LATEST NEWS
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది. సాధారణంగా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్లపై కాలింగ్, డేటా వంటి సేవలను మాత్రమే అందిస్తుంటాయి. కానీ, ఇప్పుడు వినియోగదారుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని సరికొత్తగా ఉచిత బీమా ప్రయోజనాలను జతచేశాయి.ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆఫర్ కింద, ప్రత్యేకంగా ఎంపిక చేసిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు అదనపు భరోసా లభించనుంది. దీని ప్రకారం, వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని పొందవచ్చు.  డిజిటల్ యుగంలో పెరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక వెంచర్ కింద STV 202 మరియు STV 2449 అనే రెండు ప్రముఖ ప్రీపెయిడ్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకునే యూజర్లకు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. కేవలం కాలింగ్ మరియు ఇంటర్నెట్ ప్రయోజనాలే కాకుండా, ఈ ప్లాన్ల ద్వారా వినియోగదారుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా ఈ సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీలను డిజైన్ చేయడం విశేషం.ఈ ఆఫర్‌ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రముఖ ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో టెలికాం సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది.  ఈ భాగస్వామ్యం ద్వారా అర్హత కలిగిన వినియోగదారులకు ప్రమాదవశాత్తు జరిగే దుర్ఘటనల్లో కుటుంబానికి అండగా నిలిచేందుకు ఏకంగా రూ. 1 లక్ష వరకు ప్రమాద మరణ బీమా రక్షణ కల్పించబడుతుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను నిరోధించే దిశగా మరో ముందడుగు వేశారు. ఈ ప్లాన్లను ఎంచుకునే ఖాతాదారులకు సైబర్-ఫ్రాడ్ రక్షణ కింద రూ. 10,000 వరకు నష్టపరిహారం అందేలా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల డిజిటల్ లావాదేవీలు నిర్వహించే సాధారణ ప్రజలకు పెద్దఎత్తున ఉపశమనం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెలికాం రంగంలో పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో, ప్రభుత్వ రంగ సంస్థ తీసుకున్న ఈ ప్రజాహిత నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతులు, కార్మికులు  అసంఘటిత రంగాల్లో పనిచేసే సామాన్య ప్రజలకు ఈ తరహా బీమా ప్లాన్లు ఎంతో మేలు చేకూరుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎటువంటి ప్రత్యేక దరఖాస్తులు లేకుండా నేరుగా రీఛార్జ్‌తోనే ఈ ప్రయోజనం చేకూరడం గమనార్హం.మరిన్ని భవిష్యత్ పరిణామాలలో భాగంగా, ఇతర ప్లాన్లకు కూడా ఈ రకమైన ప్రయోజనాలను విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ తరహా వినూత్న సేవలు రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త చందాదారులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, సామాన్యులకు సైతం టెలికాం సేవలతో పాటు బీమా భద్రత లభించడం శుభపరిణామమని ఆశించవచ్చు.         [ BSNL free insurance plans, BSNL STV 202 plan, BSNL STV 2449 recharge, BSNL accidental insurance cover, BSNL cyber fraud protection,  TeluguOne news, Telugu News ]   
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ పట్టా భూములు నివాస వినియోగంలోకి మారినప్పటికీ నాలా ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూములకు మార్గం సుగమం చేసింది. అర్హత ఉన్న భూములకు నాలా రుసుముతో పాటు నిబంధనల ప్రకారం ఇతర ప్రభుత్వ రుసుములు వసూలు చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.ఈ మేరకు మెమో నంబర్ 48062/ULC/A1/2026 ద్వారా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాలా ప్రక్రియ పూర్తికాకపోవడంతో రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే నమోదై ఉన్న, 22-ఎ జాబితాలో చేరిన నివాస పట్టా భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని మంత్రి చెప్పారు. దరఖాస్తులను రెవెన్యూ రికార్డులు, భూ హక్కులు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సమగ్రంగా పరిశీలించి, అర్హత ఉన్న వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.అర్హులైన దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రక్రియను పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలతో పాటు అమలు పురోగతిపై నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లకు సూచించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏళ్ల తరబడి తమ సొంత ప్లాట్లను విక్రయించుకోలేక, వాటిపై రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.22-ఎకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల కోణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అని, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అధికారులు బాధ్యతాయుతంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. గత నెల 16న శాసనసభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు అనుగుణంగా 22-ఎకు సంబంధించిన సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు పొంగులేటి తెలిపారు. 22-ఎ సమస్యల పరిష్కారంపై సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అనంతరం జీఓ 118, జీఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు. 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.అలాగే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి కూడా ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ తాజాగా మెమో జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.     [ 22-A Lands, 22-A Land Issues, NALA Process, NALA Charges, Land Problems, Patta Lands, Land Registrations, Ponguleti Srinivas Reddy, Telangana Government, Revenue Department, District Collectors, Land Rights, Urban Land Ceiling, GO 118, GO 76, Memo 48062/ULC/A1/2026, Revanth Reddy, Fast-Track Resolution ]
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రశాంతంగా ఉంటుందనుకున్న నగరంలో నేరస్థులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బడ్జెట్ హోటళ్లు, ఓయో గదులు అసాధారణ ఘటనలకు నిలయాలుగా మారుతుండటం పట్ల నగర ప్రజలు బెంబెలెత్తుతున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఓయో హోటళ్లకు వెళ్లిన ముగ్గురు యువతులు కొద్దిరోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది.నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న ఈ విషాద ఘటనలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. మాదాపూర్ పరిధిలోని ఓ ఓయో హోటల్‌కు వెళ్లిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆ తర్వాత కొద్ది రోజులకే ఎస్సార్ నగర్ ప్రాంతంలోని మరో హోటల్‌లో వివాహిత రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది.  ఆ ఘటనలో నిందితులు నకిలీ ఆధార్ కార్డులతో గది తీసుకున్నట్లు వెల్లడడవడం నగర భద్రతను తీవ్ర ప్రశ్నార్థకంలోకి నెట్టింది.