LATEST NEWS
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ కన్నుమూసిన సైనికుడి పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్న అంబులెన్స్‌ను మృత్యువు వెంటాడింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆర్మీలో సుబేదార్ మేజర్‌గా సేవలు అందించిన సత్యవాన్ సింగ్ దేశ రక్షణలో వీరమరణం పొందారు. లక్నో నుంచి ఆయన భౌతికకాయాన్ని ఘాజీపూర్‌లోని స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఈ పెనుప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ దుర్ఘటన జరిగింది. సుల్తాన్‌పూర్ జిల్లా హలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 79.6 కిలోమీటర్ మైలురాయి వద్ద వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ వేగవంతమైన ట్రక్ తీవ్రంగా ఢీకొట్టింది. ఈ అనూహ్య ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘోర సంఘటనలో అమర జవాన్ కుమారుడు గౌరవ్ సింగ్, అంబులెన్స్ డ్రైవర్ జస్పాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జవాన్ సోదరుడు రాజన్ చౌదరి, మేనల్లుడు రామ్ సముజ్ సింగ్‌లను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ వారు కూడా ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాన్ మృతదేహం రాక కోసం కన్నీటితో ఎదురుచూస్తున్న కుటుంబంలో ఈ పెనుప్రమాదం మరింత శోఖాన్ని మిగిల్చింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుబేదార్ మేజర్ సత్యవాన్ సింగ్ పార్థివ దేహాన్ని హలియాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉంచి పూర్తి సైనిక లాంఛనాలతో భద్రపరిచారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.       [ Indian Army, Veer Jawan, Jawan Funeral, Jawan Mortal Remains, Ambulance Accident, Road Accident, Fatal Accident, Satyawan Singh, Purvanchal Expressway, CM Yogi Adityanath, Telugu One, Telugu News ]  
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వాసవి నగర్‌లో నివాసం ఉంటున్న ఓ దంపతులు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే, లొకేషన్ తప్పుగా చూపించడంతో ఫుడ్ డెలివరీ కొంత ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్.. డెలివరీ బాయ్ ఆశిష్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చింది. ఇంతలో కస్టమర్ భార్య జోక్యం చేసుకుని ఆశిష్ తలపై చేతితో కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఫుడ్ డెలివరీ ఆలస్యమైందన్న కారణంతో డెలివరీ బాయ్‌పై దాడి చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దాడి అనంతరం ఆశిష్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, తనపై దాడి చేసిన ఘటనలో పోలీసులు చిన్న కేసు నమోదు చేశారంటూ ఆశిష్‌తో పాటు ఇతర డెలివరీ బాయ్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిష్ డిమాండ్ చేస్తున్నాడు. ఫుడ్ డెలివరీ ఆలస్యానికి లొకేషన్ తప్పుగా చూపించడమే కారణమా? లేక మరేదైనా సమస్య ఉందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కారణం ఏదైనా.. వివాదాన్ని దాడి వరకు తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కస్టమర్లు, డెలివరీ సిబ్బంది మధ్య తలెత్తే వివాదాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.     [ Zomato Delivery Boy, Zomato Delivery Agent Attack, Food Delivery Delay, Secunderabad News, Vasavi Nagar Incident, Karkhana Police, Delivery Boy Assault, CCTV Footage, Hyderabad Crime News, Customer Attack, Zomato News, Food Delivery Dispute, Ashish Delivery Boy, Telangana Crime News, Hyderabad Breaking News ]
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.! ఏఐ టెక్నాలజీ పేరుతో జరుగుతున్న దుర్వినియోగం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ప్రముఖ నటి జాహ్నవి కపూర్‌కు సంబంధించిన వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వీడియోలోని దృశ్యాలను తీసుకుని వాటిని డిజిటల్‌గా మార్చి అభ్యంతరకరమైన రీతిలో చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జాహ్నవి కపూర్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘దేవర: పార్ట్-1’ సినిమాలోని ‘చుట్టమల్లె’ పాటకు సంబంధించిన ఫుటేజీని ఉపయోగించి ఈ మార్ఫింగ్ వీడియోను రూపొందించారు.  ఒరిజినల్ వీడియోలోని జాహ్నవి పాత్రను ఆధారంగా చేసుకుని, ఏఐ టెక్నాలజీతో అసలు లేని దృశ్యాలను సృష్టించి నకిలీ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఏఐ ద్వారా రూపొందించిన అభ్యంతరకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సర్క్యులేషన్‌కు రావడంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. వీడియోను ఎవరు రూపొందించారు? ఎక్కడి నుంచి మొదట అప్‌లోడ్ చేశారు? ఏ టెక్నాలజీ లేదా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు? ఎంతమంది దానిని షేర్ చేశారు? అనే కోణాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మార్ఫింగ్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్‌ను తయారు చేయడమే కాకుండా.. అది నకిలీదని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడం కూడా చట్టపర మైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో వీడియో తయారీదారులతో పాటు దాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం.! ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందిం చారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మహిళలను అవమానించేలా నకిలీ వీడియోలు తయారు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం వ్యక్తం చేశారు. అంతే కాదు.. ఇలాంటి నకిలీ వీడియోలు వైరల్ అవుతున్న సమయంలో ఎవ్వరు కూడా వాటిని ఆసక్తితో చూడటం, డౌన్‌లోడ్ చేయడం, ఇతరులకు పంపడం లేదా సోషల్ మీడియాలో మళ్లీ షేర్ చేయడం చేయొద్దని కూడా సూచించారు. నకిలీ వీడియోను వైరల్ చేయడం ద్వారా బాధితురాలికి మరింత నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాహ్నవికి చిరంజీవి అండ.! ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా తీవ్రంగా స్పందించారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మహిళలపై ఇలాంటి దాడులకు పాల్పడటం ఆందోళనకరమైన పరిణామమని పేర్కొన్నారు. ఒకరి ఫొటో లేదా వీడియోను తీసుకుని, వారు చేయని పనిని చేసినట్లు చూపించే విధంగా మార్ఫింగ్ చేయడం వారి గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు సినీ పరిశ్రమ, ఫిల్మ్ సంస్థలు, సైబర్ క్రైమ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చిరంజీవి సూచించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వీడియో ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాల్లో అనేక కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి.  అయితే ఇదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల ముఖాలను, శరీర ఆకృతులను మార్చి నకిలీ వీడియోలు తయారు చేయడం ఇప్పుడు తీవ్ర సమస్యగా మారుతోంది. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేయడం వారి వ్యక్తిగత గౌరవానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ప్రముఖ నటీనటుల విషయంలో ఇలాంటి ఘటనలు చోటుచే సుకుంటే అవి క్షణాల్లో వేలాది మందికి చేరుతున్నాయి.జాహ్నవి కపూర్‌కు సంబంధించిన ఈ ఏఐ మార్ఫింగ్ వీడియో వ్యవహారం కూడా ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియో నిజమైనది కాదని, ఏఐ సాయంతో క్షణాల్లో నకిలీ కంటెంట్ సృష్టించే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి అసలు ఈ వీడియోను తయారు చేసిన వ్యక్తులే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.     [ Janhvi Kapoor, Janhvi Kapoor Deepfake Video, AI Morphed Video, Hyderabad Cyber Crime Police, Jr NTR, Chiranjeevi, Chuttamalle Song, Devara Part 1, AI Misuse, Deepfake Case, Cyber Crime Investigation, Social Media Viral Video, Celebrity Deepfake, Women Safety, Digital Crime, AI Technology, Cyber Crime Hyderabad, Fake Video Case, Deepfake Controversy, Telugu Cinema ]  
