వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి, రాజకీయ విభేదాలు సమసిపోయేలా లేవు.  తాజాగా వైఎస్ కుటుంబం ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉందని ఆశించిన వైఎస్ అభిమానుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు.  సాధారణంగా  కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను పక్కన పెట్టి కుటుంబ వేడుకల్లో కలవడం కద్దు. అయితే..   వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో.. ఆ వివాహానికి హాజరు కాకుండా స్కిప్ చేయడానికా అన్నట్లు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, షర్మిల సోదరుడు అయిన జగన్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.  షర్మిల కుమార్తె వివాహం, జగన్ విదేశీ పర్యటన రెంటినీ బేరీజు వేస్తూ.. ఆ వివాహ వేడుకకు దేశంలోనే ఉండి హాజరు కాకపోతే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందన్న భావనతోనే జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు.   వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం డాక్టర్ సోమలా రఘురామ్ రెడ్డితో నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఏర్పాట్లలో భాగంగా షర్మిల తన కుమార్తెతో కలిసి కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్‌ను సందర్శించారు. అక్కడ దివంగత నేత వైఎస్సార్ సమాధి వద్ద  నివాళులు అర్పించి, తొలి వివాహ పత్రికను ఆయన పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు కోరారు. ఇక వివాహ పనులు కుటుంబ పరంగా ముమ్మరంగా సాగుతున్నాయి.  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లో,  సెప్టెంబర్ 25న బెంగళూరులో  వివాహ నిశ్చయ తాంబూలాలు, ఎంగేజ్‌మెంట్ వేడుకలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్ 25న వివాహం జరగనుంది. డిసెంబర్ 5న హైదరాబాద్‌లో   రిసెప్షన్ నిర్వహించనున్నారు. మరోవైపు, సరిగ్గా ఇదే సమయానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన కోసం సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. దాదాపుగా అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 మధ్య కాలంలో సుమారు 25 రోజుల పాటు యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు 15 రోజుల విదేశీ ట్రిప్ కు అనుమతి ఇచ్చింది. జగన్ విదేశీ పర్యటన షెడ్యూల్, షర్మిల కుమార్తె రిసెప్షన్, వివాహ తేదీలు క్లాష్ అయ్యేలా ఉండటం గమనార్హం. ఆ విషయమూ మరోసారి షర్మిల, జగన్ మధ్య విభేదాలు, ఆస్తుల పంచాయతీపై చర్చను తెరపైకి తెచ్చాయి.   స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.   వైఎస్ కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన వివాదాలు ప్రజల్లోనూ, మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా.. షర్మిల కుమార్తె వివాహం,  జగన్ విదేశీ పర్యటనకు సంబంధించిన తాజా పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.   [YS Sharmila, YS Jagan Mohan Reddy, Anjali Reddy Marriage, YS Family Disputes, Jagan Foriegn Tour, Telugu One]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో సారి విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి  యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఆయన  హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.  తన కుమార్తెల వద్దకు వెళ్లేందుకు, అలాగే కుటుంబంతో కలిసి యూరప్‌లో పర్యటంచే నిమిత్తం పాతిక రోజుల పాటు విదేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఆయన విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 1 నుంచి నవంబర్ 30 లోపు ఎప్పుడైనా 15 రోజుల పాటు యూరప్  పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే పలు షరతులు కూడా విధించింది.   అక్రమాస్తుల కేసులలో నిందితుడిగా ఉండటం,  ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉండటంతో, వైఎస్ జగన్  విదేశాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. కాగా కోర్టు జగన్ యూరప్ పర్యటనకు విధించిన షరతులు ఇలా ఉన్నాయి.  జగన్  యూరప్ పర్యటనకు బయలుదేరే ముందే పూర్తి పర్యటన షెడ్యూల్‌ను  సీబీఐ అధికారులకు  అందజేయాలి. అలాగే విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.   ప్రస్తుతం స్థానిక ఎన్నికల హడావుడి మరియు రాజకీయ పరిణామాల వేళ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.  [YS Jagan, CBI Court, Europe Tour, YCP, Andhra Pradesh News, Jagan Foreign Travel, Green Signal, Conditions Apply]
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023  అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.   2024 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే , కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, ఆయనపై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం (సెప్టెంబర్ 18) సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 23, 2024 నుంచే ఆయనపై అనర్హత వేటు వేసింది. అంటే ఆ రోజు నుంచే దానం నాగేందర్ తన  శాసనసభ్య సభ్యత్వాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో మార్చి 11, 2026న దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై వచ్చిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ వారికి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అల్లె మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది.  ఈ తీర్పుపై స్పందించిన దానం నాగేందర్ తాను సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు.  హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని, ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్తేమీ కాదనీ దానం పేర్కొన్నారు. ప్రజల మధ్యలోకి వెళ్లేందుకు, ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఏ క్షణమైనా మళ్లీ పోటీ చేసి ఘనవిజయం సాధిస్తానన్నారు.  అదలా ఉండగా, దానంపై అనర్హత వేటుతో   ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.   [Danam Nagender, Telangana High Court, MLA Disqualification, Khairatabad Bypoll, Anti Defection Law, BRS Congress News, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
