ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది.  ఈ విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసే దిశగా  నాంపల్లి సీబీఐ కోర్టు ఈ మేరకు  ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు జగన్ తో పాటు  మిగిలిన నిందితులందరినీ కూడా స్వయంగా కోర్టు ముందుకు తీసుకురావాలని కోర్టు స్పష్టం చేసింది. జగన్ సహా మొత్తం 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించేలా ఈ ప్రక్రియ సాగుతుందని విస్పష్టంగా పేర్కొంది.  గతంలో ఈ కేసుల విచారణ నెమ్మదిగా సాగుతోందన్న కోణంలో విచారణను రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతూ ఈడీ  కోర్టును  ఆశ్రయించిన విషయం తెలిసిందే.  దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల విచారణ త్వరగా ముగించి స్పష్టత తీసుకురావాలని ఈడీ ఆ పిటిషన్‌లో కోరింది. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సీబీఐ ప్రత్యేక కోర్టు,   రోజువారీ విచారణను పట్టాలెక్కించింది. ఈ కేసుల్లో ఉన్న నిందితుల సంఖ్య పెద్దది కావడం, అలాగే దాఖలైన చార్జ్‌షీట్లు, పత్రాల పరిమాణం విస్తృతంగా ఉండటంతో న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు   వాయిదాలు, మినహాయింపులతో కాలయాపన జరుగుతోందన్న అభిప్రాయాలకు చెక్ పెడుతూ, ధర్మాసనం స్వయంగా అందరినీ ప్రత్యక్షంగా విచారించేందుకు సిద్ధమైంది. అక్రమాస్తుల కేసులకు సంబంధించి గత కొన్నేళ్లుగా సీబీఐ, ఈడీ  దాఖలు చేసిన పలు చార్జ్‌షీట్లపై విచారణ కొనసాగుతోంది.  కోర్టు నిర్ణయం నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర రాజకీయ నాయకులు స్వయంగా రోజు వారీ విచారణకు కోర్టుకు హాజరు కాకతప్పని అనివార్యత ఏర్పడింది.  రోజువారీ విచారణతో ఇప్పటివరకు వాయిదాల మీదే నడుస్తున్న ఈ కేసుల  పురోగతి వేగం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి  ఈ పరిణామాల నేపథ్యంలో నిందితులుగా ఉన్న వారు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా లేదా నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం రోజువారీ హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రతిరోజూ కోర్టు విచారణ సజావుగా సాగితే, ఈ కేసుల్లో తీర్పుల ప్రక్రియ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.  [CBI Court Shok Jagan, YS Jagan Mohan Reddy, CBI Special Court Nampally, Disproportionate Assets Case, Enforcement Directorate, Telugu One]
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.  వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.   వివేకా హత్యకు ముందు,  తర్వాత  పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు,  నిధుల బదిలీలు జరిగాయన్న అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే.  వివేకా హత్య కోసం  40 కోట్ల  రూపాయల డీల్ కుదిరిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం..  ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల ఆర్థిక మూలాలను గుర్తించేందుకు ఈడీ దర్యాప్తు చేస్తున్నది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దాఖలు చేసిన చార్జిషీట్లలోని కీలక అంశాల ఆధారంగా ఈడీ ముందుకు సాగుతున్నది.  ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులను, సాక్ష్యులు, అప్రూవర్ లను ఈడీ విచారించింది.  గత కొన్నేళ్లుగా జరిగిన బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్‌లపై ఫోకస్ పెట్టింది.  గతంలో ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌,   కడప తదితర ప్రాంతాల్లో ఈడీ బృందాలు విస్తృత సోదాలు నిర్వహించాయి. ఆ తనిఖీల్లో   కీలక పత్రాలు, డిజిటల్  ఆధారాలు,  లెక్కల్లో చూపని నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది.   ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈడీ విచారణకు పిలిచి విచారించడం సంచలనం సృష్టిస్తున్నది.   అవినాశ్ రెడ్డి విచారణ ద్వారా సేకరించిన సమాచారాన్ని గతంలో సేకరించిన ఆధారాలతో సరిపోల్చి చూసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో మరి కొందరు ప్రముఖులను కూడా ఈడీ విచారణకు పిలిచే అవకాశాలున్నాయని సమాచారం.    [ED Interrogate YS Avinash Reddy,  ED Investigation, YS Vivekananda Reddy Murder Case, Money Laundering Probe, YCP MP Avinash Reddy, ED Interrogation Viveka Case, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  కీలక పరిణామానికి విజయవాడ వేదిక కానుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న  మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన బుధవారం (అక్టోబర్ 14) జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.   