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి శంకుస్థాపన చేశారు. తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ఓ లబ్ధిదారు కుటుంబంతో కలిసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.బుర్రిపాలెంలో లబ్ధిదారుడి ఇంటిని 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో అత్యంత పటిష్టమైన ఇళ్లను నిర్మించడమే ఈ సాంకేతికత లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఇంట్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా నిర్మాణం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్ లబ్ధిదారు కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడారు. కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను బహూకరించారు. తమ ఇంటికి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి చేతుల మీదుగా భూమిపూజ జరగడం ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు విజన్‌కు చౌహాన్ ప్రశంసలు..! ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. చంద్రబాబు డైనమిక్, డెడికేటెడ్, డెసిసివ్ నాయకుడని కొనియాడారు. ఆయన విజన్‌కు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.భవిష్యత్తులో దేశానికి టెక్నాలజీనే అతిపెద్ద శక్తిగా చంద్రబాబు ఎప్పుడో గుర్తించారని చౌహాన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపీలో ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటం టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు విజన్ తనను ఆశ్చర్యపరిచిందని చౌహాన్ అన్నారు. ఆయన నిబద్ధత, కఠోర శ్రమతో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఐకాన్‌గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ పాలనపై చౌహాన్ విమర్శలు..! గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలు చేశారు. పేదల ఇళ్ల కోసం కేంద్రం నిధులు కేటాయించినప్పటికీ.. గత ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా పథకాన్ని నీరుగార్చిందని ఆరోపించారు. కేంద్రం పంపిన నిధులను కూడా దారి మళ్లించారని విమర్శించారు.గత ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే ఈపాటికే పేదలందరికీ సొంత ఇళ్లు ఉండేవని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేస్తే.. జగన్ మూడు రాజధానుల పేరుతో మరింత గందరగోళం సృష్టించారని ఆరోపించారు. మరో 6 లక్షల ఇళ్లకు హామీ..! చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే సంకల్పంతో ముందుకు వచ్చారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఏపీకి 76 వేల ఇళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ప్రధాని మోదీని కలిసి మరిన్ని ఇళ్లు కేటాయించాలని కోరారని చెప్పారు.చంద్రబాబు విజ్ఞప్తి మేరకు తొలి విడతగా 3 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఇవి కూడా సరిపోవని, మరో 6 లక్షల ఇళ్లు కావాలని చంద్రబాబు కోరారని.. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 3 లక్షలు, ఆ తర్వాత ఇంకో 3 లక్షల ఇళ్లు మంజూరు చేసి.. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో, చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పేదలందరికీ పక్కా ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టడం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.       [ CM Chandrababu, Shivraj Singh Chouhan, Andhra Pradesh, PMAY Gramin 2.0, 3 Lakh Houses, Housing Scheme, 3D Concrete Printing, Buripalem, Tenali, AP Government, Central Government, PM Modi, Poor Housing, Amaravati Development, Andhra Pradesh Development, TDP, NDA, Housing for Poor] 
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.! మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక చిన్నారి ప్రాణం తీసిన ఘటన ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. మూసాపేట మండలం సుర్తి తండాకు చెందిన మూడవత్‌ శ్రీను, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. సాధారణంగానే ఆ ఇంట పసిపిల్లల అల్లరితో పాటు నిత్యం సంతోషం వెల్లివిరుస్తుండేది. శనివారం రాత్రి సమయంలో ఇద్దరు చిన్నారులు ఇంటి ముందు ఎంతో ఉత్సాహంగా ఆడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో పిల్లల ఆకలిని తీర్చేందుకు తల్లి మౌనిక వారికి బిస్కెట్లు ఇచ్చి, తన పనులను చూసుకునేందుకు వంటగదిలోకి వెళ్లింది. పసిపిల్లలు ఆడుకుంటూ బిస్కెట్లు తింటున్న ఆ క్షణంలోనే విధి రూపంలో ఒక ఘోర విషాదం ముంచుకొచ్చింది. ఎలాంటి ప్రమాదం ఊహించని ఆ సమయంలో, కేవలం ఏడాది వయసున్న చిన్నారి బిస్కెట్ తింటుండగా.. అనుకోకుండా ఆ గట్టి బిస్కెట్ ముక్క పసివాడి గొంతులో అడ్డుపడింది. శ్వాసనాళంలో బిస్కెట్ గట్టిగా ఇరుక్కుపోవడంతో చిన్నారి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గాలి పీల్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతూ పసివాడు కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి క్రితం వరకు కేరింతలు కొడుతూ ఆడుకున్న బిడ్డ ఒక్కసారిగా విలవిలలాడటం చూసి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక కంగారుపడ్డ తల్లిదండ్రులు, వెంటనే తేరుకొని చిన్నారిని రక్షించుకునేందుకు హుటాహుటిన రంగంలోకి దిగారు. బిడ్డ గొంతులో అడ్డుపడిన బిస్కెట్‌ను తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఒక ఆటోను ఏర్పాటు చేసుకుని, చిన్నారిని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్‌ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. మార్గమధ్యంలోనూ బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు పడిన తపన వర్ణనాతీతం. ఆస్పత్రికి చేరుకున్న వెంటనే అత్యవసర విభాగంలో వైద్యులు చిన్నారిని క్షుణ్ణంగా పరీక్షించారు. అయితే, అప్పటికే పసివాడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు దృఢపరుస్తూ నిర్ధారించారు. ఆస్పత్రి బెడ్‌పై విగతజీవుడిగా పడి ఉన్న ఏడాది బిడ్డను చూసి తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరి కంటతడి పెట్టించింది. చేతికి అందివచ్చిన చిన్నారిని అనూహ్య రీతిలో కోల్పోవడంతో ఆ సుర్తి తండాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లలకు ఆహారం తినిపించే సమయంలో తల్లిదండ్రులు ఎంతటి అప్రమత్తతతో ఉండాలో ఈ ఘటన కంటతడి పెట్టించే హెచ్చరికలా నిలుస్తోంది.       [ Mahabubnagar, one year old child dies, biscuit stuck in throat, musapet news, telangana news, child choking accident, Crime news,  Mahabubnagar police, cm revanth reddy, Telugu One, Telugu News ]  
ALSO ON TELUGUONE N E W S
ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా స్టార్‌ సరసన డెబ్యూ చేసే ఛాన్స్ అంటే.. ఏ కొత్త హీరోయిన్‌కైనా అది గోల్డెన్‌ ఆఫరే. అలాంటి భారీ అవకాశమే సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వికి దక్కింది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’తో ఆమె హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇప్పుడు ఇదే సినిమా ఆమె కెరీర్‌ ప్లానింగ్‌పై చర్చకు కారణమవుతోంది. ‘ఫౌజీ’ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఇమాన్వి ఈ ప్రాజెక్ట్‌కే చాలా సమయం కేటాయించింది. ఇదే సమయంలో ఆమెకు టాలీవుడ్‌, కోలీవుడ్‌ నుంచి కొన్ని అవకాశాలు వచ్చినా.. కొత్త సినిమాలకు సైన్ చేయకుండా వెయిట్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రభాస్‌తో డెబ్యూ చేస్తున్న సినిమాపై ఆమె పెట్టుకున్న నమ్మకమేనని అంటున్నారు. సాధారణంగా ఒక పెద్ద స్టార్‌తో తొలి సినిమా చేస్తే.. ఆ సినిమా విడుదలైన తర్వాత వచ్చే గుర్తింపు, మార్కెట్‌ క్రేజ్‌ను బట్టి భారీ అవకాశాలు రావొచ్చని భావిస్తారు. ఇమాన్వి కూడా అదే ఆలోచనతో ‘ఫౌజీ’ రిలీజ్‌ వరకు వెయిట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ‘ఫౌజీ’ని ముందుగా 2026 డిసెంబర్‌ 3న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే సినిమా పనులు పూర్తికాకపోవడంతో ఆ రిలీజ్‌ను 2027కి వాయిదా వేశారు. దీంతో ఇమాన్వి డెబ్యూ కూడా మరింత ఆలస్యం అవుతోంది. ఒక కొత్త నటికి తొలి సినిమా రిలీజ్‌ చాలా కీలకం. ఆ సినిమా రిజల్ట్‌, పాత్రకు వచ్చిన స్పందన.. తర్వాతి అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ‘ఫౌజీ’ కోసం ఓపికగా వెయిట్ చేయడం ఇమాన్వికి ఎంతవరకు కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మరో కోణంలో చూస్తే.. ఇమాన్వికి ఇది రిస్క్‌తో కూడుకున్నా, భారీ రివార్డ్‌ ఇచ్చే నిర్ణయమే కావచ్చు. ‘ఫౌజీ’ ప్రభాస్‌ కెరీర్‌లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా. ఈ సినిమా సక్సెస్‌ అయితే ఇమాన్వి కెరీర్‌కు భారీ ప్లస్‌ కావచ్చు. ఇది కూడా చదవండి: ‘వారణాసి’లో హాలీవుడ్ నటి.. మహేష్‌తో రొమాన్స్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరు.?       [Fauzi Heroine Imanvi, Prabhas Fauzi Movie, Rebel Star Prbhas, Fauzi Movie, Hanu Raghavapudi, Actress Imanvi, Telugu Film News]
The demise of legendary filmmaker Singeetham Srinivasa Rao at the age of 94 has left the Telugu and Indian film industries mourning the loss of one of their most innovative filmmakers. Several prominent personalities, including Telangana Chief Minister Revanth Reddy, Jr NTR, Pawan Kalyan, Nandamuri Balakrishna, Nara Lokesh and Chiranjeevi, paid heartfelt tributes to the veteran director. Telangana CM Revanth Reddy remembered Singeetham as “a creative director who showed Telugu cinema new paths by bringing diverse storylines and innovative ideas to the screen.” He added that Singeetham’s contribution as a director, writer and thinker, driven by his immense love for cinema, “will always be remembered.” Jr NTR wrote, “Singeetham Srinivasa Rao garu is no more, and the news is deeply saddening. A visionary who thought ahead of his time and created films like Aditya 369, Pushpaka Vimanam and Mayuri that continue to feel fresh even as generations change.” Pawan Kalyan recalled the filmmaker’s experiments in films such as Pushpaka Vimanam, Vichitra Sodarulu, Mayuri and Aditya 369, adding that his direction of Singeetham at 94 was proof of his “dedication and interest in cinema.” Balakrishna described Singeetham as a “true legendary director” and recalled their association through Aditya 369, Bhairava Dweepam and Sri Krishnarjuna Vijayam. He said the filmmaker’s death was “an irreparable personal loss” and a “huge loss to Indian cinema.” His complete statement reads:  I am deeply shaken by the demise of legendary director Singeetam Srinivasa Rao garu. He was very close to our family. We created three distinct classics together: 'Aditya 369', which left a new mark not only on Telugu cinema but also on Indian cinema; 'Bhairava Dweepam', the first computer graphics-driven film in Telugu, which made history at the box office and remains unbeatable among folklore films; and 'Sri Krishnarjuna Vijayam' in the mythological genre. Through these three films, I portrayed characters across all four major genres — social, historical, folklore, and mythological — under a single director as captain. I will cherish those memories forever. Singeetam garu started his career as an assistant to the great director K. V. Reddy garu for the immortal 'Mayabazar', where my father played Lord Sri Krishna for the first time. Later, he worked as an associate for many of my father's films. Hence, our family shared a special bond with him that went far beyond cinema. Singeetam garu was truly a legendary director in every sense of the word, pursuing unforgettable cinematic experiments until his last breath at 94, across various Indian languages. His demise is a profound personal loss to me and an irreplaceable loss to the Indian film industry. May his soul rest in peace. My heartfelt condolences to his family members. Nara Lokesh called his demise “an irreparable loss to the film industry,” recalling his experimental films with NTR and Balakrishna. Chiranjeevi wrote, “A true visionary, his imagination and courage to explore new ideas gave Indian cinema some of its most unforgettable films.”   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈ లైనప్‌లో హాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్-జోన్స్ ‘వారణాసి’లో నటిస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. సినిమాలో మహేష్ బాబుతో ఆమెకు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. రాజమౌళి గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ సరసన జెన్నీ పాత్ర కోసం డైసీ ఎడ్గర్-జోన్స్ పేరు మొదట  వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌లో ఆమె నటించలేదు. ఆ పాత్రలో చివరకు ఒలివియా మోరిస్ కనిపించారు. ఇప్పుడు అదే డైసీ.. మహేష్ బాబుతో కలిసి ‘వారణాసి’లో కనిపించబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీ టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, భారతీయ పురాణాల అంశాలను కలిపిన భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. మహేష్ బాబు ఇందులో రుద్ర పాత్రతో పాటు శ్రీరాముడి పాత్రలో కూడా కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా నటిస్తున్నారు.  ఇప్పటికే ‘వారణాసి’ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2027 ఏప్రిల్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కూడా చదవండి: ‘భోగి’ టీజర్ అదిరిపోయింది.. శర్వానంద్‌లో ఇలాంటి యాక్షన్ ఎప్పుడూ చూడలేదు.!       [Daisy Edgar Jones In Varanasi, Daisy Edgar Jones, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, RRR Movie, Jr NTR, Telugu Film News]    