ఇక తాజాగా మియాపూర్‌లోని మరో హోటల్‌‌లో వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతి చెంది రోజులు గడుస్తుండటంతో మృతదేహం కుళ్లిపోయిన స్థితికి చేరుకుంది. ఇలా కేవలం పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు యువతులు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో దారుణంగా ప్రాణాలు కోల్పోవడం పోలీసు యంత్రాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.నిబంధనల ప్రకారం హోటళ్లకు వచ్చే ప్రతి అతిథికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది.  ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకుని, ఎంట్రీ రిజిస్టర్ నిర్వహించాలి. కానీ, చాలా చోట్ల హోటల్ యాజమాన్యాలు నిబంధనలను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. డబ్బుల కోసం కక్కుర్తి పడి సరైన ధ్రువీకరణలు లేకుండా గదులు కేటాయించడం వల్లే ఇలాంటి నేరాలకు అడ్డాగా మారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.హోటల్ రూమ్‌లలోకి అడుగుపెట్టిన తర్వాత అసలు ఏం జరుగుతోంది? వచ్చే అతిథుల వెరిఫికేషన్‌పై పోలీసుల నిఘా ఏమేరకు ఉంది? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల నిర్వహణ, రికార్డింగ్‌పై పర్యవేక్షణ లోపించడం వల్లే నేరస్థులు సులభంగా తప్పించుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  అనుమానాస్పద కదలికలు కనిపించినప్పుడు హోటల్ యాజమాన్యాలు వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ వరుస హత్యల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అప్రమత్తమయ్యారు. బడ్జెట్ హోటళ్లు, లాడ్జిలపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు పాటించని హోటళ్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, నిండు నూరేళ్ల జీవితాన్ని ఆశించి బయటకు వెళ్తున్న యువతులు ఇలా శవాలుగా మారుతుండటం తల్లిదండ్రులను కంటతడి పెట్టిస్తోంది. ఇకనైనా హోటళ్ల నిర్వహణపై కఠినమైన ఆంక్షలు విధించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు మరియు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.     [ Hyderabad crime news, OYO hotel murders, Hyderabad women safety, Budget hotel crimes, Miyapur Madhapur murder cases, CM Revanth reddy. DGP C.V. Anand, CP Sajjanar, Hyderabad police,  TeluguOne news, Telugu News] 
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. బండ్లగూడలోని ఫాతిమా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ తన రాజకీయ ప్రస్థానం, విద్యాభ్యాసం గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన వయస్సును ప్రస్తావిస్తూ.. “నేను ముసలోడిని అయిపోయాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అసలు పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు.. చేయను” అంటూ వ్యాఖ్యానించారు. అదే కార్యక్రమంలో తన విద్యాభ్యాసం గురించి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు. అయితే రాజకీయాల్లో తాను ఎదిగిన తీరును ప్రస్తావిస్తూ.. “నేను 12వ తరగతి చదువుకున్నాను.. కానీ నేను ఏం చెప్పినా దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పే స్థాయికి ఎదిగాను” అని పేర్కొన్నారు. విద్యార్థులతో తన అనుభవాలను పంచుకుంటూ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని వివరించారు. అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఎంఐఎం అధికారిక వివరాల ప్రకారం, ఆయన 1999 నుంచి చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఆ తర్వాత కూడా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.  పాతబస్తీలో ఎంఐఎం రాజకీయాల్లో అక్బరుద్దీన్ ఓవైసీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీపై చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. గతంలోనూ వివిధ ఎన్నికల సందర్భాల్లో ఎంఐఎం తరఫున ఆయన కీలకంగా వ్యవహరించారు. 2026లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అసలు చర్చ అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చే ఎన్నికల్లో నిజంగానే పోటీకి దూరంగా ఉంటారా? అన్నదే. ఒకవేళ ఆయన ఎన్నికల బరిలోకి దిగకపోతే చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం ఎవరిని బరిలోకి దింపుతుంది? కొత్త తరానికి అవకాశం ఇస్తుందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే “వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు.. చేయను” అంటూ స్వయంగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఒకవైపు ఆయన రాజకీయ వారసత్వం, మరోవైపు కొత్త తరానికి అవకాశాలపై చర్చ మొదలవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చాంద్రాయణగుట్ట రాజకీయాలు ఎలా మారతాయన్న ఆసక్తి నెలకొంది.       [ Akbaruddin Owaisi, AIMIM Party, Chandrayangutta Constituency, Asaduddin Owaisi,  old city, CM Revanth reddy, Telangana Assembly,  GHMCElections,Telugu News, Telugu One ]
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ పూల పండుగను కన్నుల పండువగా జరుపుకోనున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా ఎదురుచూసే ఈ చారిత్రక పూల వేడుకల కోసం అధికారిక యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ప్రకృతిని, నీటి వనరులను, మాతృత్వాన్ని గౌరవిస్తూ జరుపుకునే ఈ అద్భుతమైన వేడుకలను మరింత ఘనంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోంది. ఈ తొమ్మిది రోజుల పండుగలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తొలి రోజైన ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మల ప్రయాణం ముగుస్తూ చివరి రోజైన అక్టోబర్ 18న అత్యంత ప్రాముఖ్యమైన 'సద్దుల బతుకమ్మ' వేడుకలతో ఈ పండుగ అంబరాన్ని తాకనుంది. తెలంగాణలోని ప్రతి గ్రామం, పట్టణం మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలు, గిరిజన కళారూపాలతో కళకళలాడనుంది. గ్రామస్థాయి నుంచి నగరాల వరకు మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రాజధాని హైదరాబాద్‌లో ఈ వేడుకలను అత్యంత అట్టహాసంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, ఎల్బీ స్టేడియం వేదికలుగా భారీ కార్యక్రమాలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సంప్రదాయాన్ని భావితరాలకు చాటిచెప్పేలా వివిధ జిల్లాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, శిల్పారామం వేదికగా నృత్య ప్రదర్శనలు జరగనున్నాయి. విదేశాల్లోని తెలంగాణ ప్రవాసుల కోసం కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. పండుగ వేళ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా భద్రతా చర్యలు, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల అలంకరణ వంటి సౌకర్యాలను ముమ్మరం చేశారు. నిమజ్జన ప్రాంతాలైన చెరువులు, కుంటల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజఈతగాళ్లను, రక్షణ దళాలను మోహరించాలని నిర్ణయించారు. సంప్రదాయ పూల సేకరణ మొదలుకొని చివరి రోజు సామూహిక నిమజ్జనం వరకు అన్ని విభాగాల సమన్వయంతో బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికార వర్గాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాయి.     [ bathukamma festival 2026, saddula bathukamma dates, telangana bathukamma arrangements, hyderabad bathukamma events, bathukamma celebrations, telangana tourism festivals ]
ALSO ON TELUGUONE N E W S