ఇటీవల వంగవీటి రాధా.. పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీల తర్వాత ఆయన పార్టీ మార్పుపై ప్రచారం జోరందుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వంగవీటి రాధా పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.   ముఖ్యంగా, విజయవాడ మేయర్ పీఠం అన్‌రిజర్వ్డ్ జనరల్‌గా కేటాయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంటోందని అంటున్నారు. తెలుగుదేశంకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా  విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉండటంతో.. ఆ పార్టీ తరఫున వంగవీటి రాధా లేదా ఆయన భార్య పుష్పవల్లిని బరిలోకి దింపాలని తెలుగుదేశం, జనసేనలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  వంగవీటి కుటుంబానికి విజయవాడలో ఉన్న బలమైన అనుచరగణం, చారిత్రక నేపథ్యం ఈ నిర్ణయానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇదే సీటుపై టీడీపీ నుంచి కూడా బోండా ఉమా కుమారుడు రవితేజ, మరి కొందరు కూడా ఆసక్తికనబరుస్తుండటంతో వంగవీటి రాధ జనసేన చేరిక ఉత్కంఠ రేపుతోంది. రాజకీయంగా ఈ పరిణామంతో సమీకరణాలు ఎలా మారుతాయన్న ఆసక్తి నెలకొంది.   అదలా ఉంటే.. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.   [Vangaveeti Radha Joining Janasena, Vangaveeti Radhakrishna, Pawan Kalyan, Vijayawada Mayor Elections, TDP Janasena Alliance, Andhra Pradesh Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Natural star Nani could be joining hands with director Prem Kumar, best known for highly acclaimed Tamil films 96 and Meiyazhagan. According to industry rumours, the project is being planned to start shoot from next summer. Nani is expected to complete his Bloody Romeo by that time. Prem Kumar is directing a thriller with Fahadh Faasil in the leading role and once, he finishes it, he will start shooting with Nani. Reports further state that Bloody Romeo is going on sets after the script has been locked and Nani is not repeating The Paradise mistake.   Once, the script is locked, then only, Nani has decided to change his look, which has been teased recently. Sujeeth completed the pre-production works and he promised the leading man to complete the shooting by Summer of next year. Nani is making sure that it won't be delayed further as Paradise result left him disappointed.   Prem Kumar's cinema is said to be a complete love story and Nani will be seen in a complete make over from all his previous action films. In 2027, he might release two films and he is looking forward to forget the recent setback.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కొన్ని చిత్రాలు అంతే.. సెల్యులాయిడ్ పై అడుగుపెట్టే వరకు పెద్ద సినిమా కాదు అనే సినీ అపవాదుని మోస్తూ ఉంటాయి. కానీ సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాక ప్రేక్షకులు, బాక్స్ ఆఫీస్ ఆదరించేవే పెద్ద సినిమాలు అనేలా చేస్తాయి. అలా చేసిన చిత్రమే 'ప్రేమద ఊరలి'. సెప్టెంబర్ 25 న రిలీజ్ అవ్వగా అదే రోజు తెలుగులో కూడా 'ప్రేమనే ఊరి' గా వచ్చింది. కన్నడ మూవీ  'ప్రేమద ఊరలి' కన్నడ నాట  మౌత్ టాక్‌తో 70 కోట్ల క్లబ్ లో చేరింది. ఎలాంటి స్టార్ క్యాస్ట్, మేకర్స్ లేకుండా మూడువారాల్లోపే ఆ స్థాయి కలెక్షన్స్ ని రాబట్టిందంటే ఏ స్థాయిలో ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు.అయితే  బాక్సాఫీస్ వద్ద భారీ విజయవంతం కావడంతో, ఓటీటీ ప్రియులు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల రూమర్స్‌కి  మేకర్స్ చెక్ పెట్టారు. ప్రస్తుతానికి తాము ఏ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తోనూ లేదా శాటిలైట్ ఛానెల్‌తోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని లీడ్ యాక్టర్ శ్రీరామ్ అధికారికంగా స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: సల్మాన్ ఖాన్ ముందు భోరున ఏడ్చేసిన డైరెక్టర్.. సూపర్ అంటున్న ఫ్యాన్స్      శ్రీరామ్ తో పాటు  తపస్విని పూనాచా, రమికా శివు వంటి నూతన నటీనటులతో పాటు రంగాయణ రఘు, గోవిందే గౌడ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ  గ్రామీణ ప్రేమకథా చిత్రానికి, ‘వనిల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై నిర్మాతలు అత్యంత రిచ్‌గా, అందమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. స్వచ్ఛమైన ప్రేమకథ, తండ్రీకొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలే  ప్రేమద ఊరలి కంటెంట్.   [Premada Oorali Movie Ott Update, Premada Oorali Collections, Premada Oorali movie, Premada Oorali box office, Kannada blockbuster 2026,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సంగీతంతో ప్రేక్షకులను అలరించే ఆయన.. సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో సందడి చేస్తుంటారు. ముఖ్యంగా తనపై వచ్చే ట్రోల్స్‌కు అప్పుడప్పుడు ఫన్నీగా కౌంటర్లు ఇస్తుంటారు. తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమా మ్యూజిక్‌పై ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు థమన్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు అప్పట్లోనే కాకుండా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా’ పాటలు భారీ ఆదరణ పొందాయి. అయితే తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమా గ్లింప్స్‌ను షేర్ చేస్తూ.. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడంటే నమ్మలేకపోతున్నానంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై స్పందించిన థమన్.. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందం చెప్పే ‘నమ్మొద్దురా.. అడుక్కుతిను’ అనే డైలాగ్‌తో కూడిన మీమ్ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో థమన్ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు థమన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం AK 47’తో పాటు చిరంజీవి ‘కాకా’, బాలకృష్ణ ‘దాదా’ వంటి సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.     [S Thaman, Thaman Viral Reply, Ala Vaikunthapurramuloo Music, Allu Arjun, Thaman Troll Response, Brahmanandam Dookudu Meme, Thaman Latest News]
Renowned cinematographer Shamdat Sainudeen turns director with Don't Sleep, a psychological thriller that promises a fresh take on the fear of death. The teaser was unveiled digitally by Naga Chaitanya, Vijay Sethupathi and Dulquer Salmaan, while over 15 prominent Tollywood personalities attended the launch event in support of the film. Indhra Ram plays the lead role of a young man trapped in a psychological maze where sleep becomes his biggest enemy. His dreams begin to come true, leaving him afraid to even close his eyes. As he struggles to stay awake, death relentlessly follows him, with Ravindra Vijay playing the personification of death. The closer he gets to sleep, the closer he moves towards his end. Shamdat, known for his work as a cinematographer in several blockbusters, uses striking visuals to explore the protagonist's psychological breakdown. The teaser builds curiosity around the film's unusual premise, with the conflict between sleep, dreams and death providing an intriguing foundation for the narrative. Produced by V. Chudamani, Don't Sleep also features Vennela Kishore, Deva Katta, Taba Reema and Joyeetha Banerjee in prominent roles. The makers are expected to announce further details soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌పై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో దీపికా పదుకొణె స్థానంలో ఎవరు నటిస్తారనే విషయంలో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఆమె నవంబర్‌లో ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగంలో ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా కీలక పాత్రల్లో కనిపించారు. దీపికా పదుకొణె సుమతి పాత్రలో నటించారు. అయితే ఆమె ఈ సీక్వెల్‌లో కొనసాగడం లేదని నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దీపికా పదుకొణె తప్పుకున్న తర్వాత ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పుడు నవంబర్‌లో ఆమె షూటింగ్‌లో పాల్గొనవచ్చనే వార్తలు ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే సాయి పల్లవి నటించనున్న విషయాన్ని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.  ‘కల్కి 2’ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయినప్పటికీ, ప్రభాస్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో చిత్రీకరణకు విరామం వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ షూటింగ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు నాగ్ అశ్విన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ డిసెంబర్ రెండో వారంలో షూటింగ్‌లో పాల్గొనవచ్చనే ప్రచారం కూడా ఉంది.  సాయి పల్లవి ప్రస్తుతం నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’లో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘కల్కి 2’లో ఆమె భాగమైతే, మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆమె ఖాతాలో చేరినట్లే. ఇది కూడా చదవండి: ‘రామాయణ’ ట్రైలర్‌ 2 వచ్చేస్తోంది.. యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.!       [Sai Pallavi In Kalki 2, Kalki 2898 AD Sequel, Kalki 2 Shooting Update, Kalki 2 Movie, Sai Pallavi, Prabhas, Deepika Padukone, Nag Ashwin, Telugu Film News]  