శర్వానంద్ నుంచి ఇప్పటివరకు ఎన్నో డిఫరెంట్ సినిమాలు వచ్చాయి. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, ఎమోషనల్ డ్రామాలతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ మొదలవ్వగానే ఓ రా అండ్ రస్టిక్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. తెలంగాణ జానపద గీతం బ్యాక్‌డ్రాప్‌లో ఊరు, అక్కడి పరిస్థితులు, దొరల ఆధిపత్యం.. ఆ వ్యవస్థకు ఎదురుతిరిగే గంగ పాత్రను చూపించారు. ఈ సినిమాలో శర్వానంద్ పేరు గంగ. ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే చాలా కఠినమైన, వయలెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. ఒక ఊరిని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న దొరలపై తిరగబడే వ్యక్తిగా గంగ పాత్రను డిజైన్ చేసినట్టు టీజర్‌తో క్లారిటీ వచ్చింది. “ఆ తొమ్మిది మెట్లను నా కత్తితో కడిగి మీ నెత్తుటితో అలకకపోతే.. నేను కమ్మరోళ్ల గంగనే కాదురా” అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్‌తోనే పాత్ర ఎంత మొండిగా, ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చూపించారు. శర్వానంద్ లుక్ ఈ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడ్డం, రఫ్ లుక్, బాడీ లాంగ్వేజ్.. అన్నీ కలిపి ఓ పీరియడ్ వారియర్‌ను తలపిస్తున్నాయి. ఇప్పటివరకు క్లాస్, ఫ్యామిలీ, లవ్ స్టోరీస్‌లో ఎక్కువగా కనిపించిన శర్వాను ఇలా ఊర మాస్ అవతార్‌లో చూడటం కొత్తగా అనిపిస్తోంది. ఇక ఈ కథ 1960ల కాలం నేపథ్యంలో సాగుతుంది. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంగా తీసుకుని అప్పటి సామాజిక పరిస్థితులు, దొరల ఆధిపత్యం, సామాన్యులపై జరిగే అణచివేత వంటి అంశాలను కథలో చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కేకే రాధామోహన్ నిర్మాతగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమాలో చాలా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె పాత్ర పేరు కందుల సులోచన రాణి. టీజర్‌లో ఆమె లుక్, క్యారెక్టర్ కూడా ఆసక్తిని పెంచుతున్నాయి.  ఇక ‘భోగి’ విడుదల తేదీపై కూడా టీజర్‌తో క్లారిటీ వచ్చింది. నవంబర్ 12, 2026న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది కూడా చదవండి: 30 ఏళ్ల ‘నిన్నే పెళ్లాడతా’.. ఇప్పటికీ ఇంత స్పెషల్‌గా ఉండటానికి కారణం ఇదే.!       [Bhogi Movie Teaser, Sharwanand Bhogi Teaser, Bhogi Official Teaser, Sharwanand, Sampath Nandi, Anupama Parameswaran, Dimple Hayathi, Bhogi Teaser, Telugu Film News]  
కొన్ని సినిమాలు హిట్ అవుతాయి.. కొన్ని సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి.. మరికొన్ని మాత్రం కాలం మారినా ప్రేక్షకుల మనసుల్లో అలాగే ఉండిపోతాయి. ‘నిన్నే పెళ్లాడతా’ ఈ మూడో కోవకు చెందిన సినిమా. నాగార్జున, టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలై నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1996 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ అప్పట్లో ఓ సంచలనం. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలిపి కృష్ణవంశీ చెప్పిన విధానం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. మరీ ముఖ్యంగా కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే ప్రేమకథను చాలా సహజంగా చూపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ‘నిన్నే పెళ్లాడతా’కు ముందు కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమా ‘గులాబి’. ఆ సినిమా సమయంలోనే నాగార్జున.. కృష్ణవంశీ టేకింగ్‌కు ఇంప్రెస్ అయ్యారు. తన బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. మొదట కృష్ణవంశీ ఓ యాక్షన్ ఓరియెంటెడ్ కథను నాగార్జునతో చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత తన ఆలోచన మార్చుకున్నారు. అప్పట్లో ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలు దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుండటంతో.. వాటి తరహాలో తెలుగు నేటివిటీకి తగ్గ కథను చేయాలని నిర్ణయించుకున్నారు. నాగార్జున–టబు కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా మారింది. ఈ జంటను ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారంటే.. సినిమాలో వారి మధ్య ఉన్న ప్రేమకథ ఎంత సహజంగా వర్కౌట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సందీప్ చౌతా ఈ సినిమాతోనే తెలుగు సినిమాకు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పట్లో కొత్త వ్యక్తికి ఇంత పెద్ద సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం రావడం కూడా ఆసక్తికరమైన విషయమే. కానీ ఆయన ఇచ్చిన పాటలు సినిమా విజయానికి మరో ప్రధాన కారణంగా మారాయి. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ విజయాన్ని అందుకుంది. 1996లో విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. 1996 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును ఈ సినిమా అందుకుంది.  కథ పెద్దగా కాంప్లికేటెడ్ కాదు. విలన్ లేడు. భారీ యాక్షన్ లేదు. కానీ పాత్రలు, కుటుంబ బంధాలు, ప్రేమ, సరదా, పాటలు.. ఇవన్నీ కలిపి కృష్ణవంశీ ఓ నేచురల్ ఫీల్ ఇచ్చారు. అందుకే టీవీలో ఎన్నిసార్లు వచ్చినా ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడే సినిమాల్లో ‘నిన్నే పెళ్లాడతా’ కూడా ఒకటిగా నిలిచిపోయింది. ఇది కూడా చదవండి: రజాకార్లపై ప్రభాస్ ఒక్కడే: ‘ఫౌజీ’లో వన్ మ్యాన్ ఆర్మీ ఫైట్ మామూలుగా ఉండదు.!       [30 Years For Ninne Pelladatha, 30 Years Of Ninne Pelladatha, Ninne Pelladatha 30 Years, Ninne Pelladatha Movie, Nagarjuna, Tabu, Krishna Vamsi, Telugu Film News]
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని సెట్ ఫొటోలు బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో ‘ఫౌజీ’ గురించి కొత్త చర్చ మొదలైంది. ఈ ఫొటోల్లో ప్రభాస్ ఒంటరిగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. చుట్టూ శత్రువులు.. మధ్యలో ప్రభాస్.. వాళ్లందరినీ ఎదుర్కొంటూ ఒక్కడే పోరాడే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. ముఖ్యంగా రజాకార్లతో జరిగే పోరాటాల్లో ప్రభాస్ పాత్రను వన్ మ్యాన్ ఆర్మీ తరహాలో డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగానే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను భారీ స్థాయిలో ప్లాన్ చేశారట. యాక్షన్ కొరియోగ్రాఫర్లు విజయ్, కింగ్ సోలోమన్ ఆధ్వర్యంలో ఈ ఫైట్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ పాత్రలోని కోపం, పోరాట పటిమను చూపించేలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని టాక్. ఇప్పటికే ‘ఫౌజీ’ నుంచి వచ్చిన పోస్టర్లు, ప్రభాస్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈసారి బయటకు వచ్చిన సెట్ ఫొటోలు మాత్రం సినిమాలోని యాక్షన్ ఎలా ఉండబోతోందనే దానిపై ఓ ఐడియా ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ను భారీ యాక్షన్ బ్లాక్స్‌లో చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ లీక్స్ మరింత హైప్ పెంచుతున్నాయి. ఇక ‘ఫౌజీ’ కథ స్వాతంత్ర్యానికి ముందు కాలం నేపథ్యంలో సాగుతుంది. దేశభక్తి, ప్రేమ, పోరాటం, ఎమోషన్ వంటి అంశాలను కలిపి హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో ప్రేమకథలను తనదైన శైలిలో చెప్పిన హను.. ఈసారి ప్రభాస్‌తో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి వారు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన షూటింగ్ పార్ట్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. అక్టోబర్ 20 నాటికి ముగించేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ తర్వాత మిగిలిన పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌పై టీమ్ ఫోకస్ పెట్టనుంది. ఇది కూడా చదవండి: సింగీతం కెరీర్‌లో 'ఆదిత్య 369' ఎందుకంత ప్రత్యేకం.?       [Prabhas Fauzi Action Scene, Prabhas Fauzi Razakars Fight, One Man Army Vs Razakars, Prabhas Fauzi Movie, Hanu Raghavapudi, Prabhas Movies, Telugu Film News]    