Singeetham Srinivasa Rao, one of Telugu cinema’s most celebrated and versatile filmmakers, has passed away. The veteran director breathed his last in Chennai, according to reports. He was 95.  Singeetham was known for constantly experimenting with storytelling and filmmaking across languages and genres. After beginning his career as an assistant to legendary filmmaker K. V. Reddy, he made his directorial debut with Neethi Nijayithi in 1972 and went on to establish a distinctive identity with films such as Mayuri, Pushpaka Vimana, Aditya 369, Bhairava Dweepam, Madam and several others.  His collaboration with Kamal Haasan resulted in some of his most memorable films, including Pushpaka Vimana, Apoorva Sagodharargal and Michael Madana Kama Rajan. Pushpaka Vimana, made without conventional dialogue, remains one of the most unconventional films in Indian cinema, while Aditya 369 continues to be remembered as a landmark Telugu science-fiction film. What made Singeetham's journey even more remarkable was his continued passion for cinema well into his 90s. Earlier this year, he returned to the director's chair with Sing Geetham, produced by Nag Ashwin under Vyjayanthi Movies. The film, released in June 2026, marked his 61st directorial venture and came at the age of 94.  With a career spanning over five decades and multiple languages, Singeetham Srinivasa Rao leaves behind a body of work that stands out for its imagination, technical experimentation and willingness to explore subjects beyond conventional commercial cinema. His passing marks the loss of one of Indian cinema's true experimental filmmakers.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగం అనే మాట వినిపించిన ప్రతిసారీ గుర్తొచ్చే పేర్లలో సింగీతం శ్రీనివాసరావు పేరు ముందుంటుంది. 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో జన్మించిన ఆయన.. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే కళలు, సాహిత్యం, సినిమాలపై ఆసక్తి పెంచుకున్న సింగీతం.. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి దగ్గర అసోసియేట్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘పాతాళ భైరవి’, ‘మాయాబజార్’ వంటి అద్భుతాలను తెరకెక్కించిన కె.వి.రెడ్డి వద్ద పనిచేయడం ఆయన ఆలోచనా విధానంపై ఎంతో ప్రభావం చూపింది. అనంతరం కన్నడలో ‘సంస్కార’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. చివరకు 1970లో ‘నీతి నిజాయితీ’తో దర్శకుడిగా తన తొలి అడుగు వేశారు. దర్శకుడిగా మారిన తర్వాత సింగీతం ఒకే తరహా కథలకు పరిమితం కాలేదు. ‘అమెరికా అమ్మాయి’, ‘సొమ్మొకడిది సోకొకడిది’, ‘పంతులమ్మ’, ‘తరం మారింది’, ‘మయూరి’ వంటి చిత్రాలతో తనలోని విభిన్న కోణాలను చూపించారు. ముఖ్యంగా 1987లో వచ్చిన ‘పుష్పక విమానం’ ఆయన కెరీర్‌లోనే కాదు.. భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దాదాపు డైలాగులు లేకుండా కేవలం విజువల్స్, నటన, సంగీతం, సౌండ్‌తో కథను చెప్పిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కమల్ హాసన్, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇక సింగీతం కెరీర్‌లో మరో మైలురాయి ‘ఆదిత్య 369’. 1991లో వచ్చిన ఈ సినిమా టైమ్ ట్రావెల్, చరిత్ర, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి తెలుగు ప్రేక్షకులకు అప్పట్లోనే ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ఆ తర్వాత ‘భైరవ ద్వీపం’తో జానపద ఫాంటసీని మరో స్థాయిలో చూపించారు. ‘మయూరి’ వంటి బయోపిక్ తరహా కథను తెరకెక్కించడంతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేశారు. ‘దిక్కత్ర పార్వతి’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకోగా.. ‘పుష్పక విమానం’కు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. ‘మయూరి’కి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడి అవార్డు, ‘పుష్పక విమానం’కు కన్నడ విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు సహా పలు పురస్కారాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితానికి వస్తే.. సింగీతం శ్రీనివాసరావు భార్య లక్ష్మీ కల్యాణి. అయితే ఆమె ఇప్పటికే కన్నుమూశారు. సింగీతం వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా ప్రచారంలోకి తీసుకురాకుండా ఎక్కువగా సినిమాలకే తన సమయాన్ని కేటాయించారు. వయసు 90 దాటిన తర్వాత కూడా ఆయనలో సినిమా మీద ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. 2026లో 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. దశాబ్దం విరామం తర్వాత మళ్లీ సినిమా చేయడం సినిమా పట్ల ఆయనకు ఉన్న తపనకు నిదర్శనంగా నిలిచింది. దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, కామెడీ, బయోపిక్, ప్రయోగాత్మక చిత్రాలు.. ఇలా ఎన్నో జానర్లను టచ్ చేసిన సింగీతం.. తెలుగు సినిమా ప్రయోగాలకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన దర్శకుడిగా నిలిచిపోయారు.     [Singeetam Srinivasa Rao Biography, Singeetam Srinivasa Rao Life Story, Singeetam Srinivasa Rao Movies, Singeetam Srinivasa Rao Career, Singeetam Srinivasa Rao Family, Singeetam Srinivasa Rao Awards, Pushpaka Vimanam Director, Aditya 369 Director, Bairava Dweepam Director, Legendary Telugu Directors]
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ.. తెలుగు సినిమాకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన ఈ లెజెండరీ దర్శకుడు 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 3న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు మాత్రమే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.  సింగీతం అంటేనే ప్రయోగాలకు మరో పేరు.. సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే చిత్రాల్లో ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’, ‘సొమ్మొకడిది సోకొకడిది’ వంటి సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి డైలాగులు లేకుండా తెరకెక్కించిన ‘పుష్పక విమానం’, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ‘ఆదిత్య 369’ ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడతాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. కథను కొత్తగా చెప్పడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. ఇక సింగీతం శ్రీనివాసరావు కెరీర్‌లో ఎన్నో అవార్డులు, గౌరవాలు కూడా ఉన్నాయి. ‘పుష్పక విమానం’ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా.. ‘మయూరి’కి పలు నంది అవార్డులు దక్కాయి. ‘భైరవ ద్వీపం’కు ఆయనకు నంది ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. వయసు 94 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా సినిమా మీద తన ఆసక్తిని మాత్రం ఆయన వదులుకోలేదు. 2026లోనే దాదాపు పదేళ్ల విరామం తర్వాత మరో సినిమాకు దర్శకత్వం వహించేందుకు మెగాఫోన్ పట్టారు. ఈ వయసులోనూ సినిమా తీయడానికి సిద్ధపడటం అప్పట్లో సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. సినిమాను కేవలం వినోదంగా కాకుండా ఒక ప్రయోగశాలగా భావించి.