిరింది. పవన్ కళ్యాణ్ తన శాఖ పరంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపి, రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకురావడంలో విజయం సాధించారు. అయితే, కేంద్రం నుంచి విడుదలైన ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి చేరిన కేవలం అరగంట వ్యవధిలోనే మళ్ళించబడ్డాయనే ఆరోపణలు రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ నిధులు నేరుగా ‘మెఘా కృష్ణారెడ్డి’కి చెందిన సంస్థల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయనే అంశం ఇప్పుడు ప్రభుత్వ పారదర్శకతపై పెద్ద ప్రశ్న మార్క్‌గా నిలిచింది. రాజకీయ వ్యూహాలు మరియు అంతరార్థాలు: ఈ వ్యవహారంలో తెరవెనుక నడుస్తున్న రాజకీయ వ్యూహాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ నిధుల సాధన కోసం శ్రమిస్తుంటే, మరోవైపు ఆ నిధులు కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోవడం వెనుక ఉన్న శక్తులెవరనేది మిస్టరీగా మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న అంతర్గత సత్సంబంధాలను, ఏపీ కార్బైడ్స్ వంటి పరిశ్రమల్లో భాగస్వామ్యాలను గుర్తుచేస్తూ ప్రస్తుత రాజకీయ నాయకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఎన్నికల ముందు ప్రత్యర్థులుగా కనిపించే నాయకులు, తెరవెనుక ఒకే మంచం ఒకే కంచం అన్నట్లుగా వ్యవహరిస్తారనే వాదనకు బలం చేకూరుతోంది. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయనే భావన వ్యక్తమవుతోంది. ఇసుక రవాణాలో ప్రతి టిప్పర్‌కు భారీగా వసూళ్లు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా కాంట్రాక్టర్ల పెత్తనం మారకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే సంకేతాలు అందుతున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావం: ఈ నిధుల మళ్ళింపు ఉదంతం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక రాష్ట్ర మంత్రి కష్టపడి తెచ్చిన నిధులు, ఆయన ప్రమేయం లేకుండానే మళ్ళిపోవడం వల్ల ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణను వ్యతిరేకిస్తూ, ఎక్కువ మంది పిల్లలను కనాలని, మూడో బిడ్డకు రూ. 30 వేలు, నాలుగో బిడ్డకు రూ. 40 వేలు ఇస్తామని సరికొత్త పథకాలను ప్రకటిస్తున్నప్పటికీ, ప్రజల్లో నమ్మకం కలిగించడంలో విఫలమైతే ఆశించిన ఫలితం ఉండదు.  ప్రజల చదువు, ఆరోగ్యం, ఎదుగుదలకు ప్రభుత్వం అండగా ఉంటుందనే సంకేతాలు ఇవ్వనంత కాలం ఇటువంటి పథకాలు కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోతాయి. పాలనలో పారదర్శకత లోపిస్తే, రాబోయే రోజుల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, అది వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది. ఇలాంటి వివరాలు కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.  
  నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం(21-5-26న) మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం, పొలిట్‌బ్యూరో నియామకం తర్వాత తొలిసారి జరిగినఈ సమావేశానికి వర్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ భేటీలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు.  ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్‌కు సంబంధించిన ఒక తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.ఈ సారి మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.  టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, మహిళల భాగస్వామ్యంతో అమలు చేసిన కార్యక్రమాలను మహానాడు వేదికగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మహిళల భాగస్వామ్యంతోనే ప్రతి సంక్షేమ పథకాన్ని రూపొందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై మహానాడులో సమగ్ర చర్చ జరగాలని దిశానిర్దేశం చేశారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేలా మహానాడును నిర్వహించాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.  కార్యక్రమానికి రెండు రోజుల ముందే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరినీ మహానాడులో భాగస్వాములను చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహానాడు ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలో దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాలకు నివాళులు అర్పించి కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే ఎన్టీఆర్ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన రాజకీయ, సామాజిక మార్పులను మహానాడు వేదికగా ప్రదర్శించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.
  నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీలో ఉన్నప్పుడు వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన రామనారాయణరెడ్డి, టీడీపీలోకి 2009లో కాంగ్రెస్ నుంచి ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం, పదిహేనేళ్ల తర్వాత తిరిగి అక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ మంచి మెజార్టీతో గెలిచారు.  గత ఎన్నికల్లో ఆయన విజయం కోసం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ కొమ్మి లక్ష్మయ్యనాయుడు, సీనియర్ టీడీపీ నేత గూటూరు కన్నబాబులు కృషి చేశారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి జంప్ అయిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం ఆత్మకూరులోని తన సొంత మండలమైన మర్రిపాడులో ఆనం గెలుపు కోసం పనిచేశారట. ఇప్పుడా ముగ్గురూ ఆనం తిరిగి మంత్రి అయ్యాక ఆయన వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారు. