Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుమార్తె కోసం మంత్రి ఆనం ప్రణాళికలు... టీడీపీ క్యాడర్‌లో అసమ్మతి!
posted on: May 21, 2026 5:33PM

నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీలో ఉన్నప్పుడు వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన రామనారాయణరెడ్డి, టీడీపీలోకి 2009లో కాంగ్రెస్ నుంచి ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం, పదిహేనేళ్ల తర్వాత తిరిగి అక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ మంచి మెజార్టీతో గెలిచారు.
గత ఎన్నికల్లో ఆయన విజయం కోసం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ కొమ్మి లక్ష్మయ్యనాయుడు, సీనియర్ టీడీపీ నేత గూటూరు కన్నబాబులు కృషి చేశారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి జంప్ అయిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం ఆత్మకూరులోని తన సొంత మండలమైన మర్రిపాడులో ఆనం గెలుపు కోసం పనిచేశారట. ఇప్పుడా ముగ్గురూ ఆనం తిరిగి మంత్రి అయ్యాక ఆయన వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారు. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ఆ సీనియర్లు ఏకమై చక్రం తిప్పుతుడటం చర్చనీయాంశంగా మారింది.
రామనారాయణరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదని ఆ సీనియర్లు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరకపోవడంతో కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబు వర్గీయుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అయినా వారు టీడీపీ పట్ల లాయల్ గానే వ్యవహరిస్తున్నారు. 73 ఏళ్ల వయసు పైపడిన ఆనం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని, అప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని ఆ ఇద్దరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారంట.
అయితే ఆనం రామనారాయణ తన రాజకీయ వారసురాలిగా కుమార్తె కైవల్లారెడ్డిని ప్రకటించడం, ఆమె ఆత్మకూరు నియోజకర్గంలో యాక్టివ్ అవుతుండటం అసలు ముసలానికి కారణమైంది. ఇటీవల టీడీపీలో యువతకు ప్రాధాన్యం పెరగడంతో నారా లోకేష్ యువనేత టీంలో కీలక భూమిక పోషించే విధంగా వారసురాలిని మంత్రి ఆనం రెడీ చేస్తున్నారట. తనయుడు శుభకర్ ఉన్నప్పటికీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్న కైవల్యనే తన రాజకీయ వారసురాలిగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. 1983లో రామరాయణరెడ్డి తండ్ర ఆనం వెంకరెడ్డి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అది ప్రస్తావిస్తూ తాత వారసత్వాన్ని నిలబెట్టాలని రామనారాయణ కుమార్తెను గీతోపదేశం చేస్తున్నారట.
వచ్చే ఎన్నికలలో ఆత్మకూరు నియోజకవర్గం నుండి కైవల్య రెడ్డిని బరిలో దింపాలనే ఉద్దేశంతో రామనారాయణరెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తూ.. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీతో పాటు మేకపాటి వంశస్తులు కీలకంగా ఉన్నారు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబులతో జతకట్టి యాంటీ ఆనం గ్రూపు తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. రామనారాయణ రెడ్డి మంత్రి అయినప్పటి నుంచి జెండా మోసిన వారిని కాకుండా.. పార్టీ పిరాయింపుదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారని సీనియర్లు లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం..
ఆనం అవినీతిపై రోడ్డు ఎక్కితే పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో తామంతా మౌనంగా ఉన్నామని ఆ ముగ్గురు నేతలు చెబుతున్నారట. తమ వెంట తిరిగే కార్యకర్తలకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదీకాక కొమ్మి లక్ష్మయ్యనాయుడు సొంత మండలమైన చేజర్ల, గూటూరు కన్నబాబు సొంత మండలం కరటంపాడు లో కూడా ఆనం వర్గమే ఆదిపత్యం చెలాయిస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. ఆ క్రమంలో ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముందు ఆ ముగ్గురు సీనియర్ నేతలు కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారట.
పార్టీ కోసం తాము చేసిన త్యాగాలను అధిష్టానం కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే.. మంత్రి ఆనం మీద ఫిర్యాదు చేశారని వారి అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారి మండలాల్లో జరిగే కార్యక్రమాలకి కూడా మంత్రి ఆనం వారిని ఆహ్వానించడం లేదట. తమతో తిరిగితే పనులు కూడా చెయ్యనని తమ అనుచరులను ఆనం భయపెడుతున్నారని ఆ ముగ్గురు నేతలు రగిలిపోతున్నారట. ఆ ఎఫెక్ట్‌తో కొమ్మి లక్ష్మయ్యనాయుడు సహా ఆనంపై అసంతృప్తితో నేతలందరూ మేకపాటి శిబిరంలో చేరిపోతున్నారంట. మరి కుమార్తె పొలిటికల్ కెరీర్ కోసం పాట్లు పడుతున్న ఆనం.. ఆత్మకూరులో ఈ వ్యతిరేక పరిస్థితులు ఎలా అధిగమిస్తారో చూడాలి.


.webp)


