కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో  మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు,   నియోజకవర్గాల పునర్విభజన బిల్లలను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని భావిస్తోంది.   ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది.  ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో కేంద్రానికి అవసరమైన మద్దతు లభించలేదు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండోంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఈ బిల్లుతో  అనుసంధానమైన ఇతర బిల్లులపై కేంద్రం ముందుకు వెళ్లలేదు.   మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చర్చలో అసలు సమస్య మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలా వద్దా అన్నదొక్కటే కాదు. ఆ రిజర్వేషన్లను ఏ విధానంలో అమలు చేయాలి? నియోజకవర్గాల సంఖ్యను ఎలా మార్చాలి? రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్న ప్రశ్నలు కూడా కీలకంగా మారాయి. అన్నిటికీ మించి మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చట్టం 2023లోనే ఆమోదం పొందింది. అయితే దాని అమలు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో ముడిపడి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రతిపాదించిన మార్పులు మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే అంశంతో కలిసి ఉంది.   అదే వివాదానికీ కారణంగా మారింది. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంపై రాజకీయంగా దాదాపు అన్ని పార్టీలూ మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆ రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంటే..   నియోజకవర్గాల పేర్లు, సరిహద్దులు మార్చడం మాత్రమే కాదు..  ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉంటాయి? ఏ ప్రాంతానికి ఎంత రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుంది? వంటి అంశాలపై కూడా ప్రభావం పడుతుంది.   అందుకే ఈ వ్యవహారం   జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  ఈసారి బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా   డీఎంకేతో చర్చలు సాగుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  మరికొన్ని చిన్న పార్టీల మద్దతును కూడా కూడగట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో? [Special Session  Parliament,  Womens Reservation Bill, Delimitation Bill, Redrawing Constituencies, Central Government,  DMK, Discussions, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతకొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కూటమి సీట్ల పంచాయితీకి ఎట్టకేలకు తెరపడింది. ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది. ఈ మేరకు మూడు పార్టీలు ఎక్కడెక్కc ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలో స్పష్టత వస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. తాజా లెక్కల ప్రకారం, జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 4 కార్పొరేషన్‌లు, 21 మున్సిపాలిటీలను కేటాయించారు. అలాగే మిత్రపక్షమైన బీజేపీకి 2 కార్పొరేషన్‌లు, 7 మున్సిపాలిటీలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో తమ ప్రాబల్యాన్ని బట్టి కనీసం 40 శాతం సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబ ట్టినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆ పార్టీ  అధినేతతో చర్చించి జనసేనను.  20 శాతం లోపు సీట్లకే పరిమితం కావడానికి ఒప్పించారు.  మరోవైపు బీజేపీ పెద్దగా పట్టుబట్టకపోయినా, రాజమండ్రి,  అనంతపురం కార్పొరేషన్‌లతో పాటు 7 మున్సిపాలిటీలను కేటాయించడం గమనార్హం. రాజమండ్రిలో లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ ఆ సీటు ఇవ్వడం సహజమే అయినప్పటికీ, అనంతపురం కార్పొరేషన్‌ను కూడా కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు తన వ్యూహాత్మక రాజకీయాలతో జనసేనను ఆ పార్టీ కోరినన్ని స్థానాల కోసం పట్టుబట్టకుండా ఒప్పించగలిగారని పరిశీలకులు అంటున్నారు.  చంద్రబాబు తనదైన శైలిలో కూటమిలో సీట్ల సర్దుబాటును పూర్తి చేసి తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. [Ap Localbody Elections, Telugudesham Kutami Seat Sharing, Janasena TDP BJP AP Politics Telugu One]
దేశ రాజకీయాలలో  కాక్రోచ్ జనతా పార్టీ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు, యువత సమస్య పరిష్కారం డిమాండ్ తో ఆ పార్టీ చేపడుతున్న ఆందోళనలు, ఉద్యమాలకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.  అయితే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సీజేపీకి మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.  ఎన్నికల సంఘం  చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ) జ్ఞానేశ్ కుమార్ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, ఆందోళనలకు జగన్ మద్దతు పలికారు.   ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగిన సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్ ,  అశుతోష్ రాంకా తదితరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.  ప్రైవేట్ ప్రాంగణాల ద్వారా నిరసన ప్రదేశంలోకి ప్రవేశించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు వారిపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు   నమోదు చేసి, ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్   కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 19 వరకు 5 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి  తీహార్ జైలుకు తరలించారు.   