సందీప్ కిషన్ వన్ మాన్ షో గా భావిస్తున్న' సిగ్మా' కి సౌత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందుకు ప్రధాన కారణం ఇళయ దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడు కావడమే అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. నిన్న నైట్  'సిగ్మా' ట్రైలర్ రిలీజై  సోషల్ మీడియాని ఊపేస్తోంది.  2 నిమిషాల 16 సెకన్ల విజువల్ వండర్, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలని ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది ట్రైలర్ ప్రారంభంలోనే కథా నేపధ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. సమాజంలో అందరిచేత ఒక లూజర్‌గా, ఫెయిల్యూర్‌గా ముద్ర వేయబడిన ఒక సాధారణ రేడియో జోకీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కథానాయకుడు సందీప్ కిషన్ తన జీవితంలో ఎదురైన అవమానాలను దాటుకుని, అండర్‌వర్ల్డ్ డ్రగ్ మాఫియా కింగ్‌పిన్ కొట్లపాటి వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్) సామ్రాజ్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్‌తో ఒక ప్రమాదకరమైన హైస్ట్‌కు శ్రీకారం చుడతాడు. జూదం, డ్రగ్స్, అక్రమ దందాల ప్రపంచంలో సాగే హై-స్టేక్స్ ట్రెజర్ హంట్ ఎపిసోడ్లు విజువల్‌గా నెక్స్ట్ లెవెల్‌లో డిజైన్ చేయబడ్డాయి. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాత్ర హీరోతో సాగే లవ్, హ్యూమర్, అడ్వెంచర్ సీన్స్‌లో కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.   ఇది కూడా చదవండి: ప్రేక్షకులు మరి అంత ఎర్రి ఎంగళప్పల్లా కనిపిస్తున్నారా:ఒక మాదిరిగా కూడా కాదా!  జేసన్ సంజయ్ తన తొలి సినిమాలోనే అత్యుత్తమ టేకింగ్, విజువల్ సెన్స్‌తో, ట్రెండీ పల్స్ పట్టుకుని మాస్ ప్లస్ క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా కథనాన్ని మలిచినట్టుగా అర్ధమవుతుంది.  సాంకేతికంగా ఈ సినిమా అత్యంత ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతీ యాక్షన్ ఫ్రేమ్‌కు ప్రాణం పోసింది. కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ ట్రైలర్‌ను అత్యంత వేగవంతంగా, థ్రిల్లింగ్‌గా మార్చాయి. రాజు సుందరం, శివ్ పండిట్, అన్బు దాసన్, యోగ్ జేపీ, షీలా రాజ్‌కుమార్ వంటి బలమైన తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 2, 2026న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.     లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించగా  తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తోంది. 'ఒక విషయాన్నీ సృష్టించడం ఎంత కష్టమో, దాన్ని కాపాడుకుంటూ ఉండటం అంత కంటే ఎక్కువ కష్టం' అనే పాయింట్  సిగ్మా కథ పుట్టుకకి కారణం.    మీకు నచ్చవచ్చు : మగవాళ్ల పీరియడ్స్ పై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు    [Sigma Trailer, jasan sanjay,  Sundeep Kishan, Faria Abdullah,  Lyca Productions, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]  
కామెడీ కింగ్ బ్రహ్మానందం ఫేమస్   డైలాగ్ ఒకటుంటుంది. మరి అంత ఎర్రి వెంగళప్ప లా కనిపిస్తున్నానా? ఒక మాదిరిగా కూడా కాదా అని.. ఇప్పుడు ఈ మాటని ఇటీవల రిలీజైన సినిమాలని చూసి ప్రేక్షకులు అనుకునే పరిస్థితి. అసలు ప్రస్తుతం నడుస్తున్న సినీ కాలం ఏంటి? కథ,కథనం, క్యారెక్టర్స్ డిజైన్ ఏ విధంగా ఉండాలో అనే విషయం కూడా మర్చిపోయి, మనం తీయాలసింది సినిమా, అది ఎలా తయారైతే మనకేంటి అన్నట్టుగా సినీ మేధావి ముసుగుని కప్పుకుంటున్నారు. దీంతో ప్రేక్షకులు మరీ అంత అమాయకులుగా, ఏది చూపించినా చూసేస్తారులే అనే భావనలో ఇండస్ట్రీలో  ఉందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  టికెట్ ధరలు వందల్లో ఉంటే, కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్తే వేల రూపాయిలు ఖర్చవుతున్న ఈ రోజుల్లో, కనీస నాణ్యత లేని సినిమాలు అందించడం క్షమించరాని నేరం. గడిచిన కొన్ని నెలల గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. దాదాపు 80% నుంచి 85% వరకు సినిమాలు మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమవుతున్నాయి.   ఒకప్పుడు సగటున ఒక సినిమాలో కనీసం 50% నుంచి 60% భాగం వినోదం లేదా ఉత్కంఠ ఉండేది. కానీ ఈ మధ్య వచ్చిన దాదాపు 10కి పైగా చిత్రాల్లో అసలు మొదటి 30 నిమిషాలు గడిచేసరికే ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రేక్షకుల తెలివితేటలు, వారి సినిమా పరిజ్ఞానం ఏ స్థాయికి చేరాయో మేకర్స్ గుర్తించకపోవడమే పెద్ద పొరపాటు. ఓటీటీల పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నంబర్ వన్ కంటెంట్‌ను అందరూ తమ ఇంట్లోనే చూస్తున్నారు. ప్రపంచ స్థాయి సినిమా మేకింగ్‌ను చూస్తున్న నేటి తరానికి, మన వద్ద పాతబడిపోయిన ఫార్ములా కథలను అందించడం విడ్డూరంగా మారింది.   