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ఆ సీనియర్లు ఏకమై చక్రం తిప్పుతుడటం చర్చనీయాంశంగా మారింది. రామనారాయణరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదని ఆ సీనియర్లు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరకపోవడంతో కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబు వర్గీయుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అయినా వారు టీడీపీ పట్ల లాయల్ గానే వ్యవహరిస్తున్నారు. 73 ఏళ్ల వయసు పైపడిన ఆనం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని, అప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని ఆ ఇద్దరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారంట.  అయితే ఆనం రామనారాయణ తన రాజకీయ వారసురాలిగా కుమార్తె కైవల్లారెడ్డిని ప్రకటించడం, ఆమె ఆత్మకూరు నియోజకర్గంలో యాక్టివ్ అవుతుండటం అసలు ముసలానికి కారణమైంది. ఇటీవల టీడీపీలో యువతకు ప్రాధాన్యం పెరగడంతో నారా లోకేష్ యువనేత టీంలో కీలక భూమిక పోషించే విధంగా వారసురాలిని మంత్రి ఆనం రెడీ చేస్తున్నారట. తనయుడు శుభకర్ ఉన్నప్పటికీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్న కైవల్యనే తన రాజకీయ వారసురాలిగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. 1983లో రామరాయణరెడ్డి తండ్ర ఆనం వెంకరెడ్డి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అది ప్రస్తావిస్తూ తాత వారసత్వాన్ని నిలబెట్టాలని రామనారాయణ కుమార్తెను గీతోపదేశం చేస్తున్నారట.  వచ్చే ఎన్నికలలో ఆత్మకూరు నియోజకవర్గం నుండి కైవల్య రెడ్డిని బరిలో దింపాలనే ఉద్దేశంతో  రామనారాయణరెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తూ.. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీతో పాటు మేకపాటి వంశస్తులు కీలకంగా ఉన్నారు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబులతో జతకట్టి యాంటీ ఆనం గ్రూపు తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. రామనారాయణ రెడ్డి మంత్రి అయినప్పటి నుంచి జెండా మోసిన వారిని కాకుండా.. పార్టీ పిరాయింపుదారులకు ప్రాధాన్యత  ఇస్తున్నారని సీనియర్లు లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం..  ఆనం అవినీతిపై రోడ్డు ఎక్కితే పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో తామంతా మౌనంగా ఉన్నామని ఆ ముగ్గురు నేతలు చెబుతున్నారట. తమ వెంట తిరిగే కార్యకర్తలకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదీకాక  కొమ్మి లక్ష్మయ్యనాయుడు సొంత మండలమైన చేజర్ల, గూటూరు కన్నబాబు సొంత మండలం కరటంపాడు లో కూడా ఆనం వర్గమే ఆదిపత్యం చెలాయిస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. ఆ క్రమంలో ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముందు ఆ ముగ్గురు సీనియర్ నేతలు కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారట.  పార్టీ కోసం తాము చేసిన త్యాగాలను అధిష్టానం కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే.. మంత్రి ఆనం మీద ఫిర్యాదు చేశారని వారి అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారి మండలాల్లో జరిగే కార్యక్రమాలకి కూడా మంత్రి ఆనం వారిని ఆహ్వానించడం లేదట. తమతో తిరిగితే పనులు కూడా చెయ్యనని తమ అనుచరులను ఆనం భయపెడుతున్నారని ఆ ముగ్గురు నేతలు రగిలిపోతున్నారట. ఆ ఎఫెక్ట్‌తో  కొమ్మి లక్ష్మయ్యనాయుడు సహా ఆనంపై అసంతృప్తితో నేతలందరూ మేకపాటి శిబిరంలో చేరిపోతున్నారంట.  మరి కుమార్తె పొలిటికల్ కెరీర్ కోసం పాట్లు పడుతున్న ఆనం.. ఆత్మకూరులో ఈ వ్యతిరేక పరిస్థితులు ఎలా అధిగమిస్తారో చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే ప్రతిష్టాత్మక 158వ చిత్రం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మెగాస్టార్ కెరీర్‌లో మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో టాలీవుడ్‌లో సరికొత్త వైబ్స్ మొదలయ్యాయి. ఈ మెగా ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టడం విశేషం. మెగా బ్రదర్ నాగబాబుతో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ ఓపెనింగ్ వేడుక సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమా ప్రారంభమైన కాసేపటికే దర్శకుడు బాబీ మెగా అభిమానులను ఉద్దేశించి రాసిన ఒక ఎమోషనల్ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తాను కూడా చిరంజీవికి వీరాభిమానినని చెప్పుకొచ్చిన బాబీ.. ఈ సినిమాతో థియేటర్లలో ‘మెగా రాంపేజ్’ ఖాయమని స్పష్టం చేశారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు తనపై బాధ్యతను మరింత పెంచాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రతి మెగా అభిమాని గర్వపడేలా, కాలర్‌ ఎగరేసేలా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని బాబీ గట్టి భరోసా ఇచ్చారు. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. వింటేజ్ చిరును గుర్తుచేస్తూ బాబీ మలిచిన మాస్ ఎలిమెంట్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్‌ఫుల్ కాంబో రిపీట్ అవుతుండటంతో టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ తన లేఖలో సినిమా కథపై కూడా హింట్ ఇచ్చారు. పాత తరం మెగా ఫ్యాన్స్‌తో పాటు నేటి తరం యువ ప్రేక్షకులను సరికొత్త రీతిలో అలరించేలా ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ డ్రామాతో ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టడం, బాబీ ఎమోషనల్ ప్రామిస్ చేయడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ట్రెండింగ్ ఊపందుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఏదేమైనా ‘వాల్తేరు వీరయ్య’ను మించిన ఊరమాస్ హిట్‌ను బాబీ ఈసారి చిరుకు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారనే నమ్మకం మెగా క్యాంప్‌లో గట్టిగా కనిపిస్తోంది.