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మాధవి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీలో ఎంసి హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.  హైదరాబాద్ బస్తీలోని స్నేహాన్ని, ప్రేమను, బంధాల్ని చాటి చెప్పే చిత్రంగా అందరి హృదయాల్ని గెల్చుకుంది. ఈ సినిమాలోని పాటలు హైదరాబాద్ కల్చర్‌కి ఆంథమ్‌లా మారిపోయాయి. కుర్రాళ్లకు స్పూర్తినిచ్చేలా, మంచి సందేశంతో తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించింది. ఎంసి హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, విశ్వేందర్ రెడ్డి పాత్రలకు ప్రేక్షకులకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా గ్రాండ్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచి రిలీజ్ దొరకడం, ఆడియెన్స్‌ నుంచి ప్రశంసలు దక్కడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్‌ చేస్తోంది. ప్రస్తుతం ‘అమీర్ లోగ్’ మూవీని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఆల్రెడీ ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీకి స్మరణ్ సాయి ఇచ్చిన సంగీతం, ఎస్వీకే సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇది కూడా చదవండి: లెజెండరీ డైరెక్టర్ సింగీతం టాప్-10 మూవీస్        [Ameer Log OTT Response, Ameer Log OTT Release, Ameer Log Movie, Rana Daggubati, Telugu Movies 2026, Latest Telugu Movies, Telugu Film News]
వైవిధ్యభరిత చిత్రాలకు పెట్టింది పేరు.. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దర్శకుడిగా తనదైన ముద్రవేసిన సింగీతం.. తన కెరీర్ లో పలు విజయాలను చూశారు. అలాగే అనేక పురస్కారాలు సొంతం చేసుకున్నారు. అలాంటి సింగీతం కెరీర్ లో టాప్ 10 క్లాసిక్స్ ఏంటో చూద్దాం.. పంతులమ్మ: నాలుగు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం సొంతం చేసుకున్న మ్యూజికల్ హిట్ ఇది. రంగనాథ్, లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా 1978లో తెరపైకి వచ్చింది. సిరిమల్లె నీవే విరిజల్లు కావే అంటూ సాగే పాపులర్ గీతం ఇందులోనిదే. సొమ్మొకడిది సోకొకడిది: లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో సింగీతం రూపొందించిన తొలి చిత్రమిది. జయసుధ, రోజా రమణి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1979లో సందడి చేసింది. అబ్బో నేరేడు పళ్ళు అంటూ సాగే పాపులర్ సాంగ్ ఈ సినిమాలోదే. ఇందులో కమల్ ద్విపాత్రాభినయం చేశారు. మయూరి: ఏకంగా 14 నంది పురస్కారాలు కైవసం చేసుకున్న క్లాసిక్ మూవీ ఇది. క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో.. సుధా చంద్రన్ తన పాత్రను తనే స్వయంగా పోషించడం విశేషం. 1985లో రిలీజైన ఈ సంచలన చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ఇటు నంది, అటు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు సింగీతం.  పుష్పక విమానం: మాటల్లేకుండా సింగీతం రూపొందించిన బ్లాక్ కామెడీ మూవీ ఇది. కమల్ హాసన్, అమల జంటగా నటించిన ఈ సినిమా ఒక జాతీయ పురస్కారంతో పాటు 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు,  మూడు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకుంది. 1987లో ఈ క్లాసిక్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పలు రకాల టైటిల్స్ తో  జనం ముందు నిలిచింది. విచిత్ర సోదరులు: కమల్ హాసన్ త్రిపాత్రాభినయంలో సింగీతం తెరకెక్కించిన క్లాసిక్ ఇది. ఇందులో మరగుజ్జు పాత్రని తీర్చిదిద్దిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. అపూర్వ సగోదరగళ్ పేరుతో ప్రధానంగా తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ.. తెలుగులో విచిత్ర సోదరులు పేరుతో అనువాదమై అలరించింది. 1989లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు రెండు తమిళనాడు స్టేట్ అవార్డులను సైతం సొంతం చేసుకుందీ సినిమా. మైఖేల్ మదన కామ రాజు: కమల్ హాసన్ నాలుగు విభిన్న పాత్రల్లో ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ గా రికార్డులకెక్కిన ఈ మూవీ.. అప్పట్లో ఓ సంచలనం. సింగీతం మార్క్ వినోదంతో ఎంటర్టైన్ చేసిన ఈ క్లాసిక్ 1990లో రిలీజైంది. ఆదిత్య 369: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఓ విభిన్న ప్రయత్నం. మూడు విభిన్న కాలాల్లో సాగే ఈ చిత్రంలో కృష్ణకుమార్ గా, శ్రీ కృష్ణదేవరాయలుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. 1991లో ఈ క్లాసిక్ థియేటర్స్ లో ఎంటర్టైన్ చేసింది. బృందావనం: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ జంటగా నటించిన మ్యూజికల్ హిట్ ఇది. ఈ సినిమాకి గానూ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది పురస్కారం సొంతం చేసుకున్నారు సింగీతం. 1992లో ఈ క్లాసిక్ విడుదలైంది. మేడమ్: రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్ లో భలేగా ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రెండు విభాగాల్లో నంది పురస్కారాలను కైవసం చేసుకుంది. 1994లో ఈ మూవీ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. భైరవ ద్వీపం: తొమ్మిది నంది పురస్కారాలతో సంచలనం సృష్టించిన జానపద చిత్రం.. భైరవద్వీపం. బాలకృష్ణ, రోజా జంటగా నటించిన ఈ క్లాసిక్.. అప్పట్లో విశేషాదరణ పొందింది. 1994లో ఈ జనరంజక చిత్రం సందడి చేసింది.         [Singeetham Top 10 Movies, Singeetham Best Movies, Singeetham Classic Movies, Singeetham Srinivasa Rao, Singeetham Passed Away, Singeetham Death, Singeetham Movies, Telugu Film News, Telugu News]  
తెలుగు సినిమా గొప్ప ప్రయోగశీల దర్శకుల్లో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. 94 ఏళ్ల వయసులో శనివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సినిమా మాత్రమే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోనూ ఓ గొప్ప అధ్యాయం ముగిసినట్టైంది. సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే సినిమాలు ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’ వంటి ప్రయోగాత్మక చిత్రాలే. అప్పటి పరిస్థితుల్లో ఊహించడానికే కష్టమైన కాన్సెప్ట్స్‌ను తెరపై చూపించిన దర్శకుడిగా సింగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. https://x.com/TelanganaCMO/status/2106577647224668566 సింగీతం మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. వైవిధ్యమైన కథాంశాలు, వినూత్నమైన ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడు సింగీతం అని కొనియాడారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ చిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. https://x.com/tarak9999/status/2106442381600104682 మరోవైపు సింగీతం మృతిపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘మయూరి’ వంటి సినిమాలను గుర్తు చేసుకున్న ఎన్టీఆర్.. కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడిగా సింగీతాన్ని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. https://x.com/APDeputyCMO/status/2106572482828484763 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సింగీతం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’, ‘మయూరి’, ‘ఆదిత్య 369’, ‘మైకేల్ మదన కామరాజు’ వంటి సినిమాల్లో ఆయన చేసిన ప్రయోగాలను గుర్తు చేసుకున్నారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ సినిమాకు దర్శకత్వం వహించడం సినిమాపై ఆయనకున్న అంకితభావానికి నిదర్శనమని పవన్ పేర్కొన్నారు. ఇక నందమూరి బాలకృష్ణకు సింగీతం శ్రీనివాసరావుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ వంటి విభిన్నమైన చిత్రాలు వచ్చాయి. బాలకృష్ణ కెరీర్‌లో ఈ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. సింగీతం మృతిపై బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తమ కుటుంబానికి ఎంతో సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. ‘ఆదిత్య 369’ తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చిందని, ‘భైరవ ద్వీపం’ జానపద చిత్రాల్లో ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొన్నారు. సింగీతం మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని బాలకృష్ణ అన్నారు. https://x.com/KChiruTweets/status/2106587307427959273 సింగీతం శ్రీనివాసరావు ఓ విజనరీ అని చిరంజీవి కొనియాడారు. కొత్త ఆలోచనలను తెరపై ఆవిష్కరించేందుకు ఆయన చూపించిన ఊహాశక్తి, ధైర్యం భారతీయ సినిమాకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించిందని పేర్కొన్నారు. సినిమాకు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ ఎంతో గౌరవంతో, అభిమానంతో గుర్తు చేసుకుంటామని అన్నారు.       [Singeetham Srinivasa Rao, Singeetham Passed Away, Singeetham Death, Singeetham Movies, Telangana CM Revanth Reddy, Chiranjeevi, Nandamuri Balakrishna, Pawan Kalyan, Jr NTR]  