ఇది కూడా చదవండి: మగవాళ్ళ పీరియడ్స్ పై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు: కారవాన్‌లో జరిగింది ఇదే! సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్, కలర్‌ఫుల్ పాటలు, నాలుగు ఫైట్లు మాత్రమే కాదు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుడి హృదయానికి హత్తుకోవాలి. కానీ 2026 ప్రారంభం నుండి విడుదలైన చాలా చిత్రాల్లో 90% సన్నివేశాలు కేవలం నిడివి పెంచడానికే పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. సరైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లేకుండా, స్క్రిప్ట్ స్టేజిలోనే సరిదిద్దుకోవాల్సిన వందలాది లోపాలను సరిదిద్దకుండా నేరుగా సెట్స్ పైకి వెళ్లడం వల్ల కోట్లాది రూపాయల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. కేవలం స్టార్ క్యాస్టింగ్ ఉంటే చాలు, ప్రమోషన్లతో ఐదు రోజుల పాటు జనాన్ని థియేటర్లకు రప్పించవచ్చు అనుకోవడం పొరపాటు. ప్రేక్షకుడి తెలివితేటలను తక్కువగా అంచనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రతి శుక్రవారం వస్తున్న బాక్సాఫీస్ లెక్కలే నిరూపిస్తున్నాయి. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు కళ్లు తెరిచి, కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే, థియేటర్ వ్యవస్థకే పెద్ద గండం పొంచి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే  అంటారు తెలివిగలవాడిని కనిపెట్టాలంటే అంతకంటే తెలివైన వాడు ఉండాలి అని. ఆ ఇద్దరే దర్శక, నిర్మాత. ఓల్డ్ డేస్ లో అత్యద్భుతమైన సినిమాలు రావడానికి,ఇప్పటికీ మనల్ని అలరిస్తూ ఉండటానికి పైన చెప్పుకున్న ఫార్ములానే కారణం. ఇప్పుడు అంతా నడుస్తుంది 'షో'.. అందుకే 'షో' నచ్చటం లేదు.   మీకు నచ్చవచ్చు : శ్రీకాంత్ ఓదెల ద్వీతీయ గండం దాటుతాడా!     [Telugu Movies Story Quality Decline, This Week Telugu Cinema Releases, telugu movie quality, tollywood box office, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]
  ఐరన్ లెగ్ స్థాయి నుంచి శృతి హాసన్ మా సినిమాలో ఉండేలా చూడు అని హీరోలు, హీరో అభిమానులు తమ ఇష్టదైవాల్ని ప్రార్ధించే స్థాయికి ఎదిగింది కమల్ డాటర్ శృతి హాసన్. సెల్యులాయిడ్ పై తన బొమ్మ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ బోల్డ్, స్ట్రయిట్ ఫార్వర్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల నటి సోహా అలీ ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్ టాక్ షో లో శ్రుతి హాసన్ పాల్గొంది.  అందులో ఆమె మాట్లాడుతు 'పీరియడ్స్ సమయంలో మహిళలు అనుభవించే శారీరక, మానసిక నరక ప్రాయమైన బాధను సమాజం మరియు చిత్రపరిశ్రమ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నాకు . 13 ఏళ్ల వయసులోనే మొదటిసారి నెలసరి వచ్చినప్పుడు మొదలైన తీవ్రమైన కడుపునొప్పి, సంవత్సరాల తరబడి వేధించింది. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నందున, పీరియడ్స్ వస్తే దాదాపు 12 రోజుల పాటు నరకం చూసేదాన్ని. స్కూల్ రోజుల్లో తీవ్రమైన నొప్పితో స్పృహతప్పి పడిపోవడం మరియు వాంతులు చేసుకోవడం నిత్యకృత్యంగా మారేది.   ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెల ద్వీతీయ గండం దాటుతాడా! ఆ  కడుపునొప్పి తట్టుకోలేక తరచుగా ఆసుపత్రికి పరుగెత్తి ఐవీ ఫ్లూయిడ్స్, స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సి వచ్చేదాన్ని. ఆ సమయంలో అనీమియాతో బాధపడుతూ బరువు తక్కువగా ఉండటం వల్ల పీరియడ్స్  శారీరకంగా ఎంతగానో బలహీనపరిచాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య మరింత జటిలమైంది.     షూటింగ్ సెట్స్‌లో తీవ్రమైన పీరియడ్ క్రాంప్స్ ఉన్నప్పటికీ డ్యాన్స్ సీన్లు, యాక్షన్ సీక్వెన్సులు చేయాల్సి వచ్చేదని, కారవాన్‌లోకి వెళ్లి వాంతులు చేసుకుని మళ్లీ వచ్చి కెమెరా ముందు నటించేదాన్ని. అసలు 'మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని నేను రోజుకు వేలసార్లు దేవుడిని కోరుకున్నాను. పురుషులకు కూడా పీరియడ్స్ వస్తేనే ఆ నొప్పి ఎలాంటిదో వారికి స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడైనా సినీ నటీమణుల, మహిళా ఉద్యోగుల పని కాంట్రాక్టులలో అధికారికంగా 'పీరియడ్ లీవ్స్' లేదా ప్రత్యేక సెలవుల నిబంధనని  చేరుస్తారని చెప్పుకొచ్చింది. కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ సేతుపతితో 'ట్రైన్' మరియు దుల్కర్ సల్మాన్‌తో పలు క్రేజీ ప్రాజెక్టులలో శ్రుతి ఫుల్ బిజీ.  మీకు నచ్చవచ్చు:అను ఇమ్మానియేల్ సంచలన నిర్ణయం: ఇలా జరుగుతుందని ఫ్యాన్స్ ఊహించలేదు!     [Shruti Haasan,  Bold Comments On Men Period Pain, PCOS Dysmenorrhea, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News}  
