తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీలో అంతర్గత సమన్వయం వంటి అంశాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్  పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్ణయాల నుంచి ప్రభుత్వ హామీల అమలు వరకు అనేక అంశాలపై టీపీసీసీ అధ్యక్షుడు తన అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో కాంగ్రెస్‌లో ప్రతి చిన్న నిర్ణయానికీ ఢిల్లీ నాయకత్వం వైపు చూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పార్టీ నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పెరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అక్కడక్కడా వినిపించే భిన్నాభిప్రాయాలను పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. బీసీలకు 52 శాతం ప్రాతినిధ్యం.. కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో సామాజిక న్యాయం, ముఖ్యంగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం కీలకంగా మారిందని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. 43 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పార్టీ పరంగా బీసీలకు 52 శాతం ప్రాతినిధ్యం కల్పించామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, మంత్రుల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జాప్యం, వాటి ప్రస్తుత పరిస్థితిపై కూడా రాజకీయ చర్చ కొనసాగుతోంది. నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి, నిర్మాణ లోపాలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, కేంద్ర సంస్థల విచారణ విషయంలో బీజేపీ వైఖరిని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ సంబంధాలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కూడా బలంగా వినిపించారు. 90 వేల ఉద్యోగాలు.. హామీల అమలుపై కాంగ్రెస్ వాదన.! ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన హామీల అమలు కూడా తుది దశకు చేరుకుంటోందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. 90 వేల ఉద్యోగాల కల్పనపై వస్తున్న విమర్శలకు ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామకాల వివరాలే సమాధానమని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనతను అధిగమించేందుకు పటిష్టమైన అభ్యర్థుల అన్వేషణ జరుగుతోందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రజల మద్దతుకు నిదర్శనమని ఆయన పేర్కొన్న నేపథ్యంలో, రాబోయే ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాలపై భవిష్యత్తు ప్రభావం.! మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి అద్దం పడుతున్నాయి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగ నియామకాలు, సాగునీటి ప్రాజెక్టుల వివాదాలు రాబోయే ఎన్నికల్లో కీలక అంశాలుగా మారనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పార్టీ బలాన్ని పెంచుకోవడంతో పాటు, అంతర్గత విభేదాలకు తావులేకుండా నాయకుల మధ్య సమన్వయం కొనసాగించడం కాంగ్రెస్‌కు సవాలుగా మారనుంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలంటే ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందే ఫలితాలే కీలకం కానున్నాయి. మొత్తంగా, బీసీ రాజకీయాలు, పార్టీ స్వేచ్ఛ, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాలపై విమర్శలు.. ఇలా తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు వన్ న్యూస్ ‘ది జర్నలిస్ట్’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తప్పక కుండా ఇంటర్వ్యూను వీక్షించండి. మీకు నచ్చవచ్చు: మనిషి 1400 ఏళ్లు బతకగలడా..వృద్ధాప్యానికి ఏఐ చెక్ పెట్టనుందా.! మీకు నచ్చవచ్చు: మిస్ యూనివర్స్ 2026 విజేతగా జెన్నిఫర్ బారెటో..తొలి వివాహితగా చరిత్ర.!      [ Telugu One News, TPCC Chief Mahesh Kumar Goud, The Journalist Interview, Telangana Congress, CM Revanth Reddy, TCongress Pary, Tone News ]
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని పురాతన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ తొలగింపు  అంశంపై వైసీపీ రాజకీయ డ్రామాకు తెరలేపింది.   జాతీయ రహదారి  విస్తరణ పనుల కోసం ఈ ఆలయాన్ని కూల్చివేశారంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హేరామ్ సేవ్ టెంపుల్స్ అంటూ షేర్ చేసిన పోస్టుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.  జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు.  వాస్తవానికి  రహదారి విస్తరణకురేణిగుంట మండలం పురాతన అభయాంజనేయ స్వామి  ఆలయ భూసేకరణ ప్రక్రియ  జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర   అధికార ప్రతినిధి యామినీ శర్మ ఆధారాలతో సహా వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భూమి అప్పగింతకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని, అప్పుడే పరిహారాన్ని కూడా నిర్ణయించారని ఆమె గుర్తుచేశారు. అంతే కాకుండా, ఈ ఆలయ తరలింపు ప్రక్రియ  గ్రామస్థులు, భక్తుల సమ్మతితోనే శాస్త్రోక్తంగా జరిగింది.  