ఈ అరెస్టులను వైసీపీ అధినేత జగన్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ మద్దతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం మళ్లీ పునరుద్ధరించబడాలని, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులు సమస్యను పరిష్కరించలేవని జగన్ సామాజిక మాధ్యవ వేదికగా షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  జగన్ సీజేపీకి మద్దతు పలకడం వ్యూహాత్మకమా? లేక బీజేపీతో తెగతెంపులకు సంకేతమా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.   జగన్ బొద్దింకలకు  మద్దతుగా సామాజిక మాధ్యమ వేదికగా మద్దతు పలకడాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఎద్దేవా చేశారు. ఈడీ , సీబీఐ   కేసులను ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్   ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ ఏపీలో అధికారంలో ఉన్న కాలంలో  జరిగిన అరాచకాలు, హింసాత్మక ఘటనలను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ప్రజాస్వామ్య బద్ధంగా తగిన సమయంలో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని మాధవ్ హెచ్చరించారు.  [YS Jagan upport Cockroach Janta Party, Condemn CJP Leaders Arres, YCP Political Strategy, Election Commission India, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రెజెంట్ 'రణబాలి', జయమ్మ గా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో తమ సత్తా చాటుతూ ఉన్నారు.బ్రిటిష్ పరిపాలనా కాలంలో రాయలసీమ ఏరియాలో జరిపిన ఒక పోరాట యోధుడు కథ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు చలో టూ రణబాలి థియేటర్స్ అంటున్నారు.  ఇప్పటికే చూసిన వాళ్ళైతే మూవీకి సంబంధించిన హైలెట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు 1 .భద్ర మల్లన్న ట్రాక్  2 . విజయ్ దేవరకొండ, రష్మిక టోటల్ ఎపిసోడ్  3 . ద్వితీయార్థంలో వచ్చే ఎమోషనల్ అండ్ ప్రెగ్నెన్సీ సన్నివేశాలు  4 . యాక్షన్ సీక్వెన్స్, 5 . కరువుకి సంబంధించిన ట్రాక్  6 .ప్రొడక్షన్ వాల్యూస్  7 .డైరెక్షన్  ఇది కూడా చదవండి: Ranabaali Movie Review Telugu : రణబాలి మూవీ రివ్యూ      ఇక  థియేటర్స్ వద్ద మిక్స్డ్ టాక్ వినపడుతుంది. మెజారిటీ రివ్యూస్ పరిస్థితి కూడా అదే. ఈ నేపథ్యంలో తొలి రోజుతో పాటు వీకెండ్ ని రణభాలి టీం ఎంత వరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.     [Ranabaali Movie Highlights, Ranabaali Movie Review Telugu, Ranabaali Review, Vijay Deverakonda, Rashmika, Telugu Cinema Reviews, Tollywood, Tollywood News, Tollywood cinema]  
Cast: Anupama Parameswaran, Senior Naresh, Tharun Bhascker, Akhil Raj, Kireeti Damaraju Crew: Writer & Director: Bhadrappa Gajula Music Composer: Suresh Bobbili Cinematography: Shyam Dhupati Editor: Sravan Katikaneni Producer: Bhoosam Jagan Mohan Reddy Anupama Parameswaran and Senior Naresh play a father-daughter duo in Crazy Kalyanam The promotional content generated good buzz, and the film hit the theaters today. Let's see how crazy the movie is.   Plot: Keerthi (Anupama Parameswaran) is a smart, independent MS student from Medak who deeply loves her father, Parvathalu (Naresh). Parvathalu, who is good-hearted but slightly selfish, fixes her marriage with an NRI groom without her consent. Keerthi refuses, but he continues with the arrangements. Why does the brave Keerthi reach the wedding mandap? Who does she actually love? Watch the movie to find out. Analysis: The movie is a breezy watch without boring moments. The first half is engaging with good character introductions. The natural scenes between Naresh and Anupama are a major highlight. Tharun Bhascker shines in his entertaining role, though he deserved more screen time. However, the romantic track between Keerthi and Uday (Akhil) is just average. The interval twist works well. The second half builds good curiosity, especially during the emotional wedding episode. While the pre-climax and climax are handled well, a major suspense element is resolved too simply. Anupama delivers a natural performance, and Naresh is the absolute soul of the film. Tharun Bhascker is a strong asset. The technical values like music and cinematography are good, though the writing could have been sharper to elevate the fun. Positives: Anupama Parameswaran and Naresh's performances Engaging screenplay Negatives: Entertainment factor is too low Simple resolution of the main twist Average romantic track Bottomline: A clean, decent family drama with a good core point but misses out on high entertainment. Rating: 2.5/5 Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేశ్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. అంతేకాదు.. ఆయన పోషిస్తున్న కుంభ పాత్రను ‘మోస్ట్ కాంప్లెక్స్ మైండ్’ అంటూ అభివర్ణించింది. దీంతో ఈ పాత్రపై మరోసారి ఆసక్తి మొదలైంది. ‘వారణాసి’ అధికారిక సోషల్ మీడియా ఖాతా పృథ్వీరాజ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపింది. ‘వారణాసి’లో అత్యంత సంక్లిష్టమైన ఆలోచనలున్న వ్యక్తి కుంభ అంటూ పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యతో సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే కుంభా.. అద్భుతమైన ఏడాది కావాలి.. ఎప్పుడూ ప్రేమ, ఆనందం ఉండాలి’ అంటూ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ను ట్యాగ్ చేస్తూ హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను వ్యక్తం చేశారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా కనిపించనుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో మహేశ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు కుంభ పాత్రను ‘మోస్ట్ కాంప్లెక్స్ మైండ్’ అంటూ చిత్రబృందం పేర్కొనడంతో.. పృథ్వీరాజ్ పాత్రలో ఎలాంటి మలుపులు ఉంటాయనే చర్చ మొదలైంది. ఆయన పాత్ర కథలో కీలకమైన మలుపులకు కారణమవుతుందా? మహేశ్ బాబుతో ఆయన తలపడే సన్నివేశాలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ‘వారణాసి’ సినిమా కోసం మహేశ్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. టైమ్ ట్రావెల్, అడ్వెంచర్ అంశాలతో పాటు భారతీయ ఇతిహాస నేపథ్యం కూడా ఇందులో ఉండనుంది. ఇది కూడా చదవండి: డ్రాగన్ సెట్స్‌లోకి ఎన్టీఆర్ రీఎంట్రీ.. 