థియేటర్లలో ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య, ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో కూడా తన సునామీని కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన ఆయన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీలో అడుగుపెడుతూనే సరికొత్త చరిత్ర సృష్టించింది. మన దేశంలో నంబర్ వన్‌గా ట్రెండ్ అవ్వడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లీష్ సినిమాల విభాగంలో ఏకంగా గ్లోబల్ టాప్ 3లో నిలిచి సంచలనం సృష్టిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ వీకెండ్ లోనే 5.5 మిలియన్ వ్యూస్ సాధించింది. 2026లో ఒక సౌత్ ఇండియన్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సాధించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ఇది. 2024 తర్వాత ఒక తమిళ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో దక్కించుకున్న హయ్యెస్ట్ ఫస్ట్ వీకెండ్ వ్యూస్ రికార్డ్ కూడా కావడం విశేషం. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 4 దేశాల్లో నంబర్ 1 పొజిషన్‌లో, అలాగే 10కి పైగా దేశాల్లో టాప్ 10 జాబితాలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' దుమ్మురేపుతోంది. సూర్య మార్క్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, మమితా బైజు నటన, జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇది కూడా చదవండి: 'రాకా' స్టోరీ లీక్.. గ్లోబల్ మార్కెట్‌ను షేక్ చేయనున్న అల్లు అర్జున్.! ఇప్పటివరకు ఓటీటీల్లో యాక్షన్ సినిమాలే ఆధిపత్యం చెలాయిస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నెట్‌ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్‌పై ఇంతటి గ్లోబల్ ఇంపాక్ట్ చూపించడం ఇండియన్ సినిమాలోనే ఒక రేర్ ఫీట్ అని చెప్పవచ్చు. మీకు నచ్చవచ్చు: మువ్వలా నవ్వకలా.. ప్రభాస్ కెరీర్‌లో మళ్ళీ ఇలాంటి పాట రాదేమో.!       [Vishwanath and Sons Movie, Vishwanath and Sons Netflix, Vishwanath & Sons Netflix, Vishwanath and Sons OTT, Suriya Netflix, Mamitha Baiju, Venky Atluri, Telugu Film News, Telugu News]  
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'తుడక్కమ్'. జుడే ఆంథోని జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రముఖ నిర్మాత ఆంటోని పెరంబవూర్ కుమారుడు ఆశిష్ జో ఆంటోని కీలక పాత్రలో మెరిసారు. మోహన్ లాల్ అతిథి పాత్రలో కనిపించడం విశేషం. థియేటర్లలో రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక 'జియో హాట్‌స్టార్‌'లో తెలుగు ఆడియోతో సహా స్ట్రీమింగ్ అవుతోంది. రవి బాలచంద్రన్ (సాయికుమార్) వీల్ ఛైర్‌కే పరిమితమైన విలేజ్ ఆఫీసర్. ఆయన కూతురు మీను (విస్మయ మోహన్ లాల్). తల్లిలేని మీనును రవి చాలా గారాబంగా పెంచుతాడు. ఒకరోజు బ్యాంకు పరీక్ష రాయడానికి వెళ్లిన మీను, చీకటి పడినా తిరిగి ఇంటికి రాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి ఆందోళనకు గురవుతాడు.  ఆ రాత్రి బస్సులో ప్రయాణిస్తున్న మీను ప్రమాదకరమైన ఒక సైకో కిల్లర్‌తో గొడవపడాల్సి వస్తుంది. ఒకవైపు నిస్సహాయుడైన తండ్రి ఆందోళన, మరోవైపు కరడుగట్టిన హంతకుడి బారి నుండి రక్షించుకోవాల్సిన అమ్మాయి.. చివరికి మీను ఆ కిల్లర్ నుండి ఎలా బయటపడింది అనేది అసలు కథ. దర్శకుడు జుడే ఆంథోని జోసెఫ్ చాలా పరిమిత పాత్రలతో ఎంతో పట్టుగా కథనాన్ని నడిపించారు. నిస్సహాయుడైన తండ్రి భయం, సైకో కిల్లర్ క్రూరత్వం, ఆత్మరక్షణ కోసం పోరాడే అమ్మాయి ధైర్యం చుట్టూ సీన్స్ అన్నీ చాలా గ్రిప్పింగ్‌గా సాగుతాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేకుండా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.  ముఖ్యంగా సినిమాలో విలన్ పాత్రను డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. దాదాపు సినిమా మొత్తం ఎటువంటి డైలాగ్స్ లేకుండా, కేవలం హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తోనే తీవ్రమైన భయాన్ని కలిగిస్తుంది ఆ పాత్ర. ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తాయి. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జోమన్ జాన్ ఛాయాగ్రహణం ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. ఇది కూడా చదవండి: రాకా స్టోరీ లీక్: గ్లోబల్ మార్కెట్‌ను షేక్ చేయనున్న అల్లు అర్జున్ నటీనటుల విషయానికి వస్తే, మొదటి సినిమానే అయినప్పటికీ విస్మయ మోహన్ లాల్ తన నటనతో, యాక్షన్ సీక్వెన్సులతో ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో సాయికుమార్ నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆశిష్ జో ఆంటోని కూడా తన పరిధి మేర బాగా చేశారు. మోహన్ లాల్ కాసేపు కనిపించినా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. ప్రస్తుత సమాజంలో అమ్మాయిల భద్రత ఎంత ముఖ్యమో చెబుతూ, వారికి ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ఎంత అవసరమో సందేశాత్మకంగా చూపించారు. అనవసరమైన ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్‌గా సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి 'తుడక్కమ్' ఒక మంచి ఛాయిస్. మీకు నచ్చవచ్చు: నా మొగుడికి వంట చేసి పెడతావా? రోజాపై ఫైర్ అయిన నాంచారి.!       [Thudakkam Review Telugu, Thudakkam OTT Review JioHotstar, Vismaya Mohanlal Debut Movie, Jude Anthany Joseph Thudakkam, Thudakkam Movie Telugu Rating]
ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్) బరిలో మన దేశం తరఫున నిలిచే అధికారిక ఎంట్రీ ఖరారైంది. 99వ ఆస్కార్ వేడుకలకు సంబంధించి 'ఉత్తమ అంతర్జాతీయ చిత్రం' (Best International Feature Film) కేటగిరీలో మరాఠీ చిత్రం 'గోంధళ్'ను భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) అధికారికంగా ధ్రువీకరించింది. మహారాష్ట్రకు చెందిన విశిష్ట సంప్రదాయ జానపద కళారూపమైన 'గోంధళ్' నేపథ్యంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సంగీతం, నృత్యం, పౌరాణిక కథాంశాల కలనేతగా సాగే ఈ సంప్రదాయ ప్రదర్శనను దర్శకుడు సంతోష్ దవాఖర్ అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు.  