ఆలయ నిర్మాణం కోసం అక్కడకు సమీపంలోనే 50 సెంట్ల ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించడంతో పాటు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఖాతాలో  59.3 లక్షల పరిహార నిధులను కూడా అధికారులు జమ చేశారు.  ఇది కూడా చదవండి:  ఏపీలో ఆగని దాడులు.. మరో ఆలయంలో విగ్రహాల ధ్వంసం!​ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పర్యవేక్షణలో, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ప్రత్యామ్నాయ స్థలంలో బాలాలయం నిర్మించి, మూలవిరాట్టు విగ్రహాలను   ప్రతిష్ఠించిన తర్వాతే పాత నిర్మాణాలను తొలగించారు.  తన ప్రభుత్వ హయాంలో జరిగిన భూసేకరణ ఒప్పందాలను పక్కనపెట్టి, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా జగన్ ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   జగన్ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మీకు నచ్చవచ్చు:  శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం​ తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం! [Controversy, Anjaneyapuramtemple: Nationalhighway, YCP, Politics, Jagantweet, TeluguOne]  
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై త సుప్రియా సూలేను కూర్చోపెట్టే దిశగా ఎన్సీపీ(శరద్ పవార్) వ్యూహాలు రచిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసం సిల్వర్ ఓల్ లో జరిగిన సమావేశాలు, సంప్రదింపులను ఉదాహరణగా చూపుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయిన శరద్ పవార్.. మహా సీఎం పీఠంపై తన కుమార్తెను కూర్చోపెట్టే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు.  సిల్వర్ ఓక్ లో రహస్య మంతనాలు ఇందుకేనని విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే  తన పార్టీని ఎన్డీయే కూటమిలో చేర్చేందుకు ఆయన సమాయత్తమౌతున్నారు.    నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే  జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ నేపథ్యంలో  తన ఆరోగ్యం,  రాజకీయ వారసత్వం, పార్టీ భవిష్యత్తు వంటి అంశాలపై శరద్ పవాన్ దృష్టి కేంద్రీకరించారని చెబుతున్నారు.  ఇటీవల ప్రధానమంత్రి శరద్ పవార్ కు  ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, సుప్రియ సూలే తదితరులు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటారని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా  అజిత్ పవార్ మరణానంతరం మారిన పరిస్థితులు, విలీన చర్చలపై వచ్చిన వాదనలు మహా రాజకీయాలలో మారుతున్న, మారనున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతున్నాయి.  మహారాష్ట్రలో ఇప్పటికే అధికార కూటమిలోని  భాగస్వామ్య పక్షాల మధ్య సమతుల్యత,   పదవుల పంపకం వంటి అంశాలు ఒకింత గందరగోళంలో ఉన్నాయి. ఒకవేళ శరద్ పవార్ వర్గం ఎన్డీయే వైపు మొగ్గు చూపితే, మహారాష్ట్ర అధికార కూటమిలో సమీకరణాలు సమూలంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ కనుక  ఎన్డీయే కూటమిలో చేరితే.. అందుకు శరద్ పవార్ విధించే ఏకైక షరతు సుప్రియా సూలెకు సీఎం పదవి అని పరిశీలకులు అంటున్నారు. ఆ దిశగా బీజేపీతో ఇప్పటికే తెరవెనుక మంతనాలు సాగుతున్నాయని చెబుతున్నారు.  రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిపాలన, అభివృద్ధి అంశాలపై విపక్షాలు, అధికార పక్షాల మధ్య మాటల తూటాలు కొనసాగుతుండగానే, మరోవైపు కొత్త రాజకీయ పొత్తులపై తెరవెనుక చర్చలు జోరుగా సాగుతుండడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  నియోజకవర్గాల పునర్విభజన   భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని శరద్ పవార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.  ఇది కూడా చదవండి:  శరద్ పవార్..రాజకీయ చాణక్యుడు!​ రాబోయే రోజుల్లో పార్లమెంటు సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన చర్చలు, అలాగే మహారాష్ట్ర కూటమిలోని పరిణామాల ఆధారంగా ఈ ఊహాగానాల సాగుతున్నాయి.  మొత్తంగా ఎన్డీయేలో చేరికపై శరద్ పవార్ నిర్ణయం, సుప్రియ సూలే రాజకీయ భవిష్యత్ ఉజ్వలంగా ఉండేందుకు దోహదపడేలా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తానికి మహా రాజకీయాలు  శరద్ పవార్ చుట్టూ తిరిగుతున్నాయి.  ఆయన వ్యూహాలు ఏమేరకు సక్సెస్ అవుతాయి అన్నదానిపైనే  మహారాష్ట్ర పొలిటికల్ సినేరియాలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయన్న దానిపై క్లారిటీ వస్తుంది. మీకు నచ్చవచ్చు: రాజ్యసభ బరిలో శరద్ పవార్ అసలు సినిమా ముందుంది.. ఏక్ నాథ్ షిండే.. శివసేన చీలిక వెనుక కేంద్రం.. ఉద్ధవ్ [Supriya Sule, Sharad Pawar, Maharashtra politics, NDA alliance, delimitation,PawarStrategies, TeluguOne]