3 నెలల తర్వాత కెమెరా ముందుకు.! https://x.com/urstrulyMahesh/status/2111020643944968310       [Varanasi Movie, Kumbha The Most Complex Mind, Prithviraj Sukumaran Birthday, Mahesh Babu Wishes, Kumbha Character, Prithviraj Sukumaran, SS Rajamouli, Mahesh Babu, Telugu Film News]  
The makers of Ranbir Kapoor, Sai Pallavi and Yash starrer Ramayana have announced a grand pre-release event for the Telugu version in Hyderabad on October 19. Ranbir Kapoor, Sai Pallavi, Yash, director Nitesh Tiwari, producer Namit Malhotra, Ravi Dubey, Kajal Aggarwal and Rakul Preet Singh are expected to attend the event. The announcement comes a day after the team unveiled the film’s latest trailer at a grand event in Bengaluru. The trailer has drawn attention for its visual effects, scale and performances, further building anticipation for the mythological epic. DNEG is handling the film’s visual effects, with the makers aiming to present the story of Lord Ram to audiences across the world. Produced by Namit Malhotra, with Yash also associated with the ambitious project, Ramayana features Ranbir Kapoor as Lord Ram and Sai Pallavi as Sita, while Yash plays Ravana. The film has also attracted attention for bringing together Oscar-winning composer Hans Zimmer and A.R. Rahman, who are composing the music. Rahman’s song Ram has already generated a strong response following its release. The film is scheduled to arrive in theatres on November 5. With the Hyderabad event expected to bring together the principal cast and crew, the makers are looking to build further momentum for the film among Telugu audiences ahead of its release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -సినిమా పేరు: క్రేజీ కళ్యాణం -న‌టీన‌టులు: అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నరేష్, తరుణ్ భాస్కర్,అఖిల్ రాజ్, కిరీటి దామరాజు  తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ధూపాటి -ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని  -మ్యూజిక్: సురేష్ బొబ్బిలి  -నిర్మాత‌: భూసం జగన్ మోహన్ రెడ్డి  -బ్యానర్: ఆరోవ్ సినిమాస్  -రచన,దర్శకత్వం: భద్రప్ప గాజుల  -రిలీజ్ డేట్ : అక్టోబర్ 16 , 2026  అనుపమ పరమేశ్వరన్ , నరేష్ తండ్రి కూతుళ్లుగా చేసిన మూవీ 'క్రేజీ కళ్యాణం'. ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టగా, ప్రచార చిత్రాలతోనే మంచి బజ్ ని ఏర్పరచుకుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ కీర్తి (అనుపమ పరమేశ్వరన్) తెలంగాణాలోని మెదక్ చెందిన అందమైన యువతి. ఆత్మాభిమానం, ధైర్య సాహసాలు, స్వతంత్ర భావాలు మెండుగా ఉండటంతో పాటు చదువులో నెంబర్ వన్ స్టూడెంట్.. ఒక రకంగా చదువంటే విపరీతమైన పిచ్చి. MS కంప్యూటర్స్ చదువుతుంటుంది. తన తండ్రి పర్వతాలు(నరేష్) అన్నా, తన కుటుంబం అన్నా ఎంతో అభిమానం. పర్వతాలు మంచోడే కానీ కొంచం స్వార్దపరుడు. ఆ కోవలోనే తన అన్నయ్య కూతురుకి వచ్చిన అమెరికా పెళ్లి సంబంధాన్ని కీర్తికి సెట్ చేస్తాడు? కీర్తి పెళ్ళికి ఒప్పుకోదు. కానీ పెళ్ళి ఏర్పాట్లు చేస్తాడు? మరి పర్వతాలు ఏర్పాటు చేసిన పెళ్లి జరిగిందా? అసలు ధైర్య సాహసాలు కలిగిన కీర్తి పెళ్లి మండపం దాకా ఎందుకు వచ్చింది? ఆమె మనసులో ఎవరైనా ఉన్నారా? చివరకి కీర్తి గెలిచిందా? పర్వతాలు గెలిచాడా అనేదే క్రేజీ కళ్యాణం. ఎనాలసిస్  మూవీ చూస్తున్నంత సేపు బోర్ కొట్టకుండా ఆహ్లాదకరంగా సాగింది. కానీ కీర్తి బాగా తెలివైంది కాబట్టి, తన తండ్రిని బాధపెట్టకుండా తండ్రి కోరిక ప్రకారమే పెళ్ళికి ఒప్పుకొని, తన లవర్ ఉదయ్( అఖిల్ రాజ్)  బావ( తరుణ్ భాస్కర్) తో కలిసి మాయ చేసి తన తండ్రే నీకు ఇష్టమొచ్చిన అబ్బాయిని చేసుకో అనేలా చేసి ఉంటే క్రేజీ కళ్యాణం ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండేది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కీర్తి ఇంట్రడక్షన్ తో పాటు ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్ కి కనెక్ట్ సీన్స్ లింక్ చేసుకుంటూ వచ్చిన సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఆల్కహాల్ అడిట్  బాలరాజు( తరుణ్ భాస్కర్) సీన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఈ క్యారక్టర్ పై ఇంకా సీన్స్ క్రియేట్ చేసి మంచి ఎంటర్ టైన్ మెంట్ ని సృష్టించాల్సింది.   నరేష్, నరేష్ మదర్, కీర్తి  మధ్య వచ్చిన సీన్స్ నాచురల్ గా ఉండటం ప్లస్ పాయింట్. కీర్తి, ఉదయ్ మధ్య వచ్చిన సీన్స్ మాములే. ఎలాంటి మెరుపులు లేవు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ చూసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఏర్పడింది. పెళ్లి జరుగుతుంటే   తన తల్లి చనిపోయినా, ఆ విషయాన్నీ దాచి కీర్తికి పెళ్లి జరిపించాలనుకునే ఎపిసోడ్ బాగా పేలింది. కానీ ఆమె బతికే ఉందనే థ్రిల్ ని మాత్రం సింపుల్ గా తేల్చేసారు. ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ బాగున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన నాచురల్ పెర్ఫార్మ్ తో ఆకట్టుకుంది. అన్ని రకాల ఎమోషన్స్ ని అవలీలగా పండించింది. నరేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పర్వతాలు అనే క్యారక్టర్ లో జీవించేసారు. అసలు ఆ క్యారక్టర్ లేనిదే సినిమానే లేదు. ఎవరైనా నటన నేర్చుకోవాలనుకంటే పర్వతాలు క్యారక్టర్ ని చూసి నేర్చుకోవచ్చు. ఇక తరుణ్ భాస్కర్ కూడా అంతే. తన అద్భుతమైన పెర్ఫార్మ్ తో సినిమాకి మరో బలంగా నిలిచాడు. సరైన సినిమా పడితే రాబోయే రోజుల్లో తెలుగు సినిమాని ఏలతాడని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉదయ్ గా చేసిన అఖిల్ రాజ్ తో పాటు  మిగతా అందరూ కూడా తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు మెప్పించారు. దర్శకుడిగా భద్రప్ప మెప్పించాడు. రైటర్ గా సోసో. నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ బాగున్నాయి. బలాలు 1 . అనుపమ పరమేశ్వరన్, నరేష్ పెర్ ఫార్మెన్స్  2 . కథనం బలహీనతలు  1 .ఎంటర్ టైన్ మెంట్ ని మరింతగా ఎలివేట్ చెయ్యకపోవడం  చివరిగా చెప్పుకోవాలంటే అసభ్యతకి తావు లేని విధంగా మంచి పాయింట్ తో క్రేజీ కళ్యాణం సాగింది. రేటింగ్ 2 .5 /5                                                                                                                        అరుణాచలం                                                                                                                                                                                                                                                               
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. భుజానికి గాయం కావడంతో కొంతకాలంగా షూటింగ్‌కు దూరంగా ఉన్న తారక్.. తిరిగి కెమెరా ముందుకు వచ్చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్‌లో అక్టోబర్ 15న పాల్గొన్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ వేగం పుంజుకోనుంది. ఇకపై వరుస షెడ్యూల్స్‌తో షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో తనదైన యాక్షన్ శైలిని చూపించిన ప్రశాంత్ నీల్.. ఈసారి తారక్‌ను సరికొత్త అవతారంలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆగస్టు 12న ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ జరిగింది. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటూ ఫిజియోథెరపీ కూడా చేశారు. దీంతో షూటింగ్‌కు కొంత విరామం ఏర్పడింది. అయితే తారక్ షూటింగ్‌కు దూరంగా ఉన్నా.. ప్రశాంత్ నీల్ మాత్రం చిత్రీకరణను పూర్తిగా ఆపలేదు. ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలను ఇతర నటీనటులతో తెరకెక్కించారు. ఇప్పుడు తారక్ తిరిగి సెట్స్‌లోకి రావడంతో ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణపై దృష్టి పెట్టనున్నారు. ఎన్టీఆర్ రీఎంట్రీతో ‘డ్రాగన్’ షూటింగ్ మళ్లీ జోరందుకోనుందని తెలుస్తోంది. మిగిలిన చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు వరుస షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి షూటింగ్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ సినిమా జూన్ 11, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్, బిజూ మీనన్, అశుతోష్ రాణా, ఖుష్బూ సుందర్, అంషుమాన్ పుష్కర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: రామ్ చరణ్ నుంచి ఎన్టీఆర్ వరకు.. బాలీవుడ్ మేకర్స్‌కు నో చెబుతున్నారా.?       [Jr NTR Returns to Dragon Sets, Dragon Release Date, Jr NTR Dragon Movie, Dragon Movie Update, Jr NTR Comeback, NTR Neel Movie, Jr NTR, Prashanth Neel, Rukmini Vasanth, Telugu Film News]  
Matt Reeves has clarified that he is not leaving The Batman Part II after reports emerged that Steven Soderbergh would step in to help complete the film’s principal photography. The filmmaker took to X to address concerns about his involvement in the highly anticipated sequel, revealing that Soderbergh has come forward to help him during a challenging period. “Just to be clear, I am not leaving The Batman Part II. I am profoundly grateful to Steven for coming to my aid during this challenging time to help me finish principal photography. Thank you to all for your concern and well wishes,” Reeves wrote. The clarification comes after The Batman Part II temporarily paused production earlier this month as Reeves stepped away to attend to a family matter. With the filmmaker unable to continue working on the set for the time being, Oscar-winning director Steven Soderbergh has offered to oversee the remaining weeks of principal photography. According to reports, Soderbergh approached Reeves himself, with DC Studios extending its full support for the arrangement. Soderbergh has also made it clear that his objective is to work with Reeves and his team to ensure the new footage integrates seamlessly with the material already shot, preserving the original filmmaker’s vision. Starring Robert Pattinson as Batman, the sequel also features returning cast members Jeffrey Wright, Andy Serkis and Colin Farrell, alongside newcomers Scarlett Johansson and Sebastian Stan. After multiple delays, The Batman Part II is currently scheduled to arrive in theatres on February 18, 2028. Reeves’ latest statement makes it clear that Soderbergh’s involvement is intended to help complete filming rather than signal a permanent departure from the project. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఒకప్పుడు బాలీవుడ్ దర్శకుడితో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉండేవి. ముఖ్యంగా మన స్టార్ హీరోలు హిందీ మార్కెట్‌లోకి వెళ్లాలంటే బాలీవుడ్ మేకర్స్‌తో సినిమాలు చేయడం ఒక మార్గంగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మన హీరోలు సౌత్ దర్శకులతోనే భారీ ప్రాజెక్టులు చేస్తూ.. దేశవ్యాప్తంగా తమ మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ దర్శకుల కంటే మన దర్శకులకే స్టార్ హీరోలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే చర్చ మొదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో బాలీవుడ్ ఎంట్రీగా వచ్చిన ‘జంజీర్’ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఆయన ప్రధానంగా తెలుగు దర్శకులతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హిందీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ‘వార్ 2’లో నటించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులూ సౌత్‌కు చెందిన దర్శకులతోనే చేస్తున్నారు. 'ఆదిపురుష్' తర్వాత ప్రభాస్ సౌత్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ తో 'కల్కి 2' ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. మహేశ్ బాబు విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా, లోకేష్ కనగరాజ్, సుకుమార్ వంటి దర్శకులతో చేతులు కలిపే ఛాన్స్ ఉంది. 'పుష్ప'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఇలా మన స్టార్ హీరోల తదుపరి సినిమాల లైనప్‌ను పరిశీలిస్తే.. సౌత్ దర్శకుల పేర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి బాలీవుడ్ దర్శకులను పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పలేకపోయినా.. మన దర్శకులపై హీరోలకు ఉన్న నమ్మకం, వారితో సినిమాలు చేసేందుకు చూపిస్తున్న ఆసక్తి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: వారణాసి vs రామాయణ: రాజమౌళిని సవాల్ చేస్తున్న బాలీవుడ్ ఎపిక్.!       [Tollywood Heroes, South Directors, Bollywood Directors, Ram Charan, Jr NTR, Prabhas, Mahesh Babu, Allu Arjun, Pan India Movies, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రతిరోజూ మనం ఉదయాన్నే తెల్లటి పాలను తాగడం చూస్తూనే ఉంటాం, కానీ ఎప్పుడైనా నల్ల పాలు అనగా బ్లాక్ మిల్క్ గురించి విన్నారా? తన అందం, అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ప్రముఖ నటి అదా శర్మ తాను తాజాగా నల్ల పాలు తాగుతున్న వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడంతో ఈ సరికొత్త ట్రెండ్ హాట్ టాపిక్‌గా మారింది. రోజువారీ ఆహారంలో ఒకేలాంటి పాలు తాగి విసిగిపోయిన వారికి లేదా ఆరోగ్యపరంగా సరికొత్త ప్రయోజనాలను కోరుకునేవారికి ఈ నల్ల పాలు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ బ్లాక్ మిల్క్ కేవలం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, చర్మానికి మరియు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన పాలను ప్రధానంగా నల్ల నువ్వులు మరియు జీడిపప్పులను ఉపయోగించి తయారు చేస్తారు. వీటిలో శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ మరియు జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు ఎముకలను పటిష్టంగా మార్చడంలో సహాయపడటమే కాకుండా, జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. ఈ ఆరోగ్యకరమైన బ్లాక్ మిల్క్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా ఒక అరకప్పు నల్ల నువ్వులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్‌లో ఈ నువ్వులను వేసి పొడిగా (డ్రై రోస్ట్) వేయించాలి. నువ్వులు చిటపటలాడటం ప్రారంభించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అదే పాన్‌లో 8 నుంచి 10 జీడిపప్పులను వేసి దోరగా వేయించుకోవాలి. వేయించిన నువ్వులు కాస్త చల్లారిన తర్వాత, వాటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులోనే వేయించిన జీడిపప్పులు, గింజలు తీసేసిన 2 ఖర్జూరాలు, చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పల్చటి కాటన్ వస్త్రాన్ని తీసుకుని, ఈ మిశ్రమాన్ని అందులో వేసి గట్టిగా పిండాలి. ఇలా చేయడం ద్వారా స్వచ్ఛమైన, చిక్కటి పాలు లాంటి ద్రవం వెలువడుతుంది. దీనిని ఒక గ్లాసులోకి తీసుకుంటే పోషకాలు నిండిన నల్ల పాలు రెడీ అవుతాయి. అంతేకాకుండా, ఈ పాలు తయారు చేయగా మిగిలిన నువ్వులు, జీడిపప్పుల పిప్పిని పారేయకుండా అదా శర్మ ఒక అద్భుతమైన ఫేస్‌ప్యాక్‌లా కూడా ఉపయోగిస్తారు. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని సుమారు 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చేతులతో సున్నితంగా స్క్రబ్ చేస్తూ కడిగేయడం వల్ల ముఖం అత్యంత మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది. ఈ విధంగా ఒకే పదార్థంతో అటు ఆరోగ్యాన్ని, ఇటు అందాన్ని కాపాడుకునే ఈ సరికొత్త ఆరోగ్య రహస్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.     Adah Sharma black milk, secret black milk recipe, black milk health benefits, Adah Sharma diet secret, natural detox drinks, celebrity health drinks, charcoal sesame milk recipe.