సూర్య వశిష్ట, దీప్శిఖ చంద్రన్ ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రమణి కళ్యాణం’ (Ramani Kalyanam). నేడు (మే 22) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో  తెలుసుకుందాం.  (Ramani Kalyanam Review) కథ: చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాదంలో సంజన (దీప్శిఖ చంద్రన్) తన కంటి చూపును కోల్పోతుంది. ఆమె ఒక పబ్‌లో సింగర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. మరోవైపు, రాజ్ (సూర్య వశిష్ట) కూడా ఒక ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయి, నడవలేని స్థితిలో వీల్ చైర్ కే పరిమితమవుతాడు. పబ్‌లో జరిగిన చిన్న గొడవతో వీరిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అసలు రాజ్ వీల్ చైర్‌కే ఎందుకు పరిమితమయ్యాడు? అతని గతమేంటి? సంజన గతం ఏంటి? వీరి ప్రేమకథ పెళ్లిపీటలు ఎక్కిందా లేదా? అనేదే మిగతా కథ. విశ్లేషణ: మనలో ఏ లోపం ఉన్నా జీవితంలో ముందుకు సాగడానికి అది అడ్డంకి కాకూడదనే ఒక మంచి మోటివేషనల్ పాయింట్‌తో 'రమణి కళ్యాణం' చిత్రం తెరకెక్కింది. అయితే కొన్ని కథలు పుస్తకాలుగా లేదా నవలలుగా చదువుకోవడానికి బాగుంటాయి కానీ వాటిని వెండితెరపై సినిమాగా మలిచేటప్పుడు సరైన ట్రీట్‌మెంట్ లేకపోతే బోర్ కొడతాయి. ‘రమణి కల్యాణం’ కూడా సరిగ్గా అదే కోవకు చెందిన చిత్రంగా మిగిలిపోయింది. ఒకరు అంధురాలు, మరొకరు వికలాంగుడు.. ఈ ఇద్దరి చుట్టూ తిరిగే భావోద్వేగ భరితమైన కథ ఇది. ఇలాంటి సినిమాలకు కథనం ఎంతో కీలకం. ‘గీతాంజలి’ లాంటి క్లాసిక్స్ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకోవడానికి కారణం అందులోని బలమైన ఎమోషన్స్. కానీ ‘రమణి కళ్యాణం’లో ఆ మ్యాజిక్ వర్కవుట్ అవ్వలేదు. సంజన క్యారెక్టరైజేషన్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు సహజంగా కాకుండా, బలవంతంగా రుద్దినట్లు ఉంటాయి.  ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, రాజ్-సంజనల మధ్య స్నేహం, ప్రేమతో సాదాసీదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ లో వచ్చే ఒక ఎమోషనల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే ఆ ట్విస్ట్ తర్వాత క్లైమాక్స్ ఏంటనేది ప్రేక్షకులు సులభంగా ఊహించవచ్చు. కథనంలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. మధ్యలో కామెడీ పండించడానికి చేసిన ప్రయత్నాలు కూడా అస్సలు వర్కౌట్ కాలేదు. దానికి తోడు, సినిమాలోని సింపతీ డైలాగ్స్ ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: కళ్ళు లేని అమ్మాయి పాత్రలో దీప్శిఖ చంద్రన్ బాగానే నటించింది. ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం నటనను మెరుగుపరుచుకోవాలి. సూర్య వశిష్ట కూడా వీల్ చైర్‌కే పరిమితమైన పాత్రలో చక్కని నటన కనబరిచాడు. స్క్రీన్‌పై కూడా హ్యాండ్సమ్‌గా కనిపించాడు. ఎప్పుడూ కామెడీ పాత్రలతో నవ్వించే శ్రీనివాస రెడ్డి ఈసారి ఒక ఎమోషనల్ పాత్రలో కనిపించి మెప్పించారు. లోహిత్ కుమార్, ప్రభావతి, చైతన్య జొన్నలగడ్డ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ పరంగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికొస్తే.. కొన్ని ల్యాగ్ సీన్స్, కథకు అడ్డుపడే సాంగ్ కట్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉన్నాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా, కథనంలో ఎమోషన్‌ను ఇంకాస్త బలంగా పండించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫైనల్ గా.. ఒక మంచి సందేశంతో కూడిన ఎమోషనల్ ప్రేమకథ 'రమణి కళ్యాణం'. అయితే సాగదీత ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. రేటింగ్: 2/5 Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
  ఇండియన్ సినీ పరిశ్రమలో బాహుబలికి ఉన్న స్థానం ఎంతో అందరకి తెలిసిన విషయం తెలిసిందే. 'బాహుబలి'కి ముందు, బాహుబలికి తర్వాత అని కూడా భారతీయ చలనచిత్ర చరిత్రని విభజించవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని కూడా నెలకొల్పింది. సదరు రికార్డులు చెరిగిపోవడం అనేది కూడా జరగని పని. అటువంటి బాహుబలి గురించి తమన్నా చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  తమన్నా మాట్లాడుతు ,బాహుబలి 'ది బిగినింగ్' చిత్రాన్ని సుమారు 200  కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆ సమయంలో ప్రాంతీయ భాషా చిత్రానికి అంత భారీ మొత్తంలో పెట్టుబడి  అనేది ఒక రకమైన జూదమే. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయి ఉంటే,  ఇండస్ట్రీలోనే ఒక పెద్ద విపత్తు సంభవించేది. నిర్మాతలు కోలుకోలేని విధంగా నష్టపోయేవారు. మొదటి భాగం విజయం ఇచ్చిన నమ్మకంతోనే, రెండో భాగం 'బాహుబలి 2: ది కంక్లూజన్' చిత్రాన్ని  250 కోట్ల రూపాయల భారీ వ్యయంతో తెరకెక్కించారు. అయితే ఈ విజయం వెనుక ఉన్న అసలు సీక్రెట్ సరైన కథా బలం రాజమౌళి గారి విజన్. కేవలం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టినంత మాత్రాన సినిమాలు ఆడవని ఆమె తేల్చి చెప్పారు. Also read: Gaayapadda simham: ఓటీటీలోకి వచ్చేసిన గాయపడ్డ సింహం.. ఇది కూడా ట్రంప్‌పై ప్రతీకారమేనా!    బాలీవుడ్ చిత్రాల బడ్జెట్ మేకింగ్‌పై తమన్నా ఆసక్తికరమైన విమర్శలు చేశారు. బాలీవుడ్‌లో వందల కోట్ల భారీ బడ్జెట్‌లని  కేవలం నటీనటుల పారితోషికాలకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. మరి స్క్రీన్ మీద క్వాలిటీ  చూపించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. బాహుబలి' విషయంలో రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆ తప్పు చేయలేదని ప్రశంసించారు. వారు బడ్జెట్‌లో ఎక్కువ శాతాన్ని విజువల్ ఎఫెక్ట్స్ (VFX), భారీ సెట్లు, ప్రొడక్షన్ వాల్యూస్ మరియు సాంకేతిక నాణ్యత కోసమే కేటాయించారని చెప్పారు. బాహుబలి రెండు భాగాల్లో  అవంతిక గా మెప్పించి సినిమా విజయంలో తను కూడా ఒక భాగమైన  విషయం తెలిసిందే.   
సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఒక్కోసారి ఎంతటి వివాదాలకు దారితీస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఇద్దరు టాప్ సెలబ్రిటీలు గతంలో చేసిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు వారిని చట్టపరమైన సమస్యల్లోకి నెట్టింది. ప్రముఖ బెంగాలీ నటులు పరంబ్రత ఛటర్జీ, స్వస్తిక ముఖర్జీలపై పోలీసులకు ఫిర్యాదు అందడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటి హింసాత్మక ఘటనలకు ఈ నటుల వ్యాఖ్యలే కారణమంటూ కోల్‌కతాలోని గరియాహట్ పోలీస్ స్టేషన్‌లో జాయ్‌దీప్ సేన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 2021 నాటి సున్నితమైన పరిస్థితుల్లో ఈ ఇద్దరు తారలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారని, అందుకే వారిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారు పేర్కొన్న వివరాల ప్రకారం.. 2021 మే 2న బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున నటుడు పరంబ్రత ఛటర్జీ బెంగాలీ భాషలో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టారు. "ఈ రోజును ప్రత్యర్థులను చితకబాదే ప్రపంచ దినోత్సవంగా ప్రకటిద్దాం" అనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేయగా, దానికి నటి స్వస్తిక ముఖర్జీ నవ్వుతున్న ఎమోజీని జత చేస్తూ ‘అలాగే జరగనివ్వు’ అంటూ మద్దతుగా రిప్లై ఇచ్చారు. ఈ వ్యాఖ్యలే అక్కడ తీవ్ర హింసకు దారితీశాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ట్వీట్లు వచ్చిన కొద్దిసేపటికే బేలియాఘాట ప్రాంతంలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారని, ఆ సమయంలో జరిగిన అనేక దాడులకు ఈ సెలబ్రిటీల పోస్టులే కారణమని ఫిర్యాదులో వెల్లడించారు. పరంబ్రత ఛటర్జీ కేవలం బెంగాలీ చిత్రాల్లోనే కాకుండా హిందీలో విద్యాబాలన్ ‘కహానీ’, అనుష్క శర్మ ‘పరీ’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే స్వస్తిక ముఖర్జీ కూడా పలు పాపులర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి కావడంతో ఈ విషయం మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఐదేళ్ల నాటి పాత ట్వీట్ ఉదంతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో, సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం తగదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ లీగల్ నోటీసులు మరియు పోలీస్ కంప్లైంట్‌పై నటుడు పరంబ్రత కానీ, నటి స్వస్తిక కానీ ఎలాంటి వివరణ ఇస్తారో.. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
  కార్మికులకి శుభాకాంక్షలు చెప్తూ మే 1 న సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయిన మూవీ 'గాయపడ్డ సింహం(gaayapadda simham). తరుణ్ భాస్కర్,  ఫరియా అబ్దుల్లా,  జేడీ చక్రవర్తి. మానస చౌదరి ముఖ్యమైన క్యారెక్టర్స్ లు పోషించారు. శ్రీ విష్ణు గెస్ట్ రోల్ లో కనిపించడం ఈ చిత్రం స్పెషాలిటీ. మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఎలాంటి ముందస్తు హడావుడి, అనౌన్స్‌మెంట్‌ లేకుండా  సైలెంట్‌గా ఓటీటీలోకి  వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓటిటి వేదికగా గాయపడ్డ సింహం యొక్క బాధని చూడవచ్చు  కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్,కథాంశం చాలా వింతగా, వినూత్నంగా మరియు హిలేరియస్‌గా సాగుతుంది. అమెరికా వెళ్ళాలని, అక్కడ లైఫ్‌లో బాగా సెటిల్ అవ్వాలని కలలు కనే ఒక సగటు భారతీయ యువకుడు దరహాస్ (తరుణ్ భాస్కర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతను గాయత్రి (మానసా చౌదరి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి ఒక కఠినమైన కండిషన్ పెడతాడు. తన కూతురిని కేవలం అమెరికాలో స్థిరపడిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని స్పష్టం చేస్తాడు. దీంతో ఎలాగైనా అమెరికా వెళ్లాలని దరహాస్ నిర్ణయించుకుంటాడు. తీరా కష్టపడి అమెరికా వెళ్లిన తర్వాత, అక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీల వల్ల వెనక్కి పంపించేస్తారు. దీంతో  దరహాస్ జీవితం, ప్రేమ రెండూ ప్రమాదంలో పడతాయి. తన కలలన్నీ విచ్ఛిన్నం కావడానికి డొనాల్డ్ ట్రంపే కారణమని భావించిన దరహాస్, అమెరికా మాజీ అధ్యక్షుడిపై  పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏకంగా ‘చేతబడి’ చేయాలనే క్రేజీ నిర్ణయం తీసుకుంటాడు. Also read: gd naidu: జి.డి. నాయుడు వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఇదే  ఈ విచిత్రమైన ప్రతీకార చర్య కోసం క్షుద్ర విద్యల నేపథ్యం ఉన్న ఒక ఫ్యామిలీకి చెందిన ఐఏఎస్ అస్పిరెంట్ భైరవ్ దాస్ (శ్రీ విష్ణు) సాయం కోరతాడు. ఈ క్రమంలో బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి), విశ్వాస్ (కశ్యప్ శ్రీనివాస్) లాంటి క్యారెక్టర్స్ కథలోకి ప్రవేశించడంతో కథ పూర్తిగా మలుపులు తిరుగుతూ నవ్వులు పూయిస్తుంది. అమెరికన్ డ్రీమ్ వెనుక ఉన్న చేదు నిజాలను, యువత ఎదుర్కొంటున్న ఇమిగ్రేషన్ కష్టాలను దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఎంతో వ్యంగ్యంగా, పారడీ రూపంలో స్క్రీన్‌పై ఆవిష్కరించారు.సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్రైమ్ కామెడీ డ్రామాకి  ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరించారు.  