ALSO ON TELUGUONE N E W S
Mahesh Babu is reportedly planning a quick film with Malayalam director Jithu Madhavan after wrapping up his ambitious project Varanasi. The latest buzz suggests that the actor is keen to move on to a relatively quick project once Varanasi hits the screens. According to reports, Mahesh Babu has apparently loved the concept narrated by Jithu Madhavan, and the team is said to be planning to take the film on floors after the release of Varanasi. If the buzz turns out to be true, Mythri Movie Makers will produce the film.  Jithu Madhavan, who made a strong impression with his films, had earlier revealed plans to work with Fahadh Faasil after Scene. However, there has been no substantial update on that project, leaving fans curious about the director’s next move. There were also rumours that Jithu Madhavan might collaborate with young actor Naslen, who played antagonist in Scene, with speculation suggesting that the filmmaker was exploring a project with him as the lead. Now, the latest reports linking him with Mahesh Babu have added another layer of intrigue to his upcoming lineup. Also Read: Alias Rukmini Trailer: Interesting Concept  The possibility of Mahesh Babu working with a Malayalam filmmaker has naturally sparked interest, especially with the reports suggesting that the actor has already liked the concept. A quick film after Varanasi could also be an exciting prospect for fans waiting to see Mahesh in a different kind of story. However, Jithu Madhavan and his team are maintaining silence on the speculation. Neither the project nor the reported collaboration has been officially confirmed, and it remains to be seen whether Jithu Madhavan will indeed direct Mahesh Babu’s next film after Varanasi. Check Out:  Arjun to star in a Pan-India actioner                      Vrushakarma Trailer: An Epic Scale film Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన ఎంచుకున్న కథ, సినిమా ప్రారంభించబోతున్న వేదిక రెండూ ఆసక్తిని పెంచుతున్నాయి. ఏకంగా అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో తన కొత్త సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. దీంతో ఈ సినిమా రాముడి కథతో ముడిపడి ఉంటుందా? అనే చర్చ మొదలైంది. అర్జున్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించనున్నారు. నవంబర్ 27న అయోధ్యలో జరగనున్న ముహూర్త కార్యక్రమంలోనే సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనున్నారు. సాధారణంగా సినిమాల ప్రారంభోత్సవాలు స్టూడియోలు లేదా స్థానిక ఆలయాల్లో జరుగుతుంటాయి. కానీ అర్జున్ సినిమా కోసం అయోధ్య రామమందిరాన్ని ఎంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే అయోధ్యలో ప్రారంభమవుతోందనే కారణంతోనే ఇది పూర్తిగా రామాయణం నేపథ్యంలో తెరకెక్కే సినిమా అని చెప్పలేం. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందనుంది. ధైర్యం, త్యాగం, దేశం పట్ల బాధ్యత వంటి అంశాలు కథలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కథ, స్క్రీన్‌ప్లేను రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ అందిస్తున్నారు. సైనిక నేపథ్యం ఉన్న వ్యక్తి కథను సిద్ధం చేయడంతో ఈ సినిమాలో దేశభక్తి అంశాలను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి పెరుగుతోంది. ఇది కూడా చదవండి: రామాయణ టీమ్‌తో అమిత్ షా ప్రత్యేక భేటీ.! ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అనూప్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థకు ఇది మూడో సినిమా. బాలీవుడ్‌తో పాటు సౌత్ కు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు సమాచారం. మరి అయోధ్య వేదికగా అర్జున్ ప్రకటించబోయే సినిమా టైటిల్ ఏంటి? దేశభక్తి కథలో రామాయణానికి కూడా ఏదైనా ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు: బాహుబలి కాంబో రిపీట్‌.. వారణాసి తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి సినిమా.! ‘భోగి’కి A సర్టిఫికెట్.. సెన్సార్ టాక్ ఎలా ఉందంటే.?       [Arjun Sarja, Pan India Film, Ayodhya, Ram Mandir]  