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వియత్నాం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ.. ఇలా తన వ్యక్తిగత జీవితంలోని అందమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు. వియత్నాంలోని ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాల మధ్య మీనాక్షి చౌదరి సందడి చేస్తున్నారు. పర్యటనలో భాగంగా దిగిన ఫొటోల్లో ఆమె లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగానే స్టైలిష్‌గా కనిపించే మీనాక్షి.. వెకేషన్ ఫొటోలతోనూ తన అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీనాక్షి చౌదరికి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వియత్నాం వెకేషన్ ఫొటోలు నెటిజన్లలో ఆసక్తిని పెంచుతున్నాయి.     [Meenakshi Chaudhary, Meenakshi Chaudhary Vietnam Vacation, Meenakshi Chaudhary Latest Photos, Meenakshi Chaudhary Vacation Pictures, Tollywood Actress, Meenakshi Chaudhary Instagram, Meenakshi Chaudhary Travel Photos]
  స్టార్ జోడి విజయ్ దేవరకొండ, రష్మిక ఇప్పుడు స్టార్ కపుల్స్ హోదాలో ఈ నెల 16 న 'రణబాలి'తో సెల్యులాయిడ్ పై ల్యాండ్ కానున్నారు. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో 'రణబాలి' పై ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. పైగా భార్య భర్తలైన తర్వాత స్క్రీన్ పై మెరవనుండటంతో ఆ ఇద్దరు ఎలా మెస్మరైజ్ చేయబోతున్నారనే క్యూరియాసిటీ కూడా రెట్టింపయ్యిందని చెప్పవచ్చు.   అయితే సోషల్ మీడియాలో ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరుగా సాగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తున్న 'రణబాలి' చిత్రమే వారిద్దరి కలయికలో రాబోయే ఆఖరి సినిమా అవుతుందంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రూమర్స్ వెనుక అసలు నిజం ఏమిటనే దానిపై సినీ విశ్లేషకులు స్పందిస్తూ, ఇందులో ఎలాంటి అధికారిక స్పష్టత లేదని తేల్చిచెప్పారు. వ్యక్తిగత జీవితంలోనూ ఒకటైన ఈ తారలు, తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఎప్పుడూ మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. అయితే, ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఆఖరి సినిమా అని ప్రచారం జరగడానికి ప్రధాన కారణం, ఈ ప్రాజెక్ట్ తర్వాత వీరిద్దరూ సోలో ప్రాజెక్ట్స్‌పై లేదా వేర్వేరు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటమే కావచ్చునని సమాచారం.  ఇది చదవండి: విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్: ఆ రంగానికి సంబంధించిన 'టాప్ 10 'జాబితాలో చోటు      కాబట్టి ‘రణబాలి’ తర్వాత వారు మళ్లీ కలిసి నటిస్తారా లేదా అనేది పూర్తిగా భవిష్యత్తు స్క్రిప్ట్‌లు, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది తప్ప, రణబాలి ఖచ్చితంగా ఆఖరి సినిమా అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. విజయ్ దేవరకొండ అత్యంత ఉద్వేగభరితమైన యోధుడిగా రణాబాలి రోల్ లో  కనిపిస్తుండగా, రష్మిక జయమ్మగా శక్తివంతమైన రోల్‌ పోషిస్తున్నారు. పాన్ ఇండియా బ్యానర్  మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మించగా రాహుల్ సంక్రుత్యియన్ దర్శకుడు.       [vijay Deverakonda And Rashmika Ranabaali last Movie Truth, Vijay Deverakonda, Rashmika Mandanna, Ranabhali movie, 
‘రామాయణ’ సినిమా ప్రమోషన్స్‌లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి రెండో ట్రైలర్‌ను బెంగళూరులో విడుదల చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్ 15న ఈ కార్యక్రమం జరగనుంది. యశ్ ఇప్పటికే చిత్రబృందంతో కలిసి బెంగళూరుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో తొలి ట్రైలర్‌ను పరిచయం చేసిన చిత్రబృందం.. ఇప్పుడు రెండో ట్రైలర్‌ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కర్ణాటకలో యశ్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కేజీఎఫ్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు రావణుడి పాత్రలో కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘రామాయణ’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా రావణుడి పాత్రలో యశ్ లుక్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. రెండో ట్రైలర్‌లో కథకు సంబంధించిన మరిన్ని అంశాలను చూపిస్తారా? యశ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: RC17 కోసం కీలక అడుగు.. రామ్ చరణ్, సుకుమార్ ప్లాన్ ఇదేనా.?       [Ramayana Trailer 2, Ramayana Bengaluru Event, Ramayana Movie, Yash, Ranbir Kapoor, Sai Pallavi, Nitesh Tiwari, Telugu Film News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