    మాధవన్(R Madhavan)యాక్టింగ్ కి ఉన్న క్యాపబిలిటీ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. తన అద్భుతమైన పెర్ఫార్మ్ తో సినిమా రేంజ్ ని పెంచడంలో దిట్ట. ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 2 లో పోషించిన అజయ్ సన్యాల్ క్యారక్టర్ నే రీసెంట్ ఉదాహరణ. ఇప్పుడు మరోసారి భారతదేశపు ఎడిసన్‌గా కీర్తించబడిన గొప్ప శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త గోపాల్‌స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి. నాయుడు) జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో టైటిల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట  ట్రెండ్ అవుతోంది. సదరు  పోస్టర్‌లో మాధవన్ గెటప్‌లో కనిపిస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. 'బ్రిటిషర్లు భయపడిన.. సొంత దేశస్థులు మరచిపోయిన మహనీయుడు' అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఒక సాలిడ్ అప్‌డేట్‌ని  మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ బయోపిక్ ప్రపంచవ్యాప్తంగా 2026 జూలై 17న  గ్రాండ్‌గా రిలీజ్  కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వర్గీస్ మూలన్ పిక్చర్స్ సమర్పణలో, ట్రైకలర్ ఫిల్మ్స్ అసోసియేషన్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లోనే జరగడం విశేషం, ఎందుకంటే జి.డి. నాయుడు తన జీవితాన్ని, పరిశోధనలని  అక్కడే సాగించారు. ఈ బయోపిక్‌లో సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, తంబి రామయ్య, వినయ్ రాయ్,యోగి బాబు వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. 'గోవింద్ వసంత' అందిస్తున్న సంగీతం, 'అరవింద్ కమలనాథన్' సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న బయోపిక్ తర్వాత మాధవన్ నటిస్తున్న మరో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్డ్ మూవీ కావడంతో అభిమానుల్లో,ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. Also read: రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒకసారి మోసం చేస్తే క్షమించాలా! చిత్ర కథ విషయానికి వస్తే కేవలం మూడవ తరగతి  వరకు మాత్రమే చదువుకుని, బస్సు క్లీనర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఒక సాధారణ వ్యక్తి.. భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ ని కనిపెట్టే స్థాయికి ఎలా ఎదిగారు అనేదిగా ఉండబోతుంది. జి.డి. నాయుడు 1893లో కోయంబత్తూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. 1920లో ఒకే ఒక్క బస్సుతో రవాణా రంగాన్ని ప్రారంభించి, ఆ తర్వాత 1937లో నేషనల్ ఎలక్ట్రిక్ వర్క్స్ స్థాపించి అద్భుతాలు సృష్టించారు. 1967లో ఆయన స్థాపించిన సైన్స్ మ్యూజియం నేటికీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.    
- రాజకీయాల్లోకి రామ్ చరణ్..?  - సీఎం కావాలంటున్న ఫ్యాన్స్! - పాలిటిక్స్ పై చరణ్ బోల్డ్ స్టేట్మెంట్! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన అప్‌కమింగ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. రామ్ చరణ్ తన రాజకీయ అరంగేట్రం (Political Entry) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మీ అభిమానులు మిమ్మల్ని సీఎం (CM) గా చూడాలనుకుంటున్నారు.. భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి వెళ్తారా?" అని యాంకర్ ప్రశ్నించగా.. చరణ్ నవ్వుతూ స్పందించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదని ఆయన తేల్చి చెప్పారు. తనకు కేవలం సినిమా రంగంలోనే నంబర్ 1 అనిపించుకోవాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయడం తనకు ఇష్టం లేదని, ప్రస్తుతానికి తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని చరణ్ స్పష్టం చేశారు. కాగా, మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అలాగే కేంద్ర మంత్రిగా పని చేశారు. ఇక జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఈ క్రమంలోనే తండ్రి, బాబాయ్ ల బాటలో.. రామ్ చరణ్ కూడా పాలిటిక్స్ లోకి రావాలని అభిమానులు ఆశపడుతున్నారు. అయితే చరణ్ మాత్రం అసలు ఆ ఆలోచనే లేదు అంటున్నారు. మరి చరణ్ ఇదే మాట మీద ఉండిపోతారా? లేక అభిమానుల కోరిక మేరకు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? అనేది చూడాలి.  