A landmark cinematic collaboration is taking shape as Action King Arjun Sarja and prominent producer Anoop Mohan join forces for an ambitious patriotic Pan-India film. Mounted under the banner of Presidential Movies International Private Limited, the project marks the production house’s third feature film and brings together an accomplished creative team for a story rooted in India’s spirit, valour and national pride. The film’s auspicious muhurtham ceremony is scheduled to take place on November 27, 2026, at the sacred Sri Ram Janmabhoomi Temple in Ayodhya. Beginning a major cinematic venture at one of India’s most revered spiritual and cultural landmarks lends a special significance to the occasion. The ceremony will also witness the unveiling of the film’s official title, offering the first glimpse into a project conceived with a distinct national canvas. Arjun Sarja will shoulder the dual responsibilities of director and lead actor. An established force in Indian cinema, he has earned recognition through an extensive body of work spanning memorable action performances and directorial ventures. Bringing his experience as both an actor and filmmaker to this project, he will steer the narrative and its cinematic treatment while headlining the film. Envisioned as a large-scale Pan-India production, the film will bring together prominent actors and accomplished technicians from Bollywood and various regional film industries. The makers are assembling a diverse ensemble of talent, with further details about the cast and technical crew to be announced in the coming days. Also Read: Alias Rukmini Trailer: Interesting Concept  Anoop Mohan is producing the film under the banner of Presidential Movies International Private Limited. Jose M. Thomas Roy serves as Executive Producer, while retired Army officer Major Vijay Bhargavan has penned the story and screenplay. His military background brings a distinctive perspective to a narrative that seeks to explore the values of courage, sacrifice, duty and devotion to the nation. Rooted in patriotism and the enduring spirit of India, the film aspires to present a compelling story that combines emotional resonance with cinematic grandeur. Through its narrative, the makers aim to celebrate the valour of the nation and the sacrifices that have shaped its identity, while creating an engaging theatrical experience for audiences across linguistic and regional boundaries. The auspicious ceremony in Ayodhya is expected to be attended by prominent personalities from the Indian film fraternity, distinguished guests from various walks of life and specially invited dignitaries. For Presidential Movies International, this third production represents another significant step in its ambition to champion meaningful storytelling through large-scale cinematic ventures. With Arjun Sarja at the creative helm as director and lead actor, and Anoop Mohan backing the project as producer, the film is set to embark on its journey from Ayodhya on November 27, with its official title marking the beginning of an exciting new chapter. Check Out:  Allu Arjun grandly celebrates Arha's birthday                      Appa Kutty/ Nanna Kutty Movie Review               Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The trailer of Nithiin’s much-awaited Alias Rukmini, presented by Nani, has been unveiled and promises an engaging romantic entertainer with a novel premise. The film has generated curiosity since its first glimpse, with the trailer further raising expectations for Nithiin’s comeback. Nithiin plays Krishna, a soft-spoken and innocent family court typist. His nature and circumstances make people around him consider him unsuitable for marriage, while he struggles with his own fears and insecurities. Krishna’s unusual nightmares about intimacy lead him to write awareness books on taboo desires. His life takes a turn when he