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు విడుదలైన సమయంలోనే కాకుండా.. సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా క్లాసిక్స్‌గా నిలిచాయి. అలాంటి అరుదైన దర్శకుడు ఇక లేరనే వార్తతో సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన మృతి తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయానికి ముగింపు పలికినట్టుగా భావిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ ఈ వర్డ్ ని ఇష్టపడని వారంటూ ఈ భూమ్మీద ఉండరు. జూలో జంతువులు సైతం ప్లీజ్.. ఎక్కడ.. ఫ్రీ, మీకు పుణ్యం ఉంటుంది చెప్తారా అని కాళ్లవేళా పడే పరిస్థితి.  ఫ్రీ అనే వర్డ్ అంత సమ్మోహతని దాచుకుంది. మరి ఇప్పుడు ఒక సినిమా నన్ను చూసి మేఘాలయ ట్రిప్ ఫ్రీ గా వెళ్లండని అంటుంది. అదేంటో చూద్దాం    అగ్ర దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రీసెంట్ గా  కొత్త తరం క్రైమ్ కామెడీ చిత్రం 'బా బా బ్లాక్ షీప్' ట్రైలర్ ఘనంగా విడుదలయ్యింది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొణెపూడి నిర్మాణంలో గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌తోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నే  మేకర్స్ ఏకంగా ఉచిత మేఘాలయ ట్రిప్ ఆఫర్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆఫర్ ప్రకారం, 'బా బా బ్లాక్ షీప్' సినిమాకు సంబంధించి నిర్వహించే ఒక కాంటెస్ట్‌లో పాల్గొని గెలుపొందిన మొత్తం 10 మంది అదృష్టవంతులకు ఉచితంగా మేఘాలయ పర్యటనకు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నిర్మాత వేణు దొణెపూడి అధికారికంగా వెల్లడించారు. మేఘాలయలోని అద్భుతమైన లొకేషన్లలో పూర్తి స్థాయిలో చిత్రీకరించిన ఈ సినిమా చూడటంతో పాటు, ప్రేక్షకులకు స్వయంగా ఆ అందాలను వీక్షించే అవకాశం దక్కడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.     ఇది కూడా చదవండి: ఫ్యాన్ వార్స్: ఎవరి కోసం..స్నేహం వర్సెస్ సోషల్ మీడియా వేధింపులు మరి మేఘాలయ అందాలు చూడాలంటే  అక్టోబర్ 9న మీ అభిమాన థియేటర్ లో బా బా బ్లాక్ షీప్ చూసేయండి.   [Baa Baa Black Sheep Movie Offer, Baa Baa Black Sheep Trailer, Nag Ashwin Release Baa Baa Black Sheep, Meghalaya Trip Offer, Chitralayam Studios, Baa Baa Black Sheep Movie, Upendra Limaye, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]        
అభిమానులు.. వీరాభిమానులు..కామన్ ఆడియెన్స్ కి ఆ రెండు కేటగిరిలు థియేటర్ లో మస్తు మాజాని ఇస్తారు. హీరోకి మాత్రం దేవదూతలు అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కాదనే సాహసం ఎవరు చెయ్యలేరు.  కానీ ఒక విషయంలో ఆ రెండు జోనర్స్ ని నింపుకున్న వాళ్లపై  డౌట్ కొడుతూ ఉంది.  తెలుగు సినీ పరిశ్రమలో హీరోల నడుమ ఉండే అనుబంధానికి, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అభిమానుల వివాదాలకి నడుమ తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ హీరోలందరూ వ్యక్తిగతంగా ఎంతో ఆప్యాయంగా, క్లోజ్ ఫ్రెండ్స్‌గా మెలుగుతుంటారు. పండగలు, వేడుకలు, పార్టీలు లేదా సినిమా ప్రమోషన్లలో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పరస్పర గౌరవంతో నవ్వుతూ కరచాలనం చేసుకోవడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ, ఇంటర్నెట్ వేదికలపై మాత్రం వారి అభిమానుల మధ్య జరుగుతున్న సైబర్ యుద్దాలు రోజురోజుకూ సరిహద్దులు దాటుతున్నాయి. రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ అసోసియేషన్ల నడుమ పెరిగిపోతున్న ఈ వికృత సంస్కృతిపై పలువురు సినీ విశ్లేషకులు, స్వయంగా అగ్ర కథానాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ సైబర్ పోరులో అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే... ఎడిటింగ్ యాప్‌లు, ఏఐ టెక్నాలజీ (AI tools) ద్వారా ప్రత్యర్థి హీరోల ముఖాలను మార్ఫింగ్ చేయడం. ఒక హీరో కుటుంబాన్ని లేదా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వికృతమైన మీమ్స్ తయారు చేయడం, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు రుద్దడం రోజువారీ పరిపాటిగా మారింది. తమ అభిమాన నటుడి సినిమా కలెక్షన్లను పెంచి చూపిస్తూ, వేరే హీరో సినిమా రికార్డులను తక్కువ చేసి చూపే క్రమంలో ఈ నెగెటివిటీ వందల శాతం ముదిరిపోతోంది. ఒకప్పుడు కేవలం థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు, పోస్టర్ల గొడవలతో ముగిసే ఫ్యాన్ వార్స్, నేడు సోషల్ మీడియా వేదికగా బూతులు, మార్ఫింగ్ మార్ఫింగ్ ఫోటోలతో హద్దులు మీరుతుండటం టాలీవుడ్ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. ఇది కూడా చదవండి: ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ కల్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్: ఏ సినిమాకి షాక్!   ఈ పరిణామాలపై టాలీవుడ్ ప్రముఖులు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆన్‌‌లైన్ ట్రోలింగ్, ఆక్రోశం వల్ల ఏ ఒక్కరికీ ప్రయోజనం లేదని, అభిమానం అనేది సేవా కార్యక్రమాలు మరియు క్రమశిక్షణలో కనిపించాలే తప్ప పక్కవారిపై విషం చిమ్మడంలో కాదని హీరోలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే మనం మన హీరోని అభిమానించనట్టే అవతలి వాళ్ళు కూడా తమ హీరోని అభిమానిస్తుంటారు. అది సినీసృష్టిలో దాగి ఉన్న రహస్యం. అందరు ఉంది సినిమాని బతికించడానికి, ఎదిగేలా చెయ్యడానికి.    [Tollywood Fan Wars Social Media Morphing, Tollywood Fan Wars, Social Media Morphing Telugu Cinema, Toxic Fandom Tollywood, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]      
ఈ సారి మాత్రం పక్కా బాక్స్ ఆఫీస్ బద్దలే.. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదబ్బా అంటూ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'కల్ట్' ని ముస్తాబు చేస్తున్నాడు. విశ్వక్ సేన్      స్వయంగా దర్శకత్వం వహిస్తూ, కథ మరియు స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో అభిమానులు, సినీ ప్రియులు, సినీ సర్కిల్స్ లో  మోస్ట్ అవేటెడ్ ప్రొజెక్ట్ గా మారింది.  భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఇప్పటివరకు రాని ఒక సరికొత్త తరహా 'స్లాషర్ థ్రిల్లర్' (Slasher Thriller) జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగంగా జరుపుకుంటోంది. తారక్ సినిమాస్ మరియు వన్మయే క్రియేషన్స్ బ్యానర్లపై సందీప్ కాకరాల, కరాటే రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వైవిధ్యమైన చిత్రాన్ని రాబోయే అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ప్రకటన నాటి నుంచే ఫిలిం నగర్ వర్గాల్లోనూ, విశ్వక్ అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రత్యేక రిలీజ్ డేట్ ప్రోమో మరియు 45 నిమిషాల గ్లింప్స్ మేకర్స్ సృష్టించిన డార్క్ వరల్డ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించాయి. రక్తంతో తడిసిన గొడ్డలి చేతపట్టుకుని తీవ్రమైన ఆవేశంతో ఉన్న విశ్వక్ సేన్ రౌద్ర రూపం ప్రేక్షకుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తన కెరీర్‌లో మొదటిసారిగా విశ్వక్ సేన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో  కనిపిస్తుండటం ఈ చిత్రానికి అతిపెద్ద విశేషం.  గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి మరో పవర్ ఫుల్ ప్లస్ పాయింట్ ఏమిటంటే, క్లోజ్ ఫ్రెండ్ మరియు ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి సంభాషణలు అందించగా, కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతాన్ని సమకూర్చారు. కెమెరామెన్ అరవింద్ విశ్వనాథన్ తన మార్క్ ఛాయాగ్రహణంతో విజువల్స్ అందించగా, ఎడిటర్ రవి తేజా గిరిజాలా, ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ ములే ఎంతో శ్రమించి అద్భుతమైన డార్క్ సెట్స్ నిర్మించారు. ఇది కూడా చదవండి: చరణ్, సుకుమార్ RC17 షాకింగ్ డెడ్‌‌లైన్!      దేశంలోనే మొదటి గ్లోబల్ స్లాషర్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ చిత్రాన్ని 'ఆర్-రేటెడ్' (R-Rated) కంటెంట్‌తో విడుదల చేస్తున్నారు. కేవలం తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్, జాపనీస్, స్పానిష్‌లతో సహా మొత్తం 5 విభిన్న భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. కల్ట్ మూవీ ఇండియన్ సినిమాలో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తుందని, యాక్షన్ ప్రియులకు అక్టోబర్ 30న థియేటర్లలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అల్టిమేట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుందని చిత్ర బృందం ధీమాలో ఉంది.   [Vishwak Sen Cult release date, Cult Telugu movie shooting update, Vishwak Sen R rated slasher thriller, Cult movie October 30 release, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]        
Baa Baa Black Sheep is a new-age crime comedy being made with a different concept to entertain audiences across all sections. Presented by Donepudi Chakrapani and produced by Venu Donepudi under the Chitralayam Studios banner, the film is directed by Guni Manchikanti. The movie is set for a grand theatrical release on October 9. Tinnu Anand, Upendra Limaye, George Maryan, Akshay Lagusani, Vishnu oi, Karthikeya, Vismaya Sri, Malvi Malhotra, Kashyap, Shubhalekha Sudhakar, Raja Ravindra and others play key roles. The trailer launch event of the film was held grandly recently. On this occasion... Actor Upendra Limaye said: “First of all, I would like to sincerely thank my close friend Sandeep Reddy Vanga. He was the one who introduced me to the Telugu film industry with my own voice. What he told me at the time literally came true. Later, I got the opportunity to act in Hit Machine Anil Ravipudi’s ‘Sankranthiki Vasthunam’. Wherever I go, I can never forget the love and affection showered on me by Telugu audiences. When Vaishakh and Guni narrated the story of ‘Baa Baa Black Sheep’ to me, I found it very different and interesting. I always give more importance to the story than my character. I accept a film only when the content is good. This is my first full-fledged role in Telugu, which is why this film is very close to my heart. It is a great pleasure to be part of a project made under a prestigious banner like Chitralayam Studios. Working with young Telugu actors like Vishnu, Samriddhi, Malavika and Akshay was a wonderful experience. Though this is Guni’s debut as a director, the way he wrote the story and brought it to the screen is remarkable. Generally, food, clothing and shelter are considered basic necessities of life. But in South India, especially for Telugu people, cinema is also a basic necessity. I hope all you passionate movie lovers will watch ‘Baa Baa Black Sheep’ in theatres and thoroughly enjoy it.” Actor Vishnu Oy said: “I would like to thank everyone who supported the trailer launch of our ‘Baa Baa Black Sheep’. I thoroughly enjoyed the story when I first heard it. The film features several talented actors, including the Nepalese actress who plays my pair. It was a great experience working with National Award winner Upendra Limaye garu. Coming from a theatre background, his performance is like a masterclass. My longtime friend Akshay Lagusani has also done an excellent job in this film. I strongly believe he will reach greater heights in the coming days. While shooting in Meghalaya, the people and the local atmosphere extended tremendous support to us. Cinematographer Ajay has done excellent work in terms of visuals. This first collaboration between my good friend and director Guni and producer Venu garu is arriving in theatres on October 9. I sincerely wish the film great success and thank everyone from the bottom of my heart.” Actress Malvi Malhotra said: “‘Baa Baa Black Sheep’ is a fun and slightly quirky title that instantly creates curiosity. When director Guni narrated the story to me, I was very excited. My character has not been revealed much in the trailer, but when you watch the film in theatres, you will get a good surprise. My character’s name is Rama, and she has some grey shades. This is not a regular hero-heroine story; every character has great importance in the film. Everyone has performed their roles very well. I would especially like to thank producer Venu garu for believing in director Guni’s vision and taking this project forward. We shot the film in some of the most breathtaking locations in Meghalaya. Perhaps this could be the first Telugu film to have been shot entirely there. I thank all the technicians and actors who worked with great dedication for this film. I request everyone to watch and support ‘Baa Baa Black Sheep’ in theatres with your family and friends on October 9.” Actress Samriddhi Aryaal said: “More than the film itself, the experience I had while working with this team is very special to me. Everyone, including the actors, director and producers, treated me with great affection. They never made me feel like I was new to the team. This is my first Telugu film. Since I did not know the language, delivering Telugu dialogues was difficult initially, and I worked very hard. I memorised the dialogues and completed them successfully. The result came out much better than I expected. Overall, it has been an amazing experience, and I would love to work with this team again in the future.” Actor Akshay Lagusani said: “I am currently working on this film as well as two other films, and all three are scheduled to release in the coming four months. I hope I continue to receive the same support and blessings from all of you. I