ప్రపంచ వెన్నుముక దినోత్సవం (World Spine Day) సందర్భంగా, జిమ్‌లో చేసే వ్యాయామాలు మరియు బరువులు ఎత్తడం వల్ల వెన్నుముకకు శాశ్వత నష్టం కలుగుతుందా లేదా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. కోల్‌కతాలోని నారాయణ ఆర్‌ఎన్ టాగోర్ హాస్పిటల్ కన్సల్టెంట్, స్పైన్ సర్జన్ డాక్టర్ సాయి విక్షేత్ రాజ్ బసాని దీనిపై స్పష్టతనిచ్చారు. సరైన పద్ధతిలో చేసే స్ట్రెంత్ ట్రైనింగ్ వెన్నుముకను పాడుచేయదు సరికదా, దానికి మద్దతుగా నిలిచే కండరాలను బలోపేతం చేస్తుందని మరియు కోర్ స్టెబిలిటీని మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. చాలా మంది జిమ్ వ్యాయామాలు లేదా బరువులు ఎత్తడం వల్లే వెన్నుపూస దెబ్బతింటుందని తప్పుగా భావిస్తుంటారు, కానీ వాస్తవానికి సమస్య వ్యాయామంలో లేదు, దానిని చేసే విధానంలోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర సామర్థ్యానికి మించి బరువులు ఎత్తడం, సరైన భంగిమ (Posture) పాటించకపోవడం మరియు వ్యాయామ తీవ్రతను ఒక్కసారిగా పెంచడం వంటి పొరపాట్లు వెన్నుముక డిస్కులు, కీళ్లు, స్నాయువులు మరియు చుట్టుపక్కల కండరాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. వ్యాయామం చేసిన వెంటనే వెన్నునొప్పి రాగానే అది వెన్నుముకకు జరిగిన శాశ్వత నష్టంగా భావించకూడదని డాక్టర్ బసాని స్పష్టం చేశారు. కొత్తగా లేదా కఠినమైన వ్యాయామాలు చేసేటప్పుడు కండరాల నొప్పులు రావడం సహజం, సరైన విశ్రాంతి తీసుకుంటే ఇవి తగ్గిపోతాయి. అయితే, నొప్పిని లెక్కచేయకుండా అదేపనిగా వ్యాయామాలు కొనసాగించడం, లక్షణాలను విస్మరించడం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది. వ్యాయామం చేసేటప్పుడు కొందరు తమ శారీరక శక్తిని మించి బరువులు ఎత్తుతుంటారు. అలసట కారణంగా కండరాలు బలహీనపడినప్పుడు, రిపీటీషన్లను పూర్తి చేయడానికి భంగిమను తప్పుగా మారుస్తుంటారు. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వకుండా పదేపదే అదే కండరాల సమూహాలపై తీవ్రమైన వ్యాయామాల భారాన్ని మోపడం కూడా ప్రమాదకరమే. కాబట్టి, భారీ బరువుల కంటే సరైన టెక్నిక్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, బరువులను క్రమంగా పెంచుకోవాలని మరియు ప్రతి సెషన్‌ మధ్య తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. వెన్నునొప్పి తగ్గకుండా దీర్ఘకాలం కొనసాగడం, తిమ్మిర్లు రావడం, కండరాల బలహీనత లేదా కాళ్లలోకి నొప్పి పాకడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే మూత్ర విసర్జన లేదా మలవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం, గజ్జ ప్రాంతంలో తిమ్మిర్లు వంటి అత్యవసర లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ మెడికల్ అసెస్‌మెంట్ పొందాలి, ఎందుకంటే ఇవి తీవ్రమైన నరాల కుదింపును (Nerve Compression) సూచిస్తాయి. చివరగా, భయంతో వెన్నుముక వ్యాయామాలు లేదా వెయిట్ ట్రైనింగ్‌ను పూర్తిగా మానుకోవడం పరిష్కారం కాదని, తెలివిగా వ్యాయాయం చేయడం నేర్చుకోవాలని డాక్టర్ బసాని సూచించారు. బలవర్ధకమైన శరీరాన్ని నిర్మించడం అనేది ఒక క్రమమైన ప్రక్రియ అని, డంబెల్ లేదా బార్‌బెల్ మీద కనిపించే నంబర్ కంటే సరైన పద్ధతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ప్రపంచ వెన్నుముక దినోత్సవం మన శరీర ఆకృతిని రక్షించుకోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. సరైన శిక్షణ, దశలవారీగా బరువు పెంచడం మరియు ముందస్తు హెచ్చరికలను గమనించి తగిన వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఎవరైనా తమ వెన్నుముకను ఆరోగ్యంగా ఉంచుకుంటూ బలమైన శరీరాన్ని పొందవచ్చు.     gym workouts spine damage, back pain gym exercises, gym spine injuries myths, safe heavy lifting tips, gym back safety, gym workouts safe for spine, fitness spine care.  
మన ఇంట్లోని ఫ్లోర్ ఎంత మెరిసిపోతున్నప్పటికీ, టైల్స్ మధ్యలో ఉండే గ్యాప్స్ లేదా సిమెంట్ లైన్స్ నల్లగా మారిపోతే మాత్రం ఇల్లు మొత్తం మురికిగా, పాతదానిలా కనిపిస్తుంది. ముఖ్యంగా రోజూ వాడే వంటగది మరియు బాత్రూమ్‌లలో ఈ సమస్య అత్యంత సాధారణంగా కనిపిస్తుంటుంది. మనం రోజువారీగా ఇల్లు ఎంత శ్రద్ధగా ఊడ్చి, మోపింగ్ చేసినప్పటికీ ఆ సన్నని గ్యాప్‌లలో పేరుకుపోయే నల్లటి మురికి అంత సులభంగా వదలదు. దీంతో చాలామంది మార్కెట్లో లభించే ఖరీదైన క్లీనర్లు కొనుగోలు చేయడం లేదా ఇనుప పీచులతో టైల్స్‌ను గట్టిగా రుద్దడం వంటి పనులు చేస్తుంటారు. దీనివల్ల అనవసరమైన శ్రమ పెరగడంతో పాటు టైల్స్ రంగు మారి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అయితే, దీనికోసం భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు, మన ఇంట్లోని వంటగది సామాన్లతోనే ఈ సమస్యను చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. అసలు టైల్స్ మధ్యలో ఈ నల్లటి మురికి ఎందుకు చేరుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. సాధారణంగా టైల్స్ పైభాగం చాలా నునుపుగా ఉండటం వల్ల వాటిపై పడే దుమ్ము, ధూళి సులభంగా తుడిచిపోతాయి. కానీ, రెండు టైల్స్ మధ్యలో ఉండే సిమెంట్ లేదా గ్రౌటింగ్ భాగం కొద్దిగా రంధ్రాలతో ఉండి, కాలక్రమేణా దుమ్ము, మురికి మరియు తేమను తనలోకి పీల్చుకుంటుంది. అందుకే ఆ ప్రాంతంలో క్రమంగా నల్లటి పొర పేరుకుపోతుంది. ఇక వంటగదిలో వంట చేసేటప్పుడు ఎగిరే నూనె జిడ్డు, పొగ మరియు ఆవిరి ఆ లైన్లపై పడి గట్టిపడతాయి. మరోవైపు బాత్రూమ్‌లలో అయితే ఎల్లప్పుడూ నీరు నిలవడం వల్ల అధిక తేమ ఏర్పడి, మురికితో పాటు ప్రమాదకరమైన ఫంగస్, పాచి కూడా తయారవుతాయి. దీనివల్ల ప్రారంభంలో తెల్లగా లేదా లేత రంగులో ఉండే ఆ లైన్లు కాస్త నల్లగా మారి ఇల్లు శుభ్రత లేనిదానిలా కనిపిస్తుంది. ఈ నల్లటి మురికి పొరను సురక్షితంగా మరియు సమర్థవంతంగా వదిలించడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ముందుగా ఒక చిన్న గిన్నెలో తగినంత బేకింగ్ సోడా తీసుకుని, అందులో కొద్దికొద్దిగా నీరు కలుపుతూ చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ టైల్స్ మధ్యలో ఉన్న గ్యాప్‌లలో సులభంగా అంటుకునేలా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను టైల్స్ మధ్య నల్లగా మారిన ప్రదేశంలో వేళ్లతో లేదా బ్రష్‌తో సరిగ్గా వర్తింపజేయాలి. మురికి లోతుగా వదిలిపోవడానికి ఈ పేస్ట్‌ను కొన్ని నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత ఇంట్లో వాడని పాత టూత్‌బ్రష్ లేదా మెత్తటి ప్లాస్టిక్ బ్రష్‌తో ఆ లైన్లను మెల్లగా రుద్దాలి. ఈ ప్రక్రియలో ఎప్పుడూ ఎక్కువ బలప్రయోగం చేయడం కానీ, ఇనుప స్క్రాపర్లు వాడటం కానీ అస్సలు చేయకూడదు. అలా చేస్తే గ్యాప్‌లలో