meets Rukmini and falls in love with her. Although she accepts his love, their journey towards marriage brings unexpected turbulence. Nithiin looks convincing as Krishna, bringing the character’s innocence and vulnerability to the fore. His transformation for the role and earnest performance make the character stand out, with the trailer hinting at a performance that could mark a strong comeback. Also Read: Appa Kutty/ Nanna Kutty Movie Review  Aafiya Sayed looks outstanding as Rukmini and shares a refreshing chemistry with Nithiin. Harshavardhan and Sai Kumar also make their presence felt in the trailer, adding weight to the narrative. Directed by Murali Kanth Devasoth and produced by Deepthi Ganta, Alias Rukmini features music by Vijai Bulganin, whose songs and background score add to the film’s appeal. The trailer promises a heart-touching romance that explores a rarely discussed subject, and the film is set to release worldwide on December 4. Check Out:  Vrushakarma Trailer: An Epic Scale film                       Salman Khan rehearsed for two days   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన రికార్డు పోరు మొదలైంది. నాగార్జున నటించిన ‘ఢమరుకం’ సినిమా నవంబర్ నెలలో సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డుకు ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు చేరువయ్యాయి. అవే ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE Repeat), ‘ఆకాశంలో ఒక తార’. ఒకటి ఈ వారంలోనే రికార్డును దాటే అవకాశం ఉండగా, రెండో సినిమా కూడా త్వరలోనే ఆ మార్క్‌ను అందుకునే దిశగా వెళ్తోంది. 2012 నవంబర్ 23న విడుదలైన ‘ఢమరుకం’ అప్పట్లో నాగార్జున కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.48 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. అప్పటి నుంచి నవంబర్ నెలలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఈ రికార్డు అలాగే కొనసాగుతోంది. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆ రికార్డుకు గట్టి పోటీ ఎదురవుతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఇప్పటికే మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. నవంబర్ 19న విడుదలైన ఈ సినిమా ఏడో రోజు ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ ట్రాకింగ్ సంస్థల అంచనాలు వెల్లడిస్తున్నాయి. రూ.48 కోట్ల మార్క్‌కు చేరాలంటే మరికొంత వసూలు చేయాల్సి ఉంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ కూడా బాక్సాఫీస్ దగ్గర తన జోరు చూపిస్తోంది. నవంబర్ 20న విడుదలైన ఈ సినిమా ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.37 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగితే ‘దమరుకం’ రికార్డుకు చేరువయ్యే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: జపాన్‌లో లెనిన్ రిలీజ్.. ప్రభాస్, ఎన్టీఆర్ రేంజ్‌కి అఖిల్ వెళ్తాడా.? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాలు కేవలం ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు రెండూ ఒకే సమయంలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ నాగార్జున రికార్డును అందుకునే దిశగా సాగుతున్నాయి. ఒకవేళ రెండూ రూ.48 కోట్ల మార్కును దాటితే, ఒకే ఏడాది నవంబర్‌లో విడుదలైన రెండు తెలుగు సినిమాలు ఆ రికార్డును అధిగమించినట్లవుతుంది. మరి ముందుగా ఈ రికార్డును బద్దలు కొట్టేది ‘ఈ నగరానికి ఏమైంది 2’నా? లేక ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఊహించని వేగంతో దూసుకొస్తుందా? మొత్తానికి ఈ వీకెండ్ బాక్సాఫీస్ లెక్కలు ఆసక్తికరంగా మారాయి. మీకు నచ్చవచ్చు: వృషకర్మ ట్రైలర్‌.. అసలు ఊహించలేదు.. పాన్ ఇండియా షేక్ అవుతుందేమో.! ఎన్టీఆర్‌లో ఆ యాంగిల్.. పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అనిల్ రావిపూడి హింట్.!       [Nagarjuna, Damarukam, November Record, ENE Repeat, Aakasamlo Oka Tara]  