బలమైన భార్యాభర్తల బంధానికి, డబ్బుకు ఉన్న లింకు ఇదే..  పెళ్లి అనేది కేవలం ఇద్దరు మనుషులు ఒక్కటి కావడం కాదు. ఇద్దరి అలవాట్లు, వాళ్ళ మనసులు, వాళ్ళ బాధ్యతలు కూడా కలిసి ఉండే బంధం.  భార్యాభర్తల  మధ్య ప్రేమ, నమ్మకం ఎంత ముఖ్యమో, ఆర్థిక విషయాలలో స్పష్టత కూడా అంతే అవసరం. వివాహ బంధంలో చాలా సమస్యలు లేదా గొడవలు నేరుగా మనస్పర్ధల వల్ల కాకుండా, ఆర్థిక విషయాలలో సరైన సమాచారం, అవగాహన లేకపోవడం వల్లే మొదలవుతుంటాయి. ఆదాయం, ఖర్చులు, పొదుపు, అప్పుల విషయంలో ఇద్దరి మధ్య పారదర్శకత లేకపోతే కాలక్రమేణా ఆ బంధంలో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే పెళ్లయిన కొత్తలోనే లేదా సంసార ప్రయాణంలో దంపతులిద్దరూ కూర్చుని డబ్బుకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించుకోవడం ఎంతో అవసరం. ఆర్థిక ప్రణాళికలు సరైన మార్గంలో ఉంటేనే దాంపత్య జీవితం ఆనందంగా, మానసిక ప్రశాంతతతో సాగుతుంది..   ఆర్థిక బలంగా ఉండాలన్నా  , భార్యాభర్తల బంధం బలంగా ఉండాలన్నా..ప్రతి భార్యాభర్తలు తప్పకుండా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అవేంటో తెలుసుకుంటే .. ఇద్దరి సంపాదన , ఆదాయం వివరాలు.. భార్యాభర్తలిద్దరికీ ఒకరి ఆదాయం గురించి మరొకరికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నట్లయితే, ఇద్దరి నెలవారీ సంపాదన, వచ్చే బోనస్‌లు లేదా ఇతర ఆదాయ మార్గాల గురించి ఓపెన్ గా  మాట్లాడాలి. ఎవరి ఆదాయం ఎంత ఉందో తెలిసినప్పుడే ఇంటి బడ్జెట్‌ను సరిగ్గా నిర్వహించడం , భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం తేలికవుతుంది. ఇక్కడ సంపాదన తక్కువ లేదా ఎక్కువ అనేది ముఖ్యం కాదు, ఇద్దరు ట్రాన్స్పరెంట్ గా ఉండటమే  ప్రధానం. ఇంటి ఖర్చుల నిర్వహణ , బాధ్యతల విభజన..  ఇంటి అద్దె, గ్రోసరీస్, కరెంట్ బిల్లులు, పిల్లల చదువుల ఖర్చులు వంటి రెగ్యులర్  ఖర్చులను ఎవరు, ఎలా భరించాలో ముందుగానే మాట్లాడుకోవడం   మంచిది. ప్రతి ఖర్చునూ సగం సగం షేర్ చేసుకోవాలనే రూల్  ఏమీ లేదు. భార్యాభర్తలిద్దరూ  వారి ఆదాయం, వీలును బట్టి ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా ఖర్చులను అడ్జస్ట్ చేసుకోవచ్చు.  పొదుపు..  కేవలం సంపాదించడం, ఖర్చు పెట్టడమే కాకుండా భవిష్యత్తు భద్రత కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం. నెలకు ఎంత మొత్తం పొదుపు చేయాలి, ఆ మొత్తాన్ని ఎక్కడ దాచాలి లేదా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై ఇద్దరూ ఒక నిర్ణయానికి రావాలి. చిన్న మొత్తంతో మొదలుపెట్టినా, క్రమబద్ధమైన పొదుపు అలవాటు అత్యవసర సమయాల్లో ఎంతగానో ఆదుకుంటుంది. అప్పులు , ఈఎంఐలు.. పెళ్లికి ముందు ఉన్న అప్పులు, పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు లేదా క్రెడిట్ కార్డ్ బాకీల గురించిన నిజాలను ఒకరికొకరు నిజాయితీగా చెప్పుకోవాలి. అప్పులు ఎంత ఉన్నాయి, వాటికి నెలకు ఎంత ఈఎంఐ చెల్లిస్తున్నారు అనే వివరాలు భాగస్వామికి తెలియడం వల్ల అనవసర టెన్షన్లు తగ్గిపోతాయి. దాపరికం లేకుండా అప్పుల విషయాన్ని పంచుకోవడం ద్వారా ఇద్దరూ కలిసి త్వరగా వాటిని తీర్చే ప్రణాళిక వేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఫైనాన్సియల్ గోల్స్.. ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు, లక్ష్యాలు ఉంటాయి. సొంత ఇల్లు కొనడం, పిల్లల  చదువులు, వ్యాపారం ప్రారంభించడం లేదా రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి విషయాలపై ఇద్దరి ఆలోచనలు ఎలా ఉన్నాయో మాట్లాడుకోవాలి. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ఎన్నాళ్ల సమయం పడుతుంది, ఎలా ముందుకు వెళ్లాలి అనేది ముందే నిర్ణయించుకుంటే ఒక స్పష్టత వస్తుంది. కుటుంబ సభ్యుల బాధ్యతలు , సహాయం.. చాలామందికి తమ తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ విషయంలో పరస్పరం గౌరవం, అర్థం చేసుకునే తత్వం అవసరం. కుటుంబాలకు ఎంతవరకు సాయం చేయవచ్చు, దానికి ఎంత బడ్జెట్ కేటాయించవచ్చు అనేది ముందే మాట్లాడుకుంటే, తర్వాత కాలంలో సంసారంలో అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయి. పెద్ద నిర్ణయాలు , వ్యక్తిగత స్వేచ్ఛ.. ఏదైనా పెద్ద వస్తువు కొనాలన్నా, అప్పు తీసుకోవాలన్నా లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలన్నా ఇద్దరూ సంప్రదించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరికీ తమ సొంత అవసరాల కోసం కొంత డబ్బును ఉపయోగించుకునే స్వేచ్ఛ కూడా ఉండాలి. ఉమ్మడి లక్ష్యాలతో పాటు వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని గౌరవించినప్పుడే ఆ బంధంలో నమ్మకం, గౌరవం మరింత పెరుగుతాయి.                           *రూపశ్రీ.