ఉన్న సిమెంట్ ఊడిపోయి టైల్స్ లూజ్ అయ్యే ప్రమాదం ఉంది. బ్రష్‌తో శుభ్రం చేశాక ఒక తడి గుడ్డతో ఆ పేస్ట్‌ను మరియు విడిపోయిన మురికిని పూర్తిగా తుడిచేయాలి. ఆ తర్వాత మంచి నీళ్లతో శుభ్రంగా కడిగి, చివరగా పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టాలి. ముఖ్యంగా బాత్రూమ్‌లో నీరు నిలవకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే తేమ ఉంటే మళ్లీ ఫంగస్ వేగంగా చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఈ శుభ్రత ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పక పాటించాలి. చాలామంది బేకింగ్ సోడా మరియు వెనిగర్ కలిపి వాడుతుంటారు, అలా కలిపినప్పుడు కెమికల్ రియాక్షన్ వచ్చి నురుగు వస్తుంది కానీ దానివల్ల శుభ్రం కావడం అనేది అంతగా జరగకపోవచ్చు. పైగా వెనిగర్ మరియు నిమ్మరసంలో ఉండే యాసిడ్ గుణాలు మార్బుల్స్, గ్రానైట్ లాంటి సహజమైన రాళ్లను మరియు సిమెంట్ బంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అలాగే బ్లీచింగ్ పౌడర్ లేదా బ్లీచ్‌ను ఎప్పుడూ కూడా వెనిగర్, నిమ్మరసం లేదా ఇతర కెమికల్ క్లీనర్లతో కలపకూడదు. అలా కలిపితే విషపూరితమైన వాయువులు వెలువడి శ్వాసకోశ ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తాయి. టైల్స్ మధ్య ఎప్పుడూ మురికి పేరుకోకుండా ఉండాలంటే వంటగదిలో నూనె పడిన వెంటనే తుడిచేయాలి. వారాంతాల్లో మెత్తటి బ్రష్‌తో ఆ లైన్లను శుభ్రం చేసుకోవడం ద్వారా మీ ఇల్లు ఎప్పుడూ సరికొత్తగా, మెరిసిపోతూ కనిపిస్తుంది.     tile grout cleaning, clean black dirt between tiles, floor tile cleaning tips, bathroom tile grout cleaner, natural tile cleaner home remedies, clean tile gaps easily.  
  శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి , చిన్నచిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి మన పెద్దలు ఎన్నో రకాల గృహ వైద్యాలను సూచించారు. అలాంటి వాటిలో నాభిలో నూనె వేసుకోవడం అనేది చాలా కాలంగా వస్తున్న ఒక సాంప్రదాయ పద్ధతి. ముఖ్యంగా శీతాకాలం లేదా మారుతున్న కాలానికి తగినట్లుగా చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో రాత్రి పడుకునే ముందు నాభిలో కొన్ని చుక్కల ఆవనూనె రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దాని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. చర్మానికి తేమను అందిస్తుంది.. సాంప్రదాయం వైద్యంలో, ఇంటి చిట్కాలలోనూ, రోజువారీ అలవాట్ల లోనూ నాభికి నూనె రాయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. ఆవనూనెలో సహజ సిద్ధమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన తేమను అందించడంలో సహాయపడతాయి. రాత్రి సమయంలో నిద్రపోయే ముందు బొడ్డు ప్రాంతంలో ఆవనూనెను రాసుకోవడం ద్వారా చర్మం లోపలి నుండి పోషణ పొందుతుంది. ఆయుర్వేదంలో శరీరానికి నూనెతో మర్దన చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.  పొడి చర్మానికి రక్షణ.. మారుతున్న వాతావరణం కారణంగా చాలా మందిలో చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది. దీనివల్ల చర్మంపై పీచు వలె గరుకుగా మారడం, లాగడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో ఆవనూనెలో ఉండే కొవ్వు పదార్థాలు చర్మం పైపొరను మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. కేవలం నాభి చుట్టూ మాత్రమే కాకుండా, ఈ నూనె రాయడం వల్ల శరీరంలోని ఇతర భాగాల చర్మానికి కూడా మంచి అనుభూతి కలుగుతుంది. అయితే తీవ్రమైన పొడి చర్మం ఉన్నవారు నేరుగా మంచి మాయిశ్చరైజర్లను ఉపయోగించడం మరింత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. పగిలిన పెదాలను రిపేర్ చేస్తుంది.. చలికాలం లేదా ఎండ తీవ్రత కారణంగా పెదవులు పగిలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంది. పెదవులు పగిలి రక్తం రావడం లేదా ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నాభిలో రెండు లేదా మూడు చుక్కల ఆవనూనె వేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల పెదవులు పొడిబారకుండా మృదువుగా మారుతాయని చెబుతారు. అయితే దీనితో పాటు పెదవుల సంరక్షణ కోసం సాధారణ లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. జీర్ణవ్యవస్థ కు మంచిది.. జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, కడుపులో తేలికపాటి అసౌకర్యం లేదా నొప్పిగా ఉన్నప్పుడు పొట్ట భాగంలో గోరువెచ్చని నూనెతో మర్దన చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆవనూనె వంటి వాటితో మసాజ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది.  మహిళల నెలసరిలో.. ముఖ్యంగా మహిళలకు నెలసరి సమయాల్లో పొత్తికడుపులో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ పద్ధతి కొంత వరకు మానసిక ప్రశాంతతను , మంచి నిద్రను ఇస్తుంది. ఎలా ఉపయోగించాలి? ఆవనూనెను నాభిలో ఎలా ఉపయోగించాలనే సరైన పద్ధతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు నాభి ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి పొడిగా ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు చుక్కల ఆవనూనెను తీసుకుని, నాభిలో , దాని చుట్టూ ఉన్న చర్మంపై సున్నితంగా రాయాలి. దీనిని చాలా గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు అలాగే అతిగా నూనె పోయాల్సిన పని కూడా లేదు.  కొద్దిపాటి నూనెతో సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది. అయితే ఈ పద్ధతి అందరికీ ఒకేలా సరిపోతుంది అని చెప్పలేము. సున్నితమైన చర్మం ఉన్నవారికి లేదా ఆవనూనె పడని వారికి దీనివల్ల చికాకు, ఎరుపుదనం, దురద లేదా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నూనె రాసిన తర్వాత ఏమైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే  కడిగివేయాలి. ఎలాంటి సమస్యలు లేనివారు ఈ చిట్కాను పాటిస్తూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.                  *రూపశ్రీ.