అఖిల్ అక్కినేనికి మంచి విజయాన్ని అందించిన ‘లెనిన్’ సినిమా ఇప్పుడు మరో దేశంలో ప్రేక్షకులను పలకరించబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా జపాన్‌లో విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 11న అక్కడ థియేటర్లలోకి రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా ఓ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. అంతేకాదు, సినిమా ప్రమోషన్స్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో జపాన్‌లో ‘లెనిన్’ను ఏ స్థాయిలో విడుదల చేయబోతున్నారనే ఆసక్తి మొదలైంది. అఖిల్ కెరీర్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని ‘లెనిన్’ అందించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు. అఖిల్‌ను కొత్తగా చూపించడంతో పాటు, కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ప్రమోద్ పంజు, శివాజీ, ఈశ్వరీ రావు, సునీల్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌లో ఆ యాంగిల్.. పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అనిల్ రావిపూడి హింట్.! ఇక జపాన్‌లో తెలుగు సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. ముఖ్యంగా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలకు కూడా జపాన్ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అఖిల్ ‘లెనిన్’ కూడా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అఖిల్‌కు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన ‘లెనిన్’ ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. డిసెంబర్ 11న విడుదలయ్యే ఈ సినిమా అక్కడ ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ బ్యాన్.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక సూచన.! ‘ఈ నగరానికి ఏమైంది 2’ బాక్సాఫీస్ జోరు.. వారం రోజుల్లోనే 50 కోట్లు.!       [Akhil Akkineni, Lenin Movie, Japan Release, Bhagyashri Borse, Murali Kishor Abburu]  
సినిమా అంటేనే భారీ వెయిటింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్స్. అది ఎన్ని సంవత్సరాలో ఎవరకి తెలియదు. కానీ వెయిట్ కి తగ్గ ఫలితం వస్తే మాత్రం అభిమానులు, బాక్స్ ఆఫీస్ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. ఇప్పుడు ఈ వాస్తవాన్ని చెప్పుకునే అవకాశం విశాల్ కల్పించాడు.  విశాల్ , సమంత  జంటగా  నటించిన సూపర్ హిట్ మూవీ ‘అభిమన్యుడు'.2018లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ‘ఇరుంబు తిరై’ పేరుతో తెరకెక్కగా   పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. టెక్నాలజీ, సైబర్ నేరాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి అంశాలతో తెరకెక్కింది. ఈ నేపథ్యంలోనే దీనికి సీక్వెల్ తీసుకురావాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది.  తాజా ప్రచారం ప్రకారం.. ఈ సీక్వెల్‌లో కథని మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారట. మొదటి భాగంలో సైబర్ క్రైమ్, డేటా చోరీ ప్రధాన అంశాలుగా ఉంటే.. రెండో భాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగం చుట్టూ కథ తిరగనుందని సమాచారం.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, దాన్ని కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? దాని వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయి? అనే అంశాలను ఉత్కంఠభరితంగా చూపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఇక సమంత కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారనే టాక్ నడుస్తోంది. ఆమె రీఎంట్రీ తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే పూర్తి నటీనటుల వివరాలు, సమంత రోల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది కూడా చదవండి: నువ్వా నేనా:ఆ హీరో నా వాడే.. కాదు నా వాడే! ఇప్పటికే సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ‘అభిమన్యుడు 2’ వార్త నిజమైతే ఆమె ఖాతాలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరినట్లే.  మొత్తానికి సమంత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి విశాల్‌తో మరోసారి జతకట్టి ‘అభిమన్యుడు 2’లో సమంత సందడి చేస్తారా? ఈ సీక్వెల్‌లో ఏఐ నేపథ్యంలో ఎలాంటి కొత్త కథని  చూపించబోతున్నారు? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.   మీకు నచ్చవచ్చు అల్లు అర్జున్  25 వ సినిమా: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్  Nanna Kutty Movie Review Telugu: నాన్న కుట్టి మూవీ రివ్యూ   
ఎన్టీఆర్‌ను మళ్లీ ఫుల్ కామెడీ రోల్‌లో చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ కావడంతో ఆ కోరిక నెరవేరబోతోందనే ఆశలు పెరిగాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (IFFI)లో పాల్గొన్న అనిల్ రావిపూడి.. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా గురించి మాట్లాడారు. దాదాపు పదేళ్లుగా ఎన్టీఆర్‌ను తెరపై నవ్విస్తూ చూడలేదని, ఆయన కామెడీ టైమింగ్‌ను మరోసారి ప్రేక్షకులకు చూపించాలనే ఆసక్తి ఉందని అన్నారు. ఎన్టీఆర్‌తో సినిమా చేయడం తనకు చాలా మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు అనిల్ తెలిపారు. అయితే సినిమా కథ, జానర్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు. కానీ, ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా మెచ్చేలా సినిమా తెరకెక్కిస్తానని చెప్పారు. నిజానికి ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అదుర్స్’, ‘బాద్‌షా’ సినిమాల్లో ఆయన పండించిన కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ముఖ్యంగా చారి పాత్రలో ఎన్టీఆర్ చేసిన కామెడీకి ఇప్పటికీ అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ డ్రాగన్ టైటిల్ వెనుక అసలు సీక్రెట్ ఇదే! ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నీ ఎక్కువగా భారీ యాక్షన్ సన్నివేశాల చుట్టూనే తిరిగాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’, ‘వార్ 2’ వంటి సినిమాల్లో ఆయన పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడితో ఓ ఫుల్ ఎంటర్‌టైనర్ చేస్తే అభిమానులకు కొత్త అనుభూతి కలగడం ఖాయం. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌లతో తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై ఆయన పూర్తి దృష్టి పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి అనిల్ రావిపూడి మాటలు చూస్తుంటే ఎన్టీఆర్‌ను మరోసారి కామెడీతో ప్రేక్షకులను నవ్వించేలా చూపించాలనే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ‘అదుర్స్’లో చారిని గుర్తు చేసేలా మరో కొత్త పాత్రను తారక్ కోసం అనిల్ సిద్ధం చేస్తున్నారా? ఈ కాంబినేషన్‌లో ఎలాంటి వినోదం ఉండబోతోందో తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే. మీకు నచ్చవచ్చు: బాహుబలి కాంబో రిపీట్‌.. వారణాసి తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి సినిమా.! ‘భోగి’కి A సర్టిఫికెట్.. సెన్సార్ టాక్ ఎలా ఉందంటే.?       [Jr NTR, Anil Ravipudi, IFFI 2026, Dragon, January 12 Vidudala]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఇవి అలవాటు చేసుకోండి..! వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అలసట పెరగడం, బరువు పెరగడం, ముఖంలో కాంతి తగ్గడం చాలా మందికి ఎదురయ్యే సమస్యే. కానీ గంటల తరబడి జిమ్‌లో కష్టపడకుండా లేదా కఠినమైన డైట్లు చేయకుండా, మన రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఎప్పటికీ ఉత్సాహంగా, ఫిట్‌గా, యవ్వనంగా ఉండొచ్చు.  ఆ అలవాట్లు ఏమిటో అవి వయసు పెరిగినా యవ్వనంగా ఉండటంలో ఎలా సహాయపడతాయో వివరంగా  తెలుసుకుంటే.. ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా ప్రశాంతంగా రోజును ప్రారంభించాలి. ఫోన్ చూస్తే వెంటనే అనవసరపు ఆలోచనలు, ఒత్తిడి మొదలవుతాయి. కనీసం మొదటి 15 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. లేవగానే టీ లేదా కాఫీ తాగే బదులు ఒకటి రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. తర్వాత కాసేపు ఉదయపు ఎండలో నిలబడి కనీసం 10 నిమిషాలు నడవాలి. ఇది శరీరానికి కొత్త శక్తిని ఇచ్చి, బద్ధకాన్ని తగ్గిస్తుంది. భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడకూడదు. ఆహారాన్ని గమనిస్తూ నెమ్మదిగా నమిలి తింటే కడుపు నిండిన భావన సమయానికి తెలిసి, అతిగా తినకుండా ఉంటాము. ఇది కూడా చదవండి   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది.. జిమ్‌కు వెళ్లే సమయం లేకపోయినా రోజంతా శరీరానికి కదలిక ఉండేలా చూసుకోవాలి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వంటి చిన్న అలవాట్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. కడుపు పూర్తిగా నిండేంత వరకు కాకుండా 80 శాతం నిండగానే తినడం ఆపేయాలి. అలాగే ప్లేట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ కనిపించేలా ఉంచుకోకుండా, పండ్లు , నీళ్ల బాటిళ్లను కళ్ల ముందు ఉంచుకోవాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మంచి ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. ఒకేసారి పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాలని గట్టి నిర్ణయాలు తీసుకుని తర్వాత వదిలేయడం కంటే, రోజుకు కొంచెం కొంచెంగా చిన్న అలవాట్లు మార్చుకోవడం ఉత్తమం. అలాగే ఒకరోజు తప్పు జరిగినా నిరుత్సాహపడకుండా మరుసటి రోజు మళ్లీ కొనసాగించడం ముఖ్యం. రాత్రి పడుకునే కనీసం గంట ముందు ఫోన్, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. గాఢ నిద్ర సరిగ్గా లభిస్తే మరుసటి రోజు శరీరం ఉత్సాహంగా ఉంటుంది, అనవసరమైన ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి.                                                                                                                                            *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి      అసలు కారణాలు..!                                   జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..!