would also like to specially thank Nag Ashwin garu for launching our trailer and supporting us. Coming to the film, we shot it in Meghalaya with great passion and hard work. Even though the Meghalaya government and producer Venu garu extended tremendous support, we faced a new challenge almost every day. A special thanks to Venu sir, who worked tirelessly and ran around along with all of us. My thanks to director Guni, the direction department and all the actors. I request everyone to watch ‘Baa Baa Black Sheep’ in theatres on October 9 and support us.” Producer Venu Donepudi said: “I would like to thank every technician and actor who worked extremely hard for this film. It is a matter of great pride and honour for me to have travelled with National Award winner Upendra Limaye garu. I would also like to thank George Maryan garu, who came from Chennai, as well as the other artists who could not make it today due to their other commitments. Special thanks to our heroines Malvi Malhotra and Samriddhi Aryaal for making it to the event even though they were invited at the last minute. Along with them, the entire movie team worked with tremendous dedication. Coming to the technical team, our DOP Ajay worked with great passion to deliver stunning visuals. The background score and music by Stephen and Arcado Anand have brought life to the film. Our movie is arriving in theatres on October 9. Although there are other big films releasing around the same time, we have seen several instances in the past where small films with strong content have created wonders even amid such competition. We strongly believe our film will also achieve such success.   I would like to extend my heartfelt thanks to the Chief Minister of Meghalaya, Conrad K. Sangma garu, for his support to our film. When we went there for the shoot, the government and local administration extended tremendous support to us. Instead of travelling abroad, we have a responsibility to showcase breathtaking locations like Meghalaya within our own country and promote tourism there. As part of this initiative, we are also organising a special contest, which we will announce tomorrow. The winners will get an opportunity to travel to Meghalaya on behalf of our movie team without having to spend their own money. Finally, my heartfelt thanks to director Nag Ashwin garu for launching our trailer and extending his support to us. I request everyone to watch the film in theatres with your families and bless us.” Director Guni Manchikanti said: “First of all, a very big thanks to producer Venu garu. Given the current competition, it is very difficult for a debut director to get an opportunity to make a film. But Venu garu approved this film after listening to just one narration from me.   Within a month, he assembled the entire team, and in the next three months, we completed the pre-production and location recce and went for the shoot. We shot the film in Meghalaya for around 28 days.   I would especially like to thank my writing department and writer Ajay. He stood like a strong pillar behind the fun you see in the trailer and teaser, and travelled with me right from the screenplay stage to the shoot. I would also like to thank editor Vijay, who worked tirelessly day and night like an assistant director. My thanks to production designer Sahi Suresh garu, who recently delivered a hit with ‘Irumudi’, and costume designer Priyanka, who studied every character carefully and designed the costumes and jewellery accordingly. My heartfelt thanks to all the actors in this film, including Upendra Limaye garu. This is not a routine hero-heroine-villain story. Every character in the film is extremely important. The fact that we could complete the film in such a short span in challenging locations like Meghalaya was possible only because of the cooperation of all the actors. The film is arriving in theatres on October 9. It is a clean film that can be enjoyed by the entire family. I sincerely request everyone to watch ‘Baa Baa Black Sheep’ in theatres and support us.”   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ ల మూవీ దసరా రోజు స్టార్ట్ కాబోతుందనే న్యూస్ అయితే సినీ సర్కిల్స్ లో ఒక రేంజ్ లోనే చక్కరకొడుతుంది.సినీ క్లైమెట్ కూడా అందుకు తగ్గట్టే ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని విషయాల కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజా న్యూస్ ఒకటి వైరల్ హోదాలో జోష్ ని తీసుకొచ్చింది. సాధారణంగా సుకుమార్ మూవీ అనగానే ఎంతో నిడివి, సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్ గుర్తుకొస్తాయి. ఆయన గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూస్తే.. 2017 ఏప్రిల్‌లో ప్రారంభమైన 'రంగస్థలం' షూటింగ్ దాదాపు ఏడాదికి పైగా సమయం తీసుకుంది. ఇక 'పుష్ప 1' ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందడంతో కోవిడ్ మరియు ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. ఆ తర్వాత వచ్చిన 'పుష్ప 2' షూటింగ్ అయితే 2022లో ప్రారంభమై, సుదీర్ఘంగా సాగి 2024 నవంబర్‌ వరకు దాదాపు 2 సంవత్సరాల పైనే సమయాన్ని తీసుకుంది. స్క్రిప్ట్ విషయంలో, అలాగే ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దడంలో సుకుమార్ ఎంత సమయమైనా కేటాయిస్తారు. కానీ 'RC17' విషయంలో మాత్రం ఒక అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్‌లో ఎంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక కఠినమైన డెడ్‌‌లైన్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను రాబోయే డిసెంబర్  నాటికి పట్టాలెక్కించి, కేవలం 12 నెలల వ్యవధిలోనే.. అంటే సరిగ్గా 2027 డిసెంబర్ నాటికి షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఇది కూడా చదవండి: రెండు వారాల గ్యాప్‌లో: రెండు పాన్ ఇండియా సినిమాలు.. ప్లస్సా? నిర్మాతలకి రిస్కా!     ఇలాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కేవలం 12 నెలల పక్కా టైమ్‌ఫ్రేమ్‌లో పూర్తి చేయాలని భావించడం సుకుమార్ స్టైల్‌కి పూర్తి భిన్నమైనదని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రతి పాత్ర, విజువల్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టే ఆయన, ఈ 12 నెలల డెడ్‌లైన్‌‌ను అందుకోగలరా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చగా మారింది.ఏది ఏమైనా సబ్జెక్ట్ గా పక్కాగా ఉండి మైండ్ లో  టార్గెట్ ఫిక్స్ అయితే పెద్ద కష్టమేమి కాదు.    [Rc17 Update, Rc17 Shooting Deadline Target, Ram Charan, Sukumar, RC17 shooting deadline, RC17 movie update]    