థైరాయిడ్ సమస్యలు మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యల వెనుక థైరాయిడ్ హార్మోన్ల పాత్ర ఎంత? మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, థైరాయిడ్ పనితీరుకు మధ్య సంబంధం ఉందా? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన సందేహాలకు ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు, Cell Health Clinics వ్యవస్థాపకులు డాక్టర్ చింతా రవికుమార్ వివరణ ఇచ్చారు. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? మహిళల శరీరంలో యుక్తవయస్సు, నెలసరి, గర్భధారణ, ప్రసవం, మెనోపాజ్ వంటి వివిధ దశల్లో హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని మార్పుల వల్ల కూడా మహిళలకు థైరాయిడ్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రతి మహిళకూ థైరాయిడ్ సమస్య వస్తుందని కాదు. లక్షణాలను గుర్తించడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. TSH, T3, T4 హార్మోన్లు ఏం చేస్తాయి? థైరాయిడ్ గ్రంథి శరీరంలో జీవక్రియలు, శక్తి వినియోగం, బరువు నియంత్రణ వంటి అనేక ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. TSH పరీక్ష ద్వారా థైరాయిడ్ పనితీరు గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకోవచ్చు. T4 హార్మోన్ శరీరంలో T3 అనే క్రియాశీల హార్మోన్‌గా మారుతుంది. ఈ మార్పిడిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? థైరాయిడ్ పరీక్షల్లో వచ్చే ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలను డాక్టర్ వివరిస్తారు. గట్ హెల్త్‌కు థైరాయిడ్‌కు సంబంధం ఏమిటి? మన పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు జీర్ణక్రియతో పాటు శరీరంలోని కొన్ని జీవక్రియల్లోనూ పాత్ర పోషిస్తాయి. పోషకాలు సరిగా అందడం, పేగుల ఆరోగ్యం, శరీరంలోని హార్మోన్ల ప్రక్రియలు పరస్పరం ప్రభావితం చేసుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ల పనితీరులో గట్ హెల్త్ పాత్ర ఏమిటి? జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై ఎందుకు శ్రద్ధ పెట్టాలి? అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హషిమోటోస్ థైరాయిడిటిస్ అంటే ఏమిటి? రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసే ఆటో ఇమ్యూన్ పరిస్థితిని హషిమోటోస్ థైరాయిడిటిస్ అంటారు. ఇది థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, వైద్య పరీక్షల ప్రాధాన్యత గురించి డాక్టర్ వివరిస్తారు. PCOS, బరువు పెరగడం, నెలసరి సమస్యలకు థైరాయిడ్ కారణమా? PCOS ఉన్న మహిళల్లో నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. థైరాయిడ్ సమస్యల్లోనూ ఇలాంటి కొన్ని లక్షణాలు ఉండవచ్చు. అయితే ఈ సమస్యలన్నింటికీ థైరాయిడ్ ఒక్కటే కారణం కాదు. లక్షణాలను బట్టి సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. థైరాయిడ్ ఆరోగ్యానికి అయోడిన్, సెలీనియం, జింక్ ఎందుకు అవసరం? థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అయోడిన్ అవసరం. సెలీనియం, జింక్ వంటి పోషకాలు కూడా శరీరంలోని సాధారణ జీవక్రియలకు, థైరాయిడ్ హార్మోన్ల ప్రక్రియలకు తోడ్పడతాయి. వీటిని ఆహారం ద్వారా తగినంతగా పొందడం ఎందుకు ముఖ్యం? పోషకాల లోపం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు? అనే విషయాలపై ఈ వీడియోలో అవగాహన పొందవచ్చు. మెదడు ఆరోగ్యం, డోపమైన్, సెరోటోనిన్‌తో సంబంధం ఏమిటి? డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాలు మెదడులో మానసిక స్థితి, ప్రేరణ, నిద్ర వంటి విధులకు సంబంధించిన ప్రక్రియల్లో పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత శక్తి స్థాయులు, ఏకాగ్రత, మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపవచ్చు? ఈ అంశాల గురించి కూడా డాక్టర్ వివరిస్తారు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదలకు కూడా థైరాయిడ్ హార్మోన్లు ముఖ్యమైనవి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల ప్రకారం పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన చికిత్సను కొనసాగించడం ముఖ్యం. గర్భం దాల్చాలని ఆలోచిస్తున్న మహిళలు కూడా తమ థైరాయిడ్ ఆరోగ్యం గురించి వైద్యులను సంప్రదించాలి. మహిళల్లో థైరాయిడ్ సమస్యలకు గల కారణాలు, TSH స్థాయులు, T4 నుంచి T3గా మారే ప్రక్రియ, హషిమోటోస్ థైరాయిడిటిస్, PCOS, గట్ హెల్త్, అవసరమైన పోషకాలు, మెదడు ఆరోగ్యం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ముఖ్యమైన అంశాలపై డాక్టర్ చింతా రవికుమార్ అందించే పూర్తి వివరణను ఈ వీడియోలో చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్లు అనుమానం వచ్చినా, పరీక్షల్లో మార్పులు కనిపించినా వైద్యులను సంప్రదించండి. వైద్యుల సలహా లేకుండా థైరాయిడ్ మందులను ఆపడం లేదా వాటి మోతాదును మార్చడం చేయకండి. పోషకాహార సప్లిమెంట్లను కూడా వైద్యుల సూచనల మేరకే ఉపయోగించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)