ప్రపంచ ప్రఖ్యాత పాప్ సంగీత సంచలనం టేలర్ స్విఫ్ట్ విడుదల చేసిన సరికొత్త సింగిల్  పేషెంట్ జీరో  (Patient Zero) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. 2026 సెప్టెంబర్ 22న ఈ అనూహ్య ప్రకటన వెలువడిన క్షణం నుంచే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది స్విఫ్ట్ అభిమానులు మరియు మ్యూజిక్ నిపుణులు ఈ పాట అసలు అర్థం ఏమిటని తీవ్ర అన్వేషణ ప్రారంభించారు. అయితే, పబ్లిక్ హెల్త్ నిపుణులు మరియు వైద్య రంగానికి చెందిన పరిశోధకులు మాత్రం ఈ టైటిల్ విన్న వెంటనే ఆందోళనకు గురయ్యారు. 1980ల నాటి హెచ్‌ఐవి/ఎయిడ్స్ (HIV/AIDS) మహమ్మారి కాలం నుంచి రోగులను నిందించడానికి, సమాజంలో వేధించడానికి ఉపయోగించిన అత్యంత విషపూరితమైన  పేషెంట్ జీరో  అనే పదాన్ని టేలర్ స్విఫ్ట్ మళ్లీ తెరపైకి తీసుకురావడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, ఈ పాట మరియు స్టార్ స్టడెడ్ మ్యూజిక్ వీడియో విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు ఈ  పేషెంట్ జీరో  అనే పదానికి ఉన్న చారిత్రక నేపథ్యం చాలా బాధాకరమైనది. 1982లో యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) పరిశోధకులు అంటువ్యాధుల వ్యాప్తిని అధ్యయనం చేసే క్రమంలో అక్షర దోషం కారణంగా ఈ పదాన్ని ఉపయోగించారు. కెనడా దేశానికి చెందిన విమాన సిబ్బంది అయిన గాటెన్ డ్యుగాస్ (Gaëtan Dugas) అనే వ్యక్తిని తప్పుగా సమాజం అపార్థం చేసుకుని, ఒక వైరస్‌కు మూలకారకుడిగా ముద్ర వేసింది. అప్పటి నుండి ఈ పదం ఒక వ్యక్తిని బలిపశువును చేయడానికి, వారిపై సామాజిక కళంకాన్ని మోపడానికి ఒక అస్త్రంగా మారింది. కోవిడ్ 19 సమయంలో కూడా ఇదే తరహా ధోరణులు కనిపించాయి. అయితే, టేలర్ స్విఫ్ట్ తన సరికొత్త గీతంలో ఈ సాంప్రదాయ అర్థాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. డేంజరస్ రిలేషన్‌షిప్‌లు లేదా విషపూరితమైన సంబంధాల నుండి బయటపడే మహిళల అనుభవాలను ఇందులో శక్తివంతంగా ప్రతిబింబించింది. ఈ పాటలో టేలర్ స్విఫ్ట్ తన మాజీ భాగస్వామితో డేంజర్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకున్న మరొక మహిళను ఉద్దేశించి,  నేను మీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాను  అంటూ అండగా నిలుస్తున్నట్లుగా భావోద్వేగపూరితంగా ఆలపించారు. ఈ గేయం కేవలం ఒక వ్యక్తిగత ప్రేమకథ మాత్రమే కాకుండా, అనేక మంది మహిళలు ఎదుర్కొంటున్న మానసిక వేదనకు అద్దం పడుతోంది. తన స్నేహితురాలితో జరిగిన ఒక సంభాషణ నుంచి ఈ ఆలోచన పుట్టిందని, చాలామంది మహిళలు ఇలాంటి విషపూరిత సంబంధాల బాధితులేనని ఆమె స్పష్టం చేశారు. ఈ గీతం ద్వారా టేలర్ స్విఫ్ట్ కేవలం పాట పాడటమే కాకుండా, పాతకాలం నాటి ఒక కళంకిత పదాన్ని ఒక శక్తివంతమైన మహిళా సంఘీభావ ప్రతీకగా మార్చేశారని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్ గ్యావిన్ యామేయ్ (Gavin Yamey) వంటి నిపుణులు కొనియాడారు. మొత్తానికి,  పేషెంట్ జీరో  అనే పదాన్ని ఒక సామాజిక అస్త్రం నుండి మహిళల ధైర్యానికి ప్రతీకగా మార్చడంలో టేలర్ స్విఫ్ట్ విజయం సాధించారని చెప్పవచ్చు.     Taylor Swift new song, Taylor Swift latest track, Taylor Swift new release, Taylor Swift social media viral, Taylor Swift song reaction, Swifties new music, Taylor Swift chartbuster.  