  హీరోయిన్స్ కి గౌరవం తెచ్చిన నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. హీరోయిన్ కట్ అవుట్  చూసి కూడా థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తారని నిరూపించిన ఈ నాచురల్ సుందరాంగి రాబోయే కొన్ని నెలల వ్యవధిలోనే వరుసగా పెద్ద ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం సినీ ప్రియులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.   రణబీర్ కపూర్, నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ'లో సీతాదేవిగా నవంబర్ 6 న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు తమిళంలో ధనుష్‌తో చేసిన భారీ యాక్షన్ డ్రామా 'ఓం' (OM Chapter-1 Udhiram: The Blood Wood) సరికొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. నవంబర్ 20, 2026న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. అంటే కేవలం 2 వారాల (14 రోజుల) వ్యవధిలోనే సాయిపల్లవి నటించిన రెండు అతిపెద్ద పాన్-ఇండియా చిత్రాలు 'రామాయణ', 'ఓం' బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. ఇలాంటి అరుదైన అవకాశం ఏ హీరోయిన్ కి  త్వరగా లభించదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 100 శాతానికి పైగా డెడికేషన్‌తో ప్రాజెక్టులను ఎంచుకునే సాయిపల్లవి, తన కరియర్‌లో ఈ 2026-2027 కాలంలో వరుసగా 4 ప్రధాన చిత్రాలతో దాదాపు 1500 కోట్ల వ్యాపార మార్కెట్‌పై ప్రభావం చూపబోతోంది.   ఇది కూడా చదవండి: 'చుట్టమల్లే’ఏఐ మార్ఫింగ్ వీడియో చేసింది వీళ్ళే!      గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం తన అభినయం, డాన్స్ నైపుణ్యాలతోనే కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ, బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో గ్లోబల్ లెవెల్లో ఎలాంటి మేజిక్ క్రియేట్ చేస్తుందో అని సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.   [Sai Pallavi Back To Back Movies Release, Sai Pallavi upcoming movies, Ramayana movie release date, Sai Pallavi Dhanush Om,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]    
  ఎన్టీఆర్ యాక్టింగ్ కి, డాన్స్ లకి ఉన్న కెపాసిటీ తెలిసిందే. సాంగ్స్ కూడా దాదాపు అన్ని హిట్.  ఆ కోవలోనే ప్రీవియస్ మూవీ 'దేవర తో పాటు అందులోని  'చుట్టమల్లే' పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి ప్రేక్షకులను అలరించిన ఈ చార్ట్‌బస్టర్ సాంగ్ ఆధారంగా కొందరు ఆకతాయిలు అత్యంత అసభ్యకరమైన రీతిలో ఏఐ మార్ఫింగ్ వీడియో సృష్టించారు. నెట్టింట తీవ్రంగా సర్క్యులేట్ అవుతున్న ఈ వికృత కంటెంట్‌పై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నిందితులకు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా స్పందించిన ఎన్టీఆర్, ఈ చర్యను అత్యంత రోత పుట్టించే, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. "స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే పవిత్రమైన భారతావని మనది. 'మాతృదేవోభవ' అనేది కేవలం మాట మాత్రమే కాదు, అది తరతరాలుగా మన రక్తంలో ప్రవహిస్తున్న సంస్కృతిలో ఒక భాగం. అలాంటి సాంప్రదాయం ఉన్న గడ్డపై, సాంకేతికతను వాడుకొని ఒక మహిళ ఆత్మగౌరవాన్ని బజారుకీడ్చేలా ఇంత నీచానికి దిగజారడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు. ఈ మార్ఫింగ్ వీడియోని తయారుచేసిన కీచకులని, దానిని రకరకాల ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ చేస్తూ వైరల్ చేస్తున్న ప్రతి ఒక్కరినీ చట్టపరంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే  లేదు. ప్రతీ ఒక్కరిపై కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: హనుమాన్ అంశ' తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ డేట్ స్పెషల్ ఇదే!     దీంతో ఇప్పుడు ఆ అసభ్యకరమైన ఏఐ వీడియోని ఎవరు రెడీ చేసారనే చర్చ అభిమానులతో పాటు సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏది ఏమైనా అణువణువున   పైత్యం ఎక్కువ నిండిన వాళ్లే చేసుంటారనేది మాత్రం నిజం.     [Ntr Warning Ai Morphed Chuttamalle Video,Jr NTR, Chuttamalle Morphed Video, AI Deepfake Controversy, Jr NTR Warning Legal Action,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]      
భార్యాభర్తలు ఒకరికి ఒకరు టైం కేటాయించుకోవడం ఎందుకు ముఖ్యం.! ​భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవడం దాంపత్య జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఉద్యోగం, వ్యాపారం, పిల్లల చదువులు, ఇంటి పనులు, ఆర్థిక బాధ్యతలతో రోజంతా గడిచిపోతుంటుంది. ఈ హడావుడిలో దంపతులు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మనసులో విషయాలను పంచుకోవడానికి సమయం దొరకడం కష్టం. అయితే, కేవలం ఒకే ఇంట్లో  జీవించడం మాత్రమే కాకుండా, ఒకరికొకరు క్వాలిటీ టైమ్ కేటాయించుకోవడం చాలా అవసరం . భార్యాభర్తలు ఒకరికొకరు టైమ్ కేటాయించుకోవడం వల్ల వైవాహిక బంధంలో జరిగే అద్భుతాలు తెలుసుకుంటే..  కష్టాలలో నిలబెడుతుంది. ఎంతటి కష్టసమయంలోనైనా దంపతులను కలిపి ఉంచేది వారి మధ్య ఉన్న అనుబంధమే. రోజూ కొంత సమయం ఒకరి కోసం ఒకరు కేటాయించుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిపడుతుంది. ఒకరి ఆలోచనలు, ఆశయాలు, భయాలు మరొకరు అర్థం చేసుకోవడానికి ఈ సమయం సహాయపడుతుంది. దీనివల్ల భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి. గొడవలు తగ్గుతాయి.. చాలా కాపురాల్లో వచ్చే చిన్న చిన్న గొడవలకు లేదా విభేదాలకు ప్రధాన కారణం సరిగ్గా మాట్లాడుకోకపోవడమే. రోజూ కాసేపు ఎలాంటి ఫోన్లు, టీవీలు లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల మనసులోని భ్రమలు, అపోహలు తొలగిపోతాయి. భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినడం వల్ల మన సమస్యలను వారు అర్థం చేసుకుంటున్నారనే నమ్మకం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.. ఆఫీసు పని, కుటుంబ బాధ్యతల వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భాగస్వామితో గడిపే సమయం అద్భుతంగా పనిచేస్తుంది. రోజంతా పడిన కష్టాన్ని మరిచిపోయి, భాగస్వామితో కాసేపు నవ్వుతూ మాట్లాడినా లేదా చిన్న నడకకు వెళ్లినా మనసుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. భాగస్వామి ఇచ్చే ధైర్యం ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. జీవితం ఎప్పుడూ కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది.. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచాక చాలామందిలో జీవితం రొటీన్‌గా మారిపోయిందనే భావన వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా అవసరం. కలిసి కాఫీ తాగడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం లేదా పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వంటివి వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలకు మార్గదర్శనం.. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులను చూసే విషయాలు నేర్చుకుంటారు. ఇంట్లో భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ, ప్రేమగా సమయం గడుపుతుంటే పిల్లలు కూడా ప్రేమ, అనురాగాలు ఉన్న వాతావరణంలో పెరుగుతారు. ఇది వారిలో మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో వారు కూడా మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మార్పులను గ్రహించవచ్చు.. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, అలవాట్లు మారుతుంటాయి. పెళ్లి సమయానికి ఉన్న భాగస్వామి, కొన్నేళ్ల తర్వాత శారీరకంగా, మానసికంగా మారవచ్చు. తరచూ మాట్లాడుకోవడం వల్ల భాగస్వామిలో వస్తున్న మార్పులను, వారి కొత్త అవసరాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల జీవితంలో ఏ దశలోనైనా ఒకరికొకరు అండగా నిలబడటం తేలికవుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దాంపత్య జీవితానికి పునాది వంటిది. రోజూ కనీసం ఒక అర గంట పాటు ఫోన్లకు దూరంగా ఉండి,  మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే, ఎలాంటి సమస్యలనైనా సులభంగా దాటవచ్చు. ఎంత బిజీగా ఉన్నా భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మాత్రమే వైవాహిక బంధం సుదీర్ఘకాలం సంతోషంగా, ఆరోగ్యకరంగా సాగుతుంది.                      *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
ఉలవచారు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కానీ ఉలవలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు.. మన సంప్రదాయ ఆహార విధానంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నల్ల ఉలవలను ఆహారంగా ఎలా ఉపయోగించాలి? వాటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో 35 సంవత్సరాల ఆయుర్వేద అనుభవం ఉన్న Dr. Chittibhotla Madhusudhana Sharma గారు ఉలవల గురించి సులభమైన తెలుగులో వివరించారు. నల్ల, తెల్ల, ఎర్ర ఉలవల్లో ఉన్న తేడాలు, నల్ల ఉలవలను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు, ఉలవల్లో ఉండే పోషకాలు, ఫైబర్ జీర్ణక్రియకు ఎలా ఉపయోగపడుతుంది వంటి విషయాలను ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే ఉలవలు బరువు నియంత్రణకు ఉపయోగపడతాయా? రోజువారీ ఆహారంలో ఉలవలను ఎలా చేర్చుకోవాలి? ఉలవచారు లేదా ఇతర రూపాల్లో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవచ్చు? ఉలవలు తింటే కిడ్నీలో రాళ్లు కరుగుతాయనే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. మన వంటింట్లో సులభంగా లభించే ఉలవలను సరైన విధంగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వాటి పోషక విలువలను ఎలా పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. గమనిక: కిడ్నీలో రాళ్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఉలవలను ఏదైనా వ్యాధికి చికిత్సగా భావించి వైద్య చికిత్సను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రతిరోజూ ఉదయం ఉడకబెట్టిన గుడ్డు తినడం చాలామందికి అలవాటు. శారీరక బలానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోడిగుడ్డును అత్యంత చౌకైన , సమర్థవంతమైన ఆహారంగా నిపుణులు చెబుతుంటారు. అయితే  చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొనను మాత్రమే తిని, పచ్చసొనను తీసి పక్కన పడేస్తుంటారు. పచ్చసొన తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లేదా చెడు కొవ్వు పెరిగిపోతుందని, గుండె ఆరోగ్యానికి మంచిది కాదని, బరువు పెరుగుతారని రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు పచ్చసొన ఇస్తే అరగదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ కేవలం శాస్త్రీయ ఆధారం లేని అపోహలు మాత్రమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  నిజానికి గుడ్డులోని అసలైన పోషక నిధి పచ్చసొనలోనే దాగి ఉంటుంది. పచ్చసొనలో ఉన్న ముఖ్యమైన పోషకాలు , వాటి ప్రాముఖ్యత గుడ్డులోని సంపూర్ణ పోషక విలువలు మన శరీరానికి అందాలంటే పచ్చసొనను తీసివేయకుండా పూర్తిగా తినడం ఎంతో అవసరం. పచ్చసొనలో లభించే ప్రధానమైన పోషకాలు మన శరీరానికి ఏ విధంగా తోడ్పడతాయో వివరంగా తెలుసుకుంటే.. మెదడు అభివృద్ధికి.. గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే పోషక పదార్థం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది మెదడు సరైన రీతిలో పనిచేయడానికి , జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. విశేషమేమిటంటే, ఎదుగుతున్న చిన్న పిల్లలలో మెదడు వికాసానికి , నరాల వ్యవస్థ నిర్మాణానికి కోలిన్ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. నరాల బలానికి, రక్తకణాల తయారీకి విటమిన్ బి12.. పచ్చసొనలో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొత్త రక్తకణాలు తయారవ్వడానికి, శరీరం చురుగ్గా ఉండటానికి , నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. సాధారణంగా మనం తినే శాఖాహారంలో ఈ విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహార లోపాలను భర్తీ చేసుకోవడానికి గుడ్డు పచ్చసొన ఒక గొప్ప ఆహార మూలంగా పనిచేస్తుంది. కంటి చూపుకు, రోగనిరోధక శక్తికి విటమిన్ ఏ..  ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సాయపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, పలురకాల ఇన్ఫెక్షన్లు , వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరుకు సెలీనియం..  గుడ్డు పచ్చసొనలో సెలీనియం అనే ముఖ్యమైన ఖనిజ లవణం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి , శరీరంలో జీవక్రియల వేగాన్ని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్డును పూర్తిగా ఎందుకు తినాలి? గుడ్డు తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది, కానీ పచ్చసొనలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ , మేలైన పోషకాలన్నీ నిండి ఉంటాయి. కేవలం తెల్లసొన మాత్రమే తింటే గుడ్డు నుంచి వచ్చే పూర్తి పోషకాహార ప్రయోజనాలను మనం కోల్పోయినట్లే అవుతుంది. అందుకే అనవసరమైన భయాలు, అపోహలు పక్కన పెట్టి రోజువారీ ఆహారంలో గుడ్డును పచ్చసొనతో సహా పూర్తిగా తీసుకోవడం వల్ల  ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతుంది.                      *రూపశ్రీ.  
చేతులు వణకడం, కాళ్లలో బలహీనంగా అనిపించడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను చాలామంది సాధారణ నీరసంగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి నరాల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చు. నరాల బలహీనతకు కారణాలు ఏమిటి? నరాలపై ప్రభావం చూపించే సమస్యలు ఏంటి? చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి, వణుకు, బలహీనత ఎందుకు వస్తాయి? నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం, జీవనశైలి పాటించాలి? ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ నరాల బలహీనతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే నరాల ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ పద్ధతిలో అశ్వగంధ, వాము, దాల్చిన చెక్క, లవంగాలతో తయారు చేసుకునే చిట్కా గురించి కూడా తెలుసుకోవచ్చు. నరాల బలహీనత, నరాల నష్టం, తాత్కాలిక నీరసం మధ్య తేడా ఏమిటి? నరాలు దెబ్బతిన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నరాల ఆరోగ్యానికి మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎందుకు అవసరం? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నరాలకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. నరాల ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)