
కార్మికులకి శుభాకాంక్షలు చెప్తూ మే 1 న సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయిన మూవీ 'గాయపడ్డ సింహం(gaayapadda simham). తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, జేడీ చక్రవర్తి. మానస చౌదరి ముఖ్యమైన క్యారెక్టర్స్ లు పోషించారు. శ్రీ విష్ణు గెస్ట్ రోల్ లో కనిపించడం ఈ చిత్రం స్పెషాలిటీ. మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఎలాంటి ముందస్తు హడావుడి, అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓటిటి వేదికగా గాయపడ్డ సింహం యొక్క బాధని చూడవచ్చు కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్,కథాంశం చాలా వింతగా, వినూత్నంగా మరియు హిలేరియస్‌గా సాగుతుంది. అమెరికా వెళ్ళాలని, అక్కడ లైఫ్‌లో బాగా సెటిల్ అవ్వాలని కలలు కనే ఒక సగటు భారతీయ యువకుడు దరహాస్ (తరుణ్ భాస్కర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతను గాయత్రి (మానసా చౌదరి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి ఒక కఠినమైన కండిషన్ పెడతాడు. తన కూతురిని కేవలం అమెరికాలో స్థిరపడిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని స్పష్టం చేస్తాడు. దీంతో ఎలాగైనా అమెరికా వెళ్లాలని దరహాస్ నిర్ణయించుకుంటాడు. తీరా కష్టపడి అమెరికా వెళ్లిన తర్వాత, అక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీల వల్ల వెనక్కి పంపించేస్తారు. దీంతో దరహాస్ జీవితం, ప్రేమ రెండూ ప్రమాదంలో పడతాయి. తన కలలన్నీ విచ్ఛిన్నం కావడానికి డొనాల్డ్ ట్రంపే కారణమని భావించిన దరహాస్, అమెరికా మాజీ అధ్యక్షుడిపై పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏకంగా ‘చేతబడి’ చేయాలనే క్రేజీ నిర్ణయం తీసుకుంటాడు.
Also read: gd naidu: జి.డి. నాయుడు వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఇదే
ఈ విచిత్రమైన ప్రతీకార చర్య కోసం క్షుద్ర విద్యల నేపథ్యం ఉన్న ఒక ఫ్యామిలీకి చెందిన ఐఏఎస్ అస్పిరెంట్ భైరవ్ దాస్ (శ్రీ విష్ణు) సాయం కోరతాడు. ఈ క్రమంలో బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి), విశ్వాస్ (కశ్యప్ శ్రీనివాస్) లాంటి క్యారెక్టర్స్ కథలోకి ప్రవేశించడంతో కథ పూర్తిగా మలుపులు తిరుగుతూ నవ్వులు పూయిస్తుంది. అమెరికన్ డ్రీమ్ వెనుక ఉన్న చేదు నిజాలను, యువత ఎదుర్కొంటున్న ఇమిగ్రేషన్ కష్టాలను దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఎంతో వ్యంగ్యంగా, పారడీ రూపంలో స్క్రీన్‌పై ఆవిష్కరించారు.సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్రైమ్ కామెడీ డ్రామాకి ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరించారు.