  ఆల్ అగ్ర హీరోలతో జత కట్టి  టాప్ హీరోయిన్ హోదాని ఎంజాయ్ చేసిన భామ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet SIngh). ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో వివాహం జరిగిన తర్వాత కూడా తన కెరీర్‌ని  కొనసాగిస్తోంది.ఈ నెల 15 న  ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ, వామికా గబ్బిలతో కలిసి 'పతి పత్ని ఔర్ వో 2' తో థియేటర్స్ లో అడుగుపెట్టింది.  ప్రమోషన్లలో భాగంగా ఒక టాక్ షోలో రకుల్ తో పాటు మిగతా వాళ్ళు  కొన్ని ఆసక్తికరమైన విషయాలని  పంచుకున్నారు. ఈ చర్చ కాస్తా ఇంటర్నెట్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.  రకుల్‌ మాట్లాడుతు రిలేషన్‌షిప్‌లో మోసం చేయడం అనేది ఎట్టిపరిస్థితుల్లోను కరెక్ట్ కాదు. నేను  సమర్థించను, కానీ, అదే సమయంలో జీవితం చాలా పెద్దది. ఎవరైనా ఒకే ఒక్కసారి పొరపాటున ఆ తప్పు చేస్తే వన్ టైమ్ స్లిప్ కింద వారిని క్షమించవచ్చు అని చెప్పింది. సారా అలీ ఖాన్ మాత్రం రకుల్ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించలేదు. ఒకవేళ భాగస్వామి తప్పు చేసి నిజాయితీగా క్షమాపణ చెబితే క్షమిస్తానేమో కానీ, ఆ మోసాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంది.వెంటనే ఆ మాటలపై రకుల్ స్పందిస్తూ, ఒకరిని మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవాల్సిందే. లేదంటే ఆ బంధం ముందుకు సాగదని చాలా మెచ్యూర్డ్‌గా సమాధానమిచ్చింది. అయితే, ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ బయటకు రాగానే నెటిజన్లు రకుల్ వ్యక్తిగత జీవితాన్ని, ఆమె భర్త జాకీ భగ్నానీని ఈ వ్యాఖ్యలతో ముడిపెడుతూ ట్రోల్ చేయడం ప్రారంభించారు.   Also read: Jailer 2: జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!.. వాళ్ళు తప్పుకుంటే మంచిదేమో  ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ తమ పెళ్లిని సరదాగా 'సిట్యుయేషన్‌షిప్' అని పిలవడం, ఆ తర్వాత రకుల్ అతని చెవులు పట్టుకుని మరీ తాము మిలీనియల్స్ అని, జెన్-జీ లాగా మాట్లాడద్దని క్లారిటీ ఇచ్చిన వీడియో నెట్‌లో వైరల్  అయింది. ఈ నేపథ్యంలోనే రకుల్ చీటింగ్ గురించి మాట్లాడటంతో అందరూ రకరకాల అంచనాలకి  వచ్చేశారు. దాంతో రకుల్ వెంటనే అలర్ట్ అయ్యి, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వివరణ ఇస్తు ఒక గంట పాటు సాగిన సుదీర్ఘ ఇంటర్వ్యూ నుంచి కేవలం ఒకే ఒక్క లైన్‌ని  కట్ చేసి హెడ్‌లైన్‌గా మార్చడం చూసి నవ్వుకున్నాను. ఒక విషయాన్ని సందర్భోచితంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. నేను షోలో చేసిన వ్యాఖ్యలు సినిమా ప్రమోషన్లకి సంబంధించిన జనరల్ టాపిక్ మాత్రమే. నా వ్యక్తిగత వైవాహిక జీవితానికి, ఆ మాటలకి సంబంధం లేదు  జాకీ భగ్నానీ నా  మధ్య బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉందని రకుల్ తెలిపింది  
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) బాక్సాఫీస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాత సినిమాలు థియేటర్లలోకి రీ-రిలీజ్ అవుతున్నాయంటే చాలు, అభిమానుల హడావుడి సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.  (Athidhi Re Release) తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC X Roads) లోని ప్రముఖ ఫ్యాన్ ఫేవరెట్ థియేటర్ సుదర్శన్ వద్ద మహేష్ బాబు నటించిన 'అతిథి' సినిమాకు సంబంధించిన ఒక భారీ కటౌట్ ను ఆవిష్కరించారు. ఈ కటౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.  మహేష్ బాబు కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచిన ‘అతిథి’ చిత్రం 2007లో విడుదలై అభిమానులను అలరించింది. ఇప్పుడు దాదాపు 19 ఏళ్ల తర్వాత, ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా సరికొత్త 4K టెక్నాలజీతో థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి(మే 31)ని పురస్కరించుకుని.. మే 29న ఈ చిత్రం గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతోంది.  ఈ సరికొత్త 4K రీ-రిలీజ్ వెర్షన్‌లో టెక్నికల్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. మునుపటి కంటే ఎంతో షార్పర్ విజువల్స్, క్రిస్పీ కలర్ గ్రేడింగ్‌తో పాటు థియేటర్లలో అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్ కోసం ‘డాల్బీ అట్మాస్’ ఆడియోను జోడించారు. అంతేకాకుండా, సినిమా రన్‌టైమ్‌ను మరింత క్రిస్ప్‌గా మార్చడానికి కొన్ని టైట్ ఎడిట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మే 29న థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడటం ఖాయమని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఒక క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను థియేటర్లలో 4Kలో చూసేందుకు అటు సాధారణ ప్రేక్షకులు, ఇటు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సరికొత్త రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.  నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. కేవలం అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే ఈ చిత్రం ఇప్పటికే 15,000 కంటే ఎక్కువ టిక్కెట్లను విక్రయించి సంచలనం సృష్టించింది. నార్త్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 467 లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఇప్పటివరకు ఏకంగా $430,000 డాలర్ల (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.4 కోట్లు) గ్రాస్ వసూళ్లను సాధించి అదరగొట్టింది. ఇందులో కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి ప్రధాన రాష్ట్రాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. అక్కడి తెలుగు ప్రేక్షకులు చరణ్ మాస్ అవతారాన్ని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం అమెరికాలోనే కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మార్కెట్లో కూడా ‘పెద్ది’ హవా గట్టిగానే నడుస్తోంది. యూకేలో ఇప్పటికే 7,500 కంటే ఎక్కువ టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అమ్ముడయ్యాయి.  సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఈ స్థాయి రెస్పాన్స్ రావడం చూస్తుంటే, రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓవర్సీస్ ఓపెనర్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పవర్ ఫుల్ ఎమోషనల్ జర్నీలో రామ్ చరణ్ ఊరమాస్ పహిల్వాన్ లుక్, అలాగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన సంగీతం, ఇటీవల విడుదలైన సెన్సేషనల్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.   https://x.com/PrathyangiraUS/status/2057655862685233454
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.
  భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఒక విలువైన సంబంధం. అయితే ఈ బంధం  ఎప్పుడూ తగాదాలు,  వాదనలతో నిండి ఉంటుంది.  కానీ గొడవ అయినా, తగాదాలు అయినా  భర్త పదేపదే  అబద్ధం చెప్పడం చాలా ఇబ్బందికర విషయం.  ఇలా  అబద్ధాలు చెప్పడం భార్యను బాధకు గురిచేస్తుంది. భర్త చెప్పేవి అబద్దాలు అని తెలిసినా సరే.. కొందరు భార్యలు తమ భర్తల విషయంలో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటారు. మరికొందరు గొడవ పడుతుంటారు. అయితే ఇలా గొడవ పడటం వల్ల భార్యాభర్తల బంధానికే ముప్పు వాటిల్లుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భర్త ఇంకోసారి అబద్దం చెప్పకుండా ఉండటానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.  వాటిని ఫాలో అయితే భర్తలు అబద్దం చెప్పడం మానేస్తారు.  అవేంటో తెలుసుకుంటే.. భర్తకు అబద్ధాలు చెప్పే అలవాటును ఎలా వదిలించాలి..  భర్త  భార్యకు  అబద్ధం చెబితే, అది సంబంధానికి పెద్ద సమస్యగా మారవచ్చు. అబద్ధం చెప్పడం వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతుంది.  సంబంధంలో చీలిక ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి  కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.  భర్తతో బహిరంగంగా మాట్లాడవచ్చు.. భర్త అబద్దాలు చెబుతుంటే భార్య వాటిని ఊరికే సహించడం చేయకుండా నేరుగా  భర్తతో ఓపెన్ గా  మాట్లాడాలి. అబద్ధం ఎంత ప్రమాదకరమూ,  అది భార్యను  ఎలా బాధపెడుతుందో వివరించాలి. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు భర్తకు ఆ విషయాలు అర్థం కావడం కోసం కొన్నిఉదాహరణలు కూడా చెప్పవచ్చు. అతను చెప్పిన అబద్దాల వల్ల ఏ సందర్భంలో ఎంత బాధ అనుభవించారనేది చెప్పవచ్చు.  ఇలా చేస్తే భర్తలో ఆలోచనలు కలిగి అతను అబద్దం చెప్పడం మానుకునే అవకాశం ఉంటుంది. కారణాలు అర్థం చేసుకోవాలి.. భర్త అబద్దం చెప్పడం అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. అతను ఎలాంటి సందర్బంలో, పరిస్థితిలో అబద్దం చెప్పాడు అనే విషయాన్ని కూడా కూడా అర్థం చేసుకోవడం భార్య బాధ్యత.  ఇలా అర్థం చేసుకుంటే  తన భావాలను భార్య అర్థం చేసుకుంటోందని అతను గ్రహిస్తాడు.  అతని అబద్ధాల వెనుక గల కారణాలను అర్థం చేసుకుంటే ఆ తరువాత అతను ఎప్పుడైనా అర్థం చెప్పినా అదంత బాధ లేదా కోపాన్ని కలిగించదు.   పరిష్కారం.. భార్య భర్తకు ఎలాంటి పరిస్థితిలో అయినా  అండగా ఉన్నారని,  ఏవైనా సమస్యలు వస్తే వాటి పరిష్కార మార్గాలు కనుగొనడంలో అతనికి సహాయం చేస్తారని అతనికి  అర్థమయ్యేలా చేయాలి. ఇలా చేస్తే భర్త ఏ సమస్య వచ్చినా తన భార్య కూడా తనకు సమస్య పరిష్కారంలో తోడు ఉంటుందనే భరోసాతో అబద్దాలు చెప్పకుండా ఏ విషయాలు దాపరికం లేకుండా ఉంటారు.   బయటి నుండి సహాయం.. పైన చెప్పుకున్న చిట్కాలన్నింటినీ అనుసరించిన తర్వాత కూడా భర్త ప్రవర్తన మెరుగుపడకపోతే.. భార్య  మంచి సలహాదారుడి సహాయం తీసుకోవచ్చు. అంతేకాదు భర్త అబద్ధం చెప్పడం మానేయడానికి  అతను చేస్తున్నది ఎంత  తప్పు అనే విషయం  అర్థం చేసుకునేలా చేయడానికి  అతనితో సమయం గడపాలి. దగ్గరి వ్యక్తుల  సహాయం..   భర్త అబద్దాలు చెప్పడం అనే  సమస్యను కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు,   స్నేహితులు,  ఆత్మీయులు మొదలైనవారితో  చర్చించవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు.  కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండాలి.  భార్యాభర్తల బంధంలో అబద్దాలు చెప్పడం బంధాన్ని ఎంత ప్రమాదంలో పడేస్తుందో అతనికి అర్థమయ్యే వరకు వేచి ఉండాలి.                                *రూపశ్రీ.
టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది. అయితే, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు డాక్టర్ శ్రీలత గారు. తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ప్రత్యేక వీడియోలో డాక్టర్ శ్రీలత గారు గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాలు మరియు కొన్ని సులువైన చిట్కాలను పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం... గుండె ఆరోగ్యానికి రక్షణ కవచాలు.. ఈ ఆహారాలు: ఆకుకూరలు (Leafy Vegetables): తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే 'విటమిన్ కె' రక్తనాళాలను రక్షించి, బ్లడ్ ప్రెషర్ (BP) నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. తృణధాన్యాలు (Whole Grains): మనం తినే పాలిష్ చేసిన బియ్యానికి బదులుగా ఓట్స్, బార్లీ, జొన్నలు, రాగులు, దంపుడు బియ్యం (Brown Rice) వంటి తృణధాన్యాలను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే పీచు పదార్థం (Fiber) శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొవ్వులు (Healthy Fats): అన్ని కొవ్వులు గుండెకు కీడు చేయవు. బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) గుండె రక్తనాళాల్లో పూడికలు (Blocks) ఏర్పడకుండా చూస్తాయి. నూనెల వాడకంలో జాగ్రత్తలు: వంటల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans Fats) ఎక్కువగా ఉండే వనస్పతి, డాల్డాలను పూర్తిగా దూరం పెట్టాలి. బేకరీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ గుండె ఆరోగ్యానికి శత్రువులని డాక్టర్ శ్రీలత హెచ్చరిస్తున్నారు. ఉప్పు, పంచదార తగ్గించండి: ఆహారంలో సోడియం (ఉప్పు) శాతం పెరిగితే బీపీ పెరుగుతుంది. అది నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఉప్పు మరియు చక్కెర వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. గుండె పదిలంగా ఉండాలంటే చేయాల్సినవి: ప్రతిరోజూ కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. ధూమపానం (Smoking), మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి. గుండె జబ్బులు వచ్చాక బాధపడటం కంటే, రాకుండా ముందే జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం (Prevention is better than cure). డాక్టర్ శ్రీలత గారు సూచించిన ఈ సాధారణ డైట్ టిప్స్ పాటిస్తూ మీ హృదయాన్ని పదికాలాల పాటు పచ్చగా ఉంచుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది రకరకాల మానసిక రుగ్మతల (Mental Illness) బారిన పడుతున్నారు. అసలు మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి? వాటి రకాలు ఏమిటి? వీటికి మందులు వాడకుండా కేవలం కౌన్సెలింగ్, థెరపీల ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందా? అనే విషయాలపై ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం (న్యూ లైఫ్ కౌన్సెలింగ్ సెంటర్, హైదరాబాద్) గారు ఈ VIDEO లో విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. మానసిక రుగ్మత (Mental Illness) అంటే ఏమిటి? సాధారణంగా ఒక వ్యక్తి ఆలోచనా విధానంలో, ప్రవర్తనలో మరియు భావోద్వేగాలలో అసాధారణ మార్పులు వచ్చి, అవి వారి దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తే దానిని మానసిక రుగ్మతగా పరిగణిస్తారు. ఇది కేవలం 'పిచ్చి' కాదు, గుండె జబ్బు, మధుమేహం లాగే మెదడు పనితీరుకు సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య. ప్రధాన మానసిక సమస్యలు - రకాలు: సమాజంలో ఎక్కువగా కనిపించే కొన్ని ముఖ్యమైన మానసిక రుగ్మతలు: డిప్రెషన్ (Depression - తీవ్ర నిరాశ): ఎప్పుడూ బాధగా ఉండటం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం. యాంగ్జైటీ డిజార్డర్స్ (Anxiety Disorders - ఆందోళన): చిన్న విషయాలకే విపరీతంగా భయపడటం, కంగారుపడటం.  అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD): ఒకే ఆలోచన పదే పదే రావడం (ఉదాహరణకు చేతులు కడగడం, తాళాలు సరిచూసుకోవడం).  బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder): ఒకసారి విపరీతమైన ఆనందం, మరోసారి తీవ్రమైన నిరాశకు లోనవడం.  స్కిజోఫ్రీనియా (Schizophrenia): లేని విషయాలు ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రమపడటం. మానసిక సమస్యలను గుర్తించడం ఎలా? (Diagnosis) చాలా మంది తమకు సమస్య ఉన్నా బయటకు చెప్పుకోవడానికి సంకోచిస్తారు. ఒక వ్యక్తిలో క్రింది లక్షణాలు కనిపిస్తే వారు మానసిక ఒత్తిడిలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు: నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించడం. చిన్న విషయాలకే విపరీతంగా కోపం లేదా ఏడుపు రావడం. నెగటివ్ ఆలోచనలు, ఆత్మహత్య ఆలోచనలు రావడం. మందులు లేకుండా మానసిక సమస్యలకు చికిత్స (Treatment Without Medication): చాలా మంది మానసిక సమస్య అనగానే జీవితాంతం మందులు (Psychiatric Medicines) వాడాలేమో అని భయపడతారు. అయితే, అన్ని సమస్యలకూ మందులు అవసరం లేదని డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు స్పష్టం చేశారు. సైకాలజిస్టులు అందించే కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వీటిని పూర్తిగా నయం చేయవచ్చు: కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT): ఈ థెరపీ ద్వారా రోగిలోని ప్రతికూల (Negative) ఆలోచనలను గుర్తించి, వాటిని సానుకూల (Positive) ఆలోచనలుగా మారుస్తారు. సైకాలజికల్ కౌన్సెలింగ్: మనసులోని బాధను, ఒత్తిడిని నిపుణులైన సైకాలజిస్ట్‌తో పంచుకోవడం ద్వారా సగం సమస్య పరిష్కారమవుతుంది. వారు సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారాన్ని చూపిస్తారు. లైఫ్ స్టైల్ మార్పులు: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మైండ్‌ఫుల్‌నెస్ మరియు ధ్యానం: మెదడును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం (Meditation) ఎంతో సహాయపడుతుంది. మానసిక సమస్యలు అనేవి దాచుకోవాల్సిన విషయాలు కావు. శారీరక నొప్పులకు డాక్టర్‌ను సంప్రదించినట్లే, మానసిక ఇబ్బందులు ఉన్నప్పుడు సంకోచించకుండా సైకాలజిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం. మందుల వాడకం లేకుండా, కేవలం సరైన అవగాహన, థెరపీలతో మానసిక రుగ్మతలను జయించి సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!