Singeetham Srinivasa Rao, one of Telugu cinema’s most celebrated and versatile filmmakers, has passed away. The veteran director breathed his last in Chennai, according to reports. He was 95.  Singeetham was known for constantly experimenting with storytelling and filmmaking across languages and genres. After beginning his career as an assistant to legendary filmmaker K. V. Reddy, he made his directorial debut with Neethi Nijayithi in 1972 and went on to establish a distinctive identity with films such as Mayuri, Pushpaka Vimana, Aditya 369, Bhairava Dweepam, Madam and several others.  His collaboration with Kamal Haasan resulted in some of his most memorable films, including Pushpaka Vimana, Apoorva Sagodharargal and Michael Madana Kama Rajan. Pushpaka Vimana, made without conventional dialogue, remains one of the most unconventional films in Indian cinema, while Aditya 369 continues to be remembered as a landmark Telugu science-fiction film. What made Singeetham's journey even more remarkable was his continued passion for cinema well into his 90s. Earlier this year, he returned to the director's chair with Sing Geetham, produced by Nag Ashwin under Vyjayanthi Movies. The film, released in June 2026, marked his 61st directorial venture and came at the age of 94.  With a career spanning over five decades and multiple languages, Singeetham Srinivasa Rao leaves behind a body of work that stands out for its imagination, technical experimentation and willingness to explore subjects beyond conventional commercial cinema. His passing marks the loss of one of Indian cinema's true experimental filmmakers.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పండుగ షాపింగ్.. ఆన్లైల్ లో బట్టలు,  వస్తువులు కొనడం మంచిదేనా.! పండుగ అంటే సందడే సందడి.. ముఖ్యంగా సంక్రాంతి,  దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో ఇళ్లలోనే కాదు.. మార్కెట్లో కూడా చాలా సందడిగా ఉంటుంది.  ఇదివరకు రోజుల్లో పండుగ వస్తుందంటే.. ఇంటికి కొత్త వస్తువులు,  ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు కొనడానికి బట్టల షాపుల దగ్గర జనం ఎక్కువగా ఉండేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో  మాత్రం  సీన్ పూర్తీగా మారిపోయింది. పండుగలు వస్తున్నాయంటే చాలు.. పండుగ సేల్ పేరుతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో దుస్తుల నుండి అన్ని రకాల వస్తువులు చాలా ఆపర్ తో అందుబాటులో ఉన్నాయని ప్రమోషన్ చేస్తుంటారు.  అయితే పండుగ సమయాల్లో ఆన్లైట్ ప్లాట్ఫామ్ లలో షాపింగ్ చేయడం మంచిదేనా? ఆన్లైల్ షాపింగ్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు వివరంగా తెలుసుకుంటే.. పండుగ వస్తే చాలు, ఇళ్లకు కావలసిన కొత్త దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో మార్కెట్లు కిక్కిరిసిపోతాయి. అయితే, ఇటీవలి కాలంలో రద్దీలో తిరిగే ఓపిక లేక, సమయం కలిసి వస్తుందని చాలామంది ఆన్‌లైన్ షాపింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు చూసి మురిసిపోతూ ఇష్టమైన వస్తువులను కార్ట్‌లో వేసి ఆర్డర్ చేసేస్తున్నారు. అయితే, ఆన్‌లైన్ లో కనిపించే ప్రతి ఆఫర్ మనకు లాభం చేకూరుస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేం. పండుగ సరదాలో మనం చేసే కొన్ని ఆన్‌లైన్ కొనుగోళ్లు ఒక్కోసారి ఊహించని షాక్‌లు ఇస్తుంటాయి. ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని చేదు నిజాలు ఉన్నాయి. దుస్తులు.. ఆన్‌లైన్ లో దుస్తులు కొనేటప్పుడు ఫోటోల్లో కనిపించే రంగు, మెరుపు, క్వాలిటీ నేరుగా ఇంటికి వచ్చేసరికి సరిపోలకపోవడం చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఫోటోషూట్‌ల కోసం వాడే లైటింగ్, ఎడిటింగ్ వల్ల వస్త్రాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. తీరా ప్యాకెట్ విప్పి చూస్తే క్వాలిటీ తక్కువగా ఉండటం లేదా రంగు మారడం వంటివి జరుగుతుంటాయి. పైగా పండుగ సమయానికి వేసుకోవడానికి సరైన సైజు రాకపోతే, దాన్ని రిటర్న్ చేసి మళ్లీ కొత్తది తెప్పించుకోవడానికి పండుగ రోజులు దాటిపోతాయి. దీని కారణంగా పండుగకు కొత్త దుస్తులు వేసుకోలేరు. డిస్కౌంట్ మాయాజాలం.. పండుగ సేల్స్ అనగానే యాభై శాతం, డెబ్బై శాతం డిస్కౌంట్ అని పెద్ద అక్షరాలతో ప్రకటనలు కనిపిస్తాయి. కానీ చాలా కంపెనీలు సేల్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే వస్తువుల అసలు ధరలను పెంచేసి, ఆ తర్వాత భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు చూపిస్తాయి. దీనివల్ల వినియోగదారులకు నిజమైన ఆదా ఏమీ ఉండదు. నిజానికి సాధారణ రోజుల్లో ఉండే ధరలకే లేదా అంతకంటే కాస్త ఎక్కువ ధరకే పండుగ సేల్‌లో కూడా వస్తువులు అమ్ముడవుతుంటాయి. ఫేక్ వెబ్సైట్లు.. పండుగ సమయాల్లో ఆన్‌లైన్ లో రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ నేరగాళ్లు విజృంభిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ప్రకటనల్లో తక్కువ ధరకే బ్రాండెడ్ దుస్తులు లేదా వస్తువులు ఇస్తామని లింకులు పెడతారు. ఆ ఆఫర్ నిజమేనని నమ్మి డబ్బులు చెల్లిస్తే, వస్తువు రాకపోగా మన బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. బ్రౌజింగ్ హిస్టరీ చేదు నిజం.. షాపింగ్ యాప్‌లు మన బ్రౌజింగ్ హిస్టరీని పరిశీలించి, మనకు నచ్చిన వస్తువుల ప్రకటనలను పదే పదే చూపిస్తాయి. దీనివల్ల అవసరం లేకపోయినా, కేవలం ఆఫర్ ఉంది కదా అని అనవసర వస్తువులు కొని డబ్బులు వృథా చేసుకుంటాం. క్రెడిట్ కార్డులు, నో కాస్ట్ ఈఎమ్‌ఐ సౌకర్యాలు ఉన్నాయి కదా అని శక్తికి మించి కొనుగోళ్లు చేసి పండుగ తర్వాత అప్పుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. సమయానికి రాకపోతే నిరాశే.. పండుగ సీజన్‌లో మిలియన్ల కొద్దీ ఆర్డర్లు రావడం వల్ల డెలివరీ సర్వీసులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. పండుగ రోజు వేసుకోవడానికి ఆర్డర్ చేసిన డ్రెస్ లేదా పూజ కోసం తెప్పించిన వస్తువు సమయానికి చేరకపోతే పండుగ ఉత్సాహమే పాడవుతుంది. చాలా సందర్భాల్లో డెలివరీలు ఆలస్యం కావడం లేదా ఆర్డర్లు క్యాన్సిల్ కావడం జరుగుతుంటుంది. జాగ్రత్తలు ముఖ్యం.. ఆన్‌లైన్ షాపింగ్ పూర్తిగా చెడ్డదని చెప్పలేం. అయితే కొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఏ వస్తువైనా ఆర్డర్ చేసే ముందు వేరే ఇతర వెబ్‌సైట్లలో దాని ధరను సరిపోల్చి చూడాలి. గతంలో ఆ వస్తువు కొన్న ఇతర వినియోగదారులు ఇచ్చిన రివ్యూలు, రేటింగ్‌లు తప్పకుండా చదవాలి. అలాగే వస్తువు నచ్చకపోతే తిరిగి పంపడానికి రిటర్న్ పాలసీ ఉందో లేదో సరిచూసుకోవాలి. తెలిసిన, నమ్మకమైన అధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే కొనుగోళ్లు చేయడం వల్ల మోసపోకుండా పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు.                                                                                                                                                 *రూపశ్రీ.