ఈ చిత్రంలో కిశోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేశ్ సోహోని తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచేందుకు భారతీయ సినిమా పరిశ్రమ నుంచి ఏకంగా 33 సినిమాలు పోటీపడ్డాయి. దిల్జిత్ దోసాంజ్ నటించిన 'మై వాపస్ ఆవూంగా', భారీ యాక్షన్ డ్రామా 'బోర్డర్ 2', రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' వంటి ఎన్నో క్రేజీ చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.  ఇది కూడా చదవండి: ఓటీటీలోనూ అదే జోరు.. 'ఇరుముడి'కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న మూవీ ల‌వ‌ర్స్‌.! అయితే, కమర్షియల్ హంగుల కంటే కథలోని నేటివిటీ, సాంస్కృతిక ప్రాధాన్యతకే జ్యూరీ ప్రాధాన్యమిచ్చి 'గోంధళ్'ను ఎంపిక చేసింది. మరాఠీ చిత్రసీమకు ఇది మరొక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. గతంలో 'శ్వాస్', 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ', 'కోర్ట్' వంటి సినిమాలు ఆస్కార్ బరిలో భారత్ తరఫున పోటీపడగా, ఆ ఘనత సాధించిన నాలుగో మరాఠీ చిత్రంగా 'గోంధళ్' రికార్డుల్లోకెక్కింది.  గతేడాది 98వ ఆస్కార్ వేడుకల్లో నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన 'హోమ్‌బౌండ్' టాప్-15 షార్ట్‌లిస్ట్‌ వరకు వెళ్లి దేశానికి మంచి గుర్తింపు తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో సినీ ప్రియులు, విమర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  భారీ బడ్జెట్ సినిమాలను కాదని, మన దేశీ కళారూపాలకు అద్దం పట్టే కథను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ 'గోంధళ్' చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక 99వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం 2027 మార్చి 14న లాస్ ఏంజిల్స్‌లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరగనుంది.  వీటికి సంబంధించిన అధికారిక నామినేషన్లను 2027 జనవరి 21న వెల్లడించనుండగా, ఈసారి 'గోంధళ్' చిత్రం తుది నామినేషన్ల రేసులో నిలిచి గ్లోబల్ వేదికపై మెరుస్తుందో లేదో చూడాలి. మీకు నచ్చవచ్చు: ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకి భారీ నష్టాలు మిగిల్చిన టాప్ సినిమాలు ఇవే!     [Gondhal Marathi Movie, Oscars 2027 India Official Entry, Academy Awards Best International Film, Santosh Davakhar Gondhal, Marathi Cinema Oscars Entry]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రెజెంట్ చేస్తున్న లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'హతః'. తాజాగా ఈ సినిమా అఫీషియల్ టీజర్ విడుదలయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం ఒక్క నిమిషం పదిహేడు సెకన్ల వ్యవధి ఉన్న ఈ టీజర్ చూస్తుంటేనే హార్రర్, మిస్టరీ, అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. టీజర్ ప్రారంభంలోనే "ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. ఏంటిదంతా?" అంటూ ఒక వాయిస్ ఓవర్‌తో వాతావరణం అంతా చాలా సీరియస్‌గా మారిపోతుంది. దానికి తోడు సీనియర్ యాక్టర్ రెహమాన్ గంభీరమైన గొంతుతో "దేవుడు ఉన్నాడంటే నమ్ముతావా?" అని అడిగే ప్రశ్నకు, "నేను నీకు పూర్తి నిజం చెప్పినా.. నన్ను ఒక పిచ్చివాడిలా చూస్తావ్" అంటూ వినిపించే సంభాషణలు సినిమాలోని అసలైన మిస్టరీకి అద్దం పడుతున్నాయి. చీకటి వాతావరణం, మంచు కురుస్తున్న అడవులు, నీటిలో తేలుతున్న మనుషులు, రక్తంతో మెరిసే రహస్య సంకేతాలు, అకస్మాత్తుగా దాడి చేసే వింత జీవి.. ప్రతీ ఫ్రేమ్ కూడా ప్రేక్షకుడిని కుర్చీ అంచున కూర్చోబెట్టేలా డిజైన్ చేశారు. ఈ సినిమాలో రెహమాన్, కుష్లు, తనూజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనూష్ గోరక్ ఈ చిత్రానికి రచయితగా, సినిమాటోగ్రాఫర్‌గా, దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. ఇక జెసిన్ జార్జ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని ప్రతీ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.  ఇది కూడా చదవండి: నాని బాక్సాఫీస్ తాండవం.. ఓవర్సీస్‌లో ‘ప్యారడైజ్’ ర్యాంపేజ్.! KA ప్రొడక్షన్స్, పౌర్ణమి బ్యానర్లపై శివ శంకర్ నాయుడు వై, కిరణ్ అబ్బవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు. మీకు నచ్చవచ్చు: ట్రిపుల్ రోల్ కింగ్.. టాలీవుడ్‌లో తోపు యాక్టర్ ఎవరు?       [HATAH Teaser Review, Hatah Movie Telugu, HATAH Teaser, Kiran Abbavaram, Anush Gorak, Rahman, Telugu Film News, Telugu News]  
Hatah is the new movie produced by Kiran Abbavaram with Rehman, Kushlu Maddala, Namritha M.V., Tanuja Puttuswamy in leading roles. The movie teaser has been unveiled today with an interesting concept about a Monster attacking on a city. Using this concept Anush Gorak is debuting as a director.  He is said to be brother of Rahasya Gorak, wife of Kiran Abbavaram. He also handled cinematography for the film with Jecin George composing music. Kiran Abbavaram, Y. Shivashankar Naidu are producing the film with Vineela Sahithya, Kushlu as co-producers.  The teaser showcases everyone being afraid by this monster attack. They are unable to crack the real danger behind it all and they are all confused what evoke it. The shot division and quality of visuals is good exciting audiences to watch the film. It looks to have been handled very carefully in found footage style.  Makers have locked Diwali, 6th November release and content looks interesting from this teaser. We have to wait and see, how the film translates on the big screens.