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీస్ పని నుండి సోషల్ మీడియా స్క్రోలింగ్ వరకు ప్రతి ఒక్కరూ గంటల తరబడి ఫోన్ స్క్రీన్‌లనే చూస్తూ గడుపుతున్నారు. అయితే, ఇలా ఎక్కువ సేపు ఫోన్ వాడటం వల్ల కళ్లలో మంటలు, దురద, ఎరుపుదనం, నీరు కారడం మరియు అস্পষ্ট దృష్టి (బ్లర్డ్ విజన్) వంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. చాలా మంది ఈ సమస్యకు స్క్రీన్ బ్రైట్‌నెస్ లేదా బ్లూ లైట్ మాత్రమే కారణమని భావిస్తారు, కానీ దీని వెనుక పలు ఇతర ముఖ్యమైన ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి. మన కంటి ఉపరితలంపై తేమను నిలబెట్టే ఒక సన్నని కన్నీటి పొర (టీర్ ఫిల్మ్) ఉంటుంది. మనం ప్రతిసారీ రెప్ప వాల్చినప్పుడు ఈ కన్నీరు కంటి అంతటా ప్రసరించి తేమను కాపాడుతుంది. అయితే, మనం ఫోన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్‌లను చూస్తున్నప్పుడు మన రెప్పపాటు రేటు (ബ్లింక్ రేటు) సాధారణం కంటే చాలా వరకు తగ్గిపోతుంది లేదా మనం పూర్తిగా రెప్ప వాల్చము. దీనివల్ల కంటిలోని కన్నీటి పొర ఎండిపోయి, కళ్లలో పొడిబారడం, చికాకు మరియు తీవ్రమైన మంట వంటి లక్షణాలకు దారితీస్తుంది. డిజిటల్ ఐ స్ట్రెయిన్ పై నిర్వహించిన వివిధ వైద్య సమీక్షలు మరియు పరిశోధనల ప్రకారం, పొడి కళ్ళు, తలనొప్పి మరియు నీరు కారడం వంటివి అత్యంత సాధారణ సమస్యలుగా వెల్లడయ్యాయి. బ్లూ లైట్ ప్రభావంపై ఎన్నో అపోహలు ఉన్నప్పటికీ, కళ్ళు మంట పుట్టడానికి అసలు కారణం మనం ఫోన్ వైపు సుదీర్ఘ సమయం పాటు తదేకంగా చూడటం మరియు రెప్పపాటు తగ్గడమేనని నేత్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే తప్పుగా ప్రిస్క్రైబ్ చేయబడిన కళ్ళద్దాలు, గదిలోని పొడి గాలి, ఫ్యాన్లు లేదా ఎయిర్ కండిషనర్ల నుంచి వచ్చే గాలి కూడా కళ్లలోని తేమను ఆవిరి చేసి సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. పిల్లల్లో కూడా సరైన స్క్రీన్ అలవాట్లు లేకపోవడం వల్ల కంటి చూపు సమస్యలు పెరుగుతున్నాయి. ఈ డిజిటల్ కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన మరియు ప్రభావవంతమైన జీవనశైలి మార్పులను పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా  20,20,20 రూల్  పాటించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్ నుండి దృష్టి మళ్లించి, కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. అలాగే ఫోన్ చదువుతున్నప్పుడు లేదా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా చదువుతూ, స్పృహతో తరచుగా రెప్ప వాల్చడం అలవాటు చేసుకోవాలి. ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను గదిలోని వెలుతురుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకోవాలి. చీకటి గదిలో ఫోన్ వాడటం పూర్తిగా మానుకోవాలి. ఎండీ గాలి లేదా ఏసీ వెంట్లు నేరుగా ముఖానికి తగలకుండా చూసుకోవాలి. రాత్రి పడుకునే ముందు కనీసం గంటపాటు స్క్రీన్ వాడకానికి దూరంగా ఉండటం వల్ల కళ్ళకు తగిన విశ్రాంతి దొరుకుతుంది. కళ్ళలో మంట లేదా నొప్పులు దీర్ఘకాలికంగా వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నేత్ర నిపుణులను సంప్రదించి సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవడం అత్యంత ఉత్తమం.     Phone screen eye strain, burning eyes from screen time, digital eye strain remedies, screen time eye protection, eye care tips for smartphone users, 20,20,20 rule eye strain, computer vision syndrome tips  
  నేటి వేగవంతమైన జీవనశైలిలో సరిగ్గా సమయానికి తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సరిపడా నిద్రపోకపోవడం వంటి అలవాట్ల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి అలవాట్ల వల్ల శరీరంలోని జీవక్రియలు దెబ్బతిని దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తోంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడే వ్యాధులు మొదలవుతాయి. ఈ మూడు దోషాలు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఆయుర్వేదం సూచించే ముఖ్యమైన నియమాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. జీవనశైలి లోపాల వల్ల వచ్చే ముప్పు.. రోజువారీ జీవితంలో వ్యాయామం లేకపోవడం, వేళపాళ లేని ఆహారం తీసుకోవడం, మద్యం లేదా ఇతర అలవాట్లు ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, అధిక బరువు, టైప్ 2 మధుమేహం , ఊపిరితిత్తుల సమస్యల వంటి అనేక తీవ్రమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. చిన్న వయస్సు నుంచే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని సరిదిద్దుకోవడం ద్వారా ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారంతో దోషాల నివారణ.. ఆయుర్వేద ప్రకారం సరైన ఆహారం అంటే కేవలం కొన్ని పదార్థాలు తినడం మాత్రమే కాదు. ఆహారంలో ఉండే రుచులు, గుణాలు , వాటి కలయికను కూడా అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు ఉన్నాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఈ ఆరు రుచులు తగిన పాళ్లలో ఉండేలా చూసుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉంటాయి. ఆహారంలో తాజా కూరగాయలు, ఆయా కాలాల్లో దొరికే పండ్లు తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. సరియైన దినచర్య చాలా ముఖ్యం.. మంచి ఆరోగ్యం కోసం సరైన రోజువారీ అలవాట్లు కలిగి ఉండటం చాలా అవసరం. ఉదయాన్నే త్వరగా లేవడం, శరీరానికి నూనె మర్దన చేసుకోవడం, అభ్యంగన స్నానం , యోగా వంటి ప్రక్రియలు శరీరానికి విశ్రాంతినిస్తాయి.  ఉదయాన్నే ఆరోగ్యకరమైన టిఫిన్ చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. యోగా , ధ్యానంతో ప్రయోజనాలు.. యోగా , ప్రాణాయామం చేయడం వల్ల శరీరం, మనస్సు , ఆత్మ సమన్వయంతో పనిచేస్తాయి. ఇవి శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా పట్టుత్వాన్ని, శారీరక బలాన్ని పెంచుతాయి. రోజూ సూర్య నమస్కారాలు, ఊపిరితిత్తుల వ్యాయామాలు , ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మూడు దోషాలను సమతుల్యంగా ఉంచి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.                           *రూపశ్రీ.