ఆడపిల్ల జీవితంలో గెలవాలి అంటే ఇలా పెంచండి..! నేటి సమాజంలో ఆడపిల్లలకు కేవలం రక్షణ కల్పించడమే కాకుండా, వారు సొంత కాళ్లపై నిలబడేలా, జీవితంలో ప్రతి సవాలును జయించి విజేతలుగా నిలిచేలా పెంచడం ఎంతో అవసరం. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. ఆడపిల్లలు సుకుమారంగా, ఎలాంటి బాధ్యత, కష్టం తెలియకుండా, ఇంటి పనులన్నీ నేర్చుకుంటే చాలని అనుకుంటారు. కానీ  తీసుకునే కొన్ని చిన్న జాగ్రత్తలు ఆడపిల్లల  భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ఆడపిల్లలను కేవలం సున్నితంగా కాకుండా, ఆత్మవిశ్వాసం కలిగిన ధైర్యవంతమైన వనితలుగా  తీర్చిదిద్దడానికి పాటించాల్సిన విషయాల గురించి వివరంగా తెలుసుకుంటే.. ధైర్యవంతురాలుగా పెంచాలి.. అ​మ్మాయిలను మహారాణులుగానో లేదా ఎవరిపైనో ఆధారపడేవారిగానో కాకుండా ధైర్యంగా ఉండేలా పెంచాలి. ఆమెకు కాపలాగా ఉండటానికి మరొక రక్షకుడు అవసరం లేదని, తనకు తానే ఏకైక రక్షకురాలని చిన్నతనం నుంచే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి.  వారికది ఒక పెద్ద మానసిక బలాన్ని ఇస్తుంది. అన్ని పనులు నేర్పాలి.. ​కొన్ని పనుల విషయంలో ఇది ఆడపిల్లలు చేసే పని కాదు అని ఎప్పుడూ అనకూడదు. ఇటువంటి మాటలు వారిలో భయాన్ని, న్యూనతాభావాన్ని పెంచుతాయి. సమాజంలో లేదా ఇంట్లో ఏ పనైనా తాము చేయగలమనే ధైర్యాన్ని వారికి అందించడం తల్లిదండ్రుల బాధ్యత. ఆత్మరక్షణ.. ​ఆడపిల్లలకు చిన్నతనం నుంచే ఆత్మరక్షణ అంటే.. సెల్ఫ్ డిఫెన్స్  విద్యలను నేర్పించాలి. శారీరక బలం , ఆత్మరక్షణ నైపుణ్యాలు అమ్మాయిలలో కాన్ఫిడెన్స్ ను విశేషంగా పెంచుతాయి. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ఎదుర్కొనే ధైర్యం దీని ద్వారా లభిస్తుంది. నో చెప్పడం నేర్పాలి.. ​తమకు నచ్చని లేదా ఇబ్బంది కలిగించే విషయాలకు కుదరదు లేదా నో అని చెప్పడం నేర్పించాలి. కాదనడం అనేది ఒక బలహీనత కాదని, కష్టంగా ఎవరి కోసమో దేన్నీ యాక్సెప్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని, నో చెప్పడం అంటే..  తమ పరిమితులను , హద్దులను కాపాడుకోవడానికి గీసుకున్న లక్ష్మణ రేఖ అని వారికి వివరించాలి. ఇది వారి స్వతంత్ర ఆలోచనకు దోహదపడుతుంది. బాధ్యతలు.. ఇంట్లో ఉండే బాధ్యతలను మగపిల్లలతో సమానంగా అమ్మాయిలకు కూడా అప్పగించాలి. కుటుంబ నిర్ణయాల్లో వారిని భాగస్వాములను చేయడం, బాధ్యతలను సమానంగా పంచుకోవడం వల్ల వారిలో క్రమంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయాన్ని జయించడం.. భయాన్ని జయించిన ఏ అమ్మాయైనా ఈ ప్రపంచాన్ని సులువుగా గెలవగలదు. సరైన మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తే ఆడపిల్లలు ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టించగలరు. ఆడపిల్లను సున్నితంగా, అపురూపంగా పెంచడం  తప్పు కాదు.. కానీ.. ఆడపిల్లను భస్తురాలిగా, తండ్రిచాటు పిల్లగానో, తల్లిచాటు పిల్లగానో.. ఎవరో ఒకరు తన ముందు ఉంటే తప్ప.. తాను ఏమి సాధించలేను అనే మెంటాలిటీ కలిగిన పిల్లగానో మాత్రం పెంచకూడదు. అమ్మ నాన్న, తోబుట్టువులు.. పెళ్ళయ్యాక భర్త, అత్తమామ.. ఇలా ఎవ్వరు లేకపోయినా సరే.. ఆత్మవిశ్వాసంతో  జీవితాన్ని గడిపే ధైర్యాన్ని అమ్మాయిలకు ఇవ్వాలి. ఇలాంటి అమ్మాయిలు అద్భుతాలు చేస్తారు. తన చుట్టూ ఉన్నవారికి కీర్తి తెచ్చిపెడతారు.                            *రూపశ్రీ.
భార్యాభర్తలు ఒకరికి ఒకరు టైం కేటాయించుకోవడం ఎందుకు ముఖ్యం.! ​భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవడం దాంపత్య జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఉద్యోగం, వ్యాపారం, పిల్లల చదువులు, ఇంటి పనులు, ఆర్థిక బాధ్యతలతో రోజంతా గడిచిపోతుంటుంది. ఈ హడావుడిలో దంపతులు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మనసులో విషయాలను పంచుకోవడానికి సమయం దొరకడం కష్టం. అయితే, కేవలం ఒకే ఇంట్లో  జీవించడం మాత్రమే కాకుండా, ఒకరికొకరు క్వాలిటీ టైమ్ కేటాయించుకోవడం చాలా అవసరం . భార్యాభర్తలు ఒకరికొకరు టైమ్ కేటాయించుకోవడం వల్ల వైవాహిక బంధంలో జరిగే అద్భుతాలు తెలుసుకుంటే..  కష్టాలలో నిలబెడుతుంది. ఎంతటి కష్టసమయంలోనైనా దంపతులను కలిపి ఉంచేది వారి మధ్య ఉన్న అనుబంధమే. రోజూ కొంత సమయం ఒకరి కోసం ఒకరు కేటాయించుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిపడుతుంది. ఒకరి ఆలోచనలు, ఆశయాలు, భయాలు మరొకరు అర్థం చేసుకోవడానికి ఈ సమయం సహాయపడుతుంది. దీనివల్ల భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి. గొడవలు తగ్గుతాయి.. చాలా కాపురాల్లో వచ్చే చిన్న చిన్న గొడవలకు లేదా విభేదాలకు ప్రధాన కారణం సరిగ్గా మాట్లాడుకోకపోవడమే. రోజూ కాసేపు ఎలాంటి ఫోన్లు, టీవీలు లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల మనసులోని భ్రమలు, అపోహలు తొలగిపోతాయి. భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినడం వల్ల మన సమస్యలను వారు అర్థం చేసుకుంటున్నారనే నమ్మకం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.. ఆఫీసు పని, కుటుంబ బాధ్యతల వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భాగస్వామితో గడిపే సమయం అద్భుతంగా పనిచేస్తుంది. రోజంతా పడిన కష్టాన్ని మరిచిపోయి, భాగస్వామితో కాసేపు నవ్వుతూ మాట్లాడినా లేదా చిన్న నడకకు వెళ్లినా మనసుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. భాగస్వామి ఇచ్చే ధైర్యం ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. జీవితం ఎప్పుడూ కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది.. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచాక చాలామందిలో జీవితం రొటీన్‌గా మారిపోయిందనే భావన వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా అవసరం. కలిసి కాఫీ తాగడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం లేదా పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వంటివి వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలకు మార్గదర్శనం.. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులను చూసే విషయాలు నేర్చుకుంటారు. ఇంట్లో భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ, ప్రేమగా సమయం గడుపుతుంటే పిల్లలు కూడా ప్రేమ, అనురాగాలు ఉన్న వాతావరణంలో పెరుగుతారు. ఇది వారిలో మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో వారు కూడా మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మార్పులను గ్రహించవచ్చు.. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, అలవాట్లు మారుతుంటాయి. పెళ్లి సమయానికి ఉన్న భాగస్వామి, కొన్నేళ్ల తర్వాత శారీరకంగా, మానసికంగా మారవచ్చు. తరచూ మాట్లాడుకోవడం వల్ల భాగస్వామిలో వస్తున్న మార్పులను, వారి కొత్త అవసరాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల జీవితంలో ఏ దశలోనైనా ఒకరికొకరు అండగా నిలబడటం తేలికవుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దాంపత్య జీవితానికి పునాది వంటిది. రోజూ కనీసం ఒక అర గంట పాటు ఫోన్లకు దూరంగా ఉండి,  మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే, ఎలాంటి సమస్యలనైనా సులభంగా దాటవచ్చు. ఎంత బిజీగా ఉన్నా భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మాత్రమే వైవాహిక బంధం సుదీర్ఘకాలం సంతోషంగా, ఆరోగ్యకరంగా సాగుతుంది.                      *రూపశ్రీ.  