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మానవ శరీరం అత్యంత సంక్లిష్టమైనది, అందులోనూ మెదడు మరింత అద్భుతమైన నిర్మాణంతో కూడుకున్నది. శతాబ్దాలుగా వైద్య ప్రపంచం మరియు సైన్స్ రంగం మానవ మెదడును ఒకే రకమైన మూల కణ సమూహం నుండి ఉద్భవించిన ఒకే అవయవంగా భావిస్తూ వచ్చాయి. అంటే పిండం అభివృద్ధి చెందే ప్రాథమిక దశలోనే ఒకే మూలం నుంచి మెదడులోని వివిధ భాగాలు రూపుదిద్దుకుంటాయని విశ్వసించారు. అయితే అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా పరిశోధన ఈ పాత నమ్మకాలను పూర్తిగా తిరగరాస్తోంది. మానవ మెదడు ఒకే మూలం నుండి కాకుండా, రెండు వేర్వేరు కణ సమూహాల నుంచి స్వతంత్రంగా ఆవిర్భవించిందని ఈ సంచలన అధ్యయనంలో తేలింది. స్టాన్‌ఫోర్డ్ డెవలప్‌మెంటల్ బయోలాజికల్ రీసెర్చర్ మరియు ఈ అధ్యయన సీనియర్ రచయిత కైల్ లోహ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ కొత్త విషయాన్ని ప్రపంచానికి వెల్లడించింది. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 500 మిలియన్ సంవత్సరాల క్రితమే స్వతంత్రంగా అభివృద్ధి చెందిన రెండు వేర్వేరు కణ వ్యవస్థల కలయిక ద్వారా మన మెదడు రూపుదిద్దుకుంది. మానవ మెదడును సాధారణంగా పూర్వ మెదడు, మధ్య మెదడు, పశ్చాత్ మెదడు అనే మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజిస్తారు. భాష, తార్కిక ఆలోచన, చైతన్యం, అమూర్త ఆలోచనల వంటి సంక్లిష్టమైన సామర్థ్యాలకు పూర్వ మెదడు కేంద్రంగా నిలుస్తుంది. మరోవైపు శ్వాస తీసుకోవడం, హృదయ స్పందనలు, నిద్ర, ఆకలి వంటి ప్రాథమిక జీవక్రియలతో పాటు ముఖ కదలికలు, మాట్లాడటం, మింగడం వంటి కార్యకలాపాలను పశ్చాత్ మెదడు నియంత్రిస్తుంది. పిండం అభివృద్ధి చెందే ప్రారంభ దశలోనే పూర్వ మెదడు మరియు పశ్చాత్ మెదడు ప్రాంతాలు రెండు వేర్వేరు అభివృద్ధి మార్గాలను అనుసరిస్తాయని ఈ అధ్యయనంలో గుర్తించారు. మెదడు వెనుక భాగంతో పోలిస్తే ముందు భాగం పూర్తిగా భిన్నమైన మూల కణ సమూహం నుండి ఉద్భవిస్తుందని ప్రయోగాత్మకంగా నిరూపించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ విభజన కేవలం మానవులకే పరిమితం కాలేదని, కోళ్లు, జీబ్రాఫిష్, ఏకార్న్ వార్మ్స్ వంటి ఇతర ప్రాణుల జీవ పరిణామ క్రమంలో కూడా ఇదే రెండు భాగాల అభివృద్ధి నమూనా స్పష్టంగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని బట్టి ఈ పరిణామ ప్రక్రియ జీవుల చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైనదని స్పష్టమవుతోంది. వైద్య వైజ్ఞానిక రంగానికి ఈ ఆవిష్కరణ ఒక గొప్ప మైలురాయిగా మారనుంది.  ప్రయోగశాలల్లో మానవ పశ్చాత్ మెదడు కణాలను కృత్రిమంగా పెంచడం శాస్త్రవేత్తలకు ఎంతో కష్టతరంగా ఉండేది. కానీ ఈ కొత్త అవగాహన సహాయంతో స్టాన్‌ఫోర్డ్ పరిశోధకుల బృందం మూలకణాల నుంచి విజయవంతంగా హిండ్ బ్రెయిన్ మోటార్ న్యూరాన్లను రూపొందించింది. ప్రయోగశాలలో రూపుదిద్దుకున్న ఈ న్యూరాన్లు విద్యుత్ క్రియాశీలతను ప్రదర్శించడమే కాకుండా, ముఖం మరియు మింగే కండరాలను నియంత్రించే ప్రత్యేక ప్రోటీన్లను కూడా ఉత్పత్తి చేశాయి. ఈ విప్లవాత్మక ఫలితాలు రాబోయే రోజుల్లో మోటార్ న్యూరాన్ వ్యాధులైన అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ (ALS), స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) వంటి తీవ్రమైన నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో కొత్త వెలుగులు నింపనున్నాయి. ప్రయోగశాలలో నాడీ కణాలను సృష్టించి, వ్యాధి బారిన పడినప్పుడు కణాలు ఎలా దెబ్బతింటున్నాయో నిశితంగా పరిశీలించడానికి ఇది దోహదపడుతుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో నూతన ఔషధాలు, జీన్ థెరపీలను విజయవంతంగా పరీక్షించే అవకాశం కలుగుతుంది. రానున్న రోజుల్లో వెన్నుపాముతో పాటు నాడీ వ్యవస్థలోని ఇతర భాగాలకు కూడా ఇలాంటి ప్రాచీన అభివృద్ధి మూలాలు ఉన్నాయా అనే కోణంలో శాస్త్రవేత్తలు మరిన్ని విస్తృత పరిశోధనలు నిర్వహించనున్నారు.     [ Human Brain, Brain Development, Stanford University, Stem Cells, Kyle Loh, Forebrain, Hindbrain, Motor Neurons, ALS, Spinal Muscular Atrophy ]
మన చిన్నతనంలో అమ్మమ్మలు, నాయనమ్మలు చేతులతో స్వయంగా చేసిన వంటల రుచి, ఆ సువాసనలు ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతాయి. మైదా పిండి, నీళ్లతో పిండి కలిపి, క్షణాల్లో సన్నని రవ్వలాంటి సేమియాను తమ చేతులతోనే తయారుచేసి, పెద్ద పెద్ద పళ్లెంలో వేసి తిరిగే పంఖా కింద ఆరబెట్టే ఆ దృశ్యాలు ఇప్పటి తరానికి ఒక అపురూపమైన జ్ఞాపకం. కానీ, ఆ చేతివంట నేర్చుకోకపోవడం వల్ల, ఆ తరం మనల్ని విడిచివెళ్లాక ఆ ప్రాచీన రుచులు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోతున్నాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో, మన సాంప్రదాయ వంటల వారసత్వాన్ని, కుటుంబ మూలాలను కాపాడుకునేందుకు కొత్త తరం ఒక గొప్ప ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఆహారం అంటే కేవలం కడుపు నింపుకునే తిండి మాత్రమే కాదు, అది మన బాల్యంతో, మన సంస్కృతితో, మన మూలాలతో అనుసంధానమైన ఒక బలమైన జ్ఞాపకం. ముంబైకి చెందిన ప్రసిద్ధ ఆహార చరిత్రకారుడు కురుష్ దలాల్ ప్రకారం, ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ తగ్గుముఖం పట్టి, చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిన తర్వాతే ప్రజలు తమ సాంప్రదాయ వంటలను, ఇంటి రుచులను ఎంతగానో మిస్ అవుతున్నారు. పూర్వకాలంలో వంటల చరిత్రను, సాంప్రదాయాలను కాపాడే బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. అయితే, గత 10 ఏళ్లలో పురుషులు కూడా వంటింట్లోకి అడుగుపెట్టి, కాలగర్భంలో కలిసిపోతున్న తమ కుటుంబ సాంప్రదాయ వంటకాలను వెతికి మరీ నేర్చుకోవడం గమనార్హం. NRIలు సైతం భారతదేశానికి వచ్చినప్పుడు పాతకాలపు పార్శీ వంటకాలైన చోరా మా పాయా, వాల్, మసూర్ మా జీబ్ వంటి అరుదైన వంటకాలను అడిగి మరీ చేయించుకుని తింటున్నారంటే ప్రాచీన రుచులపై ఉన్న మక్కువ అర్థమవుతుంది. సాహిత్యం మరియు ఆహారాన్ని జోడిస్తూ బెంగళూరులో ప్రారంభమైన  ఫ్రమ్ వర్డ్స్ టు వోక్  అనే ఫుడ్-ఇన్-లిటరేచర్ క్లబ్ కేవలం 3 మంది సభ్యులతో ప్రారంభమై, నేడు 100 మందికి పైగా సభ్యులతో అలకరిస్తోంది. ప్రతీ నెలా శనివారం కలిసే ఈ క్లబ్ సభ్యులు పుస్తక పఠనం ద్వారా ఆహారానికి, సంస్కృతికి, వలసలకు, ఆకలికి మధ్య ఉన్న బంధాన్ని చర్చించుకుంటారు. మరోవైపు,  నివాలా  అనే క్యులినరీ హెరిటేజ్ ప్లాట్‌ఫారమ్‌ను స్థాపించిన శ్రుతి తన తల్లిని కోల్పోయిన తర్వాత ఈ అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఒక తరం నుండి మరొక తరానికి వంటకాలు అందించే ప్రక్రియలో ఇప్పటికే 30% నుండి 40% వరకు సాంప్రదాయ వంటకాల జ్ఞానం నశించిపోయిందని ఆమె గణాంకాలు చెబుతున్నాయి. ఈ విలువైన వంటల వారసత్వాన్ని కాపాడుకోవడానికి నివాలా ఒక సరికొత్త మార్గాన్ని కనుగొంది. వారు క్యూఆర్ కోడ్‌లు (QR Codes) కలిగిన డిజిటల్ మరియు ప్రింటెడ్ రెసిపీ పుస్తకాలను రూపొందిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే మన అమ్మమ్మలు లేదా నాయనమ్మలు ఆ వంటకాన్ని తమ సొంత గొంతుతో ఎలా చేయాలో వివరించే ఆడియో రికార్డింగ్ వినబడుతుంది. ఇది కేవలం వంట విధానం మాత్రమే కాదు, మన పెద్దల గొంతును, వారి ప్రేమను కలకాలం దాచుకునే ఒక భావోద్వేగ కానుక. వీరు ప్రచురించిన  మెమోరీస్ ఆన్ ఎ ప్లేట్  అనే పుస్తకానికి 2024 లో ప్రతిష్టాత్మక  గుర్మాండ్ వరల్డ్ కుక్‌బుక్ అవార్డు  (Gourmand World Cookbook Award) లభించింది. మీ ఇంట్లో కూడా తరతరాల నాటి వంటింటి జ్ఞాపకాలను కాపాడుకోవడానికి 6 సులువైన మార్గాలు ఉన్నాయి. మొదటిది, తాతయ్యలు, అమ్మమ్మల పేర్లు చెక్కిన పాతకాలపు కంచాలు, రాగి లేదా ఇత్తడి పాత్రలను భద్రపరుచుకోవడం. రెండవది, రోలు, పప్పు గుత్తి, చెక్క పూరీ పీట వంటి ప్రాచీన వంటింటి పరికరాలను ఫొటోలు తీసి వాటి వెనుక ఉన్న కథను రాసిపెట్టుకోవడం. మూడవది, మన పెద్దలు స్పూన్లు, గ్రాములలో కాకుండా  పిడికెడు ,  చిటికెడు  అంటూ చెప్పే అంచనా కొలతలను సరిగ్గా అర్థం చేసుకుని రికార్డ్ చేయడం. నాల్గవది, అమ్మమ్మ లేదా నాయనమ్మ వంట చేసేటప్పుడు వారి స్వరంలోనే కనీసం 30 సెకన్ల ఆడియో రికార్డ్ చేసుకోవడం. ఐదవది, తరతరాలుగా వస్తున్న ఇంట్లోనే చేసుకునే మూలికా వైద్యాన్ని, చిట్కాలను రాసి పెట్టుకోవడం. ఆరవది, వంటల తయారీలో వాడే ప్రాంతీయ పదాలను, భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవడం. కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచంలో మనుషుల జీవితాల అనిశ్చితిని గ్రహించిన చాలామంది, తమ ఇంట్లోని చివరి తరం పెద్దల వద్ద ఉన్న ఈ అమూల్యమైన రుచుల జ్ఞానాన్ని కాపాడుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు.     [ Traditional Indian Recipes, Culinary Heritage, Family Recipes, Food History, Grandmother Recipes, Parsi Cuisine, Nivala, From Words to Wok, Memories on a Plate, Gourmand World Cookbook Award ]
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఉదయాన్నే టిఫిన్ వండుకోవడానికి సమయం సరిపోక చాలామంది ఒక అరటిపండుతో తమ రోజును ముగించేస్తుంటారు. చవకగా లభించడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందనే భావనతో పరగడుపున అరటిపండు తినడం ఎంతోమందికి ఒక రోజువారీ అలవాటుగా మారిపోయింది. పొటాషియం, విటమిన్లు, ఫైబర్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండే అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనేది ఎంత నిజమో, దానిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనేది కూడా అంతే పచ్చి నిజం. పరగడుపున అరటిపండు తింటే శరీరంలో అసలు ఏం జరుగుతుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలు మరియు దాగి ఉన్న ప్రమాదాల గురించి పోషకాహార నిపుణులు వెల్లడించిన అనేక ఆసక్తికర విషయాలను ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా ఒక మీడియం సైజ్ అరటిపండులో దాదాపు 98 కేలరీలు మరియు 4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. ఉదయాన్నే దీనిని తీసుకున్నప్పుడు ఇందులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజమైన చక్కెరలు శరీరానికి వెంటనే అపరిమితమైన శక్తిని అందిస్తాయి. అలాగే అరటిలోని కరిగే పీచు పదార్థమైన పెక్టిన్ పేగుల పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ, ఇవన్నీ అరటిపండును ఇతర ఆహారాలతో కలిపి తిన్నప్పుడే సాధ్యమవుతాయి. కేవలం అరటిపండును మాత్రమే ఖాళీ కడుపుతో తీసుకుంటే, అందులోని చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా విపరీతంగా పెంచేస్తాయి. దీనిని అదుపు చేయడానికి శరీరం అధిక మొత్తంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా కొద్దిసేపటికే బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పడిపోయి, విపరీతమైన నీరసం, అలసట మరియు కడుపులో మళ్లీ ఆకలి భావన మొదలవుతాయి. మరొక ప్రధానమైన ప్రమాదం ఏమిటంటే, అరటిపండులో మెగ్నీషియం మరియు పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో అరటిపండు తిన్నప్పుడు రక్తంలో మెగ్నీషియం శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇది శరీరంలో ఉండే క్యాల్షియం మరియు మెగ్నీషియం సమతుల్యతను దెబ్బతీసి గుండెపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా అరటిపండులో ఉండే సహజ ఆమ్లత్వం వల్ల సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ మరియు కడుపులో మంట వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం) బాధిత ప్రజలు, అసిడిటీ సమస్యతో సతమతమయ్యేవారు మరియు బరువు తగ్గాలని చూస్తున్నవారు పొరపాటున కూడా ఉదయాన్నే పరగడుపున అరటిపండు తినకూడదు. అలా అని అరటిపండు తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, దానిని తినే విధానాన్ని మార్చుకుంటే చాలు. ఉదయాన్నే అరటిపండు తినాలనుకునేవారు దానిని ఎప్పుడూ ఒంటరిగా తీసుకోకూడదు. ఓట్ మీల్, గోరువెచ్చని పాలు, పెరుగు లేదా బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, ఫైబర్ తో పాటు నట్స్ లోని ప్రొటీన్లు, మంచి కొవ్వులు శరీరానికి సమతుల్యంగా అంది బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. లేదా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ పూర్తయిన తర్వాత లేదా మధ్యాహ్నం వేళలో అరటిపండు తీసుకోవడం అత్యంత సురక్షితమైన పద్ధతి. రోజువారీగా 1 నుంచి 2 అరటిపండ్లను సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.     [ Banana, Empty Stomach, Banana Benefits, Blood Sugar, Insulin, Potassium, Magnesium, Digestive Health, Diabetes, Healthy Breakfast ]
ఎర్ర గోంగూర.. కేవలం తెలుగు రాష్ట్రాల రుచుల్లోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిచుకుంది. ఆకుకూరల్లో గోంగూరకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూరలో ఆరోగ్య గుణాలు, పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది దీని పులుపుదనం వల్ల లేదా పులుపు ఎక్కువైతే ఏమన్నా సమస్యలు వస్తాయేమోనని కాస్త దూరంగా ఉంటారు. కానీ, ఎర్ర గోంగూర రోజూ లేదా వారానికి రెండు మూడు సార్లు తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. అసలు ఎర్ర గోంగూరలో  ఉండే పోషకాలు ఏమిటి? ఎర్ర గోంగూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకుంటే ఎర్ర గోంగూరను అస్సలు వదిలిపెట్టరు.  ఎర్ర గోంగూర గురించి వివరంగా తెలుసుకుంటే.. ఎర్ర గోంగూర అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రక్తహీనతకు చెక్ పెడుతుంది:  నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. ఎర్ర గోంగూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఎర్ర గోంగూర ఒక సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది:  వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు సహజంగా వస్తుంటాయి. ఎర్ర గోంగూరలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఎముకలను దృఢంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. చిన్నపిల్లల పెరుగుదలకు, ఎముకల ఎదగడానికి ఇది చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:  ఎర్ర గోంగూరలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును వేగవంతం చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, పేగుల్లో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:  ఈ ఆకుకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినందిస్తుంది. కంటి చూపు పెరిగేందుకు దోహదం చేస్తుంది:  ఎర్ర గోంగూరలో విటమిన్ ఏ తగినంత ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రేచీకటి, కళ్ళు పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తూ, దృష్టి లోపాలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి రక్షణ:  ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నిరోధించడంలో ఎర్ర గోంగూర  కీలకంగా పనిచేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు:  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలు పడకుండా చూడటానికి ఇది దోహదపడుతుంది. అలాగే తలకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి:  ఎర్ర గోంగూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న ఎర్ర గోంగూరను  దైనందిన ఆహారంలో పప్పు రూపంలోనో, పచ్చడి రూపంలోనో లేదా ఇతర కూరల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.                       *రూపశ్రీ.  
మన చుట్టూ ఎక్కడ చూసినా కనిపించే కొన్ని మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో కుప్పింటాకుకూడా ఒకటి. దీనినిపిప్పింటాకు, మురిపిండి, హరిత మంజరివంటి పేర్లతో కూడా పిలుస్తారు.  శాస్త్రీయంగా దీనిని Acalypha indica అంటారు. కుప్పింటాకును మన సంప్రదాయ వైద్య విధానాల్లో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగాపిప్పి పన్ను నొప్పి, పంటి సమస్యలు, గజ్జి, దురద, తామర వంటి చర్మ సమస్యలకు సంప్రదాయంగా ఉపయోగించే విధానాల గురించి ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరిస్తున్నారు. కుప్పింటాకు మొక్కలోని ఆకులు, వేర్లు తదితర భాగాలను వివిధ సంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగించినట్లు సమాచారం ఉంది. అయితే ఏ ఆరోగ్య సమస్యకైనా స్వయంగా చికిత్స చేసుకోవడం కాకుండా, సరైన వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కుప్పింటాకు మొక్కను ఎలా గుర్తించాలి? పిప్పి పన్ను నొప్పి, చర్మ సమస్యల వంటి వాటికి దీనిని సంప్రదాయంగా ఎలా ఉపయోగిస్తారు? ఈ ఆకు వల్ల చెప్పుకునే ఇతర ప్రయోజనాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)