మన కాళ్లకు సరైన రక్తప్రసరణ అందకపోతే నడవడం దగ్గర నుంచి రోజువారీ పనులు చేసుకోవడం వరకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమందికి కొద్దిదూరం నడవగానే పిక్కల్లో నొప్పి రావడం, పాదాల్లో తీవ్రమైన నొప్పి, కాళ్ల వాపు, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సమస్యలన్నీ ఒకే కారణంతో వస్తాయని భావించకూడదు. వీటి వెనుక రక్తనాళాలకు సంబంధించిన వివిధ సమస్యలు ఉండవచ్చు. కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రవాహం తగ్గవచ్చు. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు పిక్కల్లో నొప్పి వచ్చి, విశ్రాంతి తీసుకున్నప్పుడు తగ్గిపోవడం కాళ్ల ధమనుల్లో రక్తప్రసరణ తగ్గడానికి సంకేతం కావచ్చు. అలాగే పాదాలు చల్లబడటం, గాయాలు త్వరగా మానకపోవడం, చర్మం రంగు మారడం వంటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మరోవైపు, కాళ్లలోని సిరలు రక్తాన్ని తిరిగి గుండెకు చేరవేయడంలో సమస్య ఎదురైతే వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాళ్లలో వాపు, బరువుగా అనిపించడం, చర్మంపై ఉబ్బిన సిరలు కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ధమనుల్లో రక్తప్రసరణ తగ్గడం, సిరల్లో రక్తం తిరిగి ప్రవహించడంలో సమస్యలు రెండూ వేర్వేరు పరిస్థితులు. ఈ వీడియోలో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు గారు కాళ్లకు రక్తప్రసరణ తగ్గడానికి గల కారణాలు, కాళ్ల రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడినప్పుడు కనిపించే లక్షణాలు, వెరికోస్ వెయిన్స్ సమస్య గురించి వివరించారు. అలాగే రక్తప్రసరణను పరీక్షించడానికి ఉపయోగించే డాప్లర్ టెస్ట్ (Doppler Test) గురించి, సమస్య తీవ్రతను బట్టి అందుబాటులో ఉండే చికిత్సా విధానాల గురించి తెలియజేశారు. రక్తనాళాల్లో బ్లాకేజీలను తొలగించడానికి లేదా రక్తప్రవాహాన్ని మెరుగుపరచడానికి కొన్ని సందర్భాల్లో బెలూన్ యాంజియోప్లాస్టీ (Balloon Angioplasty), స్టెంట్ చికిత్స (Stent Treatment) అవసరమవుతాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఈ చికిత్సలు అవసరం ఉండవు. సమస్య ఎక్కడ ఉంది, ఎంత తీవ్రంగా ఉంది, రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాల ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. కాళ్ల నొప్పులను వయసు పెరగడం వల్ల వచ్చే సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారా? నడిచేటప్పుడు పిక్కల్లో నొప్పి రావడానికి రక్తప్రసరణ తగ్గడం కూడా కారణమవుతుందా? డాప్లర్ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? రక్తనాళాల్లో బ్లాకేజీ ఉంటే ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు గారి పూర్తి వీడియోను చూడండి. ముఖ్య గమనిక: కాళ్లలో నిరంతర నొప్పి, పాదాల రంగు మారడం లేదా మానని గాయాలు ఉంటే వైద్యులను సంప్రదించండి. అకస్మాత్తుగా తీవ్రమైన కాలి నొప్పి, పాదం చల్లబడటం, పాలిపోయినట్లు లేదా నీలంగా మారడం, తిమ్మిరి లేదా బలహీనత కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి. ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. వైద్య పరీక్షలు, చికిత్సలకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)