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. మజ్జిగలో ఈ మూడు పొడులు కలిపి తీసుకోండి!   జుట్టు రాలడం, పలుచబడటం, జుట్టు ఒత్తుగా పెరగకపోవడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే బయట ఉపయోగించే నూనెలు, షాంపూలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పోషకాలు సమృద్ధిగా ఉండే సహజ ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మునగాకు పొడి, కరివేపాకు పొడి, మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి? మునగాకులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మెంతులు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి? ఈ సహజ పదార్థాలను రోజువారీ ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలి? అలాగే చిరుధాన్యాలు (Millets) మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఏమిటి? రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి? సంప్రదాయ ఆహారపు అలవాట్లు, సహజంగా పండించిన ఆహార పదార్థాల ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ నేచురల్ ఫార్మింగ్ నిపుణులు  గున్న రాజేందర్ రెడ్డి (Gunna Rajender Reddy) గారు వివరించారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సహజ ఆహారాలను మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యం, సహజ ఆహారం, మునగాకు, కరివేపాకు, మెంతులు, చిరుధాన్యాల పయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ ఆహార పదార్థాలు పోషకాలను అందించవచ్చు. అయితే 90 రోజుల్లో జుట్టు తప్పనిసరిగా ఒత్తుగా పెరుగుతుందని హామీ ఇవ్వలేము. జుట్టు అధికంగా రాలుతున్నట్లయితే కారణాన్ని గుర్తించేందుకు వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూ ఉండాలని అనిపించడం చాలామందిలో కనిపిస్తుంది. ఎక్కువ పని చేసినప్పుడు లేదా సరిగ్గా తిననప్పుడు ఇలా అనిపిస్తే అది సాధారణమే. కానీ కడుపు నిండా తిన్నాక కూడా పదేపదే ఆకలి వేస్తుంటే మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అది మన అలవాటా లేక శరీరంలో  ఏదైనా సమస్య గురించి అలా లక్షణం రూపంలో బయటకు తెలుస్తోందా అన్నది తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు.  అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి. అవేంటో తెలుసుకుంటే.. అలవాట్లు.. మన రోజువారీ ఆహారపు అలవాట్లు, తినే సమయం, తినే ఆహారం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఆకలి వెనుక శరీరంలోని హార్మోన్లు లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సాధారణ ఆకలికి, అనారోగ్య సంకేతానికి మధ్య తేడాను గుర్తించాలి. డయాబెటిస్.. డయాబెటిస్ ఉన్నవారిలో పదేపదే ఆకలి వేయడం ఒక సాధారణ లక్షణం. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీర కణాలకు చేర్చడానికి ఇన్సులిన్ అవసరం. డయాబెటిస్‌లో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కణాలకు తగినంత శక్తి అందదు. దాంతో ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి తోడు ఎక్కువ దాహం, తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గినప్పుడు కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పుడు చెమట పట్టడం, వణుకు, తలతిరగడం, కంగారుగా అనిపించడం లాంటివి కలగవచ్చు. థైరాయిడ్.. థైరాయిడ్ సమస్య వల్ల కూడా ఆకలి పెరగవచ్చు. థైరాయిడ్ గ్రంథి అవసరం కంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే స్థితిలో శరీర జీవక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల ఆకలి పెరిగినా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువ చెమట పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడి ఎక్కువ ఆకలి వేయవచ్చు. ఇది కూడా చదవండి   మునగాకు లడ్డూ రోజూ 2 తింటే.. శరీరానికి ఇన్ని పోషకాలా.! ఆకలితో పాటు బరువు తగ్గడం.. ఎప్పుడూ ఆకలి వేస్తూ దానితో పాటు బరువు తగ్గడం, ఎక్కువ దాహం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. అవసరమైన రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటే అసలు కారణం తెలుస్తుంది.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   అవిసె గింజలు ఎలా తింటే ఎక్కువ మేలు సరైన పద్ధతి ఇదే!                                   ఇదిగో ఈ ఆహారాలు తింటే గట్ హెల్త్ సేఫ్ గా ఉంటుంది..!