ఉలవచారు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కానీ ఉలవలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు.. మన సంప్రదాయ ఆహార విధానంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నల్ల ఉలవలను ఆహారంగా ఎలా ఉపయోగించాలి? వాటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో 35 సంవత్సరాల ఆయుర్వేద అనుభవం ఉన్న Dr. Chittibhotla Madhusudhana Sharma గారు ఉలవల గురించి సులభమైన తెలుగులో వివరించారు. నల్ల, తెల్ల, ఎర్ర ఉలవల్లో ఉన్న తేడాలు, నల్ల ఉలవలను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు, ఉలవల్లో ఉండే పోషకాలు, ఫైబర్ జీర్ణక్రియకు ఎలా ఉపయోగపడుతుంది వంటి విషయాలను ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే ఉలవలు బరువు నియంత్రణకు ఉపయోగపడతాయా? రోజువారీ ఆహారంలో ఉలవలను ఎలా చేర్చుకోవాలి? ఉలవచారు లేదా ఇతర రూపాల్లో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవచ్చు? ఉలవలు తింటే కిడ్నీలో రాళ్లు కరుగుతాయనే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. మన వంటింట్లో సులభంగా లభించే ఉలవలను సరైన విధంగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వాటి పోషక విలువలను ఎలా పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. గమనిక: కిడ్నీలో రాళ్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఉలవలను ఏదైనా వ్యాధికి చికిత్సగా భావించి వైద్య చికిత్సను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రతిరోజూ ఉదయం ఉడకబెట్టిన గుడ్డు తినడం చాలామందికి అలవాటు. శారీరక బలానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోడిగుడ్డును అత్యంత చౌకైన , సమర్థవంతమైన ఆహారంగా నిపుణులు చెబుతుంటారు. అయితే  చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొనను మాత్రమే తిని, పచ్చసొనను తీసి పక్కన పడేస్తుంటారు. పచ్చసొన తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లేదా చెడు కొవ్వు పెరిగిపోతుందని, గుండె ఆరోగ్యానికి మంచిది కాదని, బరువు పెరుగుతారని రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు పచ్చసొన ఇస్తే అరగదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ కేవలం శాస్త్రీయ ఆధారం లేని అపోహలు మాత్రమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  నిజానికి గుడ్డులోని అసలైన పోషక నిధి పచ్చసొనలోనే దాగి ఉంటుంది. పచ్చసొనలో ఉన్న ముఖ్యమైన పోషకాలు , వాటి ప్రాముఖ్యత గుడ్డులోని సంపూర్ణ పోషక విలువలు మన శరీరానికి అందాలంటే పచ్చసొనను తీసివేయకుండా పూర్తిగా తినడం ఎంతో అవసరం. పచ్చసొనలో లభించే ప్రధానమైన పోషకాలు మన శరీరానికి ఏ విధంగా తోడ్పడతాయో వివరంగా తెలుసుకుంటే.. మెదడు అభివృద్ధికి.. గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే పోషక పదార్థం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది మెదడు సరైన రీతిలో పనిచేయడానికి , జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. విశేషమేమిటంటే, ఎదుగుతున్న చిన్న పిల్లలలో మెదడు వికాసానికి , నరాల వ్యవస్థ నిర్మాణానికి కోలిన్ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. నరాల బలానికి, రక్తకణాల తయారీకి విటమిన్ బి12.. పచ్చసొనలో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొత్త రక్తకణాలు తయారవ్వడానికి, శరీరం చురుగ్గా ఉండటానికి , నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. సాధారణంగా మనం తినే శాఖాహారంలో ఈ విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహార లోపాలను భర్తీ చేసుకోవడానికి గుడ్డు పచ్చసొన ఒక గొప్ప ఆహార మూలంగా పనిచేస్తుంది. కంటి చూపుకు, రోగనిరోధక శక్తికి విటమిన్ ఏ..  ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సాయపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, పలురకాల ఇన్ఫెక్షన్లు , వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరుకు సెలీనియం..  గుడ్డు పచ్చసొనలో సెలీనియం అనే ముఖ్యమైన ఖనిజ లవణం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి , శరీరంలో జీవక్రియల వేగాన్ని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్డును పూర్తిగా ఎందుకు తినాలి? గుడ్డు తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది, కానీ పచ్చసొనలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ , మేలైన పోషకాలన్నీ నిండి ఉంటాయి. కేవలం తెల్లసొన మాత్రమే తింటే గుడ్డు నుంచి వచ్చే పూర్తి పోషకాహార ప్రయోజనాలను మనం కోల్పోయినట్లే అవుతుంది. అందుకే అనవసరమైన భయాలు, అపోహలు పక్కన పెట్టి రోజువారీ ఆహారంలో గుడ్డును పచ్చసొనతో సహా పూర్తిగా తీసుకోవడం వల్ల  ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతుంది.                      *రూపశ్రీ.  
చేతులు వణకడం, కాళ్లలో బలహీనంగా అనిపించడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను చాలామంది సాధారణ నీరసంగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి నరాల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చు. నరాల బలహీనతకు కారణాలు ఏమిటి? నరాలపై ప్రభావం చూపించే సమస్యలు ఏంటి? చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి, వణుకు, బలహీనత ఎందుకు వస్తాయి? నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం, జీవనశైలి పాటించాలి? ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ నరాల బలహీనతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే నరాల ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ పద్ధతిలో అశ్వగంధ, వాము, దాల్చిన చెక్క, లవంగాలతో తయారు చేసుకునే చిట్కా గురించి కూడా తెలుసుకోవచ్చు. నరాల బలహీనత, నరాల నష్టం, తాత్కాలిక నీరసం మధ్య తేడా ఏమిటి? నరాలు దెబ్బతిన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నరాల ఆరోగ్యానికి మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎందుకు అవసరం? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నరాలకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. నరాల ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)